Baby Movie Creates Box Office All-Time Record In TFI - Sakshi
Sakshi News home page

Baby 10 Days Collections: 'బేబీ' వసూళ్లు.. మహేశ్, బన్నీ సినిమాలని మించి!

Published Mon, Jul 24 2023 1:53 PM | Last Updated on Tue, Jul 25 2023 4:19 PM

Baby Movie 10 Days Collection All Time Record - Sakshi

ఏ మాత్రం అంచనాల్లేకుండా థియేటర్లలోకి వచ్చి కొన్ని సినిమాలు అద్భుతాలు చేస్తుంటాయి. కంటెంట్‪ బాగుండి, టైమ్ కలిసొచ్చి బ్లాక్‌బస్టర్ వసూళ్లు సాధిస్తుంటాయి. అలా ఈ మధ్య కాలంలో జనాలకు 'బేబీ' తెగ నచ్చేసింది. ఎంతలా అంటే థియేటర్లలోకి ఈ మూవీ వచ్చి 10 రోజులు అవుతున్నాసరే ఇంకా చాలాచోట్ల హౌస్‌ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ సినిమా ఆల్‌టైమ్ రికార్డ్ సృష్టించింది.

(ఇదీ చదవండి: 'బేబీ' ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్)

పెద్దగా ఫేమ్ లేని యువ నటీనటులతో తీసిన 'బేబీ'.. బాక్సాఫీస్ దగ్గర వండర్స్ క్రియేట్ చేస్తోంది. తొలిరోజు రూ.7.1 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ఈ చిత్రం.. పదో రోజు కూడా దాదాపు అదే టెంపో మెంటైన్ చేస్తోంది. ప్రస్తుత కాలంలో ఓ సినిమా వారంపాటు థియేటర్లలో ఆడటమే గగనమైపోయింది. అలాంటిది 'బేబీ' రచ్చ రచ్చ చేస్తోంది. దీంతో 10 రోజుల్లో 66.6 కోట్ల గ్రాస్ వసూలైంది. పోస్టర్ రిలీజ్ చేసి మరీ ఈ విషయాన్ని ప్రకటించారు. 

అయితే 'బేబీ' చిత్రానికి ఈ ఆదివారం రూ.3.40 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. మిడ్ రేంజ్ సినిమాల్లో 10వ రోజు బాక్సాఫీస్ దగ్గర అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ క్రమంలోనే మహేశ్ బాబు 'సరిలేరు నీకెవ్వరు', 'శ్రీమంతుడు', 'భరత్ అను నేను' చిత్రాలతో పాటు అల్లు అర్జున్ 'సరైనోడు' కలెక్షన్స్‌ని అధిగమించిందని స్వయంగా దర్శకుడు సాయి రాజేశ్ ఇన్ స్టాలో పోస్ట్ పెట్టారు. ఇప్పుడు ఈ విషయం వైరల్ అయిపోయింది.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement