![High Court ordered the police to Do Not arrest Navdeep In Tollywood Case - Sakshi](/styles/webp/s3/article_images/2023/09/15/WhatsApp%20Image%202023-09-15%20at%2016.32.06%281%29.jpeg.webp?itok=_YzFKBrY)
డ్రగ్స్ కేసులో టాలీవుడ్ హీరో నవదీప్‌కు హైకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో అతనికి సంబంధమున్నట్లు హైదరాబాద్ సీపీ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నవదీప్ హైకోర్ట్‌ను ఆశ్రయించారు. అతని పిటిషన్‌పై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం.. ఈ కేసులో నవదీప్‌ను ఆరెస్ట్ చేయవద్దని పోలీసులను ఆదేశించింది.
(ఇది చదవండి: హీరో నవదీప్‌కు నోటీసులు.. డ్రగ్స్ కేసులో ఉన్న టాలీవుడ్ ప్రముఖులు)
అసలేం జరిగిందంటే..
మాదాపూర్‌లోని విఠల్‌నగర్‌లో ఉన్న ఫ్రెష్ లివింగ్ అపార్ట్‌మెంట్‌లో దొరికిన తీగను లాగుతుంటే టాలీవుడ్ డ్రగ్ డొంక కదులుతోంది. ఈ కేసులో పోలీసుల దర్యాప్తు వేగవంతం చేశారు. ఫిల్మ్ ఫైనాన్షియర్ కె.వెంకటరమణారెడ్డితో పాటు ‘డియర్ మేఘ’ చిత్ర దర్శకుడు అనుగు సుశాంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. వీరి నుంచి రూ.10 లక్షల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసులో టాలీవుడ్‌కు చెందిన హీరో నవదీప్‌తో పాటు నిర్మాత సుశాంత్ రెడ్డి కూడా ఉన్నట్లు నగర పోలీసు కమీషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు. నవదీప్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, త్వరలోనే అతన్ని పట్టుకుంటామని చెప్పారు. అయితే దీనిపై వెంటనే హీరో నవదీప్ కూడా స్పందించాడు. అసలు ఆ డ్రగ్స్ కేసుతో తనకు సంబంధమే లేదన్నాడు.
తాను ఎక్కడికి పారిపోలేదు
తాను ఎక్కడికి పారిపోలేదని, హైదరాబాద్‌లోనే ఉన్నానన్నారు. తన కొత్త సినిమాకి సంబంధించిన సాంగ్ లాంచింగ్ ఈవెంట్లో బీజీగా ఉన్నాయనని ఓ మీడియా ప్రతినిధికి ఆయన చెప్పారు. అలాగే ట్విటర్(ఎక్స్) ద్వారా కూడా ఆయన ఈ కేసుపై స్పందించాడు. అది నేను కాదు జెంటిల్మెన్, నేను ఇక్కడే ఉన్నాను ముందు క్లారిటీ తెచ్చుకోండి థాంక్స్ అని ట్వీట్ చేశాడు.
(ఇది చదవండి: అక్కడ సూపర్ హిట్.. తెలుగులో రిలీజ్ కానున్న మూవీ!)
నవదీప్ స్నేహితుడు అరెస్ట్
అయితే ఈ కేసులో నవదీప్ స్నేహితుడు రాంచందర్‌ని నార్కోటిక్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన ఇచ్చిన సమాచారం ప్రకారమే నవదీప్‌ను డ్రగ్స్ కన్స్యూమర్ గా తేల్చారు. ఈ విషయాన్ని సీసీ ఆనంద్ మీడియా ముఖంగా తెలియజేశారు. గతంలోనూ టాలీవుడ్ డ్రగ్స్ కేసు విషయంలో నవదీప్ పేరు మారుమోగింది.అప్పట్లో ఎక్సైజ్, ఈడీ విచారణకు కూడా ఆయన హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment