Six Pack
-
Maanas: అప్పుడలా.. ఇప్పుడిలా.. వాటే డెడికేషన్! (ఫోటోలు)
-
75 ఏళ్ల వయస్సులోనూ ఫిట్‌గా..
ఆయనకు సరిగ్గా 75 ఏళ్లు.. అయితేనేం..? నేటి తరం యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఎంతో కష్టపడితేగానీ నేటితరం యువత సాధించలేని సిక్స్‌ప్యాక్‌ను నలభై ఏళ్ల క్రితమే తన సొంతం చేసుకున్నాడు. వృద్ధాప్యంలోనూ సిక్స్‌ప్యాక్‌ను కాపాడుకుంటూ నేటితరం యువకులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆయనే సికింద్రాబాద్ ఓల్డ్‌బోయిన్‌పల్లికి చెందిన విజయ్‌కుమార్. అనేక కారణాలతో నేటి తరం యువత తమ సిక్స్‌ప్యాక్ కలను సాధించలేకపోతున్నారు.సిక్స్‌ప్యాక్ కోసం గంటల తరబడి జిమ్‌లో కసరత్తులు తప్పనిసరి. ఎన్ని కసరత్తులు చేసినా సిక్స్‌ప్యాక్ సాధ్యం అవుతుందన్న గ్యారంటీ లేదు. ఇటువంటి కఠోర వ్యాయామాలను సునాయసంగా చేస్తూ తన సిక్స్‌ప్యాక్‌ను నేటికీ పదిలపరుచుకుంటున్నారు. వయసు శరీరానికే తప్ప మనసుకు కాదు అంటున్న విజయ్‌కుమార్ ఈ వయసులోనూ హుషారుగా వ్యాయామాలు చేస్తున్నారు.. ర్యాంప్‌వాక్‌లు సైతం చేయవచ్చని నిరూపిస్తున్నారు. క్రమం తప్పకుండా జిమ్‌కు వెళ్లడం, వ్యాయామంతోపాటు జాగింగ్, సైక్లింగ్ చేస్తూ ఎందరో యువకులు, విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తున్న వృద్ధ కండలవీరుడు విజయ్‌కుమార్‌పై సాక్షి కథనం.. సునాయాసంగా కఠోర ఆసనాలు 28 ఏళ్ల వయస్సు నుంచే వ్యాయామాలుఓల్డ్బోయిన్పల్లికి చెందిన ఎం.విజయ్‌కుమార్ నాలుగు దశాబ్దాలుగా క్రమం తప్పకుడా వ్యాయామం చేస్తూ అనారోగ్యాన్ని దరిచేరకుండా జాగ్రత్తపడుతున్నారు. సికింద్రాబాద్ నుంచి సుచిత్ర వరకూ, ప్యారడైజ్ నుంచి బొల్లారం వరకూ, మారేడుపల్లి నుంచి బాలానగర్ వరకూ ఉన్న జిమ్ నిర్వాహకులకు, అందులో శిక్షణ తీసుకుంటున్న యువతకు సుపరిచితులు. సికింద్రాబాద్‌లో ఇంజినీరింగ్ వ్యాపారంలో స్థిపరడిన విజయ్‌కుమార్ తన 28 ఏళ్ల వయసు నుంచే వ్యాయాయం మొదలుపెట్టాడు. కొద్ది సంవత్సరాల క్రితం వరకూ వ్యాపారాన్ని కొనసాగించిన ఆయన ప్రస్తుతం వ్యాయామంతోపాటు యువతకు స్ఫూర్తిగా నిలిచే కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. సీనియర్ సిటిజన్స్లోనూ...కొద్ది సంవత్సరాలుగా స్నేహ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ప్రతినిధిగా కొనసాగుతున్న విజయ్‌కుమార్ వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ వృద్ధులకు స్పూర్తిగా నిలుస్తున్నారు. డీజే పాటలకు డ్యాన్స్ చేయడం, స్వతహాగా పాటలు పాడడం వంటి కార్యక్రమాలతో అటు వృద్ధుల్లో ఇటు యువకుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. జిమ్ వర్కవుట్తోపాటు జాగింగ్, సైక్లింగ్ పోటీల్లోనూ పలు మెడల్స్‌ను అందుకున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నిర్వహించిన బాడీబిల్డింగ్, సైక్లింగ్ పోటీల్లో నేటికీ పాల్గొంటుంటారు.అందరూ క్రీడాకారులే... వ్యాయామం, క్రీడలు విజయ్‌కుమార్‌తోపాటు ఆయన కుటుంబ సభ్యులకు అలవాటయ్యాయి. విజయ్‌కుమార్, భార్య పిల్లలు కూడా ఉదయం నిద్రలేచింది మొదలు వర్కవుట్స్ చేయడం వారి దినచర్య. భార్య శారద కూడా భర్తకు తోడుగా వాకింగ్, జాగింగ్‌లకు వెళతారు. సీనియర్ సిటిజన్స్ క్రీడల్లో శారద పలు పతకాలు గెలుచుకుంది. కూతురు వాణి వాలీబాల్ జాతీయ క్రీడాకారిణిగా అవార్డులు అందుకుంది. కుమారులు పవన్, నవీన్ ఇరువురూ జాతీయ, అంతర్జాతీయ స్విమ్మర్లు. పెద్దకుమారుడు ఆ్రస్టేలియాలో స్థిరపడగా చిన్నకుమారుడు స్విమ్మింగ్ కోచ్‌గా ఉన్నాడు.ఆహారం పట్ల ప్రత్యేక శ్రద్ధ...సికింద్రాబాద్ ప్రాంతంలో విజయ్‌కుమార్ వర్కవుట్ చేయని జిమ్, సైక్లింగ్ చేయని రోడ్డు, జాగింగ్ చేయని మైదానం లేదంటే అతిశయోక్తి కాదు. ఆయన వర్కవుట్ చేయడంతో పాటు అక్కడి యువకులకు వర్కవుట్‌లో మెళకువలు నేర్పుతుంటారు. ఇంటి ఆహారం అందులోనూ శాకాహారానికి ప్రాధాన్యత ఇవ్వడం, దురలవాట్లకు దూరంగా ఉండి ఆరోగ్యాన్ని పదిలం చేసుకోవడం పట్ల అవగాహన కలిగిస్తున్నారు.శేషజీవితం సమాజానికి అంకితం నిరంతర వ్యాయామంతో వృద్ధాప్యంలోనూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నా. ప్రస్తుతం కుటుంబ, వ్యాపార బాధ్యతలు ఏవీ నాపై లేవు. శేష జీవితం సమాజాభివృద్ధికి అంకితం చేయాలన్నదే లక్ష్యం. సీనియర్ సిటిజన్లలో నిరాశ, నిస్పృహలను దూరం చేసేందుకు చేతనైన సహాయం చేస్తున్నా. – మందుల విజయ్‌కుమార్ -
హై ప్రోటీన్.. వాడటం మంచిది కాదు
ఇన్స్టంట్.. ఈ మాట వినగానే ఏదో కొత్త ఊపు వచ్చేస్తుంది మనకు...ఏ పనైనా త్వరగా పూర్తవ్వడమే ఇందులోని ప్రత్యేకత.. రకరకాల అడ్వరై్టజ్మెంట్ల ప్రేరణతో.. మనం దీనికి బాగానే అలవాటుపడిపోయాం.. అయితే ఇప్పుడీ అలవాటే కొంపముంచుతోంది.. ఆహారానికే కాదు.. దాని నుంచి అందే ప్రొటీన్లు ఇన్‌స్టంట్‌గా తీసుకోవాలనుకోవడం.. ఇన్‌స్టంట్‌గా కండలు పెంచేయాలనుకోవడం పొరపాటే అంటున్నారు నిపుణులు.. సప్లిమెంట్లు, అధిక ప్రొటీన్ వినియోగం ప్రయోజనాల కంటే ప్రమాదాలను ఎక్కువ కలిగిస్తుందని జాతీయ పౌష్టికాహార సంస్థ (ఎన్ఐఎన్) స్పష్టం చేసింది. దీని వల్ల కండరాల క్షీణత సహా అనేక రకాల అనారోగ్యాలు తప్పవని తేలి్చంది. దీనిపై ఒక పరిశోధన ఆధారిత నివేదికను ఇటీవలే విడుదల చేసింది. ఆ విశేషాలు తెలుసుకుందాం... ఒకప్పుడు విపరీతమైన శ్రమ చేసే క్రీడాకారులు లేదా సిక్స్‌ప్యాక్ వంటివి సాధన చేసే వ్యాయామ ప్రియులకు మాత్రమే పరిచయమున్న ప్రొటీన్ సప్లిమెంట్స్ నగరంలో ప్రతి ఒక్కరికీ చిరపరిచితంగా మారాయి. ఆహారం ద్వారా ప్రొటీన్ అందడం లేదనే ఆలోచనతో వే ప్రొటీన్ తదితర పౌడర్లను విచ్చలవిడిగా వాడేస్తున్నారు. అయితే ప్రొటీన్ సప్లిమెంట్ల వినియోగంపై నేషనల్ ఇని స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్ఐఎన్) తాజాగా నిర్వహించిన పరిశోధన ఆశ్చర్యాన్ని కలిగింది.. అందులోని కొన్ని అంశాలు.. ఆహారం ద్వారా ప్రొటీన్ అందడం లేదనే ఆలోచనతో వే ప్రొటీన్ తదితర పౌడర్లను విచ్చలవిడిగా వాడేస్తున్నారు.ఆహారంలో తగినంత కార్బోహైడ్రేట్లు కొవ్వులు లేకుండా నాణ్యత కలిగిన అధిక ప్రోటీన్లను తీసుకున్నప్పటికీ అది సరిపోదు.👉అదనంగా జత చేసిన చక్కెరలు, కృత్రిమ స్వీట్నర్లతో పాటు ప్రొటీన్ పౌడర్లలో సాధారణంగా ఉండే ఫ్లేవర్ల ప్రొటీన్ పౌడర్స్‌ను రెగ్యులర్‌గా తీసుకోవడం హానికరం. 👉ఈ సప్లిమెంట్లలో సాధారణ ముడిపదార్థమైన వే ప్రొటీన్, బ్రాంచ్డ్–చైన్ అమైనో ఆమ్లాలను (బీసీఎఎఎస్) అధికంగా కలిగి ఉంటుంది. అధిక బీసీఎఎఎస్లు నాన్–కమ్యూనికబుల్ (అంటువ్యాధులు కాని) వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి. 👉 సప్లిమెంట్లను తీసుకోవడం కండరాల బలాన్ని పెంచదు. అయితే ఆరోగ్యకరమైన వ్యక్తులు దీర్ఘకాలిక కఠిన వ్యాయామ సమయంలో మాత్రమే ప్రొటీన్ సప్లిమెంటేషన్ కండర పరిమాణాన్ని కొద్దిగా మెరుగుపరుస్తుంది. 👉 రోజుకు 1.6 గ్రా కంటే ఎక్కువ ప్రొటీన్ తీసుకోవడం ఏ విధమైన అదనపు ప్రయోజనాలను అందించదు. 👉 మన శరీరానికి ప్రొటీన్ అవసరాలు మనం అంచనా వేసుకున్నంత ఎక్కువగా ఉండవు. 👉 క్రీడాకారులు సైతం సప్లిమెంట్లపైనే ఆధారపడకుండా ఆహారం నుంచి తగిన మొత్తంలో ప్రొటీన్ పొందడం మేలు. 👉దీర్ఘకాలం పెద్ద మొత్తంలో ప్రోటీన్ సప్లిమెంట్ తీసుకోవడం వల్ల ఎముక, కణజాలానికి నష్టం కలిగించవచ్చు. అలాగే మూత్రపిండాల సమస్యకు దారితీసే అవకాశం ఉంది. 👉 శాకాహారం లేదా మాంసాహారం నుంచి ఆరోగ్యకరమైన అమైనో ఆమ్లాలను సులభంగా అందుకోవచ్చు. 👉 తృణధాన్యాలు, పప్పుధాన్యాలను 3:1 నిష్పత్తిలో లేదా 30 గ్రాముల వరకూ పప్పులతోనో, రోజుకు 80గ్రా మాంసంతోనో ప్రొటీన్ స్థాయిల్ని భర్తీ చేయవచ్చు. ఇది సాధారణ వ్యక్తుల ప్రొటీన్ అవసరాలను తీర్చడానికి సరిపోతుంది. 👉కేవలం ప్రొటీన్ వినియోగం మాత్రమే కండరాల నిర్మాణంలో ఉపకరిస్తుందనేది అపోహ మాత్రమే. ఆహారంలో తగినంత కార్బోహైడ్రేట్లు కొవ్వులు లేకుండా నాణ్యత కలిగిన అధిక ప్రొటీన్లను తీసుకున్నప్పటికీ అది సరిపోదు. ఆహారపు అమైనో ఆమ్లాలు (ప్రొటీన్లు) ద్వారా కండర శ్రేణి నిర్మాణానికి శరీరంలో అమైనో–యాసిడ్ సంబంధిత విధులకు కార్బోహైడ్రేట్లు కొవ్వుల నుంచి కూడా తగినంత శక్తి అందాల్సిన అవసరం ఉంది. 👉 తగినంత శారీరక శ్రమ లేకుండా, కండరాల నిర్మాణానికి ప్రొటీన్లు ఉపకరించవు. సహజ ప్రొటీన్లతో మేలు..మాంసం, పౌల్ట్రీ, చేపలు, గుడ్డు, పాలు ప్రొటీన్లు శరీరంలో కొత్త ప్రొటీన్లను తయారు చేయడానికి అవసరమైన ఇరవై అమైనో ఆమ్లాలను కలిగి ఉంటాయి. పప్పులు, పచ్చి శెనగలు, గుర్రపు శెనగలు, నల్ల శనగలు, చిక్పీస్, సోయాబీన్, పచ్చి బఠానీలు వంటి పప్పుధాన్యాల్లో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. బాదం, పిస్తా, జీడిపప్పు, వాల్నట్లు, హాజెల్‌నట్‌లు, సోయా గింజలు, గుమ్మడి గింజలు, అవిసె గింజలు, నువ్వులు గణనీయమైన పరిమాణంలో ప్రొటీన్లను కలిగి ఉంటాయి. పప్పులను తృణ ధాన్యాలతో కలిపి లేదా తృణధాన్యాలు మాంసం ఆహారం, గుడ్లు/ పాలతో కలిపి తిన్నప్పుడు ఆహారంలో ప్రొటీన్ నాణ్యత మెరుగుపడుతుంది. తక్కువ కొవ్వు అధిక ఫైబర్ కలిగిన పప్పులు ఇనుము, పొటాషియం, జింక్, మెగ్నషియంవంటి ముఖ్యమైన విటమిన్లు, ఇతర ఖనిజాలను కలిగి ఉంటాయి. శాఖాహార ఆహారాలు 70%–85% వరకూ ప్రొటీన్‌ను జీర్ణం చేస్తాయి. మితిమీరితే యూరిక్ యాసిడ్ పెరిగే ప్రమాదం... తీసుకున్న ఆహారం ద్వారా గానీ, ఇతరత్రా గానీ శరీర బరువు కిలోకి 1.5 గ్రాముల్ని మించి ప్రొటీన్ తీసుకోకూడదు. అతిగా ప్రొటీన్ తీసుకుంటే కిడ్నీ సమస్యలతో పాటు యూరిక్ యాసిడ్ పెరిగే ప్రమాదాలున్నాయి. మార్కెట్లో అందుబాటులో ఉండే సప్లిమెంట్స్‌లో కొన్నింటిలో స్టెరాయిడ్స్ కలుస్తున్నాయని సమాచారం. వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే ప్రొటీన్ సప్లిమెంట్స్ వినియోగించాలి. –డా.కిషోర్‌రెడ్డి, అమోర్ హాస్పిటల్స్ -
సిక్‌ప్యాక్! లుక్ కోసమైతే ఫసక్కే
