
కోలీవుడ్ స్టార్ జయం రవి, నిత్యామీనన్ జంటగా నటించిన చిత్రం కాదలిక్కా నేరమిల్లై(Kadhalikka Neramillai). ఈ సినిమాను కృతిక ఉదయనిధి తెరకెక్కించారు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో రిలీజైంది. కోలీవుడ్‌లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. జనవరి 14న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం తాజాగా ఓటీటీకి(OTT) వచ్చేందుకు సిద్ధమైంది.
పొంగల్ కానుకగా థియేటర్లలో ఫ్యాన్స్‌ను అలరించిన కాదలిక్కా నేరమిల్లై ఈ నెల 11 నుంచే ఓటీటీలో సందడి చేయనుంది. ఈ మేరకు ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఈ విషయాన్ని వెల్లడించింది. తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానున్నట్లు ప్రకటించింది. దీంతో నెల రోజుల్లోపే ఓటీటీ ప్రియులను అలరించనుంది కాదలిక్కా నేరమిల్లై మూవీ.
(ఇది చదవండి: వారికేమో ముద్దులు, హగ్గులు.. అభిమానితో అలాగేనా?.. హీరోయిన్‌పై నెటిజన్స్ ఫైర్!)
కాగా.. ఈ చిత్రానికి తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ నిర్మాతగా వ్యవహరించారు. ఆయన సతీమణి కృతిక ఉదయనిధి దర్శకత్వం వహించారు. దర్శకురాలిగా ఆమెకు ఇది మూడో సినిమా కావడం మరో విశేషం. ఈ చిత్రంలో జయం రవి, నిత్యతో పాటు యోగి బాబు, వినయ్, లాల్, లక్ష్మీ రామకృష్ణన్, వినోదిని, గాయకుడు మనో, టీజే బాను, జాన్ కోగన్ ప్రధాన పాత్రలు పోషించారు. రెడ్ జెయింట్ మూవీస్ నిర్మించనున్న ఈ చిత్రానికి మ్యూజిక్ కంపోజర్ ఏఆర్ రఘుమాన్ సంగీతం అందించారు.
తెలుగులో నిత్యా మీనన్ కెరీర్..
అలా మొదలైంది సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది నిత్యా మీనన్. అలా మొదటి చిత్రంతోనే జనాలకు బాగా నచ్చేసింది. 180, ఇష్క్, జబర్దస్త్, గుండె జారి గల్లంతయ్యిందే, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, సన్నాఫ్ సత్యమూర్తి, రుద్రమదేవి, ఒక అమ్మాయి తప్ప, జనతా గ్యారేజ్, అ, నిన్నిలా నిన్నిలా, భీమ్లా నాయక్ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం తమిళంలో ఇడ్లీ కడాయ్, డియర్ ఎక్సెస్ సహా మరో సినిమా చేస్తోంది.
Kadhalargal gavanathirkku 👀💕… kadhalikka neram odhikkirunga, yaena…
Kadhalikka Neramillai is coming soon to Netflix on 11 February, in Tamil, Telugu, Malayalam, Kannada and Hindi!#KadhalikkaNeramillaiOnNetflix pic.twitter.com/nuAQsDsjy9— Netflix India South (@Netflix_INSouth) February 6, 2025
Comments
Please login to add a commentAdd a comment