‘‘ప్రస్తుతం అన్ని భాషల్లో కొత్త కంటెంట్‌తో సినిమాలు వస్తున్నాయి. అదే కోవలో తెలుగులో రాబోతున్న వైవిధ్యమైన సినిమా ‘లవ్ మౌళి’. ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించే సినిమా ఇది. నా 20 ఏళ్ల సినీ కెరీర్ తర్వాత నాలో ఉన్న కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తూ చేసిన సినిమా ఇది’’ అని నవదీప్ అన్నారు. నవదీప్ హీరోగా అవనీంద్ర దర్శకత్వం వహించిన చిత్రం ‘లవ్ మౌళి’. పంఖురి గిద్వానీ, భావన సాగి, ‘మిర్చి’ హేమంత్, ‘మిర్చి’ కిరణ్ ఇతర పాత్రల్లో నటించారు.
నైరా క్రియేషన్, శ్రీకర స్టూడియోస్‌తో కలిసి సి స్పేస్ నిర్మించింది. ఈ చిత్రాన్ని జూన్ 7న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా అవనీంద్ర మాట్లాడుతూ– ‘‘నేటి యువతరానికి కావాల్సిన అన్ని అంశాలు మా సినిమాలో ఉన్నాయి. ప్రేమలో ఉన్నవారి బంధాలు ఎలా ఉన్నాయి? నేటి యువతరం ప్రేమించి పెళ్లి చేసుకున్నా బ్రేకప్‌లు అవుతున్నాయి. రాజీపడితే తప్ప బంధాలు నిలబడవా? అనే ప్రశ్నకు నాకు దొరికిన పరిష్కారాన్ని కూడా ఈ చిత్రంలో చూపించాం’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment