తొలిరోజే నెగిటివ్ టాక్.. 'థగ్ లైఫ్' కలెక్షన్స్ ఎంత? | Thug Life Movie Day 1 Collection Worldwide | Sakshi
Sakshi News home page

Thug Life Collection: కమల్ సినిమా Day-1 వసూళ్లు ఎంతంటే?

Jun 6 2025 3:23 PM | Updated on Jun 6 2025 4:02 PM

Thug Life Movie Day 1 Collection Worldwide

కమల్ హాసన్ దిగ్గజ నటుడు. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ 'విక్రమ్' తప్పితే ఆయన కెరీర్‌లో గత కొన్నేళ్లలో సరైన హిట్ అన్నది లేదు. దీంతో 'థగ్ లైఫ్' సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. భాష వివాదం వల్ల కర్ణాటకలో పూర్తిగా ఈ మూవీని రిలీజ్ చేయనని తెగేసి చెప్పాడు. దీంతో తెలుగు-తమిళ భాషల్లో నిన్న(జూన్ 5) ఈ చిత్రం థియేటర్లలోకి వచ్చింది. ఇంతకీ దీనికి తొలిరోజు వసూళ్లు ఎంతొచ్చాయ్? సోషల్ మీడియాలో టాక్ ఏం నడుస్తోంది?

కమల్ హాసన్-మణిరత్నం కాంబోలో మూడు దశాబ్దాల క్రితం 'నాయకుడు' అనే సినిమా వచ్చింది. గ్యాంగ్‌స్టర్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రం అ‍ప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. క్లాసిక్‌గా నిలిచిపోయింది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత అదే హీరో-దర‍్శకుడు కలిసి ఓ యాక్షన్ మూవీ చేస్తున్నారనేసరికి హైప్ ఏర్పడింది. 'థగ్ లైఫ్' ట్రైలర్ కూడా బాగుండేసరికి కమల్ హిట్ కొట్టడం గ్యారంటీ అనుకున్నారు. కానీ సినిమా రిలీజ్ తర్వాత పూర్తిగా టాక్ మారిపోయింది.

(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న అఖిల్.. అమ్మాయి బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే?)

తెలుగు, తమిళంలో ఎక్కడా కూడా కమల్ 'థగ్ లైఫ్' చిత్రానికి పాజిటివ్ టాక్ రాలేదు. సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ వస్తున్నాయి. అయినా సరే తొలిరోజు ఓ మాదిరి కలెక్షన్స్ వచ్చాయి. దేశవ్యాప్తంగా రూ.17 కోట్ల నెట్ వసూళ్లు వచ్చాయని తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో మొదటిరోజు రూ.కోటి షేర్ కూడా రాలేదని అంటున్నారు. కమల్-మణిరత్నం కాంబోకి ఇది చాలా తక్కువ మొత్తం అని చెప్పొచ్చు. కొన్నాళ్ల క్రితం వచ్చిన కమల్ హాసన్ 'ఇండియన్ 2' ఘోరమైన ఫ్లాప్. కానీ ఈ చిత్రానికి తొలిరోజు రూ.25 కోట్ల వరకు వచ్చాయి. 'థగ్ లైఫ్'కి మాత్రం వసూళ్లు ఏ మాత్రం ఆశాజనకంగా కనిపించట్లేదు.

'థగ్ లైఫ్' విషయానికొస్తే.. రంగరాయ శక్తిరాజు (కమల్ హాసన్) ఓ గ్యాంగ్‌స్టర్. తల్లిదండ్రులు కోల్పోయిన అమర్ (శింబు) అనే కుర్రాడిని పెంచుకుంటాడు. తన నేర సామ్రాజ్యానికి కీలకంగా మారుస్తాడు. కానీ కొన్ని పరిస్థితుల వల్ల శక్తిరాజు-అమర్ మధ్య గొడవలు వస్తాయి. ఒకరిని ఒకరు చంపుకునేందుకు ప్రయత్నిస్తారు. ఇంతకీ ఇలా జరగడానికి కారణాలేంటి? ఈ కథలో త్రిష పాత్రేంటి? అనేది మిగతా స్టోరీ.

(ఇదీ చదవండి: పవన్ 'ఓజీ' కంటే కన్నప్ప బడ్జెట్ ఎక్కువ: మంచు విష్ణు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement