
కోలీవుడ్ స్టార్ కమల్ హాసన్, దర్శకుడు మణిరత్నం కాంబినేషన్లో దాదాపు 34 ఏళ్ల ముందు రూపొందిన చిత్రం నాయకన్. ఆ చిత్రం అప్పట్లో సాధించిన సంచలన విజయం సాధించింది. కాగా అదే కాంబినేషన్లో మళ్లీ ఇప్పుడు రూపొందుతున్న భారీ చిత్రం థగ్ లైఫ్. దీనిని మణిరత్నానికి చెందిన మెడ్రాస్ టాకీస్, కమలహాసన్‌కు చెందిన రాజ్‌కమల్ ఫిలిం ఇంటర్నేషనల్, ఉదయనిధి స్టాలిన్‌కు చెందిన రెడ్ జెయింట్ మూవీస్ సంస్థలు సంయుక్తంగా ని ర్మిస్తున్నాయి. ఇందులో కమలహాసన్ సరసన నటి త్రిష నటిస్తుండగా నటుడు జయం రవి, దుల్కర్ సల్మాన్, సిద్ధార్థ్ ముఖ్య పాత్రలో పోషిస్తున్నట్లు చిత్ర వర్గాలు ప్రకటించాయి. ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చైన్నెలో ప్రారంభమై ఆ తరువాత విదేశాల్లో చిత్రీకరణకు సినీ వర్గాలు వెళ్లాయి.
అయితే అలాంటి సమయంలో తమిళనాడులో పార్లమెంట్ ఎన్నికల నగారా మోగడంతో నటుడు కమలహాసన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చైన్నెకి తిరిగి వచ్చారు. దీంతో థగ్స్ లైఫ్ చిత్ర షూటింగ్ వాయిదా పడింది. ఈ చిత్ర షెడ్యూల్ వాయిదా పడడంతో నటుడు జయం రవి ఆ తరువాత దుల్కర్ సల్మాన్ ఇటీవల సిద్ధార్థ్ కూడా థగ్స్ లైఫ్ నుంచి వైదొలగినట్లు ప్రచారం జోరుగా సాగింది. అలాగఇందులో నటుడు శింబును ఒక ముఖ్యపాత్రకు ఎంపిక చేసినట్లు ప్రచారం జరిగింది. అలాంటిది ఇప్పుడు ముందుగా ఈ చిత్రం నుంచి వైదొలగినట్లు ప్రచారం జరిగిన జయంరవి, దుల్కర్ సల్మాన్‌లు మళ్లీ ఈ చిత్రంలో నటించడానికి తిరిగి వస్తున్నట్లు తాజా సమాచారం. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కాగా పార్లమెంటు ఎన్నికల ముగిసిన వెంటనే కమలహాసన్ థగ్స్ లైఫ్ చిత్ర షూటింగ్‌లో పాల్గొంటారన్నది తాజా సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment