test
-
Iran: యాంటీ-వార్‌షిప్ క్రూయిజ్ క్షిపణి ప్రయోగం విజయవంతం
ఇరాన్ తాజాగా వెయ్యి కిలోమీటర్ల పరిధి సామర్థ్యం కలిగిన నూతన యాంటీ-వార్‌షిప్ క్రూయిజ్ క్షిపణిని పరీక్షించింది. ఇది పర్షియన్ గల్ఫ్‌తో పాటు ఒమన్ సముద్రంలోని యూఎస్ నేవీ నౌకలను లక్ష్యంగా చేసుకోగలుగుతుంది. ఈ క్షిపణి గదర్-380 టైప్ ఎల్ విభాగానికి చెందినది. ఇది యాంటీ-జామింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇది శత్రువుల జామింగ్ వ్యవస్థలను కూడా ఆడ్డుకోగలుగుతుంది.ఈ క్షిపణిని భూగర్భ సౌకర్యాల నుండి ప్రయోగించవచ్చని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్(Iran Revolutionary Guard) నేవీ అధిపతి జనరల్ అలీ రెజా తాంగ్సిరి తెలిపారు. దీనిని ఐదు నిమిషాల కంటే తక్కువ సమయంలోనే ప్రయోగించవచ్చు. అయితే ఈ క్షిపణి మోసుకెళ్లే వార్‌హెడ్ గురించి లేదా పరీక్ష సమయం గురించి ఇరాన్ వెల్లడించలేదు. ఈ క్షిపణి వ్యవస్థ గార్డ్ క్షిపణి వ్యవస్థలలో ఒక భాగం మాత్రమే అని, ఈ క్షిపణి శత్రు యుద్ధనౌకలను సమర్థవంతంగా ఎదుర్కోగలదని సమాచారం.ఈ క్షిపణిని మధ్య ఇరాన్ నుండి ఒమన్ సముద్రం(Oman Sea)లోకి ప్రయోగించారు. ఈ క్షిపణిని నిపుణుడైన ఒక వ్యక్తి ఐదు నిమిషాల కంటే తక్కువ సమయంలో సిద్ధం చేసి ప్రయోగించగలడని, ఇది చాలా ప్రభావవంతంగా ఉంటుందని ఇరాన్ ఒక నివేదికలో పేర్కొంది. ఇరాన్ ఈ క్షిపణిని దక్షిణ తీరంలోని భూగర్భ క్షిపణి కేంద్రం నుండి ప్రయోగించింది. ఈ క్షిపణి శత్రు యుద్ధనౌకలకు చుక్కలు చూపిస్తుందని ఇరాన్ పేర్కొంది. 2024లో గాజాలోని హమాస్, లెబనాన్‌లోని హిజ్బుల్లాతో యుద్ధం జరుగుతున్న సమయంలో ఇరాన్ రెండు వేర్వేరు సందర్భాలలో ఇజ్రాయెల్‌పై వందలాది క్షిపణులను ప్రయోగించింది. అయితే ఇజ్రాయెల్ తన రక్షణ వ్యవస్థల ద్వారా ఈ క్షిపణులను అడ్డుకుని, నాశనం చేసింది.ఇది కూడా చదవండి: ఆర్థిక సంక్షోభంలో మాల్దీవులు.. స్పందించిన భారత్ -
ఓటీటీలో డైరెక్ట్‌గా విడుదల కానున్న నయనతార, సిద్ధార్థ్ సినిమా
నయనతార(Nayanthara) నటించిన ‘ది టెస్ట్’(The Test) సినిమా డైరెక్ట్‌గా ఓటీటీలో (OTT) విడుదల కానుంది. వైనాట్ స్టూడియోస్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుంది. క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో నయనతారతో పాటు మాధవన్, సిద్ధార్థ్ (Siddharth) లీడ్ రోల్స్ చేశారు. మీరా జాస్మిన్ ఓ కీలక పాత్రలో నటించిన ఈ సినిమాతో నిర్మాత శశికాంత్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సుమారు రెండు దశాబ్దాలుగా కథానాయకిగా వెలుగొందుతున్న నటి నయనతార. వృత్తి పరంగానూ వ్యక్తిగతంగానూ ఈమె చూడాల్సిన ఎత్తుపల్లాలు లేవని చెప్పవచ్చు. వృత్తిపరంగా ఎన్నో అవమానాలను ఎదుర్కొని లేడి సూపర్ స్టార్ స్థాయికి ఎదిగారు. ఇక వ్యక్తిగతం గాను పలుమార్లు ప్రేమలో విఫలం అయ్యారు. అయినప్పటికీ మనోధైర్యంతో ముందుకు సాగుతూ ఇప్పుడు భార్యాగానూ ఇద్దరు కవల పిల్లలకు తల్లిగానూ అందమైన సంసార జీవితాన్ని కొనసాగిస్తున్నారు. అయితే వివాదాస్పద నటి అన్నది నయనతార పేరుకు ముందు అంటి పెట్టుకునే ఉంటుంది. అయినప్పటికీ కథానాయకిగా ఇప్పటికీ బిజీ నటినే. చిత్రానికి రూ.12 నుంచి రూ. 15 కోట్లు పారితోషికం తీసుకుంటూ అగ్ర కథానాయకిగా రాణిస్తున్నారు. పలు చిత్రాలు చేతిలో ఉన్నాయి. వాటిలో ఒకటి టెస్ట్. నిర్మాత శశికాంత్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం కొన్ని నెలల క్రితమే నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. దీంతో చిత్ర విడుదల కోసం నయనతార అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా తాజా సమాచారం ప్రకారం టెస్ట్ చిత్రాన్ని థియేటర్లో కాకుండా నేరుగా ఓటీటీలో విడుదల కానుందని తెలిసింది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే నిలబడే అవకాశం ఉంది. చెన్నైలో జరిగిన ఓ అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ మ్యాచ్ ముగ్గురు వ్యక్తుల జీవితాలను ఎలా ప్రభావితం చేసిందనే ప్రధాన కాన్సెప్ట్‌తో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కించారు. ఈ చిత్రంలో 'కుముధ' అనే పాత్రలో నయన్ కనిపించనుంది. ఇకపోతే ఇంతకుముందు కూడా నయనతార ప్రధాన పాత్రను పోషించిన మూకుత్తి అమ్మన్(అమ్మోరు తల్లి), నెట్రికన్ చిత్రాలు నేరుగా ఓటీటీలోనే విడుదల కావడం గమనార్హం. ఈ సినిమా తర్వాత నయన్ చేతిలో డియర్ స్టూడెంట్స్, అమ్మోరు తల్లి 2 చిత్రాలు ఉన్నాయి. -
దివ్యాంగులకు మళ్లీ పింఛన్ ‘పరీక్షలు’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో దివ్యాంగ పింఛన్ లబ్ధిదారులకు ఈ నెల 23 నుంచి అసలు సిసలు కష్టాలు మొదలుకానున్నాయి. ఇప్పటివరకూ దీర్ఘకాలిక, తీవ్ర అనారోగ్యంతో పింఛన్లు పొందుతున్న వారి ఇంటివద్దకే డాక్టర్లను పంపి వైద్యపరీక్షలు నిర్వహించిన ప్రభుత్వం.. ఇప్పుడు మళ్లీ వారి అర్హతను గుర్తించేందుకు మరోసారి వారిని పరీక్షించనుంది. ఏరియా లేదా జిల్లా ప్రభుత్వాసుపత్రుల్లో వైద్య పరీక్షలకు హాజరుకావాలంటూ వారికి నోటీసులివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం శనివారం అన్ని జిల్లాల డీఆర్డీఏ, వైద్యశాఖ అధికారులను ఆదేశించింది.దీంతో రాష్ట్రంలో ఏళ్ల తరబడి పింఛన్లు పొందుతున్న 7,87,976 మంది వివిధ కేటగిరీల దివ్యాంగ పింఛనర్లతో పాటు మరో 6,833 మంది కుష్ఠువ్యాధి పింఛన్ లబ్ధిదారులు కనీసం 60–100 కిలోమీటర్ల దూరంలో ఉండే ఏరియా లేదా జిల్లా ప్రభుత్వాసుపత్రులకు వ్యయ ప్రయాసలతో వెళ్లి పరీక్షలకు హాజరుకావాలి. కొన్ని జిల్లాలో సంబంధిత వైద్యులు లేకపోవడం లేదా వైద్య పరికరాలు లేనందున పొరుగు జిల్లాలకు వెళ్లాల్సి ఉంటుంది. ఈనెల 20 నుంచి నోటీసులిచ్చి 23 నుంచి పరీక్షలు నిర్వహించనున్నారు. 8,000 మందికి ఇంటివద్దే పరీక్షలు పూర్తి.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక పింఛన్లలో కోత పెట్టడమే లక్ష్యంగా 8,18,900 దివ్యాంగ పింఛనుదారుల అర్హతను పరీక్షించేందుకు ప్రభుత్వం కొత్తగా మార్గదర్శకాలను విడుదల చేసింది. వీరిలో 24,091 మంది పెరాలసిస్, తీవ్ర కండరాల వ్యాధులతో బాధపడేవారు కాగా.. 7,87,976 మంది దివ్యాంగ పింఛను లబ్ధిదారులు.. 6,833 మంది కుష్టు వ్యాధిగ్రస్తులున్నారు. పెరాలసిస్, తీవ్ర కండరాల వ్యాధులతో బాధపడే వారికి ఈనెల 6 నుంచి వారి ఇంటి వద్దకే వైద్యులు వచ్చి అర్హత పరీక్షలు నిర్వహించే ప్రక్రియ ప్రారంభమైంది. వీరిలో ఇప్పటివరకు 8,010 మందికి పూర్తయ్యాయి.మిగిలిన వారికి ఈనెల 29లోగా పూర్తిచేయనున్నారు. అలాగే, నేత్ర సంబంధిత కేటగిరి లబ్ధిదారులకు ఆసుపత్రుల వద్దే పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం ఆయా జిల్లాల అధికారులకు సూచించింది. దీంతో.. ఈనెల 23 నుంచి అన్ని జిల్లాల్లోని 90,302 మంది కంటిచూపు సమస్యతో బాధపడుతున్న లబ్ధిదారులతో పాటు 1,09,232 మంది వినికిడి లోపం ఉన్న వారికి పరీక్షలు నిర్వహించనున్నారు. ఇక ఆర్థో సంబంధిత పింఛనుదారులకు కూడా ఆయా జిల్లాల్లోని ప్రభుత్వాసుపత్రుల్లోనే పరీక్షలు నిర్వహిస్తారు.కొత్త సర్టిఫికెట్ల జారీ తర్వాత రద్దు నోటీసులు.. వైద్య పరీక్షలు పూర్తయిన పింఛనుదారులకు కొత్త సదరం సరి్టఫికెట్ల జారీ నిమిత్తం ప్రభుత్వం వెబ్ అప్లికేషన్‌ను అందుబాటులోకి తెచి్చంది. వైద్యులు ఆ వెబ్ అప్లికేషన్లో పరీక్షల వివరాలను నమోదుచేశాక ప్రమాణాల ప్రకారం కొత్త సదరం సర్టిఫికెట్లను లబ్ధిదారులకు అందజేస్తారు. ఈ ప్రక్రియ శనివారం నుంచి ప్రారంభమైనట్లు అధికారులు చెప్పారు. అలాగే, వైద్య పరీక్షలు పూర్తయిన వారికి కొత్త సదరం సరి్టఫికెట్ల జారీ అనంతరం, అర్హత ఆధారంగా పింఛను రద్దు నోటీసులు జారీచేస్తామన్నారు. -
విజయం దిశగా ఆస్ట్రేలియా ‘ఎ’
మెక్కే (ఆ్రస్టేలియా): బౌలర్ల పట్టుదలకు బ్యాటర్ల క్రమశిక్షణ తోడవడంతో భారత్ ‘ఎ’తో జరుగుతున్న తొలి అనధికారిక టెస్టులో ఆ్రస్టేలియా ‘ఎ’ విజయం దిశగా సాగుతోంది. ఓవర్‌నైట్ స్కోరు 208/2తో శనివారం మూడో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ ‘ఎ’ జట్టు 100 ఓవర్లలో 312 పరుగులకు ఆలౌటైంది.సాయి సుదర్శన్ (200 బంతుల్లో 103; 9 ఫోర్లు) సెంచరీ పూర్తి చేసుకోగా... దేవదత్ పడిక్కల్ (199 బంతుల్లో 88;6 ఫోర్లు) రాణించాడు. వీరిద్దరూ సాధికారికంగా ఆడటంతో ఒక దశలో భారత్ ‘ఎ’ 226/2తో పటిష్ట స్థితిలో కనిపించింది. మిడిలార్డర్ కూడా రాణిస్తే... మ్యాచ్‌పై పట్టు చిక్కినట్లే అని భావిస్తే... కింది వరస బ్యాటర్లు కనీస పోరాటం చేయకుండానే చేతులెత్తేశారు. వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ (32; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) కాసేపు మెరిపించగా... బాబా ఇంద్రజిత్ (6), నితీశ్ కుమార్ రెడ్డి (17), మానవ్ సుతార్ (6) నిలువలేకపోయారు. ఆ్రస్టేలియా ‘ఎ’ బౌలర్లలో ఫెర్గూస్ ఓ నీల్ 4, టాడ్ మర్ఫీ మూడు వికెట్లు పడగొట్టారు. దీంతో కంగారూల ముందు 225 పరుగుల లక్ష్యం నిలవగా... శనివారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా ‘ఎ’ రెండో ఇన్నింగ్స్‌లో 50.3 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. కెప్టెన్ నాథన్ మెక్‌స్వీనీ (47 బ్యాటింగ్; 5 ఫోర్లు), మార్కస్ హారీస్ (36; 4 ఫోర్లు) రాణించారు. భారత బౌలర్లలో ముకేశ్ కుమార్, ప్రసిధ్ కృష్ణ, మానవ్ సుతార్ తలా ఒక వికెట్ పడగొట్టారు. చేతిలో ఏడు వికెట్లు ఉన్న ఆ్రస్టేలియా ‘ఎ’ జట్టు విజయానికి మరో 86 పరుగులు చేయాల్సి ఉంది. మెక్‌స్వీనీతో పాటు వెబ్‌స్టర్ (19 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. అంతకుముందు భారత్ ‘ఎ’ తొలి ఇన్నింగ్స్‌లో 107 పరుగులకు ఆలౌట్ కాగా... ఆస్ట్రేలియా ‘ఎ’ జట్టు 195 పరుగులు చేసింది. -
ఇంగ్లండ్ లక్ష్యం 297
ముల్తాన్: ఇంగ్లండ్ ముల్తాన్ వేదికపై మరో టెస్టు విజయం కోసం గట్టి ప్రయత్నమే చేస్తోంది. రెండో ఇన్నింగ్స్‌లో ఆతిథ్య పాకిస్తాన్‌ను తక్కువ స్కోరుకే కట్టడి చేసిన ఇంగ్లండ్ ముందు 297 పరుగుల లక్ష్యం ఉంది. రెండు రోజుల సమయం ఉన్నప్పటికీ ఓ రోజు ముందే దీన్ని ఛేదించే బాధ్యత బ్యాటర్లు తీసుకుంటే ఇంగ్లండ్ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను వశం చేసుకునే స్వర్ణావకాశం జట్టును ఊరిస్తోంది. అయితే మూడో రోజును ఇరుజట్ల బౌలర్లు శాసించారు. దీంతో 16 వికెట్లు కూలాయి. గురువారం ముందుగా ఓవర్‌నైట్ స్కోరు 239/6తో తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఇంగ్లండ్ 67.2 ఓవర్లలో 291 పరుగుల వద్ద ఆలౌటైంది. స్పిన్నర్ సాజిద్ ఖాన్... బ్రైడన్ కార్స్ (4), పాట్స్ (6) బషీర్ (9) వికెట్లను కూడా పడేయడంతో ఈ ఇన్నింగ్స్‌లో అతనికి ఏకంగా 7 వికెట్లు దక్కాయి. ఓవర్‌నైట్ బ్యాటర్ స్మిత్ (21; 2 ఫోర్లు), పదో వరుస బ్యాటర్ జాక్ లీచ్ (25 నాటౌట్; 3 ఫోర్లు) ఇరవై పైచిలుకు స్కోరు చేయడంతో ఇంగ్లండ్ క్రితం రోజు స్కోరుకు 52 పరుగులు జత చేసింది. పిచ్ స్వభావాన్ని గుర్తించి ఇంగ్లండ్ కూడా స్పిన్నర్లతో ఆటను ప్రారంభించడంతో పాకిస్తాన్ రెండో ఇన్నింగ్స్‌లో 59.2 ఓవర్లలో 221 పరుగుల వద్ద ఆలౌటైంది.టాపార్డర్ బ్యాటర్లు షఫీఖ్ (4), అయూబ్ (22; 1 ఫోర్), షాన్ మసూద్ (11)లకు షోయబ్ బషీర్ స్పిన్ ఉచ్చు బిగించగా, మరో స్పిన్నర్ లీచ్... కమ్రాన్ గులామ్ (26; 5 ఫోర్లు), సౌద్ షకీల్ (31; 2 ఫోర్లు)లను ఎల్బీగా వెనక్కి పంపాడు. దీంతో పాక్ 114 పరుగులకే 5 వికెట్లను కోల్పోయింది. ఏడో వరుస బ్యాటర్ సల్మాన్ ఆఘా (63; 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీతో పాక్ 200 పైచిలుకు స్కోరు చేయగలిగింది. బషీర్ 4, లీచ్ 3, పేసర్ కార్స్ 2 వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్స్‌లో పొందిన 75 పరుగుల ఆధిక్యం వల్ల పాక్ ఇంగ్లండ్ ముందు 297 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు క్రాలీ (3), డకెట్ (0) వికెట్లు కోల్పోయి 36/2 స్కోరు చేసింది. ఓలీ పోప్ (21 బ్యాటింగ్, 2 ఫోర్లు), రూట్ (12 బ్యాటింగ్; 1 ఫోర్) క్రీజులో ఉన్నారు. -
ఇంటికొచ్చి లింగ నిర్ధారణ పరీక్ష
కామారెడ్డి టౌన్: మొబైల్ వైద్య పరీక్షల ముసుగులో ఇంటి వద్దకే వచ్చి లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న ఓ వ్యక్తి పోలీసులకు చిక్కాడు. ఈ ఘటన గురువారం కామారెడ్డి జిల్లా రాజంపేట మండలంలో చోటు చేసుకుంది. మండల కేంద్రానికి చెందిన బల్ల రవీందర్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో స్కానింగ్ సెంటర్లో పని చేస్తూ గర్భిణీలకు లింగనిర్ధారణ పరీక్షలు ఎలా చేయాలో నేర్చుకున్నాడు. ఓ గర్భిణి లింగనిర్ధారణ కేసులో ఆ ఆస్పత్రి రెండేళ్ల క్రితం సీజ్ కావడంతో రవీందర్ రాజంపేటలో స్వయంగా లింగనిర్ధారణ పరీక్షలు ప్రారంభించాడు. ఇందుకోసం ఓ మినీ స్కానింగ్ యంత్రాన్ని కొనుగోలు చేశాడు.వాస్తవానికి అతనికి స్కానింగ్ చేసే అర్హత లేదు. అయితే వారి కుటుంబ వృత్తి అయిన బీడీ కార్ఖానా ముసుగులో స్కానింగ్ పరీక్షలు ప్రారంభించాడు. రోజూ బీడీల గంప పేరుతో జిల్లావ్యాప్తంగా పలు గ్రామాల్లో పర్యటించి గర్భిణీలకు లింగనిర్ధారణ పరీక్షలు చేస్తూ డబ్బులు దండుకుంటున్నాడు. చట్ట విరుద్ధంగా లింగ నిర్ధారణ చేస్తూ ఆడ, మగ శిశువు అని చెప్పి గర్భస్థ పిండాలను చిదిమేసేందుకు కారకుడయ్యాడు. కామారెడ్డి, గాంధారి, తాడ్వాయి, దోమకొండ, బీబీపేట, మాచారెడ్డి, సదాశివనగర్, ఎల్లారెడ్డి, బాన్సువాడ ఇలా చాలా మండలాలకు తన ద్విచక్ర వాహనంపై మినీ స్కానింగ్ యంత్రాన్ని తీసుకెళ్లి గర్భిణి ఇంటి వద్దనే లింగనిర్ధారణ పరీక్షలు చేస్తున్నాడు.ఆడ పిల్లలుండి మగ పిల్లలు కావాలనుకునే వారి గురించి ఆరాతీస్తూ గుట్టుచప్పుడు కాకుండా రెండేళ్లుగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నాడు. ఒక్కొక్కరి నుంచి రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు వసూలు చేస్తున్నాడు. ఈ విషయమై ఫిర్యాదులు రావడంతో కామారెడ్డి సీసీఎస్ పోలీసులు బుధవారం అర్ధరాత్రి రవీందర్ ఇంటిపై దాడి చేసి అరెస్టు చేశారు. ఇంట్లో ఉన్న స్కానింగ్ యంత్రాన్ని స్వాధీనం చేసుకుని దేవునిపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారణ చేస్తున్నారు. -
పాక్‌తో తొలి టెస్టు.. ఇంగ్లండ్ 823
ముల్తాన్: టెస్టు ఫార్మాట్లో వన్డే తరహా ఆటతీరుతో విజృంభించిన ఇంగ్లండ్ జట్టు పలు రికార్డులను బద్దలు కొట్టింది. పాకిస్తాన్ బౌలింగ్‌ను తుత్తునియలు చేస్తూ... హ్యారీ బ్రూక్ (322 బంతుల్లో 317; 29 ఫోర్లు, 3 సిక్సర్లు) ట్రిపుల్ సెంచరీ, జో రూట్ (375 బంతుల్లో 262; 17 ఫోర్లు) డబుల్ సెంచరీతో చెలరేగారు. ఫలితంగా ముల్తాన్ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌ను 823/7 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. టెస్టు క్రికెట్ చరిత్రలో నాలుగో అత్యధిక స్కోరును తమ పేరిట లిఖించుకున్న ఇంగ్లండ్ జట్టు... పలు రికార్డులు ఖాతాలో వేసుకుంది. ఓవర్‌నైట్ స్కోరు 492/3తో గురువారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్ జట్టు... నాలుగో రోజు 49 ఓవర్లు మాత్రమే బ్యాటింగ్ చేసి 331 పరుగులు రాబట్టింది. ఈ క్రమంలో రూట్, బ్రూక్ నాలుగో వికెట్‌కు 454 పరుగులు జోడించి కొత్త ప్రపంచ రికార్డు సృష్టించారు. అంతేకాకుండా ఇంగ్లండ్ తరఫున ఏ వికెట్‌కైనా అత్యధిక భాగస్వామ్యం నమోదు చేశారు. మొదట రూట్ డబుల్ సెంచరీ పూర్తి చేసుకోగా... కాసేపటికే బ్రూక్ ద్విశతకం ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత మరింత ధాటిగా ఆడిన బ్రూక్ వరుస బౌండరీలతో రెచ్చిపోయాడు. పాక్ బౌలర్లు ఎంత ప్రయత్నించినా ఈ జోడీని విడదీయలేకపోగా... బ్రూక్ 310 బంతుల్లో టెస్టు కెరీర్లో తొలి ట్రిపుల్ సెంచరీ అందుకున్నాడు. గ్రాహం గూచ్ తర్వాత (1990లో; భారత్‌పై) ట్రిపుల్ సెంచరీ బాదిన ఇంగ్లండ్ క్రికెటర్‌గా బ్రూక్ నిలిచాడు. ఓవరాల్‌గా టెస్టు క్రికెట్లో ఇది 20వ అత్యధిక వ్యక్తిగత స్కోరు. పాకిస్తాన్ బౌలర్లలో ఆరుగురు 100 కంటే ఎక్కువ పరుగులు సమర్పించుకోవడం గమనార్హం. నసీమ్ షా, ఆయూబ్ చెరో రెండు వికెట్లు తీశారు. అనంతరం 267 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్తాన్ గురువారం ఆట ముగిసే సమయానికి 37 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసింది. సల్మాన్ (49 బంతుల్లో 41 బ్యాటింగ్; 5 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా... షఫీఖ్ (0), షాన్ మసూద్ (11), బాబర్ ఆజమ్ (5), రిజ్వాన్ (10), ఆయూబ్ (25), షకీల్ (29) విఫలమయ్యారు. నేడు ఆటకు ఆఖరి రోజు. చేతిలో నాలుగు వికెట్లు ఉన్న పాకిస్తాన్... ప్రత్యర్థి స్కోరుకు ఇంకా 115 పరుగులు వెనుకబడి ఉంది. సల్మాన్‌తో పాటు ఆమేర్ జమాల్ (27 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. ఇవీ రికార్డులు4 టెస్టు క్రికెట్ చరిత్రలో ఇది (823/7 డిక్లేర్డ్) నాలుగో అత్యధిక టీమ్ స్కోరు. గతంలో శ్రీలంక (1997లో భారత్‌పై 952/6 డిక్లేర్డ్), ఇంగ్లండ్ (1938లో ఆ్రస్టేలియాపై 903/7 డిక్లేర్డ్; 1930లో వెస్టిండీస్‌పై 849) ఎనిమిది వందల పైచిలుకు పరుగులు చేశాయి. 1 పాకిస్తాన్‌పై ఒక జట్టు చేసిన అత్యధిక పరుగులు ఇవే (823/7 డిక్లేర్డ్). 1958లో వెస్టిండీస్ చేసిన 790/3 డిక్లేర్డ్ రెండో స్థానంలో ఉంది. పాకిస్తాన్ గడ్డపై నమోదైన అత్యధిక స్కోరు కూడా ఇదే.454 టెస్టు క్రికెట్లో నాలుగో వికెట్‌కు నమోదైన అత్యధిక భాగస్వామ్యం. 449 పరుగులతో ఆడమ్ వోజెస్, షాన్ మార్‡్ష (ఆస్ట్రేలియా; 2015లో వెస్టిండీస్‌పై) పేరిట ఉన్న రికార్డును రూట్, బ్రూక్ బద్దలు కొట్టారు.2 టెస్టు క్రికెట్ చరిత్రలో బ్రూక్‌ది రెండో వేగ వంతమైన ట్రిపుల్ సెంచరీ. 2008లో దక్షిణాఫ్రికాపై వీరేంద్ర సెహా్వగ్ 278 బంతుల్లోనే ట్రిపుల్ సెంచరీ బాదగా... ఇప్పుడు బ్రూక్ 310 బంతుల్లో ట్రిపుల్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. -
యువ భారత్‌దే టెస్టు సిరీస్
చెన్నై: ఆద్యంతం నిలకడగా రాణించిన యువ భారత్ జట్టు అదరగొట్టింది. ఆ్రస్టేలియా అండర్–19 జట్టుతో జరిగిన రెండో అనధికారిక టెస్టులో భారత జట్టు ఇన్నింగ్స్ 120 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఫలితంగా రెండు మ్యాచ్‌ల యూత్ సిరీస్‌ను టీమిండియా 2–0తో కైవసం చేసుకుంది. అంతకుముందు యూత్ వన్డేల్లోనూ ఆ్రస్టేలియాను క్లీన్‌స్వీప్ చేసిన యువ భారత్... సుదీర్ఘ ఫార్మాట్లోనూ అదే ఫలితాన్ని పునరావృతం చేసింది. భారత బౌలర్ల ధాటికి మూడు రోజుల్లోనే మ్యాచ్ ముగియగా... బుధవారం ఒక్క రోజే 17 వికెట్లు నేలకూలడం విశేషం.ఓవర్‌నైట్ స్కోరు 142/3తో మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆస్ట్రేలియా అండర్–19 జట్టు చివరకు 80.2 ఓవర్లలో 277 పరుగులకు ఆలౌటైంది. కెపె్టన్ ఒలీవర్ పెక్ (199 బంతుల్లో 117;16 ఫోర్లు, ఒక సిక్స్) సెంచరీతో రాణించగా... అలెక్స్ లీ యాంగ్ (66; 9 ఫోర్లు) ఆకట్టుకున్నాడు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 166 పరుగులు జోడించి ఆదుకునే ప్రయత్నం చేశారు. ఒకసారి ఈ జోడీ విడిపోయాకా ఆసీస్ ప్లేయర్లు పెవిలియన్‌కు వరుస కట్టారు. 59 పరుగుల వ్యవధిలో ఆసీస్ చివరి 6 వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్లలో మొహమ్మద్ ఇనాన్, అన్మోల్జీత్ సింగ్ చెరో నాలుగు వికెట్లు పడగొట్టారు. దీంతో యువ భారత జట్టుకు 215 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. దీంతో ఆ్రస్టేలియా జట్టును ఫాలోఆన్ ఆడించింది. అప్పటికే తొలి ఇన్నింగ్స్‌లో పేలవ ప్రదర్శన చేసి ఉన్న కంగారూలు... రెండో ఇన్నింగ్స్‌లో ఆ మాత్రం కూడా పోరాడలేకపోయారు. 31.3 ఓవర్లలో 95 పరుగులకే కుప్పకూలారు. మొత్తం జట్టులో ముగ్గురు ప్లేయర్లు మాత్రమే రెండంకెల స్కోరు అందుకోగలిగారు.సిమోన్ బడ్జ్ (26; 3 ఫోర్లు, ఒక సిక్సర్), స్టీవెన్ హోగన్ (29;4 ఫోర్లు), పదకొండో స్థానంలో బరిలోకి దిగిన హ్యారీ హొకెస్ట్రా (20 నాటౌట్; 2 ఫోర్లు, ఒక సిక్స్) తలా కొన్ని పరుగులు చేశారు. మిగిలినవాళ్లంతా విఫలమయ్యారు. భారత బౌలర్లలో అన్మోల్ జీత్ సింగ్‌కు 5, లెగ్ స్పిన్నర్ మొహమ్మద్ ఇనాన్కు మూడు వికెట్లు దక్కాయి. అంతకుముందు యువ భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 492 పరుగులు చేసింది. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 9 వికెట్లు పడగొట్టిన అరంగేట్ర ఆఫ్ స్పిన్నర్ అన్మోల్జీత్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఈ మ్యాచ్‌లో అన్మోల్జీత్, ఇనాన్ కలిసి 16 వికెట్లు పడగొట్టడం విశేషం. -
Ind vs Aus: భారత బ్యాటర్ రికార్డు.. ప్రపంచంలోనే తొలిసారి
U19 Ind vs Aus Day 1 Final Update: ఆస్ట్రేలియా అండర్–19 జట్టుపై వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన భారత అండర్–19 జట్టు అనధికారిక టెస్టు సిరీస్‌ను కూడా మెరుగ్గా ఆరంభించింది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా చెన్నై వేదికగా సోమవారం తొలి అనధికారిక టెస్టు ప్రారంభమైంది. 293 పరుగులకు ఆసీస్ ఆలౌట్‌టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 71.4 ఓవర్లలో 293 పరుగులకు ఆలౌటైంది. రిలే కింగ్సెల్ (77 బంతుల్లో 53; 9 ఫోర్లు, ఒక సిక్సర్), ఎయిడెన్ ఓ కానర్ (70 బంతుల్లో 61; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ శతకాలు సాధించారు. భారత జట్టు బౌలర్లలో సమర్థ్ నాగరాజ్, మొహమ్మద్ ఇనాన్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి 14 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 103 పరుగులు చేసింది. ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ (47 బంతుల్లో 81 బ్యాటింగ్; 13 ఫోర్లు, 2 సిక్సర్లు), విహాన్ మల్హోత్రా (21 బ్యాటింగ్, 3 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. చేతిలో 10 వికెట్లు ఉన్న యువ భారత్... ప్రత్యర్థి స్కోరుకు 190 పరుగులు వెనుకబడి ఉంది. వైభవ్ రికార్డు అర్ధ శతకం అంతర్జాతీయ క్రికెట్లో హాఫ్ సెంచరీ సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా యువ భారత్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ రికార్డుల్లోకెక్కాడు. వైభవ్ 13 సంవత్సరాల 187 రోజుల్లో ఈ ఘనత సాధించాడు. ఏ స్థాయి క్రికెట్లోనైనా ఇదే అతి పిన్న వయసులో అంతర్జాతీయ అర్ధసెంచరీ. అంతకుముందు ఈ రికార్డు బంగ్లాదేశ్ ప్లేయర్ నజ్ముల్ హసన్ షాంటో (14 సంవత్సరాల 231 రోజులు) పేరిట ఉంది. శ్రీలంకపై నజ్ముల్ ఈ రికార్డు నమోదు చేశాడు.సమిత్ ద్రవిడ్‌కు గాయం భారత అండర్–19 జట్టులో సభ్యుడైన క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ కుమారుడు సమిత్ ద్రవిడ్ మోకాలి గాయం కారణంగా ఆ్రస్టేలియాతో అనధికారిక టెస్టు మ్యాచ్‌కు దూరమయ్యాడు. రెండో మ్యాచ్ వరకూ అతడు కోలుకోవడం అనుమానమే. ప్రస్తుతం సమిత్ బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో పునరావాసం పొందుతున్నాడు. ఇటీవల యూత్ వన్డే సిరీస్‌కు కూడా గాయం కారణంగానే దూరమైన సమిత్... కోలుకునేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉన్నట్లు భారత అండర్–19 జట్టు కోచ్ హృషికేశ్ కనిత్కర్ తెలిపాడు. అండర్–19 స్థాయిలో ఆడేందుకు సమిత్ ద్రవిడ్‌కు ఇదే చివరి అవకాశం కాగా... ఈ నెల 11న అతడు 19వ పడిలోకి అడుగు పెట్టనున్నాడు. దీంతో 2026లో జరగనున్న అండర్–19 ప్రపంచకప్‌లో ఆడే అర్హత కోల్పోయాడు. -
‘ఐదు రోజులకు తీసుకెళ్లాలి’
చెన్నై: భారత్‌తో రెండు టెస్టులు, ఆపై మూడు టి20 మ్యాచ్‌ల సిరీస్ ఆడేందుకు బంగ్లాదేశ్ జట్టు భారత గడ్డపై ఆదివారం అడుగు పెట్టింది. ఢాకా నుంచి ఆటగాళ్ల బృందం తొలి టెస్టు వేదిక అయిన చెన్నైకి నేరుగా చేరుకుంది. తమ దేశంలో అంతర్యుద్ధం కొనసాగుతున్న పరిస్థితుల నేపథ్యంలో క్రికెట్ సిరీస్ కోసం భారత్‌కు వచ్చిన బంగ్లాదేశ్ జట్టుకు సెక్యూరిటీ కల్పించే విషయంలో బీసీసీఐ ప్రత్యేక దృష్టి పెట్టింది. టీమ్ బస చేస్తున్న హోటల్లో బోర్డు అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు చేసింది. సోమవారం నుంచి బంగ్లాదేశ్ జట్టు ప్రాక్టీస్ మొదలు పెడుతుంది. 19 నుంచి ఇరు జట్ల మధ్య ఎంఎ చిదంబరం స్టేడియంలో తొలి టెస్టు జరుగుతుంది. సీనియర్ ప్లేయర్ షకీబ్ అల్ హసన్ మినహా బంగ్లాదేశ్ ఆటగాళ్లంతా వచ్చారు. ప్రస్తుతం ఇంగ్లండ్‌లో కౌంటీలు ఆడుతున్న షకీబ్ టెస్టు సమయానికి నేరుగా చెన్నైకి చేరుకుంటాడు. భారత్‌కు బయల్దేరడానికి ముందు బంగ్లాదేశ్ కెప్టెన్నజు్మల్ హసన్ షంటో మీడియాతో మాట్లాడాడు. ‘పాకిస్తాన్‌పై సిరీస్ విజయంతో ఆత్మవిశ్వాసం పెరిగింది. భారత్‌తో సిరీస్‌లో గట్టి పోటీ ఇవ్వగలం. టెస్టు మ్యాచ్‌లలో కుప్పకూలిపోకుండా ఆటను ఐదు రోజుల వరకు తీసుకెళ్లడం మా తొలి లక్ష్యం. భారత్‌తో సిరీస్ మాకు సవాల్. అందరిలాగే మేమూ అన్ని మ్యాచ్‌లు గెలవాలనే కోరుకుంటాం. మా బలానికి తగినట్లుగా ఆడటం ముఖ్యం. మా అత్యుత్తమ ప్రదర్శన కూడా ఇవ్వాలి’ అని నజ్ముల్ చెప్పాడు. -
ముందస్తుగా స్ట్రెస్ టెస్ట్
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్ పథకాలకు సంబంధించి స్ట్రెస్ టెస్ట్‌ను ముందస్తుగా నిర్వహించాలని పరిశ్రమను కోరినట్టు సెబీ హోల్‌టైమ్ సభ్యుడు అనంత్ నారాయణ్ గోపాలకృష్ణన్ తెలిపారు. మ్యూచువల్ ఫండ్స్‌పై నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడారు. స్ట్రెస్ టెస్ట్ కేవలం పథకాల కోసమో లేదా ఫండ్స్ సంస్థల కోసమే కాదని.. మొత్తం మ్యూచువల్ ఫండ్ వ్యవస్థకు సంబంధించినదిగా పేర్కొన్నారు. తీవ్ర ఆర్థిక అనిశి్చతులు, ఆటుపోట్ల పరిస్థితుల్లో ఇన్వెస్టర్ల నుంచి ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడులు ఉపసంహరణ ఒత్తిళ్లు (లిక్విడిటీ రిస్క్) ఎదురైతే.. వాటిని మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు, పరిశ్రమ ఎలా అధిగమించగలవో స్ట్రెస్ టెస్ట్ ఫలితాలు తెలియజేస్తాయి. మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణ సంస్థల (ఏఎంసీల) సన్నద్ధతను ఇది పెంచుతుంది. ముఖ్యంగా స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ పథకాల్లో లిక్విడిటీ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. దీనిపై ఇన్వెస్టర్లకు అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో సెబీ ఈ విధానాన్ని ప్రవేశపెట్టడం తెలిసిందే. వివిధ మ్యూచువల్ ఫండ్ పథకాల పరిధిలో ఉండే రిస్క్‌పై ఇన్వెస్టర్లకు అవగాహన కల్పించేందుకు మెరుగైన మార్గాలను గుర్తించేందుకు ఇది సాయపడుతుందని గోపాలకృష్ణన్ పేర్కొన్నారు. ప్రస్తుతమున్న రిస్క్ నిర్వహణ విధానం.. వివిధ పథకాల్లో ఉండే వేర్వేరు రిస్క్ స్థాయిలను ప్రతిబింబించడం లేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వేర్వేరు రిస్క్ స్థాయిలు ఉన్నప్పటికీ.. చాలా పథకాలకు కేవలం అధిక రిస్క్ ట్యాగ్ వేస్తున్నట్టు చెప్పారు. కనుక ఈ వ్యత్యాసాలను మరింత పారదర్శకంగా తెలియజేయడమే కొత్త వ్యవస్థ లక్ష్యమన్నారు. సులభంగా ఉండాలి.. ‘‘పోర్ట్‌ఫోలియోలో అంతర్లీనంగా ఉండే ఆటుపోట్లను అర్థం చేసుకోవడం ముఖ్యం. ఇందుకు గాను రిస్‌్కలను సులభంగా అర్థం చేసుకునే విధంగా సమాచారం ఉండాలి. పోర్ట్‌ఫోలియో స్ట్రెస్ టెస్ట్ ఫలితాలు ఈ దిశగా మరింత స్పష్టతనిస్తాయి’’అని గోపాలకృష్ణన్ తెలిపారు. కార్యకలాపాలు క్రమబదీ్ధకరించడం, ఇన్వెస్టర్లకు మరింత కచ్చితత్వంతో సేవలు అందించడంపై దృష్టి పెట్టాలని మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమకు సూచించారు. అప్పటికప్పుడే నిధుల బదిలీకి మన వ్యవస్థలు వీలు కలి్పస్తున్న తరుణంలో.. సెటిల్మెంట్ రోజే ఇన్వెస్టర్లకు నిధుల బదిలీ చేయాలా చూడాలన్నారు. విక్రయించిన మరుసటి రోజు లేదా రెండు రోజుల తర్వాత ప్రస్తుతం ఇన్వెస్టర్లకు ఫండ్స్ సంస్థలు నిధులు బదిలీ చేస్తుండడంతో గోపాలకృష్ణన్ సూచనకు ప్రాధాన్యం సంతరించుకుంది. -
NEET(UG) రీ-టెస్ట్ ఫలితాలు విడుదల
ఢిల్లీ: నీట్ యూజీ రీ-టెస్ట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలతో పాటు రివైజ్డ్ స్కోర్ కార్డులను కూడా వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది.నీట్ ఆందోళన నడుమ.. ఆపై సుప్రీంకోర్టు జోక్యంతో 1,563 మందికి గ్రేస్ మార్కుల్ని రద్దు చేసిన ఎన్టీఏ వాళ్లకు మళ్లీ పరీక్ష నిర్వహించింది. అయితే.. జూన్ 23వ తేదీన పరీక్ష నిర్వహించగా.. 813 మంది అభ్యర్థులు మాత్రం తిరిగి పరీక్ష రాశారు. వివాదాల నేపథ్యంలో ఈసారి ఫలితాల్ని పక్కాగా విడుదల చేసింది ఎన్టీఏ. పరీక్ష అనంతరం ఆన్సర్ కీ, ఓఎంఆర్ ఆన్షర్ షీట్లను పబ్లిక్ నోటీస్ ద్వారా అందుబాటులో ఉంచిన ఎన్టీఏ.. అభ్యర్థుల నుంచి అభ్యంతరాల్ని స్వీకరించింది. ఆ అభ్యంతరాలను నిపుణులు పరిశీలించిన అనంతరం.. తుది కీని విడుదల చేసింది. ఇప్పుడు ఆ అభ్యర్థుల ఫలితాల్ని వెబ్సైట్లో ఉంచింది. -
పదేళ్ల తర్వాత టెస్టు సమరం
చెన్నై: దశాబ్ద కాలం తర్వాత భారత్, దక్షిణాఫ్రికా మహిళా క్రికెట్ జట్లు టెస్టు మ్యాచ్‌లో తలపడనున్నాయి. నేటి నుంచి జరిగే ఏకైక టెస్టులో సఫారీ టీమ్‌ను సొంతగడ్డపై భారత్ ఎదుర్కోనుంది. దక్షిణాఫ్రికాపై 3–0తో వన్డే సిరీస్ గెలిచిన భారత్ జోరు మీదుంది. ఈ మ్యాచ్ ద్వారా భారత్ నుంచి కనీసం ఐదుగురు కొత్త ప్లేయర్లు టెస్టుల్లో అరంగేట్రం చేసే అవకాశం ఉంది. ఉమా చెత్రి, ప్రియా పూనియా, సైకా ఇషాక్, అరుంధతి రెడ్డి, షబ్నమ్ షకీల్ తమ తొలి టెస్టు బరిలోకి దిగవచ్చని అంచనా.వన్డేలు, టి20లతో పోలిస్తే భారత మహిళల జట్టు చాలా తక్కువ సంఖ్యలో టెస్టులు ఆడుతోంది. రెండేళ్ల విరామం తర్వాత గత ఏడాది డిసెంబర్లో భారత్ టెస్టు ఆడింది. వరుసగా ఇంగ్లండ్, ఆ్రస్టేలియాలతో పోటీ పడిన మన టీమ్ రెండు మ్యాచ్‌లలోనూ విజయం సాధించింది. అయితే ఆ తర్వాత జట్టు మళ్లీ బరిలోకి దిగలేదు. దక్షిణాఫ్రికాతో ఆఖరిసారిగా 2014లో మైసూరు టెస్టులో తలపడిన జట్టు 34 పరుగులతో గెలుపొందింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌తో పాటు స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, షఫాలీ వర్మ, దీప్తి శర్మ బ్యాటింగ్‌లో కీలకం కానున్నారు. బౌలింగ్‌కు సంబంధించి పూజ వస్త్రకర్, దీప్తి శర్మ, స్నేహ్ రాణా ప్రభావం చూపించగలరు. చెపాక్ మైదానంలో సాధారణంగా స్పిన్‌ను బాగా అనుకూలిస్తుంది కాబట్టి భారత్ కోణంలో ఇది సానుకూలాంశం. మరోవైపు గత రెండేళ్లలో దక్షిణాఫ్రికా కూడా ఒకే ఒక టెస్టు మ్యాచ్ ఆడింది. కెపె్టన్ లారా వాల్వార్ట్, స్యూన్ లూస్, డెల్మీ టకర్, తజ్మీన్ బ్రిట్స్, అనెక్ బాష్లపై జట్టు ఆధారపడుతోంది. పిచ్ అనుకూలిస్తే స్పిన్నర్ ఎంలాబా భారత బ్యాటర్లను ఇబ్బంది పెట్టగలదు. -
యాంటీ రేడియేషన్ మిసైల్... ‘రుద్ర ఎమ్-2’ పరీక్ష సక్సెస్
భువనేశ్వర్: ఉపరితల యాంటీ రేడియేషన్ మిసైల్ రుద్ర ఎమ్-2ను భారత్ విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చండీపూర్ టెస్ట్ సెంటర్ నుంచి బుధవారం(మే29) ఈ మిసైల్‌ను పరీక్షించారు.ఈ సూపర్‌సానిక్ మిసైల్‌ను భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డీఆర్డీవో అభివృద్ధి చేసింది. యాంటీ రేడియేషన్ మిసైల్‌ను భారత్ దేశీయంగా అభివృద్ధి చేయడం ఇదే తొలిసారి. ఇది శత్రువుల నిఘా రాడార్లను లక్ష్యంగా చేసుకుని పనిచేస్తుంది.ప్రస్తుతం శత్రువుల నిఘా వ్యవస్థలను నిర్వీర్యం చేయడానికి భారత్ రష్యాకు చెందిన కేఎహెచ్-31 యాంటీ రేడియేషన్ మిసైళ్లను వినియోగిస్తుంది. వీటి స్థానంలో త్వరలో రుద్రను వాడనున్నారు. రుద్ర అనుకున్న లక్ష్యాల మేర పనిచేసిందని, ఈ పరీక్ష పూర్తిగా విజయవతమైందని డీఆర్డీవో ఒక ప్రకటనలో తెలిపింది. రుద్ర పరీక్ష విజయవంతమైందని, దీనిని అభివృద్ధి చేసిన డీఆర్డీవోకు అభినందనలని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఎక్స్(ట్విటర్)లో ఒక పోస్టు పెట్టారు. -
ఇట్లు.. ఇటలీకి!
సాక్షి, అమరావతి: అడుగు తీసి అడుగేస్తే మీడియాలో ప్రచారం కోరుకునే టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గప్‌చుప్‌గా విదేశాలకు ఉడాయించారు. తన సతీమణి భువనేశ్వరితో కలిసి హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయం నుంచి దుబాయ్ వెళ్లిన చంద్రబాబు అక్కడి నుంచి ఎక్కడికి వెళ్లారనే విషయంపై గోప్యంగా వ్యవహరిస్తున్నారు. వైద్య పరీక్షల కోసం ఆయన అమెరికా వెళ్లినట్లు టీడీపీ తొలుత మీడియాకు లీకులిచ్చింది.అయితే చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన టీడీపీ ఎన్నారై విభాగం నేత కోమటి జయరాం మాత్రం ఆయన అసలు అమెరికా రాలేదని ప్రకటించడం గమనార్హం. విదేశాల నుంచి అక్రమ నిధులను భారత్‌లోని షెల్ కంపెనీలకు మళ్లించిన చరిత్ర ఉన్న చంద్రబాబు ప్రస్తుతం ఏ దేశంలో ఉన్నారు? ఏం చేస్తున్నారన్నది చర్చనీయాంశంగా మారింది. గుట్టుచప్పుడు కాకుండా విదేశీ పర్యటన వెనుక లోగుట్టు ఏమిటన్నది సస్పెన్స్‌గా మారింది. అయితే తాజా విశ్వసనీయ సమాచారం ప్రకారం చంద్రబాబు ఇటలీలో ల్యాండ్ అయినట్లు తెలుస్తోంది.పోలింగ్ తర్వాత సైలెంట్‌చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ జీవితం అంతా మీడియా ప్రచారంతోనే ముడిపడి ఉందన్నది బహిరంగ రహస్యమే. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ఆయన మీడియా ద్వారా విపరీతమైన ప్రచారాన్ని కోరుకుంటారు. మూడు ప్రెస్మీట్లు, ఆరు మీడియా లీకులుగా ఆయన రాజకీయం కొనసాగింది. వారానికి కనీసం రెండు సార్లు మీడియా సమావేశాలు నిర్వహిస్తుంటారు. అలాంటిది ఈ నెల 13న పోలింగ్ ముగిసిన తర్వాత చంద్రబాబు ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. కనీసం ప్రెస్‌మీట్ పెట్టలేదు. పార్టీ నేతలతో సమావేశం నిర్వహించలేదు. తన శైలికి భిన్నంగా ఒక్కసారిగా మౌనముద్ర దాల్చారు.మరోవైపు లోకేశ్‌కు మాట కూడా పెగల్లేదు. చంద్రబాబు కంటే ముందే ఆయన గప్‌చుప్‌గా విదేశాలకు వెళ్లినట్లు సమాచారం. ఇక పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారో జనసేన వర్గాలే చెప్పలేకపోతున్నాయి. రాష్ట్ర బీజేపీ శాఖ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అలికిడే లేదు. పోలింగ్ ముగిసిన తర్వాత కూటమి నోట మాటే రావడం లేదు. పోలింగ్ సరళి తమకు వ్యతిరేకంగా ఉందని చంద్రబాబు కచ్చితమైన అంచనాకు రావడంతో ఒక్కసారిగా మౌనం దాల్చినట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిశ్శబ్దంగా విదేశాలకు వెళ్లడం గమనార్హం. ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకోవడంతో..చంద్రబాబు శనివారం అర్థరాత్రి శంషాబాద్ విమా¯éశ్రయం నుంచి దుబాయ్ వెళ్లారు. ఆయన విదేశీ పర్యటనలపై అధికారికంగా వెల్లడించే టీడీపీ ఈసారి అందుకు భిన్నంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. శంషాబాద్ విమానాశ్రయం వద్ద ఇమ్మిగ్రేషన్ అధికారులు చంద్రబాబును కాసేపు అడ్డుకోవడంతో ఈ వ్యవహారం బయటకు పొక్కింది. టీడీపీ హయాంలో చోటు చేసుకున్న కుంభకోణాల కేసులకు సంబంధించి చంద్రబాబుపై సీఐడీ గతంతో లుక్ అవుట్ నోటీసు జారీ చేసింది. సీఐడీ ముందస్తు అనుమతి లేకుండా ఆయన దేశం విడిచి వెళ్లకూడదని స్పష్టం చేసింది.ఈ నేపథ్యంలో చంద్రబాబును విమానాశ్రయంలో అడ్డుకున్న ఇమ్మిగ్రేషన్ అధికారులు సీఐడీని సంప్రదించారు. సీఐడీ ఆయనపై నాలుగు కేసుల్లో చార్జిషీట్లు దాఖలు చేసింది. సీఐడీకి సమాచారం ఇవ్వకుండా దేశం విడిచి వెళ్లకూడదని ఆయనకు తాజాగా నోటీసులు జారీ చేయనుంది. ఇదే విషయాన్ని సీఐడీ శంషాబాద్ ఇమ్మిగ్రేషన్ అధికారులకు తెలియచేసింది. దీంతో చంద్రబాబు విదేశీ పర్యటనపై అప్పటికప్పుడు సమాచారం ఇచ్చినట్లుగా భావించిన ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆయన్ను వెళ్లనిచ్చారు. సాధారణంగా దుబాయ్ చేరుకుని అక్కడి నుంచి మరో విమానంలో అమెరికా లేదా ఐరోపా దేశాలకు వెళుతుంటారు. చంద్రబాబు మాత్రం దుబాయ్ నుంచి ఎక్కడికి వెళ్లారో వెల్లడించలేదు. తన పర్యటనను అంత గోప్యంగా ఎందుకు ఉంచారన్నది సందేహాస్పదంగా మారింది.స్కిల్ స్కామ్‌లోనూ దుబాయ్ బంధంచంద్రబాబు రహస్య పర్యటన నేపథ్యంలో గతంలో షెల్ కంపెనీల ద్వారా అక్రమ నిధుల మళ్లింపు వ్యవహారం తెరపైకి వచ్చింది. టీడీపీ హయాంలో యథేచ్ఛగా పాల్పడిన కుంభకోణాల ద్వారా కొల్లగొట్టిన నిధులను ఆయన అక్రమంగా విదేశాలకు తరలించి అక్కడి నుంచి భారత్‌లోని షెల్ కంపెనీలకు మళ్లించినట్లు సీఐడీ ఆధారాలతో సహా నిగ్గు తేల్చింది. చంద్రబాబు 52 రోజులు రిమాండ్ ఖైదీగా రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఉన్న స్కిల్ స్కామ్‌లో కూడా నిధులను అక్రమంగా దుబాయ్‌కు చేర్చారు.ఆ కుంభకోణంలో పాత్రధారులైన ఆయన మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాస్, మనోజ్ పార్థసాని, కిలారి రాజేశ్ దుబాయ్ నుంచే అక్రమ నిధులను సింగపూర్ మీదుగా హైదరాబాద్‌లోని షెల్ కంపెనీకి తరలించారు. అనంతరం ఆ నిధులు చంద్రబాబు బంగ్లాకు చేర్చారు. అంటే ఆయన ఆర్థిక కుంభకోణాల్లో దుబాయ్ కీలక కేంద్రంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది.ఇటలీలో ప్రత్యక్షం..!గుట్టుగా విదేశాలకు వెళ్లిన చంద్రబాబు ఇటలీ చేరుకున్నట్లు సమాచారం. దుబాయ్ నుంచి చంద్రబాబు దంపతులు ఇటలీ వెళ్లినట్లు ఇమ్మిగ్రేషన్ వర్గాలు అనధికారికంగా వెల్లడించాయి. లోకేశ్ దంపతులు కూడా అక్కడికే వెళ్లినట్లు భావిస్తున్నారు. గతంలో చంద్రబాబు కుటుంబ సభ్యులతో విహార యాత్రలకు వెళ్లినప్పుడు అధికారికంగా వెల్లడించారు. ఈసారి మాత్రం అందుకు భిన్నంగా గోప్యత పాటించడం గమనార్హం. ఇటలీతోపాటు మరికొన్ని చిన్న చిన్న దేశాలకు వారు వెళ్లే అవకాశం ఉంది. అక్కడ నుంచి సింగపూర్‌కు నిధులు మళ్లించి అనంతరం భారత్‌లోని షెల్ కంపెనీలకు చేరవేసే అవకాశాలున్నట్లు భావిస్తున్నారు. చంద్రబాబు విదేశీ పర్యటనను పూర్తిగా గోప్యంగా ఉంచడం ఈ వాదనకు బలం చేకూరుస్తోంది. -
పదేళ్ల తర్వాత దక్షిణాఫ్రికాతో టెస్టు
బెంగళూరు: భారత్‌లో దక్షిణాఫ్రికా మహిళల క్రికెట్ జట్టు పర్యటన ఖరారైంది. వచ్చే జూన్, జూలైలో పూర్థిసాయి ద్వైపాక్షిక సిరీస్‌లో భాగంగా భారత్‌తో దక్షిణాఫ్రికా ఒక టెస్టు, మూడు వన్డేలు, మూడు టి20 మ్యాచ్‌లు ఆడుతుంది. ముందుగా బెంగళూరులో జూన్ 16న వన్డే సిరీస్ మొదలవుతుంది. 19న రెండో వన్డే, 23న మూడో వన్డేతో 50 ఓవర్ల ఫార్మాట్ ముగుస్తుంది. వన్డే సిరీస్ ముగిశాక ఏకైక టెస్టు పోరు జూన్ 28 నుంచి చెన్నైలో జరుగుతుంది. భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఇది కేవలం మూడో టెస్టు కానుంది. దక్షిణాఫ్రికాలోని పార్ల్ వేదికగా ఈ రెండు జట్ల మధ్య తొలి టెస్టు 2002లో... భారత్‌లోని మైసూరు వేదికగా రెండో టెస్టు 2014లో జరిగాయి. ఆ తర్వాత ఈ రెండు జట్లు టెస్టు ఫార్మాట్లో మరో మ్యాచ్ ఆడలేదు. దక్షిణాఫ్రికాతో ఆడిన రెండు టెస్టుల్లోనూ భారతే నెగ్గింది. ఏకైక టెస్టు ముగిశాక బెంగళూరులో ఈ రెండు జట్ల మధ్య జూలై 5, 7, 9 తేదీల్లో మూడు టి20ల సిరీస్ జరుగుతుంది. -
Test embed video
Test embed video Test embed videoTest embed videoTest embed videoTest embed videoTest embed videoTest embed videoTest embed videoTest embed videoTest embed videoTest embed videoTest embed videoTest embed videoTest embed videoTest embed videoTest embed videoTest embed videoTest embed videoTest embed videoTest embed videoTest embed videoTest embed videoTest embed videoTest embed videoTest embed videoTest embed videoTest embed videoTest embed videoTest embed videoTest embed videoTest embed videoTest embed videoTest embed videoTest embed videoTest embed videoTest embed videoTest embed videoTest embed videoTest embed videoTest embed videoTest embed videoTest embed videoTest embed videoTest embed videoTest embed videoTest embed videoTest embed videoTest embed videoTest embed videoTest embed videoTest embed videoTest embed videoTest embed videoTest embed videoTest embed videoTest embed videoTest embed videoTest embed videoTest embed videoTest embed video -
బంగ్లాదేశ్ జట్టులో షకీబ్ పునరాగమనం
రాజకీయ నాయకుడిగా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించాక బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ షకీబ్ అల్ హసన్ జాతీయ జట్టులోకి పునరాగమనం చేశాడు. శ్రీలంక జట్టుతో చట్టోగ్రామ్‌లో శనివారం మొదలయ్యే రెండో టెస్టులో షకీబ్ ఆడనున్నాడు. గత ఏడాది భారత్ ఆతిథ్యమిచ్చిన వన్డే వరల్డ్‌కప్ మధ్యలో షకీబ్ గాయంతో వైదొలిగాడు. ఈ ఏడాది జనవరిలో జరిగిన బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో 37 ఏళ్ల షకీబ్ అవామీ లీగ్ పార్టీ తరఫున మగురా నియోజకవర్గం నుంచి పోటీచేసి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. -
ISRO: ‘పుష్పక్’ టెస్ట్ సక్సెస్
బెంగళూరు: రీ యూజబుల్ లాంచ్ వెహికిల్(ఆర్ఎల్వీ) ‘పుష్పక్’ను శుక్రవారం(మార్చ్ 22) ఉదయం 7 గంటలకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) విజయవంతంగా ప్రయోగించింది. ఈ మేరకు ఇస్రో ఎక్స్(ట్విటర్)లో ఒక పోస్టు పెట్టింది.కర్ణాటకలోని చాలకెరెలోని ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్(ఏటీఆర్) నుంచి ఇస్రో ఈ ప్రయోగాన్ని నిర్వహించింది. పుష్పక్ ఆర్ఎల్వీని తొలుత ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన హెలికాప్టర్లో 4.5 కిలోమీటర్ల ఎత్తులో వదిలేశారు. ఆ తర్వాత భూమి నుంచి ఎలాంటి నియంత్రణ లేకుండా స్వతంత్రంగా ముందు నిర్ణయించిన చాలకెరె ఏటీఆర్ రన్‌వేపై కచ్చితమైన ప్రదేశంలో పుష్పక్ ల్యాండ్ అయింది. అంతరిక్ష ప్రయోగాల ఖర్చు తగ్గించుకునేందుకుగాను లాంచింగ్ రాకెట్లను తిరిగి వాడుకునే క్రమంలో ఇస్రో ఆర్ఎల్వీ ప్రయోగాలను నిర్వహిస్తోంది. ‘పుష్పక్ లాంచ్ వెహికిల్ పై భాగంలో చాలా ఖరీదైన ఎలక్ట్రానిక్ పరికరాలుంటాయి. వీటిని సురక్షితంగా భూమిపైకి తిరిగి తీసుకురాగలిగితే మళ్లీ వాడుకునేందుకు వీలుంటుంది’అని ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలిపారు. పుష్పక్ ఆర్ఎల్వీలో ఫ్యూసిలేజ్(బాడీ), నోస్ క్యాప్, డబుల్ డెల్టా రెక్కలు, ట్విన్ వర్టికల్ టెయిల్స్ భాగాలుంటాయి. Pushpak captured during its autonomous landing📸 pic.twitter.com/zx9JqbeslX — ISRO (@isro) March 22, 2024 ఇదీ చదవండి.. ఫ్యాక్ట్ చెక్ యూనిట్లపై సుప్రీం స్టే -
బెంట్లీ కార్లను ఎలా టెస్ట్ చేస్తారో తెలుసా..?
ప్రముఖ కార్ల తయారీ సంస్థలు వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులు అందించేందుకు వివిధ మార్గాలు, పరీక్షలు అనుసరిస్తాయి. కొన్ని కంపెనీలు ప్రత్యేకతను చాటుకునేందుకు వారి ఉత్పత్తుల్లో కొత్త ఫీచర్లు, బిల్డ్ క్వాలిటీ.. వంటివి పరిచయం చేస్తాయి. అందులో భాగంగా బెంట్లీ కార్లపై పెయింట్ వేసినా అది కారుకు అతుక్కోకుండా తయారుచేస్తున్నారు. దాన్ని వినియోగదారులకు అందించేముందు కంపెనీ పరీక్షలు నిర్వహిస్తుంది. అయితే అందుకు సంబంధించి ఓ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారుతోంది. ఈ వీడియోలో.. బెంట్లీ కారుకు పెయింట్ వేశారు. అది కారుపై అతికేలా మంటతో వేడి చేశారు. తర్వాత ఆ పెయింట్‌ను చిన్నక్లాత్తో శుభ్రం చేసేందుకు ప్రయత్నిస్తే కారుకు ఏమాత్రం అంటకుండా వెంటనే మొత్తం శుభ్రం అయింది. ఈ వ్యవహారాన్ని ఆ సంస్థ జీఎం టీజీ సమౌరి చూసి ఆశ్చర్యపోతున్నట్లు వీడియోలో ఉంది. Bentley staff spray paint and flame one of their cars to show how their paint protection product works pic.twitter.com/BYRIITFpEM — Historic Vids (@historyinmemes) March 13, 2024 -
ఎయిర్‌పోర్టుల్లో కొత్త రూల్స్.. ఆల్కహాల్ పరీక్షలు చేయించుకోవాల్సిందే!
భారత విమానాశ్రయాల్లో పనిచేస్తున్న వారికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ( DGCA ) కొత్త నిబంధనలు విధించింది. జూన్ 1 నుంచి ఎయిర్ పోర్టు సిబ్బందిలో కనీసం 25 శాతం మంది ర్యాండమ్‌గా రోజూ ఆల్కహాల్ పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుందని డీజీసీఏ పేర్కొంది. ప్రస్తుతం ప్రతిరోజూ 10 శాతం మంది సిబ్బందికి పరీక్షలు చేస్తున్నారు. డీజీసీఏ ప్రకారం.. ఏవియేషన్ సిబ్బందిలోని ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీర్లు, ఇతర సాంకేతికంగా శిక్షణ పొందిన ఉద్యోగులు, ఇంధనం, క్యాటరింగ్ వాహనాలను నడిపే డ్రైవర్లు, పరికరాల ఆపరేటర్లు, ఏరోబ్రిడ్జ్ ఆపరేటర్లు, మార్షలర్లు, ఆప్రాన్ నియంత్రణ, గ్రౌండ్ హ్యాండ్లింగ్ సేవల సిబ్బంది అలాగే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బంది ఈ ఆల్కహాల్ పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ పరీక్షల్లో మొదటిసారి ఆల్కహాల్ తీసుకున్నట్లు నిర్ధారణ అయితే వారిని విధులకు దూరంగా ఉంచడంతోపాటు వారి లైసెన్స్‌ను మూడు నెలలపాటు సస్పెండ్ చేస్తారు. ఆల్కహాల్ పరీక్షలో పాల్గొనడానికి నిరాకరించినా లేదా విమానాశ్రయం ప్రాంగణం నుండి బయటకు వెళ్లడం ద్వారా తప్పించుకోవడానికి ప్రయత్నించినా ఇదే శిక్షను అమలు చేస్తారు. నిబంధనలను రెండవసారి ఉల్లంఘిస్తే, సంబంధిత సిబ్బందికి డీజీసీఏ జారీ చేసిన లైసెన్స్ ఒక సంవత్సరం పాటు సస్పెండ్ అవుతుందని నిబంధనలు పేర్కొన్నాయి. ఇక పైలట్లు, క్యాబిన్ సిబ్బందికి ప్రీ-ఫ్లైట్ ఆల్కహాల్ పరీక్షలు డీజీసీఏ నియమాల మరొక సెట్ ప్రకారం సంబంధిత విమానయాన సంస్థలు నిర్వహిస్తాయి. -
వీఐపీల డ్రైవర్లకు ఫిట్నెస్ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ముఖ్యమైన వ్యక్తుల (వీఐపీ) డ్రైవర్లకు ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. చిన్నచిన్న తప్పిదాలతో వీఐపీలు ప్రాణాలు కోల్పోతున్నారని.. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి ఘటన నేపథ్యంలో రవాణా శాఖ సుమోటోగా ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. వీఐపీలంతా తమ డ్రైవర్లకు ఫిట్నెస్ పరీక్షలు చేయించుకోవాలని కోరుతూ లేఖలు రాస్తామన్నారు. ఈ జాబితాలో చట్టసభలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజాప్రతినిధులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులు, రాజకీయ నాయకులు ఉంటారని వివరించారు. వారి డ్రైవర్లకు అన్ని జిల్లాల్లో ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించేందుకు రెండు, మూడు రోజుల్లో ఏర్పాట్లు చేస్తామని మంత్రి తెలిపారు. ఈ పరీక్షల అనంతరం డ్రైవర్లకు సర్టిఫికెట్లు జారీ చేస్తామని, వారిని కొనసాగించుకోవాలా వద్దా అనేది వీఐపీల ఇష్టమని చెప్పారు. పొన్నంప్రభాకర్ శనివారం గాం«దీభవన్‌లో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఆర్టీసీ ఆక్యుపెన్సీ పెరిగింది మహాలక్ష్మి పథకంతో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడం వల్ల ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ పెరిగిందని మంత్రి పొన్నం చెప్పారు. గతంలో రోజూ సగటున 45లక్షల మంది వరకు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేవారని, ఇప్పుడా సంఖ్య 55–60 లక్షల వరకు ఉంటోందని తెలిపారు. మహిళలతో పాటు పురుష ప్రయాణికుల సంఖ్య కూడా పెరిగిందన్నారు. ఆర్టీసీ ఎలాంటి ఇబ్బందీ లేకుండా నడుస్తోందని చెప్పారు. పురుషులకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసే ఆలోచనేదీ లేదని, గ్రామాలకు బస్సుల కనెక్టివిటీ పెంచుతామని వెల్లడించారు. ఆర్టీసీ ఆస్తుల పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని.. పీపీపీ పద్ధతిలో ఆర్టీసీ స్థలాల్లో ప్రాజెక్టులు చేపడతామని వివరించారు. మహాలక్ష్మి పథకం కింద అనవసరంగా జీరో టికెట్లు కొట్టే కండక్టర్లపై చర్యలు తీసుకుంటామన్నారు. ఆర్టీసీకి మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, ఎంపీ పసునూరి దయాకర్, ప్రతిమా శ్రీనివాసరావు లాంటి వారు పాత బకాయిలు చెల్లిస్తున్నారన్నారు. ఆర్టీసీలోకి కొత్తగా వెయ్యి బస్సులు తీసుకువస్తామన్నారు. ఇప్పటికే 100 వచ్చాయని, దశలుగా మిగతావి తెస్తామని చెప్పారు. ఆర్టీసీ కార్గో ఆదాయం రూ.150 కోట్లకు చేరిందని, రూ.2 వేల కోట్ల ఆదాయార్జన ధ్యేయంగా ప్రణాళికలు రచిస్తున్నామని వివరించారు. బీఆర్ఎస్, బీజేపీలది డ్రామా బీఆర్ఎస్– బీజేపీ ఒకటేనని.. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కొత్త డ్రామా మొదలుపెట్టాయని పొన్నం విమర్శించారు. బీఆర్ఎస్–బీజేపీ ఒకటి కాదని చెప్పుకొనేందుకు ఎమ్మెల్సీ కవితకు నోటీసులు ఇస్తున్నారని.. అందుకే వాయిదాల పద్ధతుల్లో నోటీసులు వస్తున్నాయని ఎద్దేవా చేశారు. బిహార్ మోడల్లో కులగణన త్వరలోనే రాష్ట్రంలో కులగణన చేపడతామని, ఇందుకోసం బిహార్‌లో అమలు చేసిన ప్రక్రియను అనుసరిస్తామని మంత్రి పొన్నం తెలిపారు. ఈ గణన కోసం ప్రభుత్వ ఉద్యోగులను ఉపయోగించుకుంటామన్నారు. ప్రతి ఎన్యూమరేటర్‌కు శిక్షణ ఇస్తామని, కొత్త కమిషన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ అంశంలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి సూచనలు తీసుకుంటామన్నారు. కులగణన బిల్లును దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఆమోదించలేదని, అలాంటిది ఏదైనా ఉంటే బీఆర్ఎస్ నేతలు చూపాలని సవాల్ చేశారు. ఆటో కార్మి కులకు ఏటా రూ.12వేలు ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చామని.. దీనిపై కేబినెట్లోనూ చర్చించామని మంత్రి తెలిపారు. త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. ఉచిత బస్సు ప్రయాణం కారణంగా ఆటోల రంగం ఇబ్బంది పడుతుందనడంలో వాస్తవం లేదని.. అందుకు ప్రతి నెలా అమ్ముడవుతున్న ప్యాసింజర్ ఆటోల గణాంకాలే నిదర్శనమని పేర్కొన్నారు. -
మే 23న ఎడ్‌సెట్..జూన్ 4,5 తేదీల్లో ఐసెట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి జూన్ 4, 5 తేదీల్లో ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు ఉన్నత విద్యా మండలి పేర్కొంది. ఇందుకు సంబంధించి షెడ్యూల్‌ను ఆదివారం విడుదల చేసింది. మార్చి 5న నోటిఫికేషన్, 7నుంచి ఏప్రిల్ 30 వరకు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది. ఆలస్య రుసుముతో మే 27 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని షెడ్యూల్లో పేర్కొంది. పూర్తి వివరాల కోసం https://icet. tsche. ac.in ను చూడవచ్చని తెలిపింది. మే 23న ఎడ్‌సెట్ రెండేళ్ల బీఈడీ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి ఉమ్మడి ప్రవేశ పరీక్షను మే 23న నిర్వహిస్తున్నట్లు ఉన్నత విద్యా మండలి పేర్కొంది. మార్చి 4న నోటిఫికేషన్, మార్చి 6 నుంచి మే 13 వరకూ దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని వెల్లడించింది. పరీక్ష మే 23న ఉదయం 10 నుంచి 12 గంటల వరకూ, సాయంత్రం 2 నుంచి 4 గంటల వరకూ ఉంటుందని పేర్కొంది. -
నితీష్‌కు వ్యతిరేకంగా తేజస్వి ఇంటిలో ఏం జరుగుతోంది?
బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌కు చెందిన రాష్ట్రీయ జనతాదళ్ ఎమ్యెల్యేలంతా ఆ పార్టీ నేత తేజస్వి నివాసంలో గృహనిర్బంధంలో ఉన్నారు. వారంతా తమకు కావాల్సిన దుప్పట్లు, మందులను శనివారం సాయంత్రమే తెప్పించుకున్నారు. ఈరోజు (ఆదివారం) ఉదయం తేజస్వి నివాసం బయట సందడి నెలకొంది. ఆర్జేడీ ఎమ్మెల్యేలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసేందుకు తేజస్వీ యాదవ్ స్వయంగా సన్నాహాలు చేస్తున్నారు. ఆదివారం రాత్రి వరకు ఎమ్మెల్యేలంతా తేజస్వి నివాసంలోనే ఉండాలని పార్టీ ఆదేశించినట్లు ఆర్జేడీ వర్గాలు చెబుతున్నాయి. అంటే సోమవారం అసెంబ్లీలో జరిగే నితీష్ బలపరీక్షకు వీరంతా నేరుగా హాజరుకానున్నారు. తేజస్వి నివాసంతో 76 మంది ఎమ్మెల్యేలున్నారని, మరో ముగ్గురు ఎమ్మెల్యేలు రాలేదని సమాచారం. #WATCH | Bihar: RJD MLAs and MLAs of Mahagathbandhan at the residence of former Deputy CM and RJD leader Tejashwi Yadav in Patna ahead of the Floor Test scheduled to take place tomorrow. pic.twitter.com/5FXnvGH8Gp — ANI (@ANI) February 11, 2024 -
టీమిండియాకు భారీ షాక్.. స్టార్ ఆల్‌రౌండర్‌కు గాయం
సెంచూరియన్: తొలి టెస్టులో ఓడిన భారత్‌కు మరో దెబ్బ! బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా సెంచూరియన్ టెస్టు ఆడిన శార్దుల్ ఠాకూర్ గాయపడ్డాడు. అయితే ఇది మ్యాచ్ సమయంలో కాదు! నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా అతని ఎడమ భుజానికి గాయమైంది. వెంటనే జట్టు ఫిజియో ఐస్ ప్యాక్‌తో ఉపశమన సపర్యలు చేశాడు. అనంతరం మళీ ప్రాక్టీస్‌కు దిగలేదు. దీంతో అతను కేప్‌టౌన్‌లో జనవరి 3 నుంచి జరిగే ఆఖరి టెస్టుకు దూరమయ్యే అవకాశముంది. గాయం తీవ్రతను తెలుసుకునేందుకు శార్దుల్ భుజానికి స్కానింగ్ తీయాల్సి ఉంది. దీన్నిబట్టే అతను అందుబాటులో ఉంటాడ లేదా అనే విషయంపై స్పష్టత వస్తుంది. సఫారీ బౌలర్ కొయెట్జీ అవుట్ దక్షిణాఫ్రికా పేసర్ గెరాల్డ్ కొయెట్జీ రెండో టెస్టుకు దూరమయ్యాడు. 23 ఏళ్ల బౌలర్ పొత్తికడుపు నొప్పితో సతమతమవుతున్నాడు. ఈ నొప్పితోనే తొలిటెస్టు ఆడటంతో వాపు మొదలైందని జట్టు వర్గాలు తెలిపాయి. దీంతో కొయెట్జీ కేప్‌టౌన్ టెస్టుకు అందుబాటులో లేడని దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు సోషల్ మీడియా ‘ఎక్స్’ ద్వారా వెల్లడించింది. ఇదివరకే రెగ్యులర్ కెపె్టన్ బవుమా కూడా గాయంతో రెండో టెస్టుకు గైర్హాజరు కానున్నాడు. కొయెట్జీ స్థానాన్ని ఎన్గిడి, ముల్డర్లలో ఒకరితో భర్తీ చేసే అవకాశముంది. -
మన బ్యాటర్లూ అదరగొట్టారు
ముంబై: ఆ్రస్టేలియాతో జరుగుతున్న ఏకైక టెస్టులో భారత మహిళల హవా రెండో రోజూ కొనసాగింది. వాంఖెడే మైదానంలో తొలి రోజు పదునైన బౌలింగ్‌తో ఆసీస్ మహిళలను కట్టడి చేసిన మన జట్టు శుక్రవారం బ్యాటింగ్‌లోనూ చెలరేగి భారీ ఆధిక్యాన్ని అందుకుంది. మ్యాచ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 119 ఓవర్లలో 7 వికెట్లకు 376 పరుగులు చేసింది. దాంతో ప్రస్తుతానికి భారత్‌కు 157 పరుగుల ఆధిక్యం లభించింది. స్మృతి మంధాన (106 బంతుల్లో 74; 12 ఫోర్లు), జెమీమా రోడ్రిగ్స్ (121 బంతుల్లో 73; 9 ఫోర్లు), దీప్తి శర్మ (147 బంతుల్లో 70 నాటౌట్; 9 ఫోర్లు), రిచా ఘోష్ (104 బంతుల్లో 52; 7 ఫోర్లు) అర్ధ సెంచరీలు సాధించారు. ఆసీస్ బౌలర్లలో ఆఫ్ స్పిన్నర్ యాష్లీ గార్డ్నర్ 4 వికెట్లు పడగొట్టింది. ప్రస్తుతం క్రీజ్‌లో దీప్తితో పాటు పూజ వస్త్రకర్ (115 బంతుల్లో 33 బ్యాటింగ్; 4 ఫోర్లు) ఉంది. వీరిద్దరు ఇప్పటికే ఎనిమిదో వికెట్‌కు అభేద్యంగా 102 పరుగులు జోడించడం విశేషం. శుక్రవారం ఆట మొత్తం 100 ఓవర్ల పాటు సాగగా, గార్డ్నర్ ఒక్కతే 36 ఓవర్లు వేసింది. స్మృతి రనౌట్... ఓవర్‌నైట్ స్కోరు 98/1తో భారత్ రెండో రోజు ఆట కొనసాగించింది. స్నేహ్ రాణా (9) ఎక్కువ సేపు నిలవలేకపోగా, 68 బంతుల్లో స్మృతి అర్ధ సెంచరీ పూర్తయింది. ఆపై కొన్ని చక్కటి షాట్లు ఆడిన స్మృతి స్వయంకృతంతో వెనుదిరిగింది. గార్డ్నర్ బౌలింగ్‌లో బ్యాక్వర్డ్ పాయింట్ దిశగా ఆడి సింగిల్‌కు ప్రయత్నించింది. అయిుతే రిచాతో సమన్వయలోపంతో పరుగు ఆలస్యం కావడంతో నాన్‌స్ట్రయికింగ్ ఎండ్‌లో రనౌటైంది. అనంతరం రిచా, జెమీమా భాగస్వామ్యం భారత్‌ను మెరుగైన స్థితికి చేర్చింది. తొలి సెషన్లో భారత్ 2 వికెట్లు కోల్పోయి 95 పరుగులు జోడించింది. భారీ భాగస్వామ్యాలు... లంచ్ తర్వాత ఇన్నింగ్స్ 63వ ఓవర్లో గార్డ్నర్ బౌలింగ్‌లో రిచా కొట్టిన ఫోర్‌తో భారత్ ఆధిక్యంలోకి వెళ్లింది. జెమీమా 86 బంతుల్లో, కెరీర్లో తొలి టెస్టు ఆడుతున్న రిచా 98 బంతుల్లో అర్ధసెంచరీలు పూర్తి చేసుకున్నారు. అయితే రిచాను గార్త్ అవుట్ చేయడంతో ఈ భాగస్వామ్యానికి తెర పడింది. జెమీమా, రిచా నాలుగో వికెట్‌కు 113 పరుగులు జత చేశారు. అనంతరం చెలరేగిన గార్డ్నర్ తన వరుస ఓవర్లలో హర్మన్‌ప్రీత్ (0), యస్తిక (1)లను పెవిలియన్‌ను పంపడంతో పాటు కొద్ది సేపటికే జెమీమాకు కూడా అవుట్ చేసింది. 14 పరుగుల వ్యవధిలో 4 వికెట్లు కోల్పోవడంతో 274/7 వద్ద భారత్ ఇన్నింగ్స్ ముగిసేందుకు ఎంతో సేపు పట్టదనిపించింది. అయితే దీప్తి, పూజ భిన్నంగా ఆలోచించారు. చివరి సెషన్లో పట్టుదలగా నిలబడి పరుగులు సాధిస్తూ ఆసీస్ బౌలర్లను చికాకు పెట్టారు. దీప్తి తన బ్యాటింగ్ ప్రతిభను ప్రదర్శించగా... బౌలింగ్‌లో చెలరేగిన పూజ బ్యాటింగ్‌లోనూ మంచి డిఫెన్స్‌తో దీప్తికి అండగా నిలిచింది. ఈ క్రమంలో 115 బంతుల్లో దీప్తి హాఫ్ సెంచరీని అందుకుంది. కెరీర్లో నాలుగో టెస్టు ఆడుతున్న దీప్తి ప్రతీ టెస్టులోనూ అర్ధసెంచరీ చేయడం విశేషం. ఈ జోడీని విడదీసేందుకు ఆసీస్ ఎనిమిది బౌలర్లతో ఎంతగా శ్రమించినా లాభం లేకపోయింది. 38 ఓవర్ల సెషన్లో భారత్ 100 పరుగులు సాధించగా, ఆసీస్ ఒక్క వికెట్ కూడా తీయలేకపోయింది. స్కోరు వివరాలు ఆ్రస్టేలియా తొలి ఇన్నింగ్స్: 219; భారత్ తొలి ఇన్నింగ్స్: షఫాలీ (ఎల్బీ) (బి) జొనాసెన్ 40; స్మృతి (రనౌట్) 74; స్నేహ్ రాణా (బి) గార్డ్నర్ 9; రిచా (సి) గార్డ్నర్ (బి) గార్త్ 52; జెమీమా (సి) సదర్లాండ్ (బి) గార్డ్నర్ 73; హర్మన్‌ప్రీత్ (ఎల్బీ) (బి) గార్డ్నర్ 0; యస్తిక (ఎల్బీ) (బి) గార్డ్నర్ 1; దీప్తి శర్మ (బ్యాటింగ్) 70; పూజ (బ్యాటింగ్) 33; ఎక్స్‌ట్రాలు 24; మొత్తం (119 ఓవర్లలో 7 వికెట్లకు) 376. వికెట్ల పతనం: 1–90, 2–140, 3–147, 4–260, 5–261, 6–265, 7–274. బౌలింగ్: లౌరెన్ 9–3–23–0, గార్త్ 10–1–49–1, పెరీ 4–0–31–0, గార్డ్నర్ 41–7–100–4, జొనాసెన్ 18–4–42–1, సదర్లాండ్ 8–2–20–0, అలానా 19–1–69–0, తహీలా 10–2–22–0. -
ఆసీస్‌ను పడగొట్టిన పూజ
ముంబై: ఆ్రస్టేలియాతో ప్రారంభమైన ఏకైక టెస్టులో భారత మహిళల జట్టు తొలి రోజు సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించింది. ముందుగా చక్కటి బౌలింగ్‌తో ప్రత్యర్థిని కట్టడి చేసిన మన బృందం ఆ తర్వాత బ్యాటింగ్‌లోనూ మెరుగైన స్థితిలో నిలిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆ్రస్టేలియా మహిళల జట్టు భారత బౌలర్ల ధాటికి తమ తొలి ఇన్నింగ్స్‌లో 219 పరుగులకే ఆలౌటైంది. భారత జట్టుపై టెస్టుల్లో ఆసీస్ జట్టుకిదే అత్యల్ప స్కోరు. తహీలా మెక్‌గ్రాత్ (56 బంతుల్లో 50; 8 ఫోర్లు) అర్ధ సెంచరీ చేయగా... బెత్ మూనీ (40), కెప్టెన్ అలీసా హీలీ (38), కిమ్ గార్త్ (28 నాటౌట్) కీలక పరుగులు సాధించారు. పేసర్ పూజ వస్త్రకర్ (4/53) నాలుగు కీలక వికెట్లు పడగొట్టగా... స్పిన్నర్లు స్నేహ్ రాణా 3, దీప్తి శర్మ 2 వికెట్లు తీశారు. తొలి ఓవర్లోనే లిచ్‌ఫీల్డ్ (0) రనౌట్ కాగా, అద్భుత బంతితో ఎలీస్ పెరీ (4)ని పూజ బౌల్డ్ చేయడంతో ఆసీస్ కష్టాల్లో పడగా... మెక్‌గ్రాత్, మూనీ మూడో వికెట్‌కు 80 పరుగులు జోడించి జట్టును ఆదుకున్నారు. అనంతరం భారత్ ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోయి 19 ఓవర్లలోనే 98 పరుగులు చేసింది. స్మృతి మంధాన (49 బంతుల్లో 43 బ్యాటింగ్; 8 ఫోర్లు), షఫాలీ వర్మ (59 బంతుల్లో 40; 8 ఫోర్లు) ఆరంభం నుంచే దూకుడుగా ఆడి తొలి వికెట్‌కు 100 బంతుల్లోనే 90 పరుగులు జత చేశారు. ప్రస్తుతం భారత్ మరో 121 పరుగులు వెనుకబడి ఉంది. స్కోరు వివరాలు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: మూనీ (సి) స్నేహ్ రాణా (బి) పూజ 40; లిచ్‌ఫీల్డ్ (రనౌట్) 0; ఎలీస్ పెరీ (బి) పూజ 4; తహీలా (సి) రాజేశ్వరి (బి) స్నేహ్ రాణా 50; హీలీ (బి) దీప్తి 38; అనాబెల్ (ఎల్బీ) (బి) పూజ 16; యాష్లీ (సి) యస్తిక (బి) పూజ 11; జెస్ (ఎల్బీ) (బి) దీప్తి 19; అలానా కింగ్ (సి) యస్తిక (బి) స్నేహ్ రాణా 5; గార్త్ (నాటౌట్) 28; లౌరెన్ (సి) స్మృతి (బి) స్నేహ్ రాణా 6; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (77.4 ఓవర్లలో ఆలౌట్) 219. వికెట్ల పతనం: 1–2, 2–7, 3–87, 4–103, 5–143, 6–159, 7–160, 8–168, 9–198, 10–219. బౌలింగ్: రేణుక 7–0–35–0, పూజ వస్త్రకర్ 16–2–53–4, స్నేహ్ రాణా 22.4–4–56–3, రాజేశ్వరి 13–4–29–0, దీప్తి శర్మ 19–3–45–2. భారత్ తొలి ఇన్నింగ్స్: షఫాలీ (ఎల్బీ) (బి) జెస్ 40; స్మృతి (బ్యాటింగ్) 43; స్నేహ్ రాణా (బ్యాటింగ్) 4; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (19 ఓవర్లలో వికెట్ నష్టానికి) 98. వికెట్ల పతనం: 1–90. బౌలింగ్: లౌరెన్ 4–2–12–0, కిమ్ గార్త్ 4–0–34–0, పెరీ 4–0–31–0, యాష్లీ 5–3–8–0, జెస్ జొనాసెన్ 2–1–4–1. -
తొలి విజయం లక్ష్యంగా...
ముంబై: ఇంగ్లండ్ జట్టుపై సాధించిన ఘనవిజయం స్ఫూర్తితో... నేటి నుంచి ఆ్రస్టేలియాతో జరిగే నాలుగు రోజుల ఏకైక టెస్ట్‌లో గెలుపే లక్ష్యంగా భారత మహిళల జట్టు బరిలోకి దిగనుంది. ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని టీమిండియా 347 పరుగుల తేడాతో గెలిచింది. అయితే ఆ్రస్టేలియా జట్టుపై భారత రికార్డు అంతంత మాత్రంగానే ఉంది. ఇప్పటి వరకు ఆస్ట్రేలియాతో జరిగిన 10 టెస్టుల్లో భారత్ ఒక్క విజయం కూడా నమోదు చేయలేకపోయింది. నాలుగు టెస్టుల్లో ఓడిన భారత జట్టు... ఆరు టెస్టులను డ్రా చేసుకుంది. 1984 తర్వాత స్వదేశంలో ఆస్ట్రేలియా జట్టుతో భారత్ టెస్టు ఆడనుండటం గమనార్హం. ఆసీస్‌పై భారత్ తొలి గెలుపు సాధించాలంటే సమష్టి ప్రదర్శన తప్పనిసరి. బ్యాటింగ్‌లో స్మృతి మంధాన, షపాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్, యస్తిక భాటియా భారీ స్కోర్లు చేయాలి. ఆల్‌రౌండర్లు దీప్తి శర్మ, స్నేహ్ రాణా, పూజా వస్త్రకర్ కూడా తమవంతు పాత్రను పోషించారు. బౌలర్ రేణుక సింగ్ తన స్వింగ్ బౌలింగ్ పేస్‌తో ఆసీస్ బ్యాటర్లను కట్టడి చేయాలి. మరోవైపు అలీసా హీలీ నాయకత్వంలో ఆ్రస్టేలియా జట్టు కూడా పటిష్టంగా ఉంది. బెత్ మూనీ, యాష్లే గార్డ్నర్, తాలియా మెక్‌గ్రాత్, ఎలీసా పెర్రీ, అనాబెల్ సదర్లాండ్ ప్రదర్శనపై ఆ్రస్టేలియా విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. -
దీప్తి ధమాకా
ముంబై: ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో భారత మహిళల జట్టు విజయంపై కన్నేసింది. భారత బౌలర్ల జోరుతో రెండో రోజే మ్యాచ్‌పై జట్టు పూర్తిగా పట్టు బిగించింది. స్పిన్నర్ల హవా సాగిన శుక్రవారం రెండు జట్లలో కలిపి 19 వికెట్లు నేలకూలగా... అందులో 15 వికెట్లు స్పిన్నర్లే పడగొట్టారు. భారత ఆఫ్‌స్పిన్నర్ దీప్తి శర్మ (5/7) కేవలం 7 పరుగులకే 5 వికెట్లు పడగొట్టి తన అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసింది. దీప్తి ధాటికి ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 35.3 ఓవర్లలో 136 పరుగులకే కుప్పకూలింది. నాట్ సివర్ బ్రంట్ (70 బంతుల్లో 59; 10 ఫోర్లు) మాత్రమే పోరాడి అర్ధ సెంచరీ సాధించగా, ఇతర బ్యాటర్లంతా విఫలమయ్యారు. మరో ఆఫ్ స్పిన్నర్ స్నేహ్ రాణాకు 2 వికెట్లు దక్కాయి. ఫలితంగా భారత్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 292 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. అయితే ఇంగ్లండ్‌కు ఫాలోఆన్ ఇవ్వకుండా భారత్ మళ్లీ బ్యాటింగ్‌కు దిగింది. ఆరంభం నుంచే బ్యాటర్లంతా దూకుడుగా ఆడటంతో జట్టు ఆధిక్యం మరింత పెరిగింది. రెండో రోజు ఆట ముగిసేసమయానికి భారత్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు కోల్పోయి 186 పరుగులు సాధించింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (67 బంతుల్లో 44 నాటౌట్; 5 ఫోర్లు) రాణించగా... షఫాలీ వర్మ (33), జెమీమా (27), స్మృతి మంధాన (26) కీలక పరుగులు సాధించారు. ఇంగ్లండ్ లెఫ్టార్మ్ స్పిన్నర్లు చార్లీ డీన్ 4, ఎకెల్‌స్టోన్ 2 వికెట్లతో భారత్‌ను దెబ్బ తీశారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ టాప్ స్కోరర్‌గా నిలిచిన శుభ సతీశ్ ఎడమ చేతికి ఫ్రాక్చర్ కావడంతో బ్యాటింగ్‌కు దిగలేదు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 410/7తో శుక్రవారం ఉదయం ఆట కొనసాగించిన భారత్ మరో 18 పరుగులు జోడించి 428 పరుగులకు ఆలౌటైంది. ప్రస్తుతం ఏకంగా 478 పరుగుల ఓవరాల్ ఆధిక్యంతో భారత్ ఇప్పటికే అసాధ్యమైన లక్ష్యం విధించే దిశగా సాగుతోంది. మ్యాచ్‌లో మరో రెండు రోజులు మిగిలి ఉన్న నేపథ్యంలో ఇంగ్లండ్ ఓటమి నుంచి తప్పించుకోవడం దాదాపు అసాధ్యమే. -
మహిళల ‘టెస్టు’కు సిద్ధం
ముంబై: రెండేళ్ల విరామం తర్వాత భారత మహిళల క్రికెట్ జట్టు టెస్టు మ్యాచ్ బరిలోకి దిగుతోంది. టి20 సిరీస్ తర్వాత ఇంగ్లండ్‌తో నేటినుంచి జరిగే ఏకైక టెస్టు (నాలుగు రోజుల మ్యాచ్)లో భారత్ తలపడుతుంది. వన్డేలు, టి20లను పక్కన పెడితే టెస్టుల్లో భారత జట్టు ప్రత్యర్థి తో పోలిస్తే అనుభవం, ఫలితాలపరంగా చాలా వెనుకబడి ఉంది. మన అమ్మాయిలకు ఎప్పుడో గానీ టెస్టులు ఆడే అవకాశం రాదు. ఓవరాల్‌గా భారత్ ఇప్పటి వరకు 38 టెస్టులు మాత్రమే ఆడగా...99 మ్యాచ్‌లు ఆడిన ఇంగ్లండ్ ఇప్పుడు 100వ మ్యాచ్‌కు సిద్ధమైంది. 2014 తర్వాత భారత్‌లో మహిళల టెస్టు జరగడం ఇదే మొదటిసారి కావడం విశేషం. భారత మహిళల క్రికెట్ దిగ్గజాలు మిథాలీరాజ్, జులన్ గోస్వామిల రిటైర్మెంట్ తర్వాత జట్టు ఆడుతున్న మొదటి టెస్టు ఇదే కానుంది. ఈ నేపథ్యంలో టెస్టు అనుభవంపై ఇంగ్లండ్ ఆధారపడుతుండగా... సొంతగడ్డపై ఆడుతున్న అనుకూలతను హర్మన్ సేన నమ్ముకుంది. 2021 సెపె్టంబర్లో ఆఖరి సారిగా టెస్టు ఆడిన భారత్ ఆసీస్‌తో జరిగిన ఆ మ్యాచ్‌ను ‘డ్రా’గా ముగించగలిగింది. ఇంగ్లండ్ సమష్టిగా... దేశవాళీలో నాలుగు రోజుల మ్యాచ్‌లు ఎక్కువగా ఆడటం పాటు ‘యాషెస్’ కార ణంగా కూడా ఇంగ్లండ్ టీమ్ తరచుగా టెస్టు మ్యాచ్‌ల బరిలోకి దిగుతూ వస్తోంది. ఇప్పు డు కూడా ఆ జట్టు ఈ ఫార్మాట్లో తమ బలాన్నే నమ్మకుంది. జట్టులో ఎక్కువ మంది సభ్యులకు టెస్టు అనుభవం ఉంది. కెప్టెన్ హీతర్ నైట్‌తో పాటు బీమాంట్, సివర్ బ్రంట్ కీలక బ్యాటర్లు కాగా...మిడిలార్డర్లో క్యాప్సీ, డాని వాట్ ప్రభావం చూపించగలరు. బీమాంట్‌తో పాటు రెండో ఓపెనర్‌గా డంక్లీ బరిలోకి దిగవచ్చు. కీపర్ ఎమీ జోన్స్ ధాటిగా ఆడగలదు. స్పిన్నర్ సోఫీ ఎకెల్‌స్టోన్ ఇంగ్లండ్‌కు బౌలింగ్‌లో ప్రధాన బలం. ఇతర బౌలర్లు క్రాస్, బెల్, డీన్ భారత పిచ్‌పై ఏమాత్రం ప్రభావం చూపించగలరో చెప్పలేం. ఇంగ్లండ్ జట్టు భారత గడ్డపై 2005 తర్వాత టెస్టు మ్యాచ్ ఆడటం ఇదే మొదటిసారి. వారిద్దరే కీలకం... భారత జట్టులో భారత కెప్టెన్ కు 3 టెస్టుల, స్టార్ బ్యాటర్ స్మృతి మంధానకు 4 టెస్టుల అనుభవం మాత్రమే ఉండగా...మిగతా జట్టు సభ్యులకు ఆమాత్రం అనుభవం కూడా లేదు. వన్డేలు, టి20లతో పోలిస్తే క్రీజ్‌లో నిలవడంలో వీరు ఏమాత్రం పట్టుదల కనబరుస్తారనేది ఆసక్తికరం. అందుకే జట్టు విజయావకాశాలు ప్రధానంగా హర్మన్, స్మృతిలపైనే ఆధారపడి ఉన్నాయి. షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్ తమ బ్యాటింగ్ బలాన్ని ప్రదర్శించాల్సి ఉంది. ముఖ్యంగా పరిమిత ఓవర్ల క్రికెట్లో దూకుడుకు మారుపేరైన షఫాలీ ఇక్కడ కాస్త ఓపికను చూపించి ఆడితే భారీ స్కోరుకు అవకాశం ఉంటుంది. రోడ్రిగ్స్ కూడా టెస్టుకు తగినట్లుగా తన ఆటతీరును మార్చుకోగలదని టీమ్ మేనేజ్మెంట్ ఆశిస్తోంది. అనుభవజు్ఞలైన స్పిన్నర్లు స్నేహ్ రాణా, రాజేశ్వరి గైక్వాడ్ టెస్టులో ఎలాంటి ప్రభావం చూపిస్తారనేది చూడాలి. వీరితో పాటు దీప్తి శర్మ కూడా స్పిన్‌తో రాణించగలదు. భారత్ ఆడిన గత రెండు టెస్టులు కూడా విదేశీ గడ్డపైనే జరిగాయి. ఆ రెండు మ్యాచ్‌లలో జట్టు ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగింది. అలా చూస్తే రేణుకా సింగ్, మేఘనా సింగ్‌లతో పాటు పూజ వస్త్రకర్‌కు అవకాశం ఉంటుంది. ఇద్దరు పేసర్లకే పరిమితమైతే మాత్రం పూజను పక్కన పెట్టి అదనపు బ్యాటర్‌గా రిచా ఘోష్‌ను తీసుకోవచ్చు. -
సరదాగా డీఎన్ఏ టెస్టు... షాకిచ్చిన రిపోర్టు!
ఒక యూరోపియన్ మహిళ తన సోదరీమణులతో కలిసి సరదాగా ఇంట్లోనే డీఎన్ఏ పరీక్ష చేయించుకోవాలనుకుంది. అయితే వాటి ఫలితాలు తన జీవితంలో ఎంతటి దారుణమైన పరిణామాలకు దారితీస్తాయో ఆమె గ్రహించలేకపోయింది. తన తల్లిదండ్రులు ఇన్నాళ్లూ ఇంత పెద్ద రహస్యాన్ని దాచిపెట్టారని ఆమె ఊహించలేకపోయింది. ఈ మహిళ తన గుర్తింపును వెల్లడించకుండా సోషల్ మీడియా సైట్ రెడ్డిట్‌లో ఒక వివరణాత్మక పోస్ట్ పెట్టింది. దానిలో ఆమె.. ‘నేను, నా సిస్టర్స్ సరదాగా డీఎన్ఏ పరీక్ష చేయించుకోవాలనుకున్నాం. ఒక కిట్ సాయంతో డిఎన్ఏ టెస్టు చేయించుకున్నాం. ఆ పరీక్ష ఫలితాలు రాగానే గుండె బద్ధలయ్యే నిజం వెలుగు చూసింది. డీఎన్ఏ పరీక్ష ఫలితాలలో తన అన్నలు, అక్కాచెల్లెళ్లకు పూర్తి బంధుత్వం ఉందని, తానుమాత్రం ఒంటరినని తేలిందని ఆ మహిళ చెప్పింది. కాగా ఆమె సోదరి తమ తల్లిదండ్రులతో ఈ విషయమై మాట్లాడాలని నిర్ణయించుకుంది. అయితే తల్లిదండ్రులు ఆ డిఎన్ఏ ఫలితాలు నిజం కాదని అన్నారు. అయితే ఆమె తండ్రి ఈ విషయాన్ని ఇంతటితో ఆపేయాలని కోరాడు. తల్లి ఈ విషయంలో తనకేమీ పట్టనట్టు వ్యవహరించింది. అయితే ఎట్టకేలకు తండ్రి నిజాన్ని చెప్పాడు. అయితే ఆమె ఎప్పటికీ తన కుమార్తెనేనని అన్నాడు. ఇంతకాలం తన తల్లిదండ్రులు ఈ విషయాన్ని దాచిపెట్టడంపై ఆ మహిళ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. తనను తల్లిదండ్రులు పెంచిన విధానంలో ఏదో తేడా కనిపించడంతో తనకు వేరే తండ్రి ఉన్నడని అనుకునేదానినని ఆమె తెలిపింది. ప్రస్తుతం ఆమె తల్లితో నాటి పరిస్థితిని చర్చించాలనుకుంటోంది. అయితే తల్లి తనకు ఏమీ తెలియదని అంటోంది. కాగా ఆ మహిళ తన జీవసంబంధమైన తండ్రిని గుర్తించగలిగింది. అయితే ఇప్పుడు తాను ఏమి చేయాలంటూ ఆమె రెడ్డిట్ యూజర్స్‌ను కోరింది. ఇది కూడా చదవండి: పాక్‌పై ప్రాణాంతక అమీబా దాడి.. 11 మంది మృతి! -
సర్వం సిద్ధం
సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా): భారత అంతరిక్ష పరిశోధనాసంస్థ (ఇస్రో) శనివారం ఉదయం మొట్టమొదటగా ప్రయోగించనున్న గగన్‌యాన్ టెస్ట్ వెహికల్ (టీవీ–డీ1) ప్రయోగానికి శుక్రవారం సాయంత్రం 7.30 గంటలకు కౌంట్‌డౌన్ మొదలైంది. 12.30 గంటల కౌంట్‌డౌన్ అనంతరం శనివారం ఉదయం 8 గంటలకు ప్రయోగాన్ని చేపట్టేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు సిద్దం చేశారు. షార్‌లోని మొదటి ప్రయోగవేదిక నుంచి సింగిల్ స్టేజీతో (ఒకే దశతో) ప్రయోగాన్ని నిర్వహిస్తున్నారు. 531.8 సెకన్లకు ప్రయోగాన్ని పూర్తి చేయనున్నారు. టీవీ–డీ1ను 17 కిలోమీటర్లు ఎత్తుకు తీసుకెళ్లి రాకెట్ శిఖరభాగాన అమర్చిన క్రూమాడ్యూల్ ఎస్కేప్ సిస్టంను మళ్లీ కిందకు తీసుకొచ్చే ప్రక్రియను చేపట్టడం ఈ ప్రయోగం ముఖ్య ఉద్దేశం. రాకెట్ శిఖరభాగంలో అమర్చిన క్రూమాడ్యూల్ ఎస్కేప్ సిస్టం భూమికి 17 కిలోమీటర్లు దూరంలో అంతరిక్షంలో వదిలిపెట్టిన తరువాత దానికి పైభాగంలో అమర్చిన 10 ప్యారాచూట్ల సాయంతో బంగాళాఖాతంలో దించి సురక్షితంగా తీసుకువచ్చే ప్రక్రియను చేపడుతున్నారు. శ్రీహరికోట రాకెట్ కేంద్రానికి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతంలో కోస్టల్ నేవీ సిబ్బంది ఒక ప్రత్యేక బోట్లో వేచి ఉండి సముద్రంలో క్రూమాడ్యూల్ పడిన తరువాత దాన్ని సురక్షితంగా తీసుకొస్తారు. భవిష్యత్తులో వ్యోమగాములు అంతరిక్షంలోకి వెళ్లి తిరిగి క్షేమంగా తీసుకువచ్చే ప్రక్రియను పరిశీలించే ప్రయోగం ఇదే కావడం విశేషం. -
విషయ పరిజ్ఞానమే కొలమానం
సాక్షి, అమరావతి: పాఠశాల విద్యలో విద్యార్థి వికాస చదువులకు రాష్ట్రంలో ప్రాధాన్యం పెరిగింది. పిల్లలు జాతీయ, అంతర్జాతీయంగా రాణించేలా పరీక్షల్లోను, ప్రశ్నల తీరులోను మార్పులు తీసుకొచ్చారు. అకడమిక్ మార్కులు కంటే.. విద్యార్థి మానసిక వికాసం, విశ్లేషణ సామర్థ్యాల పెంపుపై దృష్టి పెట్టారు. అందుకు అనుగుణంగా విషయ పరిజ్ఞానం అంచనా వేసేలా పరీక్షలు నిర్వహిస్తున్నారు. కొన్ని దశాబ్దాలుగా పరీక్షల్లో సంప్రదాయ ప్రశ్నల శైలి.. మార్కుల సాధనకే పరిమితమైంది. పిల్లల్లో వికాసం, విశ్లేషణ సామర్థ్యాలను అంచనా వేసే విధానం కరువైంది. దీంతో గత ఏడాది నుంచి రాష్ట్రంలో పాఠశాల విద్యాశాఖ పరీక్ష నిర్వహణ, ప్రశ్నల శైలిలో మార్పులు తీసుకొచ్చింది. మరోపక్క కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా విద్యాస్థాయిని అంచనా వేసేందుకు, అభ్యసన లోపాలను గుర్తించేందుకు వివిధ రకాల సర్వేలు చేస్తోంది. వీటిలో ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ నేషనల్ అచీవ్మెంట్ సర్వే (ఎఫ్ఎల్ఎస్), నేషనల్ అచీవ్మెంట్ సర్వే ముఖ్యమైనవి. వీటిద్వారా వివిధ రాష్ట్రాల్లో విద్యార్థుల సామర్థ్యాలను, ఉపాధ్యాయుల బోధనా నైపుణ్యాలను అంచనా వేసి రాష్ట్రాలకు ర్యాంకింగ్ ఇస్తోంది. విద్యా సంవత్సరంలో నిర్వహించే ఫార్మెటెవ్, సమ్మెటివ్ అసెస్మెంట్లలో 1 నుంచి 8వ తరగతుల విద్యార్థులకు సిలబస్ ప్రకారం విశ్లేషణాత్మక ప్రశ్నలకు ప్రాధాన్యం ఇస్తోంది. ఎన్ఏఎస్ సర్వేకు అనుగుణంగా పరీక్షలు దేశవ్యాప్తంగా విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ అచీవ్మెంట్ టెస్ట్ (ఎన్ఏఎస్), ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ నేషనల్ అచీవ్మెంట్ సర్వేను ఏటా చేపడుతుంది. 2021లో కేంద్రం ఎన్ఏస్, 2022లో ఎఫ్ఎల్ఎస్ నిర్వహించింది. కరోనా అనంతరం నిర్వహించిన ఈ సర్వేలో దేశవ్యాప్తంగా అభ్యసన లోపాలు ఉన్నట్టు గుర్తించి, వాటిని అధిగమించేందుకు పలు సంస్కరణలను చేపట్టి నూతన విద్యా విధానానికి అనుగుణంగా అమలు చేస్తోంది. ఇందులో భాగంగా విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేసేందుకు ఏ తరహా పరీక్షలు, ప్రశ్నలు ఉంటాయో అదే విధానాన్ని ప్రభుత్వం పాఠశాల విద్యలో గత ఏడాది నుంచి అనుసరిస్తోంది. కేంద్ర ప్రభుత్వం వచ్చే నెల 3న జాతీయ స్థాయిలో సర్వే నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా గత నెలలో అండమాన్–నికోబార్‌లో వివిధ రాష్ట్రాల అసెస్మెంట్ సభ్యులకు శిక్షణ ఇచ్చింది. అందులో రాష్ట్రాలు విద్యా ప్రమాణాలు పెంచేందుకు తీసుకుంటున్న చర్యలు, అసెస్మెంట్లో అనుసరించాల్సిన విధానాలను విడుదల చేసింది. దీనికి అనుగుణంగా సిద్ధమవ్వాల్సిందిగా రాష్ట్రాలను ఆదేశించింది. రాష్ట్ర స్థాయిలో అసెస్మెంట్ సెల్ ఏర్పాటు ప్రస్తుతం రాష్ట్రంలో ఈ తరహా పరీక్ష విధానాన్ని 2022–23 విద్యా సంవత్సరంలో ప్రవేశపెట్టారు. కేంద్రం నిర్వహించే నేషనల్ అచీవ్మెంట్ సర్వే, ఎఫ్ఎల్ఎస్ పరీక్షల తరహాలోనే రాష్ట్రంలో పరీక్ష పత్రాలను రూపొందిస్తున్నారు. ఇందుకోసం 15 మంది నిపుణులైన ఉపాధ్యాయులతో రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) ఆధ్వర్యంలో ప్రత్యేక అసెస్మెంట్ సెల్ ఏర్పాటు చేశారు. విద్యార్థులు సాధించిన ఫలితాల ఆధారంగా బోధనలో సైతం మార్పులు చేస్తున్నారు. ఇందుకోసం ప్రతినెలా సబ్జెక్టు టీచర్లకు స్కూల్ కాంప్లెక్స్ శిక్షణ సైతం ఇస్తున్నారు. విద్యార్థి సామర్థ్యం అంచనాకు విశ్లేషణాత్మక ప్రశ్నలు ఒక విద్యా సంవత్సరంలో పాఠశాల విద్యాశాఖ నాలుగు ఫార్మెటివ్, రెండు సమ్మెటివ్ (ఆరు) అసెస్మెంట్లు నిర్వహిస్తోంది. వీటిలో రెండు ఫార్మెటివ్, ఒక సమ్మెటివ్ అసెస్మెంట్లకు ‘ఓఎంఆర్’ విధానం అనుసరిస్తున్నారు. ఈ విద్యా సంవత్సరంలో ఎఫ్ఏ–1 ఓఎంఆర్ విధానంలో పూర్తిచేయగా, ఎఫ్ఏ–2ను పాత విధానంలో మంగళవారం నుంచి నిర్వహించనున్నారు. ఈ విధానాన్ని 1 నుంచి 8వ తరగతి వరకు అనుసరిస్తోంది. పదో తరగతిలో బోర్డు పరీక్షలకు ఇబ్బంది లేకుండా 9, 10 తరగతులకు పాత విధానంలోనే పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఎఫ్ఏలో మొత్తం 20 మార్కులకు 15 ప్రశ్నలు ఉంటాయి, ఇందులో 10 ప్రశ్నలకు ఓఎంఆర్ విధానంలో జవాబులు గుర్తించాలి. మరో ప్రశ్నలకు 5 డిస్క్రిప్టివ్ విధానంలో సమాధానాలు రాయాలి. ఈ ప్రశ్నలన్నీ విద్యార్థి మానసిక సామర్థ్యం, ప్రశ్నలు అర్థం చేçసుకునే విధానాన్ని పరీక్షించేలా ఉంటాయి. -
షాకింగ్.. బ్రేకింగ్! ఇదేం ఐఫోన్ భయ్యా.. వైరల్ వీడియో
ప్రపంచవ్యాప్తంగా అత్యంత క్రేజ్ ఉన్న స్మార్ట్ఫోన్లు యాపిల్ (Apple) ఐఫోన్లు. చాలా మంది ఎప్పటి నుంచో ఎదురు చేస్తున్న ఐఫోన్ 15 (iPhone 15) సిరీస్‌ను యాపిల్ ఇటీవల విడుదల చేసింది. అయితే ఈ ఐఫోన్లు మార్కెట్లోకి వచ్చినప్పుటి నుంచి రోజుకో కంప్లైంట్ వెలుగులోకి వస్తోంది. తాజాగా ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ (iPhone 15 Pro Max)పై జెర్రీరిగ్ఎవెరీథింగ్ (JerryRigEverything) అనే యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన నాణ్యత పరీక్షకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ నాణ్యతపై రకరకాల పరీక్షలు చేశారు. దీంట్లో ప్రధానంగా కేవలం చేతి వేళ్లలో వంచగానే ఫోన్ వెనుకవైపున్న గ్లాస్ చిట్లిపోయింది. Oh man team no case on iPhone 15 Pro Max going to be interesting… pic.twitter.com/X9yng11umf — Miguel Lozada (@MLozada) September 23, 2023 ‘ఐఫోన్15 ప్రో మ్యాక్స్‌ను అత్యంత దృఢమైన గ్రేడ్ 5 టైటానియంతో తయారు చేసినట్లు యాపిల్ ప్రకటించినప్పుడు తాను ఆశ్చర్యపోయాను. కానీ టైటానియం ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ వెనుక గ్లాస్ ప్రైమ్ టైమ్ కోసం సిద్ధంగా లేదని తేలింది. యాపిల్స్ కొత్త ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్‌లో ఏదో తప్పు జరిగింది’ అని వీడియో డిస్క్రిప్షన్లో ఆ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ పేర్కొన్నారు. యూట్యూబ్‌లో సెప్టెంబర్ 23న పోస్ట్ చేసిన ఈ వీడియోకు ఇప్పటి వరకూ 8.5 మిలియన్లకు పైగా వ్యూవ్స్ వచ్చాయి. 2.6 లక్షలకుపైగా లైక్‌లు రాగా వేలాది మంది కామెంట్లు చేశారు. "నేను షాక్ అయ్యాను. ప్రో మాక్స్ అంత తేలిగ్గా బ్రేక్ అవుతుందని ఊహించలేదు.. ఆ బ్రేక్ షాకింగ్ గా ఉంది" అంటూ ఓ యూజర్ కామెంట్ చేశారు. మరోవైపు ఈ వీడియో క్లిప్‌ను కొంతమంది ‘ఎక్స్’ (ట్విటర్)లోనూ షేర్ చేశారు. -
‘గగన్‌యాన్’లో మరో కీలక పరీక్ష విజయవంతం
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గగన్‌యాన్ ప్రయోగానికి సంబంధించి మరో కీలక పరీక్ష విజయవంతమైంది. ఈ నెల 8వ తేదీన డ్రోగ్ ప్యారాచూట్లకు ప్రయోగాత్మక పరీక్షలు విజయవంతంగా నిర్వహించినట్లు ఇస్రో శుక్రవారం తన వెబ్సైట్లో పేర్కొంది. గగన్‌యాన్ మిషన్‌లో వ్యోమగాములు అంతరిక్షంలోకి వెళ్లి తిరిగి సురక్షితంగా భూమికి చేరుకునేందుకు డ్రోగ్ ప్యారాచూట్ విస్తరణ పరీక్షల అవసరం ఉందని తెలిపింది. క్రూ మాడ్యూల్‌ను స్థిరీకరించడానికి, రీ–ఎంట్రీ సమయంలో దాని వేగాన్ని తగ్గించి సురక్షితంగా తీసుకురావడానికి ఈ ప్యారాచూట్ కీలకపాత్ర పోషిస్తుందని వెల్లడించింది. గగన్‌యాన్ క్రూ మాడ్యూల్ మందగింపు వ్యవస్థ కోసం సంక్లిష్టమైన ప్యారాచూట్ స్వీకెన్స్‌లో మొత్తం 10 వరకు ఉంటాయని పేర్కొంది. గగన్‌యాన్ ప్రయోగంలో క్రూ మాడ్యూల్‌ను అంతరిక్షంలోకి పంపించి, దానిని మళ్లీ భూమి మీదకు తీసుకువచ్చేందుకు, సురక్షితంగా ల్యాండింగ్ చేసేందుకు ఈ ప్యారాచూట్లు కీలక పాత్ర పోషిస్తాయని, అందుకు వీటి పనితనాన్ని పరీక్షించుకుని నిర్ధారించుకుంటున్నామని ఇస్రో వివరించింది. -
ఏమో! కారు ఎగరావచ్చు.. కానీ!
నగరాల్లో విపరీతమైన వాహనాల రద్దీ, అధ్వాన్నమైన రహదారుల వల్ల సమయానికి గమ్యస్థానాలకు చేరుకోలేక ప్రయాణికులు విసుగెత్తిపోతుంటారు. ట్రాఫిక్ జంఝాటం లేకుండా హాయిగా ఆకాశంలో విహరిస్తూ వేగంగా దూసుకెళ్తే బాగుంటుందని అనుకోనివారు ఉండరు. అలాంటివారి కోసం అమెరికాలోని కాలిఫోరి్నయాకు చెందిన అలెఫ్ ఏరోనాటిక్స్ సంస్థ ఎగిరే కారును(ఫ్లైయింగ్ కారు) అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. 2015లో మొదలైన ఈ ఆలోచనకు పదునుపెట్టిన అలెఫ్ కంపెనీ 2019 నాటికి ఎగిరే కారును తయారు చేసింది. మోడల్–ఎ ఫ్లైయింగ్ కారును ఆవిష్కరించింది. కొన్ని రకాల పరీక్షల తర్వాత ఈ ఏడాది జూన్ 12న అమెరికా ఫెడరేషన్ ఏవియేషన్ అడ్మిని్రస్టేషన్(ఎఫ్ఏఏ) ఈ కారుకు స్పెషల్ ఎయిర్‌వర్తీనెస్ సర్టిఫికెట్ అందజేసింది. అంటే పరిమిత ప్రాంతాల్లో ఫ్లైయింగ్ కారును ప్రదర్శించడానికి, దీనిపై పరిశోధన–అభివృద్ధి వంటి కార్యకలాపాల కోసం అనుమతి మంజూరు చేసింది. ఇదొక టరి్నంగ్ పాయింట్ అని చెప్పాలి. ఇదంతా బాగానే ఉన్నప్పటికీ ఎగిరే కారు ప్రజలకు విస్తృతంగా అందుబాటులోకి రావడానికి సాంకేతికపరమైన, చట్టపరమైన ఎన్నో అవరోధాలు, సవాళ్లు ఉన్నాయి. వాటిని అధిగమిస్తేనే కారులో ఆకాశంలో స్వేచ్ఛగా ప్రయాణించడానికి అవకాశం ఉంటుంది. విడిభాగాల లభ్యత ఎలా ఎక్కువ సంఖ్యలో ఎగిరే కార్లను తయారు చేయడానికి కొన్ని విడిభాగాలు విస్తృతంగా అందుబాటులో లేవని అలెఫ్ ఏరోనాటిక్స్ ముఖ్య కార్యనిర్వహణాధికారి జిమ్ డుఖోవ్నీ చెప్పారు. వాటిని సమకూర్చుకోవడం చాలా కష్టమని అన్నారు. ఉదాహరణకు ఫ్లైయింగ్ కారుకు ప్రయాణంలో ఎదురయ్యే ఒత్తిడిని తగ్గించడానికి హైలీ స్పెషలైజ్డ్ ప్రొపెల్లర్ మోటార్ సిస్టమ్స్ అవసరమని, అలాంటివి తయారు చేసుకోవడం శ్రమ, ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని తెలిపారు. ఎగిరే కారు ఎంత త్వరగా క్షేత్రస్థాయిలోకి వస్తుందన్నది దాని పరిమాణం, బరువు, ధర, అది ఎంతవరకు సురక్షితం అనేదానిపైనా ఆధారపడి ఉంటుందన్నారు. సేఫ్టీ ఫీచర్ల మాటేమిటి అలెఫ్ కంపెనీ మోడల్–ఎ కార్ల విక్రయాల కోసం ఇప్పటికే ప్రి–ఆర్డర్లను స్వీకరిస్తోంది. ఒక్కో కారు ధరను 3 లక్షల డాలర్లుగా (రూ.2.46 కోట్లు) నిర్ధారించింది. మోడల్–ఎ అనేది అ్రల్టాలైట్, లో స్పీడ్ వెహికల్. చట్టప్రకారం ఈ మోడల్ కారు గోల్ఫ్ కార్ట్లు, చిన్నపాటి విద్యుత్ వాహనాల విభాగంలోకి వస్తుంది. ఫ్లైయింగ్ కారు కేవలం గాల్లో ఎగరడమే కాదు, రోడ్లపై కూడా సాధారణ వాహనాల్లాగే ప్రయాణిస్తుంది. దానికి అనుమతి రావాలంటే ‘నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్’ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. అంటే సాధారణ కార్లలో ఉండే సేఫ్టీ ఫీచర్లన్నీ ఉండాలి. అలెఫ్ సంస్థ అభివృద్ధి చేసిన మోడల్–ఎ కారు రోడ్లపై ప్రయాణానికి అంతగా సురక్షితం కాదన్న వాదన వినిపిస్తోంది. భారీ శబ్ధాలు, కాలుష్యం ఫ్లైయింగ్ కార్లు పరిమితమైన ఎత్తులోనే ఎగురుతాయి. భారీ శబ్ధాలు, కాలుష్యం ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. దీనివల్ల కొత్త సమస్యలు తప్పవు. ప్రజల్లో అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం లేకపోలేదు. ఏమాత్రం శబ్ధం వెలువడని ఫ్లైయింగ్ కార్లు డిజైన్ చేయడం చాలా సంక్లిష్టమైన ప్రక్రియ అంటున్నారు. రోడ్లపై వాహనాలు ఢీకొంటున్నట్లుగానే గగనతలంలో వేగంగా దూసుకెళ్లే ఫ్లైయింగ్ కార్లు పరస్పరం ఢీకొనే అవకాశాన్ని కొట్టిపారేయలేం. ఎగిరే కార్లు భవనాలను ఢీకొని నేలకూలడానికి ఆస్కారం ఉంది. అదే జరిగితే నష్టం భారీగానే ఉంటుంది. ఈ సమస్యను పరిష్కరించాల్సి ఉంది. ఆకాశంలో ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడకుండా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ తరహాలో ఎగిరే కార్ల రాకపోకల కోసం శాస్త్రీయమైన మార్గసూచిని రూపొందించాలి. ధనవంతులకే సాధ్యమా? ఇప్పుడున్న పరిస్థితిని బట్టి చూస్తే ఎగరే కార్ల ధరలను సంపన్నులే భరించగలరు. కోట్లాది రూపాయలు వెచ్చించి ఇలాంటివి కొనేసే స్తోమత కొందరికే ఉంటుంది. నిర్వహణ ఖర్చులు, లైసెన్స్ ఫీజులు కూడా తక్కువేమీ కాదు. విమాన ప్రయాణం ప్రారంభమైన తొలి రోజుల్లో ధనవంతులకే పరిమితం అన్నట్లుగా ఉండేది. కానీ, ఇప్పుడు దిగువ మధ్యతరగతి ప్రజలు కూడా విమానాల్లో ప్రయాణిస్తున్నారు. ఫ్లైయింగ్ కార్ల విషయంలోనూ అలాంటి పరిణామం సాధ్యపడొచ్చు. ప్రభుత్వాలే ప్రజా రవాణా వ్యవస్థలో భాగంగా ఈ కార్లను ప్రవేశపెడితే సామాన్య ప్రజలు సైతం ఆకాశయానం చేయొచ్చు. నడపడానికి లైసెన్స్ ఎవరిస్తారు? కార్లు నడపాలన్నా, విమానాలు నడపాలన్నా కచ్చితంగా లైసెన్స్ ఉండాల్సిందే. ఫ్లైయింగ్ కార్లు నడపడానికి కూడా లైసెన్స్ అవసరం. డ్రైవింగ్ శిక్షణ ఎవరిస్తారు? లైసెన్స్‌లు ఎవరు జారీ చేస్తారన్న దానిపై స్పష్టత లేదు. ఇందుకోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దీనిపై ప్రభుత్వాలదే తుది నిర్ణయం. నేలపై, గాలిలో నడపడానికి డ్రైవర్లు శిక్షణ తీసుకోవాలి. ఫ్లైయింగ్ కార్ల డ్రైవింగ్ లైసెన్స్‌లు జారీ చేయడానికి రవాణా , పౌర విమానయాన శాఖ సమన్వయంతో పని చేయాల్సి రావొచ్చు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
‘ఈతరం బ్రాడ్‌మన్’ స్టీవ్ స్మిత్.. అరుదైన మైలురాయిని చేరుకోనున్న ఆసీస్ బ్యాటర్
2010 జూలై... లార్డ్స్ మైదానంలో ఆ్రస్టేలియా, పాకిస్తాన్ మధ్య తొలి టెస్టు మ్యాచ్. దిగ్గజ క్రికెటర్ షేన్ వార్న్ రిటైరై అప్పటికి మూడేళ్లవుతోంది. అతని స్థానాన్ని భర్తీ చేసే స్పిన్నర్ల వేట కొనసాగిస్తున్న ఆ్రస్టేలియా వేర్వేరు కొత్త ఆటగాళ్లతో ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో 21 ఏళ్ల లెగ్‌స్పిన్నర్ స్టీవెన్ స్మిత్‌కు అవకాశం కల్పించింది. బౌలింగ్‌లో 3 వికెట్లు తీసిన అతను... బ్యాటింగ్ 8వ, 9వ స్థానాల్లో బరిలోకి దిగి 1, 12 పరుగులు మాత్రమే చేశాడు. అయితే తర్వాతి రోజుల్లో అతను బౌలింగ్‌ను పక్కన పెట్టి అద్భుతమైన బ్యాటర్‌గా ఎదుగుతాడని ఎవరూ ఊహించలేకపోయారు. టెస్టు క్రికెట్లో ఘనమైన రికార్డులతో ఇప్పటికే ఆల్‌టైమ్ గ్రేట్‌లలో ఒకడిగా నిలిచిన స్మిత్ నేడు కెరీర్లో 100వ టెస్టు బరిలోకి దిగనుండటం విశేషం. కెరీర్లో తొలి ఐదు టెస్టుల్లో రెండు అర్ధ సెంచరీలు సాధించినా... ఆ్రస్టేలియా టీమ్ మేనేజ్మెంట్ స్మిత్‌ను బ్యాటర్‌గా గుర్తించలేదు. బౌలింగ్‌లోనూ మూడు వికెట్లే తీయడంతో సహజంగానే జట్టులో స్థానం పోయింది. మళ్లీ టీమ్‌లోకి రావడానికి అతనికి రెండేళ్లు పట్టింది. ‘హోంవర్క్గేట్’ కారణంగా సీనియర్లపై వేటు పడటంతో అదృష్టవశాత్తూ మొహాలిలో భారత్‌తో జరిగిన టెస్టులో అతనికి అవకాశం దక్కింది. తొలి ఇన్నింగ్స్‌లో 92 పరుగులు చేసిన స్మిత్ బ్యాటింగ్ విలువేమిటో అందరికీ అర్థమైంది. కెరీర్లో తొలి మూడు సెంచరీలు ఇంగ్లండ్‌పైనే నమోదు చేసిన స్మిత్... స్టెయిన్, మోర్కెల్, ఫిలాండర్‌ల పదునైన పేస్ బౌలింగ్‌ను ఎదుర్కొని సెంచూరియన్‌లో దక్షిణాఫ్రికాపై సాధించిన శతకం అతని స్థానాన్ని సుస్థిరం చేసింది. ఆ తర్వాత అతను వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. ‘ఇంతింతై వటుడింతై’ అన్నట్లు అత్యుత్తమ ప్రదర్శనలతో దూసుకుపోయి స్మిత్ టెస్టుల్లో శిఖరానికి చేరుకున్నాడు. కెరీర్లో ఒకదశలో అత్యుత్తమంగా 64.81 సగటును అందుకున్న స్మిత్... డాన్ బ్రాడ్‌మన్ తర్వాత రెండో స్థానంలో నిలిచి ‘ఆధునిక బ్రాడ్‌మన్’ అనిపించుకున్నాడు. పరిస్థితులతో సంబంధం లేకుండా ప్రపంచంలోనే అన్ని వేదికల్లోనూ పరుగులు సాధించగలడం స్మిత్ సాధించిన ఘనత. ఎదురులేని ప్రదర్శనలతో... 2014–2018 మధ్య కాలం స్మిత్ కెరీర్లో అత్యుత్తమం. ఈ సమయంలో ఎన్నో అసాధారణ రికార్డులను అతను తన ఖాతాలో వేసుకున్నాడు. 79 ఇన్నింగ్స్‌లలో ఏకంగా 75.81 సగటుతో 5004 పరుగులు నమోదు చేశాడు. 2015 యాషెస్ సిరీస్‌లో 508 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచిన అతను ఈ సిరీస్ ముగియగానే పూర్తి స్థాయి కెపె్టన్‌గా బాధ్యతలు చేపట్టాడు. భారత గడ్డపై జరిగిన బోర్డర్–గావస్కర్ ట్రోఫీలో 3 సెంచరీలు సహా 499 పరుగులతో అతనే అగ్రస్థానంలో నిలిచాడు. ఈ సిరీస్‌లో కఠినమైన పుణే పిచ్‌పై ప్రతికూల పరిస్థితులను అధిగమించి రెండో ఇన్నింగ్స్‌లో స్మిత్ చేసిన శతకం టెస్టు క్రికెట్లో అత్యుత్తమ ప్రదర్శనల్లో ఒకటి. కొద్ది రోజులకే కెప్టెన్‌గా సొంతగడ్డపై 4–0తో యాషెస్ సిరీస్‌ను గెలిపించడంతోపాటు 687 పరుగులతో టాపర్‌గా నిలిచాడు. వరుసగా నాలుగేళ్లు వేయికి పైగా పరుగులు చేసి తన స్థాయి ఏమిటో అతను చూపించాడు. 2014లో తొలిసారి 50 బ్యాటింగ్ సగటును స్మిత్ అందుకోగా, ఇప్పటి వరకూ అది అంతకంటే తగ్గకపోవడం అతని నిలకడను చూపిస్తోంది. టాంపరింగ్ వివాదాన్ని దాటి... తెలివితేటలు, వ్యూహ చతురత, సాంకేతికాంశాలపై పట్టు స్మిత్‌ను విజయవంతమైన కెపె్టన్‌గా నిలిపాయి. అయితే ఇదే తెలివి కాస్త ‘అతి’గా మారడంతో 2018 ఆరంభంలో దక్షిణాఫ్రికాతో టెస్టులో బాల్ టాంపరింగ్‌కు పాల్పడి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. ఏడాది పాటు నిషేధం కూడా పడింది. అయితే సంవత్సరం తర్వాత తిరిగొచ్చాక అతను తనలోని పాత స్మిత్‌ను మళ్లీ చూపించాడు. 2019 యాషెస్‌లో 4 టెస్టుల్లోనే ఏకంగా 774 పరుగులతో సత్తా చాటాడు. తర్వాత కొన్నాళ్లపాటు తడబాటు కనిపించినా... గత ఏడాది గాలే టెస్టులో 145 పరుగులతో ఫామ్‌లోకి వచ్చిన అతను ఇప్పటికీ అదే జోరును కొనసాగిస్తున్నాడు. తాజాగా డబ్ల్యూటీసీ ఫైనల్లో, లార్డ్స్ టెస్టులోనూ శతకాలు బాది మరిన్ని రికార్డులపై స్మిత్ గురి పెట్టాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో 99 టెస్టులు ముగిసేసరికి అత్యుత్తమ సగటు (59.56)తో నిలిచిన ఆటగాడైన స్మిత్ 32 సెంచరీలు, 37 అర్ధ సెంచరీలతో 9113 పరుగులు సాధించాడు. నేటి నుంచి ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య మూడో ‘యాషెస్’ టెస్టు లీడ్స్‌లో జరగనుంది. హెడింగ్లీ మైదానంలో జరిగే ఈ పోరు కోసం ఇంగ్లండ్ ఇప్పటికే తుది జట్టును ప్రకటించింది. గత మ్యాచ్ ఆడిన పోప్, అండర్సన్, టంగ్ స్థానాల్లో వోక్స్, అలీ, వుడ్‌లను ఎంపిక చేశారు. సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లు నెగ్గిన ఆ్రస్టేలియా 2–0తో ఆధిక్యంలో ఉంది. మధ్యాహ్నం గం. 3:30 నుంచి మొదలయ్యే ఈ మ్యాచ్‌ను ‘సోనీ నెట్వర్క్’లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. - సాక్షి క్రీడా విభాగం -
యూరిన్ కాదు.. ఇక లాలాజలంతో ప్రెగ్నెన్సీ టెస్ట్
ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కోసం వైద్యులను సంప్రదించడం కాకుండా.. మహిళల కోసం హోంటెస్ట్ కిట్లు అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. అయితే కేవలం ఉమ్మితోనే అమ్మ అయ్యిందో లేదో తెలుసుకోవచ్చు. అందుకోసం ఓ కిట్ యూకేలో లాంఛ్ కాగా.. అతిత్వరలో అది ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి రానుంది. ప్రపంచంలోనే ఈ తరహా తొలి ఉత్పత్తి ఇదే కావడం గమనార్హం. వైద్య-సాంకేతిక రంగంలో విప్లవాత్మక అడుగు పడింది. లాలాజలంతో గర్భనిర్ధారణ కిట్ అందుబాటులోకి వచ్చింది. జరూసలెంకు చెందిన సాలిగ్నోస్టిక్స్ అనే బయోటెక్ స్టార్టప్ కంపెనీ దీనిని తయారు చేసింది. ఈ ఉత్పత్తికి ‘సాలిస్టిక్’గా నామకరణం చేశారు. ఏడాది ప్రయత్నాల తర్వాత తాజాగా యూకేలో దీనిని లాంఛ్ చేశారు. యూకేతో పాటు ఐర్లాండ్‌లోనూ వీటి అమ్మకాలు మొదలయ్యాయి. అమెరికాలోనూ అమ్మకాల కోసం ఎఫ్‌డీఏ అనుమతి కోసం దరఖాస్తు చేసుకుంది ఈ కంపెనీ. ఇంతకాలం యూరిన్ బేస్డ్ హోంటెస్ట్ కిట్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అయితే ఇక నుంచి ఈ సెలైవాతో ప్రెగెన్సీ టెస్ట్ కిట్లు అందుబాటులోకి రానున్నాయి. కరోనా టెస్టింగ్ కిట్స్ సాంకేతికతను ఉపయోగించే ఈ సెలైవా ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్లు తయారు చేయడం గమనార్హం. వీటిని ఎప్పుడైనా..ఎక్కడైనా ఉపయోగించొచ్చు. థెర్మామీటర్ను ఉంచుకున్నట్లే.. కిట్‌లో వచ్చే స్టిక్‌ను నోట్లో పెట్టుకుని కాసేపు ఉంచితే అది లాలాజలాన్ని సేకరిస్తుంది. ఆపై ఫలితం కోసం ఐదు నుంచి పది నిమిషాల పాటు వేచి ఉండాల్సి ఉంటుంది. ఒక్కోసారి మూడు నిమిషాల్లోనూ చూపించే అవకాశం ఉంది. స్టిక్ తొలుత లాలాజలాన్ని సేకరించి.. దానికి ప్లాస్టిక్ ట్యూబ్‌కు బదిలీ చేస్తుంది, అక్కడ జీవరసాయన ప్రతిచర్య జరిగి ఫలితం వెలువడుతుంది. పిండం అభివృద్ధి చెందడానికి గర్భాశయాన్ని సిద్ధం చేయడంలో ఉపయోగపడే ప్రత్యేకమైన హార్మోన్(గర్భధారణ కోసం) అయిన hCGని గుర్తించే సాంకేతికతపై ఈ పరీక్ష ఆధారపడి ఉంటుంది. ఇదీ చదవండి: సాధు జంతువు అనుకోకండి.. చిర్రెత్తితే మాత్రం.. -
ఏపీ ‘గురుకుల’ ఫలితాల వెల్లడి
సాక్షి,అమరావతి/గుంటూరు ఎడ్యుకేషన్: ఏపీ గురుకుల విద్యాలయ సంస్థ ఆధ్వర్యంలోని 5వ తరగతి నుంచి డిగ్రీ వరకు ప్రవేశాలకు నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలను గురువారం అధికారులు విడుదల చేశారు. ఈ సంస్థ పరిధిలో 38 పాఠశాలలు, 7 జూనియర్ కాలేజీలు, ఒక డిగ్రీ కళాశాల ఉన్నాయి. 2023–24 విద్యా సంవత్సరంలో ఐదో తరగతిలో ఉన్న 3,195 సీట్లకు, 6, 7, 8 తరగతుల్లో మిగిలి ఉన్న 356 ఖాళీల భర్తీకి, ఇంటర్‌లోని ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ/సీఈసీ విభాగాల్లో ఉన్న 1,149 సీట్లకు, డిగ్రీలోని బీఏ, బీకాం, బీఎస్సీలోని 4,852 సీట్లకు గత నెల 20న ప్రవేశ పరీక్ష నిర్వహించినట్లు గురుకుల విద్యాలయ సంస్థ కార్యదర్శి ఆర్.నరసింహారావు తెలిపారు. విద్యార్థుల ర్యాంకులను వారి మొబైల్ నంబర్లతో పాటు వారి పాఠశాలలకు కూడా పంపించామని, https://aprs.apcfss.in వెబ్సైట్లో కూడా ఉంచామన్నారు. మొత్తం అన్ని విభాగాల్లోను 87,252 మంది విద్యార్థులు పరీక్షకు హాజరైనట్లు వివరించారు. వీరికి ఈ నెల 12 నుంచి 15వ తేదీ వరకు కౌన్సెలింగ్ నిర్వహించి అర్హులైనవారికి ప్రవేశాలు కల్పిస్తామన్నారు. కాగా, 12 మైనార్టీ పాఠశాలలు, 3 జూనియర్ కాలేజీల్లో మైనార్టీ విద్యార్థులకు ప్రవేశ పరీక్షతో సంబంధం లేకుండా నేరుగా అడ్మిషన్లు చేపడతామని చెప్పారు. తొలి స్థానంలో నిలిచింది వీరే.. గురుకుల పాఠశాలల్లో 5 నుంచి 8వ తరగతి వరకు ప్రవేశాలకు 100 మార్కులకు, ఇంటర్, డిగ్రీ కాలేజీ ఎంట్రన్స్ టెస్ట్ 150 మార్కులకు నిర్వహించారు. వీరిలో అత్యధిక మార్కులు సాధించి తొలి స్థానంలో నిలిచిన అభ్యర్థుల పేర్లను గురుకుల విద్యాలయ సంస్థ వెల్లడించింది. ♦ ఐదో తరగతి ప్రవేశ పరీక్షలో విజయనగరం జిల్లాకు చెందిన బి.దిలీప్ కృష్ణ 99 మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలిచాడు. ఆరో తరగతిలో పి.జితేంద్రకుమార్ (శ్రీకాకుళం జిల్లా), ఏడో తరగతిలో జీకే సాయిపవన్ (పశ్చిమ గోదావరి), ఎనిమిదో తరగతిలో కె.నవీన్ కుమార్ (కృష్ణా జిల్లా) మొదటి స్థానం సాధించారు. ♦ ఇంటర్ కేటగిరీలో తూర్పు గోదావరి జిల్లాకు చెందిన కె.సాయి సృజన (ఎంపీసీ) 146 మార్కులు, టీ సాహితి (బైపీసీ) 140 మార్కులు, విజయనగరం జిల్లాకు చెందిన కేవీ.వంశీకృష్ణ నాయుడు (ఎంఈసీ/సీఈసీ) 133 మార్కులతో ప్రథమ స్థానం సాధించారు. ♦ డిగ్రీ విభాగంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన కె.అచ్యుతరావు (బీఏ), విజయనగరం జిల్లాకు చెందిన ఎం.జ్ఞానతేజ (బీకాం), టి.పునీత్ కుమార్ (బీఎస్సీ–ఎంఎస్సీఎస్), పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన ఎస్.తేజ (బీఎస్సీ–ఎంపీసీ) విభాగాల్లో మొదటి ర్యాంకులు సాధించారు. -
అంబానీ కీలక నిర్ణయం: మరో రంగంలో సునామీకి సిద్ధం
సాక్షి, ముంబై: ఆసియా బిలియనీర్ రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ మరో రంగంలోకి అడుగు పెట్టాలని నిర్ణయించారు. ఇప్పటికే ఆయిల్, టెలికాం, రీటైల్ రంగాల్లో దూసుకుపోతున్న రిలయన్స్ ఇపుడిక హెల్త్ కేర్ సెక్టార్లో ప్రవేశించనుంది. అదీ స్థానికంగా లభించే ఇతర ఆఫర్ల కంటే తక్కువకే జినోమ్ మ్యాపింగ్ పరీక్షలను అందుబాటులోకి తీసుకురానుంది. స్ట్రాండ్ లైఫ్ సైన్సెస్ రూపొందించిన జినోమ్ కిట్‌ను 145 డాలర్లకు, మార్కెట్ ధరలతో పోలిస్తే దాదాపు 86 శాతం తక్కువకే అందించనుంది. కొన్ని జన్యుపరమైన రుగ్మతలు, వ్యాధులను గుర్తించడానికి ఈ పరీక్ష ఉపయోగపడుతుంది. మైజియో యాప్‌లో రాబోయే వారాల్లో ఈ టెస్ట్‌ను దూకుడుగా మార్కెట్ చేయాలని రిలయన్స్ యోచిస్తోంది. ముఖేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జినోమ్ మ్యాపింగ్ పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తోంది. క్యాన్సర్లు, న్యూరో-డీజెనరేటివ్ వ్యాధులు, గుండె సంబంధిత ప్రమాదాలు లాంటి వ్యాధులు, వాటి ప్రభావాలు తెలుసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఈ ప్రొఫైల్‌ని స్ట్రాండ్ లైఫ్ సైన్సెస్ అభివృద్ధి చేసింది. మరికొన్నివారాల్లో జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్ష కిట్‌ను కేవలం రూ.12 వేలకే అందుబాటులోకి తెస్తున్నట్లు స్ట్రాండ్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈవో రమేష్ హరిహరన్ తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత చౌకైన జినోమిక్ ప్రొఫైల్ ఇదేనని రమేష్ హరిహరన్ తెలిపారు. ఫలితాలను వివరించడంలో స్ట్రాండ్ సరికొత్త శాస్త్రీయ పరిశోధనలను పొందుపరుస్తుందని హరిహరన్ తెలిపారు. ఈ పరీక్ష ఔషధాల అభివృద్ధికి సహాయపడే జీవసంబంధమైన డేటా రిపోజిటరీని రూపొందించడానికి కూడా అనుమతిస్తుందని ఆయన పేర్కొన్నారు. బెంగళూరుకు చెందిన ఈ సంస్థలో దాదాపు 80 శాతం వాటాలను రిలయన్స్ గ్రూప్ 2021లోనే కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అమెరికాలోని 23andMe స్టార్టప్ మాదిరిగా తక్కువ ఖర్చుతో భారతీయులందరికీ అందుబాటులోకి తీసుకురావాలని ప్రయత్నిస్తోందని తెలుస్తోంది. ఇంకా MapmyGenome, Medgenome వంటి భారతీయ కంపెనీల పూర్తి జీనోమ్ సీక్వెన్సింగ్ 1,000డాలర్లు కంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. ఈ నేపథ్యంలో తక్కువ ధరలో టెలికాం రంగంలో సునామీ సృష్టించిన అంబానీ తాజా నిర్ణయం ప్రాధాన్యతను సంతరించుకుంది. -
ఐపీఎల్ టోర్నీ మధ్యలోనే వెళ్లిపోతా: స్టోక్స్
ఐర్లాండ్‌తో జరిగే ఏకైక టెస్ట్, ఆస్ట్రేలియాతో జరిగే యాషెస్ సిరీస్ సన్నాహాల కోసం ఐపీఎల్ టి20 టోర్నీ మొత్తం మ్యాచ్‌లు ఆడబోనని ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తెలిపాడు. మార్చి 31 నుంచి మే 28 వరకు ఐపీఎల్ జరుగుతుంది. ఐర్లాండ్‌తో ఏకైక టెస్ట్ జూన్ 1 నుంచి, యాషెస్ సిరీస్ జూన్ 16 నుంచి జరుగుతాయి. గత రెండు ఐపీఎల్ సీజన్లకు దూరంగా ఉన్న స్టోక్స్‌ను గత డిసెంబర్లో చెన్నై జట్టు రూ. 16 కోట్ల 25 లక్షలకు కొనుగోలు చేసింది. -
టెస్టింగ్‌లో ఫెయిలైన సన్‌ఫార్మ హైబీపీ జెనరిక్ డ్రగ్: భారీ రీకాల్
న్యూఢిల్లీ: దేశీయ ఫార్మా దిగ్గజం సన్ ఫార్మాకు అమెరికాలో భారీ షాక్ తగిలింది. అధిక రక్తపోటు చికిత్సలో వాడే జనరిక్ మందు అమెరికా మార్కెట్లో డిసల్యూషన్ టెస్టింగ్‌లో విఫలమైంది. దీంతో 34వేలకు పైగా జెనరిక్ మందుల బాటిళ్లను రీకాల్ చేస్తోంది. అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఎన్ఫోర్స్మెంట్ రిపోర్ట్ ప్రకారం అమెరికాలోని సన్ ఫార్మాకు చెందిన ఏంజినా అధిక రక్తపోటు, ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్స్ సమస్యకు చికిత్స చేయడానికి ఉపయోగించే Diltiazem హైడ్రోక్లోరైడ్ క్యాప్సూల్స్‌ను రీకాల్ చేస్తోంది. వీటిని వాడటంతో తాత్కాలిక లేదా వైద్యపరంగా రివర్సిబుల్ ప్రతికూల ఆరోగ్య పరిణామాలకు కారణం కావచ్చు లేదా తీవ్రమైన ప్రతికూల ఆరోగ్య పరిణామాల సంభవించవచ్చని యూఎస్ ఎఫ్‌డీఏ హెచ్చరించింది. "స్టెబిలిటీ టెస్టింగ్ సమయంలో ఫెయిల్డ్ ఇంప్యూరిటీ(డీసెటైల్ డిల్టియాజెమ్ హైడ్రోక్లోరైడ్) స్పెసిఫికేషన్, ఎఫ్‌డీఏ ల్యాబ్‌లో డిసోల్యూషన్ టెస్టింగ్ ఫెయిల్యూర్ కారణంగా ప్రభావితమైన లాట్‌ను రీకాల్ చేస్తోంది. ముంబైకి చెందిన డ్రగ్ మేజర్ గుజరాత్‌లోని ప్లాంట్లోవీటిని ఉత్పత్తి చేస్తోంది. ఈ ఏడాది జనవరి 13న క్లాస్ II దేశవ్యాప్తంగా రీకాల్ (అమెరికా)ను ప్రారంభించింది. కాగా మల్టిపుల్ మైలోమా చికిత్సలో ఉపయోగించే జెనరిక్ ఔషధాల విక్రయాలకు అమెరికా హెల్త్ రెగ్యులేటర్ ఆమోదం పొందినట్టు సన్‌ఫార్మ శుక్రవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. -
ChatGPT చాట్‌జీపీటీ మరో సంచలనం..20 నిమిషాల్లో!
సాక్షి,ముంబై: విశేష ఆదరణతో దూసుకుపోతున్న చాట్‌జీపీటీ మరో సంచలనం నమోదు చేసింది. ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న చాట్‌జీపీటీ చాలా కీలకమైన పరీక్షల్లో నెగ్గుకు వస్తూ హల్ చల్ చేస్తోంది. తాజాగా 20 నిమిషాల్లో ఏకంగా 2 వేల పదాల వ్యాసాన్ని రాసి మరొక విశ్వ విద్యాలయ పరీక్ష పాస్ అయిందట. ది ఇండిపెండెంట్ నివేదిక ప్రకారం, పీటర్ 2000 పదాల వ్యాసాన్ని వ్రాయమని ChatGPTని ఆదేశించాడు. ఆశ్చర్యకరంగా, ఏఐ చాట్‌జీపీటీ దానిని కేవలం 20 నిమిషాల్లో పూర్తి చేసింది. పీటర్ దానిని ఉపాధ్యాయులకు చూపించి ఈవాల్యుయేట్ చేయాలని అడిగాడు. ఉపాధ్యాయులు 53, 2:2 స్కోరు ఇచ్చారుట. అధ్యాపకుల అభిప్రాయం ప్రకారం, టెక్స్ట్ కొద్దిగా ఫీష్షీగా ఉన్నప్పటికీ పరవాలేదన్నారు. అయితే దీనికి తగినంత విశ్లేషణ అవసరమన్నారు. అంతేకాదు లేజీ స్టూడెంట్స్ వర్క్‌ను గుర్తు చేసిందని కూడా పేర్కొన్నారు. గత ఏడాది గ్రాడ్యుయేట్ అయిన పీటర్ స్నెప్వాంజర్స్, ప్రోగ్రామ్‌తో ప్లగరిజం సాధ్యమేనా అని పరీక్షించడానికి ఒక వ్యాసాన్ని రూపొందించడానికి ChatGPT AI ని టెస్ట్ చేశారట. (ఇది చదవండి: అయ్యయ్యో గూగుల్ ‘బార్డ్’ ఎంత పనిచేసింది: 100 బిలియన్ డాలర్లు మటాష్!) కాగా చాట్‌జీపీటీ టూల్ కీలకమైన టెస్ట్‌లో విజయవంతంగా ఉత్తీర్ణత సాధించడం ఇదే మొదటిసారి కాదు. ఇటీవల యూఎస్ మెడికల్ లైసెన్సింగ్ పరీక్ష, వార్టన్ బిజినెస్ MBA ప్రోగ్రామ్ ఆపరేషన్స్ మేనేజ్మెంట్ కోర్సు చివరి పరీక్ష,యూనివర్సిటీ ఆఫ్ మిన్నెసోటా లా స్కూల్ నాలుగు స్కూల్ పరీక్షలతో సహా కొన్ని ప్రముఖ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించింది.మిన్నెసోటా యూనివర్శిటీ లా స్కూల్ ప్రొఫెసర్ జోనాథన్ చోయ్, 95 బహుళ-ఎంపిక ప్రశ్నలు, 12 వ్యాస ప్రశ్నలతో కూడిన విద్యార్థులకిచ్చే పరీక్షనేచాట్జీపీటీకిచ్చారు. బోట్ మొత్తం C+ స్కోర్ చేసినట్లు నివేదించారు. వినియోగదారులతో సాధారణ చాట్లలో పాల్గొనడం , వివిధ రకాల ప్రశ్నలకు ప్రతిస్పందించే సామర్థ్యంతో, ChatGPT చాట్‌బాట్ విపరీతంగా ఆకర్షిస్తోంది. (గూగుల్ మ్యాప్స్‌లో అద్భుతమైన అప్డేట్స్, చూసి మురిసిపోవాల్సిందే!) -
ఏమిటి ఈ పరీక్ష? ఎందుకు?
పరీక్ష... లేదా పరీక్షలు అనే మాట విద్యారంగంలో తరచూ వినిపిస్తూ ఉంటుంది. చెప్పిన పాఠాలు విద్యార్థి ఎంత శ్రద్ధగా విన్నాడు, ఎంత జ్ఞానాన్ని పొందాడు, దాని సారమెంత అన్నది ఉపాధ్యాయులు అంచనా వేయాలి. అలా వేసే అంచనానే పరీక్షంటే. పరీక్ష అతణ్ణి పైతరగతులకు పంపే ఒక పక్రియ లేదా సాధనం. అయితే పరీక్ష అనేది విద్యార్థులకు మాత్రమే పరిమితం కాదు. చదువున్నా లేకపోయినా, జీవితంలో ప్రతి ఒక్కరూ పరీక్షకు గురి అయిన వారే. తమను తాము పరీక్ష చేసుకునేవారే. ఇంతకీ పరీక్ష అంటే ఏమిటి, ఎందుకో తెలుసుకుందాం. మన మాట తీరు, ఇతరులతో మన సంబంధాలు, వారితో మన వర్తన, విలువలు, నీతి, నిజాయితీ, తోటి మానవుల పట్ల మన భావన, ప్రేమ ఇటువంటి అనేకమైన వాటిని అంచనా వేసుకునేందుకు కూడా పరీక్ష అవసరం. మన జీవిత ప్రవాహ సారాన్ని అర్ధం చేసుకుని దాన్ని ఎప్పటికప్పుడు మదింపు చేసుకోవాలి. అంటే మన జీవితాన్ని పరీక్షించుకోవాలి. దాన్ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలంటే ఈ పరీక్ష అనేది ప్రతి ఒక్కరికి అవసరం. ఇతర జీవులకు, మనకు ఉండే జనన మరణాల సారూప్యతకు భిన్నంగా, గొప్పగా మన జీవనవిధానాన్ని గమనిస్తూ జీవితాన్ని మార్పు చేసుకోగలమా? అలా మన తెలివితేటలకు, ఆధిక్యతకు ఒక విశిష్టత, అర్థం చూపగలమా? ఆ ఆలోచన వచ్చిన వారెవరైనా తమ శల్య పరీక్షకు సంసిద్ధులైతే జీవితాన్ని చక్కగా మలచు కోవటం కష్టం కానే కాదు. అది మనోవికాసానికి, గొప్ప ఆలోచనలకు దారి తీసి మానవాళికి ఉపయుక్తం అయ్యే అనేక ఆవిష్కరణలకు దారితీస్తుంది.‘శోధించని జీవిత జీవనయోగ్యం కాదు’ అన్నాడు సోక్రటీస్. ఈ పరీక్షకు విద్యార్థి, పరీక్షాధికారి ఎవరికి వారే. విద్యార్థి సంవత్సరకాలంలో పుస్తకాలలోని తను పొందిన జ్ఞానాన్ని ఎలా జ్ఞప్తికి తెచ్చుకుంటాడో అలా ప్రతి వ్యక్తి తను గడిపిన, గడుపుతున్న జీవితాన్ని నెమరు వేసుకోవాలి. వివిధ సందర్భాలలో తన మాటలు, ప్రవర్తన అనుబంధాలకు, ఆప్యాయతలకు ఎంత విలువనిచ్చాయి, వాటిని తను ఎంత నిలబెట్టుకున్నాడో స్ఫురణకు తెచ్చుకోవాలి. తన వర్తన ఇతరుల మనస్సులనేమైనా అకారణంగా గాయపరిచిందేమో తరచి చూసుకోవాలి. వృత్తి జీవితంలోనూ ఒక ఉద్యోగి, రచయిత, కళాకారుడు తమ కృషి లేదా పని తీరును సమీక్షించు కోవడమూ పరీక్షే. జీవితాన్ని ఎంత నిశితంగా పరీక్షలకు గురి చేస్తే అంతగా మన వ్యక్తిత్వం సార్థక మవుతుంది. ఇక్కడ పరీక్ష పత్రం తయారు చేసేది, సమాధానాలు రాసేది మనమే. దీనితో విద్యార్థి పాత్ర ఉపాధ్యాయుని పాత్రగా మారుతుంది. ఇప్పుడు పరీక్షాధికారిగా వీటి మంచి చెడులను విశ్లేషించాలి. మంచికి మురిసిపోతూ మనల్ని మనమే ప్రశంసించుకో కూడదు. మంచిని చూసినంత బాగా, నిశితంగా లోపాలను చూడాలి. నిష్పక్షపాతంగా, పారదర్శకంగా వ్యవహరించగలగాలి. ఆ ఫలితాలను లోతుగా చూసి, ఒక నిజమైన, ఖచ్చితమైన మదింపు వేసుకోవాలి. అవసరమైన మార్పులు, చేర్పులు చేసుకునే వివేచన కావాలి. ఇక్కడ బేషజాన్ని, ఆహాన్ని విడిచి తప్పులను దిద్దుకునే సంస్కారం అలవరుచుకోవాలి. పెద్దలు, అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవాలి. విద్యార్థి తన విద్యాభ్యాసకాలంలో రాసే పరీక్షలు కొన్నే ఉంటాయి. కాని మనం జీవితాంతం మన జీవితాన్ని పరీక్షకు గురి చేయాల్సిందే. సరిదిద్దుకుంటూ ముందుకు సాగాల్సిందే. సోక్రటీస్ చెప్పిన మాటల సారమిదే. తల్లిదండ్రులు, అమ్మమ్మ, తాతయ్యలు ఉపాధ్యాయులు ఈ శోధన తత్వాన్ని పిల్లలు అలవాటు చేసుకునేలా చెయ్యాలి.ఈ శోధన మనిషి వ్యక్తిత్వ వికాసానికి ఎంతో దోహదం చేస్తుంది. కొందరు వ్యక్తులకు ఈ శోధన చిన్నతనం నుండే సహజంగా ఉంటుంది. ఆ శోధనా దృష్టి కొందరిలో అతి చిన్న వయస్సులోనే ఏర్పడి చక్కని రూపు దాల్చి ఉన్నత పథంలో పయనం చేసి మొత్తం మనవాళికి దాని ఫలితాలను అందిస్తుంది. వారు చిర స్మరణీయులవుతారు. ఈ శోధనాతత్వం ప్రతి ఒక్కరికీ అవసరం. ముఖ్యంగా ఉపాధ్యాయులకు, శాస్రవేత్తలకు, నాయకులకు చాలా అవసరం. ఎప్పటికప్పుడు తాము చేసిన పనిని, దానిలోని తప్పుల్ని తెలుసుకుని తమను తాము నూతనంగా ఆవిష్కరించుకుంటారు. సోక్రటీస్ అన్న మాటలలో పరిశీలన, తార్కికత, ఉత్సహం, ఆధ్యాత్మికత పెనవేసుకున్నాయి. ప్రశ్నించే, శోధించే గుణాలు ఉన్నాయి. వృత్తి జీవితంలోనూ ఒక ఉద్యోగి, రచయిత, కళాకారుడు తమ కృషి లేదా పని తీరును సమీక్షించు కోవడమూ పరీక్షే. జీవితాన్ని ఎంత నిశితంగా పరీక్షలకు గురి చేస్తే అంతగా మన వ్యక్తిత్వం సార్థకమవుతుంది. – లలితా వాసంతి -
గగన్‌యాన్ తొలి ప్రయోగంపై కేంద్రం కీలక ప్రకటన
న్యూఢిల్లీ: భారత తొలి మానవ సహిత అంతరిక్ష ప్రయోగం 2024లో ఉంటుందని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ మంగళవారం వెల్లడించారు. 2022లోనే చేపట్టాల్సిన ఈ ప్రయోగంపై కరోనా ప్రభావం పడిందన్నారు. రష్యాలో వ్యోమగాముల శిక్షణ కూడా కరోనా వల్లే వాయిదా పడిందన్నారు. ‘‘గగన్‌యాన్ మిషన్ తొలి ప్రయోగ పరీక్ష ఈ ఏడాది చివర్లో ఉంటుంది. అంతరిక్ష నౌకను 15 కిలోమీటర్ల ఎత్తుకు ప్రయోగిస్తారు. క్యాప్సూల్‌ను పారాచ్యూట్ల సాయంతో భూమిపైకి తీసుకొస్తారు. రెండోసారి అంతరిక్ష నౌకను మరింత ఎత్తుకు తీసుకెళ్తారు’’ అని అధికారులు వెల్లడించారు. వచ్చే ఏడాది చేపట్టే మరో యాత్రలో మహిళ ముఖ కవళికలుండే వ్యోమ్ మిత్ర అనే హ్యూమనాయిడ్‌ను పంపిస్తామని మంత్రి తెలిపారు. ఇదీ చదవండి: శాస్త్రవేత్తలను సైతం కలవరపాటుకు గురిచేసిన 'విచిత్ర జీవి': వీడియో -
రష్యా అణు విన్యాసాలు
మాస్కో: యూరప్‌లో కాస్త చల్లారాయనుకుంటున్న యుద్ధ భయాలను, ఉద్రిక్తతలను రష్యా మళ్లీ పెంచేస్తోంది. తమ బలగాల సన్నద్ధతను, అణు, సంప్రదాయ ఆయుధాలను పరీక్షించుకునేందుకు శనివారం భారీ సాయుధ కసరత్తుకు దిగుతున్నట్టు రష్యా సైన్యం పేర్కొంది. అణు వార్హెడ్లను మోసుకెళ్లగల ఖండాంతర బాలిస్టిక్ మిసైళ్లు, క్రూయిజ్ మిసైళ్లతో పాటు పూర్తిస్థాయి సైనిక సామర్థ్యాన్ని ప్రదర్శిస్తూ జరిగే ఈ విన్యాసాలను అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తారని రక్షణ శాఖ పేర్కొంది. యుద్ధమే జరిగితే వినాశనానికే దారితీస్తుందని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ శుక్రవారం హెచ్చరించారు. మరోవైపు నాటో సభ్య దేశాల రక్షణ మంత్రులు బ్రెసెల్స్‌లో సమావేశమై తాజా పరిస్థితులపై చర్చించారు. రష్యాలో అమెరికా దౌత్యాధికారి బ్రాట్ గార్మన్ను రష్యా బహిష్కరించింది. తాము కూడా దీటుగా స్పందిస్తామని యూఎస్ చెప్పింది. తూర్పు ఉక్రెయిన్‌లో నానాటికీ పెరుగుతున్న కాల్పుల నేపథ్యంలో అక్కడి వేర్పాటువాద ప్రభుత్వం స్థానికులను రష్యాకు తరలిస్తోంది. -
ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా టెస్ట్ ధర తగ్గింపు
-
AP: 6 గంటల్లోనే కల్చర్ టెస్ట్
ఏయూక్యాంపస్ (విశాఖతూర్పు): వ్యాధి నియంత్రణకు ఏ ఔషధాలను ఉపయోగించాలనే విషయాన్ని నిర్ధారించేందుకు నిర్వహించే కల్చర్ టెస్ట్ ఇక సులభతరం కానుంది. ప్రస్తుతం కల్చర్ టెస్ట్ ఫలితాలు రావడానికి 48 నుంచి 72 గంటల సమయం పడుతోంది. అనంతరం వ్యాధి నియంత్రణకు అవసరమైన ఔషధాన్ని వినియోగించడం ప్రారంభిస్తారు. చదవండి: విశాఖ పూర్ణామార్కెట్ ఆశీలు వసూలులో ‘మహా’ మాయ! ఈ సమయాన్ని తగ్గిస్తూ 6 గంటల్లోనే కల్చర్ టెస్ట్ ఫలితాలు అందించే విధానాన్ని ఆవిష్కరించి పరికరాన్ని సైతం రూపొందించారు ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిశోధకురాలు బొల్లాప్రగడ కీర్తిప్రియ. ఇన్స్ట్రుమెంట్ టెక్నాలజీ విభాగంలో ఆచార్య డి.వి.రామకోటిరెడ్డి, డాక్టర్ ఎ.డైసీరాణిల సంయుక్త మార్గదర్శకత్వంలో పరిశోధన పూర్తిచేసి డాక్టరేట్ సైతం అందుకున్నారు. తాను రూపొందించిన పరికరంతో కీర్తి ప్రియ ఖర్చు తక్కువ.. సమయం ఆదా ప్రస్తుతం వైద్యపరీక్షల కేంద్రాల్లో కల్చర్ టెస్ట్ చేయడానికి వినియోగించే విదేశీ పరికరాలు రూ.25 లక్షలకుపైగా విలువ చేస్తాయి. ఇవి 4 నుంచి 18 గంటలల్లోగా ఫలితాలను అందిస్తాయి. వీటి నిర్వహణ, పరీక్షల ఖర్చుకూడా ఎక్కువే. సంప్రదాయ విధానాల్లో కల్చర్ టెస్ట్ చేసే సాంకేతిక పరికరాల విలువ రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఉంటుంది. వీటి నిర్వహణ, పరీక్షల ఖర్చులు కొంతవరకు మధ్యతరగతికి సైతం అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం బొల్లాప్రగడ కీర్తిప్రియ చేసిన పరిశోధనలో భాగంగా తక్కువ ఖర్చుతో దేశీయంగా ఒక నూతన పరికరాన్ని అభివృద్ధి చేశారు. పేటెంట్‌కు దరఖాస్తు చేశారు. ఇప్పటికే పేటెంట్ పబ్లిష్ కాగా పూర్తిస్థాయిలో క్షేత్రస్థాయి పరిశీలన జరిపి తుదిదశ పేటెంట్‌ను మంజూరు చేస్తారు. ఆమె ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ లెర్నింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంశాలను తన పరిశోధనలో ఉపయోగించి కల్చర్ టెస్ట్ ఫలితాలను అందించే ప్రక్రియను వేగవంతం చేశారు. ప్రాథమికంగా ఆవులు, గొర్రెలు, మేకల నుంచి నమూనాలను సేకరించారు. వ్యాధిని నియంత్రించడానికి ఉపయోగించాల్సిన యాంటీ బయోటిక్స్‌ను గుర్తించడానికి సంప్రదాయ సాంకేతిక విధానాలను ఉపయోగించి ఇమేజ్ బ్యాంక్‌ను అభివృద్ధి చేసుకున్నారు. వీటికి డీప్‌లెర్నింగ్ అల్గారిథమ్స్‌ను ఉపయోగించి 99 శాతం కచ్చితమైన ఫలితాలను ఇచ్చేవిధంగా పరికరాన్ని తీర్చిదిద్దారు. రూ.లక్ష ఖర్చుతోనే ఈ పరికరాన్ని తయారుచేశారు. ప్రాథమిక నైపుణ్యం ఉన్నవారు సైతం దీన్ని ఉపయోగించి కచ్చితమైన వివరాలు పొందే అవకాశం ఉంది. పరీక్ష ఫలితాలను నేరుగా మన మొబైల్ ఫోన్‌ను అనుసంధానం చేసుకుని తెలుసుకునే అవకాశం ఉంది. టెలిమెడిసిన్ ఉపయోగిస్తూ ఈ–చీటీ (ఈ–ప్రిస్కిప్షన్)ను వైద్యుడి సలహాతో పొందవచ్చు. దీనికి ప్రత్యేకంగా ఒక మొబైల్ యాప్‌ను సైతం సిద్దం చేశారు. రూ.10 వేలతో రూపొందించాలని ఉంది భవిష్యత్తులో కేవలం రూ.10 వేలతో ఈ పరికరాన్ని తయారు చేయాలనే ఆలోచన ఉంది. తద్వారా అందరికీ అందుబాటులో ఉంచడంతో పాటు, పేద, మధ్యతరగతి వారికి పూర్తిస్థాయిలో ఉపయుక్తంగా నిలుస్తుంది. ప్రస్తుతం చేస్తున్న కల్చర్ టెస్ట్‌కు అధిక సమయం పడుతోంది. పరీక్ష ఫలితాలు వచ్చేలోగా వైద్యులు విభిన్న యాంటీ బయోటిక్స్‌ను రోగిపై వినియోగించాల్సిన అవసరం ఏర్పడుతోంది. దీన్ని నివారిస్తూ, కచ్చితమైన ఔషధాన్ని రోగికి అందించడం వలన మెరుగైన ఫలితాలు, సత్వర ఉపశమనం లభిస్తాయి. ముఖ్యంగా పశువుల్లో మరణాలను నియంత్రించడానికి ఈ విధానం ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. – బొల్లాప్రగడ కీర్తిప్రియ, పరిశోధకురాలు -
Omicron Variant : గంటన్నరలో ఒమిక్రాన్ ఫలితం
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఐఐటీ పరిశోధక బృందం గంటన్నరలో ఒమిక్రాన్ వేరియంట్‌ను గుర్తించే కొత్త పరీక్షా విధానాన్ని రూపొందించారు. ఆర్టీపీసీఆర్ ఆధారిత నిర్ధారణ పరీక్షతో కోవిడ్ కొత్త వేరియంట్‌ను వేగంగా గుర్తించవచ్చని అధికారులు తెలిపారు. ఒమిక్రాన్‌ను గుర్తించేందుకు జీనోమ్ స్వీకెన్సింగ్‌ను వాడుతున్నారు. దీని ఫలితాలు వచ్చేందుకు 3 రోజులు పడతుంది. ఈ నేపథ్యంలో ఐఐటీ ఢిల్లీకి చెందిన కుసుమా స్కూల్ ఆఫ్ బయలాజికల్ సైన్సెస్ రాపిడ్ స్క్రీనింగ్ పరీక్షను అభివృద్ధి చేసింది. ప్రస్తుతం ఈ పరీక్షకు పేటెంట్ తీసుకోవడం కోసం ఐఐటీ దరఖాస్తు చేసుకుంది. ఉత్పత్తి కోసం పారిశ్రామిక భాగస్వాములతో చర్చలు ప్రారంభించింది. ఒమిక్రాన్‌లో వేరియంట్లో మాత్రమే కనిపించే ప్రత్యేక ఉత్పరివర్తనాలను(మ్యుటేషన్లు) గుర్తించడంపై ఆధారపడి నిర్ధారణా పరీక్షను రూపొందించారు. ఎస్జీన్లో ఉండే మ్యుటేషన్లు పరీక్షలో బయటపడితే ఒమిక్రాన్‌గా నిర్ధారిస్తారు. సింథటిక్ డీఎన్ఏ ముక్కలను ఇందులో వాడతారు. కొత్త విధానంతో తొందరగా ఒమిక్రాన్‌ను గుర్తించవచ్చన్నారు. గతంలో కరోనాను తొందరగా, సులభంగా గుర్తించే పీసీఆర్ ఆధారిత పరీక్షను ఐఐటీ ఢిల్లీ రూపొందించింది. ఐసీఎంఆర్ అనుమతి లభించిన అనంతరం మార్కెట్లోకి విడుదల చేశారు. ఇప్పుడు ఒమిక్రాన్ వేరియంట్‌ను గుర్తించే పరీక్షకు అనుమతులు లభిస్తే మరింత విరివిగా, తొందరగా ఫలితాలు రాబట్టవచ్చని అధికారుల అంచనా. చదవండి: ‘నెల రోజులే ఎందుకు? రెండు, మూడు నెలలు బెనారస్‌లోనే ఉండాలి’ -
వైరల్: కోవిడ్ టెస్ట్ చేయించుకొని.. బిల్లు చూసి షాకయ్యాడు..
వాషింగ్టన్: దాదాపు గత రెండేళ్ల నుంచి సాధారణ జ్వరం, జలుబు వచ్చిన కరోనానేమో అని కంగారు పడిపోతున్నాం. పక్కన ఎవరైన దగ్గుతూ, తుమ్ముతూ కనిపిస్తే ఇంకేమైనా ఉందా మెల్లగా పక్కకు జారుకుంటాం. ఒకవేళ ఇవే లక్షణాలన్నీ మనకే ఉంటే ఉన్నపళంగా టెస్టులు, మందులు అంటూ హైరానా పడిపోతాం. కోవిడ్‌కు అనేక చోట్ల టెస్టులు ఉచితంగా చేస్తున్నారు. కానీ ప్రైవేటు ఆసుపత్రుల్లో మాత్రం కొంత డబ్బులు తీసుకొని పరీక్షలు చేస్తున్నారు. తాజాగా అమెరికాలోని ఓ వ్యక్తి తనకు కరోనా ఉందేమో అనుకొని టెస్టుకు వెళ్లాడు. తరువాత అతను షాక్‌కు గురయ్యాడు. అయితే ఆ వ్యక్తి అంతలా కంగుతినడానికి కారణం..వచ్చిన రిజల్ట్స్‌ను బట్టి కాదు.. ఆసుపత్రి వారు వేసిన బిల్‌ను చూసి.. అసలేం జరిగిందంటే.. చదవండి: మాంచెస్టర్‌లో మహారాష్ట్ర కుర్చీ.. 7000 కి.మీ ఎలా ప్రయాణించిందంటే? టెక్సాక్‌కు చెందిన ట్రెవిస్ వార్నర్ అనే వ్యక్తి కరోనా టెస్టులు చేయించుకున్నారు. పీసీఆర్ టెస్టులు చేయించుకున్న వార్నర్‌కు ఆసుపత్రి యాజమాన్యం ఏకంగా 54 వేల డాలర్లు బిల్లు వేసింది. అంటే మన కరెన్సీలో సుమారు రూ.40 లక్షలు. దీంతో వార్నర్ షాక్ అయ్యాడు. ఇందులో పీసీఆర్ టెస్టులు, యాంటిజెన్ టెస్ట్ ఫెసిలిటీ ఫీజు కోసం కలిసి భారీగా వసూలు చేశారు. ఇంత మొత్తం బిల్లు వేయడం చూసి వార్నర్ ఖంగుతిన్నాడు. అయితే, అతనికి మోలీనా హెల్త్‌కేర్ నుంచి ఇన్సూరెన్స్ ఉండటంతో ఆ బిల్లును సదరు కంపెనీకి పంపాడు. ఆ బిల్లుచూసి ఇన్సూరెస్ కంపెనీ సైతం షాక్ అయి ఆసుపత్రి యాజమాన్యంతో మాట్లాడి బిల్లును 54 వేల డాలర్ల నుంచి 16,915 డాలర్లకు తగ్గించి చెల్లించింది. చదవండి: Ankita Konwar: వృక్షాసనం నాకు చాలా స్పెషల్.. ఎందుకంటే? ఈ విషయాన్ని ఓ వ్యక్తి ట్విటర్లో షేర్ చేయడంతో నెట్టింట వైరలవుతోంది. కాగా అమెరికాలో ఇలా ఇష్టారీతిన డబ్బులు గుంజడం ఇదేం తొలిసారి కాదు. కోవిడ్ అవతరించినప్పటి నుంచి టెస్టుల కోసం అధిక ధరలు వసూలు చేసిన సందర్భాలు చాల ఉన్నాయి. సాధారణంగా పీసీఆర్ టెస్టు కోసం అమెరికాలో 8 నుంచి 15 డాలర్ల వరకు ఖర్చు అవుతుంది. What is wrong w the US? This guys bill for a few tests came to $54,000!!! His wife’s insurance negotiated her cost down to $1000!! PCR tests themselves can cost -
కర్ణాటక సర్కార్ కీలక నిర్ణయం
-
తప్పుడు పేర్లు.. నకిలీ టెస్టులు!
ఇంజాపూర్కు చెందిన సుమతి (38) కూడా 21వ తేదీన టెస్టు చేయించుకున్నట్టు నమోదు చేశారు. ఆమెకు ఈ విషయమే తెలియదు. తన పేరు, తన భర్త ఫోన్ నంబర్ (8247323492)ను ఎందుకు నమోదు చేశారని ఆమె అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏపీలోని చిత్తూరు జిల్లా పీలేరుకు చెందిన కౌశిక్ (31) కొద్దిరోజులుగా తిరుపతిలోనే ఉన్నారు. ఈ మధ్య హైదరాబాద్ వచ్చిన దాఖలాలు కూడా లేవు. కానీ బుధవారం అబ్దుల్లాపూర్‌మెట్‌లో కరోనా టెస్టు చేయించుకున్నట్టు ఆయన ఫోన్ నంబర్ (9440452123)తో సహా రికార్డు చేశారు. ఉమర్ఖాన్గూడకు చెందిన రజిత (30), సైదులు (37), శివకుమార్ (25), ప్రణవి (12), రాము (28)లు ఈ నెల 21న అబ్దుల్లాపూర్‌మెట్‌లో ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టు చేయించుకున్నట్టు ఆస్పత్రి రికార్డులో పేర్లు, ఫోన్ నంబర్ (7989983606) సహా నమోదు చేశారు. వారికి నెగెటివ్ వచ్చినట్టు చూపారు. నిజానికి ఆ రోజున వీరెవరూ టెస్టులు చేయించుకోలేదు. సాక్షి, హైదరాబాద్/అబ్దుల్లాపూర్‌మెట్ ప్రభుత్వ ఆస్పత్రిలో కరోనా టెస్టులు చేయకుండానే.. చేసినట్టుగా నమోదు చేసి, ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టు కిట్లను పక్కదారి పట్టించిన తీరు ఇది. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న కొందరు వైద్యులు, నర్సులు, టెక్నీషియన్లు కలిసి చేస్తున్న ఈ దందా ‘సాక్షి’ క్షేత్రస్థాయి పరిశీలనలో బయటపడింది. గతంలో టెస్టులు చేయించుకున్న వారి పేర్లు, వివరాలనే మళ్లీమళ్లీ రికార్డుల్లో నమోదు చేసి కిట్లను దారిమళ్లిస్తున్నట్టు తేలింది. వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం, నిర్లక్ష్యమే ఈ వ్యవహారానికి కారణమన్న విమర్శలు వస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ ఆరోగ్య కేంద్రంలో జరిపిన పరిశీలనలో విస్తుపోయే వాస్తవాలు వెల్లడయ్యాయి. ఈ ఆరోగ్య కేంద్రం పరిధిలో బుధవారం 43 మందికి, గురువారం 63 మందికి ర్యాపిడ్ యాంటీజన్ టెస్టులు చేసినట్టు రికార్డుల్లో నమోదు చేశారు. అందులో ఇద్దరికి మాత్రమే పాజిటివ్ నిర్ధారణ అయినట్టు, మిగతా వారందరికీ నెగిటివ్ వచ్చినట్టు రికార్డు చేశారు. కానీ రికార్డులో చూపించిన వారిలో ఐదారుగురికి మినహా మిగతావారెవరికీ టెస్టులే చేయలేదని తేలింది. కిట్లు లేవని జనాన్ని తిప్పిపంపేస్తూ.. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో 248 ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాల్లో ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులు చేస్తున్నారు. కోవిడ్ ఉధృతి ఎక్కువగా ఉన్న ఏప్రిల్, మే నెలల్లో రోజుకు సగటున 50 వేల నుంచి 60 వేల టెస్టులు చేశారు. ప్రస్తుతం వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. కానీ జనం టెస్టుల కోసం ఇప్పటికీ కొన్ని ఆరోగ్య కేంద్రాలకు క్యూ కడుతున్నారు. అక్కడి సిబ్బంది కిట్లు లేవని చెబుతూ చాలా మందిని తిప్పి పంపేస్తున్నారు. కానీ రికార్డుల్లో మాత్రం టెస్టులు చేసినట్టు తప్పుడు లెక్కలు చూపిస్తున్నారు. నకిలీ పేర్లు, ఫోన్ నంబర్లు నమోదు చేస్తున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా.. ప్రభుత్వ వైద్యులు, నర్సులు, టెక్నీషియన్లలో కొందరు డ్యూటీ ముగిసిన తర్వాత ఇంటివద్ద, బయట ప్రైవేటుగా ప్రాక్టీసు చేస్తున్నారు. చిన్నచిన్నక్లినిక్లు పెట్టి నడిపిస్తున్నారు. వాటిల్లో ప్రైవేటుగా కోవిడ్ టెస్టులు చేస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల వద్ద క్యూలు ఉండటం, ప్రైవేటు డయాగ్నస్టిక్ సెంటర్లలో ధరలు ఎక్కువగా ఉండటం, ర్యాపిడ్ కిట్లు లేకపోవడంతో.. చాలా మంది చిన్న క్లినిక్‌లలో కరోనా టెస్టులు చేయించుకోవడానికి సిద్ధమవుతున్నారు. కొందరు వైద్య సిబ్బంది దీనిని సొమ్ము చేసుకుంటున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా రికార్డుల్లో తప్పుడు పేర్లు, ఫోన్ నంబర్లు నమోదు చేస్తున్నారు. పది, ఇరవై మందికి టెస్టులు చేసి.. 50 నుంచి 60 మందికి చేసినట్టు నమోదు చేస్తున్నారు. పాజిటివ్ రిపోర్టులు రాస్తే.. పైఅధికారులకు అనుమానం వస్తుందన్న ఉద్దేశంతో నెగిటివ్‌గా నమోదు చేస్తున్నారు. ఇక కొందరు వైద్య సిబ్బంది టెస్టు కిట్లను చిన్నచిన్న ప్రైవేటు ఆస్పత్రులకు అమ్ముకుంటున్నట్టు కూడా ఆరోపణలు ఉన్నాయి. తప్పుడు ఫలితాలతో సమస్యలు చేయని టెస్టులు చేసినట్టు.. నెగెటివ్ వచ్చినట్టు చూపుతుండటంతో కేసులు తక్కువగా ఉన్నాయన్న అభిప్రాయం నెలకొంటోంది. వైరస్ వ్యాప్తి తగ్గిందన్న భావనతో జనం కోవిడ్ నిబంధనలను విస్మరిస్తున్న పరిస్థితి ఉందని.. మాస్క్‌లు, భౌతిక దూరం వంటివి పాటించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదిలాగే కొనసాగితే వైరస్ చాపకింద నీరులా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని స్పష్టం చేస్తున్నారు. -
బంగ్లాదేశ్ 294/8
హరారే: జింబాబ్వేతో జరుగుతున్న ఏకైక టెస్టులో బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్ లిటన్ దాస్ (95; 13 ఫోర్లు), కెప్టెన్ మోమినుల్ హక్ (70; 13 ఫోర్లు), మహ్ముదుల్లా (54 బ్యాటింగ్; 5 ఫోర్లు) రాణించారు. దీంతో బుధవారం తొలిరోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ 83 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 294 పరుగులు చేసింది. ఆరంభంలో 8 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన బంగ్లాను కెప్టెన్ హక్ ఆదుకున్నాడు. ఆ తర్వాత షకీబ్ (3), ముష్ఫికర్ (11) నిర్లక్ష్యంతో మళ్లీ బంగ్లా 132 పరుగుల వద్ద 6 వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో లిటన్, మహ్ముదుల్లా ఏడో వికెట్‌కు 138 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. ఆట నిలిచే సమయానికి మహ్ముదుల్లాతో పాటు టస్కిన్ అహ్మద్ (13 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఆతిథ్య జింబాబ్వే బౌలర్లలో ముజరబని 3, టిరిపానో, విక్టర్ న్యౌచీ చెరో 2 వికెట్లు పడగొట్టారు. -
టెస్టుకు ముందు పళ్ల రసాలు.. కరోనా రిజల్ట్ తారుమారు?
కరోనా వైరస్, రెండో దఫా లాక్డౌన్ ప్రభావంతో మూతపడ్డ విద్యాసంస్థల్ని.. కొన్ని దేశాలు తెరవాలని నిర్ణయించుకున్నాయి. అయితే ఇంగ్లండ్‌లో బడికి వెళ్లడం ఇష్టంలేని కొందరు పిల్లలు హుషారుతనం ప్రదర్శిస్తున్నారు. పండ్ల రసాల్ని, కెచప్‌లను ఉపయోగించి కరోనా పాజిటివ్ సర్టిఫికెట్లు సంపాదించుకుంటున్నారు. ఈ క్రమంలో ఓ స్కూల్ యాజమాన్యం.. తల్లిదండ్రులకు పంపిన హెచ్చరిక సందేశం ద్వారా అసలు విషయం బయటపడింది. లండన్: మెర్సెసైడ్‌లోని బెల్లె వాలేలో ఉన్న గేట్‌ఎకర్ స్కూల్ యాజమాన్యం తాజాగా పేరెంట్స్‌కి ఒక మెయిల్ పెట్టింది. ల్యాటెరల్ ఫ్లో టెస్ట్ (ర్యాపిడ్ తరహా టెస్ట్) టైంలో చాలామంది పిల్లలు ఆరెంజ్, కచెప్.. ఇతరత్రా పండ్లరసాలు తాగుతున్నారని, దాంతో స్వాబ్ నమూనాలు మారిపోయి.. ఫలితం తేడా వస్తోందని తెలిపింది. దాని ద్వారా అంతా బాగానే ఉన్న పిల్లలకు కరోనా పాజిటివ్ రిజల్ట్ వస్తోందని, ఇలాంటి తప్పుడు పనులను తాము సహించబోమని, కఠిన చర్యలు తీసుకుంటామని ఆ మెయిల్లో హెచ్చరించింది. జూన్ 21 సోమవారం నుంచి నిర్వహిస్తున్న టెస్టుల్లో వరుసబెట్టి ఆ స్కూల్ పిల్లలకు పాజిటివ్ రిపోర్టులు వచ్చాయట. ఆ అనుమానంతోనే ఈ మెయిల్ పంపింది స్కూల్. అయితే వాళ్లలో ఎంత మంది ఇలాంటి పనికి పాల్పడ్డారనేది తేలాల్సి ఉంది. అదే టైంలో బ్రిటన్ వ్యాప్తంగా చాలా స్కూళ్లలో స్టూడెంట్స్ ఇలాంటి చేష్టలకు పాల్పడినట్లు రుజువైందని, అందుకే తమ స్కూల్ పిల్లలపై కూడా అనుమానంతోనే ఆ మెయిల్ పంపామని స్కూల్ యాజమాన్యం వివరణ ఇచ్చుకుంది. అంతేకాదు ఆర్టీపీసీఆర్ టెస్ట్ రిపోర్టులనే తాము నమ్ముతామని పేరెంట్స్‌కి స్పష్టం చేసింది. మరోవైపు పండ్ల రసాలు, ఫిజ్జీలాంటి జ్యూస్‌లతో ఇలాంటి చేష్టలకు పాల్పడుతూ కొందరు టిక్‌టాక్‌లు చేస్తుండడంతో స్టూడెంట్స్పై ప్రభావం పడుతోందని అధికారులు భావిస్తున్నారు. చదవండి: వుహాన్ ల్యాబ్‌కు ఈ ఏడాది నోబెల్!! -
పంజాబ్ ‘ఫ్యామిలీమ్యాన్’... వెలికి తీశాడు భారీ స్కాం
వెబ్‌డెస్క్ :ఇండియన్ జేమ్స్‌బాండ్, మిషన్ ఇంపాజిబుల్ సిరీస్ తరహాలో ఇటీవల ఫ్యామిలీమ్యాన్ వెబ్‌సిరీస్ పేరు తెచ్చుకుంది. అందులో హీరో సామాన్యుడిలా కనిపిస్తూనే చిన్న చిన్న క్లూల సాయంతో ఉగ్రవాదుల కుట్రలను ఎప్పటికప్పుడు కనిపెడుతూ దేశ భద్రతకు భరోసాగా ఉంటాడు. అచ్చంగా ఫ్యామిలీమ్యాన్ తరమాలోనే కోట్ల రూపాయల స్కామ్‌ని వెలుగులోకి తెచ్చాడు పంజాబ్‌కి ఓ సామాన్య ఎల్ఐసీ ఏజెంట్. ఎక్కడో పంజాబ్‌లో ఉంటూ ఇంకెక్కడో ఉన్న హరిద్వార్‌లో జరిగిన ఫేక్ కోవిడ్ టెస్ట్ స్కాంని చాకచక్యంగా వెలికి తీశాడు. కేవలం ఒక ఫోన్ మేసేజ్ ఆధారంగా కోట్ల రూపాయల కుంభకోణం గుట్టురట్టు చేశారు. ఎస్సెమ్మెస్‌తో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న హరిద్వార్ కుంభమేళా ఫేక్ కోవిడ్ టెస్ట్ స్కామ్‌ను బయటపెట్టింది ఓ సాధారణ ఎల్ఐసీ ఏజెంట్. పంజాబ్‌లోని ఫరీద్‌కోట్‌లో విపన్ మిట్టల్ ఓ సాధారణ ఎల్ఐసీ ఏజెంట్‌గా పని చేస్తున్నాడు. 2021 ఏప్రిల్ 22న అతని ఫోన్‌కి ఓ మేసేజ్ వచ్చింది. అందులో ‘ మీ కరోనా నిర్థారణ పరీక్షా ఫలితాలు నెగటివ్‌గా వచ్చాయి’ అంటూ సందేశం ఉంది. అయితే కరోనా పరీక్షలకు శాంపిల్స్ ఇవ్వకుండానే ఫలితాలు రావడమేంటని ఆశ్యర్యపోయాడు విపన్ మిట్టల్. వెళ్లవయ్యా.. వెళ్లూ... ఎక్కడో, ఏదో జరుగుతోందని అనుమానించిన విపన్ వెంటనే కలెక్టర్ కార్యాలయం చేరుకుని తనకు జరిగిన అనుభవం చెప్పాడు. అయితే కలెక్టరేట్ సిబ్బంది అక్కడి నుంచి వెళ్లిపోవాల్సిందిగా విపన్ని కసిరారు. విషయాన్ని అక్కడితో వదిలేయకుండా తన ఫోన్‌కి మేసేజ్ రావడం, తాను టెస్ట్ చేయించుకోకపోవడం తదితర విషయాలన్నీ పూస గుచ్చినట్టు వివరిస్తూ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐపీఎంఆర్)కి ఈ మెయిల చేశాడు. తగు చర్యలు తీసుకుంటామంటూ అక్కడి నుంచి రిప్లై వచ్చినా... వాస్తవంలో ఏం జరగలేదు. పట్టువదలక తనకు కావాల్సిన సమాచారం ఎంతకీ రాకపోవడంతో పట్టువదలని విక్రమార్కుడిలా ఆర్టీఐ చట్టం కింద విపన్ మిట్టల్ దరఖాస్తు చేశాడు . అందులో హరిద్వార్‌లో విపన్కి కరోనా నిర్థారణ పరీక్షలు జరిపినట్టు తేలింది. ఫరీద్‌కోట్‌లో ఉన్న వ్యక్తికి హరిద్వార్‌లో కరోనా టెస్ట్ నిర్వహించినట్టు రిజల్ట్ రావడం ఏంటీ ? .. అసలేం జరిగిందనే ప్రశ్నలు ప్రభుత్వ అధికారులకు తలెత్తాయి...... చివరకు ఫేక్ కరోనా టెస్ట్ స్కాం వెలుగు చూసింది. హరిద్వార్ ఆరోగ్యశాఖ అధికారులు కుంభమేళ సందర్భంగా నాలుగు లక్షల టెస్టులు చేయగా... అందులో లక్ష వరకు ఫేక్ అని తేలుతోంది. కోట్లాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అయ్యింది. ఈ అంశంపై దర్యాప్తు కొనసాగుతోంది. ఫ్యామిలీమ్యాన్ ఎక్కడ? ఇండియాలోనే అతిపెద్దదిగా భావిస్తోన్న ఫేక్ కోవిడ్ టెస్ట్ స్కాం ని వెలికి తీసిన విపన్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు, ఎలా ఉన్నాడు అనేది తెలియనివ్వడం లేదు అధికారులు. విపన్ భద్రత దృష్ట్యా అతని వివరాలు అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు. -
సింహం మృతితో అలర్ట్: ఏనుగులకు కోవిడ్ టెస్ట్
చెన్నె: ఇన్నాళ్లు మనుషులకు మహమ్మారి కరోనా వైరస్ సోకుతుండగా తాజాగా జంతువులకు కూడా ఆ వైరస్ వ్యాపిస్తోంది. జంతువులకు మొట్టమొదటి కేసు తెలంగాణలోని నెహ్రూ జూలాజికల్ పార్కులో వెలుగు చూడగా అనంతరం తమిళనాడులోని వండలూరు జూలో కూడా జంతువులకు కరోనా సోకింది. అయితే ఇక్కడ వైరస్‌తో ఓ సింహ మృతి చెందడం కలకలం రేపింది. ఆ సింహం ద్వారా 9 సింహాలకు వైరస్ పాకింది. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ సందర్భంగా ఏనుగులకు కూడా వైరస్ పరీక్షలు చేయాలని నిర్ణయించింది. ఈ సందర్భంగా ముదుమలై టైగర్ రిజర్వ్‌లోని తెప్పకాడు ఏనుగుల శిబిరంలో మంగళవారం 28 ఏనుగులకు కరోనా పరీక్షలు చేశారు. వాటి నుంచి నమూనాలను (శాంపిల్స్) సేకరించారు. ఉత్తరప్రదేశ్‌లోని ఇన్‌జత్‌నగర్‌లో ఉన్న భారత పశుసంవర్ధక పరిశోధనా సంస్థ (ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ సెంటర్)కు నమూనాలు పంపించాలని ఆ రాష్ట్ర అటవీ శాఖ మంత్రి రామచంద్రన్ ఆదేశించారు. ఏనుగుల నుంచి ట్రంప్ వాష్ శాంపిల్, రెక్టల్ స్వాబ్‌ను సేకరించినట్లు వెటర్నరీ సర్జన్ రాజేశ్ కుమార్ తెలిపారు. అయితే ఏనుగులన్నీ ఆరోగ్యంగా ఉన్నాయని, వాటికి వైరస్ లక్షణాలు లేవని మరో అధికారి కేకే కౌశల్ వివరించారు. అయితే ముందు జాగ్రత్త చర్యగా వాటి బాగోగులు చూసుకునే మావటిలు, సహాయ సిబ్బంది మొత్తం 52 మందికి కరోనా వ్యాక్సిన్ వేయించారు. ఏనుగులకు కరోనా సోకే అవకాశం చాలా తక్కువ అని, ఎందుకైనా మంచిదని ముందు జాగ్రత్తగా వాటికి కరోనా పరీక్షలు చేయించినట్లు అధికారులు తెలిపారు. కరోనాతో సింహం మృతి చెందడంతో అప్రమత్తమైన ముఖ్యమంత్రి స్టాలిన్ జూన్ 6వ తేదీన జూపార్క్‌ను సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. -
ముక్కులో ఇరుక్కున్న శ్వాబ్.. డాక్టర్‌పై దాడి
ముంబై : కరోనా వైరస్ శాంపిల్ సేకరణలో చోటుచేసుకున్న పొరపాటు కారణంగా ఓ డాక్టర్ చావుదెబ్బలు తిన్నాడు. ఈ సంఘటన మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కొద్ది రోజుల క్రితం పాల్ఘర్ జిల్లా విరార్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన ఓ మహిళ కరోనా పరీక్షలు చేయించుకోవాటానికి దగ్గరలోని ఆసుపత్రికి వెళ్లింది. అక్కడి లాబ్ టెక్నీషియన్ ఆమెకు ఆర్టీపీసీఆర్ టెస్ట్ నిమిత్తం శాంపిల్ తీయటానికి స్వాబ్‌ను ఆమెను ముక్కులో పెట్టాడు. ఈ నేపథ్యంలో ఆ స్వాబ్ విరిగి సగ భాగం అందులోనే ఉండిపోయింది. దీంతో ఆగ్రహించిన ఆమె బంధువులు లాబ్ టెక్నీషియన్‌ను బూతులు తిట్టడం మొదలుపెట్టారు. అక్కడికి వచ్చిన ఓ వైద్యుడిపై దాడికి పాల్పడ్డారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు. చదవండి : పెళ్లి సంబరాల్లో కాల్పులు.. పదేళ్ల బాలిక మృతి -
ఇంట్లోనే కరోనా పరీక్ష చేసుకోండి ఇలా..
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే తొలిసారిగా సొంతంగా కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేసుకునేలా పుణేకు చెందిన మైలాబ్ సంస్థ రూపొందించిన ‘కోవి సెల్ఫ్’ టెస్ట్ కిట్‌కు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) గురువారం ఆమోద ముద్ర వేసింది. రూ.250కి లభ్యమయ్యే ఈ కిట్ ద్వారా కోవిడ్ నిర్ధారణ పరీక్షలు (ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్) వైద్య నిపుణుల సహాయం లేకుండానే సొంతంగా పరీక్షించుకోవచ్చు. సొంతంగా కోవిడ్ నిర్ధారణ పరీక్షలు ఎలా చేసుకోవాలనే విషయంపై ఐసీఎంఆర్ మార్గదర్శకాలు విడుదల చేసింది. వీటిని వీడియో రూపంలో అందుబాటులోకి తెచి్చంది. ‘కోవి సెల్ఫ్’ టెస్ట్ కిట్ యూజర్ మ్యాన్యువల్‌లో కూడా కిట్‌ను ఎలా ఉపయోగించొచ్చనే సూచనలు ఉంటాయి. కోవిడ్ లక్షణాలు ఉన్న వారితో పాటు కోవిడ్ రోగులను కలిసిన వారు ఈ కిట్‌ను ఉపయోగించాలి. ముక్కులో నుంచి నమూనాలు తీసుకుని ఈ పరీక్ష చేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి పాజిటివ్‌గా తేలితే మళ్లీ పరీక్షలు చేసుకోవాల్సిన అవసరం లేదు. పరీక్షలు ఇలా చేసుకోవాలి.. ఈ కిట్‌ను ఉపయోగించే వారు మొదట ‘కోవి సెల్ఫ్’ యాప్ డౌన్లోడ్ చేసుకుని వివరాలు నమోదు చేసుకోవాలి. పరీక్ష చేసుకోవడానికి ముందు చేతులను శుభ్రంగా కడుక్కుని తడిలేకుండా చూసుకోవాలి. కోవిసెల్ఫ్ కిట్‌లో 3 విడి భాగాలు ఉంటాయి. నాసల్ స్వాబ్ (ముక్కులో నుంచి శాంపిల్ తీసుకునేందుకు), శాంపిల్ తీసిన తర్వాత స్వాబ్‌ను పెట్టేందుకు ఉపయోగించే ఒక చిన్న ట్యూబ్, టెస్ట్ కార్డు (పరీక్ష ఫలితాన్ని తెలిపేది) ఉంటాయి. నాసల్ స్వాబ్‌ను ముక్కు రంధ్రాల్లో 2 నుంచి 3 సెంటీమీటర్ల లోపల వరకు పెట్టుకుని కనీసం 5 సార్లు తిప్పాలి. ప్రత్యేక ద్రవంతో కూడిన ట్యూబ్‌ను తెరిచి ఈ స్వాబ్ తలభాగాన్ని అందులో మునిగేలా పెట్టి 10 సార్లు తిప్పాలి. స్వాబ్‌ను విరగ్గొట్టిన తర్వాత ట్యూబ్‌కు మూత పెట్టి, దాన్ని నెమ్మదిగా ఒత్తుతూ ట్యూబ్ మూతలోని రంధ్రం ద్వారా రెండు చుక్కలను టెస్ట్ కార్డు చివరలో ఉండే చిన్న గుంతలాంటి భాగంలో వేయాలి. కిట్‌ను ఉపయోగించేవారు ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత టెస్ట్ కార్డు ఫోటో తీసుకోవాలి. 15 నిమిషాల తర్వాత మొబైల్ యాప్‌లో ఫలితం కనిపిస్తుంది. 20 నిమిషాల తర్వాత కనిపించే ఫలితాన్ని ఇన్‌వ్యాలిడ్‌గా భావించాలి. ఈ ఫలితాన్ని ఐసీఎంఆర్ కోవిడ్ టెస్టింగ్ పోర్టల్‌లో భద్రపరుస్తారు. పాజిటివ్‌గా తేలితే కోవిడ్ నిబంధనల మేరకు జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు హోం ఐసోలేషన్‌లో ఉండాలి. చదవండి: కరోనా.. తెల్లారితే కూతురు పెళ్లి.. అంతలోనే తండ్రి చదవండి: పాపం! అయినా అమ్మ దక్కలేదు.. -
ఇంట్లోనే కరోనా టెస్టులు..
-
భారత నౌకలో 14 మందికి పాజిటివ్: అధికారుల టెన్షన్
జొహన్నెస్‌బర్గ్: భారత్‌లో కరోనా వైరస్ విలయతాండం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు దేశాలు భారత్ నుంచి వెళ్లే విమానాలపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఇక నౌకలపై కూడా ఆంక్షలు విధించేలా పరిణామాలు కన్పిస్తున్నాయి. భారత్ నుంచి బియ్యం లోడుతో ఓ భారీ నౌక దక్షిణాఫ్రికాకు చేరుకుంది. అక్కడి పోర్టు అధికారులు నౌక సిబ్బందికి కరోనా పరీక్షలు చేయగా వారికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో అక్కడి పోర్టు అధికారులు అప్రమత్తమయ్యారు. ఇటీవల భారత్ నుంచి ఓ నౌక సుమారు మూడు వేల టన్నులకు పైగా బియ్యం లోడుతో సాతాఫ్రికాలోని డర్బన్ పోర్టుకు చేరుకుంది. ప్రస్తుత కరోనా పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని నౌకలోని సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఆశ్చర్యంగా అందులో 14 మంది సిబ్బందికి పాటిజివ్‌గా నిర్ధారణ అయిందని దక్షిణాఫ్రికాకు చెందిన ట్రాన్స్‌నెట్ నేషనల్ పోర్ట్ అథారిటీ వెల్లడించింది. ప్రస్తుతం ఆ నౌకను క్వారంటైన్లో ఉంచామని, అందులోకి వెళ్లడానికి, బయటకు రావడానికి ఎవరికీ అనుమతి లేదని పోర్టు అధికారులు వెల్లడించారు. నౌకతో ముడిపడి ఉన్న అన్ని కార్యకలాపాలను ప్రస్తుతం నిలిపివేశారు. నౌకలోని సిబ్బందిని ఎవరెవరు కలిశారనే విషయాన్ని గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమైనట్లు తెలిపారు. ఆ నౌకలో గత ఆదివారం నుంచి సుమారు 200 మంది పోర్టు సిబ్బంది పనిచేస్తున్నట్లు స్థానిక మీడియా వర్గాలు వెల్లడించాయి. అందులో 50 కిలోల బ్యాగుల్లో బియ్యం ఉన్నాయని, వాటిని దింపడానికి ఈ సిబ్బంది పని చేసినట్లు తెలిసింది. భారతదేశంలో రోజూ వేలాది మంది మరణాలకు కారణమవుతున్న కరోనా కొత్త వేరియంట్ దక్షిణాఫ్రికా తీరాలకు చేరిందనే వార్త ప్రస్తుతం అక్కడి మీడియాలో వైరల్‌గా మారింది. ( చదవండి: 22 ప్రవేశమార్గాలను మూసేసిన నేపాల్ ) -
గుండెలు పిండేసే దృశ్యం..
-
కరోనా లక్షణాలు ఉండి నెగెటివ్ వస్తే ఏ టెస్టు ఉత్తమం?
లక్షణాలు లేకపోయినా టెస్టు చేయించుకోవచ్చా? కరోనా లక్షణాలు లేకపోయినా తమకు వైరస్ సోకిందో లేదో నిర్ధారణ చేసుకునేందుకు టెస్టు చేయించుకోవచ్చు. దీనికి ఆర్టీపీసీఆర్ టెస్టే ఉత్తమం. అలాగే లక్షణాలు లేనప్పటికీ ఎవరైనా కరోనా పేషెంట్లతో క్లోజ్ కాంటాక్ట్‌లోకి వెళ్లామనుకున్నప్పుడు కూడా ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేసుకుంటే మంచిది. లక్షణాలుండి ఆర్టీపీసీఆర్లో నెగెటివ్ వస్తే వారు సీటీ స్కాన్ తో నిర్ధారణ చేసుకోవాలి. వందలో 30 మంది వరకు ఇలా జరగొచ్చు. లక్షణాలు ఏమీ లేకపోతే స్కానింగ్ అవసరం ఉండదు. - వీవీ రమణప్రసాద్, పల్మనాలజీ,స్లీప్ డిజార్డర్స్ స్పెషలిస్ట్, కిమ్స్ ఆసుపత్రి, హైదరాబాద్ ఫాల్స్ పాజిటివ్, ఫాల్స్ నెగెటివ్ అంటే ఏమిటి? ఫాల్స్ పాజిటివ్ అంటే మనలో ఇన్ఫెక్షన్ లేకపోయినా నమూనాలో పాజిటివ్ రావడం. ఫాల్స్ నెగెటివ్ అంటే కరోనా సోకిఉన్నప్పటికీ టెస్టులో నెగెటివ్ రావడం. దీనికి ప్రధాన కారణాలు.. గొంతులో నుంచి తీసిన ద్రవాలను సరిగా గుర్తించలేకపోవడం, వైరస్ మ్యుటేషన్ కావడం, నమూనా సరిగా సేకరించకపోవడం, నమూనాల రవాణాలో జాప్యం, కొన్నిసార్లు ఆర్టీపీసీఆర్ టెస్ట్ మిక్సింగ్‌లో ఎర్రర్స్ రావడం, ఒక్కోసారి మనం ఇంట్లో యాంటీ బయోటిక్స్ వాడుతూ నమూనాలు ఇచ్చినప్పుడు వైరస్ సరిగా డిటెక్ట్ కాకపోవడం, వీటన్నిటితో పాటు టెక్నీషియన్ నైపుణ్యత ఇవన్నీ కారణాలుగా చెప్పుకోవచ్చు. దీనివల్ల బాధితుడికి నష్టం జరగవచ్చు. అందుకే లక్షణాలు ఉండి నెగెటివ్ వచ్చినప్పుడు ఆర్టీపీసీఆర్ టెస్టు, లేదా సీటీ స్కాన్ చేయించుకుంటే మంచిది. - డా.జి.ప్రవీణ్ కుమార్, మైక్రోబయాలజిస్ట్ ఔషధ నియంత్రణ శాఖ ల్యాబొరేటరీ చదవండి: ఏ వ్యాక్సిన్ మంచిది? గర్భిణులు టీకా తీసుకోవచ్చా? ర్యాపిడ్, ఆర్టీపీసీఆర్ టెస్టుల్లో తేడా ఏంటి ? డోసుల మధ్య ఎంత విరామం అవసరం? తేడా వస్తే ? -
‘ఇంటికి పోదాం లేవయ్యా..’ హృదయ విదారక దృశ్యం
కరోనా భయంతో కళ్లముందే చెట్టంత కొడుకు కూర్చున్న చోటనే విగతజీవిగా మారడంతో కన్నపేగు కన్నీటి రోదన హృదయాలను ద్రవీంపచేస్తోంది. ‘ఇంటికి పోదాం లేవయ్యా..’ అంటూ ప్రాణాలు కోల్పోయిన భర్తను పట్టుకుని భార్య విలపించిన హృదయ విదారక దృశ్యం గుండెలను పిండెస్తోంది. ఈ విషాద ఘటన నిజామాబాద్ జిల్లాలో జరిగింది. బోధన్ టౌన్/రెంజల్: కరోనా సోకకున్నా పలువురు అనవసరంగా ఆందోళన పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. తాజాగా తనకు కరోనా వచ్చిందేమోనన్న భయంతో అనవసర ఆందోళన పడి ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన ఆదివారం నిజామాబాద్ జిల్లాలో జరిగింది. రెంజల్ మండలం బోర్గం గ్రామానికి చెందిన అశోక్ (30) వృత్తి రీత్యా ఆటోడ్రైవర్. కొద్దిరోజులుగా తీవ్ర జ్వరంతో బాధ పడుతున్నాడు. కరోనా లక్షణాలుగా భావించి తన భార్య లక్ష్మి, తల్లి గంగామణి, తమ్ము డు గంగాధర్‌తో కలసి ఆదివారం రెంజల్ ప్రాథ మిక ఆరోగ్య కేంద్రానికి వచ్చాడు. టెస్టు చేయించుకున్న అశోక్ నీరసంగా ఉందని పక్కనే ఉన్న చెట్టు కిందకు వెళ్లి తల్లి, భార్యతో కలసి కూర్చున్నాడు. తరచూ కోవిడ్‌వార్తలు వింటున్న ఆయన పరీక్ష ఫలితం రాకముందే తనకున్న లక్షణాలను బట్టి కోవిడ్ వచ్చిందేమోనని తీవ్ర భయాందోళనకు లోనయ్యాడు. దీంతో ఆయన అక్కడిక్కడే చెట్టుకిందే కుప్ప కూలిపోయాడు. కన్నీరు మున్నీరుగా విలపించిన తల్లి, భార్య బాధితుడి భార్య ఆస్పత్రి ప్రాంగణంలో ‘ఇంటికి పోదాం లేవయ్యా’ అంటూ విలపించిన తీరు అక్కడున్న వారందరినీ కలచివేసింది. కుమారుడిని పట్టుకుని అశోక్ తల్లి గంగామణి కన్నీటిపర్యంతమయింది. ఇదిలాఉంటే అనంతరం వచ్చిన కరోనా పరీక్ష ఫలితాల్లో అశోక్ కరోనా నెగెటివ్ అని తేలింది. చదవండి: పరీక్ష కోసమని వచ్చి.. కుర్చీలో కూర్చుని అలాగే.. -
ర్యాపిడ్, ఆర్టీపీసీఆర్ టెస్టుల్లో తేడా ఏంటి ?
సాక్షి, హైదరాబాద్: ట్రూనాట్, ర్యాపిడ్ యాంటీ జెన్ టెస్టులను పాయింట్ ఆఫ్ కేర్ అంటారు. అంటే వీటిని ఎక్కడికైనా తీసుకెళ్లి చేసుకోవచ్చు. అదే ఆర్టీపీసీఆర్కు పెద్ద ల్యాబొరేటరీ ఎక్విప్మెంట్ ఉండాలి. ట్రూనాట్ అనేది ఒక చిప్ బేస్డ్ టెస్టింగ్. మన శరీరంలో ఎక్కువ జీన్లు ఉంటాయి. అయితే ఇది కొన్ని జీన్లను మాత్రమే కనుక్కుంటుంది. వీటిలో వైరస్ ఉందో లేదో మాత్రమే గుర్తిస్తుంది. తక్కువ సమయంలో రిజల్ట్ వస్తుంది. అదే ఆర్టీపీసీఆర్లో ఎక్కువ జీన్లను గుర్తించే అవకాశం ఉంటుంది. కేసులు ఎక్కువవుతున్నాయి కాబట్టి, తక్కువ సమయంలో రిజల్ట్ వస్తుంది కాబట్టి, అలాగే ఎక్కడైనా టెస్టు చేసేందుకు అవకాశం ఉందన్న ఉద్దేశంతో ట్రూనాట్, ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులకు అనుమతి ఇచ్చారు. గొంతులో ద్రవం తీసి కిట్‌పై వేస్తే 10 నిమిషాల్లో రిజల్ట్ వస్తుంది. ఇందులో పాజిటివ్ వస్తే తిరిగి ఆర్టీపీసీఆర్కు వెళ్లి నిర్ధారించుకోవచ్చు. ఆర్టీపీసీఆర్‌నే గోల్డెన్ స్టాండర్డ్ టెస్టుగా చెప్పుకోవాలి. -డాక్టర్ ఆవుల రేణుకాదేవి, ప్రొఫెసర్, మైక్రోబయాలజీ, కర్నూలు ప్రభుత్వ మెడికల్ కాలేజి కరోనా నిర్ధారణ అయిన వెంటనే డీడైమర్, హెచ్ఆర్సీ టెస్టులు చేసుకోవచ్చా? కరోనా పాజిటివ్ వచ్చిన తర్వాత 5–7 రోజుల మధ్య డీడైమర్, హెచ్ఆర్సీటీ థొరాక్స్ వంటి టెస్టులు చేయించుకోమని సలహా ఇస్తాం. వైరస్ ప్రభావంతో రక్తం గడ్డ కట్టే అవకాశం ఉంది. డీడైమర్ లెవల్స్ పెరుగుతుంటే దాని ప్రభావం రక్తం మీద పడుతోందని అర్థం. అప్పుడు రక్తం గడ్డ కట్టకుండా వైద్యుల సూచనల మేరకు బ్లడ్ థిన్నర్స్ వాడాలి. ఇక కోవిడ్ వల్ల ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్కు గురవుతున్న విషయం తెలిసిందే. నిమోనియా శాతం తెలుసుకోవడానికే హెచ్ఆర్సీటీ థొరాక్స్ టెస్టు. దీనిద్వారా ఊపిరితిత్తులపై వైరస్ ప్రభావం పడిందా లేదా అని తెలుసుకోవచ్చు.-డాక్టర్ శ్రీనివాస్, మెడికల్ ఆఫీసర్, యూపీహెచ్సీ, బాలాపూర్ ( చదవండి: డోసుల మధ్య ఎంత విరామం అవసరం? తేడా వస్తే ? ) -
పరీక్ష కోసమని వచ్చి.. కుర్చీలో కూర్చుని అలాగే..
శాయంపేట: పదిరోజులుగా జ్వరంతో బాధపడుతూ ఆర్ఎంపీ వద్ద చికిత్స చేయించుకున్నా తగ్గలేదు. దీంతో గ్రామస్తుల సూచన మేరకు భార్యతో కలిసి కరోనా పరీక్ష చేయించుకునేందుకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చాడు. మధ్యాహ్నం తరువాత పరీక్షలు చేస్తామని సిబ్బంది చెప్పడంతో అప్పటికే నీరసంతో ఉన్న అతడు అక్కడే ఉన్న కుర్చీలో కూర్చుని అలాగే మృతి చెందాడు. ఈ ఘటన వరంగల్ రూరల్ జిల్లా శాయంపేటలో శనివారం చోటుచేసుకుంది. మండలంలోని రాజపల్లికి చెం దిన కొయ్యడ రాజమల్లు (45) కూలీ. ఆయనకు భార్య రజితతోపాటు కుమారుడు, కుమార్తె ఉన్నారు. పదిరోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఆయన సర్పంచ్, ఏఎన్ఎం ఒత్తిడితో శనివారం ఉదయం భార్యతో కలిసి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చాడు. మధ్యాహ్నం కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తామని సిబ్బంది చెప్పారు. అప్పటికే నీరసంగా ఉన్న రాజమల్లు పక్కనే ఉన్న బల్లపై పడుకుని, కొంతసేపటికి మృతిచెందాడు. కాగా, మృతదేహానికి కరోనా పరీక్ష నిర్వహించగా నెగెటివ్‌గా వచ్చింది. ఆయన భార్యకు పాజిటివ్‌గా తేలింది. ( చదవండి: పదేళ్లకు చేరిన తల్లి.. దుఃఖాన్ని ఆపుకోలేక కుమారుడు ) -
షాకింగ్: కోవిడ్ నిబంధనలు గాలికొదిలి 300 మంది పరార్
గువహటి: ఒకవైపు దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ ప్రకంపనలు రేపుతోంది. మరోవైవు అసోంలోని సిల్చార్ విమానాశ్రయంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. తప్పనిసరిగా కోవిడ్ టెస్ట్ చేయించు కోవాల్సిన విమాన ప్రయాణికులు అధికారుల కళ్లుగప్పి దొడ్డి దారిన ఉడాయించారు. ఇలా ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 300 మంది ప్రయాణికులు పరారయ్యారు. నిబంధనలను గాలికి ఒదిలి బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించిన ఈ ఘటన రాష్ట్రంలో కలకలం రేపుతోంది. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన కాచర్ జిల్లా అధికారులు సీరియస్‌గా స్పందించారు. విమాన ప్రయాణికులందరి వివరాలను సేకరిస్తున్నామని, అనంతరం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా అదనపు డిప్యూటీ కమిషనర్ సుమిత్ సత్తవన్ వెల్లడించారు. (వ్యాక్సిన్ తరువాత పాజిటివ్ : ఐసీఎంఆర్ సంచలన రిపోర్టు) అసోంలోని సిల్చార్ ఎయిర్‌పోర్టుకు నిన్న(బుధవారం, ఏప్రిల్ 21) మొత్తం ఆరు విమానాలు చేరుకున్నాయి. ఇలా వచ్చిన మొత్తం 690 మంది ప్రయాణికుల్లో 189 మంది మాత్రమే కరోనా టెస్టులు చేయించు కున్నారు. వీరిలో ఆరుగురికి పాజిటివ్ రావడం గమనార్హం. ఇందులో కొందరు రాష్ట్రంలోని గువహతి నుంచి రావడం, మరికొందరు ఇతరు ఈశాన్య రాష్ట్రాల(ట్రాన్సిట్)కు ప్రయాణిస్తున్నవారున్నారు. ఈ నేపథ్యంలో 200 మందికి పైగా ప్రయాణికులను పరీక్షించాల్సిన అవసరం లేదని విమానాశ్రయం, ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. అయితే ప్రభుత్వ ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలును ఉల్లంఘించి 300 మందికి పైగా ప్రయాణికులు టెస్టులు చేయించుకోకుండా తప్పించుకున్నారని అధికారులు వెల్లడించారు. సంబంధిత ప్రయాణికుల వివరాలన్నీ తమ దగ్గర ఉన్న నేపథ్యంలో తొందరలోనే వీరి వివరాలు సేకరిస్తామని చెప్పారు. కాగా కరోనా ఉధృతి నేపథ్యంలో అసోం ప్రభుత్వం మునుపటి నిబంధనలను పాక్షికంగా సవరించి, కోవిడ్ పరీక్ష ఫలితం ప్రతికూలంగా వచ్చినప్పటికీ, విమానాలు, రైళ్ల ద్వారా అసోంకు వచ్చే వారికి 7 రోజుల గృహ నిర్బంధాన్ని తప్పనిసరి చేసింది. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ ప్రధాన కార్యదర్శి సమీర్ కుమార్ సిన్హా జారీ చేసిన ఆదేశాల ప్రకారం ప్రభుత్వ అధికారులు, అత్యవసర వైద్యంకోసం ప్రయాణించేవారు, ఇతర ఈశాన్య రాష్ట్రాల పౌరులు, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నవారికి దీన్నుంచి మినహాయింపు ఇచ్చింది. చదవండి : జొమాటో కొత్త ఫీచర్, దయచేసి మిస్ యూజ్ చేయకండి! ఎన్నిసార్లు గెలుస్తావ్ భయ్యా..! నెటిజన్లు ఫిదా -
క్యాన్సర్ రాకుండా వ్యాక్సిన్?!
విద్య విజ్ఞానం ఎంతగానో అభివృద్ధి చెందినా ఇప్పటికీ కొన్ని వ్యాధులకు ఖచ్చితమైన పరిష్కారాన్ని కనుక్కోలేకపోతున్నాం. క్యాన్సర్ అని తెలియగానే ఎన్నో సందేహాలు, భయాలు మనల్ని వెంటాడుతుంటాయి. అవగాహన పెంపొందించుకుని తొలిదశలోనే గుర్తిస్తే చికిత్సకు లొంగే క్యాన్సర్ గురించి ప్రముఖ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ చిగురుపాటి మోహనవంశీ గారు మీకందిస్తున్న వివరాలను తెలుసుకోండి. క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయి? క్యాన్సర్ సోకిన అవయవాన్ని బట్టి లక్షణాలు మారుతూ ఉంటాయి. అన్ని రకాల క్యాన్సర్లలో కనిపించే సాధారణ లక్షణాలు... తీవ్రమైన అలసట. జ్వరం, ఇమ్యూనిటీ తగ్గడం, ఆకలి తగ్గడం, వాంతులు, విరేచనాలు, బరువు తగ్గడం, రక్తహీనత. (ఇవన్నీ క్యాన్సర్ ముదిరాక కనిపించే కొన్ని లక్షణాలు). క్యాన్సర్ కణం శరీరంలో ఎక్కడైనా ఉందా అని ముందే తెలుసుకోవచ్చా? శరీరం మొత్తంలో క్యాన్సర్ కణం ఎక్కడైనా ఉందా అని ముందే తెలుసుకోడానికి నిర్దిష్టమైన పరీక్ష అయితే లేదు. ఎందుకంటే ఏ అవయవానికి క్యాన్సర్ వచ్చిందని అనుమానిస్తే... ఆ అవయవానికి సంబంధించిన పరీక్షలు వేర్వేరుగా ఉంటాయి. వీటిలో బయాప్సీ, ఎఫ్ఎన్ఏ టెస్ట్, బ్లడ్ మార్కర్స్, ఎక్స్–రే, సీటీ స్కాన్, ఎమ్మారై, పెట్ స్కాన్ ఇలా... అవసరాన్ని బట్టి రకరకాల పరీక్షలు చేస్తుంటారు. ఒక్క సర్వైకల్ క్యాన్సర్‌ను మాత్రమే పాప్‌స్మియర్ ద్వారా చాలా ముందుగా గుర్తించవచ్చు. క్యాన్సర్ రాకుండా వ్యాక్సిన్ లేదా? గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ (సర్వైకల్ క్యాన్సర్)కు కారణం హెచ్‌పీవీ వైరస్ అని తెలుసు కాబట్టి ఇది రాకుండా అమ్మాయిలకు వ్యాక్సిన్ ఉంది. తొమ్మిదేళ్ల నుంచి పెళ్లికాని అమ్మాయిలందరూ (అంటే శృంగార జీవితం ప్రారంభం కాకముందు) ఈ వ్యాక్సిన్ తీసుకుంటే ఈ క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుకోవచ్చు. (అండాశయం, గొంతుక్యాన్సర్ రాకుండా కూడా ఈ వ్యాక్సిన్ పనిచేయవచ్చని... 40 ఏళ్ల వరకు స్త్రీలు ఈ వ్యాక్సిన్ వేయించుకోవచ్చని డాక్టర్స్ సలహా ఇస్తుంటారు). క్యాన్సర్ నివారణ మన చేతుల్లో లేదా? సర్వైకల్ క్యాన్సర్‌కు తప్పితే మిగతా ఏ క్యాన్సర్‌కూ ఖచ్చితమైన కారణం తెలియదు కాబట్టి నివారణ మన చేతుల్లో లేనట్టే. అయితే పీచు పదార్థాలు ఉండే ఆహారం, వ్యాయామం, కాలుష్యానికీ, రసాయనాలకూ దూరంగా ఉండటం, పొగతాగడం–ఆల్కహాల్ వంటి అలవాట్లకు దూరంగా ఉండటం, తరచూ ఇన్ఫెక్షన్స్ గురికాకుండా చూసుకోవడం ద్వారా క్యాన్సర్ రాకుండా ప్రయత్నం చేసినవాళ్లమవుతాం. ఏదైనా క్యాన్సర్స్ వంశపారంపర్యమా? ఖచ్చితంగా చెప్పలేం గానీ... మిగతావారితో పోలిస్తే... రొమ్ముక్యాన్సర్ ఉన్నప్పుడు రక్తసంబంధీకుల్లో ఆ క్యాన్సర్ ముప్పు ఎక్కువ. బీఆర్సీఏ–1, బీఆర్సీఏ–2 వంటి జీన్ మ్యూటేషన్ పరీక్షల ద్వారా రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని పసిగట్టడచ్చు. రొమ్ము క్యాన్సర్ బాధితులు 80% వంశపారంపర్యంగా లేనివారే కాబట్టి ప్రతి మహిళా తన 20వ ఏటి నుంచే రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన పెంచుకోవాలి. నెలసరి అయిన ఏడో రోజున సబ్బు చేతులతో వేళ్ల మధ్యభాగంతో రొమ్ములను పరీక్షించుకుని, చిన్న చిన్న గడ్డలు ఏవైనా తగులుతున్నాయా అని గమనించుకోవాలి. 30 ఏళ్ల నుంచి ఇతర పరీక్షలు, 40 ఏళ్ల పైబడ్డాక మామోగ్రామ్ వంటివి ముప్పు ఉన్నవారు ఏడాదికి ఒకసారి లేదా ఇతరులు మూడేళ్లకు ఓసారి చేయించుకుంటే రొమ్ముక్యాన్సర్‌ను తొలిదశలోనే గుర్తించడం సాధ్యం. క్యాన్సర్‌కు వయోభేదం లేదా? లేదు. ఏ వయసువారిలోనైనా కనిపించవచ్చు. అదృష్టవశాత్తు చిన్నపిల్లల్లో వచ్చే క్యాన్సర్స్ చాలావరకు పూర్తిగా నయం చేయగలిగేవే. వయసు పెరిగేకొద్దీ క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఎక్కువ. పెద్ద వయసు వారిలో వచ్చే క్యాన్సర్స్ తీవ్రత చాలా ఎక్కువ. అందుకే క్యాన్సర్ చికిత్స అన్నది కూడా రోగి వయసును బట్టి మారుతూ ఉంటుంది. క్యాన్సర్‌ను అదుపులో మాత్రమే ఉంచగలమా? నయం చేయలేమా? చికిత్స సమయంలోనూ, ఆ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి? పరిశోధకులు క్యాన్సర్ చికిత్సతో వచ్చే దుష్ప్రభావాలను (సైడ్‌ఎఫెక్ట్స్‌ను) చాలావరకు తగ్గించగలిగారు గానీ ఇప్పటికీ అవి ఎంతోకొంత ఉన్నాయి. వైద్యుల సలహాలు పాటించడం, అన్ని సదుపాయాలు ఉన్న అనుభవజ్ఞులైన డాక్టర్ దగ్గరికి వెళ్లడం, మనోధైర్యంతో యోగా, ధ్యానం వంటివి చేస్తూ ఉండటం మంచిది. పథ్యాలు ఏవీ పాటించనక్కర్లేదు. మంచి పోషకాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. క్యాన్సర్ కణాలమీదే పనిచేసే కీమోథెరపీ, రేడియోథెరపీలతో పాటు ల్యాపరోస్కోపిక్ పద్ధతిలో చేసే కీ–హోల్ సర్జరీలు కూడా నేడు క్యాన్సర్‌కు చేయగలుగుతున్నారు. సర్జరీ చేశాక రేడియోథెరపీ, కీమో, హార్మోన్ థెరపీ వంటివి ఇచ్చినా లేదా థెరపీ తర్వాత సర్జరీ చేసినా చికిత్స అంతటితో ముగిసిందని అనుకోడానికి లేదు. క్రమం తప్పకుండా చెకప్స్‌కు వెళ్లడం, పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి. మొదటి ఐదేళ్లలో వ్యాధి తిరగబెట్టకపోతే అది మళ్లీ వచ్చే అవకాశాలు తక్కువ. అయితే కొంతమందిలో పది, ఇరవై ఏళ్ల తర్వాత వ్యాధి వచ్చిన భాగంలో కాకుండా మరో అవయవంలో వచ్చిన సందర్భాలున్నాయి. కాబట్టి క్యాన్సర్ అదుపులో ఉంది అంటారుగానీ పూర్తిగా నయమైంది అని చెప్పలేరు. ఒక రొమ్ములో క్యాన్సర్ వచ్చిన వారిలో మరో రొమ్ములోనూ వచ్చే అవకాశాలు ఎక్కువ. అంతేకాకుండా కొన్ని రకాల క్యాన్సర్లు శరీరంలోని ఒక అవయవం నుంచి ఇంకో అవయవానికి విస్తరించి, మిగతా భాగాలకు వ్యాపించి, ఇతర అవయవాలకూ వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి వాటిని నిర్ధారణ చేసే పరీక్షలను చికిత్స ముగిశాక కూడా చేయించుకుంటూ ఉండాలి. -
కోవిడ్-19 నిర్ధారణకు టాటా ఎండీ ‘చెక్’
సాక్షి, హైదరాబాద్: కోవిడ్-19 నిర్ధారణ పరీక్షలకై టాటా మెడికల్ అండ్ డయాగ్నొస్టిక్స్ ‘చెక్’ పేరుతో రూపొందించిన టెస్ట్ కిట్‌ను తొలిసారిగా భారత్‌లో అపోలో హాస్పిటల్స్ వినియోగించనుంది. ఫెలూదా డయాగ్నొస్టిక్ టెక్నాలజీపై ప్రపంచంలో మొదటిసారిగా కరోనా వైరస్ పరీక్షలకై డీఎన్ఏ జీనోమ్ ఎడిటింగ్ టూల్ క్రిస్పర్ కాస్-9తో ఈ కిట్ రూపుదిద్దుకుంది. ఫెలూదాను కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్‌కు (సీఎస్ఐఆర్) చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ జీనోమిక్స్, ఇంటిగ్రేటివ్ బయాలజీ అభివృద్ధి చేసింది. చెక్ టెస్ట్ ద్వారా అధిక కచ్చితత్వంతోపాటు పరీక్ష ఫలితాలు వేగంగా తెలుసుకోవచ్చు. (గుడ్‌న్యూస్: క్రిస్మస్కు ముందే కరోనా వ్యాక్సిన్) అపోలో డయాగ్నోస్టిక్స్ 2020 డిసెంబర్ మొదటి వారం నుండి జాతీయ రాజధాని ప్రాంతంలో (ఎన్‌సిఆర్) టాటా ఎమ్‌డి చెక్ పరీక్షను అందిస్తాయని, ఆ తరువాత దేశంలోని అన్ని ప్రధాన మెట్రోల్లో దీనిని విడుదల చేయనున్నట్లు కంపెనీలు తెలిపాయి. ప్రధానంగా మొదటి దశలో కోల్‌కతా, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, అహ్మదాబాద్, పూణే, తరువాత రెండవ దశ ఇతర నగరాలకు చేరుకున్నాయని వారు తెలిపారు. (కరోనా వ్యాక్సిన్ : ఇన్ఫీ మూర్తి కీలక డిమాండ్) -
కరోనా టెస్ట్ : 90 నిమిషాల్లోనే ఫలితం
సాక్షి,ముంబై: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ సెకండ్ వేవ్ ముప్పు భయపెడుతున్నతరుణంలో ఈ మహమ్మారి వైరస్‌ను త్వరితంగా గుర్తించడం కూడా కీలకం. ఈ నేపథ్యంలో టాటా గ్రూపు కోవిడ్-19ను అతి తొందరగా గుర్తించే కిట్‌ను సోమవారం ప్రారంభించింది. దీని ద్వారా కేవలం 90 నిమిషాల్లోనే కరోనా వైరస్ ఉనికిని కనిపెట్టవచ్చని టాటా మెడికల్ అండ్ డయాగ్నోస్టిక్స్ లిమిటెడ్ తెలిపింది. ఇది ప్రస్తుతం ఉన్న వాటికంటే మరింత సమర్థవంతంగా, విశ్వసనీయంగా పనిచేస్తుందని పేర్కొంది. దేశవ్యాప్తంగా పరీక్షల సామర్థ్యాన్ని భారీగా పెంచే లక్ష్యంతో దీన్ని ఆవిష్కరించామని సంస్థ సీఈఓ గిరీష్ కృష్ణమూర్తి వెల్లడించారు. 90 నిమిషాల్లో తుది ఫలితాన్ని అందించే తమ కిట్‌కు ప్రభుత్వ ఆమోదం లభించిందన్నారు. దక్షిణ భారతదేశంలోని చెన్నైలోని టాటా ప్లాంట్‌లో దీన్ని తయారు చేయనున్నామని చెప్పారు. నెలకు పది లక్షల టెస్ట్ కిట్లను ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నామన్నారు. భారతదేశం అంతటా ఈ పరీక్షను అందుబాటులోకి తెచ్చేందుకు పలు ఆసుపత్రులు, వివిధ డయాగ్నొస్టిక్ సెంటర్లు, ఇతర ప్రయోగశాలలతో భాగస్వామ్యం కోసం యోచిస్తున్నట్టు చెప్పారు. వచ్చే నెల(డిసెంబరు)నాటికి ఈ కిట్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని కృష్టమూర్తి వెల్లడించారు. కాగా సోమవారం నాటి గణాంకాల ప్రకారం దేశంలో కరోనా కేసుల సంఖ్య 8.55 మిలియన్లకు చేరుకోగా, 1,26,611 మరణాలు నమోదయ్యాయి. -
కరోనా: ఆ టెస్ట్‌లో నెగిటివ్ వస్తే నమ్మలేం
న్యూఢిల్లీ: ప్రపంచంపై కరోనా కరాళ నృత్యం చేస్తోన్న సంగతి తెలిసిందే. ఊసరవెల్లి మాదిరి వైరస్ తన పరిమాణాన్ని మార్చుకుంటూ.. శక్తివంతంగా మారుతూ ప్రపంచానికి సవాలు విసురుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కరోనా పరీక్షల విషయంలో నేటికి ఎన్నో అపోహలు. ఈ నేపథ్యంలో కేంద్రం గురువారం కరోనా నిర్ధారణ పరీక్షల విషయంలో మార్గదర్శకాలు జారీ చేసింది. ర్యాపిడ్ యాంటి జెన్ టెస్టులో పాజిటివ్ వస్తే... వైరస్ సోకినట్లు అర్థం. అయితే ఈ టెస్టులో ఒకవేళ నెగిటివ్ వస్తే నమ్మలేమని కేంద్రం అభిప్రాయపడింది. లక్షణాలు ఉండి.. ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులో నెగిటివ్ వస్తే.. ఆర్టీ-పీసీఆర్ టెస్టు చేయాల్సిందిగా కేంద్రం సూచించింది. ఈ టెస్టులో గనక నెగిటివ్ అని వస్తే.. అప్పుడు కరోనా లేనట్టే అని తెలిపింది. ఇంతకు ఈ టెస్టులు ఏంటో.. వాటి వివరాలు చూడండి.. (చదవండి: కరోనా పాజిటివ్.. తప్పుడు రిపోర్ట్ అనుకుంటా) #IndiaFightsCorona Health Ministry urges States/UTs to Mandatorily retest all Symptomatic Negative Cases of Rapid Antigen Tests through RT-PCR.https://t.co/jIqbBmdshV@PMOIndia @drharshvardhan @AshwiniKChoubey @PIB_India @DDNewslive @airnewsalerts @ICMRDELHI @mygovindia — Ministry of Health (@MoHFW_INDIA) September 10, 2020 ర్యాపిడ్ యాంటి జెన్ టెస్ట్ కరోనా నిర్ధారణ కోసం చేసే ఈ పరీక్షలో ఖర్చు తక్కువ.. ఫలితం కూడా అర్థగంటలోపే వస్తుంది. దీనిలో వైరస్‌పై స్పందించేందుకు సదరు వ్యక్తి శరీరంలో యాంటీబాడీలు తయారయ్యాయ లేదా అనే విషయం ఈ పరీక్ష ద్వారా తెలుస్తుంది. ఒక వేళ యాంటీబాడీలు ఉత్పత్తి అయితే పాజిటివ్.. లేదంటే నెగిటివ్‌గా ఫలితాలను నిర్ధారిస్తారు. సాధారణంగా ఈ పరీక్షలను ఎక్కువగా కరోనా హాట్‌స్పాట్ కేంద్రాల్లో నిర్వహిస్తారు. అయితే కొన్నిసార్లు కరోనా సోకినప్పటికి యాంటీబాడీలు ఉత్పత్తి కాకపోతే.. నెగిటివ్‌గా వస్తుంది. ఆ తర్వాత కొద్ది రోజులకు ఆర్టీ-పీసీఆర్ పరీక్షల్లో పాజిటివ్ రావడం జరిగిందన్నారు వైద్యులు. ఆర్టీ-పీసీఆర్ టెస్ట్ రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ పాలిమరేజ్ చైన్ రియాక్షన్(ఆర్టీ-పీసీఆర్) అనేది ల్యాబ్‌లో ఆర్ఎన్ఏను డీఎన్ఏగా మార్చే ప్రక్రియ. యాంటీబాడీ టెస్టుల్లో భాగంగా వైరస్‌ను కనుగొని దానికి శరీరం ఏ విధంగా స్పందిస్తుంది అనేది ఈ పరీక్షల్లో నిర్ధారిస్తారు. ఇందుకోసం రోగి శరీరంలోని శ్వాస మార్గం, గొంతు, ముక్కు నుంచి నమూనాలను సేకరిస్తారు. వీటి ఫలితాలు రావడానికి 12-24 గంటల సమయం పడుతుంది. ఖరీదైనది కూడా. -
కోవిడ్-19 : ఇక ఇంట్లోనే పరీక్షలు
లండన్ : కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షల ఫలితాల కోసం రోజుల తరబడి వేచిచూడాల్సి రావడంతో నిమిషాల్లోనే ఫలితాన్ని వెల్లడించే ర్యాపిడ్ టెస్ట్‌లను లక్షల సంఖ్యలో చేపట్టాలని బ్రిటన్ యోచిస్తోంది. వ్యక్తి వేలి నుంచి రక్తాన్ని సేకరించి తక్షణమే ఫలితాలను వెల్లడించే పద్ధతిని అనుసరించాలని నిర్ణయించింది. ఈ పరీక్షలపై గోప్యంగా నిర్వహించిన ట్రయల్స్ విజవంతమయ్యాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ల్యాబ్‌లతో కలిసి యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ అభివృద్ధి చేసిన హోమ్ టెస్ట్‌ల్లో కేవలం 20 నిమిషాల్లోనే ప్రాణాంతక వైరస్ వ్యక్తికి సోకిందా అనేది తెలిసిపోతుంది. జూన్‌లో నిర్వహించిన మానవ పరీక్షల ఫలితాల్లో ఇది 98.6 కచ్చితత్వం సాధించిందని తేలినట్టు ది డైలీ టెలిగ్రాఫ్ పేర్కొంది. ఈ ర్యాపిడ్ టెస్ట్ అద్భుతమని, దీన్ని ఇంట్లోనే మనం చేయవచ్చని బ్రిటన్ ప్రభుత్వ యాంటీబాడీ పరీక్షల కార్యక్రమానికి నేతృత్వం వహించిన ఆక్స్ఫర్డ్ రీజియస్ ప్రొఫెసర్ (మెడిసిన్) జాన్ బెల్ పేర్కొన్నారు. ఇప్పటివరకూ ల్యాబొరేటరీల్లో పరీక్షించేందుకు అనుమానితుల రక్త నమూనాలను పంపడం వాటిని విశ్లేషించి ల్యాబ్‌లు ఫలితం వెల్లడించే యాంటీబాడీ పరీక్షలకే బ్రిటన్ ప్రభుత్వం అనుమతించింది. ఈ ప్రక్రియ రోజుల తరబడి సాగుతుండటంతో తక్షణం ఫలితాలను వెల్లడించే ర్యాపిడ్ టెస్ట్‌లవైపు ప్రభుత్వం మొగ్గుచూపుతోంది. ర్యాపిడ్ టెస్ట్‌లకు త్వరలో బ్రిటన్ ఆమోదముద్ర వేస్తుందనే ప్రచారంతో పెద్దసంఖ్యలో ఈ తరహా మెషీన్లను ఫ్యాక్టరీల్లో ఉత్పత్తి చేపట్టారని టెలిగ్రాఫ్ తెలిపింది. కోవిడ్-19ను ఎదుర్కొనే ఇమ్యూనిటీ స్ధాయిలను యాంటీబాడీ టెస్ట్‌లు వెల్లడిస్తాయి. అయితే కరోనా వైరస్ యాంటీబాడీలు ఈ వ్యాధి నుంచి భవిష్యత్‌లోనూ వ్యక్తికి ఇమ్యూనిటీని అందిస్తాయా అనేదానిపై స్పష్టత లేదు. చదవండి : తోపుడు బండిపై శవాన్ని తోసుకెళ్లిన భార్య.. ఇక ఈ ఏడాది చివరినాటికి బ్రిటన్ అంతటా మాస్ స్ర్కీనింగ్ కార్యక్రమం అందుబాటులోకి వస్తుందని మంత్రులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, బ్రిటన్ డయాగ్నస్టిక్ కంపెనీల భాగస్వామ్యంతో కూడిన యూకే ర్యాపిడ్ టెస్ట్ కన్సార్షియం (యూకే-ఆర్టీసీ) నూతన యాంటీబాడీ టెస్ట్‌లను అభివృద్ధి చేశాయి. గత వారం ఉల్ట్సర్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు 300 మందిపై నిర్వహించిన పరీక్షలో నూతన యాంటీబాడీ టెస్ట్ ట్రయల్స్ విజయవంతమయ్యాయని యూకే-ఆర్టీసీకి చెందిన డాక్టర్ క్రిస్ హ్యాండ్ వెల్లడించారు. ఈ పరీక్షల ఫలితాలు 98.6 శాతం కచ్చితత్వం సాధించడం శుభవార్తేనని ఆయన చెప్పుకొచ్చారు. ఏడాది పాటు సాగే ఈ ప్రక్రియను తాము రాత్రింబవళ్లు పనిచేసి 13 వారాల్లోనే సాధించామని తెలిపారు. ప్రజలు ఇంటి నుంచే ఈ పరీక్షలు చేసుకుని ఫలితాలను సెంట్రల్ డేటాబేస్కు పంపుతారని చెప్పారు. వ్యాక్సిన్‌కు వ్యక్తుల యాంటీబాడీ రెస్పాన్స్‌ను లెక్కగట్టేందుకు మాస్ యాంటీబాడీ పరీక్షలు అవసరమవుతాయని, ఈ ప్రణాళికలో భాగంగానే ర్యాపిట్ టెస్ట్‌ల ప్రక్రియను అభివృద్ధి చేశామని డాక్టర్ హ్యాండ్ తెలిపారు. -
పీహెచ్‌సీల్లో కోవిడ్–19 చికిత్స
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ నిర్ధారణ, కోవిడ్–19 చికిత్సలు ఇకపై ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయిలోనే నిర్వహిస్తామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. ప్రాథమిక దశలోనే కరోనా వైరస్‌ను నిర్ధారించి చికిత్స అందిస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు. ఈ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, కరోనా వైరస్ నియంత్రణలోకి వచ్చే వరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందని వెల్లడించారు. బీఆర్కే భవన్లో ఫార్మా కంపెనీలు, డీలర్లతో శనివారం ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జ్వరం తదితర లక్షణాలు వచ్చిన వారిని ఉపకేంద్రాల స్థాయిలో గుర్తించి పీహెచ్‌సీకి తరలిస్తామని, అక్కడే కరోనా వైరస్ పరీక్షలు నిర్ధారణ చేసి ప్రాథమిక చికిత్స కూడా చేస్తామన్నారు. హోంఐసోలేషన్ అవసరమైన వారికి మందులు పంపిణీ చేసి నిరంతర పర్యవేక్షణ చేస్తామన్నారు. అవసరమైన వారిని పెద్దాసుపత్రికి తరలిస్తామని వివరించారు. కోవిడ్–19 రోగులకు ఇచ్చే మందులు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచుతామని మంత్రి ప్రకటించారు. రాష్ట్రంలో మందులకు కొరత లేదని, అవసరమైన మందులను ఎంత ఖర్చు అయినా కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. మందులు బ్లాక్‌మార్కెట్‌కు తరలితే సహించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామస్థాయి నుంచి ప్రతి మందుల షాప్‌లో మందులు అందుబాటులో ఉండేలా చూడాలని, ప్రతి ప్రభుత్వ ఆసుపత్రికి విధిగా అవసరమైన మందులు సరఫరా చేయాలని కోరారు. ఎక్కువ ఖరీదు ఉన్న మందులు కూడా అన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. కరోనా చికిత్సలో అవసరమైన అన్నిరకాల మందులు ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడాలని డ్రగ్ కంట్రోల్ డైరెక్టర్‌ను ఆదేశించారు. వైరస్ లోడ్‌ను తగ్గించడానికి వినియోగిస్తున్న రెమ్‌డెసివిర్ మందును తయారు చేస్తున్న హెటిరో కంపెనీ యాజమాన్యంతో ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా మాట్లాడారని, రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా మందులను సరఫరా చేయాలని కోరారని, కాబట్టి త్వరలోనే ఆ మందు ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందని మంత్రి తెలిపారు. ప్రజల ప్రాణాలే ముఖ్యం ఆసుపత్రుల వారీగా నెలకొన్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కార్యాచరణ సిద్దం చేస్తోందని మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. శనివారం కోఠిలోని వైద్యశాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఆస్పత్రుల్లో అవసరమైన సిబ్బందిని నియమించుకునే అవకాశాన్ని సూపరింటెండెంట్లకు ఇస్తున్నట్లు వెల్లడించారు. సిబ్బంది, పరికరాలు అడిగిన 24 గంటల్లోనే ఇస్తామని మంత్రి హామీ ఇచ్చారు. టీం వర్క్‌తో పనిచేసి ప్రజల ప్రాణాలు పోకుండా చూడాలని వైద్యశాఖ అధికారులకు విజ్ఞప్తి చేశారు. హాస్పిటల్‌కి వచ్చిన ఏ ఒక్క పేషంట్‌ను కూడా వెనక్కి తిరిగి పంపించ కూడదని.. ప్రాథమిక చికిత్స అందించి కరోనా నిర్ధారణ పరీక్షలు చేసి అవసరమైన హాస్పిటల్‌కి పంపించేలా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆస్పత్రులు చుట్టూ పేషెంట్లు తిరుగుతున్నారని వస్తున్న వార్తలకు స్వస్తి పలకాలన్నారు. ఉస్మానియా ఆసుపత్రిపై కూడా ఈటల సమీక్ష నిర్వహించారు. హైటెక్ యుగంలో పురాతన కట్టడాలతో ప్రజల ప్రాణాలు తీసే హక్కు ఎవరికీ లేదని, ప్రజలు ప్రాణాలు హరించే విధంగా ఉన్నా ఉస్మానియా ఆసుపత్రిని ఆధునీకరించాలని అనేక విజ్ఞప్తులు వస్తున్నాయని వాటికి అనుగుణంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని మంత్రి అన్నారు. -
తెలంగాణలో మొదలైన ర్యాపిడ్ కరోనా టెస్టులు
-
కరోనా పరీక్షల్లో ఏపీ మూడో స్ధానం
-
కరోనా పరీక్షల్లో ఏపీ మరో రికార్డ్
-
కరోనా టెస్టులు
-
ఐదు నిమిషాల్లో కరోనా నిర్థారణ
లక్నో: ఉత్తరప్రదేశ్ నాసిక్‌లో ఉన్న ఐటీ సొల్యూషన్స్ కంపెనీ, ఈఎస్డీఎస్ సాఫ్ట్వేర్ కరోనాను నిర్ధారించే పరికరాన్ని కనిపెట్టింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పనిచేసే ఈ పరికరం ఛాతీ ఎక్సరే ద్వారా కరోనాను నిర్థారణ చేయగలుగుతుంది. దీనికి సంబంధించి ఆ కంపెనీ ప్రతినిధులు మాట్లాడుతూ... తమ టెస్టింగ్ టూల్ ఐదునిమిషాల్లో కరోనాను నిర్థారించగలదని తెలిపారు. ఇంకా వారు మాట్లాడుతూ ఇది పూర్తిగా కాంటాక్ట్ లెస్ పరీక్షా విధానమని తెలిపారు. దీనిలో ఛాతి ఎక్స్- రే రిపోర్టలను తీసుకొని వాటిని వెబ్బ్రౌసర్లో అప్లోడ్ చేయాలని, తరువాత సబ్మిట్ బటన్ నొక్కాలని తెలిపారు. తరువాత వెంటనే అది ఆ వ్యక్తి కరోనాతో బాధపడుతున్నాడో లేదో తెలియజేస్తోందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. (డబ్ల్యూహెచ్ఓలో కేంద్ర మంత్రికి కీలక పదవి) ఈ విధానాన్ని చైనా, ఫ్రాన్స్, ఇజ్రాయిల్, యూకే లాంటి ఇతర దేశాలు కూడా అనుసరిస్తున్నాయని కూడా కంపెనీ పేర్కొంది. దీని ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరీక్షలు చేస్తోన్నామని, ఇప్పటి వరకు 8,500 ఛాతి ఎక్స్-రేలను పరీక్షించామని వాటిలో 96 శాతం మంచి ఫలితాలను ఇచ్చాయని తెలిపారు. గవర్నమెంట్ ఆసుపత్రుల్లో ఈ పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. కరోనా కేసలు రోజు రోజుకు పెరిగిపోతున్న ఈ నేపథ్యంలో కరోనాను తొందరగా నిర్థారించడానికి ఇది బాగుంటుందని ఈఎస్డీఎస్ సంస్థ సీఈఓ పియ్యూష్ సొమానీ తెలిపారు. (త్రీస్టార్.. తిరుపతి వన్) -
సిటీలో టెస్ట్‌లపై ప్రత్యేక దృష్టి పెట్టాలి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో కేసుల పెరుగుదల ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో పరీక్షలపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించాలని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌కు రాసిన లేఖలో సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కోరారు. రాష్ట్రానికి కావాల్సిన ర్యాపిడ్ టెస్టింగ్‌లు, ఇతర మెడికల్ ఎక్విప్మెంట్ ఉచితంగా ఇవ్వాలని కేంద్రంపై రాష్ట్రప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. నగరంలోని ఎల్బీనగర్, మలక్‌పేట, చార్మినార్, కార్వాన్ జోన్లలో విస్తృతంగా, కంటైన్మెంట్లలో భౌతికదూరం, మాస్క్‌లు, పరిశుభ్రత పాటించడంతో పాటు ప్రతీ ఒక్కరికి పరీక్షలు చేయడం ద్వారానే కరోనా నియంత్రణ సాధ్యమని తమ పార్టీ భావిస్తోందన్నారు. ముఖ్యంగా కార్వాన్ నియోజకవర్గంలోని జియాగూడ డివిజన్లో జనసాంద్రత ఎక్కువని, 25 రోజుల్లోనే 91 కరోనా పాజిటివ్ కేసులు, 8 మంది చనిపోయారని పేర్కొన్నారు. -
కరోనా కట్టడికి కేంద్రం సరికొత్త వ్యూహం..!
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న క్రమంలో వైరస్‌ను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త వ్యూహాలను అనుసరిస్తోంది. ఇప్పటి వరకు కేవలం వైరస్ బారినపడిన, అనుమానితులకు మాత్రమే పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయినా కూడా వైరస్ వ్యాప్తిని కట్టడిచేయలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో నాలుగంచెల వ్యూహంతో కరోనా సోకిన వారిని గుర్తించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కోవిడ్ నియంత్రణకు దక్షిణ కొరియా అనుసరించిన విధానాలను అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది. దీనిపై పలు విషాయలను కేంద్ర ఆరోగ్యశాఖమంత్రి హర్షవర్థన్ ఆదివారం ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకున్నారు. దేశంలో కరోనా వైరస్‌ను అరికట్టేందుకు సరికొత్త విధానాలను అనుసరించాలని కేంద్రప్రభుత్వం సంకల్పించిందని మంత్రి తెలిపారు. (కేంద్రమంత్రిని వెంటాడుతున్న కరోనా భయం!) దీనిలో భాగంగానే వైరస్ లక్షణాలు ఉన్న వారిని గుర్తించడం (ట్రేస్) పరీక్షలు నిర్వహించడం (టెస్ట్) క్వారెంటైన్‌కు పంపడం (ఐసోలేషన్) వైద్య చికిత్స అందించడం (ట్రీట్) లాంటి వ్యూహాన్ని అమలుపరుస్తున్నట్లు హర్షవర్ధన్ వెల్లడించారు. దీని వల్లన వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చని అభిప్రాయపడ్డారు. అలాగే నగర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కరోనా పరీక్షలు నిర్వహించాలని కూడా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు ఇచ్చినట్లు కేంద్రమంత్రి తెలిపారు. మే చివరి నాటికి రోజుకు లక్ష పరీక్షలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. కరోనాను కట్టడి చేసేందుకు కేంద్రం అమలు చేస్తున్న విధానాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని, లాక్డౌన్, సామాజిక దూరంతోనే పూర్తిగా అంతం చేయగలమని అన్నారు. (ఒక్కరోజులో 1,975 కేసులు) కాగా దక్షిణ కొరియా ఎలాంటి కఠిన చర్యలు పాటించకుండానే విజయవంతంగా కోవిడ్19 మహమ్మారిని తమ దేశంలో నిరోధించిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 29న దక్షిణ కొరియాలో అత్యధికంగా 909 కేసులు నమోదు కాగా, మార్చి 17 నాటికి ఇది 74 కేసులకు తగ్గింది. పెద్ద ఎత్తున వైరస్ బాధితులను గుర్తించి పరీక్షలు నిర్వహించడంలో ఆ దేశం విజయవంతం అయ్యింది. ఈ నేపథ్యంలో ఆ దేశం అనుసరించిన విధానాల వైపు ప్రపంచ దేశాలన్నీ చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ కూడా అదే బాటలో నడవాలని భావించింది. మరోవైపు దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి ఆగడం లేదు. శనివారం సాయంత్రం నుంచి ఆదివారం సాయంత్రం వరకు రికార్డు స్థాయిలో కొత్తగా 1,975 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే, 24 గంటల వ్యవధిలో 47 మంది కరోనా వల్ల మరణించారు. దీంతో భారత్‌లో ఇప్పటిదాకా మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 27,892కు, మరణాల సంఖ్య 872కు చేరిందని ఆరోగ్య శాఖ సోమవారం ప్రకటించింది. -
సరికొత్త యాంటీబాడీ పరీక్ష సిద్ధం
కరోనా వైరస్‌ను గుర్తించేందుకు ప్రస్తుతం పీసీఆర్ ఆర్సీటీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. గొంతు, ముక్కు నుంచి సేకరించిన ద్రవ నమూనాల్లో వైరస్ తాలూకు డీఎన్ఏ పోగులను గుర్తించడం ఈ పరీక్షల పద్ధతి. అయితే ఇందుకు చాలా సమయం పడుతుంది. ఈ క్రమంలో ప్రత్యామ్నాయ పరీక్షల కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఫలితాలపై సందేహాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో వైలీ అనే సంస్థ యాంటీబాడీ పరీక్ష ఒకదాన్ని సిద్ధం చేసింది. ప్రస్తుతం వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే వాటిని గుర్తించడం వీలవుతుండగా యాంటీబాడీ లేదా రక్త పరీక్షలు తొలిదశలోనే వైరస్‌ను గుర్తించగలవు. అంతేకాకుండా వైరస్ ఎంతమేరకు విస్తరించింది, ఒక్కో వ్యక్తి యాంటీబాడీ ప్రతిస్పందన ఎలా ఉంది? మరోసారి వైరస్ బారిన పడకుండా ఉండగలిగే సామర్థ్యం ఎందరికి ఉంది? అన్నది ఈ కొత్త యాంటీబాడీ పరీక్ష ద్వారా గుర్తించవచ్చు. కరోనా వైరస్‌లోని కీలకమైన ప్రొటీన్ భాగాలను ఉపయోగించడం ద్వారా వైరస్‌ను అడ్డుకునేందుకు శరీర రోగ నిరోధక వ్యవస్థ తయారు చేసిన యాంటీబాడీలను గుర్తించడం ఈ కొత్త పరీక్ష పద్ధతి విశేషం. లక్షణాలు లేని వారితోపాటు, కొద్దిపాటి తీవ్రత ఉన్నవారిలోనూ వైరస్ వ్యాప్తి ఎంతనేది ఈ పరీక్షల్లో స్పష్టంగా తెలుస్తుందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ వైరస్‌ను తట్టుకోగల రోగ నిరోధకశక్తి ఉన్న వ్యక్తులను గుర్తించడం కూడా ఈ పరీక్ష ద్వారా సాధ్యమవుతుంది. దీనివల్ల కరోనా వైరస్ సోకని వ్యక్తులనే రోగుల చికిత్సలో ఉపయోగించవచ్చు. తద్వారా వైరస్ ఇతరులకు సోకే అవకాశం తగ్గిపోతుంది. ఈ కొత్త పరీక్ష ఎలా నిర్వహించాలనేది కరెంట్ ప్రొటోకాల్స్ ఇన్ మైక్రోబయాలజీలో విశదీకరించారు. వర్క్ ఫ్రమ్ హోమ్‌కు ఊపు కరోనా నేపథ్యంలో ఐటీతోపాటు ఇతర ఉద్యోగాల్లోనూ ఇంటి నుంచే పనిచేయడమనే సంస్కృతి రానుంది. ఇప్పటివరకూ ఉద్యోగులు కంపెనీల ఐటీ బ్యాండ్‌విడ్త్‌ను ఉపయోగించుకుని పనులు చేస్తుంటే.. ఇప్పుడు ఇళ్లలోని ఇంటర్నెట్ కనెక్షన్లను వాడాలి. దీంతో బ్యాండ్‌విడ్త్ సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో సరికొత్త వైఫై ప్రొటోకాల్ అందుబాటులోకి రావడం ఊరటనిచ్చే అంశం. ఇది అందుబాటులోకి వస్తే ఒకే కనెక్షన్‌పై బోలెడన్ని ఎలక్ట్రానిక్ పరికరాలను జోడించుకుని నడిపించవచ్చు. ఇంట్లోని వారంతా హైస్పీడ్ వీడియోగేమ్‌లు, ఇతర సాఫ్ట్వేర్లు వాడుతున్నా ఇంటర్నెట్ వేగం ఏమాత్రం తగ్గదన్నమాట. అయితే ప్రస్తుతానికి ఈ కొత్త వైఫై ప్రొటోకాల్‌ను వాడుకోగల స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. ఈ కొత్త వైఫైతో వీడియో కాన్ఫరెన్సింగ్, టెలిమెడిసిన్, ఆన్లైన్ క్లాసుల వంటివి బ్యాండ్‌విడ్త్ సాఫీగా నడుస్తాయని నిపుణులు చెబుతున్నారు.