Navdeep
-
ఓటీటీలో తెలుగు బోల్డ్ సినిమా 'లవ్ మౌళి'
నవదీప్ హీరోగా చేసిన సినిమా 'లవ్ మౌళి'. అవనీంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రం.. జూన్ 7న థియేటర్లలోకి వచ్చింది. ఈ మూవీతో నవదీప్ 2.0 మొదలైందంటూ చిత్ర యూనిట్ భారీగానే ప్రమోషన్స్ చేసింది. ఇందుకు తగ్గట్లే టీజర్, ట్రైలర్ కాస్త బోల్డ్ కంటెంట్‌తో ఉండటంతో ప్రేక్షకుల్లో కూడా కాస్త అంచనాలు పెరిగాయి. ఈ చిత్రంలో ఫంకూరీ గిద్వానీ హీరోయిన్గా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి రానుంది. ఈమేరకు తెలుగు ప్రముఖ ఓటీటీ సంస్థ 'ఆహా' అధికారికంగా ప్రకటన చేసింది. 'లవ్ మౌళి' చిత్రం జూన్ 27నుంచి స్ట్రీమింగ్ అవుతుందని ఆ సంస్థ తెలిపింది. రిలేషన్లో ఉన్న ఒక జంట రెండు సంవత్సరాలు హ్యాపీగా ఉన్న తర్వాత.. వారిద్దరి మధ్య ఎందుకు అంత ప్రేమ ఉండటం లేదు. ఎందుకు ఆ రిలేషన్ బ్రేక్ అవుతుంది అనే కాన్సెప్ట్‌తో కథ ఉంటుంది.కథేంటి?మౌళి (నవదీప్) తల్లిదండ్రులు చిన్నప్పుడే విడిపోవడంతో తాతయ్య దగ్గర పెరుగుతాడు. 14 ఏళ్ల వయసులో ఆయన చనిపోవడంతో తనకు ఇష్టమొచ్చినట్లు, ప్రపంచాన్ని పట్టించుకోకుండా పెరుగుతాడు. తన లోకంలో తానుంటాడు. స్వతహాగా పెయింటర్ అయిన మౌళి.. మేఘాలయాలో ఉంటాడు. ఓ రోజు అనుకోకుండా అడవుల్లో అఘోరాతో ప్రేమ విషయమై గొడవ పడగా, ఓ పెయింట్ బ్రష్‌ని సృష్టించి ఇస్తాడు.కొన్నాళ్ల తర్వాత దానితో ఓ అమ్మాయి బొమ్మ గీయగా, అందులో నుంచి నిజంగానే చిత్ర(పంఖురి గిద్వాని) అనే అమ్మాయి బయటకొస్తుంది. ఈమెతో గొడవ అయ్యేసరికి చిత్ర బొమ్మ మరోసారి గీస్తాడు. డిఫరెంట్ పర్సనాలిటీతో మళ్లీ వస్తుంది. ఇంతకీ ఇలా ఎందుకు జరుగుతోంది? అసలు మౌళి ప్రేమ గురించి తెలుసుకున్నాడా? చివరకు ఏమైందనేదే స్టోరీ? View this post on Instagram A post shared by ahavideoin (@ahavideoin) -
'లవ్ మౌళి' సినిమా రివ్యూ
కొన్నాళ్ల గ్యాప్ తర్వాత నవదీప్ హీరోగా చేసిన సినిమా 'లవ్ మౌళి'. అవనీంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రం.. తాజాగా జూన్ 7న థియేటర్లలోకి వచ్చింది. ఈ మూవీతో నవదీప్ 2.0 మొదలైందని ప్రమోషన్స్ చేశారు. ఇందుకు తగ్గట్లే టీజర్, ట్రైలర్ కాస్త అంచనాలు పెంచాయి. ట్రైలర్లో ముద్దు, బోల్డ్ సీన్స్ వైరల్ అయ్యాయి. మరి ఈ చిత్రం ఎలా ఉంది? ఏంటనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.కథేంటి?మౌళి (నవదీప్) తల్లిదండ్రులు చిన్నప్పుడే విడిపోవడంతో తాతయ్య దగ్గర పెరుగుతాడు. 14 ఏళ్ల వయసులో ఆయన చనిపోవడంతో తనకు ఇష్టమొచ్చినట్లు, ప్రపంచాన్ని పట్టించుకోకుండా పెరుగుతాడు. తన లోకంలో తానుంటాడు. స్వతహాగా పెయింటర్ అయిన మౌళి.. మేఘాలయాలో ఉంటాడు. ఓ రోజు అనుకోకుండా అడవుల్లో అఘోరాతో ప్రేమ విషయమై గొడవ పడగా, ఓ పెయింట్ బ్రష్‌ని సృష్టించి ఇస్తాడు. కొన్నాళ్ల తర్వాత దానితో ఓ అమ్మాయి బొమ్మ గీయగా, అందులో నుంచి నిజంగానే చిత్ర(పంఖురి గిద్వాని) అనే అమ్మాయి బయటకొస్తుంది. ఈమెతో గొడవ అయ్యేసరికి చిత్ర బొమ్మ మరోసారి గీస్తాడు. డిఫరెంట్ పర్సనాలిటీతో మళ్లీ వస్తుంది. ఇంతకీ ఇలా ఎందుకు జరుగుతోంది? అసలు మౌళి ప్రేమ గురించి తెలుసుకున్నాడా? చివరకు ఏమైందనేదే స్టోరీ?ఎలా ఉందంటే?'లవ్ మౌళి' గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఇది సాధారణ ప్రేమకథ. కాకపోతే ఓ ఫాంటసీ ఎలిమెంట్ జోడీంచడం వల్ల స్క్రీన్ ప్లే కాస్త కొత్తగా అనిపించింది. ప్రేమ అంటే ఏంటని వెతికే క్రమంలో ఓ అబ్బాయి ఏం తెలుసుకున్నాడు అనే పాయింట్‌తో ఈ మూవీ తీశారు. అయితే తొలి సగం కాస్త సాగదీసినట్లు అనిపిస్తుంది. కానీ సెకండాఫ్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఇకపోతే ఈ మూవీ స్టోరీకి తగ్గట్లు లోకేషన్స్, మ్యూజిక్ అదిరిపోయింది. కథంతా మేఘాలయలోనే ఉంటుంది.సీన్స్ పరంగా చూసుకుంటే ప్రేమ, పెళ్లిలో ఉన్న ప్రతి ఒక్కరికీ ఏదో ఓ చోట కనెక్ట్ అవుతాయి. ఈ సినిమాలోని ప్రేమ ఎమోషన్‌కి మనం కనెక్ట్ అయితే సినిమా బాగా నచ్చేస్తుంది. ముద్దు సీన్స్, బోల్డ్ సన్నివేశాలు బాగానే ఉన్నాయి. చాలా వరకు ముద్దు సీన్స్ సహజంగానే అనిపించినా ఒకటి రెండు బోల్డ్ సీన్స్ మాత్రం అవసరమా అనిపిస్తాయి. కథని ఎంత కొత్తగా చూపించినా చివరకు అందరూ చెప్పేదే చెప్పడంతో ఓస్ ఇంతేనా అనిపిస్తుంది.ఎవరెలా చేశారు?ప్రమోషన్స్‌లో 2.0 అనేలా నవదీప్ యాక్ట్ చేశాడు. బాడీ, సీన్స్ కోసం బాగానే కష్టపడ్డాడు. హీరోయిన్ చిత్ర పాత్ర చేసిన పంఖురి గిద్వాని సూపర్‌గా చేసింది. హారికగా నటించిన భావన సాగి పర్వాలేదనిపించింది. మిగిలిన పాత్రలు ఓకే. రానా దగ్గుబాటి అఘోరాగా గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చి అదరగొట్టేసాడు. టెక్నికల్ విషయాలకొస్తే.. లొకేషన్స్ అదిరిపోయాయి. మేఘాలయని అద్భుతంగా చూపించారు. దర్శకుడే సినిమాటోగ్రాఫర్ కావడంతో ఔట్పుట్ అదిరిపోయింది. గోవింద్ వసంత, కృష్ణ ఇచ్చిన సంగీతం సరిగ్గా సరిపోయింది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కొన్ని చోట్ల బాగుంటుంది. అవనీంద్ర, దర్శకుడిగా ఆకట్టుకున్నాడు. నిర్మాణ విలువల మూవీకి తగ్గట్లు ఉన్నాయి. -
రెండున్నరేళ్లు ఒకే గెటప్‌లో ఉన్నాను: నవదీప్
‘‘లవ్ మౌళి’ సినిమా షూటింగ్ మొత్తం మేఘాలయాలోని చిరపుంజీలో చేశాం. ఎన్నో వ్యయ ప్రయాసలతో అక్కడ షూట్ చేయడం పెద్ద సాహసమే అని చెప్పాలి. ఎప్పుడూ వర్షం పడే ఆ ప్రదేశంలో సినిమా మీద ప్యాషన్‌తో షూటింగ్ చేశాం. ఈ సినిమాలోని నా పాత్ర కోసం రెండున్నరేళ్లు ఒకే గెటప్‌లో ఉన్నాను. ‘లవ్ మౌళి’ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిస్తుంది’’ అని హీరో నవదీప్ అన్నారు.ప్రముఖ దర్శకుడు రాజమౌళి శిష్యుడు అవనీంద్ర దర్శకత్వంలో నవదీప్ హీరోగా నటించిన చిత్రం ‘లవ్ మౌళి’. నైరా క్రియేషన్స్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్స్‌తో కలిసి సి స్పేస్ సంస్థ నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా నవదీప్ మాట్లాడుతూ– ‘‘నా కెరీర్ప్రారంభంలో జెట్ స్పీడులో వెళ్లింది. ఇప్పుడు ప్రేక్షకుల ఆలోచనకు తగ్గట్లుగా కెరీర్ మార్చుకోవాలనిపించింది. ఆ సమయంలో విన్న కథే ‘లవ్ మౌళి’. ఇది రెగ్యులర్ ప్రేమకథ కాదు. అందరికీ కనెక్ట్ అవుతుంది.ముఖ్యంగా యువతకు కచ్చితంగా కనెక్ట్ అవుతుంది. ‘లవ్ మౌళి’ విజయంతో నా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అవుతుందనుకుంటున్నాను. సరదాగా హీరో రానాకు ఈ చిత్రకథ చెప్పాను. కథ బాగుండటంతో అఘోరా పాత్ర చేశాడు. ప్రస్తుతం తమిళంలో నిత్యా మీనన్‌తో ఓ సినిమా, అలాగే ‘న్యూసెన్స్ 2’ వెబ్ సిరీస్ చేస్తున్నాను. నేను నటించిన మరికొన్ని వెబ్ సిరీస్‌లు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇక నుంచి సోలో హీరోగా మంచి కథలతో సినిమాలు చేయాలనుకుంటున్నాను’’ అన్నారు. -
నా కోసం రానా అఘోరగా నటించాడు : హీరో నవదీప్
‘లవ్ మౌళి’కథను సరదాగా నా స్నేహితుడు రానాకు చెప్పాను. స్టోరీ మొత్తం విన్నాక.. చాలా బాగుందని చెప్పి అందులోని అఘోర పాత్రను చేశాను. నిజంగా చెప్పాలంటే రానాకు ఆ పాత్ర చేయాల్సిన అవసరం లేదు. కానీ నా కోసం చేశాడు. ఈ సినిమాలో రానా అఘోరగా నటించాడని ఇంతవరకు రివీల్ చేయలేదు. ఎందుకంటే దీనిని కమర్షియల్‌గా వాడుకోవడం ఇష్టం లేదు’అని అన్నారు హీరో నవదీప్. చాలా తర్వాత నవదీప్ హీరోగా నటించిన చిత్రం ‘లవ్ మౌళి’.రాజమౌళి శిష్యుడు అవనీంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. జూన్ 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా హీరో నవదీప్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..⇒ నా కెరీర్ ప్రారంభమైనప్పుడు.. మంచి జెట్‌స్పీడులో వెళ్లింది. వరుసగా చేసుకూంటూ వెళ్లాను. ఆ తరువాత అన్ని తరహా పాత్రలు చేశాను. ఇప్పుడు జనాల నా గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకున్నాను. వాళ్లు నా గురించి ఆలోచించే తరహాలో మార్పు ఉన్నప్పుడు మనం కూడా మరాలి అనిపించింది. అందుకే నాకు కూడా వాళ్ల ఆలోచన తగిన విధంగా కెరీర్‌ను మార్చకోవాలినిపించింది. ఆ తరుణంలో విన్న కథే లవ్,మౌళి. ఈ సినిమా కోసం అన్ని మార్చుకున్నాను.⇒ ఈ సినిమా షూటింగ్ మొత్తం మేఘాలయాలోని చిరపుంజీలో చేయడం పెద్ద సాహసం అని చెప్పాలి. ఎన్నో వ్యయ ప్రయాసాలతో షూటింగ్ చేశాం. ఎప్పూడు వర్షం పడే ఆ ప్లేస్‌లో సినిమా మీద పాషన్‌తో చిత్రీకరణ చేశాం. రెండున్నర సంవత్సరాలు నేను కూడా అదె గెటప్‌లో వున్నాను. సినిమా కోసం అందరం కష్టపడి తీశాం. లవ్ మౌళి సినిమా మేకింగ్ అంతా ఓ సాహసం అని చెప్పాలి.⇒ ఇది రెగ్యులర్ లవ్‌స్టోరీ కాదు. ఈ సినిమా అందరికి కొత్త అనుభూతినిస్తుంది. ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. ముఖ్యంగా యూత్‌కు ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది. ఈ సినిమా తెలుగులో కాకుండా మరో భాషల్లో వచ్చి ఉంటే చూసే కోణంలో కూడా తేడా వుండేదెమో.. ఈ సినిమా అందరికి ఎక్కడో ఒక దగ్గర కనెక్ట్ అవుతుది.⇒ ఈ సినిమా కోసం నేను, దర్శకుడు సింక్‌లో ఉండి ప్రిపేర్ అయ్యాం. నేను ఏ సినిమా చేసినా ఆ పాత్రకు తగ్గట్టుగా ప్రిపేర్ అయ్యే వాడిని. ఈ సినిమాతో విజయం నా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అవుతుందని అనుకుంటున్నాను.⇒ ఈ సినిమాలో నేపథ్యం సంగీతం హైలైట్ అని చెప్పాలి. సన్నివేశానికి ఎలివెట్ చేసే విధంగా చాలా మంచి పాటలతో పాటు నేపథ్య సంగీతం ఇచ్చాడు. ఈ సినిమాకు నేపథ్య సంగీతం ప్రాణం పోసింది. లవ్‌మౌళి ఎక్స్పీరియన్స్ అందరికి కొత్త అనుభూతిని ఇస్తుంది.⇒ నా రియల్‌లైఫ్‌లో ఎన్నో ప్రేమకథలు ఉన్నాయి. 23 ఏళ్ల నుండి రకరకాల మనుషులను ప్రేమించాను. పర్సనల్‌గా కూడా ఈ సినిమా కథ నాకు ఎంతో కనెక్ట్ అయ్యింది. సినిమా దర్శకుడు కూడా తన వ్యక్తిగత అనుభవాలను ఇందులో చూపించాడు. అతని ఆలోచనలకు దగ్గర ఈ సినిమా ఉంటుంది. మనం ఏంటో తెలుసుకుని ప్రశాంతంగా ఉండి.. అవతలి వాళ్లను కూడా ప్రశాంతంగా ఉంచితే.. బాగుంటుంది.⇒ న్యూసెన్స్ 2 వెబ్‌సీరిస్‌తో పాటు తమిళంలో నిత్యమీనన్‌తో ఓ సినిమా చేస్తున్నాను. దీంతో పాటు మరికొన్ని వెబ్‌సీరిస్‌లు రిలీజ్‌కు సిద్దంగా ఉన్నాయి. ఇక నుంచి సోలో హీరోగా మంచి కథలతో రావాలనుకుంటున్నాను. లవ్, మౌళికి వచ్చిన స్పందన బట్టి నా తదుపరి చిత్రాల ఎంపిక ఆధారపడి ఉంటుంది. -
లవ్ మౌళి 2.0 అని తె? ఎందుకు పెట్టారు..?
-
నాలో కొత్త కోణాన్ని చూపించిన చిత్రమిది: నవదీప్
‘‘ప్రస్తుతం అన్ని భాషల్లో కొత్త కంటెంట్‌తో సినిమాలు వస్తున్నాయి. అదే కోవలో తెలుగులో రాబోతున్న వైవిధ్యమైన సినిమా ‘లవ్ మౌళి’. ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించే సినిమా ఇది. నా 20 ఏళ్ల సినీ కెరీర్ తర్వాత నాలో ఉన్న కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తూ చేసిన సినిమా ఇది’’ అని నవదీప్ అన్నారు. నవదీప్ హీరోగా అవనీంద్ర దర్శకత్వం వహించిన చిత్రం ‘లవ్ మౌళి’. పంఖురి గిద్వానీ, భావన సాగి, ‘మిర్చి’ హేమంత్, ‘మిర్చి’ కిరణ్ ఇతర పాత్రల్లో నటించారు.నైరా క్రియేషన్, శ్రీకర స్టూడియోస్‌తో కలిసి సి స్పేస్ నిర్మించింది. ఈ చిత్రాన్ని జూన్ 7న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా అవనీంద్ర మాట్లాడుతూ– ‘‘నేటి యువతరానికి కావాల్సిన అన్ని అంశాలు మా సినిమాలో ఉన్నాయి. ప్రేమలో ఉన్నవారి బంధాలు ఎలా ఉన్నాయి? నేటి యువతరం ప్రేమించి పెళ్లి చేసుకున్నా బ్రేకప్‌లు అవుతున్నాయి. రాజీపడితే తప్ప బంధాలు నిలబడవా? అనే ప్రశ్నకు నాకు దొరికిన పరిష్కారాన్ని కూడా ఈ చిత్రంలో చూపించాం’’ అన్నారు. -
బెంగళూరు రేవ్ పార్టీ.. ఈసారి బతికిపోయానన్న నవదీప్..!
బెంగళూరులో ఇటీవల జరిగిన రేవ్ పార్టీ టాలీవుడ్లో ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. చాలామంది సెలబ్రిటీలు ఉన్నట్లు మొదట సోషల్ మీడియాలో పెద్దఎత్తున వార్తలొచ్చాయి. నటుడు శ్రీకాంత్, హేమ పేర్లు బయటికి రావడంతో వాళ్లిద్దరూ బయటికి వచ్చి క్లారిటీ ఇచ్చారు. కానీ హేమ ఆ పార్టీలో పాల్గొన్నట్లు బెంగళూరు పోలీసులు ధృవీకరించారు. ఆ తర్వాత జరిగిన బ్లడ్ శాంపిల్స్ టెస్ట్‌లో హేమకు పాజిటివ్ రావడంతో నోటీసులు కూడా ఇచ్చారు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.అయితే గతంలో టాలీవుడ్ డ్రగ్స్ కేసు సమయంలో హీరో నవదీప్ పేరు కూడా వినిపించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా తాను నటిస్తోన్న కొత్త సినిమా లవ్ మౌళి ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూకు ఆయన హాజరయ్యారు. ఈసారి మీరు ఫేక్ న్యూస్‌లో కనిపించడం లేదు కదా సార్ అని కొందరు ప్రశ్నించారు. ఇలాంటి వార్తలొచ్చినప్పుడు మీ పేరు కూడా వినిపించేది కదా సార్ అని అడగడంతో నవదీప్ స్పందించారు.ఈ సారి అంతా మంచే జరిగిందని.. ఈ ఒక్కసారి తనను వదిలేశారని నవదీప్ నవ్వుతూ సమాధానామిచ్చాడు. రేవ్ పార్టీ అంటే.. రేయి, పగలు జరిగేదని ఓ ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. ఆ పార్టీ వేరు వేరు దేశాల్లో వేరే విధంగా ఉంటుందన్నారు. రొమాంటిక్ డ్రామాగా అవనీంద్ర తెరకెక్కించిన లవ్ మౌళి మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రంలో భావన సాగి హీరోయిన్గా నటించింది. ఈ మూవీ జూన్ 7న విడుదల కానుంది. -
చిన్న హీరో అంటూ ఆ హీరోయిన్ చులకనగా మాట్లాడింది: నవదీప్
జై సినిమాతో హీరో నవదీప్ తన కెరీర్ మొదలుపెట్టాడు. హీరోగానే కాకుండా విలన్‌గా, సహాయక నటుడిగానూ సినిమాలు చేశాడు. ఓటీటీలోనూ సినిమాలు, సిరీస్‌లతో ఆకట్టుకుంటున్నాడు. అతడు హీరోగా నటించిన లవ్ మౌళి మూవీ జూన్ 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్ల స్పీడు పెంచాడు నవదీప్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను గూర్చి మాట్లాడాడు.రెండో సినిమాకే..'నా రెండో సినిమా మనసు మాట వినదు సమయంలోనే కాంట్రవర్సీ మొదలైంది. సక్సెస్‌కు చాలా గ్యాప్ వచ్చిన పెద్ద హీరోలకు హిట్లు ఇచ్చిన లక్కీ పర్సన్ తానే అని హీరోయిన్ అంకిత ఫీలైంది. అలాంటి నన్ను ఈ చిన్న హీరో డేట్ల కోసం ఇబ్బందిపెడతారా? అని నిర్మాతను ప్రశ్నించింది. అప్పుడు నాకింకా 17 ఏళ్లు. అసలేం జరుగుతుందో అర్థం కాలేదు. అప్పటినుంచే..తర్వాత ఆ గొడవ సద్దుమణిగింది. ఆ సినిమా నుంచే నన్ను వివాదాలు చుట్టుముట్టడం మొదలయ్యాయి. రేవ్ పార్టీ, ఈడీ కేసులు.. అని ఏదేదో ప్రచారం చేస్తుంటారు. నాకు సంబంధం లేకపోయినా నా పేరు తీసుకొస్తుంటారు. కానీ అందులో ఏమాత్రం నిజముండదు. అసలు నాపై ఒక్క కేసు కూడా లేదు' అని నవదీప్ చెప్పుకొచ్చాడు.చదవండి: 'సలార్ 2' పక్కన పెట్టేశారని రూమర్స్.. ఒక్క ఫొటోతో క్లారిటీ -
మృగాడితో రొమాన్స్.. బోల్డ్ సీన్లతో ట్రైలర్
'లవ్ మౌళి'గా చాలారోజుల తర్వాత ప్రేక్షకులు ముందుకు రానున్నారు నవదీప్. ఆయన హీరోగా నటించిన ఈ చిత్రాన్ని అవనీంద్ర డైరెక్ట్ చేయగా.. నైరా క్రియేషన్స్, శ్రీకర స్టూడియోస్ పతాకాలపై సి స్పేస్ సంస్థ నిర్మించింది. ఈ చిత్రం ఏప్రిల్ 19న విడుదల కానుంది. ఇందులో పంఖురి గిద్వానీ హీరోయిన్గా నటించగా. భావన సాగి, మిర్చి హేమంత్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ప్రేమ అనేది లేకుండా ప్రపంచంలో మనుషులకు దూరంగా బతుకుతున్న ఒక వ్యక్తికి అనూహ్యంగా ప్రేమ దొరికితే ఎలా ఉంటుంది అనే కోణంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మనుషులతో ఎలాంటి పరిచయం లేని వ్యక్తికి ప్రేమించే వ్యక్తి దొరికితే మనిషి ఎలా మారతాడు అనే విషయాన్ని కాస్త బోల్డ్‌గానే చెప్పినట్లు ట్రైలర్‌తో తెలుస్తోంది. ట్రైలర్లో అక్కడక్కడ రొమాన్స్ సీన్లు ఉన్నా.. అందులో ఏదో కంటెంట్ ఉంది అనేలా ట్రైలర్‌ను మేకర్స్ కట్ చేశారు. 2021లో ప్రారంభమైన ఈ సినిమా కరోనా సమయంలో పలు ఇబ్బందులు ఎదుర్కొని ఆపై అనేక ఒడుదొడుకల నడుమ ఇటీవల ఈ ప్రాజెక్ట్ పనులు పూర్తి అయ్యాయి. ఏప్రిల్ 19న ఈ సినిమా విడుదల కానుంది. -
సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ 2024..తారల సందడి (ఫొటోలు)
-
ఏవం సినిమా గురించి నటుడు నవదీప్
-
ఇటీవలే వరుణ్ తేజ్ పెళ్లి..నెక్ట్స్ నేనే అంటోన్న టాలీవుడ్ హీరో!
టాలీవుడ్లో మోస్ట్ బ్యాచలర్ హీరోల్లో నవదీప్ ఒకరు. జై సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన నవదీప్ పలు సినిమాల్లో నటించారు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణించారు. గౌతమ్ ఎస్ఎస్సీ, ఆర్య-2, ధృవ, అల వైకుంఠపురములో, నేనే రాజు, నేనే మంత్రి లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో కనిపించారు. అయితే ఈ ఏడాది న్యూసెన్స్ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సిరీస్‌కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇప్పటివరకు బ్యాచ్లర్గానే ఉన్న నవదీప్ పెళ్లిపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. తన ట్విటర్ ద్వారా ఓ వీడియోను రిలీజ్ చేశారు. వీడియోలో నవదీప్ మాట్లాడుతూ.. 'పెళ్లిళ్ల మీద నా అభిప్రాయం తెలిసిన మా మదర్ ఇండియా.. పొద్దున్నే నన్ను ఓ క్వశ్చన్ అడిగింది. నిజంగానే పెళ్లిళ్లు అంత బ్యాడ్ అయితే.. పాపం పెళ్లిళ్లు వర్కవుట్ అవ్వక విడాకులు తీసుకునేవాళ్లు.. మళ్లీ ఎందుకు పెళ్లి చేసుకుంటారా? అని అడిగింది.' అని అన్నారు. అంతే కాకుండా వీడియోతో పాటు జరగాలి పెళ్లి అనే క్యాప్షన్ కూడా ఇచ్చాడు. అయితే ఇది చూసిన అభిమానులు సైతం క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. అన్నా పెళ్లి చేసుకునే పనిలో ఉన్నారా? అంటూ పోస్టులు పెడుతున్నారు. మరికొందరేమో నవదీప్ త్వరలోనే పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉన్నారని కామెంట్స్ చేస్తున్నారు. కొందరేమో అన్నా మీ పెళ్లికి మమ్మల్ని కచ్చితంగా పిలవండి అంటూ హీరోను రిక్వెస్ట్ చేస్తున్నారు. నవదీప్ పోస్ట్‌ను చూస్తే మన హీరో త్వరలోనే పెళ్లిపీటలెక్కడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే గతంలో చాలా సార్లు పెళ్లిపై ప్రశ్నలు ఎదురయ్యాయి. అయితే ఇప్పుడే చేసుకునే ఉద్దేశం లేదని గతంలోనే చెప్పారు. కాగా.. ఇటీవలే టాలీవుడ్ హీరో వరుణ్ తేజ్ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. 😅 pic.twitter.com/5CeV7EPIGY — Navdeep (@pnavdeep26) November 16, 2023 -
Eagle Movie Teaser Stills: రవితేజ 'ఈగల్' మూవీ స్టిల్స్
-
ఆ ఖాతాలకు డబ్బు ఎందుకు పంపారు?
