physical
-
వైమానిక యోగా!
బిజీ లైఫ్ స్టైల్లో తీవ్ర ఒత్తిడి, కోపం, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలతో భాగ్యనగర వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యోగా, ధ్యానం వల్ల మనసుకు ఎంతో ప్రశాంతత చేకూరుతుంది. ఇవన్నీ పూర్వకాలం నుంచి తరతరాలుగా ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు నగరంలో వయసుతో సంబంధం లేకుండా యోగా చేస్తున్నారు. అయితే ప్రస్తుతం యోగాలో కూడా కొత్త ట్రెండ్ నడుస్తోంది. అదే ఏరియల్ యోగా.. దీన్నే రోప్ యోగా అని కూడా అంటారు. సాధారణంగా కింద కూర్చుని యోగాసనాలు వేయడం కామన్.. కానీ గాల్లో వేలాడుతూ వివిధ యోగాసనాలు చేయడమే ఏరియల్ యోగా స్పెషల్ అన్నమాట. గాల్లో యోగాసనాలు ఎలా వేస్తారనే కదా మీ అనుమానం. దీని గురించిన మరిన్ని విశేషాలు తెలుసుకుందాం.. ఏరియల్ యోగాలో చీర పరిమాణంలో ఉన్న ఒక వస్త్రాన్ని పైనుంచి ఊయల మాదిరిగా వేలాడదీస్తారు. ఆ వస్త్రాన్ని శరీరం చుట్టూ చుట్టుకోవాలి. ఇక, వస్త్రాన్ని శరీరానికి చుట్టుకున్న తర్వాత వివిధ యోగాసనాలు వేస్తుంటారు. దీని వల్ల శరీరంలో రక్త ప్రసరణ పెరగడంతో పాటు శరీరానికి ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. అనేక ఆరోగ్య సమస్యలకూ పరిష్కారంగా నిలుస్తోంది.జీర్ణక్రియకు తోడ్పాటు.. ఏరియల్ యోగాతో జీర్ణక్రియ ఎంతో మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. మలబద్ధకం, ఉబ్బరం, కడుపు నొప్పి, అజీర్తి వంటి జీర్ణ సమస్యలను నివారించడంలో ఎంతో ఉపయోగపడుతుంది. శరీరాన్ని సాగతీయడంతో పొత్తికడుపు ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది. పేగు సంబంధ సమస్యలు దరి చేరకుండా చూస్తుంది. కడుపు నొప్పి లేదా గ్యాస్ ఉంటే ఏరియల్ యోగాతో తగ్గించుకోవచ్చు. ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది..ఏరియల్ యోగా శరీర కండరాలు సాగేలా చేస్తుంది. గాల్లో ఉంటారు కాబట్టి.. శరీరాన్ని మరింత స్ట్రెచ్ చేసేందుకు వీలు కలుగుతుంది. కొద్ది రోజులకు శరీరం మరింత ఫ్లెక్సిబుల్‌గా మారుతుంది. ఇలా చేయడం వల్ల కండరాలు కూడా బలంగా తయారవుతాయి. వెన్నెముక, భుజం శక్తివంతంగా తయారయ్యేందుకు దోహదపడుతుంది.ఒత్తిడిని తగ్గించే ఆయుధం.. ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యలతో బాధపడుతుంటే.. ఏరియల్ యోగా చాలా ఉత్తమమైన వ్యాయామం అని చెప్పొచ్చు. మానసిక స్థితిని మెరుగుపరచడంతో పాటు ప్రవర్తనలో కూడా మంచి మార్పులు తీసుకొస్తుంది. ఒత్తిడి, ఆందోళనను తగ్గి స్తుంది. గాల్లో తల్లకిందులుగా వేలాడుతూ.. ధ్యానం చేస్తుంటే మంచి ఆలోచనలపై దృష్టి పెట్టేందుకు అవకాశం ఉంటుంది. ఏరియల్ యోగాతో మెదడులో రక్త ప్రసరణ పెరిగి మానసిక ఆరోగ్యం మన సొంతమయ్యేలా చేస్తుంది.వెన్నునొప్పి హుష్‌కాకి.. వెన్నెముకపై ఎలాంటి ఒత్తిడీ పడకుండా వెన్నెముక, దాని సంబంధిత సమస్యలను నయం చేయడంలో ఏరియల్ యోగా ఎంతో ప్రభావం చూపుతుంది. వస్త్రంలో పడుకుని వెనక్కి అలా వంగి కాసేపు ఆసనం వేస్తే వెన్నెముక సమస్యలు ఇట్టే తొలగిపోతాయి. ఏరియల్ యోగాతో శరీర తీరుతో పాటు వెన్నెముకను సరిచేసుకోవచ్చు. నడుము నొప్పి కూడా తగ్గుతుంది.బరువు తగ్గిపోతుంది.. ఏరియల్ యోగా బరువు తగ్గించడంలో కూడా ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది. 50 నిమిషాల పాటు ఏరియల్ యోగా చేస్తే దాదాపు 320 కేలరీలు బర్న్ చేయగలదు. శరీర కొవ్వును బర్న్ చేసేటప్పుడు ఇది టోన్డ్, లీన్ కండరాలను పొందడానికి సహాయం చేస్తుంది. సమర్థవంతమైన ఫలితాల కోసం వారానికి ఒకసారి దీన్ని ప్రాక్టీస్ చేయవచ్చు.నిపుణుల పర్యవేక్షణలో ..యోగా చేసేటప్పుడు నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే చేయాలి. సొంతంగా చేస్తే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముందు ఎవరైనా గురువు దగ్గర నేర్చుకుని ఆ తర్వాతే అభ్యాసం చేయాలి. కొన్ని యోగాసనాలు చేస్తే పర్వాలేదు. అన్ని ఆసనాలు అందరూ చేయకూడదు. ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు నిపుణుల సలహాలు తీసుకోవాలి. క్రమం తప్పకుండా క్రమపద్ధతిలో చేయాలి. – శ్రీకాంత్ నీరటి, యోగా ట్రైనర్యోగాతో ఎన్నో ప్రయోజనాలుయోగా చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అయితే పతంజలి సూచించిన అష్టాంగ మార్గాల్లోని యమ, నియమను పాటిస్తూ యోగా సనాలు వేయాలి. అప్పుడే మానసిక, శారీరక, ఆధ్యాత్మిక ప్రయోజనాలు చేకూరతాయి. స్థితప్రజ్ఞత సాధించేందుకు యోగా అత్యున్నత మార్గం. – నెతికార్ లివాంకర్, యోగా ట్రైనర్, రామకృష్ణ మఠంకాని్ఫడెన్స్ పెరుగుతుంది.. ఏరియల్ యోగా లేదా యాంటీ గ్రావిటీ యోగా ద్వారా శరీరం చాలా బలంగా తయారవుతుంది. అలాగే మనపై మనకు కాన్ఫిడెన్స్తోపాటు జ్ఞాపకశక్తి, రక్త ప్రసరణ పెరుగుతుంది. మైండ్ రిలాక్సేషన్ అవుతుంది. కాకపోతే సాధారణ యోగాలో కొంతకాలం అనుభవం ఉన్న వారు మాత్రమే దీనిని చేయాలి. ముఖ్యంగా గురువుల సమక్షంలో చేస్తే మంచిది. – కొండకళ్ల దత్తాత్రేయ రావు, అద్వైత యోగా సెంటర్ -
కుర్చీకి అతుక్కుపోతే అంతే సంగతులు
ఏ వయసు వారైనా రోజుకు తగినంత శారీరక శ్రమ చేయడం శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో మంచిది. చదువు, పనిలో ఎంత బిజీగా ఉన్నా శారీరక శ్రమను మాత్రం నిర్లక్ష్యం చేయొద్దని.. శరీరాన్ని కాస్త అటూఇటూ కదల్చాలని ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) సూచిస్తోంది. జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్), ఐసీఎంఆర్ కలిసి డైట్రీ గైడెన్స్ ఫర్ ఇండియా పేరిట మెరుగైన ఆరోగ్యం కోసం 17 మార్గదర్శకాలను ఇటీవల వెల్లడించాయి. సంపూర్ణ ఆరోగ్యం కోసం శారీరక శ్రమ, యోగా, వ్యాయామంపై పలు సిఫార్సులు చేశాయి. – సాక్షి, అమరావతిప్రతి కొద్ది గంటలకు కదలిక ఉత్తమంఎంత బిజీగా ఉన్నా పనిచేసే ప్రదేశాల్లో, ఇతర సందర్భాల్లో కుర్చీకే అతుక్కోపోవడం సరికాదు. ప్రతి కొన్ని గంటలకు ఒకసారి శరీరాన్ని కదల్చాలని ఐసీఎంఆర్ సూచించింది. పని చేసే ప్రదేశాల్లో స్టాడింగ్ డెస్క్ ఉపయోగించాలి. లేదంటే ప్రతి అరగంటకు ఒకసారి లేచి నిలబడాలి. అదే విధంగా ప్రతి కొన్ని గంటలకు లేచి 5 నుంచి 10 నిమిషాలు అటూఇటూ నడవాలని పేర్కొంది. ఇంట్లో, పని ప్రదేశాల్లో ఫోన్ మాట్లాడేప్పుడు నడుస్తూ ఉండాలి. లిఫ్ట్, ఎలివేటర్‌కు బదులు మెట్లను వినియోగించాలి. టీవీ చూస్తున్నప్పుడు కుర్చీకే పరిమితం కాకూడదు. టీవీల్లో వచ్చే కమర్షియల్ బ్రేక్ సమయంలో లేచి తిరగాలి.30 నుంచి 60 నిమిషాల వ్యాయామం⇒ 19 నుంచి 60 ఏళ్ల వయసు వారు రోజుకు 30 నుంచి 60 నిమిషాల పాటు మితమైన, తీవ్రమైన వ్యాయామం చేయాలి.⇒ వారంలో ఐదు రోజులు వ్యాయామం తప్పనిసరి.⇒ వయసు, ఆరోగ్య స్థితిగతులను పరిగణనలో ఉంచుకుని ఏరోబిక్ ఫిజికల్ ఎక్సర్సైజ్, వాకింగ్ వంటి ఇతర శారీరక శ్రమ చేయాలి.⇒ ఇదే తరహాలో 60 ఏళ్లకు పైబడిన వృద్ధులకు కూడా వారం మూడు, అంతకంటే ఎక్కువ రోజులు శారీరక శ్రమను ఐసీఎంఆర్ సూచించింది.⇒ 5–19 ఏళ్ల పిల్లలు, యుక్త వయస్కులకు రోజుకు కనీసం 60 నిమిషాల ఇంటెన్సిటీ యాక్టివిటీని సూచించింది.భారత్‌లో డబ్ల్యూహెచ్‌వో సూచనలు అందుకోలేక పోయిన వారు.. (శాతం)సంపూర్ణ ఆరోగ్యం కోసం దైనందిన జీవనంలో వివిధ కార్యకలాపాలపై సిఫార్సులు ఇలా..లాన్సెట్ అధ్యయనం ఏం చెబుతోందంటే.. భారత్‌లోని 57 శాతం మహిళలు, 42 శాతం మంది పురుషులు ఫిజికల్ ఇనాక్టివ్‌గా ఉంటున్నట్టు తాజాగా ది లాన్సెట్ గ్లోబల్ హెల్త్ జర్నల్ అధ్యయనంలో వెల్లడైంది. ప్రపంచ వ్యాప్తంగా 195 దేశాల్లోని డేటాను అధ్యయనం చేయగా భారత్ 12వ స్థానంలో ఉన్నట్టు స్పష్టమైంది. ప్రపంచ వ్యాప్తంగా 31 శాతం మంది పెద్దలు అంటే.. దాదాపు 1.8 బిలియన్ల మంది 2022లో ఇనాక్టివ్‌గా ఉంటున్నారు. 2010 నుంచి 2022 మధ్య 5 శాతం మేర ఈ స్థాయి పెరిగినట్టు తేలింది.వారానికి కనీసం 150 నిమిషాలు..ప్రపంచ వ్యాప్తంగానే కాకుండా భారతీయుల్లో కూడా శారీరక శ్రమ తగ్గిపోతోంది. జీవన శైలి జబ్బుల బారినపడకుండా ఉండాలంటే వారానికి కనీసం 150 నిమిషాలు శారీరక శ్రమ చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) సూచిస్తోంది. -
పల్మనరీ మెడిసిన్ ఔట్
సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్ సీట్లతో మెడికల్ కాలేజీ పెట్టడానికి సంబంధించిన తాజా మార్గదర్శకాలను జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) విడుదల చేసింది. మూడేళ్ల తర్వాత ప్రస్తుత పరిస్థితులను ఆధారం చేసుకొని గత మార్గదర్శకాల్లో పలు మార్పులు చేర్పులు చేసింది. గతంలో మెడికల్ కాలేజీకి అనుమతి రావాలంటే 24 డిపార్ట్మెంట్లు తప్పనిసరిగా ఉండాలి. ప్రస్తుతం వాటిల్లో నాలుగింటిని తొలగించి, ఒక దాన్ని చేర్చారు. అంటే 21 విభాగాలు ఉంటే సరిపోతుంది. అయితే ఎంబీబీఎస్ విద్యార్థులకు కీలకమైన పల్మనరీ మెడిసిన్ విభాగం తొలగించడంపై విమర్శలు వస్తున్నాయి. దీనితో పాటు ప్రాధాన్యత కలిగిన ఎమర్జెన్సీ మెడిసిన్, ఫిజికల్ మెడిసిన్ అండ్ రిహాబిలిటేషన్, రేడియేషన్ అంకాలజీ విభాగాలను కూడా ఎన్ఎంసీ తొలగించింది. కొత్తగా సమీకృత వైద్య పరిశోధన విభాగాన్ని తీసుకొచ్చింది. అత్యవసర వైద్యానికి ప్రాధాన్యం ఇచి్చంది. సాధారణ పడకలను 8 శాతం తగ్గించి ఐసీయూ పడకలను మాత్రం 120 శాతం పెంచింది. పల్మనాలజీ కిందే ఛాతీ, ఊపిరితిత్తుల వ్యాధులు ఛాతీ, ఊపిరితిత్తులు సంబంధిత వ్యాధులు లేదా కరోనా వంటి సమయాల్లో పల్మనరీ మెడిసిన్ కీలకమైనది. టీబీ వ్యాధి కూడా దీని కిందకే వస్తుంది. వెంటిలేటర్ మీద ఉండే రోగులను పల్మనరీ, అనెస్తీషియా విభాగాల వైద్యులే చూస్తారు. అలాంటి ప్రాధాన్యత కలిగిన విభాగాన్ని తొలగించడంపై సంబంధిత వైద్యులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పల్మనరీని తీసేయడం వల్ల అనెస్తీషియా, జనరల్ మెడిసిన్ స్పెషలిస్టులపై భారం పడుతుందని అంటున్నారు. కాలేజీలో తొలగించిన విభాగాలకు చెందిన పీజీలు ఉండరు. దానికి సంబంధించిన వైద్యం కూడా అందుబాటులో ఉండదు. పల్మనరీ మెడిసిన్ రద్దు సమంజసం కాదు 50 ఏళ్లుగా ఉన్న పల్మనరీ మెడిసిన్ విభాగం తప్పనిసరి నిబంధన తొలగించడం సరైన చర్య కాదు. 2025 నాటికి టీబీ నిర్మూలనను లక్ష్యంగా పెట్టుకున్న భారత్ పల్మనరీ వంటి కీలకమైన విభాగాన్ని తీసేయడం సమంజసం కాదు. – డాక్టర్ కిరణ్ మాదల, సైంటిఫిక్ కమిటీ కన్వినర్,ఐఎంఏ, తెలంగాణ మరికొన్ని మార్గదర్శకాలు అనెస్తీషియా కింద పెయిన్ మేనేజ్మెంట్ విభాగాన్ని తీసుకొచ్చారు. దీర్ఘకాలిక నొప్పులు, మోకాళ్ల నొప్పులు, నడుము నొప్పులు వంటివి ఈ విభాగం కిందికి వస్తాయి. యోగాను ఒక విభాగంగా ప్రవేశపెట్టారు. ఈ మేరకు వేర్వేరుగా స్త్రీ, పురుష శిక్షకులు ఉండాలి. గతంలో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు 300 పడకలు అవసరం కాగా, ప్రస్తుతం వాటిని 220కి కుదించారు. స్కిల్ ల్యాబ్ తప్పనిసరి చేశారు. ఎంబీబీఎస్ విద్యార్థులు నేరుగా రోగుల మీద కాకుండా బొమ్మల మీద ప్రయోగం చేసేందుకు దీన్ని తప్పనిసరి చేశారు. గతంలో కాలేజీకి సొంత భవనం ఉండాలన్న నియమం ఉండేది. ఇప్పుడు 30 ఏళ్లు లీజుతో కూడిన భవనం ఉంటే సరిపోతుంది. కాలేజీ, అనుబంధ ఆసుపత్రి మధ్య దూరం గతంలో 10 కిలోమీటర్లు, 30 నిమిషాల ప్రయాణంతో చేరగలిగేలా ఉండాలన్న నియమం ఉండేది. ఇప్పుడు దీనిని కేవలం 30 నిమిషాల్లో చేరగలిగే దూరంలో ఉండాలన్న నియమానికి పరిమితం చేశారు. ఎన్ని సీట్లకు ఎన్ని జర్నల్స్, పుస్తకాలు ఉండాలన్నది స్పష్టం చేశారు. మెడికల్ కాలేజీకి అనుబంధంగా డాక్టర్లు, నర్సులతో పాటు మొత్తం 17 మంది సిబ్బందితో అర్బన్ హెల్త్ సెంటర్ ఉండాలి. ఎంబీబీఎస్ విద్యార్థులను ఇక్కడికి శిక్షణకు పంపుతారు. గతంలో ఎంబీబీఎస్, హౌసర్జన్లు, రెసిడెంట్లకు హాస్టల్ వసతి తప్పనిసరిగా ఉండేది. ఇప్పుడు రెసిడెంట్లకు తీసేశారు. -
అయ్యో మహేషా.. ఎంత పనైంది బిడ్డా!
సాక్షి, హైదరాబాద్: పాపం.. ఆ యువకుడి జీవితం అర్థాంతరంగా ముగిసింది. సర్కారీ కొలువు కొట్టాలన్న కసి.. అతని ప్రాణం తీసింది. శనివారం నగరంలో జరిగిన కానిస్టేబుల్ ఈవెంట్స్‌లో విషాదం నెలకొంది. కానిస్టేబుల్స్ ఈవెంట్స్‌లో పాల్గొని గుండెపోటుకు గురయ్యాడు మహేష్ అనే అభ్యర్థి. వెంటనే అతన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు అధికారులు. అయితే అక్కడ చికిత్స పొందుతూ మహేష్ కన్నుమూశాడు. దీంతో.. అతని కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగం దక్కించుకోవాలన్న కల.. కుటుంబానికి ఆసరాగా నిలవాలని అనుకున్న అతని లక్ష్యం రెండూ నెరవేరకుండానే అతని జీవితం అర్థాంతంరంగా ముగిసింది. -
పరిణతి... జీవన సాఫల్యం
బాల్యదశ తరువాత మనలో శారీరకంగా వచ్చే మార్పు, ఎదుగుదలే పరిణతి. ఇది భౌతికమైనదే కాదు, మానసికమైనదీ కూడ. మన ఆలోచనలలో, ఆలోచనా రీతిలో వచ్చిన, వస్తున్న తేడాను చూపుతుంది. అంటే మన మనోవికాసాన్ని, దాని స్థాయిని సూచిస్తుంది. మనం వయసు రీత్యా ఎదిగే క్రమంలో మన భాషలో, అభివ్యక్తిలో, ఎదుటివారిని అర్ధం చేసుకునే తీరులో, మన స్పందనలో వెరసి మన ప్రవర్తనలో వచ్చే క్రమానుగతమైన మార్పే పరిణతి. కొంతమందిలో వారి శారీరక వయసు కన్నా పరిణతి వయసు ఎక్కువ. మరికొందరిలో దీనికి భిన్నమూ కావచ్చు. వయసులో పెద్దవారైనా తగిన పరిణతి లేకపోవచ్చు. అలాగే వయసులో చాలా చిన్నవారైనా కొంతమందిలో ఎంతో మానసిక పరిణతి కనిపిస్తుంటుంది. కాబట్టి మన వయసు మన మానసిక ఎదుగుదలకు దర్పణం కావచ్చు. కాకపోవచ్చు. అందువల్లనే పరిణతికి వయసు లేదని, వయసు రీత్యా నిర్ధారించలేమని విజ్ఞులు చెపుతారు. పరిణతికి ఛాయార్థాలు చాలా ఉన్నా పరిపక్వత అన్న అర్థంలో ఎక్కువగా వాడతారు. ప్రవర్తన గురించి చెప్పటానికి తరచూ వాడే మాట. పరిణతి అన్న నాలుగు అక్షరాలలో ఎంతో విశేషమైన, లోతైన, విస్తృతార్థముంది. పరిణతంటే సంక్షిప్తంగా చెప్పాలంటే భావోద్వేగాల మీద గట్టి పట్టు, నియంత్రణే పరిణతి. విచక్షణ, వివేచన, సంయమనం, సహనం, క్షమాగుణం, ఉచిత సంభాషాణ తీరు, దూరదృష్టి, విభేదాలు మరచి అందరిని కలుపుకుని ముందుకు సాగే వైఖరి. ఇక్కడ ఉదాహరించినవి కొన్నే అయినా ఈ పరిణతి ఇంకా ఎన్నో లక్షణాలను దానిలో పొదవుకుంది. మన పుట్టుకకు లక్ష్యం జీవితాన్ని మెరుగుపరుచుకోవటం. మనలోని దుర్గుణాలను తొలగించుకుంటూ, మంచిని పెంచుకుంటూ ఇతరులను కలుపుకుని మనలోని మానవీయ శక్తులను బలపరచుకుంటూ ముందుకుసాగాలి. అదే జీవిత సార్థకత. ఉత్తమమైన, ఉన్నతమైన పథంలో పయనించగలగాలి. అప్పుడే కదా మానవులు బుద్ధిజీవులన్న మాటకు మరింత ఊతాన్నిచ్చినట్టు! ఇది మనసు లో నిలుపుకుని మానవుడే మహనీయుడు అన్న మాటను సుసాధ్యం చేయాలనుకునే వారికి.. పరిణితి ఎందుకు సాధ్యం కాదు? అన్న ఆలోచన వస్తుంది. దీన్ని సాధించి తీరాలన్న పట్టుదల వస్తుంది. అటువంటి వారికి ఇంత గొప్ప పరిణితి సాధించటం అసాధ్యం కాదు. అంటే దీనర్థం పరిణతికున్న అర్ధ పార్శా్వలన్నిటిపై వారికి ఓ పట్టు వచ్చి వారి వ్యక్తిత్వంలో ఒక భాగమైపోతుంది. మన జీవనక్రమంలో అనేకమందితో కలసి ప్రయాణం చేయవలసి ఉంటుంది. ఈ ప్రయాణం కొందరితో కొంతకాలం, మరికొందరితో జీవితాంతం సాగుతుంది. వీరందరితోనూ సంబంధ బాంధవ్యాలు నిలుపుకోవలసిన ఆవశ్యకత ఉంది. దీనికి గొప్ప మానసిక పరిణతి కావాలి. ఇంతటి ఉన్నత పరిపక్వత సాధించే గలిగే వారు వేళ్ళమీద లెక్కించగల సంఖ్యలోనే ఉంటారు. వాళ్లు వయసులో పెద్దవారైనా చిన్నవారైనా గొప్పవారే, ఆదర్శనీయులే, నమస్కరించ తగినవారే. ఒక విషయాన్ని అర్థం చేసుకునే పద్ధతిలో మన దృష్టి ముఖ్యపాత్ర వహిస్తుంది. ఇక్కడ దృష్టి అంటే మన వైఖరి. సమగ్రమైన అవగావన రావాలంటే దానికి చుట్టుకొని ఉన్న అన్ని కోణాలను పరిగణనలోకి తీసుకోవాలి. అపుడే దానిమీద సాధికారంగా మాట్లాడగలం. ఈ దృష్టి, విశ్లేషణా శక్తి, అవగాహనా తీరునే పరిణతి అంటాం. స్థాయిలో పరిణితి సాధ్యమా? అన్న ప్రశ్న చాలామందిలో ఉదయిస్తుంది. గట్టి ప్రయత్నం చేయగలిగితే కనక ఇది సాధ్యమే.. ఇది మన దృఢ నిశ్చయం మీద ఆధారపడి ఉంటుంది. అందరూ ప్రయత్నించినా ఇది ఏ కొందరికో మాత్రమే పట్టుబడే శక్తి. ఈ పరిణితికి ఆవృతమైన అనేక లక్షణాలలో కొందరికి కొన్ని బాగా అలవడచ్చు. అందుకే దీనికి స్థాయీభేదం ఉంటుంది. ప్రతి ఒక్కరి వయసు పెరుగుతూ ఉంటుంది. ఇది భౌతికమైనది. దీనికి అదే నిష్పత్తిలో మానసిక ఎదుగుదల ఉందా? మనలో ఎంతమంది వయసుకు తగిన విధంగా సమయోచితంగా ప్రవర్తిస్తున్నాం!? ఈ రెండిటి మధ్య ఒక సమతౌల్యత పరిణతే కదా! మనం కొన్ని విషయాల్లో కొందరితో విభేదిస్తాం. అంతమాత్రాన బద్ధశత్రువులం కానవసరంలేదు. ఓ భావపరమైన, సిద్ధాంతపరమైన విషయాల వరకు మాత్రమే దానిని పరిమితి చేయాలి. అలాగే చంపదగ్గ శత్రువు మన చేత చిక్కినా వాడిని చంపకుండా తగిన మేలు చేసి విడిచిపెట్టాలని వేమన చెప్పిన దానిలోనూ, మనకు అపకారం చేసిన వారికి కూడ వారి తప్పులను ఎంచకుండా ఉపకారం చేయాలని బద్దెన చెప్పిన దానిలో గోచరించేది పరిణతే. పరిణతి ఓ ధైర్యం. నిశ్చలత, స్థిత ప్రజ్ఞత. చక్కని శ్రుతి లయలతో, ఆరోహణ అవరోహణలతో, భావయుక్తంగా అటు శాస్త్రీయత ఇటు మాధుర్యం రెండిటి సమాన నిష్పత్తిలో అద్భుతంగా సంగీతకచేరి చేస్తున్నాడో యువ సంగీత కళాకారుడు. ఆ రాగ జగత్తులో, ఆ భావనాజగత్తులో విహరిస్తూ తాదాత్మ్యతతో పాడుతున్న అతడి గానం పండిత, పామర రంజితంగా సాగింది. తన సంగీత ప్రవాహంలో ఊయలలూగించిన ఆ కళాకారుడు అంధుడు. కచేరి అనంతరం అతణ్ణి ఆ ఊళ్ళో అతనికి చిన్నప్పుడు సరళీ స్వరాలు నేర్పుతూ అసలు ఈ గుడ్డివాడికి ఆ విద్య అలవడనే అలవడదని తరిమేసిన అతని గురువు దగ్గరకు తీసుకు వెళ్లారు నిర్వాహకులు. ఆ శిష్యుడు ఆయనకు పాదాభివందనం చేసి‘ఇదంతా మీరు పెట్టిన భిక్షే’ అని వినయంగా ఆయన పక్కన నిలబడ్డాడు. అంతే! ఆ గురువుకు తను చేసిన చర్య మనసులో కదిలి, సిగ్గుపడ్డాడు. అటు సంగీతంలోనే కాకుండా ప్రవర్తనలోనూ ఎంతో పరిణతి సాధించిన శిష్యుణ్ణి చూస్తూ ఆనందాశ్రువులు రాలుస్తూ మనసారా అతణ్ణి ఆశీర్వదించాడు. శారీరక వయసు కన్నా పరిణతి వయస్సు ఎక్కువని చెప్పటానికి ఇది చక్కని ఉదాహరణ. పరిణతి పొందటానికి అత్యంత అవసరమైనది అవేశాన్ని వీడటం. దానికి ఎంత దూరమైతే మానసిక పరిపక్వతకు అంత దగ్గరవుతాం. ఆవేశంలో ఆలోచనా శక్తిని కోల్పోతాం. వివేకం నశిస్తుంది. ఆ స్థితిలో మన మనసు తుఫానులో చిక్కుకున్న కల్లోలిత సంద్రమే. ఈ ఆవేశహంకారాలే విశ్వామిత్రుణ్ణి రాజర్షి స్థాయి నుండి మహర్షి, బ్రహ్మర్షి స్థాయికి చేర్చటానికి అభేద్యమైన అవరోధమైంది. ఆయన జీవితంలో సింహభాగాన్ని ధార పోసేటట్టు చేసింది. – లలితా వాసంతి -
అక్రమాలకు చెక్ ....గోధుమల ఎగుమతికి ఫిజికల్ వెరిఫికేషన్ తప్పనిసరి..
న్యూఢిల్లీ: రష్యా దాడి కారణంగా ఉక్రెయిన్ ఎగుమతులు పడిపోయిన సంగతి తెలిసింది. అదీగాక ఇతర దేశాలలో పంటలు ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనడంతో యావత్ ప్రపంచం గోధుమల కోసం భారత్‌వైపే చూసింది. అందుకు అనుగుణంగా భారత్ కూడా సుమారు 10 మిలయన్ల వరకు గోధులమలను ఎగుమతి చేయాలని అనుకుంది గానీ జాతీయ ఆహార భద్రతా దృష్ట్యా నిలిపేసింది. ఈ మేరకు భారత్ మే 13న గోధుమల ఎగుమతిని నిషేధించిన సంగతి తెలసిందే. అంతేకాదు కేంద్రం గోదుముల నిషేధం అమలులోకి రాక మునుపే కస్టమ్స్ అథారిటీ వద్ద నమోదు చేసుకున్న గోధుమ సరుకుల రవాణాను మాత్రమే అనుమతించాలని నిర్ణయించిన సంగతి కూడా తెలిసిందే. దీంతో ప్రైవేట్ ఎగుతిదారులు ఈ నిబంధను క్యాష్ చేసుకుని ఎలాంటి అక్రమాలకు పాల్పడకుండా ఉండేలా కఠినతరమైన నిబంధనలను జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం గోధుమలు ఎగుమతి చేసే ముందు ఫిజికల్ వెరిఫికేషన్ నిర్వహించాలని తెలిపింది. అంతేకాదు అర్హత ఉన్న ఎగుమతిదారుల విషయంలో రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ల (ఆర్సీలు) జారీకి ప్రాంతీయ అధికారులు డ్యూ డిలిజెన్స్' పాటించాలని వాణిజ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. చాలామటుకు నిషేధాన్ని తప్పించుకునే క్రమంలో లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్సి)ని మే 13కి ముందు తేదిని ఇస్తున్నట్లు వెల్లడించింది. దీంతో డైరెక్టరేట్-జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డిజిఎఫ్‌టి) ఎలాంటి అక్రమాలు జరగకుండా ఉండేలా తనిఖీలు తప్పనసరి అని స్పష్టం చేసింది. ప్రాంతీయ అధికారులు ఆమెదించిన లెటర్ ఆఫ్ క్రెడిట్(ఎల్సీ) తేదికి సంబంధిత బ్యాంకులకు సంబంధించిన స్విఫ్ట్ లావాదేవీల తేదితో సరిపోల్చాలని సూచించింది. నిబంధనలను ఉల్లంఘించిన ప్రైవేట్ ఎగుమతిదారులు సీబీఐ విచారణను ఎదుర్కొవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఒకవేళ బ్యాంకర్లకు ఏ దశలోనైనా ఏదైన సమస్య తలెత్తినట్లయితే తగిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం పేర్కొంది. ఈ నిబంధనలకు కట్టుబడి ఉండేలా చేసే ప్రయత్నాలలో భాగంగా ఫిజికల్ వెరిఫికేషన్ తర్వాత రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లు ఆమోదం కోసం ఇద్దరు సభ్యుల ఉన్న కమిటీకి పంపబడతాయని ప్రభుత్వం తెలిపింది. ఐతే ఈ కమిటీ క్లియరన్స్ ఇచ్చిన తర్వాతే ప్రాంతీయ అధికారులు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లను జారీ చేస్తారని వెల్లడించింది. (చదవండి: గోధుమల ఎగుమతులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేంద్రం) -
సరికొత్త విప్లవం: అమెజాన్ బట్టల దుకాణం
Amazon Announced Physical Cloth Store: ఆన్లైన్ ఈ-కామర్స్ రారాజు అమెజాన్ విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. ఈ-వరల్డ్ నుంచి రియల్ వరల్డ్‌లోకి అడుగుపెట్టనుంది. ఈ మేరకు లాస్ ఏంజెల్స్‌లో క్లాతింగ్ స్టోర్‌ను(bricks-and-mortar clothing store) ప్రారంభించనున్నట్లు కంపెనీ గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది. కాలిఫోర్నియా నగరం లాస్ ఏంజెల్స్‌లో అమెజాన్ కంపెనీ ఈ ఏడాది చివర్లో ఈ క్లాత్ స్టోర్‌ను ప్రారంభించనుంది. అమెజాన్ స్టైల్ స్టోర్ ప్రత్యేకత ఏంటంటే.. కస్టమర్లు అమెజాన్ యాప్‌ని ఉపయోగించి దుస్తుల QR కోడ్లను స్కాన్ చేయడం, తమకు కావాల్సిన సైజులతో పాటు రంగులను ఎంచుకోవవచ్చు. ఆపై వాటిని ప్రయత్నించడానికి ఫిట్టింగ్ రూమ్‌లకు అనుమతిస్తారు. ఇదంతా స్మార్ట్ మెథడ్‌లో కొనసాగుతుంది. ఇక ఈ ఫిట్టింగ్ రూమ్‌లను ‘‘పర్సనలైజ్డ్ స్పేస్’’గా పేర్కొంటూ.. అందులోనూ టచ్ స్క్రీన్లను ఏర్పాటు చేస్తారు. అవసరం అనుకుంటే ఆ స్క్రీన్ మీద కస్టమర్ తమకు కావాల్సిన దుస్తుల్ని ఎంచుకోవవచ్చు. తద్వారా అటు ఇటు తిరగాల్సిన అవసరం లేకుండా.. బోలెడు టైం ఆదా అవుతుంది. యాప్ ద్వారా షాపర్స్ అభ్యర్థించిన వస్తువులతో పాటు ఆప్షన్స్ ద్వారా కార్ట్‌కు జోడించిన(యాడ్ చేసిన) ఎంపికలను సైతం ఆ ఫిట్టింగ్ రూంకి పంపిస్తారు. ‘‘కస్టమర్ షాపింగ్ చేస్తున్నంతసేపు అమెజాన్ మెషీన్ లెర్నింగ్ అల్గారిథమ్‌లు యాక్టివేట్‌గా ఉంటాయి. అవి వాళ్లకు తగిన, రియల్ టైం సిఫార్సులను ఉత్పత్తి చేస్తాయి. తద్వారా కస్టమర్లు ఇబ్బంది పడకుండా కావాల్సినవి ఎంచుకోవచ్చు’’ అని అమెజాన్ ఒక ప్రకటనలో తెలిపింది. అంతేకాదు డెలివరీ విషయంలో ఆన్సైట్ ఆపరేషన్స్ తరహాలోనే అత్యాధునిక టెక్నాలజీ ద్వారా త్వరగతిన చేయిస్తాయి. మార్కెట్లో అమెజాన్ ఆధిపత్యం అధికంగా ఉంటోందని పోటీదారులు, ప్రభుత్వాలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీటెల్(వాష్టింగ్టన్) కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న అమెజాన్.. ఫిజికల్ స్టోర్ల ద్వారా తన రిటైల్ ఉనికిని విస్తరించేందుకు ముందుకు వచ్చింది. ఇదిలా ఉంటే 2017లో అమెజాన్ హోల్ ఫుడ్స్ మార్కెట్ గ్రోసరీ చైన్‌ను $13.7 బిలియన్ డాలర్లకు చేజిక్కించుకున్న విషయం తెలిసిందే. తద్వారా ఫిజికల్ రిటైల్‌లో ఈ చర్య, ఈ-కామర్స్ దిగ్గజపు ఉనికిని గణనీయంగా విస్తరించింది. చదవండి: అమెజాన్ 'గ్రేట్ రిపబ్లిక్ డే సేల్'..! 70 శాతం మేర తగ్గింపు! -
సుప్రీంకోర్టులో త్వరలో ప్రత్యక్ష విచారణ
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ విస్తరణ కారణంగా నిలిపివేసిన కేసుల ఫిజికల్ హియరింగ్ (వీడియోలో కాకుండా కోర్టురూములో న్యాయమూర్తులు, న్యాయవాదుల సమక్షంలో దావా జరపడం) ప్రక్రియను త్వరలో హైబ్రిడ్ పద్ధతిలో ఆరంభిస్తామని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బాబ్డె చెప్పినట్లు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. కరోనా సంక్షోభం సమసిపోతున్నందున ఫిజికల్ హియరింగ్స్ ఆరంభించాలని పలువురు న్యాయవాదులు డిమాండ చేస్తున్న తరుణంలో బార్ కౌన్సిల్ సభ్యులతో చీఫ్ జస్టిస్, సొలిసిటర్ జనరల్ సమావేశమై ఈ అంశాన్ని చర్చించారు. గత మార్చి నుంచి సుప్రీంకోర్టులో వీడియోకాన్ఫరెన్స్ ద్వారానే కేసుల హియరింగ్ నిర్వహిస్తున్నారు. అయితే ఫిజికల్ హియరింగ్‌కు డిమాండ్ పెరుగుతుండడంతో త్వరలో ఈ ప్రక్రియను హైబ్రిడ్ పద్ధతిలో(కొన్ని కేసులు వీడియో కాన్ఫరెన్సు ద్వారా, కొన్నింటిని భౌతికంగా) నిర్వహించేందుకు చీఫ్ జస్టిస్ చెప్పారని బీసీఐ చైర్మన్ మనన్ కుమార్ చెప్పారు. అయితే అంతకుముందు మెడికల్, టెక్నికల్ సమస్యలపై రిజిస్ట్రీతో చర్చించి నిర్ణయం తీసుకుంటారన్నారు. సాంకేతిక సమస్యలను పరిశీలించి నిర్ణయం చెప్పాలని సెక్రటరీ జనరల్‌ను చీఫ్ జస్టిస్ ఆదేశించారని, కుదిరితే మార్చి మొదటివారం నుంచి ఫిజికల్ హియరింగ్‌లు నిర్వహించ వచ్చని తెలిపారు. కరోనా సమస్య పూర్తిగా అంతమయ్యేవరకు హైబ్రిడ్ పద్ధతిలో హియరింగ్స్ జరపుతారని, ఢిల్లీలో ఉన్న లాయర్లకు మాత్రమే వీడియో హియరింగ్ సౌకర్యం కల్పిస్తారని తెలిపారు. మరోవైపు తక్షణమే ఫిజికల్ హియరింగ్స్ ఆరంభించాలని కొందరు న్యాయవాదులు సుప్రీంకోర్టు ప్రాంగణంలో నిరసన చేపట్టారు. న్యాయవాదుల సంఘాల కోరిక మేరకు లాయర్స్ ఛాంబర్‌ను ఉదయం 9 నుంచి సాయంత్రం 7 వరకు తెరిచిఉంచేందుకు చీఫ్ జస్టిస్ అంగీకరించారు. 6 నుంచి తెరచుకోనున్న రాష్ట్రపతి భవన్ కోవిడ్-19 కారణంగా గత 11 నెలలుగా మూసివేతకు గురైన రాష్ట్రపతి భవన్ ఈ నెల 6 నుంచి తెరచుకోనుందని అధికారులు సోమవారం తెలిపారు. ప్రభుత్వ సెలవుదినాలు కాకుండా శనివారం, ఆదివారం రోజుల్లో రాష్టపతి భవన్ తెరచే ఉంటుందని స్టేట్మెంట్ ద్వారా చెప్పారు. భౌతిక దూరాన్ని పాటించేందుకుగానూ గరిష్టంగా స్లాట్‌కు 25 మంది చొప్పున మూడు స్లాట్లలో (ఉదయం 10:30, మధ్యాహ్నం 12:30, 2:30) పర్యాటకు లను అనుమతించనున్నట్లు చెప్పింది. లోపలికి అనుమతించేందుకు ఒక్కొక్కరికి రూ. 50 చెల్లించాల్సి ఉంటుంది. 8 నుంచి తెరచుకోనున్న జేఎన్‌యూ కరోనా కారణంగా మూతబడిన జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఈ నెల 8 నుంచి తెరచుకోనుందని జేఎన్‌యూ సోమవారం ప్రకటించింది. 4వ సెమిస్టర్ చదువుతున్న ఎంఫిల్, ఎంటెక్ విద్యార్థులు, ఎంబీఏ చివరి సెమిస్టర్‌విద్యార్థులు ఈ నెల 8 నుంచి కాలేజీకి, హాస్టల్‌కు రావచ్చని ప్రకటించింది. జూన్ 30లోగా థీసిస్‌ను సమర్పించాలని చెప్పింది. -
భౌతిక దూరం ఎనిమిది మీటర్లు?
న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ ఊపిరి వదిలినప్పుడు ఎనిమిది మీటర్ల దూరం వరకూ ప్రయాణించగలదని, గాల్లోనే నాలుగు గంటలపాటు ఉండగలదని అమెరికాలోని మసాచూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు జరిపిన తాజా పరిశోధన తెలిపింది. దీంతో వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తున్న ఒకట్రెండు మీటర్ల భౌతిక దూరం ఎంతవరకూ పనిచేస్తుందనేది ప్రశ్నార్థకంగా మారింది. జర్నల్ ఆఫ్ ద అమెరికన్ మెడికల్ అసోసియేషన్ తాజా సంచికలో ప్రచురితమైన పరిశోధన వ్యాసంలో ఎంఐటీ శాస్త్రవేత్తలు ఈ విషయాలను స్పష్టం చేశారు. (కమ్ముకున్న కరోనా) దగ్గు, తుమ్ము వంటి వాటివల్ల గాల్లో ఏర్పడే మేఘాల్లాంటి నిర్మాణాలపై 1930లలో జరిగిన పరిశోధనల ఆధారంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒకట్రెండు మీటర్ల భౌతిక దూరాన్ని ప్రతిపాదించిందని, కానీ ఈ అంచనాలు ఇప్పుడు పనికిరావని అసోసియేట్ ప్రొఫెసర్ లిడియా బౌరౌబా హెచ్చరించారు అన్ని రకాల నీటి తుంపర్లు వైరస్‌ను కలుపుకుని 23 నుంచి 27 అడుగుల దూరం ప్రయాణించగలవని తెలిపారు.తుంపర బిందువు పరిమాణంపై ఏకపక్షంగా నిర్ణయాలు జరిగాయని, వాటి ఆధారంగా మార్గదర్శకాలు జారీ చేశారని ఆరోపించారు. (దివాలా అంచున ఎయిర్‌లైన్స్) -
సమాధిలో వెలుగు
‘‘అమ్మా ఫలానా ఆయన కోసం సమాధి తవ్వుతుంటే పక్కనే ఉన్న మీ ఆయన సమాధి బయట పడింది. అందులో మీ ఆయన కఫన్ (శవ) వస్త్రం కొంచెం కూడా నలగలేదు. చనిపోయి ఇన్నేళ్లయినా మీ ఆయన కఫన్ వస్త్రంపై వేసిన పూలూ వాడిపోలేదు. పైగా సువాసనలు వెదజల్లుతున్నాయి’’ ఏమిటీ కారణం, బతికుండగా అంతటి పుణ్యకార్యాలు ఏమిచేశారో కాస్త చెబుతారా?’’ అంటూ ఒక్కొక్కరూ అడగడం మొదలెట్టారు ఆ ముసలావిడను. సుమారు డెబ్బై ఏళ్లక్రితం ఒక వ్యక్తి అంత్యక్రియల్లో భాగంగా సమాధి తవ్వుతుంటే పక్కన ఉన్న సమాధిలోని భౌతికకాయం బయల్పడింది. ఆ సమాధిని చూసిన వారంతా ఆశ్చర్యానికి లోనయ్యారు. అంత్యక్రియల అనంతరం సమాధిపై ఉన్న ఫలకంపై ఉన్న వివరాల ప్రకారం ఆ ఇంటి వారిని గుర్తించి ఆ ఇంటికి వెళ్లగా ఓ ముసలావిడ మంచంపై మూలుగుతూ ఉంది. వయసు మీదపడిన ఆ మహిళ బలం కూడగట్టుకుని లేచి పరిశీలనగా చూసింది. ఎవరో నలుగురు మనుషులు వచ్చి తన ముందు నిల్చున్నట్లు మసక కళ్లతోనే గమనించింది. వాళ్లడిగిన దానికి ఏం చెప్పాలో ముసలావిడకు ఏమీ తోచలేదు. తన భర్త చనిపోయి ఇన్నేళ్లు గడిచినా సమాధి ఇంతగా మెరుస్తుందా అని ఆశ్చర్యపోయింది. ‘‘నా భర్త ఏమీ చదువుకోలేదు. దానాలు చేయడానికి మేం ధనవంతులమూ కాము. చదువుకోకపోయినా ఎప్పుడూ ధార్మికంగా ఉండేవాడు. ఎవరైనా ఖుర్ఆన్ చదవడం కనపడితే ఎంతో శ్రద్ధగా వినేవాడు. తనకు ఖుర్ఆన్ చదవడం వచ్చి ఉంటే తానూ పారాయణం చేసేవాడని బాగా చింతించేవాడు. ఇంట్లో ఉన్న ఖుర్ఆన్ గ్రంథాన్ని చేతుల్లో తీసుకుని ముద్దాడేవాడు. ఖుర్ ఆన్ వాక్యాలను తాకుతూ తెగ మురిసిపోయేవాడు. ఒక్కోసారి రాత్రంతా ఖుర్ఆన్ను గుండెలకు హత్తుకుని కన్నీళ్లు పెట్టుకునేవాడు. ఖుర్ఆన్ పట్ల ఉన్న ఆ ప్రేమే అతని సమాధిని ఇలా దేదీప్యమానం చేస్తుందని నేననుకుంటాను’’ అని చెప్పింది ఆ పెద్దావిడ. జీవితాంతం ఖుర్ ఆన్ చదివి, అర్థం చేసుకుని, దైనందిన జీవితంలో ఆచరణలో పెడితే మన సమాధి ఇంకెంత జ్యోతిర్మయమవుతుందో ఆలోచించండి. – తహూరా సిద్దీఖా -
ప్రశాంతంగా రెండో రోజు దేహదారుఢ్య పరీక్షలు
కాకినాడ క్రైం : పోలీస్ కానిస్టేబుల్ నియామకాలకు సంబంధించి శారీరక దేహదారుఢ్య పరీక్షలు బుధవారం రెండోరోజు కాకినాడ పోలీస్ పెరేడ్ మైదానంలో అడిషనల్ ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆధ్వర్యంలో ప్రశాంతంగా జరిగాయి. తొలిరోజు నిర్వహించిన శారీరక పరీక్షల్లో 407 మంది అభ్యర్థులు అర్హత సాధించినట్లు ఏఎస్పీ తెలిపారు. రెండో రోజు జరిగిన పోటీలకు వెయ్యి మంది హాజరు కావాల్సి ఉండగా, 708 మంది పాల్గొన్నారన్నారు. ఈ పరీక్షలకు వచ్చే అభ్యర్థులు తప్పనిసరిగా నెట్లో డౌన్లోడ్ చేసుకున్న స్టేజ్–1, స్టేజ్–2 ఫార్మేట్లను వెంట తీసుకురావాలని ఆదేశించారు. వాటిని వెంట తీసుకురాకపోవడం వల్ల ఒరిజినల్ పత్రాల వెరిఫికేషన్ ప్రక్రియ జాప్యం అవుతుందన్నారు. తొలిరోజు ఫిజికల్ ఎఫిషియన్సీ, ఫిజికల్ మెజర్మెంట్ విభాగాల్లో నిర్వహించిన ఈవెంట్లలో జరిగిన జాప్యాన్ని పరిగణన లోకి తీసుకోకుండా రెండోరోజు ఎటువంటి జాప్యం జరక్కుండా జిల్లా ఎస్పీ రవిప్రకాశ్ ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. నిర్ణీత సమయంలో దేహదారుఢ్య పరీక్షలు జరగడంతో అభ్యర్థులు ఊపిరిపీల్చుకున్నారు. -
మా సమస్యలు పరిష్కరించండి
భానుగుడి (కాకినాడ) : కొన్ని సంవత్సరాలుగా పేరుకుపోయిన తమ సమస్యలను పరిష్కరించాలని రాజీవ్ విద్యామిషన్ పీవో మేకా శేషగిరిని ఆర్వీఎం ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఆసోసియేషన్ సభ్యులు కోరారు. సోమవారం పీవోను కలిసి తమ సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. 2012 నుంచి పనిచేస్తున్న ఆర్వీఎం ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ , ఫిజికల్, వర్క్ ఎడ్యుకేషన్ కాంట్రాక్టు ఉపాధ్యాయులను పాఠశాలల్లో 100 మంది కంటే తక్కువ విద్యార్థులున్న చోట తీసేశారని, జిల్లాలో ప్రస్తుతం ఏర్పడిన ఖాళీలను వారితో భర్తీ చేయాలని కోరారు. ఈ విద్యాసంవత్సరంలో పక్క జిల్లాల్లో జూ¯ŒS 16నుంచి వేతనాలిస్తే మన జిల్లాలో జులై 4నుంచి వేతనాలిచ్చారని, ఇక్కడా అదే తరహా నిబంధనను అమలు చేయాలని కోరారు. పాఠశాలల్లో నెలకొన్న పలు సమస్యలను పరిష్కరించాలని కోరారు. పీవోను కలిసినవారిలో ఏఎంవో చామంతి నాగేశ్వరరావు, ఆ సంఘం జిల్లా అ««దl్యక్షుడు ఎన్. రాజేంద్రప్రసాద్, సీహెచ్ఎన్.రవి,రాధాకృష్ణ, ప్రసన్నకుమార్ అసిస్టెంట్ ఏఎంవో ఎన్ .రాజేంద్రప్రసాద్ ఉన్నారు. -
అంత్యక్రియలకు హాజరైన సీఎం
మోర్తాడ్, వేల్పూర్: అనారోగ్యంతో మరణించిన టీఆర్ఎస్ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వేముల సురేందర్‌రెడ్డి అంతక్రియలను ఆదివారం నిజామాబాద్ జిల్లాలోని ఆయన స్వగ్రామం వేల్పూర్‌లో నిర్వహించగా ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు హాజరయ్యారు. మిషన్ భగీరథ వైస్ చైర్మన్, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి తండ్రి అయిన సురేందర్‌రెడ్డి తీవ్ర అనారోగ్యంతో మరణించారు. సీఎం కేసీఆర్ రోడ్డు మార్గంలో వేల్పూర్‌కు చేరుకుని సురేందర్‌రెడ్డి భౌతిక కాయంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళులు అర్పించారు. అనంతరం ప్రశాంత్‌రెడ్డిని, ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. సురేందర్‌రెడ్డితో తనకు ఉన్న అనుబంధాన్ని సీం గుర్తు చేసుకున్నారు. సీఎం వెంట ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, అటవీశాఖ మంత్రి జోగు రామన్న, రాజ్యసభ సభ్యులు కేశవరావ్, డి శ్రీనివాస్, పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, జిల్లా ఎమ్మెల్యేలు గణేష్ గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్, హన్మంత్‌షిండే, జీవన్‌రెడ్డి, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. -
భౌతిక, రసాయన శాస్త్ర బోధనా లక్ష్యాలు
విద్యార్థి ప్రవర్తనలో తీసుకురావాల్సిన వాంఛనీయ మార్పులను లక్ష్యాలంటారు. ‘‘యునెస్కో హ్యాండ్ బుక్ ఫర్ సైన్స్ టీచర్స్’’.. గమ్యం నుంచి ఉద్దేశం, దాన్నుంచి లక్ష్యం ఆవిర్భవిస్తాయని పేర్కొంది. సెకండరీ స్థాయిలో విజ్ఞానశాస్త్ర బోధన.. మేధస్సుకు సంబంధించినది, ఉన్నత విద్యకు సిద్ధపరిచేదిగా ఉండాలని కొఠారి కమిషన్ పేర్కొంది. జ్ఞానరంగంలోని లక్ష్యాలు-6; భావావేశరంగంలోని లక్ష్యాలు-5;మానసిక చలనాత్మరంగంలోని లక్ష్యాలు-5. విద్యార్థి ఓల్టుమీటరుకు, అమ్మీటర్కు మధ్య భేదాలను గుర్తించాడు.. అతడు సాధించిన లక్ష్యం- అవగాహన. అభ్యసన అనుభవాలు రెండు రకాలు. ప్రత్యక్ష అనుభవానికి ఉదాహరణ: నాటకీకరణ, అనుభవాలు; పరోక్ష అనుభవానికి ఉదాహరణ: పోస్టర్లు. బోధనా లక్ష్యాలకు ప్రాతిపదిక విద్యా లక్ష్యాలు. అభ్యసన ఫలితాల్లో కనిపిస్తూ విద్యార్థుల వికాసానికి ప్రతీకలుగా నిలిచేవి స్పష్టీకరణలు. లక్ష్యాలు స్పష్టీకరణలు ద్వారా నెరవేరుతాయి. జ్ఞాన లక్ష్యానికి చెందిన స్పష్టీకరణలు- జ్ఞప్తికి తెచ్చుకోవడం, గుర్తించుట. ‘దోషాలు సరిదిద్దుతాడు’.. అనే స్పష్టీకరణ అవగాహన లక్ష్యానికి చెందినది. విద్యార్థి తాను పొందిన జ్ఞానాన్ని, అవగాహనను కొత్త పరిస్థితులకు అన్వయించడం అనేది వినియోగం అనే లక్ష్యం. జరగబోయే ఫలితాన్ని ఊహించి చెప్పడం అనేది వినియోగం లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ. వేగంగా, స్పష్టంగా, కచ్చితంగా ఒక పని చేయడాన్ని నైపుణ్యం అంటారు. జ్ఞానాత్మక రంగంలో ముఖ్యమైన లక్ష్యాలు- జ్ఞానం, అవగాహన, వినియోగం. ప్రస్తుత విద్యా వ్యవస్థలో ముఖ్యమైన లక్ష్యం- వినియోగం. జ్ఞానాత్మక రంగంలో అత్యున్నత లక్ష్యం మూల్యాంకనం. నైపుణ్యాలను సాధించడంలో అత్యున్నత పాత్ర పోషించేంది అనుకరణ. అంతర్గత ప్రేరణతో ప్రారంభమయ్యేది అనుకరణ. విద్యార్థి ప్రయోగాలు చేసేటప్పుడు, పరిశీలనలు జరిపేటప్పుడు కచ్చితంగా రీడింగులు తీసుకోవడం సునిశితత్వం. ఒక విద్యార్థి ఆమ్లాలు, క్షారాల మధ్య భేదాలను గుర్తించాడు. అతడు సాధించిన లక్ష్యం అవగాహన. ‘ప్రాగుక్తి చేస్తారు’.. అనేది వినియోగం లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ. అభ్యసనం అంటే శాశ్వత ప్రవర్తనా మార్పు. మూలకాలను లోహాలు, అలోహాలుగా వర్గీకరిస్తే విద్యార్థి సాధించిన లక్ష్యం అవగాహన. విద్యార్థి శాస్త్ర సంబంధ మ్యాగజైన్లను చదివిన అతను సాధించిన లక్ష్యం అభిరుచి. విషయానికి, అభ్యాసకునికి మధ్య జరిగే పరస్పర ప్రతిచర్యను ఏమంటారు- అభ్యసనానుభవం. సంకేతాలు పరోక్ష రకపు అనుభవాలు. ఉత్తమ లక్షణాన్ని వ్యక్తపరిచే స్థితిని వైఖరి అంటారు. ప్రాక్టీస్ బిట్స్ 1.విద్యా విధానంలో మార్గదర్శక సూత్రాలు? ఎ) లక్ష్యాలు బి) స్పష్టీకరణలు సి) ఆశయాలు డి) వైఖరులు 2.విశాల పరిధి, దృక్పథాన్ని కలిగి ఉండేవి? ఎ) లక్ష్యాలు బి) ఆశయాలు సి) విలువలు డి) స్పష్టీకరణలు 3.విద్యార్థుల అధ్యయనాన్ని నియంత్రించేవి? ఎ) లక్ష్యాలు బి) ఆశయాలు సి) విలువలు డి) ఎ, సి 4.బేసిక్ విద్యా విధానాన్ని ప్రతిపాదించినవారు? ఎ) ఈశ్వరీభాయి పటేల్ బి) మహాత్మాగాంధీ సి) కొఠారి కమిషన్ డి) మొదలియార్ కమిషన్ 5. ఉద్దేశించిన ఆశయం దేన్ని చేరేందుకు ఉపకరిస్తుంది? ఎ) గమ్యం బి) లక్ష్యం సి) స్పష్టీకరణ డి) విద్యా ప్రణాళిక 6.లక్ష్యాలు లేకుంటే ఏ ప్రక్రియ నిరుపయోగమవుతుంది? ఎ) బోధన బి) అభ్యసన సి) ఎ, బి డి) అభ్యసన అనుభవం 7.కొఠారి కమిషన్‌ను ఏర్పాటు చేసిన సంవత్సరం? ఎ) 1952 బి) 1960 సి) 1964 డి) 1988 8.జ్ఞానాత్మక రంగంలో మూడో లక్ష్యం? ఎ) అవగాహన బి) వినియోగం సి) విశ్లేషణ డి) మూల్యాంకనం 9. మానసిక చలనాత్మక రంగంలోని మొదటి లక్ష్యం? ఎ) అనుకరణ బి) హస్తలాఘవం సి) సునిశితత్వం డి) ఉచ్ఛారణ 10. విద్యార్థి సరైన సాక్ష్యాలు లేనప్పుడు తన నిర్ణయాన్ని నిలిపేస్తాడు అనే స్పష్టీకరణ లక్షణం? ఎ) అవగాహన బి) నైపుణ్యం సి) అభిరుచి డి) శాస్త్రీయ వైఖరి 11. ఒక విద్యార్థి కాపర్ సల్ఫేట్, పొటాషియం డైక్రోమేట్ వంటి రసాయనాలను గుర్తించిన అతను సాధించిన లక్ష్యం? ఎ) జ్ఞానం బి) అవగాహన సి) వినియోగం డి) నైపుణ్యం 12. ఒక విద్యార్థి సాంద్రత, సాపేక్ష సాంద్రతల మధ్య తేడాలను గుర్తించిన సాధించిన లక్ష్యం? ఎ) జ్ఞానం బి) అవగాహన సి) వినియోగం డి) నైపుణ్యం 13. గురుత్వ త్వరణాన్ని నిర్వచించగల విద్యార్థి సాధించిన లక్ష్యం? ఎ) నైపుణ్యం బి) జ్ఞానం సి) అవగాహన డి) కృత్యం 14. ఒక విద్యార్థి ఓమ్ నియమాన్ని నిరూపించే సర్క్యూట్ లో దోషాలను కనుగొన్నాడు..అతను సాధించిన లక్ష్యం? ఎ) జ్ఞానం బి) అవగాహన సి) వినియోగం డి) నైపుణ్యం 15. ప్రయోగానంతరం గ్రాఫ్‌లు గీసి, వివరాలను గ్రాఫ్ ద్వారా క్రోడీకరించిన విద్యార్థులు సాధించిన లక్ష్యం? ఎ) జ్ఞానం బి) అవగాహన సి) అన్వయం డి) అభిరుచి 16. విద్యార్థి జీవశాస్త్ర సంబంధ పదాలను, భావనలను, సిద్ధాంతాలను పోల్చి చూస్తాడు అనే స్పష్టీకరణకు లక్ష్యం? ఎ) అన్వయం బి) అభిరుచి సి) జ్ఞానం డి) అవగాహన 17.భావావేశ రంగంలో అత్యున్నత లక్ష్యం? ఎ) ప్రతిస్పందించడం బి) వ్యవస్థాపన సి) విలువకట్టడం డి) శీల స్థాపన 18. భావావేశ రంగంలో మూడో లక్ష్యం ఏమిటి? ఎ) ప్రతిస్పందించటం బి) వ్యవస్థాపన సి) విలువ కట్టడం డి) శీల స్థాపన 19. జ్ఞానాత్మకరంగంలోని అత్యున్నత లక్ష్యం ఏమిటి? ఎ) అవగాహన బి) విశ్లేషణ సి) సంశ్లేషణ డి) మూల్యాంకనం 20. భావావేశ రంగంలోని లక్ష్యాలు ఎన్ని? ఎ) 5 బి) 4 సి) ఆరు డి) ఏడు 21.‘వర్గీకరణ’ దేనికి సంబంధించిన స్పష్టీకరణ? ఎ) జ్ఞానం బి) నైపుణ్యం సి) వినియోగం డి) అవగాహన సమాధానాలు 1) సి; 2) బి; 3) ఎ; 4) బి; 5) ఎ; 6) సి; 7) సి; 8) బి; 9) ఎ; 10) డి; 11) ఎ; 12) బి; 13) సి; 14) బి; 15) డి; 16) డి; 17) డి; 18) సి; 19) డి; 20) ఎ; 21) డి. -
మనోబలానికి ప్రార్థన దివ్యౌషధం
ధ్యాన భావనలు మనసుని తొలిచివేసే ఆలోచనల్లో భయం ఒకటి. భయం సార్వజనీనం. పశుపక్ష్యాదులకు కూడా ఉంటుందీ భయం. భయాన్ని మన జీవితంలో అనేక రకాల బెంగలతో భవిష్యత్తు, కుటుంబం, పని లేదా వ్యాపారాల గురించి వెలిబుచ్చుతాం. కొన్ని బెంగలు చిన్నవిగా ఉంటే, కొన్ని తీవ్రంగా ఉంటాయి. ఇది మన శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యాలకు మంచిది కాదని మనందరికీ తెలుసు. బెంగపడి సాధించేదేమీ లేదని కూడా తెలుసు. మనకు భవిష్యత్తులో రాసిపెట్టి ఉన్నదాన్ని, మనం బెంగపడడం వల్ల ఏమీ మార్చలేమనీ తెలుసు. అయినప్పటికీ మనం బెంగపడి, కంగారు పడి, దిగులు చెంది, భయపడి పోతుంటాం. దీన్ని బట్టి ఒక విషయం స్పష్టంగా తెలుస్తోంది. ఈ సమస్య మన వివేకానికి సంబంధించినది కాదు. అలాగయితే భయం తొలగిపోవాలి. మరి సమస్య ఎక్కడుంది? మన మనసులో, మన మానసిక అలవాట్లలో ఉందన్నమాట. సగం మానసిక సమస్యలు నా భావపరమైన అలవాట్ల నుంచి వస్తాయి. ఈ అలవాట్లు నేను నా మనసులో పదేపదే భావాలను తిరగదోడటం వల్ల ఏర్పడతాయి. ఇప్పుడు భావాలు నా అంతఃచేతన మనసులో లోతుగా ఉన్నాయి. వాటిని సంస్కారాలు లేదా వాసనలు అంటారు. వాటిని నేను పారద్రోలాలంటే, నేను వాటిని ప్రయత్నపూర్వకంగా బయటకు లాగి, వాటి వ్యతిరేక భావాలను సాధన చేయాలి. నేను ప్రశాంతంగా కూర్చొని, నా బెంగలనన్నిటినీ పైకి లాగి, వాటిని బయట పెట్టి, వాటి కింద దాగిన గట్టి మనసును కనుక్కోవాలి. నేను బెంగపడడం లేదని నాకు నేనే చెప్పుకోవాలి. మొదట్లో అది యాంత్రికంగా ఉండవచ్చు. లేదా చూడడానికి అలా ఉండవచ్చు. కానీ రానురాను అది నేను అలవరచుకున్న ఒక సానుకూల ఆలోచన అవుతుంది. ఈ కొత్త అలవాటును పెంపొందించుకోడానికి, నేను దేవుని సహాయం కోరుతాను. నాకు బలాన్నివ్వమని వేడుకుంటాను. ‘ఓ దేవా! నా భవిష్యత్తును, అది ఎలాగున్నా సరే, మనస్ఫూర్తిగా ఆహ్వానించే శక్తిని ఇవ్వు నాకు. నా భవిష్యత్తు గానీ, నా కుటుంబ భవిష్యత్తుగానీ, నా దేశ భవిష్యత్తుగానీ ఎలా ఉంటుందో నాకు తెలియదు. అది మంచీచెడుల మేలు కలయికగా ఉంటుందని మాత్రం నాకు తెలుసు. నేను వాటిని అనుభవించక తప్పదు. ఎందుకంటే నేను భూమ్మీద పుట్టిందే నా కర్మఫలాన్ని హరింపజేయడానికి. వాటిని నేను ఆడించలేను. తప్పించుకోలేను. అందుకని ఏ విధమైన బెంగకూ లోను కాకుండా, వాటిని ప్రశాంతంగా ఆహ్వానించేందుకు నాకు శక్తి కావాలి’. ప్రార్థన చేస్తే నా శక్తి పెరుగుతుందని మొదట నేను నమ్మాను. మనసారా, భక్తితో చేసిన ప్రతి ప్రార్థన తర్వాతా నేను మరింత శక్తిని పుంజుకున్నాను. ఆ శక్తిని నేను గ్రహించుకుని, నేనిప్పుడు మరింత శక్తిమంతంగా ఉన్నాను. నా జీవితంలో ఎటువంటి సంఘటననైనా ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నాను అని నాకు నేనే చెప్పుకుంటాను. నా వృద్ధాప్యం, అనారోగ్యం, మరణం, కుటుంబ సభ్యుల జీవితాలలో ఒడిదుడుకులు, వ్యాపారంలో లాభనష్టాలు ఏవి కలిగినా సరే నాకిక బెంగ లేదు. నేను ఇక కంగారుపడను. నేను ఇక దిగులు చెందను. మిన్ను విరిగి మీదపడ్డా దాన్ని ఎదుర్కోడానికి నేను సిద్ధం. నేను విశ్రాంతిగా ఉన్నాను. నేను విశ్రాంతిగా ఉన్నాను. నేను విశ్రాంతిగా ఉన్నాను. శాంతోహం శాంతోహం శాంతోహం. - స్వామి పరమార్థానంద (తెలుగు: మద్దూరి రాజ్యశ్రీ)