Navdeep Gives Clarity On Fake Rumours - Sakshi
Sakshi News home page

Navdeep: నా వల్ల హీరోయిన్‌ ఆత్మహత్య చేసుకుందన్నారు.. గే అన్నారు..

May 6 2023 7:30 PM | Updated on May 6 2023 8:32 PM

Navdeep Gives Clarity On Fake Rumours - Sakshi

నేను గే అని జరిగిన ప్రచారం కూడా అబద్ధమే! ఇకపోతే నా ఆధ్వర్యంలో రేవ్‌ పార్టీ జరిగిందన్న ప్రచారంలోనూ ఎటువంటి వాస్తవం లేదు. అందుకు మా అమ్మ సాక్ష్యం. ఎందుకంటే ఆ

డైరెక్టర్‌ తేజ దర్శకత్వం వహించిన జై సినిమాతో వెండితెరకు హీరోగా పరిచయమయ్యాడు నవదీప్‌. ఆ వెంటనే గౌతమ్‌ ఎస్‌ఎస్‌సీ, చందమామ నిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అతడు హీరోగానే కాకుండా సెకండ్‌ లీడ్‌గా, నెగెటివ్‌ క్యారెక్టర్‌ ఉన్న పాత్రలు సైతం పోషిస్తూ వచ్చాడు. ప్రస్తుతం అతడు న్యూసెన్స్‌ వెబ్‌ సిరీస్‌లో నటిస్తున్నాడు. ఈ సిరీస్‌ మే 12 నుంచి ఆహా ఓటీటీలో ప్రసారం కానుంది.

ఈ క్రమంలో శనివారం జరిగిన న్యూసెన్స్‌ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో నవదీప్‌కు కొన్ని చిక్కుప్రశ్నలు ఎదురయ్యాయి. మీ వల్ల ఓ హీరోయిన్‌ ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని గతంలో వార్తలు వచ్చాయి? దీనికి మీ సమాధానం ఏంటి? అన్న ప్రశ్న ఎదురైంది. దీనికి హీరో నవదీప్‌ స్పందిస్తూ.. '2005లో ఓ హీరోయిన్‌ నా వల్ల ఆ‍త్మహత్య చేసుకుందని వచ్చిన వార్తల్లో నిజం లేదు. అది పూర్తిగా అబద్ధం.

అలాగే నేను గే అని జరిగిన ప్రచారం కూడా అబద్ధమే! ఇకపోతే నా ఆధ్వర్యంలో రేవ్‌ పార్టీ జరిగిందన్న ప్రచారంలోనూ ఎటువంటి వాస్తవం లేదు. అందుకు మా అమ్మ సాక్ష్యం. ఎందుకంటే ఆ సమయంలో నేను అమ్మతో కలిసి ఫామ్‌ హౌస్‌లో డిన్నర్‌ చేశాను. ఈ ఫేక్‌ న్యూస్‌ల వల్ల మా ఇంట్లో కూడా నన్ను అనుమానించే పరిస్థితి వచ్చింది. అమ్మతో ఉన్నప్పుడే అలా ఏదో జరిగిపోయిందంటూ వార్త రాశారు. అదంతా అబద్ధమని ఇంట్లో వాళ్లకు తెలుసు కాబట్టి అప్పటి నుంచి నాపై మా ఇంట్లో నమ్మకం పెరిగింది' అని చెప్పుకొచ్చాడు నవదీప్‌.

చదవండి: త్రిష మాజీ ప్రియుడిని ప్రేమించా: బిందుమాధవి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement