రాజకీయ నాయకుడిగా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించాక బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ షకీబ్ అల్ హసన్ జాతీయ జట్టులోకి పునరాగమనం చేశాడు. శ్రీలంక జట్టుతో చట్టోగ్రామ్‌లో శనివారం మొదలయ్యే రెండో టెస్టులో షకీబ్ ఆడనున్నాడు.
గత ఏడాది భారత్ ఆతిథ్యమిచ్చిన వన్డే వరల్డ్‌కప్ మధ్యలో షకీబ్ గాయంతో వైదొలిగాడు. ఈ ఏడాది జనవరిలో జరిగిన బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో 37 ఏళ్ల షకీబ్ అవామీ లీగ్ పార్టీ తరఫున మగురా నియోజకవర్గం నుంచి పోటీచేసి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.
Comments
Please login to add a commentAdd a comment