Vaishnavi Chaitanya
-
నా జీవితంలోని అద్భుతం నువ్వు.. 'బేబి' వైష్ణవి పోస్ట్ వైరల్
'బేబి' సినిమాతో హీరోయిన్గా ఓవర్ నైట్ స్టార్డమ్ సంపాదించిన వైష్ణవి చైతన్య.. తెలుగులో ప్రస్తుతం సిద్ధు జొన్నలగడ్డతో 'జాక్' మూవీ చేస్తోంది. మరో మూవీ కూడా సెట్స్‌పై ఉంది. షూటింగ్స్ జరుగుతున్నాయ్ కాబట్టి ప్రస్తుతం పెద్దగా సోషల్ మీడియాలో కనిపించట్లేదు. అలాంటిది ఇప్పుడు తమ్ముడు నితీష్ పుట్టినరోజు సందర్భంగా ఇన్ స్టాలో చాంతాడంత పోస్ట్ పెట్టింది.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 8: యష్మి ఎలిమినేట్!)'మోస్ట్ అమేజింగ్ తమ్ముడికి హ్యాపీ బర్త్ డే. నాకు కోసం అన్ని చేస్తున్నందుకు థ్యాంక్యూ. ప్రతిరోజు నా నవ్వుకి కారణం నువ్వే. ప్రతిరోజూ నన్ను మోటివేట్ చేస్తున్నావ్. నీ ప్రేమ, కేరింగ్‌తో రోజుని పరిపూర్ణం చేస్తున్నావ్. నా జీవితంలోని అద్భుతానివి నువ్వు. నువ్వు లేకుండా ఒక్కరోజుని కూడా ఊహించుకోలేకపోతున్నాను. ఎవరు కేర్ తీసుకోనంత జాగ్రత్తగా నువ్వు నన్ను చూసుకుంటున్నావ్. నువ్వే నా బలం. నీ కోసం నేనేదైనా చేస్తా. మాటల్లో చెప్పలేను గానీ లవ్ యూ' అని వైష్ణవి చైతన్య రాసుకొచ్చింది.వైష్ణవి చైతన్య పోస్ట్ బట్టి చూస్తుంటే తమ్ముడిపై బోలెడంత ప్రేమ ఉన్నట్లు కనిపిస్తుంది. దాన్నంతా ఇప్పుడు బయటపెట్టింది. ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: భార్య పుట్టినరోజు.. ఖరీదైన కారు గిఫ్ట్ ఇచ్చిన స్టార్ హీరో) View this post on Instagram A post shared by Vaishnavi Chaitanya (@vaishnavi_chaitanya_) -
ఓటీటీకి బేబీ హీరోయిన్ మూవీ.. అప్డేట్ వచ్చేసింది!
యంగ్ హీరో ఆశిష్, బేబి మూవీతో ఫేమ్ తెచ్చుకున్న వైష్ణవి చైతన్య జంటగా నటించిన చిత్రం 'లవ్ మీ'. ఇఫ్ యూ డేర్ అనేది సబ్ టైటిల్. మే 25న ఈ మూవీ థియేటర్ల రిలీజై పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయితే బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. హారర్ రొమాంటిక్ చిత్రంగా ఈ సినిమాను అరుణ్ భీమవరపు దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ మూవీని దిల్‌రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి, నాగ మల్లిడి నిర్మించారు.తాజాగా ఈ మూవీ ఓటీటీలో సందడి చేసేందుకు వస్తోంది. ఈ విషయంపై మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. త్వరలోనే అమెజాన్ ప్రైమ్ స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. అయితే ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అవుతుందనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ఈ వీకెండ్లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే తేదీని ప్రకటించే అవకాశముంది. కాగా.. దెయ్యాన్ని ప్రేమిస్తే ఎలా ఉంటుందో అనే ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్‌తో ఈ మూవీ తెరకెక్కించారు. ఈ చిత్రంలో రవికృష్ణ, సిమ్రన్ చౌదరి, సంయుక్త మీనన్, రాజీవ్ కనకాల ప్రధాన పాత్రలు పోషించారు.Get ready to be spooked and enchanted by #GhostLove! Brace yourself for chills and thrills in the ultimate love story. 🥶❤️#LoveMe - '𝑰𝒇 𝒚𝒐𝒖 𝒅𝒂𝒓𝒆' coming soon on @PrimeVideoIN! @AshishVoffl @iamvaishnavi04 @iamsamyuktha_ @mmkeeravaani @pcsreeram #ArunBhimavarapu… pic.twitter.com/edT60T2o1c— Dil Raju Productions (@DilRajuProdctns) June 12, 2024 -
ఎర్ర చీరలో కుందనపు బొమ్మలాగా మెరిసిపోతున్న బేబీ భామ వైష్ణవి చైతన్య (ఫొటోలు)
-
‘లవ్ మీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
ఆ ధైర్యం దిల్ రాజుకే సాధ్యం: అల్లు అరవింద్
ఆశిష్, బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య జంటగా నటించిన చిత్రం లవ్ మీ. ఇఫ్ యు డేర్ అన్నది ఉపశీర్షిక. ఈ చిత్రానికి అరుణ్ భీమవరపు దర్శకత్వం వహించారు. శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్‌పై హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మించారు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దిల్ రాజు గురించి ఆసక్తరమైన విషయాలను పంచుకున్నారు.లవ్ మీ చిత్రాన్ని డైరెక్ట్ చేసే అవకాశాన్ని అరుణ్‌కు దక్కడం చాలా సంతోషం అని అల్లు అరవింద్ అన్నారు. కొత్తవారికి దర్శకత్వం వహించే ఛాన్సులు ఎక్కువగా దిల్ రాజు ఇస్తుంటారని ఆయన గుర్తు చేశారు. డైరెక్షన్లో గత అనుభవం లేని వారికీ అవకాశాలు ఇవ్వడం దిల్ రాజుకే సాధ్యమని అల్లు అరవింద్ తెలిపారు. అలాంటి సాహసం తాను ఏమాత్రం చేయలేనని ఆయన అన్నారు. లవ్ మీ సినిమాతో కీరవాణి, పీసీ శ్రీరామ్‌లాంటి స్టార్ టెక్నిషియన్లతో మొదటి ప్రాజెక్ట్‌కే పని చేయడం అరుణ్ అదృష్టమని తెలిపారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంటుందని ఆరవింద్ ఆశించారు.దిల్ రాజు మాట్లాడుతూ..'హర్షిత్ రెడ్డి సినిమాపై ఉన్న ఆసక్తితో నిర్మాతగా మారాడు. హన్షిత చిన్నప్పటినుంచి షూటింగ్స్‌కు వెళ్లేది. కానీ సినిమా రంగంలోకి వస్తుందని ఊహించలేదు. వీరిద్దరు కలిసి దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై చిత్రాలు నిర్మిస్తున్నారు. తొలి సినిమా బలగంతో వేణు యెల్దండిని దర్శకుడిగా పరిచయం చేశారు. లవ్ మీతో అరుణ్‌కు ఛాన్స్ ఇచ్చారు. మరికొన్ని సినిమాల వివరాలు త్వరలోనే ప్రకటిస్తాం. కొత్తవారిని ప్రోత్సహించాలనేదే మా లక్ష్యం' అని అన్నారు. -
దెయ్యాన్ని ప్రేమించిన హీరో.. లవ్ మీ ట్రైలర్ చూశారా?
దెయ్యంతో ప్రేమ.. కాన్సెప్ట్ కొత్తగా ఉంది కదూ..! ఈ కాన్సెప్ట్‌తో వస్తోన్న క ఒత్త మూవీ లవ్ మీ. ఆశిష్, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న ఈ మూవీ ట్రైలర్ గురువారం (మే 16న) రిలీజైంది. రోజూ రాత్రి సరిగ్గా ఎనిమిది గంటలకు ఒక అలారం మోగుతుంది. రాత్రి 8 గంటలకు..ఆ సమయానికి ఎవరు ఏ పనిలో ఉన్నా అందరూ టంచనుగా ఆ టైంకు ఇంటి తలుపును మూసేస్తారు. కానీ ఓ ఆడపిల్ల మాత్రం గది తలుపు తెరిచి చూసి కెవ్వుమని అరుస్తుంది. ఆ వెంటనే హీరో ఇంట్రడక్షన్ వేశారు. ఎవరైనా ఏదైనా పని చేయొద్దు అంటే అదే చేయాలనిపిస్తుంది. అక్కడ డేంజర్ వెళ్లొద్దు అంటే అటే వెళ్లాలనిపిస్తుందంటూ తన స్వభావాన్ని ట్రైలర్లో చూపించాడు. దెయ్యంతో లవ్అందుకే అందరూ భయపడే దెయ్యంతో ప్రేమలో పడతాడు. దెయ్యం చంపుతుందని అందరూ హెచ్చరించినా హీరో మాత్రం ఆ ఘోస్ట్ ప్లేస్‌లోకి వెళ్తాడు. చివరికి ఆ దెయ్యం అర్జున్ పీక పట్టుకోవడంతో ట్రైలర్ ముగుస్తుంది. మరి ఈ మనిషి-దెయ్యం ప్రేమకథ ఎలా ఉందో తెలుసుకోవాలంటే మే 25 వరకు ఆగాల్సిందే! మే 25న రిలీజ్అంటే సరిగ్గా మరో తొమ్మిది రోజుల్లో ప్రేక్షకులను భయపెట్టేందుకు లవ్ మీ థియేర్లలో విడుదల కానుంది. ఈ చిత్రానికి అరుణ్ భీమవరపు దర్శకత్వం వహించగా ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందించాడు. దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి, నాగ మల్లిడి నిర్మించారు. చదవండి: అలా జరిగుంటే నా పవిత్ర బతికేది, మా రిలేషన్‌ను చెప్దామనుకున్నాం.. ఏడ్చేసిన నటుడు -
MM Keeravani: డ్యాన్స్ చేశాం
‘‘లవ్ మీ’ సినిమాలో ‘ఆటగదరా శివ..’ అని ఓ టైటిల్ సాంగ్ రాశారు చంద్రబోస్‌గారు. ఈ సినిమాకు పని చేయడానికి మేం స్టూడియోలో డ్యాన్స్ చేశాం. చంద్రబోస్‌గారితో ఫైట్ కూడా చేశాం (నవ్వుతూ). ఈ చిత్రం విజయం సాధించాలి’’ అని సంగీతదర్శకుడు ఎంఎం కీరవాణి అన్నారు. ఆశిష్, వైష్ణవీ చైతన్య జంటగా అరుణ్ భీమవరపు దర్శకత్వం వహించిన చిత్రం ‘లవ్ మీ’. శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్‌పై హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న రిలీజ్ కానుంది. ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ సినిమా ఆడియో విడుదల వేడుకను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ వేడుకలో నిర్మాత ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘ఆడియో రిలీజ్ ఈవెంట్స్‌ని మర్చి΄ోయి చాలా రోజులైంది. ‘లవ్ మీ’తో మళ్లీ ఆ సంస్కృతిని తీసుకొస్తున్నాం’’ అన్నారు. ‘‘ఆడియో లాంచ్ ఈవెంట్ చూస్తుంటే సక్సెస్ మీట్‌లా అనిపిస్తోంది’’ అన్నారు అరుణ్ భీమవరపు. ‘‘మా సినిమా ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అన్నారు ఆశిష్. ఈ కార్యక్రమంలో వైష్ణవీ చైతన్య, హన్షిత, శిరీష్, హర్షిత్ రెడ్డి, నాగ మల్లిడి, కెమెరామేన్ పీసీ శ్రీరామ్ తదితరులు ΄ాల్గొన్నారు. -
తెలుగుతనం ఉట్టిపడుతున్న ‘బేబీ’ గర్ల్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)
-
'లవ్ మీ' మూవీ ఆడియో వేడుక (ఫొటోలు)
-
ఇదొక కొత్త ప్రయత్నం
ఆశిష్, వైష్ణవీ చైతన్య హీరో హీరోయిన్గా నటించిన చిత్రం ‘లవ్ వీ’. ‘ఇఫ్ యు డేర్’ (నీకు ధైర్యం ఉంటే...) అనేది ఉపశీర్షిక. శిరీష్ సమర్పణలో ‘దిల్’ రాజు ప్రోడక్షన్స్ పతాకంపై హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 25న విడుదల కానుంది. ఈ సినిమాలోని ‘రావాలి రా..’ అనే లిరికల్ సాంగ్ రిలీజ్ ఈవెంట్ హైదబాద్‌లో జరిగింది. కీరవాణి సంగీత సారథ్యంలో చంద్రబోస్ సాహిత్యం అందించిన ఈ పాటను చెబోలు అమల, గోమతీ అయ్యర్, అదితీ భావరాజు, అజ్మల్ ఫాతిమా పర్విన్, సాయి శ్రేయ ఆలపించారు. ‘‘ఓ ఘోస్ట్ లవ్‌స్టోరీ నేపథ్యంలో హారర్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం ఉంది’’ అని చిత్రం యూనిట్ పేర్కొంది. ‘‘లవ్ మీ ఒక కొత్త ప్రయత్నం’’ అన్నారు ‘దిల్’ రాజు. -
'ఒకసారి డేట్‌కు పిలిస్తే కదా తెలిసేది'.. టీజర్‌తోనే భయపెట్టేశాడు!
టాలీవుడ్ యంగ్ హీరో ఆశిష్ రెడ్డి, బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య జంటగా నటిస్తోన్న తాజా చిత్రం 'లవ్ మీ'. ఇటీవలే పెళ్లి చేసుకున్న హీరో సరికొత్త ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. హార్రర్ థ్రిల్లర్‌గా అరుణ్ భీమవరపు దర్శకత్వం తెరెకెక్కిస్తున్నారు. ఈ సినిమాను దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఆయన కూతురు హన్షిత రెడ్డి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా చేతుల మీదుగా టీజర్ విడుదల చేశారు. టీజర్ చూస్తే ఈ చిత్రాన్ని హారర్ జానర్లో డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఒకవైపు భయపెడుతూనే రొమాంటిక్ లవ్ స్టోరీగా రూపొందించినట్లు అర్థమవుతోంది. గతంలో దెయ్యం కాన్సెప్ట్‌తో చాలా సినిమాలు వచ్చాయి. కానీ దెయ్యంతో హీరో ప్రేమను కొనసాగించడం కాస్తా ఆసక్తిని పెంచుతోంది. దెయ్యంతో డేటింగ్, రొమాన్స్, ప్రేమను ఈ సినిమాతో ప్రేక్షకులకు పరిచయం చేయనున్నారు. 'లవ్ మీ' ఇఫ్ యూ డేర్ అనే ట్యాగ్‌లైన్‌తో వస్తోన్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు మేకర్స్. -
Vaishnavi Chaitanya: సింపుల్ లుక్స్‌లో మెస్మరైజ్ చేస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)
-
క్రేజీ ఛాన్స్ కొట్టేసిన బేబీ హీరోయిన్.. బీచ్‌లో ప్రగ్యా జైస్వాల్!
►బేబీ హీరోయిన్ బర్త్ డే స్పెషల్ పిక్ ►బీచ్‌లో ప్రగ్యా జైస్వాల్ హాట్ పోజులు ►బ్లూ డ్రెస్‌లో అమృత అయ్యర్ హోయలు ►దుబాయ్‌లో యషిక ఆనంద్ స్టిల్స్ ►బ్యాంకాక్‌లో చిల్ అవుతోన్న బాలీవుడ్ భామ దిశా పటానీ ►మెగా కోడలు లావణ్య త్రిపాఠి పోస్ట్ వైరల్ View this post on Instagram A post shared by Lavanya tripathi konidela (@itsmelavanya) View this post on Instagram A post shared by disha patani (paatni) 🦋 (@dishapatani) View this post on Instagram A post shared by Yash 🔱⭐️🌙 (@yashikaaannand) View this post on Instagram A post shared by Amritha - Thendral (@amritha_aiyer) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Vaishnavi Chaitanya (@vaishnavi_chaitanya_) -
నాకు కాబోయే భర్తకు ఉండాల్సిన లక్షణాలు ఇవే
-
బేబి కాంబో రిపీట్
‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న హీరో ఆనంద్ దేవరకొండ, హీరోయిన్ వైష్ణవీ చైతన్య కాంబినేషన్లో మరో సినిమా రూ΄పొందనుంది. ‘బేబి’ చిత్ర దర్శకుడు సాయి రాజేశ్ ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా రవి నంబూరి దర్శకునిగా పరిచయం అవుతున్నారు. అమృతప్రోడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్‌పై ఎస్కేఎన్, సాయి రాజేశ్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ‘‘ఈ సినిమా ప్రస్తుతం ప్రీప్రోడక్షన్ పనులు జరుపుకుంటోంది. త్వరలోనే షూటింగ్ మొదలవుతుంది. వచ్చే వేసవిలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: విజయ్ బుల్గానిన్, కెమెరా: బాల్ రెడ్డి, సహనిర్మాత: ధీరజ్ మొగిలినేని. -
కోకాపేట్ లో సందడి చేసిన ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైత్యన (ఫొటోలు)
-
అలా మాట్లాడుతూ యూత్ పరువు తీస్తున్నారు..!
-
ఇంకా మంచి నటుడు అనిపించుకోవాలని నా కోరిక
-
ఈ వినాయక చవితి చాలా ప్రత్యేకం
‘‘నాకు చాలా చాలా ఇష్టమైన పండగ వినాయక చవితి. వినాయక విగ్రహాన్ని ఇంటివద్దకు తీసుకొచ్చేటప్పుడు, నిమజ్జనానికి తీసుకెళ్లేటప్పుడు బ్యాండ్‌కి తగ్గట్టు ఫుల్‌గా డ్యాన్స్ చేసి అలిసిపోయేదాన్ని. ‘బేబీ’ చిత్రంలో ఓ పాటలో వినాయకుడి విగ్రహం ముందు డ్యాన్స్ చేస్తున్నప్పుడు నాకు చిన్నతనం గుర్తొచ్చింది. ఇప్పటికి కూడా వినాయకుడి వద్ద ఉండే బ్యాండ్ సౌండ్‌కి డ్యాన్స్ చేయకుండా ఆగలేను’’ అని హీరోయిన్ వైష్ణవీ చైతన్య అన్నారు. ‘బేబీ’ సినిమాతో సూపర్‌హిట్ అందుకున్నారు తెలుగమ్మాయి వైష్ణవీ చైతన్య. నేడు వినాయక చవితి సందర్భంగా ‘సాక్షి’తో ప్రత్యేకంగా ముచ్చటించారామె.. ఆ విశేషాలు... ► ఈ ఏడాది వినాయక చవితిని ఎలా ప్లాన్ చేస్తున్నారు? గతంలో ప్రతిసారి నేను, తమ్ముడు ప్లాన్ చేసేవాళ్లం. కానీ, ఈ సారి మా అమ్మ, నాన్న ప్లాన్ చేస్తున్నారు. ప్రతి ఏడాది తొమ్మిది రోజులు వినాయకుణ్ణి ఇంట్లో పెట్టి పూజ చేసేవాళ్లం.. కాలనీ వాళ్లని పిలిచి అన్నదానం చేసేవాళ్లం. ప్రతిరోజూ సాయంత్రం భజనలు చేసేవాళ్లం. కుటుంబ సభ్యులు, స్నేహితులు కలిసి ఫుల్ హంగామా చేస్తూ ట్యాంక్‌బండ్‌కి తీసుకెళ్లి నిమజ్జనం చేసేవాళ్లం. ఈ సారి అలాగే చేయాలనుకుంటున్నాం. ► గత ఏడాదికీ, ఈ ఏడాదికీ మీ స్థాయిలో మార్పు వచ్చింది. గతంలో వైష్ణవీ చైతన్య అంటే ఎవరికీ పెద్దగా తెలియకపోవచ్చు. కానీ, ఇప్పుడు ‘బేబీ’ హీరోయిన్ అని తెలుసు.. దాన్ని ఎలా చూస్తారు? ప్రతి ఏడాది కొంచెం ప్రత్యేకంగా ఉంటుంది. అయితే ఈ ఏడాది ఇంకా ఎక్కువ ప్రత్యేకం. ఎందుకంటే ‘బేబీ’ సినిమా చేశాం.. చాలా పెద్ద హిట్ అయింది. ఎంతో మంది నుంచి యూనిట్‌కి అభినందనలు వచ్చాయి. దాంతో మేము చాలా మోటివేషన్ (ప్రేరణ) జోన్లో ఉన్నాం. ఇంకా అదే సంతోషంలోనే ఉన్నాం.. కాబట్టి ఈ ఏడాది ఇంకా ప్రత్యేకం అని చెప్పాలి. ► వినాయక చవితి అంటే అమ్మాయిలు ప్రత్యేకించి లెహంగా వంటి బట్టలు కుట్టించుకోవడం చేస్తుంటారు. ఈసారి కూడా అలాంటివి ఏమైనా కుట్టించుకున్నారా? నా చిన్నప్పటి నుంచి నా బట్టలన్నీ మా అమ్మే కుట్టేది.. ఈసారి కూడా అమ్మే కుడుతుంది. తొమ్మిది రోజులు వినాయకుడికి ఇంట్లో పూజలు చేస్తాం కాబట్టి తొమ్మిది జతల బట్టలు కుడుతుంది. నవరాత్రులకు కూడా అలాగే చేస్తాం. నా కోసం తొమ్మిది హాఫ్ శారీస్ రెడీ చేసి పెడుతుంది మా అమ్మ. ► హాఫ్ శారీస్ కట్టుకోవడం మీకు ఇష్టమేనా? చాలా ఇష్టం. ఇంట్లో ఖాళీగా కూర్చుని ఉన్నా సంప్రదాయంగా హాఫ్ శారీస్, చీరలు కట్టుకుంటాను. అవి అంటే నాకు అంత పిచ్చి. నేను జీన్స్ వేసుకోవడం చాలా తక్కువ. ఎప్పుడైనా వేసుకున్నా బొట్టు మాత్రం కచ్చితంగా పెట్టుకుంటా. మన సంప్రదాయం, బొట్టు అనేవి నాకు మంచి ప్రేరణ, నమ్మకాన్ని ఇస్తాయి. ► చవితికి పిండి వంటలు చేయడం మీకు వచ్చా? నేను చేస్తాను.. నాకు బాగా వస్తాయి. పిండి వంటలు, ఉండ్రాళ్లు, పులిహోర నేను చేస్తాను. స్వీట్స్ మాత్రం అమ్మ చేస్తుంది. స్వీట్స్ అంటే నాకు ఎక్కువ ఇష్టం లేదు కాబట్టి నేను చేయను. వంటలన్నీ బాగా వండుతాను. ► మీ అమ్మ మన సంప్రదాయాల గురించి చెబుతూ మిమ్మల్ని పెంచారా? మన ఇంట్లో వాళ్లు ఎలా ఉంటే మనం కూడా అలా ఉంటాం కదా! మా అమ్మ ఎప్పుడూ పూజలు, వంటలు చేస్తూ పాజిటివ్ వైబ్స్‌తో ఉండేది. ఆమెను చూస్తూ నేను కూడా నేర్చుకున్నా. నన్ను అయితే నేర్చుకో అంటూ ఎప్పుడూ ఒత్తిడి చేయదు. ► ఇప్పుడు హీరోయిన్గా బిజీగా ఉన్నారు కాబట్టి వంట గదిలోకి వెళ్లే సమయం ఉండదేమో? అవును. ‘బేబీ’ తర్వాత ఆశిష్‌కి జోడీగా ఓ సినిమా, సిద్ధు జొన్నలగడ్డకి జతగా ఓ చిత్రం చేస్తున్నా. ► ఖైరతాబాద్ వినాయకుడు అంటే బాగా ఫేమస్.. అక్కడికి వెళుతుంటారా? ప్రతి ఏడాది వెళు తుంటాం. గత ఏడాది కూడా వెళ్లాను. ఈ ఏడాది కూడా వెళ్లాల్సిందే. ‘బేబీ’ సినిమా తర్వాత నేను ఎక్కడికి వెళ్లినా గుర్తు పడుతున్నారు. నన్నే కాదు.. మా కుటుంబ సభ్యులను కూడా గుర్తు పట్టి మాట్లాడటం సంతోషంగా ఉంది. ► చిన్నప్పుటి నుంచి హీరోయిన్ కావాలనే లక్ష్యం ఉండేదా? లేకుంటే వేరే ఏదైనా..? నాకు పదిహేనేళ్ల నుంచి సినిమా అంటే ఇష్టం ప్రారంభమైంది. సినిమా అంటే ఏంటో తెలియని వయసులో ప్రారంభమైన ఇష్టం ఇప్పుడు సినిమానే నా జీవితం అయింది. ► మీకు సినిమా నేపథ్యం లేదు. చిత్ర పరిశ్రమలో ఎలా రాణించగలుగుతామనిపించిందా? పైగా తెలుగమ్మాయి అంటే అవకాశాలు తక్కువగా ఉంటాయి కదా... తెలుగమ్మాయిలకు అవకాశాలు ఇవ్వరనే మాట ఎలా వచ్చిందో నాకు తెలియదు. కానీ, నేనయితే సినిమాలపై ఇష్టం, ప్రేమతో ప్రయత్నాలు చేయడం ప్రారంభించా.. ఆడిషన్స్‌కి వెళ్లేదాన్ని. నమ్మకం కోల్పోకుండా అలా ప్రయత్నించగా అవకాశాలు వచ్చాయి. దేనికైనా సమయం పడుతుంది. అది నటనే కాదు.. వేరే ఏ కెరీర్ అయినా కూడా. మనం కోరుకున్నది వచ్చే వరకు ప్రయత్నిస్తూనే ఉండాలి. ► నటన ఒక్కటేనా? లేకుంటే డైరెక్షన్, ఇతర ఆలోచనలేమైనా ఉన్నాయా? నాకు చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే ఇష్టం. కూచిపూడి, వెస్ట్రన్ డ్యాన్స్ నేర్చుకున్నాను. ► మీ జీవితంలో మరచిపోలేని వినాయక చవితి ఏది? స్కూల్లో చదువుతున్న సమయంలో అందరూ నిద్రపోయాక కాలనీలోని వినాయక మండపం వద్ద ఉన్న లడ్డును దొంగతనం చేయాలనుకునేవాళ్లం. తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో మండపం వద్దకు వెళ్లి లడ్డు దొంగతనం చేసి అందరికీ పంచేవాళ్లం (నవ్వుతూ). -
'బేబి' హీరోయిన్‌కి పెళ్లిపై ఇంట్రెస్ట్.. అలాంటోడే కావాలని!
తెలుగులో ఎప్పుడు ఏ సినిమా హిట్ అవుతుందనేది చెప్పలేం. అలా కొన్నాళ్ల ముందు ఎలాంటి అంచనాల్లేకుండా థియేటర్లలోకి వచ్చి, బీభత్సం సృష్టించిన మూవీ అంటే గుర్తొచ్చేది 'బేబి'నే. ప్రస్తుతం ట్రెండ్ కి తగ్గట్లు తీసిన ఈ ట్రాయాంగిల్ లవ్‌స్టోరీ.. యువతకి పిచ్చిపిచ్చిగా నచ్చేసింది. హీరోయిన్ వైష్ణవి చైతన్య ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన పెళ్లిపై కామెంట్స్ చేసింది. (ఇదీ చదవండి: ఆ చిన్న సినిమాలో ఏకంగా 24 పాటలు.. అది కూడా!) యూట్యూబర్‌గా కెరీర్ ప్రారంభించి పలు షార్ట్ ఫిల్మ్స్, ఆల్బమ్ సాంగ్స్‌తో గుర్తింపు తెచ్చుకున్న వైష్ణవి చైతన్య.. 'బేబి' సినిమాతో హీరోయిన్ అయిపోయింది. ఈమె నటనకిగానూ అద్భుతమైన ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం కొత్త ప్రాజెక్టులు చేసే బిజీలో ఉన్న ఈమె.. తాజాగా ఓ యూట్యబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో పాల్గొంది. తన కెరీర్, సినిమా కష్టాలు అన్ని చెప్పింది. అయితే కాబోయే భర్తకి ఉండాల్సిన క్వాలిటీస్ గురించి చెప్పడం ఆసక్తికరంగా అనిపించింది. 'నాకు కాబోయే భర్త గురించి పెద్దగా అంచనాలు అయితే పెట్టుకోవడం లేదు. ఆస్తిపాస్తులు ఏం లేకపోయినా, అందంగా లేకపోయినా నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. మంచి మనసు ఉంటే చాలు' అని వైష్ణవి చైతన్య చెప్పుకొచ్చింది. అయితే ఈ కాలంలో ఇలాంటి క్వాలిటీ ఉన్న అబ్బాయిలంటే చాలా వెతకాల్సి ఉంటుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. (ఇదీ చదవండి: భోళా శంకర్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. అప్పటి నుంచి స్ట్రీమింగ్) -
మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిన తమ్ముడు.. ఏడ్చేసిన బేబి హీరోయిన్!
రాఖీ పండగ వచ్చిందంటే చాలు.. ఎంత దూరంలో ఉన్నా సరే, అన్నా చెల్లెళ్లు, అక్కాతమ్ముళ్లు ఒకచోటకు చేరాల్సిందే! రాఖీ కట్టి తీరాల్సిందే! ఎంతో ప్రేమతో రాఖీ కట్టిన సోదరికి అన్న/తమ్ముడు తనకు తోచినంతలో ఎంతో కొంత డబ్బో లేదంటే ఏదైనా బహుమతో ఇస్తాడు. తనకు కూడా తమ్ముడు మర్చిపోలేని బహుమతి ఇచ్చాడంటోంది వైష్ణవి చైతన్య. అయితే ఆ గిఫ్ట్ రాఖీ పండగకు కాకుండా తన బర్త్‌డేకి ఇచ్చాడంది. కానీ, ప్రతి రాఖీ పండగకు అదే గిఫ్ట్ చూపిస్తున్నాడంటోంది. ఇంతకీ ఆ బహుమతి మరేంటో కాదు పచ్చబొట్టు! వైష్ణవి చైతన్య మాట్లాడుతూ.. 'నా బర్త్‌డేకి గుర్తుండిపోయే గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాడు. అలా తన ఎడమచేతిపై వైషు అని పచ్చబొట్టు వేయించుకున్నాడు. అది నిజమైన టాటూ అనుకోలేదు, జోక్ చేస్తున్నాడనుకున్నాను. కానీ తర్వాత అది నిజమైన టాటూనే అని అర్థమైంది. ఈ పచ్చబొట్టు వేయించుకోవడానికి మూడు గంటలు పట్టిందట! చాలా ఎమోషనల్ అయిపోయా.. ఏడ్చేశాను. అప్పటి నుంచి రాఖీ కట్టిన ప్రతిసారి పచ్చబొట్టు చూపిస్తున్నాడు' అని చెప్పుకొచ్చింది. ఇకపోతే యూట్యూబ్ సెన్సేషన్ అయిన వైష్ణవి చైతన్య బేబి సినిమాతో హీరోయిన్గా మారింది. ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాకు సాయి రాజేశ్ దర్శకత్వం వహించాడు. జూలై 14న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం రూ.90 కోట్ల మేర వసూలు చేసింది. ప్రస్తుతం ఓటీటీలోనూ అందుబాటులోకి వచ్చేసింది. చదవండి: ఫోటో షేర్ చేసిన మంచు లక్ష్మి.. విష్ణుకు ఎందుకు రాఖీ కట్టలేదంటూ..? -
ఆనంద్ దేవరకొండ సినిమాకు హీరోయిన్గా ప్రగతి.. బేబీకి నో ఛాన్స్