అనారోగ్యంపాలవుతున్న బాడీ బిల్డర్స్సిక్స్ ప్యాక్ శరీరానికి మంచిది కాదు..ఆరోగ్యకరమైన కొవ్వులూ అవసరమే : వైద్యులు ఏదైనా అతిగా చేస్తే అనర్థమే..! ఔను నిజమనే అంటున్నారు వైద్యులు.. ఇంతకీ ఏంటది? దేని గురించి? ఈ చర్చంతా దేనికి అనుకుంటున్నారా? అదే నండి బాబు సిక్స్ ప్యాక్ గురించి.. సిక్స్ ప్యాక్ అనగానే.. ప్రస్తుత తరానికి ఎంతో క్రేజ్. ఆ పేరు చెప్పగానే శరీరంలోని నరాలన్నీ జివ్వుమన్నట్లు అవుతుంది.. కానీ అతిగా చేస్తే ఆరోగ్యానికి అనర్థమే అంటున్నారు వైద్యులు.. ఇటీవల పలువురు హీరోలు అతిగా వ్యాయామం చేసి అనారోగ్యం పాలవ్వడమే దీనికి చక్కటి ఉదాహరణ. అసలు సిక్స్ ప్యాక్ కథేంటి? వైద్యులు ఏమంటున్నారు? తెలుసుకుందాం.. బాలీవుడ్ టు టాలీవుడ్.. సిక్స్ ప్యాక్ సినిమా స్క్రీన్కు పరిచయమై రెండు దశాబ్దాలు పైమాటే. అయినా అంతకంతకూ తన క్రేజ్‌ను పెంచుకుంటోంది. దాదాపు బాలీవుడ్, టాలీవుడ్ అగ్రహీరోల్లో యుక్తవయసులో ఉన్న హీరోలందరూ ఆరున్నొక్కరాగం ఆలపిస్తున్నవారే. తెలుగులో ‘దేశ ముదురు’తో అల్లు అర్జున్ నుంచి మొదలై సునీల్, ప్రభాస్, నితిన్, జూనియర్ ఎనీ్టయార్, రామ్‌చరణ్, సుధీర్‌బాబు, విజయ్ దేవరకొండ...తాజాగా అఖిల్..ఇలా అనేకమంది ఆరు–ఎనిమిది పలకల దేహాలతో తెరపై గ్రీక్ లుక్‌లో తళుక్కుమంటున్నారు. అనుకరణ మరింత ప్రమాదమట.. సిక్స్‌ప్యాక్ కొనసాగింపు కోసం నాగశౌర్య నెలల తరబడి తీవ్ర కసరత్తులు చేశారని, అదే విధంగా కఠినమైన డైట్ ను పాటించారని సమాచారం. ఎప్పుడూ హుషారుగా ఆరోగ్యంగా కనిపించే శౌర్యకు ఆకస్మికంగా స్పృహ కోల్పోయే పరిస్థితి రావడానికి సిక్స్ ప్యాక్ క్రేజ్ కారణమై ఉండవచ్చని పలువురి వాదన.. అయితే వైద్యులు మాత్రం ఆ విషయాన్ని ధృవీకరించలేదు. ఈ నేపధ్యంలో హీరోల్ని చూసి మక్కీకి మక్కీ అనుసరించే లక్షలాది మంది యువ అభిమానులు జాగ్రత్త పడాల్సి ఉందని, అన్ని రకాల వసతులూ, శిక్షకులూ ఉన్న స్టార్లకే అలా అయితే.. ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆరుపలకల దేహాన్ని పొందాలని కోరుకునేవారు చాలా మంది ఉండొచ్చు.. అయితే దానిని సాధించడం చాలా కష్టం. అంతేకాదు సాధించినా కూడా ఆ సిక్స్‌ప్యాక్‌ని కొనసాగించడం మరింత కష్టం. ఈ విషయం చాలా మందికి తెలీదు సిక్స్–ప్యాక్ మ్యానియాలో పడి గుడ్డిగా అనుసరించే ముందు, ఆకస్మిక, కఠినమైన డైట్ వల్ల కలిగే ఆరోగ్య ప్రమాదాల గురించి యువత తెలుసుకోవాలని వైద్యులు, ఫిట్నెస్ నిపుణులు సూచిస్తున్నారు. వైద్యులు ఏం చెబుతున్నారు.. 👉సిక్స్ ప్యాక్ కొనసాగింపు శరీరానికి ఆరోగ్యకరమైనది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 👉అసహజమైన శరీరపు అతి తక్కువ కొవ్వు శాతం ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. కొన్ని నెలల పాటు సిక్స్ ప్యాక్ మెయింటెయిన్ చేయడం అంటే శరీరపు కొవ్వు శాతం ఉండాల్సిన కనీస స్థాయి కన్నా పురుషులలో అయితే 12% మహిళల్లో అయితే 18% తక్కువవుతుందని వైద్యులు చెబుతున్నారు. 👉కొవ్వు ఇలా పరిమితికి మించి తగ్గడం అనేది అంతర్గత అవయవాల లైనింగ్‌ను ప్రభావితం చేస్తుంది. 👉తమకు వచ్చిన సిక్స్ ప్యాక్ చూపులకు బిగుతుగా కనిపించేలా చేయడానికి కొందరు ఆహారంలో ఉప్పును పూర్తిగా వదులుకుంటారు ఇది మరింత ప్రమాదకరం. ఆహారం నుంచి ఉప్పు తొలగించడం ఆరోగ్యంపై ప్రతికూల ఫలితాలను కలిగిస్తుంది. 👉అదే విధంగా కొన్ని సందర్భాల్లో తాగే నీటికి కూడా ప్రమాదకర పరిమితి పాటించాల్సి ఉంటుంది. ఇది తీవ్రమైన డీ హైడ్రేషన్‌కు గురిచేసే అవకాశం ఉంది. 👉అలాగే సిక్స్–ప్యాక్ సాధించిన తర్వాత కూడా దాన్ని నిలబెట్టుకోవడం కోసం నిరంతరం పరిగెత్తడం, అవి కనపడని రోజున తీవ్ర ఒత్తిడికి గురికావడం జరుగవచ్చని, అది మానసిక సమస్యలకు దోహదం చేస్తుందని సైక్రియాట్రిస్ట్లు హెచ్చరిస్తున్నారు. 👉బాడీ బిల్డింగ్ పోటీలకు హాజరయ్యేవారు లేదా పూర్తిగా వైద్యుల, న్యూట్రిషనిస్ట్‌ల పర్యవేక్షణలో గడిపేవారు, ఒత్తిడితో కూడిన వృత్తి వ్యాపకాలు నిర్వహించని వారు తప్ప సిక్స్ ప్యాక్ గురించి ఎక్కువ శ్రమించడం ప్రమాదకరం అంటున్నారు. 👉ఇక ఫాస్ట్‌గా సిక్స్ ప్యాక్ దక్కించుకోవడం కోసం స్టెరాయిడ్స్ వంటివి అతిగా తీసుకుంటున్నారు కొందరు. ఇది కూడా శరీరంలోని హార్మోన్ల పనితీరును దెబ్బతీస్తుందని, ఫలితంగా ఆరోగ్యపరమైన ఇబ్బందులు కలుగుతాయని వైద్యులు చెబుతున్నారు. అదే అసలు కారణమా? ఆ మధ్య టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ఉన్న నటుడు రానా దగ్గుబాటి ఆరోగ్యం విషయంలో రకరకాల వార్తలు గుప్పుమన్నాయి. బాహుబలి అనంతరమే ఆయన ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నాడని, సిక్స్ ఫిజిక్ కోసం ఆశ్రయించిన పలు మార్గాలే దీనికి కారణమని పలు వార్తలు వెలుగు చూశాయి. అలాగే ఇటీవల కొన్ని రోజుల క్రితం టాలీవుడ్ యువ నటుడు నాగÔౌర్య ఆకస్మిక అనారోగ్యంతో ఆసుపత్రి పాలయ్యారు. హైదరాబాద్‌లో జరుగుతున్న సినిమా షూటింగ్లో పాల్గొన్న ఆయన ఆకస్మికంగా సొమ్మసిల్లిపడిపోగా ఆయనను గచ్చి»ౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స అనంతరం కోలుకున్నారు. ఆసుపత్రిలో చేరే సమయంలో డీ హైడ్రేషన్, హై ఫీవర్‌తో బాధపడుతున్నారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఇక కన్నడ సూపర్‌స్టార్ పునీత్‌రాజ్ జిమ్ చేస్తూ స్ట్రోక్ వచ్చి మరణించిన విషయమూ తెలిసిందే...జాగ్రత్తలు పాటించాలి... అబ్బాయిలు మాత్రమే కాదు అమ్మాయిలు సైతం సిక్స్ ప్యాక్ పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. శారీరకంగా అమ్మాయిలకు, అబ్బాయిలతో పోలిస్తే చాలా పరిమితులు ఉంటాయనే విషయం గుర్తుంచుకోవాలి. మగవాళ్లకన్నా ఆరోగ్య సమస్యలు ఎక్కువ. ఫిట్నెస్ రంగాన్ని ప్రొఫెషన్‌గా తీసుకున్నా, బాడీ బిల్డింగ్ రంగంలో రాణించాలనుకున్నా.. ఓకే గానీ... సరదాకో, గుర్తింపు కోసమో సిక్స్‌ప్యాక్ చేయాలనుకోవడం ఏ మాత్రం సరికాదు. –కిరణ్ డెంబ్లా, డి.జె, ఫిట్నెస్ శిక్షకురాలుఏడాది పాటు శ్రమించా..కఠినమైన వర్కవుట్స్‌తో పాటు డైట్ కూడా ఫాలో అయ్యా. షూటింగ్ ఉన్నప్పుడు వర్కవుట్ చేయడంతో పాటు నీళ్లు కూడా తీసుకోలేదు. ఇలాంటి సందర్భంలో సైకలాజికల్ ప్రెషర్‌ను ఎదుర్కోవడం అంత సులభం కాదు. సిక్స్ ప్యాక్ అనేది చాలా కష్టమైన ప్రక్రియ. –ఆనంద్ దేవర్కొండ, సినీ హీరోరాంగ్ రూట్లో అనర్థాలే.. చాలా మంది యువత ఎఫర్ట్ పెట్టి సిక్స్‌ప్యాక్ సాధిస్తున్నారు. అయితే కొందరు మాత్రం త్వరగా షేప్ వచ్చేయాలని రాంగ్ రూట్లో ప్రయత్నాలు చేయడం, మజిల్స్‌ను పరిమితికి మించి శ్రమకు గురిచేయడం వల్ల ఆరోగ్య సమస్యలకు గురవుతున్నారు. –ఎం.వెంకట్, ట్రైనర్, సిక్స్ ప్యాక్ స్పెషలిస్ట్ -
'బేబి' హీరో ఇంతలా మారిపోయాడేంటి? ఏకంగా అలా..
'బేబి'తో హిట్ కొట్టిన యువ హీరో ఆనంద్ దేవరకొండ.. ఇప్పుడు ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అయిపోయాడు. ఇతడు హీరోగా చేసిన లేటెస్ట్ మూవీ 'గం గం గణేశా'. ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్లు. ఉదయ్ శెట్టి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఆనంద్ తన కెరీర్లో చేస్తున్న ఫస్ట్ యాక్షన్ మూవీ ఇది. దీంతో సిక్స్ ప్యాక్ కూడా చేశాడు.(ఇదీ చదవండి: 'జబర్దస్త్' కమెడియన్‌కి ప్రమాదం.. తుక్కు తుక్కయిన కారు!)ఈ నెల 31న 'గం గం గణేశా' సినిమా థియేటర్లలోకి రానుంది. ఈ నెల 20న ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నారు. ప్రస్తుతం ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే ఆనంద్ దేవరకొండ సిక్స్ ప్యాక్ ఫొటోని మేకర్స్ విడుదల చేశారు. అయితే ఇందులో ఆనంద్ ని చూసి చాలామంది గుర్తుపట్టలేకపోతున్నారు. ఇంతలా మారిపోయాడేంటని కామెంట్స్ పెడుతున్నారు.(ఇదీ చదవండి: In Time Review: బతకాలంటే అక్కడ 'టైమ్' కొనాల్సిందే.. ఓటీటీలో ఈ మూవీ మిస్సవ్వొద్దు!) -
అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చిన కిచ్చా.. ఆ లుక్‌తో కనిపించి!
కిచ్చా సుదీప్ ఈ పేరు వింటే చాలా తెలుగువారికి రాజమౌళి తెరకెక్కించిన ఈగ సినిమానే గుర్తుకొస్తుంది. ఆ సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. అయితే ఈ ఏడాది ఆయన నటించిన విక్రాంత్ రోణ అభిమానులను పెద్ద ఆకట్టుకోలేదు. అయితే ఇటీవల సుమలత అంబరీష్ బర్త్ డే పార్టీలో కిచ్చా సుదీప్ కనిపించారు. ప్రస్తుతం ఆయన కిచ్చా46 చిత్రంలో నటిస్తున్నారు. విజయ్ కార్తీక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. విక్రాంత్ రోణ సినిమా తర్వాత కిచ్చా సుదీప్ నెక్స్ట్ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ సినిమా కోసం కిచ్చా సుదీప్ డిఫరెంట్ లుక్‌లో కనిపించనున్నారు. తాజాగా తన న్యూ లుక్‌తో ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ ఇచ్చారు. (ఇది చదవండి: 'పుష్ప' లాంటి స్టోరీతో మరో సినిమా) కిచ్చా తన ఇన్‌స్టాలో సిక్స్ ప్యాక్‌తో బాడీని ప్రదర్శిస్తున్న ఫోటోలను పంచుకున్నారు. అయితే ఇదంతా కిచ్చా46 సినిమా కోసమేనని ఫ్యాన్స్ అంటున్నారు. అయితే ఈ సినిమా క్లైమాక్స్ ఫైట్ కోసం సుదీప్ ఇలా రెడీ అయ్యారంటూ కొందరు పోస్టులు పెడుతున్నారు. ఇప్పటికే టీజర్ రిలీజ్ కాగా.. ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా కోసం సుదీప్ తన సిక్స్ ప్యాక్ బాడీని ప్రదర్శించడం ఇదే మొదటిసారి కాదు. గతంలో పైల్వాన్ సినిమా కోసం సిక్స్ ప్యాక్‌తో కనిపించారు. ఇన్‌స్టాలో రాస్తూ..'వర్కవుట్ చేయడం నా సంతోషకరమైన క్షణాలలో ఒకటి. ఇది నన్ను ప్రశాంతంగా ఉంచుతుంది. మిమ్మల్ని దృష్టి కేంద్రీకరించేలా చేస్తుంది. కిచ్చా46 చిత్రం క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్ కోసం మరో నెల సమయం ఉంది. దానికి ముందే ఈ వర్కవుట్.' అని సుదీప్ రాసుకొచ్చారు. కాగా.. తుపాకి, కబాలి, కర్ణన్, అసురన్‌తో సహా తమిళంలో భారీ బడ్జెట్ చిత్రాలను అందించిన ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ వి క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కలైపులి ఎస్ తాను ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. (ఇది చదవండి: పిల్లల ఫోటోలు రివీల్ చేసిన నయనతార.. ఈరోజే ఎందుకంటే?) View this post on Instagram A post shared by KicchaSudeepa (@kichchasudeepa) -
ఈ హీరోయిన్ని గుర్తుపట్టారా? ఆ తెలుగు హీరోకి భార్య..
సాధారణంగా హీరోయిన్లు అనగానే సున్నితంగా ఉంటారు. గ్లామర్ తో ప్రేక్షకుల్ని ప్రేమలో పడేస్తుంటారు అని అనుకుంటూ ఉంటాం. కానీ అదంతా ఒకప్పుడు. ఇప్పుడూ కొందరు అలానే ఉన్నప్పటికీ ఇంకొందరు మాత్రం జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ సూపర్ ఫిజిక్ మెంటైన్ చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే సిక్స్ ప్యాక్ లుక్స్‌తో కుర్రాళ్లకు పోటీ ఇస్తున్నారు. పైన ఫొటోలో కనిపిస్తున్న బ్యూటీ కూడా తెలుగులో సినిమాలు చేసిన హీరోయిన్. కాకపోతే తక్కువ మూవీస్ లోనే నటించింది. ఆ తర్వాత ఓ యంగ్ హీరోని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇంకా గుర్తురాలేదా? ఆమె ఎవరో కాదు బిగ్‌బాస్ తో చాలామందికి పరిచయమైన వితికా షేరు. అదేనండి 'కొత్తబంగారు లోకం' హీరో వరుణ్ సందేశ్ ని పెళ్లి చేసుకుంది కదా. ఆమెనే ఈమె. (ఇదీ చదవండి: బిగ్‌బాస్ 7 ఆఫర్‌పై హీరోయిన్ మాధవీ లత క్లారిటీ) 2008లో కన్నడ సినిమాతో నటిగా కెరీర్ మొదలుపెట్టిన వితికా షేరు.. ఆ తర్వాత ఏడాదే తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. 'ఝుమ్మంది నాదం', 'భీమిలి కబడ్డీ జట్టు' సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసింది. 2015లో 'పడ్డామండీ ప్రేమలో మరి' సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది. ఇందులో హీరోగా చేసిన వరుణ్ సందేశ్ తో రియల్ లైఫ్ లోనూ ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది. అలా సినిమా చేస్తూ ప్రేమలో పడ్డ వరుణ్ సందేశ్-వితికా షేరు.. 2016లో పెళ్లి చేసుకున్నారు. 2021లో వచ్చిన 'పెళ్లి సందD' మూవీలో చివరగా వితిక కనిపించింది. ఇకపోతే బిగ్ బాస్ మూడో సీజన్ లో భర్తతో కలిసి జంటగా పాల్గొన్న వితిక.. ఆరో సీజన్ లో కీర్తి భట్ ని సపోర్ట్ చేయడానికి వచ్చింది. ప్రస్తుతం యూట్యూబ్ వ్లాగర్ గా బిజీగా ఉన్న ఈ బ్యూటీ.. సడన్ గా ఫిట్ గా మారి అందరికీ షాకిచ్చింది. (ఇదీ చదవండి: చెప్పు తెగుతుందంటూ.. రిపోర్టర్‌పై వైష్ణవి సీరియస్) -
సిక్స్ ప్యాక్ మానియాలో హీరోలు..ఆరోగ్యంపై ఎఫెక్ట్
సిక్స్ ప్యాక్ సినిమా స్క్రీన్కు పరిచయమై దశాబ్ధంపైగానే అయినా అంతకంతకూ తన క్రేజ్‌ను పెంచుకుంటోంది. దాదాపుగా బాలీవుడ్, టాలీవుడ్ అగ్రహీరోల్లో యుక్తవయసులో ఉన్న హీరోలు అందరూ ఆరున్నొక్కరాగం ఆలపిస్తున్నవారే. తెలుగులో దేశ ముదురు సినిమా కోసం అల్లు అర్జున్ నుంచి మొదలై సునీల్, ప్రభాస్, నితిన్, జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్, సుధీర్‌బాబు, విజయ్ దేవరకొండ...తాజాగా అఖిల్..ఇలా అనేకమంది ఆరు–ఎనిమిది పలకల దేహాలతో తెరపై గ్రీక్ లుక్‌లో తళుక్ మంటున్నారు. నాణేనికి మరోవైపు... ఆ మధ్య టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ఉన్న నటుడు రానా దగ్గుబాటి ఆరోగ్యం విషయంలో రకరకాల వార్తలు గుప్పుమన్నాయి. బాహుబలి అనంతరమే ఆయన ఆరోగ్య సమస్యలు ఎదుర్కున్నాడని, సిక్స్ ఫిజిక్ కోసం ఆశ్రయించిన పలు మార్గాలే దీనికి కారణమని కూడా కొన్ని విశ్లేషణలు వెలుగు చూశాయి. అలాగే ఇటీవల కొన్ని రోజుల క్రితం టాలీవుడ్ యువ నటుడు నాగశౌర్య ఆకస్మిక అనారోగ్యంతో ఆసుపత్రి పాలయ్యారు. హైదరాబాద్‌లో జరుగుతున్న సినిమా షూటింగ్లో పాల్గొన్న ఆయన ఆకస్మికంగా సొమ్మసిల్లిపడిపోగా ఆయనను గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స