postal services
-
డోన్లతో ఉత్తరాల బట్వాడా.. 10 నిముషాల్లో డెలివరీ
ధర్మశాల: ఉత్తరాల బట్వాడాలో పోస్టల్శాఖమరో ముందడుగు వేసింది. హిమాచల్ పోస్టల్ విభాగం డ్రోన్ల సాయంతో మారుమూల, మంచు ప్రాంతాలకు ఉత్తరాలను బట్వాడా చేయనుంది. కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు పోస్టల్‌శాఖ అప్పర్ సిమ్లాలో డ్రోన్ ద్వారా ఉత్తరాలను డెలివరీ చేసే ట్రయల్‌ను ప్రారంభించింది.డ్రోన్ల సాయంతో సబ్ పోస్టాఫీసు నుండి బ్రాంచ్ పోస్టాఫీసులకు ఐదు నుంచి పది నిమిషాల్లో ఉత్తరాలు డెలివరీ అవుతున్నాయి. గతంలో ఇలా ఉత్తరాలు చేరడానికి ఒక రోజు పట్టేది. ఈ ట్రయల్ విజయవంతం అయిన దరిమిలా కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు పోస్టల్ విభాగం హైటెక్ టెక్నాలజీని ఉపయోగించి ఇతర మారుమూల ప్రాంతాలకు కూడా ఉత్తరాలను బట్వాడా చేసే అవకాశం ఏర్పడనుంది.హిమాచల్ తపాలా శాఖ ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల మధ్య డ్రోన్ల ద్వారా సబ్ పోస్టాఫీస్ హట్కోటి నుంచి నందపూర్, కథాసు, ఆంటి, జాధగ్ బ్రాంచ్ పోస్టాఫీసులకు ఉత్తరాలను పంపుతోంది. ఒకేసారి ఏడు కిలోగ్రాముల వరకు భారాన్ని మోయగల ఈ డ్రోన్ ఐదు నుండి పది నిమిషాల్లో ఏడు నుండి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాలకు ఉత్తరాలను చేరవేసి, తిరిగివస్తోంది. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా ఉత్తరాల డెలివరీకి సంబంధించిన పూర్తి డేటాను ఆన్లైన్లో ఉంచుతున్నారు. డ్రోన్ ట్రయల్స్ కోసం ఒక ప్రైవేట్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు పోస్టల్‌శాఖ అధికారి ఒకరు తెలిపారు.ఇది కూడా చదవండి: Republic Day 2025: అందమైన ఈ శకటాలను చూసితీరాల్సిందే -
స్మార్ట్ కార్డు ‘బట్వాడా’ కష్టాలు
సాక్షి, హైదరాబాద్: రవాణా, పోస్టల్ శాఖల మధ్య ఏర్పడిన సమస్య వాహనదారులకు కష్టాలు తెచ్చిపెట్టింది. రవాణాశాఖ జారీచేసే లైసెన్సులు, ఆర్సీ సహా అన్ని రకాల స్మార్ట్ కార్డుల బట్వాడాను తపాలాశాఖ నిలిపేయటంతో కార్డులు అత్యవసరమైన వాహనదారులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. 15 నెలలుగా కార్డుల బట్వాడా చార్జీలను తపాలా శాఖకు రవాణాశాఖ చెల్లించటం లేదు. దాదాపు రూ.2 కోట్ల చార్జీలు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం.ఎంతకూ ఈ బిల్లు రాకపోవటంతో నవంబర్ ఒకటో తేదీ నుంచి పోస్టల్ శాఖ ఆర్టీఏ కార్యాలయాల నుంచి కార్డుల బట్వాడాకు సంబంధించిన ముందస్తు బుకింగ్‌తోపాటు సిద్ధమైన కార్డులను వాహనదారులకు చేరవేసే సేవలను కూడా నిలిపివేసింది. దీంతో ఆర్టీఏ కార్యాలయాల్లోనే దాదాపు 2 లక్షల కార్డులు పేరుకుపోయాయి. దీంతో జేబులో ఆర్సీ, లైసెన్స్ లేకుండా వాహనంతో రోడ్డెక్కితే ట్రాఫిక్ పోలీసులు ఫైన్ వేస్తున్నారని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.రాబడి లెక్కే.. చెల్లింపు లెక్కలేదు వాహనదారుల నుంచి వసూలు చేసే వివిధ రకాల చార్జీలను రవాణాశాఖ ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి జమ కడుతుంది. దీన్ని ఆదాయంగా ప్రభుత్వం భావిస్తుంది. తదుపరి సంవత్సరానికి ఈ ఆదాయాన్ని పెంచాలని రవాణా శాఖకు ప్రభుత్వం కొత్త టార్గెట్ నిర్దేశిస్తుంది. ప్రభుత్వం ఆదాయాన్ని అయితే వసూలు చేస్తోంది కానీ.. ఖర్చులకు కావల్సిన మొత్తాన్ని విడుదల చేయటంలేదు. 2014–15లో రూ.1,855 కోట్ల ఆదాయాన్ని రవాణాశాఖ ద్వారా పొందిన ప్రభుత్వం.. 2023–24 నాటికి రూ.6,990 కోట్లకు పెంచుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జూన్ నాటికి రూ.1,593 కోట్ల ఆదాయం పొందింది. రూ.4 కోట్లు వసూలు చేసినా.. గత 15 నెలల్లో వాహనదారుల నుంచి ‘కార్డుల బట్వాడా రుసుము’పేరుతో రవాణాశాఖ దాదాపు రూ.4 కోట్లు వసూలు చేసింది. ఇందులో రూ.2 కోట్లు తపాలాశాఖకు చెల్లించాల్సి ఉంది. 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం రవాణాశాఖ ద్వారా రూ.6,990 కోట్లు రాబట్టుకుంది. ఇందులో రూ.2 కోట్లంటే సముద్రంలో నీటిబొట్టంతే. కానీ, ఆ చిన్న మొత్తాన్ని కూడా తపాలా శాఖకు చెల్లించలేకపోయింది.ఆర్సీ, లైసెన్సు, రెన్యువల్స్, కొన్ని రకాల డూప్లికేట్ స్మార్ట్ కార్డులను రవాణాశాఖ వాహనదారులకు పోస్టు ద్వారా చేరవేస్తుంది. ఆయా లావాదేవీకి సంబంధించి దరఖాస్తు సమయంలోనే ఆన్లైన్లో తపాలా బట్వాడా రుసుము వసూలు చేస్తుంది. తపాలా బట్వాడా చార్జీ కింద వాహనదారు నుంచి రూ.35 చొప్పున రవాణా శాఖ వసూలు చేసుకుంటోంది. పోస్టల్ శాఖకు మాత్రం ఒక్కో కార్డు బట్వాడాకు చెల్లిస్తున్నది రూ.17 మాత్రమే. కవర్ చార్జీ కింద మరో రూపాయి చెల్లిస్తుంది. తపాలాశాఖ ఉదారం.. రవాణాశాఖ నిర్లక్ష్యం రాష్ట్ర ప్రభుత్వ విభాగాలకు తన వంతుగా మెరుగైన సేవలు అందించేందుకు తపాలాశాఖ కొంత ఉదారంగానే వ్యవహరిస్తోంది. ‘బుక్ నౌ.. పే లేటర్’విధానాన్ని ప్రారంభించి బట్వాడాకు సంబంధించిన పార్శిళ్లను ముందుగా బుక్ చేసి, వాటి రుసుములను తర్వాత చెల్లించినా ఫర్వాలేదు అన్న ‘ఉద్దెర’పాలసీ తీసుకొచ్చింది. దీంతో కార్డుల బట్వాడా చేయించుకుంటూ.. రుసుములు తర్వాత చెల్లించే పద్ధతికి రవాణాశాఖ అలవాటు పడింది. చార్జీలు రాకున్నా సేవలు ఎందుకు అందిస్తున్నారని రెండేళ్ల క్రితం ఆడిట్ విభాగం తపాలాశాఖను ప్రశ్నించింది. తపాలాశాఖ అధికారులు ఇదే విషయాన్ని రవాణాశాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా వారి తీరు మారలేదు. -
ఇండియా పోస్ట్, అమెజాన్ జత
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా డెలివరీ సర్వీసుల సామర్థ్యాన్ని పెంపొందించుకునే బాటలో ఈకామర్స్ దిగ్గజం అమెజాన్, పోస్టల్ శాఖ(ఇండియా పోస్ట్) జతకట్టాయి. ఇందుకు అమెజాన్ ట్రాన్స్‌పోర్టేషన్ సర్వీసెస్, ఇండియా పోస్ట్ అవగాహనా ఒప్పందాన్ని(ఎంవోయూ) కుదుర్చుకున్నాయి. దాంతో దేశవ్యాప్త లాజిస్టిక్స్ సర్వీసుల్లో వ్యూహాత్మక భాగస్వామ్యానికి తాజాగా తెరతీశాయి.సామర్థ్యాల పెంపు, పటిష్టంగా వనరుల వినియోగం, రవాణా నెట్‌వర్క్‌లను పంచుకోవడం తదితరాల కోసం పరస్పరం సహకరించుకోనున్నట్లు సంయుక్త ప్రకటనలో వివరించాయి. 1,65,000 పోస్టాఫీసుల నెట్వర్క్ కలిగిన ఇండియా పోస్ట్ దేశవ్యాప్తంగా ఈకామర్స్‌ను విస్తరించేందుకు దోహదపడనున్నట్లు పోస్టల్ సెక్రటరీ వందితా కౌల్ పేర్కొన్నారు. ఇండియా పోస్ట్ సర్వీసులను ఆధునీకరించడం, నూతన సాంకేతికతలను వినియోగించడం తదితర ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా అమెజాన్‌తో చేతులు కలిపినట్లు వివరించారు. నిజానికి 2013లోనే కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ దేశవ్యాప్త డెలివరీలకు అమెజాన్ ఇండియా పోస్ట్‌తో భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకుంది. ఇక 2023లో సమీకృత విదేశీ లాజిస్టిక్స్ సొల్యూషన్ల కోసం రెండు సంస్థలు ఎంవోయూ కుదుర్చుకున్నాయి. తద్వారా సూక్ష్మ, చిన్న, మధ్యతరహాసంస్థ (ఎంఎస్ఎంఈ)ల ఈకామర్స్ ఎగుమతులకు తెరతీశాయి.ఇదీ చదవండి: సెప్టెంబర్‌లో ‘సేవలు’ పేలవం -
‘ఆధార్ ఏటీఎం’ వచ్చేసింది..అదెలా పనిచేస్తుందంటే?
మీకు అత్యవసరంగా డబ్బులు కావాలా? బ్యాంక్ లేదంటే ఏటీఎంకు వెళ్లేందుకు సమయం లేదా? మరేం ఫర్లేదు. మీరు ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబీ) ద్వారా ఆన్లైన్ ఆధార్ ఏటీఎం( ఏఈపీఎస్) సేవను ఉపయోగించి ఇంటి నుంచే డబ్బులు డ్రా చేసుకోవచ్చు. మీ కనీస అవసరాల్ని తీర్చుకోవచ్చు. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ సోషల్ మీడియా పోస్ట్‌లో ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది. అందులో ‘అత్యవసర నగదు కావాలి కానీ బ్యాంక్‌కు వెళ్లేందుకు సమయం లేదా? చింతించకండి! ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఆన్లైన్లో ఆధార్ ఏటీఎం(ఏఈపీఎస్) ద్వారా మీ ఇంటి నుంచే డబ్బుల్ని డ్రా చేసుకోవచ్చు. మీ పోస్ట్‌మాన్ ఇప్పుడు మీ ఇంటి వద్దే నగదును విత్‌డ్రా చేసుకునేందుకు మీకు సహాయం చేస్తారు.’ అంటూ ట్వీట్లో పేర్కొంది. ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ (ఏఈపీఎస్) ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ (ఏఈపీఎస్)తో ఒక వ్యక్తి తన బయోమెట్రిక్‌ని ఉపయోగించి నగదు తీసుకోవడానికి, ఆధార్-లింక్డ్ బ్యాంక్ అకౌంట్ నుంచి ఇతరులకు నగదు పంపుకోవచ్చు. కస్టమర్లు ఏటీఎం లేదా బ్యాంక్‌ని సందర్శించాల్సిన అవసరం లేకుండా ఏఈపీఎస్ని ఉపయోగించి చిన్న మొత్తాలను విత్‌డ్రా చేసుకోవచ్చు. దీని వల్ల సమయం కూడా ఆదా అవుతుంది. ఏఈపీఎస్ అంటే ఏఈపీఎస్ అంటే ‘ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ (ఏఈపీఎస్) అనేది ఒక చెల్లింపు సేవ. ఈ సేవల ద్వారా ఒక బ్యాంక్ కస్టమర్ తన ఆధార్ లింక్ చేసిన బ్యాంక్ అకౌంట్‌ను ఓపెన్ చేయడంతో పాటు ప్రాథమిక్ బ్యాంకింగ్ అవసరాలు అంటే బ్యాలెన్స్ ఎంక్వైరీ చేసుకోవడం, కొద్ది మొత్తంలో డబ్బులు ఒక బ్యాంక్ అకౌంట్ నుంచి మరో బ్యాంక్ అకౌంట్‌కు పంపుకోవచ్చు. ఏఈపీఎస్ సేవల్ని పొందడం ఎలా? ఏఈపీఎస్ సర్వీసుల్ని పొందాలనుకునే కస్టమర్‌కు తప్పని సరిగా బ్యాంక్ అకౌంట్ ఉండాలి. ఆ బ్యాంక్ అకౌంట్‌కు ఆధార్ లింక్ చేయాలి. బయోమెట్రిక్‌ను ఉపయోగించి డబ్బుల్ని పంపడం,విత్ డ్రాయిల్ వంటి సేవల్ని వినియోగించుకోవచ్చు. ఆధార్ నంబర్ ఉంటే సరిపోతుంది. ప్రస్తుతానికి క్యాష్ విత్‌డ్రా, ట్రాన్స్‌ఫర్‌కు లిమిట్ అనేది ఏం లేదు. కానీ గరిష్టంగా రూ. 10 వేల వరకు ఉన్నట్లు తెలుస్తోంది. In need of urgent cash but don’t have time to visit the bank? Worry not! With @IPPBOnline Aadhaar ATM (AePS) service, withdraw cash from the comfort of your home. Your Postman now helps you to withdraw cash at your doorstep. Avail Now! 👉For more information Please visit:… pic.twitter.com/4NNNM6ccct — India Post Payments Bank (@IPPBOnline) April 8, 2024 -
అయోధ్యలోని రామాలయ ప్రారంభోత్సవాన్ని..57 ఏళ్ల క్రితమే ఊహించారా?
ఈ నెల 22న జరగబోయే బాలరాముని విగ్రహ ప్రతిష్టాపనకు సంబంధించిన కార్యక్రమాలు అట్టహాసంగా మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో నేపాల్‌కు చెందిన 57 ఏళ్ల నాటి సీతారాముల స్టాంపు ఒకటి బయటపడింది. సరిగ్గా ఏప్రిల్ 18, 1967న శ్రీరామ నవమి (రాముడి పుట్టినరోజు) సందర్భంగా ఈ స్టాంపును విడుదల చేశారు. ఈ స్టాంప్‌పై నేపాల్, భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో అనుసరించే హిందూ క్యాలెండర్ అయిన విక్రమ్ సంవత్ 2024 సంవత్సరం ఉంది. గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం 1967లో విడుదలైన ఈ స్టాంప్‌పై ఈ ఏడాది రాసి ఉంది. అలాగే హిందువులు అనుసరించే విక్రమ్ సంవత్, గ్రెగోరిన్ క్యాలెండర్ కంటే 57 ఏళ్లు ముందుంటుంది. సరిగ్గా అయోధ్యలో ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమాలు రసవత్తరంగా సాగుతున్న వేళ ఈ స్టాంప్ బయటపడటం రకరకాల ఊహాగానాలుకు తెరతీసింది. అంతేగాదు ఇప్పుడు అయోధ్యలో జరగనున్న రామాలయ ప్రారంభోత్సవాన్ని నేపాల్ 57 ఏళ్ల క్రితమే ఊహించిందా?.. అంటూ చర్చలకు దారితీసింది. అదికూడా సరిగ్గా ఈ టైంలో వెలుగులోకి వచ్చిన ఈ స్టాంప్‌పై ఉన్న సంవత్సరం ఈ ఏడాదిని పోలి ఉండటం అందర్నీ ఆలోచింపచేసేలా ఆశ్చర్యానికి గురి చేసింది. ముఖ్యంగా ఈ స్టాంప్ విడుదలైన సంవత్సరం ఆలయ ప్రతిష్టాపన సంవత్సరంతో సరిపోలింది. 2024లో రాముడు తన జన్మభూమి అయిన అయోధ్యకి తిరిగి వస్తాడని 57 ఏళ్ల కిత్రం నేపాల్‌లో ఈ స్టాంప్ విడుదలైనప్పుడు ఎవరూ ఊహించి ఉండరు కదా!. ఇదిలా ఉండగా, ఈనెలలో జరగనున్న రామ ప్రాణప్రతిష్టాపన కోసం 56 అంగుళాల పొడవుతో సింహగర్జనతో కూడిన డ్రమ్ అయోధ్యకు పెద్ద ఊరేగింపుగా వచ్చింది. దీన్ని ఆలయంలో ఉంచుతారు. అలాగే ఎనిమిది లోహాలతో కూడిన శంఖం కూడా ప్రాణ ప్రతిష్టాపన సమయంలో బాల రాముడి పాదాల వద్ద ఉంటుంది. ఈ శంఖాన్ని అలీఘర్ నివాసి విరాళంగా ఇచ్చారు. కాగా, ఈ నెల 22న జరగనున్న భవ్య రామాలయం ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ఆలయ ట్రస్ట్ అధ్యక్షుడు మహంత్ నృత్య గోపాల్ దాస్ వంటి ప్రముఖులు హాజరుకానున్నారు. దాదాపు ఏడు వేల మంది ప్రముఖ ఆహ్వానితులలో క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, పారిశ్రామికవేత్తలు ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ వంటి వారు ఉన్నారు. (చదవండి: రూ. 500 నోట్లపై శ్రీరాముడ ముఖచిత్రం..వైరల్) -
పోస్టల్ బ్యాలెట్‌కు.. ఇబ్బందులు తప్పవనే అభిప్రాయం!
సాక్షి, ఆదిలాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచడంతో పాటు అర్హులైన ప్రతిఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలనే ఉద్దేశంతో కేంద్ర ఎ న్నికల సంఘం కొత్తగా ప్రవేశపెట్టిన పోస్టల్ బ్యాలెట్ కు జిల్లాలో స్పందన అంతంతగానే కనిపించింది. పోలింగ్ కేంద్రాలకు వెళ్లలేని ఓటర్ల కు సంబంధించి అందిన దరఖాస్తులను పరిశీలి స్తే ఈ విషయం స్పష్టమవుతుంది. పోస్టల్ బ్యాలెట్ వినియోగంపై అధికార యంత్రాంగం తగు ప్రచారం కల్పించకపోవడం, దరఖాస్తు విధానంపై అవగాహన లేకపోవడంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఈ నెల 30న నిర్వహించే ఎన్నికల్లో ఆయా వర్గాల వారు పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వినియోగం కోసం ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి తప్పేలా కనిపించడం లేదు. పోలింగ్ శాతం పెంచడమే లక్ష్యంగా.. ఓటు వినియోగంపై అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినా పోలింగ్ శాతం 70 నుంచి 80శాతానికి మించి దాటడం లేదు. ఓటు వేసేందుకు గాను ఆయా కేంద్రాలకు వచ్చేందుకు వృద్ధులు, వైకల్యంతో దివ్యాంగులు ఎక్కువగా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో వారితో పాటు అత్యవసరమైన సేవలందించే వైద్యారోగ్య, విద్యుత్, రైల్వే, ఆర్టీసీ, పౌరసరఫరాలు, బీఎస్ఎన్ఎల్, ఫైర్,ఎయిర్‌పోర్టు అధార్టీ ఆఫ్ ఇండియా, ఫుడ్ కార్పొరేషన్, పీఐబీ, దూరదర్శన్, ఆలిండియారేడియా ఉద్యోగులు, మీడియా ప్రతినిధులకు ఇంటి నుంచే ఓటు వేసేలా సీఈసీ పోస్టల్ బ్యాలెట్ సదుపాయం అందుబాటులోకి తెచ్చింది. తద్వారా ఓటింగ్ శాతం పెంచవచ్చని భావించింది. ఆయా వర్గాలకు దీనిపై అవగాహన కల్పించి సద్వినియోగం చేసుకునేలా తగు ప్రచారం కల్పించాలని ఎన్నికల అధికారులను ఆదేశించింది. స్పందన రాలే.. ఈసీ ఆదేశాలు బాగానే ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో పోస్టల్ బ్యాలెట్ ఓటు వినియోగంపై అవగాహన క ల్పించడంలో యంత్రాంగం అంతగా దృష్టిసారించలేదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. జిల్లా వ్యాప్తంగా పోస్టల్ బ్యాలెట్ ఫాం–12డీ కోసం కేవలం 727 మంది మాత్రమే దరఖాస్తు చేసుకోవడం నిదర్శనంగా నిలుస్తోంది. ఈ అవకాశాన్ని వినియోగించుకో వాల్సిన వృద్ధులు, దివ్యాంగులుతో పాటు ఈసీ నిర్దేశించిన ఆయా కేటగిరీల వారు వేలల్లో ఉన్నపటికీ దరఖాస్తులు వందల్లో రావడం గమనార్హం. రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అఽధికారులు అవగా హన కల్పించేలా ఎలాంటి చర్యలు తీసుకోకపోవ డం, క్షేత్రస్థాయిలో ఆయావర్గాల వారు పోస్టల్ బ్యా లెట్‌కు దరఖాస్తు చేసుకునేలా చూడాల్సిన బీఎల్వోలు తమకేం సంబంధం లేదన్నట్లుగా వ్యవహరించడంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఓటు వినియోగానికి వృద్ధులు, దివ్యాంగులు మరోసారి ఇబ్బందులు పడక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. ఈసీ ఇంటి వద్ద నుంచే ఓటేసే అవకాశం కల్పించిన దాన్ని తెలియజేయాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతో వారు పోలింగ్ కేంద్రాలకు వెళ్లక తప్పని దుస్థితి. ఫలితంగా ఆయా వర్గాలకు ఇబ్బందులు పునరావృతమయ్యే అవకాశం లేకపోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇవి చదవండి: విభిన్న తీర్పు! ప్రస్తుత ఎన్నికల ట్రెండ్‌పై సర్వత్రా ఆరా.. -
ఎగుమతుల ప్రోత్సాహకానికి సమావేశాలు
న్యూఢిల్లీ: ఈ–కామర్స్ ద్వారా ఎగుమతులను ప్రోత్సహించే మార్గాలపై అవగాహన పెంచేందుకు నెలవారీ వర్క్‌షాప్‌లను నిర్వహించాలని నిర్ణయించినట్లు వాణిజ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపింది. వర్క్‌షాప్‌ల ద్వారా విదేశాలకు సరుకు రవాణా, పోస్టల్, కస్టమ్స్ సమ్మతి, చెల్లింపులకు సంబంధించిన అంశాలపై అవగాహన కల్పిస్తారు. ప్రతిపాదిత వర్క్‌షాప్‌లు ప్రతి నెల మొదటి వారంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహిస్తారు. సాధ్యమయ్యే చోట వ్యక్తిగతంగా వర్క్‌షాప్‌లు నిర్వహిస్తామని వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అనుభవాలను పంచుకోవడానికి, కొత్త వ్యవస్థాపకులకు సలహా ఇవ్వడానికి ప్రముఖ ఈ–కామర్స్ ఎగుమతిదారులను ఆహా్వనించినట్టు వెల్లడించింది. -
భారతీయులకు శుభవార్త, 38 దేశాలకు చేరిన పోస్టల్ సేవలు..తాజాగా..
భారత్‌కు చెందిన పోస్టల్ డిపార్ట్మెంట్ కెనడా ప్రభుత్వాల మధ్య ఒప్పందాలు జరిగాయి. ఈ ఒప్పందంతో భారతీయులు స్థానిక పోస్టాఫీస్‌ల నుంచి కెనడాకు పార్శిళ్లను పంపుకోవచ్చు. ఇంటర్నేషనల్ ట్రాక్డ్ ప్యాకెట్ సర్వీస్ (ITPS) పేరుతో కార్యకలాపాలు జూన్ 30 నుంచి ప్రారంభమయ్యాయి. కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటన ప్రకారం.. భారతీయులు నిర్వహించే సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) యూనిట్లు, చిన్న వ్యాపారాలు లేదంటే తయారు చేసిన వస్తువుల్ని, వారి వ్యాపారాల్ని మరింత విస్తరించేందుకు వీలుగా లేదంటే వ్యాపారాల్ని కెనడాకు సైతం సులభంగా ఎగుమతి చేసుకునేందుకు వీలుగా భారత్ - కెనడా ప్రభుత్వాలు ఈ కొత్త సర్వీసుల్ని రూపొందించాయి. తద్వారా ఎగుమతిదారుల సరిహద్దు షిప్పింగ్ అవసరాలు తీరిపోనున్నాయి. భారత్ ఇప్పటికే ఐటీపీఎస్ తరహా సేవల్ని 38 దేశాల్లో అందిస్తుండగా.. తాజాగా కెనడాతో కుదుర్చుకున్న ఒప్పందంతో ఆ సంఖ్య మొత్తం 39కి చేరింది. 39 దేశాల్లో పోస్టాఫీస్ సేవలు జూన్ 1, 2023 ముందు వరకు 16 దేశాలకు మాత్రమే దేశీయ పోస్టాఫీసుల నుంచి దేశీయంగా తయారు చేసిన వస్తువల్ని విదేశాలకు పంపుకునే వెసలు బాటు ఉంది. జూన్ 1 తర్వాత ఆ సంఖ్య 38కి చేరింది. భారత్ కొత్తగా ఒప్పందం చేసుకున్న దేశాల జాబితాలో ఫ్రాన్స్, బ్రిటన్, యూఏఈ, ఈజిప్ట్‌తో పాటు ఇతర దేశాలు ఉన్నాయి. ధరలు ఎలా ఉన్నాయి ఇంటర్నేషనల్ స్పీడ్ పోస్ట్, ఇతర మార్కెట్ సంస్థల ఉత్పత్తులతో పోల్చితే ఐటీపీఎస్ రేట్లు అందుబాటులో ఉన్నాయని పోస్టల్ డిపార్ట్మెంట్ అధికారులు చెబుతున్నారు. మొదటి 50 గ్రాముల పార్శిళ్లపై రూ.400 వసూలు చేస్తుండగా.. అదనంగా ప్రతి 50 గ్రాములకు రూ.35 చొప్పున చెల్లించాలి. ఇలా 2 కేజీల వరకు నామమాత్రంగా సర్వీసులు ఛార్జీలు వసూలు చేస్తుండగా.. ఆపై వస్తువు బరువు, ప్రాంతాన్ని బట్టి రేట్లు మారతాయని పోస్టల్ డిపార్ట్మెంట్ విడుదల చేసిన నోటీసుల్లో పేర్కొంది. ఇదీ చదవండి : పాకిస్తాన్లో జాక్‌మా ప్రత్యక్షం.. రహస్య ప్రాంతంలో -
పోస్టల్ ఉద్యోగుల అలసత్వమే..
సాక్షి, ఆదిలాబాద్/ఉట్నూర్: ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌లో పదో తరగతి జవాబు పత్రాల బండిల్ మిస్సింగ్ కేసులో పోస్టల్ సిబ్బంది నిర్లక్ష్యమే కనిపిస్తోంది. సోమవారం ప్రథమ భాష పరీక్ష తర్వాత జవాబు పత్రాలను పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులు ఉట్నూర్ పోస్టాఫీసుకు అందించారు. ఇక్కడ బండిళ్లను తయారు చేసి బస్సు ద్వారా వరంగల్‌కు పంపించాలి. పోస్టాఫీస్ నుంచి ఆటోలో సిబ్బంది ఎంటీఎస్, ఈడీ ప్యాకర్ వెంటఉండి వాటిని బస్టాండ్‌కు తరలించాలి. అయితే ఈ సిబ్బంది ఎవరూ వెంట లేకుండానే ఆటోలో వేసి వారు తమ ద్విచక్ర వాహనం ద్వారా వెళ్లారు. బస్టాండ్‌కు వెళ్లిన తర్వాత 11 బండిల్స్ (కట్ట) నుంచి ఒకటి మిస్ అయ్యింది. పోస్టుమాస్టర్ ఫిర్యాదు మేరకు సోమవారం సాయంత్రం ఉట్నూర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని పేపర్ బండిల్ కోసం వెతికినప్పటికీ దొరకలేదు. మంగళవారం ఉదయం కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశాల మేరకు అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, డీఈవో ప్రణీత ఉట్నూర్ చేరుకున్నారు. మొదట పోస్టాఫీసుకు వెళ్లగా సెలవు కారణంగా వారు అందుబాటులో లేరు. దీంతో వీరు స్థానిక పోలీసు స్టేషన్‌కు చేరుకొని డీఎస్పీ నాగేందర్‌ను కలిసి వివరాలు తెలుసుకున్నారు. అక్కడి నుంచి ఎంపీడీవో కార్యాలయానికి చేరుకున్న అధికారులు పూర్తి విషయాలపై ఆరా తీశారు. కాగా, నిజామాబాద్ పోస్టల్ డిపార్ట్మెంట్ సూపరింటెండెంట్ ఉమామహేశ్వర్రావు ఉట్నూర్ చేరుకొని బండిల్ మిస్సింగ్ విషయంలో విచారించారు. ఇదిలా ఉంటే పోలీసులు పోస్టల్ కార్యాలయం నుంచి బస్టాండ్ వరకు ఆటో వెళ్లిన దారిలో రోడ్డు పక్కన ఉన్న సీసీ కెమెరాలను తనిఖీ చేశారు. మంగళవారం సాయంత్రం వరకు పేపర్ బండిల్ దొరకలేదు. పరీక్ష రాసిన 9 మంది విద్యార్థుల జవాబు పత్రాల బండిల్ మిస్సింగ్‌తో ఆ విద్యార్థుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. ఇద్దరిపై వేటు టెన్త్ జవాబు పత్రాల బండిల్ మిస్సింగ్ ఘటనలో పోస్టాఫీస్ ఉద్యోగి ఎంటీఎస్ రజితపై సస్పెన్షన్ వేటుపడింది. ఈ క్రమంలోనే ఆమె అస్వస్థతకు గురికాగా ఆదిలాబాద్‌లోని రిమ్స్ కు తరలించారు. మరో ఔట్సోర్సింగ్ ఉద్యోగి నాగరాజును బాధ్యతల నుంచి తప్పించారు. -
టెక్ తపాలా..
పోస్టాఫీసులంటే టక్కున గుర్తువచ్చేవి ఉత్తరాలు, టెలిగ్రామ్‌లు. కాలం మారింది. దూరాలను దగ్గరగా చేసిన పోస్టల్ శాఖ సాంకేతిక విప్లవంతో ఉత్తర ప్రత్యుత్తరాలకు తావులేక ప్రజలకు దూరమవుతున్న పరిస్థితి నెలకొంది. దీంతో అదే సాంకేతికతను అందిపుచ్చుకునే దిశగా అడుగులు వేస్తోంది. వినూత్న పథకాలు, ప్రణాళికలతో ‘దూరం నుంచి దగ్గర’ అవుతోంది. ఇప్పటికే పోస్టల్ ఖాతాలను జాతీయ బ్యాంకుల తరహాలో ఆన్లైన్ చేసింది. ఏటీఎం కార్డులను జారీ చేస్తూ.. ఏటీఎంలను ప్రారంభించిన ఈ శాఖ మరో అడుగు ముందుకేసి గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకులు, ప్రైవేట్ ఫైనాన్సు సంస్థల కంటే మిన్నగా ఆర్థిక సేవలను వేగంగా అందిస్తోంది. ప్రజలకు ఆత్మబంధువులా చేరువవుతోంది. మార్కాపురం: టెక్నాలజీ లేని కాలంలో గ్రామీణ ప్రజలకు పోస్టాఫీసులే దిక్కు. ఉత్తరాల దగ్గర నుంచి అత్యవసర సేవల కోసం ప్రజలు వీటినే ఆశ్రయించే వారు. ఉత్తరాలు, ఇంటర్వ్యూ లెటర్లు, అపాయింట్మెంట్ ఆర్డర్లు, మనియార్డర్లతో ఖాకీ డ్రెస్ వేసుకుని ప్రతి రోజూ తిరుగుతూ అందరినీ పలకరిస్తూ ఎందరో ఆశలకు జీవం పోసి ఉత్సాహపరుస్తూ ఆతీ్మయులుగా ఉండేవారు పోస్టుమేన్లు. నేడు పరిస్థితి మారింది. సమాచారాన్ని క్షణాల్లో మన ముందుంచేలా పలు రకాల సేవలు అందుబాటులోకి వచ్చాయి. అదే స్థాయిలో పోస్టల్ శాఖ కూడా మారుతూ వచ్చింది. ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకుంది. అత్యాధునిక సేవలను వినియోగదారులకు అందిస్తూ పోటీ పడుతోంది. సెల్‌ఫోన్ రాకతో.. సెల్ఫోన్లు, ఆండ్రాయిడ్ ఫోన్లు అందుబాటులోకి వచ్చినప్పటికీ సాంకేతికంగా వస్తున్న మార్పులను ప్రజలకు అందించేందుకు తపాలాశాఖ సిద్ధమైంది. పోస్టాఫీసుకు వెళ్లి ఉత్తరాలు కొని డబ్బాలో వేసే సంస్కృతికి కాలం చెల్లిపోయింది. ప్రస్తుతం వాట్సాప్, ట్విట్టర్ ద్వారా సమాచార మారి్పడి చేసుకుంటున్నారు. మనీయార్డర్ల స్థానంలో ఏటీఎంలు, మనీ ట్రాన్స్ఫర్ వంటివి వచ్చాయి. సెల్‌ఫోన్, ఇంటర్నెట్, ఈ మెయిల్స్ పోటీ తట్టుకోవటంలో వెనుకబడిన తపాలా శాఖ ఇప్పుడిప్పుడే వినూత్న పథకాలను ప్రవేశపెడుతూ ప్రజల ఆదరణ చూరగొంటోంది. టెక్ సాయంతో ముందడుగు.. ప్రైవేటు సంస్థలు, బ్యాంక్‌లకు దీటుగా పోస్టాఫీసుల్లో కూడా ఆన్లైన్ సేవలు, ఏటీఎంలు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటికే టీటీడీ ప్రత్యేక దర్శనం టికెట్లు, పుష్కరాల సమయంలో ఆ ప్రాంత పుష్కరాలను తెలియజేస్తూ కృష్ణ, గోదావరి, కావేరి, తుంగభద్ర జలాల లీటర్, అర్ధ లీటర్ బాటిల్స్ తక్కువ రేటుకు ప్రజలకు అందిస్తూ వారి అభిమానాలను చూరగొంటోంది. మొబైల్ మనీ ట్రాన్స్ఫర్, ఎల్రక్టానిక్ మనీయార్డర్, మై స్టాంప్ పథకం, స్పీడ్ పోస్టుల సేవలను అందుబాటులోకి తెచ్చింది. దీంతో వివిధ వర్గాల ప్రజలు మళ్లీ పోస్టాఫీసుకెళ్తున్నారు. విదేశాల్లో ఉన్న బంధు మిత్రుల నుంచి క్షణాల్లో నగదు బదిలీ, ప్రైవేటు కొరియర్స్ కంటే ముందుగా వెళ్తున్న స్పీడ్ పోస్టు, వ్యక్తిగతంగా ఫొటోలతో విడుదల చేసే మై స్టాంప్, రికరింగ్ డిపాజిట్లు, ఇన్సూరెన్స్ పథకాలు ఆకట్టుకుంటున్నాయి. కరోనా సమయంలో అత్యవసరమైన మందులను పోస్టల్‌శాఖ వారు అందించారు. దీనికి గాను కేంద్ర ప్రభుత్వం నుంచి అవార్డు కూడా అందుకున్నారు. మూడేళ్ల క్రితం ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్‌ను పోస్టల్ శాఖ ప్రారంభించింది. పోస్టల్ సిబ్బందికి బయోమెట్రిక్ మిషన్ అందించారు. దీని ద్వారా బ్యాంకు అకౌంట్ ఉంచి ఐపీపీబీలో అకౌంట్ కలిగి ఉంటే పోస్టల్ సిబ్బంది బయోమెట్రిక్ వేయించుకుని రూ.5 నుంచి రూ.10 వేల వరకూ వారే ఇంటికి వచ్చి అందించే సౌకర్యం కల్పించారు. -
తపాలా నిద్ర.. అక్రమాల ముద్ర
సాక్షిప్రతినిధి, కాకినాడ: పోస్టాఫీసు అంటే నమ్మకానికి చిరునామా. పల్లెల నుంచి నగరం వరకు ఏ చిన్న ఉత్తరం వచ్చినా భద్రంగా అందజేసి విశ్వసనీయత చాటుకునే వ్యవస్థగా మంచి పేరు. ఆధునిక పరిస్థితుల నేపథ్యంలో ఉత్తరాల పాత్ర లేకపోవటంతో పోస్టాఫీసులు బ్యాంకింగ్ రంగంలోకి అడుగుపెట్టాయి. ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు(ఐపీపీబీ)పేరుతో పల్లెల్లో బ్యాంకింగ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చింది. బ్యాంకుల మాదిరి అన్ని నగదు లావాదేవీలు చేపడుతోంది. అయితే ఈ వ్యవహారాపై పర్యవేక్షణ, జవాబుదారీతనం కొరవడిందనే విమర్శ ఇటీవల బలంగా వినిపిస్తోంది. ఉన్నతాధికారుల అజమాయిషీ అంతంతమాత్రంగా ఉంటోందని తెలుస్తోంది. ఫలితంగా కొన్ని బ్రాంచిల్లో పోస్టుమాస్టర్లు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఖాతాదారుల సొమ్ముకు ఎసరు పెడుతున్నారు. ఇలాంటి మోసాలు ఇటీవల కాలంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పలు బ్రాంచిల్లో వెలుగులోకి రావడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా కొవ్వూరు మండలం ధర్మవరం బ్రాంచిలో పోస్టుమాస్టర్ ఏకంగా నకిలీ పాస్‌పుస్తకాలు తయారుచేసి కోటిన్నర లూటీ చేయడం పోస్టల్శాఖనే ఒక్క కుదుపు కుదిపేసింది. జిల్లాల పునర్విభజనకు ముందు నుంచి బ్యాంకింగ్ లావాదేవీలు నిర్వహిస్తోన్న బ్రాంచిల్లో ఎక్కడోచోట ఈ బాగోతాలు బయటపడి ఖాతాదారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నాయి. బయటపడిన కొన్ని బాగోతాలు ఈ ఏడాది మేలో అమలాపురం పోస్టల్ డివిజన్ పరి«ధిలోని అయినవిల్లి మండలం విలస సబ్ పోస్టాఫీసు ఐపీపీబీలో రూ.1.18 కోట్లు దుర్వినియోగమయ్యాయి. హెడ్ పోస్టాఫీసులో సిస్టమ్ అడ్మిని్రస్టేటర్ ఖాతాదారుల సొమ్ములను సన్నిహితులు, బంధువుల ఖాతాలకు బదిలీచేసి అక్రమానికి పాల్పడ్డాడు. ఇందులో ఇద్దరు పోస్టల్ అసిస్టెంట్లు సస్పెండయ్యారు. ఆరుగురికి షోకాజ్ నోటీసులు ఇచ్చారు. సూత్రధారి సిస్టమ్ అడ్మినిస్టేటర్ ఇప్పటికీ పరారీలో ఉండటం విస్మయాన్ని కలిగిస్తోంది. డిజిటల్ సంతకాల పాస్ వర్డ్‌లను తెలుసుకుని సిస్టమ్ అడ్మి్రస్టేటర్ అక్రమాలకు పాల్పడ్డాడని గుర్తించారు. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం గుడ్డిగూడెంలో 70 మంది ఖాతాదారులు మోసపోయిన వైనం ఆరు నెలల క్రితం బయటపడింది. డిపాజిట్ సొమ్ము డ్రా చేసేందుకు వెళ్లేసరికి అసలు ఖాతాల్లో సొమ్ములు లేవని తేలడంతో వీరంతా నివ్వెరపోయారు. బాధితులు తాడేపల్లిగూడెం హెడ్‌పోస్టాఫీసుకు ఫిర్యాదు చేయగా విచారణ జరుగుతోంది. నల్లజర్ల మండలం చీపురుగూడెంలో ఖాతాదారు ల డిపాజిట్లను పాస్‌బుక్‌లో నమోదు చేసినా ఐపీపీబీ ఖాతాల్లో జమ చేయలేదు .కల్లూరు సచివాలయ డిజిటల్ అసిస్టెంట్ చిగురుపల్లి గోవర్థన్ తన ఖాతాలో డిపాజిట్ సొమ్ము లేదని గుర్తించడంతో బ్రాంచి పోస్టుమాస్టర్ ఇందిర అవినీతి వ్యవహారం బహిర్గతమైంది. విచారణ జరుగుతోంది. గోకవరం సబ్ పోస్టాఫీసులో తపాలా ఉద్యోగి (జీడీఎస్–పేకర్) ఐపీపీబీ ఖాతాల నుంచి రూ. 20 లక్షలు కాజేసిన వైనాన్ని గతేడాది డిసెంబర్లో ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. డమ్మీ డిపాజిట్లతో లక్షల్లో విత్‌డ్రా చేసి తపాలా శాఖకు షాక్ ఇచ్చాడు. తాజాగా కొవ్వూరు మండలం ధర్మవరం బ్రాంచిలో పోస్టు మాస్టర్ ఖాతాదారులకు కుచ్చుటోపీ వేశారు. పోస్టు మాస్టర్ ఎస్కే మీరావలి నిర్వాకంతో సుమారు 750 మంది డిపాజిటర్లు ఆందోళన చెందుతున్నారు. పెదవేగి ఆనందరావు ధర్మవరం బ్రాంచిలో డిపాజిట్ చేసిన రూ.5లక్షలు కొవ్వూరు ప్రధాన కార్యాలయంలో పరిశీలిస్తే జమ కాలేదని తేలడంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. సుమారు కోటి రూపాయలు దాటి ఉంటుందని తెలుస్తోంది. దీనిపై అసిస్టెంట్ పోస్టల్ సూపరింటెండెంట్ విచారిస్తున్నారు. 2002లో అమలాపురం ప్రధాన తపాలా కార్యాలయంలో ఇందిరా వికాస్ పత్రాలు(ఐకేపీ) పేరుతో రూ.1.50 కోట్లు దురి్వనియోగమయ్యాయి. గడువుతీరిన ఐకేపీ పత్రాలను అడ్డం పెట్టుకుని సొమ్ము కాజేయడం అప్పట్లో సంచలనమైంది. ఇద్దరు పోస్టల్ ఉద్యోగులను తొలగించారు. ఐదుగురిని సస్పెండ్ చేశారు. 31 మందిని బాధ్యులుగా నిర్ధారించి జీతాల నుంచి రికవరీ చేశారు. 81 మంది బాధితుల్లో నలుగురు ఇప్పటికే చనిపోయారు. నిరంతర పర్యవేక్షణ బ్రాంచిల్లో ఐపీపీబీల కార్యకలాపాలపై నిరంతర పర్యవేక్షణతో అవకతవకలకు తావులేకుండా చూస్తున్నాం. ప్రతి నెలా నాలుగైదు బ్రాంచిల్లో ఆకస్మికంగా తనిఖీలు చేస్తున్నాం. నాతో పాటు నలుగురు ఇనస్పెక్టర్లు, సిబ్బంది రెండు బృందాలుగా ఏర్పడి ఐపీపీబీ ఖాతాదారుల పాస్‌పుస్తకాలు, రికార్డులను పరిశీలిస్తున్నాం. బ్రాంచి పోస్టాఫీసులకు వెళ్లి పరిశీలన జరిపే వరకు కూడా బృందం తనిఖీలకు వెళుతున్న సమాచారం గోప్యంగా ఉంచుతాం. కాకినాడ జిల్లాలో షెడ్యూల్ ప్రకారం చేస్తుండబట్టే అవకతవకలకు ఆస్కారం ఉండటం లేదు. నాగేశ్వరరెడ్డి, పోస్టల్ సూపరింటెండెంట్, కాకినాడ ఇలా చేస్తే అడ్డుకట్ట ఐపీపీబీ డివిజన్‌కు ఒక కార్యాలయం మాత్రమే ఉంది. దీంతో పెద్దగా పర్యవేక్షణకు ఆస్కారం ఉండటం లేదు. ఇక్కడ ఉద్యోగులను కూడా అవుట్ సోర్సింగ్‌లో తీసుకుంటున్నారు. ఐపీపీబీ కార్యాలయాల్లో సిబ్బందిని పోస్టల్ బ్రాంచ్ కార్యాలయాలు, సబ్ పోస్టాఫీసులకు అనుసంధానం చేయటంలో లోపాలున్నాయి. తరచూ పోస్టల్ డిపాజిట్లు, అకౌంట్లపై అధికారుల తనిఖీలు ఉండాలి. అధికారులు తనిఖీలకు వచ్చినప్పుడు పోస్టల్ కార్యాలయాల్లో రికార్డులనే కాకుండా క్షేత్ర స్థాయికి వెళ్లి ఖాతాదారుల పాసుపుస్తకాలను కూడా తనిఖీ చేయాలి. వాణిజ్య బ్యాంక్‌ల మాదిరిగానే పోస్టల్ ఖాతాదారుల మొబైళ్లకు మెసేజ్ అలర్టు ఉన్నప్పటికీ నిధులు కాజేసే కొందరు ఉద్యోగులు ఈ మెసెజ్ రాకుండా సర్వర్‌ను నియంత్రిస్తున్నారని తెలుస్తోంది. ఈ విధానాన్ని కట్టడి చేయాల్సి ఉంది.పాస్‌వర్డు కింది స్థాయి సిబ్బందికి తెలియకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకిలా మోసం జరుగుతోంది... ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఐపీపీబీలో ఇటువంటి సంఘటనలు పునరావృతం కావడానికి ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడమే ప్రధాన కారణం. సబ్ పోస్టాఫీసును సూపరింటిండెంట్, అసిస్టెంట్ సూపరింటెండెంట్, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోసాఫీసెస్ వంటి అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తుండాలి. వీరు సబ్ పోస్టాఫీసు, పోస్టాఫీసులను ప్రతి మూడు, అరు నెలలకు తనిఖీ చేస్తున్నా ఐపీపీబీ ఖాతాల ఆన్లైన్ లావాదేవీలపై దృష్టి పెట్టడం లేదు. ఈ విధానమే బ్రాంచి స్థాయిలో అవకతవకలకు ఆజ్యం పోస్తోందని తెలుస్తోంది. తపాలా ఉద్యోగులు, ఐపీపీబీ పర్యవేక్షకుల మధ్య సమన్వయం లేకపోవడం కొంప ముంచుతోంది. ఐపీపీబీ రాక ముందు (పోస్టల్ లావాదేవీలు ఆన్లైన్ కాక ముందు) తపాల కార్యాలయాల ద్వారా సేవింగ్స్ బ్యాంకు, రికరింగ్ డిపాజిట్, ఫిక్సిడ్ డిపాజిట్ ఖాతాలను తెరిచేవారు. ఆఫ్‌లైన్‌లో లావాదేవీలు జరిగేటప్పుడు ఈ తరహా అవకతవకలు చోటుచేసుకోలేదు. ఆన్లైన్, ఐపీపీబీ వ్యవస్థ వచ్చాక ఖాతాల నుంచి సొమ్ము మాయవుతుండటం ఉన్నత స్థాయి వైఫల్యంగానే కనిపిస్తోంది. -
ప్రధాని మోదీ బర్త్‌డే.. విషెస్ చెప్పాలనుకుంటున్నారా ఇలా చేయండి!
వన్‌టౌన్ (విజయవాడ పశ్చిమ): ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజును పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపేందుకు తపాల శాఖ ‘బర్త్ డే పార్శిల్’ పేరుతో ప్రత్యేక కార్డును తీసుకువచ్చినట్లు పోస్టల్ శాఖ విజయవాడ డివిజన్ సీనియర్ సూపరింటెండెంట్ మల్లాది హరిప్రసాద్ చెప్పారు. విజయవాడలోని తన కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హరిప్రసాద్ మాట్లాడుతూ.. ఈ నెల 17వ తేదీన నరేంద్ర మోదీ పుట్టిన రోజు సందర్భంగా దేశ ప్రజలు శుభాకాంక్షలు తెలిపేందుకు వీలుగా ప్రత్యేక కార్డును తీసుకువచ్చినట్లు తెలిపారు. ప్రజలు తమకు దగ్గరలోని పోస్టాఫీస్‌కు వెళ్లి లేదా పోస్ట్‌మేన్‌ను కలిసి రూ.50 చెల్లించి ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని సూచించారు. ఈ అవకాశం అక్టోబర్ రెండో తేదీ వరకు ఉంటుందన్నారు. ఈ నెల 23వ తేదీన విజయవాడలో సుకన్య సమృద్ధి మహోత్సవాన్ని నిర్వహించనున్నట్లు హరిప్రసాద్ చెప్పారు. పదేళ్లలోపు బాలికలకు తల్లిదండ్రులు లేదా సంరక్షకులు పోస్టాఫీస్‌లో ఖాతా తెరిచి ఈ పథకంలో డబ్బు పొదుపు చేయవచ్చన్నారు. ఈ సమావేశంలో పోస్టల్ అధికారులు శోంఠి రవికిషోర్, జి.ఝాన్సీలక్ష్మి పాల్గొన్నారు. -
వయసులో తండ్రీ కొడుకులకు ఏడేళ్లే తేడా!
కర్నూలు (ఓల్డ్‌సిటీ): తండ్రి 1981లో పుడితే అతని కుమారుడు 1988లో పుట్టాడు. వినడానికి వింతగా ఉంది కదూ! కారుణ్య నియామకాల్లో ఓ తపాలా అధికారి చూపిన వింత లీల ఇది. ఈ లీల కర్నూలు జిల్లాలో జరిగింది. ఎమ్మిగనూరు సబ్ డివిజన్ పరిధిలోని దైవందిన్నె గ్రామ వాసి శంకరన్న నకిలీ స్కూల్ సర్టిఫికెట్తో 2005లో కారుణ్య నియామకం ద్వారా తపాలా శాఖలో గ్రామ డాక్ సేవక్ (జీడీఎస్) ఉద్యోగం పొందాడు. ఆ సమయంలో ఎమ్మిగనూరు సబ్ డివిజన్లో ఇన్స్పెక్టర్ ఆఫ్ పోస్టాఫీసెస్ (ఐపీవో)గా పనిచేసిన కె.హరికృష్ణ ప్రసాద్ ఆ నియామకం చేశారు. అయితే 2019లో శంకరన్న కన్నుమూశాడు. ఇదే సమయంలో హరికృష్ణ ప్రసాద్ డివిజన్ హెడ్ (పోస్టల్ సూపరింటెండెంట్) హోదాలో ఉన్నారు. ఈ సమయంలో శంకరన్న కుమారుడు వీరేంద్రకు కూడా కారుణ్య నియామకం ద్వారా తండ్రి ఉద్యోగాన్ని హరికృష్ణ ప్రసాద్ కట్టబెట్టారు. ఈ వ్యవహారంలో ఉన్నతాధికారులు రికార్డులు పరిశీలించగా.. శంకరన్న ఇచ్చిన స్కూల్ సర్టిఫికెట్లో 1981లో పుట్టినట్లుగా ఉంది. కానీ అతని ఆధార్ కార్డులో 1958లో పుట్టినట్లుగా ఉంది. ఇక వీరేంద్ర 1988లో పుట్టినట్లుగా అతని స్కూల్ సర్టిఫికెట్లు స్పష్టం చేస్తున్నాయి. సర్టిఫికెట్లలో తండ్రీ కొడుకులకు మధ్య ఏడేళ్లు మాత్రమే తేడా ఉండటంతో ఆశ్చర్యపోవడం ఉన్నతాధికారుల వంతైంది. శంకరన్నకు సర్వీసులో ప్రయోజనం చేకూర్చడం కోసం హరికృష్ణ ప్రసాద్ తప్పు చేసినట్లు గుర్తించిన ఉన్నతాధికారులు ఆయనకు అత్యున్నత నేర అభియోగం (రూల్–14) అయిన చార్జిషీట్‌ను జారీ చేశారు. దీనిపై హరికృష్ణ ప్రసాద్‌ను వివరణ కోరగా.. తప్పులు జరుగుతాయని, దీనిని ప్రచారం చేయవద్దని అన్నారు. చదవండి: చెత్త సేకరణపై నిఘా.. సిటిజన్ యాప్‌ను రూపొందించిన పంచాయతీరాజ్ శాఖ -
పోస్టాఫీస్ పథకం: రూ.399కే రూ.10లక్షల యాక్సిడెంటల్ ఇన్స్యూరెన్స్!
పోస్టల్ డిపార్ట్ మెంట్ కొత్త పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. టాటా ఏఐజీత కలిసి ఖాతాదారుల కోసం గ్రూప్ యాక్సిడెంట్ గార్డ్ పేరిట యాక్స్డెంట్ ఇన్స్యూరెన్స్ పాలసీని తీసుకువచ్చింది. ఈ పాలసీ హొల్డర్లు ఏడాదికి రూ.399 చెల్లించి రూ.10లక్షల యాక్సిడెంట్ ఇన్స్యూరెన్స్ సదుపాయాన్ని పొందవచ్చు. ఈ పాలసీ గురించి క్లుప్తంగా ►18 నుంచి 65ఏళ్ల వయసు కలిగిన వారు ఎవరైనా సరే పోస్టాఫీస్ నుంచి ఈ పాలసీని పొందవచ్చు. ►పాలసీ హోల్డర్లు ప్రమాదంలో మరణించినా, శాస్వత వైకల్యం ఏర్పడినా రూ.10లక్షలు చెల్లిస్తారు. ►ప్రమాదం జరిగి వైద్యం కోసం ఆస్పత్రిలో చేరితే రూ.60వేలు చెల్లిస్తారు. ►ఔట్ పేషంట్ రూ.30వేల వరకు క్లైమ్ చేసుకోవచ్చు. ►ఇక ఇదే పథకం కింద పాలసీ దారులు రూ.299 చెల్లించినా రూ.10లక్షల వరకు ఇన్స్యూరెన్స్ పొందవచ్చు. దీంతో పాటు ఇతర సౌకర్యాలు పొందవచ్చు. -
మూకుమ్మడిగా కుక్కల దాడి... పోస్టల్ ఉద్యోగి మృతి
ఫ్లోరిడా: నార్త్ ఫ్లోరిడాలో ఒక పోస్టల్ ఉద్యోగి కుక్కల దాడిలో మృతి చెందింది. 61 ఏళ్ల పమేలా జేన్ రాక్ అనే మహిళ తన పోస్టల్ ట్రక్కుతో రోడ్డుపై వెళ్తోంది. ఇంతలో ట్రక్కు కదలకుండా మొరాయించడంతో ఆమె వాహనం దిగి సాయం కోసం చూస్తోంది. అంతే ఎక్కడ నుంచి వచ్చాయో ఒక ఐదు కుక్కలు గుంపుగా ఆమెను చుట్టుముట్టి దాడి చేశాయి. దీంతో ఆమె కింద పడిపోయి గట్టిగా పెడబొబ్బలు పెడతూ సాయం కోసం అరుస్తూ ఉంది. ఆమె కేకలు విని చుట్టు పక్కల ఉన్న నివాసితులు, సదరు కుక్కల యజమాని వెంటనే వచ్చి ఆ కుక్కలను చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. అందులో భాగంగా ఒక వ్యక్తి తుపాకిని గాల్లో రెండు రౌండ్ల కాల్చాడు కూడా. ఐతే పమేలాకి తీవ్ర గాయాలై రక్త స్రావం అవడంతో ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు స్థానికులు. కానీ ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో జంతు నియంత్రణ సంస్థ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆ ఐదు కుక్కలను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై పోలీసుల దర్యాప్తు చేయడమే కాకుండా సదరు కుక్కుల యజమానిని కూడా విచారిస్తున్నారు. యూఎస్ పోస్ట్ సర్వీస్ విడుదల చేసిన డేటా ప్రకారం 2021లో సుమారు 5 వేల మంది పోస్టల్ ఉద్యోగుల పై కుక్కలు దాడి చేశాయని అదికారులు తెలిపారు. కుక్కల యజమానుల తమ కుక్కలను చుట్టుపక్కల వారికి హాని కలిగించకుండా సురక్షితమైన ప్రదేశాల్లో పర్యవేక్షించుకోవాలని సూచించారు అధికారులు. (చదవండి: ఇదేం సరదా.. అడిగి మరీ అరెస్టయింది!) -
Har Ghar Tiranga: 10 రోజుల్లో ఎన్ని పతాకాలు కొన్నారో తెలుసా?
న్యూఢిల్లీ: జాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా నిర్వహిస్తున్న హర్‌ఘర్ తిరంగా పిలుపులో కేవలం పది రోజుల్లో ఆన్లైన్లో పౌరులకు 1 కోటికి పైగా జాతీయ జెండాలను విక్రయించినట్లు కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది. పోస్టల్ విభాగానికి దేశవ్యాప్తంగా ఉన్న 1.5 లక్షల పోస్టాఫీసుల ద్వారా జాతీయ జెండాలను విక్రయిస్తోంది. దేశవ్యాప్తంగా ఏ చిరునామాకైనా ఉచిత డోర్‌స్టెప్ డెలివరీని కూడా ఆఫర్ చేస్తోంది. ఒక్కో త్రివర్ణ పతాకాన్ని 25 చొప్పున పౌరులు 1.75 లక్షలకు పైగా జెండాలను ఆన్లైన్లో కొనుగోలు చేశారు. దేశవ్యాప్తంగా 4.2 లక్షల మంది తపాలా ఉద్యోగులు నగరాలు, పట్టణాలు, గ్రామాలతోపాటు, సరిహద్దు ప్రాంతాలలో, తీవ్రవాదుల ప్రభావిత జిల్లాల్లో పర్వత, గిరిజన ప్రాంతాల్లో సైతం విస్తృతంగా ప్రచారం చేశారని డిఓపి తెలిపింది. ప్రభాత్ భేరీలు, బైక్ ర్యాలీ చౌపల్స్ సభల ద్వారా, సమాజంలోని ప్రతి వర్గానికి 'హర్ ఘర్ తిరంగా' సందేశాన్ని తీసుకెళ్లామని వెల్లడించింది. "ప్రభాత్ ఫేరిస్, బైక్ ర్యాలీ మరియు చౌపల్స్ సభల ద్వారా, ఇండియా పోస్ట్ సమాజంలోని ప్రతి వర్గానికి 'హర్ ఘర్ తిరంగా' సందేశాన్ని తీసుకువెళ్లింది. ప్రోగ్రామ్ యొక్క సందేశాన్ని వ్యాప్తి చేయడానికి ట్విట్టర్ మరియు ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా సాధనాలు కూడా విస్తృతంగా ఉపయోగించబడ్డాయి. డిజిటల్‌గా అనుసంధానించబడిన పౌరులు" అని పోస్టల్ శాఖ తెలిపింది. కాగా 75 సంవత్సరాల స్వాతంత్ర్య వేడుకల్లో భాగంగా ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ప్రోగ్రామ్ తీసుకొచ్చింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 13 నుంచి 15 వరకు మూడు రోజులు ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. ఈ పిలుపులో చాలామంది ప్రజలు స్పందిస్తున్నారు. సోషల్ మీడియాలో పలు పోస్ట్‌లు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. What is Your Excuse??.. Tiranga Merit Shan 🇮🇳 HarGharTiranga🇮🇳 pic.twitter.com/qg6n2OR0aC — ट्विटर पर उपस्थित 🙄 (@aapki_harsha) August 12, 2022 p> “I can't see the flag, but I can feel patriotism by touching the flag” - Madhuri, class IX student.@IndiaPostOffice #HarGharTiranga pic.twitter.com/XnDfS8c8Hi — Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) August 12, 2022 -
శభాష్.. సుప్రియ
మైలవరం: (జమ్మలమడుగు రూరల్): తొమ్మిదేళ్ల వయసులోనే తల్లిని, పన్నెండేళ్ల వయసులో తండ్రిని కోల్పోయిన ఆ బాలిక పట్టుదలతో చదువును కొనసాగించి పద్దెనిమిదేళ్ల వయసులోనే పోస్టల్‌శాఖలో ఉద్యోగం సాధించి అందరిచేత శభాష్ అనిపించుకుంది. మైలవరం మండలం వద్దిరాల గ్రామానికి చెందిన గడ్డం సుమలత, మద్దిరాల ప్రసాద్‌ల ఏకైక కుమార్తె సుప్రియ. దురదృష్టవశాత్తు 2013లో మిద్దె కూలి తల్లి సుమలత మరణించగా 2016లో తండ్రి ప్రసాద్ గుండెపోటుతో చనిపోయాడు. తల్లిదండ్రులిద్దరూ కానరాని లోకాలకు వెళ్లిపోయినా సుప్రియ మాత్రం ఆత్మస్థైర్యంతో చదువును కొనసాగించింది. మేనమామ గడ్డం ఓబులేసు సంరక్షణలో ఉంటూ రాజుపాలెం మండలం వెల్లాల గురుకుల పాఠశాలలో 10 వ తరగతి వరకు చదివింది. పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో 600కు 594 మార్కులు సాధించి ఔరా అనిపించింది. సుప్రియ ఇంటర్మీడియట్ రెండేళ్లు కర్నూలు జిల్లా బనగానపల్లెలోని కంకర గురివిరెడ్డి జూనియర్ కళాశాలలో చదివింది. అక్కడ బైపీసీ గ్రూపు తీసుకొని 1000 మార్కులకు 952 మార్కులు తెచ్చుకొని అందరి మన్ననలు పొందింది. కాగా ఈ ఏడాది జూన్ నెలలో పోస్టల్‌శాఖ విడుదల చేసిన ఫలితాల్లో సుప్రియ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఉద్యోగానికి ఎంపికైంది. ఈమెను నంద్యాల పోస్టల్ డివిజన్లోని బురుజుపల్లె పోస్టాఫీసులో బీపీఎంగా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. మూడేళ్లుగా అమ్మ ఒడికి దూరం.. చిన్నవయసులోనే తల్లిదండ్రులను కోల్పోయిన సుప్రియ జగనన్న ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమ్మఒడి పథకాన్ని అందుకోలేకపోయింది. వాస్తవానికి సుప్రియ తల్లిదండ్రుల్లో ఏ ఒక్కరు బతికి ఉన్నా ఆమెకు అమ్మ ఒడి వర్తించేది. ఇద్దరూ చనిపోవడంతో సుప్రియ మేనమామ గడ్డం ఓబులేసు ఆమెకు సంరక్షకుడిగా ఉన్నారు. అయితే ఓబులేసుకు కూడా 3వ తరగతి చదివే కుమారుడు ఉండడంతో ఆ అబ్బాయికి అమ్మఒడి వర్తించింది. ఒక కుటుంబంలో ఒక్కరికే అమ్మఒడి అనే నిబంధన ఉండడంతో సుప్రియకు అమ్మ ఒడి వర్తించలేదు. తల్లిదంద్రలు ఇరువురూ చనిపోయిన పిల్లలకు అమ్మఒడి డబ్బులను సంరక్షకుల పేరు మీద కాకుండా విద్యార్థుల బ్యాంకు ఖాతాలో పడేలా రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలను సవరిస్తే తనలాంటి వారికి ఎందరికో మేలు జరుగుతుందని సుప్రియ అంటున్నారు. -
పోస్ట్ ఇన్ఫో యాప్.. క్షణాల్లో డిజిటల్ సేవలు
పెదవాల్తేరు(విశాఖ తూర్పు): తపాల శాఖ పూర్వకాలం నాటి పద్ధతులకు స్వస్తి పలుకుతూ.. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త టెక్నాలజీతో వినియోగదారులకు సేవలు అందించడానికి ప్రయత్నం చేస్తోంది. కేవలం ఉత్తరాల బట్వాడా లాంటి సేవలకే పరిమితమైతే మనుగడ కష్టమని గ్రహించిన తపాలా శాఖ.. మార్కెట్లోకి వచ్చిన ప్రతి సేవనూ తామూ అందిస్తామని సగర్వంగా ప్రచారం చేస్తోంది. ఆధార్ కార్డు నమోదు, సవరణలు, పాస్‌పోర్టు దరఖాస్తు తదితర ఎన్నో సేవలు అందిస్తూ వినియోగదారులకు చేరువ అవుతోంది. సుకన్య సమృద్ధి యోజన, రికరింగ్, సేవింగ్స్ డిపాజిట్ల సేకరణలో కూడా వినూత్న పంథా అనుసరిస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే అన్నింటా తానూ ఉన్నానని చాటిచెబుతోంది. త్వరితగతిన సమాచారం నిమిత్తం ఇప్పుడు ప్రజలంతా మొబైల్ ఫోన్ల మీదనే ఆధార పడుతున్నారు. అన్ని రకాల సేవలు ఫోన్ల ద్వారా సులభంగా పొందుతున్నారు. ఈ నేపథ్యంలో తపాలా శాఖ కూడా మొబైల్ యాప్ ‘పోస్ట్ ఇన్ఫో’ తీసుకొచ్చింది. పోటీ ప్రపంచంలో బ్యాంకులు, ఇతర సేవలందించే వివిధ సంస్థలకు దీటుగా ఈ యాప్ చక్కగా ఉపయోగపడుతుంది. ఆండ్రాయిడ్ మొబైల్లో ప్లేస్టోర్ నుంచి యాప్‌ను డౌన్లోడు చేసుకోవచ్చు. యాప్ ద్వారా తొమ్మిది రకాల సేవలు పొందే సౌకర్యం ఉంది. ప్రీమియం, వివిధ రకాల డిపాజిట్లపై వడ్డీ లెక్కలు సైతం వెంటనే తెలుసుకోవచ్చు. ఇప్పటికే పోస్ట్ బ్యాంక్ యాప్ వినియోగంలో ఉంది. పలు రకాల సేవలు అందించే తపాలా శాఖ ఏటీఎం సౌకర్యం కూడా ఏర్పాటు చేసింది. యాప్‌లో ఫీచర్స్ ఇవే.. సుకన్య సమృద్ధి యోజన పథకం రికరింగ్ డిపాజిట్ పథకం. టైం డిపాజిట్లో ఏడాది నుంచి ఐదేళ్ల వరకు చేసే డిపాజిట్లపై ఆదాయాన్ని తెలుసుకోవచ్చు. ఇంట్రస్ట్ కాలిక్యులేటర్ ఏ డిపాజిట్ పథకంలో ఎంత సొమ్ము కడితే ఎంత మొత్తం తిరిగి పొందవచ్చు. దానికి సంబంధించిన వివిధ పథకాల సమాచారం తెలుసుకోవచ్చు. ఆర్టికల్ ట్రాకింగ్ వినియోగదారులు పంపిన స్పీడ్ పోస్టు, రిజిస్టర్ పోస్టు, పార్శిల్, ఈఎంవో ఎక్కడ ఉన్నాయి. అవతలి వ్యక్తులకు ఎప్పుడు చేరుతుందో తెలుసుకునేందుకు ఉపయోగపడుతుంది. సర్వీస్ రిక్వెస్ట్ ఇంటి వద్ద సేవలు పొందేందుకు, డోర్ డెలివరీ వంటి సదుపాయాలకు సంబంధించిన సమాచారం కూడా తెలుసుకోవచ్చు. కంప్లైంట్స్ ట్రాకింగ్ వినియోగదారులు ఇచ్చిన ఫిర్యాదులు ఏ దశలో ఉన్నాయి. దానికి సంబంధించిన సమాచారం ఇంకా ఏమైనా కావాలా అనే అంశాలు తెలుస్తాయి. ఇన్సూరెన్స్ పోర్టల్ తపాలా శాఖ ద్వారా అందిస్తున్న వివిధ రకాల బీమా పథకాల సమాచారం తెలుసుకోవచ్చు. ఫీడ్ బ్యాక్ పోస్టల్ సేవలకు సంబంధించిన సందేహాలు ఏమైనా ఉంటే వివరంగా తెలుసుకోవచ్చు. సలహాలు, సూచనలు ఇవ్వవచ్చు. పోస్టేజ్ కాలిక్యులేటర్ వినియోగదారులు పంపించే పార్సిళ్లు, పోస్టల్ కవర్లు, ధరలు, ఎంత బరువుకు ఎంత చెల్లించాలి. సాధారణ, స్పీడ్ పోస్టులో పంపితే ఎంత ఖర్చు అవుతుంది. అన్న విషయాన్ని చాలా సులభంగా, స్పష్టంగా తెలుసు కోవచ్చు. పోస్టల్ ఆఫీస్ సెర్చ్ దేశంలో ఏ పిన్ కోడ్ అయినా తెలుసుకోవచ్చు. ఊరి పేరు నమోదు చేయగానే సంబంధిత పిన్‌కోడ్ వస్తుంది. పిన్‌కోడ్ నంబర్ తెలిస్తే డెలివరీ కావాల్సిన పోస్ట్ ఆఫీసు ఎక్కడ ఉంది. ఏ తపాలా ప్రధాన కార్యాలయం పరిధిలో ఉందో కూడా ఇట్టే తెలుసుకోవచ్చు. యాప్‌తో ఉపయోగాలు పోస్ట్ ఇన్ఫో యాప్‌తో వినియోగదారులకు మరిన్ని సేవలు అందుబాటులోకి అందుతాయి. మొబైల్ ఫోన్ల ద్వారా పలు రకాల సేవలు అందిస్తున్నాం. తపాలా వినియోగదారులంతా ఈ యాప్‌ను డౌన్లోడు చేసుకోవడం ద్వారా కొత్త సేవలు పొందవచ్చు. – సోమశేఖరరావు, సీనియర్ సూపరింటెండెంట్, తపాలాశాఖ, విశాఖ -
పోస్టాఫీసుల్లో డిజిటల్ సేవలు
సాక్షి, హైదరాబాద్: తపాలా శాఖ డిజిటల్ సేవలకు సిద్ధమైంది. ఇప్పటి ఇండియా పోస్టల్ పేమెంట్ బ్యాంక్ ద్వారా డిజిటల్ సేవలందిస్తున్న పోస్టల్ శాఖ తాజాగా పోస్టాఫీసుల్లో జరిగే సాధారణ లావాదేవీలను సైతం డిజిటల్ సేవలకు శ్రీకారం చుట్టింది. స్పీడ్, రిజిస్టర్డ్, పార్శిల్ సర్వీస్ చార్జీలను డిజిటల్ చెల్లింపులకు అనుమితిస్తోంది. నగదుతో పని లేకుండా జీ పే, ఫోన్‌పే ద్వారా చార్జీలను స్వీకరిస్తోంది. వినియోగదారులకు వెసులుబాటు కలిగినట్లయింది. (చదవండి: సిలిండర్ వెయ్యి అయ్యింది. మహిళలకు కట్టెల పొయ్యే దిక్కయింది: కేటీఆర్) -
సినిమా రేంజ్లో గాల్లోకి ఎగిరిపడ్డ ట్రక్! వైరల్ వీడియో
A truck carrying United States Postal Service (USPS) mail: చాలా భయంకరమైన ప్రమాదాలు గురించి విన్నాం. పైగా అంతపెద్ద ప్రమాదం జరిగినప్పటికీ త్రుటిలో బయట పడ్డ మృత్యుంజయులను చూశాం. బతికే అవకాశం లేదనే ప్రమాదంలో గాయాలు పాలుకాకుండా బయటపడి అందర్నీ ఆశ్చర్య పరిచని ఘటనలు కోకొల్లలు. అచ్చం అలాంటి సంఘటనే అమెరికాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..యునైటెడ్ స్టేట్స్ పోస్టల్ సర్వీస్(యూఎస్పీఎస్) మెయిల్‌ను తీసుకువెళ్తున్న ట్రక్కు 50 అడుగుల వంతెన పై నుంచి బోస్టన్ సమీపంలోని మంచుతో నిండిన నదిలో పడింది. అయితే డ్రైవర్ మాత్రం అద్భుతంగా ప్రాణాలతో బయటపడ్డాడు. కానీ డ్రైవర్‌కి ఈత రాకపోవడంతో పాక్షికంగా నీట మునిగిన ట్రక్ పై ఉన్నాడు. అంతేకాదు అతనికి ఎలాంటి గాయాలు అవ్వలేదు. అయితే దగ్గరలోనే అగ్నిమాపక సిబ్బంది ఉన్నందును సత్వరమే స్పందించి ఆ డ్రైవర్ని ఒడ్డుకు చేర్చారు. ఆ తర్వాత అతన్ని బ్రిగ్హామ్ అండ్ ఉమెన్స్ హాస్పిటల్‌కు తరలించారు. ఈ మేరకు ఈ ఘటన ఆ నదికి సమీపంలో ఉన్న సీసీ కెమరాలో రికార్డు అయ్యింది. దీంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. EXCLUSIVE FOOTAGE: Never before seen video of the major TT crash Saturday in Weston Click here for more:https://t.co/CRRpYWhfAS (@MassStatePolice, @WESTON_FIRE, @NewtonFireDept, @SPAMPresident, @wbz, @WCVB, @7News, @NBC10Boston, @boston25, @bostonherald, @LiveBoston617) pic.twitter.com/ZUmJJbXF6Z — State Police Association of Massachusetts (@MSPTroopers) February 27, 2022 (చదవండి: ఒంటి చేత్తో యుద్ధ ట్యాంక్‌ని ఆపాడు! వైరల్ వీడియా) -
Punganur Cow: బుల్లి ఆవుకు అరుదైన గౌరవం
పుంగనూరు(చిత్తూరు జిల్లా): పుంగనూరు జాతి ఆవులను క్రీ.శ. 610 సంవత్సరంలో గుర్తించినట్లు శాసనాలు పేర్కొంటున్నాయి. బాణులు, నోళంబులు, వైదంబ చోళ ప్రభువులు పుంగనూరు ఆవును పోషించేవారు. పుంగనూరు నుంచి తిరుపతి వరకు గల అప్పటి అభయారణ్యంలో పుంగనూరు ఆవులు అభివృద్ధి చెందాయి. చదవండి: చుక్క గొరక.. సాగు ఎంచక్కా! ఆవుల విశిష్టత భారతదేశంలో ఎక్కడా లేని విధంగా పుంగనూరు ఆవులు చిన్న అకారాన్ని కలిగి ఉంటాయి. మంచి ఔషధ గుణాలు, స్నేహపూర్వకంగా మెలుగుతాయి. ప్రపంచ దేశాల్లో ఈ ఆవు పాలకు మంచి గిరాకీ ఉంది. తెలుపు, నలుపు వర్ణాలతో ఉంటాయి. ఈ ఆవు పాలలో ఉన్న ఔషధ గుణాలు మరే పాలలోనూ లేదని బయోడైవర్సిటీ యూనివర్సిటీ ప్రకటించింది. ఈ ఆవుల చరిత్ర, విశిష్టత గురించి మద్రాస్ ప్రభుత్వం అప్పట్లో గెజిట్‌ను విడుదల చేసింది. అలాగే కేఎస్ఎస్ శేషన్ అనే రచయిత తన పరిశోధనాత్మక పుస్తకం బ్రిటీష్ రోల్ ఇన్ రూరల్ ఎకానమీలో పుంగనూరు ప్రాంత ఆవుల గురించి జమీందారులు చేపట్టిన సంరక్షణ చర్యలను విశదీకరించారు. రూ.70 కోట్లతో పరిశోధన కేంద్రం ఈ జాతి ఆవులు అంతరించిపోతుండడంతో వీటిని అభివృద్ధి చేసేందుకు ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ కడప జిల్లాలో రూ.70 కోట్లతో పరిశోధన కేంద్రం ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్శా ఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి పుంగనూరు జాతి ఆవుకు తగిన గుర్తింపునకు చర్యలు తీసుకున్నారు. జాతీయ స్థాయిలో గుర్తింపు లభించేలా పోస్టల్ స్టాంపు, కవర్ విడుదల చేయడంలో సఫలీకృతులయ్యారు. ఆవుకు జాతీయ గుర్తింపు రావడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేకతలు ♦ఈ ఆవులు 70 నుంచి 90 సెంటీమీటర్ల ఎత్తు మాత్రమే ఉంటుంది. ♦ఎద్దులు కూడా ఇదే పరిణామంలో ఉంటాయి. ♦పుంగనూరు ఆవులను దేవతా గోవులుగా పిలుస్తారు. ♦సాధారణ గోవు పాలలో 3 నుంచి 3.5 శాతం వరకు కొవ్వు పదార్థాలు ఉంటాయి. ఈ జాతి ఆవు పాలలో 8 శాతం కొవ్వు పదార్థాలతో పాటు పూర్తిగా ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. ♦ఈ జాతి ఆవులు 115 నుంచి 200 కిలోల బరువు కలిగి ఉంటుంది. ♦ప్రతి రోజూ ఒక ఆవు 5 కిలోల పచ్చిగడ్డిని తింటుంది. ♦2 నుంచి 4 లీటర్ల వరకు పాల దిగుబడి ఇస్తుంది. ♦ఎంత కరువు పరిస్థితులు ఎదురైనా తట్టుకుని జీవించగలవు. ♦లేత చర్మం, చిన్న పొదుగు, చిన్న తోక, చిట్టికొమ్ములు కలిగి నలుపు, తెలుపు వర్ణంలో ఉంటాయి. ♦వీటి ధర రూ. లక్ష నుంచి రూ. 20 లక్షల వరకు ఉంటుంది. -
ఆ స్వీటుకు అంతర్జాతీయ గుర్తింపు, వందేళ్లకు పైగా చరిత్ర.. తాజాగా మరో గుర్తింపు!
సాక్షి, విశాఖపట్నం: మీకు తెలుసా కాకినాడ కాజాకు అంతర్జాతీయంగా గుర్తింపు ఉందని. వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన ఈ కాజాను దక్షిణ భారతంలో ప్రసిద్ధి వంటకంగా పేరుంది. 1891లో తొలిసారిగా ఈ గొట్టం కాజా తయారీ జరిగింది. కోటయ్య అనే ఆయన తొలిసారి ఈ కాజాను తయారు చేశారు. 2018లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ కాజాకు జియోగ్రాఫిక్ ఇండికేషన్ సౌకర్యం కల్పించి అంతర్జాయంగా మరింత ప్రచారం కల్పించింది. ప్రత్యేక పోస్టల్ కవర్ విడుదల ద్వారా కాకినాడ గొట్టం కాజా చరిత్రను తపాలా శాఖ మరోసారి నేటి తరానికి అందించింది. దీంతో పాటు మాడుగుల హల్వా విశిష్టతను సైతం ప్రత్యేక పోస్టల్ కవర్ ద్వారా వెలుగులోకి తెచ్చింది. విశాఖ జిల్లా మాడుగుల వేదికగా 1890లో తొలిసారి తయారు చేసిన ఈ హల్వాకు అంతర్జాతీయ గుర్తింపు ఉంది. గోధుమపాలు, నెయ్యి, జీడిపప్పు, బాధం పప్పుS సమాహారంగా మాడుగుల వాసులు ఈ రుచికరమైన హల్వాను తయారు చేస్తున్నారు. ఈ హల్వా లైంగిక సామర్థ్యం పెంచే గుణం కూడా ఉన్నట్లు అంతర్జాతీయంగా ప్రచారం ఉంది. దీంతో పాటు ఆత్రేయపురం పూతరేకుల విశిష్టతపైనా తపాలా శాఖ ప్రత్యేక పోస్టల్ కవర్‌ను ముంద్రించి ఆ విశిష్టతలను ప్రస్తుత తరానికి అందించింది. చదవండి: కాళ్లకు తాడు కట్టుకుని బావిలో ఈత.. ఎలా సాధ్యం? -
ఈ పోస్టల్ స్టాంప్ డిజైన్ చేస్తే రూ.15 వేలు మీ సొంతం
మీకు ఫోటో డిజైనింగ్ విషయంలో నైపుణ్యం ఉందా? అయితే మీకు ఒక శుభవార్త. ప్రత్యేక పోస్టల్ స్టాంప్ రూపకల్పన చేసిన వారికి కేంద్ర ప్రభుత్వం రూ.15,000 వరకు నగదు బహుమతి అందించనుంది. "సైన్స్ అండ్ టెక్నాలజీలో భారతదేశం సాధించిన అతిపెద్ద విజయాలు ఏమిటి? వాటితో కూడిన ఒక పోస్టల్ స్టాంప్ డిజైన్ చేస్తే రూ.15,000 వరకు గెలుచుకునే అవకాశం ఉంది!" అని కేంద్రం ట్వీట్ చేసింది.(చదవండి: వర్క్ ఫ్రమ్ హోం: ఇదీ పరిస్థితి!) భారతదేశం 75వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకున్న సందర్భంగా విజ్ఞాన్ ప్రసార్, డిపార్ట్ మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా పోస్టల్ స్టాంప్ డిజైన్ పోటీని ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ పోర్టల్ www.mygov.in ఓపెన్ చేసి మీ వివరాలు సమర్పించి లాగిన్ కావాల్సి ఉంటుంది. ఈ పోటీలో పాల్గొనడానికి చివరి తేదీ సెప్టెంబర్ 15, 2021 రాత్రి 11.45. మొదటి బహుమతి రూ.15,000, రెండో బహుమతి 10,000, మూడో బహుమతి 5,000, మూడు కన్సోలేషన్ ప్రైజ్ రూ.2,000. ఈ పోటీలో పాల్గొనడానికి ఇక్కడ క్లిక్ చేయండి. Calling creative minds to participate in the postal stamp design competition on the theme - "विज्ञान से विकास - प्रौद्योगिकी से प्रगति". Submit your entry today and stand a chance to win cash prizes of upto ₹15,000. Visit: https://t.co/8NZHsTJUi9 pic.twitter.com/fhF6y8oYvW — MyGovIndia (@mygovindia) August 24, 2021 -
అల్లూరి పేరిట పోస్టల్ కవర్
చింతపల్లి: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు చరిత్ర భావితరాలకు ఆదర్శనీయమని అరకు ఎంపీ గొడ్డేటి మాధవి, పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి అన్నారు. స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా చింతపల్లి పోలీస్ స్టేషన్‌పై అల్లూరి సీతారామరాజు దాడి చేసి వందేళ్లు పూర్తయిన సందర్భంగా తపాలా శాఖ ఆదివారం విశాఖ జిల్లా చింతపల్లిలో అల్లూరి పేరిట పోస్టల్ కవర్‌ను ఆవిష్కరించింది. తొలుత ఎంపీ, ఎమ్మెల్యే, తపాలా శాఖ అధికారులు పాత బస్టాండ్ నుంచి సెయింట్ ఆన్స్ స్కూల్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, పోస్టల్ కవర్‌ను ఆవిష్కరించారు. అల్లూరి పోరాట చరిత్ర భావితరాలకు గుర్తుండాలనే లక్ష్యంతోనే పోస్టల్ కవర్‌ను ఆవిష్కరించినట్టు విశాఖ రీజియన్ పోస్ట్‌మాస్టర్ జనరల్ డాక్టర్ ఎన్.వెంకటేశ్వర్లు తెలిపారు. అల్లూరి దాడి చేసిన ప్రతి పోలీసు స్టేషన్‌కు ఒకటి చొప్పున పోస్టల్ కవర్‌ను విడుదల చేయనున్నట్టు ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఏపీ మెడికల్ కౌన్సిల్ సభ్యుడు డాక్టర్ తమర్భ నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు. -
‘పోస్ట్’లో పూతరేకులు!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని స్థానిక ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతి తీసుకువచ్చేందుకు పోస్టల్ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. వివిధ ప్రాంతాలకు చెందిన ఆహార పదార్థాలు, చేనేత ఉత్పత్తుల పేరిట పోస్టల్ కవర్లు విడుదల చేస్తోంది. ఇందులో భాగంగా ఆత్రేయపురం పూతరేకులు, ధర్మవరం చీరల ప్రత్యేకతను తెలియజేసే కవర్లను ఇప్పటికే అందుబాటులోకి తెచ్చింది. అంతేకాకుండా వీటిని జాతీయంగా, అంతర్జాతీయంగా మార్కెటింగ్ చేసేందుకు వివిధ సంస్థలతో ఒప్పందాలు కూడా చేసుకుంటోంది. ఆప్కో, లేపాక్షితో పాటు వివిధ ఆహార ఉత్పత్తుల సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నట్లు ఏపీ సర్కిల్ అసిస్టెంట్ పోస్ట్‌మాస్టర్ జనరల్ కె.సుధీర్‌బాబు తెలిపారు. ఆప్కోతో ఒప్పందం ద్వారా ఇప్పటికే ధర్మవరం, మంగళగిరి, ఉప్పాడ తదితర చేనేత ఉత్పత్తులను దేశవ్యాప్తంగా డెలివరీ చేస్తున్నామని చెప్పారు. బందరు లడ్డు, ఆత్రేయపురం పూతరేకులు తదితర ఆహార ఉత్పత్తులను కూడా వేగంగా అందించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ముందుగా ఆత్రేయపురం పూతరేకులను సమీప ప్రాంతాలకు డెలివరీ చేసేందుకు అవసరమైన జాగ్రత్తలను పరిశీలిస్తున్నామని తెలిపారు. వీటన్నిటి కోసం ఆన్లైన్ పోర్టల్‌ను అభివృద్ధి చేస్తున్నామని, గాంధీ జయంతి సందర్భంగా దీన్ని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. మహనీయుల పేరిట పోస్టల్ కవర్లు.. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా వివిధ రంగాల్లో సేవలందించిన మహనీయుల పేరిట ప్రత్యేక కవర్లను పోస్టల్ శాఖ విడుదల చేస్తోందని సుధీర్‌బాబు చెప్పారు. ఆత్మ నిర్భర్ భారత్, వోకల్ ఫర్ లోకల్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో భౌగోళిక గుర్తింపు(జీఐ) పొందిన 18 ఉత్పత్తులతో పాటు జీఐ కోసం దరఖాస్తు చేసుకున్న మరో 10 ఉత్పత్తులపై కూడా ప్రత్యేక తపాలా కవర్లు విడుదల చేయనున్నట్టు తెలిపారు. ఇప్పటివరకు మొత్తం 33 ప్రత్యేక కవర్లు విడుదల చేసినట్టు వివరించారు. రూ.20 నుంచి రూ.150 ధర ఉన్న ఈ కవర్లను దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన పోస్టాఫీసుల్లో అందుబాటులో ఉంటాయన్నారు. దేశంలో ఇంత పెద్దఎత్తున ప్రత్యేక కవర్లను విడుదల చేసిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్.. దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని సుధీర్‌బాబు పేర్కొన్నారు. రానున్న కాలంలో రాష్ట్రంలో విద్య, వైద్య, పారిశ్రామిక రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన వ్యక్తుల పేరిట కూడా ప్రత్యేక కవర్లు విడుదల చేయడానికి పోస్టల్ శాఖ ప్రణాళికలు సిద్ధం చేసిందన్నారు. -
తపాలాశాఖ సేవకు పెరుగుతున్న ఆదరణ
సాక్షి, హైదరాబాద్: ఆధార్‌కార్డుతో మొబైల్ నెంబరు అనుసంధానం/నంబర్ మార్పులాంటి వాటికి ఇక ఎక్కడికో వెళ్లాల్సిన పనిలేదు. ఫోన్‌చేస్తే చాలు తపాలా సిబ్బంది ఇంటి కే వచ్చి పని చేస్తారు. తపాలాశాఖ అందుబాటులోకి తెచ్చిన ఈ సేవ ఇప్పుడు జనాన్ని బాగా ఆకట్టుకుంటోంది. ఇప్పుడు ప్రతి పనికీ ఆధార్ అవసరమవుతోంది. దానికి సంబం ధించి ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. ఇందుకు ఆధార్‌తో ఫోన్ నంబర్ అనుసం ధానం తప్పనిసరి. ఈ పనికి ఆధార్ కేంద్రానికి వెళ్లి అక్కడ క్యూలో నిలబడి పని చేయించుకోవాల్సి వస్తోంది. పనులు మాని మరీ ఆధార్ కేంద్రానికి వెళ్లాలి. కానీ, ఈ ఇబ్బంది లేకుండా, ఫోన్‌చేస్తే తపాలా సిబ్బందే ఇంటికి వచ్చి మనకు అనుకూలమైన సమయంలో అనుసంధానం చేసి వెళ్తారు. ఇప్పటికే నంబర్ అనుసంధానమై ఉన్నప్పుడు.. ఫోన్ నంబరు మారినా, కొత్త నంబర్‌తో అనుసంధానించుకోవాలని అనుకున్నా తపాలా సిబ్బంది ఆ పనిచేసి వెళ్తారు. ఇందుకు ఒక్కో అనుసంధానానికి రూ.50 చొప్పున చార్జి చేస్తారు. సంబంధిత పోస్టాఫీసు పోస్టుమాస్టర్ లేదా పోస్ట్‌మేన్‌కు ఫోన్‌చేస్తే ఇంటికి వస్తారని తపాలాశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. -
ఆధార్ యూజర్లకు షాక్.. 2 సేవలు నిలిపివేత!
ఆధార్ యూజర్లకు యుఐడీఏఐ షాక్ ఇచ్చింది. యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యుఐడీఏఐ) చిరునామా ధ్రువీకరణ ప్రక్రియను, డాక్యుమెంట్ల పునఃముద్రణకు సంబంధించిన రెండు సేవలను నిలిపివేసినట్లు తెలిపింది. యుఐడీఏఐ పోస్టల్ చిరునామా ధ్రువీకరణ లేఖ ద్వారా ఆధార్ కార్డులో వివరాలను అప్డేట్ చేసుకునే సౌకర్యాన్ని నిలిపివేసింది. యుఐడీఏఐ ఇచ్చిన సమాచారం ప్రకారం తదుపరి ఆర్డర్లు వచ్చే వరకు అడ్రస్ వాలిడేషన్ లెటర్ సదుపాయాన్ని నిలిపివేసింది. అడ్రస్ వాలిడేషన్ లెటర్ ఆప్షన్ తొలగించడం వల్ల అద్దెకు ఉంటున్న వారిపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. అలాగే ఎలాంటి డాక్యుమెంట్లు లేని వారు కూడా ఇకపై అడ్రస్ మార్చుకోవడం ఇక కష్టం కావొచ్చు. అలాగే, యుఐడీఏఐ పాత కార్డును రి ప్రింట్ చేసే అవకాశాన్ని నిలిపివేసింది. ఇంతకు ముందు కార్డుదారులు అసలు కార్డును కోల్పోతే పాత ఆధార్ కార్డును తిరిగి ముద్రించుకునే అవకాశం ఉంది. లైవ్ హిందుస్థాన్ ప్రకారం ఈ సేవలు ఇప్పుడు నిలిపివేసినట్లు తెలుస్తోంది. ఇటీవల, ట్విట్టర్ లో ఒక వ్యక్తి ఆధార్ కార్డు రీప్రింట్, అడ్రస్ వాలిడేషన్ లెటర్ గురించి ఆధార్ కార్డు హెల్ప్ లైన్ ను అడిగాడు. దీనికి, హెల్ప్ సెంటర్ నుంచి సర్వీస్ అందుబాటులో లేదని సమాధానం వచ్చింది. ఆధార్ కార్డు రీప్రింట్ స్థానంలో పీవీసీ కార్డును పొందవచ్చు. ఇది ఏటీఎం పరిమాణంలో ఉంటుంది. -
Post Cord Day: ఆ పాత ‘ఉత్తరం’ ఎక్కడోపోయింది..
సాక్షి, సుజాతనగర్(భద్రాద్రి కొత్తగూడెం): బంధువుల యోగక్షేమాలు తెలుసుకోవాలన్నా.. స్నేహితులతో కబుర్లు చెప్పుకోవాలన్నా.. ప్రియుడు/ప్రియురాలితో మనసులోని భావాలను పంచుకోవాలన్నా.. సైనికులు తమ కుటుంబాలకు వివరాలు తెలపాలన్నా.. పాత రోజుల్లో పోస్ట్‌కార్డు (ఉత్తరం) ఉండేది. ఆ ఉత్తరాల ద్వారానే అన్ని రకాల సమాచారం చేరవేసుకునేవారు. ఇంటి ముందటికి పోస్ట్‌మ్యాన్ వచ్చి పోస్ట్ అనగానే ఇంటిల్లిపాది అతడి దగ్గరవాలిపోయేవారు. ఉత్తరాలు చదివి.. తిరిగి జవాబు రాసి పంపించి ఎంతో ఆనందించేవారు. నేడు పోస్ట్ కార్డు డే సందర్భంగా ఆ పాత ఉత్తరాన్ని గుర్తుచేశాం. చదవండి: తలకు గన్నుపెట్టి భూమి పత్రాలను రాయించుకున్న ఎస్సై.. -
వినూత్న ప్రయత్నం: స్టాంపులపై సాహితీ ముద్ర
సాక్షి, హైదరాబాద్: శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలోని ఆధునిక మార్పులు, తాత్విక అంశాలు కలగలిపి అద్భుత రచనలతో సాహిత్యంలో తొలి నోబెల్ బహుమతి అందుకున్న ఫ్రెంచ్ రచయిత సల్లీ ప్రుధోమ్మే... కాల్పనిక పాత్రలు సృష్టించి, అవి చేసే పనులతో మనల్ని కాల్పనిక లోకంలో విహరింపజేసిన బ్రిటిష్ రచయిత చార్లెస్ డికెన్స్... కవిత్వం అంటే ఇలా ఉండాలి అని ప్రపంచం నలుమూలలా అనిపించుకున్న రాబర్ట్ ఫ్రాస్ట్... 103 పద్యాల సంకలనంతో భక్తి భావాన్ని కళ్లముందు నిలిపి మన దేశానికి ఏకైక సాహిత్య నోబెల్ సాధించిపెట్టిన రవీంద్రనాథ్ ఠాగూర్... ఇలా ఒకరేమిటి.. ఏకంగా వెయ్యి మంది కవులు, రచయితలు, ఇతర సాహితీవేత్తలు. ప్రపంచవ్యాప్తంగా విశేషంగా సాహితీ సేవ చేసినవారు. ఆయా ప్రభుత్వాలు వారి పేరుతో తపాలాబిళ్లలు (స్టాంపులు) విడుదల చేసి నివాళులు అర్పించాయి. కొందరు మాతృదేశానికే పరిమితం కాకుండా.. ఇతర దేశాల్లోనూ తపాలాబిళ్లలపై సగౌరవంగా నిలిచారు. అలా తమదైన ‘ముద్ర’వేసుకున్న వెయ్యి మంది సాహితీవేత్తల పోస్టల్ స్టాంపులు ఒకచోట చేరాయి. భారత్ డైనమిక్ లిమిటెడ్ (బీడీఎల్) చీఫ్ విజిలెన్సు అధికారి వెన్నం ఉపేందర్ ఈ వినూత్న సేకరణ చేశారు. స్వతహాగా కవి అయిన ఉపేందర్‌కు ప్రపంచ సాహితీమూర్తులంటే ఎంతో అభిమానం. ఆయన మాతృసంస్థ తపాలా శాఖ కావడంతో పోస్టల్ స్టాంపులంటే ప్రత్యేక ఇష్టం. ఈ రెండు అభిరుచులను ఒకటి చేసి.. సాహితీరంగంలో విశేష సేవలందించిన వారి పేరిట విడుదలైన స్టాంపులను సేకరించారు. కొన్ని నెలల పాటు ప్రయత్నించి.. వంద దేశాలకు చెందిన వెయ్యి మంది సాహితీవేత్తల చిత్రాలున్న 1,100 స్టాంపులు, ప్రత్యేక పోస్టల్ కవర్లను సేకరించారు. నోబెల్ సాహిత్య బహుమతి ప్రారంభమైన 1901 నుంచి 2017 వరకు ఆ అవార్డు పొందిన 186 మంది చిత్రాలున్న స్టాంపులు కూడా ఉన్నాయి. ప్రస్తుతం బ్రెజిల్లో జరుగుతున్న అంతర్జాతీయ తపాలాబిళ్లల ప్రదర్శనలో వీటిని అందుబాటులో ఉంచారు. ఇంతమంది సాహితీవేత్తల పేరిట విడుదలైన స్టాంపులు ఒకేచోట ఉండటం పట్ల సందర్శకులు ప్రత్యేక ఆసక్తి కనబరుస్తున్నారు. ఇంతకు ముందు కూడా.. గతంలో రామాయణం ఇతివృత్తంగా వివిధ దేశాలు విడుదల చేసిన పోస్టల్ స్టాంపులను ఉపేందర్ సేకరించారు. వాటిపై ఉన్న చిత్రాలతో రామాయణ గాథను వివరించగలిగేంతగా ఆ సేకరణ ఉండటం విశేషం. అప్పట్లో అది లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. ఇప్పుడు సాహితీవేత్తల స్టాంపుల సేకరణను కూడా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తించిందని, 2022 బుక్‌లో పొందుపరచనుందని ఉపేందర్ చెప్పారు. త్వరలో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నిర్వాహకులు కూడా తన సేకరణను పరిశీలించనున్నారని తెలిపారు. ప్రపంచంలో మరెవరూ ఇలా సేకరించలేదు వెయ్యి మంది సాహితీవేత్తలతో కూడిన తపాలా బిళ్లలను ఇప్పటివరకు ప్రపంచంలో ఎవరూ సేకరించిన దాఖలాలు లేవు. నా ప్రయత్నమే మొదటిది. నా అభిమానాన్ని, అభిరుచితో రంగరించి ఇలా చాటుకున్నందుకు సంతోషంగా ఉంది. – వెన్నం ఉపేందర్, బీడీఎల్ చీఫ్ విజిలెన్స్ అధికారి చదవండి: రేపు పీవీ శతజయంతి ఉత్సవాలు -
బ్యాంకింగ్ వ్యవస్థలోకి పోస్టాఫీస్ బ్యాంక్
ముంబై, సాక్షి: సుమారు 150 ఏళ్ల చరిత్ర కలిగిన పోస్టల్ శాఖ 2020లో అత్యంత కీలకంగా వ్యవహరించింది. కోవిడ్-19 తలెత్తడంతో దేశవ్యాప్తంగా లాక్డవున్లు అమలయ్యాయి. ఈ సమయంలో వైమానిక, రైల్వే, రోడ్డు రవాణా దాదాపుగా నిలిచిపోయినప్పటికీ పోస్టల్ శాఖ పలు సర్వీసులు అందించింది. ప్రధానంగా మెడికల్ తదితర కీలకమైన పార్సిల్ డెలివరీలలో ముందు నిలిచింది. లాక్‌డవున్ సమయంలో 10 లక్షల మెడికల్ ఆర్టికల్స్‌ను డెలివరీ చేసింది. వీటిలో మెడికల్ పరికరాలు, వెంటిలేటర్లు, పీపీఈ కిట్లు, ఔషధాలున్నాయి. ఈ బాటలో పార్సిల్ హ్యాండ్లింగ్ సామర్థ్యాన్ని 2020 డిసెంబర్‌కల్లా వార్షికంగా 6 కోట్ల నుంచి 7.5 కోట్లకు పెంచుకుంది. కాగా.. ఈ ఏడాది(20201) ఏప్రిల్‌కల్లా పోస్టాఫీస్ సేవింగ్స్ బ్యాంక్.. దేశంలోని ఇతర బ్యాంకు ఖాతాలతో కలసికట్టుగా నిర్వహించేందుకు వీలు కలగవచ్చని పీఎస్‌యూ దిగ్గజం ఇండియా పోస్ట్ భావిస్తోంది. ఇందుకు వీలుగా ఇటీవల పలు సర్వీసులను డిజిటైజేషన్ బాట పట్టించిన పోస్టల్ శాఖ 2021లో అన్ని సర్వీసులనూ ఆన్లైన్ చేయాలని భావిస్తోంది. (తొలుత మనకే వ్యాక్సిన్లు: సీరమ్) 50 కోట్ల ఖాతాలు పోస్ట్ ఆఫీస్‌కు కీలకమైన బ్యాంకింగ్ సొల్యూషన్(సీబీఎస్) ప్రపంచంలోనే అతిపెద్ద నెట్‌వర్క్‌ను కలిగి ఉన్నట్లు పోస్టల్ శాఖ సెక్రటరీ ప్రదీప్త కుమార్ తాజాగా పేర్కొన్నారు. 23,483 పోస్టాఫీసులు ఇప్పటికే ఈ నెట్వర్క్ పరిధిలోకి చేరినట్లు తెలియజేశారు. దేశవ్యాప్తంగా 1.56 లక్షల పోస్టాఫీసులున్నాయి. వీటి ద్వారా పోస్టాఫీస్ సేవింగ్స్ బ్యాంక్‌లో 50 కోట్లమందికి ఖాతాలున్నాయి. పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లావాదేవీల నిర్వహణకు 1.36 లక్షల యాక్సెస్ పాయింట్లను ఏర్పాటు చేసింది. తద్వారా గ్రామీణ ప్రాంతాలలోనూ ఇంటివద్దనే బ్యాంకింగ్ సర్వీసులను అందిస్తోంది. (4 నెలల గరిష్టానికి రూపాయి) పలు పథకాలు పోస్టాఫీస్ పొదుపు పథకాలలో భాగంగా సేవింగ్స్ ఖాతా, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, సుకన్య సమృద్ధి(ఎస్ఎస్వై), నేషనల్ సేవింగ్(ఎన్ఎస్సీ), కిసాన్ వికాస్ పత్ర, సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ తదితరాలను అందిస్తున్న విషయం విదితమే. ఈ పథకాల కింద రూ. 10,81,293 కోట్ల ఔట్‌స్టాండింగ్ బ్యాలన్స్‌ను కలిగి ఉంది. సీబీఎస్ ద్వారా 24 గంటలూ ఏటీఎం, ఇంటర్నెట్, మొబైల్ బ్యాంకింగ్‌కు వీలు కల్పిస్తోంది. పీవోఎస్‌బీ పథకాలన్నిటినీ ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకుకు అనుసంధానించింది. దీంతో మొబైల్ యాప్ డాక్‌పే ద్వారా లావాదేవీల నిర్వహణకు వీలు కల్పించింది. మొబైల్ యాప్ పోస్ట్‌మ్యాన్ మొబైల్ యాప్‌లో 1.47 పీవోఎస్‌లను భాగం చేసింది. తద్వారా 14 కోట్ల స్పీడ్ పోస్ట్, రిజిస్టర్డ్ పార్సిల్ ఆర్టికల్స్ స్టేటస్‌ను వాస్తవిక సమాయానుగుణంగా పరిశీలించేందుకు వీలు కల్పించింది. డాక్ఘర్ నిర్యత్ కేంద్ర పేరుతో ఈకామర్స్కూ మద్దతు పలుకుతోంది. తద్వారా ఎంఎస్ఎంఈ ప్రొడక్టుల ఎగుమతులకు ప్రోత్సాహాన్నిస్తోంది. అంతేకాకుండా పోస్టల్ జీవిత బీమా, ప్రభుత్వ పథకాల లబ్దిదారులకు ప్రత్యక్ష చెల్లింపులు తదితరాలలో గ్రామీణ ప్రాంతాలనూ డిజిటలైజేషన్లో భాగం చేస్తోంది. -
శుభవార్త: రైతు బంధు ఇక ఇంటికే..!
సాక్షి, హైదరాబాద్: రైతుల బ్యాంకు ఖాతాలో నేటి నుంచి రైతు బంధు డబ్బు జమ కానుంది.. కానీ, దాన్ని తీసుకోవా లంటే బ్యాంక్ ఉన్న పట్టణానికో, ఏటీఎం ఉన్న పొరుగు ఊరికో వెళ్లాలి.. అసలే చలికాలం, ఆపై కరోనా వ్యాప్తి.. పట్టణాలకు వెళ్లాలం టే భయం. మరి డబ్బు తీసుకోవడం ఎలా?. ఇకపై ఇలాంటి ఇబ్బందులేమీ లేకుండా నేరుగా రైతు చేతికే రైతుబంధు సొమ్ము అందనుంది. ఈ మేరకు తపాలా శాఖ పక్కా ఏర్పాట్లు చేసింది. తపాలా కార్యాలయంలో ఖాతా ఉండాల్సిన అవసరం లేకుండానే ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఆదివారం నుంచి ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. మైక్రో ఏటీఎం సేవలు.. జనానికి మళ్లీ చేరువయ్యేందుకు తపాలా శాఖ ఎన్నో వినూత్న పద్ధతులు చేపడుతోంది. గతంలో ఉత్తరాల బట్వాడాతోనే సరిపుచ్చిన తపాలాశాఖ.. వాటికి కాలం చెల్లుతున్న నేపథ్యంలో కొత్త కార్యాచరణతో ముందుకొస్తోంది. ఈ క్రమంలోనే మైక్రో ఏటీఎం సేవలు ప్రారంభించింది. తపాలా ఉద్యోగి మన ఇంటికే వచ్చి డబ్బు అందజేసి వెళ్తాడు. మన బ్యాంకు ఖాతా నుంచి అంత మొత్తం తపాలాశాఖకు బదిలీ అవుతుంది. బ్యాంకుకో, ఏటీఎంకో వెళ్లాల్సిన పని లేకుండానే సొమ్ము చేతికందుతుంది. అనారోగ్యంతో ఉన్నవారు, కరోనా విపత్కర పరిస్థితులతో ఇబ్బంది పడుతున్న వారికి ఈ సేవలు ఉపయుక్తంగా ఉంటు న్నాయి. ఇప్పుడు తపాలాశాఖ రైతు బంధును దీనితో అనుసంధానించనుంది. రబీ సీజన్‌కు సంబంధించి 59 లక్షల మంది రైతులకు ఆదివారం రైతుబంధు సొమ్ము విడుదల కానుంది. దీంతో సోమవారం నుంచి మైక్రో ఏటీఎం సేవల ద్వారా రైతుబంధు నగదు చెల్లింపును తపాలాశాఖ ప్రారంభించనుంది. చదవండి: (అన్నదాతల ధర్మాగ్రహం) సొమ్ము అందుతుందిలా.. తపాలాశాఖకు తెలంగాణలో 4,860 పోస్టాఫీసులున్నాయి. చాలా చిన్న గ్రామాల్లో బ్రాంచీలను కూడా ప్రారంభించారు. ఇప్పుడు ఆయా బ్రాంచీ పోస్టాఫీస్‌లు సహా అన్ని కార్యాలయాలకు ప్రత్యేకంగా ఓ సెల్‌ఫోన్‌ను, బయోమెట్రిక్ డివైస్‌ను అందజేశారు. సంబంధిత రైతు ఆ తపాలా కార్యాలయానికి వెళ్లినా లేదా ముందస్తు సమాచారమిస్తే ఆ సిబ్బందే వారి ఇంటికి వెళ్లైనా సరే నగదు అందజేస్తారు. ఆ రైతు బ్యాంకు ఖాతా కచ్చితంగా ఆధార్‌తో అనుసంధానమై ఉండాలి. రైతు తన ఆధార్ నంబర్ తెలిపి బయోమెట్రిక్ డివైస్‌లో వేలిముద్ర వేయగానే అది అతని బ్యాంకు ఖాతాతో అనుసంధానం అవుతుంది. రోజుకు గరిష్టంగా రూ.10 వేల వరకు తన ఖాతా నుంచి నగదు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఆ వివరాలను సంబంధిత తపాలా సిబ్బంది మొబైల్ ఫోన్ ద్వారా నమోదు చేస్తాడు. అప్పుడు రైతు మొబైల్‌కు ఓటీపీ నంబర్ వస్తుంది. దాన్ని తపాలా సిబ్బందికి తెలిపితే చాలు.. అతను కావాల్సిన మొత్తాన్ని రైతు చేతికి అందిస్తాడు. ఎలాంటి చార్జీలు లేవు.. దీనికోసం సంబంధిత తపాలా కార్యాలయాల్లో అవసరమైన నగదు నిల్వలను సిద్ధం చేశారు. రాష్ట్రంలో పట్టణ ప్రాంతాల్లో మాత్రమే బ్యాంక్‌లు, ఏటీఎంలు అందుబాటులో ఉంటాయి. మారుమూల గ్రామాలకు చెందిన రైతులు రైతుబంధు సొమ్ము తీసుకోవాలంటే పట్టణాలకు వెళ్లాల్సి వస్తోంది. ఇప్పుడు ఈ మైక్రో ఏటీఎంల ద్వారా ఇంట్లో కూర్చునే సొమ్ము పొందవచ్చు. తపాలా కార్యాలయంలో ప్రత్యేకంగా పొదుపు ఖాతా ఉండాల్సిన అవసరం లేకుండానే ఈ సేవలు మొదలవుతున్నాయి. ఈ సేవలు పొందినందుకు నయా పైసా ఛార్జీ కూడా లేకపోవడం విశేషం. కోవిడ్ మహమ్మారి ఆవరించిన కష్ట సమయంలో ఈ సరికొత్త మైక్రో ఏటీఎం సేవను రైతులంతా వినియోగించుకోవాలి. పట్టణాల్లో ఉండే బ్యాంక్‌ల వరకో, ఏటీఎంల వరకో కష్టపడి వెళ్లే పనిలేదు. ఊళ్లో ఉండే పోస్టాఫీస్‌కు వెళ్తే సరిపోతుంది. సంబంధిత సిబ్బందికి ఇంటిమేట్ చేస్తే వారే ఇంటికి వచ్చి నగదు అందించే ఈ సౌలభ్యాన్ని వినియోగించుకోవాలి. – పీవీఎస్ రెడ్డి, రీజియన్ పోస్టుమాస్టర్ జనరల్, తపాలాశాఖ హైదరాబాద్ -
పోస్టల్ బ్యాంక్ నుంచి ‘డాక్‌పే’ యాప్
సాక్షి, అమరావతి: మారుమూల గ్రామీణ ప్రాంతాల నుంచి దేశంలో ఎక్కడికైనా తక్షణం నగదు పంపిణీ చేసే సౌకర్యాన్ని తపాలా శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ (ఐపీపీబీ) ‘డాక్‌పే’ పేరుతో మొబైల్ డిజిటల్ పేమెంట్ సర్వీసును అందుబాటులోకి తీసుకొచ్చింది. డాక్‌పే యాప్ ద్వారా అన్ని బ్యాంకు అకౌంట్లను అనుసంధానం చేసుకోవడం ద్వారా అన్ని రకాల ఆర్థిక సేవలను వినియోగించుకోవచ్చని ఐపీపీబీ తెలిపింది. నగదు బదిలీ, చెల్లింపులతో పాటు పోస్టల్ శాఖ అందిస్తున్న వివిధ సేవింగ్స్ పథకాల్లో నేరుగా ఇన్వెస్ట్ చేయొచ్చు. డాక్‌పే యాప్ అందిస్తున్న సేవలు యూపీఐ: ఒక బ్యాంక్ అకౌంట్ నుంచి మరో బ్యాంక్ అకౌంట్‌కు సురక్షితంగా, వేగంగా నగదు బదిలీ. వీడీసీ: రూపే డెబిట్ కార్డు ద్వారా చేసిన కొనుగోళ్లకు డిజిటల్ విధానంలో చెల్లింపులు చేయొచ్చు. డీఎంటీ: దేశంలో ఎక్కడి బ్యాంకు ఖాతాకైనా తక్షణం నగదు బదిలీ చేసుకోవచ్చు. ఏపీఎస్: ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సర్వీసుల్లో భాగంగా ఇంటి వద్దనే వేలి ముద్ర వేయడం ద్వారా బ్యాంకు సేవలు పొందవచ్చు. బిల్ చెల్లింపులు : దేశ వ్యాప్తంగా 470కిపైగా వ్యాపార సంస్థలకు నగదు రహిత లావాదేవీలు చేయొచ్చు. ఈ సంఖ్య క్రమేపీ పెరుగుతూ ఉంటుంది. పోస్టల్ పథకాలు: తపాల శాఖ అందిస్తున్న రికరింగ్ డిపాజిట్, పీపీఎఫ్, సుకన్య సంవృద్ధి ఖాతా వంటి వివిధ ఆర్థిక సేవలను వినియోగించుకోవచ్చు. -
పోస్టల్ ద్వారా ఆలయాల నుంచి ప్రసాదాలు
సాక్షి,అమరావతి/వన్‌టౌన్(విజయవాడ పశ్చిమ): రాష్ట్రంలో పెద్ద, ప్రముఖ ఆలయాల నుంచి ప్రసాదాలు వంటివి భక్తులకు చేరవేసేందుకు తగిన ఏర్పాట్లు చేయనున్నట్టు దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు వెల్లడించారు. దీనికోసం పోస్టల్ శాఖ సేవలు వినియోగించుకుంటామని చెప్పారు. రాష్ట్రంలోని ప్రసిద్ధ పంచారామాలైన అమరారామం (అమరావతి), సోమారామం (భీమవరం), క్షీరారామం (పాలకొల్లు), భీమారామం (ద్రాక్షారామం), కుమారారామం (సామర్లకోట) చిత్రాలు ముద్రించిన ఐదు రకాల పోస్టు కార్డులను పోస్టల్ శాఖ ప్రత్యేకంగా రూపొందించింది. ఈ పోస్టుకార్డులను మంత్రి వెలంపల్లి బుధవారం విజయవాడలోని మంత్రి కార్యాలయంలో ఆవిష్కరించారు. అదే సమయంలో ఆయా ఆలయాల్లోనూ పోస్టల్ శాఖ, దేవదాయ శాఖ అధికారులు పోస్టుకార్డుల ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఆన్లైన్లో ఏకకాలంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి వెలంపల్లి మాట్లాడుతూ.. హిందూ సంప్రదాయాలు, దేవాలయాలపై పోస్టు కార్డులు ప్రింట్ చేయడం సంతోషకరమన్నారు. ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ ముత్యాల వెంకటేశ్వర్లు, విజయవాడ సర్కిల్ పోస్ట్ మాస్టర్ జనరల్ టి.యం. శ్రీలత, రీజియన్ పోస్టల్ డైరెక్టర్ ఎస్.రంగనాథన్, అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్ జనరల్ కేవీఎల్ఎన్ మూర్తి, విజయవాడ డివిజన్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్టాఫీసెస్ కందుల సుదీర్ బాబు తదితరులు పాల్గొన్నారు. -
‘తపాలా శాఖ అందరికి వారధిగా ఉంటుంది’
సాక్షి, విజయవాడ: హిందూ సంప్రదాయాలు, దేవాలయాల పేరుతో పోస్ట్‌కార్డులు ముద్రించడం చాలా సంతోషమని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. ‘పంచారామస్’ ఇన్ ఆంధ్రప్రదేశ్ పేరుతో తపాలా శాఖ ప్రత్యేకంగా రూపొందించిన పోస్ట్ కార్డులను విడుదల చేసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తపాలా శాఖా సేవా కార్యక్రమాలు చేస్తూ అందరికి వారధిగా ఉంటుందని తెలిపారు. పంచారామాల దర్శనం కార్తీకమాసంలో ఎంతో పుణ్యమని తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న అన్ని దేవాలయాల వలె ఏపీలో ఉన్న దేవాలయాలకు కూడా పోస్టల్ సేవలు వినియోగించుకుంటామని పేర్కొన్నారు. ఒకేసారి వర్చ్యువల్‌గా పంచరామాలు దర్శించడం సంతోషమని తెలిపారు. మహాత్ముల గురించి తెలుసుకోవడం యువతకు చాలా అవసరమని చెప్పారు. చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. పంచారామాల పిక్చర్ పోస్టుకార్డులు ప్రారంభిస్తున్నామని, ‘ఫిలాటెలీ’ అనేది స్టాంపుల సేకరణ అనే హాబీ అని తెలిపారు. ఫిలాటెలిస్టులకు ఈ పంచారామాల పోస్టుకార్డులు ముఖ్యమైన సంపదని పేర్కొన్నారు. చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలపై తపాలా శాఖా పోస్టుకార్డులు తయారుస్తోందని చెప్పారు. మహాత్మాగాంధీ 150వ జన్మదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో ఐదు ప్రాంతాలపై పోస్టు కవర్లు విడుదల చేశామని తెలిపారు. చారిత్రక ఘట్టాలను డాక్యుమెంట్ చేయడానికి ‘ఫిలాటెలీ’ అనేది ఓ సాధనమని పేర్కొన్నారు. విజయనగరం సిరిమానోత్సవం పేరు మీద కూడా స్పెషల్ కవర్ చేశామని చెప్పారు. ఈ రోజు పంచారామాల పోస్టు కార్డులు ప్రారంభిస్తున్నామని, పోస్టుకార్డుపై వేసే డేట్ స్టాంప్ ఈ ఒక్కరోజే ఉంటుందని ఆయన తెలిపారు. -
స్మార్ట్‌ఫోన్ ఆర్డర్ చేస్తే.. సోన్‌పాపిడి డబ్బా..
సాక్షి, బెంగళూరు: ఆన్లైన్ వంచకులు తీయని మాటలతో అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు. కారుచవగ్గా ఖరీదైన వస్తువులు మీవేనంటూ వచ్చే ఫోన్లకు జనం నిజమేనని నమ్మడం మోసగాళ్లకు కలిసొస్తోంది. చిత్రదుర్గం జిల్లా చెళ్లకెరె తాలూకాలోని గోపనహళ్లి గ్రామానికి చెందిన నరసింహమూర్తి ఇదేమాదిరి నష్టపోయాడు. దీపావళి పండుగ సందర్భంగా శాంసంగ్ గెలాక్సీ మొబైల్‌ఫోన్‌ను రూ. 1,700 కే అందిస్తున్నామని ఒక వ్యక్తి ఫోన్ చేశాడు. పోస్టల్ శాఖ నుంచి పార్శిల్ వస్తుందని, డబ్బు చెల్లించి తీసుకోవాలని సూచించగా నరసింహమూర్తి తక్కువధరకే స్మార్ట్‌ఫోన్ వస్తోందని మురిసిపోయాడు. (చదివింది ఏడు.. రూ. 20 కోట్లకు కుచ్చుటోపి) మిఠాయిపెట్టె, గిల్టు చైన్ బుక్ చేయగా గురువారం బెంగుళూరు హెబ్బాళ నుంచి గోపనహళ్లి తపాలా కార్యాలయానికి నరసింహమూర్తి పేరుమీద ఓ పార్శిల్ వచ్చింది. ఆయన రూ.1700 ఇచ్చి పార్సల్ తీసుకుని చూడగా, ఫోన్‌కు బదులు 50 రూపాయల సోన్ పాపిడి మిఠాయి పెట్టె, ఓ రోల్డ్ గోల్డ్ చైన్ కనిపించింది. దీంతో నరసింహమూర్తి నిర్ఘాంతపోయాడు. పోలీసులకు ఫిర్యాదు చేస్తానని తెలిపాడు. -
ఖమ్మం పోస్టల్ బ్యాంక్‌కి జాతీయ స్థాయి గుర్తింపు
సాక్షి, ఖమ్మం: ఖమ్మం పోస్టల్ డివిజన్ జాతీయస్థాయిలో ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్ (ఐపీపీబీ) ఆధార్ ఆధారిత విధానంలో ఖమ్మం పోస్టల్ డివిజన్ జాతీయస్థాయిలో నంబర్‌వన్‌గా నిలిచినట్లు శుక్రవారం ఢిల్లీ జాతీయ పోస్టల్ విభాగం ప్రకటించింది. ఈ మేరకు ఖమ్మం డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ యలమందయ్యకు ఆన్లైన్లో ఉత్తర్వులు అందాయి. జాతీయ స్థాయిలో పోస్టల్ శాఖ 2018 సెప్టెంబర్ నుంచి ఐపీపీబీ బ్రాంచ్‌లతో నిర్వహిస్తోంది. ఈ బ్యాంక్ నిర్వహణలో మంచి ఫలితాలను సాధిస్తుండటంతో 2019 సెప్టెంబర్ నుంచి ఆధార్ ఆధారిత విధానాన్ని (ఏఈపీఎస్) అమలులోకి తీసుకువచ్చింది. ఏ బ్యాంక్‌లో ఖాతా ఉన్నప్పటికీ ఆధార్ కార్డు ఆధారంగా ఐపీపీబీ ద్వారా నగదును డ్రా చేసుకునే విధానాన్ని అమలు చేస్తున్నారు. ఈ విధానంలో ఐపీపీబీ దేశం మొత్తంలో ఆగస్టు 31వ తేదీ నాటికి రూ.6 వేల కోట్ల నగదును పంపిణీ చేసింది. ఖమ్మం పోస్టల్ డివిజన్ (పూర్వపు ఖమ్మం జిల్లా) పరిధిలోని 611 పోస్టల్ బ్రాంచ్‌ల్లో ఐపీపీబీని నిర్వహిస్తోంది. ఆధార్ ఆధారిత విధానం ప్రారంభమైనప్పటి నుంచి 2020 ఆగస్టు 31వ తేదీ వరకు రూ.106.15 కోట్లను 2,76,288 లావాదేవీల్లో నిర్వహించింది. ఈ లావాదేవీల నిర్వహణలో ఖమ్మం డివిజన్ ఐపీపీబీ దేశంలో నంబర్‌వన్‌గా నిలిచింది. ఐపీపీబీ రెండేళ్లు నిండిన క్రమంలో ఢిల్లీ పోస్టల్ కార్పొరేట్.. ఆధార్ ఆధారిత విధానం అమలులో ఖమ్మం డివిజన్ ఐపీపీబీ నంబర్‌వన్‌గా నిలిచిందని ప్రకటించింది. దేశవ్యాప్తంగా మూడు సర్కిళ్లను టాప్ ర్యాంకర్లుగా గుర్తించింది. ఈ ర్యాంకుల్లో ఉత్తరప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయి. ఈ సర్కిళ్లలో నంబర్‌వన్ ర్యాంక్ సాధించిన బ్రాంచ్‌గా ఖమ్మం గాంధీచౌక్ బ్రాంచ్ (ఖమ్మం ఐపీపీబీ) నిలిచింది. 2వ ర్యాంక్ హూజూర్‌నగర్ బ్రాంచ్‌కి దక్కింది. మూడో ర్యాంక్ నారాయణరావుపేట బ్రాంచ్, 5వ ర్యాంక్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప బ్రాంచ్ దక్కించుకుంది. కరోనా కారణంగా లాక్డౌన్ విధించిన సమయంలో బ్యాంకుల నిర్వహణ సక్రమంగా లేకపోవటంతో ప్రజలు ఐపీపీబీ సేవలను బాగా వినియోగించుకున్నారు. ఆ సమయంలో కేంద్ర ప్రభుత్వం పేద మహిళలకు జన్‌ధన్ ఖాతాల్లో రూ.500 చొప్పున జమ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ రేషన్ కోసం రూ.1500 చొప్పున పేద వర్గాల బ్యాంక్ ఖాతాల్లో జమ చేశాయి. ఈ మొత్తాలను ఆధార్ ఆధారిత విధానంలో ఖమ్మం ఐపీపీబీ ప్రజలకు అందజేసింది. ఈ క్రమంలో ఐపీపీబీ లావాదేవీలు బాగా పెరిగాయి. ఖమ్మం డివిజన్ ఐపీపీబీ సేవలను జిల్లాలో ఉద్యోగులు సమర్థవంతంగా నిర్వహించడంతో దేశ స్థాయిలో ఈ గుర్తింపు లభించింది. ఆరు నెలల కిందట ఖమ్మం ఐపీపీబీ పరిధిలోని సత్తుపల్లి డివిజన్ అన్నపురెడ్డిపల్లి బ్రాంచ్ పెద్దిరెడ్డిగూడెం సబ్ పోస్టాఫీస నిర్వాహకుడు కదూరు శ్రీనివాస్ బ్యాంక్ ఖాతాలను చేర్చడంలో దేశంలో 9వ స్థానాన్ని దిక్కంచుకున్నారు. ఆయనను ఢిల్లీ కార్పొరేట్ పోస్టల్ శాఖ సత్కరించింది. అంకితభావంతో పనిచేశాం ఖమ్మం ఐపీపీబీ పరిధిలో ఉన్న పోస్టల్ ఉద్యోగులు అంకితభావంతో పనిచేయటం కారణంగానే దేశంలోనే ఖమ్మం పోస్టల్ డివిజన్‌కు గుర్తింపు వచ్చింది. ఖమ్మం ఐపీపీబీ ఆది నుంచి క్రమశిక్షణతో, లక్ష్యంతో పనిచేస్తోంది. ఖమ్మం ఐపీపీబీ జాతీయస్థాయిలో నంబర్‌వన్‌గా నిలపడంలో ఉద్యోగులందరి కృషి ఉంది. ఐపీపీబీ నిర్వాహకులు, ఉద్యోగులను అభినందిస్తున్నా. - యలమందయ్య, ఖమ్మం డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ అందరి కృషి ఫలితమే.. ఖమ్మం పోస్టల్ డివిజన్ పరిధిలో ఉన్న ఉద్యోగుల కృషి ఫలితంగానే జాతీయ స్థాయిలో ఆధార్ ఆధారిత విధానం అమలులో నంబర్‌వన్‌గా నిలిచాం. కరోనా వంటి కష్ట కాలంలో బ్యాంకులు పూర్తి స్థాయిలో పనిచేయని సమయంలో పోస్టల్ ఉద్యోగులు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించి ప్రజలకు ప్రభుత్వాల నుంచి అందిన సహాయాన్ని అందజేశారు. ఖమ్మం ఐపీపీబీకి ఈ స్థాయి గుర్తింపు మరవలేనిది. -అనిల్, ఖమ్మం ఐపీపీబీ మేనేజర్ -
అధ్యక్ష ఎన్నికలపై పోస్టల్ సర్వీస్ వార్నింగ్
వాషింగ్టన్: కరోనా విపత్కర పరిస్థితుల్లో పోస్టల్ ఓటింగ్ విధానానికి అమెరికాలో ప్రాధాన్యం పెరిగింది. ఈ నేపథ్యంలో పోస్టల్ ఓటింగ్‌ను మరింత సరళం చేయాలని అమెరికాలోని రాష్ట్రాలు భావిస్తున్నాయి. అయితే, అమెరికా పోస్టు మాస్టర్ జనరల్ లూయిస్ డిజోయ్ నవంబరులో జరిగే అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. విపరీతంగా పెరిగే పోస్టల్ ఓట్లతో సమస్యలు తలెత్తుతాయని అంటున్నారు. దాంతోపాటు సుదూరంలో ఉండే 46 సముద్ర తీర రాష్ట్రాల్లోని ప్రాంతాల నుంచి పోస్టల్ బ్యాలెట్ బాక్సులు సకాలంలో అందుతాయని హామీ ఇవ్వలేమని పేర్కొన్నారు. ఆయా రాష్ట్రాల గడువులకు లోబడి ప్రజలు ఓటు హక్కును వినియోగించుకున్నప్పటికీ మిలియన్ల కొద్దీ ఓట్లు నిరాకరణకు గురయ్యే అవకాశముందని హెచ్చరించారు. ఈ మేరకు ఆయా రాష్ట్రాలకు లేఖలు రాసినట్టు తెలిపారు. (ఇజ్రాయెల్, యూఏఈ శాంతి ఒప్పందం) ఓటర్లను నొప్పించడం తన ఉద్దేశం కాదని అన్నారు. అయితే, వాస్తవ పరిస్థితులను చూసుకుని వ్యవహరించాలని ఆయన చెప్తున్నారు. మరోవైపు ప్రజలందరూ సుశిక్షితంగా, సురక్షితంగా మునుపటిలా ఓటు వేసే సమయం వచ్చేవరకూ ఎన్నికలను వాయిదా వేయాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త వాదన తెరపైకి తెచ్చిన సంగతి తెలిసిందే. పోస్టల్ ఓటింగ్ ద్వారా అవకతవకలు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. అయితే, ట్రంప్ చెబుతున్న లోపాలకు సంబంధించి ఎలాంటి గట్టి ఆధారాలు లేవు. పైగా ఆయన పోస్టల్ ఓటింగ్‌ను విమర్శించడం ఇదే తొలిసారి కాదు. ఇదిలాఉండగా.. అమెరికాలోని చాలా ప్రాంతాల్లో రోడ్డుకు సమీపంలో ఉండే పోస్టు బాక్సులను తొలగించారని కొందరు ఓటర్లు, ప్రజాప్రతినిధులు ఇప్పటికే విమర్శలు చేశారు. ట్రంప్‌నకు అనుకూలుడైన పోస్ట్ మాస్టర్ జనరల్ ఎపుడూ లేని సమస్యలు లేవనెత్తుతున్నారని కొందరు విమర్శిస్తున్నారు. (చదవండి: టిక్‌టాక్ బ్యాన్ : ట్రంప్ ఊరట) -
గుమ్మం వద్దకే నగదు
సాక్షి, సిటీబ్యూరో: లాక్డౌన్లో తపాలా శాఖ సేవలు మరింత విస్తృతమయ్యాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదలకు అందిస్తున్న నగదు చేయూతను కూడా తపాలా శాఖ గమ్మం వద్దకు అందుబాటులోకి తెచ్చింది. రాష్ట్ర ఆహార భద్రత కార్డు కలిగిన పేదలకు నిత్యావసరాల కోసం బ్యాంకు ఖాతాల్లో రూ.1500 చొప్పున నగదు జమ చేసింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా నిరుపేదల జన్‌ధన్ ఖాతాలో రూ.500 చొప్పున నగదు వేసింది. బ్యాంక్ ఖాతాలో నగదు పడటంతో పేదలు వాటిని డ్రా చేసుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. బ్యాంకుల ముందు కనీసం సామాజిక దూరం పాటించకుండా బారులు తీరుతున్నారు. కాగా, తపాలా శాఖ తమ బ్యాంకింగ్ సేవల్లో భాగంగా వివిధ బ్యాంకులలోని నగదును ఇంటి గుమ్మం వద్దనే వినియోగదారులు డ్రా చేసుకునే విధంగా వెసులు బాటు కల్పించింది. మరోవైపు పోస్టాఫీసుకు వెళ్లి కూడా డ్రా చేసుకోవచ్చు. కేవలం బ్యాంకు ఖాతాతో అనుసంధానమైన ఆధార్ నెంబర్ ఆధారంగా వేలిముద్ర వేస్తే సరిపోతుంది. ఇక ఒక ప్రాంతంలో 50 మంది ఉంటే పోస్టాఫీస్‌కు వెళ్లి సమాచారం అందిస్తే చాలు. పోస్ట్‌మేన్ వారి వద్దకే వచ్చి ఆధార్ ఆధారంగా వేలిముద్ర తీసుకొని నగదు అందిస్తారు. హైదరాబాద్ మహానగరంలో రోజుకు రెండు నుంచి మూడు కోట్ల వరకు ఆధార్ అధారంగా నగదు అందిస్తున్నామని పోస్టల్ పేమెంట్ బ్యాంక్ అధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. మొబైల్ పోస్టాఫీసు సేవలు లాక్డౌన్లో తపాలా శాఖ ప్రజలకు మొబైల్ పోస్టాఫీసుల ద్వారా సేవలందిస్తోంది. అత్యవసర సేవల్లో తపాలా శాఖ ఉండటంతో పూర్తి స్థాయిగా పనిచేస్తోంది. ఇంటి వద్దకు మొబైల్ పోస్టాఫీసు (మెయిల్ మోటార్ సర్వీస్) ద్వారా స్పీడ్ పోస్ట్ పార్శిల్, రిజిస్ట్రర్డ్ ఆర్టికల్, స్టాంప్ అమ్మకాలు, బ్యాంకు సేవలైన డిపాజిట్ విత్ డ్రా, ఖాతాల ప్రారంభం, ఆసరా పింఛన్ల సేవలందిస్తోంది. రవాణా ద్వారా పార్సిల్స్ సేవలు ఎయిర్‌కార్గో ద్వారా పార్సిల్ సేవలు అందుబాటులోకి తెచ్చారు. రవాణా ద్వారా వివిధ మందులు, శానిటైజర్లు, మాస్కులు, వెంటిలేటర్లు, వైద్య పరికరాల పార్సిల్స్, అదేవిధంగా మురికి వాడలకు, వలస కార్మిక శిబిరాలకు వస్తువులు, బియ్యం, ఆహార పదార్థాల పార్శిల్స్ చేరవేస్తోంది. తాజగా వివిధ మందుల పార్శిళ్లకు మంచి డిమాండ్ పెరిగింది. కేవలం మహా నగర పరిధిలో ప్రతి రోజు 500 నుంచి 600 తగ్గకుండా పార్శిల్స్ బుకింగ్ జరుగుతున్నట్లు పోస్టల్ అధికారి ఒకరు తెలిపారు. -
చెత్తకుప్పలో 10 సంచుల ఉత్తరాలు
సాక్షి, హైదరాబాద్ : నమ్మకంగా ఉత్తరాలను బట్వాడా చేయాల్సిన పోస్టల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఆప్తులకు, అభ్యుర్థులకు చేరాల్సిన ఉత్తరాలను చెత్తకుప్పలో పడేశారు. ఈ ఘటన కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం వెలుగుచూసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసుల విచారణ చేపట్టారు. కీసరలోని బండ్లగూడ సమీపంలో ఉన్న ప్రజాసాయి గార్డెన్స్ గేట్ పక్కన వేలకొద్దీ ఉత్తరాలు చెత్తకుండీలో లభ్యమయ్యాయి. 10 సంచుల్లో ఉన్న లెటర్స్‌ను రాజిరెడ్డి అనే వ్యక్తి ముందుగా గుర్తించాడు. ఆయన ఫిర్యాదు మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చారు. ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని అధికారులు కోరినట్లు తెలుస్తోంది. ఉత్తరాల్లో ఎక్కువ భాగం కూకట్పల్లి, షాద్‌నగర్, బాలానగర్, జగద్గిరిగుట్ట ప్రాంతాల అడ్రస్‌లతో ఉండటం గమనార్హం. ఎవరైనా కావాలని చేశారా, డ్యూటీ చేయలేక పోస్టల్ సిబ్బందే నిర్లక్ష్యంతో పడేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం. లెటర్స్‌ను బట్వాడా చేయకపోవంతో కొందరు ఉద్యోగ అవకాశాలు కోల్పోయే ప్రమాదం కూడా ఉందని సీఐ నరేందర్ గౌడ్ అభిప్రాయపడ్డారు. -
ఇక పోస్ట్‘పాలసీ’ మ్యాన్లు!
న్యూఢిల్లీ: తపాలా శాఖకు చెందిన పోస్ట్మ్యాన్లు, గ్రామీణ డాక్ సేవక్‌లు త్వరలో బీమా పాలసీ విక్రయదారుల అవతారం ఎత్తనున్నారు. వీరిని పాయింట్ ఆఫ్ సేల్స్ పర్సన్స్‌గా (విక్రయదారులు) ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు (ఐపీపీబీ) ప్రతిపాదించవచ్చని ఐఆర్డీఏఐ తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాల్లో పేర్కొంది. వీటి ప్రకారం.. తపాలా శాఖ పోస్ట్మ్యాన్లు, గ్రామీణ డాక్ సేవక్‌ల జాబితాను ఐఆర్డీఏఐకు పంపి అనుమతి కోరాల్సి ఉంటుంది. ప్రధానంగా బ్యాంకింగ్ సేవలు అందుబాటులో లేని, పూర్తి స్థాయిలో బ్యాంకింగ్ సేవలు విస్తరించని ప్రాంతాల్లో (మారుమూల గ్రామీణ ప్రాంతాల వరకు) వీరు బీమా విస్తరణకు తోడ్పడతారు. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు ఒకటికి మించిన బీమా కంపెనీలతో వ్యాపార ఒప్పందాలు కూడా చేసుకుని, పోస్ట్మ్యాన్లు, డాక్ సేవక్‌ల ద్వారా పాలసీల విక్రయాలను చేపట్టవచ్చు. -
ప్రత్యేక సంస్థగా పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్?
కోల్‌కతా: భారతీయ తపాలా శాఖ తన బీమా వ్యాపార విభాగం ‘పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్’ను (పీఎల్ఐ) ప్రత్యేక సంస్థగా ఏర్పాటు చేసే ప్రతిపాదనను సీరియస్‌గా పరిశీలిస్తోంది. ఈ విషయాన్ని పశ్చిమబెంగాల్ సర్కిల్ చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ గౌతమ్ భట్టాచార్య గురువారం కోల్‌కతాలో మీడియాకు చెప్పారు. పీఎల్ఐ పథకాలు గతంలో ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకే పరిమితం కాగా, ఇప్పుడు లిస్టెడ్ కార్పొరేట్ సంస్థలు, వృత్తి నిపుణులు సైతం వీటిని తీసుకునే అవకాశం కల్పించినట్టు చెప్పారు. పీఎల్ఐ మార్కెట్ వాటా 3 శాతంగా ఉండగా, పాలసీదారులకు బోనస్ మాత్రం ఇతర బీమా సంస్థలతో పోలిస్తే అధికంగా ఇస్తోంది. కమీషన్ చెల్లింపులు తక్కువగా ఉండడంతోపాటు నిర్వహణ వ్యయాలు కూడా తక్కువగా ఉండడమే అధిక బోనస్ చెల్లింపులకు కారణమని భట్టాచార్య తెలిపారు. ప్రస్తుతం తపాలా శాఖ ఆదాయంలో 60 శాతం సేవింగ్స్ పథకాల ద్వారానే వస్తోందని, పార్సెల్ మెయిల్స్ నుంచి వచ్చే ఆదాయన్ని పెంచుకోవడంపై దృష్టి పెట్టామని చెప్పారు. -
ఇంటికే డబ్బులు తెచ్చిస్తారు
వృద్ధులు, మహిళలు, దివ్యాంగులకు శుభవార్త. ఇకపై వీరంతా నగదు కోసం బ్యాంకులు, ఏటీఎంల ముందు క్యూ కట్టాల్సిన పని లేదు. బ్యాంక్ పాస్‌బుక్, విత్ డ్రా ఫామ్, ఏటీఎం కార్డులూ అవసరం లేవు. ఇంట్లో ఉండే నగదు డ్రా చేసుకోవచ్చు. ఎలాగంటారా?.. మీ మొబైల్ లేదా ల్యాండ్‌లైన్ ద్వారా పోస్టల్ టోల్ ఫ్రీ నంబర్ 155299కు ఫోన్ చేసి రిక్వెస్ట్ పంపితే చాలు. మీ ఏరియా పోస్ట్‌మేన్ ‘మొబైల్ మైక్రో ఏటీఎం’తో మీ ఇంటికే వస్తారు. ఆయన అడిగిన వివరాలు అందిస్తే చాలు.. అవసరమైన మొత్తాన్ని కనీసం రూ.100 నుంచి రూ.10 వేల వరకు పొందవచ్చు. బ్యాలెన్స్, లావాదేవీల వివరాలూ తెలుసుకోవచ్చు. ఈ సేవలన్నీ ఉచితమే.. సాక్షి, సిటీబ్యూరో : పోస్టల్ శాఖ ఉత్తరాలు, మనీ ఆర్డర్ల బట్వాడాకే పరిమితం కాకుండా.. మార్పులకు అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్నీ అందిపుచ్చుకొంటోంది. ఈ క్రమంలోనే బ్యాంకింగ్ సేవలకు శ్రీకారం చుట్టింది. గతేడాది ‘ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్’ పేరుతో బ్యాంకింగ్ రంగంలో ప్రవేశించిన తపాలా శాఖ పోస్టాఫీసులతో పాటు ఇంటి వద్దకు కూడా సేవలను అందిస్తోంది. ఇప్పటి వరకు పోస్టాఫీస్‌కు వెళ్లలేని మహిళలు, వృద్ధులు, దివ్యాంగులైన ఐపీపీబీ ఖాతాదారులకు బ్యాంకింగ్ సేవలందిస్తూ వచ్చిన తపాలా శాఖ ఇటీవల వివిధ బ్యాంక్‌ల ఖాతాదారులకు సైతం ఇంటి వద్ద బ్యాంకింగ్ సేవలందించే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. హెడ్, సబ్ పోస్టాఫీసుల ద్వారా కేవలం ఆధార్ నంబర్ ఆధారంగా ‘ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్’ ద్వారా ఏ బ్యాంక్‌లో ఖాతా ఉన్నా నగదు విత్ డ్రా చేసుకునే వెసులుబాటును కల్పించిన తపాలా శాఖ తాజాగా ఇంటి ముంగిటకు ఆధార్ ఏటీఎం పేరుతో సేవలను విస్తరించింది. మొబైల్ మైక్రో ఏటీఎంలు తపాలా శాఖ హైదరాబాద్ నగర పరిధిలోని 950 మంది పోస్ట్మేన్లకు ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ విధానంపై శిక్షణనిచ్చింది. మొబైల్ ఫోన్లలో మైక్రో ఏటీఎం యాప్‌లను డౌన్లోడ్ చేసి మొబైల్ ఫోన్లను సైతం అందజేసింది. ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో ఉత్తరాలు బట్వాడా చేసే వీరంతా అవసరమైన వారికి ఆధార్ ఏటీఎంల ద్వారా సేవలందిస్తున్నారు. ఆధార్ ఏటీఎం సేవలు ఇలా.. - 155299 నంబర్‌కు రిక్వెస్ట్ పంపగానే, ఆ ఏరియా పోస్ట్‌మేన్ ‘మొబైల్ మైక్రో ఏటీఎం’తో మీ ఇంటి వద్దకు వస్తారు. - పోస్ట్‌మేన్ మీ పేరు, మొబైల్ నంబరు తీసుకుని ఎంటర్ చేయగానే, మీ మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేయగానే ఆధార్ నంబర్ అడుగుతుంది. - అది నమోదు చేయగానే కావల్సిన నగదు, బ్యాంక్ పేరు అడుగుతుంది. నగదు మొత్తం ఎంటర్ చేసి, ఖాతా కలిగిన బ్యాంక్ పేరును ఎంపిక చేసుకోవాలి (ఆధార్‌తో ఆ బ్యాంక్ ఖాతా అనుసంధానమై ఉండాలి). - ఆపై బయోమెట్రిక్ అందిస్తే.. అది ఆమోదం కాగానే నగదు విత్ డ్రా, మినీ స్టేట్మెంట్, బ్యాలెన్స్ విచారణ, ఫుల్ మనీ ఆప్షన్లు వస్తాయి. - ఉదాహరణకు నగదు విత్ డ్రా ఆప్షన్ ఎంచుకుంటే.. నగదు మొత్తం ధ్రువీకరణ కోసం మరోమారు బయోమెట్రిక్ అందించాలి. - ఈ ప్రక్రియ పూర్తి కాగానే, పోస్ట్‌మేన్ ఆ నగదు అందజేస్తారు. ఏరియా పోస్ట్మేన్లను అడిగితే చెబుతారు ఏరియా పోస్ట్మేన్లను సంప్రందించి ఇంటి ముంగిటే ఆధార్ ఏటీఎంల సేవలు పొందవచ్చు. బ్యాంక్, ఏటీఎంలకు వెళ్లలేని వృద్ధులు, మహిళలు, వికలాంగులు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలి. ఇందుకోసం ఎలాంటి సర్వీస్ చార్జీ ఉండదు. టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం అందిస్తే మీ ఏరియా పోస్ట్‌మేన్ అందుబాటులోకి వస్తారు. – జయరాజ్, చీఫ్ పోస్ట్‌మాస్టర్, జనరల్ పోస్టాఫీసు, హైదరాబాద్ -
కొత్త సేవల్లోకి తపాలాశాఖ
సాక్షి, సిటీబ్యూరో: కాలం గిర్రున తిరిగింది.. కార్డులకు కాలం చెల్లింది.. తపాలా శాఖ కథ మారింది.. కొత్త సేవల్లోకి షిఫ్టు అయింది. ఒకప్పుడు ఉత్తరాలు, పోస్టు్టకార్డులు,మనీయార్డర్లు మోసుకొచ్చిన తపాలా శాఖ... ఇప్పుడు సరుకు రవాణా, ఈ–కామర్స్‌డెలివరీలు, బ్యాంకింగ్, కొరియర్, బీమా, పెన్షన్, పాస్‌పోర్టు, ఆధార్, టీటీడీ టికెట్లు, పుస్తకాలు, మందుల బట్వాడా తదితర సేవల్లో బిజీ అయింది.ఆర్థిక అవసరాలరీత్యా ప్రస్తుతం వాణిజ్యపర సేవలతో లాభాలు ఆర్జించే పనిలో పడింది. 160 ఏళ్లు సేవలందించిన టెలిగ్రామ్ ఐదేళ్ల క్రితంకనుమరుగైంది. ఇంటర్నెట్, సెల్‌ఫోన్ విప్లవంతో ఉత్తరాలు,పోస్టుకార్డులను ఈ–మెయిల్స్, ఎస్ఎంఎస్లు మరిపించగా... మనీయార్డర్లను డిజిటల్ బ్యాంకింగ్ మింగేసింది. ఆధునిక సాంకేతిక విప్లవంతో తపాలాశాఖ మనుగడ ప్రశ్నార్థకమైంది.ఈ నేపథ్యంలో ఆధునికతను అందిపుచ్చుకున్న తపాలాశాఖ వినూత్న ఆలోచనలతో సరికొత్త సేవలకు ముందడుగు వేసింది.పోస్టల్ సిబ్బందిని సరుకు రవాణా, ఈ–కామర్స్ డెలివరీలకు వినియోగించుకుంటోంది. మరోవైపు బ్యాంకింగ్ బాధ్యతలు చేపట్టింది. ప్రజలకు మరింత చేరువయ్యేందుకు పాస్ట్‌పోర్టు, ఆధార్ నమోదు తదితర సేవలందిస్తోంది. ఉత్తరాలు, పోస్టుకార్డులు, ఇన్లాండ్ లేటర్లు క్రమంగా కనుమరుగవుతున్నాయి. ప్రస్తుతం బిజినెస్ మెయిల్స్, పార్శిల్స్, స్పీడ్, రిజిస్టర్డ్ మెయిల్స్ పెరిగాయి. అత్యధిక శాతం పాస్‌పోర్టు, డ్రైవింగ్ లైసెన్సులు, ఏటీఎం కార్డులు, బ్యాంక్ చెక్‌బుక్స్, స్టూడెంట్స్ స్టడీ మెటీరియల్ తదితరాల బట్వాడా జరుగుతోంది. తపాలాశాఖ సాంకేతిక విజ్ఞానంతో సాధారణ ఉత్తరాల బట్వాడాపై దృష్టిసారించింది. పోస్టుబాక్స్లు సకాలంలో క్లియరెన్స్ చేసేందుకు స్మార్ట్ఫోన్లతో స్కానింగ్ నిర్వహిస్తోంది. ఈ–కామర్స్‌లో 60శాతం ఈ–కామర్స్ వ్యాపారానికి ప్రధానమైంది డెలివరీ. దేశవ్యాప్తంగా విస్తరించిన ఈ నెట్‌వర్క్‌పై తపాలాశాఖ దృష్టిసారించింది. సాంకేతికతను అందిపుచ్చుకొని ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంది. లాజిస్టిక్స్ కంపెనీలతో ఒప్పందం కుదర్చుకుంది. ఈ–కామర్స్ పార్శిళ్ల ద్వారా లాభాలు ఆర్జిస్తోంది. మరోవైపు క్యాష్ అండ్ డెలివరీ ఆర్డర్ల (సీఓడీ) బట్వాడాకు నాప్తల్ వంటివి పూర్తిగా పోస్టల్ విభాగాలపై ఆధారపడ్డాయి. సీఓడీలో ఒకవైపు మాత్రమే చార్జీలు వసూలు చేస్తుండడంతో మంచి ఆధరణ లభిస్తోంది. స్టాంపుల విక్రయానికి స్నాప్‌డిల్, దేశవ్యాప్త డెలివరీ కోసం అమోజాన్‌లు ఒప్పందాలు చేసుకున్నాయి. మొత్తమ్మీద ఈ–కామర్స్ డెలివరీలలో 60శాతం వాటా పోస్టల్ శాఖదే. ఐపీపీబీ ప్రారంభం.. వాణిజ్య బ్యాంకులకు దీటుగా పోస్టల్ శాఖ ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబి)ని ప్రారంభించింది. ఈ బ్యాంక్ ద్వారా మూడు రకాల జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ ఖాతాలు అందిస్తోంది. వీటిలో అపరిమిత ఉపసంహరణలు, డోర్‌స్టెప్ బ్యాంకింగ్, డిపాజిట్ల వెసులుబాటు కల్పించింది. పొదుపు ఖాతాలకు 4శాతం వడ్డీ రేటు వర్తిస్తోంది. ఈ ఖాతా ద్వారా డిపాజిట్, మనీ ట్రాన్స్ఫర్, డీబీటీ, బిల్లింగ్ పేమెంట్, ఇంటర్నెట్ బ్యాకింగ్, డిజిటల్ పేమెంట్ సేవలు పొందొచ్చు. ట్రాన్స్‌పోర్టు సైతం... తపాలాశాఖ పోస్టల్ టాన్స్‌పోర్టు బిజినెస్‌కు తెరలేపింది. మహానగరంలో ప్రత్యేక పోస్టల్ పార్శిల్ హబ్స్ ఏర్పాటు చేసింది. నగర శివార్లలోని ఆటోనగర్, ముషీరాబాద్ సమీపంలోని పద్మారావునగర్‌లలో పార్శిల్ హబ్స్ ఉన్నాయి. వస్తువుల బుకింగ్ మాత్రం సమీపంలోని పోస్టు ఆఫీస్‌లలో చేయవచ్చు. అదే విధంగా ప్యాకింగ్ సర్వీస్ కూడా అందుబాటులోకి వచ్చింది. వస్తువు అప్పగిస్తే తపాలా శాఖ సిబ్బంది ప్యాకింగ్ చేసి సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చుతున్నారు. ప్యాకింగ్‌కు ప్రత్యేకంగా చార్జీలు వసూలు చేస్తారు. పోస్టల్ ట్రాన్స్‌పోర్టుల ద్వారా వస్తువులతో పాటు కూరగాయల రవాణాకు కూడా వెసలుబాటు కల్పించింది. వస్తువుల బరువును బట్టి కిలోమీటర్ల చొప్పున చార్జీలు వసూలు చేస్తోంది. లాజిస్టిక్ కంపెనీల నుంచి పార్శిళ్ల పిక్‌ఆప్ కూడా జోరందుకుంది. ఎగుమతులు... దిగుమతులు నగరం ఇప్పుడు ఎన్నో ఉత్పత్తులకు హబ్‌గా మారుతోంది. శివారు ప్రాంతాల్లో తయారీ రంగం విస్తరిస్తోంది. ఫార్మాతో పాటు చాలా వస్తువులు ఇక్కడ ఉత్పత్తవుతున్నాయి. వీటిల్లో తక్కువ పెట్టుబడితో చిన్నస్థాయి తయారీ యూనిట్లు కూడా ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. ఈ ఉత్పత్తుల్లో చాలా వరకు విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి పెద్ద పెద్ద యూనిట్లు షిప్పింగ్ ద్వారా ఎగుమతి చేస్తుండగా.. చిన్నచిన్న తయారీ యూనిట్లు మాత్రం తపాలా ద్వారా పార్శిళ్ల రూపంలో పంపుతున్నాయి. ఇందుకోసం తపాలా శాఖ నగరంలోని హుమాయూన్‌నగర్‌లో సెంట్రల్ ఎక్సైజ్ విభాగంతో కలసి ఫారిన్ పోస్టాఫీస్‌ను ఏర్పాటు చేసింది. సెంట్రల్ ఎక్సైజ్ విభాగం ప్రత్యేక స్కానర్ల ద్వారా విదేశాలకు ఎగుమతయ్యే, విదేశాల నుంచి దిగుమతయ్యే పార్శిళ్లను ఇక్కడే తనిఖీ చేస్తారు. అవసరమైన వాటికి కస్టమ్ డ్యూటీ కట్టించుకుని డెలివరీకి వీలుగా తపాలా సిబ్బందికి అందిస్తున్నారు. అదేవిధంగా దేశంలోనే మొట్టమొదటిగా బేగంపేటలో నేషనల్ స్పీడ్ పోస్ట్ హబ్‌ను ఏర్పాటు చేసింది. 94 దేశాలకు స్పీడ్ పోస్టు సేవలు అందిస్తోంది. -
డిజిటల్ వైపు తపాలా అడుగులు
సాక్షి, బోయినపల్లి: సంపూర్ణ డిజిటల్ గ్రామాల దిశలో తపాలా శాఖ అడుగులు వేస్తోంది. ప్రాజెక్టు అభిమాన్‌లో భాగంగా కరీంనగర్ డివిజన్లో ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంకు (ఐపీపీబీ) ఆధ్వర్యంలో ఐదు డిజిటల్ గ్రామాలుగా ఎంపికయ్యాయి. ఈ గ్రామాల్లోని ప్రజలంతా ఐపీపీబీ ఖాతాలు కలిగి ఉన్నట్లు ధ్రువీకరించామని ఐపీపీబీ కరీంనగర్ డివిజన్ సీనియర్ మేనేజర్ చంద్రకాంత్ తెలిపారు. ఐపీపీబీ ఖాతాలతో ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలు సైతం పొందే అవకాశముంది. రూ.100 బ్యాలెన్స్‌తో ఐపీపీబీ ఖాతా ప్రారంభించవచ్చు. వినియోగదారుడు తన మొబైల్లో ఐపీపీబీ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. యాప్‌తో పోస్టల్ శాఖలో ఉన్న ఎస్ఎస్ఏ, పీపీఎఫ్, ఆర్డీ ఖాతాల డిపాజిట్ ఉన్న చోటి నుంచే ఆపరేట్ చేయొచ్చు. కరీంనగర్ డివిజన్ పోస్టల్ సమాచారం డివిజన్ కేంద్రం: కరీంనగర్ హెచ్ఓలు: 2, కరీంనగర్, జగిత్యాల సబ్ డివిజన్లు: 5, కరీంనగర్నార్త్, సౌత్, జగిత్యాల ఈస్ట్, వెస్ట్, రాజన్నసిరిసిల్ల సబ్ పోస్టాఫీసులు: 43 బ్రాంచ్ పోస్టాఫీసులు: 310 ఐపీపీబీ ఖాతాలు: 50,000 ఐదు సంపూర్ణ డిజిటల్ గ్రామాలు కరీంనగర్ పోస్టల్ డివిజన్లో 310 బ్రాంచి పోస్టాఫీసులు, 43 సబ్ పోస్టాఫీసులు, కరీంనగర్, జగిత్యాల కేంద్రాలుగా 2 హెడ్ పోస్టాఫీసులు ఉన్నాయి. వీటి పరిధిలో 50వేల మందికి ఐపీపీబీ ఖాతాలు ఉన్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఐపీపీబీలో సాక్షమ్ గ్రామ్ (డిజిటల్ గ్రామాలు)గా ఐదు గ్రామాలు ఎంపికైనట్లు సంబందిత శాఖ అధికారి చంద్రకాంత్ తెలిపారు. కరీంనగర్ డివిజన్లో ఉన్న సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం గునుకుల కొండాపూర్, కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం నవాబుపేట, జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం చిల్వకోడూర్, గంగిరెడ్డిపల్లి, రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం తడగొండ గ్రామాలు డిజిటల్ గ్రామాలుగా ఎంపికయ్యాయి. ఈ గ్రామాల్లో ఖాతాదారులు తమ మొబైల్ ఫోన్‌తో ఆన్లైన్ బ్యాంకింగ్ చేసే అవకాశం ఉంది. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్.. ఆధార్ అనుసంధానంతో ఐపీపీబీ ఖాతాదారులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాల డబ్బులు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ (డీబీటీ) ద్వారా తమ ఖాతాల్లో జమ అయ్యే అవకాశముంది. ఇదులో ఉపాధిహామీ చెల్లింపులు, గ్యాస్ సబ్సిడీ, పీఎం కిసాన్ నిధి, రైతుబంధు, కేసీఆర్ కిట్ తదితర పథకాల డబ్బులు నేరుగా ఐపీపీబీ ఖాతాలో జమ చేసుకుని లబ్ధి పొందవచ్చు. గ్రామాల్లో డోర్ స్టెప్ బ్యాంకింగ్.. ఇంటి వద్దకే బ్యాంకు సేవలు కాన్సెప్ట్‌తో.. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల ఇళ్లలోకి బీపీఎంలు వెళ్లి డోర్‌స్టెప్ బ్యాంకింగ్ కింద ఐపీపీబీ ఖాతాలు తెరుస్తున్నారు. ఇందుకోసం బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (బీపీఎం)లకు పోస్టల్ శాఖ ఐపీపీబీ యాప్ ఉన్న ప్రత్యేక సెల్ ఫోన్, బయోమెట్రిక్ డివైస్ అందించారు. ఖాతా ఇంటి వద్దే తెరిచి డీవైసీలో వేలిముద్ర తీసుకుని ఆన్లైన్ చేస్తారు. డిపాజిట్ సొమ్ము విత్‌డ్రా చేసుకోవాలనుకున్నా ఇంటి వద్దనే విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంది. ప్రజలతో సన్నిహిత సంబంధాలు బోయినపల్లి ఎస్ఓ పరిధిలో ఉన్న తడగొండ గ్రామంలో ప్రజలతో మంచి సంబంధాలు ఏర్పరచుకున్నా. ఐపీపీబీ ఖాతాలతో కలిగే ప్రమోజనాలు ప్రజలకు వివరించా. దీంతో గ్రామంలో ఐదు వందలకు పైగా ఖాతాలు తెరిచా. తడగొండ డిజిటల్ గ్రామంగా ఎంపికయ్యాంది. – కిరణ్, బీపీఎం, తడగొండ, బోయినపల్లి పథకాల డబ్బులు జమ మంచిదే.. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే గ్యాస్ సబ్సిడీ, ఉపాధిహామీ, రైతుబంధు తదితర సంక్షేమ పథకాల డబ్బులు నేరుగా ఖాతాలో జమ చేయడం మంచి పరిణామం. దీంతో వినియోగదారులకు చాలా సౌకర్యంగా ఉంటుంది. – బుర్ర రాజు, తడగొండ, బోయినపల్లి ఇంటి వద్దే సేవలు.. ఐపీపీబీ కింద ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఐదు గ్రామాలను సంపూర్ణ డిజిటల్ గ్రామాలుగా ప్రకటించడం జరిగింది. ఈ గ్రామాల్లో ప్రజలందరికీ ఐపీపీబీ ఖాతాలు ఉన్నాయి. ఫోన్లో యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇంట్లోంచే బ్యాంకు సేవలు పొందే అవకాశం ఉంది. – చంద్రకాంత్, ఐపీపీబీ సీనియర్ మేనేజర్, కరీంనగర్ డివిజన్ -
‘పది’ జవాబు పత్రాలు గల్లంతు
కాగజ్‌నగర్: పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల జవాబు పత్రాల గల్లంతయిన ఘటన కుమురంభీం జిల్లా కాగజ్‌నగర్‌లో కలకలం సృష్టించింది. తపాలా శాఖ అధికారుల నిర్లక్ష్యంతో జవాబు పత్రాలు గల్లంతు కాగా రెండు రోజుల అనంతరం దొరికాయి. ఈ మేరకు బుధవారం కాగజ్‌నగర్ డీఎస్పీ సాంబయ్య వివరాలు వెల్లడించారు. ఈ నెల 10న కాగజ్‌నగర్ పట్టణంలోని మూడు కేంద్రాల్లో పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించారు. తొలిరోజు 65 మంది విద్యార్థులు తెలుగు, హిందీ, ఉర్దూ పరీక్షలు రాయగా వాటికి సంబంధించిన జవాబు పత్రాలను అదే రోజు సాయంత్రం పట్టణంలోని తపాలా కార్యాలయానికి తరలించారు. పోస్టల్ అధికారులు ఒక బ్యాగులో జవాబు పత్రాలను భద్రపరిచి రైలు ద్వారా మంచిర్యాల సార్టింగ్ కేంద్రానికి తరలించడానికి ప్రయత్నించారు. జవాబు పత్రాల బ్యాగుతోపాటు మొత్తం 13 బ్యాగులు ఆటోలో రైల్వేస్టేషన్‌కు తీసుకెళ్లారు. గ్రాండ్‌ట్రంక్ (జీటీ) ఎక్స్‌ప్రెస్‌లో మంచిర్యాలకు తరలించడానికి ఆర్ఎంఎస్ (రైల్వే మెయిన్ సర్వీసెస్) బోగీలో ఎక్కిస్తుండగా అందులో ఒక బ్యాగు లేనట్లు గుర్తించారు. వెంటనే చుట్టుపక్కల ప్రాంతంలో గాలించారు. అయినా ఎంతకూ దొరక్కపోవడంతో ఈ నెల 11న పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆటోలో నుంచి జారిపడటంతో.. విచారణ చేపట్టిన పోలీసులు బ్యాగులు తరలించిన రోజు ఈదురుగాలులతో కూడిన వర్షం ఉండటంతో ఆటో నుంచి జవాబు పత్రాలు కింద పడినట్లు తేల్చారు. ఆ బ్యాగు గుర్తుతెలియని మహిళకు దొరకడంతో ఆమె ఓ రైల్వే ఉద్యోగి ఇంట్లో అప్పగించింది. రైల్వే ఉద్యోగి విధు లు ముగించుకుని బుధవారం ఇంటికి రావడంతో అతని కంట పడింది. పట్టణ పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు బ్యాగును స్వాధీనం చేసుకున్నారు. డీఈవో భిక్షపతి సమక్షంలో పరీక్ష కేంద్రాల సూపరింటెం డెట్లు శంకరయ్య, హన్మంతు, వరలక్ష్మి బ్యాగును పరిశీలించారు. తాము వేసిన సీలులో ఏ తేడా లేదని తేలడంతో జిల్లా అధికారికి అప్పగించారు. పోస్టల్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా జవాబు పత్రాలు గల్లంతైన ట్లు విచారణలో తేలిందని అధికారులు వెల్లడించారు. దీనిపై ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తామని తెలిపారు. -
గోమతి చిత్రంతో తపాలా బిళ్ల
తిరువొత్తియూరు: దోహాలో జరిగిన ఆసియా అథ్లెటిక్స్ పోటీలో బంగారం పతకం సాధించిన గోమతి పేరుతో తపాళా బిళ్లను బుధవారం విడుదల చేశారు. తిరుచ్చి ముడి కన్నడం గ్రామానికి చెందిన గోమతి ఖతర్‌లోని దోహాలో జరిగిన అథ్లెటిక్స్ పోటీలో 800 మీటర్ల పరుగు పందెం విభాగంలో బంగారు పతకం సాధించారు. ఈ పోటీలో భారతదేశానికి దక్కిన మొదటి బంగారు పతకం ఇదే కావడం విశేషం. భారతదేశానికి కీర్తిని తెచ్చిపెట్టిన క్రీడాకారిణి గోమతికి ప్రోత్సాహకాలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో గోమతి విజయానికి చిహ్నంగా ఆమె ఫొటోతో కూడిన రూ.5 విలువ గల తపాలా బిళ్లను విడుదల చేశారు. ఆ తపాలా బిళ్లలో బంగారం పతకం చూపిస్తున్న గోమతి, పక్కన ఎర్రకోట ముద్రింపబడి ఉంది. ఆ తపాలా బిళ్లను తిరుచ్చి తపాలా ప్రధాన కేంద్రం అధికారులు క్రీడాకారిణి గోమతికి అందచేశారు. -
కనుడు.. కనుడు..రామాయణ గాథ..
సాక్షి, హైదరాబాద్: రామాయణాన్ని తపాలా బిళ్లల ద్వారా చెప్తే ఎలా ఉంటుంది.. కాస్త ఆశ్చర్యంగా ఉన్నా తపాలాశాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి ఇదే ప్రయత్నం చేశారు. రామాయణ గాథను ఆది నుంచి అంతం వరకు తపాలా బిళ్లల ద్వారా కళ్ల ముందుకు తెస్తున్నారు. పైగా అవన్నీ 20 వివిధ దేశాలు వివిధ సందర్భాల్లో ముద్రించిన రామాయణ ఇతివృత్తంతో కూడిన పోస్టల్ స్టాంపులు కావటం విశేషం. కొన్నేళ్ల పాటు శ్రమించి వాటిని సేకరించిన ఆయన పూర్తి రామాయణ గాథను వాటి రూపంలో నిక్షిప్తం చేశారు. ఆయన కృషికి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కింది. బుధవారం అధికారికంగా నిర్వాహకులు ఈ విషయాన్ని ప్రకటించారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం గుమ్మడవల్లి గ్రామానికి చెందిన వెన్నం ఉపేందర్ ఈ ఘనత సాధించారు. 450 స్టాంపులు.. 80 ఏ–4 పేజీలు! తమిళనాడులోని మదురైలో పోస్టుమాస్టర్ జనరల్‌గా పనిచేస్తున్న ఉపేందర్ కొన్నేళ్లుగా రామాయణ ఇతివృత్తంపై వివిధ దేశాలు ముద్రించిన తపాలా బిళ్లలను సేకరించటం ప్రారంభించారు. ఇప్పటివరకు ఆయన 450 స్టాంపులను సమీకరించారు. వాటిని వరుసగా పేరిస్తే ఏ–4 సైజులో ఉండే 80 కాగితాలకు సరిపోతున్నాయి. ఇదే ప్రపంచ రికార్డుగా ఉంది. అంతకుముందు 16 ఏ–4 సైజు షీట్లకు సరిపడా సంఖ్యలో రామాయణ స్టాంపులు సేకరించిన ఇజ్రాయెల్‌కు చెందిన మెల్లమ్ అనే వ్యక్తి పేరిట రికార్డు ఉంది. తన వద్ద ఉన్న స్టాంపులతో పలు ప్రదర్శనల్లో రామాయణ గాథను వివరించిన ఉపేందర్ పలు పురస్కారాలు సొంతం చేసుకున్నారు. గత డిసెంబర్లో హైదరాబాద్‌లో జరిగిన జాతీయ స్థాయి ప్రదర్శనలో ఆయన బంగారు పతకం సైతం సాధించారు. జూన్, జూలైలలో సిడ్నీ, సింగపూర్లలో జరగనున్న అంతర్జాతీయ ప్రదర్శనలో పాల్గొంటున్నట్టు ఉపేందర్ తెలిపారు. ఆగ్నేయాసియా దేశాల్లోనే ఎక్కువ రామాయణ ఇతివృత్తంపై ఉపేందర్ 450 స్టాంపులు సేకరిస్తే అందులో భారత్‌కి చెందినవి 15కు మించిలేవు. ఎక్కువగా ఆగ్నేయాసియా దేశాలవే ఎక్కువగా ఉన్నాయి. కంబోడియా, ఇండోనేసియా, మలేసియా, థాయ్‌లాండ్, సింగపూర్ దేశాలు పెద్ద సంఖ్యలో రామాయణ ఇతివృత్తంపై తపాలా బిళ్లలను విడుదల చేశాయి. పొరుగు దేశాలైన నేపాల్, శ్రీలంక, మయన్మార్‌లతో పాటు జర్మనీలాంటి కొన్ని యూరప్ దేశాలు కూడా రామాయణ ఘట్టాలపై స్టాంపులు విడుదల చేశాయి. వీటన్నింటిని ఉపేందర్ సేకరించారు. రామాయణం ఏం చెప్తోంది... రామాయణం ప్రస్తుత సమాజానికి ఏం చెప్తోంది.. విదేశాల్లో రామాయణానికి ఇస్తున్న ప్రాధాన్యం.. మొత్తంగా రామాయణ గాథను స్టాంపుల ద్వారా వివరిస్తున్నట్టు ఉపేందర్ తెలిపారు. మలేసియాలో హికాయత్ సేరి రామా పేరుతో రామాయణాన్ని వివరిస్తున్నారని, అక్కడ ప్రధాని ప్రమాణ స్వీకార సమయంలో ఇప్పటికీ రామ పాదాలను ఉంచుతున్నారని, కొన్ని దేశాల్లో రాజులను రామ–1, రామ–2గా పిలుచుకుంటున్నారని.. ఇలాంటి ఎన్నో విషయాలు స్టాంపుల ద్వారా వెల్లడవుతున్నాయని ఆయన చెప్పారు. రామాయణ గాథను వివరించటంతోపాటు స్టాంపుల ద్వారా జనం ముందుకు తీసుకెళ్తున్నందుకు సంతోషంగా ఉందని.. త్వరలోనే ఇది గిన్నీస్ దృష్టికి వెళ్లనుందని అన్నారు. ఉపేందర్ -
జీరో బ్యాలెన్స్‌తో ఖాతా తెరుస్తాం
కడప వైఎస్ఆర్ సర్కిల్ : తపాలా అంటే ముందుగా గుర్తుకు వచ్చేది ఉత్తరాల బట్వాడా. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా తపాలా శాఖ అనేక మార్పులను చేసుకుంటూ తన పరిధి పెంచుతోంది. తపాలాశాఖ పూర్తిగా డిజిటలైజేషన్‌తో ప్రజలకు విస్తృత సేవలు అందించడంలో ముందు వరుసలో ఉంటోంది. పోస్టల్ శాఖ ప్రస్తుతం బ్యాంకింగ్‌లో ప్రవేశించి తన పరిధిని మరింత విస్తృతపరిచింది. మారు మూల గ్రామీణ ప్రాంతాల్లో కూడా అన్ని రకాల సేవలను అందుబాటులో ఉంచినట్లు కడప డివిజనల్ పోస్టల్ సూపరింటెండెంట్ ఎ. శ్రీనివాసరావు వెల్లడించారు. తపాలా సేవలను మెరుగు పరుస్తున్నామని ఆయన ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు. ఆ వివరాలు .. డిజిటలైజేషన్.. ‘తపాలా శాఖ మార్పుల్లో భాగంగా ఎలక్ట్రానిక్ వ్యాపార లావాదేవీలపై దృష్టి సారించింది. డిజిటలైజేషన్‌తో పూర్తి స్థాయిలో ఆన్లైన్ సదుపాయాలను అందుబాటులోకి తీసుకువచ్చాం. ఆర్థికపరమైన లావాదేవీలు అందించేందుకు ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకును రంగంలోకి దించాం. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారికి కూడా అతి చేరువయ్యేలా ఈ బ్యాంకింగ్ విధానాన్ని రూపొందించారు. గత ఏడాది దేశ వ్యాప్తంగా బ్యాంకులను ప్రారంభించాం. ప్రభుత్వం అందిస్తున్న సామాజిక లబ్ధి చేకూర్చే పథకాలను పొందే లబ్ధిదారులకు నేరుగా రాయితీలను వారి ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. 9వేల బ్యాంకు ఖాతాలతో..... ♦ కడప డివిజన్ పరిధిలో ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకును కడపలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బ్యాంకులో ఇప్పటి వరకు దాదాపు 9 వేల ఖాతాలను ప్రారంభించాం. అంతా ఆన్లైన్ కావటంతో ఖాతాదారుల ఖాతాల్లో ప్రభుత్వం అందిస్తున్న రాయితీ నేరుగా జమ అవుతోంది. ఖాతాదారుల ఖాతా ద్వారా పన్నులు, విద్యుత్ బిల్లులు వంటివి చెల్లించవచ్చు.ఇతర ఖాతాల్లోకి నగదును కూడా తమ ఖాతా నుంచి చెల్లించే సదుపాయం ఉంది. అలానే ఖాతాదారుడి ఇంటికే సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ♦ ఐపిపిబి బ్యాంకు వ్యవహారమంతా కాగితరహిత పాలన జరుగుతోంది. ఖాతాను ప్రారంభించేందుకు కూడా ఎలాంటి కాగితాలు , పాస్ పుస్తకాలు ఉండవు. క్యూఆర్ కార్డు విధానాన్ని అమలుల్లోకి తీసుకువచ్చాం. పోస్టాఫీసుకు వెళ్లి ఆధార్ నెంబర్ ఇస్తే చాలు బ్యాంకు ఖాతాను తెరుస్తారు. పాస్‌పుస్తకం బదులు క్యూఆర్ కార్డు ను ఇస్తారు. ఈ కార్డు బ్యాంకుకు తీసుకెళితే కార్డును స్కానింగ్ చేయగానే ఖాతాదారుల వివరాలు కంప్యూటర్లో దర్శనమిస్తాయి.‘0’ బ్యాలెన్స్‌తో ఖాతాను తెరిచే సదుపాయం కల్పిస్తున్నాం. అలానే ఐపిపిబి యాప్‌ను కూడ ఆవిష్కరించాం. ♦ తపాలా శాఖ ద్వారా మెరుగైన సేవలు అందిస్తున్నాం. స్పీడ్ పోస్ట్ లావాదేవీలు, లాజిస్టిక్ పోస్టు, బిజినెస్ పార్శిల్, ఎక్స్‌ప్రెస్ పార్శిల్, మీడియాపోస్టు, డైరెక్ట్ పోస్ట్, ఈ పోస్టు, ప్యాక్పోస్ట్ తదితర సేవలు అందిస్తున్నాం. తపాలా బీమాకు విశేష ఆదరణ... తపాలా బీమా పథకం ప్రాచుర్యంలో ఉంది. ముందుగా తపాలా ఉద్యోగుల సంక్షేమం కోసం ఈ పథకాన్ని ప్రారంభించగా తర్వాత ఉద్యోగుల కోసం.. తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ తపాలా పేరిట విస్తరించింది. ప్రస్తుతం దీనిని కూడా ఆన్లైన్ చేయటం ద్వారా ప్రీమియంను ఎక్కడైనా చెల్లించవచ్చు. ఆధార్, పాస్‌పోర్టు సేవలు... తపాలా శాఖ ద్వారా ఆధార్, పాస్‌పోర్టు సేవలు కూడ అందిస్తున్నాం. యూఐడీఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకొని కడప డివిజన్ పరిధిలో పోస్టాఫీసులో దాదాపు 18 ఆధార్ సెంటర్లు ఏర్పాటు చేసి రోజుకు దాదాపు 300 మంది వరకు ఆధార్ సేవలు అందిస్తున్నాం. పాస్‌పోర్టు సేవా కేంద్రాన్ని సైతం అందుబాటులోకి తెచ్చి జిల్లా వాసులకు ఈసేవలను విస్తృతంగా అందజేస్తున్నాం.’ అని కడప డివిజనల్ పోస్టల్ సూపరింటెండెంట్ ఎ. శ్రీనివాసరావు వివరించారు. -
నమ్మితే... నట్టేట ముంచాడు...
‘మా తల్లిదండ్రుల కాలం నాటి నుంచి ఆయనపై నమ్మకం...అదే విశ్వాసంతో పోస్టల్ ఆర్డీలు పేరిట డబ్బు కట్టాం...తీరా ఇప్పుడేమో కట్టిన డబ్బులకు రశీదుల్లేవు...బాండ్లు లేవు...తిరిగి డబ్బుల్లేవు...’ అంటూ జి.ములగాం గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని కోరారు. వివరాల్లోకి వెళ్తే... విజయనగరం, చీపురుపల్లి: పోస్టల్ ఆర్డీల పేరిట ఓ వ్యక్తిని నమ్మి రూ.లక్షల్లో డబ్బులు కట్టి మోసపోయామని తమకు న్యాయం చేయాలని వారం రోజుల కిందట పోలీసుస్టేషన్‌ను ఆశ్రయించిన జి.ములగాం గ్రామస్తులు మంగళవారం మరోసారి పోలీసుస్టేషన్‌ను ఆశ్రయించారు. గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కరిమజ్జి శ్రీనివాసరావు, వైఎస్సార్ సీపీ మండల నాయకులు ఇప్పిలి అనంతరం, వలిరెడ్డి శ్రీనివాసనాయుడు సహకారంతో స్థానిక పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన వారు తమకు న్యాయం చేయాలని ఎస్ఐ దుర్గాప్రసాద్‌ను వేడుకున్నారు. తమతో డబ్బులు కట్టించుకుని గ్రామంలో లేకుండా ఉడాయించిన పోస్టు రన్నర్‌ను కూడా తీసుకొచ్చి పోలీసులకు అప్పగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామానికి చెందిన వందలాది మంది ఏళ్ల తరబడి పోస్టు రన్నర్ వద్ద డబ్బులు కడుతున్నామని ఎవరికీ ఏ రోజు రశీదులు ఇవ్వడం ఆయనకు అలవాటు లేదన్నారు. తాము కూడా ఆయనపై ఎంతో నమ్మకంతో రశీదులు, బాండ్లు ఏరోజు అడగలేదన్నారు. దాచుకున్న డబ్బులు ఎంత కాలమైనా రాకపోవడంతో ఇటీవల ఆయన్ను అడగడంతో గ్రామం వీడి వెళ్లిపోయాడని చెప్పారు. ఇదిలా ఉండగా గ్రామస్తులు తీసుకొచ్చిన పోస్టు రన్నర్‌ను ఎస్ఐ ప్రశ్నించగా ప్రజల నుంచి సేకరించిన డబ్బు మొత్తం సహారా ఇండియా పరివార్ సంస్థలో పెట్టానని, ఆ సంస్థ దివాళా తీయగా సుప్రీంకోర్టులో కేసు నడుస్తోందన్నారు. ఆ సంస్థ నుంచి డబ్బులు రావాల్సి ఉందన్నారు. దీంతో జోక్యం చేసుకున్న గ్రామస్తులు తాము చెల్లించిన డబ్బులకు రశీదులు, బాండ్లు ఇవ్వాలని పట్టుబట్టారు. తన ఇంటి వద్ద ఉన్నాయని ఇస్తానని పోస్టు రన్నర్ చెప్పాడు. చివరగా ఎస్ఐ దుర్గాప్రసాద్ జోక్యం చేసుకుని గ్రామంలోకి వచ్చి విచారణ నిర్వహిస్తామని తరువాత చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. దీంతో గ్రామస్తులు వెనుదిరిగారు. -
రూ.17 స్పీడ్పోస్టుకు రూ.35 వసూలు..
ఆర్టీఏలో పోస్టల్ చార్జీల పేరిట భారీ దోపిడీ సాగుతోంది. ఏజెంట్ల చేతివాటం, అధికారుల ఏమరుపాటు కారణంగా వినియోగదారుల జేబులకు చిల్లు పడుతోంది. ఏటా స్పీడ్ పోస్టుల పేరిట వసూలు చేసిన కోట్ల రూపాయలకు ఆడిటింగ్ కూడా జరగకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. దీంతో ఈ డబ్బంతా ఎవరి జేబుల్లోకి వెళ్తోందన్నది సమాధానం లేని ప్రశ్నగా మిగిలింది. 2008 నుంచి ఇలాగే పోస్టల్ చార్జీలు వసూలు చేస్తున్నా పట్టించుకునే నాథుడే కరవయ్యాడు. ఏంటీ సమస్య? ఆర్టీఏ కార్యాలయాల్లో రోజూ వాహనాల రిజి స్ట్రేషన్లు, పర్మినెంట్ లైసెన్స్‌లు, ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్, ఆర్సీ డూప్లికేట్ ఇలా రకరకాల కార్డులు జారీ చేస్తుంటారు. జారీ చేసే స్మార్ట్ కార్డుల సంఖ్య రోజుకు దాదాపు 350కి పైగానే ఉం టుంది. నిబంధనల ప్రకారం వీటన్నింటినీ స్పీడ్ పోస్టుద్వారా పంపాలి. కానీ వీటిలో 80% అంటే దాదాపు 300 కార్డులు దళారుల చేతికే వెళ్తు న్నాయి. ఇందుకు వాహనదారుల వద్ద రూ.100 నుంచి 150 వరకు వసూలు చేస్తు న్నారు. అంటే అధికారుల సాయంతో ఏజెంట్లు నేరుగా చేతికే కార్డులు ఇస్తూ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. స్పీడ్ పోస్టు గురించి నిబంధనలు ఇవీ.. భారతీయ తపాలా సంస్థ పెట్టిన నిబంధనలు తెలంగాణ రవాణా శాఖలో అమలు కావ ట్లేదు. 40 గ్రాముల వరకు 350 కిలోమీటర్ల దూరం వరకు రూ.17 చార్జీ చేస్తారు. కానీ తెలంగాణ రవాణా శాఖ జారీ చేసే లైసెన్సుల దూరం మహా అయితే 15 కి.మీ. మించదు. జిల్లాల్లో ఈ పరిధి కాస్త అధికంగా ఉండొచ్చు. కార్డు బరువు 9 గ్రాములే ఉండటం గమనార్హం. ఇందులో కవర్ ఖర్చు ఒక్క రూపాయి అనుకున్నా కార్డు బట్వాడాకు అయ్యే ఖర్చు రూ.18 మాత్రమే. మరి రూ.35 ఎందుకు వసూలు చేస్తున్నారో ఎవరికీ తెలియదు. ప్రజల నుంచి అక్రమంగా కోట్ల రూపాయలు వసూలు చేస్తున్న రవాణా శాఖలో ఈ విషయంపై ఇంతవరకూ అంత ర్గత ఆడిటింగ్ జరగకపోవడం గమనార్హం. ఇంత జరుగుతున్నా ఇంటర్నరల్ ఆడిటింగ్ ఎందుకు జరగట్లేదు.. అదనంగా వసూలవు తున్న మొత్తం ఎవరి ఖాతాల్లోకి వెళ్తోంది.. దళారులు నేరుగా కార్డులు ఎలా ఇవ్వ గలుగుతున్నారనే వాటికి సమాధానం లేదు. 74 ఆఫీసుల్లో రోజుకు దాదాపు 50 కార్డులు మాత్రమే స్పీడ్ పోస్టు ద్వారా బట్వాడా అవుతున్నాయి. సీఎం, గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తాం వాహనదారుల నుంచి ఆర్టీఏ అధి కారులు కోట్లాది రూపాయలు అక్ర మంగా వసూలు చేస్తున్నారు. తపాలా శాఖ నిబంధనలను కాదని, అదనంగా వసూలు చేస్తున్న రూ.17కు ఎందుకు లెక్క చెప్పరు? ఇలా వసూలవుతున్న కోట్ల రూపాయలను ఏం చేస్తున్నారు? ఈ విషయాన్ని త్వరలోనే ముఖ్యమంత్రి, గవర్నర్ దృష్టికి తీసుకెళ్తాం. దీనిపై తప్పకుండా ఏసీబీ విచారణ జరిపించాలి. – దయానంద్, తెలంగాణ ఆటో, మోటార్స్ వెల్ఫేర్ అసోసియేషన్ దళారులను ఆశ్రయించొద్దు.. వాహనదారులు దళారులను ఆశ్రయించొద్దు. నిబంధనల ప్రకారం కార్డులన్నీ స్పీడ్ పోస్టులోనే తీసుకోవాలి. అలాంటివారిపై ఫిర్యాదులు చేస్తే చర్యలు తీసుకుంటాం. – రమేశ్, జేటీసీ, ఆర్టీఏ చేతికిచ్చే వాటిలోనూ చేతివాటమేనా? మిగిలిన స్మార్ట్ కార్డులను తప్పనిసరిగా స్పీడ్పోస్టులోనే పంపాలని నిబంధనలు ఉన్నాయి. కాబట్టి వాటికి పోస్టల్ చార్జీల కింద రూ.35 వసూలు చేస్తున్నారని అనుకుందాం. కానీ ఏదైనా వాహనానికి ఎన్ఓసీ, ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్‌లు తీసుకున్నప్పుడు చేతికే ఇవ్వాలి. కానీ అధికారులు వీటికి ఇస్తున్న రశీదుల్లోనూ రూ.35 స్పీడ్ పోస్టు చార్జీలు కలిపి వడ్డిస్తుండటంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. 74 కార్యాలయాల్లో పోస్టు ద్వారా పంపుతున్న మొత్తం కార్డులు 3,700 స్పీడ్ పోస్టుకు వాస్తవంగా వసూలు చేయాల్సింది రూ.18 ప్రస్తుతం అదనంగా వసూలు చేస్తోంది రూ.17 3,700 కార్డులకు ఒకరోజు పడుతున్న అదనపు భారం రూ.62,900 22 పనిదినాలకు పడే భారం రూ.13,83,800 - భాషబోయిన అనిల్‌కుమార్ -
తపాలా శాఖలో ‘కుసుమ’ కలకలం
చిత్తూరు కార్పొరేషన్: తపాలా శాఖ మాజీ ఉద్యోగి కుసుమ ఫిర్యాదు చిత్తూరు పోస్ట ల్ శాఖలో కలకలం రేపింది. సాక్షాత్తు ఆ శాఖ ఎస్పీ(సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్) విజయ్‌కుమార్‌తో సహా ఏడుగురిపై క్రిమినల్ కేసు నమోదవడంతో తపాలా శాఖకు అవినీతి మరకలు అంటుకున్నాయి. ఏం జరిగిందంటే.. ఐరాల సబ్ పోస్టాఫీసు పరిధిలోని ముదిగోళం బ్రాంచ్‌లో దళిత కులానికి చెందిన కుసుమ రెగ్యులర్ ఉద్యోగిగా విధులు నిర్వహించేవారు. గతేడాది పోస్టల్ శాఖలో ఆన్లైన్ విధానం అమల్లోకి వచ్చింది. అప్పట్లో ముదిగోళంలో ఖాతాదారులు చెల్లించిన మొత్తాన్ని పాసుబుక్ సీల్ వేసి, అకౌంట్ బుక్‌లో నమోదు చేసేవారు. అలా నమోదు చేయరాదని పూతలపట్టు సబ్ పోస్టాఫీçసర్ కవిత ఆదేశాలు జారీ చేశారు. ఆ మేరకు కుసుమ విధులు నిర్వహించారు. వీటిని ఆన్లైన్ చేయడంలో కవిత నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీంతో యూసీఆర్ (అన్ క్లారిఫైరిసిప్ట్)లో రూ.15,832 ఎక్కువగా రావడంతో కుసుమపై నెపం నెట్టేసి, ఆమెను వి«ధుల నుంచి తొలగించారు. ఆమెపై క్రిమినల్ కేసు నమోదవడంతో అరెస్టు కూడా అయ్యారు. తన తప్పు లేకుండా విధుల నుంచి తొలగించారని, మొత్తంవ్యవహారంపై పూర్తి విచారణ చేయాలని, ఈ వ్యవహారంలో పెద్దల పాత్ర ఉందని, ఖాతా దారుల నగదు గోల్‌మాల్‌లో చాలామంది ప్రమేయం ఉందని కుసుమ పోలీసులను ఆశ్రయించారు. వారి నుంచి స్పందన లేకపోవడంతో తనకు జరిగిన అన్యాయంపై న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. న్యాయం చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన చిత్తూరు నాలుగో మునిసిఫ్ మేజిస్ట్రేట్ న్యాయస్థానం కుసుమ ఆరోపణలు చేసిన ఏడుగురిపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. కేసు నమోదు వీరిపైనే.. కుసుమ ఫిర్యాదుతో విజయ్‌కుమార్(తపాలా శాఖ ఎస్పీ చిత్తూరు), మల్లికార్జున (వాయల్పాడు పోస్టల్ ఇన్స్పెక్టర్), ఆర్ముగం(తపాలా శాఖ ఎఎస్పీ చిత్తూరు), కవిత (వెంగలరాజకుప్పం ఎస్వో), జశ్వంత్(విచారణ అధికారి, ఎస్పీ కార్యాలయం), మురళీకుమార్ (పోస్ట్‌మ్యాన్ చిత్తూరు), బీవీఆర్ మూర్తి(ప్రధాన తపాలా కార్యాలయ పోస్ట్‌మాస్టర్)పై పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిపై ఐపీసీ 120–ఎ, 120–బీ, 420, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, 177, 194, ,195, 196, 199, 211, 212, 218, 454, 488 సెక్షన్ల కింద కాణిపాకం పోలీసులు కేసు నమోదు చేశారు. అధికారులు మౌనం.. ఈ వ్యవహారంపై తపాలా శాఖ అధికారులు మౌనం వహిస్తున్నారు. కుసుమ చేసిన ఆరోపణలపై స్పందించడానికి నిరాకరిస్తున్నారు. పెదవి విప్పితే తపాలా శాఖ పరువు బజారున పడుతుందని అధికారులు దీనిపై మాట్లాడటం లేదని తెలుస్తోంది. -
ఏమిటీ జాప్యం..
సాక్షి, హైదరాబాద్: వివిధ కేసుల్లో న్యాయస్థానాలు పంపుతున్న నోటీసులు, సమన్లు తదితరాలను ఆయా వ్యక్తులకు అందచేయడంలో పోస్టల్ విభాగం చూపుతున్న నిర్లక్ష్యంపై హైకోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. న్యాయస్థానాల నుంచి వెళ్లే నోటీసులు, సమన్లు తదితరాలను అందచేసే విషయంలో పోస్టల్ సిబ్బంది నిర్లక్ష్యంవల్ల పోస్టల్‌శాఖపై ప్రజలు నమ్మకం కోల్పోతారంది. ఇదే సమయంలో నోటీసుల అందచేతలో జరిగే అసాధారణ జాప్యంవల్ల మొత్తం న్యాయవ్యవస్థే కదిలిపోయే ప్రమాదం ఉందని హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. కోర్టుల నుంచి వెళ్లే నోటీసులు తదితరాలను అందచేసే విషయంలో పోస్టల్ సిబ్బంది చాలా ఉదాసీనంగా, నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నారని, ఎవరికి నోటీసులు అందచేయాలో ఆవ్యక్తి లేరని, గ్రామం నుంచి వెళ్లిపోయారని, అసలు అటువంటి చిరునామానే లేదని, చిరునామా తప్పు అని పలు కారణాలతో నోటీసులు అందచేయకుండా తిరిగి వెనక్కి పంపుతున్నారంది. ఇలా చేయడం విధినిర్వహణలో నిర్లక్ష్యం ప్రదర్శించడమేనని స్పష్టం చేసింది. కేసుల్లో ప్రతివాదులుగా ఉన్న వ్యక్తులకు సకాలంలో నోటీసులు అందకపోవడం వల్ల న్యాయస్థానాల్లో కేసులు సత్వర విచారణకు నోచుకోవడం లేదని పేర్కొంది. కింది కోర్టుల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొందని, ఈ నేపథ్యంలో పోస్టల్ శాఖను గాడిలో పెట్టాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఈ పరిస్థితిపై పోస్టల్ శాఖలోని ఉన్నతాధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని తెలిపింది. కిందిస్థాయి అధికారులను అప్రమత్తం చేయాల్సిన బాధ్యత ఉన్నతాధికారులపై ఉందని పేర్కొంది. ఉదాసీనంగా ఉండే సిబ్బందిపై చర్యలకు ఆదేశం విధినిర్వహణలో ఉదాసీనంగా వ్యవహరించే సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు హైకోర్టు స్పష్టం చేసింది. చట్టప్రకారం వారికి బయటకు వెళ్లే ద్వారాలను చూపాలంది. న్యాయస్థానాలు ఇచ్చే నోటీసులను సంబంధిత వ్యక్తులకు అందచేయకపోవడం కోర్టు ఆదేశాలను ఉల్లంఘించడం కిందకే వస్తుందని తేల్చి చెప్పింది. పోస్టల్ అధికారులు తాము నిర్వర్తించాల్సిన విధులను నిర్వర్తించకపోవడమేనని పేర్కొంది. ఈ ఆదేశాల గురించి తెలంగాణ పోస్ట్‌మాస్టర్ జనరల్ దృష్టికి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వ న్యాయవాదికి హైకోర్టు స్పష్టం చేసింది. తదుపరి చర్యలకు సంబంధించిన వివరాలను తమ ముందుంచాలని ఆదేశించింది. ఈ వ్యవహారాన్ని ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్)గా పరిగణించాలని రిజిస్ట్రీని ఆదేశించింది. ఇందులో కేంద్ర పోస్టల్‌శాఖ కార్యదర్శి, తెలంగాణ చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్, న్యాయశాఖ కార్యదర్శి, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌ను ప్రతివాదులుగా చేర్చాలంది. ఈ వ్యాజ్యంపై ఈ నెల 28న విచారణ చేపడతామని పేర్కొంది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. -
ఖమ్మంలో రాష్ట్ర మహాసభలు
ఖమ్మంవ్యవసాయం: నేషనల్ యూనియన్ ఆఫ్ పోస్టల్ ఎంప్లాయీస్ గ్రూప్–సీ(ఎఫ్‌ఎన్‌పీఓ), నేషనల్ యూనియన్ ఆఫ్ గ్రామీణ డాక్ సేవక్స్ (ఎన్‌యూపీఈ) రెందో ద్వై వార్షిక మహాసభలను ఖమ్మంలో నిర్వహిచడానికి ఆయా యూనియన్ల తెలంగాణ సర్కిల్ యూనియన్లు నిర్ణయించాయి. ఈ నెల 16 నుంచి 18వ తేదీ వరకు ఖమ్మం నగరంలోని స్టేషన్ రోడ్లో ఉన్న శాంతి హోటల్ వేదికగా నిర్వహించడానికి నిర్ణయించారు. 16వ తేదీ ఉదయం 10 గంటలకు సంయుక్త ఓపెన్ సెషన్‌తో కార్యక్రమం ప్రారంభమవుతుందని ప్రకటించా రు. ఈ మహాసభల్లో ఎన్‌యూజీడీఎస్, ఎఐజీడీఎస్ సంయుక్త ఆధ్వర్యంలో వివిధ డిమాండ్లపై ఈ నెల 18వ తేదీ నుంచి నిర్వహించతలపెట్టిన నిరవధిక సమ్మెపై ప్రత్యేకంగా చర్చించనున్నారు. గ్రామీణ తపాలా ఉద్యోగులు 16రోజుల పాటు చారిత్రక సమ్మె అనంతరం జరిగిన పరిస్థితులు, డిపార్ట్మెంట్ ఒప్పుకున్న హామీలు అమలు, పెం డింగ్ అంశాలపై కూడా చర్చ జరుగుతుంది. డిపార్ట్మెంట్ ఉద్యోగులు, జీడీఎస్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న అనేక రకాల సాంకేతిక ఇబ్బందులు, ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించిన పలు అంశాలను చర్చించి వాటి సాధనకు తీసుకోవాల్సిన నిర్ణయాలపై చర్చ ఉంటుంది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ సర్కిల్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ బ్రిగేడియర్ బి.చంద్రశేఖర్, గౌరవ అతిథులుగా హైదరాబాద్ పోస్ట్ మాస్టర్ జనరల్ ఆకాష్దీప్ చక్రవర్తి, పోస్టల్ సర్వీసెస్ డైరెక్టర్లు వీవీ సత్యనారాయణరెడ్డి, ఎస్వీరావుల ను ఆహ్వానించారు. కార్యక్రమ నిర్వహణకు రిసెప్షన్ కమిటీగా జి.నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శిసీహెచ్ కోటేశ్వరరావు, కోశాధ్యక్షుడిగా సీహెచ్ఎస్బీవీబీకుమార్ను నియమించారు. ఎఫ్ ఎన్పీఓ ఖమ్మం డివిజన్ గ్రూప్–సీ అధ్యక్షుడు పమ్మి వెంకటేశ్వరరావు కార్యక్రమ నిర్వహణలో భాగంగా వివిధ బ్రాంచ్‌ల అధ్యక్ష, కార్యదర్శుల తో సమావేశాలు నిర్వహిస్తూ, కార్యక్రమ విజయవంతానికి ప్రణాళిక రూపొందించారు. తెలంగాణ పోస్టల్ సర్కిల్లోని శాఖల అన్ని కార్యాలయాలకు కార్యక్రమ వివరాలను వివిధ రకాలుగా యూనియన్ నాయకులు చేరవేస్తున్నారు. -
చిటికెలో స్పీడ్ పోస్టులు
సాక్షి బెంగళూరు: వినియోగదారుల సమయం ఆదా చేసేందుకు స్మార్ట్ పోస్టు కియోస్క్‌ను పోస్టల్ విభాగం అందుబాటులోకి తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా ఏటీఎం తరహాలో స్మార్ట్ పోస్టు కియోస్క్ యంత్రాలను అందుబాటులోకి తెచ్చిన పోస్టల్ విభాగం నగరంలోని ప్రధాన పోస్టాఫీసు కార్యాలయం (జీపీవో)లో ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసింది. దీనిద్వారా రిజిస్టర్, స్పీడ్ పోస్టులను కేవలం ఒక్క నిమిషంలోపే పంపే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా దీన్ని పరిశీలించి చూస్తున్న పోస్టల్ శాఖ భవిష్యత్తులో మెట్రో స్టేషన్లు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు తదితర పబ్లిక్ ప్రాంతాల్లో ఈ యంత్రాలను ఏర్పాటు చేయనుంది. ఎలా పనిచేస్తుంది.. ఈ కియోస్క్ యంత్రం ద్వారా కేవలం స్పీడ్, రిజిస్టర్ పోస్టులను మాత్రమే పంపించుకునే అవకాశం ఉంది. తొలుత వినియోగదారులు యంత్రం ఎదుట నిలిచి తమ పేరు, మొబైల్ నంబర్, ఈ–మెయిల్ ఐడీ, పోస్టు చేరుకోవాల్సిన చిరునామా తదితర వివరాలను యంత్రంలో సూచనల మేరకు పొందుపరచాలి. అనంతరం తాను పంపిస్తున్న పోస్టు రిజిస్టరా లేక స్పీడ్ పోస్టా అనే విషయాన్ని ధ్రువీకరించుకోవాలి. అనంతరం యంత్రం స్క్రీన్ మీద పోస్టు కవర్‌పై దాని బరువు ఆధారంగా ఎంత మొత్తం చెల్లించాలనే విషయాన్ని చూపిస్తుంది. అనంతరం డెబిట్, క్రెడిట్ కార్డులు లేదా ఐపీబీపీ కార్డును ఉపయోగించి యంత్రంలో చూపించిన మేరకు రుసుమును చెల్లించాలి. పేమెంట్ చేసిన తర్వాత బార్‌కోడ్‌తో కూడిన స్టిక్కర్ బయటకు వస్తుంది. దాన్ని పోస్టల్ కవర్‌పై అంటించి యంత్రంలో వేసేయాలి. అనంతరం యంత్రం నుంచి రసీదు ఒకటి వస్తుంది. దీంతో స్పీడు, రిజిస్టర్ పోస్టు చేయడం ముగుస్తుంది. ఆ తర్వాత తపాల విభాగం సిబ్బంది దాన్ని కోరుకున్న చోటుకి చేరవేస్తారు. -
చర్చలకు తలుపులు మూసిన ‘తపాలా బిళ్ల’
అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ వారంలో భారత్-పాకిస్తాన్ విదేశాంగ మంత్రుల సమావేశం జరిగేది. భారత్ పాక్‌ల మధ్య చర్చలు జరగాలన్న పాక్ నూతన ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రతిపాదనకు భారత్ అంగీకరించింది. అయితే, ఆ తర్వాత 24 గంటల్లోనే పాక్‌తో చర్చలు జరిపేది లేదని భారత్ స్పష్టం చేసింది. కశ్మీర్లో ‘భారత ప్రభుత్వ దురాగతాల’పై వెలువడిన తపాలా బిళ్లలే చర్చల రద్దు నిర్ణయానికి ప్రధాన కారణంగా భారత విదేశాంగ శాఖ చెబుతోంది. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు భారత సరిహద్దు భద్రతా దళం సైనికుడిని గొంతుకోసి దారుణంగా చంపడం, ముగ్గురు కశ్మీరీ పోలీసులను కిడ్నాప్ చేసి చంపేయడం కూడా మరో కారణమని అంటోంది. బుర్హాన్ వనీ ఫోటోతో స్టాంపు 8 రూపాయల విలువైన 20 తపాలా బిళ్లలను పాకిస్తాన్ విడుల చేసింది. ‘భారత్ ఆక్రమిత కశ్మీర్లో అత్యాచారాలు’ పేరుతో విడుదలయిన ఈ తపాలా బిళ్లపై కశ్మీర్లో వివిధ సందర్భాల్లో జరిగిన ఘటనల బాధితుల ఫోటోలు ఉన్నాయి. 2016లో జరిగిన ఎన్కౌంటర్లో చనిపోయిన కశ్మీర్ తీవ్రవాది బుర్హాన్ వనీ ఫోటోతో ఒక స్టాంపు ఉంది. బుర్హాన్‌ను స్వతంత్రయోధుడిగా ఆ తపాల బిళ్లపై పేర్కొన్నారు. అలాగే, భద్రతా దళాల వాహనం బానెట్‌పై ఫరూఖ్ అహ్మద్ దార్ అనే నిరసనకారుడిని కట్టేసి తీసుకెళుతున్న ఫోటోను ‘హ్యూమన్ షీల్డ్’ పేరుతో మరో తపాలా బిళ్లపై ముద్రించారు. రసాయన ఆయుధాలు, పెల్లెట్ల బాధితులుగా చెపుతున్న వారి ఫోటోలు, కశ్మీర్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన ప్రదర్శనలు మొదలైన ఫోటోలు ఇతర స్టాంపులపై ఉన్నాయి. ఈ తపాలా బిళ్లల రూపకల్పనను బట్టి తీవ్రవాదం విషయంలో పాక్ కొత్త ప్రభుత్వం కూడా పాత దారిని మార్చుకోలేదని, కొత్త ప్రధాని అసలు స్వరూపం బయటపడిందని భారత విదేశాంగ శాఖ వ్యాఖ్యానించింది. ఎవరి పని ఇది భారత్‌కు వ్యతిరేకంగా ఈ తపాలా బిళ్లలను ఎవరు తెచ్చారన్నది స్పష్టం కాలేదు. దేశంలో ఎవరైనా ఇలాంటి స్మారక తపాలా బిళ్లల ప్రతిపాదన చేయవచ్చని పాక్ తపాలా శాఖ ఉన్నతాధికారి ఒకరు అన్నారు. ‘ఇలాంటి ప్రతిపాదనను తపాలా శాఖ ఆమోదిస్తే, కమ్యూనికేషన్ల మంత్రిత్వ, విదేశాంగ శాఖల ఆమోదానికి వెళుతుంది. అది కూడా అయితే తుది ఆమోదం కోసం ప్రధాన మంత్రి కార్యాలయానికి వెళుతుంది. ’అని ఆయన వివరించారు. ఎన్నికలకు ముందున్న తాత్కాలిక ప్రభుత్వానిదే ఈ ఆలోచన అని దాని హయాంలోనే ఈ తపాలా బిళ్లలు బయకొచ్చి ఉంటాయని భావిస్తున్నారు. ఎప్పుడు విడుదలయ్యాయి పాకిస్తాన్లో సార్వత్రిక ఎన్నికలు జరగడానికి ఒక రోజు ముందు జులై 24న వీటిని విడుదల చేయడం జరిగింది. అంటే ఇమ్రాన్ ప్రధాని ప్రమాణ స్వీకారం చేయడానికి 25 రోజుల ముందన్న మాట. ఎలా అమ్మారు ఈ తపాలా బిళ్లలను 20 బిళ్లలు ఒక షీటు చొప్పున మొత్తం 20వేల షీట్లు ముద్రించారు. ఈషీటు విదేశాల్లో ఒక్కొక్కటి 6 డాలర్ల చొప్పున అమ్ముడుపోయాయని పాకిస్తాన్‌లోని తపాలా బిళ్లల సేకరణాభిలాషులు తెలిపారు. అయితే, తాము ఒక్కోషీటు 1.30 డాలర్ల చొప్పున 300 షీట్లు విక్రయించామని పాక్ తపాలా శాఖ అధికారి ఒకరు చెప్పారు. 20వేలలో చాలా షీట్లు అమ్ముడైనట్టు ఆయన చెప్పారు. -
పోస్ట్ పేమెంట్ బ్యాంకు.. గొప్ప ఆవిష్కరణ
హైదరాబాద్: మంచి, చెడుతోపాటు అన్ని విషయాలను చేరవేసే ఒకే ఒక్క మహానుభావుడు పోస్ట్‌మాన్ అని, అలాంటి తపాలా సేవలను మరింత విస్తృతం చేసి ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ పేరుతో గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి గడపకు బ్యాంక్ సేవలను అందించడం గొప్ప విషయమని గవర్నర్ నరసింహన్ అన్నారు. శనివారం ఇక్కడ ఖైరతాబాద్ విశ్వేశ్వరయ్య భవన్లో పోస్టల్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ తెలంగాణ బ్రాంచ్‌ను గవర్నర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ సేవలు సీనియర్ సిటిజన్లు, మహిళలకు ఎంతో ఉపయోగపడతాయని అభిప్రాయపడ్డారు. దీనిని పోస్టల్ శాఖలో గొప్ప చరిత్రగా చెప్పవచ్చన్నారు. అనంతరం తెలంగాణ సర్కిల్ చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ (సీపీఎంజీ) బి.చంద్రశేఖర్ మాట్లాడుతూ భారత ప్రభుత్వం పోస్టల్ డిపార్ట్మెంట్ను మరింత బలోపేతం చేసేందుకుగాను డోర్ స్టెప్ బ్యాంక్ సేవలను అందించే క్రమంలో ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ సేవలను ప్రారంభించిందన్నారు. తెలంగాణ వ్యాప్తంగా 23 బ్రాంచ్‌లను, 115 యాక్సెస్ పాయింట్లను ప్రారంభించినట్లు తెలిపారు. పోస్టాఫీస్, సబ్ పోస్టాఫీస్, హెడ్ పోస్టాఫీస్‌లను కలుపుకొని 5,695 యాక్సెస్ పాయింట్లను డిసెంబర్ కల్లా అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. తపాలాశాఖ వనరులతో బ్యాంకింగ్ సేవలు తపాలాశాఖలో ఉన్న వనరులను ఉపయోగించుకుంటూ బ్యాంకింగ్ సేవలను విస్తృతం చేస్తామని చెప్పారు. ఇందులో ముఖ్యంగా సేవింగ్, కరెంట్ అకౌంట్లు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, బయోమెట్రిక్ క్యాష్ డిపాజిట్, విత్‌డ్రా, ఆర్టీజీఎస్, బిల్లు పేమెంట్స్, ఇన్సురెన్స్ వంటి సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. మూడు లక్షల మంది సిబ్బంది మైక్రో ఏటీఎంల ద్వారా డోర్‌స్టెప్ బ్యాంకింగ్ సేవలు అందించబోతున్నారని వెల్లడించారు. ఇది పేపర్ లెస్ బ్యాంకింగ్ అని, కేవలం ఆధార్, ఫోన్ నెంబర్ ఉంటే బ్యాంకింగ్ సేవలు పొందవచ్చన్నారు. బ్యాంకింగ్ సేవలపై సందేహాలను తెలుసుకునేందుకు మిస్డ్ కాల్ ఇస్తే చాలు అని పేర్కొన్నారు. పోస్టాఫీస్‌లోని సేవింగ్ అకౌంట్ హోల్డర్లకు కూడా ఐపీపీబీ ద్వారా అన్ని సేవలను పొందవచ్చన్నారు. ఎంపీ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ టెక్నాలజీకి అనుగుణంగా పోస్టల్ డిపార్ట్మెంట్ ముందడుగు వేసి కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టిందని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ వ్యవస్థలో మార్పులు తీసుకువచ్చి లక్ష్యాలను సాధిస్తున్నారన్నారు. అనంతరం బ్యాంక్ అకౌంట్లు ప్రారంభించి గవర్నర్ చేతుల మీదుగా క్యూర్ కార్డులను అందజేశారు. కార్యక్రమంలో పోస్టల్ శాఖ అధికారి రాధికా చక్రవర్తి, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో 23 పోస్ట్ పేమెంట్ బ్యాంక్‌లు
సాక్షి, హైదరాబాద్: ప్రజలకు మరిన్ని సేవలందించేందుకు పోస్టల్ శాఖ సిద్ధమైంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో కొత్తగా 23 ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకులను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. ఈ విషయమై బుధవారం హైదరాబాద్‌లోని డాక్‌సదన్ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ సర్కిల్ చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్(సీపీఎంజీ) బ్రిగేడియర్ బి.చంద్రశేఖర్ మాట్లాడారు. పేమెంట్ బ్యాంక్ శాఖలను సెప్టెంబర్ 1న ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ, హైదరాబాద్‌లో గవర్నర్ నరసింహన్ లాంఛనంగా ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఒకే రోజు దేశ వ్యాప్తంగా 650 పోస్టల్ బ్యాంకులు, 3,250 అనుబంధ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. తెలంగాణ సర్కిల్లో తొలివిడతగా 115 అనుబంధ కేంద్రాలు ప్రారంభించి.. డిసెంబర్ 31 నాటికి అన్ని పోస్టల్ ఆఫీసులకు విస్తరించే విధంగా ప్రణాళిక రూపొందించినట్లు వివరించారు. కరెంట్ ఖాతాల లావాదేవీలపై ఎటువంటి పరిమితి లేదని, సేవింగ్ ఖాతాలపై మాత్రం కొంత పరిమితి ఉందని స్పష్టం చేశారు. డోర్ స్టెప్ లావాదేవీలు..: ఇంటి వద్ద నుంచే పోస్టు మ్యాన్ వద్ద ఉన్న మైక్రో ఏటీఎం ద్వారా కొత్త ఖాతాలు ప్రారంభించవచ్చని చంద్రశేఖర్ తెలిపారు. అంతేకాకుండా డిజిటల్ పేమెంట్స్, నగదు రహిత లావాదేవీలు, కరెంట్ తదితర లావాదేవీలు జరుపుకోవచ్చని పేర్కొన్నారు. కేవలం 3 నిమిషాల్లో లావాదేవీలకు సంబంధించిన ఎస్ఎంఎస్ సెల్‌ఫోన్‌కు వస్తుందన్నారు. సేవింగ్ ఖాతాలను రూ.100తో, కరెంట్ ఖాతాలను రూ.1000లతో ప్రారంభించవచ్చని పేర్కొన్నారు. ఆన్లైన్ బ్యాంకింగ్ సదుపాయాన్ని సైతం అందిస్తున్నామని తెలిపారు. -
‘ఫాల్గుణ’కు అరుదైన గౌరవం
సిర్పూర్(టి): కాగజ్‌నగర్ ఫారెస్ట్ డివిజన్ పరిధిలోని ఫాల్గుణ పెద్దపులికి అరుదైన గౌరవం దక్కింది. పెద్దపులి ఫొటోతో ఉన్న పోస్టల్ స్టాంప్‌ను కేంద్రం విడుదల చేసింది. కాగజ్‌నగర్ డివిజన్ ఫారెస్ట్ రేంజ్ అధికారులు పంపిన ప్రతిపాదనలను కేంద్రం ఇటీవల అంగీకరించింది. పెద్దపులి (ఫాల్గుణ) ఫొటోతో పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేయడం దేశంలో ఇదే తొలిసారి అని ఎఫ్ఆర్వో పూర్ణచందర్ తెలిపారు. ఫాల్గుణ ప్రస్తుతం కాగజ్‌నగర్ డివిజన్ పరిధిలోని పెంచికల్పేట్ అటవీ ప్రాంతంలో ఉంటోంది. -
ఆధార్ సేవల్లో రాష్ట్రానికి మూడో స్థానం
సాక్షి, హైదరాబాద్: అత్యంత వేగంగా ఆధార్ నమోదు చేసినందుకు గానూ తెలంగాణ పోస్టల్ సర్కిల్ దేశంలో మూడో స్థానాన్ని దక్కించుకుంది. ఇదే విభాగంలో పంజాబ్, బిహార్ పోస్టల్ సర్కిల్స్ తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ) ‘ఆధార్ ఎక్సలెన్సీ అవార్డ్స్ృ2018’పేరిట మూడు విభాగాల్లో 66 అవార్డులను ప్రకటించింది. ఢిల్లీలోని ఇండియా హ్యాబిటేట్ సెంటర్లో బుధవారం జరగనున్న కార్యక్రమంలో తెలంగాణ పోస్టల్ సర్కిల్ నుంచి చీఫ్ పోస్టుమాస్టర్ జనరల్ బి.చంద్రశేఖర్ ఈ అవార్డును అందుకోనున్నారు. అలాగే ‘బెస్ట్ పెర్ఫామింగ్ పోస్టుఆఫీసు ఇన్ ఏ పోస్టల్ రీజియన్’కేటగిరీలో హైదరాబాద్ సిటీ రీజియన్ నుంచి సికింద్రాబాద్ ప్రధాన పోస్టాఫీసు కార్యాలయం పోస్టుమాస్టర్ బి.ప్రసాదరావు, హైదరాబాద్ రీజియన్ నుంచి ఇదే విభాగంలో హన్మకొండ పోస్టాఫీసు ప్రధాన కార్యాలయ పోస్టుమాస్టర్ కె.సంపత్‌లు అవార్డులు అందుకోనున్నారు. తెలంగాణలో 266 పోస్టాఫీసులు, ఆంధ్రప్రదేశ్‌లో 578 పోస్టాఫీసులు, ఒడిశాలో 473 పోస్టాఫీసులు, ఛత్తీస్‌గఢ్‌లో 161 పోస్టాఫీసుల్లో ఆధార్ నమోదు కార్యకలాపాలు సాగుతున్నాయని యూఐడీఏఐ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ జి.వేణుగోపాల్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. దేశవ్యాప్తంగా 14 వేల పోస్టాఫీసుల్లో ఆధార్ నమోదు సేవలందిస్తున్నామని, ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోస్టాఫీసులకు అవార్డులు ప్రకటించామని చెప్పారు. ఏపీకి మూడు అవార్డులు.. ‘బెస్ట్ పెర్ఫామింగ్ పోస్టు ఆఫీసు’ కేటగిరీలో ఆంధ్రప్రదేశ్‌కు మూడు అవార్డులు దక్కాయి. కడప పోస్టాఫీసు ప్రధాన కార్యాలయ పోస్టుమాస్టర్ జె.సుబ్బారాయుడు, విజయవాడ పోస్టాఫీసు ప్రధాన కార్యాలయ పోస్టుమాస్టర్ కె.కనక రత్నారావు, విశాఖపట్నం పోస్టాఫీసు ప్రధాన కార్యాలయ పోస్టుమాస్టర్ ఆర్.గణేశ్‌కుమార్‌లు ఈ అవార్డులు అందు కోనున్నారు. బెస్ట్ పెర్ఫామింగ్ పోస్టల్ సర్కిల్లో మహారాష్ట్ర, కర్ణాటక, పంజాబ్ రాష్ట్రాలు అవార్డులను దక్కించుకున్నాయి. -
చీటీ పేరుతో రూ.2 కోట్ల మోసం
సాక్షి,తిరుత్తణి : చీటీల పేరుతో రూ.2 కోట్లు మోసం చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరమంగళం గ్రామస్తులు మంగళవారం తిరుత్తణి పోలీసులను ఆశ్రయించారు. తిరుత్తణి సమీపంలోని కోరమంగళం గ్రామానికి చెందిన దాము అలియాస్ దామోదరన్ (45) తపాలా శాఖలో విధులు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో గ్రామంలో 20 సంవత్సరాల నుంచి చీటీలు నడుపుతున్నారు. అతని వద్ద కోరమంగళం, పరిసర గ్రామాలకు చెందిన వారు చీటీలు కట్టారు. అయితే రెండేళ్ల నుంచి చీటీలు కట్టిన వారికి డబ్బులు ఇవ్వలేదు. ఈ విషయమై బాధితులు అడిగితే బాండు రాసి ఇస్తానని డబ్బులు త్వరలో చెల్లిస్తానని చెపుతూ కాలం వెల్లదీస్తూ వచ్చాడు. అయితే చీటీలో నష్టం వచ్చిందని డబ్బులు ఇవ్వడం కుదరదని చెప్పడంతో డబ్బులు కట్టి మోసపోయిన బాధితులు దామును నిలదీశారు. దీంతో అతను అదృశ్యమయ్యాడు. బాధితులు వంద మంది తిరుత్తణి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వచ్చారు. అయితే రూ.2 కోట్లు కావడంతో జిల్లా ఎస్పీ కార్యాలయంలోని నేర విభాగంలో ఫిర్యాదు చేయాలని పోలీసులు చెప్పి పంపారు. -
తపాలా ఉద్యోగులపై ప్రభుత్వ నిర్లక్ష్యం అన్యాయం
అనకాపల్లిటౌన్ : తమ న్యాయమైన డిమాండ్ల సాధనకు పదహారు రోజులుగా తపాలా ఉద్యోగులు సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం దుర్మార్గమని గ్రామీణ తపాలా ఉద్యోగుల జేఏసీ సంఘ ప్రతినిధి కె.మనోహర్ అన్నా రు. స్థానిక తపాలా కార్యాలయం వద్ద బుధవారం చేపట్టిన రిలే నిరాహారదీక్షల్లో ఆయన మాట్లాడారు. కమలేష్ చంద్ర కమిటీ నివేదికను తక్షణమే ప్రభుత్వం ఆమోదించి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో పీ త్రీ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.నాగేశ్వరరావు, ఏఐజీడీఎస్ సంఘం డివిజన్ ఆర్గనైజర్ వి.ప్రకాశరావు, ఎఫ్‌ఎన్‌పీవో డివిజన్ కార్యదర్శి ఎ.లోవరాజు, అధికసంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు. సీఐటీయూ మద్దతు గ్రామీణ తపాలా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ ప్రధాన కార్యదర్శి మళ్ల సత్యనారాయణ డిమాండ్ చేశారు. స్థానిక సీఐటీయూ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గత నెల 22 నుంచి తపాలా ఉద్యోగులు సమ్మె చేపడతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం అన్యాయం అన్నారు. వారు చేపడుతున్న ఆందోళనకు సీఐటీయూ మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. సంఘ నాయకులు పి.ఎన్.వి.పరమేశ్వరరావు, దాకారపు శ్రీనివాసరావు, ఎస్.బ్రహ్మాజీ, ఎం.భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు. -
తపాలా ఉద్యోగుల సమ్మె ఉధృతం
విజయనగరం టౌన్ : తపాలా శాఖలోని ఉద్యోగులకు కమలేష్ చంద్ర కమిటీ నివేదికలోని సానుకూల అంశాలను ఆమోదించి వేతన కమిటీని వెంటనే నియమించాలనే డిమాండ్‌తో గత నెల 22 నుంచి చేపట్టిన ఉద్యోగుల సమ్మె రోజురోజుకూ ఉధృతమవుతోంది. నేటికి 15 రోజులు కావస్తున్నా డిమాండ్ పరిష్కారానికి నోచుకోకపోవడంతో కార్మిక సంఘాలన్నీ కలిసి తపాలా ఉద్యోగులకు మద్దతు పలుకుతున్నారు. ఈ నేపథ్యంలో ఐఎన్టీయూసీ నాయకులు ఎం.శ్రీనివాస్, ఐఎఫ్టీయూ సన్యాసిరావు, ఏఐఎఫ్టీయూ నాయకులు శంకరరావు, సీఐటీయూ నాయకులు టీవీ రమణ, ఏఐటీయూసీ నాయకులు కృష్ణంరాజు, ఏపీటీఎఫ్ నాయకులు ఈశ్వరరావు, పీఆర్టీయూ నాయకులు పట్నాయక్, యూటీఎఫ్ నాయకులు శేషగిరి, ప్రభూజీ, ఆపస్ నాయకులు శాంతమూర్తి తదితరులు మంగళవారం సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తపాలా శాఖలో వెట్టిచాకిరీ చేస్తున్న గ్రామీణ తపాలా ఉద్యోగులకు అమలు చేయాల్సిన వేతన కమిటీని ఇప్పటి వరకూ అమలు చేయకపోవడం దారుణమన్నారు. కేంద్రం మొండి వైఖరిని వీడాలని సూచించారు. కమలేష్ చంద్ర కమిటీ కేంద్ర ప్రభుత్వానికి తన రిపోర్టును సమర్పించి 18 నెలలు సమయం పూర్తయినా నేటి వరకూ ఆమోదించకపోవడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణ తపాలా ఉద్యోగుల నిరవధిక సమ్మెకు తమ సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామన్నారు. కార్యక్రమంలో తపాలా జేఏసీ నాయకులు కె.సూర్యారావు, ఎ.పెంటపాపయ్య, కంది నారాయణరావు, శ్రీనివాసరావు అధిక సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు. -
తపాలా పెట్టెకు సమ్మె తాళం !
ఆదోని అర్బన్ : గ్రామీణప్రాంతాల్లో పనిచేస్తున్న తపాలా ఉద్యోగులు సమ్మెబాట పట్టడంతో పోస్టాఫీసులు మూతపడ్డాయి. దేశవ్యాప్తంగా తపాలాశాఖలో పనిచేసే గ్రామీణ డాక్ సేవక్స్ (జీడీఎస్)లకు పనికి తగిని వేతనం, సమయ పాలన, సర్వెంట్ హోదాతో పాటు 7వ ఆర్థిక వేతన సంఘం సిఫారసులను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మే 22 నుంచి నిరవధిక సమ్మె ప్రారంభించారు. తపాలా ఉద్యోగుల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో అయ్యే ఉత్తరాల బట్వడా ఆగిపోయింది. వీటిలో ప్రధానంగా టెలిఫోన్ బిల్లులు, పార్శల్స్, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలకు వెళ్లే బల్క్ ఉత్తరాలు, నిరుద్యోగులకు కాల్ లెటర్లు, ఉద్యోగ నియామక రాత పరీక్షలకు సంబంధించిన ఉత్తర ప్రత్యుత్తరాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఆదోని సబ్ డివిజన్లో 140 బ్రాంచ్ తపాలా కార్యాలయాలు, 9 సబ్ పోస్టాఫీసులు ఉన్నాయి. దాదాపు 327మంది గ్రామీణ డాక్‌సేవక్‌లు (జీడీఎస్), డిపార్ట్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. జీడీఎస్‌లు రూ.7వేల నుంచి రూ.12వేల వేతనంతో జీవనం సాగిస్తున్నారు. వీరి సమస్యల పరిశీలనకు కేంద్ర ప్రభుత్వం 2016 నవంబర్‌లో కమలేష్ చంద్ర కమిటీని నియమించింది. ఈ కమిటీ నివేదిక ఇచ్చి రెండేళ్లు కావస్తున్నా ఇప్పటి వరకు అమలుకు నోచుకోవడం లేదు. దీంతో సమ్మెబాట పట్టారు ఉద్యోగులు. ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. 12వ రోజుకు చేరిన ఉద్యోగుల ఆందోళన పట్టణంలో హెడ్ పోస్టాఫీసు ఆవరణలో గ్రామీణ డాక్ సేవక్‌లు చేపట్టిన నిరవధిక సమ్మె శనివా రానికి 12వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా పీ3, పీ4 బ్రాంచ్ సెక్రటరీలు విజయలక్ష్మీ, గంగాధర్, జీడీఎస్ సంఘం సబ్ డివిజన్ ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు, మాజీ బ్రాంచ్ సెక్రటరీ మునీ, సం ఘం నాయకులు రాజు, నరేష్ సింగ్, శ్రీనివాస స్వామి, ప్రహ్లాద్ మాట్లాడారు. సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలం చెందిం దన్నారు. సమస్యలు పరిష్కరించేంత వరకు సమ్మెను కొనసాగిస్తామని హెచ్చరించారు. -
తపాలా ఉద్యోగుల డిమాండ్లు నెరవేర్చాలి
బేతంచెర్ల : గ్రామీణ తపాలా ఉద్యోగుల డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చాలని ఆ సంఘం నాయకులు చల్లా వెంకటేశ్వర్లు, శ్రీనివాసులు అన్నారు. శనివారం స్థానిక పోస్టాఫీసు వద్ద తపాలా ఉద్యోగుల సమ్మె కొనసాగింది. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ, మండల, జిల్లాస్థాయిలో తపాల సేవలు స్తంభించిపోయినా కేంద్ర ప్రభుత్వం స్పందిచకపోవడం దారుణమన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి తపాలా ఉద్యోగుల సమస్యలతో పాటు, కమలేశ్‌చంద్ర కమిటీ సిఫారసులను వెంటనే అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో తపాలా ఉద్యోగులు విజయ్‌కుమార్, రమేశ్, మధు శివరామయ్య, ఖలీల్, రంగమ్మ, రామలక్షమ్మ తదితరులు పాల్గొన్నారు. -
బోయినపల్లిలో తపాలా ఉద్యోగుల వంటావార్పు
బోయినపల్లి : గ్రామీణ తపాల ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని మండలకేంద్రం లోని సబ్ పోస్ట్ ఆఫీస్ ఎదుట శుక్రవారం తపాల ఉద్యోగులు వంటావార్పు కార్యక్రమం నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. రోడ్డుపైనే కట్టెల పొయ్యితో వంటలు చేశారు. అనంతరం సామూహిక బోజనాలు చేశారు. ఈ సందర్భంగా తపాల ఉద్యోగులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వెంటనే కమలేశ్ చంద్ర కమిటీ నివేదికను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నో ఏళ్లుగా చాలీ చాలని జీతంతో బతుకులీడుస్తున్న తమకు వేతన సవరణ చేసి, జీతాలు పెంచాలని విజ్ఞప్తి చేశారు. ఏఐజేడీఎస్‌యూ కార్యదర్శి క్రిష్ణ, బోయినపల్లి సబ్ పోస్టాఫీసు పరిధిలోని తడగొండ, విలాసాగర్, అనంతపల్లి, నూకలమర్రి, ఫాజుల్‌నగర్, వట్టెంల, నర్సింగాపూర్, కోరెం గ్రామాల బీపీఎంలు కట్ట కిరణ్, జయప్రకాశ్, శశి, తిరుపతి, మల్లేశం, ప్రభాకర్, వేణు, ఈడీఎంసీలు రాజేందర్, లచ్చయ్య, నాగభూషణం తదితరులున్నారు. -
ఖాతా... క్యాష్ ఇంటివద్దే..
సాక్షి, హైదరాబాద్: ఇంతకాలం ఉత్తరాల బట్వాడా.. చిన్న మొత్తాల పొదుపు, బీమా తదితర సేవలను అందిస్తున్న తపాలా శాఖ ఇకపై పూర్తి స్థాయిలో బ్యాంకింగ్ సేవలు అందించనుంది. గ్రామీణ ప్రాం తాల్లో సరిపడా బ్యాంకు శాఖలు లేకపోవడం, గ్రామీ ణ ప్రాంతాల ప్రజలకు బ్యాంకింగ్ కార్యకలాపాలపై పూర్తి అవగాహన లేకపోవడాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్రం తపాలా శాఖ ఆధ్వర్యంలో ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్(ఐపీపీబీ)ను ఏర్పాటు చేసింది. ఐపీపీబీ ద్వారా ఖాతాదారులు, ప్రజలకు సులభతరంగా బ్యాంకింగ్ సేవలు అందనున్నాయి. ఇప్పటివరకూ పొదుపు ఖాతా తెరడానికి వినియోగదారులు బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. సరైన ధ్రువీకరణ పత్రాలు ఉంటే ఇకపై ఇంటి వద్దనే పోస్టల్ బ్యాంకు ఖాతా తెరవవచ్చు. నగరంలోని జనరల్ పోస్టాఫీసు(జీపీవో), ప్రధాన తపాలా కార్యాలయాలు(హెచ్‌పీవో), ఉప తపాలా కార్యాలయాలు(ఎస్పీవో), బ్రాంచి పోస్టాఫీసు(బీపీవో)ల్లో బ్యాంకింగ్ సేవలు అందించడానికి తపాలా శాఖ కార్యాచరణ సిద్ధం చేసింది. ఇప్పటికే తపాలా సిబ్బందికి కర్ణాటక లోని మైసూర్లో ప్రత్యేక శిక్షణ కూడా ఇప్పించింది. మేనేజర్లను నియమించింది. దేశంలోని 650 జిల్లాల్లో ఈ సేవలను అందుబాటులోకి తెస్తుండగా.. రాష్ట్రం లో తొలి విడతగా హైదరాబాద్‌తోపాటు ఉమ్మడి జిల్లాల్లోని 13 ప్రాంతాల్లో ఈ సేవలు అందుబాటులో కి తెచ్చింది. తపాలా శాఖ ఏ పథకం తెచ్చినా నగరంలోని జీపీవోలో మొదట ప్రారంభిస్తామని ఖైరతాబాద్ సీనియర్ పోస్టుమాస్టర్ జయరాజ్ తెలిపారు. ఇంటి వద్దనే లావాదేవీలు.. ♦ పొదుపు ఖాతా కోసం ఆధార్ కార్డు ఉంటే చాలు. సంబంధిత పోస్ట్‌మాన్ ఇంటికి వచ్చి ఖాతా తెరు స్తారు. వారికి ఆండ్రాయిడ్ ఫోన్, బయోమెట్రిక్ పరికరం ఇస్తారు. ♦ తపాలా కార్యాలయాల్లో పొదుపు ఖాతా మాత్ర మే తెరవడానికి వీలుండేది. ప్రస్తుతం కరెంట్ ఖాతా కూడా తెరవవచ్చు. ♦ ఖాతాదారు రోజుకు రూ.లక్ష వరకు నగదు లావాదేవీలు చేయవచ్చు. తపాలా కార్యాలయాలకు వెళ్లలేని వారు వివిధ లావాదేవీలను ఇంటివద్దనే నిర్వహించే వీలుంది. ఆర్టీజీఎస్, ఎన్ఈఎఫ్టీ, ఆన్లైన్ బ్యాంకింగ్, ఫోన్ బ్యాంకింగ్, ఏటీఎం కార్డులు, చెక్కుల లావాదేవీలు నిర్వహించవచ్చు. ♦ నగదు డిపాజిట్, ఉపసంహరణ కోసం సంబంధిత పోస్ట్‌మాన్‌కు 24గంటల ముందు సందేశం పంపితే ఇంటికి వచ్చి లావాదేవీలు నిర్వహిస్తారు. ఈ లావాదేవీలు రూ.10 వేలకు మించరాదు. బయోమెట్రిక్ పరికరం ద్వారా వేలిముద్ర తీసుకుంటారు. ♦ నగదు ఉపసంహరించుకున్నా, డిపాజిట్ చేసినా వాయిస్ మెసేజ్ వస్తుంది. దీంతో చదువు రాని వారు కూడా లావాదేవీలు తెలుసుకోవచ్చు. ♦ పోస్టల్ ఏటీఎం ద్వారా జరిపే లావాదేవీలకు చార్జీ లు వసూలు చేయరు. ఎన్నిసార్లు నగదు తీసుకు న్నా అదనపు చార్జీలు చెల్లించనవసరం లేదు. -
నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా తపాల ఉద్యోగుల సమ్మె
-
జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి
సదాశివపేట రూరల్(సంగారెడ్డి) : వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని టీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి ఫైజల్,జిల్లా ఆధ్యక్షకార్యదర్శులు మల్లికార్జున్ రెడ్డి,విష్ణు ప్రసాద్ లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.శనివారం పట్టణంలోని ఐబీలో స్థానిక జర్నలిస్టులతో కలిసి జర్నలిస్టుల గర్జన గోడ పత్రిక,కర పత్రాలను వారు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ రంగాలలో పని చేస్తున్న జర్నలిస్టులు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించారన్నారు. ఉద్యమ వార్తలను, ఉద్యమకారుల ఆందోళన, నిరసనను ప్రభుత్వానికి చాటి చెప్పడానికి విలేకరులు ఎంతోగానో శ్రమించారని అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్టం ఏర్పడి నాలుగేళ్లు అవుతున్న ఇప్పటి వరకు జర్నలిస్టుల న్యాయ పరమైన సమస్యలను ప్రభుత్వం పరిష్కరించలేదన్నారు. ఇళ్ల స్థలాలు, మెరుగైన వైద్యసేవలను అందించాలని అన్నారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి ఈ నెల 28వ తేదీన ఉదయం 11గంటలకు హైదరాబాద్ లోని బాగ్ లింగంపల్లి ఆర్టీసీ కల్యాణ మండపంలో జర్నలిస్టుల గర్జన బహిరంగ సభను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని మండలాలకు చెందిన విలేకరులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలనీ కోరారు. కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ సభ్యులు ఉల్లిగడ్డల శివకుమార్, హాజీ, నరేశ్, విజయ్, నెల్లి శ్రీనివాస్, సిద్ధు, బుచ్చయ్య, నర్సిములు, లింగం, శేఖర్, శివకుమార్ గౌడ్, నగేశ్, చిరు, మహేశ్, విశ్వనాథం పాల్గొన్నారు. -
బ్యాంకులకు ఈపీఎఫ్ఓ కీలక ఆదేశాలు
న్యూఢిల్లీ : ఉద్యోగ భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్ఓ) బ్యాంకులకు కీలక ఆదేశాలు జారీచేసింది. ఆధార్ లేదన్న సాకు చూపించి, పింఛన్‌దారులకు చెల్లింపులు నిలిపివేయరాదని ఈపీఎఫ్ఓ బ్యాంకులను ఆదేశించింది. దీనికి బదులు ప్రత్యామ్నాయ గుర్తింపు కార్డుల ఆధారంగా నెలవారీ చెల్లింపులు జరపాలని సూచించింది. దీనికి సంబంధించి పెన్షన్ పంపిణీ చేసే పోస్టల్ సర్వీసులకు, బ్యాంకు అధికారులకు ఈపీఎఫ్ఓ ఓ సర్క్యూలర్ జారీచేసింది. ఆధార్ లేని వారి గుర్తింపును ప్రత్యామ్నాయ విధానాల్లో నిర్ధారించుకోవాలని పేర్కొంది. అదేవిధంగా బ్యాంకులు పెన్షనర్లకు ఆధార్ ఎన్రోల్మెంట్ సౌకర్యం కల్పించాలని ఆదేశించింది. గుర్తింపు కోసం ఫింగర్‌ప్రింట్‌తో ఇబ్బందులు పడుతున్న వారికోసం, ఐరిస్ స్కానర్‌ను కూడా బ్యాంకులు ఏర్పాటు చేయాలని తెలిపింది. నెలవారి పింఛన్‌ను అందుకోవడంలో ప్రజలు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 2016 నుంచి పెన్షనర్లు తమ పింఛన్‌ను పొందడానికి జీవన్ ప్రమాణ్ అనే డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్‌ను పొందాల్సి ఉంటుంది. ఈ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్‌ను పరిశీలించిన అనంతరం, బ్యాంకులు ఆధార్ ఫింగర్‌ప్రింట్ ప్రామాణీకరణను చేపడతాయి. అనంతరం పెన్షన్‌ను అందిస్తాయి. అయితే వయసు పైబడటంతో, లబ్దిదారుడి ఫింగర్‌ప్రింట్ ప్రామాణీకరణ సరిగ్గా నమోదు అవడం లేదు. ఇలాంటి సమస్యలన్నింటిన్నీ పరిగణనలోకి తీసుకున్న భవిష్య నిధి సంస్థ బ్యాంకులకు కొన్ని సూచనలు చేస్తూ ఈ సర్క్యూలర్ జారీచేసింది. జీవన్ ప్రమాణ్ లేదని లేదా ఆధార్ ప్రామాణీకరణ సరిగ్గా నమోదు అవడం లేదని పెన్షనర్లకు పింఛన్ ఇవ్వడం నిరాకరించవద్దని తాము బ్యాంకులకు స్పష్టమైన ఆదేశాలు జారీచేసినట్టు కేంద్ర ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ డాక్టర్. వీపీ జాయ్ తెలిపారు.ఆధార్ గుర్తింపు లేని వ్యక్తుల నుంచి సాధారణ ధ్రువీకరణ పత్రాలను తీసుకొని పెన్షన్ చెల్లించాలని స్పష్టం చేసినట్టు తెలిపారు. అలాగే నడవలేని స్థితిలో ఉన్న వృద్ధులు, దివ్యాంగులు ఆధార్ కార్డు పొందేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని బ్యాంకులను కోరింది. ఆధార్ అనుసంధానం పూర్తికానంత మాత్రాన వృద్ధులకు పెన్షన్ చెల్లింపుల్లో జాప్యం చోటుచేసుకోరాదని కేంద్ర సమాచార కమిషన్ కూడా తేల్చిచెప్పింది. ఏటా నవంబరులో పెన్షన్‌దారుల నుంచి అవసరమైన సర్టిఫికేట్లను సేకరించడంతోపాటు పెన్షన్ తీసుకోవడం కోసం సంతకం చేసిన ఒప్పంద పత్రాలను బ్యాంకులు తీసుకోవాలని ఈపీఎఫ్ఓ పేర్కొంది. -
పొదుపు వడ్డీ కుదింపు
బద్వేలు:చిన్న మొత్తాలపై వడ్డీ శాతాన్ని తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో పొదుపు డిపాజిట్లపై ప్రభావం చూపే అవకాశాలున్నాయి. కడప డివిజన్లో దాదాపు 1.20లక్షల మేర పొదుపు ఖాతాల్లోని ఖాతాదారులు తమ చిన్న మొత్తాల పొదుపుపై వడ్డీని కోల్పోనున్నారు. సామాన్య మధ్య తరగతి వర్గాలు కుటుంబ అవసరాల నిమిత్తం ఎక్కువగా చిన్న మొత్తాల్లో పొదుపు చేస్తుంటారు. రూ.వంద నుంచి రూ.లక్ష వరకు పొదుపు చేసుకునే వీలుం ది. జనవరి నుంచి మార్చి వరకు మూడు నెలల పాటు వర్తించే ఈ తగ్గింపులో 0.20 శాతం అంటే రెండు పైసల చొప్పున తగ్గుతుంది. ప్రభుత్వ హామీతో పాటు ఆదాయపన్ను మినహాయింపు వర్తించే ప్రయోజనాలు ఉన్న చిన్న మొత్తాల పొదుపు పథకాలకు ప్రజల నుంచి మంచి ఆదరణ ఉంది. ప్రస్తుతం తపాలాశాఖ అందించే ఏడు రకాల పథకాలపై వడ్డీరేటు ప్రభావం పడనుంది. జిల్లాలోని పోస్టల్ డివిజన్లో దాదాపు రూ.10 0కోట్లకు పైగా పొదుపు నిల్వలు ఉంటాయి. ఇప్పటి వరకు పొదుపు చేసుకున్న మదుపరులపై తాజా నిర్ణయం ప్రభావం ఉండదు. జనవరి ఒకటి నుంచి పొదుపు చేసే మొత్తాలపై వడ్డీ రేటు తగ్గింపు ప్రభావం ఉంటుంది. బాలికా పథకాలకుఇబ్బందే:ఆడపిల్లల సంక్షేమం కోసం సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని కేంద్రం అమలు చేస్తోంది. ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన ఈ పథకానికి చాలా ఆదరణ ఉంది. కానీ ఈ పథకం వడ్డీ రేటు క్రమంగా తగ్గుతూ వస్తోంది. పుట్టిన ఆడపిల్లకు 14 ఏళ్ల పాటు ప్రతి నెలా రూ.వెయ్యి చొప్పున పొదుపు చేస్తే ఏటా వడ్డీతో కలిపి 21ఏళ్లకు రూ.6.5లక్షల వరకు అవుతుంది. ఈ పథకం ఆరంభంలో వడ్డీ రేట్టు 9.2శాతం ఉండగా ప్రస్తుతం 8.3 శాతం ఉంది. ఒకటో తేదీ నుంచి ఇది 0.20శాతం తగ్గనుంది. చిన్నపాటి ఉద్యోగులు పదవీ విరమణ తర్వాత చేతి కందిన సొమ్మును నెలసరి ఆదాయంగా ఐదేళ్ల పథకంలో పొదుపు చేస్తుంటారు. దీనిపై వచ్చే వడ్డీతో కుటుంబ అవసరాలను తీర్చుకుంటుంటారు. వడ్డీరేటు తగ్గింపు ప్రభావం వీరిపై కూడా పడనుంది. తపాలా శాఖలో ప్రతి మూడు నెలలకొకసారి వడ్డీరేట్లు మారుతుంటాయి. ఒకటో తేదీ నుంచి కొత్త రేట్లు అమలవుతాయని పోస్టల్ సిబ్బంది చెబుతున్నారు. -
పోయి దొరికిన ప్రాణం
చెన్నై సామియర్స్ రోడ్డులో నివాసం ఉంటున్న 81 ఏళ్ల శాంతా శ్రీనివాసన్ 2015 వరదల్లో తన సర్వస్వం కోల్పోయారు. అందుకు ఆమె పెద్దగా బాధపడలేదు కానీ, దశాబ్దాలుగా ఆమె సేకరించుకుంటూ వస్తున్న అరుదైన తపాలా బిళ్లలు కూడా పోగొట్టుకున్న ఆ ‘సర్వస్వం’లో ఉండటం ఆమెను ఎంతో మనోవేదనకు గురిచే సింది. అలాగని ఆమె చింతిస్తూ కూర్చోలేదు. మూడేళ్లపాటు నిర్విరామంగా కష్టపడి, తిరిగి తన స్టాంపుల సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. ఇప్పుడా తపాలా బిళ్లల్ని అన్నా రోడ్డులోని ప్రధాన తపాలా కార్యాలయంలో ఉన్న ‘ఫిలాటñ లిక్ బ్యూరో’ ప్రదర్శనకు పెట్టింది. వాటిల్లో లైంగిక సమానత్వం, వర్కింగ్ ఉమన్ ప్రధానాంశాలుగా ఉన్న స్టాంపులు కూడా ప్రత్యేక విభాగంగా ఉన్నాయి. 1940లలో పాఠశాల విద్యార్థినిగా ఉన్నప్పటి నుంచి శాంత తపాలా బిళ్లల్ని సేకరిస్తున్నారు. ఈ అద్భుతమైన ‘ఫిలాటలీ’ ప్రపంచాన్ని (స్టాంపుల సేకరణ, అధ్యయనం) చిత్తూరులో ఉండే ఆమె కజిన్ ఆమెకు మొదట పరిచయం చేశారు. అక్కడి నుంచి ఆమెకు ‘ఫస్ట్ డే కవర్స్’, కొత్తగా విడుదలైన స్టాంపులను ఆ కజిన్ పంపించేవారు. (అధికారికంగా విడుదలైన వెంటనే ఆ స్టాంపులతో బట్వాడా అయ్యే కవర్లను ఫస్ట్ డే కవర్స్ అంటారు). విదేశాలకు వెళ్లినప్పుడు కూడా అక్కడి నుంచి ప్రత్యేకంగా పోస్టల్ స్టాంపులను సేకరించి తెచ్చుకునేవారు శాంత. శాంత భర్త శ్రీనివాసన్ ఇండియన్ ఆర్మీలో పనిచేసేవారు. అలా కూడా సెంట్రల్ ఆర్మీ పోస్ట్ ఆఫీస్ నుంచి అరుదైన స్టాంపులు అమెకు అందేవి. అలాగే కొన్ని స్టాంపుల్ని తోటి ఫిలాటలిస్టుల నుంచి ఆమె ఇచ్చిపుచ్చుకునేవారు. 1857కు పూర్వపు స్వాతంత్య్ర సమరయోధులైన రాణీ వేలు నచియార్, రాణీ అవంతీబాయి, సంగీత విద్వన్మణులు వీణా ధనమ్మాళ్, డి.కె.పట్టమ్మాళ్, ఎం.ఎస్. సుబ్బులక్ష్మి.. ఇంకా అనేక రంగాలలోని సుప్రసిద్ధులపై వచ్చిన తపాలా బిళ్లలు శాంత కలెక్షన్లో ఉన్నాయి. ‘‘స్టాంపులపై శాంతా శ్రీనివాసన్‌కు ఉన్న ఆసక్తిని, ఆమెలోని తపనను చూశాక ఆమె కలెక్షన్‌కు చోటు కల్పించాలని నిర్ణయించుకున్నాం. తమిళనాడులోని తపాలాశాఖలలో డిపాజిట్ అకౌంట్లు ఉన్న ఖాతాదారులలో శాంతమ్మలా దాదాపు 12 వేల మంది స్టాంపుల సేకరణ హాబీ ఉన్నవారు ఉన్నారు’’ అని చెన్నై సిటీ రీజియన్ పోస్ట్‌మాస్టర్ జనరల్ ఆర్.ఆనంద్.. శాంతను అభినందిస్తూ చెప్పారు. -
‘ఫేక్ న్యూస్’ ప్రకంపనలు
సాక్షి, బెంగళూరు: దేశంలో నకిలీ వార్తలు ప్రకంపనలు సష్టిస్తున్న నేపథ్యంలో వీటిని అరికట్టడం కోసం బాధ్యులైన జర్నలిస్టుల గుర్తింపు కార్డులు అంటే ఢిల్లీలోని ‘ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో’ జారీ చేసిన ‘అక్రిడిటేషన్ కార్డులు’ను రద్దు చేస్తామంటూ కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి స్మృతి ఇరానీ ఓ సర్కులర్ తీసుకొచ్చి, ఆపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జోక్యంతో ఆ సర్కులర్‌ను చెత్తబుట్టలో పడేశారు. అసలు ఇంతకు ఎవరు నకిలీ న్యూస్‌ను సష్టిస్తున్నారు? ఎవరు వాటికి ప్రచారం కల్పిస్తున్నారు? ఎందుకు ప్రచారం చేస్తున్నారు? ప్రచారం చేస్తున్న నకిలీ వార్తలు ఎలాంటివి? ఎవరి లక్ష్యంగా అవి ప్రచారం అవుతున్నాయి ? వారం క్రితమే (గత గురువారం) ‘పోస్ట్‌కార్డ్ న్యూస్’ సహ వ్యవస్థాపకుడు మహేశ్ విక్రమ్ హెగ్డేను నకిలీ వార్తల ప్రచురణ, ప్రచారం నేరారోపణల కింద బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. వెంటనే ఆయన్ని విడుదల చేయాలంటూ ‘రిలీజ్ మహేశ్ హెగ్డే’ హాష్ ట్యాగ్‌తో కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హెగ్డే మొదలుకొని సామాన్య బీజేపీ కార్యకర్తల వరకు సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం సాగించారు. మార్చి 18వ తేదీన ఓ జైన సన్యాసిని.. ముస్లిం యువకుడు దాడిచేసి తీవ్రంగా గాయపర్చాడని, సిద్ధరామయ్య ప్రభుత్వంలో ఎవరికి రక్షణ లేకుండా పోయిందంటూ పోస్ట్‌కార్డ్ న్యూస్ ప్రచారం చేసింది. తన ఫేస్బుక్ పేజీలో కూడా పోస్ట్ చేయగా, అది వైరల్ అయింది. ఎల్లప్పుడు పోస్ట్‌కార్డ్ న్యూస్ తప్పుడు వార్తలపై ఓ కన్నేసి ఉంచే ఫ్యాక్ట్ ఫైండింగ్ వెబ్సైట్ ‘అల్టర్ న్యూస్’ జర్నలిస్టులు రంగంలోకి దిగి బెంగుళూరు పోలీసుల నుంచి వాస్తవాలను సేకరించారు. సదరు సన్యాసిపై ఎవరూ దాడి చేయలేదని, రోడ్డు దాటుతుండగా చిన్న ప్రమాదమై స్వల్ప గాయమైందని పోలీసులు చెప్పడంతోపాటు ఆ జైన సన్యాసి కూడా ధ్రువీకరించారు. ఈ నెల 12వ తేదీన రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి నకిలీ వార్తలను ప్రచారుం చేస్తున్నారన్నది సులభంగానే అర్థం అవుతుంది. పోస్ట్‌కార్డ్ న్యూస్‌లో ఒక్కటి కాదు, పదులు కాదు, పాతిక సంఖ్యల్లో నకిలీ వార్తలు వస్తున్నాయి. అవన్నీ కూడా మైనారిటీలకు వ్యతిరేకంగా హిందూత్వ శక్తులకు అనుకూలంగా ఉంటున్నాయి. అందుకనేమో వీటిని బీజేపీ, ఆరెస్సెస్ నాయకుల నుంచి కార్యకర్తల వరకు సోషల్ మీడియాలో చురుగ్గా షేర్ చేస్తున్నారు. మచ్చుకు పోస్ట్‌కార్డ్ న్యూస్‌లో మరికొన్ని నకిలీ వార్తలు 2016, ఆగస్టు నెలలో: సీనియర్ జర్నలిస్ట్ బార్కా దత్, హిజ్బుల్ ముజాహిద్దీన్ టెర్రరిస్ట్ గ్రూప్ కమాండర్ జకీర్ రషీద్ భట్ అలియాస్ జకీర్ మూసాతోని టూవీలర్‌పై వెనక తగులుకునేలా కూర్చొని వెళుతున్న దశ్యం అంటూ పోస్ట్‌కార్డ్ న్యూస్ ప్రచారం చేసింది. ట్విటర్లో పుట్టిన ఈ వార్తను పోస్ట్‌కార్డ్ ప్రచారం చేయగా, దాన్ని హిందూత్వ శక్తులు వైరల్ చేశాయి. అల్లర్లు కొనసాగుతున్న కశ్మీర్లో తాను న్యూస్ కవరేజ్‌కి వెళ్లినప్పుడు కారు చెడిపోయిందని, కర్ఫ్యూ కారణంగా తాను కారు మరమ్మతు చేయించుకోలేక ఓ టూ వీలర్ బాటసారిని లిఫ్ట్ అడిగి గమ్యస్థానానికి చేరుకున్నానంటూ బార్కా దత్ వివరణ ఇచ్చారు.టూవీలర్ నడుపుతున్న వ్యక్తికి టెర్రరిస్ట్ కమాండర్‌కు దగ్గరి పోలికలు ఉన్నాయని పోస్ట్‌కార్డ్ న్యూస్ వాదించింది. కనిపిస్తే కాల్చిచంపే ఉత్తర్వులు ఉన్నాయని తెలిసి, ఎక్కడో అజ్ఞాతంలో ఉన్న టెర్రరిస్టు కమాండర్ కర్ఫ్యూ సమయంలో, విస్తృతంగా పోలీసుల తనిఖీలు జరుగుతున్న సమయంలో టూ వీలర్‌పై ఎలా తిరుగుతాడని ‘అల్టర్ న్యూస్’ నిలదీసింది. 2017, మే నెల: పశ్చిమ బెంగాల్ రాష్ట్రం త్వరలోనే మరో పాకిస్తాన్‌గా మారిపోనుంది. ఆ పుణ్యం ప్రస్తుత ముఖ్యమంత్రి మమతా బెనర్జీనే కట్టుకోవచ్చు. ఎందుకంటే, ముస్లింల కోసం ఆమె త్వరలోనే ప్రత్యేక ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షను ప్రవేశపెట్టబోతున్నారు. ముస్లింలను మంచి చేసుకోవడం కోసం ఆమె రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు. ఈ వార్తలో కూడా నిజం లేదని అల్టర్ న్యూస్ తేల్చింది. 2018, ఫిబ్రవరి 5: తమిళనాడులోని కొన్ని క్రైస్తవ బృందాలు మధురైలోని కలియార్ కోవిల్, శివగామి ఆలయాల్లోకి వెళ్లి ఆ ప్రాపర్టీ తమదని డిమాండ్ చేశాయని, క్రైస్తవ మిషనరీలు ఆ హిందూ దేవాలయాలను చర్చిలుగా మార్చేందుకు కుట్ర పన్నాయని పోస్ట్‌కార్డ్ న్యూస్ ఎలాంటి ఆధారాలు లేకుండా ఓ వార్తను ప్రచురించింది. ఇలాంటి నకిలీ వార్తలను పట్టుకునే మరో వెబ్సైట్ ‘బూమ్లివ్’ స్థానిక పోలీసు అధికారులతోని, స్థానిక జర్నలిస్టులతోని మాట్లాడి వాస్తవాలను బయట పెట్టింది. క్రైస్తవ బృందాలు ఆ ఆలయాల సమీపం నుంచి వెళ్లాయని, ఆలయాల లోపలికి ఎవరు వెళ్లలేదని, ప్రతి ఏట సంప్రదాయంగా జరిగే ఊరేగింపు అదని తేలింది. హిందుత్వ శక్తులు, ప్రధాని మోదీకి అనుకూలంగా ట్వీట్లు కూడా పెట్టే మహేశ్ విక్రమ్ హెగ్డే ఎలాంటి జర్నలిస్టో సులభంగానే గ్రహించవచ్చు. నకిలీ వార్తలను అరికట్టాలంటూ స్మృతి ఇరానీ మాట్లాడం అంటే ‘దొంగే దొంగా దొంగా’ అని అరిచినట్లు ఉంది. అయితే జర్నలిస్టుల గుర్తింపు కార్డులు రద్దు చేయడం వల్ల నకిలీ వార్తలు ఆగుతాయా? గుర్తింపు కార్డులు కలిగిన జర్నలిస్టులు నకిలీ వార్తలు సృష్టిస్తున్నారా? ఇంట్లో కూర్చున్న వారు, పోస్ట్‌కార్డ్ న్యూస్ లాంటి మీడియా ముసుగేసుకున్న వారు నకిలీ వార్తలు సృష్టిస్తున్నారు. బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయా లాంటి వారే నకిలీ వార్తలను, ఫొటోలను ప్రచారం చేస్తుంటే ఇంకా ఎవరిని అరికడతాం. పశ్చిమ బెంగాల్లో ఏడాది క్రితం మత ఘర్షణలు జరిగినప్పుడు ‘బెంగాల్లో పట్టపగలు ఓ హిందూ మహిళను వివస్త్రను చేస్తున్న ముస్లిం యువకులు’ అన్న కాప్షన్‌తో మరాఠీ చిత్రంలోని ఓ సన్నివేశం ఫొటోతో సోషల్ మీడియాలో ఆయన ప్రచారం చేశారు. అభాసు పాలవుతామని నరేంద్ర మోదీనే ఇరానీ సర్కులర్‌ను రద్దు చేశారు. అయితే తన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచే నకిలీ వార్తలు ఎక్కువయ్యాయన్న విషయాన్ని గ్రహించి వాటిని అరికట్టేందుకు సమగ్ర చట్టం తీసుకరావాలి. గతేడాదే జార్ఖండ్‌లో నకిలీ వార్తల కారణంగా రెండు వేర్వేరు సంఘటల్లో ఏడుగురు అమాయకులు మరణించారు. అపరిచితులు పిల్లలను ఎత్తుకుపోతున్నారంటూ ‘వాట్సాప్’లో తప్పుడు ప్రచారం జరగడంతో అమాయకులను అనుమానించి జనమే కొట్టి చంపారు. -
అసత్య కథనాలు.. ఎడిటర్ అరెస్ట్
సాక్షి, బెంగళూరు : అసత్య కథనాలు రాసి మత విద్వేషాలు రెచ్చగొట్టారన్న ఆరోపణలతో ఓ వెబ్ జర్నలిస్ట్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరు పోలీసుల కథనం ప్రకారం.. జైనమత గురువు ఉపాధ్యాయ మయాంక్ సాగర్ జీ మహారాజ్ హాసన్ జిల్లా శ్రావణబెలగొలలో జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు మార్చి 19న వెళ్తున్నారు. మద్యం మత్తులో బైక్ నడుపుతున్న ముస్లిం యువకుడు జైన గురువును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో జైన గురువుకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ క్రమంలో ముస్లింల మనోభావాలు దెబ్బతీసే విధంగా పోస్ట్‌కార్డ్ వెబ్సైట్ సహవ్యవస్థాపకుడు, నిర్వాహకుడు మహేశ్ విక్రమ్ హెగ్డే కథనాలు రాయడం స్థానికంగా కలకలం రేపింది. 'ఇది చాలా దురదృష్టకరమైన విషయం. ఓ ముస్లిం యువకుడు జైనమత గురువుపై దాడికి పాల్పడ్డాడు. సిద్ధరామయ్య ప్రభుత్వంలో ఏ మతానికి చెందిన వాళ్లకు రక్షణ లేదంటూ' ట్వీట్ చేశాడు విక్రమ్ హెగ్డే. ఆయన చేసిన ట్వీట్‌తో పాటు రాసిన వార్తా కథనాలపై సోషల్ మీడియాలో దుమారం చెలరేగింది. తమపై దుష్ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోస్టుకార్డు వెబ్సైట్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా మహేష్ విక్రమ్ హెగ్డే తప్పుడు కథనాలను వ్యాప్తి చేశారని బెంగళూరు క్రైం బ్రాంచ్ పోలీసుల దర్యాప్తులో తేలింది. విక్రమ్ హెగ్డేను అరెస్ట్ చేసిన మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచగా.. 14 రోజుల పోలీసు కస్టడీకి అనుమతించారు. ఎడిటర్ అరెస్ట్‌ను బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. సీఎం సిద్దరామయ్య ఆదేశాలతోనే విక్రమ్ హెగ్డేను అరెస్ట్ చేసి వేధిస్తున్నారని బీజేపీ నేత ప్రతాప్ సింహా ఆరోపించారు. చట్టం తనపని తాను చేసుకు పోతుందని ఇందులో ఎవరూ జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. -
ప్రజా వ్యతిరేక బాటలో తపాలా
విశ్లేషణ వేలాది కేసుల్లో సరిగ్గా సమాధానం ఇవ్వకుండా తమ ఖాతాదారులనే ఏడిపించడంలో తపాలా అధికారులు వారికి వారే సాటి. వారిని ఉద్యోగులనీ, ప్రజాసేవకులనీ, పబ్లిక్ సర్వెంట్‌లనీ అనడం పొరబాటవుతుంది. రమణీ మోహన్ ఘోష్, ప్రొఫెసర్ కమలా ఘోష్ భార్యాభర్తలు. వారికి ఒక్కతే కూతురు– సంఘమిత్రా ముఖర్జీ. ఆ దంపతులు, తాము పొదుపుచేసిన సొమ్ము పోస్టాఫీసులోని వివిధ పథకాల్లో దాచుకున్నారు. నెలవారీ పొదుపు పథకం, రికరింగ్ డిపాజిట్, జాతీయ పొదుపు పత్రాలు, ఇతర ఖాతాల్లో డబ్బు పెట్టుబడి పెట్టుకున్నారు. వారు వృద్ధాప్యంలో మరణించారు. వారి పెట్టుబడులకు నామినీగా సంఘమిత్ర పేరునే పెట్టారు. ఆమె ఒక్కతే వారికి వారసురాలు. వారి మరణ ధృవపత్రాన్ని సమర్పించి ఆ డబ్బును తనకు ఇవ్వాలని ఆమె పోస్టాఫీసు చుట్టూ తిరుగుతూనే ఉంది. కనీసం వంద సార్లు. ‘‘నా ఇంటిముందే పోస్టాఫీసు ఉంది. ప్రతిసారీ మళ్లీ రమ్మంటున్నారు. లేదా నన్ను గంటల కొద్దీ ఎదురుచూసేట్టు చేస్తున్నారు. కాగితాలు వెదుకుతున్నట్టు నటిస్తున్నారు. తర్వాత రమ్మంటున్నారు. ఏడిపిస్తున్నారు. ఇంకా ఏవేవో వివరాలు ఇమ్మంటున్నారు. నా దగ్గర ఉన్న వివరాలన్నీ ఇచ్చాను. ఒక్కపైసా కూడా ఇవ్వలేదు’’. అని ఆమె వాపోయారు. ఆమె భర్త కూడా చనిపోయారు. ఆరోగ్యం కూడా సహకరించడంలేదని దీనంగా వివరించారు. ఆమె ఆర్టీఐని ఆశ్రయించి తన తల్లిదండ్రుల అకౌంట్ వివరాలు ఇవ్వాలని వాటి ధృవప్రతులు ఇవ్వాలని, ఆ డబ్బు తీసుకోవడానికి ప్రక్రియ ఏమిటో తెలియజేయాలని అడిగారు. దానికి కూడా మీరే వివరాలు ఇవ్వాలని అంటూ వారు తిరస్కరించారు. ఈ నిర్ణయాన్ని మొదటి అప్పీలు అధికారి కూడా సమర్థించారు. ఆమె విధిలేక కమిషన్ ముందు రెండో అప్పీలు దాఖలుచేశారు. డిసెంబర్ 2016 లో వేసిన రెండో అప్పీలు సమాచార కమిషన్ ముందుకు మార్చి 13న వచ్చింది. పోస్టాఫీసులో పీఐఓలు సమాచారం ఇవ్వకపోవడం వల్ల వేలాది కేసులు రెండో అప్పీళ్లుగా చేరుకుంటున్నాయి. వేలాది కేసుల్లో సరిగ్గా సమాధానం ఇవ్వకుండా తమ ఖాతాదారులనే ఏడిపించడంలో తపాలా అధికారులు వారికి వారే సాటి. వారిని ఉద్యోగులనీ, ప్రజాసేవకులనీ, పబ్లిక్ సర్వెంట్‌లనీ అనడం పొరబాటవుతుంది. వారిని మహాఘనత వహించిన తపాలా రాజ్య చక్రవర్తులనీ, ప్రభువులనీ, ఏలిన వారనీ సంబోధించాలి. వారు దయఉంటే అడిగిన సమాచారం ఇస్తారు. వారు కరుణిస్తే తపాలా సేవలు అందించి మీడబ్బు మీరు ఖాతాల నుంచి తీసుకోవడానికి సహాయం చేస్తారు. లేదా కొంత వాటా ఇచ్చుకోవాలి. కనీసం విచారణ నోటీసు వచ్చిన తరువాత కూడా పోస్టాఫీసు అధికారుల వైఖరి మారలేదు. మొండిగా పాత వాదనలే వినిపించారు. మొత్తానికి ఆమె డబ్బు ఆమెకు ఇవ్వకుండా ఆలస్యం చేస్తున్నారు. సహాయ సూపరింటెండెంట్ సంజయ్ బిస్వాస్ ఏ సహాయమూ చేయలేదు. సీపీఐఓ దీనానాథ్ ప్రసాద్ ఆమెకు ఏ విధంగా సమాచారం నిరాకరించారో బిస్వాస్ వివరిస్తూ ఆమెకు చట్టపరంగా సమాచారం ఇవ్వడానికి వీల్లేదని సుదీర్ఘంగా వాదించారు. ఈ వ్యవహారంలో అపరాధులైన అధికారులెవరో కనిపెట్టి ఉన్నతాధికారులు శిక్షించవలసిన అవసరం ఉంది. తపాలాకార్యాలయం బాధ్యతల్లో వినియోగదారులకు సేవచేయడం ప్రధానమైంది. మొత్తం అధికారులకు ఉద్యోగులకు వేతనాలు అందేది ఈ వినియోగదారుల డబ్బు డిపాజిట్ల వల్ల వచ్చే వడ్డీ సొమ్ముతోనే. సంఘమిత్ర తల్లిదండ్రుల వంటి మదుపుదార్లు డిపాజిట్ చేసిన డబ్బుకు తపాలాశాఖ ధర్మకర్తగా వ్యవహరిం చాలి. ఆ డబ్బు తమ దగ్గర డిపాజిట్ రూపంలో ఉండ టం వల్ల వచ్చే వడ్డీని స్వీకరించి ఆ డబ్బు చెందవలసిన వారసులకు అడిగినప్పుడు ఇప్పించవలసిన బాధ్యత కలి గిన ధర్మకర్త తపాలా శాఖ అనే విషయం పూర్తిగా మరిచిపోయారు. వారసురాలిని వేధించి వెడలగొట్టి ఆ డబ్బును కాజేయాలనుకుంటున్నారనే అనుమానం వస్తున్నది. ఈ విధంగా వ్యవహరించడం ధర్మకర్తృత్వ బాధ్యతను భంగపరచడమే అవుతుంది. డిపాజిట్ డబ్బును నియమాలను అనుసరించి తిరిగి వారసులకు ఇవ్వడం వారి బాధ్యత అని కాంట్రాక్టు చట్టం నిర్దేశిస్తుంది. ఆ ఒప్పందం ఉల్లంఘనకు పరిహారం చెల్లించవలసిన బాధ్యత కూడా ఉంటుంది. ఇది కాకుండా తపాలాశాఖ సొంత ప్రయోజనాల దృష్ట్యా కూడా వినియోగదారుడి పట్ల బాధ్యతగా వ్యవహరించాలి. ఇవన్నీ మరిచిపోయింది తపాలాశాఖ. పైగా ఆర్టీఐ దరఖాస్తును కూడా అసంబంద్ధ కారణాలతో తపాలా వారు తిరస్కరించారు. సంఘమిత్ర కోరిన సమాచారం మొత్తం ఇవ్వాలని, వాటికి సంబంధించిన అన్ని పత్రాలు ధృవీకరించి ఉచి తంగా ఇవ్వాలని కమిషన్ ఆదేశించింది. ఆమె దరఖాస్తులో వ్యక్తమైన ఫిర్యాదును గుర్తించి, జరిగిన అన్యాయాన్ని సరిచేయాలని కూడా ఆదేశించింది. సమాచారం ఇవ్వకుండా వేధించినందుకు ఎందుకు నష్టపరిహారం ఇవ్వకూడదో చెప్పాలని, గరిష్ట జరిమానా ఎందుకు విధించకూడదో చెప్పాలని సీపీఐఓ దీనానాథ్ ప్రసాద్‌ను కమిషన్ ఆదేశించింది. (సంఘమిత్ర ముఖర్జీ వర్సెస్ పీఐఓ తపాలాశాఖ, CIC/POSTS/A/2017/10 0006 కేసులో 16 మార్చి 2018న ఇచ్చిన తీర్పు ఆధారంగా). వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ professorsridhar@gmail.com -
20 రోజుల్లో పాస్‌పోర్ట్ సేవలు ప్రారంభం
ఒంగోలు వన్‌టౌన్: జిల్లాకు పాస్‌పోర్ట్ కార్యాలయం అనుమతి వచ్చి ఏడాది కావస్తున్నా ఆచరణలో పోస్టల్ అధికారులు కార్యాలయ ప్రారంభానికి శ్రద్ధ చూపక పోవడంపై ఒంగోలు పార్లమెంట్ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన తరువాత జిల్లా వాసులు పాస్‌పోర్ట్‌కు చెన్నె లేదా విజయవాడ పదేపదే వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్న రీత్యా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి జిల్లాకు ప్రాంతీయ పాస్ పోర్ట్ కార్యాలయం అనుమతి తీసుకోవడం జరిగిందని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. గురువారం ఒంగోలు హెడ్ పోస్టాఫీస్‌లో పాస్‌పోర్ట్ కార్యాలయం ప్రారంభించడానికి భవన పరిశీలనకు వచ్చిన ఎంపీ అధికారులను మార్చి నెల ఆఖరు లోపు జిల్లాలో పాస్‌పోర్ట్ కార్యాలయ సేవలు ఎట్టి పరిస్థితుల్లో ప్రారంభించాలని, అందుకు కావాల్సిన అన్ని చర్యలు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా పోస్టల్ అధికారులను కోరారు. ఈ విషయమై పీఎంజీ రాధికా చక్రవర్తి జిల్లాకు పూర్తి సహకారం అందిస్తామని తెలిపారన్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ 20 రోజుల్లోగా జిల్లాలో పాస్‌పోర్టు సేవలు ప్రారంభిసా ్తమన్నారు. కార్యక్రమంలో ఎంపీ వెంట సంతనూతలపాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్, జిల్లా పోస్టల్ అధికారులు సీనియర్ సూపరింటెండెంట్ టీఏవీ శర్మ, పి.వెంకటేశ్వరరావు, పోస్టల్ పెన్షనర్స్ యూనియన్ నాయకులు పి.పేరయ్య, కె.వీరాస్వామిరెడ్డి, కె.వెంకటేశ్వర్లు ఉన్నారు. ఎంపీ వెంట పార్టీ నాయకులు వెన్నా హనుమారెడ్డి, పులుగు అక్కిరెడ్డి, పటాపంజుల అశోక్ ఉన్నారు. -
ముఖ్యమంత్రికి ఎన్నారైల పోస్టుకార్డులు
లండన్: లండన్ టీజేఏసీ తలపెట్టిన పోస్ట్ కార్డు ఉద్యమానికి మద్దతు తెలిపి నిరుద్యోగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎన్నారైలు లేఖలు పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా టీజేఏసీ చైర్మన్ కోదండరాం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎన్నారై లను ఉద్దేశించి మాట్లాడారు. పోస్టు కార్డు ఉద్యమానికి ఎన్నారైల మద్దతు హర్షణీయమని కోదండరాం తెలిపారు. ప్రభుత్వం ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసి, నియామకాల కాలెండర్ విడుదల చేయాలనీ.. నిరుద్యోగ భృతి కల్పించి యువతకు న్యాయం చేయాలనే ప్రధాన ఎజండాగా పోస్ట్ కార్డు ఉద్యమాన్ని ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. లండన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి అధ్యక్షత వ్యవహరించిన రంగు వెంకట్ మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటుకు నియమాకాలు ప్రధాన అంశం , తెలంగాణ ఏర్పాటు అయితే లక్షల ఉద్యోగాలు వస్తామని యువత ఎంతో ఆశతో ఉందన్నారు. నాలుగేళ్లు గడుస్తున్నా ప్రభుత్వం ఉద్యోగాల భర్తీపై దృష్టి సారించలేదన్నారు. తెలంగాణలో ఖాళీగా ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలనీ, ఉద్యోగ భృతిని కల్పించాలని లండన్ నుండి లేఖలు పంపి ఈ పోస్టుకార్డు ఉద్యమానికి మద్దతు తెలిపామన్నారు. రవి కూర మాట్లాడుతూ ఉద్యోగాలు నియామకాలు జరిపే టీఎస్పీఎస్సీ లోనే ఖాళీలు భర్తీచేయకపోవడం హాస్యాస్పదమన్నారు. మరో ఎన్నారై మహేష్ చాట్ల మాట్లాడుతూ..ఉద్యోగ కల్పన ను ప్రభుత్వం విస్మరించడం సరైనదికాదని.. నాలుగేళ్లలో 7 ఉద్యోగాలు మాత్రమే నియామకం జరగడం.. నోటిఫికేషన్ ప్రక్రియల్లో లోపాల వల్ల కూడా యువత ఇబ్బంది పడ్డారని ఆయన తెలిపారు. రాజు కొయ్యడ మాట్లాడుతూ ప్రగతి భవన్ కు చేరుతున్న గుట్టల కొద్దీ ఉత్తరాలతో అయిన ముఖ్యమంత్రికి కనువిప్పు కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తిరుపరి నర్సింహా రెడ్డి, కొలను విద్యాభూషణ్, గుర్రం మల్లారెడ్డి, పుప్పాల రాజు, మధు, గుమ్మడవెల్లి రమేష్, నాయిని శైలజ, నాయిని సురేందర్ రెడ్డి, ఆకుల వెంకట స్వామిలు పాల్గొని లండన్ నుంచి 12 లేఖలు ముఖ్యమంత్రికి పంపారు. -
ఆయన సేవలు అజరామరం
భారతీయ సినిమాకు ఆధ్యుడు, సినీ ప్రేమికుడు బి.నాగిరెడ్డి 105వ వర్ధ్దంతిని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా నాగిరెడ్డి పేరుతో తపాలా బిళ్లను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, గవర్నర్ బన్వరిలాల్ చెన్నైలో ఆవిష్కరించారు. తమిళసినిమా: నాగిరెడ్డి సేవలు అజరామరం అని, ఆయన్ను ఆదర్శంగా తీసుకుని సమాజానికి మేలు చేసే చిత్రాలు రూపొందించాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. భారతీయ సినీ పితామహుడు, దివంగత ప్రఖ్యాత సినీ దర్శక, నిర్మాత, వాహినీ స్టూడియో అధినేత బి.నాగిరెడ్డి పేరుతో తపాలాబిళ్లను శుక్రవారం చెన్నైలో ఆవిష్కరించారు. భారతీయ సినిమాకు ఆధ్యుడు, సినీ ప్రేమికుడు బి.నాగిరెడ్డి విజయా ప్రొడక్షన్స్ పతాకంపై తెలుగు, తమిళం, హిందీ అంటూ పలు భాషల్లో ఎన్నో అద్భుత కళాఖండాలను నిర్మించారు. పాతాళభైరవి, మిస్సమ్మ, మాయాబజార్ వంటి ఆ పాత మధుర చిత్రాలతో పాటు నమ్‌నాడు, ఎంగవీట్టు పిళ్లైవంటి పలు జనరంజక తమిళ చిత్రాల నిర్మించారు. అదేవిధంగా భారతదేశంలోనే ప్రసిద్ధి గాంచిన వాహినీ స్టూడియో నిర్మాణ కర్త బి.నాగిరెడ్డినే. విజయా వైద్య, విద్యా సంస్థల వ్యవస్థాపకుడు అయిన నాగిరెడ్డికి ఈ నెల 25న 105వ వర్ధంతి రోజు. ఈ రోజును పురçస్కరించుకుని ఆయన పేరుతో తపాలాబిళ్లను విడుదల చేయడం విశేషం. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, రాష్ట్ర గవర్నర్ బన్వరిలాల్ పురోíహిత్ హాజరయ్యారు. బి.నాగిరెడ్డి రూ.5 తపాలాబిళ్లను వెంకయ్యనాయుడు ఆవిష్కరించగా తమిళనాడు గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ బి.నాగిరెడ్డి ది లెజెండ్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ బి.నాగిరెడ్డి అన్నా, ఆయన చిత్రాలన్నా తనకు చాలా ఇష్టం అని పేర్కొన్నారు. సమాజానికి ఉపయోగపడే చిత్రాలనే నాగిరెడ్డి రూపొందించారని కీర్తించారు. ఆయన చిత్రాల్లో భాషకు, యాసకు ప్రాముఖ్యత ఉండేదన్నారు. శృంగారం లాంటి అసభ్య దృశ్యాలు లేకుండానే నాగిరెడ్డి ఎన్నో గొప్పగొప్ప ప్రేక్షకాదరణ పొందిన మంచి సందేశాత్మక కథా చిత్రాలను నిర్మించారని, ఇప్పుడు శృంగారం పేరుతో అపహాస్యం చేస్తున్నారని అన్నారు. నిజానికి ఇప్పటి చిత్రాల్లో శృంగారం కంటే, అంగారమే కనిపిస్తుందని అన్నారు. అలా కాకుండా సమాజానికి మంచి చేసే కథా చిత్రాలతో భావితరానికి మంచి సందేశాన్ని అందించే బాధ్యత నేటి దర్శక నిర్మాతలపై ఉందన్నారు. నైతిక విలువలతో కూడిన భారతీయ సంస్కృంతి, సంప్రదాయాలను పెంపొందించే చిత్రాలను రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. భాష ఏదైనా మనందరం భారతీయులమని వ్యాఖ్యానించారు. మాతృభాష తల్లిపాలు లాంటిదని, ఇతర భాషలు అద్దం లాంటివని పేర్కొన్నారు. అలాంటి తెలుగు భాషను మనమే చెడగొట్టుకుంటున్నామని అన్నారు. ఎన్ని గూగుల్స్ వచ్చినా మన గూగుల్ (ఉపాధ్యాయులు)లను మరవరాదని అన్నారు. నాగిరెడ్డి సినిమాలతోనే కాకుండా రియల్ లెజెండ్ అని వ్యాఖ్యానించారు, ఆయన సేవలు అజరామరం అని, సినీమారంగానికే కాకుండా వైద్య, విద్యారంగాల్లోనూ ఉత్తమ సేవలను అందించిన గొప్ప మానవతావాది ఆయన అని అన్నారు. ఒక సాధారణ కుటుంబంలో పుట్టిన నాగిరెడ్డి ఎంతో సాధించారని పేర్కొన్నారు. అందుకే ఆయన దాదా సాహెబ్ పాల్కే అవార్డులాంటి ఎన్నో గొప్పగొప్ప అవార్డులతో సత్కరింపబడ్డారని గుర్తు చేశారు.నాగిరెడ్డిని ఆదర్శంగా తీసుకుని ఈ తరం దర్శక నిర్మాతలు చిత్రాలు చేయాలని హితవు పలికారు. నాగిరెడ్డి పేరుతో తపాలాబిళ్లను విడుదల చేసిన తపాలా శాఖకు, కేంద్రప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానన్నారు. ఈ తపాలాబిళ్లను తన చేతులమీదగా ఆవిష్కరించడం అదృష్టంగా భావిస్తున్నానని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. నాగిరెడ్డి గొప్ప మానవతావాది అని తమిళనాడు గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ పేర్కొన్నారు. స్వశక్తితో ఎదిగి ఎంతో సాధించిన గొప్ప వ్యక్తి నాగిరెడ్డి అని శ్లాఘించారు. చందమామ హిందీ పత్రికను తాను చిన్నతనంలోనే చదివాననని, అయితే ఆ పత్రిక సంపాదకుడు బి.నాగిరెడ్డి అన్న విషయం ఇప్పుడే తెలిసిందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాగిరెడ్డి తనయుడు బి.వెంకటరామిరెడ్డి, ఆయన సతీమణి బి.భారతీదేవి, రాష్ట్ర మంత్రి అన్భళగన్, ప్రముఖ చిత్ర నిర్మాత ఏవీఎం.శరవణన్ వేదికనలంకరించారు. పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.నాగిరెడ్డి మనువడు వినయరెడ్డి వందన సమర్పణ చేశారు. నాగిరెడ్డి ది లెజెండ్ పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న వెంకయ్యనాయుడు -
బి.నాగిరెడ్డి పోస్టల్ స్టాంప్ విడుదల
సాక్షి, చెన్నై : ప్రేక్షకులకు పలు చిరస్మరణీయ చిత్రాలను అందించిన అలనాటి ప్రముఖ నిర్మాత బి.నాగిరెడ్డి స్మారక పోస్టల్ స్టాంపును ముఖ్య అతిధిగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు శుక్రవారం విడుదల చేశారు. చెన్నైలో జరిగిన ఈ కార్యక్రమంలో దగవర్నర్ బన్వరిలాల్ పురోహిత్, రాష్ట్ర మంత్రి అన్భళగన్ ఆస్పత్రి నిర్వాహకులు, నాగిరెడ్డి వారసులు పాల్గొన్నారు. ఎన్నో చిత్రాల నిర్మాతగా, విజయా స్టుడియోస్ అధినేతగా, ఆస్పత్రుల వ్యవస్థపకులుగా, చందమామ పత్రిక పబ్లిషర్‌గా నాగిరెడ్డి సేవలు అమోఘమని ముఖ్య అతిధులు శ్లాఘించారు. సినీ రంగాని, వైద్య రంగానికి నాగిరెడ్డి చేసిన సేవలని గుర్తుతెచ్చుకునే విధంగా పోస్టల్ స్టాంప్‌తో , పుస్తకాన్ని ఆవిష్కరించడం సంతోషం కలిగించిందని వెంకయ్య నాయుడు అన్నారు. సమాజానికి సేవలు చేసిన నాగిరెడ్డి పేరిట స్టాంప్ విడుదల చేసేందుకుకు ముందుకు వచ్చిన తపాలా శాఖకు అభినందనలు తెలిపారు. నాగిరెడ్డి గొప్ప మానవతావాది అని, గొప్పవారి జ్ఞాపకాలను రేపటి తరాలకు అందించటం హర్షించదగ్గ పరిణామం అన్నారు. విజయా సంస్థ చిత్రాలతో పాటు చందమామ, బాలమిత్ర వంటి కథలు నాగిరెడ్డిని ఇప్పటికీ గుర్తుకు తెస్తాయని వెంకయ్య అన్నారు. -
తపాలా తప్పులకూ పరిహారమే!
విశ్లేషణ ఒకప్పుడు పోస్ట్ ఆఫీస్ అన్నా, పోస్ట్ మ్యాన్ అన్నా నమ్మకానికి మారుపేర్లు. కానీ ఇటీవల పోస్టాఫీసులపై వస్తున్న ఫిర్యాదులు, ఆరోపణలు, సమాచార నిరాకరణలు వింటూ ఉంటే ఆశ్చర్యం వేస్తుంది. ఇవేనా ఆ తపాలా కార్యాలయాలు అనిపిస్తుంది. తపాలా కార్యాలయం అంటే ప్రతి గ్రామంలో ఒక చైతన్య కేంద్రం. అందరికీ ఆత్మీయ సందేశాలను అందించే ఒక ఆప్త బంధువు. డబ్బు దాచుకోవచ్చు. కుటుంబానికి డబ్బు మనీయార్డర్ చేయవచ్చు. దేశమంతటా మారుమూల గ్రామాలలో సైతం విస్తరించిన పోస్టాఫీసులు ప్రజల మిత్రులు పోస్ట్ మ్యాన్ ఊళ్లో వాళ్లందరికీ పరిచితుడు. ఎవరెవరు ఎక్కడుంటారో తెలిసినవాడు. కానీ ఇటీవల పోస్టాఫీసులపై వస్తున్న ఫిర్యాదులు, ఆరోపణలు, సమాచార నిరాకరణలు వింటూ ఉంటే ఆశ్చర్యం వేస్తుంది. ఇవేనా ఆ తపాలా కార్యాలయాలు అనిపిస్తుంది. ఉత్తరం చేరకపోవడం చాలా అరుదుగా జరిగేది. డబ్బు ఠంచనుగా అందేది. మానాన్న గారు చిన్నాయన గారి చదువుకోసం వందరూపాయలు మనీయార్డర్ పంపడం తెలుసు. అది ఆయనకు 99 శాతం వరకు సకాలానికే అందేది. ఇప్పుడంతా తిరగబడింది. అనేకానేక మోసాల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సమాచార హక్కు ఈ శాఖలో జరుగుతున్న దురన్యాయాలను నిర్లక్ష్య ఆలస్యాలను, ఖాతాల్లో డబ్బు మాయం దుర్మార్గాలను ఎండగట్టడానికి ఒక అద్భుతమైన పరికరంగా ఉపయోగపడుతున్నది. అడిగేవాడు లేకుండా విర్రవీగుతున్న తపాలా దురుద్యోగులకు సమాచార హక్కు దరఖాస్తులు సింహస్వప్నాలు. ఉద్యోగానికి, లేదా కోర్సులో చేరడానికి ఆఖరి తేదీలోగా దరఖాస్తు పంపితే వారికి ఎందుకు చేర్చలేదని జనం నిలదీసి అడుగుతున్నారు. రిజిస్టర్డ్ పోస్ట్ చేసిన వస్తువులు ఉత్తరాలు, ప్రధానమైన పత్రాలు ఎందుకు మాయమై పోతున్నాయని చొక్కా పట్టుకుని ప్రశ్నిస్తున్నారు. వేలాది పోస్టాఫీసుల్లో అవినీతిని ఊడ్చివేయడానికి ఆర్టీఐ కొత్త చీపురు కట్టగా పనిచేస్తున్నది. తపాలా సేవలను వినియోగించి భంగపడిన ఒక పౌరుడు ఆర్టీఐ అభ్యర్థనలో కొన్ని ప్రశ్నలు సంధించాడు. 2015 నవంబర్‌లో పంపిన రిజిస్టర్డ్ పోస్టు వస్తువు ఎందుకు చేరలేదు, తాను ఇచ్చిన మూడు ఫిర్యాదులపై ఏ చర్య తీసుకున్నారు అని. అది మరో డివిజన్‌కు సంబంధించిన విషయమని ఆ డివిజన్ ఫిర్యాదు నమోదు చేసుకుని దర్యాప్తు జరిపించారని సీపీఐఓ జవాబిచ్చాడు. సరైన సమాచారం ఇచ్చాడని మొదటి అప్పీలు అధికారి సమర్థించారు. ఫిర్యాదుల విచారణ పోర్టల్‌కు ఫిర్యాదు కూడా చేశాడు. రూ. 63ల నష్టపరిహారం తీసుకోవాలని అతనికి చెప్పారు. డిపార్ట్మెంట్ రూల్ ప్రకారం రూ. 63ల రిజిస్టర్డ్ చార్జీలతో పాటు వంద రూపాయల కనీస పరిహారం ఇవ్వవలసి ఉన్నా ఇవ్వలేదు. సరైన, పూర్తి సమాచారం ఇవ్వకపోవడం సీపీఐఓ చేసిన తప్పులు. కనుక జరిమానా ఎందుకు విధించకూడదో కారణాలు తెలపాలనే నోటీసు జారీ చేసింది కమిషన్. చాలా కీలకమైన పత్రాలను తన మేనల్లుడికి పంపానని, దానికి 480 రూపాయలు ఖర్చయిందనీ, దానితో పాటు 50 రూపాయల పుస్తకాన్ని పంపానని దరఖాస్తుదారుడు వివరించాడు. ఈ కవర్ అందకపోవడం వల్ల తన మేనల్లుడు ఒక పరీక్షకు హాజరు కాలేకపోయాడని, తదుపరి ఏడాది పరీక్షకు హాజరు కావలసి వచ్చిందని పరి హారం చెల్లించాలని కోరాడు. పరిహారం ఎందుకు ఇవ్వకూడదో వివరించాలని మరో నోటీసుకూడా జారీ చేసింది కమిషన్. పోస్టాఫీసు అధికారి మాత్రం రిజిస్టర్డ్ పోస్ట్ ఎందుకు అందలేదో విచారించి రూపొందించిన నివేదిక ప్రతిని ఆర్టీఐ అడిగిన వ్యక్తికి ఇచ్చామని చెప్పారు. విలువైన వస్తువులు పంపే వ్యక్తులు దానికి బీమా చేయించాలని, తాము పోయిన వస్తువు విలువను పరిహారంగా ఇచ్చే వీల్లేదని, రూల్స్ ప్రకారం కేవలం వంద రూపాయలు పరిహారం రూ. 63ల చార్జీలు మాత్రమే ఇస్తామని వివరించారు. సమాచారం త్వరగా ఇచ్చినప్పటికీ అది తప్పుడు సమాచారం కనుక పరిహారం ఇవ్వవలసిన కేసు అని కమిషన్ నిర్ధారించింది. సెక్షన్ 19(8)(బి) కింద రూ. 3,630ల పరిహారం (పూర్తి సమాచారం ఇవ్వకుండా వేధించినందుకు 2 వేలు, పరి హారం 100, ప్రయాణ ఖర్చుల కింద రూ. 1,000లు, కోల్పోయిన వస్తువుల విలువ రూ. 53లు) ఇవ్వాలని కమిషన్ ఆదేశిం చింది. సేవల వితరణలో నిర్లక్ష్యం కారణంగా వినియోగదారుడికి నష్టం జరిగితే పరి హారం ఇవ్వడం ఏ సర్వీసు సంస్థకయినా తప్పదు. ఇదే పౌర నష్టపరిహార న్యాయసూత్రం. కానీ చిన్న చిన్న పరిహా రాలకోసం వినియోగదారులు కోర్టుకు వెళ్లడం లేదా మామూలు కోర్టుకు వెళ్లడం భరించలేని భారం అవుతుంది. కనుక డిపార్ట్మెంట్లోనే కొన్ని పరిహార సూత్రాలు ఏర్పాటు చేసుకుని న్యాయంగా పరిహారం చెల్లించాలి. పోస్ట్ చేసే వారు విలువైన వస్తువులను పంపేటప్పుడు వాటిని విధిగా బీమా చేయాలనే అంశానికి బాగా ప్రచారం ఇవ్వాలి. తరువాత ఆ బీమా సొమ్ము బాధితుడికి ఇవ్వడానికి తపాలా అధికారులు సత్వర చర్యలు తీసుకోవాలి. అసలు పరిపాలనే మరిచిపోయిన ప్రభుత్వ కార్యాలయాలకన్న ఘోరంగా తపాలా కార్యాలయాలు తయారు కావడం దురదృష్టకరం. కనుక పౌరులు విధిలేక ఆర్టీఐ ఆసరా తీసుకుంటున్నారు. దానికి కూడా సరైన సమాధానాలు ఇవ్వకుండా అధికారులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. సమాచార హక్కు చట్టంలో సెక్షన్ 19 అనేక పరిష్కారాలను కల్పిస్తున్నది. అందులో ఒకటి నష్టపరిహార నియమం. సమాచారం సకాలంలో ఇవ్వకపోవడం వల్ల, పూర్తిగా ఇవ్వనందున, ఇచ్చినా ఆ సమాచారం తప్పుల తడక కావడం వల్ల కలిగిన నష్టాలకు అందుకు పౌరుడి పైన పడిన భారాన్ని కూడా ఆర్టీఐ భంగపరిచిన అధికార సంస్థ చెల్లించాలని 19(8) (బి) నిర్దేశిస్తున్నది. అయితే ఈ నష్టమే కాకుండా, ఇతర నష్టాలను, లోపాలను కూడా భర్తీ చేయాలని ఆ నియమంలో ఉంది. నిజానికి ఈ కేసులో పౌరుడి బంధువు పరీక్షకు హాజరుకాలేకపోవడం వల్ల ఏడాది సమయాన్ని కోల్పోయాడు. ఈ పరిహారాన్ని లెక్కించడం చాలా కష్టం. నామమాత్రంగా నష్టపరిహారం ఇవ్వవలసి ఉంటుంది. దరఖాస్తుదారుడు కూడా సరిగ్గా తన నష్టాన్ని అంచనా వేయవలసి ఉంటుంది. అది కూడా జరగడం లేదు. (CIC/POSTS/ A/2017/167339 రాకేశ్ గుప్తా వర్సెస్ పోస్టాఫీస్ కేసులో సీఐసీ 9 జనవరి 2018 న ఇచ్చిన ఆదేశం ఆధారంగా). వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ professorsridhar@gmail.com -
దేశమంతా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు సేవలు
న్యూఢిల్లీ: తపాలా శాఖకు చెందిన పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు తన సేవల్ని దేశవ్యాప్తంగా విస్తరించనుంది. వచ్చే మే నుంచి పేమెంట్స్ బ్యాంకు శాఖలను దేశవ్యాప్తంగా ప్రారంభించే ఆలోచనతో ఉన్నామని, ఇందుకు రూ.1,450 కోట్లు వెచ్చిస్తామని తపాలా శాఖ సెక్రటరీ అనంత నారాయణ్ నందా తెలిపారు. ‘‘ఏప్రిల్ నాటికి ఏర్పాట్లన్నీ పూర్తవుతాయి. మే నుంచి సెప్టెంబర్ మధ్య దేశవ్యాప్తంగా పోస్ట్ పేమెంట్స్ బ్యాం కు శాఖలను ప్రారంభిస్తాం’’ అని వెల్లడించారు. 1.55 లక్షల పోస్టాఫీసులు సేవల కేంద్రాలుగా పనిచేస్తాయని, వీటికి బ్యాక్ ఎండ్ సేవల్ని 650 పేమెంట్స్ బ్యాంకు శాఖలు అందిస్తాయని చెప్పారు. గతేడాది జనవరిలో తపాలా శాఖ పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు సేవల్ని ప్రయోగాత్మకంగా రాంచీ, రాయ్‌పూర్‌లో ప్రారంభించింది. మొత్తం 11 సంస్థలు పేమెంట్స్ బ్యాంకు సేవల్ని ప్రారంభించేందుకు ఆర్బీఐ 2015లో అనుమతించింది. ఎయిర్టెల్, పేటీఎం, పోస్ట్ పేమెంట్స్ బ్యాంకులు మాత్రమే ఇప్పటిదాకా సేవల్ని ఆరంభించాయి.