నిజామాబాద్ అర్బన్: పోస్టల్ శాఖకు చెందిన ఓ అధికారి లంచం తీసుకుంటూ సీబీఐ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కాడు. వరంగల్ జిల్లాకు చెందిన కేథావత్ లోకేష్ నాయక్ ఆదిలాబాద్ జిల్లా బైంసాలోని పోస్టాఫీస్‌లో ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోస్టాఫీస్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. జిల్లా కేంద్రంలోని గంగాస్థాన్ ఫేస్-2లో నివాసం ఉంటూ బైంసాకు వెళ్లి వస్తున్నాడు. బైంసాలోని పోస్టాఫీస్ కార్యాలయంలో ఇటీవల సంజీవ్‌కుమార్‌కు మేల్ క్యారియర్‌గా ఉద్యోగం వచ్చింది.
ఆయన సెప్టెంబర్ ఒకటిన విధుల్లో చేరాడు. ఉద్యోగంలో భాగంగా సంజీవ్‌కుమార్ తన పేరును పోప్టాఫీస్ కార్యాలయంలోని చార్జిషీట్‌లో నమోదు చేయాలి. అప్పుడే ఉద్యోగ పరంగా వేతనాలు, ఇతర సౌకర్యాలు అధికారికంగా లభిస్తాయి. ఈ మేరకు ఆయన బైంసా ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోస్టాఫీస్ లోకేష్‌నాయక్‌ను అభ్యర్థించాడు. దీనికి గాను రూ.50 వేలు ఇవ్వాలని లోకేష్‌నాయక్ డిమాండ్ చేశాడు. అంత డబ్బు ఇచ్చుకోలేనని.. కొత్తగా ఉద్యోగం వచ్చిందని సంజీవ్‌కుమార్ వేడుకున్నా.. ఆ అధికారి వినలేదు. డబ్బులు ఇస్తేనే నమోదు చేస్తానని చెప్పడంతో సంజీవ్‌కుమార్ రూ. 10వేలు ఇస్తానని వేడుకున్నాడు. ఆ తర్వాత డబ్బుల కోసం సంజీవ్‌కుమార్‌ను ఆ అధికారి పలుమార్లు ఇబ్బంది పెట్టాడు.
దీంతో సంజీవ్‌కుమార్ హైదరాబాద్‌లోని సీబీఐ అధికారులను ఆశ్రయించాడు. ఆదివారం సంజీవ్‌కుమార్ రూ. 10వేలు డబ్బుతో పాటు సీబీఐ అధికారులతో కలిసి లోకేష్ నాయక్ నివాసం ఉంటున్నా గంగాస్థాన్-2, రోడ్‌నంబర్ -5లోని ఆయన ఇంటికివచ్చాడు. ఆ సమయంలో లోకేష్‌నాయక్ ఇంట్లో లేడు. సీబీఐ అధికారులు ఆయన ఇంటి సమీపంలో సుమారు 6గంటల పాటు నీరీక్షించారు. లోకేష్‌నాయక్ ఇంటికి వచ్చి సంజీవ్‌కుమార్ నుంచి రూ.10వేలు తీసుకుంటుండగా సీబీఐ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.ఈ దాడిలో సీబీఐ ఇన్‌స్పెక్టర్లు సురేష్‌బాబు, శ్రీనివాస్, శ్రీధర్ పాల్గొన్నారు. లోకేష్‌నాయక్ ఇంటిలో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆయన ఇంటిలోని ల్యాప్‌టాప్, స్కానర్లు ఇతర వస్తువులను సీజ్ చేశారు. అనంతరం లోకేష్‌ను అరెస్ట్ చేసి హైదరాబాద్‌కు తీసుకెళ్లారు.
సీబీఐకి చిక్కిన పోస్టల్ ఉద్యోగి
Published Sun, Sep 27 2015 11:02 PM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM
Advertisement
Advertisement