సాక్షి భవిత ఎడ్యుకేషన్ ఫెయిర్
తేదీలు: మే 28, 29
వేదిక: వైట్ హౌస్, కొత్తపేట,
దిల్సుఖ్నగర్, హైదరాబాద్
హైదరాబాద్: ఇంటర్మీడియెట్ అనంతరం ఎన్నో కోర్సులు.. ఇంజనీరింగ్ టు ఎకనామిక్స్... ఏరోనాటిక్స్ టు టెక్స్టైల్స్.. ఫిజియోథెరపీ నుంచి ఫ్యాషన్ అండ్ డిజైన్... అగ్రికల్చర్ టు లా- ఇలా ఎన్నో కోర్సులు!! ఇప్పుడు విద్యార్థి సెలక్ట్ చేసుకునే కోర్సు.. యావత్ భవిష్యత్‌ను నిర్దేశిస్తుంది. అందుకే టెన్త్, ఇంటర్ విద్యార్థులకు ఎంతో కీలకమైన ఈ సమయంలో.. సాక్షి భవిత ఎడ్యుకేషన్ ఫెయిర్ నిర్వహిస్తోంది. ఈ నెల 28, 29 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు జరిగే సాక్షి భవిత ఎడ్యుకేషన్ ఫెయిర్‌కు ప్రవేశం ఉచితం.
ఇప్పటికే ఎంసెట్ రాసి ర్యాంకులు సాధించిన విద్యార్థులు తమకు ఏ కాలేజీలో, ఏ బ్రాంచ్‌లో సీటు లభిస్తుందో తెలుసుకునే విధంగా మాక్ కౌన్సెలింగ్ సదుపాయం కూడా అందుబాటులో ఉంది. సాక్షి భవిత ఎడ్యుకేషన్ ఫెయిర్‌కు మెయిన్ స్పాన్సర్ విజ్ఞాన్ ఇంజనీరింగ్ కాలేజెస్, హైదరాబాద్, అసోసియేట్ స్పాన్సర్స్ వీఐటీ యూనివర్సిటీ, భారత్ ఇన్స్టిట్యూషన్స్. వివరాలకు సంప్రదించాల్సిన నంబర్లు 9912220375, 9951602991.