వారికేమో ముద్దులు, హగ్గులు.. అభిమానితో అలాగేనా?.. హీరోయిన్‌పై నెటిజన్స్‌ ఫైర్! | Actress Nithya Menen Behaviour With Fan In Movie Promotion Event; Video Viral | Sakshi
Sakshi News home page

Nithya Menen: వారికి ముద్దులు, హగ్గులు.. అభిమానికి మాత్రం.. నిత్యా తీరుపై విమర్శలు!

Published Thu, Jan 9 2025 7:49 PM | Last Updated on Thu, Jan 9 2025 9:23 PM

Heroine Nithya Menen Behaviour with Fan In Movie Peomotion Event

టాలీవుడ్ హీరోయిన్ నిత్యామీనన్ ప్రస్తుతం ఇడ్లీ కడై అనే కోలీవుడ్ చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాలో ధనుశ్ హీరోగా నటిస్తున్నారు. గతంలో వీరిద్దరు జంటగా రుచిత్రంబ‌లం (తెలుగులో ‘తిరు’) మూవీలో నటించారు. ఈ సినిమాలో నటనకు గానూ నిత్యాకు జాతీయ ఉ‍త్తమ నటి అవార్డ్‌ను దక్కించుకుంది. అంతేకాకుండా జయం రవి సరసన కాదలిక్క నెరమిళ్లై అనే సినిమాలో కనిపించనుంది. ఈ మూవీ సంక్రాంతి కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సందడి చేయనుంది.

కాగా.. ఈ చిత్రానికి తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆయన సతీమణి కిరుతిగ ఉదయనిధి దర్శకత్వంలో తెరకెక్కించారు. దర్శకురాలిగా ఆమెకు ఇది మూడో సినిమా కావడం మరో విశేషం. ఇటీవల ఈ మూవీ ట్రైలర్‌ రిలీజ్ చేయగా ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం  సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కానుంది. తాజాగా చెన్నైలో ఓ ప్రమోషనల్ ఈవెంట్‌ నిర్వహించారు మేకర్స్.

రిలీజ్ తేదీ దగ్గర పడుతుండడంతో మేకర్స్ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే నిర్వహించిన ఓ ఈవెంట్‌కు హీరోయిన్ నిత్యామీనన్ కూడా హాజరైంది. అయితే ఈవెంట్‌లో నిత్యామీనన్ వ్యవహరించిన తీరుపై నెట్టింట విమర్శలొస్తున్నాయి. ఆమె మాట్లాడుతుంగా అక్కడే ఉన్న ఓ వ్యక్తి షేక్ హ్యాండ్ ఇవ్వబోయాడు. కానీ నిత్యా అతన్ని సున్నితంగా తిరస్కరించింది. దీంతో నిత్యామీనన్ తీరుపై నెటిజన్స్ విమర్శలు చేస్తున్నారు. ఆమెది చెత్త బిహేవియర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

కానీ అంతకుముందు ఇదే ఈవెంట్‌లో నిత్యా వ్యవహరించిన తీరు అందరిని షాకింగ్‌కు గురి చేస్తోంది. ఇదే ఈవెంట్‌లో నిత్యా మీనన్ దర్శకుడు మిష్కిన్‌ను ముద్దుపెట్టుకుంది. అంతేకాకుండా మూవీ హీరో జయం రవిని కూడా హగ్ చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. అయితే ఆమె చేసిన దాంట్లో తప్పేమీ లేకపోయినా.. ఓ అభిమాని షేక్ హ్యాండ్‌ ఇస్తే ఇవ్వరా? అంటూ ప్రశ్నిస్తున్నారు నెటిజన్స్. ఫ్యాన్స్‌తో నిత్యా మీనన్ తీరు సరికాదంటూ పోస్టులు పెడుతున్నారు. 

(ఇది చదవండి: ప్రేమకు వ్యతిరేకం కాదు.. అలాంటి ‍వ్యక్తికే నా లైఫ్‌లో చోటు: నిత్యా మీనన్)

కాగా.. ఈ చిత్రంలో జయం రవి, నిత్యతో పాటు యోగి బాబు, వినయ్, లాల్, లక్ష్మీ రామకృష్ణన్, వినోదిని, గాయకుడు మనో, టీజే బాను, జాన్ కోగన్ ప్రధాన పాత్రలు పోషించారు. రెడ్ జెయింట్ మూవీస్ నిర్మించనున్న ఈ చిత్రానికి మ్యూజిక్ కంపోజర్ ఏఆర్ రఘుమాన్ సంగీతం అందించారు.

జాతీయ అవార్డు

కాగా తిరు సినిమాకుగానూ నిత్యామీనన్‌కు ఉత్తమ నటిగా జాతీయ అవార్డు లభించింది. ఈ మూవీలో ధనుష్‌ హీరోగా నటించగా రాశీ ఖన్నా హీరోయిన్‌గా యాక్ట్‌ చేసింది. హీరో స్నేహితురాలిగా నిత్య ఆకట్టుకుంది. మిత్రన్‌ జవహర్‌ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ఇది 2022లో విడుదలైంది. నిత్య లేటెస్ట్‌ మూవీ కాదలిక్క నెరమిళ్లై విషయానికి వస్తే.. ఇందులో జయం రవి, వినయ్‌, యోగి బాబు కీలక పాత్రలు పోషించారు. రెడ్‌ జియాంట్‌ సినిమా నిర్మిస్తున్న ఈ మూవీకి ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ జనవరి 14న విడుదల కానుంది.

తెలుగులో సినీ కెరీర్‌.. 

అలా మొదలైంది సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది నిత్యా మీనన్‌. అలా మొదటి చిత్రంతోనే జనాలకు బాగా నచ్చేసింది. 180, ఇష్క్‌, జబర్దస్త్‌, గుండె జారి గల్లంతయ్యిందే, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, సన్నాఫ్‌ సత్యమూర్తి, రుద్రమదేవి, ఒక అమ్మాయి తప్ప, జనతా గ్యారేజ్‌, అ, నిన్నిలా నిన్నిలా, భీమ్లా నాయక్‌ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం తమిళంలో ఇడ్లీ కడాయ్‌, డియర్‌ ఎక్సెస్‌ సహా మరో సినిమా చేస్తోంది.

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement