ఇటీవలే వరుణ్ తేజ్ పెళ్లి..నెక్ట్స్ నేనే అంటోన్న టాలీవుడ్ హీరో! | Tollywood Hero Navdeep Comments On Marriage With His Mother Advice | Sakshi
Sakshi News home page

Navdeep: 'అమ్మ చెప్పిన లాజిక్ నిజమే'.. పెళ్లిపై నవదీప్ క్లారిటీ!!

Published Fri, Nov 17 2023 3:42 PM | Last Updated on Fri, Nov 17 2023 4:06 PM

Tollywood Hero Navdeep Comments On Marriage With His Mother Advice - Sakshi

టాలీవుడ్‌లో మోస్ట్ బ్యాచలర్‌ హీరోల్లో నవదీప్ ఒకరు.  జై సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన నవదీప్ పలు సినిమాల్లో నటించారు. హీరోగా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా రాణించారు.  గౌతమ్ ఎస్ఎస్‌సీ, ఆర్య-2, ధృవ, అల వైకుంఠపురములో, నేనే రాజు, నేనే మంత్రి లాంటి సూపర్‌ హిట్‌ చిత్రాల్లో కనిపించారు. అయితే ఈ ఏడాది న్యూసెన్స్ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సిరీస్‌కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇప్పటివరకు బ్యాచ్‍లర్‌గానే ఉన్న నవదీప్‌ పెళ్లిపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. తన ట్విటర్ ద్వారా ఓ వీడియోను రిలీజ్ చేశారు.

వీడియోలో నవదీప్ మాట్లాడుతూ.. 'పెళ్లిళ్ల మీద నా అభిప్రాయం తెలిసిన మా మదర్ ఇండియా.. పొద్దున్నే నన్ను ఓ క్వశ్చన్ అడిగింది. నిజంగానే పెళ్లిళ్లు అంత బ్యాడ్ అయితే.. పాపం పెళ్లిళ్లు వర్కవుట్ అవ్వక విడాకులు తీసుకునేవాళ్లు.. మళ్లీ ఎందుకు పెళ‍్లి చేసుకుంటారా? అని అడిగింది.' అని అన్నారు. అంతే కాకుండా వీడియోతో పాటు జరగాలి పెళ్లి అనే క్యాప్షన్ కూడా ఇచ్చాడు.

అయితే ఇది చూసిన అభిమానులు సైతం క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. అన్నా పెళ్లి చేసుకునే పనిలో ఉ‍న్నారా? అంటూ పోస్టులు పెడుతున్నారు. మరికొందరేమో నవదీప్ త్వరలోనే పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉన్నారని కామెంట్స్ చేస్తున్నారు. కొందరేమో అ‍న్నా మీ పెళ్లికి మమ్మల్ని కచ్చితంగా పిలవండి అంటూ హీరోను రిక్వెస్ట్ చేస్తున్నారు. నవదీప్ పోస్ట్‌ను చూస్తే మన హీరో త్వరలోనే పెళ్లిపీటలెక్కడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే గతంలో చాలా సార్లు పెళ్లిపై ప్రశ్నలు ఎదురయ్యాయి. అయితే ఇప్పుడే చేసుకునే ఉద్దేశం లేదని గతంలోనే చెప్పారు. కాగా.. ఇటీవలే టాలీవుడ్ హీరో వరుణ్ తేజ్ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement