తెలుగు రాష్ట్రాల్లో తపాలా పోస్టులు : ఆంధ్రప్రదేశ్‌లో-1126 తెలంగాణలో -645
జాబ్ పాయింట్
Published Wed, Mar 29 2017 4:28 PM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM
తెలుగు రాష్ట్రాల్లో తపాలా పోస్టులు : ఆంధ్రప్రదేశ్‌లో-1126 తెలంగాణలో -645
తెలుగు రాష్ట్రాల్లో 1771 గ్రామీణ డాక్ సేవక్ పోస్టులకు పోస్టల్ శాఖ ప్రకటన విడుదల చేసింది. ఈ పోస్టుల్లో ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ తపాలా సర్కిళ్లలో 1126, తెలంగాణలోని వివిధ సర్కిళ్లలో 645 ఉన్నాయి.
పోస్టు పేరు: గ్రామీణ డాక్ సేవక్ (ప్యాకర్/బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ (బీపీఎం)/ఎండీ/ఎంసీ)
పోస్టుల సంఖ్య: 1771 (ఆంధ్రప్రదేశ్‌లో 1126, తెలంగాణలో 645)
► సర్కిళ్ల వారీ పోస్టుల సంఖ్య:
ఆంధ్రప్రదేశ్‌లో...
అనంతపురం –24, చిత్తూరు –10, వైఎస్సార్ కడప –65, హిందూపురం –42, కర్నూలు –68, నంద్యాల –42, ప్రొద్దుటూరు –32, తిరుపతి –57, భీమవరం –54, ఏలూరు–35, గుడివాడ –42, గూడూరు –23, గుంటూరు –16, మచిలీపట్నం –24, నరసరావుపేట –33, నెల్లూరు– 63, ప్రకాశం– 128, తాడేపల్లిగూడెం –22, తెనాలి–30, విజయవాడ–46, అమలాపురం –26, అనకాపల్లి –77, కాకినాడ –20, పార్వతీపురం –32, రాజమండ్రి –22, శ్రీకాకుళం –54, విశాఖపట్నం –3, విజయనగరం –36. వీటిలో అన్‌రిజర్వుడు –625, ఓబీసీ –284, ఎస్సీ –126, ఎస్టీ –91.
తెలంగాణలో ..
ఆదిలాబాద్ –48, హన్మకొండ –13, కరీంనగర్ –29, ఖమ్మం –97, మహబూబ్‌నగర్ –40, నల్గొండ –25, నిజామాబాద్ –67, పెద్దపల్లి –27, ఆర్‌ఎంఎస్ జెడ్ డివిజన్ –26, సూర్యాపేట –39, వనపర్తి –27, వరంగల్ –17, హైదరాబాద్ సిటీ –29, హైదరాబాద్ సార్టింగ్ డివిజన్ –66, హైదరాబాద్ సౌత్‌ఈస్ట్ –17, మెదక్ –20, సంగారెడ్డి –21, సికింద్రాబాద్ –37. వీటిలో అన్‌రిజర్వుడ్ 356, ఓబీసీ 151, ఎస్సీ –86, ఎస్టీ –52.
అర్హతలు: పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. మొదటి ప్రయత్నంలోనే ఉత్తీర్ణులైన వారికి ప్రాధాన్యం ఉంటుంది. ఉన్నత విద్య చదివినప్పటికీ దానికి ప్రత్యేక మార్కులేమీ ఉండవు. సైకిల్ వచ్చి ఉండాలి. గుర్తింపు పొందిన సంస్థలో కంప్యూటర్ కోర్సు చదివి ధ్రువపత్రం పొంది ఉండాలి. అభ్యర్థులు ఏ బ్రాంచ్ పరిధిలో పోస్టుకు ఎంపికవుతారో ఆ బ్రాంచ్ పరిధిలోని గ్రామంలోనే నెల వ్యవధిలోపు నివాసం ఏర్పాటు చేసుకోవాలి. బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ (బీపీఎం) పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ.25 వేలకు, రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులు రూ.10 వేలకు ఫెడిలిటీ గ్యారంటీ బాండ్ ఇవ్వాలి. ఉద్యోగానుభవాన్ని ఎంపికలో పరిగణించరు.
వయోపరిమితి: 18–40 ఏళ్ల లోపు ఉండాలి. రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనల మేర వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: రూ.100. అభ్యర్థులు ఏదేనీ పోస్టాఫీజులో ఫీజు చెల్లించి రసీదు నెంబర్‌ను పీఓ కౌంటర్‌లో తెలియజేయాలి. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.
దరఖాస్తు విధానం: అభ్యర్థులు www.indiapost.gov.in (or) www.appost.in/gdsonline వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: పదో తరగతి మార్కుల శాతాన్ని అనుసరించి మెరిట్ జాబితా ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తులు ప్రారంభం: మార్చి 18, 2017. చివరితేదీ: ఏప్రిల్ 19, 2017.
వెబ్‌సైట్స్: www.indiapost.gov.in (or) www.appost.in/gdsonline
► ఎస్‌బీఐలో 255ఉద్యోగాలు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తన పరిధిలోని వేర్వేరు శాఖల విభాగాల్లో 255 స్పెషలిస్ట్ క్యాడర్ పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేసేందుకు ప్రకటన విడుదల చేసింది.
పోస్టుల పేరు – ఖాళీలు: స్పెషలిస్ట్ హెడ్ –1, ప్రోడక్ట్స్, ఇన్వెస్ట్‌మెంట్స్ అండ్ రీసెర్చ్ హెడ్ –1, ఆపరేషన్స్ హెడ్ –1, మేనేజర్ (బిజినెస్ డెవలప్‌మెంట్) –1, మేనేజర్ (బిజినెస్ ప్రాసెస్) –1, సెంట్రల్ రీసెర్చ్ టీమ్ –4, అక్వైజిషన్ రిలేషన్‌షిప్ మేనేజర్ –21, రిలేషన్ షిప్ మేనేజర్ –120, రిలేషన్‌షిప్ మేనేజర్ (టీమ్ లీడ్) –15, ఇన్వెస్ట్‌మెంట్ కౌన్సిలర్ –25, కస్టమర్ రిలేషన్‌షిప్ ఎగ్జిక్యూటివ్ –65. వీటిలో కొన్ని విభాగాల్లోని పోస్టులను రిజర్వుడు కేటగిరీ అభ్యర్థులకు కేటాయించారు.
వయోపరిమితి: మార్చి 1, 2017 నాటికి స్పెషలిస్ట్ హెడ్, ఇన్వెస్ట్‌మెంట్స్ అండ్ రీసెర్చ్ హెడ్ అభ్యర్థులకు 40–52 ఏళ్లు, ఆపరేషన్స్ హెడ్ అభ్యర్థులకు 35–45, మేనేజర్ (బిజినెస్ డెవలప్‌మెంట్), మేనేజర్ (బిజినెస్ ప్రాసెస్), సెంట్రల్ రీసెర్చ్ టీమ్ అభ్యర్థులకు 30–40, అక్వైజిషన్ రిలేషన్‌షిప్ మేనేజర్ అభ్యర్థులకు 22–35, రిలేషన్‌షిప్ మేనేజర్, ఇన్వెస్ట్‌మెంట్ కౌన్సిలర్ అభ్యర్థులకు 23–35, రిలేషన్ షిప్ మేనేజర్ (టీమ్ లీడ్) అభ్యర్థులకు 25–40, కస్టమర్ రిలేషన్‌షిప్ ఎగ్జిక్యూటివ్ అభ్యర్థులకు 20–35 ఏళ్లు. రిజర్వ్ కేటగిరీ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంది.
అర్హతలు: అభ్యర్థులు ఆయా విభాగాల పోస్టు లను అనుసరించి ఎంబీఏ/పీజీడీఎం/డిగ్రీ/ పీజీ చేసి ఉండాలి. దీంతోపాటు నిబంధనల మేర ఉద్యోగానుభవం తప్పనిసరి.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.600. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.100. ఫీజు ఆన్‌లైన్ ద్వారా (డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/ఇంటర్నెట్ బ్యాంకింగ్) మాత్రమే చెల్లించాలి.
దరఖాస్తు విధానం: అభ్యర్థులు www.sbi.co.in/careers వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు నింపాలి. దానిని ప్రింటవుట్ తీసుకొని సంబంధిత ధ్రువపత్రాల నకళ్లు , ఫీజు రిసీప్ట్‌ను జతచేసి ఒక ఎన్వలప్ కవర్‌లో ఉంచి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ రిక్రూట్‌మెంట్ అండ్ ప్రమోషన్ డిపార్ట్‌మెంట్, కార్పొరేట్ సెంటర్, థర్డ్ ఫ్లోర్, అట్లాంటా బిల్డింగ్, నారీమన్ పాయింట్, ముంబై – 400021 చిరునామాకు గడువులోగా పంపాలి. దరఖాస్తు చేసే పోస్టు పేరును విధిగా కవర్ పైన రాయాలి.
ఎంపిక విధానం: మెరిట్ జాబితా, ఇంటర్వ్యూ వేతనం: అభ్యర్థుల విద్యార్హతలు, ఉద్యోగానుభవం అనుసరించి వేతనం నిర్ణయిస్తారు.
దరఖాస్తుల ప్రారంభం: మార్చి 24, 2017. ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లింపు, దరఖాస్తు చేసుకోవడానికి: ఏప్రిల్ 10, 2017.
పోస్టు ద్వారా హార్డ్ కాపీలు పంపడానికి: ఏప్రిల్ 13, 2017. మరిన్ని వివరాలకు వెబ్‌సైట్: www.sbi.co.in
► ఎన్‌ఐసీఎల్‌లో 205 ఉద్యోగాలు
నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్.. స్కేల్–1 ఆఫీసర్స్ కేడర్‌లో 205 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ (ఏవో) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
మొత్తం పోస్టులు: 205 (అన్ రిజర్వుడ్ – 113, ఎస్సీ –31, ఎస్టీ–16, ఓబీసీ – 45)
వేతన శ్రేణి: ప్రారంభంలో బేసిక్ పే రూ.32,975 (రూ,32795–1610 (14)–రూ.55335–1745 (4)–రూ.62315) ఉంటుంది. మెట్రోపాలిటన్ నగరాల్లో అన్ని అలవెన్సులు కలుపుకుని నెలకు దాదాపు రూ.51,000 వేతనం అందుతుంది.
అర్హతలు: ఏప్రిల్ 20, 2017 నాటికి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 60 శాతం (ఎస్సీ/ఎస్టీలకు 55 శాతం) మార్కులతో గ్రాడ్యుయేషన్/పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత.
వయోపరిమితి: మార్చి 1, 2017 నాటికి కనీసం 21 ఏళ్లు ఉండి 30 ఏళ్లు మించరాదు. అభ్యర్థులు మార్చి 2, 1987 కంటే ముందు, మార్చి 1, 1996 తర్వాత జన్మించి ఉండకూడదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ విధానంలో నిర్వహించే ప్రిలిమినరీ, మెయిన్స్ టెస్టులు, ఇంటర్వ్యూ ఆధారంగా.
మొదటి దశ... ప్రిలిమినరీ ఎగ్జామ్: దీన్ని 100 మార్కులకు ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. గంట (60 నిమిషాలు) వ్యవధిలో సమాధానాలు గుర్తించాలి. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటాయి. మూడు విబాగాల నుంచి ప్రశ్నలడుగుతారు. అవి.. ఇంగ్లిష్ లాంగ్వేజ్ (30 మార్కులు), రీజనింగ్ ఎబిలిటీ (35 మార్కులు), క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ (35 మార్కులు).
మెయిన్ ఎగ్జామినేషన్: ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులను ఒక్కో పోస్టుకు 15 మంది చొప్పున కేటగిరీలవారీగా మెయిన్ పరీక్షకు ఎంపిక చేస్తారు. ఇది మొత్తం 230 మార్కులకు ఉంటుంది. ఇందులో 200 మార్కులకు ఆబ్జెక్టివ్ టెస్ట్, 30 మార్కులకు డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉంటుంది. రెండు టెస్ట్‌లనూ ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్ టెస్ట్‌లో భాగంగా రీజనింగ్, ఇంగ్లిష్ లాంగ్వేజ్, జనరల్ అవేర్‌నెస్, కంప్యూటర్ నాలెడ్జ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌ల నుంచి 40 ప్రశ్నల చొప్పున అడుగుతారు. డిస్క్రిప్టివ్ టెస్ట్‌లో భాగంగా ఇంగ్లిష్ లాంగ్వేజ్ (ఎస్సే, ప్రెసిస్ అండ్ కాంప్రహెన్షన్) నుంచి మూడు ప్రశ్నలు అడుగుతారు. ఆబ్జెక్టివ్ టెస్ట్‌లో అభ్యర్థులు ప్రతి సెక్షన్‌లోనూ నిర్దేశిత మార్కులు సాధించాలి. వీరిని మాత్రమే డిస్క్రిప్టివ్ టెస్ట్‌కు అనుమతిస్తారు.
చివరి ఎంపిక ఇలా: ఆన్‌లైన్ మెయిన్ ఎగ్జామినేషన్ (ఆబ్జెక్టివ్ అండ్ డిస్క్రిప్టివ్ విభాగాలు), ఇంటర్వూ్యలకు 80:20 లెక్కన వెయిటేజీ ఇస్తారు. వీటి ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు రుసుం: జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.600 (ఇంటిమేషన్ ఛార్జీలు కలిపి) నెట్ బ్యాంకింగ్/క్రెడిట్ కార్డ్/డెబిట్ కార్డ్ ద్వారా చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు రూ.100 ఇంటిమేషన్ ఛార్జీ చెల్లిస్తే సరిపోతుంది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్/రంగారెడ్డి, వరంగల్, విజయవాడ, విశాఖపట్నం, ఒంగోలు.
► ముఖ్య తేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం: మార్చి 30, 2017 ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: ఏప్రిల్ 20, 2017
దరఖాస్తు ఫీజుల చెల్లింపు: మార్చి 30 – ఏప్రిల్ 20 వరకు మొదటి దశ ఆన్‌లైన్ పరీక్ష: జూన్ 3, 4, 2017
రెండో దశ ఆన్‌లైన్ పరీక్ష: జూలై 2, 2017 వెబ్‌సైట్: www.nationalinsuranceindia.com
► డీజీసీఏలో 24 పోస్టులు
భారత పౌర విమానయాన శాఖలోని డీజీసీఏ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) 24 పైలెట్ పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేసేందుకు ప్రకటన విడుదల చేసింది.
మొత్తం పోస్టులు: 24
పోస్టులు: ఏరోప్లేన్ విభాగంలో.. డిప్యూటీ చీఫ్ ఫ్లైట్ ఆపరేషన్స్ ఇన్‌స్పెక్టర్ –1, సీనియర్ ఫ్లైట్ ఆపరేషన్స్ ఇన్‌స్పెక్టర్స్–8, ఫ్లైట్ ఆపరేషన్స్ ఇన్‌స్పెక్టర్స్–14, హెలీకాఫ్టర్ విభాగంలో.. ఫ్లైట్ ఆపరేషన్స్ ఇన్‌స్పెక్టర్ –1
వయోపరిమితి: డిప్యూటీ చీఫ్ ఫ్లైట్ ఆపరేషన్స్ ఇన్‌స్పెక్టర్ – 55 ఏళ్లు, సీనియర్ ఫ్లైట్ ఆపరేషన్స్ ఇన్‌స్పెక్టర్– 50 ఏళ్లు, ఫ్లైట్ ఆపరేషన్స్ ఇన్‌స్పెక్టర్ (ఏరోప్లేన్/హెలీకాఫ్టర్)–40 ఏళ్లు మించరాదు. రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనల మేర వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అర్హతలు: డీజీసీఏ జారీ చేసిన ఎయిర్‌లైన్ ట్రాన్స్‌పోర్ట్ పైలెట్ లైసెన్స్, నిబంధనల మేర ఉద్యోగానుభవం.
వేతనం: ఆయా విభాగాల పోస్టులను అనుసరించి రూ.1,74,250 – 5,99,330
దరఖాస్తు విధానం: అభ్యర్థులు www.dgca.nic.in వెబ్‌సైట్ ద్వారా అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకొని పూర్తి వివరాలు నింపి ఓ కవర్‌లో ఉంచి రిక్రూట్‌మెంట్ సెల్, బి–బ్లాక్, రూమ్ నెం. బి–12, ఆపోజిట్ సఫ్దర్‌జంగ్ ఎయిర్‌పోర్ట్, అరబిందోమార్గ్, న్యూఢిల్లీ– 110003 చిరునామాకు గడువులోగా చేరేలా పంపాలి.
దరఖాస్తులకు చివరి తేది: ఏప్రిల్ 11, 2017. వెబ్‌సైట్: www.dgca.nic.in
► రైట్స్ లిమిటెడ్‌లో 16 పోస్టులు
మినీ రత్న పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ప్రైజెస్‌లోని ఆర్‌ఐటీఈఎస్ (రైట్స్) కాంట్రాక్ట్ పద్ధతిలో 16 ఇంజనీరింగ్ ప్రొఫెషనల్స్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
పోస్టు పేరు: ఇంజనీరింగ్ ప్రొఫెషనల్స్
మొత్తం పోస్టులు: 16
విభాగాల వారీ ఖాళీలు: ఇంజనీర్ (సివిల్)–4, టెక్నికల్ అసిస్టెంట్ (సివిల్) –3, క్యాడ్ ఆపరేటర్ (సివిల్)–9.
వయోపరిమితి: మార్చి 1, 2017 నాటికి 32 ఏళ్లు.
అర్హతలు: డిగ్రీ/డిప్లొమా (సివిల్ ఇంజనీరింగ్), ఎంటెక్ (సాయిల్ మెకానిక్స్). జనరల్ అభ్యర్థులు ఫస్ట్‌క్లాస్‌లో పాసై ఉండాలి. రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకు మార్కుల శాతంలో సడలింపు ఉంటుంది. దీంతోపాటు ఆయా పోస్టులను బట్టి నిబంధనల మేరకు ఉద్యోగానుభవం తప్పనిసరి.
వేతనం: ఇంజనీర్ (సివిల్) రూ.16,974, టెక్నికల్ అసిస్టెంట్ (సివిల్) రూ.11,670, క్యాడ్ ఆపరేటర్ రూ.10,344
దరఖాస్తు ఫీజు: లేదు
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా టజ్టీ్ఛటl్టఛీ.ఛిౌఝలో అప్లికేషన్‌ను పూర్తిచేసి ప్రింట్‌అవుట్ తీసుకోవాలి. దానికి అభ్యర్థుల విద్యార్హతలు, తదితర ధ్రువపత్రాల నకళ్లను అటెస్టేషన్ చేయించి జత చేయాలి. వీటిని అసిస్టెంట్ మేనేజర్ (పీ) /ఆర్‌ఈసీటీటీ, రైట్స్ లిమిటెడ్, రైట్స్ భవన్, ప్లాట్ నెం.1, సెక్షన్ –29, గుర్గావ్ –122001, హరియాణా చిరునామాకు పోస్టు ద్వారా పంపాలి.
ఎంపిక విధానం: దరఖాస్తుల పరిశీలన అనంతరం ఎంపికైన అభ్యర్థులకు రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఉంటుంది.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: ఏప్రిల్ 9, 2017. పోస్టు ద్వారా హార్డ్ కాపీలు పంపడానికి: ఏప్రిల్ 20, 2017.
వెబ్‌సైట్: ritesltd.com
Advertisement