ఒక సినిమా గురించి ఒక స్టార్ పరిచయం చేస్తే ఆ మాటలు మంత్రాల్లా పని చేస్తాయి. ప్రేక్షకుల దృష్టి ఆ సినిమావైపు మళ్లేలా చేస్తాయి. ఆ మాటలు సినిమాకి అదనపు ఆకర్షణ అవుతాయి. అందుకే కొన్ని చిత్రాలకు స్టార్స్‌తో ‘వాయిస్ ఓవర్’ చెప్పిస్తుంటారు. అలా ఈ మధ్యకాలంలో ‘వాయిస్ ఓవర్’ ఇచ్చిన స్టార్స్ గురించి తెలుసుకుందాం.
దళపతికి ఉలగ నాయగన్ మాట
ఇళయ దళపతి విజయ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘లియో’. ఈ సినిమాకి ఉలగ నాయగన్ (లోక నాయకుడు) కమల్‌హాసన్ వాయిస్ ఓవర్ ఇచ్చారట. ‘మాస్టర్’ తర్వాత విజయ్–లోకేష్ కాంబినేషన్‌లో ‘లియో’ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో త్రిష హీరోయిన్‌గా, సంజయ్ దత్ విలన్‌గా చేస్తున్నారు. జూన్ 22 విజయ్ పుట్టినరోజు సందర్భంగా కొత్త లుక్ రిలీజ్ చేశారు. త్వరలో విడుదల కానున్న ఈ చిత్రం టీజర్‌కి కమల్‌హాసన్‌తో వాయిస్ ఓవర్ చెప్పించారని టాక్. అలాగే ఈ చిత్రంలో కమల్ హాసన్ అతిథి ΄పాత్రలో కనిపిస్తారని కోలీవుడ్ సమాచారం. అక్టోబర్ 19న తమిళ, తెలుగు భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.
సాలే గురించి చెప్పిన టిల్లు
‘డీజే టిల్లు’ సినిమా సూపర్ హిట్ కావడంతో హీరో సిద్ధు జొన్నలగడ్డ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ప్రత్యేకించి యూత్‌లో అతని ఫాలోయింగ్ రెట్టింపయ్యింది. ఈ క్రేజ్ దృష్ట్యా ‘భాగ్ సాలే’ చిత్ర యూనిట్ సిద్ధు జొన్నలగడ్డతో వాయిస్ ఓవర్ చెప్పించింది. తన వాయిస్‌తో ‘భాగ్ సాలే’ చిత్ర నేపథ్యాన్ని వివరిస్తారు సిద్ధు.
కేడీ కోసం మల్టీ స్టార్స్
యాక్షన్ కింగ్ అర్జున్ మేనల్లుడు ధృవ సర్జా హీరోగా నటిస్తున్న తొలి పాన్ ఇండియా చిత్రం ‘కేడీ: ది డెవిల్’. ప్రేమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రీష్మా నానయ్య హీరోయిన్. శిల్పా శెట్టి, సంజయ్ దత్, విజయ్ సేతుపతి కీలకపాత్రలు చేస్తున్నారు. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూ΄÷ందుతోన్న ఈ సినిమా కన్నడతో పాటు తెలుగు, హిందీ, మలయాళం, తమిళ భాషల్లోనూ విడుదలకానుంది. ఈ సినిమా టైటిల్ టీజర్‌కి కన్నడలో చిత్ర దర్శకుడు ప్రేమ్ వాయిస్ ఓవర్ ఇవ్వగా, హిందీలో సంజయ్ దత్, మలయాళంలో మోహన్ లాల్, తమిళంలో విజయ్ సేతుపతి ఇచ్చారు. ఇంకా తెలుగు వాయిస్ ఓవర్ పూర్తి కాలేదట. అక్టోబర్ 15న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment