National Film Awards: హనుమాన్‌కు జాతీయ అవార్డు.. ఉత్తమ చిత్రంగా..! | 71st National Film Awards 2025 Winners Live Updates; Check Here Full List | Sakshi
Sakshi News home page

National Film Awards 2025: హనుమాన్‌, బేబీ సినిమాలకు అవార్డులు.. ఉత్తమ నటుడిగా ఇద్దరు హీరోలు..

Aug 1 2025 6:01 PM | Updated on Aug 2 2025 12:14 PM

71st National Film Awards 2025 Winners Live Updates; Check Here Full List

సినిమా ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే జాతీయ చలనచిత్ర అవార్డులను (71st National Film Awards) కేంద్ర ప్రభుత్వం ‍ప్రకటించింది. 12th ఫెయిల్‌ జాతీయ ఉత్తమ చిత్రంగా నిలిచింది. భగవంత్‌ కేసరికి ఉత్తమ తెలుగు చిత్రం పురస్కారం వరించింది. యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్ గేమ్ అండ్ కామిక్ విభాగంలో హనుమాన్‌ ఉత్తమ చిత్రంగా నిలిచింది.  షారూఖ్‌ ఖాన్‌ (జవాన్‌), విక్రాంత్‌ మాస్సే (12th ఫెయిల్‌) బెస్ట్‌ యాక్టర్‌ అవార్డు గెలుచుకున్నారు.  

సుకుమార్‌ కూతురికి పురస్కారం
మిసెస్‌ చటర్జీ వర్సెస్‌ నార్వే చిత్రానికి గానూ రాణీ ముఖర్జీకి ఉత్తమ నటిగా జాతీయ అవార్డు వరించింది. గాంధీ తాత చెట్టు చిత్రానికిగానూ సుకుమార్‌ కూతురు సుకృతి ఉత్తమ బాలనటి అవార్డు గెలుచుకుంది. నేషనల్‌, సోషల్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంటల్‌ వాల్యూస్‌ విభాగంలో సామ్‌ బహదూర్‌ చిత్రానికి జాతీయ అవార్డు వరించింది. 2023లో దేశవ్యాప్తంగా విడుదలైన వందలాది సినిమాల నుంచి అందిన నామినేషన్లను జ్యూరీ పరిశీలించి ఈ విజేతలను ఎంపిక చేసింది.

71వ జాతీయ చలనచిత్ర పురస్కారాల విజేతల జాబితా..

(ఫీచర్‌ ఫిలిం కేటగిరిలో..)
ఉత్తమ సహాయ నటుడు
విజయరాఘవన్‌ - పోక్కాలమ్‌ మలయాళ చిత్రం
ముధుపెట్టయి సోము భాస్కర్‌ - పార్కింగ్‌ తమిళ చిత్రం

ఉత్తమ సహాయ నటి
ఊర్వశి - ఉళ్లోళుక్కు మలయాళ చిత్రం
జంకీ బోడివాల - వశ్‌ గుజరాతీ చిత్రం

బెస్ట్‌ చైల్డ్‌ ఆర్టిస్ట్‌
సుకృతి వేణి బండ్రెడ్డి - గాంధీ తాత చెట్టు
కబీర్‌ ఖాండరి - జిప్సీ మరాఠి మూవీ
త్రిష తోసార్‌, శ్రీనివాస్‌ పోకలే, భార్గవ్‌ జగ్తాప్‌ - నాల్‌ 2 మరాఠీ మూవీ

ఉత్తమ దర్శకుడు
సుదీప్తో సేన్‌ -ద కేరళ స్టోరీ

ఉత్తమ డెబ్యూ దర్శకుడు
ఆశిశ్‌ బెండె- ఆత్మపాంప్లెట్‌

బెస్ట్‌ మేల్‌ ప్లేబ్యాక్‌ సింగర్‌
పీవీఎన్‌ ఎస్‌ రోహిత్‌ - (ప్రేమిస్తున్నా.. బేబీ మూవీ)

బెస్ట్‌ ఫీమేల్‌ ప్లేబ్యాక్‌ సింగర్‌
శిల్పరావు (చెలియా.. జవాన్‌ మూవీ)

బెస్ట్‌ సినిమాటోగ్రఫీ
ప్రసంతను మొహపాత్ర - ద కేరళ స్టోరీ

బెస్ట్‌ లిరిక్స్‌
ఊరు, పల్లెటూరు సాంగ్‌.. లిరిసిస్ట్‌ కాసర్ల శ్యామ్‌ (బలగం)

బెస్ట్‌ యాక్షన్‌ డైరెక్షన్‌ (స్టంట్‌ కొరియోగ్రఫీ)
నందు, పృథ్వి (హనుమాన్‌)

బెస్ట్‌ స్క్రీన్‌ప్లే
ఉత్తమ స్క్రీన్‌ప్లే రచయిత
సాయిరాజేశ్‌ నీలం (బేబీ)
రాంకుమార్‌ బాలకృష్ణన్‌ (పార్కింగ్‌)
డైలాగ్‌ రచయిత
దీపక్‌ కింగక్రాని (సిర్ఫ్‌ ఏక్‌ బండా కాఫి హై)

ఉత్తమ చిల్డ్రన్స్‌ ఫిలిం: నాల్‌ 2 (మరాఠి మూవీ)
బెస్ట్‌ కొరియోగ్రఫీ: దిండోరా బాజ్‌ రె పాట.. కొరియోగ్రాఫర్‌: వైభవి మర్చంట్‌ (రాకీ ఔర్‌ రాణీకి ప్రేమ్‌ కహాని)
బెస్ట్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌: జీవీ ప్రకాశ్‌ కుమార్‌ (సాంగ్స్‌) - (వాతి), హర్షవర్ధన్‌ రామేశ్వర్‌ (బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌)- (యానిమల్‌)
బెస్ట్‌ మేకప్‌: శ్రీకాంత్‌ దేశాయ్‌ (సామ్‌ బహదూర్‌)
బెస్ట్‌ కాస్ట్యూమ్‌ డిజైనర్‌: సచిన్‌ లోవలేకర్‌, దివ్య గంభీర్‌, నిధి గంభీర్‌ (సామ్‌ బహదూర్‌)
బెస్ట్‌ ప్రొడక్షన్‌ డిజైనర్‌: మోహన్‌దాస్‌ (2018: ఎవ్రీవన్‌ ఈజ్‌ ఎ హీరో)
బెస్ట్‌ ఎడిటింగ్‌: మిధున్‌ మురళి (పొక్కలాం- మలయాళ చిత్రం)
బెస్ట్‌ సౌండ్‌ డిజైనర్‌: సచిన్‌ సుధాకరణ్‌- హరిహరణ్‌ మురళీధరన్‌ (యానిమల్‌)
బెస్ట్‌ పాపులర్‌ ఫిలిం (హోల్‌సమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌) - రాకీ ఔర్‌ రాణీకి ప్రేమ్‌ కహాని

ఉత్తమ ప్రాంతీయ చిత్రాల జాబితా

ఉత్తమ తమిళ చిత్రం - పార్కింగ్‌
ఉత్తమ పంజాబీ చిత్రం - గొడ్డే గొడ్డే చా
ఉత్తమ మరాఠి చిత్రం - శ్యాంచీ ఆయ్‌
ఉత్తమ మలయాళ చిత్రం - ఉల్లొళు
ఉత్తమ కన్నడ చిత్రం - కందిలు
ఉత్తమ హిందీ చిత్రం: కాథల్‌
ఉత్తమ గుజరాతీ చిత్రం: వశ్‌
ఉత్తమ ఒడియా చిత్రం- పుష్కర
ఉత్తమ బెంగాలీ చిత్రం: డీప్‌ ఫ్రిడ్జ్‌
ఉత్తమ అస్సామీస్‌ చిత్రం: రొంగటపు 1982

స్పెషల్‌ మెన్షన్‌
యానిమల్‌ (రీరికార్డింగ్‌ మిక్సర్‌) - ఎమ్‌ఆర్‌ రాజకృష్ణన్‌

నాన్‌ ఫీచర్‌ ఫిలిం విజేతల జాబితా
బెస్ట్‌ నాన్‌ ఫీచర్‌ ఫిలిం: ఫ్లవరింగ్‌ మ్యాన్‌ (హిందీ) 
బెస్ట్‌ డైరెక్షన్‌: పీయూశ్‌ ఠాకూర్‌ (ద ఫస్ట్‌ ఫిలిం)
బెస్ట్‌ స్క్రిప్ట్‌: సన్‌ఫ్లవర్స్‌ వర్‌ ద ఫస్ట్‌ వన్స్‌ టు నో (కన్నడ) - కథారచయిత- చిదానంద నాయక్‌
బెస్ట్‌ వాయిస్‌ ఓవర్‌: ద సేక్రడ్‌ జాక్‌: ఎక్స్‌ప్లోరింగ్‌ ద ట్రీ ఆఫ్‌ విషెస్‌ (ఇంగ్లీష్‌) - (వాయిస్‌ ఓవర్‌: హరికృష్ణన్‌ ఎస్‌)
బెస్ట్‌ మ్యూజిక్‌ డైరెక్షన్‌: ప్రణీల్‌ దేశాయ్‌ (ద ఫస్ట్‌ ఫిలిం -హిందీ)

బెస్ట్‌ ఎడిటింగ్‌: నీలాద్రి రాయ్‌ (మూవింగ్‌ ఫోకస్‌)
బెస్ట్‌ సౌండ్‌ డిజైన్‌: శుభరుణ్‌ సేన్‌గుప్తా (దుండగిరి కె పూల్‌)
బెస్ట్‌ సినిమాటోగ్రఫీ: లిటిల్‌ వింగ్స్‌ (తమిళ చిత్రం) - శరవణముత్తు సౌందరపండి, మీనాక్షి సోమన్‌
బెస్ట్‌ ఫిలిం క్రిటిక్‌: ఉత్పల్‌ దత్తా (అస్సామీస్‌)
బెస్ట్‌ డైరెక్షన్‌: పీయూశ్‌ ఠాకూర్‌ (ద ఫస్ట్‌ ఫిలిం)

ఉత్తమ షార్ట్‌ ఫిలిం: గిద్‌ ద స్కావెంజర్‌
బెస్ట్‌ నాన్‌ ఫీచర్‌ ఫిలిం (సోషల్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ వాల్యూస్‌): ద సైలెంట్‌ ఎపిడమిక్‌ (హిందీ)
బెస్ట్‌ డాక్యుమెంటరీ: గాడ్‌ వల్చర్‌ అండ్‌ హ్యుమన్‌ (ఇంగ్లీష్‌, హిందీ, తెలుగు)
బెస్ట్‌ ఆర్ట్స్‌/కల్చర్‌ ఫిలిం: టైమ్‌లెస్‌ తమిళనాడు (ఇంగ్లీష్‌)
బెస్ట్‌ బయోగ్రఫికల్‌/హిస్టారికల్‌ రికన్‌స్ట్రక్షన్‌ ఫిలిం: మా బో, మా గాన్‌ (ఒడియా చిత్రం), లెంటినా ఓ: ఎ లైట్‌ ఆన్‌ ద ఈస్టర్న్‌ హారిజన్‌ (ఇంగ్లీష్‌ చిత్రం)
బెస్ట్‌ డెబ్యూ డైరెక్టర్‌: శిల్పిక బోర్డొలాయ్‌ (మావ్‌: ద స్పిరిట్‌ డ్రీమ్స్‌ ఆఫ్‌ చెరియూ- మిజోరాం చిత్రం)

స్పెషల్‌ మెన్షన్‌
1. నేకల్‌: క్రోనికల్‌ ఆఫ్‌ ద పాడీ మ్యాన్‌ (మలయాళం)
2. ద సీ అండ్‌ సెవన్‌ విలేజెస్‌ (ఒడియా)

చదవండి: ప్రియుడితో బిగ్‌బాస్‌ బ్యూటీ వరలక్ష్మి వ్రతం.. ఫోటోలు వైరల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement