మృగాడితో రొమాన్స్‌.. బోల్డ్‌ సీన్లతో ట్రైలర్‌ | Love Mouli Theatrical Trailer Out Now | Sakshi
Sakshi News home page

మృగాడితో రొమాన్స్‌.. బోల్డ్‌ కంటెంట్‌తో ట్రైలర్‌ విడుదల

Apr 9 2024 11:25 AM | Updated on Apr 9 2024 2:06 PM

Love Mouli Theatrical Trailer Out Now - Sakshi

'లవ్‌ మౌళి'గా చాలారోజుల తర్వాత ప్రేక్షకులు ముందుకు రానున్నారు నవదీప్‌. ఆయన హీరోగా నటించిన ఈ చిత్రాన్ని అవనీంద్ర డైరెక్ట్‌ చేయగా.. నైరా క్రియేషన్స్‌, శ్రీకర స్టూడియోస్‌ పతాకాలపై సి స్పేస్‌ సంస్థ నిర్మించింది. ఈ చిత్రం ఏప్రిల్‌ 19న విడుదల కానుంది. ఇందులో పంఖురి గిద్వానీ హీరోయిన్‌గా నటించగా. భావన సాగి, మిర్చి హేమంత్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్‌ను మేకర్స్‌ విడుదల చేశారు.

ప్రేమ అనేది లేకుండా ప్రపంచంలో మనుషులకు దూరంగా బతుకుతున్న ఒక వ్యక్తికి అనూహ్యంగా ప్రేమ దొరికితే ఎలా ఉంటుంది అనే కోణంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మనుషులతో ఎలాంటి పరిచయం లేని వ్యక్తికి  ప్రేమించే వ్యక్తి దొరికితే మనిషి ఎలా మారతాడు అనే విషయాన్ని కాస్త బోల్డ్‌గానే చెప్పినట్లు ట్రైలర్‌తో తెలుస్తోంది.

ట్రైలర్‌లో అక్కడక్కడ రొమాన్స్‌ సీన్లు ఉన్నా.. అందులో ఏదో కంటెంట్‌ ఉంది అనేలా ట్రైలర్‌ను మేకర్స్‌ కట్‌ చేశారు.  2021లో ప్రారంభమైన ఈ సినిమా కరోనా సమయంలో పలు ఇబ్బందులు ఎదుర్కొని ఆపై అనేక ఒడుదొడుకల నడుమ ఇటీవల ఈ ప్రాజెక్ట్‌ పనులు పూర్తి అయ్యాయి. ఏప్రిల్‌ 19న ఈ సినిమా విడుదల కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement