మాదాపూర్ డ్రగ్స్ కేసులో టాలీవుడ్ నటుడు నవదీప్‌కు బిగ్ షాక్ తగిలింది. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ చేయొద్దంటూ హైకోర్టు ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. అయితే నవదీప్ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఆ పిటిషన్‌ను తోసిపుచ్చింది. 41 ఏ కింద నోటీసులు ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది.
(ఇది చదవండి: విజయ్ ఆంటోనీ కూతురు ఆత్మహత్య.. ఆ తల్లి ఎంతలా తల్లడిల్లిందో!)
పిటిషన్‌పై హై కోర్టులో విచారణ
సినీ నటుడు నవదీప్ పిటిషన్‌పై హై కోర్టు లో విచారణ జరిగింది. అయితే నవదీప్‌పై గతంలోనూ డ్రగ్స్ కేసులు ఉన్నాయని హై కోర్టుకు పోలీసులు వివరించారు. గతంలో ఉన్న డ్రగ్స్ కేసుల్లో నవదీప్ నిందితుడిగా లేడని అతని తరఫున అడ్వకేట్ సిద్దార్థ్ వాదించారు. గతంలోనూ దర్యాప్తు సంస్థల ముందు నవదీప్ హాజరయ్యారని నవదీప్ అడ్వకేట్ సిద్దార్థ్ హైకోర్టుకు వివరించారు. మాదాపూర్ డ్రగ్స్ కేసుతో నవదీప్ కు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు.
(ఇది చదవండి: ఒక్క ఫైట్ సీన్.. ఆ హీరో జీవితాన్నే ముగించింది!)
ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు ఈ కేసులో 41 ఏ కింద నవదీప్‌కు నోటీస్ ఇవ్వాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. నోటీసులిచ్చి విచారణ జరపాలని ఆదేశిస్తూ నవదీప్ పిటిషన్ కొట్టివేసింది.
Comments
Please login to add a commentAdd a comment