rites
-
తండ్రి కన్నుమూత, కన్నీరుమున్నీరైన గాయకుడు (ఫోటోలు)
-
ఫ్రాన్స్ చేతిలో చిత్తు.. బ్రస్సెల్స్‌లో మొరాకో అభిమానుల విధ్వంసం
ఫిఫా ప్రపంచకప్-2022లో డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్ తన జైత్ర యాత్రను కొనసాగిస్తోంది. ఖతర్ వేదికగా జరిగిన రెండో సెమీఫైనల్లో మొరాకోను చిత్తు చేసిన ఫ్రాన్స్.. వరుసగా రెండో సారి ఫైనల్‌కు చేరుకుంది. ఇక నాకౌట్ దశలో అదరగొట్టిన మొరాకో.. కీలకమైన సెమీఫైనల్లో మాత్రం చేతులేత్తేసింది. 0-2 తేడాతో ఓటమిపాలైన మొరాకో ఈ మెగా ఈవెంట్ నుంచి ఇంటిముఖం పట్టింది. బ్రస్సెల్స్‌లో అల్లర్లు.. కాగా మొరాకో ఓటమిని ఆ దేశ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో మొరాకో అభిమానులు బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌లో విధ్వంసం సృష్టించారు. సుమారు 100 మంది ఫ్యాన్స్ బ్రస్సెల్స్ సౌత్ స్టేషన్ సమీపంలో పోలీసులపై బాణాసంచాలను విసిరారు. అదే విధంగా వీధుల్లో ఉన్న షాప్‌లకు నిప్పు అంటించారు. ఈ ఘటనతో అప్రమత్తమైన పోలీసులు వారిని చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు. ఈ అల్లర్లకు కారణమైన చాలా మంది అభిమానలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, భారీ నష్టం ఏమీ జరగలేదని రాయిటర్స్ పేర్కొంది. చదవండి: FIFA WC:సెమీస్‌లో అదరగొట్టిన ఫ్రాన్స్.. రికార్డులు బ్రేక్ చేస్తూ విజయం 🚨🇫🇷 Breaking: Moroccans start attacking French people celebrating their country's victory in Paris, France. pic.twitter.com/k19wvVeD5J — Terror Alarm (@Terror_Alarm) December 14, 2022 -
అమ్మకానికి కోల్ ఇండియా వాటాలు, కేంద్రం మరో కీలక నిర్ణయం?
రష్యా - ఉక్రెయిన్ యుద్ధంతో కేంద్రానికి దిగుమతుల ఖర్చు, రాయితీల భారం పెరిగిపోయిన విషయం తెలిసిందే. అయితే పలు కేంద్ర ప్రభుత్వ సంస్థలకు చెందిన వాటాల్ని అమ్మగా వచ్చిన మొత్తంతో వాటిని సర్ధు బాటు చేసేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో కోల్ ఇండియా, హిందుస్తాన్ జింక్, రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్ సంస్థలకు చెందిన 5 నుంచి 10 శాతం వాటాను విక్రయించనుందని, వాటిలో కొన్ని షేర్లని ఆఫర్ ఫర్ సేల్ మెకానిజం ద్వారా సేల్ చేయనున్నట్లు బ్లూమ్‌బెర్గ్ నివేదిక తెలిపింది.అమ్మే ఈ కొద్ది మొత్తం వాటాతో సంబంధిత సంస్థల షేర్లు లాభాల్లో పయనించడంతో పాటు ఫైనాన్షియల్ ఇయర్ చివరి త్రైమాసికం సమయానికి ఆర్ధికంగా వృద్ధి సాధించ వచ్చని కేంద్రం భావిస్తున్నట్లు బ్లూమ్ బెర్గ్ నివేదిక పేర్కొంది. 16500 కోట్లు ఇక ప్రభుత్వ రంగం సంస్థల్లోని వాటాల్ని అమ్మగా రూ.16500 కోట్లు సమకూరున్నట్లు సమాచారం. ఇప్పటికే వాటాల విక్రయాలపై కేంద్రం కేబినెట్ ఈ ఏడాది మేలో ఆమోదం తెలపగా..వాటాల విక్రయాన్ని వేగ వంతం చేస్తోంది. ఆఫర్ ఫర్ సేల్ డిజ్‌ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్‌లో భాగంగా కోల్ ఇండియా,ఎన్టీపీసీ, హిందుస్తాన్ జింక్, రైల్ ఇండియా టెక్నికల్ అండ్, ఎకనామిక్స్ సర్వీస్ లిమిటెడ్ (ఆర్ఐటీఈఎస్) వాటాల్ని ఆఫర్ ఫల్ సేల్కు పెట్టనుంది. 10-20శాతం వాటాల విక్రయం పలు నివేదికల ప్రకారం.. రాష్ట్రియ కెమికల్స్ ఫర్టిలైజర్స్, నేషనల్ ఫర్టిలైజర్స్ సంస్థల వాటాల్ని 10 నుంచి 20 శాతం వరకు అమ్మనున్నట్లు సమాచారం. టార్గెట్ రూ.65 వేల కోట్లు పెట్టుబడుల ఉపసంహరణ (డిజ్ఇన్వెస్ట్మెంట్) ద్వారా 2023-2024 సమయానికి మొత్తం రూ.65వేల కోట్లను సేకరించేలా కేంద్రం ప్రణాళికల్ని సిద్ధం చేసుకుంది. ప్రస్తుతం ఫైనాన్షియల్ ఇయర్లో డిజ్ఇన్వెస్ట్మెంట్ ద్వారా మొత్తం రూ.24వేల కోట్లు సమకూరినట్లు డిపార్ట్ మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ (దీపం)వెబ్సైట్ పేర్కొంది. అనిల్ అగర్వాల్ చేతిలో 2002లో నాటి కేంద్ర ప్రభుత్వం హిందుస్తాన్ జింక్ 26 శాతం వాటాని వేదాంత గ్రూప్ ఛైర్మన్ అనిల్ అగర్వాల్‌కు విక్రయించింది. ఆ తర్వాత అదే సంస్థకు చెందిన భారీ మొత్తంలో వాటాను కొనుగోలు చేశారు. ఆ మొత్తం వాటా కలిపి 64.92శాతంగా ఉంది. -
రిసెప్షనిస్టు హత్య కేసు: అంత్యక్రియలకు ససేమిరా! అంటున్న తల్లిదండ్రులు
Receptionist Murder Case:ఉత్తరాఖండ్‌లోని 19 ఏళ్ల యువతి రిసెప్షనిస్ట్ అంకితా భండారి హత్య కేసు పెద్ద కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ హ్యత కేసులో బీజీపీ నేత వినోద్ ఆర్య కొడుకు పుల్కిత్ ఆర్య నిందితుడిగా గుర్తించి అరెస్టు చేశారు కూడా. ఆ తర్వాత బాధితురాలి మృతదేహాన్ని పోలీసులు శనివారం చిల్లా కాలువా నుంచి స్వాధీనం చేసుకున్నారు. అంతేగాదు ఈ కేసుకి సంబంధించి ఆమె వాట్సాప్ చాట్లపై పోలీసులు సమగ్ర దర్యాప్తు చేపడుతున్నారు. ఇదిలా ఉండగా అంకితా కుటుంబసభ్యులు ఆమె అంత్యక్రియలు నిర్వాహించేందుకు నిరాకరించారు. ఆమె పోస్ట్‌మార్టం రిపోర్టు అప్పగించిన తర్వాత అంత్యక్రియలు నిర్వహిస్తామని పట్టుబట్టారు. ఐతే నిందితుల ఇలాంటి తప్పలు చేసేందుకు భయపడేలా వారి రిసార్టును కూల్చివేయాల్సిందిగా సీఎం ధామీ పుష్కర్ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఐతే ఈ విషయమై అంకితా తండ్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రిసార్ట్ కూల్చివేతతో కీలక ఆధారాలు మాయమవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన ఇలా ఎందుకు చేశారంటూ...ఉత్తరాఖండ్ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ మేరకు డీఐజీ మాట్లాడుతూ...రిసార్ట్‌లో పని చేస్తున్న ప్రతి ఉద్యోగిని విచారించాం. ప్రతి ఒక్కరి నుంచి వాగ్మూలం తీసుకుంటున్నాం. రిసార్ట్ నేపథ్యంపై కూడా దర్యాప్తు చేస్తున్నాం. అలాగే వెలుగులోకి వచ్చిన సదరు బాధితురాలు అంకితా భండారీ వాట్సాప్‌లను కూడా పరీశీలిస్తున్నాం. అయినా మాకు ఇంకా పోస్ట్‌మార్టం నివేదిక అందలేదు. తొందరలోనే అందే అవకాశం ఉందని ఆశిస్తున్నాం. అని అన్నారు. అయితే అంకితా కుటుంబీకులు మాత్రం అంత్యక్రియలు చేసేదే లేదని తెగేసి చెబుతున్నారు. అంతేగాదు ఈ కేసును ఫాస్ట్‌ట్రాక్ కోర్టు విచారించాలని, నిందితులకు ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేశారు. (చదవండి: రిసెప్షనిస్ట్ హత్య కేసులో కీలక విషయాలు..) -
రైట్స్ బైబ్యాక్‌కు.. రైట్‌రైట్
సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్)కు ప్రభుత్వ రంగ కంపెనీ.. రైట్స్(RITES) లిమిటెడ్ బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. బైబ్యాక్‌లో భాగంగా రూ. 265 ధర మించకుండా 9.69 మిలియన్ ఈక్విటీ షేర్లను కొనుగోలు చేయనుంది. ఇందుకు రూ. 257 కోట్లను వెచ్చించనున్నట్లు మినీరత్న కంపెనీ రైట్స్ తాజాగా వెల్లడించింది. 2018 జులైలో లిస్టయిన ఈ పీఎస్యూలో కేంద్ర ప్రభుత్వానికి ప్రస్తుతం 72 శాతానికిపైగా వాటా ఉంది. కంపెనీ ఆర్థికంగా పటిష్ట స్థితిలో ఉన్నట్లు రైట్స్ చైర్మన్, ఎండీ రాజీవ్ మెహ్రోత్రా తెలియజేశారు. అంతేకాకుండా రుణరహిత కంపెనీ కావడంతో ఈక్విటీ షేర్ల బైబ్యాక్‌కు తెరతీసినట్లు వివరించారు. ఇది కంపెనీ వృద్ధి అవకాశాలు, పటిష్టతపట్ల యాజమాన్యానికున్న నమ్మకానికి నిదర్శనమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. కాగా.. బైబ్యాక్‌కు ఈ నెల 30 రికార్డ్ డేట్‌గా బోర్డు నిర్ణయించినట్లు వెల్లడించారు. కాగా.. శుక్రవారం ఎన్ఎస్ఈలో రైట్స్ షేరు 0.8 శాతం పుంజుకుని రూ. 255 వద్ద స్థిరపడింది. ఎంఆర్‌పీఎల్ వారాంతాన జరిగిన వార్షిక సమావేశంలో భాగంగా రూ. 5,000 కోట్లవరకూ నిధుల సమీకరణకు బోర్డు అనుమతించినట్లు మంగళూరు రిఫైనరీ పెట్రోకెమికల్స్(ఎంఆర్‌పీఎల్) తెలియజేసింది. ఇందుకు వీలుగా మార్పిడికి వీలుకాని డిబెంచర్లు(ఎన్సీడీలు), బాండ్లు తదితరాల జారీని చేపట్టే వీలున్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో ఎంఆర్‌పీఎల్ షేరు ఎన్ఎస్ఈలో శుక్రవారం దాదాపు యథాతథంగా రూ. 29 వద్ద ముగిసింది. -
20 నుంచి రీట్స్ ఐపీఓ
న్యూఢిల్లీ: రైల్వే ఇంజినీరింగ్, లాజిస్టిక్స్ కన్సల్టెన్సీ సంస్థ, రీట్స్ ఐపీఓ ఈ నెల 20న మొదలవుతోంది. ఈ ఏడాది ఐపీఓకు వస్తున్న తొలి ప్రభుత్వ రంగ సంస్థ ఇదే. ఈ నెల 22న ముగిసే ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.460 కోట్లు సమీకరిస్తుందని అంచనా. ఈ ఐపీఓకు రూ.180–185 ధరల శ్రేణిని నిర్ణయించారు. ఐపీఓలో భాగంగా 12% వాటాకు సమానమైన 2.52 కోట్ల షేర్లను విక్రయిస్తారు. వీటిల్లో 12 లక్షల షేర్లను ఉద్యోగులకు రిజర్వ్ చేశారు. కనీసం 80 షేర్లకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. వచ్చే నెల 2న ఈ షేర్లు స్టాక్ ఎక్సే్చంజ్‌ల్లో లిస్ట్ అయ్యే అవకాశాలున్నాయి. ఉద్యోగులకు, రిటైల్ ఇన్వెస్టర్లకు ఇష్యూ ధరలో రూ.6 డిస్కౌంట్ లభిస్తుంది. త్వరలో రైల్ వికాస్ నిగమ్ ఐపీఓ ఈ ఐపీఓ తర్వాత రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ ఐపీఓకు రానుంది. ఈ ఐపీఓ ద్వారా కంపెనీ రూ.500 కోట్ల మేర నిధులు సమీకరించే అవకాశాలున్నాయి. ఇక జూలై–సెప్టెంబర్ క్వార్టర్లో ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్ప్, ఇర్కాన్ ఇంటర్నేషనల్ ఐపీఓకు రానున్నాయి. ఇండియన్ రైల్వే ఫైనాన్స్ రూ.1,000 కోట్లు, ఇర్కాన్ రూ.500 కోట్లు సమీకరిస్తాయని అంచనా. -
జాబ్ పాయింట్
తెలుగు రాష్ట్రాల్లో తపాలా పోస్టులు : ఆంధ్రప్రదేశ్‌లో-1126 తెలంగాణలో -645 తెలుగు రాష్ట్రాల్లో 1771 గ్రామీణ డాక్ సేవక్ పోస్టులకు పోస్టల్ శాఖ ప్రకటన విడుదల చేసింది. ఈ పోస్టుల్లో ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ తపాలా సర్కిళ్లలో 1126, తెలంగాణలోని వివిధ సర్కిళ్లలో 645 ఉన్నాయి. పోస్టు పేరు: గ్రామీణ డాక్ సేవక్ (ప్యాకర్/బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ (బీపీఎం)/ఎండీ/ఎంసీ) పోస్టుల సంఖ్య: 1771 (ఆంధ్రప్రదేశ్‌లో 1126, తెలంగాణలో 645) ► సర్కిళ్ల వారీ పోస్టుల సంఖ్య: ఆంధ్రప్రదేశ్‌లో... అనంతపురం –24, చిత్తూరు –10, వైఎస్సార్ కడప –65, హిందూపురం –42, కర్నూలు –68, నంద్యాల –42, ప్రొద్దుటూరు –32, తిరుపతి –57, భీమవరం –54, ఏలూరు–35, గుడివాడ –42, గూడూరు –23, గుంటూరు –16, మచిలీపట్నం –24, నరసరావుపేట –33, నెల్లూరు– 63, ప్రకాశం– 128, తాడేపల్లిగూడెం –22, తెనాలి–30, విజయవాడ–46, అమలాపురం –26, అనకాపల్లి –77, కాకినాడ –20, పార్వతీపురం –32, రాజమండ్రి –22, శ్రీకాకుళం –54, విశాఖపట్నం –3, విజయనగరం –36. వీటిలో అన్‌రిజర్వుడు –625, ఓబీసీ –284, ఎస్సీ –126, ఎస్టీ –91. తెలంగాణలో .. ఆదిలాబాద్ –48, హన్మకొండ –13, కరీంనగర్ –29, ఖమ్మం –97, మహబూబ్‌నగర్ –40, నల్గొండ –25, నిజామాబాద్ –67, పెద్దపల్లి –27, ఆర్ఎంఎస్ జెడ్ డివిజన్ –26, సూర్యాపేట –39, వనపర్తి –27, వరంగల్ –17, హైదరాబాద్ సిటీ –29, హైదరాబాద్ సార్టింగ్ డివిజన్ –66, హైదరాబాద్ సౌత్ఈస్ట్ –17, మెదక్ –20, సంగారెడ్డి –21, సికింద్రాబాద్ –37. వీటిలో అన్‌రిజర్వుడ్ 356, ఓబీసీ 151, ఎస్సీ –86, ఎస్టీ –52. అర్హతలు: పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. మొదటి ప్రయత్నంలోనే ఉత్తీర్ణులైన వారికి ప్రాధాన్యం ఉంటుంది. ఉన్నత విద్య చదివినప్పటికీ దానికి ప్రత్యేక మార్కులేమీ ఉండవు. సైకిల్ వచ్చి ఉండాలి. గుర్తింపు పొందిన సంస్థలో కంప్యూటర్ కోర్సు చదివి ధ్రువపత్రం పొంది ఉండాలి. అభ్యర్థులు ఏ బ్రాంచ్ పరిధిలో పోస్టుకు ఎంపికవుతారో ఆ బ్రాంచ్ పరిధిలోని గ్రామంలోనే నెల వ్యవధిలోపు నివాసం ఏర్పాటు చేసుకోవాలి. బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ (బీపీఎం) పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ.25 వేలకు, రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులు రూ.10 వేలకు ఫెడిలిటీ గ్యారంటీ బాండ్ ఇవ్వాలి. ఉద్యోగానుభవాన్ని ఎంపికలో పరిగణించరు. వయోపరిమితి: 18–40 ఏళ్ల లోపు ఉండాలి. రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనల మేర వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. దరఖాస్తు ఫీజు: రూ.100. అభ్యర్థులు ఏదేనీ పోస్టాఫీజులో ఫీజు చెల్లించి రసీదు నెంబర్‌ను పీఓ కౌంటర్లో తెలియజేయాలి. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. దరఖాస్తు విధానం: అభ్యర్థులు www.indiapost.gov.in (or) www.appost.in/gdsonline వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఎంపిక విధానం: పదో తరగతి మార్కుల శాతాన్ని అనుసరించి మెరిట్ జాబితా ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తులు ప్రారంభం: మార్చి 18, 2017. చివరితేదీ: ఏప్రిల్ 19, 2017. వెబ్‌సైట్స్: www.indiapost.gov.in (or) www.appost.in/gdsonline ► ఎస్బీఐలో 255ఉద్యోగాలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తన పరిధిలోని వేర్వేరు శాఖల విభాగాల్లో 255 స్పెషలిస్ట్ క్యాడర్ పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేసేందుకు ప్రకటన విడుదల చేసింది. పోస్టుల పేరు – ఖాళీలు: స్పెషలిస్ట్ హెడ్ –1, ప్రోడక్ట్స్, ఇన్వెస్ట్మెంట్స్ అండ్ రీసెర్చ్ హెడ్ –1, ఆపరేషన్స్ హెడ్ –1, మేనేజర్ (బిజినెస్ డెవలప్మెంట్) –1, మేనేజర్ (బిజినెస్ ప్రాసెస్) –1, సెంట్రల్ రీసెర్చ్ టీమ్ –4, అక్వైజిషన్ రిలేషన్షిప్ మేనేజర్ –21, రిలేషన్ షిప్ మేనేజర్ –120, రిలేషన్షిప్ మేనేజర్ (టీమ్ లీడ్) –15, ఇన్వెస్ట్మెంట్ కౌన్సిలర్ –25, కస్టమర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ –65. వీటిలో కొన్ని విభాగాల్లోని పోస్టులను రిజర్వుడు కేటగిరీ అభ్యర్థులకు కేటాయించారు. వయోపరిమితి: మార్చి 1, 2017 నాటికి స్పెషలిస్ట్ హెడ్, ఇన్వెస్ట్మెంట్స్ అండ్ రీసెర్చ్ హెడ్ అభ్యర్థులకు 40–52 ఏళ్లు, ఆపరేషన్స్ హెడ్ అభ్యర్థులకు 35–45, మేనేజర్ (బిజినెస్ డెవలప్మెంట్), మేనేజర్ (బిజినెస్ ప్రాసెస్), సెంట్రల్ రీసెర్చ్ టీమ్ అభ్యర్థులకు 30–40, అక్వైజిషన్ రిలేషన్షిప్ మేనేజర్ అభ్యర్థులకు 22–35, రిలేషన్షిప్ మేనేజర్, ఇన్వెస్ట్మెంట్ కౌన్సిలర్ అభ్యర్థులకు 23–35, రిలేషన్ షిప్ మేనేజర్ (టీమ్ లీడ్) అభ్యర్థులకు 25–40, కస్టమర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ అభ్యర్థులకు 20–35 ఏళ్లు. రిజర్వ్ కేటగిరీ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంది. అర్హతలు: అభ్యర్థులు ఆయా విభాగాల పోస్టు లను అనుసరించి ఎంబీఏ/పీజీడీఎం/డిగ్రీ/ పీజీ చేసి ఉండాలి. దీంతోపాటు నిబంధనల మేర ఉద్యోగానుభవం తప్పనిసరి. దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.600. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.100. ఫీజు ఆన్లైన్ ద్వారా (డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/ఇంటర్నెట్ బ్యాంకింగ్) మాత్రమే చెల్లించాలి. దరఖాస్తు విధానం: అభ్యర్థులు www.sbi.co.in/careers వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు నింపాలి. దానిని ప్రింటవుట్ తీసుకొని సంబంధిత ధ్రువపత్రాల నకళ్లు , ఫీజు రిసీప్ట్‌ను జతచేసి ఒక ఎన్వలప్ కవర్లో ఉంచి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ రిక్రూట్మెంట్ అండ్ ప్రమోషన్ డిపార్ట్మెంట్, కార్పొరేట్ సెంటర్, థర్డ్ ఫ్లోర్, అట్లాంటా బిల్డింగ్, నారీమన్ పాయింట్, ముంబై – 400021 చిరునామాకు గడువులోగా పంపాలి. దరఖాస్తు చేసే పోస్టు పేరును విధిగా కవర్ పైన రాయాలి. ఎంపిక విధానం: మెరిట్ జాబితా, ఇంటర్వ్యూ వేతనం: అభ్యర్థుల విద్యార్హతలు, ఉద్యోగానుభవం అనుసరించి వేతనం నిర్ణయిస్తారు. దరఖాస్తుల ప్రారంభం: మార్చి 24, 2017. ఆన్లైన్లో ఫీజు చెల్లింపు, దరఖాస్తు చేసుకోవడానికి: ఏప్రిల్ 10, 2017. పోస్టు ద్వారా హార్డ్ కాపీలు పంపడానికి: ఏప్రిల్ 13, 2017. మరిన్ని వివరాలకు వెబ్సైట్: www.sbi.co.in ► ఎన్ఐసీఎల్లో 205 ఉద్యోగాలు నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్.. స్కేల్–1 ఆఫీసర్స్ కేడర్‌లో 205 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ (ఏవో) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టులు: 205 (అన్ రిజర్వుడ్ – 113, ఎస్సీ –31, ఎస్టీ–16, ఓబీసీ – 45) వేతన శ్రేణి: ప్రారంభంలో బేసిక్ పే రూ.32,975 (రూ,32795–1610 (14)–రూ.55335–1745 (4)–రూ.62315) ఉంటుంది. మెట్రోపాలిటన్ నగరాల్లో అన్ని అలవెన్సులు కలుపుకుని నెలకు దాదాపు రూ.51,000 వేతనం అందుతుంది. అర్హతలు: ఏప్రిల్ 20, 2017 నాటికి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 60 శాతం (ఎస్సీ/ఎస్టీలకు 55 శాతం) మార్కులతో గ్రాడ్యుయేషన్/పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత. వయోపరిమితి: మార్చి 1, 2017 నాటికి కనీసం 21 ఏళ్లు ఉండి 30 ఏళ్లు మించరాదు. అభ్యర్థులు మార్చి 2, 1987 కంటే ముందు, మార్చి 1, 1996 తర్వాత జన్మించి ఉండకూడదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు సడలింపు ఉంటుంది. ఎంపిక విధానం: ఆన్లైన్ విధానంలో నిర్వహించే ప్రిలిమినరీ, మెయిన్స్ టెస్టులు, ఇంటర్వ్యూ ఆధారంగా. మొదటి దశ... ప్రిలిమినరీ ఎగ్జామ్: దీన్ని 100 మార్కులకు ఆన్లైన్లో నిర్వహిస్తారు. గంట (60 నిమిషాలు) వ్యవధిలో సమాధానాలు గుర్తించాలి. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటాయి. మూడు విబాగాల నుంచి ప్రశ్నలడుగుతారు. అవి.. ఇంగ్లిష్ లాంగ్వేజ్ (30 మార్కులు), రీజనింగ్ ఎబిలిటీ (35 మార్కులు), క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ (35 మార్కులు). మెయిన్ ఎగ్జామినేషన్: ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులను ఒక్కో పోస్టుకు 15 మంది చొప్పున కేటగిరీలవారీగా మెయిన్ పరీక్షకు ఎంపిక చేస్తారు. ఇది మొత్తం 230 మార్కులకు ఉంటుంది. ఇందులో 200 మార్కులకు ఆబ్జెక్టివ్ టెస్ట్, 30 మార్కులకు డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉంటుంది. రెండు టెస్ట్‌లనూ ఆన్లైన్లోనే నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్ టెస్ట్‌లో భాగంగా రీజనింగ్, ఇంగ్లిష్ లాంగ్వేజ్, జనరల్ అవేర్నెస్, కంప్యూటర్ నాలెడ్జ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌ల నుంచి 40 ప్రశ్నల చొప్పున అడుగుతారు. డిస్క్రిప్టివ్ టెస్ట్‌లో భాగంగా ఇంగ్లిష్ లాంగ్వేజ్ (ఎస్సే, ప్రెసిస్ అండ్ కాంప్రహెన్షన్) నుంచి మూడు ప్రశ్నలు అడుగుతారు. ఆబ్జెక్టివ్ టెస్ట్‌లో అభ్యర్థులు ప్రతి సెక్షన్‌లోనూ నిర్దేశిత మార్కులు సాధించాలి. వీరిని మాత్రమే డిస్క్రిప్టివ్ టెస్ట్‌కు అనుమతిస్తారు. చివరి ఎంపిక ఇలా: ఆన్లైన్ మెయిన్ ఎగ్జామినేషన్ (ఆబ్జెక్టివ్ అండ్ డిస్క్రిప్టివ్ విభాగాలు), ఇంటర్వూ్యలకు 80:20 లెక్కన వెయిటేజీ ఇస్తారు. వీటి ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం: ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు రుసుం: జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.600 (ఇంటిమేషన్ ఛార్జీలు కలిపి) నెట్ బ్యాంకింగ్/క్రెడిట్ కార్డ్/డెబిట్ కార్డ్ ద్వారా చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు రూ.100 ఇంటిమేషన్ ఛార్జీ చెల్లిస్తే సరిపోతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్/రంగారెడ్డి, వరంగల్, విజయవాడ, విశాఖపట్నం, ఒంగోలు. ► ముఖ్య తేదీలు: ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభం: మార్చి 30, 2017 ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: ఏప్రిల్ 20, 2017 దరఖాస్తు ఫీజుల చెల్లింపు: మార్చి 30 – ఏప్రిల్ 20 వరకు మొదటి దశ ఆన్లైన్ పరీక్ష: జూన్ 3, 4, 2017 రెండో దశ ఆన్లైన్ పరీక్ష: జూలై 2, 2017 వెబ్సైట్: www.nationalinsuranceindia.com ► డీజీసీఏలో 24 పోస్టులు భారత పౌర విమానయాన శాఖలోని డీజీసీఏ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) 24 పైలెట్ పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేసేందుకు ప్రకటన విడుదల చేసింది. మొత్తం పోస్టులు: 24 పోస్టులు: ఏరోప్లేన్ విభాగంలో.. డిప్యూటీ చీఫ్ ఫ్లైట్ ఆపరేషన్స్ ఇన్స్పెక్టర్ –1, సీనియర్ ఫ్లైట్ ఆపరేషన్స్ ఇన్స్పెక్టర్స్–8, ఫ్లైట్ ఆపరేషన్స్ ఇన్స్పెక్టర్స్–14, హెలీకాఫ్టర్ విభాగంలో.. ఫ్లైట్ ఆపరేషన్స్ ఇన్స్పెక్టర్ –1 వయోపరిమితి: డిప్యూటీ చీఫ్ ఫ్లైట్ ఆపరేషన్స్ ఇన్స్పెక్టర్ – 55 ఏళ్లు, సీనియర్ ఫ్లైట్ ఆపరేషన్స్ ఇన్స్పెక్టర్– 50 ఏళ్లు, ఫ్లైట్ ఆపరేషన్స్ ఇన్స్పెక్టర్ (ఏరోప్లేన్/హెలీకాఫ్టర్)–40 ఏళ్లు మించరాదు. రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనల మేర వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. అర్హతలు: డీజీసీఏ జారీ చేసిన ఎయిర్‌లైన్ ట్రాన్స్పోర్ట్ పైలెట్ లైసెన్స్, నిబంధనల మేర ఉద్యోగానుభవం. వేతనం: ఆయా విభాగాల పోస్టులను అనుసరించి రూ.1,74,250 – 5,99,330 దరఖాస్తు విధానం: అభ్యర్థులు www.dgca.nic.in వెబ్సైట్ ద్వారా అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని పూర్తి వివరాలు నింపి ఓ కవర్లో ఉంచి రిక్రూట్మెంట్ సెల్, బి–బ్లాక్, రూమ్ నెం. బి–12, ఆపోజిట్ సఫ్దర్‌జంగ్ ఎయిర్పోర్ట్, అరబిందోమార్గ్, న్యూఢిల్లీ– 110003 చిరునామాకు గడువులోగా చేరేలా పంపాలి. దరఖాస్తులకు చివరి తేది: ఏప్రిల్ 11, 2017. వెబ్సైట్: www.dgca.nic.in ► రైట్స్ లిమిటెడ్‌లో 16 పోస్టులు మినీ రత్న పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ప్రైజెస్‌లోని ఆర్ఐటీఈఎస్ (రైట్స్) కాంట్రాక్ట్ పద్ధతిలో 16 ఇంజనీరింగ్ ప్రొఫెషనల్స్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. పోస్టు పేరు: ఇంజనీరింగ్ ప్రొఫెషనల్స్ మొత్తం పోస్టులు: 16 విభాగాల వారీ ఖాళీలు: ఇంజనీర్ (సివిల్)–4, టెక్నికల్ అసిస్టెంట్ (సివిల్) –3, క్యాడ్ ఆపరేటర్ (సివిల్)–9. వయోపరిమితి: మార్చి 1, 2017 నాటికి 32 ఏళ్లు. అర్హతలు: డిగ్రీ/డిప్లొమా (సివిల్ ఇంజనీరింగ్), ఎంటెక్ (సాయిల్ మెకానిక్స్). జనరల్ అభ్యర్థులు ఫస్ట్‌క్లాస్‌లో పాసై ఉండాలి. రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకు మార్కుల శాతంలో సడలింపు ఉంటుంది. దీంతోపాటు ఆయా పోస్టులను బట్టి నిబంధనల మేరకు ఉద్యోగానుభవం తప్పనిసరి. వేతనం: ఇంజనీర్ (సివిల్) రూ.16,974, టెక్నికల్ అసిస్టెంట్ (సివిల్) రూ.11,670, క్యాడ్ ఆపరేటర్ రూ.10,344 దరఖాస్తు ఫీజు: లేదు దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా టజ్టీ్ఛటl్టఛీ.ఛిౌఝలో అప్లికేషన్‌ను పూర్తిచేసి ప్రింట్అవుట్ తీసుకోవాలి. దానికి అభ్యర్థుల విద్యార్హతలు, తదితర ధ్రువపత్రాల నకళ్లను అటెస్టేషన్ చేయించి జత చేయాలి. వీటిని అసిస్టెంట్ మేనేజర్ (పీ) /ఆర్ఈసీటీటీ, రైట్స్ లిమిటెడ్, రైట్స్ భవన్, ప్లాట్ నెం.1, సెక్షన్ –29, గుర్గావ్ –122001, హరియాణా చిరునామాకు పోస్టు ద్వారా పంపాలి. ఎంపిక విధానం: దరఖాస్తుల పరిశీలన అనంతరం ఎంపికైన అభ్యర్థులకు రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది: ఏప్రిల్ 9, 2017. పోస్టు ద్వారా హార్డ్ కాపీలు పంపడానికి: ఏప్రిల్ 20, 2017. వెబ్సైట్: ritesltd.com -
బ్రహ్మాన్ని తెలుసుకున్నవాడే పరబ్రహ్మం
తైత్రియోపనిషత్ మానవ జీవనంలో ఋతం (సర్వదృష్టి) స్వాధ్యాయం (చదువుకోవడం), ప్రవచనం (చదువు చెప్పడం), సత్యం, తపస్సు, ఇంద్రియనిగ్రహం, శాంతి, అగ్నిహోత్రం, యజ్ఞం, అతిథులను పూజించడం, సమాజసంక్షేమకార్యాలు, మంచి సంతానం అనేవి తప్పనిసరిగా ఉండాలి. ‘సత్యవచనుడు’ సత్యానికీ, పౌరశిష్టి, తపస్సుకూ, నాక మహర్షి స్వాధ్యాయ ప్రవచనాలకూ ప్రాధాన్యం ఇచ్చాడు. ‘సంసారవృక్షానికి నేనే మూలాన్ని. నేనే శిఖరాన్ని. నా కీర్తి పవిత్రం. నేను సంపన్నుణ్ణి. కాంతిమంతుణ్ణి, బుద్ధిమంతుణ్ణి, మరణం లేని వాణ్ణి’ అనే ఆత్మవిశ్వాసంతో, ఉన్నత లక్ష్యంతో మానవుడు జీవించాలని త్రిశంకు మహర్షి చెప్పాడు. ‘శిష్యులారా! సత్యం పలకండి. ధర్మాన్ని ఆచరించండి. శ్రద్ధగా చదవండి, గురుదక్షిణ చెల్లించండి. సంతానవంతులు కండి. సత్యమార్గాన్ని తొలగకండి. ధర్మం, సత్కర్మలు, అధ్యయనం, ప్రవచనం, దేవకార్యాలు, పితృకార్యాలు మానకండి. తలిదండ్రులను గురువును, అతిథులను దైవాలుగా పూజించండి. నాలోని మంచినే స్వీకరించండి. చెడ్డపనులు చేయకండి. పెద్దలను గౌరవించండి. దానం శ్రద్ధగా చెయ్యండి. మహాత్ములను అనుసరించండి. ఇదే గురువుల ఆదేశం. ఉపదేశం. ఇదే వేదం చెప్పేది. దీన్ని ఉపాసించండి అని విద్యపూర్తి అయిన సందర్భంలో ఇచ్చే ఈ సందేశం భారతీయ సంస్కృతిలోని గురుశిష్య సంబంధాన్ని పై తరం కింది తరానికి చె ప్పవలసిన మార్గదర్శకసూత్రాలను బోధించే శిక్షావల్లి. ఇది తైత్తిరీయోపనిషత్తుకే తలమానికంగా మానవజాతిని తీర్చిదిద్దుతుంది. విద్య ముగించుకుని వెళ్లే విద్యార్థులకు చెప్పే ఈ హితోపదేశాన్ని ఇప్పుడు పెళ్లికి ముందు చేసే స్నాతకంలో వినిపిస్తున్నారు. విద్యార్థులు అందరికీ దీనిని వినిపించి అర్థం చెబితే ఆదర్శ సమాజం ఏర్పడుతుంది తైత్తిరీయోపరిషత్తులో రెండవ అధ్యాయం ఆనందవల్లి. దీనిలో తొమ్మిది అనువాకాలు ఉన్నాయి. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయకోశాలను దాటి బ్రహ్మానందాన్ని పొందే క్రమాన్ని ఆనందవల్లి విశదంగా తెలియచేస్తుంది. బ్రహ్మజ్ఞానం అనంతం. దానిని పొందినవాడు అత్యున్నత స్థితికి చేరుకుంటాడు. హృదయపు గుహలో సత్యమూ, జ్ఞానమూ, అనంతమూ అయిన పరబ్రహ్మ ఉన్నాడని తెలుసుకున్నవాడు తానే పరబ్రహ్మం అవతాడు. పరమాత్మనుంచి ఆకాశం, ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి నీరు, నీటినుంచి భూమి, భూమినుంచి ఓషధులు, ఓషధుల నుంచి అన్నం, అన్నం నుంచి ప్రాణి ఆవిర్భావం జరిగింది. ఇది అన్నమయ శరీరం. అన్నం నుంచే మానవులుగాని, ఇతర ప్రాణులుగానీ జన్మిస్తున్నాయి. అంతా అన్నాన్నే బ్రహ్మగా ఉపాసిస్తున్నారు. ప్రాణులన్నీ అన్నం వల్ల పుడుతూ వర్థిల్లుతున్నాయి. అన్నంతోనే మరణిస్తున్నాయి. అన్నిటికీ అన్నమే మూలం. అన్నంతో పెరిగే బాహ్యశరీరం కాక లోపల మరో శరీరం ఉంది. అది ప్రాణమయం. దానితోనే అన్నమయ దేహం బతుకుతోంది. దానికి కూడా తల, కుడి, ఎడమ, కింద అన్నీ ఉన్నాయి. దాని శరీరం ఆకాశం. కింది భాగం భూమి. ఇది ప్రాణమయ శరీరం. ఎవరిని గురించి చెప్పటానికి మాటలు లేవో, మనసు కూడా చేరలేదో అతడే పరబ్రహ్మ. ఇది తెలిసిన వానికి భయం లేదు. ప్రాణమయ శరీరానికి ఈ మనోమయ శరీరమే ఆధారం. దీనిలో విజ్ఞానమయ శరీరం ఉంది. దీని తల శ్రద్ధ. కుడిభాగం ఋతం, ఎడమ భాగం సత్యం, ఆత్మ యోగం, తేజస్సు వెనుక భాగం. ఇది మనోమయ వర్ణన. విజ్ఞానమే మానవులచే యజ్ఞాలు, కర్మలు చేయిస్తోంది. సర్వదేవతలు విజ్ఞానమే బ్రహ్మగా ఉపాసిస్తున్నారు. విజ్ఞానమే బ్రహ్మమని తెలుసుకున్నవాడికి ఏ ప్రమాదమూ లేదు. అన్ని పాపాలూ పోతాయి. అన్ని కోరికలూ తీరుతాయి. మనోమయ శరీరానికి ఆధారంగా ఈ విజ్ఞానమయ శరీరం ఉంటుంది. బుద్ధితో ఏర్పడిన ఈ విజ్ఞానమయ శరీరంలో ఆత్మానందమయ శరీరం ఉంటుంది. దానితో విజ్ఞానమయ శరీరం పరిపూర్ణం అవుతుంది. ఇది కూడా విజ్ఞానమయంలాగానే ఆకారం కలిగి ఉంటుంది. దానికి శిరస్సు ప్రియం. కుడి భాగం మోదం. ఎడమ భాగం ప్రమోదం. ఆత్మ ఆనందం. పరబ్రహ్మమే వెనుక భాగం. ఇది విజ్ఞానమయ వర్ణన. - డా.పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ -
ఉద్యోగ అవకాశాలు
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఫ్యాకల్టీలు పశ్చిమ బెంగాల్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ - కల్యాణి.. ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. వివరాలు.. అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్: 2 (విభాగాలు: కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్/ఐటీ); అసిస్టెంట్ ప్రొఫెసర్: 05 (విభాగాలు: ఫిజిక్స్ - 01, మ్యాథమెటిక్స్ - 01, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్/ఐటీ - 03). దరఖాస్తును వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. దరఖాస్తులకు చివరి తేది అక్టోబర్ 16. వివరాలకు www.iiitkalyani.edu.in చూడొచ్చు. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో వివిధ పోస్టులు నేషనల్ డిఫెన్స్ అకాడమీలో ప్రొఫెసర్; కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ హెల్త్ సర్వీస్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్; కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖలో లీగల్ అసిస్టెంట్; నౌకాయాన శాఖలో నాటికల్ సర్వేయర్; యానిమల్ హస్బెండరీ విభాగంలో వెటర్నరీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. వివరాలు., ప్రొఫెసర్ (ఎకనామిక్స్-1), అసిస్టెంట్ ప్రొఫెసర్ (సర్జరీ, ఫిజికల్ మెడిసిన్ అండ్ రిహాబిలిటేషన్-19), అసిస్టెంట్ (లెజిస్లేటివ్ కౌన్సిల్-1), నాటికల్ సర్వేయర్ (15), వెటర్నరీ ఆఫీసర్ (2). రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులకు చివరి తేది అక్టోబర్ 15. మరిన్ని వివరాలకు www.upsconline.nic.in చూడొచ్చు. రైట్స్‌లో జూనియర్ అసిస్టెంట్లు రైల్ ఇండియా టెక్నికల్ ఎకనమిక్ సర్వీసెస్ లిమిటెడ్ (రైట్స్).. జూనియర్ అసిస్టెంట్ (ఫైనాన్స్ అండ్ అకౌంట్స్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. వివరాలు.. జూనియర్ అసిస్టెంట్ (14). 55 శాతం మార్కులతో బీకామ్/బీబీఏ (ఫైనాన్స్)/బీఏఎంఎస్ (ఫైనాన్స్) ఉత్తీర్ణులు అర్హులు. రాత, మౌఖిక పరీక్షల ద్వారా ఎంపిక ఉంటుంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులకు చివరి తేది అక్టోబర్ 15. వివరాలకు www.rites.comచూడొచ్చు. ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్‌లో ఆఫీస్ అసిస్టెంట్స్ కడపలోని ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్.. 108 ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండి ఐబీపీఎస్ 2014 సెప్టెంబర్/అక్టోబర్‌లో నిర్వహించిన రీజినల్ రూరల్ బ్యాంక్స్ (ఆర్ఆర్బీ) పరీక్ష-3లో అర్హత సాధించినవారు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. వీరికి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. తెలుగు మాట్లాడి, రాయగలిగి ఉండాలి. దరఖాస్తులకు చివరి తేది అక్టోబర్ 1. మరిన్ని వివరాలకు http://apgb.in/index.php చూడొచ్చు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీఏ)లో వివిధ పోస్టులు ఖడక్వాస్లాలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీ వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. పోస్టుల వివరాలు.. కెమికల్ అసిస్టెంట్, లోయర్ డివిజన్ క్లర్క్, డ్రాఫ్ట్స్‌మెన్, కంపోజిటర్ కమ్ ప్రింటర్, కుక్, కార్పెంటర్, సివిలియన్ మోటార్ డ్రైవర్, ఫైర్‌మెన్, టెక్నికల్ అటెండెంట్, మల్టీటాస్కింగ్ స్టాఫ్. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుకు చివరి తేది అక్టోబర్ 10. అర్హతలు, మరిన్ని వివరాలకు http://ndacivrect.org/eligibility.htm చూడొచ్చు. ఎయిర్ ఇండియాలో క్యాబిన్ క్రూ ఎయిర్ ఇండియా.. 331 క్యాబిన్ క్రూ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వివరాలు.. ఢిల్లీ (నార్తన్ రీజియన్ - 217), ముంబై (వెస్ట్రన్ రీజియన్-69), కోల్‌కతా (ఈస్ట్రన్ రీజియన్-08), చెన్నై (సదరన్ రీజియన్-37). 10+2 ఉత్తీర్ణులు అర్హులు. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది అక్టోబర్ 6. వివరాలకు www.airindia.in చూడొచ్చు. ఆయిల్ ఇండియాలో ఎగ్జిక్యూటివ్ ట్రైనీలు ఆయిల్ ఇండియా లిమిటెడ్.. గేట్-2016 ద్వారా ఇంజనీరింగ్ (ఎగ్జిక్యూటివ్ ట్రైనీ) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. విభాగాలు.. మెకానికల్, జియాలజీ, జియోఫిజిక్స్. ఎంపికైనవారికి మొదటి ఏడాది శిక్షణలో స్టైఫండ్‌తోపాటు వసతి సౌకర్యం ఉంటుంది. ఎంఈ/ఎంటెక్/ఎంఎస్సీ (మెకానికల్ ఇంజనీరింగ్/జియాలజీ/జియోఫిజిక్స్)లో 60/65 శాతం మార్కులతో ఉత్తీర్ణులు అర్హులు. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది అక్టోబర్ 1. వివరాలకు www.oil-india.com చూడొచ్చు. ఐజీఐఎంఎస్‌లో వివిధ పోస్టులు ఇందిరాగాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్(ఐజీఐఎంఎస్)..సిస్టర్ గ్రేడ్-2 (80), ప్రొఫెసర్ (05), అసిస్టెంట్ ప్రొఫెసర్(13) పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. సిస్టర్ పోస్టులకు మెట్రిక్యులేషన్/జనరల్ నర్సింగ్, అసిస్టెంట్ ప్రొఫెసర్లకు సంబంధిత సబ్జెక్ట్‌ల్లో ఎండీ/ఎంఎస్ ఉత్తీర్ణులు అర్హులు. నిర్దేశిత నమూనాలో పూర్తి చేసిన దరఖాస్తులను‘ ద డైరక్టర్, ఐజీఐఎంఎస్, షేఖ్పూరా, పాట్నా-14’కు పంపాలి. దరఖాస్తులకు చివరి తేది సెప్టెంబర్ 28. వివరాలకు www.igims.org చూడొచ్చు. సీసీఆర్ఎస్లో పోస్టులు సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ ఇన్ సిద్ధా (సీసీఆర్ఎస్).. రీసెర్చ ఆఫీసర్ (ఖాళీలు-27) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మెడిసిన్‌లో పీజీ ఉత్తీర్ణులు అర్హులు. నిర్దేశిత నమూనాలో పూర్తి చేసిన దరఖాస్తులను‘ ద డిపార్టమెంట్ ఆఫ్ ఆయుష్, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఎస్సీఆర్ఐ బిల్డింగ్, అన్నా గవర్నమెంట్ హాస్పిటల్ క్యాంపస్, ఆరుంబక్కం, చెన్నై-600106’కు పంపాలి. దరఖాస్తులకు చివరి తేది నవంబర్ 09. వివరాలకు www.siddhacouncil.com చూడొచ్చు. నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్లో గ్రాడ్యుయేట్ ట్రైనీలు నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్.. గేట్-2016 ద్వారా గ్రాడ్యుయేట్ ట్రైనీ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. విభాగాలు.. మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, ఇన్స్ట్రుమెంటేషన్, కంప్యూటర్, మైనింగ్. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది జనవరి 22. గేట్ దరఖాస్తులకు ఆఖరు తేది అక్టోబర్ 01. వివరాలకు www.nlcindia.com చూడొచ్చు. హెచ్పీసీఎల్లో ఇంజనీర్లు హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్).. గేట్ 2016 ద్వారా ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. విభాగాలు.. మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, ఇన్స్ట్రుమెంటేషన్, కెమికల్. గేట్ దరఖాస్తులకు చివరి తేది అక్టోబర్ 01. హెచ్‌పీసీఎల్ దరఖాస్తులకు చివరి తేది ఫిబ్రవరి 02. వివరాలకు www.hindustanpetroleum.com చూడొచ్చు.