Actress Vaishnavi Chaitanya Talk About Baby Movie - Sakshi
Sakshi News home page

Vaishnavi Chaitanya: టిక్ టాక్ వీడియోలు చేస్తే..హీరోయిన్‌ అవుతారా? అని కామెంట్‌ చేశారు

Published Tue, Jul 11 2023 4:34 PM | Last Updated on Tue, Jul 11 2023 4:42 PM

Vaishnavi Chaitanya Talk About Baby Movie - Sakshi

టాలీవుడ్‌లో తెలుగు అమ్మాయిలకు చాన్స్‌లు ఇవ్వరనే ప్రచారం ఎలా వచ్చిందో నాకు తెలియదు. కానీ ఇండస్ట్రీలో మాత్రం అలా ఏం ఉండదు. మన వంతు ప్రయత్నం మనం చేయాలి. అప్పుడే అవకాశాలు వస్తాయి. ఆడిషన్స్‌ ఇవ్వడానికి నేను చాలా కష్టాలు పడ్డాను. ఆర్థికంగా ఇబ్బందులు ఉండేవి. దాదాపు ఏనిమిదేళ్లు తర్వాత నాకు సినిమా చాన్స్‌ వచ్చింది. ‘బేబీ’మూవీ తర్వాత వరుస అవకాశాలు వస్తాయని భావిస్తున్నాను’అని హీరోయిన్‌ వైష్ణవి చైతన్య అన్నారు. ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ , వైష్ణవి చైతన్య నటించిన చిత్రం బేబీ. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ మీద ఈ చిత్రాన్ని ఎస‌కేఎన్ నిర్మించారు. ఈ చిత్రానికి సాయి రాజేష్ దర్శకత్వం వహించారు. జులై 14న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా వైష్ణవి చైతన్య మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. 

హీరోయిన్ అవ్వాలనే కోరికతోనే ఇండస్ట్రీకి వచ్చాను. ఇప్పటికి నా ప్రయాణం మొదలుపెట్టి ఎనిమిదేళ్లు అవుతోంది. కానీ నాకు ఇంత మంచి అవకాశం వస్తుందని అనుకోలేదు. ఈ పాత్ర వచ్చినప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు. కథ విని షాక్ అయ్యాను. నాకు ఓ మంచి అవకాశం లభించిందని అనుకున్నాను. ఈ పాత్రను పోషిస్తానా? లేదా? అని నా మీద నాకు నమ్మకం లేనప్పుడు సాయి రాజేష్ గారు నన్ను నమ్మారు. నా జీవితానికి ఇది చాలా గొప్ప అవకాశం.

ప్రతీ యాక్టర్‌ అంతిమ లక్ష్యం సినిమానే. ఇన్ స్టాలో వీడియోలు, టిక్ టాక్ వీడియోలు చేస్తే సినిమా హీరోయిన్ అవుతుందా? అని నెగెటివ్ కామెంట్లు వచ్చాయి. ఈ మూవీ ఛాన్స్ వచ్చినప్పుడు కూడా నా చుట్టూ వాళ్లు నెగెటివ్ కామెంట్లు చేశారు. అది నా మీద చాలానే ప్రభావం చూపించింది. నేను యూట్యూబ్ వరకేనా? అని అనిపించింది. కానీ సాయి రాజేష్ గారు నన్ను నమ్మారు. నాలో ధైర్యాన్ని నింపారు.

బేబీ సినిమాలో నాది ఓ బస్తీలో పెరిగే ఓ అమాయకురాలైన అమ్మాయి. బస్తీ నుంచి బయటకు వచ్చిన ఆ అమ్మాయి జీవితం ఎలా మలుపు తిరిగింది? అనేది కథ. ఆ జీవితం నుంచి ఏం నేర్చుకుంటుంది? చిన్నప్పటి నుంచే ఓ అబ్బాయితో ప్రేమలో ఉంటుంది. కాలేజ్‌కు వచ్చాక మరో అబ్బాయి లైఫ్‌లోకి వస్తాడు. ఆ తరువాత ఆ అమ్మాయి జీవితం ఎలా ప్రభావితం అయింది అనేది చక్కగా చూపించారు.

సాయి రాజేష్ గారికి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. ఇది మ్యూజిక్ ఓరియెంటెడ్ సినిమా. ఈ సినిమా కథ విన్నప్పుడు నా జీవితమే గుర్తుకు వచ్చింది. రియల్ లైఫ్‌లోంచి తీసుకున్న కథ. ఈ కథ, పాత్రతో నేను ఎక్కువగా రిలేట్ అయ్యాను. నటించేందుకు ఎక్కువ స్కోప్ ఉన్న పాత్ర. ఇది ఎంతో సున్నితమైన పాత్ర.

బస్తీ నుంచి కాలేజ్‌కి వచ్చిన అమ్మాయి ఎలా మారిపోయిందని చెప్పేందుకు ఈ కలర్‌ను ఓ మీటర్‌లా తీసుకున్నాం. బ్లాక్ అండ్ వైట్ అనే మీటర్‌లో చూపించలేదు. ఆ అమ్మాయి మీద ఏ విషయాలు ప్రభావితం చూపించాయి.ఎలా మారిపోయింది? అనే కోణంలోనే చూపించాం. 

షూటింగ్‌ కోసం సెట్‌లోకి వచ్చినప్పుడు భయపడుతూ ఉండేదాన్ని. కానీ టేక్ చెప్పేసరికి మేం ముగ్గురం చర్చించుకుని రెడీగా ఉండేవాళ్లం. ఆ ఇద్దరూ కూడా ఎంతో ఫ్రీడం ఇచ్చారు. డార్క్ లుక్‌లో ఉన్న సీన్‌లే ఎక్కువ ఎంజాయ్ చేశాను. సినిమా చూస్తే ఇది మన జీవితంలో జరిగినట్టే అనిపిస్తుంది. ఈ సినిమాలో నెగెటివ్, పాజిటివ్, హీరో, హీరోయిన్లు అని ఉండరు. పరిస్థితులే ప్రభావితం చేస్తాయి.

ఇప్పటి వరకు నేను ఏ కొత్త ప్రాజెక్ట్‌కు సైన్ చేయలేదు. నా ఫోకస్ మొత్తం బేబీ మీదే ఉంది. ఈ సినిమా వచ్చాక రెస్పాన్స్ చూడాలి. నేను ఏం చేయగలనో కూడా  అందరికీ ఓ క్లారిటీ వస్తుంది.  నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలే చేసేందుకు ఇష్టపడతాను. గ్లామర్ రోల్స్ కంటే.. పర్ఫామెన్స్ ఓరియెంటెడ్ సినిమాలే చేస్తాను.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement