'బేబి' హీరోయిన్‌కి పెళ్లిపై ఇంట్రెస్ట్.. అలాంటోడే కావాలని! | Baby Movie Actress Vaishnavi Chaitanya Comments Husband Qualities | Sakshi
Sakshi News home page

Vaishnavi Chaitanya: కాబోయే భర్తకి అలాంటి క్వాలిటీస్ ఉండాలట!

Sep 10 2023 6:18 PM | Updated on Sep 10 2023 6:25 PM

Baby Movie Actress Vaishnavi Chaitanya Comments Husband Qualities - Sakshi

తెలుగులో ఎప్పుడు ఏ సినిమా హిట్ అవుతుందనేది చెప్పలేం. అలా కొన్నాళ్ల ముందు ఎలాంటి అంచనాల్లేకుండా థియేటర్లలోకి వచ్చి, బీభత్సం సృష్టించిన మూవీ అంటే గుర్తొచ్చేది 'బేబి'నే. ప్రస్తుతం ట్రెండ్ కి తగ్గట్లు తీసిన ఈ ట్రాయాంగిల్ లవ్‌స్టోరీ.. యువతకి పిచ్చిపిచ్చిగా నచ్చేసింది. హీరోయిన్ వైష్ణవి చైతన్య ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన పెళ్లిపై కామెంట్స్ చేసింది.

(ఇదీ చదవండి: ఆ చిన్న సినిమాలో ఏకంగా 24 పాటలు.. అది కూడా!)

యూట్యూబర్‌గా కెరీర్ ప్రారంభించి పలు షార్ట్ ఫిల్మ్స్, ఆల్బమ్ సాంగ్స్‌తో గుర్తింపు తెచ్చుకున్న వైష్ణవి చైతన్య.. 'బేబి' సినిమాతో హీరోయిన్ అయిపోయింది. ఈమె నటనకిగానూ అద్భుతమైన ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం కొత్త ప్రాజెక్టులు చేసే బిజీలో ఉన్న ఈమె.. తాజాగా ఓ యూట్యబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో పాల్గొంది. తన కెరీర్, సినిమా కష్టాలు అన్ని చెప్పింది. అయితే కాబోయే భర్తకి ఉండాల్సిన క్వాలిటీస్ గురించి చెప్పడం ఆసక్తికరంగా అనిపించింది.

'నాకు కాబోయే భర్త గురించి పెద్దగా అంచనాలు అయితే పెట్టుకోవడం లేదు. ఆస్తిపాస్తులు ఏం లేకపోయినా, అందంగా లేకపోయినా నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. మంచి మనసు ఉంటే చాలు' అని వైష్ణవి చైతన్య చెప్పుకొచ్చింది. అయితే ఈ కాలంలో ఇలాంటి క్వాలిటీ ఉన్న అబ్బాయిలంటే చాలా వెతకాల్సి ఉంటుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

(ఇదీ చదవండి: భోళా శంకర్‌ ఓటీటీ రిలీజ్ డేట్‌ ఫిక్స్.. అప్పటి నుంచి స్ట్రీమింగ్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement