సీబీఐ దాడులు: నలుగురు పోస్టల్ ఆఫీసర్లు అరెస్టు
సీబీఐ దాడులు: నలుగురు పోస్టల్ ఆఫీసర్లు అరెస్టు
Published Wed, Dec 7 2016 7:02 PM | Last Updated on Tue, Sep 18 2018 8:18 PM
హైదరాబాద్: నగదు మార్పిడిలో అక్రమాలకు పాల్పడిన నలుగురు పోస్టల్ అధికారులను సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నగరంలోని 11 పోస్టాఫీసుల్లో బుధవారం సోదాలు నిర్వహించిన కేంద్ర దర్యాప్తు సంస్ధ(సీబీఐ) నగదు మార్పిడిలో అక్రమాలకు పాల్పడుతున్న నలుగురు పోస్టల్ అధికారులను అరెస్ట్ చేశారు. కొంతమంది ప్రైవేట్ వ్యక్తులతో చేతులు కలిపి పాత రూ.500, రూ.1000 నోట్లను కొత్త రూ.2వేల నోట్లతో మార్పిడి చేస్తున్నారనే సమాచారంతో సీబీఐ నగరంలోని పోస్టాఫీసులపై దాడులు నిర్వహించింది.
పోస్టల్ అధికారులు జీ శ్రీనివాస్, అబ్దుల్ గని, సురేష్ కుమార్, రవితేజలు రూ.2.95 కోట్ల కొత్త నోట్లను అక్రమంగా ప్రైవేటు వ్యక్తులకు అందించినట్లు గుర్తించారు. అదుపులోకి తీసుకున్న సమయంలో వీరి నుంచి కీలక పత్రాలు, ల్యాప్ టాప్ లు, మొబైళ్లు, రూ.17.02 లక్షల నగదు(రూ.2వేల నోట్లు) స్వాధీనం చేసుకున్నారు. వీరందరిని జ్యూడిషీయల్ కస్టడీకి పంపించి విచారణ చేస్తున్నారు.
Advertisement
Advertisement