Baby Movie Day 4 Box Office Collection Worldwide - Sakshi
Sakshi News home page

Baby Day 4 Collection: వసూళ్లతో రెట్టింపు లాభాలు.. ఇదెక్కడి మాస్ రా మావ!

Published Tue, Jul 18 2023 3:01 PM | Last Updated on Tue, Jul 18 2023 3:12 PM

Baby Movie Day 4 Collection Worldwide - Sakshi

Baby Movie Collection: కొన్నిసార్లు మనం అనుకోని సంఘటనలు జరుగుతుంటాయి. వాటినే అద్భుతాలు అంటారు. సినిమాల విషయంలోనూ అలాంటివి చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. 'బేబీ' సినిమా కలెక్షన్స్ చూస్తుంటే ఇప్పుడు అదే మాట గుర్తొస్తుంది. ఎందుకంటే 'ఆదిపురుష్' లాంటి సినిమాలో నాలుగో రోజుకి డీలా పడిపోయాయి. 'బేబీ' మాత్రం గుర్రంలా దూసుకెళ్తూ ట్రేడ్ వర్గాల్ని ఆశ్చర్యపరుస్తోంది.

(ఇదీ చదవండి: రెండు వారాల్లోనే ఓటీటీలోకి సూపర్‌హిట్ సినిమా!)

నాలుగో రోజు కూడా
అసలు ఏ మాత్రం అంచనాల్లేకుండా విడుదలైన 'బేబీ' సినిమా యూత్‌కి తెగ కనెక్ట్ అయిపోయింది. సింగిల్, రిలేషన్‌షిప్ లో ఉన్నవాళ్లు.. ఇలా అందరూ ఈ చిత్రాన్ని చూసి ఎమోషనల్ అవుతున్నారు. వైష్ణవి పాత్రని తెగ తిట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే 'బేబీ' నాలుగురోజైనా వర్కింగ్ కూడా హౌస్‌ఫుల్స్‌తో కళకళలాడిపోయింది. ఫలితంగా సోమవారం ఒక్కరోజే రూ.7.5 కోట్ల గ్రాస్ వసూలైంది.

కళ్లుచెదిరే లాభాల్లో
మొత‍్తంగా చూసుకుంటే కేవలం నాలుగురోజుల్లోనే  ప్రపంచవ్యాప్తంగా రూ.31 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయని దర్శకనిర్మాతలు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన పోస్టర్‪‌ని రిలీజ్ చేశారు. రెండో రోజుకే పెట్టుబడి తిరిగి తెచ్చేసుకున్న 'బేబీ'.. మూడోరోజుకి అన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ అయిపోయింది. ప్రస్తుతం బయ్యర్లు, ఎగ్జిబిటర్లు లాభాల‍్లో ఉన్నారు. ఈ శుక్రవారంలోపు రూ.50 కోట్ల మార్క్ ఈజీగా దాటేస్తుందని అంచనా. చూడాలి మరి ఏం జరుగుతుందో?

(ఇదీ చదవండి: హీరోయిన్‌​ వైష్ణవి పక్కన నటించిన ఈ 'బేబీ' గురించి తెలుసా?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement