Anand Devarakonda
-
అనంత శ్రీరామ్‌కు ఐఫా అవార్డు
పాటల రచయిత అనంత శ్రీరామ్ ఐఫా(ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్) అవార్డు అందుకున్నారు. ‘బేబి’ సినిమాలోని ‘ఓ రెండు మేఘాలిలా..’ పాటకు ఈ అవార్డు వచ్చింది. ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో సాయి రాజేశ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘బేబి’. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఎస్కేఎన్ నిర్మించిన ఈ సినిమా 2023 జూలై 14న విడుదలై, సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రానికిగానూ ‘ఓ రెండు మేఘాలిలా..’ పాటకు బెస్ట్ లిరిక్ రైటర్‌గా అనంత శ్రీరామ్ తాజాగా ఐఫా అవార్డు అందుకోవడంతో ఎస్కేఎన్, సాయి రాజేశ్ కలిసి అనంత శ్రీరామ్‌ను అభినందించారు. ‘‘బేబి’ మూవీకి ఇప్పటిదాకా ఫిలింఫేర్, సైమా, గామా వంటి అనేక గొప్ప పురస్కారాలు దక్కాయి. తాజాగా ఐఫా దక్కడం ఆనందంగా ఉంది. ఈ సినిమాకు ప్రేక్షకుల రివార్డ్స్‌తో పాటు ప్రతిష్టాత్మక అవార్డులు దక్కుతున్నాయంటే ఆ ఘనత సాయి రాజేశ్‌కే దక్కుతుంది. ఈ ప్రేమ కథను హృద్యంగా తెరపై ఆవిష్కరించారాయన’’ అని మేకర్స్ తెలిపారు. కాగా ఎస్కేఎన్, సాయి రాజేశ్ కాంబినేషన్లో ‘బేబి’ సినిమా బాలీవుడ్లో రీమేక్ అవుతోంది. -
'స్ట్రోమ్' వచ్చాక సంతోషం వచ్చింది.. : విజయ్ దేవరకొండ
స్ట్రోమ్ (విజయ్ దేవరకొండ పెంపుడు కుక్క పేరు) వచ్చాక మా ఇంట్లో ఎంతో ఆనందం వచ్చిందని సినీ హీరో విజయ్ దేవరకొండ అన్నారు. జూబ్లీహిల్స్‌లో నూతనంగా నెలకొల్పిన సెవన్ ఓక్స్ పెట్ హాస్పిటల్‌ను విజయ్ తన సోదరుడు ఆనంద్ దేవరకొండతో కలిసి ప్రారంభించారు. మా ఇంట్లో మొదట్లో పెట్స్ అంటే ఇష్టం ఉండేది కాదని, కానీ మా అమ్మా నాన్నకు నచ్చజెప్పి స్ట్రోమ్ గాడిని తెచ్చుకున్నామని, ఇప్పుడు మాకంటే మా పేరెంట్స్ స్ట్రోమ్ గాడితోనే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారని విజయ్ అన్నారు.షూటింగులలో ఎంతో బిజీగా ఉండి, ఒత్తిడిలో ఇంటికి రాగానే స్ట్రోమ్ గాడి అల్లరితో అంతా మర్చిపోతామన్నారు. పెట్స్‌ను పెంచడమంటే మామూలు విషయం కాదని, ఇంట్లో ఒక చిన్న బేబీని చూసినంత పని ఉంటుందని, అంత కేర్ తీసుకునే ఓపిక ఉన్న వాళ్లు మాత్రమే పెట్స్‌ను పెంచుకోవాలని సూచించారు. సెవన్ ఓక్స్ పెట్ హాస్పిటల్ నిర్వాహకులు సంధ్య, శ్రీరెడ్డి పాల్గొన్నారు. -
జూబ్లీహిల్స్ : సెవన్ ఓక్ పెట్ హాస్పిటల్లో సందడి చేసిన విజయ్ ,ఆనంద్ దేవరకొండ (ఫొటోలు)
-
సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన ఆనంద్ దేవరకొండ సినిమా
మరో తెలుగు సినిమా సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'గం గం గణేశా'. మే 31న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ.. అదే రోజు రిలీజైన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి', 'భజే వాయు వేగం' చిత్రాల వల్ల సరైన వసూళ్లు సాధించలేకపోయింది. ఇప్పుడు ఎలాంటి హడావుడి లేకుండానే ఓటీటీలో స్ట్రీమింగ్ అయిపోతోంది.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 11 మూవీస్.. మొత్తంగా 17 రిలీజ్)'బేబి' మూవీతో గతేడాది బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాడు ఆనంద్ దేవరకొండ. దీంతో ఇతడు నటించిన 'గం గం గణేశా' మూవీపై కాస్త బజ్ ఏర్పడింది. యాక్షన్ క్రైమ్ కామెడీ స్టోరీతో తీసిన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ పెద్దగా కలెక్షన్స్ సాధించలేకపోయింది. ఈ క్రమంలోనే ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది.'గం గం గణేశా' విషయానికొస్తే.. గణేశ్ (ఆనంద్ దేవరకొండ) ఓ చిన్న సైజ్ దొంగ. అతడికో ఫ్రెండ్ (ఇమ్మాన్యుయేల్). ఓ షాపులో పనిచేసే శ్రుతి (నయన్ సారిక)తో ప్రేమలో పడతాడు. ఆమె గణేశ్‌ని కాకుండా షాప్ ఓనర్‌తో పెళ్లికి రెడీ అవుతుంది. అమ్మాయి మనసు గెలుచుకోవాలంటే డబ్బు ముఖ్యమని ఓ డైమండ్ దొంగతనానికి గణేశ్ సిద్ధపడతాడు. మరోవైపు ఓ రాజకీయ నాయకుడు రూ.100 కోట్ల బ్లాక్ మనీని ముంబై నుంచి కర్నూలు తీసుకొచ్చే పనిలో ఉంటాడు. ఈ రెండింటికి లింక్ ఏంటి? డైమండ్ ఎవరికి దక్కింది అనేదే స్టోరీ.(ఇదీ చదవండి: ఒకేసారి ఆరు ఫ్లాట్స్ కొనేసిన స్టార్ హీరో.. రేటు ఎంతో తెలుసా?) -
అమెరికాలో విజయ్ దేవరకొండ ఫ్యామిలీ టూర్ (ఫొటోలు)
-
సిక్‌ప్యాక్! లుక్ కోసమైతే ఫసక్కే
అనారోగ్యంపాలవుతున్న బాడీ బిల్డర్స్సిక్స్ ప్యాక్ శరీరానికి మంచిది కాదు..ఆరోగ్యకరమైన కొవ్వులూ అవసరమే : వైద్యులు ఏదైనా అతిగా చేస్తే అనర్థమే..! ఔను నిజమనే అంటున్నారు వైద్యులు.. ఇంతకీ ఏంటది? దేని గురించి? ఈ చర్చంతా దేనికి అనుకుంటున్నారా? అదే నండి బాబు సిక్స్ ప్యాక్ గురించి.. సిక్స్ ప్యాక్ అనగానే.. ప్రస్తుత తరానికి ఎంతో క్రేజ్. ఆ పేరు చెప్పగానే శరీరంలోని నరాలన్నీ జివ్వుమన్నట్లు అవుతుంది.. కానీ అతిగా చేస్తే ఆరోగ్యానికి అనర్థమే అంటున్నారు వైద్యులు.. ఇటీవల పలువురు హీరోలు అతిగా వ్యాయామం చేసి అనారోగ్యం పాలవ్వడమే దీనికి చక్కటి ఉదాహరణ. అసలు సిక్స్ ప్యాక్ కథేంటి? వైద్యులు ఏమంటున్నారు? తెలుసుకుందాం.. బాలీవుడ్ టు టాలీవుడ్.. సిక్స్ ప్యాక్ సినిమా స్క్రీన్కు పరిచయమై రెండు దశాబ్దాలు పైమాటే. అయినా అంతకంతకూ తన క్రేజ్‌ను పెంచుకుంటోంది. దాదాపు బాలీవుడ్, టాలీవుడ్ అగ్రహీరోల్లో యుక్తవయసులో ఉన్న హీరోలందరూ ఆరున్నొక్కరాగం ఆలపిస్తున్నవారే. తెలుగులో ‘దేశ ముదురు’తో అల్లు అర్జున్ నుంచి మొదలై సునీల్, ప్రభాస్, నితిన్, జూనియర్ ఎనీ్టయార్, రామ్‌చరణ్, సుధీర్‌బాబు, విజయ్ దేవరకొండ...