Ponniyin Selvan 2 first single AR Rahman's 'Aga Naga' is out now - Sakshi
Sakshi News home page

Ponniyin Selvan2 : పొన్నియిన్‌ సెల్వన్‌-2లోని ఫస్ట్‌ సాంగ్‌ విన్నారా?

Published Tue, Mar 21 2023 1:08 PM | Last Updated on Tue, Mar 21 2023 1:25 PM

Ponniyin Selvan2 First Single Ar Rahman Aga Naga Is Out Now - Sakshi

ఆగనందే.. ‘ఆగనందే ఆగనందే.. మోవి నవ్వుతోందే.. మోవి నవ్వే.. మోవి నవ్వే.. మోము నవ్వుతోందే.. మోము నవ్వే.. మోము నవ్వే.. మాను నవ్వుతోందే’ అని పాడుతున్నారు యువరాణి కుందై. ప్రియుడు వల్లవరాయన్‌ వందియ దేవన్‌ కోసమే ఈ పాట. విక్రమ్, ‘జయం’ రవి, కార్తీ, ఐశ్వర్యా రాయ్, త్రిష తదితర భారీ తారాగణంతో మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన ‘పొన్నియిన్‌ సెల్వన్‌2’లోని పాట ఇది. చోళ సామ్రాజ్యం నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో కుందవైగా త్రిష, వందియ దేవన్‌గా కార్తీ నటించారు.

ఈ ఇద్దరి మధ్య సాగే ‘ఆగనందే ఆగనందే మోవి నవ్వుతోందే..’ పాట పూర్తి లిరికల్‌ వీడియోను సోమవారం విడుదల చేశారు. ఏఆర్‌ రెహమాన్‌ స్వరపరచిన ఈ పాటకు అనంత్‌ శ్రీరామ్‌ సాహిత్యం అందించగా శక్తి శ్రీ గోపాలన్‌ పాడారు. ‘పొన్నియిన్‌సెల్వన్‌’కి సీక్వెల్‌గా రూపొందిన రెండో భాగం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏప్రిల్‌ 28న విడుదల కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement