టాలీవుడ్ లేటెస్ట్ బాక్సాఫీస్ సెన్సేషన్ 'బేబీ' సినిమా బ్లాక్‌బస్టర్ సెలబ్రేషన్స్ హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగాయి. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ యాక్టింగ్‌కి, నిర్మాతగా ఎస్కేఎన్ అభిరుచికి, సాయి రాజేష్ దర్శకత్వంపై ముఖ్య అతిథులు విజయ్ దేవరకొండ, అల్లు అరవింద్, నాగబాబు తదితరులు ప్రశంసలు కురిపించారు.
ఇక ఇదే ఈవెంట్‌లో 'బేబీ' హీరోయిన్ వైష్ణవి చైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 'విజయ్ యాక్టింగ్‌కు నేను అభిమానిని. చిన్నప్పటి నుంచి మా పేరెంట్స్ నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు. వాళ్ల వల్లే ఇవాళ ఈ వేదిక మీదున్నా. ఫ్యూచర్‌లో మీకు ఇంకా మంచి పేరు తీసుకొస్తాను. తెలుగు అమ్మాయిలకు అవకాశాలు రావని అంటుంటారు. కానీ ప్రయత్నిస్తే నాకు బేబీ సినిమా అవకాశం వచ్చినట్లే మీకు వస్తుంది. ఈ సినిమా సక్సెస్ చూస్తుంటే ఇన్నేళ్ల నుంచి దీని కోసమే కదా కష్టపడింది అనిపిస్తోంది. మా సినిమాకు రియల్ హీరోస్ మా టెక్నీషియన్స్' అని చెప్పింది.
(ఇదీ చదవండి: నాలుగో రోజు కూడా 'బేబీ'కి ఈ రేంజ్ కలెక్షన్స్.. నిజంగా గ్రేట్!)
విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. 'థియేటర్‌లో కూర్చున్న వెంటనే 'ఓ రెండు ప్రేమ మేఘాలిలా' పాట వచ్చింది. అప్పుడే ఒక మంచి లవ్ స్టోరీ చూపిస్తున్నారనే ఫీల్‌లోకి వెళ్లిపోయా. ఇప్పుడు ఈ సినిమా గురించి డిబేట్ చేస్తున్నారు. క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఇందులో ఒకరు చెడ్డ, మరొకరు మంచి చెప్పడం ఉద్దేశం కాదు. సొసైటీలో అన్ని రకాల వ్యక్తిత్వాలు ఉన్న వాళ్లుంటారు. నాకు చాలా మంది మంచి అమ్మాయిలు స్నేహితులుగా ఉండేవారు. వారి గుడ్ ఫ్రెండ్‌షిప్ తెలుసు. వైష్ణవి క్యారెక్టర్ ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. అబ్బాయిలు కూడా లవ్ బ్రేక్ చేసేవాళ్లు ఉంటారు'
'దర్శకుడు సాయి రాజేశ్ హానెస్ట్‌గా అటెంప్ట్ చేశాడు. అతను నాకు ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు. నేను సపోర్ట్ చేసేందుకు రెడీగా ఉంటాను. అల్లు అరవింద్ గారి వల్ల వాసు గారు, మారుతి, ఎస్కేఎన్ గారు ఇలా వారి దగ్గర నుంచి ఈ టీమ్... ఒకరి సపోర్ట్‌తో మరొకరు ఇలా వస్తున్నాం. మా అందరిలో మంచి కథలు తెరపై చూపించాలనే ప్రయత్నమే ఉంటుంది. ఆనంద్ తనకు తానుగా ప్రాజెక్ట్స్ చేసుకుంటున్నాడు. ఇవాళ తన సక్సెస్ గర్వంగా ఉంది. అలాగే విరాజ్, వైష్ణవికి మంచి పేరొచ్చింది. 'బేబీ' మీద మీ లవ్ చూపిస్తూనే ఉండాలని కోరుకుంటున్నా' అని విజయ్ దేవరకొండ అన్నారు.
(ఇదీ చదవండి: రెండు వారాల్లోనే ఓటీటీలోకి సూపర్‌హిట్ సినిమా!)
Comments
Please login to add a commentAdd a comment