
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య , విరాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన యూత్‌ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్ సినిమా 'బేబీ'. సాయి రాజేశ్ దర్శకుడు. ప్రేక్షకుల ముందుకు వచ్చిన తొలిరోజే రూ.7 కోట్లు వరకు కలెక్షన్స్ రాబట్టింది. విడుదలై 20 రోజులు దాటిని ఇప్పటికి కూడా కలెక్షన్స్ పరంగా దూసుకుపోతుంది. సుమారు రూ.85 కోట్ల మేరకు ఇప్పటి వరకు రాబట్టి ఈ సినిమా బాక్సాఫీసు వద్ద కొనసాగుతుంది.
(ఇదీ చదవండి: ఎలాంటి నరకం అనుభవించానో నాకు మాత్రమే తెలుసు: నరేష్)
తాజాగా ఈ సినిమా యూనిట్ విజయ యాత్రలో భాగంగా ఏపీలోని భీమవరం పర్యటించింది. అయితే ఈ విషయం తెలుసుకున్న చాలామంది అభిమానులు థియేటర్ వద్దకు చేరుకున్నారు. వారితో పాటు కొంతమంది స్థానిక మీడియా ప్రతినిధులు కూడా ఒక్కసారిగా గుంపుగా రావడంతో.. వారు మీడియా ప్రతినిధులు అని గమనించక బౌన్సర్లు తోసేశారు. అంతేకాకుండా వారి పట్ల కాస్త దురుసుగా కూడా ప్రవర్తించారు. దీంతో వారందరూ ఆందోళనకు దిగారు. అనంతరం చిత్ర నిర్మాత ఎస్‌కేఎన్ కారును వారందరూ అడ్డుకున్నారు.
దీంతో కారు నుంచి దిగిన ఎస్కేఎన్‌తో వారందరూ వాగ్వాదానికి దిగారు. ఆ సమయంలో ఆయన కూడా కొంతమేరకు సీరియస్ అయ్యారు. అనంతరం వారికి క్షమాపణ చెప్పడంతో గొడవ సద్దుమనిగింది. అక్కడున్న వారిలో ఒకరు స్వల్పంగా గాయపడ్డారు. అతన్ని స్థానిక ఆస్పత్రికి ఎస్కేన్ సిబ్బంది తరలించారట. ప్రస్తుతం ఈ గొడవకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
భీమవరంలో బేబీ చిత్ర యూనిట్
— Telugu Scribe (@TeluguScribe) August 4, 2023
#BabyTheMovie #Baby pic.twitter.com/rflAImEYMU
Comments
Please login to add a commentAdd a comment