సుధీర్‌బాబే సూత్రధారి! | Sudheer babu itself key member | Sakshi
Sakshi News home page

సుధీర్‌బాబే సూత్రధారి!

Published Thu, Dec 8 2016 12:46 AM | Last Updated on Tue, Sep 18 2018 8:18 PM

సుధీర్‌బాబే సూత్రధారి! - Sakshi

సుధీర్‌బాబే సూత్రధారి!

మూడు పోస్టాఫీసుల్లో ‘నోట్ల మార్పిడి’ అవకతవకలు గుర్తింపు
- రూ.2.95 కోట్లు పక్కదారి పట్టినట్లు ఆధారాలు
- నిందితుల జాబితాలో ఆరుగురు ఉద్యోగులు
- నలుగురిని అరెస్టు చేసిన సీబీఐ అధికారులు
- విజిలెన్స్ ను రంగంలోకి దింపిన తపాలా శాఖ
- రాష్ట్రవ్యాప్తంగా పోస్టాఫీసుల్లో తనిఖీలు  
 
 సాక్షి, హైదరాబాద్: ‘నోట్ల మార్పిడి’ని సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్టాఫీసెస్ (ఎస్‌ఎస్‌పీఓఎస్) కె.సుధీర్‌బాబు భారీగా సొమ్ము చేసుకున్నట్లు తేలింది. హైదరాబాద్ లోని 3 పోస్టాఫీసులు కేంద్రంగా జరిగిన రూ. 2.95 కోట్ల అవకతవకలకు ఆయనే సూత్ర ధారి అని గుర్తించారు. సుధీర్‌బాబు మరో ఐదుగురు పోస్టల్ ఉద్యోగులతో కలసి అక్రమాలకు పాల్పడినట్లు వెల్లడైంది. ఈ వ్యవ హారంపై 3 కేసులు నమోదు చేసి దర్యాప్తు చేప ట్టిన సీబీఐ.. బుధవారం నలుగురు పోస్టల్ అధికారులు/ఉద్యోగులను అరెస్టు చేసింది.

 మూడు కేసులు..
 ‘బడా బాబు’లకు చెందిన నల్లధనాన్ని తెల్లధ నంగా మార్చిన ఈ వ్యవహారంలో సుధీర్ బాబుతో పాటు అబిడ్‌‌స జీపీఓలో క్యాష్ ఓవర్ సీర్‌గా పనిచేసే సయ్యద్ ఎతేషుద్దీన్, ఎస్‌ఎస్ పీఓఎస్ కార్యాలయం ఆఫీస్ అసిస్టెంట్ జి. రవితేజ కీలకపాత్ర పోషించారని సీబీఐ గుర్తిం చింది. మూడు పోస్టాఫీసుల ద్వారా సాగిన ఈ వ్యవహారాలకు సంబంధించి ఆర్సీ నం.24 (ఎ)/2016, ఆర్సీ నం.27(ఎ)/2016, ఆర్సీ నం.28(ఎ)/2016 కింద కేసులు నమోదు చేసింది. నిందితులపై కుట్ర, మోసం, నమ్మక ద్రోహం, ప్రభుత్వ ఉద్యోగి ద్వారా నమ్మక ద్రోహం, ఖాతాలు/పుస్తకాలను తారుమారు చేయడం తదితర ఆరోపణలు చేసింది. ఈ వ్యవహారంలో మరికొందరు ప్రభుత్వ ఉద్యో గులకు, ప్రైవేట్ వ్యక్తులకు ప్రమేయమున్నట్లు అనుమానిస్తున్నామని పేర్కొంది. ఎవరి నగదును ఈ రకంగా అక్రమ మార్పిడి చేశా రనే అంశంపై లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు సీబీఐ అధికారులు పేర్కొన్నారు.

 పోస్టాఫీసులకు చేరకముందే..
 నోట్ల మార్పిడి కోసం జీపీఓలోని పోస్టల్ ట్రెజరీ కార్యాలయం ఎస్‌ఎస్‌పీఓఎస్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్‌కు రోజూ కొంత మొత్తంలో రూ.2 వేల నోట్లను మంజూరు చేస్తోంది. జీపీఓలో ఉన్న పోస్టల్ ట్రెజరీ కార్యాలయంలో క్యాష్ ఓవర్‌సీర్‌గా పనిచేసే సయ్యద్ ఎతేషుద్దీన్ ఎస్‌ఎస్‌పీఓఎస్‌కు కొత్త నోట్లు పంపిస్తారు. వీటిని ఎస్‌ఎస్‌పీఓఎస్‌గా ఉన్న సుధీర్‌బాబు తన అధీనంలోని 11 సబ్ పోస్టాఫీసులకు రవితేజ ద్వారా సరఫరా చేరుుస్తారు. అరుుతే ఈ క్రమంలో హిమాయత్‌నగర్ సబ్ పోస్టాఫీ స్ ద్వారా రూ.36 లక్షలు, గోల్కొండ సబ్ పోస్టాఫీస్ ద్వారా రూ.1.39 కోట్లు, కార్వాన్ సబ్ పోస్టాఫీస్ ద్వారా రూ.1.39 కోట్లు పక్కదారి పట్టినట్లు సీబీఐ గుర్తించింది. కొత్త రూ.2 వేల నోట్లు సబ్ పోస్టాఫీసులకు చేరకుండానే సుధీర్‌బాబు వాటిని పాత నోట్లతో మార్చేవాడని దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఆ మూడు పోస్టాఫీసుల్లో సబ్ పోస్టుమాస్టర్స్‌గా పనిచేస్తున్న జి.రేవతి (హిమాయత్‌నగర్), ఎం.గోవిందరావు (గోల్కొండ), పి.సంపత్‌కుమార్ (కార్వాన్) ఈ అక్రమాలకు సహకరించారని తేల్చి.. వారిని ఈ కేసుల్లో నిందితులుగా చేర్చారు.

 రికార్డులు మార్చి చూపే యత్నం
 సుధీర్‌బాబు ఆదేశాల మేరకు రవితేజ ద్వారా అందుకున్న పాత నోట్లను సాధారణ ప్రజల నుంచి ‘మార్పిడి’ ద్వారా తీసుకున్నట్లు రికార్డులు రూపొందించేందుకు పోస్టల్ అధికారులు సిద్ధమయ్యారని సీబీఐ గుర్తిం చింది. ఈ వ్యవహారంలో పోస్టల్ ఉద్యోగులు అబ్దుల్ ఘనీ, కె.సురేష్‌కుమార్, జి.శ్రీనివా స్‌లకు ప్రమేయం ఉన్నట్లు గుర్తించింది. మొత్తంగా ఈ అక్రమాలను వెలికితీయడానికి పోస్టాఫీసులు, నిందితుల ఇళ్ళతో సహా మొత్తం 11 ప్రాంతాల్లో సీబీఐ అధికారులు దాడులు చేశారు. మొబైల్ ఫోన్లు, ల్యాప్ టాప్స్, డాక్యుమెంట్లతో పాటు రూ.17.02 లక్షల విలువైన కొత్త రూ.2 వేల నోట్లు స్వాధీనం చేసుకున్నారు. షేక్ అబ్దుల్ ఘనీ, జి.రవితేజ, కె.సురేష్‌కుమార్, జి. శ్రీనివా స్‌లను బుధవారం అరెస్టు చేశారు.
 
 ఇంటిదొంగల గుట్టు సీబీఐకి..
 రద్దయిన నోట్లను దర్జాగా కొందరు తపాలా కార్యాలయాల ద్వారా మార్పిడి చేసుకోగలిగారు. కొందరు తపాలా శాఖ అధికారులు, ఉద్యోగులు కమీషన్లకు కక్కుర్తిపడి ‘నల్ల ధనికుల’కు సహ కరించిన విషయాన్ని సీబీఐ గుర్తించింది. దీంతో మేల్కొన్న తపాలాశాఖ స్వయంగా ఇంటిదొంగలను పట్టుకోవా లని నిర్ణరుుంచి, విజిలెన్‌‌సను రంగంలోకి దింపింది. నోట్ల రద్దు తర్వాత పెద్ద సంఖ్యలో డిపాజిట్లు వచ్చిన పోస్టాఫీ సులు, భారీగా నగదు మార్పిడి జరిగిన పోస్టాఫీసులను గుర్తించి తనిఖీలు చేస్తున్నారు. హైదరాబాద్‌లో 30 పోస్టాఫీసుల్లో తనిఖీలు చేయగా.. పలు చోట్ల అక్ర మాలు జరిగినట్టు తెలిసింది. ఈ వివరా లను వెంటనే సీబీఐకి అందజేయగా.. సీబీఐ చర్యలు ప్రారంభించింది. ఇక జిల్లా ల్లోనూ విజిలెన్‌‌స తనిఖీలు జరుగుతు న్నారుు. మరో రెండురోజుల్లో అవి పూర్తవుతాయని, అక్రమాలు వెలుగు చూస్తే ఆ వివరాలను కూడా సీబీఐకి అందిస్తామని తపాలాశాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement