'బేబి' హీరో ఇంతలా మారిపోయాడేంటి? ఏకంగా అలా.. | Anand Devarakonda Six Pack Look In Gam Gam Ganesha Movie | Sakshi
Sakshi News home page

Anand Devarakonda: సిక్స్ ప్యాక్ లుక్.. ఎందుకోసమో తెలుసా?

Published Sun, May 19 2024 12:34 PM | Last Updated on Sun, May 19 2024 12:54 PM

Anand Devarakonda Six Pack Look In Gam Gam Ganesha Movie

'బేబి'తో హిట్ కొట్టిన యువ హీరో ఆనంద్ దేవరకొండ.. ఇప్పుడు ఎంటర్‌టైన్ చేసేందుకు రెడీ అయిపోయాడు. ఇతడు హీరోగా చేసిన లేటెస్ట్ మూవీ 'గం గం గణేశా'. ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్లు. ఉదయ్ శెట్టి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఆనంద్ తన కెరీర్‌లో చేస్తున్న ఫస్ట్ యాక్షన్ మూవీ ఇది. దీంతో సిక్స్ ప్యాక్ కూడా చేశాడు.

(ఇదీ చదవండి: 'జబర్దస్త్' కమెడియన్‌కి ప్రమాదం.. తుక్కు తుక్కయిన కారు!)

ఈ నెల 31న 'గం గం గణేశా' సినిమా థియేటర్లలోకి రానుంది. ఈ నెల 20న ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నారు. ప్రస్తుతం ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే ఆనంద్ దేవరకొండ సిక్స్ ప్యాక్ ఫొటోని మేకర్స్ విడుదల చేశారు. అయితే ఇందులో ఆనంద్ ని చూసి చాలామంది గుర్తుపట్టలేకపోతున్నారు. ఇంతలా మారిపోయాడేంటని కామెంట్స్ పెడుతున్నారు.

(ఇదీ చదవండి: In Time Review: బతకాలంటే అక్కడ 'టైమ్' కొనాల్సిందే.. ఓటీటీలో ఈ మూవీ మిస్సవ్వొద్దు!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement