![Sudeep Latest Movie Max Ott Streaming Date Fix](/styles/webp/s3/article_images/2025/02/14/sudeep.jpg.webp?itok=HKWFeUHY)
శాండల్‌వుడ్ స్టార్ కిచ్చా సుదీప్ హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ మ్యాక్స్. గతేడాది డిసెంబర్‌లో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో హనుమాన్ నటి వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్ర పోషించారు. టాలీవుడ్ నటుడు సునీల్ ఈ మూవీతో కన్నడ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఈ సినిమాను వి క్రియేషన్స్ పతాకంపై కలైపులి ఎస్ థాను నిర్మించారు.
తాజాగా ఈ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ఈ నెల 15 నుంచే జీ5 వేదికగా స్ట్రీమింగ్ కానుంది. మొదట ఈ నెల 22 నుంచి స్ట్రీమింగ్‌కు రానుందని భావించారు. కానీ వారం రోజుల ముందుగానే ఓటీటీ ప్రియులను అలరించేందుకు వస్తోంది. ఈ మేరకు ప్రత్యేత పోస్టర్‌ను రిలీజ్ చేశారు. దీంతో మరికొన్ని గంటల్లోనే ప్రేక్షకులను అలరించనుంది మ్యాక్స్ మూవీ. ఈ చిత్రంలో అర్జున్ మహాక్షయ్ అనే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కిచ్చా సుదీప్ అభిమానులను మెప్పించారు.
మ్యాక్స్ కథేంటంటే..
సస్పెండ్ అయిన సీఐ అర్జున్ అలియాస్ మాక్స్(సుదీప్ కిచ్చా) తిరిగి తన డ్యూటీలో జాయిన్ అయ్యేందుకు వస్తుంటాడు. అదే సమయంలో ఓ లేడీ కానిస్టేబుల్‌తో అసభ్యకరంగా ప్రవర్తించడంతో ఇద్దరిని చితక్కొట్టి అరెస్ట్ చేస్తాడు. వారిద్దరు మంత్రుల కొడులని తర్వాత తెలుస్తుంది. ఆ మంత్రులు ఇద్దరు సీఎంను దించేందుకు కుట్ర పన్ని ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నాల్లో ఉంటారు. అదే రోజు రాత్రి పోలీసు స్టేషనల్‌లో ఉన్న మంత్రుల కొడుకులిద్దరు చనిపోతారు. వారిద్దరు ఎలా చనిపోయారు..? మినిస్టర్స్ కొడుకుల చనిపోయారనే విషయం బయటకు తెలియకుండా పోలీసులు ఆడిన డ్రామా ఏంటి? మాక్స్ దగ్గర బంధీగా ఉన్న మినిస్టర్స్ కొడుకులను బయటకు తెచ్చేందుకు క్రైమ్ ఇన్‌స్పెక్టర్ రూప(వరలక్ష్మీ శరత్ కుమార్), గ్యాంగ్‌స్టర్ గని(సునీల్) చేసిన ప్రయత్నం ఏంటి? తన తోటి సహచరుల ప్రాణాలను కాపాడేందుకు మాక్స్(Max Review) ఏం చేశాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
The MAXxive blockbuster from Kannada cinema!
Premieres 15th February@KicchaSudeep @theVcreations @Kichchacreatiin @vijaykartikeyaa @AJANEESHB @shekarchandra71 @ganeshbaabu21 @shivakumarart @dhilipaction @kevinkumarrrr @ChethanDsouza @shobimaster @saregamasouth @ZeeKannada pic.twitter.com/ox5wN6U4OO— ZEE5 Telugu (@ZEE5Telugu) February 13, 2025
Comments
Please login to add a commentAdd a comment