Movie collections
-
ఆర్ ఆర్ ఆర్ రికార్డు బ్రేక్ చేసిన సంక్రాంతికి వస్తున్నాం ..!
-
సంక్రాంతికి వస్తున్నాం సినిమా 5వ రోజు కలెక్షన్స్
-
'పుష్ప 2' ఐదు రోజుల కలెక్షన్స్.. రూ.1000 కోట్లకు చేరువ
'పుష్ప 2' మూవీకి మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. రోజురోజుకీ వందల కోట్ల కలెక్షన్స్ సాధిస్తున్న ఈ చిత్రం.. ఐదో రోజు పూర్తయ్యేసరికి రూ.1000 కోట్ల మార్క్ దాటేస్తుందని అనుకున్నారు. కానీ కాస్త దగ్గరకు వచ్చి ఆగిపోయింది. సోమవారం.. వర్కింగ్ డే కావడంతో ఓ మేరకు వసూళ్లు తగ్గాయి. ఇంతకీ ఇప్పటివరకు వచ్చిన మొత్తం కలెక్షన్ ఎంత?(ఇదీ చదవండి: 'పుష్ప 2' కాదు.. అసలు కథ ముందుంది!)తొలి వీకెండ్‌ని అద్భుతంగా ముగించిన 'పుష్ప 2'కి ఆదివారం ముగిసేసరికి రూ.829 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. వీకెండ్ కావడంతో దేశవ్యాప్తంగా థియేటర్లన్నీ కళకళాలాడిపోయాయి. అయితే సోమవారం వర్కింగ్ డే కావడంతో ఉదయం షోలతో పోలిస్తే ఈవినింగ్ షోలు ఫూల్ అయ్యాయి. దీంతో ఐదోరోజు కేవలం రూ.97 కోట్ల గ్రాస్ మాత్రమే వచ్చింది. ఈ మేరకు అధికారికంగా నిర్మాణ సంస్థ పోస్టర్ రిలీజ్ చేసింది.ఓవరాల్‌గా చూసుకుంటే ఐదు రోజుల్లో 'పుష్ప 2' సినిమాకు రూ.922 కోట్ల గ్రాస్ వచ్చింది. అయితే మంగళవారం వసూళ్లతో రూ.1000 కోట్ల రౌండ్ ఫిగర్ అవుతుందా లేదంటే బుధవారం వరకు ఎదురుచూడాలా అనేది మరో రోజు గడిస్తే తేలుతుంది. నాలుగంకెల నంబర్ మరో ఒకటి రెండు రోజుల్లో దాటేస్తుంది గానీ లాంగ్ రన్లో ఎన్ని వందల కోట్లు వస్తాయనేది ఇప్పుడు అందరికి వస్తున్న సందేహంగా మారింది.(ఇదీ చదవండి: ఓటీటీలో హారర్ సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్)922 CRORES GROSS for #Pushpa2TheRule in 5 days 💥💥 A record breaking film in Indian Cinema - the fastest to cross the 900 CRORES milestone ❤🔥RULING IN CINEMAS.Book your tickets now!🎟️ https://t.co/tHogUVEgCt#Pushpa2#WildFirePushpaIcon Star @alluarjun @iamRashmika… pic.twitter.com/wXO9GmcTt9— Mythri Movie Makers (@MythriOfficial) December 10, 2024 -
'పుష్ప 2' కలెక్షన్స్.. రెండు రోజుల్లో ఏకంగా అన్ని కోట్లు
'పుష్ప 2' తొలిరోజు వసూళ్లలో బీభత్సం సృష్టించింది. ఏకంగా రూ.294 కోట్ల గ్రాస్ సొంతం చేసుకుని.. ఇప్పటివరకు ఉన్న రికార్డులని పక్కనబెట్టేసింది. అలా దేశంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. దీంతో రెండో రోజు ఎంత కలెక్ట్ చేస్తుందా అని అందరూ ఎదురు చూస్తుండగా.. ఇప్పుడు అధికారిక ప్రకటన వచ్చేసింది.తొలిరోజు రూ.294 కోట్లు కలెక్షన్స్ సాధించిన 'పుష్ప 2'.. రెండో రోజు కాస్త తగ్గింది. రూ.155 కోట్ల గ్రాస్ సొంతం చేసుకుంది. అలా రెండు రోజులకు కలిపి రూ.449 కోట్లు వచ్చాయి. దీంతో రెండో రోజుకే రూ.400 కోట్ల మార్క్ దాటేసిన తొలి చిత్రంగా ఘనత సాధించింది.(ఇదీ చదవండి: 'పుష్ప2' టికెట్ల ధరలు తగ్గనున్నాయా.. కారణం ఇదేనా..?)అయితే దక్షిణాదిలో 'పుష్ప 2' మేనియా ఓ మాదిరిగా ఉండగా.. నార్త్‌లో మాత్రం రప్పా రప్పా అనేలా ఉంది. ఎందుకంటే ఉత్తరాది ప్రేక్షకులు ఎగబడి మరీ సినిమా చూస్తున్నారు. థియేటర్లలో రచ్చ రచ్చ చేస్తున్నారు. ఈ ఊపు ఇలానే కొనసాగితే వారం రోజుల్లోనే రూ.1000 కోట్లు వసూళ్లు వచ్చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు.'పుష్ప 2'లో స్టోరీ పెద్దగా లేనప్పటికీ.. గూస్ బంప్స్ తెప్పించే సీన్స్ ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. దీంతో మూడున్నర గంటల నిడివి కూడా తక్కువే అనిపిస్తుంది. పాటలు, ఫైట్స్ దేనికవే రచ్చ రచ్చ అనేలా ఉండటంతో సాధారణ ప్రేక్షకులు కూడా ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారు.(ఇదీ చదవండి: Pushpa2: థియేటర్స్‌లో మహిళలకు పూనకాలు.. వీడియో వైరల్) -
సూర్య 'కంగువా'.. రూ.2000 కోట్ల కలెక్షన్స్ సాధ్యమేనా?
సూర్య 'కంగువా' సినిమా ప్రేక్షకులు ముందుకొచ్చేసింది. అయితే రిలీజ్‌కి కొన్నాళ్ల ముందు నిర్మాత జ్ఞానవేల్ రాజా మాట్లాడుతూ.. ఈ మూవీ ఏకంగా రూ.2000 కోట్ల కలెక్షన్స్ సాధిస్తోందని, డౌట్ లేదంటూ చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. అప్పట్లోనే ఈ మాటలు కాస్త ఓవర్‌గా అనిపించాయనే కామెంట్స్ వినిపించాయి. మరి 'కంగువ' ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? 2000 కోట్లు వసూళ్లు అయ్యే పనేనా?కోలీవుడ్ 'బాహుబలి' అని చెప్పి 'కంగువా' సినిమాని ప్రచారం చేశారు. ట్రైలర్ చూస్తే వర్కౌట్ అయ్యే కంటెంట్ అనే చాలామంది అనుకున్నారు. కానీ రియాలిటీలో చాలా డిఫరెన్స్ ఉంది. టీమ్ అంతా కష్టపడ్డారు గానీ కథ, స్క్రీన్ ప్లే విషయంలో తీసికట్టుగా వ్యవహరించారు. ప్రస్తుత జనరేషన్ సూర్యకి సంబంధించిన 20-25 నిమిషాల ఎపిసోడ్ సినిమా మొదటలో ఉంటుంది. ఇదైతే మరీ చిరాకు పుట్టేంచేలా ఉంటుంది.(ఇదీ చదవండి: Kanguva Review: 'కంగువా' మూవీ రివ్యూ)పీరియాడిక సెటప్‌లో ఉంటే సూర్య గెటప్ బాగానే ఉంది. కానీ ఆ సీన్లు మరీ సాగదీతగా, ఆడియెన్స్‌కి కనెక్ట్ కాని విధంగా ఉన్నాయి. స్క్రీన్‌పై యుద్ధాలు జరుగుతుంటాయి. యాక్షన్ జరుగుతూ ఉంటుంది. కానీ ప్రేక్షకులకు పెద్దగా ఫీలవరు. తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజే మిక్స్డ్ టాక్ వచ్చింది. వీకెండ్ వరకు అంటే ఏదోలా మేనేజ్ అయిపోతుంది గానీ ఆ తర్వాత మాత్రం ఆడియెన్స్ థియేటర్లకు వచ్చే దానిబట్టి ఉంటుంది.సూర్య 'కంగువా' చిత్రానికి తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా కలిపి రూ.50 కోట్ల లోపే గ్రాస్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇలానే తక్కువ నంబర్స్ వస్తే రూ.2000 కోట్లు కాదు కదా.. లాంగ్ రన్ లో రూ.1000 కోట్లు రావడం కూడా కష్టమే! ఇప్పటికే తెలుగులో ఈ మార్క్ చేరుకున్న సినిమాలు బోలెడున్నాయి. తమిళ ఇండస్ట్రీ మాత్రం రూ.1000 కోట్ల వసూళ్ల కోసం మరికొన్నాళ్లు వెయిట్ చేయక తప్పదేమో?(ఇదీ చదవండి: సూర్య 'కంగువా' ఏ ఓటీటీకి రానుందంటే?) -
'లక్కీ భాస్కర్' కలెక్షన్.. రెండు రోజుల్లో ఎన్ని కోట్లంటే?
దీపావళికి తెలుగు రాష్ట్రాల్లో రిలీజైన సినిమాల్లో 'లక్కీ భాస్కర్' జోరు చూపిస్తోంది. మిగిలిన మూవీస్ కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ దుల్కర్ చిత్రానికి ఆడియెన్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు అనిపిస్తుంది. రెండు రోజుల్లో వచ్చిన కలెక్షన్స్ చూస్తే అదే నిజమనిపిస్తోంది.(ఇదీ చదవండి: 'లక్కీ భాస్కర్' సినిమా రివ్యూ)'సీతారామం' ఫేమ్ దుల్కర్ సల్మాన్ నటించిన లేటెస్ట్ తెలుగు మూవీ 'లక్కీ భాస్కర్'. బ్యాంకింగ్ రంగంలోని మోసాలకు ఫ్యామిలీ ఎమోషన్స్ జోడిస్తూ తీసిన ఈ చిత్రానికి హిట్ టాక్ వచ్చింది. దీంతో తొలి రోజు రూ.12.7 కోట్లు గ్రాస్ రాగా, రెండో రోజు కూడా అంతే స్టడీగా వచ్చాయి. కాస్త రూ.13.5 కోట్ల గ్రాస్ సొంతం చేసుకుంది. అలా రెండు రోజుల్లో రూ.26.2 కోట్లు గ్రాస్ వసూళ్లు సాధించినట్లు నిర్మాతలు పోస్టర్ రిలీజ్ చేసి అధికారికంగా ప్రకటించారు.దుల్కర్‌తో పాటు మీనాక్షి చౌదరి కూడా యాక్టింగ్‌తో ఆకట్టుకుంది. వెంకీ అట్లూరి రచన-దర్శకత్వం ఒకెత్తయితే, జీవీ ప్రకాశ్ కుమార్ అందించిన సంగీతం మరో ఎత్తు. ఓవరాల్‌గా బాక్సాఫీస్ దగ్గర 'లక్కీ భాస్కర్' నెమ్మదిగా పికప్ అవుతోంది. ఈ వీకెండ్ ముగిసేసరికి రూ.50 కోట్ల వసూళ్లు మార్క్ చేరుకుంటుదేమో చూద్దాం!(ఇదీ చదవండి: దీపావళికి నాలుగు కొత్త సినిమాలు.. ఏది ఎలా ఉందంటే?)Our Baskhar is 𝐔𝐍𝐒𝐓𝐎𝐏𝐏𝐀𝐁𝐋𝐄 at the box office, 𝟐𝟔.𝟐 𝐂𝐑+ 𝐆𝐑𝐎𝐒𝐒 worldwide in 2 Days! 🔥💰#BlockbusterLuckyBaskhar 💥💥𝑼𝑵𝑰𝑽𝑬𝑹𝑺𝑨𝑳 𝑫𝑰𝑾𝑨𝑳𝑰 𝑩𝑳𝑶𝑪𝑲𝑩𝑼𝑺𝑻𝑬𝑹 🏦 #LuckyBaskhar In Cinemas Now - Book your tickets 🎟 ~ https://t.co/Gdd57KhHT3… pic.twitter.com/KHw1GjC2kL— Dulquer Salmaan (@dulQuer) November 2, 2024 -
బ్లాక్‌బస్టర్ హిట్ సినిమా.. రూ.4 వేల కోట్ల కలెక్షన్స్.. ఏదో తెలుసా? (ఫొటోలు)
-
రూ.500 కోట్లు దాటేసిన 'దేవర' కలెక్షన్
ఎన్టీఆర్ 'దేవర' రూ.500 కోట్ల కలెక్షన్ సొంతం చేసుకుంది. సెప్టెంబరు 27న పాన్ ఇండియా స్థాయిలో రిలీజైన ఈ చిత్రానికి తొలుత మిక్స్డ్ టాక్ వచ్చింది. తెలుగు ప్రేక్షకులే చాలామంది మూవీ నచ్చలేదని అన్నారు. కానీ రోజురోజుకు కుదురుకుని.. 16 రోజుల్లో ఇప్పుడు రూ.500 కోట్ల వసూళ్లు మార్క్ దాటేసింది. ఈ మేరకు నిర్మాతలు అధికారిక ప్రకటన చేశారు.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ నూతన్ నాయుడు ఇంట్లో విషాదం)'ఆర్ఆర్ఆర్' తర్వాత ఎన్టీఆర్ చేసిన సినిమా ఇది. 'ఆచార్య' లాంటి డిజాస్టర్ తర్వాత కొరటాల చేసిన సినిమా కావడంతో తొలుత చాలామంది 'దేవర'పై సందేహపడ్డారు. కానీ ఎన్టీఆర్ యాక్టింగ్, అనిరుధ్ పాటలు, బీజీఎం మూవీకి వెన్నముకగా నిలిచాయి. హిట్టా ఫ్లాప్ అనే సంగతి పక్కనబెడితే రూ.500 కోట్ల వసూళ్లు వచ్చాయంటే విశేషమనే చెప్పాలి.'దేవర' రెండో భాగానికి సంబంధించిన వర్క్ త్వరలో ప్రారంభమవుతుంది. ప్రస్తుతం ఎన్టీఆర్.. 'వార్ 2' అనే హిందీ సినిమా చేస్తున్నాడు. మరో రెండు నెలలో ప్రశాంత్ నీల్ తీయబోయే మూవీ షూటింగ్‌కి హాజరవుతాడు. ఈ రెండు పూర్తయిన తర్వాతే 'దేవర 2' ఉండే అవకాశముంది. (ఇదీ చదవండి: హీరోగా 'బిగ్‌బాస్' అమరదీప్.. కొత్త సినిమా మొదలు)A Sea of Bloodand a Shoreline of Destruction 🔥Man of Masses @Tarak9999’s Massacre made #Devara cross 𝟓𝟎𝟎 𝐂𝐫𝐨𝐫𝐞𝐬+ 𝐆𝐁𝐎𝐂 😎&Sending a Notice of being a truly Unstoppable hunt ❤️🔥#BlockbusterDevara pic.twitter.com/p613NQO86j— Devara (@DevaraMovie) October 13, 2024 -
బాక్సాఫీస్ వసూళ్లు.. 'దేవర' సరికొత్త రికార్డులు
ఎన్టీఆర్ 'దేవర' సరికొత్త రికార్డులు సెట్ చేసేలా ఉంది. ఎందుకంటే రిలీజ్‌కి ముందు ఓ మాదిరి ట్రోలింగ్కి గురైన ఈ సినిమా ఇప్పుడు తొలిరోజు ఏకంగా రూ.172 గ్రాస్ వసూళ్లు సాధించింది. ఇన్నాళ్లు పాన్ ఇండియా సినిమా అంటే ప్రభాస్ మాత్రమే అనే దగ్గర నుంచి లిస్టులో తారక్ కూడా చేరిపోయాడు అనేంత వరకు వెళ్లింది. అలానే 'దేవర' పలు రికార్డులు కూడా సెట్ చేసినట్లు తెలుస్తోంది.టాప్-5లోకి 'దేవర'పాన్ ఇండియా అంటే తెలుగు, దక్షిణాది సినిమాలు మాత్రమే అనేలా ఉన్నాయి. ఎందుకంటే తొలిరోజు వసూళ్లలో తొలి ఐదు స్థానాల్లో మనమే ఉన్నాం మరి. ఆర్ఆర్ఆర్ (రూ.223.5 కోట్లు), బాహుబలి 2 (రూ.214.5 కోట్లు), కల్కి 2898 ఏడీ (రూ.191.5 కోట్లు), సలార్ (రూ.178.8 కోట్లు) ఇప్పటివరకు టాప్-4లో కొనసాగుతున్నాయి. వీటి తర్వాతి స్థానంలో దేవర (రూ.172 కోట్లు) వచ్చి చేరింది. అనంతరం కేజీఎఫ్ 2 (రూ.164.2 కోట్లు), ఆదిపురుష్ (రూ.136.8 కోట్లు), సాహో (రూ.125.6 కోట్లు) ఉన్నాయి.(ఇదీ చదవండి: 'దేవర' పార్ట్ 2లో స్టోరీ ఏం ఉండొచ్చు?)తెలుగు రాష్ట్రాల్లోనూఇక తెలుగు రాష్ట్రాల్లోనూ తొలిరోజు వసూళ్లలో 'దేవర' సరికొత్త రికార్డ్ సెట్ చేసిందనే చెప్పాలి. రాజమౌళి 'ఆర్ఆర్ఆర్' రూ.74.11 కోట్లు సాధించగా.. ఇప్పుడు 'దేవర' రూ.54.21 కోట్ల షేర్‌తో రెండో స్థానంలోకి వచ్చింది. అంతకు ముందు ప్రభాస్ సలార్ రూ.50.49 కోట్లతో ఈ ప్లేసులో ఉండేది. ఈ లెక్కన చూసుకుంటే టాప్-2లోని రెండు మూవీస్ కూడా తారక్వే కావడం విశేషం.ప్రభాస్ తర్వాత ఎన్టీఆరే?ప్రస్తుత పరిస్థితులు చూసుకుంటే పాన్ ఇండియా రేంజులో ప్రభాస్ తర్వాత సిసలైన స్టార్ ఎన్టీఆరే అనిపిస్తున్నాడు. ఎందుకంటే సోలో హీరోగా తొలిరోజే రూ.172 కోట్ల కలెక్షన్ రాబట్టడం అంటే సాధారణమైన విషయం కాదు. ప్రస్తుతానికి తారక్ ఉన్నప్పటికీ 'పుష్ప 2', 'గేమ్ ఛేంజర్' తదితర చిత్రాలు రిలీజైతే లెక్కలు మారే ఛాన్సులు ఉంటాయి. (ఇదీ చదవండి: 'దేవర'తో రాజమౌళి సెంటిమెంట్ బ్రేక్ అయిందా?) -
'ఆర్ఆర్ఆర్' రికార్డ్ కూడా బ్రేక్ చేసిన 'కల్కి'
ప్రభాస్ 'కల్కి' ప్రస్తుతం నాలుగో వారంలో ఉంది. అయితేనేం ఇప్పటికీ మోస్తరు వసూళ్లు సాధిస్తోంది. కొత్త సినిమాలు రిలీజైనప్పటికీ.. అవి హిట్ కాకపోవడం దీనికి ప్లస్ అయింది. ఈ క్రమంలోనే రెండేళ్ల క్రితం 'ఆర్ఆర్ఆర్' సాధించిన ఓ రికార్డుని ఇప్పుడు 'కల్కి' బ్రేక్ చేసింది. ఇంతకీ ఆ ఘనత ఏంటి?(ఇదీ చదవండి: 41 ఏళ్ల డైరెక్టర్‌తో 28 ఏళ్ల హీరోయిన్ పెళ్లి.. వీళ్లు ఎవరంటే?)రిలీజ్ ముందు వరకు 'కల్కి'పై ఓ మాదిరి అంచనాలు మాత్రమే ఉన్నాయి. కానీ ఒక్కసారి థియేటర్లలోకి వచ్చిన తర్వాత హిట్ టాక్ సొంతం చేసుకుంది. మరీ ముఖ్యంగా మహాభారతం ఎపిసోడ్స్ కోసం రిపీట్స్‌లో చూస్తున్నారు. తెలుగులో కలెక్షన్ కాస్త డౌన్ అయినప్పటికీ హిందీలో ఇంకా రన్ కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో కేవలం హిందీలోనే నాలుగు వారాల్లో రూ.275.9 కోట్లు వచ్చాయి. దీంతో ఇప్పటివరకు 'ఆర్ఆర్ఆర్' హిందీలో సాధించిన రూ.272 కోట్ల రికార్డ్ బ్రేక్ అయింది.ఇకపోతే హిందీలో అత్యధిక వసూళ్లు సాధించిన డబ్బింగ్ సినిమాల జాబితాలో 'బాహుబలి 2', 'కేజీఎఫ్ 2' తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. వీటికి బాలీవుడ్లో వరసగా రూ.511, రూ.435 కోట్లు వచ్చాయి! ఇదిలా ఉండగా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్ల క్రాస్ చేసిన 'కల్కి'.. మొత్తం పూర్తయ్యేసరికి ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందనేది చూడాలి.(ఇదీ చదవండి: విడాకులు తీసుకున్నా.. కానీ హ్యాపీగానే ఉన్నా: స్టార్ హీరో భార్య) -
'కల్కి' రికార్డుల పరంపర.. నైజాం, ఓవర్సీస్లో తగ్గేదే లే
ప్రభాస్ 'కల్కి' థియేటర్లలోకి వచ్చి వారం దాటిపోయింది. ఓవరాల్‌గా హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతానికైతే రూ.800 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు తెలుస్తున్నాయి. మరోవైపు ఈ సినిమా వల్ల అక్కడా ఇక్కడా అనే తేడా లేకుండా రికార్డులు బద్ధలవుతున్నాయి. తాజాగా ప్రభాస్ ఖాతాలో మరికొన్ని రికార్డులు చేరడం విశేషం.(ఇదీ చదవండి: డైరెక్టర్ రాజమౌళి జీవితంపై సినిమా.. ఓటీటీలో నేరుగా రిలీజ్)ఈ సినిమాకు మన దగ్గర కంటే ఓవర్సీస్లో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఎందుకంటే మిగతా హీరోలు ఒకటి లేదా రెండు మిలియన్ డాలర్ల మార్క్ అందుకోవడమే కష్టంగా మారుతుంటే.. 'కల్కి'తో ప్రభాస్ ప్రస్తుతం 14.5 మిలియన్ డాలర్ల మార్క్ అందుకున్నాడు. ఇప్పటివరకు ఆర్ఆర్ఆర్ రెండో స్థానంలో 14.3 మిలియన్ డాలర్స్‌తో ఉండగా ఇప్పుడు దీన్ని 'కల్కి' అధిగమించేసింది.మరోవైపు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ.242 కోట్ల మేర గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఒక్క నైజాంలోనే ఏకంగా రూ.100 కోట్లని 'కల్కి' సాధించినట్లు టాక్. తమిళనాడులో రూ.24 కోట్లు, బాలీవుడ్లో రూ.164 కోట్లు, కర్ణాటక-తమిళనాడులో వరసగా రూ.25 కోట్లు, రూ.24 కోట్లు సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఏదేమైనా తన గత చిత్రాల కలెక్షన్స్ రికార్డులని ప్రభాసే అధిగమిస్తుండటం విశేషం.(ఇదీ చదవండి: పొరపాట్లు ఒప్పుకొన్న 'కల్కి' డైరెక్టర్.. ఆ మూడు విషయాల్లో!) -
ప్రభాస్ 'కల్కి' రేర్ రికార్డ్.. ఇది కదా అసలైన మాస్ అంటే
డార్లింగ్ ప్రభాస్ మరో అరుదైన ఘనత సాధించాడు. 'కల్కి'తో ఇప్పటికే వరల్డ్ వైడ్ మరింతగా గుర్తింపుతో పాటు వసూళ్ల జోరు చూపిస్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా రూ.500 కోట్ల క్లబ్‌లోకి మరోసారి చేరిపోయాడు. 'బాహుబలి' నుంచి వరసగా ఈ మార్క్ చేరుకుంటున్నప్పటికీ.. ఇప్పుడు మాత్రం అదిరిపోయే రికార్డ్ తన పేరిట నమోదు చేసుకున్నాడు.(ఇదీ చదవండి: రామ్ చరణ్ ఇంట్లో సీక్రెట్‌గా ఉండేదాన్ని: మంచు లక్ష్మీ)'బాహుబలి'తో పాన్ ఇండియా స్టార్డమ్ సొంతం చేసుకున్న ప్రభాస్.. దీని తర్వాత బాహుబలి 2, సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్.. ఇలా వరస చిత్రాలతో వందల కోట్ల కలెక్షన్స్ సాధించాడు. కాకపోతే 'బాహుబలి 2' తప్పితే మిగిలినవన్నీ కూడా లాంగ్ రన్లో ఐదారు వందల కోట్లు మాత్రమే సొంతం చేసుకున్నాయి. 'కల్కి' మాత్రం తొలి వీకెండ్ పూర్తి కాకుండానే రూ.500 కోట్ల మార్క్ అధిగమించింది. రేర్ రికార్డ్ నమోదు చేసింది.ఆదివారం సాయంత్రం ఫస్ట్ షో పడేటప్పటికీ రూ.500 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చేసినట్లు తెలిసిపోయింది. మరోవైపు ఓవర్సీస్లోనూ వీకెండ్ పూర్తయ్యేసరికి 10.5 మిలియన్ డాలర్ల కలెక్షన్స్ సాధించింది. గతంలో 'బాహుబలి' మూవీ తొలి వారాంతంలో రూ.415 కోట్ల వసూళ్లు వచ్చాయి. ఇప్పుడు దీన్ని 'కల్కి' అధిగమించిందంటే.. లాంగ్ రన్లో రూ.1000 కోట్ల దాటడంతో పాటు సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయం అనిపిస్తోంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 24 మూవీస్.. ఆ నాలుగు స్పెషల్) -
'కల్కి' రెండో రోజు కలెక్షన్స్.. కాస్త తగ్గాయి కానీ!
బాక్సాఫీస్ దగ్గర 'కల్కి 2898' జోరు మామూలుగా లేదు. తొలిరోజే రూ.191 కోట్ల మేర గ్రాస్ వసూళ్లు సాధించిన ఈ సినిమా.. రెండో రోజు కూడా అదే జోరు చూపించింది. కాకపోతే కాస్త తగ్గుదల చూపించింది. త్రిబుల్ సెంచరీ కొద్దిలో మిస్ అయింది. ఈ మేరకు నిర్మాణ సంస్థ అధికారిక పోస్టర్ రిలీజ్ చేసింది.(ఇదీ చదవండి: 'కల్కి 2' షూటింగ్ 60% అయిపోయింది.. నిర్మాత కామెంట్స్)టాలీవుడ్లోనే భారీ బడ్జెట్‌తో తీసిన 'కల్కి'.. రెండు రోజుల క్రితం థియేటర్లలోకి వచ్చింది. పాజిటివ్ టాక్ తెచ్చుకుని దూసుకుపోతోంది. ఇప్పటికే ఓవర్సీస్లో 7 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇకపోతే ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు రూ.191.5 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాగా.. రెండో రోజు రూ.107 కోట్లు సొంతం చేసుకుంది.తద్వారా ప్రపంచవ్యాప్తంగా రెండు రోజుల్లో రూ.298.5 కోట్లు వచ్చినట్లు నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ పోస్టర్ రిలీజ్ చేసింది. దీని బట్టి చూస్తుంటే వీకెండ్ అయ్యేసరికి ఎంత? లాంగ్ రన్లో ఎంత కలెక్ట్ చేస్తుందోనని ఫ్యాన్స్ అప్పుడే లెక్కలు వేసేస్తున్నారు.(ఇదీ చదవండి: మహాభారతం గురించే డిస్కషన్.. ఇదంతా 'కల్కి' వల్లే) -
బాక్సాఫీస్ దగ్గర 'గం గం గణేశా'.. రెండు రోజుల వసూళ్లు ఎంతంటే?
ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'గం గం గణేశా'. చాన్నాళ్ల పాటు సరైన సినిమాలు లేకపోవడంతో థియేటర్లు బోసిపోయాయి. అలాంటి టైంలో అంటే రీసెంట్ శుక్రవారం ఏకంగా మూడు తెలుగు మూవీస్ రిలీజయ్యాయి. వీటిలో ఒకటే ఇది. రోజు రోజుకి మెరుగైన వసూళ్లు సాధిస్తున్న ఈ చిత్రం రెండు రోజుల్లో ఎన్ని కోట్లు దక్కించుకుంది? ప్రస్తుతం పరిస్థితి ఏంటి?(ఇదీ చదవండి: హీరో ఆత్మహత్య చేసుకున్న ఫ్లాట్‌లో హీరోయిన్ మకాం)'బేబి' మూవీతో గతేడాది హిట్ కొట్టిన ఆనంద్ దేవరకొండ.. ఇప్పుడు జానర్ మార్చి మరో మూవీతో ప్రేక్షకుల్ని పలకరించాడు. క్రైమ్ కామెడీతో తీసిన 'గం గం గణేశా' తొలిరోజు రూ.1.20 కోట్ల గ్రాస్ సొంతం చేసుకుంది. వీకెండ్ కావడంతో రెండో రోజు థియేటర్లకి జనాలు బాగానే వచ్చారు. తద్వారా రెండో రోజు రూ.1.50 కోట్లకి పైగా గ్రాస్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.ఈ లెక్కన ఓవరాల్‌గా చూసుకుంటే 'గం గం గణేశా' సినిమాకు రెండు రోజుల్లో రూ.2.60 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు దక్కినట్లు సమాచారం. మరి ఇంకా చాలానే రాబట్టాల్సి ఉంది. మరి సేఫ్ జోన్లోకి వెళ్తుందా లేదా అనేది మరో రెండు మూడు రోజుల్లో తెలిసిపోతుంది.(ఇదీ చదవండి: 'బేబి' హీరోయిన్ నుంచి త్వరలో గుడ్ న్యూస్?) -
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
అల్లరి నరేశ్ చాలారోజుల తర్వాత చేసిన కామెడీ సినిమా 'ఆ ఒక్కటి అడక్కు'. తండ్రి ఈవీవీ సత్యనారాయణ తీసిన మూవీ టైటిల్ కావడంతో ఈ చిత్రంపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లే రెండు రోజుల్లో కలెక్షన్స్ బాగానే వచ్చాయి. చెప్పాలంటే తొలిరోజు కంటే రెండో రోజు ఎక్కువగానే వసూళ్లు రావడం విశేషం.(ఇదీ చదవండి: సైబర్ మోసం.. తెలిసి మరీ లక్షలు పోగొట్టుకున్న నటుడి భార్య)అల్లరి నరేశ్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన సినిమా 'ఆ ఒక్కటి అడక్కు'. పెళ్లి కాని అబ్బాయిల్ని.. మ్యాట్రిమోనీ వాళ్లు ఎలా మోసం చేస్తున్నారనే కాన్సెప్ట్‌తో తీసిన ఈ చిత్రంలో కామెడీ కంటే సీరియస్‌నెస్ ఎక్కువైంది. దీంతో మిక్స్డ్ టాక్ వచ్చింది. అయినా సరే తొలిరోజు రూ.1.62 కోట్లు గ్రాస్ వచ్చినట్లు నిర్మాతలు ప్రకటించారు.ఇక రెండో రోజు శనివారం.. వీకెండ్ అడ్వాంటేజ్ కావడంతో బాగానే వసూళ్లు వచ్చాయి. ఓవరాల్‌గా రెండు రోజుల్లో రూ.3.34 కోట్ల గ్రాస్ సొంతం చేసుకున్నట్లు మరో పోస్టర్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం థియేటర్లలో చెప్పుకోదగ్గ సినిమాలేం కాబట్టి 'ఆ ఒక్కటి అడక్కు' చిత్రానికి వసూళ్లు పరంగా ఏమైనా ప్లస్ అవుతుందేమో అనేది చూడాలి.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హారర్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?)Silencing the hot summer with a COOL TREAT ❤️🔥#AaOkkatiAdakku collects 3.34CR Worldwide Gross in 2 days 🤘🏻And it’s DAY 2 >>> Day 1 of Laughter madness ❤️🔥https://t.co/zbg0yxIPZx#SummerFunBlockbusterAOA@allarinaresh @fariaabdullah2 #VennelaKishore @harshachemudu… pic.twitter.com/0wx0dSmR1C— Ramesh Bala (@rameshlaus) May 5, 2024 -
లాభాల్లోకి విశ్వక్సేన్ 'గామి'.. మొత్తం వసూళ్లు ఎన్ని కోట్లంటే?
శివరాత్రి కానుకగా థియేటర్లలోకి వచ్చిన 'గామి' సినిమా బాక్సాఫీస్ దగ్గర రచ్చ లేపుతోంది. వీకెండ్ అయ్యేసరికే లాభాల్లోకి వెళ్లిపోయింది. అలానే విశ్వక్ సేన్ గత చిత్రాలతో పోలిస్తే ఇది అద్భుతమైన వసూళ్లు సాధిస్తోంది. దాదాపు ఆరేళ్ల పాటు తీసిన ఈ సినిమాకు ప్రతిఫలం ఇప్పుడు వసూళ్ల రూపంలో కనిపిస్తోంది. తాజాగా వీకెండ్ అయ్యేసరికి అద్భుతమైన మార్క్ దాటేసింది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 24 సినిమాలు.. ఆ మూడు స్పెషల్) విద్యాధర్ కాగిత అనే యువ దర్శకుడు తీసిన తొలి సినిమా 'గామి'. క్రౌడ్ ఫండింగ్‌తో మొదలై, ఆగుతూ ఆగుతూ ఈ చిత్రాన్ని ఆరేళ్ల పాటు తీశారు. అన్ని అడ్డంకుల్ని క్లియర్ చేసుకుని తాజాగా మార్చి 8న థియేటర్లలోకి వదిలారు. ట్రైలర్‌తోనే అంచనాలు పెంచిన ఈ చిత్రం.. తొలిరోజు రూ.9 కోట్లు, రెండు రోజు రూ.6 కోట్లు, మూడు రోజు రూ.5 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అంటే మూడు రోజుల్లో రూ.20.3 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు స్వయంగా నిర్మాతలే పోస్టర్ రిలీజ్ చేశారు. ప్రయోగాత్మక కథతో తీసిన 'గామి' చిత్రానికి మూడు రోజుల్లో ఈ రేంజులో కలెక్షన్స్ రావడం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఈ వారం కూడా పెద్దగా చెప్పుకోదగ్గ చిత్రాలేం థియేటర్లలోకి రావట్లేదు కాబట్టి ఈ మూవీ మరిన్ని కోట్లు రాబట్టుకోవడం గ్యారంటీ. వీకెండ్ అయ్యేసరికే దాదాపు అన్నిచోట్ల లాభాల్లోకి వెళ్లిపోయిన 'గామి'.. ఓవర్సీస్లో మంచి నంబర్స్ నమోదు చేస్తోంది. లాంగ్ రన్లో మిలియన్ డాలర్స్ మార్క్ అందుకున్న ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. (ఇదీ చదవండి: ఆస్కార్-2024 విజేతల పూర్తి జాబితా.. ఆ సినిమాకు ఏకంగా ఏడు అవార్డ్స్) MASSIVE FIRST WEEKEND for #Gaami at the Box Office ❤🔥 Collects 20.3 CRORE+ Gross Worldwide in 3 days & ATTAINS PROFITS in all territories 🔥 Book your tickets now for the 𝗧𝗛𝗘 𝗕𝗥𝗘𝗔𝗧𝗛𝗧𝗔𝗞𝗜𝗡𝗚 𝗘𝗣𝗜𝗖 𝗙𝗥𝗢𝗠 𝗧𝗘𝗟𝗨𝗚𝗨 𝗖𝗜𝗡𝗘𝗠𝗔 💥 🎟️… pic.twitter.com/6SIBx8VTCb — V celluloid (@vcelluloidsoffl) March 11, 2024 -
టాక్ ఏమో అలా.. 'భైరవకోన' కలెక్షన్స్ మాత్రం కళ్లు చెదిరేలా!
ప్రస్తుతం థియేటర్లలో పెద్ద సినిమాలేం లేవు. ఈ శుక్రవారం రిలీజైన 'ఊరిపేరు భైరవకోన' చిత్రానికి తొలుత యావరేజ్ టాక్ వచ్చింది. దీంతో వసూళ్లు ఏముంటాయిలే అని అందరూ అనుకున్నారు. కానీ టాక్‌తో సంబంధం లేకుండా కళ్లు చెదిరే కలెక్షన్స్ వస్తున్నాయి. ఈ మూవీకి వస్తున్న వసూళ్లు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ రెండు రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయో తెలుసా? (ఇదీ చదవండి: అందుకే ఇంత లావయ్యాను.. చిన్నప్పుడు ఆ భయం ఉండేది: వైవా హర్ష) తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతికి దాదాపు నాలుగు సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. వీటిలో 'హనుమాన్' హిట్ టాక్‌తోపాటు రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించగా.. 'గుంటూరు కారం', 'నా సామి రంగ' పాసైపోయాయి. 'సైంధవ్'కి పెద్ద దెబ్బ పడింది. గతవారం రవితేజ 'ఈగల్' వచ్చింది కానీ రెండు మూడు రోజుల్లోనే సైలెంట్ అయిపోయింది. ఈ శుక్రవారం థియేటర్లలోకి వచ్చిన 'ఊరిపేరు భైరవకోన' చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. దీంతో కలెక్షన్స్ పెద్దగా ఏం ఉండవులే అని అందరూ అనుకున్నారు. కానీ తొలిరోజు రూ.6.03 కోట్లు రాగా.. రెండో రోజు ఏకంగా రూ 7 కోట్లు వరకు వచ్చాయి. తద్వారా రెండు రోజుల్లో రూ.13.10 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు పోస్టర్ రిలీజ్ చేశారు. వీకెండ్ వరకు ఈ జోష్ కొనసాగేలా ఉంది. సోమవారం నుంచి ఏం జరుగుతుందనేది మాత్రం చూడాలి. (ఇదీ చదవండి: మెగా హీరో మూవీకి చిక్కులు.. షూటింగ్‌కి ముందే నోటీసులు) The magic of #OoruPeruBhairavakona is spreading at the worldwide box office❤️🔥 Grosses1️⃣3️⃣.1️⃣0️⃣Cr in 2 Days 🔥 Enjoy this Sunday at the cinemas with the Magical Entertainer ❤️ - https://t.co/OV3enwDhNJ@sundeepkishan’s much-anticipated, A @Dir_Vi_Anand Fantasy… pic.twitter.com/0M2IekIiud — AK Entertainments (@AKentsOfficial) February 18, 2024 -
హనుమాన్ 250 కోట్ల క్లబ్ లోకి వెళ్తుందా..?
-
హనుమాన్ తో హిట్. ప్రశాంత్ వర్మ కు షాక్!
-
బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న హనుమాన్
-
భారీ వసూళ్లు సాధిస్తున్న హనుమాన్
-
హనుమాన్, గుంటూరు కారం లెక్క ఎంత..?
-
రూ.100 కోట్ల వసూళ్లు దాటేసిన 'హనుమాన్'.. ఆ విషయమైతే చాలా స్పెషల్
చిన్న సినిమా అన్నారు. అలానే న్యాయం జరుగుతుందని చెప్పారు. దీనికి తోడు సరిపడా థియేటర్లు దొరకలేదు. అయితేనేం 'హనుమాన్' చిత్రబృందం అనుకున్నది సాధించింది. ఎవరూ ఊహించని విధింగా కలెక్షన్స్‌లో సరికొత్త రికార్డులు సృష్టిస్తూ దూసుకుపోతోంది. తాజాగా సినిమా రూ.100 కోట్ల గ్రాస్ మార్క్ దాటేసినట్లు ప్రకటించారు. ఈ క్రమంలోనే సినిమా పలు రికార్డులు క్రియేట్ చేయడం విశేషం. తేజసజ్జా-ప్రశాంత్ వర్మ కాంబోలో తీసిన 'హనుమాన్'.. సూపర్ హీరో కాన్సెప్ట్‌తో తీశారు. అయితే సంక్రాంతి బరిలో గుంటూరు కారం, సైంధవ్, నా సామి రంగ లాంటి స్టార్ హీరోల సినిమాలు ఉండటంతో తొలుత తప్పుకోమని సలహాలు ఇచ్చారు. కానీ కంటెంట్ మీద నమ్మకంతో బలంగా నిలబడ్డారు. థియేటర్లు సరిపడా ఇవ్వకపోయినా సరే హిట్ కొట్టి తీరతామని నమ్మారు. ఇప్పుడు దానికి తగ్గ ప్రతిఫలం దక్కిందని చెప్పొచ్చు. (ఇదీ చదవండి: సంక్రాంతి సినిమాల సందడి.. ఏది హిట్? కలెక్షన్స్ ఎంత?) కేవలం రూ.55 కోట్లతో తీసిన 'హనుమాన్' సినిమాకు.. జస్ట్ నాలుగు రోజుల్లోనే రూ.100 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. బెన్ఫిట్ షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రానికి దక్షిణాదిలో ఓ మాదిరి వసూళ్లు వచ్చినప్పటికీ నార్త్, ఓవర్సీస్లో అద్భుతమైన కలెక్షన్స్ వస్తున్నాయి. బాక్సాఫీస్ దగ్గర నిలకడగా సరాసరి రూ.25 కోట్ల వరకు సాధిస్తూ వెళ్తున్న ఈ చిత్రం.. రూ.100 కోట్ల మార్క్ దాటేయడం మామూలు విషయం కాదు. అలానే నార్త్ అమెరికాలోనూ 3 మిలియన్ డాలర్లు సాధించి... ఓవర్సీస్లో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్-10 చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఇది మాత్రం 'హనుమాన్' టీమ్‌కి చాలా అంటే చాలా స్పెషల్ అని చెప్పొచ్చు. ఇక నాలుగు రోజుల్లో ఈ రేంజు వసూళ్లు వచ్చాయంటే.. లాంగ్ రన్లో రూ.300-400 కోట్లు వచ్చినా సరే ఆశ్చర్యపోనక్కర్లేదు. (ఇదీ చదవండి: పెళ్లి చేసుకోబోతున్న హీరోయిన్ సాయిపల్లవి చెల్లి.. కుర్రాడు ఎవరంటే?) small film - BIG JUSTICE from the audience ❤️ The Humongous Roar of #HANUMAN Resounded at the Box-Office 💪 1️⃣0️⃣0️⃣ 𝐂𝐑𝐎𝐑𝐄𝐒 𝐖𝐎𝐑𝐋𝐃𝐖𝐈𝐃𝐄 in just 4 days ᴡɪᴛʜ ʟɪᴍɪᴛᴇᴅ ꜱᴄʀᴇᴇɴꜱ & ᴍɪɴɪᴍᴀʟ ᴛɪᴄᴋᴇᴛ ᴘʀɪᴄᴇꜱ 💥#HanuManCreatesHistory -… pic.twitter.com/4LNGkhYz8f — Mythri Movie Makers (@MythriOfficial) January 16, 2024 -
రెండో రోజుకే భారీగా తగ్గిపోయిన 'గుంటూరు కారం' కలెక్షన్స్
సూపర్‌స్టార్ మహేశ్‌బాబు 'గుంటూరు కారం' సినిమా బాక్సాఫీస్ దగ్గర తడబడుతోంది. తొలిరోజే ఆహా అనే రేంజులో కలెక్షన్స్ రాగా.. రెండో రోజుకి భారీగా డ్రాప్ కనిపించింది. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. అలానే రాబోయే రోజుల్లో మరింతగా తగ్గే అవకాశాలు గట్టిగా కనిపిస్తున్నాయి. ఇంతకీ ఈ చిత్రానికి ఇలా జరగడానికి కారణాలేంటి? రెండో రోజుల్లో మహేశ్ మూవీ ఎంత కలెక్ట్ చేసిందనేది ఇప్పుడు చూద్దాం. మహేశ్-త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన మూడో సినిమా 'గుంటూరు కారం'. ఈ ప్రాజెక్ట్ ప్రకటించినప్పుడు చాలా అంచనాలు ఏర్పడ్డాయి. కానీ షూటింగ్ వాయిదా పడటం, హీరోయిన్ పూజాహెగ్డే, సినిమాటోగ్రాఫర్ తప్పుకోవడం లాంటివి అభిమానులకు సందేహాలు రేకెత్తించాయి. అయినా సరే త్రివిక్రమ్ మీద అందరూ నమ్మకం పెట్టుకున్నారు. కానీ తాజాగా రిలీజైన ఈ సినిమాకు మొట్టమొదటి షో నుంచే మిక్స్డ్ రివ్యూలు వచ్చాయి. దీంతో ప్రేక్షకుల ముందువెనక అయ్యారు. (ఇదీ చదవండి: సంక్రాంతి మూవీస్.. ఈమె నటిస్తే హిట్ కొట్టడం గ్యారంటీనా?) అయితే అడ్వాన్స్ బుకింగ్స్ వల్ల 'గుంటూరు కారం' సినిమాకు తొలిరోజు ఏకంగా రూ 94 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు నిర్మాతలే ప్రకటించారు. రెండో రోజుకి వచ్చేసరికి రూ.127 కోట్ల వసూళ్లు వచ్చినట్లు పోస్టర్ రిలీజ్ చేశారు. అంటే రెండో రోజు కేవలం రూ 33 కోట్ల వచ్చినట్లే అనమాట. అంటే ఫస్ట్ డే వచ్చిన మొత్తంతో పోలిస్తే ఇది మూడో వంతు. 'గుంటూరు కారం' కలెక్షన్స్ తగ్గడానికి కారణాలు చూసుకుంటే.. దీనితోపాటే రిలీజైన 'హను-మాన్' హిట్ టాక్ తెచ్చుకోవడం, అలానే 'సైంధవ్', 'నా సామి రంగ' సినిమాలతో థియేటర్ల పంచుకోవడం కూడా వసూళ్ల తగ్గుదలకు కారణాలుగా కనిపిస్తున్నాయి. దీనికి తోడు కథలోనూ కొత్తదనం లేకపోవడం మహేశ్ సినిమాకి దెబ్బేసినట్లు అభిమానులు మాట్లాడుకుంటున్నారు. సో అదన్నమాట విషయం. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేస్తున్న ఆ తెలుగు సినిమా.. స్ట్రీమింగ్ అప్పుడే) రమణగాడి 𝗦𝗨𝗣𝗘𝗥 𝗦𝗔𝗡𝗞𝗥𝗔𝗡𝗧𝗛𝗜 𝗕𝗟𝗢𝗖𝗞𝗕𝗨𝗦𝗧𝗘𝗥 💥#GunturKaaram grosses over 𝟏𝟐𝟕 𝐂𝐑 𝐆𝐫𝐨𝐬𝐬 in 2 Days Worldwide 🔥 ఈ భోగికి మీలో ఉన్న Egos & Haterd కాల్చేస్తారు అని ఆశిస్తూ, మీ అందరికి భోగి శుభాకాంక్షలు ✨ Watch the #BlockbusterGunturKaaram at cinemas… pic.twitter.com/1OvKeHnM36 — Haarika & Hassine Creations (@haarikahassine) January 14, 2024 -
1000 కోట్ల హీరోయిన్..!
-
గుంటూరు కారం మూవీ మార్నింగ్ షో కలెక్షన్...!
-
అక్కడ 'సలార్'ని మించి కలెక్షన్స్ సాధిస్తున్న చిన్న సినిమా!
డార్లింగ్ ప్రభాస్ 'సలార్' సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ సాధిస్తోంది. ప్రస్తుతం రూ.600 కోట్లకు చేరువలో ఉన్న ఈ చిత్రం.. లాంగ్ రన్లో మరో రూ.100 కోట్లు దక్కించుకునే అవకాశం గట్టిగా కనిపిస్తుంది. అయితే ఓ చోట మాత్రం 'సలార్' కంటే ఓ ప్రాంతీయ సినిమా ఎక్కువ కలెక్షన్స్ సాధించింది. ఇప్పుడీ విషయం హాట్ టాపిక్‌గా మారిపోయింది. 'సలార్' సినిమాని తీసింది డైరెక్టర్ ప్రశాంత్ నీల్. 'కేజీఎఫ్' సినిమాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఇతడు.. ప్రభాస్‌తో మాస్ సినిమా తీశాడు. అయితే ఇది 2014లో తన తీసిన ఫస్ట్ మూవీ 'ఉగ్రమ్'కి రీమేక్ అని సరిగ్గా రిలీజ్‌కి ఓ రోజు ముందు చెప్పాడు. మిగతా భాషా ప్రేక్షకులు 'ఉగ్రమ్' చూడలేదు కానీ కన్నడ ఆడియెన్స్ చాలాసార్లు చూసేశారు. (ఇదీ చదవండి: 'మంగళవారం' హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ ఇంట్లో విషాదం) ఈ క్రమంలోనే కర్ణాటకలో 'సలార్' వసూళ్లు ఓ మాదిరిగానే వచ్చాయి. ఇప్పటివరకు రూ.35.7 కోట్ల కలెక్షన్స్ మాత్రమే సాధించినట్లు తెలుస్తోంది. అదే టైంలో రీసెంట్గా డిసెంబరు 29న కన్నడ స్టార్ హీరో దర్శన్ 'కాటేరా' రిలీజైంది. విలేజ్ బ్యాక్‌డ్రాప్ స్టోరీతో తీసిన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో రెండు రోజుల్లోనే రూ.37 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. మిగతా చోట్ల 'సలార్' వసూళ్ల మేనియా గట్టిగా ఉన్నప్పటికీ కన్నడలో మాత్రం పెద్దగా ఎఫెక్ట్ చూపించలేకపోయింది. ఈ కారణంగానే 'కాటేరా'కు ప్లస్ అయింది. అలా కాకుంటే మాత్రం ప్రభాస్ సినిమా ముందు దర్శన్ అస్సలు నిలబడలేకపోయేవాడు. (ఇదీ చదవండి: 'గుంటూరు కారం' పాట.. కుర్చీ తాతకి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?) -
'సలార్' వీకెండ్ కలెక్షన్స్.. ఏకంగా రూ.400 కోట్ల దాటేసి..!
డైనోసర్ దెబ్బకు బాక్సాఫీస్ కుదేలైపోతోంది. 'సలార్' వసూళ్ల సునామీ దెబ్బ గట్టిగానే తగిలింది. డార్లింగ్ ప్రభాస్ అయితే చాలారోజుల తర్వాత రచ్చరచ్చ చేస్తున్నాడు. ఇంతలా ఎందుకు చెబుతున్నామంటే.. 'సలార్' మూవీకి వీకెండ్లో అదిరిపోయే కలెక్షన్స్ వచ్చాయి. ఏకంగా రూ.400 కోట్ల మార్క్ కూడా క్రాస్ చేసిపడేసింది. ఇంతకీ ఓవరాల్ వసూళ్లు ఎంత? (ఇదీ చదవండి: 'సలార్' మేకింగ్ వీడియో.. ఆ సీన్స్ ఇలా తీశారా?) ప్రభాస్ కటౌట్‌కి తగ్గ మాస్ సినిమా పడి చాన్నాళ్లయిపోయింది. 'బాహుబలి' తర్వాత పాన్ ఇండియా స్టార్ అయినప్పటికీ.. 'సాహో', 'రాధేశ్యామ్', 'ఆదిపురుష్'.. అనుకున్నంత రేంజులో ఆకట్టుకోలేకపోయాయి. ఇప్పుడు అవన్నీ మర్చిపోయేలా 'సలార్' చేస్తోంది. ఇప్పటికే పాజిటివ్ టాక్ తెచ్చుకోగా.. అందుకు తగ్గట్లే కలెక్షన్స్ కూడా దుమ్మురేపుతున్నాయి. తొలిరోజు రూ.178.7 కోట్లు రాగా.. రెండో రోజుకి ఇది రూ.295.7 కోట్లు అయ్యాయి. మూడు రోజులు పూర్తయ్యేసరికి రూ.402 కోట్లు వచ్చినట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఫస్ట్ వీకెండ్లోనే 400 కోట్ల మార్క్ దాటిపోయిందంటే.. రెండో వీకెండ్ అయ్యేసరికి రూ.1000 కోట్ల మార్క్ క్రాస్ కావడం గ్యారంటీ అనిపిస్తుంది. (ఇదీ చదవండి: Bigg Boss 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ షాకింగ్ డెసిషన్.. వాళ్లపై రివేంజ్!?) 𝑩𝑶𝑿 𝑶𝑭𝑭𝑰𝑪𝑬 𝑲𝑨 𝑺𝑨𝑳𝑨𝑨𝑹 🔥#BlockbusterSalaar hits 𝟒𝟎𝟐 𝐂𝐑𝐎𝐑𝐄𝐒 𝐆𝐁𝐎𝐂 (worldwide) 𝐢𝐧 𝟑 𝐃𝐚𝐲𝐬!#RecordBreakingSalaar #SalaarRulingBoxOffice#Salaar #SalaarCeaseFire #Prabhas #PrashanthNeel @PrithviOfficial @shrutihaasan @VKiragandur @hombalefilms… pic.twitter.com/C8rFGeSs86 — Salaar (@SalaarTheSaga) December 25, 2023 -
'సలార్' కలెక్షన్స్ రచ్చ.. రెండు రోజుల్లో ఏకంగా అన్ని కోట్లు
సలారోడు.. బాక్సాఫీస్‌ని ఊచకోత కోస్తున్నాడు. ప్రభాస్ దెబ్బకు ఫ్యాన్స్ మాస్ జపం చేస్తున్నారు. దీనికి తగ్గట్లే కలెక్షన్స్ దుమ్మురేపుతున్నాయి. అయితే తొలిరోజు వసూళ్లతో పలు రికార్డులు సెట్ చేసిన 'సలార్'.. రెండోరోజుకి కాస్త నెమ్మదించింది. ఇంతకీ రెండు రోజుల్లో ఈ సినిమాకు ఎన్ని డబ్బలు వచ్చాయి? అసలేం జరుగుతోంది? (ఇదీ చదవండి: ఓటీటీలోకి ఆ హిట్ మూవీ.. రెండు నెలల తర్వాత ఇప్పుడు స్ట్రీమింగ్) డార్లింగ్ ప్రభాస్ చాలా ఏళ్ల తర్వాత చేసిన మాస్ మూవీ 'సలార్'. పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న తర్వాత ప్రభాస్ నుంచి 'సాహో' లాంటి మాస్ చిత్రం వచ్చింది. కానీ ఎందుకో ఇది అభిమానుల్ని సంతృప్తి పరచలేకపోయింది. ఆ తర్వాత వచ్చిన 'రాధేశ్యామ్', 'ఆదిపురుష్' ఆడియెన్స్‌ని ఆకట్టుకోవడంలో ఫెయిలయ్యాయి. ఇప్పుడు వీళ్లందరినీ 'సలార్' ఫుల్ సాటిస్పై చేస్తోంది. అందుకు తగ్గట్లే కలెక్షన్స్ వస్తున్నాయి. టాక్‌తో సంబంధం లేకుండా తొలిరోజు రూ.178.7 కోట్లు వసూలు చేసిన సలార్.. రెండో రోజు పూర్తయ్యేసరికి 295.7 కోట్ల వసూళ్లు సాధించింది. అంటే తొలిరోజుతో పోలిస్తే శనివారం కలెక్షన్స్ కాస్త తగ్గాయి. సరిగా చెప్పాలంటే రెండో రోజు మాత్రం రూ.117 కోట్ల వరకు ప్రపంచవ్యాప్తంగా సొంతం చేసుకుంది. ఆదివారం కూడా 100 కోట్ల తగ్గకుండా వస్తాయి. వచ్చే వారం పెద్దగా చెప్పుకోదగ్గ మూవీస్ ఏం లేవు కాబట్టి త్వరలో రూ.1000 కోట్ల మార్క్ దాటేసినా పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. (ఇదీ చదవండి: 'సలార్' ఊరమాస్ కలెక్షన్స్.. కొద్దిలో మిస్ అయిన 'ఆర్ఆర్ఆర్' రికార్డ్!) 𝑻𝒉𝒆 𝑯𝒖𝒏𝒕𝒊𝒏𝒈 𝑺𝒆𝒂𝒔𝒐𝒏 𝑩𝒆𝒈𝒊𝒏𝒔…🔥💥#SalaarCeaseFire dominates the global-box office, crossing 𝟐𝟗𝟓.𝟕 𝐂𝐑𝐎𝐑𝐄𝐒 𝐆𝐁𝐎𝐂 (worldwide) 𝐢𝐧 𝟐 𝐃𝐚𝐲𝐬!#BlockbusterSalaar #RecordBreakingSalaar #SalaarRulingBoxOffice#Salaar #Prabhas #PrashanthNeel… pic.twitter.com/suEQftytyj — Salaar (@SalaarTheSaga) December 24, 2023 -
'సలార్' ఊరమాస్ కలెక్షన్స్.. కొద్దిలో మిస్ అయిన 'ఆర్ఆర్ఆర్' రికార్డ్!
డార్లింగ్ ప్రభాస్ అంటే ఏంటో మరోసారి ప్రూవ్ అయింది. 'బాహుబలి'తో పాన్ ఇండియా స్టార్‌గా ఎక్కడికో వెళ్లిపోయాడు. ఆ తర్వాత వచ్చిన 'సాహో', 'రాధేశ్యామ్', 'ఆదిపురుష్' చిత్రాలు ఇతడి రేంజుని మ్యాచ్ చేయలేకపోయాయి. అయితేనేం ఇప్పుడు వచ్చిన 'సలార్' వాటన్నింటి గురించి మర్చిపోయేలా చేస్తోంది. తొలిరోజే ఏకంగా రూ.178.7 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఈ ఏడాది హయస్ట్ ఓపెనర్‌గా నిలిచింది. కానీ ఓ రికార్డ్ మాత్రం కొద్దిలో మిస్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ 'సలార్' కోసం ఫ్యాన్స్ ఎప్పటినుంచో చాలా అంటే చాలా వెయిట్ చేస్తూ వచ్చారు. హీరో ప్రభాస్, మాస్ కథ, డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. దీనికి కారణాలు అయ్యిండొచ్చు. విడుదలకు కొన్నిరోజుల ముందు సినిమాపై అందరూ డౌట్ పడ్డారు. కానీ తాజాగా థియేటర్లలోకి వచ్చి హిట్ టాక్ తెచ్చుకున్న తర్వాత ఇప్పట్లో తగ్గేదేలే అన్నట్లు కనిపిస్తుంది. ఎందుకంటే సౌత్-నార్త్ అనే తేడా లేకుండా బాక్సాఫీస్ దగ్గర దుమ్ముదులిపేస్తోంది. (ఇదీ చదవండి: 'సలార్' మూవీకి రివ్యూ ఇచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి) అయితే నైజాంలో ఇప్పటికే పలు సినిమాలతో కింగ్ అనిపించుకున్న ప్రభాస్.. 'సలార్'తో మరోసారి దాన్ని నిరూపించుకున్నాడు. అయితే టాలీవుడ్ ట్రేడ్ సమాచారం ప్రకారం.. 'ఆర్ఆర్ఆర్' తొలిరోజు నైజాంలో రూ.23 కోట్ల 35 లక్షల కలెక్షన్ నమోదు చేయగా.. 'సలార్' రూ.22 కోట్ల 55 లక్షల దగ్గర వచ్చి ఆగిందట. అంటే కేవలం రూ.80 లక్షలు మాత్రమే తేడా. ఒకవేళ 'డంకీ', 'ఆక్వామెన్' లాంటి మూవీస్ ఏం లేకుండా 'సలార్' సోలోగా రిలీజై ఉంటే మాత్రం 'ఆర్ఆర్ఆర్'ని ప్రభాస్ ఈజీగా దాటేసేవాడు! ఇక 'సలార్'కి ఆల్రెడీ పాజిటివ్ టాక్ వచ్చేసింది. దీంతో శని-ఆదివారాలు కూడా చాలాచోట్ల షోలు హౌస్‌ఫుల్ అయిపోయాయి. అలానే పలుచోట్ల షోలు కూడా పెంచుతుండటం విశేషం. క్రిస్మస్ సెలవులు కూడా ఉండటం 'సలార్'కి చాలా ప్లస్ కానుంది. అదే టైంలో రూ.1000 కోట్ల మార్క్ కూడా కొన్నిరోజులు క్రాస్ చేసేయడం గ్యారంటీ. (ఇదీ చదవండి: సలార్ హిట్.. పవన్ కల్యాణ్‌ను ఆడుకుంటున్న నెటిజన్లు) The most violent man announced his arrival ⚠️#SalaarCeaseFire hits 𝟏𝟕𝟖.𝟕 𝐂𝐑𝐎𝐑𝐄𝐒 𝐆𝐁𝐎𝐂 (worldwide) on the opening day! 𝐓𝐡𝐞 𝐛𝐢𝐠𝐠𝐞𝐬𝐭 𝐨𝐩𝐞𝐧𝐢𝐧𝐠 𝐟𝐨𝐫 𝐚𝐧𝐲 𝐈𝐧𝐝𝐢𝐚𝐧 𝐅𝐢𝐥𝐦 𝐢𝐧 𝟐𝟎𝟐𝟑 💥#BlockbusterSalaar #RecordBreakingSalaar… pic.twitter.com/8FPzU8RB0I — Mythri Movie Makers (@MythriOfficial) December 23, 2023 -
తుస్సుమన్న కొత్త సినిమాలు.. తొలిరోజు కలెక్షన్స్ ఎంతంటే?
ప్రతివారంలానే ఈసారి కూడా కొత్త సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. కాకపోతే చెప్పుకోదగ్గ తెలుగు మూవీస్ లేకపోవడంతో డబ్బింగ్ చిత్రాలే ప్రేక్షకులకు దిక్కయ్యాయి. అలా తాజాగా కార్తీ 'జపాన్'తో పాటు 'జిగర్ తాండ డబుల్ ఎక్స్' అనే రెండు తమిళ డబ్బింగ్ సినిమాలు విడుదలయ్యాయి. వీటికి పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు. అందుకు తగ్గట్లే తొలిరోజు కలెక్షన్స్ కూడా దారుణంగా వచ్చినట్లు తెలుస్తోంది. (ఇదీ చదవండి: Japan Review: ‘జపాన్’ మూవీ రివ్యూ) 'ఆవారా', 'యుగానికొక్కడు'. 'ఖైదీ' లాంటి డిఫరెంట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన కార్తీ తాజాగా 'జపాన్' సినిమాతో వచ్చాడు. అయితే దొంగ-పోలీస్ కథతో తీసిన ఈ మూవీ ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంలో దారుణంగా ఫెయిలైంది. రివ్యూలు అన్ని అలానే వచ్చాయి. దీంతో తొలిరోజు ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రూ.కోటి మాత్రమే వచ్చిందట. తమిళంలో మాత్రం రూ.3.5 కోట్ల పైనే వసూళ్లు వచ్చినట్లు సమాచారం. అలా ఓవరాల్‌గా రూ.5 కోట్ల లోపే కలెక్షన్ వచ్చాయి. వీకెండ్ లో కాస్తోకూస్తో డబ్బులు వస్తాయి తప్పితే లాంగ్ రన్ లో నష్టాలు రావడం గ్యారంటీ! ఇకపోతే డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు తీసిన 'జిగర్తాండ డబుల్ ఎక్స్' మూవీ ఓ మాదిరి అంచనాలతో థియేటర్లలోకి వచ్చింది. ఇది కూడా 'జపాన్'లానే తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదు. లారెన్స్, ఎస్జే సూర్య యాక్టింగ్ బాగానే ఉన్నప్పటికీ కంటెంట్ ల్యాగ్ ఉండటం సినిమాకు మైనస్ అయినట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రానికి తొలిరోజు మొత్తంగా రూ.1.75 కోట్లు మాత్రమే వసూళ్లు దక్కినట్లు తెలుస్తోంది. ఇలా దీపావళి కానుకగా థియేటర్లలోకి వచ్చిన డబ్బింగ్ చిత్రాలు తుస్సుమనిపించాయి. (ఇదీ చదవండి: 'జిగర్ తండ డబుల్ ఎక్స్' మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?) -
Movie Tickets: రూ.99కే సినిమా టిక్కెట్లు!
జాతీయ సినిమా దినోత్సవం సందర్భంగా అక్టోబర్ 13, శుక్రవారం రోజున మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా రూ.99కే సినిమా టిక్కెట్లను అందిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఆఫ్ర్ కేవలం ఇండియా సినిమాలకే కాకుండా ది ఎక్సార్సిస్ట్:బిలీవర్, పాపెట్రోల్ వంటి హాలీవుడ్ సినిమాలకు కూడా వర్తిస్తుందని తెలిపారు. జవాన్, గదర్2, మిషన్ రాణిగంజ్ వంటి బాలీవుడ్ సినిమాలతో సహా అన్ని నేషనల్ మూవీస్‌కు రూ.99 టిక్కెట్ అందుబాటులో ఉంటుంది. షారుఖ్ ఖాన్, అజయ్ దేవగన్ వంటి స్టార్లు కూడా తమ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా కొత్త రూ.99 ఆఫర్‌ను ప్రచారం చేస్తున్నారు. #NationalCinemaDay par aap sab ke liye ek bahut khaas tohfaa, only for the love of cinema! Iss 13th October, jaiye aur dekhiye Jawan at just Rs. 99! Book your tickets now!https://t.co/fLEcPK9UQT Watch #Jawan in cinemas - in Hindi, Tamil & Telugu. pic.twitter.com/uS3LfpcTNb — Shah Rukh Khan (@iamsrk) October 12, 2023 సినిమా టిక్కెట్లను ఆన్లైన్ ప్లాట్ఫామ్ల్లో లేదా బాక్సాఫీస్ వద్ద కొనుగోలు చేయవచ్చు. అయితే ఆన్లైన్లో బుక్ చేసుకునే వారు మాత్రం సంబంధిత మల్టీప్లక్స్‌లు అందించే వెబ్సైట్ల్లోకి వెళ్లి ఫుడ్, బేవరేజెస్ వివరాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. గత ఏడాది జాతీయ సినిమా దినోత్సవం రోజున రికార్డు స్థాయిలో థియేటర్లో 6.5 మిలియన్ల అడ్మిషన్లు వచ్చాయి. ఈ సంవత్సరం 4000 స్క్రీన్లలో ఈ ఆఫర్ ఉండనుంది. పీవీఆర్ ఐనాక్స్, సినోపోలీస్, మిరాజ్, సిటీప్రైడ్, ఏషియన్, ముక్తా ఏ2, మూవీటైం, వేవ్, ఎం2కే, డెలైట్ వంటి మల్టీప్లెక్స్‌ల్లో ఈ ఆఫర్ వర్తిస్తుంది. This cheer right here is why we do what we do... Thank you fans for the full houses & full hearts filled with love. Nothing matters beyond YOU. HAPPY NATIONAL CINEMA DAY. pic.twitter.com/R7h5v6xKZa — Ajay Devgn (@ajaydevgn) October 13, 2023 -
'స్కంద' కలెక్షన్స్.. సగానికి సగం పడిపోయాయి!
యంగ్ హీరో రామ్-బోయపాటి కాంబోలో వచ్చిన సినిమా 'స్కంద'. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని.. బోయపాటి తనదైన శైలిలోనే తీశారు. రామ్ గెటప్స్‌తో పాటు తమనే నేపథ్య సంగీతం థియేటర్లని దడదడలాడిస్తోంది. మరోవైపు తొలిరోజు కళ్లుచెదిరే వసూళ్లు రాగా, రెండో రోజు సగానికి సగం పడిపోయాయి. తాజాగా పోస్టర్ రిలీజ్ చేయడంతో ఈ విషయం క్లారిటీ వచ్చేసింది. (ఇదీ చదవండి: 'బిగ్‌బాస్ 7' నుంచి హాట్ బ్యూటీ ఎలిమినేట్!) స్కంద సంగతేంటి? బోయపాటి సినిమాలంటే లాజిక్స్ వెతక్కూడదు. హీరోలు లార్జర్ దేన్ లైఫ్ పాత్రల్లో కనిపిస్తుంటారు. ఇందులో హీరో పాత్ర అంతకు మించే ఉంటుంది. మిగతా వాళ్లకు పెద్దగా కనెక్ట్ కాకపోవచ్చు గానీ మాస్ ఆడియెన్స్‌కి మాత్రం ఈ సినిమా నచ్చేస్తుంది. ఈ క్రమంలోనే తొలిరోజు రూ.18.2 కోట్ల గ్రాస్ సొంతం చేసుకుంది. రెండోరోజు వచ్చేసరికి సగానికి పైగా వసూళ్లు పడిపోయాయి. సగానికి సగం అంటే తొలిరోజు రూ.18.2 కోట్లు వసూలు కాగా, రెండో రోజు రూ.9.4 కోట్ల మేర గ్రాస్ వసూళ్లు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఓవరాల్‌గా రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.27.6 కోట్ల కలెక్షన్స్ సాధించింది. ఇందుకు సంబంధించిన పోస్టర్ ని అధికారికంగా రిలీజ్ చేశారు. అయితే వీకెండ్ అయ్యేసరికి 'స్కంద' ఎన్ని కోట్లు వసూలు చేస్తుందో చూడాలి? మరోవైపు 'స్కంద' మేకింగ్ వీడియోని కూడా తాజాగా రిలీజ్ చేశారు. (ఇదీ చదవండి: వరుణ్ తేజ్ బ్యాచిలర్ పార్టీ.. పెళ్లికి అంతా సెట్!) -
రజనీకాంత్ మరో రికార్డ్.. ఆ లిస్టులో ప్రభాస్‌తోపాటు
సూపర్‌స్టార్ రజనీకాంత్ పనైపోయిందన్నారు. సినిమాలు చేయడం ఆపేస్తే బెటర్ అన్నారు. కట్ చేస్తే 'జైలర్' బ్లాక్‌బస్టర్ అయింది. దెబ్బకు ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఉన్న రికార్డులన్నీ గల్లంతైపోతున్నాయి. ప్రస్తుతం రూ.500 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించిన ఈ సినిమాతో రజనీ మరో సరికొత్త రికార్డు సృష్టించారు. ప్రస్తుతం ఆ విషయం ఆలోవర్ ఇండియాలో హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఏంటి రికార్డ్? రజనీకాంత్ 'రోబో' సినిమా సంచలనం సృష్టించింది. దీనికి కొనసాగింపుగా వచ్చిన 'రోబో 2.0'.. కంటెంట్ పరంగా పెద్దగా ఆకట్టుకోలేదు గానీ వసూళ్లు మాత్రం రూ.500 కోట్లకు పైనే వచ్చాయి. దీని తర్వాత సూపర్‌స్టార్ పలు సినిమాలు చేస్తున్నప్పటికీ డబ్బులు సాధించలేకపోయాయి. మళ్లీ ఇన్నాళ్లకు 'జైలర్' వల్ల రజనీ మూవ రూ.500 కోట్ల మార్క్ క్రాస్ చేసింది. (ఇదీ చదవండి: హీరోయిన్ శ్రీదేవి చివరి కోరిక నెరవేర్చిన భర్త) ప్రభాస్ తర్వాత అయితే రజనీకాంత్ కంటే ముందు ఈ లిస్టులో ప్రభాస్ మాత్రమే ఉన్నాడు. 'బాహుబలి' రెండు పార్ట్లతో రూ.500 కోట్ల మార్క్ ని క్రాస్ చేశాడు. సౌత్ నుంచి ఇప్పటివరకు ఈ ఘనత సాధించింది ప్రభాస్ మాత్రమే. ఇప్పుడు రజనీకాంత్ కూడా చేరడం కొత్త జోష్ తీసుకొచ్చింది. ఏదేమైనా ఇక పనైపోయిందనుకునే టైంలో రజనీ కమ్‌బ్యాక్ ఇవ్వడం అంతటా చర్చనీయాంశంగా మారిపోయింది. కలెక్షన్స్ ఎంత? 'జైలర్' ప్రస్తుతం 10 రోజుల్లో రూ.560 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది. తమిళనాడులో ఇప్పటికే హైయస్ట్ గ్రాస్ సాధించిన మూవీగా నిలిచింది. ఇక తెలుగులో రూ.60 కోట్ల మార్క్ దాటేసిన ఈ చిత్రం.. యూఎస్‌లోనూ 5 మిలియన్ల కలెక్షన్స్ క్రాస్ అయిపోయింది. కన్నడ, మలయాళంలోనూ మంచి నంబర్స్ నమోదు చేయడం విశేషం. లాంగ్ రన్లో ఎన్ని కోట్లు సాధిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. (ఇదీ చదవండి: 'రీ-రిలీజ్' ట్రెండ్.. ప్లస్‌ల కంటే మైనస్‌లే ఎక్కువ!) -
'జైలర్' కలెక్షన్స్.. రజనీ దెబ్బకు 'విక్రమ్' రికార్డ్ బ్రేక్
సూపర్‌స్టార్ రజనీకాంత్ సినిమాకు బ్లాక్‌బస్టర్ టాక్ రావడం చూసి చాలా ఏళ్లయిపోయింది. 'రోబో' తర్వాత సినిమాలు చేస్తున్నారు. డబ్బులు ఓ మాదిరిగా వస్తున్నాయి. తాజాగా రిలీజైన 'జైలర్' మాత్రం ఇంతకు ముందెన్నడూ లేనంతగా బాక్సాఫీస్ దగ్గర రచ్చ రంభోలా చేస్తోంది. రజనీ దెబ్బకు ఇప్పటివరకు ఉన్న రికార్డులన్నీ గల్లంతవుతున్నాయి. అన్ని కోట్ల వసూళ్లు ఆగస్టు 10న ప్రపంచవ్యాప్తంగా రిలీజైన జైలర్ సినిమాకు తొలిరోజు మిక్స్ డ్ టాక్ వచ్చినప్పటికీ.. రెండోరోజు నుంచి మాత్రం తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లో హిట్ టాక్ వినిపించింది. మరోవైపు 'భోళా శంకర్' అంతగా ఆకట్టుకోలేకపోవడం రజనీ మూవీకి ఓ రేంజులో కలిసొచ్చింది. ఫలితంగా ఇప్పటివరకు అంటే ఆరు రోజుల్లో రూ.416 కోట్ల మేర గ్రాస్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో రూ.40 కోట్ల వరకు వచ్చాయట. (ఇదీ చదవండి: 'జైలర్' కోడలు.. సినిమాలో పద్ధతిగా బయట మాత్రం!) 'విక్రమ్' రికార్డ్ బ్రేక్ అయితే గతేడాది కమల్ హాసన్ 'విక్రమ్' మూవీ కమ్‌బ్యాక్ ఇచ్చారు. ఈ సినిమాకు లాంగ్ రన్ లో మొత్తంగా రూ.410 కోట్లు వచ్చాయి. కానీ రజనీ 'జైలర్' మాత్రం ఆ మార్క్ ని ఆరు రోజుల్లోనే దాటేయడం విశేషం. ఇప్పటివరకు తమిళ సినిమాలు సెట్ చేసిన రికార్ట్స్ బ్రేక్ చేసిన 'జైలర్'.. లాంగ్ రన్ లో ఎన్ని వందల కోట్లు వసూలు చేస్తుందనేది చూడాలి. 'జైలర్'కి అదే ప్లస్ రజనీకాంత్ నటించిన 'జైలర్' స్టోరీ కొత్తదేం కాదు. అయినాసరే రజనీ స్వాగ్, స్టైల్ తోపాటు అనిరుధ్ అందించిన పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాని ఎక్కడికో తీసుకెళ్లిపోయాయి. ఈ వీకెండ్ లో మరో పెద్ద మూవీ ఏదీ థియేటర్లలో లేకపోవడం.. ఇలా అన్ని అంశాలు 'జైలర్'కు కలిసొచ్చాయి. దీంతో బాక్సాఫీస్ దగ్గర దుమ్ములేచిపోతోంది. (ఇదీ చదవండి: Chiranjeevi : సర్జరీ @ ఢిల్లీ, వచ్చే వారం హైదరాబాద్ కు చిరంజీవి) -
ఒక్క వీకెండ్.. నాలుగు సినిమాలు.. రికార్డ్ కలెక్షన్స్!
పెద్ద సినిమాలు ఎప్పుడూ ఒకే టైంలో విడుదల చేయరు. ఎందుకంటే థియేటర్ల సమస్య, కలెక్షన్స్ తగ్గుదల లాంటివి వస్తాయని దర్శకనిర్మాతలు భయపడుతుంటారు. అయితే గత వీకెండ్ మాత్రం ఏకంగా నాలుగు పెద్ద సినిమాలు రిలీజయ్యాయి. వీటి రిజల్ట్ ఏంటనేది పక్కనబెడితే వసూళ్లలో మాత్రం సరికొత్త రికార్డు సృష్టించాయి. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఏంటా రికార్డ్? గత వారం రజినీకాంత్ 'జైలర్', చిరు 'భోళా శంకర్', అక్షయ్ కుమార్ 'ఓ మై గాడ్ 2', సన్నీ డియోల్ 'గదర్ 2'. వీటిలో రజినీ, సన్నీ చిత్రాలకు హిట్ టాక్ రాగా.. అక్షయ్ మూవీకి మిక్స్డ్ టాక్, చిరు సినిమాకు ఫ్లాప్ టాక్ వచ్చింది. అయితేనేం వీకెండ్లో మాత్రం దుమ్ముదులిపే వసూళ్లు దక్కించుకున్నాయి. మొత్తంగా ఈ నాలుగు సినిమాలకు ఆగస్టు 11-13 మధ్య రూ.390 కోట్ల కలెక్షన్స్ వచ్చినట్లు ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. (ఇదీ చదవండి: హైపర్ ఆదితో పెళ్లి? క్లారిటీ ఇచ్చేసిన వర్షిణి!) దేశ సినీ చరిత్రలో ఓ వీకెండ్ ఇన్ని కోట్ల కలెక్షన్స్ రావడం ఇదే ఫస్ట్ టైమ్ అని ఓ నోట్ రిలీజ్ చేసింది. అలానే మూడు రోజుల్లో ఏకంగా 2.10 కోట్ల మంది థియేటర్లలోకి వచ్చారని పేర్కొంది. కరోనా తగ్గుదల తర్వాత థియేటర్లలో సినిమాలు చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తుండటం ఆనందంగా ఉందని ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా తెలిపింది. ఏయే సినిమాలకు ఎంత? ఈ నాలుగు సినిమాల్లో 'జైలర్' కలెక్షన్స్ ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం రూ.32 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిన రజినీ చిత్రం.. ఓవరాల్‌గా రూ.300 కోట్ల మార్క్ దాటేసినట్లు సమాచారం. మరోవైపు 'గదర్ 2' వీకెండ్ పూర్తయ్యేసరికి రూ.134 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. అలానే అక్షయ్ 'ఓ మై గాడ్ 2' చిత్రం రూ.50 కోట్ల మార్క్‌కి చేరువలో ఉంది. చిరు 'భోళా శంకర్'కు రూ.20 కోట్లు మాత్రమే వచ్చినట్లు తెలుస్తోంది. ఏదేమైనా గత వీకెండ్ సినీ ప్రియులకు వినోదం పంచింది. చాలారోజుల తర్వాత బాక్సాఫీస్ బద్దలైపోయేలా చేసింది. BIGGGEST NEWS… ⭐️ #Jailer ⭐️ #Gadar2 ⭐️ #OMG2 ⭐️ #BholaaShankar 🔥 COMBINED Gross BO of ₹ 390 cr+ 🔥 COMBINED Footfalls of 2.10 cr+ 🔥 ALL-TIME Theatrical Gross #BO record in 100+ year history Note: 11 - 13 Aug 2023 weekend Multiplex Association of India and Producers Guild… pic.twitter.com/kofNvtXNpc — taran adarsh (@taran_adarsh) August 14, 2023 (ఇదీ చదవండి: హీరో ప్రభాస్ కి సర్జరీ.. కారణం అదే!) -
ఒక్క వీకెండ్లో వేలకోట్ల కలెక్షన్స్.. ఏ మూవీకి ఎక్కువ?
వరల్డ్‌వైడ్ బాక్సాఫీస్ దగ్గర హాలీవుడ్ సినిమాల హవా నడుస్తోంది. గత శుక్రవారం థియేటర్లలోకి వచ్చిన 'ఓపెన్ హైమర్', 'బార్బీ' సునామీ కలెక్షన్లతో దూసుకుపోతున్నాయి. జస్ట్ ఒక్క వీకెండ్లో అంటే శుక్ర-శని-ఆదివారాలు కలిపి వేల కోట్ల వసూళ్లు సాధించాయి. ఈ విషయంలో రెండింటి మధ్య విపరీతమైన పోటీ నెలకొంది. మరి ఏ సినిమా టాప్‌లో నిలిచింది. హాలీవుడ్లో ఫాంటసీ కామెడీ సినిమాగా 'బార్బీ' విడుదలైంది. గ్రెటా గెర్విగ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 'బార్బీ ఫ్యాషన్ డాల్స్' పుస్తకం ఆధారంగా తీశారు. దాదాపు రూ.1200 కోట్ల బడ్జెట్ తో దీన్ని నిర్మించారు. తొలి వీకెండ్లోనే ఆ మొత్తాన్ని రాబట్టేసుకుంది. కేవలం మూడు రోజుల్లో 337 మిలియన్ డాలర్ల వసూళ్లు దక్కాయి. మన కరెన్సీ ప్రకారం రూ.2763 కోట్లు అనమాట. (ఇదీ చదవండి: విడాకుల రూమర్స్.. బుర్ఖాలో కనిపించిన కలర్స్ స్వాతి!) మరోవైపు అమెరికా న్యూక్లియర్ బాంబ్ తయారు చేయడంలో కీలక పాత్ర పోషించిన రాబర్ట్ ఓపెన్ హైమర్ జీవితం ఆధారంగా తీసిన సినిమా 'ఓపెన్ హైమర్'. ఫాదర్ ఆఫ్ న్యూక్లియర్ బాంబ్, హిస్టరీలో అతి ముఖ్యమైన సంఘటనకు పాలిటిక్స్ తో లింక్ చేస్తూ తెరకెక్కించిన ఈ మూవీకి క్రిస్టోఫర్ నోలన్ దర్శకుడు. 100 మిలియన్ డాలర్స్‌తో నిర్మిస్తే తొలి వీకెండే 174 మిలియన్ డాలర్స్ వసూలు చేసింది. మన కరెన్సీ ప్రకారం రూ.1426 కోట్లు అనమాట. ఈ రెండింటి కంటే రెండు వారాల ముందు అంటే జూలై 12న థియేటర్లలోకి వచ్చిన 'మిషన్ ఇంపాజిబుల్: డెడ్ రెకనింగ్'.. తొలి వీకెండ్ లో 235 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ సాధించింది. అంటే రూ.1931 కోట్లు. ఇలా ఈ మూడు చిత్రాలు దాదాపు ఆరు వేల కోట్ల వరకు వసూళ్లు సాధించినట్టే. అయితే భారత్‌లో 'ఓపెన్ హైమర్' హవా నడుస్తుండగా, మిగతా చోట్ల మాత్రం 'బార్బీ' టాప్‌లో ఉంది. ఓవరాల్‌గా చూసుకుంటే సినీ ప్రేక్షకులు యాక్షన్, డ్రామా కంటే 'బార్బీ'లో కామెడీకే పట్టం కట్టారు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్) -
కలెక్షన్స్‌లో 'బేబీ' ఆల్‌టైమ్ రికార్డ్!
ఏ మాత్రం అంచనాల్లేకుండా థియేటర్లలోకి వచ్చి కొన్ని సినిమాలు అద్భుతాలు చేస్తుంటాయి. కంటెంట్ బాగుండి, టైమ్ కలిసొచ్చి బ్లాక్‌బస్టర్ వసూళ్లు సాధిస్తుంటాయి. అలా ఈ మధ్య కాలంలో జనాలకు 'బేబీ' తెగ నచ్చేసింది. ఎంతలా అంటే థియేటర్లలోకి ఈ మూవీ వచ్చి 10 రోజులు అవుతున్నాసరే ఇంకా చాలాచోట్ల హౌస్‌ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ సినిమా ఆల్‌టైమ్ రికార్డ్ సృష్టించింది. (ఇదీ చదవండి: 'బేబీ' ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్) పెద్దగా ఫేమ్ లేని యువ నటీనటులతో తీసిన 'బేబీ'.. బాక్సాఫీస్ దగ్గర వండర్స్ క్రియేట్ చేస్తోంది. తొలిరోజు రూ.7.1 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ఈ చిత్రం.. పదో రోజు కూడా దాదాపు అదే టెంపో మెంటైన్ చేస్తోంది. ప్రస్తుత కాలంలో ఓ సినిమా వారంపాటు థియేటర్లలో ఆడటమే గగనమైపోయింది. అలాంటిది 'బేబీ' రచ్చ రచ్చ చేస్తోంది. దీంతో 10 రోజుల్లో 66.6 కోట్ల గ్రాస్ వసూలైంది. పోస్టర్ రిలీజ్ చేసి మరీ ఈ విషయాన్ని ప్రకటించారు. అయితే 'బేబీ' చిత్రానికి ఈ ఆదివారం రూ.3.40 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. మిడ్ రేంజ్ సినిమాల్లో 10వ రోజు బాక్సాఫీస్ దగ్గర అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ క్రమంలోనే మహేశ్ బాబు 'సరిలేరు నీకెవ్వరు', 'శ్రీమంతుడు', 'భరత్ అను నేను' చిత్రాలతో పాటు అల్లు అర్జున్ 'సరైనోడు' కలెక్షన్స్‌ని అధిగమించిందని స్వయంగా దర్శకుడు సాయి రాజేశ్ ఇన్ స్టాలో పోస్ట్ పెట్టారు. ఇప్పుడు ఈ విషయం వైరల్ అయిపోయింది. View this post on Instagram A post shared by Sai Rajesh (@sairazesh) (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్) -
నాలుగో రోజు కూడా ఈ రేంజ్ కలెక్షన్స్.. నిజంగా గ్రేట్!
Baby Movie Collection: కొన్నిసార్లు మనం అనుకోని సంఘటనలు జరుగుతుంటాయి. వాటినే అద్భుతాలు అంటారు. సినిమాల విషయంలోనూ అలాంటివి చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. 'బేబీ' సినిమా కలెక్షన్స్ చూస్తుంటే ఇప్పుడు అదే మాట గుర్తొస్తుంది. ఎందుకంటే 'ఆదిపురుష్' లాంటి సినిమాలో నాలుగో రోజుకి డీలా పడిపోయాయి. 'బేబీ' మాత్రం గుర్రంలా దూసుకెళ్తూ ట్రేడ్ వర్గాల్ని ఆశ్చర్యపరుస్తోంది. (ఇదీ చదవండి: రెండు వారాల్లోనే ఓటీటీలోకి సూపర్‌హిట్ సినిమా!) నాలుగో రోజు కూడా అసలు ఏ మాత్రం అంచనాల్లేకుండా విడుదలైన 'బేబీ' సినిమా యూత్‌కి తెగ కనెక్ట్ అయిపోయింది. సింగిల్, రిలేషన్షిప్ లో ఉన్నవాళ్లు.. ఇలా అందరూ ఈ చిత్రాన్ని చూసి ఎమోషనల్ అవుతున్నారు. వైష్ణవి పాత్రని తెగ తిట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే 'బేబీ' నాలుగురోజైనా వర్కింగ్ కూడా హౌస్‌ఫుల్స్‌తో కళకళలాడిపోయింది. ఫలితంగా సోమవారం ఒక్కరోజే రూ.7.5 కోట్ల గ్రాస్ వసూలైంది. కళ్లుచెదిరే లాభాల్లో మొత్తంగా చూసుకుంటే కేవలం నాలుగురోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.31 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయని దర్శకనిర్మాతలు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ని రిలీజ్ చేశారు. రెండో రోజుకే పెట్టుబడి తిరిగి తెచ్చేసుకున్న 'బేబీ'.. మూడోరోజుకి అన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ అయిపోయింది. ప్రస్తుతం బయ్యర్లు, ఎగ్జిబిటర్లు లాభాల్లో ఉన్నారు. ఈ శుక్రవారంలోపు రూ.50 కోట్ల మార్క్ ఈజీగా దాటేస్తుందని అంచనా. చూడాలి మరి ఏం జరుగుతుందో? 🙏🏻 em cheppaali …1st day kante working day roju ekkuva 🙏🏻 Dear telugu audience 🙏🏻 pic.twitter.com/GjkGjO9199 — Sai Rajesh (@sairazesh) July 18, 2023 (ఇదీ చదవండి: హీరోయిన్ వైష్ణవి పక్కన నటించిన ఈ 'బేబీ' గురించి తెలుసా?) -
'బేబీ' కలెక్షన్స్.. మూడో రోజుకే అన్ని కోట్ల లాభాలతో!
Baby Movie Collection: 'బేబీ' అస్సలు తగ్గట్లేదు. బాక్సాఫీస్ దగ్గర చిన్న సినిమాగా విడుదలైనప్పటికీ మాస్ ర్యాంపేజ్ చూపిస్తోంది. సాధారణంగా తక్కువ బడ్జెట్ సినిమాలకు ఎంత మంచి టాక్ వచ్చినా సరే పెట్టుబడి రిట్నర్ అయి, బ్రేక్ ఈవెన్ కావడానికి తక్కువలో తక్కువ వారమైనా పడుతుంది. కానీ ఈ మూవీ మాత్రం జస్ట్ మూడు రోజుల్లోనే ఫ్రాఫిట్ జోన్ లోకి వెళ్లిపోయింది. ఇప్పుడిదే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ట్రాయాంగిల్ లవ్ స్టోరీతో తీసిన 'బేబీ'లో మెయిన్ హైలెట్ పాటలు. కథ ఇప్పటి జనరేషన్ కి రిలేట్ అయినప్పటికీ.. అద్భుతమైన సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాని మరో స్థాయిలో నిలబెట్టాయి. దీనికి తోడు లీడ్ రోల్స్ యాక్టింగ్ మేజర్ ప్లస్ పాయింట్ అయింది. బూతులు, శృంగార సన్నివేశాలు కాస్త ఎక్కువగానే ఉన్నప్పటికీ అవేవి కలెక్షన్లని అడ్డుకోలేకపోతున్నాయి. (ఇదీ చదవండి: 'బేబీ' హీరోయిన్ ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?) ఈ క్రమంలోనే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోనూ 'బేబీ' హవా నడుస్తోంది. దీంతో మూడు రోజుల్లోనే వరల్డ్‌వైడ్ రూ.23.5 కోట్ల గ్రాస్ సాధించినట్లు నిర్మాతలు పోస్టర్ రిలీజ్ చేశారు. అలానే అన్నిచోట్ల బ్రేక్ ఈవెన్ అయినట్లు ప్రకటించారు. దీనిబట్టి చూస్తే.. ఇకపై వచ్చే వసూళ్లంతా కూడా లాభాల కింద లెక్క. 'బేబీ' మూవీని రూ.7 కోట్లు పెట్టి తీశారనే సమాచారం. ప్రస్తుతం వస్తున్న కలెక్షన్స్ బట్టి చూస్తే లాంగ్ రన్ లో రూ.40-50 కోట్ల వరకు గ్రాస్ వసూలయ్యే అవకాశాలు గట్టిగా కనిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే జరిగితే మాత్రం నిర్మాతలకు పెట్టుబడి మీద 2-3 రెట్లు లాభాలు రావడం గ్యారంటీ. బేబీ మూడు రోజుల కలెక్షన్స్ నైజాం 8,56,50,706 వైజాగ్ 2,82,56,239 ఈస్ట్ 1,38,06,945 వెస్ట్ 83,00,334 కృష్ణా 1,33,22,572 గుంటూరు 1,08,04,046 నెల్లూరు 69,56,210 సీడెడ్ 2,09,11,880 కర్ణాటక+రెస్టాఫ్ ఇండియా 77,93,808 ఓవర్సీస్ 3,94,00,000 మొత్తం 23,52,02,740 CULT BLOCKSBUSTER #BabyTheMovie proves it yet again that content is the king 👑 Breakeven in all areas with 23.5 Crores and racing into profit zone in just 3 days 💥 Experience the #CultBlockbusterBaby https://t.co/W41DguZjiF pic.twitter.com/IuY5kImUnN — Ramesh Bala (@rameshlaus) July 17, 2023 (ఇదీ చదవండి: ఆ న్యూస్ చూసి చాలా బాధపడ్డాను: సుస్మిత కొణిదెల) -
'బేబీ' కలెక్షన్స్.. రెండు రోజుల్లోనే అన్ని కోట్లు
Baby Day 2 Collection: బాక్సాఫీస్ దగ్గర 'బేబీ' సెన్సేషన్ సృష్టిస్తోంది. సాధారణంగా చిన్న సినిమాలపై అంచనాలు ఉన్నాసరే కలెక్షన్స్ అంతంత మాత్రంగానే వస్తుంటాయి. ఇప్పుడు అలాంటి కామెంట్స్ ని 'బేబీ' బద్దలు కొట్టింది. మూవీలో పేరున్న యాక్టర్స్ ఎవరూ లేనప్పటికీ.. రెండో రోజుకే లాభాల్లోకి వెళ్లిపోయింది. ఇప్పుడిదే ఇండస్ట్రీలో హాట్ టాపిక్. బూతులు ఉన్నాసరే టాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో సరైన లవ్ స్టోరీలు రాలేదు. సరిగ్గా దీన్ని ట్రాయంగిల్ ప్రేమకథతో తీసిన 'బేబీ' క్యాష్ చేసుకుంది. 'ఓ రెండు ప్రేమ మేఘాలిలా' పాట చాలారోజుల క్రితమే వచ్చింది. అప్పటినుంచి ఈ మూవీపై బజ్ పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు ఆ అంచనాల్ని 'బేబీ' అందుకుంది. బూతులు, శృంగార సన్నివేశాలు కాస్త ఎక్కువయ్యాయని కామెంట్స్ వినిపిస్తున్నప్పటికీ కలెక్షన్లకు అవి ఎలాంటి అడ్డంకి కావట్లేదు. (ఇదీ చదవండి: సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న కేజీఎఫ్ హీరోయిన్) రెండోరోజే లాభాల్లోకి తొలిరోజు రూ.7.1 కోట్ల గ్రాస్ వసూలు చేసిన 'బేబీ'.. రెండో రోజు కూడా అంతకంటే కాస్త ఎక్కువనే సాధించింది. మొత్తంగా రెండు రోజుల్లో రూ.14.3 కోట్ల గ్రాస్ వచ్చిందని స్వయానా నిర్మాత ఎస్కేఎన్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇకపోతే సినిమాకు రూ.7 కోట్ల వరకు మాత్రమే బడ్జెట్ అయింది. దీనిబట్టి చూస్తే రెండో రోజుకే బ్రేక్ ఈవెన్ కావడంతో పాటు లాభాల్లోకి కూడా వెళ్లిపోయింది. 'బ్రో' వచ్చే వరకు ఇకపోతే తర్వాత వారం పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలేవు కాబట్టి జూలై చివరివారంలో 'బ్రో' వచ్చే వరకు 'బేబీ' హవానే ఉండొచ్చు అనిపిస్తోంది. అలానే లాంగ్ రన్ లో 'బేబీ' రూ.35-40 కోట్ల వరకు గ్రాస్ సాధించిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనిపిస్తోంది. అలానే బేబీ ఓటీటీ హక్కుల్ని ఆహా సొంతం చేసుకుంది. బహుశా ఆరు వారాల తర్వాతే స్ట్రీమింగ్ ఉండొచ్చు. బేబీ రెండు రోజుల వసూళ్లు నైజాం-5.8 కోట్లు వైజాగ్-1.73 కోట్లు ఈస్ట్- 83 లక్షలు వెస్ట్-46 లక్షలు కృష్ణా-74 లక్షలు గుంటూరు-61 లక్షలు నెల్లూరు-37 లక్షలు సీడెడ్-1.18 కోట్లు కర్ణాటక-రెస్టాఫ్ ఇండియా- 43 లక్షలు ఓవర్సీస్-2.84 కోట్లు Thank you Thank you Thank you For all the love affection and compliments ❤️ No words And on the 3rd day (Sunday) Bookings are Sensational, never imagine we'll get such a warm reception Love u all 🙏❤️#BabyTheMovie @sairazesh@ananddeverkonda @viraj_ashwin@iamvaishnavi04… pic.twitter.com/PvA5qLSXgv — SKN (Sreenivasa Kumar) (@SKNonline) July 16, 2023 (ఇదీ చదవండి: దేవుడా.. రెండో సినిమాకే లక్షలు తీసుకుంటున్న అల్లు అర్హ!) -
శ్రీ విష్ణు కెరీర్లో బిగ్గెస్ట్ కలెక్షన్స్.. ఈ కథ అతని వద్దకు ఎలా వచ్చిందంటే?
శ్రీ విష్ణు హీరోగా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రూపొందిన 'సామజవరగమన' మంచి కలెక్షన్లతో దూసుకుపోతుంది. మొదట ఎటువంటి బజ్ లేకుండా థియేటర్లలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు టాలీవుడ్లో మంచి టాక్ అందుకుని సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. కలెక్షన్ల పరంగానూ రోజు రోజుకూ పెంచుకుంటూ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. మొదటి వారంలో ప్రపంచవ్యాప్తంగా రూ. 30.1 కోట్లు వసూలు చేసి శ్రీవిష్ణు కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. (ఇదీ చదవండి: హీరో విజయ్ నన్ను బెదిరిస్తున్నాడు.. అరెస్ట్ చేయండి: ప్రియ) ఈ విజయం అతని కెరీర్లో టర్నింగ్ పాయింట్‌గా నిలుస్తుంది. ఇప్పటికే 'సమాజవరగమన' చూసిన అల్లు అర్జున్,రవితేజ వంటి సినీ ప్రముఖులు ఈ చిత్రాన్ని ప్రశంసలతో ముంచెత్తారు. దీంతో ఈ సినిమాకు మరింత పబ్లిసిటీ దక్కింది. క్లాస్ స్టోరీతో పాటు కామెడీ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉండటంతో ఈ సినిమా వైపు ఫ్యామిలీ ఆడియెన్స్ అంతా క్యూ కట్టేలా చేస్తోంది. 'సామజవరగమన'ను రిజెక్ట్ చేసిన హీరో దర్శకుడు రామ్ అబ్బరాజు 'సామజవరగమన' కథ కోసం హీరోగా శ్రీ విష్ణును అనుకోలేదట. రామ్ అబ్బరాజు గతంలో వివాహభోజనంబు సినిమాను డైరెక్ట్ చేశాడు. ఆ సినిమాకు సందీప్ కిషన్ నిర్మాతగా వ్యవహరించాడు. ఆ పరిచయంతో సందీప్ కోసం కథను రెడీ చేశాడట రామ్. కానీ అప్పటికే మైఖేల్ సినిమాతో సందీప్ బిజీగా ఉండటంతో ఈ సినిమాలోకి శ్రీ విష్ణు ఎంట్రీ ఇచ్చేశాడని టాక్. (ఇదీ చదవండి: ఆలయంలో ప్రేమికులు చేసిన పనిని సమర్థించిన నటి) -
సొంత సినిమా కాదు.. అయినా సరే స్టార్ యాక్టర్స్ అలా
ఒక సినిమా గురించి ఒక స్టార్ పరిచయం చేస్తే ఆ మాటలు మంత్రాల్లా పని చేస్తాయి. ప్రేక్షకుల దృష్టి ఆ సినిమావైపు మళ్లేలా చేస్తాయి. ఆ మాటలు సినిమాకి అదనపు ఆకర్షణ అవుతాయి. అందుకే కొన్ని చిత్రాలకు స్టార్స్‌తో ‘వాయిస్ ఓవర్’ చెప్పిస్తుంటారు. అలా ఈ మధ్యకాలంలో ‘వాయిస్ ఓవర్’ ఇచ్చిన స్టార్స్ గురించి తెలుసుకుందాం. దళపతికి ఉలగ నాయగన్ మాట ఇళయ దళపతి విజయ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘లియో’. ఈ సినిమాకి ఉలగ నాయగన్ (లోక నాయకుడు) కమల్‌హాసన్ వాయిస్ ఓవర్ ఇచ్చారట. ‘మాస్టర్’ తర్వాత విజయ్–లోకేష్ కాంబినేషన్లో ‘లియో’ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో త్రిష హీరోయిన్గా, సంజయ్ దత్ విలన్‌గా చేస్తున్నారు. జూన్ 22 విజయ్ పుట్టినరోజు సందర్భంగా కొత్త లుక్ రిలీజ్ చేశారు. త్వరలో విడుదల కానున్న ఈ చిత్రం టీజర్‌కి కమల్‌హాసన్‌తో వాయిస్ ఓవర్ చెప్పించారని టాక్. అలాగే ఈ చిత్రంలో కమల్ హాసన్ అతిథి ΄పాత్రలో కనిపిస్తారని కోలీవుడ్ సమాచారం. అక్టోబర్ 19న తమిళ, తెలుగు భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. సాలే గురించి చెప్పిన టిల్లు ‘డీజే టిల్లు’ సినిమా సూపర్ హిట్ కావడంతో హీరో సిద్ధు జొన్నలగడ్డ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ప్రత్యేకించి యూత్‌లో అతని ఫాలోయింగ్ రెట్టింపయ్యింది. ఈ క్రేజ్ దృష్ట్యా ‘భాగ్ సాలే’ చిత్ర యూనిట్ సిద్ధు జొన్నలగడ్డతో వాయిస్ ఓవర్ చెప్పించింది. తన వాయిస్‌తో ‘భాగ్ సాలే’ చిత్ర నేపథ్యాన్ని వివరిస్తారు సిద్ధు. కేడీ కోసం మల్టీ స్టార్స్ యాక్షన్ కింగ్ అర్జున్ మేనల్లుడు ధృవ సర్జా హీరోగా నటిస్తున్న తొలి పాన్ ఇండియా చిత్రం ‘కేడీ: ది డెవిల్’. ప్రేమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రీష్మా నానయ్య హీరోయిన్. శిల్పా శెట్టి, సంజయ్ దత్, విజయ్ సేతుపతి కీలకపాత్రలు చేస్తున్నారు. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూ΄÷ందుతోన్న ఈ సినిమా కన్నడతో పాటు తెలుగు, హిందీ, మలయాళం, తమిళ భాషల్లోనూ విడుదలకానుంది. ఈ సినిమా టైటిల్ టీజర్‌కి కన్నడలో చిత్ర దర్శకుడు ప్రేమ్ వాయిస్ ఓవర్ ఇవ్వగా, హిందీలో సంజయ్ దత్, మలయాళంలో మోహన్ లాల్, తమిళంలో విజయ్ సేతుపతి ఇచ్చారు. ఇంకా తెలుగు వాయిస్ ఓవర్ పూర్తి కాలేదట. అక్టోబర్ 15న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తోంది. -
ప్రభాస్ సరికొత్త రికార్డ్.. ఏ సౌత్ హీరో వల్ల కాలేదు!
మీకు తెలిసిన ఫస్ట్ పాన్ ఇండియా స్టార్ ఎవరు? అని అడిగితే ఇప్పటి జనరేషన్ టక్కున చెప్పే పేరు ప్రభాస్. 'బాహుబలి' ముందు వరకు కేవలం తెలుగుకే పరిమితమైన ఇతడు.. ఆ తర్వాత తన రేంజుని అంతకంతకు పెంచుకుంటూ ఎక్కడికో వెళ్లిపోయాడు. ఇప్పుడు ఏకంగా సౌత్ లో ఏ హీరోకి సాధ్యం కానీ విధంగా ఓ సరికొత్త రికార్డు సృష్టించాడు. పాన్ ఇండియా స్టార్ అంటే దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్ని అలరించాలి. తన సినిమాలతో ఎంటర్ టైన్ చేయాలి. డార్లింగ్ ప్రభాస్ ని చూస్తుంటే అచ్చం అలానే అనిపిస్తోంది. ఎందుకంటే 'ఆదిపురుష్'నే తీసుకోండి. డివైడ్ టాక్ వచ్చినాసరే కలెక్షన్స్ సాధిస్తూనే ఉంది. సౌత్ లో అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ.. నార్త్ లో ఈ సినిమాకు ప్రేక్షకులు వెళ్తున్నారు. చూసి ఎంజాయ్ చేస్తున్నారు. దీనికి కారణం వన్ అండ్ ఓన్లీ ప్రభాస్. (ఇదీ చదవండి: ఆ నెలంతా పాన్ ఇండియా మూవీసే.. ఏకంగా అన్ని!) 'బాహుబలి' తర్వాత 'సాహో', 'రాధేశ్యామ్', 'ఆదిపురుష్'.. ఇలా మూడు భారీ బడ్జెట్ చిత్రాలతో ప్రేక్షకుల్ని పలకరించాడు ప్రభాస్. వీటి టాక్ ఏంటనేది పక్కనబెడితే నార్త్ లో ఇవన్నీ కూడా కలెక్షన్స్ లో వావ్ అనిపించాయి. మొత్తం ఈ నాలుగు చిత్రాలు.. కేవలం హిందీలోనే తలో రూ.100 కోట్లు చొప్పున నెట్ వసూళ్లు సాధించాయి. తద్వారా దక్షిణాది నుంచి వెళ్లి బాలీవుడ్ లో ఈ ఘనత సాధించిన ఫస్ట్ హీరోగా ప్రభాస్ నిలిచాడు. ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే.. ప్రభాస్ తన నాలుగు సినిమాలతో తలో రూ.100 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధిస్తే దక్షిణాది నుంచి మరే హీరో కూడా కనీసం ఒక్కటంటే ఒక్క మూవీతోనూ ఈ క్లబ్ లో చేరలేకపోయాడు. దీన్నిబట్టే మీరు అర్థం చేసుకోవచ్చు అసలు సిసలు 'పాన్ ఇండియా స్టార్' ప్రభాస్ అని. మరోవైపు బాలీవుడ్ లో ఇలా రూ.100 కోట్లు సాధించిన హీరోలు ఒకరో ఇద్దరో ఉంటారంతే! (ఇదీ చదవండి: వారం గడిచింది.. 'ఆదిపురుష్' కలెక్షన్స్ ఎన్ని కోట్లు?) -
వారం గడిచింది.. 'ఆదిపురుష్' కలెక్షన్స్ ఎన్ని కోట్లు?
ప్రభాస్ 'ఆదిపురుష్' కలెక్షన్స్.. రోజురోజుకీ డ్రాప్ అవుతూనే ఉన్నాయి. ఏడోరోజు కూడా చాలా అంటే చాలా తక్కువ వసూళ్లు వచ్చినట్లు తెలుస్తోంది. తొలి మూడు రోజులు ఆహాఓహో అనే రేంజులో ఈ చిత్రం రూ.340 కోట్ల మేర గ్రాస్ వసూలు చేసింది. ఆ తర్వాత మాత్రం దెబ్బ మీద దెబ్బ అన్నట్లు తయారైంది. (ఇదీ చదవండి: రూ.200 కోట్ల దర్శకుడితో మెగాస్టార్ సినిమా?) విడుదలకు ముందు 'ఆదిపురుష్'కు ఓ మాదిరి హైప్ ఏర్పడింది. కానీ థియేటర్లలోకి వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తొలి మూడు రోజుల టాక్ ఏంటనేది బయటకొచ్చినా అడ్వాన్స్ బుకింగ్స్ వల్ల అద్భుతమైన కలెక్షన్స్ వచ్చాయి. నిర్మాణ సంస్థ బయటపెట్టిన దాని ప్రకారం ఫస్ట్ వీకెంట్ లో రూ.340 కోట్లు గ్రాస్ వసూలు చేసింది. ఈ సోమవారం నుంచి మాత్రం 'ఆదిపురుష్'కి వరస దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఓవైపు వివాదాలు పెరుగుతుంటే.. మరోవైపు కలెక్షన్స్ తగ్గుతూ వచ్చాయి. ఆరు రోజుల్లో రూ.410 కోట్ల గ్రాస్ సాధించిన ఈ మూవీకి ఏడో రోజు ఓవరాల్ గా రూ.10 కోట్ల వరకే కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. దీనిబట్టి ఓవరాల్ గా తొలివారంలో రూ.420 కోట్ల మేర గ్రాస్ సాధించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే 'ఆదిపురుష్' ఇక కోలుకోవడం కష్టమే? (ఇదీ చదవండి: ఓటీటీలోకి సూపర్‌హిట్ 'గురక సినిమా'.. అస్సలు మిస్సవ్వొద్దు!) -
బాలీవుడ్‌ను భయపెడుతున్న ప్రభాస్
కటౌట్ ఉన్నోడు కొంతవరకు మాత్రమే హైలెట్ అవుతాడు.. దిమాకున్నోడు దునియా మొత్తాన్నే ఏలుతాడు. తాజాగా బాలీవుడ్లో ప్రభాస్ రేంజ్ చూస్తే ఇలానే ఉంది. ఇప్పటికే వరుసగా తన నాలుగు సినిమాలు రూ. 300 కోట్ల క్లబ్లో చేరిపోయాయి. దీంతో రెబల్ స్టార్ ప్రభాస్ దెబ్బకు బాలీవుడ్ హీరోల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాడు. తాజాగా ఆదీపురుష్ సినిమాపై డివైడ్ టాక్ వినిపించినా కలెక్షన్ల పరంగా పలు రికార్డుల దుమ్ము దులిపేశాడు. మొదటి మూడురోజుల్లోనే రూ.340 కోట్ల గ్రాస్‌ని వసూళ్లు చేసి ఆశ్చర్యపరిచాడు. ఇలా ఐదురోజుల్లోనే రూ. 400 కోట్ల మార్క్‌ను కూడా దాటేశాడు. (ఇదీ చదవండి: యూత్‌ను టార్గెట్ చేస్తూ.. బోల్డ్ కామెంట్స్ చేసిన నటి) దేశం మొత్తం ఆదీపురుష్పై విమర్శలు గుప్పిస్తున్న తరుణంలో ఇలాంటి కలెక్షన్లు రావడం చాలా కష్టం కానీ ప్రభాస్ ప్రభంజనంతో అవన్నీ కొట్టుకుపోయాయి. ఇప్పటికే బాహుబలి రెండు భాగాలతో పాటు సాహో కూడా రూ. 300 కోట్ల మార్కును దాటిన జాబితాలో ఉన్నాయి. ఇదే లిస్ట్‌లోకి ఆదిపురుష్ వచ్చి చేరింది. ఇప్పటి వరకు ఏ హీరోకు ఇలాంటి ఫీట్ సాధ్యపడలేదు. ప్రభాస్‌కు మాత్రమే ఇది సాధ్యమైంది. బాలీవుడ్లో కేవలం ఇద్దరు లేదా ముగ్గురికి సాధ్యమయ్యే ఈ అరుదైన ఫీట్‌ను టాలీవుడ్ నుంచి వచ్చిన ప్రభాస్ క్రియేట్ చేయడంతో వారిప్పుడు ఆశ్చర్యపోతున్నారు. కంటెంట్ లేదంటున్న సినిమాతోనే ఇన్ని రకాల విధ్వంసాలు సృష్టిస్తే... సలార్‌తో పాటు ప్రాజెక్ట్ కే చిత్రాలతో వస్తున్న ప్రభాస్‌ను ఇంకెవరు ఆపలేరని వారు అంచనా వేస్తున్నారు. రాబోయేరోజుల్లో ప్రభాస్ నుంచి బాలీవుడ్ హీరోలకు అతిపెద్ద ప్రమాదమే పొంచి ఉందని అక్కడి క్రిటిక్స్ అంచనా వేస్తున్నారు. వారి అంచనాలు నిజమయ్యేలా తాజాగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రియా రెడ్డి ‘సలార్’ గురించి మాట్లాడి అంచనాలను భారీగా పెంచేసింది.'సలార్’ సినిమా ‘కేజీఎఫ్’కు మించి ఉంటుంది. ఒకరకంగా రెండు కేజీఎఫ్ సినిమాలకు సమానంగా సలార్ వస్తుంది. నేను ఇప్పటి వరకు ఇలాంటి స్క్రిప్ట్, యాక్షన్‌ను చూడలేదు. ప్రశాంత్ నీల్ ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ లాగా ఒక ప్రపంచాన్ని సృష్టించారు. ఇందులో ప్రభాస్ ఇప్పటి వరకు చూడని విధంగా ఉంటాడు. ఇందులోని ప్రతి సన్నివేశం కొత్తగా ఉంటుంది' అని ఆమె చెప్పింది. సెప్టెంబరు 28న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. (ఇదీ చదవండి: పిల్లలు ఎందుకు కలగలేదో ఓపెన్‌గానే చెప్పేసిన నటి) -
'ఆదిపురుష్' 6వ రోజు కలెక్షన్.. మరీ ఇంత తక్కువ!?
ప్రభాస్ 'ఆదిపురుష్' హడావుడి తగ్గినట్లే కనిపిస్తుంది. తొలి మూడు రోజుల్లో ఆకాశమే హద్దు అన్నట్లు రయ్ మని దూసుకెళ్లాయి. నాలుగో రోజు నుంచి సడన్ గా డ్రాప్ అయ్యాయి. ఆరో రోజైన బుధవారమైతే మరింత తక్కువగా వచ్చాయి. మొత్తం నంబర్ చూడటానికి పెద్దగా ఉండొచ్చు కానీ రోజువారీ లెక్కలు మాత్రం ట్రేడ్ వర్గాల్ని కలవరపెడుతున్నాయి. (ఇదీ చదవండి: అలాంటి రోల్స్ చేసి చాలా ఇబ్బందిపడ్డా: ఆశిష్ విద్యార్థి) ఆరురోజుల్లో ఎన్నికోట్లు? రామాయణం ఆధారంగా తీసిన 'ఆదిపురుష్' రిలీజ్ కి ముందు ఓ మాదిరి హైప్ ఏర్పరుచుకుంది. కానీ థియేటర్లలోకి వచ్చిన తర్వాత మొత్తం పరిస్థితి మారిపోయింది. చాలామందికి ఈ సినిమా నచ్చుండొచ్చు కానీ విమర్శలు చేసేవాళ్లు మాత్రం ఎక్కువయ్యారు. వాటి ప్రభావమో ఏమో గానీ కలెక్షన్స్ పై ఈ ఎఫెక్ట్ గట్టిగానే పడిందని చెప్పొచ్చు. ఆరో రోజు వరల్డ్ వైడ్ కేవలం రూ.15 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. దీంతో ఓవరాల్ నంబర్ రూ.410 కోట్లకు చేరింది. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి? రెండు తెలుగు రాష్ట్రాల్లో 'ఆదిపురుష్'కి మిశ్రమ స్పందన వచ్చింది. దీంతో అనుకున్న దానికంటే తక్కువగానే థియేటర్లకు వెళ్తున్నారు. ఐదో రోజుకు మన రాష్ట్రాల్లో రూ.75.70 కోట్ల షేర్ ఉండగా, ఆరో రోజుకి రూ.77.53 కోట్లు అయింది. అంటే దాదాపు రూ.1.83 కోట్లు మాత్రమే వచ్చింది. వర్కింగ్ డేస్ లో ఇలా ఉంటే పర్లేదు గానీ ఈ వీకెండ్ లో మాత్రం పుంజుకోవాలి లేదంటే మాత్రం భారీ నష్టాలు తప్పవు!? #AdiPurush divine triumph all over🏹🔥#AdiPurushBlockBuster#AdiPurush3D#Prabhas @omraut #SaifAliKhan @kritisanon @mesunnysingh #BhushanKumar @SachetParampara @neerajkalyan_24 @TSeries @Retrophiles1 @UV_Creations @Offladipurush #Pramod #Vamsi @amb_cinemas @vishwaprasadtg… pic.twitter.com/j8LvW5l5PV — People Media Factory (@peoplemediafcy) June 22, 2023 (ఇదీ చదవండి: స్టార్ సింగర్ మెడలో డైమండ్ వాచ్.. ఎన్ని కోట్లో తెలుసా?) -
'ఆదిపురుష్' 5 రోజుల కలెక్షన్స్.. తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని కోట్లు?
డార్లింగ్ ప్రభాస్ 'ఆదిపురుష్' సినిమా బాక్సాఫీస్ దగ్గర పడుతూ లేస్తూ వెళ్తోంది. మంచి హైప్ తో విడుదలైన ఈ చిత్రం.. తొలి మూడురోజుల్లో అద్భుతమైన వసూళ్లు సాధించింది. రూ.340 కోట్ల వరకు సొంతం చేసుకుంది. నాలుగో రోజుకి మాత్రం అనుహ్యరీతిలో కలెక్షన్స్ తగ్గిపోయాయి. ఇప్పుడు ఐదోరోజు కూడా మరింతగా తగ్గిపోయాయి. ఇంతకీ 'ఆదిపురుష్' ఓవరాల్ కలెక్షన్స్ ఎంత? అసలేం జరుగుతుంది? (ఇదీ చదవండి: 'ఆదిపురుష్' రిజల్ట్ ముందే పసిగట్టిన ప్రభాస్.. ఆ వీడియో వైరల్!) కలెక్షన్స్ ఎంత? ఓ మాదిరి హైప్ తో రిలీజైన 'ఆదిపురుష్'.. తొలిరోజు రూ.140 కోట్ల వసూళ్లు సాధించింది. ఓ విధంగా చెప్పాలంటే మంచి ఆరంభం అని చెప్పొచ్చు. శనివారం, ఆదివారం కూడా బాక్సాఫీస్ దగ్గర ప్రభంజనం సృష్టించిన ఈ సినిమా చెరో రూ.100 కోట్లు సాధించింది. దీంతో మూడు రోజుల్లో రూ.340 కోట్లు వచ్చాయి. నాలుగో రోజు మాత్రం కేవలం రూ.35 కోట్లు రావడం అందరినీ షాకయ్యేలా చేసింది. ఐదోరోజు మన దేశంలో కేవలం రూ.10 కోట్ల మాత్రమే నెట్ వసూళ్లు వచ్చినట్లు సమాచారం. గ్రాస్ తో కలిపి రూ.20 కోట్లు వచ్చాయి. దీన్నిబట్టి ఓవరాల్ గా ఐదు రోజుల్లో రూ.395 కోట్ల గ్రాస్ సొంతం చేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి? 'ఆదిపురుష్' వసూళ్లు తెలుగు రాష్ట్రాల్లో నిలకడగా సాగుతున్నాయి. మిగతా చిత్రాలకు ఇలా నిలకడగా ఉంటే పర్లేదు గానీ 'ఆదిపురుష్' విషయంలో ఇలా జరగడం ఆందోళన కలిగిస్తోంది. ఆంధ్రా-తెలంగాణలో కలిపి ఐదు రోజుల్లో రూ.75.70 కోట్ల షేర్ వచ్చినట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా తెలుగు వెర్షన్ షేర్ రూ.95 కోట్లు అని సమాచారం. మరింతగా పుంజుకోవాల్సిన రెండో వారంలో ఇలా డ్రాప్ కనిపిస్తుండటం ట్రేడ్ వర్గాల్ని కలవరపెడుతోంది. #Adipurush remains resilient at Global Box Office as it amassed ₹ 395 CR. on its day 5! The film keeps the momentum going on Tuesday.#BlockbusterAdipurush#Prabhas @omraut #SaifAliKhan @kritisanon @mesunnysingh #BhushanKumar #KrishanKumar @vfxwaala @rajeshnair06 @DevdattaGNage… pic.twitter.com/qyz5GxH6P6 — People Media Factory (@peoplemediafcy) June 21, 2023 (ఇదీ చదవండి: మెగా ఫ్యామిలీకి సెంటిమెంట్‌గా మారుతున్న ఆ పేరు!?) -
Adipurush: సోమవారం దారుణంగా పడిపోయిన కలెక్షన్స్.. కారణం ఇదే
మెగా-బడ్జెట్‌తో రాముడిగా ప్రభాస్ నటించిన ఆదిపురుష్‌కు డివైడ్ టాక్ వచ్చినా ఫస్ట్ వీకెండ్లో భారీ వసూళ్లను రాబట్టింది. తొలి మూడురోజులకు గాను ఏకంగా రూ. 340 కోట్లు వచ్చినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. తాజాగా నాలుగురోజులకు గాను ప్రపంచవ్యాప్తంగా రూ. 375 కోట్లు కలెక్ట్ చేసినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. కానీ ఆదిపురుష్ సినిమాకు సోమవారం నుంచి అగ్నిపరీక్ష మొదలైంది. కలెక్షన్లు ఒక్కసారిగా 75% పడిపోయాయి. బాక్స్ ఆఫీస్ ఇండియా లెక్కల ప్రకారం సోమవారం ఈ సినిమా ఆల్ ఇండియా (నెట్) కలెక్షన్ దాదాపు రూ. 20 కోట్లు మాత్రమే అని తేల్చేసింది. బాలీవుడ్లో సోమవారం నికరంగా రూ.8 కోట్లు మాత్రమే వసూళు చేసినట్లు తెలుస్తోంది. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్కడ మొదటి నాలుగు రోజులకు రూ. 113 కోట్లు వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. (ఇదీ చదవండి: మెగా వారసురాలు అంటూ.. వీడియోలు షేర్ చేస్తున్న ఫ్యాన్స్) తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఇదీ ఇప్పటివరకు ఏపీ, తెలంగాణలో రూ.72 కోట్లకు పైగా షేర్ సాధించింది. గ్రాస్ ప్రకారం అయితే రూ. 113 కోట్లు అవుతుంది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే మరో రూ.70 కోట్ల షేర్ వరకు రాబట్టాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితి చూస్తుంటే అది జరగటం కష్టమే అనిపిస్తుంది. మరో పది రోజులపాటు సినిమాకు కలెక్షన్స్ ఉంటేనే ఇదే సాధ్యమవుతుంది. లేదంటే ప్రభాస్ ఖాతాలో వరుసగా మరో డిజాస్టర్ పడినట్టే అవుతుంది అనడంలో సందేహంలేదు. (ఇదీ చదవండి: సుధాకర్ కొడుక్కి అండగా మెగాస్టార్, ఆ బాధ్యత చిరంజీవిదేనట!) పఠాన్ రికార్డు బద్దలు కొట్టాడు కానీ.. మొదటి వీకెండ్లో ఆదిపురుష్ కలెక్షన్స్ పఠాన్ సినిమాను దాటాయి. అప్పటి వరకు పఠాన్ పేరుతో ఉన్న రూ. 313 కోట్ల రికార్డ్‌ను ఆదిపురుష్ అధిగిమించింది. కానీ పఠాన్ ఫైనల్ కలెక్షన్స్ అయిన రూ. 1000 కోట్ల గ్లోబల్ మార్క్‌ను ఆదిపురుష్ అధిగమించలేదని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఆదిపురుష్‌కు ప్రారంభం నుంచే డివైడ్ టాక్ వచ్చింది. దీంతోనే చాలా వరకు నష్టపోయిందని ప్రముఖ బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ తెలిపాడు. అంతే కాకుండా సినిమాలోని VFX భాగలేదనే టాక్ రావడమే కాకుండా క్యారెక్టర్ డిజైన్ కూడా బాగాలేదని కామెంట్లు వచ్చాయి. చివరికి ఈ సినిమా జాతీయ వివాదానికి కూడా దారితీసింది అని ఆయన తెలిపాడు. అందువల్ల ఈ సినిమా భారీ నష్టాలను మిగల్చవచ్చని ఆయన అభిప్రాయపడ్డాడు. THE NEGATIVE WORD OF MOUTH HAS COME INTO PLAY… After a strong opening weekend, #Adipurush COLLAPSES on Monday.#Hindi version. #India biz. pic.twitter.com/HJT4hHT80u — taran adarsh (@taran_adarsh) June 19, 2023 -
టాలీవుడ్ లో 2018 మూవీ సంచలనం తొలి రోజే కోటి రూపాయల గ్రాస్
-
రిపబ్లిక్ డే స్పెషల్: దేశభక్తి చాటే బాలీవుడ్ బాలీవుడ్ సినిమాలు
భారత రిపబ్లిక్ డే జనవరి 26న వేడుకలు జరగనున్నాయి. ఈ ఏడాది జరిగే గణతంత్ర సంబరాలు చేసుకునేందుకు కోట్లాది ప్రజలు సిద్ధమయ్యారు. అయితే ఒక్కసారి స్వాతంత్ర్య పోరాటంలో అమరులైన వారి చరిత్రలు గురించి తెలుసుకుందాం. ఈ కాలంలో పుస్తకాలు చదివే సమయం లేకపోయినా.. చరిత్రను తెరపై ఆవిష్కరించిన చిత్రాలెన్నో ఉన్నాయి. ఈ గణతంత్ర దినోత్సవం రోజున ఎంచక్కా కుటుంబంతో కలిసి చూడాల్సిన స్వాతంత్ర్య పోరాట సినిమాలను కొన్నింటిని మీకు గుర్తు చేస్తున్నాం. ఈ గణతంత్ర దినోత్సవాన్ని దేశభక్తితో పాటు ఎంటర్టైన్మెంట్ ఇచ్చే బాలీవుడ్ టాప్ టెన్ చిత్రాలపై ఓ లుక్కేయండి. అమీర్ ఖాన్ లగాన్ అశుతోష్ గోవారికర్ తెరకెక్కించిన చిత్రం లగాన్. ఈ సినిమాలో అధిక మొత్తంలో బ్రిటీష్ పన్నుల నుంచి ప్రజలను విముక్తి చేయడానికి రైతు చేస్తున్న పోరాటాన్ని చక్కగా తెరకెక్కించారు. అన్యాయమైన వ్యవస్థకు వ్యతిరేకంగా స్వాతంత్ర్యం పొందేందుకు బ్రిటిష్ వారికి ఇష్టమైన క్రీడ అయిన క్రికెట్లో ఓడించడం ఈ చిత్రంలో చూపించారు. షారుఖ్ ఖాన్ స్వదేశ్ షారుఖ్ ఖాన్ నటించిన చిత్రం స్వదేశ్. నాసాలో పనిచేసే శాస్ర్తవేత్తగా ఇందులో కనిపించారు. ఈ చిత్రంలో హీరో తన అమ్మను చూసేందుకు భారతదేశానికి వచ్చే వస్తాడు. ఆ తరువాత ఇక్కడి పరిస్థితులకు చలించిపోయి స్వేదేశంలోనే ఉండాలని నిర్ణయించుకుంటాడు. నాసా ప్రధాన కార్యాలయంలో చిత్రీకరించబడిన మొదటి భారతీయ చిత్రం స్వదేశ్. రంగ్ దే బసంతి రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా తెరకెక్కించిన సినిమా రంగ్ దే బసంతి. ఈ చిత్రంలో భారతదేశంలోని సామాజిక సమస్యలను కళ్లకు కట్టినట్లు చూపించారు. ఇండియాలోని ఐదుగురు స్వాతంత్ర్య సమరయోధుల కథను డాక్యుమెంట్ చేయడానికి ఒక బ్రిటిష్ విద్యార్థి భారత్‌కు వస్తాడు. ఇందులో ఐదుగురు భారతీయ విప్లవకారుల పాత్రలు చూపించారు. ఇది బ్రిటీష్ ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా పోరాడాటం చక్కగా తెరకెక్కించారు. చక్ దే ఇండియా కబీర్ ఖాన్ తెరకెక్కించిన మూవీ చక్ దే ఇండియా. ఈ సినిమాలో దేశభక్తిని అద్భుతంగా ఆవిష్కరించారు. ఈ చిత్రంలో షారూక్ ఖాన్ భారత మహిళా హాకీ జట్టు కోచ్ పాత్రలో కనిపిస్తారు. ఇండియా కోల్పోయిన తన ఖ్యాతిని తిరిగి కాపాడుకోవాలనే సందేశంతో తెరకెక్కించారు. అంతర్జాతీయ టోర్నమెంట్లో భారత జట్టు హాకీ జట్టు గెలవాలనే కోరికను బలంగా చూపించారు. రాజీ- ఆలియా భట్ ఆలియా భట్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రాజీ. రా ఎజెంట్ పాత్రలో ఆలియా భట్ నటించింది. ఈ చిత్రంలో ఇండియాకు కీలకమైన విలువైన సమాచారాన్ని సంపాదించాలనే ఉద్దేశ్యంతో ఆమె ఒక పాకిస్తాన్ సైనికుడిని వివాహం చేసుకుని ఆ దేశానికి వెళ్లిపోతుంది. దేశం పట్ల ఆమెకున్న ప్రేమతో కుటుంబాన్ని కోల్పోతుంది. ఈ సినిమాలో అలియా భట్, విక్కీ కౌశల్ ప్రధాన పాత్రల్లో నటించారు. కేసరి- సిక్కు సైనికుల కథ సారాంఘరి యుద్ధంలో పోరాడిన వీర సిక్కు సైనికుల కథను ఈ సినిమాలో చూపించారు. అమరులైన వీరికి కేసరి నివాళులు అర్పించారు. పదివేల మంది పష్టూన్ ఆక్రమణదారులతో జరిగిన పోరాటాలను చక్కగా తెరకెక్కించారు. ఈ చిత్రంలో 21 మంది సిక్కు సైనికులకు నాయకత్వం వహించిన హవల్దార్ ఇషార్ సింగ్ నేతృత్వంలోని యుద్ధాన్ని ఈ కథలో ఆవిష్కరించారు. భారతదేశ చరిత్రలో గొప్ప యుద్ధాలలో ఇది ఒకటిగా నిలిచింది. మణికర్ణిక- కంగనా రనౌత్ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం మణికర్ణిక. ఈ చిత్రంలో ఝాన్సీ రాణి పాత్రను ఆమె పోషించింది. ఈస్ట్ ఇండియన్ కంపెనీ రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఝాన్సీ రాణి చేసిన పోరాటాన్ని చక్కగా తెరకెక్కించారు. ఆమె తిరుగుబాటు బ్రిటీష్ వారిపై విపరీతమైన స్వాతంత్ర్య యుద్ధంగా మారింది. ఝాన్సీ రాణి మణికర్ణిక పాత్రలో కంగనా రనౌత్ మెప్పించింది. యూరి -ది సర్జికల్ స్ట్రైక్ యూరిలో జరిగిన దాడికి ప్రతీకారంగా జరిగిన సర్జికల్ స్ట్రైక్ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. 2016లో కాశ్మీర్‌లోని ఒక భాగమైన సైనిక స్థావరం యూరీపై మిలిటెంట్లు దాడి చేశారు. ఆ తర్వాత భారత సైన్యం జరిపిన సర్జికల్ స్ట్రైక్ అంతర్జాతీయంగా సంచలనం సృష్టించింది. ఆధారంగా రూపొందించబడింది. ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ సినిమా రూపంలో అమరులైన భారత సైనికులకు ఘన నివాళి అర్పించారు. విక్కీ కౌశల్‌లో మేజర్ విహాన్ సింగ్ షెర్గిల్ పాత్రలో కనిపించారు. షేర్షా- కార్గిల్ యుద్ధం షేర్షా పాకిస్తాన్‌పై కార్గిల్ యుద్ధం నాటి సంఘటనల ఆధారంగా షేర్షా మూవీని తెరకెక్కించారు. ఈ చిత్రం ద్వారా కెప్టెన్ విక్రమ్ బాత్రా త్యాగాలకు గుర్తుగా నివాళులు అర్పించారు. కెప్టెన్ బాత్రా పాత్రలో బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా నటించారు. సర్దార్ ఉధమ్ సింగ్- 1919 జలియన్ వాలాబాగ్ ఉదంతం బ్రిటీష్ పాలనలోని 1919 కాలంలో జరిగిన మారణహోమం జలియన్ వాలాబాగ్ ఉదంతం. ఈ మారణకాండకు ప్రతీకారంగా మైఖేల్ ఓ డయర్ను భారతీయ విప్లవకారుడు సర్దార్ ఉధమ్ సింగ్ హత్య చేశారు. అతని జీవిత ప్రయాణాన్ని షూజిత్ సిర్కార్ ఈ సినిమాలో చూపించారు. ఈ చిత్రంలో విక్కీ కౌశల్ భారతీయ విప్లవకారుడు ఉధమ్ సింగ్ పాత్రను పోషించాడు. భారతీయ చరిత్రలో నిలిచిపోయిన వీరుడికి ఈ చిత్రం ద్వారా ఘన నివాళి అర్పించారు. -
బాక్సాఫీస్ షేక్ చేస్తున్న బాస్.. 10 రోజుల్లోనే రూ.200 కోట్లు
మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ సినిమా 'వాల్తేరు వీరయ్య' ప్రభంజనం సృష్టిస్తోంది. భారీ అంచనాల మధ్య సంక్రాంతి కానుకగా శుక్రవారం(జనవరి 13న) ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. రిలీజైన మూడు రోజుల్లోనే వందకోట్లు కలెక్ట్ చేసి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. దీంతో మూవీ భారీ విజయంతో చిత్రబృందం ఫుల్ జోష్‌లో ఉంది. తాజాగా మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. (ఇది చదవండి: వాల్తేరు వీరయ్యకు 2.25 రేటింగ్‌పై చిరంజీవి సెటైర్లు) వాల్తేరు వీరయ్య విడుదలైన పది రోజుల్లోనే రూ.200 కోట్ల గ్రాస్ మార్కును అధిగమించింది. ఈ విషయాన్ని మైత్రి మూవీ మేకర్స్ తన అధికారిక ట్విటర్ ఖాతాలో పంచుకుంది. కేవలం పది రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా వసూళ్లు రావడంతో చిత్రబృందం సంతోషం వ్యక్తం చేసింది. 'వాల్తేరు వీరయ్య' సినిమాతో మెగాస్టార్ అభిమానులు పూనకాలతో ఊగిపోయారు. బాస్ పార్టీ సాంగ్, మెగాస్టార్ యాక్టింగ్, డ్యాన్స్, గ్రేస్‌కు ఫిదా అయిపోయారు మెగా ఫ్యాన్స్. మాస్ మహారాజ రవితేజ కూడా సినిమాలో ఉండగా వీరి కాంబినేషన్లో వచ్చే సీన్లతో థియేటర్లు దద్దరిల్లిపోయాయి. Megastar's ACTION PACKED BONANZA CONTINUES at Box Office with 200 CR+ Gross 💥🔥❤️🔥 Watch the MEGA MASS BLOCKBUSTER #WaltairVeerayya 🔥 - https://t.co/KjX8J7HFFi@KChiruTweets @RaviTeja_offl @dirbobby @shrutihaasan @ThisIsDSP @SonyMusicSouth pic.twitter.com/4Ma7Fg21r3 — Mythri Movie Makers (@MythriOfficial) January 23, 2023 -
చరిత్ర సృష్టించిన అవతార్-2.. ఇండియాలో తొలిచిత్రంగా రికార్డ్
హాలీవుడ్ దిగ్గజం జేమ్స్ కామెరూన్ విజువల్ వండర్ అవతార్-2 ఇండియాలో రికార్డులు సృష్టిస్తోంది. అవతార్‌లో పండోరా గ్రహాన్ని సృష్టించి, ప్రకృతి అందాలను తెరపై సరికొత్తగా చూపించి అందరిని ఆశ్చర్యపరిచాడు. దాదాపు 13 ఏళ్ల తర్వాత దానికి కొనసాగింపుగా వచ్చిన ‘అవతార్ అవతార్-ది వే ఆఫ్ వాటర్’(అవతార్-2) ప్రస్తుతం అన్ని రికార్డులను తిరగరాసింది. గతేడాది డిసెంబర్లో విడుదలైన ఈ చిత్రం ప్రపంచ బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో కలెక్షన్స్‌ని రాబట్టింది. సముద్ర గర్భంలో ఓ అందమైన ప్రపంచం ఉందని ఈ చిత్రం ద్వారా ప్రేక్షకులకు పరిచయం చేశారు జేమ్స్ కామెరూన్. అవతార్-2 ఇండియాలో రూ.368.20 కోట్లు వసూళ్లతో సరికొత్త చరిత్ర సృష్టించింది. అత్యధిక కలెక్షన్లు రాబట్టిన హాలీవుడ్ సినిమాని నిలిచింది. అంతకుముందు 'ఎవెంజర్స్: ది ఎండ్‌గేమ్' రూ.367 కోట్లు వసూళ్లు సాధించగా ఆ రికార్డ్ బ్రేక్ చేసింది. ఈ విషయాన్ని ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్విట్టర్లో వెల్లడించారు. అవతార్-2 కేవలం 14 రోజుల్లోనే బాక్సాఫీస్ 1 బిలియన్ యూఎస్ డాలర్ల మార్కును దాటింది. 2022లో విడుదలైన 'టాప్ గన్: మావెరిక్','జురాసిక్ వరల్డ్ డొమినియన్' సరసన నిలిచింది అవతార్-2. దీంతో 2022లో విడుదలైన ఇతర సినిమాల కంటే జేమ్స్ కామెరూన్ చిత్రం ఈ మైలురాయిని వేగంగా అధిగమించి రికార్డు సృష్టించింది. #Avatar2 creates HISTORY… Emerges the HIGHEST GROSSING #Hollywood film in #India by surpassing *lifetime biz* of #AvengersEndgame. ⭐️ #Avatar2: ₹ 368.20 cr NBOC ⭐️ #AvengersEndgame: ₹ 367 cr NBOC#India biz. #Avatar #AvatarTheWayOfWater pic.twitter.com/eS8EIZ5xu4 — taran adarsh (@taran_adarsh) January 21, 2023 -
రికార్డ్స్ బద్దలు కొట్టిన ధమాకా..
-
ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీ ‘18 పేజెస్’ వారం రోజుల కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే..
యంగ్ హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్ర 18 పేజెస్. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 23న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ మంచి విజయం సాధించింది. విడుదలైన తొలి షో నుంచే ఈ సినిమా ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. దీంతో మొదటి రోజే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్‌తో దూసుకెళ్లింది. కేవలం మౌత్ టాక్‌తోనే ఈ చిత్రానికి రోజు రోజుకు ఆదరణ మరింత పెరుగుతోంది. ఈ సినిమా విడుదలై వారం రోజులు గడుస్తున్నా ఇప్పటికి థియేటర్లో అదే జోరు కొనసాగుతోంది. ఆడియన్స్ మళ్లీ మళ్లీ థియేటర్‌కు వచ్చి సినిమా చూస్తుండటం విశేషం. ఫలితంగా ఈ సినిమా ఇప్పటివరకు (వారం రోజులకు) రూ. 20 కోట్ల గ్రాస్ సాధించి విజయంతంగా ముందుకు సాగుతుంది. కాగా బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమాను, మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పించారు. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి పాన్ ఇండియా డైరెక్టర్ సుకుమార్ కథ అంధించిన సంగతి తెలిసిందే. ఆయన శిష్యుడు ‘కుమారి 21ఎఫ్’ చిత్ర దర్శకుడు సూర్యప్రతాప్ పల్నాటి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కమర్షియల్ సినిమాలు మాత్రమే కాదు ఒక ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీకి కూడా సరైన ఆదరణ లభిస్తుంది అని నిరూపించింది ఈ క్రేజి లవ్ స్టోరీ. ఈ సినిమాలో సిద్ధు, నందినిల పాత్రలను మలిచిన తీరు, పాటలు, కొన్ని అందమైన విజువల్స్, వీటన్నింటిని మించి సుకుమార్ మార్క్‌తో కూడిన క్లైమాక్స్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. చదవండి: బాలయ్య ‘అన్‌స్టాపబుల్ షో’పై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు! వాల్తేరు వీరయ్య నుంచి మరో మాస్ సాంగ్, గొంతు కలిపిన చిరు, రవితేజ -
ఈ ఏడాది బాక్సాఫీస్‌ను బద్దలు కొట్టిన చిత్రాలివే..!
ఈ ఏడాది చిత్ర పరిశ్రమ కలిసొచ్చిందనే చెప్పాలి. 2022లో విడుదలైన పెద్ద చిత్రాలతో పాటు చిన్న సినిమాలు సైతం బాక్సాఫీస్‌ను బద్దలుకొట్టాయి. చిన్న సినిమా అయినా సరే కంటెంట్ ఉంటే ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ జాబితాలో ది కశ్మీర్ ఫైల్స్, కాంతార ముందు వరుసలో ఉంటాయి. ఇక టాలీవుడ్ సంచలనం ఆర్ఆర్ఆర్ ఏకంగా వెయ్యి కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఈ ఏడాది ప్రేక్షకుల ఆదరణ పొందిన చాలా చిత్రాలు వంద కోట్ల క్లబ్లో చేరి రికార్డ్ సృష్టించాయి. అలాగే వీటితో పాటు బాలీవుడ్ చిత్రాలు సైతం ఈ మార్క్‌ను చేరుకున్నాయి. ఈ ఏడాది వంద కోట్ల వసూళ్లు దాటిన సినిమాలేవో ఓసారి రివైండ్ చేసుకుందాం. ఈ ఏడాది వంద కోట్ల క్లబ్లో చేరిన చిత్రాలివే.. టాలీవుడ్ చిత్రాలు: ఆర్ఆర్ఆర్, సర్కారువారిపాట, భీమ్లా నాయక్, రాధేశ్యామ్, కార్తికేయ, గాడ్‌ఫాదర్ బాలీవుడ్ చిత్రాలు: ది కశ్మీర్ ఫైల్స్, బ్రహ్మస్త్ర, దృశ్యం-2, భూల్ భూలయ్యా-2, గంగూభాయ్ కతియావాడి, విక్రమ్ వేద, లాల్‌సింగ్ చద్దా, జగ్‌జగ్ జీయో తమిళ చిత్రాలు: పొన్నియిన్ సెల్వన్, విక్రమ్, బీస్ట్, డాన్, తిరుచిత్రాంబలం, సర్దార్, వలిమై కన్నడ చిత్రాలు: కేజీఎఫ్-2, కాంతార, విక్రాంత్ రోణ, 777 ఛార్లీ, జేమ్స్ -
KGF రికార్డ్స్ పై కన్నేసిన " కాంతారా "
-
అమ్ముడైన టికెట్లు 20 మాత్రమే.. రూ. 85 కోట్లకుపైగా నష్టం
బాలీవుడ్ కాంట్రవర్సీ బ్యూటీ కంగనా రనౌత్ తాజాగా నటించిన చిత్రం ధాకడ్. రజ్నీష్ ఘాయ్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ మూవీ మే 20న గ్రాండ్‌గా విడుదలైంది. సినిమా టీజర్, ట్రైలర్ మూవీపై భారీ అంచనాలను నెలకొల్పింది. ధాకడ్ మూవీలో యాక్షన్ హీరోయిన్గా బాలీవుడ్లో సత్తా చాటుతుందని అనుకున్నారు. కానీ అందుకు భిన్నంగా అంచనాలన్నీ తారుమారయ్యాయి. రిలీజైన మొదటి రోజు నుంచే ఈ సినిమా కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి. ఎనిమిదో రోజైన రెండో శుక్రవారం (మే 27) దేశవ్యాప్తంగా కేవలం 20 టికెట్లు మాత్రమే అమ్ముడు పోయాయి. దీంతో రూ. 4,420 మాత్రమే వసూళ్లను రాబట్టగలిగింది. ఈ మూవీకి మొత్తం బడ్జెట్ రూ. 90 కోట్లు. ఇప్పటివరకు ధాకడ్ నమోదు చేసిన షేర్ రూ. 5 కోట్లలోపే అని చిత్ర వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ లెక్కన చూసుకుంటే కంగనా మూవీకి వచ్చిన నష్టం రూ. 85 కోట్లకు పైమాటే. దీంతో ఈ సినిమా అత్యంత భారీ నష్టాలు మిగిల్చిన బిగ్గెస్ట్ డిజాస్టర్ చిత్రాల జాబితాలో చేరింది. అంతేకాకుండా ఈ సినిమా ఓటీటీలోకి వచ్చిన ఆ నష్టాన్ని భర్తీ చేలేదని బీటౌన్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సినిమాను తీసుకునేందుకు ఓటీటీలు కూడా ముందుకు రావట్లేదని సమాచారం. కంగనా కాంట్రవర్సీ విషయాలు ఎలా ఉన్నా బాలీవుడ్లో ఆమెకు ఫుల్ క్రేజ్ ఉంది. స్టార్ హీరోయిన్ అయిన కంగనా సినిమాకు ఇలాంటి చెత్త కలెక్షన్లు రావడం నిజంగా ఆశ్చర్యమే. చదవండి: 👇 బాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలకు నో చెప్పి రిస్క్ తీసుకున్నా:కంగనా ఆరేళ్లప్పుడు లైంగిక వేధింపులు.. కంగనా రనౌత్ షాకింగ్ రియాక్షన్ #Dhaakad today collects 4 thousand by selling 20 tickets across India. Meanwhile India's No.1 female star #AliaBhatt's #GangubaiKathiawadi collected 5.01 cr nett on second Friday. — Indian Box Office (@box_oficeIndian) May 27, 2022 #Dhaakad Is One Of The Biggest Disasters Of All Timehttps://t.co/EdOtOPNqTd — Box Office India (@Box_Off_India) May 24, 2022 -
'సర్కారు వారి పాట’ రెండో రోజు కలెక్షన్స్ ఎంతంటే..
బాబు ల్యాండ్ అయితే బాక్సాఫీస్ కు బ్యాండే అంటుంటారు ఫ్యాన్స్. ఈ మాటను మరోసారి నిజం చేసాడు మహేశ్‌బాబు. సర్కారువారి పాట పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సూపర్ స్టార్.. తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.75 కోట్ల వసూలు చేసిన ఈ చిత్రం.. రెండో రోజు కూడా అదే జోష్ని కనబరిచాడు. వరల్డ్ వైడ్‌గా ఈ చిత్రం రెండు రోజుల్లో రూ.103 కోట్ల గ్రాస్‌ని సాధించింది. ఏపీ, తెలంగాణల్లో కలిపి రెండో రోజు రూ.11.64 కోట్లను వసూలు చేసింది. నైజాంలో రూ.5.2 కోట్లు, సీడెడ్ 1.45 కోట్లు, ఉత్తరాంధ్ర 1.65 కోట్లు, ఈస్ట్ 1.08 కోట్లు, వెస్ట్ 45 లక్షలు, గుంటూరు 51 లక్షలు, కృష్ణా 89 లక్షలు, నెల్లూరులో 41లక్షల రూపాయలను వసూలు చేసింది. (చదవండి: మహేశ్ హీరోయిన్స్ మాస్ ఇమేజ్ పక్కా!) మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల్లో రూ.48.27 కోట్ల కలెక్షన్స్ రాబట్టి.. రూ.50 కోట్ల క్లబ్లో చేరడానికి రెడీగా ఉంది. ఇక అమెరికాలో అయితే ఈ చిత్రానికి అద్భుతమైన స్పందన వస్తోంది. రెండు రోజుల్లో ఈ చిత్రం అక్కడ 1.5 మిలియన్స్ డాలర్లను కలెక్ట్ చేసి తెలుగు సినిమా సత్తా చాటింది. సర్కారు వారి పాట రెండు రోజులు కలెక్షన్స్ వివరాలు(ఏపీ & తెలంగాణ) ► నైజాం - రూ.17.44 కోట్లు ► సీడెడ్ - రూ.6.15 కోట్లు ► ఈస్ట్ - రూ.4.33 కోట్లు ► వెస్ట్ - రూ.3.19కోట్లు ► ఉత్తరాంధ్ర - రూ.5.38 కోట్లు ► గుంటూరు- రూ.6.34కోట్లు ► కృష్ణా - రూ.3.47 కోట్లు ► నెల్లూరు - రూ.1.97 కోట్లు ► మొత్తం రూ.48.27 కోట్లు -
‘సర్కారు వారి పాట’ ఫస్ట్‌డే కలెక్షన్స్ ఎంతంటే..
Sarkaru Vaari Paata First Day Collection: సూపర్ స్టార్ మహేశ్‌బాబు మోస్ట్ అవెటెడ్ మూవీ సర్కారు వారి పాట గురువారం(మే 12) విడుదలై పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ రావడంతో ప్రేక్షకులు ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు. నిన్న దాదాపు అన్ని చోట్ల హౌస్‌ఫుల్ బోర్డులు దర్శనమిచ్చాయి. దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత మహేశ్ నుంచి వచ్చిన సినిమా ఇది. (చదవండి: ‘సర్కారు వారి పాట’ రివ్యూ) తెరపై సూపర్ స్టార్ చాలా స్టైలీష్‌గా కనిపించడం.. కామెడీ, యాక్షన్‌తో పాటు అదిరిపోయే స్టెప్పులేయడంతో ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియులు కూడా ‘సర్కారు వారి పాట’కి ఫిదా అయ్యారు. దీంతో తొలిరోజు బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం భారీ వసూళ్లను రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు దాదాపు రూ. 36.63 కోట్ల కలెక్షన్స్ రాబట్టి.. మహేశ్ బాబు సత్తా ఏంటో మరోసారి గుర్తు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం రూ.75 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. సర్కారు వారి పాట ఫస్ట్ డే కలెక్షన్స్ వివరాలు ► నైజాం - రూ. 12.24 కోట్లు ► సీడెడ్ - రూ. 4.7 కోట్లు ► ఈస్ట్ - రూ. 3.25 కోట్లు ► వెస్ట్ - రూ. 2.74 కోట్లు ► ఉత్తరాంధ్ర - రూ. 3.73 కోట్లు ► గుంటూరు- రూ. 5.83 కోట్లు ► కృష్ణా - రూ. 2.58 కోట్లు ► నెల్లూరు - రూ. 1.56 కోట్లు ► మొత్తం రూ.36.69 కోట్లు #SVP AP/TG Share 36.63Cr ALL TIME RECORD for Regional Film🤘💥#BlockbusterSVP #SarkaruVaariPaata https://t.co/QyE7gPFZIp — SarkaruVaariPaata (@SVPTheFilm) May 13, 2022 -
‘ఆర్ఆర్ఆర్’ వసూళ్లపై ఐపీఎల్ ప్రభావం..!
IPL 2022 Going To Impact RRR Business: మరి కొద్ది గంటల్లో ప్రారంభంకానున్న క్రికెట్ పండుగ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2022) ప్రభావం, ఐదేళ్ల పాటు సినీ అభిమానులను ఊరిస్తూ ఎట్టకేలకు ఇవాళ థియేటర్లలో రిలీజైన పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’పై పడనుందా అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు. భారతీయులకు రెండు ప్రధాన కాలక్షేపాలైన సినిమా, క్రికెట్ ఒకే సమయంలో ప్రారంభమైతే రెండిటిపై ఎంతో కొంత ప్రభావం తప్పక ఉంటుందని ఇరు రంగాలకు చెందిన నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కోవిడ్ నేపథ్యంలో ఐపీఎల్ మ్యాచ్‌లకు 100 శాతం ప్రేక్షకులను(స్టేడియంలోకి) అనుమతించేది లేదని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఇదివరకే స్పష్టం చేసింది కాబట్టి, ఐపీఎల్‌తో పోలిస్తే ఆర్ఆర్ఆర్ కలెక్షన్లపైనే అధిక ప్రభావం తప్పదని వారు వాదిస్తున్నారు. ఐపీఎల్ మ్యాచ్‌లు సాయంత్రం 7 గంటలకు ప్రారంభంకానున్న నేపథ్యంలో సినిమా ఉదయం, మధ్యాహ్నం ఆటలపై ఎలాంటి ప్రభావం ఉండకపోయినా ఫస్ట్ షో, సెకండ్ షో కలెక్షన్లకు భారీగానే గండిపడే అవకాశముందని అంచనా వేస్తున్నారు. ఐపీఎల్ మ్యాచ్‌లు చూసేందుకు సినిమా పోగ్రాంను మానుకునేవాళ్లు చాలామందే ఉంటారని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు. సౌత్‌లో భారీ ఫాలోయింగ్ ఉన్న చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ జట్ల మ్యాచ్‌లు శని (మార్చి 26), ఆదివారాల్లో (మార్చి 27) జరగనుండగా ఆ రోజుల్లో సినిమా కలెక్షన్లపై ప్రభావం తప్పదని అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి రానున్న రెండు వారాలు ఐపీఎల్ వర్సెస్ ఆర్ఆర్ఆర్గా సాగనుందని అంటున్నారు. కాగా, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ ముఖ్యతారగణంగా దర్శక ధీరుడు రాజమౌళి రూపొందించిన భారీ బడ్జెట్ సినిమా ‘రౌద్రం, రణం, రుధిరం’ (ఆర్ఆర్ఆర్) ఇవాళ (మార్చి 25) ప్రపంచవ్యాప్తంగా వేల థియేటర్లలో విడుదల కాగా, క్రికెట్ పండుగ ఐపీఎల్ రేపటి నుంచి (మార్చి 26) ప్రారంభంకానుంది. ఆర్ఆర్ఆర్కి పోటీగా మరో భారీ సినిమా థియేటర్లలో సందడి చేయకపోయినా.. ఐపీఎల్ 2022 రూపంలో జక్కన్ టీమ్ గట్టిపోటీ (కలెక్షన్ల రూపంలో) ఎదుర్కొననుంది. చదవండి: ఆర్ఆర్ఆర్ మూవీ రివ్యూ -
సంక్రాంతి సెకండ్ విన్నర్ మాదే!
‘‘రౌడీ బాయ్స్’ ఆశిష్‌కి తొలి చిత్రం. నా దృష్టిలో తను ఇప్పుడు ఒక నటుడు. ఒక్క సినిమాకే హీరో అని అనను.. ప్రేక్షకులు తనని బాగా ఆదరించినప్పుడే హీరో’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. ఆశిష్, అనుపమా పరమేశ్వరన్ జంటగా శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ‘రౌడీ బాయ్స్’ ఈ నెల 14న విడుదలైంది. ఈ సందర్భంగా ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘రౌడీ బాయ్స్’ ఆశిష్‌కు చక్కటి శుభారంభం. తొలి సినిమా అయినా నటన, డ్యాన్స్, ఎమోషన్స్, ఎంటర్టైన్మెంట్లో ఆకట్టుకున్నాడని అందరూ ప్రశంసిస్తున్నారు. మా సినిమా కథ, పాత్రలతో యువతరం కనెక్ట్ అవుతుండటంతో విడుదల నుంచి ఇప్పటివరకూ వసూళ్లు నిలకడగా ఉన్నాయి. ఆంధ్ర, తెలంగాణలో ఐదు రోజుల్లో ఏడుకోట్ల గ్రాస్, నాలుగున్నర కోట్ల షేర్ లభించింది. కొత్త హీరో సినిమాకు ఈ స్థాయి ఆదరణ దక్కడం హ్యాపీ. ఏపీలో యాభై శాతం ఆక్యుపెన్సీ మా సినిమాకు అడ్వాంటేజ్‌గానే భావిస్తున్నాం. తెలంగాణలో కంటే ఆంధ్రాలో వసూళ్లు బాగున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన పాటలకు మంచి స్పందన లభిస్తుండటంతో మ్యూజికల్ కాంటెస్ట్ పెట్టి ఈవెంట్ నిర్వహించబోతున్నాం. ఈ సంక్రాంతి తొలి విన్నర్ ‘బంగార్రాజు’ సినిమానే. రెండో స్థానం ‘రౌడీ బాయ్స్’ది. ‘సెల్ఫిష్’ పేరుతో తెరకెక్కనున్న ఆశిష్ రెండో చిత్రానికి సుకుమార్ శిష్యుడు కాశీ దర్శకుడు. సుకుమార్ డైలాగ్స్ అందిస్తారు. ‘ఆర్య’ తర్వాత నేను, సుకుమార్ కలిసి చేస్తున్న చిత్రమిది (నిర్మాతలుగా).. అందుకే బాధ్యతగా భావిస్తున్నాం’’ అన్నారు. -
‘అనుభవవించు రాజా’ ఫస్ట్‌డే కలెక్షన్స్ ఎంతంటే..?
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా శ్రీను గవిరెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ అనుభవించు రాజా. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి సుప్రియ యార్లగడ్డ నిర్మాతగా వ్యవహరించారు. భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం(నవంబర్ 26)న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీకి మిశ్రమ స్పందన వచ్చింది. అయితే కలెక్షన్స్ పరంగా మాత్రం ఈ మూవీ దూసుకెళ్తున్నట్లు తెలుస్తోంది. ఈ వారం పెద్ద చిత్రాలేవి లేకపోవడం, విడుదలైన చిన్న చిత్రాల్లో ‘అనుభవించు రాజా’కే మంచి స్పందన రావడంతో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లనే రాబట్టింది. దాదాపు 450 పైగా థియేటర్స్ లో రిలీజ్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా తొలి రోజే రూ.70 లక్షలకు పైగా వసూళ్లు చేసినట్లు తెలుస్తోంది. వీకెండ్లో ఈ కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది. అనుభవించు రాజా చిత్రానికి రూ.3.90 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది.సో బ్రేక్ ఈవెన్ కు రూ.4 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఈ వీకెండ్లో భారీగా వసూళ్లను రాబడితే.. బ్రేక్ ఈవెన్ ఈజీగా అవుతుందనే చెప్పాలి. పోటీగా మరే క్రేజీ మూవీ లేకపోవడం.. అనుభవించు రాజా కి ప్లస్ పాయింట్. -
పిల్లల కోసం ప్రత్యేక సినిమాలు!
పిల్లలూ.. కథలే కాదు మీకోసం చక్కటి సినిమాలూ వచ్చాయి. మీకు వినోదం పంచడానికి తెలుగు సహా మీకు తెలిసిన ప్రపంచ భాషలన్నిటిలోనూ మీకోసం సినిమాలు ఉన్నాయి. వాటిల్లో కొన్నిటి గురించి ఇక్కడ తెలుసుకుందాం.. బాలరాజు కథ.. మహాబలిపురం పట్టణంలో బాలారాజు అనే పదేళ్ల పిల్లవాడుండేవాడు. అతనికో చెల్లి రాధ. తండ్రిలేని పిల్లలు. తల్లితో కలసి మేనమామ కుటుంబం ఉంటున్న గుడిసె పక్కనే మరో గుడిసెలో నివసించేవారు. మేనమామ సోమరి, తాగుబోతు. దాంతో ఇటు తమ కుటుంబంతోపాటు మేనమామ కుటుంబాన్ని బాలరాజే పోషిస్తూండేవాడు. టూరిస్ట్ గైడ్‌గా పనిచేస్తూ. ఈ చలాకీ పిల్లవాడు టూరిస్ట్‌లు ఇచ్చిన డబ్బు తీసుకుని ‘టాటా గిడి గిడీ’ అంటూ తనదైన శైలిలో కృతజ్ఞతలు తెలిపేవాడు. ఒకరోజు గుంటూరుకు చెందిన ధనిక దంపతులు కారులో మహాబలిపురం వస్తారు. వాళ్లకు పిల్లలు ఉండరు. ఆ జంటకు మన బాలరాజే గైడ్. వాళ్లను మహాబలిపురం తిప్పుతుండగా తల్లికి ఆరోగ్యం పాడైనట్టు చెల్లి రాధ వచ్చి చెబుతుంది. ఆ అన్నా, చెల్లి పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్లిపోతారు. కానీ అప్పటికే వాళ్లమ్మ చనిపోయుంటుంది. ఈ విషయం తెలిసిన గుంటూరు దంపతులు ఆ పిల్లలిద్దరినీ దత్తత తీసుకోవాలనుకుంటారు. ప్రతినెల తనకు వంద రూపాయలు ఇవ్వాలనే నియమం మీద ఆ పిల్లలను ఆ దంపతులకు దత్తత ఇస్తాడు బాలరాజు మేనమామ. పిల్లలను తీసుకుని వెళుతుండగా తమ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం జరిగిందని టెలిగ్రాం అందుతుంది ఆ దంపతులకు. దాన్నొక అపశకునంగా, దానికి బాలరాజు గ్రహచారమే కారణం అనుకుంటూంటారు ఆ దంపతులు. ఆ మాటను చాటుగా విన్న ఆ అన్నా, చెల్లెలు తిరిగి తమ ఇంటికి వెళ్లిపోతారు. బాలరాజు గురువుగా భావించే ఓ శిల్పాచార్యుడు ఆ పిల్లవాడిని ఓదారుస్తాడు. శిల్పాచార్యుడు పర్యవేక్షిస్తున్న శిల్పాల తయారీ స్థలంలో ఓ వినాయకుడి విగ్రహం ఉంటుంది. దాని దగ్గరున్న ఓ శిలాఫలకంలో కొన్ని వాక్యాలు రాసి ఉంటాయి. వాటిల్లో ఉన్నట్టే పరిస్థితులు ఎదురవుతుంటాయి బాలరాజుకు. చదువులేని బాలరాజుకు ఆ సంఘటనలే లోకజ్ఞానాన్ని కలగజేస్తుంటాయి. ఇంతలోకి గుంటూరు దంపతుల్లోని భార్య ఈ పిల్లల మీద బెంగతో మంచం పడుతుంది. ఆ పిల్లలను తీసుకెళితే తన భార్య మళ్లీ ఆరోగ్యవంతురాలవుతుందని తలుస్తాడు. పిల్లలను వెదుక్కుంటూ మళ్లీ మహాబలిపురం వస్తాడు. దత్తత ఇవ్వమని పిల్లల మేనమామను బతిమిలాడుతాడు. మేనమామ ఒప్పుకొని పిల్లలను అతనితో పంపించేస్తాడు. పిల్లల మాట వినగానే ఆ తల్లి కళ్లు తెరుస్తుంది. బాలరాజు కోరిక మేరకు అతని మేనమామ కుటుంబాన్ని కూడా తమ ఇంటికి తీసుకొస్తారు గుంటూరు దంపతులు. అలా బాలరాజు కథ సుఖాంతమవుతుంది. ఇది ‘వా రాజా వా’ అనే తమిళ సినిమాకు రీమేక్. మూల కథ.. నాగరాజన్. మాటలు.. ముళ్లపూడి వెంకటరమణ, దర్శకత్వం.. బాపు. ఈ బ్లాక్ అండ్ వైట్ సినిమా కథను టూకీగా 1970, ఆగస్ట్ చందమామ సంచికలో బాపూ బొమ్మలతో ప్రచురించారు. చదవండి: హెచ్చరిక!! ఈ శతాబ్దం చివరి నాటికి భూమిపై ఘోర మారణహోమం.. పథేర్ పాంచాలి బెంగాల్‌లోని నిశ్చింద్రపురం ఊరి చివరన ఉంటుంది హరిహర్ రాయ్‌గారి పాత పెంకుటిల్లు. వచ్చే కొద్దిపాటి సంపాదనతో అతను పూజారిగా జీవనం సాగిస్తుంటాడు కానీ గొప్ప కవి, నాటక రచయిత అవ్వాలని కలలు కంటుంటాడు. అతని భార్య సర్వజయ, కూతురు దుర్గ, కొడుకు అపు హరిహర్ రాయ్‌కు వరుసకు అక్క అయిన ఇందిరమ్మ అనే ముసలావిడ.. అతని కుటుంబ సభ్యులు. హరిహర్ రాయ్ సంపాదన కోసం ఊర్లు పట్టుకు తిరుగుతుంటాడు. సర్వజయకు ఇందిరమ్మంటే పడదు. దుర్గ, అపుల అల్లర్లు, ఆకతాయి పనులు, చిన్న చిన్న సంతోషాలతో కాలం గడుస్తూంటుంది. దుర్గ స్నేహితురాలి పెళ్లి కుదురుతుంది. ఆపెళ్లికి వెళ్లి తిరిగి వస్తూండగా కుండపోతగా వర్షం కురుస్తుంది. ఆ వానలో దుర్గ డాన్స్ చేస్తుంది. అలా వర్షంలో తడవడంవల్ల దుర్గకు జ్వరం వస్తుంది. వైద్యంచేసినా జ్వరం తగ్గదు. తరువాతి రోజు రాత్రి తుఫాను వస్తుంది. ఆ రాత్రే దుర్గ చనిపోతుంది. పక్కింటి వాళ్ల సహాయంతో అంత్యక్రియలూ జరుగుతాయి. ఈ విషయం తెలియని హరిహర్రాయ్ ఊరి నుంచి ఇంటికి వస్తాడు. దుర్గ చనిపోయిందని తెలిసి భోరున విలపిస్తాడు. సర్వజయను ఓదార్చడమైతే ఎవరి తరమూ కాదు. తుఫానుకు వంటగది కూలిపోయి ఉంటుంది. ఆ ఊరు వదిలేసి కాశీ వెళ్లిపోవటానికి సిద్ధమవుతుంది ఆ కుటుంబం. గ్రామపెద్దలు వచ్చి ఊరు వదిలివెళ్లొద్దని సర్దిచెప్తారు. కానీ హరిహర్ రాయ్ ఒప్పుకోడు. ఇల్లు సర్దే క్రమంలో అపుకి దుర్గ దొంగలించిన పూసలదండ దొరుకుతుంది. అపు పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ దండను కొలనులోకి విసిరేస్తాడు. ఆ విషయం ఎవరికీ చెప్పడు. హరిహర్ రాయ్ కుటుంబం ఎద్దుల బండిలో కాశీకి బయలుదేరడంతో సినిమా ముగుస్తుంది. 1929లో బిభూతిభూషణ్ బందోపాధ్యాయ రాసిన ‘పథేర్ పాంచాలి’ అనే బెంగాలీ నవల ఆధారంగానే అదే పేరుతో 1955లో ఈ సినిమాను తీశాడు సత్యజిత్ రాయ్. ఈ నవలను 1960లో మద్దిపట్ల సూరి తెలుగులో అనువదించారు. వేర్ ఈజ్ ది ఫ్రెండ్స్ హోమ్ (ఇరానియన్ సినిమా. కథ, దర్శకత్వం.. అబ్బాస్ కైరోస్తమి) ఇరాన్‌లోని కొకర్ గ్రామంలో అహ్మద్ అనే ఎనిమిదేళ్ల పిల్లాడుంటాడు. ఇంటిపనుల్లో వాళ్లమ్మకు సాయం చేస్తూ ఊరిలోని బడిలో చదువుకునేవాడు. ఎప్పటిలాగే ఆరోజు కూడా ఇంటికి వచ్చి హోమ్‌వర్క్ చేయబోతుంటే తెలుస్తుంది పొరపాటున తన క్లాస్మేట్ మహమ్మద్ రెజా నమత్‌జాద్ నోట్‌బుక్‌ను తను తెచ్చేశాడని. వెంటనే ఆ నోట్‌బుక్‌ను అతనికి తిరిగి ఇవ్వకుంటే అతను హోమ్‌వర్క్ చేయలేడు. హోమ్‌వర్క్ చేయకుంటే టీచర్ క్లాస్‌లోకి రానివ్వడు. అందుకే ఎలాగైనా ఆ రోజే ఆ నోట్‌బుక్‌ను స్నేహితుడికి ఇవ్వాలని అనుకుంటాడు. జరిగిన విషయం తల్లితో చెప్తాడు. ‘రేపు ఇవ్వొచ్చులే’ అని వారిస్తుంది ఆమె. దాంతో అమ్మకు తెలియకుండా నోట్‌బుక్‌ను చొక్కాలోపల దాచుకుని పరుగులాంటి నడకతో బయలుదేరుతాడు అహ్మద్. వాళ్లూరికి పక్కనున్న కొండ మీద ‘పొస్థే’ అనే ఊళ్లోనే ఉంటుంటాడు నమత్‌జాద్. పరిగెత్తుకుంటూ పోస్థేకి చేరుకుంటాడు అహ్మద్. కానీ అంతకు క్రితమే నమత్‌జాద్ వాళ్ల బంధువైన హెమాతి వాళ్ల ఇంటికి వెళ్లాడని తెలుస్తుంది. అతికష్టం మీద హెమాతి వాళ్ల ఇంటికీ వెళ్తాడు. అక్కడ హెమాతి ఉండడు. అహ్మద్ స్వగ్రామం అయిన కొకర్కే వెళ్లాడని తెలుస్తుంది. మళ్లీ పరిగెత్తుకుంటూ కొకర్కు వస్తాడు అహ్మద్. అక్కడా నమత్‌జాద్ కనిపించడు. మళ్లీ పోస్థేకు వెళతాడు. అయినా నమత్‌జాద్ జాడ కనిపెట్టలేకపోతాడు. ఈలోపు రాత్రవుతుంది. నిరాశతో ఇల్లు చేరతాడు అహ్మద్. ఎక్కడికెళ్లావంటూ పిల్లాడిని మందలిస్తుంది తల్లి. తన హోమ్‌వర్క్‌తో పాటు నమత్‌జాద్ హోమ్‌వర్క్ కూడా పూర్తిచేస్తాడు అహ్మద్. తరువాతి రోజు తరగతి గదిలో పిల్లల హోమ్‌వర్క్ చూసిన టీచర్ నమత్‌జాద్ హోమ్‌వర్క్ బుక్‌లో గుడ్ అని రాస్తాడు. డ్రీమ్స్ (జపనీస్ సినిమా. కథ, దర్శకత్వం.. అకిరా కురసోవా) ఇందులో మొత్తం 8 కథలుంటాయి. ఒక కథకు మరో కథకు సంబంధం ఉండదు. దేనికదే స్వతంత్ర కథగా నడుస్తుంది. వీటిల్లోని సన్‌షైన్ త్రూ ది రైన్ అనే ఒక కథ గురించి మాత్రం ఇక్కడ తెలుసుకుందాం. జపాన్‌లోని ఓ గ్రామంలో ఒక ఆరేళ్ల పిల్లాడు ఉంటుంటాడు. ఒకరోజు మధ్యాహ్నం హఠాత్తుగా వానపడుతుంది. ఓ వైపు ఎండగానే ఉంటుంది.. ఇంకోవైపు చినుకులు పడుతునే ఉంటాయి. పిల్లవాడి అమ్మ పరిగెత్తుకుంటూ బయటకు వచ్చి చేటలో ఎండబెట్టిన వాటిని ఇంట్లోకి చేరుస్తుంటుంది. పిల్లాడేమో వానలో నిలబడి ఉంటాడు. ‘ఇలా ఎండా.. వానా ఒకేసారి వస్తే మన ఇంటి పక్కనున్న అడవిలో నక్కల పెళ్లి జరుగుతుంది. వాటి పెళ్లిని మనుషులు చూస్తే వాటికి కోపం వస్తుంది. అందుకే త్వరగా ఇంట్లోకి వచ్చేయ్’ అంటుంది అమ్మ. ఆమె అలా ఇంట్లోకి వెళ్లగానే పిల్లాడు వడివడిగా నడుచుకుంటూ ఇంటి పక్కనున్న అడవిలోకి వెళ్లిపోతాడు. అక్కడ ఆకాశాన్ని తాకే పెద్దపెద్ద చెట్లు ఉంటాయి. వాటి మొదళ్లు చాలా లావుగా బలంగా ఉంటాయి. పిల్లాడు ఓ చెట్టు వెనుక దాక్కుంటాడు. నక్కల వేషధారణలోని స్త్రీ, పురుషుల గుంపు లయబద్ధంగా సంగీత వాయిద్యాలు వాయిస్తూ నాట్యం చేస్తూంటుంది. ఆ గుంపుకి కనిపించకుండా పిల్లాడు ఓ చెట్టు బోదె వెనుక దాక్కుని అంతా గమనిస్తుంటాడు. కాని ఓ ఇద్దరు ఆ బాలుడిని కనిపెడ్తారు. కళ్లతో కోపాన్ని చూపిస్తారు. పిల్లాడు భయపడి ఇంటికి పారిపోతాడు. వాడి కోసం ఎదురుచూస్తున్న అమ్మ ‘నా మాట వినకుండా నక్కల పెళ్లి చూసి వాటికి కోపం తెప్పించావు. ఓ మగనక్క వచ్చి ఈ కత్తి నీకు ఇమ్మంది. దీన్ని తీసుకెళ్లి వాటికి తిరిగి ఇచ్చేసి క్షమాపణ చెప్పి రా! నక్కల క్షమాపణ సంపాదించే వరకు నిన్ను ఇంటికి రానివ్వను’ అంటుంది కరాఖండిగా. ‘నక్కలు ఎక్కడుంటాయో నాకు తెలీదు’ అంటాడు పిల్లాడు. ‘ఇలాంటి వాతావరణంలో నక్కలు ఇంద్రధనుస్సు కింద ఉంటాయి’ అని చెప్పి పిల్లాడిని బయటే ఉంచి తలుపు వేసేస్తుంది అమ్మ. రూళ్లకర్రలా ఉన్న ఆ కత్తిని తీసుకుని పక్కనే ఉన్న తోటలోకి వెళ్తాడు పిల్లాడు. ఆ తోటంతా రంగురంగుల పూలమయం. ఎదురుగా ఉన్న రెండు కొండల మధ్య అద్భుతమైన ఇంద్రధనుస్సు కనపడుతుంది. నడుచుకుంటూ దాని దగ్గరకు వెళ్తాడు పిల్లాడు. ఇక్కడితో ఈ కథ ముగుస్తుంది. ముగింపు ప్రేక్షకుల ఊహకే వదిలేస్తాడు దర్శకుడు. ఇలా మొత్తం ఎనిమిది కథలతో ఈ సినిమా సాగుతుంది. ఇంకెన్నో పిల్లల సినిమాలు.. పిల్లలూ.. ఇలా మిమ్మల్ని అలరించే ఇంకెన్నో మంచి సినిమాలు ఉన్నాయి. వీటిల్లో కష్టాంక (రష్యన్), ది రెడ్ బెలూన్ (ఫ్రెంచ్), చిల్డ్రన్ ఆఫ్ హెవెన్ (ఇరానియన్), ది కార్ట్ (ఇరానియన్), గిఖోర్ (అర్మీనియన్), ది బ్లూ అంబ్రెల్లా (హిందీ), ది ఓల్డ్ మ్యాన్ అండ్ ది సీ (క్యూబన్), ది మ్యాన్ హూ ప్లాంటెడ్ ట్రీస్ (ఫ్రెంచ్), ది కలర్ ఆఫ్ పారడైజ్ (ఇరానియన్), ది కిడ్ (అమెరికన్), బైసికిల్ థీవ్స్ (ఇటాలియన్), ది వైట్ బెలూన్ (ఇరానియన్), లాస్ట్ ఇన్ ది డెజర్ట్ (అమెరికన్), జంపింగ్ ఓవర్ పెడల్స్ అగైన్ (చెకోస్లోవియన్ ), కాక ముటై్ట (తమిళ్), ఇవాన్స్ చైల్డ్‌హుడ్ (రష్యన్), ది చైల్డ్‌హుడ్ ఆఫ్ మాక్సిమ్ గోర్కీ (రష్యన్), ది మిర్రర్ (ఇరానియన్), ది రన్నర్ (ఇరానియన్), స్ట్రే డాగ్స్ (ఇరానియన్) ... వంటివి తప్పక చూడాల్సిన కొన్ని చిత్రాలు. – అనిల్ బత్తుల (‘పిల్లల సినిమా కథలు పుస్తకం’ నుంచి..) చదవండి: వింత ఆచారం! అల్లుడికి కట్నంగా 21 విషపూరితమైన పాములు.. -
బాక్స్ ఆఫీస్ దగ్గర 50 కోట్లు కొల్లగొట్టిన బ్యాచ్ లర్
-
Pirated Sites: బందిపొట్లే... కానీ సంపాదనలో బడాబాబులే
సినిమా ఒక మాస్ కమ్యూనికేషన్..! ఒక విషయాన్ని వివరించడంలో ఎక్కువ మందికి చేరువయ్యేలా చేసే మాధ్యమం సినిమా. ఎంతో మందికి అన్నం పెడుతూ..ప్రేక్షకులకు ఆనందాన్ని, ఉత్సాహాన్ని అందించడంలో సినిమా పాత్ర ఎనలేనిది. రకరకాల సినిమాలు నవరసాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఎప్పుడు ముందుంటాయి. ఎంటరైన్మెంట్ రంగంలో సినిమాకు ఉన్న స్థానం అంతా ఇంతా కాదు. పెరుగుతున్న సాంకేతికతో సినిమా కూడా కొంతపుంతలను తొక్కుతుంది. సాంకేతికతో భారీ చిత్రాలను సినీ ప్రేక్షకులకు అందిస్తూనే ప్రేక్షకులచే ఔరా..! అనిపిస్తున్నాయి ఇప్పటి సినిమాలు. సాంకేతికతో సినిమాలు తీసే విధానం పూర్తిగా మారగా..అదే సాంకేతికత సినిమాల కొంప ముంచుతుంది. ప్రపంచవ్యాప్తంగా చిత్ర పరిశ్రమ ఎదుర్కోటున్న పెద్ద సవాలు పైరెసీ భూతం. పైరసీ చేయడంతో ఆయా సినిమాలో కోసం పనిచేసిన వారి కష్టం బూడిదపాలవుతుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ ఇతర చిత్ర పరిశ్రమలు పైరసీ భూతాన్ని ఎదుర్కొంటున్నాయి. పైరసీ భూతం సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. సినిమాలను పైరసీ చేసే పైరేటెడ్ సైట్ల ఆదాయం ఎంతో తెలిస్తే కచ్చితంగా షాక్ అవ్వాల్సిందే. సినిమాలు, ఇతర టీవీ షోలను పైరసీ చేయడం ద్వారా ఆయా పైరేటెడ్ సైట్లు ప్రతి సంవత్సరం సుమారు 1.3 బిలియన్ డాలర్లు (రూ. 9,660 కోట్లు.). ఇది కేవలం పైరేటెడ్ సైట్లకు యాడ్స్ ద్వారా వచ్చే ఆదాయం మాత్రమే. పైరేటెడ్ సైట్లకు పోర్న్, ఇతర కంపెనీలు ఆదాయాన్నిచ్చే సంస్థలుగా నిలుస్తున్నాయి. కాగా యాడ్స్ కేవలం వాటి నుంచే వస్తున్నాయంటే పొరపడినట్లే. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రఖ్యాతి సంపాదించిన ఈ-కామర్స్ సైట్లు కూడా పైరేటెడ్ సైట్లకు ఆదాయమార్గాలుగా ఉన్నాయి. పైరేటెడ్ సైట్లకు ప్రధాన కంపెనీ బ్రాండ్లు సుమారు నాలుగు శాతం మేర యాడ్ రెవెన్యూను అందిస్తున్నాయి. ఇవే ప్రధాన కంపెనీ బ్రాండ్స్ పైరేట్డ్ యాప్‌లకు 24 శాతం మేర ఆదాయాన్ని జనరేట్ చేస్తున్నాయి. ప్రధాన కంపెనీల్లో గూగుల్, అమెజాన్, ఫేస్బుక్ వంటి సైట్లు కూడా ఉన్నాయి. పైరసీ ద్వారా సినిమాలను చూసే వారికి కూడా కచ్చితంగా ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. ఒక సర్వేలో ప్రపంచవ్యాప్తంగా 84 వేల పైరేటెడ్ సైట్లు ఉన్నాయని పరిశోధకులు గుర్తించారు. పైరేటెడ్ సైట్లను నియంత్రిచడంలో ప్రధాన కంపెనీలు కీలక పాత్ర వహించాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. ఆయా పైరేటెడ్ సైట్ల ఐపీలకు యాడ్స్‌ను కల్పించకుండా ఉంటే సైట్లకు రెవెన్యూ గణనీయంగా పడిపోయే అవకాశం ఉంది. -
బొమ్మ బంపర్ హిట్!
పైరసీతో సినీ రంగం నష్టపోతోందంటూ పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నా.. థియేటర్లకు వెళ్లి చూసే ప్రేక్షకుల సంఖ్యేమీ తగ్గడం లేదు. సినిమా కలెక్షన్లు అలవోకగా వందల కోట్లు దాటడమూ ఆగడం లేదు. ఆర్థిక వ్యవస్థలో మందగమనం భయాల్లాంటివి ఎలా ఉన్నా .. సినీ ప్రేమికులు రేటెంతైనా సరే టికెట్టు కొనుక్కుని చూసేందుకు మొగ్గుచూపుతున్నారని నివేదికలు చెబుతున్నాయి. గతేడాదే సినిమాలపై ప్రేక్షకులు ఏకంగా రూ. 10వేల కోట్లపైగానే వెచ్చించారు. న్యూఢిల్లీ: కొన్నాళ్లుగా స్తబ్దుగా ఉంటున్న సినిమా టికెట్ల అమ్మకాలు మళ్లీ జోరు అందుకుంటున్నాయి. పైరసీ కష్టాలు ఎలా ఉన్నా.. టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ తేడా లేకుండా సినీ ప్రియులు .. రేటెంతయినా సరే టికెట్లు కొనుక్కుని థియేటర్లలో చూసేందుకు ప్రాధాన్యమిస్తున్నారు. గతేడాది గణాంకాలే ఇందుకు నిదర్శనం. ఒర్మాక్స్ మీడియా అనే కన్సల్టింగ్ సంస్థ రూపొందించిన బాక్సాఫీస్ రిపోర్ట్ 2019 ప్రకారం.. భారతీయులు గతేడాది 103 కోట్ల సినిమా టికెట్లు కొనుగోలు చేశారు. ఇందుకోసం దాదాపు రూ. 10,948 కోట్లు వెచ్చించారు. అంతక్రితం ఏడాదితో పోలిస్తే ఇది 11.6 శాతం అధికం. 2018లో దేశీ సినీ ప్రియులు 94.5 కోట్ల టికెట్లు కొనుగోలు చేశారు. ఇందుకోసం రూ. 9,810 కోట్లు వెచ్చించారు. అమ్ముడైన టికెట్లలో దాదాపు మూడో వంతు వాటా హిందీ సినిమాలదే ఉంది. 19 శాతం తమిళ సినిమాలు, 18 శాతం తెలుగు సినిమాల వాటా ఉంది. హాలీవుడ్, మలయాళం సినిమాలు ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ప్రాంతీయ భాషలకు ప్రాధాన్యం.. సినిమాలు బంపర్ కలెక్షన్లు సాధించడంలో భాష ప్రధానంగా ఉంటోంది. ప్రభాస్ నటించిన సాహో (హిందీ, తమిళం, తెలుగు) బాక్సాఫీస్ ఆదాయాల్లో అత్యధికంగా 60 శాతం వాటా హిందీ నుంచే వచ్చినట్లు ఒర్మాక్స్ మీడియా సీఈవో శైలేష్ కపూర్ పేర్కొన్నారు. ఇక హృతిక్ రోషన్ నటించిన బాలీవుడ్ సినిమా ‘వార్’ కలెక్షన్లలో గణనీయ భాగం తెలుగు వెర్షన్ నుంచి వచ్చాయని వివరించారు. ఈ నేపథ్యంలో చాలా మటుకు టాప్ 10 సినిమాలు.. బహుభాషల్లో విడుదలవుతున్నాయని కపూర్ చెప్పారు. హాలీవుడ్ సినిమాలు కూడా తెలుగు, తమిళం, హిందీ తదితర పలు భారతీయ భాషల్లోకి డబ్ చేస్తున్నారని విశ్లేషించారు. ‘అవెంజర్స్ సినిమా బాక్సాఫీస్ ఆదాయాల్లో 40–45 శాతం వాటా హిందీ, తెలుగు, తమిళ వెర్షన్లదే ఉంది. భారీ సినిమాలన్నింటికీ ఇది వర్తిస్తుంది. వాటి బాక్సాఫీస్ ఆదాయాల్లో సగటున 30–35 శాతం వాటా భారతీయ భాషల వెర్షన్ల నుంచే వస్తోంది. 1917 లాంటి చిన్న సినిమాలు ఇంగ్లీష్‌లో మాత్రమే విడుదలవుతున్నాయి’ అని కపూర్ చెప్పారు. హాలీవుడ్ చిత్రాలైనా .. బాలీవుడ్ సినిమాలైనా .. పలు భాషల్లో డబ్ చేసి, విడుదల చేస్తుండటం వల్ల టికెట్ల అమ్మకాలు.. తద్వారా బాక్సాఫీస్ ఆదాయాలు పెరుగుతున్నాయి. కంటెంటే కింగ్.. అయితే, సినిమాల కలెక్షన్లు పెరగడానికి కారణం పలు భాషల్లో రిలీజ్ చేయడం ఒక్కటే కాదని, కంటెంట్ కూడా బాగుంటేనే ప్రేక్షకులు ఆదరిస్తున్నారని నివేదిక విశ్లేషించింది. స్టార్ హీరోలు, యాక్టర్లతో సంబంధం ఉండటం లేదని వివరించింది. హిందీ సినిమాలు.. కలెక్షన్ల కోసం తొలి వారాంతంపై ఆధారపడటమనేది దశాబ్దపు కనిష్ట స్థాయికి పడిపోయినట్లు పేర్కొంది. కేవలం తొలి వారానికే పరిమితం కాకుండా కంటెంట్ ఎంత బాగుంటే .. అంత ఎక్కువ కాలం థియేటర్లలో సినిమాలు నడుస్తున్నాయి. ‘గతంలో కహానీ (2012), క్వీన్ (2014) వంటి సినిమాల్లో పెద్ద స్టార్లు లేకపోయినా అవి రూ. 100 కోట్ల వసూళ్లు సాధించడం గొప్పగా ఉండేది. కానీ 2019 విషయం తీసుకుంటే పెద్ద స్టార్లెవరూ లేని చిచోరే సినిమా అలవోకగా రూ. 140 కోట్ల వసూళ్లు సాధించింది. సల్మాన్ ఖాన్ వంటి పెద్ద స్టార్ నటించిన దబాంగ్ 3కి సరిసమాన స్థాయిలో నిల్చింది. కనుక స్టార్లు లేరు కాబట్టి సినిమా వసూళ్లు అంతంత మాత్రంగానే ఉంటాయని అనుకోవడానికి లేదు. కంటెంట్ బాగుంటే చాలు.. ఆదాయాలకు ఆకాశమే హద్దుగా ఉంటోంది‘ అని కపూర్ చెప్పారు. స్టార్ యాక్టర్ల సినిమాలకు సాధారణంగానే మంచి ఓపెనింగ్స్ వస్తుంటాయి. కానీ, ఎంత కాలం నిలదొక్కుకోగలుగుతాయి అన్నది కంటెంట్ పైనే ఆధారపడి ఉంటోంది. దబాంగ్ 3 ఓపెనింగ్స్ రూ. 32 కోట్లతో పోలిస్తే చాలా తక్కువగా రూ. 6 కోట్ల ఓపెనింగ్స్‌తో ప్రారంభమైన చిచోరే.. ఆ తర్వాత అదర గొట్టే కలెక్షన్లు సాధించడం దీనికి నిదర్శన మని కపూర్ తెలిపారు. విదేశీ మార్కెట్ల లోనూ దూకుడు.. వసూళ్లు పెంచుకోవడానికి చిత్రాలను విదేశీ మార్కెట్లలోనూ పెద్ద ఎత్తున విడుదల చేసే ధోరణి పెరిగిందని కేర్ రేటింగ్స్ తెలిపింది. బాలీవుడ్ స్టార్ ఆమిర్‌ఖాన్ నటించిన దంగల్ సినిమా దీనికి నిదర్శనంగా పేర్కొంది. మొత్తం రూ. 1,968 కోట్ల వసూళ్లలో నాలుగింట మూడొంతుల వాటా విదేశీ మార్కెట్ల నుంచే వచ్చిందని వివరించింది. చైనా, మధ్యప్రాచ్యం, తైవాన్, మలేషియా, హాంకాంగ్, బ్రిటన్ వంటి దేశాల్లో భారతీయ సినిమాలకు ఆదరణ ఉంటోందని కేర్ రేటింగ్స్ తెలిపింది. మరోవైపు, నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్ వంటి ఓవర్–ది–టాప్ కంటెంట్ ప్లాట్‌ఫాంల సంఖ్య పెరుగుతున్నప్పటికీ.. థియేటర్లలో టికెట్ల రాబడి కూడా పెరగడం గమనార్హమని వివరించింది. ఒకదాని వల్ల మరో దానికి ముప్పు రాకుండా ఓటీటీ ప్లాట్‌ఫాంలు, థియేటర్లు కలిసి ముందుకు సాగగలవని పేర్కొంది. బాక్సాఫీస్‌పై ‘లిప్‌స్టిక్’ ప్రభావం: కేర్ బాక్సాఫీస్ వద్ద వసూళ్లు పెరగడానికి ‘లిప్‌స్టిక్’ ఎఫెక్ట్ కూడా కారణమని రేటింగ్ ఏజెన్సీ కేర్ రేటింగ్స్ ఒక నివేదికలో పేర్కొంది. ఆర్థిక మందగమన పరిస్థితుల్లో వినియోగదారులు .. విలాసవంతమైన భారీ కొనుగోళ్ల జోలికి పోకుండా.. చిన్న చిన్న సరదాలపై ఖర్చు పెట్టే ధోరణిని లిప్‌స్టిక్ ఎఫెక్ట్‌గా వ్యవహరిస్తారు. ఈ ప్రభావంతో పాటు కంటెంట్ మెరుగుపడటం, సినిమా టికెట్లపై జీఎస్టీ తగ్గడం కూడా పరిశ్రమకు తోడ్పడిందని కేర్ రేటింగ్స్ పేర్కొంది. సినిమాల సగటు ఆదాయం 15 శాతం పెరిగి రూ. 23 కోట్లకు చేరిందని వివరించింది. 2018లో ఏడు చిత్రాలు రూ. 100 కోట్ల వసూళ్ల మార్కును దాటగా 2019లో ఇది పదమూడుకు పెరిగింది. గతేడాది ఆరు బాలీవుడ్ సినిమాలు రూ. 200 కోట్ల మార్కును అధిగమించాయి. -
‘లవ్ ఆజ్ కల్ 2’ ఫస్ట్ డే కలెక్షన్ అదుర్స్.. కానీ!
బాలీవుడ్ యువ నటుడు కార్తీక్ ఆర్యన్, హీరోయిన్ సారా అలీ ఖాన్, రణ్‌దీప్ హూడాలు ప్రధాన పాత్రలో నటించిన ‘లవ్ ఆజ్ కల్ 2’ సినిమా ప్రేమికుల రోజు సందర్భంగా (ఫ్రిబ్రవరి 14)న విడుదలైన సంగతి తెలిసిందే. దర్శకుడు ఇంతీయాజ్ అలీ 2009లోని ‘లవ్ ఆజ్ కల్’కు స్వీకెల్‌గా ఈ చిత్రాన్ని రూపొందించారు. విభిన్న ప్రేమకథ భావాలతో తెరకెక్కిన ఈ సినిమాపై అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. సెన్సార్ బోర్డు కూడా సినిమాలో అసభ్యకర సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయంటూ చిత్ర యూనిట్‌కు షాకిచ్చింది. అలా ఎన్నో విమర్శల మధ్య విడుదలైన ఈ సినిమా మొదటి రోజు రూ. 12.40 కోట్లు వసూలు చేసింది. అయినప్పటికీ సినిమా అనుకున్న అంచనాలకు చేరుకోలేక పోయింది. అటు అభిమానుల నుంచి సైతం విమర్శలు వెల్లువెత్తున్నాయి. ‘లవ్ ఆజ్ కల్ 2’కు సెన్సార్ షాక్! దర్శకుడు ఇంతీయాజ్ కాలానుగుణంగా ప్రేమలో వచ్చే మార్పులను చూపించేందుకు భిన్న ప్రేమ కథలను తీసుకుని ఈ చిత్రాన్ని రూపొందించారు. కాగా కార్తీక్ ఆర్యన్ 2020 నాటి ప్రేమికుడు వీర్, 1990 నాటి రఘుగా ద్విపాత్రలు పోషించాడు. ఇక వీర్‌కు ప్రియురాలిగా సారా నటించగా.. 1990 నాటి రఘు ప్రేయసిగా లిలా పాత్రలో ఆరూషి నటించిది. ఇక ఆరూషికి ఇదే మొదటి సినిమా కూడా. ఇకపోతే విడుదలైన రోజునే ఈ సినిమాపై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ వచ్చాయి. ముఖ్యంగా సారా అలీ ఖాన్ చేసిన ఓవరాక్షన్ భరించలేపోయామంటు సారాపై మండిపడుతున్నారు. ఈ సినిమాలో కేవలం కార్తీక్ నటన మాత్రమే బాగుందని.. మిగతాదంతా అంతా చెత్తగా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు ప్యారాచూట్‌పై ఉన్న ఓ వ్యక్తి భయపడుతూ కళ్లు మూసుకున్న ఫొటోని షేర్ చేస్తూ.. ‘కావాలంటే 500 ఇస్తాం దయచేసి సినిమా ఆపండ్రా బాబు’ అంటూ క్రియోట్ చేసిన మీమ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ‘ఆ హీరోయిన్ చాలా ఓవర్ చేసింది’ -
బ్రేక్ ఈవెన్‌ను క్రాస్ చేసిన ‘అశ్వథ్థామ’
అమ్మాయిల ఫాలోయింగ్ ఉన్న యంగ్ హీరో నాగ శౌర్య నటించిన తాజా చిత్రం అశ్వథ్థామ. ఇప్పటి వరకు లవర్ బాయ్‌గా కనిపించిన నాగ శౌర్య ఈ సినిమాతో యాక్షన్ అవతారం ఎత్తారు. రమణ తేజను దర్శకుడిగా పరిచయం చేస్తూ సొంతంగా కథ రాసుకుని ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. యాక్షన్, ఎమోషనల్ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమాలో మెహరీన్ శౌర్యకి జోడిగా నటించింది. జనవరి 31 న విడుదలైన ఈ సినిమా మిశ్రమ స్పందనతో ముందుకు కొనసాగుతోంది. (‘అశ్వథ్థామ’ మూవీ రివ్యూ) సంక్రాంతి సీజన్లో వచ్చిన అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరూ వంటి సినిమాల హమా మెల్లగా తగ్గుతుండటం.. అశ్వథ్థామ కలెక్షన్స్‌కు ప్లస్ అవుతుందని చెప్పవచ్చు. నాగశౌర్య నటనకు ప్రేక్షకులు మంచి మార్కులు వేయడంతో ఈ సినిమా స్థిరమైన కలెక్షన్లు రాబడుతోంది. నిన్నటి వరకు రూ. 10 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి బ్రేక్ ఈవెన్‌కు చేరువగా నిలవగా.. తాజాగా అందిన రిపోర్ట్స్ ప్రకారం రిలీజ్ అయిన అయిదు రోజుల్లోనే అన్ని ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ క్రాస్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ. 13.65 కోట్లను రాబట్టి బ్లాక్బాస్టర్ హిట్‌ను సొంతం చేసుకుంది. -
అయ్య బాబోయ్ అసలు కలెక్షన్లు ఆగట్లా..
సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన సూపర్‌స్టార్ మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ క్రమంలో చిత్ర బృందం వరంగల్‌లో ‘బ్లాక్‌బస్టర్ కా బాప్’ పేరుతో విజయోత్సవ సభ నిర్వహించింది. అంతేకాకుండా కలెక్షన్లకు సంబంధించిన వివరాలను చిత్ర బృందం ఎప్పటికప్పుడూ సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడిస్తూనే ఉంది. తాజాగా ఈ చిత్రం వారం రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లకు పైగా షేర్ వసూలు చేసిందని ప్రకటించింది. అలాగే కలెక్షన్లు ఇంకా కొనసాగుతున్నాయని పేర్కొంది. అలాగే ఈ చిత్రానికి సంబంధించిన రెండు ప్రోమోలను చిత్రబృందం విడుదల చేసింది. అందులో ఒకదానిలో ప్రకాశ్ రాజ్‌తో మహేష్ అయ్య బాబోయ్.. ఫ్లో ఆగట్లేదని పలికే సన్నివేశాన్ని చూపించారు. ఈ వీడియోను ట్విటర్లో పోస్ట్ ఏకే ఎంటర్టైన్మెంట్స్.. ‘అయ్య బాబోయ్ అసలు కలెలక్షన్లు ఆగట్లా..’ అని పేర్కొంది. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా అనిల్ సుంకర, దిల్ రాజు, మహేష్ బాబు సంయుక్తంగా నిర్మించారు. రష్మిక మందన్నా హీరోయిన్గా నటించగా విజయశాంతి, రాజేంద్ర ప్రసాద్, ప్రకాశ్‌రాజ్, సంగీత కీలక పాత్రల్లో నటించారు. Ayya baboi asalu collections aagatlaa.. 😉 🤩 Never Before Ever After Blockbuster #SarileruNeekevvaru latest promo - https://t.co/vHT2tbBFww#BlockBusterKaBAAP Super ⭐ @urstrulyMahesh @AnilRavipudi @AnilSunkara1 @vijayashanthi_m @iamRashmika @ThisIsDSP — AK Entertainments (@AKentsOfficial) January 19, 2020 -
రూ 300 కోట్ల క్లబ్ దిశగా వార్..
ముంబై : బాలీవుడ్ గ్రీక్‌గాడ్ హృతిక్ రోషన్, యంగ్ హీరో టైగర్ ష్రాఫ్‌ల కాంబోలో యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన వార్ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన వార్ శనివారం రూ 11.80 కోట్లు రాబట్టి రూ 257 కోట్ల మార్క్‌ను అధిగమించింది. ఇక ఆదివారం సెలవు దినం కావడంతో ఈ మూవీ భారీ వసూళ్లను రాబడుతుందని అంచనా వేస్తున్నారు. హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో 4000 స్క్రీన్లలో వార్ రిలీజైంది. హృతిక్, టైగర్లతో పాటు ఈ మూవీలో వాణీకపూర్ తన అందాలతో ఆకట్టుకోగా, అశుతోష్ రాణా, అనుప్రియ గోయెంకా ఇతర పాత్రల్లో నటించారు. -
సూపర్ 30 : మొదటి రోజు రికార్డ్ కలెక్షన్
సాక్షి : బిహార్‌కు చెందిన ప్రముఖ గణిత వేత్త ఆనంద్‌కుమార్ జీవిత కథ ఆధారంగా బాలీవుడ్లో రూపొందించిన చిత్రం సూపర్ 30. హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో నటించగా వికాస్ బహల్ దర్శకత్వం వహించారు. శుక్రవారం విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకొంది. ఫర్హా ఖాన్, కరణ్ జోహార్లతో పాటు చాలా మంది ప్రముఖులు ఈ సినిమాను మెచ్చుకుంటున్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ఈ చిత్రం చూసి మంచి కంటెంట్ ఉన్న సినిమాను ప్రేక్షకులకు అందించారనీ, హృతిక్ నటన బాగుందని అభినందిస్తూ ట్వీట్ చేశారు. ఇక కలెక్షన్ పరంగా చూస్తే ఈ చిత్రం మొదటి రోజు దాదాపు పదకొండున్నర కోట్లు వసూలు చేసింది. హృతిక్ రోషన్ ఇంతకు ముందు చిత్రం కాబిల్ 10.43 కోట్లను రాబట్టగా, తాజా చిత్రం ఆ రికార్డును చెరిపేసింది. అంతేకాక, గతేడాది సూపర్ హిట్లుగా నిలిచిన అజయ్ దేవగణ్ రైడ్, అక్షయ్ కుమార్ ప్యాడ్ మ్యాన్ల కంటే ఎక్కువగా ఈ చిత్రం మొదటిరోజు వసూళ్లను సాధించింది. సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్ల పరంగా దూసుకెళ్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
'కబీర్ సింగ్' కలెక్షన్స్ అదుర్స్!
తాజాగా రిలీజైన కబీర్ సింగ్ మూవీ తోలి రోజే 20 కోట్లకు పైగా సంపాదించి, భారీ ఓపెనింగ్‌తో బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తుంది. షాహిద్ ఇంతకుముందు నటించిన మల్టీస్టారర్ మూవీ ‘పద్మావతి’ కలెక్షన్స్‌ను పక్కకునెడుతూ తన కెరీర్లోనే అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా ప్రస్తుతం కబీర్ సింగ్ నిలిచింది. కబీర్ సింగ్ తెలుగులో సూపర్ హిట్టయిన సినిమా 'అర్జున్ రెడ్డి'కి రీమేక్. తన గర్ల్‌ఫ్రెండ్ మరోవ్యక్తిని పెళ్లి చేసుకున్న కారణంగా ఓ మెడికల్ స్టూడెంట్ ఎలా స్వీయ విధ్వంసానికి పాల్పడతాడనేది మూవీ సారంశం. బాక్సాఫీస్ ఇండియా రిపోర్ట్ ప్రకారం, అడ్వాన్స్ బుకింగ్‌లో సల్మాన్ ఖాన్ నటించిన భారత్, ఎవెంజర్స్ తర్వాత కబీర్ సింగ్ 3వ స్థానంలో నిలిచింది. యువత, మాస్ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తుండడంతో ఈ మూవీ విడుదలకు ముందే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. -
భారత్ వసూళ్ల వర్షం
న్యూఢిల్లీ : బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ భారత్ మూవీ బాక్సాఫీసు వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఈద్ రోజు విడుదలైన ఈ మూవీ కేవలం నాలుగురోజుల్లోనే రూ 122.22 కోట్లు రాబట్టిందని ట్రేడ్ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్ తెలిపారు. భారత్ తొలిరోజు రూ 42.30 కోట్లు రాబట్టి ఈద్ రోజు విడుదలైన సల్మాన్ మూవీల్లో అత్యధిక ఓపెనింగ్ వసూళ్లు సాధించిన మూవీగా నమోదైంది. భారత్ శనివారం రూ 26.70 కోట్లు రాబట్టింది. భారత్ బాక్సాఫీస్‌లో వసూళ్ల సునామీ సృష్టిస్తోందని, సింగిల్ స్క్రీన్స్‌లో దుమ్మురేపుతున్న మూవీ మల్టీప్లెక్స్‌లోనూ సత్తాచాటుతోందని తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. భారత్ బాక్సాఫీస్ బిజినెస్ వివరాలు చూస్తే..బుధవారం రూ 42.30 కోట్లు వసూలు చేసిన మూవీ గురువారం రూ 31 కోట్లు, శుక్రవారం రూ 22.20 కోట్లు, శనివారం రూ 26.70 కోట్లు వసూలు చేసి మొత్తం భారత్‌లో రూ 122.20 కోట్లు రాబట్టినట్టు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. ఇక భారత్ రూ 100 కోట్ల క్లబ్లో చేరిన సల్మాన్ ఖాన్ మూవీల్లో 14వ చిత్రంగా నిలవడం గమనార్హం. -
రూ 700 కోట్ల క్లబ్లో 2.ఓ
చెన్నై : సూపర్‌స్టార్ రజనీకాంత్, అక్షయ్‌కుమార్‌ల కలయికలో శంకర్ రూపొందించిన విజువల వండర్ 2.ఓకు విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన లభించినా వసూళ్లలో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. నవంబర్ 29న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సైంటిఫిక్ ఫిక్షన్ మూవీ రెండు వారాల్లో రూ 700 కోట్లు వసూలు చేసింది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన 2.ఓ రూ 700 కోట్ల క్లబ్లో చేరిన తొలి కోలీవుడ్ సినిమాగా నిలిచింది. 2.ఓ ప్రపంచవ్యాప్తంగా రూ 710.98 కోట్లు వసూలు చేసిందని, రెండు వారాల్లో తమిళనాడులో రూ 166.98 కోట్లు రాబట్టిందని ట్రేడ్ అనలిస్ట్ మనోబాల విజయబాలన్ వెల్లడించారు. అంతర్జాతీయ మార్కెట్లోనూ 2.ఓ మెరుగైన వసూళ్లను రాబడుతోంది. రెండు వారాల తర్వాత కూడా అమెరికాలో 2.ఓ వందకు పైగా థియేటర్లలో రన్ అవుతోంది. ఉత్తర అమెరికాలో ఈ తరహాలో ఎక్కువ రోజులు మరే ఇతర భారతీయ సినిమా ప్రదర్శింపబడలేదని చెబుతున్నారు. ఈ ప్రపంచం కేవలం మానవాళి కోసమే కాకుండా సమస్త జీవరాశుల కోసం సృష్టించబడిందనే సందేశంతో తెరకెక్కిన ఈ మూవీలో రజనీకాంత్ డాక్టర్ వశీకరణ్, చిట్టి, 2.ఓ, మైక్రోబోట్స్ 3.ఓ వంటి పలు పాత్రల్లో మెప్పించారు. -
సినిమా టికెట్ల ధరలు పెరుగుతాయ్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గూడ్స్, సర్వీసెస్ ట్యాక్స్‌తో (జీఎస్టీ) రానున్న రోజుల్లో తమ రంగానికి కష్ట కాలమేనని సినీ పరిశ్రమ హెచ్చరిస్తోంది. 95 శాతం మంది నిర్మాతలు నష్టాలను చవిచూస్తున్నారని నిర్మాత, దర్శకులు తమ్మారెడ్డి భరద్వాజ తెలిపారు. మీడియా, ఎంటర్టైన్మెంట్ రంగంపై జీఎస్టీ ప్రభావం అన్న అంశంపై అసోచాం, పీడబ్లు్యసీ గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నష్టాలు పొందుతున్న నిర్మాతలకు జీఎస్టీ అదనపు భారమేనని స్పష్టం చేశారు. ‘పన్నుతో నిర్మాతలకు 30% ఖర్చు పెరుగుతోంది. రూ.100 దాటిన టికెట్‌పై పన్ను 28 శాతముంది. అంటే రూ.150 టికెట్లో రూ.42 జీఎస్టీ ఉంది. ఇది పరిశ్రమకు అనుకూలం కాదు. త్వరలో రూ.100 టికెట్ కాస్తా రూ.150, రూ.150 విలువగలది రూ.200లకు చేరనుంది. థియేటర్లో లభించే ఫుడ్, బెవరేజెస్ సైతం ప్రియం కానున్నాయి. అంతిమంగా ఖర్చులు అధికం అవుతాయి కాబట్టి థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గుతుంది’ అని వెల్లడించారు. లగ్జరీ నుంచి తొలగించాలి.. సినిమాలను లగ్జరీగా పరిగణించరాదని అసోచాం ఎంటర్టైన్మెంట్, మీడియా నేషనల్ కౌన్సిల్ చైర్మన్, సారథి స్టూడియోస్ డైరెక్టర్ కె.వి.రావు అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ పన్ను విషయమై సమీక్షించాలని కోరారు. సినీ రంగంలో వందలాది మంది వివిధ విభాగాల్లో పనిచేస్తున్నారు. ఈ రంగానికి పరిశ్రమ హోదా ఇవ్వాలని పీడబ్లు్యసీ పార్టనర్ అనిత రస్తోగి డిమాండ్ చేశారు. దాదాపు 1.2 లక్షల ప్రతిపాదనల ఆధారంగా జీఎస్టీ రూపుదిద్దుకుందని మేడ్చల్ జీఎస్టీ కమిషనరేట్ కమిషనర్ ఎం.శ్రీనివాస్ తెలిపారు. పన్ను తగ్గింపు విషయంలో ఇప్పటికే కేంద్రానికి ప్రతిపాదనలు పంపామని చెప్పారు. కార్యక్రమంలో అసోచాం ప్రతినిధులు డీఎస్ రావత్, బి.శ్రీకాంత్ పాల్గొన్నారు. -
మార్కెట్ రేస్
-
ఓపెనింగ్ వసూళ్లలో చరిత్ర సృష్టించిన రెయిడ్
బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్‌గణ్ తాజా సినిమా ‘రెయిడ్’ చరిత్ర సృష్టించింది. మంచి టాక్‌తో కలెక్షన్లపరంగా దూసుకెళ్తూ.. మొదటి మూడు రోజుల్లోనే రూ.41 కోట్లు వసూళ్లు చేసింది. దీంతో 2018లో పద్మావత్ సినిమా తర్వాత అతి పెద్ద వీకెండ్ కలెక్షన్ల సినిమాగా చరిత్రకెక్కింది. బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకెళ్తున్న ‘రెయిడ్’... ఈ ఏడాది వీకెండ్ కలెక్షన్ల పరంగా రెండో అతిపెద్ద హిట్‌గా నిలిచిందని ఫిలీం ట్రెడ్ అనలిస్ట్ తరన్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. ఈ ఏడాది విడుదలయిన సినిమాల్లో రూ.114 కోట్ల వీకెండ్ కలెక్షన్లతో పద్మావత్ మొదటి స్థానంలో ఉండగా, రూ. 41.01 కోట్లతో రెయిడ్ రెండో స్థానంలో ఉందని ట్వీట్లో పేర్కొన్నారు. మొదటిరోజు కాస్త తడబడి రూ. 10.04 కోట్లు మాత్రమే వసూళ్లు చేసిన ఈ సినిమా రెండోరోజు శనివారం రూ. 13.86 కోట్లు దక్కించుకుంది. ఆదివారం ఒక్క రోజే రూ.17.11 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. మూడు రోజుల్లో కలిపి రూ. 41.01కోట్లను రాబట్టింది. రాజ్‌కుమార్ గుప్తా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అజయ్‌కు జోడీగా ఇలియానా నటించారు.1980ల్లో ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటుచేసుకున్న అతిపెద్ద ఆదాయ పన్ను దాడుల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కించారు. -
భారీ వసూళ్లతో దూసుకెళ్తున్న రెయిడ్
సాక్షి, సినిమా : బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్గన్ తాజా సినిమా ‘రెయిడ్’.. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమా మంచి టాక్‌తో కలెక్షన్లపరంగా దూసుకెళ్తోంది. అంచనాలనుమించి వసూళ్లు రాబడుతోంది. మొదటిరోజే రూ. 10.04 కోట్ల భారీ ఓపెనింగ్ వసూళ్లు రాబట్టిన ఈ సినిమా రెండోరోజు శనివారం.. రూ. 13.86 కోట్లు దక్కించుకుంది. రెండు రోజుల్లో రెయిడ్ సినిమా రూ. 23.90 కోట్లు వసూలుచేసిందని ట్రెడ్ అనాలిస్ట్ తరన్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. ఈ సినిమా 38.04శాతం వృద్ధి రేటుతో దూసుకెళ్తోందని ఆయన ట్విటర్లో పేర్కొన్నారు. 1981లో ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటుచేసుకున్న ఐటీ దాడుల నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో అజయ్ దేవ్గన్ సరసన ఇలియానా నటించింది. డిప్యూటీ కమీషనర్ అమై పట్నాయక్ పాత్రలో అజయ్ దేవగణ్ చూపిన నటన విమర్శకుల ప్రసంశలు అందుకుంటుంది. -
ఫిల్మ్‌నగర్‌పై ‘ట్యాక్స్’ నజర్
సాక్షి, హైదరాబాద్: ప్రజల నుంచి సినిమా టికెట్ల రూపేణా పన్నులు వసూలు చేసి జేబులు నింపుకుంటున్న సినీ నిర్మాతలపై హైదరాబాద్ వస్తు సేవల పన్ను(జీఎస్టీ) కమిషనరేట్ దృష్టి సారించింది. కొందరు బడా నిర్మాతలు ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నును ఎగవేస్తున్నారని తేలడంతో రంగంలోకి దిగిన జీఎస్టీ కమిషనరేట్.. వారం రోజులుగా ఓ నిర్మాతపై దృష్టిపెట్టి, పన్ను కట్టకుండా ‘రాజా’లా తిరు గుతున్న అతని వద్ద నుంచి రూ.2 కోట్లు వసూలు చేసి కేసు నమోదు చేసినట్లు సమా చారం. కొందరు బడా నిర్మాతలపైనా సెంట్ర ల్ ఎక్సైజ్ విభాగం కన్నేసినట్టు సమాచారం. 12 శాతం పన్ను కట్టాల్సిందే.. జీఎస్టీ అమల్లోకి వచ్చాక సినిమా టికెట్లపై 12 శాతం పన్ను చెల్లించాల్సి ఉంది. ఈ ఎనిమిది నెలల కాలంలో జీఎస్టీ కింద కొన్ని సినీ నిర్మా ణ సంస్థలు రూపాయి కూడా పన్ను చెల్లించలేదని నగర జీఎస్టీ కమిషనరేట్ వర్గాల పరిశీలనలో తేలింది. దీంతో ఆ శాఖ అధికారులు బడా నిర్మాతలుగా పేరుగాంచిన కొందరి సంస్థలకు చెందిన ఆడిటింగ్ ఫైళ్లను పరిశీలించారు. ఇందులో ఓ నిర్మాత దాదాపు రూ.7 కోట్ల మేర పన్ను చెల్లించాల్సి ఉందని తేలింది. రూ.5 కోట్లకు మించి పన్ను ఎగవేతకు పాల్పడితే కేసు నమోదు చేసే అధికారం జీఎస్టీ కమిషనరేట్ అధికారులకు ఉన్నందున ఆయనపై కాగ్నిజబుల్ కేసు నమోదుచేశారు. దీంతో రూ.2 కోట్లు చెల్లించిన ఆ నిర్మాత మిగిలిన మొత్తం చెల్లించేందుకు గడువు కోరినట్టు సమాచారం. ఆయనకు సమయం ఇవ్వాలా? లేక కేసు నమోదు చేసి ప్రాసిక్యూట్ చేయా లా? అనే అంశాన్ని కమిషనరేట్ అధికారులు పరిశీలిస్తున్నారని ఆ శాఖ వర్గాలంటున్నాయి. ఈ రంగంతో సంబంధం ఉన్న ఆర్టిస్టులు, మ్యూజిషియన్లు, సాంకేతిక నిపుణులు, డిస్ట్రిబ్యూటర్లు, కలర్‌ల్యాబ్‌లు, స్టూడియోల లావాదేవీలపైనా ఓ కన్నేశామని ఆ శాఖ అధికారులంటున్నారు. నగరంలోని కొన్ని బడా రెస్టారెంట్లు, కోచింగ్ ఇనిస్టిట్యూషన్లు, ఇన్ఫ్రా కంపెనీలు కూడా పన్ను ఎగవేతకు పాల్పడు తున్నాయనే అభిప్రాయంతో అధికారులు ఉన్నారు. దాదాపు 500 బడా సంస్థలకు నోటీసులు కూడా జారీ చేసినట్టు సమాచారం. సినీ నిర్మాతపై పన్నుకు సంబంధించి కేసు నమో దు చేయడం దేశంలోనే ఇదే తొలిసారి.