తాజాగా అఖిల్..ఇలా అనేకమంది ఆరు–ఎనిమిది పలకల దేహాలతో తెరపై గ్రీక్ లుక్‌లో తళుక్కుమంటున్నారు. అనుకరణ మరింత ప్రమాదమట.. సిక్స్‌ప్యాక్ కొనసాగింపు కోసం నాగశౌర్య నెలల తరబడి తీవ్ర కసరత్తులు చేశారని, అదే విధంగా కఠినమైన డైట్ ను పాటించారని సమాచారం. ఎప్పుడూ హుషారుగా ఆరోగ్యంగా కనిపించే శౌర్యకు ఆకస్మికంగా స్పృహ కోల్పోయే పరిస్థితి రావడానికి సిక్స్ ప్యాక్ క్రేజ్ కారణమై ఉండవచ్చని పలువురి వాదన.. అయితే వైద్యులు మాత్రం ఆ విషయాన్ని ధృవీకరించలేదు. ఈ నేపధ్యంలో హీరోల్ని చూసి మక్కీకి మక్కీ అనుసరించే లక్షలాది మంది యువ అభిమానులు జాగ్రత్త పడాల్సి ఉందని, అన్ని రకాల వసతులూ, శిక్షకులూ ఉన్న స్టార్లకే అలా అయితే.. ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆరుపలకల దేహాన్ని పొందాలని కోరుకునేవారు చాలా మంది ఉండొచ్చు.. అయితే దానిని సాధించడం చాలా కష్టం. అంతేకాదు సాధించినా కూడా ఆ సిక్స్‌ప్యాక్‌ని కొనసాగించడం మరింత కష్టం. ఈ విషయం చాలా మందికి తెలీదు సిక్స్–ప్యాక్ మ్యానియాలో పడి గుడ్డిగా అనుసరించే ముందు, ఆకస్మిక, కఠినమైన డైట్ వల్ల కలిగే ఆరోగ్య ప్రమాదాల గురించి యువత తెలుసుకోవాలని వైద్యులు, ఫిట్నెస్ నిపుణులు సూచిస్తున్నారు. వైద్యులు ఏం చెబుతున్నారు.. 👉సిక్స్ ప్యాక్ కొనసాగింపు శరీరానికి ఆరోగ్యకరమైనది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 👉అసహజమైన శరీరపు అతి తక్కువ కొవ్వు శాతం ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. కొన్ని నెలల పాటు సిక్స్ ప్యాక్ మెయింటెయిన్ చేయడం అంటే శరీరపు కొవ్వు శాతం ఉండాల్సిన కనీస స్థాయి కన్నా పురుషులలో అయితే 12% మహిళల్లో అయితే 18% తక్కువవుతుందని వైద్యులు చెబుతున్నారు. 👉కొవ్వు ఇలా పరిమితికి మించి తగ్గడం అనేది అంతర్గత అవయవాల లైనింగ్‌ను ప్రభావితం చేస్తుంది. 👉తమకు వచ్చిన సిక్స్ ప్యాక్ చూపులకు బిగుతుగా కనిపించేలా చేయడానికి కొందరు ఆహారంలో ఉప్పును పూర్తిగా వదులుకుంటారు ఇది మరింత ప్రమాదకరం. ఆహారం నుంచి ఉప్పు తొలగించడం ఆరోగ్యంపై ప్రతికూల ఫలితాలను కలిగిస్తుంది. 👉అదే విధంగా కొన్ని సందర్భాల్లో తాగే నీటికి కూడా ప్రమాదకర పరిమితి పాటించాల్సి ఉంటుంది. ఇది తీవ్రమైన డీ హైడ్రేషన్‌కు గురిచేసే అవకాశం ఉంది. 👉అలాగే సిక్స్–ప్యాక్ సాధించిన తర్వాత కూడా దాన్ని నిలబెట్టుకోవడం కోసం నిరంతరం పరిగెత్తడం, అవి కనపడని రోజున తీవ్ర ఒత్తిడికి గురికావడం జరుగవచ్చని, అది మానసిక సమస్యలకు దోహదం చేస్తుందని సైక్రియాట్రిస్ట్లు హెచ్చరిస్తున్నారు. 👉బాడీ బిల్డింగ్ పోటీలకు హాజరయ్యేవారు లేదా పూర్తిగా వైద్యుల, న్యూట్రిషనిస్ట్‌ల పర్యవేక్షణలో గడిపేవారు, ఒత్తిడితో కూడిన వృత్తి వ్యాపకాలు నిర్వహించని వారు తప్ప సిక్స్ ప్యాక్ గురించి ఎక్కువ శ్రమించడం ప్రమాదకరం అంటున్నారు. 👉ఇక ఫాస్ట్‌గా సిక్స్ ప్యాక్ దక్కించుకోవడం కోసం స్టెరాయిడ్స్ వంటివి అతిగా తీసుకుంటున్నారు కొందరు. ఇది కూడా శరీరంలోని హార్మోన్ల పనితీరును దెబ్బతీస్తుందని, ఫలితంగా ఆరోగ్యపరమైన ఇబ్బందులు కలుగుతాయని వైద్యులు చెబుతున్నారు. అదే అసలు కారణమా? ఆ మధ్య టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ఉన్న నటుడు రానా దగ్గుబాటి ఆరోగ్యం విషయంలో రకరకాల వార్తలు గుప్పుమన్నాయి. బాహుబలి అనంతరమే ఆయన ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నాడని, సిక్స్ ఫిజిక్ కోసం ఆశ్రయించిన పలు మార్గాలే దీనికి కారణమని పలు వార్తలు వెలుగు చూశాయి. అలాగే ఇటీవల కొన్ని రోజుల క్రితం టాలీవుడ్ యువ నటుడు నాగÔౌర్య ఆకస్మిక అనారోగ్యంతో ఆసుపత్రి పాలయ్యారు. హైదరాబాద్‌లో జరుగుతున్న సినిమా షూటింగ్లో పాల్గొన్న ఆయన ఆకస్మికంగా సొమ్మసిల్లిపడిపోగా ఆయనను గచ్చి»ౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స అనంతరం కోలుకున్నారు. ఆసుపత్రిలో చేరే సమయంలో డీ హైడ్రేషన్, హై ఫీవర్‌తో బాధపడుతున్నారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఇక కన్నడ సూపర్‌స్టార్ పునీత్‌రాజ్ జిమ్ చేస్తూ స్ట్రోక్ వచ్చి మరణించిన విషయమూ తెలిసిందే...జాగ్రత్తలు పాటించాలి... అబ్బాయిలు మాత్రమే కాదు అమ్మాయిలు సైతం సిక్స్ ప్యాక్ పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. శారీరకంగా అమ్మాయిలకు, అబ్బాయిలతో పోలిస్తే చాలా పరిమితులు ఉంటాయనే విషయం గుర్తుంచుకోవాలి. మగవాళ్లకన్నా ఆరోగ్య సమస్యలు ఎక్కువ. ఫిట్నెస్ రంగాన్ని ప్రొఫెషన్‌గా తీసుకున్నా, బాడీ బిల్డింగ్ రంగంలో రాణించాలనుకున్నా.. ఓకే గానీ... సరదాకో, గుర్తింపు కోసమో సిక్స్‌ప్యాక్ చేయాలనుకోవడం ఏ మాత్రం సరికాదు. –కిరణ్ డెంబ్లా, డి.జె, ఫిట్నెస్ శిక్షకురాలుఏడాది పాటు శ్రమించా..కఠినమైన వర్కవుట్స్‌తో పాటు డైట్ కూడా ఫాలో అయ్యా. షూటింగ్ ఉన్నప్పుడు వర్కవుట్ చేయడంతో పాటు నీళ్లు కూడా తీసుకోలేదు. ఇలాంటి సందర్భంలో సైకలాజికల్ ప్రెషర్‌ను ఎదుర్కోవడం అంత సులభం కాదు. సిక్స్ ప్యాక్ అనేది చాలా కష్టమైన ప్రక్రియ. –ఆనంద్ దేవర్కొండ, సినీ హీరోరాంగ్ రూట్లో అనర్థాలే.. చాలా మంది యువత ఎఫర్ట్ పెట్టి సిక్స్‌ప్యాక్ సాధిస్తున్నారు. అయితే కొందరు మాత్రం త్వరగా షేప్ వచ్చేయాలని రాంగ్ రూట్లో ప్రయత్నాలు చేయడం, మజిల్స్‌ను పరిమితికి మించి శ్రమకు గురిచేయడం వల్ల ఆరోగ్య సమస్యలకు గురవుతున్నారు. –ఎం.వెంకట్, ట్రైనర్, సిక్స్ ప్యాక్ స్పెషలిస్ట్ -
మూవీ రెండు రోజుల కలెక్షన్స్ చూస్తే షాక్
-
బాక్సాఫీస్ దగ్గర 'గం గం గణేశా'.. రెండు రోజుల వసూళ్లు ఎంతంటే?
ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'గం గం గణేశా'. చాన్నాళ్ల పాటు సరైన సినిమాలు లేకపోవడంతో థియేటర్లు బోసిపోయాయి. అలాంటి టైంలో అంటే రీసెంట్ శుక్రవారం ఏకంగా మూడు తెలుగు మూవీస్ రిలీజయ్యాయి. వీటిలో ఒకటే ఇది. రోజు రోజుకి మెరుగైన వసూళ్లు సాధిస్తున్న ఈ చిత్రం రెండు రోజుల్లో ఎన్ని కోట్లు దక్కించుకుంది? ప్రస్తుతం పరిస్థితి ఏంటి?(ఇదీ చదవండి: హీరో ఆత్మహత్య చేసుకున్న ఫ్లాట్‌లో హీరోయిన్ మకాం)'బేబి' మూవీతో గతేడాది హిట్ కొట్టిన ఆనంద్ దేవరకొండ.. ఇప్పుడు జానర్ మార్చి మరో మూవీతో ప్రేక్షకుల్ని పలకరించాడు. క్రైమ్ కామెడీతో తీసిన 'గం గం గణేశా' తొలిరోజు రూ.1.20 కోట్ల గ్రాస్ సొంతం చేసుకుంది. వీకెండ్ కావడంతో రెండో రోజు థియేటర్లకి జనాలు బాగానే వచ్చారు. తద్వారా రెండో రోజు రూ.1.50 కోట్లకి పైగా గ్రాస్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.ఈ లెక్కన ఓవరాల్‌గా చూసుకుంటే 'గం గం గణేశా' సినిమాకు రెండు రోజుల్లో రూ.2.60 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు దక్కినట్లు సమాచారం. మరి ఇంకా చాలానే రాబట్టాల్సి ఉంది. మరి సేఫ్ జోన్లోకి వెళ్తుందా లేదా అనేది మరో రెండు మూడు రోజుల్లో తెలిసిపోతుంది.(ఇదీ చదవండి: 'బేబి' హీరోయిన్ నుంచి త్వరలో గుడ్ న్యూస్?) -
‘గం..గం..గణేశా’తొలి రోజు కలెక్షన్స్ ఎంతంటే..?
ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన తాజా చిత్రం ‘గం..గం..గణేశా’. ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్లు. ఈ సినిమాను హై-లైఫ్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మించారు. ఉదయ్ శెట్టి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. భారీ అంచనాల మధ్య నిన్న (మే 31) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. (చదవండి: ‘గం..గం..గణేశా’ మూవీ రివ్యూ)ఫలితంగా తొలి రోజు ఈ చిత్రం మంచి వసూళ్లను రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా ఫస్ట్‌డే ఈ మూవీ 1.82 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టిందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. వీకెండ్లో ఈ కలెక్షన్స్ మరింత పుంజుకునే అవకాశం ఉందని సినీ పండితులు చెబుతున్నారు. -
‘గం..గం..గణేశా’ మూవీ రివ్యూ
టైటిల్: గం..గం..గణేశా నటీనటులు : ఆనంద్ దేవరకొండ, ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక, కరిష్మా, వెన్నెల కిషోర్, సత్యం రాజేశ్, జబర్దస్త్ ఇమాన్యూయల్, రాజ్ అర్జున్, తదితరులు.నిర్మాణ సంస్థ:హై-లైఫ్ ఎంటర్ టైన్ మెంట్నిర్మాతలు:కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచిరచన, దర్శకత్వం - ఉదయ్ శెట్టి సంగీతం: చేతన్ భరద్వాజ్సినిమాటోగ్రఫీ: ఆదిత్య జవ్వాడిఎడిటర్: కార్తీక్ శ్రీనివాస్విడుదల తేది: మే 31, 2024‘బేబీ’లాంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత ఆనంద్ దేవరకొండ నటించిన చిత్రం ‘గం..గం..గణేశా’. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ఈ మూవీపై హైప్‌ని క్రియేట్ చేశాయి. దానికి తోడు ప్రమోషన్స్ కూడా భారీగా చేయడంతో ‘గం..గం..గణేశా’పై ఆసక్తి ఏర్పడింది. భారీ అంచనాలతో నేడు(మే 31) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ యాక్షన్ క్రైమ్ కామెడీ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే..హైదరాబాద్‌కు గణేష్(ఆనంద్ దేవరకొండ) ఓ అనాథ. స్నేహితుడు శంకర్ (ఇమ్మాన్యుయేల్)తో కలిసి చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ జీవితం గడుపుతుంటాడు. అదే ఏరియాలో ఓ షాపులో పని చేసే శృతి(నయన్ సారిక)తో పీకల్లోతూ ప్రేమలో ఉంటాడు. అయితే శ్రుతి మాత్రం డబ్బుకు ఆశపడి ఆ షాపు ఓనర్ కొడుకుతో పెళ్లికి రెడీ అయిపోతుంది. ప్రేమించిన అమ్మాయి మోసం చేయడంతో హర్ట్ అయిన గణేష్..ఎలాగైన భారీగా డబ్బు సంపాదించుకోవాలనుకుంటాడు. ఈ క్రమంలో స్నేహితుడు శంకర్‌తో కలిసి రూ. 7 కోట్లు విలువ చేసే డైమండ్‌ను దొంగిలిస్తాడు. ఆ డైమండ్ కోసం అరుణ్ (ప్రిన్స్ యావర్) గ్యాంగ్ గణేష్ వెంటపడుతుంది. వారి నుంచి తప్పించుకునే క్రమంలో ఆ డైమంగ్ ఓ గణేశ్ విగ్రహంలోకి చేరుతుంది. ఆ విగ్రహం కర్నూలు జిల్లాకు చెందిన రాజావారు(సత్యం రాజేశ్)కొనుగోలు చేసి తన గ్రామానికి తీసుకెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? వినాయకుడి విగ్రహంలో పడిపోయిన డైమండ్ కోసం గణేష్ ఏం చేశాడు? ఆ విగ్రహాన్ని దొంగిలించేందుకు రుద్రా(కృష్ణ చైతన్య) గ్యాంగ్ ఎందుకు ప్రయత్నించింది? ముంబైలో చాలా విగ్రహాలు ఉన్నప్పటికీ.. రాజావారు ప్రత్యేకంగా ఆ విగ్రహాన్నే ఎందుకు కొనుగోలు చేశాడు? ఈ విగ్రహానికి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవాలనుకుంటున్న కిషోర్ రెడ్డి(రాజ్ అర్జున్)కి ఉన్న సంబంధం ఏంటి? ఆర్గాన్ డేవిడ్(వెన్నెల కిశోర్) కారణంగా రుద్రా గ్యాంగ్‌తో పాటు గణేష్‌కి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? చివరకు ఆ విగ్రహం ఎవరికి దక్కింది? అందులో పడిపోయిన డైమాండ్ చివరకు ఎవరికి దక్కింది? గణేష్ లైఫ్‌లోకి కృష్ణవేణి(ప్రగతి శ్రీవాస్తవ)ఎలా వచ్చింది? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. ప్రతి మనిషిలోనూ భయం, అత్యాశ, కుట్ర అనే మూడు లక్షణాలు ఉంటాయి. ఇవి కొందరి జీవితాలను ఎలా ప్రభావితం చేస్తాయనేది ‘గం..గం..గణేశా’ సినిమాలో చూపించాడు దర్శకుడు. ఇలాంటి క్రైమ్ కామెడీ థ్రిల్లర్ చిత్రాలు తెలుగు తెరకు కొత్తేమి కాదు. కానీ డిఫరెంట్ కామెడీతో పాటు క్రిస్పీ ఎడిటింగ్‌తో హిలేరిస్‌గా కథనాన్ని సాగించాడు. కథ మొత్తం వినాయకుడి విగ్రహం చుట్టే తిరుగుతుంది. ట్విస్ట్స్ అండ్ టర్న్స్ సింపుల్‌గానే ఉన్నా ఎంటర్టైన్ చేస్తాయి.హైదరాబాద్ నేపథ్యంగా మొదలయ్యే ఈ సినిమా కథ ఆ తర్వాత కర్నూల్ కు షిప్ట్ అవుతుంది. సినిమా ప్రారంభంలో వచ్చే హీరో లవ్ ట్రాక్ అంతగా ఆకట్టుకోదు. డైమాండ్ దొంగిలించాలని హీరో ఫిక్సయ్యాక..కథలో వేగం పుంజుకుంటుంది. ఒకవైపు కిశోర్ రెడ్డి ట్రాక్.. మరోవైపు గణేష్ ట్రాక్ రెండింటిని సమాంతరంగా నడిపిస్తూ ఎక్కడా బోర్ కొట్టకుండా కథనాన్ని సాగించాడు. డైమండ్ వినాయకుడి విగ్రహంలోకి చేరడం..దాన్ని కిశోర్ రాజకీయ ప్రత్యర్థి గ్రామమైన రాజావారి పల్లెకు తీసుకెళ్లడంతో ఏం జరుగుతుందనే ఉత్కంఠ ప్రేక్షకుల్లో కలుగుతుంది. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ద్వితియార్థంలో కథంతా విగ్రహం చుట్టే తిరగడంతో కాస్త సాగదీతగా అనిపిస్తుంది. అలాగే విగ్రహం కొట్టేసేందుకు రుద్రా గ్యాంగ్, డైమండ్‌ను తీసుకెళ్లడం కోసం హీరో చేసే ప్రయత్నాలు అంతగా ఎంటర్టైన్ చేయవు. మతిభ్రమించిన డాక్టర్ ఆర్గాన్ డైమండ్గా వెన్నెల కిశోర్ పండించే కామెడీ మాత్రం సినిమాకు ప్లస్ అయింది. అతను తెరపై కనిపించిన ప్రతి సారి థియేటర్లలో నవ్వులు పూశాయి. అదేసమయంలో అరుణ్ గ్యాంగ్‌కు సంబంధించిన సన్నివేశాలు.. నీలవేణితో గణేష్ నడిపే లవ్‌ట్రాక్ కథకు అనవసరంగా జోడించినట్లు అనిపిస్తుంది. క్లైమాక్స్‌లో స్వామిజీ(రంజగన్)ఇచ్చే ట్విస్ట్ మాత్రం ఊహించని విధంగా ఉంటుంది. సినిమా ముగింపు మాత్రం దర్శకుడు ఇవ్వాలనుకున్న సందేశానికి విరుద్ధంగా ఉన్నట్లు అనిపిస్తుంది. తెలుగు ప్రేక్షకులను నెగెటివ్ క్లైమాక్స్‌ని ఒప్పుకోరని అలా ముగించాడేమో. చిన్న చిన్న లోపాలు మినహాయిస్తే.. ఎక్కడా అసభ్యకర సన్నివేశాలు లేని ఈ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ హ్యాపీగా ఫ్యామిలీతో కలిసి చూసేయొచ్చు. ఎవరెలా చేశారంటే.. ఆనంద్ దేవరకొండ ఇప్పటిదాకా బాయ్ నెక్ట్ డోర్ క్యారెక్టర్స్ చేశారు. ఈ చిత్రంలో మాత్రం కాస్త డిఫరెంట్‌గా ట్రై చేశాడు. గ్రే షేడ్స్ ఉన్న గణేష్ పాత్రలో ఆనంద్ ఒదిగిపోయాడు. డ్యాన్స్‌తో పాటు కామెడీ కూడా బాగా పండించాడు. తెరపై చాలా ఎనర్జిటిక్‌గా కనిపించాడు. ఇక జబర్థస్త్ ఫేం ఇమ్మాన్యుయేల్‌కి ఈ చిత్రంలో మంచి పాత్ర లభించింది. హీరో స్నేహితుడు శంకర్‌గా ఆయన చక్కగా నటించాడు. తనదైన కామెడీతో ఆకట్టుకున్నాడు. ఇక హీరోయిన్లుగా నటించిన ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక ఇద్దరు తెరపై కనిపించేది తక్కువ సమయమే అయినా..ఉన్నంతలో చక్కగా నటించారు. మతిభ్రమించిన డాక్టర్ ఆర్గాన్ డేవిడ్‌గా వెన్నెల కిశోర్ పండించిన కామెడీ సినిమాకు ప్లస్ అయింది. ఆ పాత్రకు మరిన్ని సన్నివేశాలు ఉంటే బాగుండేది. కిశోర్ రెడ్డిగా రాజ్ అర్జున్, రుద్రాగా కృష్ణ చైతన్యతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికపరంగా సినిమా పర్వాలేదు. చేతన్ భరద్వాజ్ నేపథ్య సంగీతం బాగుంది. పాటలు పర్వాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. కార్తీక్ శ్రీనివాస్ ఎడిటింగ్ సినిమాకు ప్లస్ అయింది. సన్నివేశాలను చాలా క్రిస్పిగా కట్ చేశాడు. స్క్రీన్ ప్లే బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్ డెస్క్ -
Gam Gam Ganesha X Review: ‘గం..గం..గణేశా’ టాక్ ఎలా ఉందంటే..
బేబీ తర్వాత ఆనంద్ దేవరకొండ నటించిన తాజా చిత్రం ‘గం..గం..గణేశా’. ఉదయ్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్స్ గా నటించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు, ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. దానికి తోడు ప్రమోషన్స్ కూగా గ్రాండ్‌గా చేయడంతో ఈ సినిమాపై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య ఎట్టకేలకు నేడు(మే 31) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్ షో పడిపోయింది. సినిమా చూసిన ప్రేక్షకుల సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. గం..గం..గణేశా ఎలా ఉంది? ఆనంద్ దేవరకొండ ఖాతాలో మరో హిట్ పడిందా లేదా? తదితర అంశాలను ఎక్స్(ట్విటర్) వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూసేద్దాం. ఇది కేవలం ప్రేక్షకుల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’ బాధ్యత వహించదు.ఎక్స్‌లో గం..గం..గణేశాకు మంచి స్పందన లభిస్తోంది. కామెడీ బాగా వర్కౌట్ అయిందని కామెంట్ చేస్తున్నారు. ఆనంద్ దేవరకొండ నుంచి వచ్చిన కరెక్ట్ కమర్షియల్ థ్రిల్లర్ ప్యాకేజీ అని అంటున్నారు. #GamGamGanesha 🏆🏆🏆🏆 A Proper Commercial Thriller Package from Anand deverkonda 👌Entertaining First Half and Thrilling Second Half with good Climax works big time 💥 Emmanuel , Krishna Chaitanya was best in their roles 🔥#GGG pic.twitter.com/HgfRVL9RTm— Let's X OTT GLOBAL (@LetsXOtt) May 31, 2024 ఆనంద్ దేవరకొండ నుంచి వచ్చిన ప్రాపర్ కమర్షియల్ థ్రిల్లర్ ప్యాకేజ్ గం..గం..గణేశా. ఫస్టాఫ్ ఎంటర్టైనింగ్ ఉంది. సెకండాఫ్ థ్రిల్లింగ్‌గా సాగుతుంది. క్లైమాక్స్ బాగుంది. ఇమ్మాన్యుయేల్, కృష్ణ చైతన్య వారి వారి పాత్రల్లో చక్కగా నటించారని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.#GamGamGanesha A Complete Fun Entertainer 🏆@ananddeverkonda Steals The Show With His Brilliant Performance 👏Director @udaybommisetty Congratulations! You Have Impressed Everyone With Ur Narrative Style & CharacterisationsMusic & Cinematography Are Of Top Notch Quality 👌 pic.twitter.com/rGmF8sM5uw— Official Srinu (@OfficialSreeNu) May 30, 2024 గం..గం..గణేశా ఒక కంప్లీట్ ఫన్ ఎంటర్టైనర్. ఆనంద్ దేవరకొండ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. డైరెక్టర్ ఉదయ్ నెరేటివ్ స్టైల్‌తో పాటు పాత్రలను తీర్చిదిద్దిన విధానం బాగుంది. సంగీతం, సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉందని మరో నెటిజన్ రాసుకొచ్చాడు.#GamGamGanesha is a 'Sit-back and Relax' fun Crime Comedy. Situational comedy works superbly & Vennala Kishore Track was 🤣. BGM 🔥Despite its known story, Kudos to @udaybommisetty for his brilliant execution! @ananddeverkonda HIT Streak continues! ✌️ pic.twitter.com/GqiSbcLxf0— The Creative Shelf (@tcsblogs) May 31, 2024 గం గం గణేశా మూవీ సిట్ బ్యాక్ అండ్ రిలాక్స్ ఫన్ క్రైమ్ కామెడీ. వెన్నెల కిషోర్ సిట్యుయేషనల్ కామెడీ అద్భుతంగా వర్కౌట్ అయింది. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సూపర్ గా ఉంది. ఉదయ్ బొమ్మిశెట్టి కథనాన్ని నడించిన తీరు బాగుంది. ఆనంద్ దేవరకొండ ఖాతాలో మరో హిట్ పడిందని ఓ నెటిజన్ రాసుకొచ్చాడు. #GamGamGanesha Day 🔥UK reviews bagunavi 😍Another BB loading............#AnandDeverakonda #VijayDeverakonda pic.twitter.com/LaCH0TDSj9— Mahesh (@starmahesh10) May 31, 2024#GamGamGaneshaReview:Simple story but missing content.Comedy is ok in some scenes.#AnandDeverakonda trying his best in plots but this time it's not up to the mark, #Immanuel #VennalaKishore are big plus.He always trying new appreciate for that.#GamGamGanesha#GangsOfGodavari pic.twitter.com/ko7QQYNZmg— MJ Cartels (@Mjcartels) May 31, 2024#GamGamGanesha Premiere Review from UK 🇬🇧 pic.twitter.com/f6W0Hn9LFu— Anonymous (@__GirDhar) May 31, 2024Positive reviews every where another hit loading ❤️🔥Congrats @ananddeverkonda anna #GamGamGanesha pic.twitter.com/hSHsbL4fcN— sashanth (@sashant39979304) May 31, 2024#GamGamGaneshaReviewPositives: • Situational Comedy 😂• Vennala Kishore Track 🤩• Characters & Characterisations 💥• Engaging Screenplay 💯• Decent Twists 🤗• Superb BGM 🥵Negatives: • Artificial First 15mins • Weak Villain Characterization• Few Acting &… pic.twitter.com/ozh13EbQ8z— Movies4u Official (@Movies4u_Officl) May 31, 2024 -
హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనం చూసి స్టోరీ రాసుకున్నా: ఉదయ్ శెట్టి
‘భయం, అత్యాశ, కుట్ర అనేవి ప్రతి మనిషిలో ఉంటాయి. అయితే కొందరిలో కొంత మరికొందరిలో ఎక్కువగా ఉంటాయి. ఈ మూడు లక్షణాలు కొందరు మనుషులను ఎలాంటి పరిస్థితుల వైపు తీసుకెళ్లాయి అనేది "గం..గం..గణేశా"లో ఆసక్తికరంగా తెరకెక్కించాం’ అన్నారు డైరెక్టర్ ఉదయ్ శెట్టి. ఆయన దర్శకత్వం వహించిన చిత్రం ‘గం..గం..గణేశా’. ఆనంద్ దేవరకొండ హీరో. సరసన ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్స్ గా నటించారు. రేపు(మే 31) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా దర్శకుడు ఉదయ్ శెట్టి మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. → నేను విజయేంద్రప్రసాద్ గారి టీమ్ లో రైటర్ గా వర్క్ చేసేవాడిని. ఒకసారి హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనం కార్యక్రమంలో పాల్గొన్నాను. ఆ టైమ్ లో ఈ స్టోరీ లైన్ ఫ్లాష్ అయ్యింది. నా ఫ్రెండ్, దర్శకుడు అనుదీప్ కేవీ ద్వారా ఆనంద్ దేవరకొండ టీమ్ కు ఈ స్క్రిప్ట్ సినాప్సిస్ పంపించాను. ఆ సాయంత్రమే నాకు ఫోన్ వచ్చింది. వచ్చి ఒకసారి కలవండి అని. నేను వెళ్లి స్క్రిప్ట్ గురించి వాళ్లకున్న డౌట్స్ క్లియర్ చేశాను. ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్ చేద్దామని ఆనంద్ చెప్పారు. అలా "గం..గం..గణేశా" జర్నీ బిగిన్ అయ్యింది.→ వినాయకుడి విగ్రహం చుట్టూ తిరిగే కథ ఇది. ఆ విగ్రహం సంపాదించుకునేందుకు చాలా మంది ప్రయత్నిస్తుంటాడు. ఈ సినిమాలో అన్నీ గ్రే క్యారెక్టర్స్ ఉంటాయి. ఒక హీరోయిన్ ని మాత్రం మంచి క్యారెక్టర్ లో చూపిస్తున్నాం. మరో హీరోయిన్ నెగిటివ్ గా బిహేవ్ చేస్తుంది. అయితే తను బ్యాడ్ కాదు పరిస్థితుల వల్ల అలా ప్రవర్తించాల్సివస్తుంది.→ ఇటీవల మా మూవీ ప్రివ్యూ చూసిన వాళ్లు వెన్నెల కిషోర్ క్యారెక్టర్ ఇంకాస్త సేపు ఉంటే బాగుండేది అన్నారు. వాళ్లకు అంతగా నచ్చింది. ఇందులో స్పెషల్ గా లవ్ స్టోరి అంటూ ఉండదు. కథ జర్నీలో భాగంగా ఇద్దరు హీరోయిన్స్ వస్తారు. వాళ్లకు కీ రోల్స్ ఉన్నాయి. బాగా నయన్ సారిక, ప్రగతి శ్రీ వాస్తవ బాగా పర్ ఫార్మ్ చేశారు.→ "గం..గం..గణేశా" సినిమాలో స్క్రీన్ ప్లే ఆకట్టుకుంటుంది. కథలో నేను నమ్మిన ట్విస్ట్స్ అండ్ టర్న్స్ ను అలాగే హోల్డ్ చేస్తూ స్క్రీన్ ప్లే సాగుతుంది. ఈ సినిమా మరో రెండేళ్లకు తెరపైకి తీసుకొచ్చినా కొత్తగా ఉంటుంది. అలాంటి స్క్రీన్ ప్లే కుదిరింది.→ "గం..గం..గణేశా" మేకింగ్ టైమ్ లో ఆనంద్ చాలా సపోర్ట్ చేశాడు. నేను అనుకున్న క్యారెక్టర్ లో బాగా పర్ ఫార్మ్ చేశాడు. ఎడిట్ టేబుల్ మీద ఆనంద్ పర్ ఫార్మెన్స్ చూస్తున్నప్పుడు హ్యాపీగా అనిపించింది. డైలాగ్ డెలివరీ, టైమింగ్, రియాక్షన్స్ చాలా బాగా చేశాడు. ఈ సినిమాకు ఆయన పర్ ఫార్మెన్స్ హైలైట్ అవుతుంది. కమర్షియల్ హీరోకు ఉండాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఆయన క్యారెక్టర్ లో కనిపిస్తాయి.→ నేను పూరి జగన్నాథ గారిని చూసి ఇన్స్ పైర్ అయ్యాను. అయితే రాజమౌళి గారి సినిమాల్లోని డ్రామా చాలా ఇష్టం. మనకు సినిమా చూసేప్పుడు డ్రామా మన మనసులకు రీచ్ అవుతుంది. అలాంటి యాక్షన్ డ్రామా మూవీస్ చేయాలని ఉంది. నా నెక్ట్ మూవీ యాక్షన్ డ్రామాగానే ఉంటుంది. -
వైరల్ కావాలనే రష్మికతో అలా చిట్ చాట్ చేశాం: ఆనంద్ దేవరకొండ
రష్మిక మా ఫ్యామిలీ ఫ్రెండ్. నాతో పాటు మా ఫ్యామిలీతో క్లోజ్‌గా ఉంటుంది. అందుకే గం.. గం.. గణేశా ప్రిరిలీజ్ ఈవెంట్లో ఫన్నీగా చిట్ చాట్ చేశాం(చిట్ చాట్‌లో భాగంగా మీ ఫేవరెట్ హీరో ఎవరని అడగ్గా..ఆనంద్.. నువ్వు నా ఫ్యామిలీ ఇలా ఇరికిస్తే ఎలా? అంటూనే రౌడీ బాయ్ (విజయ్ దేవరకొండ) పేరును రష్మిక చెప్పడంతో అది వైరల్ అయింది). అది వైరల్ అవుతుందని తెలిసే..కావాలనే అలా చేశాం. రష్మికకు అన్నకు(విజయ్ దేవరకొండ) మధ్య ఏదైన రిలేషన్ ఉంటే ఎప్పటికైనా బయటపడుతుంది కదా(నవ్వుతూ..). ఇప్పటికైతే రష్మిక మాకు మంచి స్నేహితురాలు మాత్రమే’ అని అన్నారు ఆనంద్ దేవరకొండ. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘గం..గం..గణేశా’. ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమాను హై-లైఫ్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్నారు. ఉదయ్ శెట్టి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ నెల 31న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆనంద్ దేవరకొండ మీడియాతో ముచ్చటిస్తూ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.⇢ లాక్డౌన్ సమయంలోనే బేబి కథతో పాటు "గం..గం..గణేశా" స్క్రిప్ట్ కూడా నా దగ్గరకు వచ్చింది. దర్శకుడు ఉదయ్ శెట్టి పంపిన స్క్రిప్ట్ సినాప్సిస్ లో అత్యాశ, భయం, కుట్ర అనే మూడు పదాలు నన్ను అట్రాక్ట్ చేశాయి. ఈ లైన్ ఎగ్జైట్ చేసింది. యూనిక్ గా అనిపించింది. అందుకే ఈ సినిమాను ఒప్పుకున్నాను.⇢ ఈ మూవీ షూటింగ్ డిలే అయ్యింది. నేను బేబి మూవీ కోసం ఆ క్యారెక్టర్ మేకోవర్ లో ఉండిపోయాను. అందులో నుంచి బయటకు వచ్చేందుకు కొన్ని నెలల టైమ్ పట్టింది. కోవిడ్ సెకండ్ వేవ్, ఫిల్మ్ యూనియన్ స్ట్రైక్స్ జరగడం..ఇలాంటి వాటి వల్ల డిలేస్ అవుతూ వచ్చాయి. సెకండాఫ్ లో వినాయకుడి మండపం నేపథ్యంలో సీన్స్ ఉంటాయి. వాటికోసం ఒక సెట్ వేశాం. భారీ వర్షాలకు ఆ సెట్ పడిపోయింది. మళ్లీ ఆ సెట్ ను పునర్నిర్మించి షూటింగ్ చేశాం. దానికి కొంత టైమ్ పట్టింది.⇢ ప్రతి ఇంటర్వ్యూలో మీరు హీరో సెంట్రిక్ మూవీస్ ఎందుకు చేయరు అని అడుగుతుంటారు. ఎందుకు చేయకూడదు అని నాకూ అనిపించింది. "గం..గం..గణేశా" కథతో ఆ ప్రయత్నం చేయొచ్చనే నమ్మకం కలిగింది.⇢ నేను గతంలో కనిపించినట్లు ఇందులో పక్కింటి కుర్రాడిలా కనిపించను. ఎనర్జిటిక్ గా ఉంటా, కామెడీ చేస్తా, ఏడవాలనిపిస్తే ఏడుస్తా...హైపర్ గా ఉంటాను. తనను తాను హీరో అనుకుంటాడు గానీ హీరోలా ప్రవర్తించడు.నేను పెట్టుకున్న నమ్మకానికి తగినట్లు మా డైరెక్టర్ ఉదయ్ కథను అందరికీ నచ్చేలా స్క్రీన్ ప్లేతో తెరకెక్కించాడు.⇢ ఇటీవల ఫ్యామిలీ, యూత్ ఆడియెన్స్ కోసం "గం..గం..గణేశా" స్పెషల్ షోస్ వేశాం. వాళ్లు సినిమా చూస్తున్నంత సేపు ఎంటర్ టైన్ అవుతూ ఎంజాయ్ చేశారు. వాళ్ల రెస్పాన్స్ చూసి మాకు మరింత కాన్ఫిడెన్స్ వచ్చింది.⇢ వినాయకుడి విగ్రహం చుట్టూ జరిగే కథ ఇది. ఆ విగ్రహం దక్కించుకోవడం కోసం కొందరు ప్రయత్నాలు చేస్తుంటారు. వాళ్లంతా బ్యాడ్ ఇంటెన్షన్ ఉన్నవాళ్లు. ఆ విగ్రహంలో అంత విలువైనది ఏముంది. ఎవరికి విగ్రహం దక్కింది అనేది కథాంశం. మనలోనూ భయం, అత్యాశ, కుట్ర అనే లక్షణాలు ఉంటాయి. అవి కొందరి జీవితాలను ఎలా ప్రభావితం చేశాయి అనేది ఈ సినిమాలో చూపిస్తున్నాం.⇢ నేను పాటలు వింటూ డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తుంటా. ఇంట్లో ఖాలీగా ఉంటే అన్న విజయ్ డ్యాన్స్ ప్రాక్టీస్ చేయి అంటాడు. మా నాన్న కూడా నీలో గ్రేస్ ఉందిరా డ్యాన్స్ నేర్చుకో అనేవారు. బేబిలో ఓ ఆరు నిమిషాల పాట చేశాం. కానీ సినిమా నిడివికి ఎక్కువవుతుందని కట్ చేశాం. ఈ సినిమాలో డ్యాన్స్ లు చేసే అవకాశం దక్కింది.⇢ "గం..గం..గణేశా"కు చేతన్ భరద్వాజ్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. బీజీఎం కూడా ఆకట్టుకుంటుంది. హైలైఫ్ ఎంటర్ టైన్ మెంట్స్ నా హోమ్ బ్యానర్ లాంటిది. కేదార్, వంశీ నా ఫ్రెండ్స్. ఈ సినిమా కోసం వాళ్లు ఎంతో సపోర్ట్ చేశారు. షూటింగ్ డిలేస్, సెట్ పాడయినప్పుడు మళ్లీ ఖర్చు పెట్టి సినిమా కంప్లీట్ చేశారు.⇢ నాకు రా యాక్షన్ మూవీస్ చేయడం ఇష్టం. ధనుష్ కర్ణన్, అసురన్ మూవీస్ లా సినిమాలు చేయాలనే కోరిక ఉండేది. ఇప్పుడు వినోద్ అనంతోజు సితార ఎంటర్ టైన్ మెంట్స్ కాంబోలో చేస్తున్న మూవీ అలాంటి ఫార్మేట్ లోనే ఉంటుంది. డైరెక్టర్ సాయి రాజేశ్, ఎస్ కేఎన్, వైష్ణవి, నేను కలిసి బేబి కాంబోలో ఓ మూవీ చేస్తున్నాం. వీటితో పాటు స్టూడియో గ్రీన్ వారి డ్యూయెట్ సినిమాలో నటిస్తున్నా. ఈ సినిమా 50 పర్సెంట్ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. -
‘గం..గం..గణేశా’ ప్రేక్షకుల్ని బాగా నవ్విస్తుంది : వంశీ కారుమంచి
‘‘క్రైమ్, కామెడీ, యాక్షన్‌గా ‘గం..గం..గణేశా’ సినిమా రూపొందింది. మరీ ముఖ్యంగా ఇందులోని వినోదం ఆకట్టుకుంటుంది. మన స్నేహితుల్లో ఎవరో ఒకరు మనల్ని సమస్యల్లో ఇరికిస్తుంటారు. అలాంటి సందర్భాల్లో వచ్చే వినోదం ప్రేక్షకుల్ని బాగా నవ్విస్తుంది’’ అని నిర్మాత వంశీ కారుమంచి అన్నారు. ఆనంద్ దేవరకొండ హీరోగా, ప్రగతి శ్రీవాస్తవ, కరిష్మా హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘గం..గం.. గణేశా’. ఉదయ్ శెట్టి దర్శకుడు. హైలైఫ్ ఎంటర్టైన్మెంట్స్పై వంశీ కారుమంచి, కేదార్ సెలగంశెట్టి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 31న రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా వంశీ కారుమంచి మాట్లాడుతూ–‘‘నాది గుంటూరు. చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఇష్టం. అమెరికాలో ఉద్యోగం, వ్యాపారం చేశా. కొన్ని సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేశాను. ఇండియాలోనే స్థిరపడాలనుకున్నప్పుడు సినిమాలు నిర్మించాలనే ఆలోచన ఉండేది. ఉదయ్ కథ చెప్పగానే ఆనంద్కి సరి΄ోతుందనిపించింది. కొంత ఆకతాయిగా, జులాయిగా ఉండే పాత్ర తనది. గణేష్ విగ్రహం, డబ్బుతో ముడిపడిన యాక్షన్ కామెడీ సినిమా ‘గం గం గణేశా’. ఇద్దరి హీరోయిన్ల పాత్రకి మంచి ప్రాధాన్యం ఉంది. సినిమా ఇండస్ట్రీ చూసేందుకు చిన్నదిగా కనిపించినా లక్షల మంది దీని మీద ఆధారపడి జీవిస్తున్నారు. ప్రస్తుతం రెండు కథలు ఫైనలైజ్ చేస్తున్నాం’’ అన్నారు. -
ఆనంద్, నువ్వు నా ఫ్యామిలీ రా.. రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్
రష్మిక పేరు చెప్పగానే చాలామందికి విజయ్ దేవరకొండనే గుర్తొస్తాడు. ఎందుకంటే వీళ్లిద్దరూ ఫ్రెండ్సా? లవర్సా? అనేది ఇప్పటికీ సస్పెన్సే. ఈ జంట పెళ్లి గురించి ఎప్పటికప్పుడు వార్తలు వస్తూనే ఉంటాయి. తాజాగా విజయ్ తమ్ముడు ఆనంద్ దేవరకొండ లేటెస్ట్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొంది. విజయ్‌తో బాండింగ్ గురించి ఓ క్లారిటీ ఇచ్చేసింది.(ఇదీ చదవండి: హీరోయిన్ నమిత విడాకులు తీసుకోనుందా?)ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన 'గం గం గణేశా'.. మే 31న థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే తాజాగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన రష్మికని ఆనంద్ దేవరకొండ చాలా ప్రశ్నలు అడిగాడు. రీసెంట్గా రష్మిక పోస్ట్ చేసిన పెట్ డాగ్స్ ఫొటోలు చూపించి, వీటిలో ఏదంటే నీకు బాగా ఇష్టమని అడిగాడు. దీంతో ఆరా(రష్మిక పెట్ డాగ్) నా ఫస్ట్ బేబీ, స్టార్మ్(విజయ్ పెట్ డాగ్) నా సెకండ్ బేబీ అని చెప్పింది.నీ ఫేవరెట్ కో స్టార్ ఎవరు? అని రష్మికని ఆనంద్ అడగ్గా.. మైక్ పక్కకు పెట్టి నీ యబ్బ అని ఆనంద్‌ని సరదాగా తిట్టింది. ఆ వెంటనే మైక్ లో.. ఆనంద్ నువ్వు నా ఫ్యామిలీరా, ఇలా స్పాట్లో పెడితే ఎలా అని అనడంతో ఈవెంట్‌కి వచ్చిన వాళ్లందరూ రౌడీ, రౌడీ స్టార్ అని అరిచారు. దీంతో రౌడీ బాయ్ నా ఫేవరేట్ అని విజయ్‌ని ఉద్దేశించి రష్మిక చెప్పింది. ఇలా రష్మిక-విజయ్ ఎంత క్లోజ్ అనేది మరోసారి ప్రూవ్ అయింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు.. ఆ రెండు మాత్రం స్పెషల్)#AnandDeverakonda: who's your fav co-star#Rashmika: Neeyabba.. Nuvvu Naa family anand #GamGamGanesha Pre Release pic.twitter.com/ZhiSfUU6pF— 𝐁𝐡𝐞𝐞𝐬𝐡𝐦𝐚 𝐓𝐚𝐥𝐤𝐬 (@BheeshmaTalks) May 27, 2024 -
‘గం. గం.. గణేశా’ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
'ఫ్యామిలీస్టార్'ను వాళ్లు కావాలనే టార్గెట్ చేశారు: ఆనంద్
ఆనంద్ దేవరకొండ హీరోగా, ప్రగతీ శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘గం..గం..గణేశా’. ఈ చిత్రం ఈ నెల 31న విడుదలవుతోంది. తాజాగా సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమంలో తన సోదరుడు విజయ్ దేవరకొండ నటించిన ఫ్యామిలీస్టార్ చిత్రం గురించి ఆయన కామెంట్ చేశాడు.కొద్దిరోజుల క్రితం విడుదలైన 'ఫ్యామిలీస్టార్'కు కావాలనే నెగెటివ్ టాక్‌తో ప్రచారం చేశారు. ఆ సినిమా విడదల కావడానికి 48 గంటల ముందు నుంచే పబ్లిక్ మాట్లాడిని పాత వీడియోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. గతంలో విజయ్ సినిమాలకు సంబంధించిన మాటలను తీసుకొచ్చి ఫ్యామిలీస్టార్ రిజల్ట్, రివ్యూలు అంటూ తప్పుడు థంబ్ నెయిల్స్ పెట్టారు. అలాంటి సమయంలో ప్రేక్షకుల్లో కూడా కాస్త నిరుత్సాహం కనిపించింది. కనీసం సినిమా చూసిన తర్వాత అయినా అలా రివ్యూస్ ఇచ్చి ఉంటే.. నిజంగానే ప్రేక్షకులకు మూవీ నచ్చలేదేమోనని అనుకునే వాళ్లం. అలాంటిది ఫ్యామిలీస్టార్ విడుదలకు ముందే కావాలని టార్గెట్ చేసి కొందురు ఎందుకు ఎటాక్ చేశారో తెలియడం లేదు. ఇలాంటి పద్ధతి చిత్ర పరిశ్రమకు చాలా ప్రమాదకరం. ఇలాంటి పని ఎందుకు, ఎవరు చేస్తున్నారో తెలుసుకునేందుకు సైబర్‌క్రైమ్‌కు వారికి ఫిర్యాదు కూడా చేశాం. భవిష్యత్‌లో విజయ్ నుంచి మూడు సినిమాలు వస్తున్నాయి. అవన్నీ మీకు నచ్చుతాయని కోరుకుంటున్నాను. అని ఆయన అన్నారు. -
గం గం గణేశా మూవీ ట్రైలర్ లాంచ్ (ఫోటోలు)
-
వినాయక చవితి చుట్టూ...
‘‘గం గం గణేశా’ దర్శకుడు ఉదయ్ నా వద్ద పని చేశాడు. అంకితభావం, కష్టపడే తత్వం ఉన్న అతనికి ఈ సినిమా తప్పకుండా సక్సెస్ ఇవ్వాలి’’ అని రచయిత, దర్శకుడు విజయేంద్ర ప్రసాద్ అన్నారు. ఆనంద్ దేవరకొండ హీరోగా, ప్రగతీ శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘గం..గం..గణేశా’. ఉదయ్ శెట్టి దర్శకత్వంలో కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 31న విడుదలవుతోంది.ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమంలో విజయేంద్ర ప్రసాద్, దర్శకులు వంశీ పైడిపల్లి, సాయి రాజేశ్ అతిథులుగా పాల్గొన్నారు. ‘‘గం గం గణేశా’ని థియేటర్స్‌లో చూసి ఎంజాయ్ చేయండి’’ అన్నారు వంశీ కారుమంచి, కేదార్ సెలగంశెట్టి. ‘‘వినాయక చవితి చుట్టూ తిరిగే కథతో ఈ సినిమా రూపొందించాం’’ అన్నారు ఉదయ్ శెట్టి. ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ– ‘‘గం గం గణేశా’లో తొలిసారి ఎనర్జిటిక్ క్యారెక్టర్ చేశాను’’ అన్నారు. -
ఆనంద్ దేవరకొండ 'గం గం గణేశా' ట్రైలర్ చూశారా?
గతేడాది 'బేబి' సినిమాతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఆనంద్ దేవరకొండ ఇప్పుడు రూట్ మార్చాడు. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ మూవీ 'గం గం గణేశా'తో ఎంటర్టైన్ చేసేయడానికి వచ్చేస్తున్నాడు. మే 31న మూవీ థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇంతకీ ఇది ఎలా ఉందంటే?(ఇదీ చదవండి: నేనూ మనిషినే.. అలా అంటే తట్టుకోవడం కష్టం: యువ హీరోయిన్)హీరో ఓ దొంగ. ఫ్రెండ్‌తో కలిసి జాలీగా బతికేస్తుంటాడు. ఓ అమ్మాయిని చూసి ప్రేమలో పడతాడు. ఆ తర్వాత ఓ ఊరికి వెళ్తాడు. అక్కడ వినాయకుడి విగ్రహాం దొంగతనం జరుగుతుంది. హీరో కూడా ఊహించని విధంగా ఆ దొంగతనంలో ఇరుక్కుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది? చివరకు ఏమైందనేదే కథలా అనిపిస్తుంది. ఇప్పటివరకు కూల్‌గా ఉంటే క్యారెక్టర్స్ చేస్తూ వచ్చిన ఆనంద్.. ఈ చిత్రం కామెడీ కూడా చేశాడు. మరి అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి?(ఇదీ చదవండి: బిడ్డకు జన్మనిచ్చిన టాలీవుడ్ హీరోయిన్.. పేరేంటో తెలుసా?) -
'బేబి' హీరో ఇంతలా మారిపోయాడేంటి? ఏకంగా అలా..
'బేబి'తో హిట్ కొట్టిన యువ హీరో ఆనంద్ దేవరకొండ.. ఇప్పుడు ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అయిపోయాడు. ఇతడు హీరోగా చేసిన లేటెస్ట్ మూవీ 'గం గం గణేశా'. ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్లు. ఉదయ్ శెట్టి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఆనంద్ తన కెరీర్లో చేస్తున్న ఫస్ట్ యాక్షన్ మూవీ ఇది. దీంతో సిక్స్ ప్యాక్ కూడా చేశాడు.(ఇదీ చదవండి: 'జబర్దస్త్' కమెడియన్‌కి ప్రమాదం.. తుక్కు తుక్కయిన కారు!)ఈ నెల 31న 'గం గం గణేశా' సినిమా థియేటర్లలోకి రానుంది. ఈ నెల 20న ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నారు. ప్రస్తుతం ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే ఆనంద్ దేవరకొండ సిక్స్ ప్యాక్ ఫొటోని మేకర్స్ విడుదల చేశారు. అయితే ఇందులో ఆనంద్ ని చూసి చాలామంది గుర్తుపట్టలేకపోతున్నారు. ఇంతలా మారిపోయాడేంటని కామెంట్స్ పెడుతున్నారు.(ఇదీ చదవండి: In Time Review: బతకాలంటే అక్కడ 'టైమ్' కొనాల్సిందే.. ఓటీటీలో ఈ మూవీ మిస్సవ్వొద్దు!) -
బేబీ హీరోయిన్ ఫోన్ కాల్.. 'లవ్ మీ' చెప్పాలంటూ హీరోను!
బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య టాలీవుడ్ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. ఆ సినిమాతో ఒక్కసారిగా ఫేమ్ తెచ్చుకుంది. ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ నటించిన బేబీ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. సాయి రాజేశ్ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం భారీ వసూళ్లు రాబట్టింది.అయితే ఈ సినిమాతో ఫేమ్ తెచ్చుకున్న బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య ప్రస్తుతం లవ్ మీ చిత్రంలో హీరోయిన్గా నటిస్తోంది. ఆశిష్ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రానికి అరుణ్ భీమవరపు దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు మేకర్స్.అయితే ఈ వేడుకలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. వేదికపై ఉండగానే ఆనంద్ దేవరకొండకు ఫోన్ చేసింది వైష్ణవి. ఫోన్లోనే తనకు 'లవ్ మీ.. ఇఫ్ యూ డేర్' చెప్పాలని వైష్ణవి కోరింది. అయితే దీనికి షాక్ అయిన ఆనంద్ నేనే చెప్పాలా? అని అడిగారు. బేబీ సినిమా మొత్తం చూసినా కదా.. అవన్నీ చెబితే బాగోదేమో అంటూ ఫన్నీగా ఆన్సరిచ్చారు. ఆ పదాన్ని రిపీట్ చేయాలని మళ్లీ కోరింది వైష్ణవి చైతన్య. దీంతో చివరికీ 'లవ్ మీ.. ఇఫ్ యూ డేర్' అంటూ చెప్పేశారు. దీంతో అక్కడున్న వారంతా కేకలు చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కాగా.. లవ్ మీ మూవీ ఈ నెల 25న రిలీజ్ కానుంది.#LoveMe - '𝑰𝒇 𝒚𝒐𝒖 𝒅𝒂𝒓𝒆 📱Actress @iamvaishnavi04 takes up a dare and calls @ananddeverkonda during #LoveMeTrailer launch live event!😃Watch Live here - https://t.co/CKcEqqOreD#VaishnaviChaitanya #AnandDeverakonda #TeluguFilmNagar pic.twitter.com/0cHFxZjroQ— Telugu FilmNagar (@telugufilmnagar) May 16, 2024 -
పిచ్చిగా నచ్చేశావే...
‘‘పిచ్చిగా నచ్చేశావే రంగు తూనీగా.. కళ్లలో చల్లేశావే రంగులన్నీ భలేగా..’ అంటూ సాగుతుంది ‘గం..గం..గణేశా..’ సినిమాలోని ‘పిచ్చిగా నచ్చేశావే’ పాట. ఆనంద్ దేవరకొండ హీరోగా, ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్లుగా నటించిన చిత్రం ఇది. ఉదయ్ శెట్టి దర్శకత్వంలో కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 31న రిలీజ్ కానుంది. శనివారం ఈ చిత్రంలోని ‘పిచ్చిగా నచ్చేశావే..’ పాట లిరికల్ వీడియోను హైదరాబాద్‌లోని మల్లారెడ్డి కాలేజీ విద్యార్థుల సమక్షంలో రిలీజ్ చేసింది యూనిట్. చేతన్ భరద్వాజ్ స్వరపరచిన ఈ పాటకు సురేష్ బనిశెట్టి సాహిత్యం అందించగా అనురాగ్ కులకర్ణి పాడారు. -
యూత్‌ఫుల్ డ్యూయెట్
‘డ్యూయెట్’ పాడుతున్నారు మదన్. ఆనంద్ దేవరకొండ, రితికా నాయక్ జంటగా నటిస్తున్న యూత్‌ఫుల్ లవ్ ఎంటర్టైనర్ ‘డ్యూయెట్’. మిథున్ వరదరాజ కృష్ణన్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ కేఈ జ్ఞానవేల్ రాజా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఓ డిఫరెంట్ లవ్‌స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమా రెగ్యులర్ చిత్రీకరణ జరుపుకుంటోంది. శుక్రవారం ఆనంద్ దేవరకొండ బర్త్ డే. ఈ సందర్భంగా ‘డ్యూయెట్లో మదన్ క్యారెక్టర్లో ఆనంద్ నటిస్తున్నట్లుగా వెల్లడించి, కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాశ్ కుమార్, సహనిర్మాత: మధుర శ్రీధర్ రెడ్డి. మరోవైపు ఆనంద్ దేవరకొండ నటిస్తున్న యాక్షన్ ఫిల్మ్ ‘గం..గం..గణేశా’. ఉదయ్ శెట్టి దర్శకత్వంలో కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా కొత్త పోస్టర్ కూడా విడుదలైంది. -
తమ్ముడికి విషెస్ చెప్పిన టాలీవుడ్ యంగ్ హీరో.. ట్వీట్ వైరల్!
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్‌తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ మూవీలో విజయ్ సరసన మృణాల్ ఠాకూర్ కనిపించనుంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. హోల్ సమ్ ఎంటర్ టైనింగ్ డైరెక్టర్ పరశురామ్ పెట్ల రూపొందిస్తున్నారు. 'ఫ్యామిలీ స్టార్' చిత్రానికి క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వాసు వర్మ వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 5వ తేదీన థియేటర్లలో సందడి చేయనుంది. అయితే విజయ్ దేవరకొండ బ్రదర్ ఆనంద్ దేవరకొండ గతేడాది బేబీ సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు. తాజాగా ఇవాళ ఆనంద్ బర్త్ డే కావడంతో అన్న విజయ్ స్పెషల్ ట్వీట్ చేశారు. తమ్మునితో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేశారు. నాతో ఫైట్ చేసే మొదటి అబ్బాయికి హ్యాపీ బర్త్ డే అంటూ ట్విటర్లో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన అభిమానులు సైతం హీరోకు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు. Happiest Birthday to the first boy I’ll take with me on a fight 😄❤️ Brother boy @ananddeverkonda I love you most 😘 pic.twitter.com/Yg2ZisFuE2 — Vijay Deverakonda (@TheDeverakonda) March 15, 2024