
సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్స్ మీరా జాస్మిన్, నయనతార నటించిన చిత్రం 'ది టెస్ట్'. ఈ సినిమాతో నిర్మాత శశికాంత్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ మూవీలో మాధవన్, సిద్ధార్థ్ లీడ్ రోల్స్ చేశారు. చెన్నైలో జరిగిన ఓ అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ మ్యాచ్ ముగ్గురు వ్యక్తుల జీవితాలను ఎలా ప్రభావితం చేసిందనే కథనంతో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కించారు. వైనాట్ స్టూడియోస్ బ్యానర్‌లో ఈ మూవీని తెరకెక్కించారు.
అయితే ఈ సినిమాను నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేయనున్నారు. తాజాగా ఈ విషయాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ వెల్లడించింది. మీరా జాస్మిన్ ఫోటోలు షేర్ చేస్తూ స్ట్రీమింగ్ డేట్‌ను రివీల్ చేసింది. ఏప్రిల్ 4వ తేదీ నుంచి టెస్ట్ మూవీని స్ట్రీమింగ్ చేయనున్నట్లు పోస్ట్ చేసింది. తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ, హిందీలో కూడా అందుబాటులో ఉండనుందని ట్విటర్ ద్వారా తెలిపింది.
ఒకప్పటి స్టార్ హీరోయిన్ మీరా జాస్మిన్ తెలుగువారికి సుపరిచితమే. రవితేజ భద్ర సినిమాతో టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత తెలుగులో పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. టాలీవుడ్‌లో గుడుంబా శంకర్, రారాజు, ఆకాశ రామన్న, గోరింటాకు, బంగారు బాబు, మహారథి లాంటి చిత్రాల్లో కనిపించింది. అయితే కొన్నేళ్లపాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన మీరా.. ఆ తర్వాత విమానం సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం టెస్ట్ మూవీతో ప్రేక్షకులను అలరించేందుకు వస్తోంది.
Some things change, but our love for Meera Jasmine? Never 🥰
Watch TEST, out 4 April in Tamil, Telugu, Malayalam, Kannada and Hindi, only on Netflix!#TestOnNetflix pic.twitter.com/Sm1Neb2B4t— Netflix India South (@Netflix_INSouth) March 18, 2025
Comments
Please login to add a commentAdd a comment