అనంతరం కోలుకున్నారు. అయితే ఆసుపత్రిలో చేరే సమయంలో డీ హైడ్రేషన్, హై ఫీవర్‌తో బాధపడుతున్నారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. సిక్స్‌ప్యాక్ కారణం? టాలీవుడ్లో హీరోలకు క్రేజీగా మారిన సిక్స్‌ప్యాక్ దక్కించుకుని, దాని కొనసాగింపుల కోసం నాగశౌర్య గత కొన్ని నెలలుగా తీవ్రమైన కసరత్తులు చేస్తున్నారని, అదే విధంగా కఠినమైన డైట్ రొటీన్‌ను పాటిస్తున్నారని సమాచారం. యువకుడు, ఎప్పుడూ హుషారుగా ఆరోగ్యంగా కనిపించే నాగశౌర్యకు ఆకస్మికంగా స్పృహ కోల్పోయే పరిస్థితి రావడానికి సిక్స్ ప్యాక్ క్రేజ్ కారణమై ఉండవచ్చునని అంటున్నారు. అయితే వైద్యులు మాత్రం ఇంకా ఆ విషయాన్ని థృవీకరించలేదు. ఈ నేపధ్యంలో హీరోల్ని చూసి మక్కీ కి మక్కీ అనుసరించే లక్షలాది మంది యువ అభిమానులు జాగ్రత్త పడాల్సి ఉంది. అన్ని రకాల వసతులూ, శిక్షకులూ ఉన్న స్టార్లకే అలా అయితే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో కదా... నిపుణులేమంటున్నారు? ఆరుపలకల దేహాన్ని పొందాలని కోరుకునేవారు చాలా మంది ఉండొచ్చు.. అయితే దానిని సాధించడం చాలా కష్టం. అంతేకాదు సాధించినా కూడా ఆ సిక్స్‌ప్యాక్‌ని కొనసాగించడం మరింత కష్టం. ఈ విషయం చాలా మందికి తెలీదు. సిక్స్–ప్యాక్ మానియాలో పడి గుడ్డిగా అనుసరించే ముందు, ఆకస్మిక, కఠినమైన డైట్ వల్ల కలిగే ఆరోగ్య ప్రమాదాల గురించి యువత తెలుసుకోవాతని వైద్యులు, ఫిట్నెస్ నిపుణులు సూచిస్తున్నారు. సిక్స్ ప్యాక్ శరీరానికి ఆరోగ్యకరమైనది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వారేం చెప్తున్నారంటే... ► అసహజమైన శరీరపు అతి తక్కువ కొవ్వు శాతం ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. కొన్ని నెలల పాటు సిక్స్ ప్యాక్ మెయింటెయిన్ చేయడం అంటే శరీరపు కొవ్వు శాతం ఉండాల్సిన కనీస స్థాయి కన్నా పురుషులలో అయితే 12% మహిళల్లో అయితే 18% తక్కువవుతుందని వైద్యులు చెబుతున్నారు. కొవ్వు ఇలా పరిమితికి మించి తగ్గడం అనేది అంతర్గత అవయవాల లైనింగ్‌ను బాగా ప్రభావితం చేస్తుంది. ► తమకు వచ్చిన సిక్స్ ప్యాక్ చూపులకు బిగుతుగా కనిపించేలా చేయడానికి కొందరు ఆహారంలో ఉప్పును పూర్తిగా వదులుకుంటారు ఇది మరింత ప్రమాదకరమైన విషయం. ఆహారం నుంచి ఉప్పును తొలగించడం ఆరోగ్యంపై ప్రతికూల ఫలితాలను కలిగిస్తుంది. ► అదే విధంగా కొన్ని సందర్భాల్లో తాగే నీటికి కూడా ప్రమాదకర పరిమితి పాటించాల్సి ఉంటుంది. ఇది తీవ్రమైన డీ హైడ్రేషన్‌కు గురి చేసే అవకాశం ఉంది. ► అలాగే సిక్స్–ప్యాక్ సాధించిన తర్వాత కూడా దాన్ని నిలబెట్టుకోవడం కోసం నిరంతరం పరిగెత్తడం, ఆ ఆరు పలకల కండరాలు ప్రస్ఫుటంగా కనిపించడం కోసం తరచు తరచి చూసుకోవడం, అవి కనపడని రోజున తీవ్రమైన ఒత్తిడికి గురికావడం జరుగవచ్చుని అది మానసిక సమస్యలకు దోహదం చేస్తుందని కూడా సైక్రియాట్రిస్ట్లు హెచ్చరిస్తున్నారు. ► బాడీ బిల్డింగ్ పోటీలకు హాజరయ్యేవారు లేదా పూర్తిగా వైద్యుల, న్యూట్రిషనిస్ట్‌ల పర్యవేక్షణలో గడిపేవారు, ఒత్తిడితో కూడిన వృత్తి వ్యాపకాలు నిర్వహించని వారు తప్ప సిక్స్ ప్యాక్ గురించి ఎవరు ఎక్కువ శ్రమపడినా అది ప్రమాదకరమే కావచ్చునంటున్నారు. ► ఇక ఫాస్ట్‌గా సిక్స్ ప్యాక్ దక్కించుకోవడం కోసం స్టెరాయిడ్స్ వంటివి అతిగా తీసుకునేవారు కూడా ఆరోగ్యపరమైన తీవ్ర ఇబ్బందులకు గురి కాక తప్పదు.