Actress Vithika Sheru's Six Pack Photos Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

Vithika Sheru Six Pack Photos: సిక్స్‌ప్యాక్ లుక్‌.. యంగ్ హీరోయిన్ సర్‌ప్రైజ్

Published Sun, Jul 9 2023 12:19 PM | Last Updated on Sun, Jul 9 2023 4:59 PM

Actress Vithika Sheru Six Pack Look Pic Viral - Sakshi

సాధారణంగా హీరోయిన్లు అనగానే సున్నితంగా ఉంటారు. గ్లామర్ తో ప్రేక్షకుల్ని ప్రేమలో పడేస్తుంటారు అని అనుకుంటూ ఉంటాం. కానీ అదంతా ఒకప్పుడు. ఇప్పుడూ కొందరు అలానే ఉన్నప్పటికీ ఇంకొందరు మాత్రం జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ సూపర్ ఫిజిక్‌ మెంటైన్ చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే సిక్స్ ప్యాక్ లుక్స్‌తో కుర్రాళ్లకు పోటీ ఇస్తున్నారు.

పైన ఫొటోలో కనిపిస్తున్న బ్యూటీ కూడా తెలుగులో సినిమాలు చేసిన హీరోయిన్. కాకపోతే తక్కువ మూవీస్ లోనే నటించింది. ఆ తర్వాత ఓ యంగ్ హీరోని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇంకా గుర్తురాలేదా? ఆమె ఎవరో కాదు బిగ్‌బాస్ తో చాలామందికి పరిచయమైన వితికా షేరు. అదేనండి 'కొత్తబంగారు లోకం' హీరో వరుణ్ సందేశ్ ని పెళ్లి చేసుకుంది కదా. ఆమెనే ఈమె.

(ఇదీ చదవండి: బిగ్‌బాస్‌ 7 ఆఫర్‌పై హీరోయిన్‌ మాధవీ లత క్లారిటీ)

2008లో కన్నడ సినిమాతో నటిగా కెరీర్ మొదలుపెట్టిన వితికా షేరు.. ఆ తర్వాత ఏడాదే తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. 'ఝుమ్మంది నాదం', 'భీమిలి కబడ్డీ జట్టు' సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసింది. 2015లో 'పడ్డామండీ ప్రేమలో మరి' సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది. ఇందులో హీరోగా చేసిన వరుణ్ సందేశ్ తో రియల్ లైఫ్ లోనూ ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది.

అలా సినిమా చేస్తూ ప్రేమలో పడ్డ వరుణ్ సందేశ్-వితికా షేరు.. 2016లో పెళ్లి చేసుకున్నారు. 2021లో వచ్చిన 'పెళ్లి సందD' మూవీలో చివరగా వితిక కనిపించింది. ఇకపోతే బిగ్ బాస్ మూడో సీజన్ లో భర్తతో కలిసి జంటగా పాల్గొన్న వితిక.. ఆరో సీజన్ లో కీర్తి భట్ ని సపోర్ట్ చేయడానికి వచ్చింది. ప్రస్తుతం యూట్యూబ్ వ్లాగర్ గా బిజీగా ఉన్న ఈ బ్యూటీ.. సడన్ గా ఫిట్ గా మారి అందరికీ షాకిచ్చింది. 

(ఇదీ చదవండి: చెప్పు తెగుతుందంటూ.. రిపోర్టర్‌పై వైష్ణవి సీరియస్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement