Baby Movie
-
అనంత శ్రీరామ్‌కు ఐఫా అవార్డు
పాటల రచయిత అనంత శ్రీరామ్ ఐఫా(ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్) అవార్డు అందుకున్నారు. ‘బేబి’ సినిమాలోని ‘ఓ రెండు మేఘాలిలా..’ పాటకు ఈ అవార్డు వచ్చింది. ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో సాయి రాజేశ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘బేబి’. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఎస్కేఎన్ నిర్మించిన ఈ సినిమా 2023 జూలై 14న విడుదలై, సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రానికిగానూ ‘ఓ రెండు మేఘాలిలా..’ పాటకు బెస్ట్ లిరిక్ రైటర్‌గా అనంత శ్రీరామ్ తాజాగా ఐఫా అవార్డు అందుకోవడంతో ఎస్కేఎన్, సాయి రాజేశ్ కలిసి అనంత శ్రీరామ్‌ను అభినందించారు. ‘‘బేబి’ మూవీకి ఇప్పటిదాకా ఫిలింఫేర్, సైమా, గామా వంటి అనేక గొప్ప పురస్కారాలు దక్కాయి. తాజాగా ఐఫా దక్కడం ఆనందంగా ఉంది. ఈ సినిమాకు ప్రేక్షకుల రివార్డ్స్‌తో పాటు ప్రతిష్టాత్మక అవార్డులు దక్కుతున్నాయంటే ఆ ఘనత సాయి రాజేశ్‌కే దక్కుతుంది. ఈ ప్రేమ కథను హృద్యంగా తెరపై ఆవిష్కరించారాయన’’ అని మేకర్స్ తెలిపారు. కాగా ఎస్కేఎన్, సాయి రాజేశ్ కాంబినేషన్లో ‘బేబి’ సినిమా బాలీవుడ్లో రీమేక్ అవుతోంది. -
హైదరాబాద్: నల్లగండ్లలో సందడి చేసిన సినీనటి వైష్ణవి చైతన్య (ఫొటోలు)
-
69th Filmfare Awards 2024: ఐదు అవార్డ్స్‌తో సత్తా చాటిన ‘బేబి’
69వ ఫిల్మ్ ఫేర్ సౌత్ 2024 అవార్డ్స్ లో ‘బేబి’ సినిమా సత్తా చాటింది. 8 నామినేషన్స్‌లో ఏకంగా 5 అవార్డులను దక్కించుకొని చరిత్ర సృష్టించింది. ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం గతేడాది జులైలో విడుదలై ఘన విజయం సాధించింది. బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్ల వసూళ్లను సాధించి రికార్డు క్రియేట్ చేసింది. (చదవండి: Filmfare South 2024: ఆ మూడు సినిమాలకే దాదాపు అవార్డులన్నీ..)కేవలం కలెక్షన్స్ పరంగానే కాకుండా అవార్డుల పరంగానూ ‘బేబి’ దూసుకెళ్తోంది. ఇప్పటికే పలు అవార్డులను సొంతం చేసుకున్న ఈ చిత్రం.. తాజాగా జరిగిన ఫిల్మ్ ఫేర్ సౌత్ 2024 అవార్డ్స్ల్లోనూ ఐదు అవార్డులను సొంతం చేసుకుంది. బేబి సినిమాలో ది బెస్ట్ పర్ ఫార్మెన్స్ ఇచ్చిన వైష్ణవి చైతన్య బెస్ట్ యాక్ట్రెస్ గా, క్లాసిక్ ఇమేజ్ తో పాటు కమర్షియల్ సక్సెస్ సాధించి 100 కోట్ల గ్రాసర్ గా నిలిచినందుకు బెస్ట్ ఫిల్మ్ గా అవార్డు సొంతం చేసుకుంది.(చదవండి: ఒక్క సినిమాకు ఆరు అవార్డులు.. కోలీవుడ్‌లో ఎవరికి వచ్చాయంటే?)అలాగే తన మ్యూజిక్ తో బేబికి ప్రాణం పోసిన విజయ్ బుల్గానిన్ బెస్ట్ మ్యూజిక్ కంపోజర్ గా, ఓ రెండు మేఘాలిలా పాటతో టైటిల్స్ నుంచే సినిమాలో ప్రేక్షకుల్ని లీనం చేసేలా సాహిత్యాన్ని అందించిన అనంత్ శ్రీరామ్ కు బెస్ట్ లిరిసిస్ట్ గా, ఈ పాట అందంగా పాడిన శ్రీరామ చంద్ర బెస్ట్ సింగర్ గా అవార్డ్స్ దక్కాయి. -
ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్-2024.. తెలుగులో ఎవరెవరికి వచ్చాయంటే?
69వ ఫిల్మ్ ఫేర్ -2024 సౌత్ అవార్డుల కార్యక్రమం హైదరాబాద్‌లో శనివారం అంగరంగ వైభవంగా జరిగింది. దక్షిణాది చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖ నటీనటులు అందరూ ఈ వేడుకకు హాజరయ్యారు. ఇకపోతే తెలుగులో దసరా, బలగం, బేబి చిత్రాల్నే దాదాపు అవార్డులన్నీ వరించడం విశేషం. ఇంతకీ ఎవరెవరికీ ఏయే అవార్డు వచ్చిందనేది ఇప్పుడు చూద్దాం.(ఇదీ చదవండి: కట్టప్ప లేటెస్ట్ సినిమా.. డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్)69వ ఫిల్మ్ ఫేర్ తెలుగు-2024 అవార్డ్ విజేతల జాబితాఉత్తమ సినిమా - బలగంఉత్తమ నటుడు - నాని (దసరా)ఉత్తమ నటి - కీర్తి సురేశ్ (దసరా)ఉత్తమ దర్శకుడు - వేణు (బలగం)ఉత్తమ పరిచయ దర్శకుడు - శ్రీకాంత్ ఓదెల (దసరా), శౌర్యువ్ (హాయ్ నాన్న)ఉత్తమ చిత్రం (క్రిటిక్స్) - సాయి రాజేశ్ (బేబి)ఉత్తమ నటి (క్రిటిక్స్) - వైష్ణవి చైతన్య (బేబి)ఉత్తమ నటుడు (క్రిటిక్స్) - నవీని పొలిశెట్టి (మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి), ప్రకాశ్ రాజ్ (రంగమార్తాండ)ఉత్తమ సహాయ నటుడు - రవితేజ (వాల్తేరు వీరయ్య), బ్రహ్మానందం (రంగమార్తాండ)ఉత్తమ సహాయ నటి - రూపలక్ష్మి (బలగం)ఉత్తమ గాయకుడు - శ్రీరామ చంద్ర (ఓ రెండు ప్రేమ మేఘాలిలా- బేబి)ఉత్తమ గాయని - శ్వేత మోహన్ (మాస్టారూ మాస్టారూ- సార్)ఉత్తమ సాహిత్య - అనంత్ శ్రీరామ్ (ఓ రెండు ప్రేమ మేఘాలిలా- బేబీ)ఉత్తమ సంగీతం - విజయ్ బుల్గానిన్ (బేబి)ఉత్తమ సినిమాటోగ్రాఫీ - సత్యన్ సూరన్ (దసరా)ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ - కొల్లా అవినాష్ (దసరా)ఉత్తమ కొరియోగ్రఫీ - ప్రేమ్ రక్షిత్ (ధూమ్ ధామ్ దోస్తానా- దసరా) -
సైమా అవార్డ్స్ కోసం పోటీలో ఉన్న సినిమాలు, హీరోలు.. లిస్ట్ ఇదే
సినీ రంగానికి సంబంధించి ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డుల్లో సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా) ఒకటి. ఈ అవార్డుల విషయంలో ప్రేక్షకులకు తీపి కబురు వినిపించింది సైమా. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ చిత్ర పరిశ్రమకి చెందిన నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణుల్ని ప్రోత్సహించే ఉద్దేశంతో ప్రారంభమైంది. 12 ఏళ్లుగా విజయవంతంగా ఈ పురస్కారాల వేడుకలు జరుగుతున్నాయి. 2024 ఏడాది సైమా ఉత్సవాలకు ముహూర్తం ఖరారైంది.ఈ ఏడాది సెప్టెంబరు 14, 15 తేదీల్లో జరగనున్న ఈ వేడుకకు దుబాయ్ వేదిక కానుంది. ఈ అవార్డ్స్ దక్కించుకునేందుకు పోటీ పడుతున్న చిత్రాల జాబితాను ‘సైమా’ టీమ్ తాజాగా విడుదల చేసింది. 2023లో రిలీజైన సినిమాలకు ఈ అవార్డ్స్ దక్కనున్నాయి. టాలీవుడ్ నుంచి నాని నటించిన దసరా సినిమా అత్యధికంగా 11 విభాగాల్లో పోటీపడుతుంది. తమిళ్ నుంచి జైలర్ 9 విభాగాల్లో సత్తా చాటుతుంది. మలయాలళం నుంచి టొవినో థామస్ 2018, దర్శన్ నటించిన కాటేర (కన్నడ) 8 విభాగాల్లో రేసులో ఉన్నాయి.ఉత్తమ చిత్రం కోసం బరిలో ఉన్న సినిమాలు సలార్: సీజ్ ఫైర్దసరాహాయ్ నాన్నమిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టిబేబీబలగంసామజవరగమనఉత్తమ నటుడి అవార్డ్ లిస్ట్లోచిరంజీవి (వాల్తేర్ వీరయ్య)బాలకృష్ణ (భగవంత్ కేసరి)ఆనంద్ దేవరకొండ (బేబీ)నాని (దసరా)నాని (హాయ్ నాన్న)ప్రకాశ్ రాజ్ (రంగమార్తాండ)ధనుష్ (సర్)నవీన్ పొలిశెట్టి (మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి)ఉత్తమ నటి కోసం పోటీ పడుతున్న హీరోయిన్లుకీర్తిసురేశ్ (దసరా)సమంత (శాకుంతలం)అనుష్క (మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి)వైష్ణవీ చైతన్య (బేబీ)మృణాళ్ ఠాకూర్ (హాయ్ నాన్న) ఉత్తమ దర్శకుడు కోసం బరిలో ఉన్న డైరెక్టర్స్ ప్రశాంత్‌నీల్ (సలార్:పార్ట్-1 సీజ్ ఫైర్)వేణు యెల్దండ (బలగం)శ్రీకాంత్ ఓదెల (దసరా)అనిల్ రావిపూడి (భగవంత్ కేసరి)శౌర్యువ్ (హాయ్ నాన్న)కార్తిక్ దండు (విరూపాక్ష)సాయి రాజేశ్ (బేబీ) -
'బేబి' డైరెక్టర్‌కి షాకింగ్ ఎక్స్‌పీరియెన్స్.. పాపం అలా అనేసరికి!
'బేబి' సినిమా గతేడాది ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టీనేజ్ లవ్ స్టోరీతో దర్శకుడు సాయి రాజేశ్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేశాడు. గతంలో పలు సినిమాలకు దర్శకుడు, నిర్మాతగా వ్యవహరించినప్పటికీ.. 'బేబి'తోనే అందరికీ బాగా పరిచయమయ్యాడు. ప్రస్తుతం కొత్త ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఇతడికి తాజాగా వింత అనుభవం ఎదురైంది. భోజనానికి పిలిచి మరీ షాకిచ్చారు. దీని గురించి స్వయంగా సాయి రాజేశ్ ఇన్ స్టాలో పోస్ట్ పెట్టాడు.(ఇదీ చదవండి: పొరపాట్లు ఒప్పుకొన్న 'కల్కి' డైరెక్టర్.. ఆ మూడు విషయాల్లో!)'నిన్న ఒక స్నేహితుడు బలవంతం మీద , తన ప్రాణ స్నేహితుడి ఇంటికి భోజనానికి వెళ్లాను, 'నీ సినిమా అంటే మా వాడికి ప్రాణం, 50 సార్లు చూసుంటాడు, ఇన్నేళ్ల మా స్నేహం లో ఏది ఆడగలేదు, నిన్ను భోజనానికి తీసుకు రమ్మన్నాడు' అన్నాడు. సర్లే మనకి ఈ చపాతీలు, రోటీలు మొహం మొత్తింది. హోమ్ ఫుడ్ తినొచ్చు అని వెళ్లాను. 10 రకాల వంటలు, అద్భుతమైన ఆతిథ్యం , ఎంత గొప్ప సినిమా సర్ అని వాళ్ల ఆవిడకి, పక్కింటి వాళ్లకి, గేట్ దగ్గర వాచ్ మాన్‌కి, కొరియర్ బాయ్‌కి, సార్‌తో సెల్ఫీ దిగండి, 'బేబీ సినిమా డైరెక్టర్' అని 30 ఫోటో లు ఇప్పించారు. ఒక గంట తర్వాత ప్లేట్లో గారెలు, నాటుకోడి పులుసు వడ్డించారు. 'మా అమ్మాయికి సమంత అంటే చాలా ఇష్టమండి, ఒక ఫొటో ఇప్పించండి, మళ్లీ ఎప్పడు చేస్తున్నారు ఆవిడతో' అని అన్నాడు. ఇంత జరిగినా గారెలు సిగ్గు లేకుండా లోపలకి వెళ్లిపోయినాయి. ఓ బేబీ' అని సాయి రాజేశ్ రాసుకొచ్చాడు.గతంలో సమంత ప్రధాన పాత్రలో 'ఓ బేబీ' అనే సినిమా వచ్చింది. 'బేబి' పేరుతో సాయి రాజేశ్ ఓ మూవీ తీశాడు. ఈ రెండింటి విషయంలో పొరబడ్డ డైరెక్టర్ ఫ్రెండ్ ఫ్రెండ్ సాయి రాజేశ్ పెద్ద షాకిచ్చాడు. అక్కడ ఏం చెప్పాలో తెలీక ఇలా ఇన్ స్టాలో పోస్ట్ పెట్టి అందరినీ నవ్వించేస్తున్నాడు. ఏదేమైనా 'బేబి' పేరు ఎంత పనిచేసింది!(ఇదీ చదవండి: ప్రభాస్ 'రాజాసాబ్'... ఆ వార్తలు నమ్మొద్దని టీమ్ ప్రకటన) View this post on Instagram A post shared by Sai Rajesh (@sairazesh) -
'బేబి' హీరోయిన్ నుంచి త్వరలో గుడ్ న్యూస్?
'బేబి' ఫేమ్ వైష్ణవి చైతన్య త్వరలో గుడ్ న్యూస్ చెప్పబోతుందా? ఏమో మరి ఓ షోలో ఈమె సహ నటుడే ఈ విషయాన్ని బయటపెట్టాడు. దీంతో అది ఏమై ఉంటుందా అని మాట్లాడుకుంటున్నారు. అయితే చెప్పబోయే శుభవార్త ఏంటి? ఇంతకీ ఏం చెప్పాడు?షార్ట్ ఫిల్మ్స్‌తో కెరీర్ మొదలుపెట్టిన వైష్ణవి చైతన్య.. పలు సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్ చేసింది. ఎప్పుడైతే 'బేబి' మూవీలో హీరోయిన్గా చేసిందో ఈమె దశ తిరిగిపోయింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ వల్ల ఈమెకు హీరోయిన్గా టాలీవుడ్లో మంచి ఛాన్సులు వస్తున్నాయి. రీసెంట్గా 'లవ్ మీ' చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించింది.(ఇదీ చదవండి: ప్రేమికులే హంతకులైతే? ఇంట్రెస్టింగ్గా 'పరువు' ట్రైలర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?)ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా 'సుమ అడ్డా' షోలో పాల్గొన్నారు. అయితే అందుకు సంబంధించిన ప్రోమోని ఇప్పుడు రిలీజ్ చేశారు. ఇందులోనే ఓ చోట హీరో అశిష్.. వైష్ణవి చైతన్య త్వరలో గుడ్ న్యూస్ చెప్పబోతుందని అన్నాడు. వెంటనే అందుకున్న సుమ.. రీసెంట్గా పెళ్లి జరిగింది నీకు, చెబితే నువ్వు చెప్పాలి అని సెటైర్ వేసింది.మరి వైష్ణవి చైతన్య నుంచి గుడ్ న్యూస్ అంటే పెళ్లి ఏమైనా చేసుకోబోతుందా అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. లేదంటే ఏదైనా పెద్ద మూవీలో హీరోయిన్గా అవకాశమైనా వచ్చి ఉండొచ్చేమో అని అనుకుంటున్నారు.(ఇదీ చదవండి: 'భారతీయుడు 2'.. శంకర్ మార్క్ కనబడట్లేదే?) -
సాయి రాజేష్ పాము లాంటి వ్యక్తి.. గాయత్రి సెన్సేషనల్ కామెంట్స్
బేబీ సినిమా కథ నాదేనంటూ షార్ట్ ఫిలిం డైరెక్టర్, సినిమాటోగ్రాఫర్ శిరిన్ శ్రీరామ్ కొన్నిరోజులుగా పోరాడుతున్నాడు. గతేడాదిలో ఆనంద్ దేవరకొండ , వైష్ణవి చైతన్య , విరాజ్ ఆనంద్ ప్రధాన పాత్రల్లో నటించిన 'బేబీ' చిత్రాన్ని సాయి రాజేశ్ దర్శకత్వం వహిస్తే ఎస్కేఎన్ నిర్మాతగా తెరకెక్కించారు. అయితే, ఈ కథ మొత్తం తనదే అంటూ ఐడియాను కాపీ కొట్టి సాయి రాజేశ్ బేబి సినిమా తీశాడని దర్శకుడు శిరిన్ శ్రీరామ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ విషయంపై సాక్ష్యాలతో సహా సాయి రాజేష్ మీద ‘బేబీ లీక్స్ అనే బుక్‌ను వెబ్సైట్లో https://babyleaks2023.blogspot.com/ అందుబాటులోకి తీసుకొచ్చాడు.బేబీ సినిమా డైరెక్టర్ సాయి రాజేష్ చేసిన మోసం, దానికి సంబంధించిన సాక్ష్యాలను బేబీ లీక్స్ అంటూ పుస్తకరూపంలో తీసుకొచ్చారు. ఈ బేబీ లీక్స్ బుక్‌ను మీడియా ముందుంచారు. అయితే, తాజాగా సినీ నటి గాయత్రి గుప్తా కూడా ఈ అంశంపై రియాక్ట్ అయింది. ఫిదా సినిమాతో పాపులర్ అయిన గాయత్రి.. ఐస్ క్రీమ్ 2, కొబ్బరిమట్ట, మిఠాయి లాంటి సినిమాల్లో నటించింది. బేబీ డైరెక్టర్ సాయి రాజేష్ గురించి గాయత్రి ఇలా చెప్పుకొచ్చింది. 'బేబీ సినిమా కథను ప్రేమించొద్దు అనే పేరుతో శిరిన్ శ్రీరామ్ రాసుకున్నారు. దానిని సాయి రాజేష్ కాపీ కొట్టేశాడు. ఈ సినిమాలో మొదటగా హీరోయిన్గా నన్ను అనుకున్నారు. అందుకు ఆడిషన్ కూడా జరిగింది. స్కూల్ డ్రెస్‌లో ఉన్న ఆ ఫోటోలను సాయి రాజేష్‌కు చూపించాను. దానినే బేబీలో కాపీ కొట్టాడు. ట్రైలర్ విడుదల అయ్యాక చూసి నేను షాక్ అయ్యాను. సాయి రాజేష్‌తో ఇబ్బందులు నాకు కొత్త కాదు. ఆయన డైరెక్ట్ చేసిన కొబ్బరిమట్టలో కూడా నన్ను ఇబ్బంది పెట్టాడు. ఆ సినిమాకు సంబంధించి రూ. 3లక్షలు ఇస్తానన్నారు. కానీ, కేవలం రూ.25 వేలు ఇచ్చి బాగా టార్చర్ పెట్టారు. అవన్నీ సరేలే అనుకుంటే.. బేబీ కథను మొదట రాసుకుంది శిరిన్. కానీ, సాయి రాజేష్ మాత్రం ఆ కథను తానే క్రియేట్ చేశానంటాడు. ఇద్దరూ కలిసి ఆ కథతో సినిమా తీద్దామని చివరి క్షణంలో బడ్జెట్ లేదని తెలివిగా శిరిన్‌ను తప్పించాడు. అదే కథను శిరిన్ నుంచి సాయి రాజేష్ కాపీ కొట్టేసి.. గీతా ఆర్ట్స్‌లో చర్చలు జరిపాడు. ఆ సంస్థ చాలా మంచిది. కానీ, పాము లాంటి సాయి రాజేష్‌ను వారు గుర్తించాలి. బేబీ సినిమా కోసం సాయి రాజేష్ చాలా చీప్ ట్రిక్స్ చేశాడు. బేబీ పాత్రను చాలా దారుణంగా చూపించాడు. కొందరైతే హీరోయిన్ పోస్టర్‌ను చెప్పులతో కూడా కొట్టారు. అంతలా ఆయన పబ్లిసిటీని ఉపయోగించుకున్నాడు. సాయి రాజేష్ లాంటి వ్యక్తి టాలీవుడ్‌కు మచ్చలా మిగిలిపోతాడు. బేబీ కథ రాసుకున్న శిరిన్ శ్రీరామ్‌కు న్యాయం జరిగాలి.' అని కోరుకుంటున్నట్లు ఆమె తెలిపింది. -
సాయి రాజేశ్ మోసం చేశాడు.. అందుకే బేబీ లీక్స్ రాశా: టాలీవుడ్ డైరెక్టర్
నా ఐడియాను కాపీ కొట్టి సాయి రాజేశ్ బేబి సినిమా తీశాడని దర్శకుడు శిరిన్ శ్రీరామ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ విషయంపై సాక్ష్యాలతో సహా సాయి రాజేష్ మీద ‘బేబీ లీక్స్ అనే బుక్ అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా బేబీ లీక్స్ పేరిట బుక్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ టాపిక్ టాలీవుడ్లో చర్చనీయాశంగా మారింది. తాజాగా నిర్వహించిన ప్రెస్ మీట్లో ఈ విషయాలన్నీ శిరీన్ శ్రీరామ్ ప్రస్తావించారు.శిరిన్ శ్రీరామ్ కేఫ్ బ్యానర్‌పై అనురూప్ రెడ్డి, దేవా మలిశెట్టి, సారిక, మానస ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ప్రేమించొద్దు’. శిరిన్ శ్రీరామ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందించారు. పాన్ ఇండియా చిత్రంగా 5 భాషల్లో నిర్మించారు. ఈ చిత్రం తెలుగు వర్షన్ జూన్ 7న విడుదల కానుంది. ఈ క్రమంలో శిరీన్ శ్రీరామ్ తనకు సాయి రాజేష్ చేసిన అన్యాయం, తన కథను కాపీ కొట్టి బేబీ సినిమా తీయడంపై మరోసారి స్పందించాడు. సాయి రాజేష్ చేసిన మోసం, దానికి సంబంధించిన సాక్ష్యాలను బేబీ లీక్స్ అంటూ పుస్తకరూపంలో తీసుకొచ్చారు. ఈ బేబీ లీక్స్ బుక్‌ను మీడియా ముందుంచారు.ఈ సందర్భంగా శిరీన్ శ్రీరామ్ మాట్లాడుతూ.. 'రవి కిరణ్ అనే వ్యక్తిని 2015లో కలిశాను. తరువాత రవి కిరణ్ ఫేస్ బుక్‌లో పెట్టిన పోస్ట్ చూసి ఓ పాయింట్ అనుకున్నా. ఓ అమ్మాయిని ఇద్దరబ్బాయిలు కలిసి చంపారనే పోస్ట్ చూసి కథ అనుకున్నాం. దాన్ని ఓ బస్తీ అమ్మాయి పాత్రతో లింక్ చేసి కథ రాసుకున్నా. ఆ టైంలో నిర్మాత సాయి రాజేశ్‌తో ఏడాది ప్రయాణం చేశా. నాకు దర్శకుడిగా అవకాశం ఇస్తూ.. ఆయనే సినిమాను నిర్మిస్తానని అన్నారు. అయితే ఆలస్యం అవుతూ వచ్చింది. కారణాలేమైనా ఉండొచ్చేమో అనిపించి.. ఆయన సినిమా నిర్మించడం లేదని నేను బయటకు వచ్చేశా. అప్పుడు మాకేం గొడవ జరగలేదు.' అని అన్నారు.ఆ తర్వాత మాట్లాడుకూ..'నాకు దర్శకత్వం అవకాశం ఇస్తానన్నవాడు.. నా కథను కాపీ కొట్టి అదే బస్తీ అమ్మాయి.. ఇద్దరబ్బాయిల్ని ప్రేమించే కథతో బేబీ అనే సినిమా తీశాడు. 2023 జూలైలో సినిమా రిలీజ్ అయినప్పుడు రచ్చ చేయలేదు. నాకు రియలైజ్ అవ్వడానికి చాలా టైం పట్టింది. సాక్ష్యాలు అన్నీ సంపాదించి లాయర్ నిఖిలేశ్‌ను కలిశాను. కాపీరైట్ లీగల్ నోటీస్ పంపాం. కానీ నాకే ఆయన ఆ కథను చెప్పాడని ఆ నోటీసులో రిప్లై ఇచ్చాడు. హృదయ కాలేయం సినిమాకు ఫ్రీగా టీజర్ డైరెక్ట్ చేసి, ఎడిట్ చేసి ఇచ్చా. కానీ నన్నే మోసం చేశాడు. ఫిబ్రవరిలో రాయదుర్గంలో కేసు ఫైల్ చేశా. నన్ను బద్నాం చేసేందుకు ఫిల్మ్ ఛాంబర్, ప్రొడ్యూసర్ కౌన్సిల్లో ఫిర్యాదులు చేశాడు. అందుకే ఆయన మీద బేబీ లీక్స్ అనే పుస్తకాన్ని కూడా రాశా. ఇవాళ దాన్ని మీడియా ముందుకు తీసుకొస్తున్నా. https://babyleaks2023.blogspot.com/ అనే ఆన్ లైన్లో మాధ్యమంలో పీడీఎఫ్, వెబ్ సైట్ కూడా ఉంది.' అని అన్నారు. -
బేబీ హీరోయిన్ హారర్ థ్రిల్లర్.. ట్రైలర్ చూశారా?
ఆశిష్, బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య జంటగా నటించిన చిత్రం లవ్ మీ. ఇఫ్ యు డేర్ అన్నది ఉపశీర్షిక. ఈ చిత్రానికి అరుణ్ భీమవరపు దర్శకత్వం వహించారు. శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్‌పై హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మించారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.ట్రైలర్ చూస్తే హారర్ థ్రిల్లర్‌గా ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. దెయ్యంతో హీరో ప్రేమలో పడడం అనే కాన్సెప్ట్ ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. హీరో, దెయ్యం మధ్య సన్నివేశాలు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తున్నాయి. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 25న థియేటర్లలో విడుదల కానుంది. -
అప్పుడు 'బేబీ'.. ఇప్పుడు 'బ్యూటీ'!
గతేడాది వచ్చిన సూపర్ హిట్ సినిమాల లిస్ట్ తీస్తే అందులో 'బేబి' కచ్చితంగా ఉంటుంది. అంచనాలు లేకుండా థియేటర్లలోకి వచ్చి, సంచలన విజయం సాధించింది. ఇందులో నటించిన నటీనటులు, టెక్నీషియన్స్‌కు మంచి పేరు కూడా వచ్చింది. ఈ సినిమా నిర్మాతల్లో డైరెక్టర్ మారుతి ఒకడు. ఇప్పుడు ఈయన నుంచి మరో సినిమా వస్తోంది. దానికి 'బ్యూటీ' అని పేరు ఖరారు చేశారు. (ఇదీ చదవండి: జబర్దస్త్ కమెడియన్ల బ్రేకప్? గొడవలు నిజమేనన్న నూకరాజు) సుబ్రహ్మణ్యం ఆర్.వీ దర్శకత్వం వహిస్తుండగా.. జీ స్టూడియోస్‌తో కలిసి మారుతి టీమ్ నిర్మిస్తోంది. ఏ. విజయ్ పాల్ రెడ్డి నిర్మాత. ఈనెల 22న లాంఛనంగా ప్రారంభిస్తారు. అప్పుడే టైటిల్‌ని కూడా అధికారికంగా ప్రకటిస్తారు. ‘బేబీ’లో సినిమాలో దాదాపు అంతా కొత్తవారే కనిపించారు. అయితే అందులో కల్ట్ పాయింట్ పట్టుకొన్నారు. అది యూత్‌కి బాగా నచ్చింది. ఈ ‘బ్యూటీ’ కూడా అంతేనని సమాచారం. 'బేబీ' ఫేమ్ విజయ్ బుల్గానిన్ ఈ చిత్రానికి సంగీతమందిస్తున్నాడు. (ఇదీ చదవండి: హీరోగా సీనియర్ నటుడు.. మూవీ టీజర్ రిలీజ్) -
తెలుగుతనం ఉట్టిపడుతున్న ‘బేబీ’ గర్ల్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)
-
ఆ టైటిల్ ఏంటి.. ట్రైలర్లో సీన్లేంటి?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (టీఎస్–నాబ్) అధికారులు అవసరమైన సందర్భాల్లో సినిమాల ’సెన్సార్ బోర్డు’బాధ్యతల్నీ చేపడుతున్నారు. ఆయా చిత్రాల్లో మాదకద్రవాల వినియోగాన్ని ప్రేరేపించేలా ఉన్న సీన్లు, టైటిల్స్ మార్చాల్సిందిగా ఆదేశిస్తున్నారు. గతంలో ఆనంద్ దేవరకొండ హీరోగా వచి్చన ‘బేబీ’చిత్రంపై స్పందించిన అధికారులు తాజాగా సాయి ధరమ్‌తేజ్ కథానాయకుడిగా రూపొందించిన ‘గాంజా శంకర్’ను పరిగణనలోకి తీసుకున్నారు. ఈ సినిమా టైటిల్ మార్చాలని, చిత్రంలోని సన్నివేశాల్లో సైతం గంజాయి పండించడం, విక్రయించడం, వినియోగించడాలను ప్రోత్సహించేవిగా లేకుండా చూడాలని స్పష్టం చేశారు. ఈ మేరకు టీఎస్ నాబ్ డైరెక్టర్ సందీప్ శాండిల్య శనివారం హీరో సాయి ధరమ్‌తేజ్, నిర్మాత ఎస్.నాగవంశీ, దర్శకుడు సంపత్ నందిలకు నోటీసులు జారీ చేశారు. ‘బేబీ’లో వివాదాస్పదమైన ఓ సీన్... మాదాపూర్‌లోని విఠల్‌నగర్‌లో ఉన్న ఫ్రెష్ లివింగ్ అపార్ట్మెంట్లో జరుగుతున్న ఓ డ్రగ్ పార్టీపై టీఎస్ నాబ్ అధికారులు గతేడాది దాడి చేశారు. ఆ ఫ్లాట్‌లో కనిపించిన సీన్‌కు అప్పట్లో విడుదలైన ‘బేబీ’సినిమాలోని సీన్లకు మధ్య సారూప్యత ఉందని అధికారులు తేల్చారు. దాంతో మాదకద్రవ్యాల వినియోగాన్ని ప్రేరేపించేలా ఉన్న ఆ సన్నివేశాలకు సంబంధించి చిత్ర యూనిట్‌కు నోటీసులు ఇచ్చారు. దీంతో అభ్యంతరకరమైన సీన్లు వచి్చనప్పుడు సినిమాలో వారి్నంగ్ నోట్ వచ్చేలా దర్శకుడు చర్యలు తీసుకున్నారు. తాజాగా మరోసారి తెరపైకి వివాదం... గత ఏడాది సెప్టెంబర్ నాటి ‘బేబీ’చిత్రం తర్వాత ఈ వివాదం మళ్లీ తెరపైకి రాలేదు. తాజాగా శుక్రవారం ట్రైలర్ విడుదలైన గాంజా శంకర్ చిత్రం విషయంలో టీఎస్ నాబ్ కలగజేసుకుంది. ఈ సినిమా టైటిల్‌తో పాటు ట్రైలర్లో కనిపించిన సన్నివేశాలు సైతం యువత... ప్రధానంగా విద్యార్థులను గంజాయి వినియోగం, విక్రయం వైపు ఆకర్షించేలా ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు. ఈ చిత్ర కథానాయకుడు గంజాయి వ్యాపారిగా కనిపిస్తున్నాడని, దీని ప్రభావంతో పలువురు ఆ దారిలో వెళ్లే ప్రమాదం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు టీఎస్ నాబ్ డైరెక్టర్ సందీప్ శాండిల్య ‘గాంజా శంకర్’ సినిమా హీరోతో పాటు దర్శకనిర్మాతలకు నోటీసులు జారీ చేశారు. సినిమా టైటిల్‌తో పాటు అభ్యంతరకరమైన, గంజాయి, డ్రగ్స్ వైపు యువతను మళ్లించేలా ఉన్న వాటిని మార్చాలని స్పష్టం చేశారు. సినిమా పేరులో ఉన్న గాంజా అనే పదం తీసేయాలని కోరారు. అలా కాని పక్షంలో ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బాలీవుడ్ చిత్రాలపై ఎన్సీబీ సహాయంతో... ఈ నోటీసుల ప్రతిని టీఎస్–నాబ్ అధికారులు తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, డైరెక్టర్స్ అసోసియేషన్లతో పాటు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌కు పంపారు. అయితే బాలీవుడ్ చిత్రాల్లో డ్రగ్స్‌కు సంబంధించిన సీన్లు అనేకం ఉంటున్నాయి. ఇప్పటి వరకు వీటి విషయం ఎవరూ పట్టించుకోలేదు. టీఎస్ నాబ్ అధికారులు మాత్రం వీటినీ తీవ్రంగా పరిగణించాలని యోచిస్తున్నారు. బాలీవుడ్ చిత్రాల్లోనూ డ్రగ్స్‌ను ప్రేరేపించేలా సీన్లు లేకుండా చూడాలని, ఉన్న వాటిపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వ అ«దీనంలోని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోను (ఎన్సీబీ) కోరనున్నారు. ఆ విభాగం లెక్కల ప్రకారం ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 14 కోట్ల మంది డ్రగ్స్ వినియోగదారులు ఉన్నారు. డ్రగ్స్ ప్రేరేపించే చిత్రాలను సీరియస్‌గా తీసుకోకుంటే భవిష్యత్తరాలు నిర్విర్యమయ్యే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. -
'బేబీ' దర్శక, నిర్మాతలపై పోలీసులకు ఫిర్యాదు
బేబీ సినిమా కథ నాదేనంటూ హైదరాబాద్‌లోని రాయదుర్గం పోలీసులకు షార్ట్ ఫిలిం డైరెక్టర్ సినిమాటోగ్రాఫర్ శిరిన్ శ్రీరామ్ ఫిర్యాదు చేశాడు. గతేడాదిలో ఆనంద్ దేవరకొండ , వైష్ణవి చైతన్య , విరాజ్ ఆనంద్ ప్రధాన పాత్రల్లో నటించిన యూత్‌ఫుల్ లవ్ ఎంటర్టైనర్ చిత్రంగా 'బేబీ' సూపర్ హిట్ కొట్టింది. ఈ చిత్రాన్ని సాయి రాజేశ్ దర్శకత్వం వహిస్తే ఎస్కేఎన్ నిర్మాతగా తెరకెక్కించారు. (ఇదీ చదవండి : వీధి పోకిరి చెంప చెళ్లు మనిపించా: టాప్ హీరోయిన్) ఈ సినిమా కథను కొన్నేళ్ల క్రితమే డైరెక్టర్ సాయి రాజేశ్‌కు తాను చెప్పానంటూ శిరిన్ శ్రీరామ్ తాజాగా తెలుపుతున్నాడు. వారు కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించారని పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశాడు. 2013లో తన సినిమాకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేయాలని డైరెక్టర్ సాయిరాజేశ్ కోరినట్లు శ్రీరామ్ తెలిపాడు. అలా ఆయనతో పరిచయం ఏర్పడినట్లు ఆయన తెలుపుతున్నాడు. పోలీసులు చెబుతున్న ప్రకారం. ' 2015లో 'కన్నా ప్లీజ్' టైటిల్‌తో శ్రీరామ్ ఒక కథ రాసుకున్నాడు. ఆ కథకు 'ప్రేమించొద్దు' అని టైటిల్ పెట్టుకున్నారు. డైరెక్టర్ సాయి రాజేశ్ సూచనతో నిర్మాత శ్రీనివాసకుమార నాయుడు (SKN)కు కథ చెప్పాడు. ఇదే కథను కొన్నేళ్ల తర్వాత అంటే 2023లో 'బేబీ' టైటిల్‌తో సినిమా తెరకెక్కించారు. సాయి రాజేశ్ డైరెక్టర్‌గా ఎస్కేఎన్, ధీరజ్ మొగిలినేని సహ నిర్మాతలుగా బేబీ చిత్రాన్ని తీశారు. ఈ కథ మొత్తం తన 'ప్రేమించొద్దు' స్టోరీనే అని శిరిన్ శ్రీరామ్ రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో వారు కేసు నమోదు చేశారు. -
కంటెంట్‌పై మాకు నమ్మకం ఉంది.. అవి కేవలం రూమర్స్: బేబీ నిర్మాత
మణికందన్, గౌరి ప్రియ, కన్న రవి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా "ట్రూ లవర్". ఈ విభిన్నమైన ప్రేమ కథ చిత్రాన్ని దర్శకుడు ప్రభురామ్ వ్యాస్ రూపొందించారు. ఈ సినిమాను డైరెక్టర్ మారుతి, సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ నెల 10వ తేదీన థియేటర్లలో రిలీజవుతోంది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్మాత ఎస్కేఎన్, మారుతి పాల్గొన్నారు. నిర్మాత ఎస్ కేఎన్ మాట్లాడుతూ - 'ఈ సినిమా తమిళ ప్రీమియర్స్ చూసిన వాళ్లు ఇటీవల ఇలాంటి మంచి లవ్ స్టోరి రాలేదని చెబుతున్నారు. తెలుగు ఆడియెన్స్‌కు కూడా ఈ సినిమా నచ్చుతుంది. ఇప్పటికే టీజర్, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మా బేబి సినిమాకు కూడా ఇలాగే ముందు రోజు ప్రీమియర్ వేశాం. కంటెంట్ మీద మాకు నమ్మకం ఉంది. మారుతికి యూత్ సినిమాలంటే ఇష్టం. ఈ సినిమా ఈ వాలెంటైన్ డే విన్నర్ అవుతుంది. రవితేజ ఈగల్తో మా సినిమాకు పోటీ లేదు. మాస్ మహారాజ్ రవితేజ అంటే నాకు ఇష్టం. నేను ఆయనతో ఓ సినిమా కూడా చేయాలని అనుకున్నా. బేబి హిందీ రీమేక్‌లో నేను నటిస్తున్నాననే అనే వార్తల్లో నిజం లేదు' అన్నారు. దర్శకుడు మారుతి మాట్లాడుతూ - 'నేను ఈ సినిమా ఫస్ట్ టైమ్ చూసినప్పుడు ఎలాంటి ఫీలింగ్ కలిగిందో.. తమిళ ప్రీమియర్స్ తర్వాత సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులు చూస్తున్నప్పుడు అంతే సంతోషం కలిగింది. ఈ సినిమా కథను దర్శకుడు చాలా జెన్యూన్‌గా తెరకెక్కించాడు. అబ్బాయిలు, అమ్మాయిలే కాదు ఫ్యామిలీ అంతా కలిసి చూసే సినిమా ఇది. ఈ మూవీతో వాలెంటైన్స్ డే మర్చిపోలేకుండా ఉంటుందని చెప్పగలను. ప్రస్తుతం ప్రభాస్ సినిమా చేస్తూ బిజీగా ఉన్నా. ఇదొక మంచి సినిమా కావడం వల్లే ఇంతగా ప్రమోట్ చేస్తున్నాం. తెలుగులో ఇప్పటివరకు ఇలాంటి పాయింట్‌తో సినిమా రాలేదు.' అన్నారు. -
బన్నీకి ప్రత్యేక కృతజ్ఞతలు: బేబీ నిర్మాత
టాలీవుడ్లో వైవిధ్యమైన కథలతో కమర్షియల్ చిత్రాలు నిర్మిస్తూ మంచి పేరు తెచ్చుకున్న నిర్మాతల్లో ఎస్కేఎన్ ఒకరు. కాగా.. ఇటీవలే ఆయన ఇంట్లో తీవ్ర విషాదం నెలకొన్న సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితమే ఆయన తండ్రిని కోల్పోయారు. ఇంకా ఆ బాధ నుంచి ఎస్కేఎన్ బయటికి రాలేదు. అతని కుటుంబం అంతా ఆయన ఇంటి పెద్దను కోల్పోయిన బాధలోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఐకాన్ స్టార్ ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. తాజాగా ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ హైదరాబాద్‌లోని ఎస్కేఎన్ నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించారు. ఎస్కేఎన్ తండ్రి గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దీంతో తాను అభిమానించే బన్నీ తన ఇంటికి రావడం చాలా ఓదార్పునిచ్చిందని అన్నారు. ఇలాంటి కష్ట సమయంలో నా ఇంటికి వచ్చి.. నాకు ధైర్యం చెప్పినందుకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కాగా.. ఇండస్ట్రీలో మొదటి నుంచి అల్లు అర్జున్ ప్రతిభ, అంకితభావాన్ని అభిమానించే ఎస్‌కెఎన్‌కు బన్నీ అంటే చాలా గౌరవం. ఎస్కేఎన్ 'బేబీ', 'టాక్సీవాలా' లాంటి సూపర్ హిట్ చిత్రాలను నిర్మించారు. -
బేబీ నిర్మాత 'ఎస్కేఎన్' ఇంట తీవ్ర విషాదం
టాలీవుడ్ నిర్మాత ఎస్కేఎన్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి గారు అయిన శ్రీ గాదె సూర్య ప్రకాశరావు గారు ఈరోజు ఉదయం స్వర్గస్తులయ్యారు. దీంతో ఆయన ఇంట తీవ్ర విషాదం నెలకొంది. అనారోగ్యం కారణంగ ఆయన మరణించినట్లు తెలుస్తోంది.దీంతో పలువురు సినీ ప్రముఖులు ఎస్కేఎన్ కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు. నేడు (జనవరి 4) సాయంత్రం 4 గంటలకు ఫిలిమ్‌నగర్ దగ్గర్లో ఉన్న మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు జరుగుతాయని ఎస్కేఎన్ కుటుంబం తెలిపింది. చిరంజీవి అభిమానిగా ఇండస్ట్రీలోకి వచ్చిన ఎస్కేఎన్ మొదట చిన్నపాటి డిస్ట్రిబ్యూటర్‌గా ఆపై పీఆర్ఓగా ఇండస్ట్రీలో తన జర్నీ ప్రారంభించాడు. తర్వాత అల్లు అరవింద్ కుటుంబానితో ఆయనకు ఉన్న సాన్నిహిత్యం అతన్ని నిర్మాతను చేసింది. దీంతో పలు హిట్ చిత్రాలు నిర్మించిన ఆయన గతేడాది తన స్నేహితుడు అయన డైరెక్టర్ సాయి రాజేష్‌తో కలిసి బేబీ సినిమాను తెరకెక్కించి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. . -
Rewind 2023: బడ్జెట్‌తో పనిలేని బంపర్ హిట్స్
ఈ ఇయర్లో కొన్ని చిన్న సినిమాలు పెట్టిన పెట్టుబడికి ఐదారు ఇంతలకు పైగా కలెక్షన్లు సంపాదించాయి. ఇంకా చెప్పాలి అంటే..మేకర్స్ కూడా ఈ రేంజ్ విజయాన్ని ఉహించలేకపోయారు. అంతగా ఆడియన్స్ మనసు దోచుకున్నాయి. బయ్యర్లకు భారీ లాభాలు తీసుకొచ్చి.. కంటెంట్ బలం మరోసారి నిరూపించాయి. ఏ మాత్రం అంచనాలు లేకుండా వచ్చి సూపర్ హిట్‌గా నిలిచిన స్మాల్ మూవీస్‌పై ఓ లుక్కేద్దాం. బలగం ఏ మాత్రం అంచనాలు లేకుండా వచ్చి పెద్ద హిట్‌గా నిలిచిన చిత్రాల్లో బలగం ముందు వరుసలో ఉంటుంది. కమెడియన్ వేణు ఎల్దండి దర్శకత్వం వహించిన తొలి చిత్రం ఇది. తెలంగాణ నేపథ్యంలోని పల్లెటూరి లో జరిగే స్టోరీతో ఈ సినిమాను తెరకెక్కించాడు వేణు. మార్చి 3న విడుదలైన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ.25 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. తెలంగాణలోని పల్లెల్లో తెరలు కట్టి మరి ఈ సినిమాను ప్రదర్శించారంటే.. ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో అర్థం చేసుకోవచ్చు. బేబి ఈ ఏడాది సూపర్ హిట్ కొట్టిన మరో చిన్న చిత్రం బేబి. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి, విరాజ్అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం జులై 14న విడుదలై బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. .దాదాపుగా వందకోట్ల వసూళ్ల వరకు వెళ్లి సంచలనాలు నమోదు చేసింది. సాయి రాజేశ్ దర్శకత్వం వహించిన ఈ ముక్కోణపు ప్రేమ కథా చిత్రంపై మొదట్లో పెద్ద అంచనాలేమి లేవు. కానీ సినిమా విడుదలైన తర్వాత మౌత్‌టాక్‌తో వసూళ్లను పెంచుకుంది. ఈ సినిమా బడ్జెట్ 10 కోట్లలోపే కానీ.. కలెక్షన్స్ మాత్రం వంద కోట్ల వరకు వచ్చాయి. కంటెంట్ బాగుంటే చాలు ప్రేక్షకులు సినిమా హిట్ చేస్తారనేదానికి బేబీ మూవీని బెస్ట్ ఎగ్జాంపుల్‌గా చెప్పొచ్చు. మ్యాడ్ అంతా కొత్త నటులే..అయినా కూడా బాక్సాఫీస్‌ని షేక్ చేశారు. విడుదలకు ముందు మ్యాడ్ చిత్రంపై కూడా పెద్దగా అంచనాలు లేవు. కానీ రిలీజ్(అక్టోబర్ 6) తర్వాత ఈ మూవీకి బాగా పేరొచ్చింది. కాలేజీ నేపథ్యంలో సాగే ఈ కామెడీ డ్రామా.. యూత్‌ని బాగా ఆకట్టుకుంది. ఈ చిత్రంతో కళ్యాణ్ శంకర్ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఈ ఏడాది సితార ఎంటర్టైన్మెంట్స్కు మంచి లాభాలను తెచ్చిపెట్టిన చిత్రంగా మ్యాడ్ నిలిచింది. ఈ ఇయర్ మరికొన్ని చిన్న చిత్రాలు కూడా ఆడియన్స్‌ని ఆకట్టుకున్న చిత్రాలలో చోటు దక్కించుకున్నాయి. ఆర్ ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ హీరోగా నటించిన బెదురు లంక 2012 మూవీ .డీసెంట్ హిట్ కొట్టింది. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చినా..కీడా కోలా..పెట్టుబడిని వెనక్కి తీసుకొచ్చిన చిన్న చిత్రాల జాబితాలోకి చేరింది. సత్యం రాజేష్,బాలాదిత్యా ప్రధాన పాత్రలో నటించిన మా ఊరి పొలిమేర 2 మూవీ విడుదలైన మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించింది. తెలంగాణ నేపథ్యంలో వచ్చిన పరేషాన్..కూడా ఎంటర్టైన్ చేసింది.మరో చిన్న సినిమా మిస్టర్ ప్రెంగ్నెంట్ కూడా డిఫరెంట్ సబ్జెక్ట్ చిత్రంగా అలరించింది.ఇక స్మాల్ హీరో సుహాస్ హీరోగా నటించిన రైటర్ పద్మభూషణ్ మూవీ కూడా హిట్ స్టెటస్ దక్కించుకుంది. అలాగే ఇటీవల విడుదలైన హారర్ మూవీ పిండం కూడా మంచి టాక్ని సొంతం చేసుకుంది. -
పోస్టర్ కోసం క్రియేట్ చేసిన పదం.. కొత్త సినిమా టైటిల్‌గా!
'బేబి' సినిమాతో నిర్మాత ఎస్కేఎన్.. తెలుగు ఇండస్ట్రీకి క్రేజీ హిట్ ఇచ్చారు. ఈ క్రమంలోనే మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై వరస మూవీస్ నిర్మిస్తున్నారు. 'బేబి' హీరోహీరోయిన్ కాంబోలో ఓ చిత్రం, రష్మిక మెయిన్ లీడ్‌గా 'గర్ల్‌ఫ్రెండ్' అనే మూవీ తీస్తున్నారు. రీసెంట్‌గానే ఈ చిత్ర షూటింగ్ కూడా మొదలైంది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 32 మూవీస్) మరోవైపు సంతోష్ శోభన్, అలేఖ్య హారిక జంటగా ఓ సినిమా తీస్తున్న నిర్మాత ఎస్కేఎన్.. తను నిర్మించే ఓ కొత్త మూవీ కోసం 'కల్ట్ బొమ్మ' అనే టైటిల్ రిజిస్టర్ చేయించారు. అయితే 'బేబి' హిట్ కావడంతో అప్పుడు ప్రమోషన్స్ కోసం పోస్టర్స్‌పై కల్ట్ బొమ్మ అని వేశారు. ఇప్పుడు ఈ పదాన్ని ఏకంగా మూవీ టైటిల్ చేసేయడం డిఫరెంట్‌గా అనిపించింది. ఏమైనా బేబి ప్రమోషన్లో కల్ట్ బ్లాక్ బస్టర్, కల్ట్ బొమ్మ అనే పదాన్ని తన స్పీచుల్లో ఎస్ కే ఎన్ బాగా వాడి, ఆ పదాలను పాపులర్ చేశారు. ఈసారి అదే టైటిల్‌తో సినిమా చేస్తుండటం ఇంట్రెస్టింగ్గా ఉంది. (ఇదీ చదవండి: Bigg Boss 7: శోభాశెట్టి ఎలిమినేట్.. మొత్తం రెమ్యునేషన్ ఎంతో తెలుసా?) -
బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న చిన్న చిత్రాలు
సినిమా విజయానికి కంటెంట్ ప్రధాన కారణం.దీనికి రుజువుగా నిలుస్తున్నాయి చిన్న సినిమాలు.కథ బలంతో వచ్చి..ఆడియన్స్‌ను అట్రాక్ట్ చేస్తున్నాయి.తక్కువ బడ్జెట్లో నిర్మాణం జరుపుకుని లాభాల పంట పండిస్తున్నాయి. 2023 లో వచ్చిన స్మాల్ మూవీస్ ఇందుకు సాక్షంగా నిలిచాయి. ఒకటో రెండో కాదు..ఎన్నో సినిమాలు..విజయ ఢంకా మోగించాయి. ప్రేక్షకులను కనుల విందు చేసాయి. స్టార్స్ నటించకున్నా కూడా..మంచి కలెక్షన్లు రాబట్టి మేము కూడా ఫేమస్ అని నిరూపిస్తున్నాయి. ఆ మధ్య తరుణ్ బాస్కర్ దర్శకత్వం వహించి, నటించిన కీడా కోలా మూవీ థియేటర్లోకి వచ్చింది. మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుంది. సినిమాకు సూపర్ హిట్ స్టెటస్ కూడా దక్కింది. మొదటి సినిమా పెళ్లి చూపులుతోనే...తెలుగు బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ తో పాటు..ఉత్తమ స్క్రీన్ ప్లే, డైలాగ్ రైటర్‌గా జాతీయ అవార్డు అందుకున్నాడు తరుణ్. తర్వాత ఈ నగరానికి ఏమైంది మూవీతో యూత్‌ను అట్రాక్ట్ చేసాడు. రీసెంట్గా రీ రిలీజ్ అయిన ఈ మూవీ.. మంచి వసూళ్లు రాబట్టడం విశేషం. ఇక తర్వాత వెంకటేశ్‌తో తరుణ్ మూవీ పట్టాలు ఎక్కాల్సింది. కాని ఈ మూవీ ప్రారంభం అవటం ఆలస్యం అవుతుండటంతో..ఈ లోపు కీడా కోలా మూవీకి మెగా ఫోన్ పట్టుకున్నాడు. మా ఊరి పొలిమేర మూవీ ఓటీటీలో విడుదలయింది.మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.ఆడియన్స్ ఈ థ్రిల్లర్ సబ్జెక్టు బ్రహ్మరథం పట్టారు.ఇటీవల మా ఊరి పొలిమేర మూవీకి సెకండ్ భాగం కూడా విడుదల అయింది.అయితే ఈ సారి థియేటర్లలోకి వచ్చింది.ఫస్ట్ భాగానికి వచ్చిన స్పందనతో...రెండో భాగానికి మంచి వసూళ్లు వచ్చాయి.సత్యం రాజేష్,బాలాదిత్యా లాంటి వారు ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించింది. (చదవండి: వాస్తవ సంఘటనలే సినిమాగా తెరకెక్కిస్తున్న దర్శకులు) ఈ ఇయర్ హిట్ సినిమాల గురించి మాట్లాడుకుంటే..మ్యాడ్ మూవీ గురించి కూడా చెప్పుకోవాలి.అంతగా గుర్తింపు లేని యాక్టర్లు నటించిన ఈ కామెడీ డ్రామా..యూత్ ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకుంది. కళ్యాణ్ శంకర్ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. తక్కువ బడ్జెట్లో తెరకెక్కిన ఈ మూవీ..మంచి వసూళ్లు రాబట్టింది. (చదవండి: ప్రభాస్ 'సలార్' షర్ట్ కావాలంటే ఇలా పొందండి.. ధర ఎంతో తెలుసా?) మీడియం రేంజ్ హీరోలకే వందకోట్ల కలెక్షన్లు డ్రీమ్‌గా మారాయి. రేపో మాపో ఈ టార్గెట్ చేరుకోవాలి అనుకుంటున్నారు. అయితే బేబి లాంటి చిన్న సినిమా మాత్రం ..దాదాపుగా వందకోట్ల వసూళ్లుకు దగ్గరగా వెళ్లింది. ఆనంద్ దేవరకొండ కు ..బిగ్ హిట్ లేదు. ఈ మూవీ దర్శకుడు సాయి రాజేశ్‌కు కూడా..ఓ కమర్శియల్ విజయం లేదు. కాని..కంటెంట్ యూత్ కు బాగా కనెక్ట్ అయింది. అందుకే భారీ విజయం సాధ్యం అయింది శ్రీవిష్ణుకి విజయం వచ్చి చాలా కాలామే అయింది. అయితే ఈ ఇయర్ మాత్రం..ఉహించని సక్సెస్ చూశాడు. సామజవరగమనతో..సూపర్ హిట్ అందుకున్నాడు.డిఫరెంట్ సబ్జెక్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమా యాభై కోట్ల వసూళ్లు రాబట్టింది. కామెడీ డ్రామాగా రూపొందిన ఈ మూవీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి ఆడియనన్స్ను ఫ్రెష్ ఫీల్ కలుగజేసింది.సెంటిమెంట్,ప్రేమ,మెసెజ్ లాంటి అన్ని అంశాలతో కట్టి పడేసింది. ఈ సినిమాలో సంభాషణలు ఆసక్తికరంగా ఉండి ఆకట్టుకున్నాయి. మినిమిం బజ్‌తో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర యాభై కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. తెలంగాణ నేపథ్యంలోని పల్లెటూరి లో జరిగే స్టోరీతో తెరకెక్కింది బలగం. ఈ మూవీ మీద ఏమాత్రం అంచానాలు లేవు. కాని కంటెంట్ పర్ఫెక్ట్గా ఉంటే ..చిన్న సినిమా కూడా మంచి వసూళ్లు రాబడుతుంది అని చెప్పటానికి పెద్ద ఉదాహారణగా ఈ మూవీ నిలిచింది. చావు చుట్టు తిరిగే ఈ మూవీ స్టోరీ. బందాలు,అనుభందాలు ఎంత గొప్పగా ఉంటాయో చాటి చెప్పింది. ఆర్ ఎక్స్ 100 తర్వాత కార్తికేయకు మరో విజయం దక్కలేదు.మార్కెట్ కూడా పాడు చేసుకున్నాడు.దాంతో విజయం కంపల్ సరిగా మారింది.ఈ సారి బెదురు లంక 2012 మూవీతో వచ్చాడు.ఈ ఇయర్ థియేటర్లలోకి వచ్చింది.పాజిటివ్ టాక్ సొంతం చేసుకొని..డీసెంట్ హిట్ కొట్టింది.కార్తికేయను హిట్ ట్రాక్ మీదికి తీసుకొచ్చింది.నేహా శెట్టి ఈ మూవీలో కథానాయికగా నటించింది. ఇక ఈ నెలలో విడుదలైన మంగళవారం, కోట బొమ్మాళి చిత్రాలు కూడా హిట్ టాక్ని సంపాదించుకున్నాయి. అయితే ఇందులో మంగళవారం చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చిన.. ఆశించిన స్థాయిలో మాత్రం వసూళ్లను రాబట్టలేకపోతుంది. ఇక కోట బొమ్మాళి మూవీ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి. ఈ ఏడాది వీటితో పాటు మరికొన్ని చిన్న చిత్రాలు కూడా ఆడియన్స్‌ని ఆకట్టుకున్నాయి. తెలంగాణ నేపథ్యంలో పల్లెటూరులో జరిగే సబ్జెక్ట్‌తో రూపొందిన పరేషాన్, డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన మిస్టర్ ఫ్రెంగ్నెంట్.. సుహాన్ హీరోగా నటించిన రైటర్ పద్మభూషణ్ లాంటి చిత్రాలు కూడా డీసెంట్ హిట్ టాక్ని సంపాదించుకున్నాయి. -
సరికొత్త కథతో వస్తోన్న బేబీ నటుడు.. రిలీజ్ ఎప్పుడంటే?
బేబి చిత్రంలో అందరి ప్రశంసలు అందుకున్న నటుడు విరాజ్ అశ్విన్. తాజాగా అతను హీరోగా నటిస్తున్న చిత్రం ‘జోరుగా హుషారుగా’. పూజిత పొన్నాడ కథానాయికగా నటిస్తోంది. అను ప్రసాద్ దర్శకత్వంలో శిఖర అండ్ అక్షర ఆర్ట్స్ ఎల్ఎల్పీ పతాకంపై నిరీష్ తిరువిధుల నిర్మిస్తున్నారు. యూత్‌ఫుల్ అండ్ ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని డిసెంబరు 15న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ పోస్టర్‌ను నిర్మాత నిరీష్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ.. 'యూత్‌ఫుల్ అండ్ ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న చిత్రమిది. ఇటీవలే విడుదలైన టీజర్‌కు, పాటలకు మంచి స్పందన వచ్చింది. సినిమాలో అందర్ని ఆకట్టుకుంటుంది. ప్రముఖ నిర్మాత బెక్కెం వేణుగోపాల్ గారి సహకారంతో చిత్రాన్ని డిసెంబరు 15న విడుదల చేస్తున్నామని అన్నారు. అనంతరం దర్శకుడు మాట్లాడుతూ.. 'ఈ చిత్రంలో విరాజ్ అశ్విన్‌ను కొత్తగా చూస్తారు. ఆయన పాత్రలో మంచి ఎనర్జీ వుంటుంది. బేబి చిత్రంతో యూత్‌కు 'దగ్గరైన విరాజ్ ఈ చిత్రంతో మరింత చేరువతాడు. కొత్తదనం ఆశించే ప్రతి ఒక్కరికి మా చిత్రం తప్పకుండా నచ్చుతుంది' అని అన్నారు. ఈ చిత్రంలో సాయికుమార్, రోహిణి, మధునందన్, సిరి హనుమంతు, సోనూ ఠాకూర్, బ్రహ్మజీ , చమ్మక్ చంద్ర, క్రేజీ కన్నా ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రణీత్ సంగీతమందిస్తున్నారు. -
అలా ఇచ్చేందుకు మీకు ఒక్క సినిమా కనిపించలేదా?: సాయి రాజేశ్
బేబీ మూవీతో సూపర్ హిట్ కొట్టిన డైరెక్టర్ సాయి రాజేశ్. ఈ చిత్రంలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ ప్రధాన పాత్రల్లో నటించారు. చిన్న సినిమాగా వచ్చిన బేబీ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ట్రయాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కించిన ఈ చిత్రం భారీ వసూళ్లు సాధించింది. హృదయకాలేయం, కొబ్బరి మట్ట చిత్రాల తర్వాత బేబీ మూవీకి దర్శకత్వం వహించారు. అయితే బేబీ హిట్‌తో జోష్‌లో ఉన్న సాయి రాజేశ్ మరో సినిమాను ఇటీవలే ప్రకటించారు. సంతోష్ శోభన్ హీరోగా రూపొందుతోన్న ఈ సినిమాకు సాయి రాజేష్ కథ, స్క్రీన్‌ప్లే అందిస్తుండగా.. సుమన్ పాతూరి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. బేబీ సినిమాతో తెలుగమ్మాయి వైష్ణవి చైతన్యకు హిట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మరో తెలుగమ్మాయి.. 'బిగ్ బాస్' ఫేమ్ అలేఖ్య హారికను కథానాయకిగా పరిచయం చేస్తున్నారు. అయితే తాజాగా ఓ ఈవెంట్‌కు హాజరైన సాయి రాజేశ్ సినిమా రివ్యూయర్స్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. గత ఐదేళ్లుగా ఒక్క తెలుగు సినిమాకైనా 4 లేదా 4.5 రేటింగ్ ఇచ్చారా? అని ప్రశ్నించారు. రాజమౌళి ఆర్ఆర్ఆర్, బాహుబలి లాంటి సినిమాలకు ఎంత రేటింగ్ ఇచ్చారని అడిగారు. మీరు 4 రేటింగ్ ఇచ్చేందుకు ఒక్క సినిమా కూడా మీ వెబ్సైట్లకు కనిపించలేదా? అన్నారు. ఈ విషయంలో మీకు మీరే ఎంత రేటింగ్ ఇచ్చుకుంటారు? అన్నారు. మన సినిమాల విషయంలో కేవలం 2.75 నుంచి 3.5, 3.75 మధ్య రివ్యూలు ఇస్తూ ఎందుకిలా సేఫ్ గేమ్ ఆడుతున్నారు? గత పదేళ్లుగా 3.75 పైనా రేటింగ్ ఇచ్చినా ఒక్క సినిమా పేరు చెప్పండి చాలు? అంటూ మీడియా ప్రతినిధులను ప్రశ్నించారు. మీరంతా కలిసి రివ్యూల విషయంలో ఎందుకు సేఫ్ గేమ్ ఆడుతున్నారు. అసలు మీ మనసుకు ఒక్కసారి కూడా 4 రేటింగ్ ఇవ్వాలని అనిపించలేదా? అని అడిగారు. సాయి రాజేశ్ అడిగిన ప్రశ్నకు ఓ మీడియా ప్రతినిధి సమాధానమిచ్చారు. ఆయన మాట్లాడుతూ.. 'మేము ఇచ్చే రివ్యూస్ మాత్రమే సినిమా ఫలితాన్ని డిసైడ్ చేయలేవు. లక్కీగా చాలా సందర్భాల్లో మేము ఇచ్చే రివ్యూలు కూడా మ్యాచ్ అవుతాయి. ఎండ్ ఆఫ్ ది డే ఇది వ్యక్తిగత అభిప్రాయం. రాజమౌళి సినిమా కూడా ఫెయిల్ కావొచ్చు. అది మనం డిసైడ్ చేయలేం కదా.' అని చెప్పారు. -
కూతురి పెళ్లికి దాచిన డబ్బు చెదల పాలు.. సాయం ప్రకటించిన 'బేబీ' సినిమా నిర్మాత
పసి వయసులో చేయి పట్టుకొని నడిపిస్తూ ఈ విశాల ప్రపంచాన్ని తొలిసారి పరిచయం చేసేది నాన్నే. భుజాలపై ఎక్కించుకుని ఆడించినా.. అల్లరి చేసినప్పుడు దండించినా బిడ్డ భవిష్యత్తే నాన్నకు ముఖ్యం. ప్రధానంగా ఆడపిల్ల ఉన్న తండ్రి ఇంకా భిన్నంగా ఆలోచిస్తాడు. ఎంతో కష్టపడి అతని చేతిలో డబ్బున్నా తన గారాల బిడ్డ చదువు, ఆమె పెళ్లి కోసం డబ్బు దాస్తాడు. తన కోసం ఏదీ కొనుక్కోడు కానీ పిల్లల కోసం తన కోరికలను, ఆశలను చంపుకుని డబ్బు కూడాబెడుతాడు. అలాంటి డబ్బే చెదల పాలు అయితే ఆ తండ్రి వేదన భరించలేనిది. పార్వతీపురం మన్యం జిల్లాలో ఓ తండ్రి కూడా బిడ్డల భవిష్యత్ కోసం దాచుకున్న డబ్బు చెదల పాలు కావడంతో కన్నీరుమున్నీరు అయ్యాడు. తన కూతురి పెళ్లి కోసం రోజంతా కష్టపడి వచ్చిన డబ్బును తన ఇంట్లో దాచి ఉంచాడు. సుమారు రూ. 2 లక్షల మొత్తాన్ని అతను తన ఇంట్లో భద్రపరిచాడు.. కానీ ఆ డబ్బు చెదులు పట్టిందా..? లేదా ఎలుకలు కొరికాయో తెలియదు కానీ ఇలా ఆ మొత్తం డబ్బు వినియోగించుకునేందుకు పనికిరాకుండా పోయింది. ఆ డబ్బును చూసిన ఆ తండ్రి కంట కన్నీళ్లు ఆగడం లేదు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సోషల్ మీడియా ద్వారా ఆ తండ్రి కన్నీళ్లు చూసిన బేబీ సినిమా నిర్మాత ఎస్కేఎన్ (SKN) రియాక్ట్ అయ్యాడు. ఆ కుటుంబానికి సాయం చేసేందుకు ఆయన ముందుకు వచ్చాడు. ఆ తండ్రి వివరాలు తనకు పంపాలని... ఆయన కుమార్తె పెళ్లికి అవసరమయ్యే రూ. 2లక్షల డబ్బును ఆయన ఇస్తానని తన ఎక్స్‌లో తెలిపాడు. ఇందుకు గాను గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు జరుగుతుంటాయి. బ్యాంకులలో డబ్బును దాచుకునేలా వారికి అవగాహన కల్పించాల్సిన భాద్యత అందరిపైన ఉందని ఆయన తెలిపాడు. దీంతో ఎస్కేఎన్ ఫ్యాన్స్‌తో పాటు నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు. కష్టంలో ఉన్న వారికి ఇలాంటి సాయం చేయడానికి ముందుకు వచ్చిన మీకు ప్రత్యేక ధన్యవాదాలు అంటూ కామెంట్లు చేస్తున్నారు. వీడేంటి రా ఇంత మంచోడు అంటూ మరోకరు తెలిపారు. ఆ సినిమా డైరెక్టర్ సాయి రాజేష్ కూడా తన ఫ్రెండ్ చేస్తున్న మంచి పనిని అభినందించినట్లు సమాచారం. ఏదేమైనా నష్టపోయిన ఆ వ్యక్తికి సంబంధించిన పూర్తి వివరాలు ఎస్కేఎన్కు అందేలా చేయండని మరికొందరు తెలుపుతున్నారు. Sad to know & it's very unfortunate to see their innocence keep money like that Can any one share their contact please Would like to help them — SKN (Sreenivasa Kumar) (@SKNonline) November 19, 2023 -
'మీరు బాదకముందే చెబుతున్నా ఆరు 'నిబ్బా నిబ్బీ' లవ్ స్టోరీలు ఉన్నాయి'
బేబీ సినిమాతో డైరెక్టర్‌గా సాయి రాజేష్‌కు గుర్తింపు వచ్చినా ఆయన మొదటగా ‘హృదయకాలేయం’ చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. తర్వాత కొబ్బరి మట్ట సినిమాను కూడా డైరెక్ట్ చేశాడు. ఆ రెండూ సినిమాలకు సంబంధించిన మీమ్స్ ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉంటాయి. తర్వాత కలర్ ఫోటోతో నిర్మాతగా మెప్పించాడు.బేబీ సినిమాను నిర్మాత ఎస్కేఎన్తో కలిసి సాయి రాజేష్ తెరకెక్కించాడు. ఆ సినిమా సూపర్ హిట్ అందుకుంది. మొత్తం ఆరు ప్రేమకథలు నిర్మించబోతున్నట్లు ‘బేబి’ దర్శకుడు సాయి రాజేష్ ప్రకటించారు. (ఇదీ చదవండి: దొరికిపోయిన రతిక.. మోకాళ్లపై కూర్చుని దండం పెట్టిన అమర్!) కలర్ ఫోటో,బేబీ సినిమాలు ఇప్పటికే విడుదలయ్యాయి.. మరో రెండు ప్రేమకథలు నిర్మాణంలో ఉన్నాయి. త్వరలో ఇంకో రెండు కథలు త్వరలో ప్రకటిస్తామని ఆయన చెప్పారు. ఇండస్ట్రీలో మంచి స్నేహితులుగా కొనసాగుతున్న సాయి రాజేష్, ఎస్కేఎన్ ఇద్దరూ.. గీతా ఆర్ట్స్ కాంపౌండ్‌లో ఉంటూ చాలా రోజులుగా కలిసి పనిచేస్తున్నారు. అలా బేబీ హిట్‌తో వారిద్దరి పేర్లు సెన్సేషన్ అయ్యాయి. తాజాగా వీరి నుంచి మరో సినిమా ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే.. సంతోష్ శోభన్ హీరోగా రూపొందుతోన్న ఈ సినిమాకు సాయి రాజేష్ కథ, స్క్రీన్‌ప్లే అందిస్తుండగా.. వారి బ్యాచ్‌లో ఉన్న మరో స్నేహితుడు సుమన్ పాతూరి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. బేబీ సినిమాతో తెలుగమ్మాయి వైష్ణవి చైతన్యకు హిట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మరో తెలుగమ్మాయి.. 'బిగ్ బాస్' ఫేమ్ అలేఖ్య హారికను కథానాయకిగా పరిచయం చేయడం విషేశం. 'అమృత ప్రొడక్షన్స్' నుంచి ఇప్పటి వరకు మూడు సినిమాలు నిర్మించిగా. ఆఖరి సినిమాగా కలర్ ఫోటో వచ్చిందని సాయి రాజేష్ గుర్తు చేశారు. ఆ చిత్రానికి ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డు కూడా వచ్చింది. నేనేమీ లోకేష్ కనగరాజ్ కాదు ఆ తర్వాత తాను నిర్మాతగా సినిమాలు నిర్మించలేదని సాయి రాజేష్ ఇలా చెప్పుకొచ్చాడు. ఒక మంచి కథ వచ్చినప్పుడు నేను మళ్లీ సినిమా నిర్మించాలని అనుకున్నాను. ఈ కథ ప్రేక్షకులను మెప్పిస్తుంది. సోషల్ మీడియాలో కొందరు ఎన్ని తీస్తారురా 'నిబ్బా నిబ్బీ' లవ్ స్టోరీలు అని బాదకముందే నేనే ముందుగా చెప్తున్నాను. నాది, ఎస్కేఎన్ కాంబినేషన్లో మొత్తం 6 ప్రేమకథలు రాబోతున్నాయి. వీటిలో రెండు మీరు చూసేశారు. ఒకటి కలర్ ఫోటో.. రెండోది బేబి. రెండు నిర్మాణంలో ఉన్నాయి.. వైష్ణవి, ఆనంద్ కాంబినేషన్లో రీసెంట్గా ఒక సినిమా ప్రకటించాం. ఇప్పుడు సంతోష్, హారిక కాంబినేషన్లో ఈ సినిమా రానుంది. ఇవి కాకుండా ఇంకో రెండు లవ్ స్టోరీలు ఉంటాయి. కొందరు మాత్రం ఇదేమైనా సినిమాటిక్ యూనివర్సా.. స్టోరీలో ఏమైనా లింక్ అయ్యాయా..? సీక్వెల్ ఉంటుందా..? అంటే నేనేమీ లోకేష్ కనగరాజ్ కాదు.. ఆ విషయం నాకు కూడా తెలుసు. కానీ.. మీ అందర్నీ మెప్పించేలా ఆరు ప్రేమ కథలు ఉన్నాయి. అవి నేను, ఎస్కేఎన్ కలిసి మీకు అందిస్తున్నాం. వాటిలో ఇదీ ఒకటి. ఇది నా మనసుకు చాలా దగ్గరైన ప్రేమ కథ. ఈ ప్రాజెక్ట్‌లో నాకు చాలా బాధ్యతలు ఉన్నాయి. ఎందుకంటే డైరెక్టర్ సుమన్ పాతూరి, హారిక అలేఖ్య, కలర్ ఫోటో డైరెక్టర్ సందీప్, సుహాస్, మేమందరం చాలా సంత్సరాలుగా స్నేహితులం. ఎస్కేఎన్, నేను చిన్నప్పటి నుంచీ ఫ్రెండ్స్. అందరం ఫ్రెండ్స్ కలిసి ఫ్రెండ్స్ కోసం చేస్తున్న సినిమా ఇది. కచ్చితంగా ఒక బ్లాక్ బస్టర్ కొట్టాలని ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా ఈ సినిమా తీస్తున్నాం.' అని సాయి రాజేష్ చెప్పారు. -
బేబి కాంబో రిపీట్
‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న హీరో ఆనంద్ దేవరకొండ, హీరోయిన్ వైష్ణవీ చైతన్య కాంబినేషన్లో మరో సినిమా రూ΄పొందనుంది. ‘బేబి’ చిత్ర దర్శకుడు సాయి రాజేశ్ ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా రవి నంబూరి దర్శకునిగా పరిచయం అవుతున్నారు. అమృతప్రోడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్‌పై ఎస్కేఎన్, సాయి రాజేశ్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ‘‘ఈ సినిమా ప్రస్తుతం ప్రీప్రోడక్షన్ పనులు జరుపుకుంటోంది. త్వరలోనే షూటింగ్ మొదలవుతుంది. వచ్చే వేసవిలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: విజయ్ బుల్గానిన్, కెమెరా: బాల్ రెడ్డి, సహనిర్మాత: ధీరజ్ మొగిలినేని.