ప్రశాంతంగా రెండో రోజు దేహదారుఢ్య పరీక్షలు
ప్రశాంతంగా రెండో రోజు దేహదారుఢ్య పరీక్షలు
Published Wed, Dec 21 2016 11:59 PM | Last Updated on Mon, Sep 4 2017 11:17 PM
కాకినాడ క్రైం : పోలీస్ కానిస్టేబుల్ నియామకాలకు సంబంధించి శారీరక దేహదారుఢ్య పరీక్షలు బుధవారం రెండోరోజు కాకినాడ పోలీస్ పెరేడ్ మైదానంలో అడిషనల్ ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆధ్వర్యంలో ప్రశాంతంగా జరిగాయి. తొలిరోజు నిర్వహించిన శారీరక పరీక్షల్లో 407 మంది అభ్యర్థులు అర్హత సాధించినట్లు ఏఎస్పీ తెలిపారు. రెండో రోజు జరిగిన పోటీలకు వెయ్యి మంది హాజరు కావాల్సి ఉండగా, 708 మంది పాల్గొన్నారన్నారు. ఈ పరీక్షలకు వచ్చే అభ్యర్థులు తప్పనిసరిగా నెట్‌లో డౌన్‌లోడ్ చేసుకున్న స్టేజ్–1, స్టేజ్–2 ఫార్మేట్లను వెంట తీసుకురావాలని ఆదేశించారు. వాటిని వెంట తీసుకురాకపోవడం వల్ల ఒరిజినల్ పత్రాల వెరిఫికేషన్ ప్రక్రియ జాప్యం అవుతుందన్నారు. తొలిరోజు ఫిజికల్ ఎఫిషియన్సీ, ఫిజికల్ మెజర్‌మెంట్ విభాగాల్లో నిర్వహించిన ఈవెంట్లలో జరిగిన జాప్యాన్ని పరిగణన లోకి తీసుకోకుండా రెండోరోజు ఎటువంటి జాప్యం జరక్కుండా జిల్లా ఎస్పీ రవిప్రకాశ్ ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. నిర్ణీత సమయంలో దేహదారుఢ్య పరీక్షలు జరగడంతో అభ్యర్థులు ఊపిరిపీల్చుకున్నారు.
Advertisement