సాక్షి, హైదరాబాద్: ‘ఈ బ్యాంకు ఖాతాకు మీరు డబ్బు ఎందుకోసం పంపారు? ఈ ఆర్థిక లావాదే వీలు జరిపిన వ్యక్తులు మీకు ఎలా తెలుసు? ఎప్పటి నుంచి ఈ బ్యాంకు ఖాతాలకు డబ్బులు పంపుతున్నారు?’ ఇలాంటి అనేక కీలక ప్రశ్నలు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు నటుడు నవదీప్‌కు సంధించినట్లు సమాచారం. కొందరు నైజీరియన్ల బ్యాంకు ఖాతాలకు నవదీప్ బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులు వెళ్లినట్టుగా ఈడీ అధికా రులు గుర్తించినట్టు తెలిసింది. 2017లో నమోదైన టాలీవుడ్ డ్రగ్స్ కేసులతో పాటు ఇటీవల నమో దైన మాదాపూర్ డ్రగ్స్ కేసులలో ఆర్థిక లావాదేవీ లపై ప్రశ్నించేందుకు తమఎదుట హాజరుకావాలంటూ ఈడీ అధికా రులు నటుడు నవదీప్‌కు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో మంగళవారం ఉదయం 10–40 గంటలకు సైఫాబాద్ లోని ఈడీ కార్యాలయానికి నవదీప్ చేరుకున్నారు. సమన్లలో పేర్కొన్న విధంగా బ్యాంక్ స్టేట్మెంట్లు, పాన్‌కార్డ్ సహా ఇతర డాక్యుమెంట్లను అధికారులకు అందజేశారు. జాయింట్ డైరెక్టర్ రోహిత్ ఆనంద్ ఆధ్వర్యంలోని ఐదుగురు అధికారుల ప్రత్యేక బృందం నవదీప్‌ను దాదాపు 8 గంటల పాటు విచారించింది. ముఖ్యంగా నవదీప్‌కు చెందిన 3బ్యాంకు ఖాతాల లావాదేవీలపై ప్రశ్నించినట్టు తెలిసింది. నైజీరియన్లతో ఆర్థిక లావాదేవీలు.. 2017లో తెలంగాణ ఎక్సైజ్‌శాఖ నమోదు చేసిన డ్రగ్స్ కేసులలో కీలక నిందితుడు కెల్విన్ పట్టుబడిన తర్వాత టాలీవుడ్ డ్రగ్స్ లింకులు బయటపడ్డాయి. దీంతో హీరో నవదీప్ సహా పలువురిని ఎక్సైజ్ అధికారులు విచారించారు. ఈడీ మనీలాండరింగ్‌పై దృష్టి పెట్టింది. ప్రత్యేకంగా కేసు నమోదు చేసిన అధికారులు 2021లో నవదీప్‌తో పాటు పలువురు టాలీవుడ్ నటులను ప్రశ్నించారు. ఇప్పటికే ఒకసారి నవదీప్‌ను ప్రశ్నించిన ఈడీ అధికారులు తాజాగా మంగళవారం నాటి విచారణలోనూ ఆయన ఆర్థిక లావాదేవీలపై ఆరా తీశారు. నవదీప్‌కు ఇటీవల మాదాపూర్ డ్రగ్స్ కేసులో అరెస్టయిన వరంగల్‌కు చెందిన రామ్‌చంద్ అత్యంత సన్నిహితుడు. రామ్‌చంద్ బెంగళూరులో షెల్టర్ తీసుకుంటున్న నైజీరియన్లు అమోబి చుక్వుడి, మైకేల్, థామస్ అనఘల వద్ద డ్రగ్స్ కొనుగోలు చేసి హైదరాబాద్‌లో కస్టమర్లకు అమ్మేవాడని తేలింది. కాగా హీరో నవదీప్ కూడా డ్రగ్స్ అందించేవాడని దర్యాప్తు సంస్థలు అనుమా నిస్తున్నాయి. ఈ క్రమంలోనే నైజీరియన్లతో నవదీప్ ఆర్ధికపరమైన లావాదేవీలు జరిపినట్టుగా ఈడీ ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. తాజా డ్రగ్స్ కేసులతో పాటు 2017లో నమోదైన టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కూడా నవదీప్ నుంచి వివరాలు రాబడుతున్నట్టు సమాచారం. విచారణ అనంతరం మంగళవారం రాత్రి ఈడీ కార్యాలయం నుంచి తిరిగి వెళుతున్న నవదీప్‌ను మీడియా ప్రతినిధులు పలు అంశాలపై ప్రశ్నించారు. అయితే ఆయన ఏమీ స్పందించకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
డ్రగ్స్ కేసులో నవదీప్ విచారణ పూర్తి.. మొత్తం 9 గంటలు!
డ్రగ్స్ కేసు విషయమై తెలుగు ప్రముఖ నటుడు నవదీప్‌ని ఈడీ విచారించడం ముగిసింది. హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయానికి ఉదయం 11 గంటల సమయానికి వచ్చిన నవదీప్.. సాయంత్రం 7 గంటలకు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అంటే దాదాపు 9 గంటల పాటు అతడిని ప్రశ్నించారు. డ్రగ్స్ కేసులో మనీలాండరింగ్ గురించి.. అలానే డ్రగ్స్ అమ్మేవాళ్లతో ఆర్థిక లావాదేవీలు, నవదీప్ బ్యాంకు ఖాతాల వివరాల గురించి విచారణలో అడిగినట్లు తెలుస్తోంది. (ఇదీ చదవండి: రాజకీయాల్లోకి అనసూయ? హాట్ యాంకర్ సమాధానమిదే!) ఇంతకీ ఏం జరిగింది? గుడిమల్కాపూర్ పరిధిలో కొన్నిరోజులు క్రితం డ్రగ్స్ కేసు వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలోనే ఈనెల 10న విచారణకు హాజరవ్వాలని నటుడు నవదీప్‌కి ఈడీ నోటీసులు జారీ చేసింది. పోలీసులకు చిక్కిన నైజీరియన్ డ్రగ్ పెడ్లర్‌తో పాటు తెలుగు సినీ నిర్మాత వెంకటరత్నారెడ్డి, రాంచందర్‌లను విచారించడంతో నవదీప్ పేరు బయటపడింది. ఈ క్రమంలోనే నవదీప్‌ను కొద్దిరోజుల క్రితం టీన్యాబ్ పోలీసులు సుమారు ఆరు గంటలపాటు విచారించారు. తాజాగా ఈడీ అధికారులు ఏకంగా 9 గంటలు విచారణ చేశారు. (ఇదీ చదవండి: చిరంజీవి క్లాసిక్ హిట్ సినిమా.. ఇప్పుడు కొత్త గొడవ?) -
నవదీప్ తో పాటు పలువురిని ప్రశ్నిస్తున్న ఈడీ
-
హీరో నవదీప్ మెడకు బిగుస్తున్న డ్రగ్స్ ఉచ్చు
-
సినీ నటుడు నవదీప్ కు ఈడీ నోటీసులు
-
టాలీవుడ్ హీరో నవదీప్‌కు ఈడీ నోటీసులు
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ హీరో నవదీప్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. మాదాపూర్ డ్రగ్స్ కేసులో ఇటీవలే నవదీప్‌ను నార్కోటిక్ బ్యూరో విచారించిన సంగతి తెలిసిందే. అయితే.. నార్కోటిక్ బ్యూరో కేసు ఆధారంగా ఈడీ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ నెల 10వ తేదీన నవదీప్‌ను హాజరు కావాలని ఈడీ తన నోటీసుల్లో పేర్కొంది. (ఇదీ చదవండి: నార్కోటిక్ విచారణ పూర్తి.. నవదీప్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ) అసలేం ఏం జరిగింది? ఈ ఏడాది సెప్టెంబరు 14న తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో అధికారులు.. గుడిమల్కాపుర్ పోలీసులతో కలిసి బెంగళూరుకి చెందిన ముగ్గురు నైజీరియన్స్, ఓ దర్శకుడితో పాటు నలుగురు వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు. ఈ ముఠా నుంచి పలు రకాల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. వీళ్లని విచారించగా.. వీళ్లతో నటుడు నవదీప్ సంప్రదింపులు జరిపినట్లు తేలింది. అరెస్ట్ అయిన వారిలో రామచందర్ అనే వ్యక్తి నుంచి నవదీప్ డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు ఆరోపించారు. ఆధారాలు కూడా ఉన్నాయన్నారు. ఈ డ్రగ్స్ కేసులో నటుడు నవదీప్‌ని నిందితుడుగా చేర్చిన పోలీసులు.. ఇటీవలే అతడిని విచారించారు. (ఇది చదవండి: ఓటీటీలోకి ఆ బ్లాక్‌బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) -
'సగిలేటి కథ' నుంచి 'చికెన్ సాంగ్' లాంచ్
రవి మహాదాస్యం, విషిక లక్ష్మణ్ జంటగా నటిస్తున్న చిత్రం 'సగిలేటి కథ'. రాయలసీమ పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి రాజశేఖర్ సుద్మూన్ దర్శకుడు. హీరో నవదీప్ సి-స్పేస్ సమర్పణలో, షేడ్ ఎంటర్టైన్మెంట్, అశోక్ ఆర్ట్స్ బ్యానర్లో దేవీప్రసాద్ బలివాడ, అశోక్ మిట్టపల్లి సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ అలరిస్తుంది. తాజాగా ఓ క్రేజీ గీతాన్ని విడుదల చేశారు. (ఇదీ చదవండి: సర్జరీ వికటించి ప్రముఖ నటి కన్నుమూత) హీరో నవదీప్ ఆధ్వర్యంలో తెలుగు యంగ్ డైరెక్టర్స్ 'బేబీ' ఫేమ్ సాయి రాజేశ్, వెంకటేష్ మహా, సందీప్ రాజ్.. ఈ సాంగ్ లాంచ్‌కి ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఈ సినిమాలో రోషం రాజు క్యారెక్టర్ తనకు చాలా ఇష్టమని, అలానే ఈ మూవీలో కామెడీ అందరిని నవ్విస్తుందని, ఈ సినిమా చూసిన తర్వాత ప్రతిఒక్కరికీ చికెన్ తినాలనిపిస్తుందని నవదీప్ చెప్పుకొచ్చాడు. అక్టోబర్ 13న ఈ చిత్రం థియేటర్లలోకి వస్తోంది. (ఇదీ చదవండి: 'మంత్ ఆఫ్ మధు' రివ్యూ) -
పోలీస్ స్టేషన్ లో నన్ను చాలా కొట్టారు
-
సినీ భాషలోనే డ్రగ్స్ దందా!
హైదరాబాద్: సైబరాబాద్ పోలీసు కమిషనరేట్లలోని ఠాణాల్లో నమోదైన ‘టాలీవుడ్ డ్రగ్స్’ కేసుల దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సినీ రంగానికి చెందిన వారు మాదకద్రవ్యాల దందాను వారి పారిభాషిక పదాలనే కోడ్ వర్డ్స్‌గా వినియోగించే చేస్తున్నట్లు వెల్లడైంది. మరోపక్క టీఎస్ నాబ్ అధికారులు నటుడు నవదీప్ నుంచి స్వాధీనం చేసుకున్న సెల్‌ఫోన్‌ను విశ్లేషిస్తున్నారు. న్యాయస్థానం నుంచి ముందస్తు బెయిల్ పొందిన నిందితులు మంగళవారం దర్యాప్తు అధికారి ఎదుట హాజరయ్యారు. ఇటీవల కాలంలో టాలీవుడ్‌తో లింకులు ఉన్న డ్రగ్స్ కేసులు రెండు నమోదయ్యాయి. సైబరాబాద్ పోలీసులు పట్టుకున్న కేపీ రెడ్డికి సంబంధించిన కేసు మాదాపూర్ ఠాణాలో నమోదైంది. టీఎస్ నాబ్ అధికారులు గుట్టురట్టు చేసిన వెంకట రమణరెడ్డి లింకులకు సంబంధించిన కేసు హైదరాబాద్ కమిషనరేట్‌లోని గుడిమల్కాపూర్ ఠాణాలో రిజిస్టరైంది. ఈ కేసులోనే హీరో నవదీప్ పేరు బయటపడింది. ఈ రెండు కేసుల్లోనూ అనేక మంది టాలీవుడ్ నటులు, నిర్మాతలు, దర్శకులతో పాటు మోడళ్ళు సైతం డ్రగ్స్ వినియోగదారులుగా ఉన్నట్లు బయటపడింది. వీళ్ళు రహస్య ప్రాంతాల్లో, పొరుగు రాష్ట్రాల్లో పార్టీలు నిర్వహించుకుంటూ, మాదకద్రవ్యాలు వినియోగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సాధారణంగా డ్రగ్స్ క్రయవిక్రయాల్లో వాటి పేర్లను డైరెక్టుగా వాడరు. ఎవరికి వాళ్ళు కొన్ని కోడ్ వర్డ్స్ పెట్టుకుని పని పూర్తి చేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే సినీ రంగానికి చెందిన వారు ఆ పారిభాషిక పదాలతోనే డ్రగ్స్‌కు కోడ్ వర్డ్స్ రూపొందించినట్లు పోలీసులు గుర్తించారు. నటులు, దర్శకులు, నిర్మాతలతో పాటు మోడల్స్ సైతం ఎక్కువగా కొకై న్ను వినియోగిస్తుంటారని అధికారులు చెప్తున్నారు. దీంతో ఈ డ్రగ్‌కు స్క్రిప్ట్ అనే కోడ్ వర్డ్ ఏర్పాటు చేసుకున్నారు. అలాగే మాదకద్రవ్యాలు సరఫరా చేసే డ్రగ్ పెడ్లర్‌కు రైటర్ అని, డ్రగ్స్ రావాలని అడగటానికి ‘షెల్ వీ మీట్’ అని కోడ్స్ ఏర్పాటు చేసుకున్నారు. వారి వారి ఫోన్లు విశ్లేషించినప్పుడు ఈ పదాలే కనిపించాయని దర్యాప్తు అధికారులు చెప్తున్నారు. మరోపక్క నవదీప్ నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న ఫోన్ విశ్లేషణ ప్రారంభమైంది. ఈ ఫోన్‌ను పోలీసులకు అప్పగించే ముందే నవదీప్ ఫార్మాట్ చేసినట్లు గుర్తించారు. దీంతో డిలీట్ అయిన డేటాను రిట్రీవ్ చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. ఇప్పటికే దర్యాప్తులో గుర్తించిన అంశాలను బట్టి ఈ డ్రగ్స్ క్రయవిక్రయాలన్నీ స్నాప్‌చాట్ ఆధారంగా జరిగాయి. ఈ సోషల్‌మీడియా యాప్‌లో ఉన్న డిజ్అప్పీర్ ఆప్షన్‌ను పెడ్లర్లు, వినియోగదారులు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. గుడిమల్కాపూర్ కేసులో నిందితులుగా ఉండి, న్యాయస్థానం నుంచి మందస్తు బెయిల్ తీసుకున్న వ్యాపారి కలహర్‌రెడ్డి, పబ్ నిర్వాహకుడు సూర్య కాంత్ సహా మరో వ్యక్తి మంగళవారం దర్యాప్తు అఽధికారి ఎదుట హాజరయ్యారు. గుడిమల్కాపూర్ ఠాణాలో ష్యూరిటీలు సమర్పించడంతో పాటు ఎప్పుడు పిలిచినా విచారణకు హాజరవుతాయని హామీ ఇచ్చారు. కలహర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... ‘హైకోర్టు ఆదేశాల మేరకు గుడిమల్కాపూర్ పోలీసుస్టేషన్ లో లొంగిపోయా. నాకు, డ్రగ్స్ కేసుకి ఎలాంటి సంబంధం లేదు. విచారణకు పూర్తిగా సహకరించాను.. తర్వాత కూడా సహకరిస్తాను. పోలీసులు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తా. నాకు డ్రగ్స్ తీసుకునే అలవాటు లేదు’ అని అన్నారు. -
డ్రగ్స్ కేసులు..పబ్బు గొడవలు.. నిత్యం వివాదాల్లో హీరో నవదీప్!
నవదీప్.. తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరితమైన వ్యక్తి. జై సినిమాతో హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ టాలెంటెడ్ నటుడు.. వరుస ప్రేమ కథా చిత్రాల్లో నటించి లవర్ బాయ్‌గా గుర్తింపు పొందాడు. అయితే సినిమాల కంటే ఎక్కువగా వివాదాలతోనే పాపులర్ అయ్యాడు నవదీప్. డ్రగ్స్ కేసులు..పబ్బు గొడవలు అంటూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు. మాదాపూర్ డ్రగ్స్ కేసులో ఏ-29గా నవదీప్ ఇటీవల హైదరాబాద్ మాదాపూర్‌లోని విఠల్‌నగర్ ఫ్రెష్ లివింగ్ అపార్ట్మెంట్లో డ్రగ్స్ వ్యవహారంతో మరోమారు నవదీప్ పేరు తెరపైకి వచ్చింది. ఈ కేసులో పట్టుబడిన రామ్‌చంద్ ఇచ్చిన సమాచారం మేరకే హీరో నవదీప్‌పై కేసు నమోదైంది. నవదీప్ కు డ్రగ్స్ ముఠా తో సంబంధం ఉందని, అతను సైతం ఈ కేసులో నిందితుడిగా ఉన్నట్లు సీపీ, టీఎస్ఎన్ఏబీ డైరెక్టర్ సీవీ ఆనంద్ ప్రకటించారు. రిమాండ్ రిపోర్ట్‌లో ఏ 29 గా నవదీప్‌ని చేర్చారు. నిన్న విచారణకు కూడా హాజరయ్యాడు. విచారణ కొత్తేమి కాదు డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కోవడం నవదీప్‌కు కొత్తేమి కాదు. 2017లో టాలీవుడ్‌ను కుదిపేసిన డ్రగ్స్ వ్యవహారంలోనూ నవదీప్ విచారణ ఎదుర్కొన్నాడు. నవదీప్‌తో పాటు రవితేజ, ఛార్మీ, రకుల్ ప్రీత్ సింగ్, రానా, పూరి జగన్నాధ్, నవదీప్, తరుణ్, తనీష్, సుబ్బరాజు, ముమైత్ ఖాన్ సహా పలువురు సెలబ్రిటీలను అధికారులు విచారించారు. అప్పట్లో నవదీప్ పేరే అందరికంటే ఎక్కువగా వినిపించింది. వివాదాలకు కేంద్రబిందువుగా నవదీప్ సినిమాల కంటే ఎక్కువగా వివాదాలతోనే వార్తల్లో నిలుస్తుంటాడు నవదీప్. డ్రగ్స్ ఆరోపణలే కాదు.. పబ్ గొడవలు.. విద్యార్థులపై దాడి..తదితర ఆరోపణలు కూడా నవదీప్‌పై ఉన్నాయి. 2011లో స్నేహితులతో కలిసి అనుమతి లేకుండా నాగార్జున సాగర్‌లో పడవ ప్రయాణం చేశాడు. ఈ విషయంపై అప్పట్లో నవదీప్‌పై కేసు కూడా నమోదైంది. అదే ఏడాది హైదరాబాద్‌లోని ప్రముఖ హోటల్లో కొంతమంది ఇంజనీరింగ్ విద్యార్థులతో నవదీప్ గొడవపడ్డాడు. ఓ విద్యార్థిపై దాడి కూడా చేశాడు. ఈ గొడవ విషయంలోనూ మాదాపూర్ ఠాణాలో నవదీప్‌పై కేసు నమోదైంది. గతంలో బంజారాహిల్స్‌లో అతివేగంగా వాహనం నడుపుతూ పోలీసుకులకు పట్టుపట్టాడు. ఆ సమయంలో పోలీసులతో అనుచితంగా వ్యవహరించడంతో కేసు నమోదు చేశారు. ఇప్పుడు రెండోసారి డ్రగ్స్ కేసు విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. -
మూడేళ్ల క్రితం డ్రగ్స్ తీసుకున్నా..
హిమాయత్‌నగర్: మూడేళ్ల క్రితం డ్రగ్స్ తీసుకున్నానని... ఇటీవల కాలంలో ఎప్పుడూ వాటి జోలికి పోలేదని నటుడు నవదీప్ తెలంగాణ స్టేట్ నార్కోటిక్ బ్యూరో (టీఎస్ఎన్ఏబీ) అధికారులకు తెలిపాడు. ఇటీవల హైదరాబాద్ మాదాపూర్‌లోని విఠల్‌నగర్ ఫ్రెష్ లివింగ్ అపార్ట్మెంట్లో డ్రగ్స్ వ్యవహారంలో మరోమారు నవదీప్ పేరు తెరపైకి రావడం, అతడు సైతం డ్రగ్స్ కేసులో నిందితుడిగా ఉన్నట్లు సీపీ, టీఎస్ఎన్ఏబీ డైరెక్టర్ సీవీ ఆనంద్ ప్రకటించిన నేపథ్యంలో టీఎస్ఎన్ఏబీ నుంచి నోటీసులు అందుకున్న హీరో నవదీప్ శనివారం ఉదయం 11 గంటలకు టీఎస్ఎన్ఏబీ కార్యాలయానికి విచారణ నిమిత్తం హాజరయ్యాడు. ఏసీపీ కె.నర్సింగరావుతో కలసి టీఎస్ఎన్ఏబీ (వెస్ట్) ఎస్పీ సునీతారెడ్డి నవదీప్‌ను దాదాపు 7 గంటలపాటు ప్రశ్నించారు. విచారణ అనంతరం నవదీప్ మీడియాతో మాట్లాడుతూ నార్కోటిక్ బ్యూరో అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పానన్నాడు. మళ్లీ ఎప్పుడు పిలిచినా తాను వచ్చేందుకు సిద్ధమని తెలియజేశాడు. ఈమధ్య కాలంలో డ్రగ్స్ తీసుకోలేదు... డ్రగ్స్ వ్యవహారంలో రామ్‌చంద్ అనే వ్యక్తిని టీఎస్ఎన్ఏబీ పోలీసులు విచారించగా తన పేరు చెప్పాడని... అతనిచ్చిన వాంగ్మూలం మేరకు నార్కోటిక్ పోలీసులు ప్రశ్నించారని హీరో నవదీప్ వివరించాడు. తాను మూడేళ్ల క్రితం డ్రగ్స్ తీసుకున్నానే తప్ప ఇటీవల కాలంలో తీసుకోలేదన్నాడు. 15 ఏళ్లుగా పరిచయమున్న రామ్‌చంద్ ఏ కారణంతో తన పేరు చెప్పాడో తెలియదని పేర్కొన్నాడు. డ్రగ్ పెడ్లర్లు వెంకటరమణారెడ్డి, బాలాజీలతో ఉన్న సంబంధం ఏమిటో చెప్పాలంటూ నార్కోటిక్ పోలీసులు ప్రశ్నించగా 2017 నాటి డ్రగ్స్ కేసు విషయం, ఆనాటి పెడ్లర్ల ద్వారా వారు పరిచయమయ్యారని అతను చెప్పినట్లు తెలిసింది. 2017లో ఎక్సైజ్ అధికారులు విచారణకు పిలిచినప్పుడు వారు అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానాలు చెప్పానని నవదీప్ ఈ సందర్భంగా గుర్తుచేశాడు. ఆ 81 మందిపై ఆరా... హీరో నవదీప్ మొబైల్‌ను స్వా«దీనం చేసుకున్న నార్కోటిక్ బృందం క్షుణ్ణంగా పరిశీలించింది. ప్రధానంగా 81 ఫోన్ నంబర్లపై పోలీసులు దృష్టి సారించారు. అందులో డ్రగ్ పెడ్లర్లు, వినియోగదారుల పేర్లు ఉన్నట్లు నార్కోటిక్ పోలీసులు అభిప్రాయానికి వచ్చారు. దీంతో వారి గురించి ఆరా తీస్తున్నట్లు తెలుస్తుంది. నవదీప్‌కు చెందిన ఎస్బీఐ ఖాతాను పరిశీలిస్తున్న పోలీసులు... ఎవరెవరితో లావాదేవీలు జరిగాయనే కోణంలో విచారిస్తున్నారు. అదేవిధంగా అతని మొబైల్లోని స్నాప్‌చాట్, వాట్సాప్, టెలిగ్రామ్ చాట్లను పరిశీలిస్తున్నారు. డ్రగ్స్ కొనుగోలు, విక్రయాలు, అతను ఎవరెవరితో కలసి డ్రగ్స్ తీసుకున్నాడనే విషయాలన్నీ స్నాప్‌చాట్, టెలిగ్రామ్‌ల చాటింగ్‌లో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి ఈ నెలాఖరు లేదా అక్టోబర్ మొదటి వారంలో నవదీప్‌ను విచారణ నిమిత్తం పిలిచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. భయం వేసి పారిపోయా.. డ్రగ్స్ తీసుకోకుంటే పారిపోవాల్సిన అవసరం ఏముందని ఎస్పీ సునీతారెడ్డి నవదీప్‌ను ప్రశ్నించగా మీడియాలో తాను డ్రగ్స్ తీసుకున్నట్లు పదేపదే వార్తలు రావడం వల్ల భయానికి గురయ్యానని హీరో నవదీప్ పేర్కొన్నట్లు తెలిసింది. మీడియా ఒత్తిడి వల్ల తనను నార్కోటిక్ బ్యూరో అరెస్టు చేసే అవకాశం ఉందని భావించి పారిపోయినట్లు విచారణలో అతను చెప్పాడని సమాచారం. 45 మందికి తరచూ ఫోన్లు.. డ్రగ్స్ వ్యవహారంలో హీరో నవదీప్‌ను విచారించాం. మూడేళ్ల క్రితం డ్రగ్స్ తీసుకున్నానని చెప్పాడు. విచారణకు వచ్చే సమయంలో మొబైల్లోని డేటా అంతా తొలగించి.. తల్లికి చెందిన మొబైల్ ఫోన్‌తో వచ్చాడు. అతని మొబైల్ ఫోన్ గురించి ప్రశ్నించగా.. మరమ్మతుల్లో ఉందన్నాడు. దీనిపై క్రాస్ చెక్ చేయగా మొబైల్ షాప్ వ్యక్తి కూడా అదే సమాధానం ఇచ్చాడు. పాత, కొత్త మొబైల్‌తోపాటు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ద్వారా ఇప్పటివరకు 81 లింకులను గుర్తించాం. వాటిలో ప్రధానంగా 45 మందికి నవదీప్ తరచూ ఫోన్‌కాల్స్, మెసేజ్‌లు చేసేవాడు. వాటిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం – ఎస్పీ సునీతారెడ్డి -
నార్కోటిక్ విచారణ పూర్తి.. నవదీప్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
డ్రగ్స్ కేసులో భాగంగా తెలుగు నటుడు నవదీప్‌ని నార్కోటికి అధికారులు విచారించారు. దాదాపు ఆరు గంటల పాటు పలు ప్రశ్నలు అడిగారు. ఇదంతా పూర్తయిన తర్వాత బయటకొచ్చిన నవదీప్.. మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తనకు సంబంధం లేదంటూనే కొత్త విషయాల్ని బయపెట్టాడు. ఇంతకీ అసలేం జరిగింది? నవదీప్ ఏం చెప్పాడు? ఏం జరిగింది? ఈ సెప్టెంబరు 14న తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో అధికారులు.. గుడిమల్కాపుర్ పోలీసులతో కలిసి బెంగళూరుకి చెందిన ముగ్గురు నైజీరియన్స్, ఓ దర్శకుడితో పాటు నలుగురు వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు. ఈ ముఠా నుంచి పలు రకాల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. వీళ్లని విచారించగా.. వీళ్లతో నటుడు నవదీప్ సంప్రదింపులు జరిపినట్లు తేలింది. అరెస్ట్ అయిన వారిలో రామచందర్ అనే వ్యక్తి నుంచి నవదీప్ డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు ఆరోపించారు. ఆధారాలు కూడా ఉన్నాయన్నారు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి ఆ బ్లాక్‌బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) ఈ డ్రగ్స్ కేసులో నటుడు నవదీప్‌ని నిందితుడుగా చేర్చిన పోలీసులు.. తాజాగా అతడిని విచారించారు. ఈ క్రమంలోనే శనివారం దాదాపు 6 గంటలకు పైగా ఈ విచారణ సాగింది. ఇది పూర్తయిన తర్వాత బయటకొచ్చిన తర్వాత నవదీప్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. నవదీప్ కామెంట్స్ 'డ్రగ్స్ కేసులో నోటీసులు ఇచ్చినందుకు నేను విచారణకు వచ్చాను. రామచందర్ అనే వ్యక్తి నాకు పరిచయం ఉన్న మాట వాస్తవమే కానీ అది పదేళ్ల క్రితం విషయం. నేను ఎక్కడా డ్రగ్స్ తీసుకోలేదు. గతంలో ఓ పబ్‌ని నిర్వహించినందుకు నన్ను పిలిచి విచారించారు. గతంలో సిట్, ఈడీ విచారిస్తే ఇప్పుడు తెలంగాణ నార్కోటిక్స్ విచారిస్తుంది. అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాను. అవసరముంటే మళ్లీ పిలుస్తామని చెప్పారు. అలానే ఏడేళ్ల పాత ఫోన్ రికార్డులని కూడా పరిశీలించి దర్యాప్తు చేశారు. డ్రగ్స్ కేసులో సీపీ సీవీ ఆనంద్, ఎస్పీ సునీత రెడ్డి నేతృత్వంలో టీమ్ బాగా పనిచేస్తోంది' అని నవదీప్ చెప్పుకొచ్చాడు. (ఇదీ చదవండి: సీరియల్ బ్యాచ్‌ని వాయించేసిన నాగార్జున.. తప్పుల్ని గుర్తుచేస్తూ!)