'అర్జున్‌రెడ్డి' సినిమాకు ముందే విజయ్‌ను నమ్మాను: నిర్మాత | SKN Talks About Baby Movie Press Meet | Sakshi
Sakshi News home page

వివాదాల నుంచి పబ్లిసిటీ కోరుకోను: నిర్మాత

Jul 7 2023 3:41 AM | Updated on Jul 7 2023 7:49 AM

SKN Talks About Baby Movie Press Meet - Sakshi

'ఇండస్ట్రీలో జర్నలిస్ట్‌గా మొదలై, పీఆర్‌వో అయ్యాను. ఆ తర్వాత నిర్మాతగా మారాను. కెరీర్‌ చాలా సంతృప్తిగా ఉంది' అన్నారు ఎస్‌కేఎన్‌. ఆనంద్‌ దేవరకొండ, విరాజ్‌ అశ్విన్, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో సాయి రాజేష్‌ దర్శకత్వంలో ఎన్‌కేఎన్‌ నిర్మించిన చిత్రం ‘బేబీ’. ఈ నెల 14న ఈ చిత్రం రిలీజ్‌ కానుంది. నేడు (శుక్రవారం) ఎస్‌కేఎన్‌ బర్త్‌ డే.

ఈ సందర్భంగా గురువారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఎస్‌కేఎన్‌ మాట్లాడుతూ– 'ఆనంద్, విరాజ్, వైష్ణవిల మధ్య సాగే ఎమోషనల్‌ లవ్‌స్టోరీ ‘బేబీ’. కథ, కథనం, సన్నివేశాలు కొత్తగా ఉంటాయి. ఇంట్రవెల్‌కు ముందు పెద్ద షాక్‌ ఉంటుంది. మ్యూజిక్‌ పరంగా ఈ మధ్య వచ్చిన ప్రేమకథా చిత్రాల్లో ‘బేబీ’ ఓ మంచి చిత్రంగా నిలిచిపోతుందనే నమ్మకం ఉంది. విజయ్‌ బుల్గానిన్‌ మంచి సంగీతం అందించాడు.

ఇక సోలో నిర్మాతగా నేను తొలిసారి విజయ్‌ దేవరకొండతో ‘టాక్సీవాలా’ నిర్మించాను. అప్పుడు సాయి రాజేష్‌ నాకు ‘బేబీ’ కథ చెప్పాడు. కథ విన్నాక నిర్మాతగా నా తర్వాతి చిత్రం ఇదే చేయాలనుకున్నాను. ఈ సినిమా నుంచి విడుదలైన ఓ పోస్టర్‌ వివాదాస్పదమైంది. ఆ పోస్టర్‌ను అలాగే ఉంచితే మూవీకి ప్రమోషన్‌ వస్తుందని కొందరు అన్నారు.

కానీ కంటెంట్‌ బాగుంటే పబ్లిసిటీ అదే వస్తుంది.. కాంట్రవర్సీల నుంచి కాదని నమ్మే వ్యక్తిని. ఇక మార్కెట్‌ అంటే.. ‘అర్జున్‌రెడ్డి’ రిలీజ్‌ కాకముందే విజయ్‌ స్టార్‌ అవుతాడని నమ్మి ‘టాక్సీవాలా’ తీశా. అలా ‘బేబీ’ ఆనంద్‌ కెరీర్‌లో ఓ మైలురాయిలా నిలుస్తుందని నమ్ముతున్నాను. ఏడాదికి రెండు సినిమాలు, వెబ్‌ ఫిల్మ్‌ నిర్మించాలనుకుంటున్నాను. సందీప్‌ రాజ్, సాయి రాజేష్, రాహుల్‌ సంకృత్యాన్, వీఐ ఆనంద్‌లతో సినిమాలు ఉన్నాయి' అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement