Anand Deverakonda Baby Movie Day 2 Box Office Worldwide Collections, Deets Inside - Sakshi
Sakshi News home page

Baby Movie Collections: 'బేబీ' రచ్చ.. రెండో రోజే లాభాల్లోకి

Jul 16 2023 3:10 PM | Updated on Jul 16 2023 4:18 PM

Baby Movie Day 2 Collection Worldwide - Sakshi

Baby Day 2 Collection: బాక్సాఫీస్ దగ్గర 'బేబీ' సెన్సేషన్ సృష్టిస్తోంది. సాధారణంగా చిన్న సినిమాలపై అంచనాలు ఉన్నాసరే కలెక్షన్స్ అంతంత మాత్రంగానే వస్తుంటాయి. ఇప్పుడు అలాంటి కామెంట్స్ ని 'బేబీ' బద్దలు కొట్టింది. మూవీలో పేరున్న యాక్టర్స్ ఎవరూ లేనప్పటికీ.. రెండో రోజుకే లాభాల్లోకి వెళ్లిపోయింది. ఇప్పుడిదే ఇండస్ట్రీలో హాట్ టాపిక్.

బూతులు ఉన్నాసరే
టాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో సరైన లవ్ స్టోరీలు రాలేదు. సరిగ్గా దీన్ని ట్రాయంగిల్ ప్రేమకథతో తీసిన 'బేబీ' క్యాష్ చేసుకుంది. 'ఓ రెండు ప్రేమ మేఘాలిలా' పాట చాలారోజుల క్రితమే వచ్చింది. అప్పటినుంచి ఈ మూవీపై బజ్ పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు ఆ అంచనాల్ని 'బేబీ' అందుకుంది. బూతులు, శృంగార సన్నివేశాలు కాస్త ఎక్కువయ్యాయని కామెంట్స్ వినిపిస్తున్నప్పటికీ కలెక్షన్లకు అవి ఎలాంటి అడ్డంకి కావట్లేదు.

(ఇదీ చదవండి: సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న కేజీఎఫ్‌ హీరోయిన్)

రెండోరోజే లాభాల్లోకి
తొలిరోజు రూ.7.1 కోట్ల గ్రాస్ వసూలు చేసిన 'బేబీ'.. రెండో రోజు కూడా అంతకంటే కాస్త ఎక్కువనే సాధించింది. మొత్తంగా రెండు రోజుల్లో రూ.14.3 కోట్ల గ్రాస్ వచ్చిందని స్వయానా నిర్మాత ఎస్కేఎన్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇకపోతే సినిమాకు రూ.7 కోట్ల వరకు మాత్రమే బడ్జెట్ అయింది. దీనిబట్టి చూస్తే రెండో రోజుకే బ్రేక్ ఈవెన్ కావడంతో పాటు లాభాల్లోకి కూడా వెళ్లిపోయింది. 

'బ్రో' వచ్చే వరకు
ఇకపోతే తర్వాత వారం పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలేవు కాబట్టి జూలై చివరివారంలో 'బ్రో' వచ్చే వరకు 'బేబీ' హవానే ఉండొచ్చు అనిపిస్తోంది. అలానే లాంగ్ రన్ లో 'బేబీ' రూ.35-40 కోట్ల వరకు గ్రాస్ సాధించిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనిపిస్తోంది. అలానే బేబీ ఓటీటీ హక్కుల్ని ఆహా సొంతం చేసుకుంది. బహుశా ఆరు వారాల తర్వాతే స్ట్రీమింగ్ ఉండొచ్చు.

బేబీ రెండు రోజుల వసూళ్లు

  • నైజాం-5.8 కోట్లు
  • వైజాగ్-1.73 కోట్లు
  • ఈస్ట్- 83 లక్షలు
  • వెస్ట్-46 లక్షలు
  • కృష్ణా-74 లక్షలు
  • గుంటూరు-61 లక్షలు
  • నెల్లూరు-37 లక్షలు
  • సీడెడ్-1.18 కోట్లు
  • కర్ణాటక-రెస్టాఫ్ ఇండియా- 43 లక్షలు
  • ఓవర్సీస్-2.84 కోట్లు

(ఇదీ చదవండి: దేవుడా.. రెండో సినిమాకే లక్షలు తీసుకుంటున్న అల్లు అర్హ!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement