న్యూఢిల్లీ: రైల్వే ఇంజినీరింగ్, లాజిస్టిక్స్ కన్సల్టెన్సీ సంస్థ, రీట్స్ ఐపీఓ ఈ నెల 20న మొదలవుతోంది. ఈ ఏడాది ఐపీఓకు వస్తున్న తొలి ప్రభుత్వ రంగ సంస్థ ఇదే. ఈ నెల 22న ముగిసే ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.460 కోట్లు సమీకరిస్తుందని అంచనా. ఈ ఐపీఓకు రూ.180–185 ధరల శ్రేణిని నిర్ణయించారు.
ఐపీఓలో భాగంగా 12% వాటాకు సమానమైన 2.52 కోట్ల షేర్లను విక్రయిస్తారు. వీటిల్లో 12 లక్షల షేర్లను ఉద్యోగులకు రిజర్వ్ చేశారు. కనీసం 80 షేర్లకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. వచ్చే నెల 2న ఈ షేర్లు స్టాక్ ఎక్సే్చంజ్‌ల్లో లిస్ట్ అయ్యే అవకాశాలున్నాయి. ఉద్యోగులకు, రిటైల్ ఇన్వెస్టర్లకు ఇష్యూ ధరలో రూ.6 డిస్కౌంట్ లభిస్తుంది.
త్వరలో రైల్ వికాస్ నిగమ్ ఐపీఓ
ఈ ఐపీఓ తర్వాత రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ ఐపీఓకు రానుంది. ఈ ఐపీఓ ద్వారా కంపెనీ రూ.500 కోట్ల మేర నిధులు సమీకరించే అవకాశాలున్నాయి. ఇక జూలై–సెప్టెంబర్ క్వార్టర్లో ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్ప్, ఇర్‌కాన్ ఇంటర్నేషనల్ ఐపీఓకు రానున్నాయి. ఇండియన్ రైల్వే ఫైనాన్స్ రూ.1,000 కోట్లు, ఇర్‌కాన్ రూ.500 కోట్లు సమీకరిస్తాయని అంచనా.
Comments
Please login to add a commentAdd a comment