బేబీ సినిమా సక్సెస్‌తో ఆనంద్ దేవరకొండకు వరుస సినిమా అవకాశాలు క్యూ కట్టాయి. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఇండస్ట్రీలో ఆనంద్ మార్కెట్ కొంతమేరకు పెరిగింది. ఇప్పటికే తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నిర్మాత జ్ఞానవేల్ రాజాతో ఒక చిత్రానికి ఆనంద్ సంతకం చేశాడు. ఈ సినిమాను ఏఆర్ మురుగదాస్ టీమ్ నుంచి ఒక కొత్త డైరెక్టర్ ఈ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించనున్నాడట. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ సినిమాకు హీరోయిన్గా సోషల్ మీడియాలో పాపులర్ అయిన ఢిల్లీ బ్యూటీ ప్రగతి శ్రీవాస్తవను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ బ్యూటీ శ్రీకాంత్ అడ్డాల ‘పెద్ద కాపు’తో తన జర్నీని స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. రెండు పార్టులుగా వస్తున్న ఈ సినిమా మొదటి భాగం విడుదల కోసం ఆమె ఎదురుచూస్తోంది. ఇది విడుదల కాకముందే ఈ బ్యూటీకి మరో క్రేజీ సినిమాను కైవసం చేసుకోవడం ఆహ్వానించదగ్గ పరిణామం. త్వరలో ప్రారంభం కానున్న ఈ ప్రాజెక్ట్‌లోకి ఆనంద్ దేవరకొండతో పాటు ప్రగతి శ్రీవాస్తవ కూడా అడుగుపెట్టబోతుంది. (ఇదీ చదవండి: అతను అలా ప్రవర్తించినా త్రిష భరించింది.. ఎందుకంటే: సినీ నటి) బేబీ సినిమా తర్వాత సినిమాల ఎంపిక విషయంలో ఆనంద్ దేవరకొండ మరింత జాగ్రత్త పడుతున్నాడని చెప్పవచ్చు. ఈ సినిమాతో పాటు మైత్రీ మూవీ మేకర్స్‌తో కూడా ఆయన డీల్ కుదుర్చుకున్నాడు. ఆనంద్ జ్ఞానవేల్ రాజా, మైత్రీ మూవీ మేకర్స్ లాంటి రెండు పెద్ద ప్రొడక్షన్స్లలో ఆనంద్‌కు ఒకేసారి ఛాన్స్ దక్కడంతో ఆయన ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. కానీ బేబీ సినిమా తర్వాత వైష్ణవి చైతన్యతో ఆనంద్ మరో సినిమా తీస్తున్నట్లు ప్రచారం జరిగింది. దీనిని బట్టి చూస్తే అందులో నిజం లేదని తెలుస్తోంది. ఒక సినిమాకు హీరోయిన్గా ప్రగతి శ్రీవాస్తవ ఎంపిక దాదాపు జరిగిపోయింది. ఇక మిగిలి ఉండేది మైత్రీ మూవీ మేకర్స్ మాత్రమే ... అందులోనైనా ఆమెకు అవకాశం దక్కుతుందేమో వేచి చూడాలి. బేబీ సినిమా హిట్ కావడం వెనుక వైష్ణవి చైతన్య నటన ఎంతో బలం చేకూర్చింది. కానీ ఆ సినిమా తర్వాత ఆమెకు ఇప్పటి వరకు ఒక్క అవకాశం కూడా రాలేదు. -
దుస్తులు మార్చుకునేందుకు గది కూడా లేదు, అమ్మ ఏడ్చేసింది: బేబి హీరోయిన్
ఈ మధ్య కాలంలో థియేటర్ దగ్గర సెన్సేషన్ సృష్టించిన చిత్రాల్లో బేబి మూవీ ఒకటి. ఈ మూవీతో తెలుగమ్మాయి వైష్ణవి చైతన్య పేరు మార్మోగిపోయింది. స్టార్ హీరోలు సైతం ఆమెను పొగడ్తల్లో ముంచెత్తారు. నిజానికి ఆమెకు హీరోయిన్ అవకాశం అంత ఈజీగా రాలేదు. మొదట డబ్స్మాష్, టిక్‌టాక్ వీడియోలతో గుర్తింపు తెచ్చుకుంది వైష్ణవి చైతన్య. తర్వాత యూట్యూబ్‌లో షార్ట్ ఫిలింస్, కవర్ సాంగ్స్, వెబ్ సిరీస్ చేస్తూ ఫేమస్ అయింది. వెండితెరపైనా పలు సినిమాల్లో చిన్నచిన్న పాత్రలు చేస్తూ ప్రేక్షకులకు దగ్గరైంది. 10వ తరగతిలోనే కుటుంబ బాధ్యత అందం, ప్రతిభ ఉన్నప్పటికీ హీరోయిన్ ఛాన్స్ ఆమెను ఆలస్యంగానే వరించింది. డైరెక్టర్ సాయి రాజేశ్ బేబి కథకు వైష్ణవి సరిపోతుందని భావించడంతో ఆమెను సెలక్ట్ చేశాడు. తర్వాత ఆ మూవీ ఓ రేంజ్లో హిట్టవడం.. హీరోయిన్‌కు ఎక్కడలేని క్రేజ్ రావడం తెలిసిందే! తాజాగా వైష్ణవి చైతన్య ఓ ఇంటర్వ్యూలో తను పడ్డ కష్టాలను చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడుతూ.. 'నేను పదో తరగతి నుంచే కుటుంబ బాధ్యతలు తీసుకున్నా. అప్పుడు నాకు తెలిసిందల్లా డ్యాన్స్ ఒక్కటే! బర్త్‌డే, పెళ్లి.. ఇలాంటి ఈవెంట్స్‌లో డ్యాన్స్ చేసేదాన్ని. అలా ఒక్కరోజు డ్యాన్స్ చేస్తే రూ.700 ఇచ్చేవాళ్లు. మా అమ్మ ఆ డబ్బుతో బియ్యం కొనుక్కువచ్చేది. దుస్తులు మార్చుకునేందుకు గది లేదు యూట్యూబ్‌లో వీడియోలు చేసేటప్పుడు కాస్ట్యూమ్స్ మార్చుకుందామన్నా ప్రత్యేక గది ఉండేది కాదు. అక్కడున్న వాష్‌రూమ్‌కి వెళ్లి దుస్తులు మార్చుకునేదాన్ని. అది మా అమ్మ ఏడ్చేసింది. ఎందుకమ్మా, ఇదంతా వద్దు.. వదిలేయ్ అని బాధపడింది. అప్పుడే ఏదైనా సాధించాలనుకుని ఫిక్సయ్యాను. ఒకసారేం జరిగిందంటే.. ఒక సినిమాలో చిన్న పాత్ర చేశాను. మనకంటూ కారవాన్ ఉండదు. పెద్ద ఆర్టిస్ట్ దగ్గరకువెళ్లి వాష్‌రూమ్ కోసం మీ కారవ్యాన్ వాడుకోవచ్చా? అని అడిగితే ఆమె నానామాటలు అంది. నాకు ఏడుపొక్కటే మిగిలింది. ఈ సంఘటన నన్ను చాలా బాధపెట్టింది. అంతేకాదు, ఈ పిల్ల ఏం చేయలేదు, తను ముందుకు వెళ్లలేదు అని చాలామాటలన్నారు. అవి ఎంత పట్టించుకోవద్దనుకున్నా అవి నన్ను ఏదో ఒకరంగా బాధించాయి' అని చెప్పుకొచ్చింది వైష్ణవి చైతన్య. చదవండి: -
Baby Movie In OTT: ఓటీటీలోకి బేబి సినిమా.. ప్రకటించిన మేకర్స్
ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో దర్శకుడు సాయి రాజేశ్ తెరకెక్కించిన చిత్రం 'బేబీ'. జులై 14న విడుదలైన ఈ సినిమా యూత్ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అయింది. ఇప్పటి వరకు సుమారు రూ. 90 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టినట్లు సమచారం. (ఇదీ చదవండి: Bigg Boss Telugu 7: బిగ్‌బాస్‌లో గ్లామర్ డోస్ పెంచేందుకు హాట్ బ్యూటీస్ ఎంట్రీ ) ఇకపోతే ఆగష్టు 25 నుంచి ఈ సినిమా ప్రముఖ తెలుగు ఓటీటీలో ప్రసారం కానుంది. ఓటీటీ కోసం ఇందులో ఒక సాంగ్‌తో పాటు కొన్ని సీన్లను కూడా చేర్చనున్నారని తెలుస్తోంది. 10 కోట్ల కలెక్షన్ల టార్గెట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మొదటి రెండురోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్క్‌ను రీచ్ అయింది. అంతేకాకుండా ఈ సినిమాకు సంబంధించిన బయ్యర్స్ కూడా భారీగా లాభాల్లోకి వచ్చారు. ఇక 25 నుంచి ఓటీటీలోకి వస్తున్న బేబీని చూసి మరోసారి ఎంజాయ్ చేయండి. -
'బేబీ' బ్యూటీని ఎవరూ పట్టించుకోవట్లేదా.. లేదంటే?
తెలుగులో చిన్న సినిమాలు హిట్ అవ్వడం అరుదు. ఒకవేళ అయినా వసూళ్లు సాధించిన సందర్భాలు తక్కువని చెప్పొచ్చు. అలాంటిది ఈ రెండు విషయాల్లో 'బేబీ' మూవీ సెన్సేషన్ సృష్టించింది. ఎలాంటి అంచనాల్లేకుండా కొన్నాళ్లు ముందు థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రంలో వైష్ణవి చైతన్య అనే అమ్మాయి హీరోయిన్గా చేసింది. చిరంజీవి, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలు ఈమెని తెగ పొగిడేశారు. కట్ చేస్తే ఇప్పుడు ఈమెని పెద్దగా పట్టించుకోవట్లేదా అని డౌట్ వస్తుంది. (ఇదీ చదవండి: మెహర్ రమేశ్.. కమెడియన్‌గా నటించాడని మీకు తెలుసా?) డబ్ స్మాష్, టిక్ టాక్ వీడియోలతో గుర్తింపు తెచ్చుకున్న వైష్ణవి చైతన్య.. ఆ తర్వాత యూట్యూబర్‌గా మారింది. కవర్ సాంగ్స్, షార్ట్ ఫిల్మ్స్‌లో నటిస్తూ మెల్లమెల్లగా క్రేజ్ పెంచుకుంది. ఈమె అయితే తన కథకు సరిగ్గా సరిపోతుందని భావించిన దర్శకుడు సాయి రాజేశ్.. 'బేబీ' హీరోయిన్గా ఈమెని ఎంపిక చేశాడు. బోల్డ్ స్టోరీకి తోడు ఈమె యాక్టింగ్‌కి మంచి పేరు వచ్చింది. దీంతో బోలెడన్ని కొత్త ఆఫర్లు వస్తాయని భావించింది. కానీ జరుగుతున్నది వేరు అనిపిస్తుంది. 'బేబీ' ప్రొడ్యూసర్ ఎస్కేన్ తీయబోయే రెండు కొత్త సినిమాల్లో వైష్ణవి హీరోయిన్ అనే టాక్ వినిపించింది. కానీ వీటికి ఇంకా చాలా టైముందని అంటున్నారు. అలానే రామ్, అల్లు శిరీష్ సినిమాల్లోనూ వైష్ణవిని హీరోయిన్గా తీసుకున్నారని అన్నారు. దీనిపై క్లారిటీ వస్తే గానీ అసలు విషయం తెలీదు. 'బేబీ'లో తన క్యారెక్టర్ బోల్డ్ కావడం కూడా బడా నిర్మాణ సంస్థల నుంచి పిలుపు రాకపోవడానికి కారణమేమో అని వైష్ణవిని కన్ఫ్యూజన్లో పడిపోయినట్లు తెలుస్తోంది. మరి వైష్ణవి నుంచి కొత్త సినిమా కబురు ఎప్పుడొస్తుందో ఏంటనేది చూడాలి. (ఇదీ చదవండి: హైపర్ ఆదితో పెళ్లి? క్లారిటీ ఇచ్చేసిన వర్షిణి!)