భౌతిక, రసాయన శాస్త్ర బోధనా లక్ష్యాలు
విద్యార్థి ప్రవర్తనలో తీసుకురావాల్సిన వాంఛనీయ మార్పులను లక్ష్యాలంటారు. ‘‘యునెస్కో హ్యాండ్ బుక్ ఫర్ సైన్స్ టీచర్స్’’.. గమ్యం నుంచి ఉద్దేశం, దాన్నుంచి లక్ష్యం ఆవిర్భవిస్తాయని పేర్కొంది.
సెకండరీ స్థాయిలో విజ్ఞానశాస్త్ర బోధన.. మేధస్సుకు సంబంధించినది, ఉన్నత విద్యకు సిద్ధపరిచేదిగా ఉండాలని కొఠారి కమిషన్ పేర్కొంది.
జ్ఞానరంగంలోని లక్ష్యాలు-6; భావావేశరంగంలోని లక్ష్యాలు-5;మానసిక చలనాత్మరంగంలోని లక్ష్యాలు-5.
విద్యార్థి ఓల్టుమీటరుకు, అమ్మీటర్‌కు మధ్య భేదాలను గుర్తించాడు.. అతడు సాధించిన లక్ష్యం- అవగాహన.
అభ్యసన అనుభవాలు రెండు రకాలు. ప్రత్యక్ష అనుభవానికి ఉదాహరణ: నాటకీకరణ, అనుభవాలు; పరోక్ష అనుభవానికి ఉదాహరణ: పోస్టర్లు.
బోధనా లక్ష్యాలకు ప్రాతిపదిక విద్యా లక్ష్యాలు. అభ్యసన ఫలితాల్లో కనిపిస్తూ విద్యార్థుల వికాసానికి ప్రతీకలుగా నిలిచేవి స్పష్టీకరణలు. లక్ష్యాలు స్పష్టీకరణలు ద్వారా నెరవేరుతాయి.
జ్ఞాన లక్ష్యానికి చెందిన స్పష్టీకరణలు- జ్ఞప్తికి తెచ్చుకోవడం, గుర్తించుట.
‘దోషాలు సరిదిద్దుతాడు’.. అనే స్పష్టీకరణ అవగాహన లక్ష్యానికి చెందినది.
విద్యార్థి తాను పొందిన జ్ఞానాన్ని, అవగాహనను కొత్త పరిస్థితులకు అన్వయించడం అనేది వినియోగం అనే లక్ష్యం.
జరగబోయే ఫలితాన్ని ఊహించి చెప్పడం అనేది వినియోగం లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ.
వేగంగా, స్పష్టంగా, కచ్చితంగా ఒక పని చేయడాన్ని నైపుణ్యం అంటారు.
జ్ఞానాత్మక రంగంలో ముఖ్యమైన లక్ష్యాలు- జ్ఞానం, అవగాహన, వినియోగం. ప్రస్తుత విద్యా వ్యవస్థలో ముఖ్యమైన లక్ష్యం- వినియోగం. జ్ఞానాత్మక రంగంలో అత్యున్నత లక్ష్యం మూల్యాంకనం.
నైపుణ్యాలను సాధించడంలో అత్యున్నత పాత్ర పోషించేంది అనుకరణ. అంతర్గత ప్రేరణతో ప్రారంభమయ్యేది అనుకరణ.
విద్యార్థి ప్రయోగాలు చేసేటప్పుడు, పరిశీలనలు జరిపేటప్పుడు కచ్చితంగా రీడింగులు తీసుకోవడం సునిశితత్వం.
ఒక విద్యార్థి ఆమ్లాలు, క్షారాల మధ్య భేదాలను గుర్తించాడు. అతడు సాధించిన లక్ష్యం అవగాహన.
‘ప్రాగుక్తి చేస్తారు’.. అనేది వినియోగం లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ.
అభ్యసనం అంటే శాశ్వత ప్రవర్తనా మార్పు.
మూలకాలను లోహాలు, అలోహాలుగా వర్గీకరిస్తే విద్యార్థి సాధించిన లక్ష్యం అవగాహన.
విద్యార్థి శాస్త్ర సంబంధ మ్యాగజైన్‌లను చదివిన అతను సాధించిన లక్ష్యం అభిరుచి.
విషయానికి, అభ్యాసకునికి మధ్య జరిగే పరస్పర ప్రతిచర్యను ఏమంటారు- అభ్యసనానుభవం.
సంకేతాలు పరోక్ష రకపు అనుభవాలు. ఉత్తమ లక్షణాన్ని వ్యక్తపరిచే స్థితిని వైఖరి అంటారు.
ప్రాక్టీస్ బిట్స్
1.విద్యా విధానంలో మార్గదర్శక సూత్రాలు?
ఎ) లక్ష్యాలు
బి) స్పష్టీకరణలు
సి) ఆశయాలు
డి) వైఖరులు
2.విశాల పరిధి, దృక్పథాన్ని కలిగి ఉండేవి?
ఎ) లక్ష్యాలు
బి) ఆశయాలు
సి) విలువలు
డి) స్పష్టీకరణలు
3.విద్యార్థుల అధ్యయనాన్ని నియంత్రించేవి?
ఎ) లక్ష్యాలు
బి) ఆశయాలు
సి) విలువలు
డి) ఎ, సి
4.బేసిక్ విద్యా విధానాన్ని ప్రతిపాదించినవారు?
ఎ) ఈశ్వరీభాయి పటేల్
బి) మహాత్మాగాంధీ
సి) కొఠారి కమిషన్
డి) మొదలియార్ కమిషన్
5. ఉద్దేశించిన ఆశయం దేన్ని చేరేందుకు ఉపకరిస్తుంది?
ఎ) గమ్యం
బి) లక్ష్యం
సి) స్పష్టీకరణ
డి) విద్యా ప్రణాళిక
6.లక్ష్యాలు లేకుంటే ఏ ప్రక్రియ నిరుపయోగమవుతుంది?
ఎ) బోధన
బి) అభ్యసన
సి) ఎ, బి
డి) అభ్యసన అనుభవం
7.కొఠారి కమిషన్‌ను ఏర్పాటు చేసిన సంవత్సరం?
ఎ) 1952
బి) 1960
సి) 1964
డి) 1988
8.జ్ఞానాత్మక రంగంలో మూడో లక్ష్యం?
ఎ) అవగాహన
బి) వినియోగం
సి) విశ్లేషణ
డి) మూల్యాంకనం
9. మానసిక చలనాత్మక రంగంలోని మొదటి లక్ష్యం?
ఎ) అనుకరణ
బి) హస్తలాఘవం
సి) సునిశితత్వం
డి) ఉచ్ఛారణ
10. విద్యార్థి సరైన సాక్ష్యాలు లేనప్పుడు తన నిర్ణయాన్ని నిలిపేస్తాడు అనే స్పష్టీకరణ లక్షణం?
ఎ) అవగాహన
బి) నైపుణ్యం
సి) అభిరుచి
డి) శాస్త్రీయ వైఖరి
11. ఒక విద్యార్థి కాపర్ సల్ఫేట్, పొటాషియం డైక్రోమేట్ వంటి రసాయనాలను గుర్తించిన అతను సాధించిన లక్ష్యం?
ఎ) జ్ఞానం
బి) అవగాహన
సి) వినియోగం
డి) నైపుణ్యం
12. ఒక విద్యార్థి సాంద్రత, సాపేక్ష సాంద్రతల మధ్య తేడాలను గుర్తించిన సాధించిన లక్ష్యం?
ఎ) జ్ఞానం
బి) అవగాహన
సి) వినియోగం
డి) నైపుణ్యం
13. గురుత్వ త్వరణాన్ని నిర్వచించగల విద్యార్థి సాధించిన లక్ష్యం?
ఎ) నైపుణ్యం
బి) జ్ఞానం
సి) అవగాహన
డి) కృత్యం
14. ఒక విద్యార్థి ఓమ్ నియమాన్ని నిరూపించే సర్క్యూట్ లో దోషాలను కనుగొన్నాడు..అతను సాధించిన లక్ష్యం?
ఎ) జ్ఞానం
బి) అవగాహన
సి) వినియోగం
డి) నైపుణ్యం
15. ప్రయోగానంతరం గ్రాఫ్‌లు గీసి, వివరాలను గ్రాఫ్ ద్వారా క్రోడీకరించిన విద్యార్థులు సాధించిన లక్ష్యం?
ఎ) జ్ఞానం
బి) అవగాహన
సి) అన్వయం
డి) అభిరుచి
16. విద్యార్థి జీవశాస్త్ర సంబంధ పదాలను, భావనలను, సిద్ధాంతాలను పోల్చి చూస్తాడు అనే స్పష్టీకరణకు లక్ష్యం?
ఎ) అన్వయం
బి) అభిరుచి
సి) జ్ఞానం
డి) అవగాహన
17.భావావేశ రంగంలో అత్యున్నత లక్ష్యం?
ఎ) ప్రతిస్పందించడం
బి) వ్యవస్థాపన
సి) విలువకట్టడం
డి) శీల స్థాపన
18. భావావేశ రంగంలో మూడో లక్ష్యం ఏమిటి?
ఎ) ప్రతిస్పందించటం
బి) వ్యవస్థాపన
సి) విలువ కట్టడం
డి) శీల స్థాపన
19. జ్ఞానాత్మకరంగంలోని అత్యున్నత లక్ష్యం ఏమిటి?
ఎ) అవగాహన
బి) విశ్లేషణ
సి) సంశ్లేషణ
డి) మూల్యాంకనం
20. భావావేశ రంగంలోని లక్ష్యాలు ఎన్ని?
ఎ) 5
బి) 4
సి) ఆరు
డి) ఏడు
21.‘వర్గీకరణ’ దేనికి సంబంధించిన స్పష్టీకరణ?
ఎ) జ్ఞానం
బి) నైపుణ్యం
సి) వినియోగం
డి) అవగాహన
సమాధానాలు
1) సి; 2) బి; 3) ఎ; 4) బి; 5) ఎ;
6) సి; 7) సి; 8) బి; 9) ఎ; 10) డి;
11) ఎ; 12) బి; 13) సి; 14) బి; 15) డి;
16) డి; 17) డి; 18) సి; 19) డి; 20) ఎ;
21) డి.