Sudhirbabu
-
సినిమా దర్శకుడిగా చేస్తున్నా!
‘‘ఇంద్రగంటిగారి డైరెక్షన్లో చేసిన ‘సమ్మోహనం’లో సినిమాలు ఇష్టపడని వ్యక్తి పాత్ర చేశా. ఇప్పుడు ఆయన డైరెక్షన్లో ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’లో సినిమా డైరెక్టర్ పాత్ర చేస్తున్నాను. ఇది రొమాంటిక్ ఎంటర్టైనర్’’ అన్నారు సుధీర్‌బాబు. గాజులపల్లె సుధీర్‌బాబు సమర్పణలో బి. మహేంద్ర బాబు, కిరణ్ బల్లపల్లి నిర్మిస్తున్న చిత్రం ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’. సుధీర్‌బాబు, కృతీ శెట్టి జంటగా రూపొందుతున్న ఈ చిత్రానికి మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తోంది. శనివారం జరిగిన ఈ సినిమా ఫస్ట్ లుక్ ఆవిష్కరణ వేడుకలో నిర్మాత వై. రవిశంకర్ మాట్లాడుతూ– ‘‘ఇంద్రగంటì గారు అన్ని జానర్స్‌లో సినిమాలు చేయగలరు. సుధీర్ టాలెంటెడ్ హీరో. ఇక ఆ అమ్మాయి (కృతి) ఎంత మంచి నటో ‘ఉప్పెన’ సినిమాలో చూపించాం. ‘ఆ అమ్మాయి..’ నిర్మాణంలో మేం భాగస్వాములు కావడం హ్యాపీగా ఉంది’’ అన్నారు. ఇంద్రగంటి మోహనకృష్ణ మాట్లాడుతూ– ‘‘ఒక అబ్బాయి జీవితాన్ని ఒక అమ్మాయి ఎలా ప్రభావితం చేస్తుంది? వీళ్లు ఎలా ప్రేమలో పడ్డారు? ఆ ప్రేమకు ఫ్యామిలీ, సొసైటీ నుంచి ఎదురైన ఇబ్బందులను అధిగమించి ప్రేమతో పాటు వాళ్లు అనుకున్నది ఎలా సాధించారనేది ఈ చిత్రకథ’’ అన్నారు. ‘‘మన ఇరుగు పొరుగింట్లో జరిగినంత సహజంగా ఈ సినిమా ఉంటుంది’’ అన్నారు కృతి. మైత్రీ మూవీ మేకర్స్ సీఈవో చెర్రీ, ఛాయాగ్రాహకుడు పీజీ విందా పాల్గొన్నారు. -
బ్రాడ్ పిట్లా ఉండాలన్నారు
నాని, సుధీర్‌బాబు నటించిన మల్టీస్టారర్ సినిమా ‘వి’. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ‘దిల్’ రాజు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 5న అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానుంది. ఈ సందర్భంగా సుధీర్‌బాబు చెప్పిన విశేషాలు ► ‘వి’ సినిమా రాక్షసునికి, రక్షకునికి మధ్య జరిగే పోరాటం. నేను హీరో, నాని విలన్. ఇద్దరం కొలతలేసుకుని నటించలేదు, క్యారెక్టర్ల ప్రకారం నడుచుకున్నాం. రెండు పాత్రలకూ సమాన ప్రాధాన్యం ఉంటుంది. నేను ఈ ప్రాజెక్ట్‌లోకి ఎంటర్ అయ్యేటప్పటికే అక్కడ రాక్షసుడు (అప్పటికే నాని ఈ పాత్రకు కన్ఫార్మ్ అయ్యారు) ఉన్నాడు. అందుకే నేను రక్షకుడు అయ్యాను. ఒకవేళ రెండు పాత్రలు నాకు చెప్పి నన్ను ఎన్నుకోమన్నా నేను పోలీసాఫీసర్ పాత్రనే ఎన్నుకునేవాణ్ణి. అంటే... ఇదే బెటర్ రోల్ అని చెప్పడంలేదు. కానీ నాకు ఇది కొత్త, నానీకి అది కొత్తగా ఉంటుంది. ► ఇంద్రగంటి గారంటే మహేశ్‌గారికి ఫుల్ నమ్మకం. ‘సమ్మోహనం’ సమయంలో రాత్రి ఒంటి గంటకు ఫోన్ చేసి ఈ సినిమా బావుంటుందని ధైర్యం చెప్పారు. మొన్నీ మధ్య మహేశ్‌గారిని కలిసినప్పుడు కూడా ‘వి’లో యాక్షన్ సీక్వెన్స్ బాగుంది, యాక్షన్ కొరియోగ్రఫీ ఎవరు? అని అడిగారు. ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలని వెయిట్ చేస్తున్నారు మహేశ్. ఇందగ్రంటిగారు నాకు ఈ కథ చెప్పినప్పుడు ఫైట్స్ నేచురల్‌గా ఉండాలనుకుంటున్నాను అని నా బాడీ ఎలా ఉండాలో చెప్పారు. చూడటానికి లావుగా ఉండకూడదు, కానీ చొక్కా విప్పితే కండలు ఉండాలని చెప్పారు. ఉదాహరణకి బ్రాడ్ పిట్లా ఉండాలన్నారు. అదే నాకు మోటివేషన్‌లా అనిపించింది. ► లాక్డౌన్లో అందరిలానే ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేసే అవకాశం వచ్చింది. చూడాలనుకున్న చాలా సినిమాలు చూసే తీరిక దొరికింది, చూశాను. అలానే చాలా కథలు విన్నాను. అందులో రెండు కథలకి ఓకే చెప్పాను. ఈ డిసెంబర్ నుండి పుల్లెల గోపిచంద్ బయోపిక్‌లో నటిస్తున్నాను. ఇది ప్యాన్ ఇండియా సినిమా. -
నేను హ్యాపీ అని ‘దిల్’రాజు అన్నారు
నాని, సుధీర్‌బాబు ముఖ్యపాత్రల్లో నటించిన చిత్రం ‘వి’. ‘దిల్’ రాజు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 5న అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్రదర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ పలు విషయాలను పంచుకున్నారు. ► సినిమాను థియేటర్లలోనే రిలీజ్ చేయాలని దాదాపు ఐదు నెలలు ‘దిల్’ రాజుగారిని నేను, నాని బతిమాలి ఓ నాలుగునెలల పాటు లాక్కొచ్చాం. రాజుగారు ఓ రోజు ‘కరెక్ట్‌గా థియేటర్లు ఎప్పుడు ఓపెన్ చేస్తారో ఓ డేట్ చెప్ప’మన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కనుచూపు మేరలో ఆ పరిస్థితి కనపడటంలేదు. అందుకనే ఈ సినిమాని డిజిటల్లో విడుదల చేయటానికి మొగ్గుచూపాం. ► ప్రతి విషయానికి పాజిటివ్, నెగిటివ్ ఉన్నట్లే ఈ సినిమాకు డిజిటల్ రిలీజ్ కూడా ప్లస్ అవుతుందనుకుంటున్నా. ఎందుకంటే ‘వి’ చిత్రాన్ని శుక్రవారం రాత్రి 12గంటలకు విడుదల చేస్తున్నాం. దాదాపు 200 దేశాల్లో ఈ సినిమా విడుదల కానుంది. జనరల్‌గా మా అమ్మగారు, అత్తగారు లాంటి 70 ఏళ్ల వయసున్నవారు థియేటర్లకు వచ్చి సినిమా చూడరు. నా సినిమాకు అలాంటివాళ్లందరూ ఎక్స్ట్రా ఆడియన్స్. మొదటివారం సినిమా చూసే ప్రేక్షకులంతా మొదటిరోజే చూస్తారు. శనివారం హాలిడే కాబట్టి అందరూ నైట్ పాప్‌కార్న్, కూల్‌డ్రింక్‌ను పక్కన పెట్టుకుని ఇంట్లో సినిమాని ఎంజాయ్ చేస్తారనుకుంటున్నా. ఎటొచ్చీ ప్రేక్షకుల మధ్యలో కూర్చుని సినిమా చూడలేకపోతున్నామనే బాధ తప్ప మిగతా అన్నీ మంచి విషయాలే. కానీ, నాకు వ్యక్తిగతంగా థియేటర్ అంటేనే ఇష్టం. ఇదొక (ఒటీటీ) ఫేజ్ మాత్రమే అనుకుంటున్నా. ► ‘దిల్’ రాజుగారు ఈ సినిమాకు నిర్మాత అయినా ఆయన ఒక బయ్యర్, డిస్ట్రిబ్యూటర్ కూడా. ఓటీటీలో రిలీజ్ చేయటం వల్ల ఆయనకు ఎన్నో సమస్యలు ఉండవచ్చు. ‘సార్ మీరు హ్యాపీయా’ అని అడిగితే, ‘హ్యాపీ మోహన్’ అన్నారు. లేకపోతే ఆయన అంత తేలిగ్గా ఓటీటీలో రిలీజ్ అనే నిర్ణయం తీసుకోరు. ► నానీతో నా అనుబంధం పుష్కరకాలం. నానీకి ఈ కథ చెప్పినప్పుడు ఇది తనకు 25వ సినిమా అని నాకు తెలియదు. ఆ తర్వాత తెలిసింది. అప్పుడు నానీని ‘ఇది నీ 25వ సినిమా కదా. ఈ పాత్ర (విలన్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్) ఏమైనా చేయడానికి ఇబ్బందా అంటే లేదన్నాడు. మొన్న సినిమా చూసిన తర్వాత ‘ఇది నా 25వది అయినందుకు, ఆ 25వ సినిమా మీతో చేసినందుకు హ్యాపీ’ అని నాని అన్నాడు. ► విజయ్ దేవరకొండతో ఓ సినిమా చేయాలి. అది ఎప్పుడు అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో చెప్పలేను. ఇద్దరు, ముగ్గురు నిర్మాతలకు ఓ సినిమా చేసి, మళ్లీ ‘దిల్’ రాజుగారితో సినిమా చేస్తాను. ► ప్రస్తుత పరిస్థితుల్లో షూటింగ్ అంటే క్రియేషన్ మీద పెట్టాల్సిన శ్రద్ధ శానిటేజషన్ మీద పెట్టాల్సి వస్తుందేమో. సెప్టెంబర్, అక్టోబర్లలో కొన్ని సినిమాల షూటింగ్‌ను ప్రారంభిస్తున్నారట. చూద్దాం.. ఎంతవరకు వర్కౌట్ అవుతుందో. రానున్న ఐదారు నెలల్లో నిర్మాతలు, దర్శకులు, నటులు సరికొత్త చాలెంజ్‌లను ఎదుర్కొనే పరిస్థితి రాబోతుంది. -
‘లౌక్యం’ తర్వాత ‘శమంతకమణి’
నిర్మాత వి.ఆనంద ప్రసాద్ ‘‘శమంతకమణి’ సినిమా మా భవ్య క్రియేషన్స్‌ను మరో మెట్టు పైకి తీసుకెళ్లింది. మా సంస్థలో ‘లౌక్యం’ చిత్రం తర్వాత 100 శాతం ప్రేక్షకులు బావుందని చెప్పిన సినిమా ‘శమంతకమణి’. కుటుంబమంతా కలిసి చూసే కథ. త్వరలో విజయయాత్ర చేయనున్నాం’’ అని నిర్మాత వి.ఆనంద ప్రసాద్ అన్నారు. నారా రోహిత్, సందీప్ కిషన్, సుధీర్‌బాబు, ఆది హీరోలుగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఆనంద్ ప్రసాద్ నిర్మించిన ‘శమంతకమణి’ ఈ నెల 14న విడుదలైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ నిర్వహించారు. సుధీర్‌బాబు మాట్లాడుతూ – ‘‘మా సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్. ఈ సినిమాలో నటించిన నా మిత్రులతో మరో సినిమా చేస్తా’’ అన్నారు. ‘‘ఈ సినిమాలో చేసిన కార్తీక్ క్యారెక్టర్ నాకు చాలా మెమరబుల్.’’ అన్నారు ఆది. ‘శమంతకమణి’ సినిమాకి వస్తున్న ప్రేక్షకుల ఆదరణ మా అందరి గెలుపుగా భావిస్తున్నాం’’ అని సందీప్ కిషన్ చెప్పారు. ‘‘ఈ సినిమా చేయడానికి ముఖ్య కారణం కథ. ఇలాంటి ఓ పాత్ర నాకు ఇచ్చినందుకు శ్రీరామ్ ఆదిత్యకు, ఇటువంటి చిత్రం తీసిన ఆనందప్రసాద్‌గారికి కృతజ్ఞతలు’’ అన్నారు నారా రోహిత్. ‘‘నా కల నిజం చేసిన మా హీరోలకు స్పెషల్ థ్యాంక్స్’’ అన్నారు శ్రీరామ్ ఆదిత్య. -
కమిషనర్ చొరవతో మహిళకు విముక్తి
వాట్సాప్ సందేశంతో రియాద్‌లోని మహిళకు విముక్తి వరంగల్: వరంగల్ పోలీస్ కమిషనర్ జి.సుధీర్‌బాబు చొరవతో ఏపీలోని కడప జిల్లా మాదారం సిద్దోట మండలానికి చెందిన ఓ మహిళకు రియాద్‌లో పడుతున్న చిత్రహింసల నుంచి విముక్తి లభించింది. మాదారం సిద్దోట మండలం లక్ష్మీపురానికి చెందిన పేరూరు సుబ్బలక్ష్మి రియాద్‌లో తనను చిత్రహింసలు పెడుతున్నారని.. రక్షించాలని వాట్సప్‌లో పంపిన వీడియోను చూసి వరంగల్ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు స్పందించారు. వెంటనే డీసీపీ నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి 4 రోజుల్లోనే ఆమెను వరంగల్‌కు తీసుకువచ్చారు. సోమవారం వరంగల్ లో ఈ కేసు విషయాలను సీపీ వివరించారు. సుబ్బలక్ష్మి ఉపాధి కోసం దుబాయికి వెళ్లేందుకు ఏజెంట్లు జిలానీ, వెంకటేశ్, వలీలను సంప్రదించి రూ.80 వేలు అందజేసింది. వారు ఆమెను దుబాయికి కాకుండా రియాద్ దేశంలోని అబ్ధుల్లా షేక్‌కు రూ.2 లక్షలకు అమ్మేశారు. అక్కడ సుబ్బలక్ష్మి కొన్నాళ్లకు అనారోగ్యానికి గురైంది. షేక్ ఆమెకు చికిత్స చేయించకుండా ఓ గదిలో బంధించి హింసకు గురిచేశాడు. ఆ దృశ్యాలను ఆమె తన తమ్ముడదికి వాట్సప్‌లో పంపింది. ఈ నెల 7న సీపీ సుధీర్‌బాబు నంబరుకు ఆమె బంధువులు ఆ వీడియోను పంపడంతో అప్రమత్తమై డీసీపీ ఇస్మాయిల్ నేతృత్వంలో బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందం సుబ్బలక్ష్మి యాజమాని అబ్ధుల్లా షేక్‌తో ఏజెంట్ ద్వారా సంప్రదింపులు జరిపించడంతో పాటు అతనికి ఇవ్వాల్సిన రూ.2 లక్షలను కూడా ఏజెంటుతోనే ఇప్పించారు. ఆమెను అక్కడినుంచి రప్పించి ఆమె భర్త పెంచలయ్యకు సోమవారం అప్పగించారు. -
సీఐ వేధిస్తున్నాడు..
మహిళాపోలీస్స్టేషన్ సిబ్బంది ఆవేదన సాక్షి, వరంగల్: వరంగల్ పోలీసు కమిష నరేట్ పరిధిలోని మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఇన్స్పెక్టర్ విష్ణుమూర్తి వేధింపులకు గురి చేస్తున్నారంటూ సిబ్బంది పోలీసు కమిషనర్ జి.సుధీర్‌బాబుకు ఫిర్యాదు చేశారు. మహిళా పోలీసుస్టేషన్లో పనిచేస్తున్న సిబ్బంది బుధవారం పోలీస్ కమిషనర్‌ను స్వయంగా కలిసి ఫిర్యాదు పత్రం ఇచ్చారు. విధి నిర్వహణ పేరుతో పరేడ్, డ్రెస్ ఇలా ఉండాలంటూ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నా డని మహిళా సిబ్బంది పోలీసు కమిషనర్‌కు చెప్పారు. విష్ణుమూర్తిని ఇన్స్పెక్టర్గా కొన సాగిస్తే మూకుమ్మడిగా సెలవులు పెట్టేందు కు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఆరోపణలపై విచారణ జరిపి చర్య తీసు కుంటామని కమిషనర్ హామీ ఇచ్చారు. -
‘నోటు’కాడి కూడూ రద్దు
- పెద్ద నోట్ల రద్దుతో ‘అమ్మానాన్న’ ఆశ్రమంలో అభాగ్యుల విలవిల - అర్ధాకలితో అల్లాడుతున్న 388 మంది అనాథలు - డబ్బుల్లేక ముందుకు రాని దాతలు - మూడు పూటల భోజనం రెండు పూటలకు కుదింపు - పరిస్థితి ఇలాగే ఉంటే ఇక ఒక్కపూటే.. చౌటుప్పల్: వారంతా విధి వంచితులు.. అనాథలు.. అభాగ్యులు.. ఓ అనాథ ఆశ్రమంలో కాలం గడు పుతున్నారు.. దాతల సాయంతో ఆ ఆశ్రమం ఇన్నాళ్లూ బాగానే నడిచింది.. కానీ ఇప్పుడు నోట్ల రద్దు ప్రభావంతో ఆశ్రమ నిర్వహణ భారంగా మారింది.. దాతల సాయం తగ్గిపోయింది.. ఇన్నాళ్లూ కడుపునిండా అన్నం తిన్న ఆ అనాథలు ఇప్పుడు అర్ధాకలితో అలమటిస్తున్నారు. ఇంకొందరు మంచినీళ్లతోనే కడుపు నింపుకుంటున్నారు! అన్నమో రామచంద్రా..: వీధుల్లో తిరిగే అనాథలు, అభాగ్యులను చేరదీసి మానవతా దృక్పథంతో సేవలందించాలనే లక్ష్యంతో నల్లగొండ జిల్లా సంస్థాన్‌నారాయణపురం మండల కేంద్రానికి చెందిన గట్టుశంకర్ అనే వ్యక్తి చౌటుప్పల్‌లో ‘అమ్మానాన్న’ పేరిట అనాథాశ్రమాన్ని నెలకొల్పాడు. 2010 ఫిబ్రవరి 1న ఇద్దరు అనాథలతో ప్రారంభమైన ఈ ఆశ్రమంలో ఇప్పుడు 388 మంది ఉన్నారు. వీరిలో 320 మంది పురుషులు, 68 మంది మహిళలు. వలిగొండ రోడ్డు సమీపంలో ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో ఈ ఆశ్రమం నడుస్తోంది. వీరికి రోజుకు మూడు పూటలా భోజనం, ఇతర సౌకర్యాలు అందిస్తారు. వారికి వ్యక్తిగత సపర్యలు చేసేందుకు 14 మంది సభ్యులు స్వచ్ఛందంగా పని చేస్తున్నారు. ఇంతవరకు భాగానే ఉన్నా నెల రోజుల నుంచి ఆశ్రమ నిర్వాహణ పూర్తిగా తలకిందులైంది. పెద్ద నోట్లను రద్దు తర్వాత నిధులకు కొరత ఏర్పడింది. దాతలు ముందుకు రాకపోవడంతో మూడు పూటలా భోజనం కాస్తా రెండు పూటలకు కుదించాల్సి వచ్చింది. పరిస్థితి ఇలాగే ఉంటే ఒక్కపూట భోజనం కూడా కష్టంగా మారే పరిస్థితి కనిపిస్తోంది. ఇక వారికి దుస్తులు, దుప్పట్లు కూడా సరిపడా లేవు. కొత్తగా మరో 200 మంది..: అమ్మానాన్న ఆశ్రమం ఇటీవల జీహెచ్ఎంసీతో ఒప్పందం కుదుర్చుకుంది. హైదరాబాద్‌లో ఉన్న అనాథలు, మతిస్థిమితం లేని వ్యక్తులు, అడుక్కుతినే వారిని ఈ ఆశ్రమంలో చేర్చుకునేందుకు మేయర్ బొంతు రామ్మోహన్‌తో ఒప్పందం చేసుకున్నారు. బెగ్గర్‌ఫ్రీ సిటీలో భాగంగా ఈ ఒప్పందం జరిగింది. ఆ క్రమంలో ఇటీవలే 200 మందిని హైదరాబాద్ నుంచి ఇక్కడికి తీసుకు వచ్చారు. అసలే నోట్ల రద్దు ప్రభావంతో ఇబ్బందులు పడుతున్న ఆశ్రమానికి మరో 200 మంది వరకు అదనంగా రావడంతో నిర్వహణ మరింత భారంగా మారింది. పూటకు రూ.8 వేల ఖర్చు: ఆశ్రమంలోని అనాథల భోజనానికి ఒక్క పూటకు రూ.8వేల ఖర్చు వస్తుందని నిర్వాహకులు చెబుతున్నారు. ఇలా మూడు పూటలకు రూ.24 వేల ఖర్చు వస్తుంది. గతంలో ప్రతినెలా 25 మంది దాతలు అన్నదానం నిర్వహించేవారు. కానీ పెద్ద నోట్ల రద్దు తర్వాత ఇప్పటివరకు ఐదుగురు మాత్రమే అన్నదానం చేశారు. దాతలు లేకపోవడంతో నిర్వహణ భారం ఆశ్రమ నిర్వాహకులపైనే పడుతోంది. దీంతో నిర్వాహకులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఆగిపోయిన అన్నపూర్ణ..: ఆశ్రమంలోని 237 మందికి అన్నపూర్ణ పథకం కింద ఒక్కరికి పది కిలోల చొప్పున బియ్యం వచ్చేవి. కానీ రెండు నెలలుగా అవి కూడా రావడం లేదు. ఉమ్మడి నల్లగొండ జిల్లాగా ఉన్నప్పుడు సక్రమంగా అందిన బియ్యం.. విభజన జరగడంతో సాంకేతిక కారణాలతో నిలిచిపోయింది. ప్రస్తుతం బియ్యం సరఫరా జరగాలంటే ఆశ్రమంలోని అనాథలందరికీ ఆధార్ కార్డులు ఉండాలి. ఈ ప్రక్రియ పూర్తయితే గానీ బియ్యం సరఫరా జరిగే అవకాశాలు లేవు. నిబంధనలు కాకుండా సేవాదృక్పథంతో బియ్యం సరఫరాను పునరుద్ధరించాలని పలువురు కోరుతున్నారు. ప్రభుత్వమే ఆదుకోవాలి బెగ్గర్‌ఫ్రీ సిటీలో భాగంగా హైదరాబాద్ నుంచి అనాథలు, మతిస్థితిమితం కోల్పోయిన వ్యక్తులను ఇక్కడికి తీసుకొచ్చాం. జీహెచ్సీం వాళ్లు తోడ్పాటునందిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు పట్టించుకోవడం లేదు. ఆశ్రమంలో భోజనం పెట్టలేని పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలి. లేకుంటే అనాథలు అన్నమో రామచంద్రా అంటూ రోడ్లెక్కే పరిస్థితి నెలకొంటుంది. – గట్టు శంకర్, ఆశ్రమ నిర్వాహకుడు మహిళల సిగపట్లు మూడు రోజుల సెలవుల తర్వాత తెరుచుకున్న బ్యాంకుల వద్ద ఆందోళనకర పరిస్థితులు మొదలయ్యాయి. మంగళవారం వికారాబాద్ జిల్లా బషీరాబాద్‌లోని స్టేట్ బ్యాంకుకు జనం భారీగా వచ్చారు. దీంతో ఖాతాదారుల మధ్య తోపులాట జరిగింది. మహిళల మధ్య మాటా మాటా పెరిగింది. చివరికి కొట్టుకునేదాకా వచ్చింది. నాన్నకు వైద్యం ఎలా..? ‘‘నెల రోజుల కింద మా నాన్న బస్వరాజ్ అనారోగ్యానికి గుర య్యారు. హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లాం. పరీక్షలు చేసి న వైద్యులు గుండెజబ్బు అని చెప్పారు. ఆస్ప త్రి ఖర్చుల కోసం ఆ డబ్బు తీసుకునేందుకు బ్యాంకు దగ్గరికి వచ్చిన. ‘నో క్యాష్’ బోర్డు పెట్టారు. నాన్నకు వైద్యం ఎలా చేయించాలి. – ప్రవీణ్, పాత కోల్కుంద, వికారాబాద్ జిల్లా బ్యాంకు వద్ద తొక్కిసలాట మూడు రోజుల వరుస సెలవుల అనంతరం మంగళవారం నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్‌లోని బ్యాంకుల వద్ద జనం పెద్ద సంఖ్యలో బారులుదీరారు. స్థానిక ఎస్బీహెచ్ వద్ద తీవ్ర తోపులాట జరిగి, ప్రధాన గేటు విరిగిపోయింది. మహిళలకు మొదటి అంతస్తులో చెల్లించడంతో వారు ఇరుకైన మెట్ల మీద గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది. ఓ దశలో తోపులాట, తొక్కిసలాట జరిగి బాబాపూర్‌కు చెందిన లోలపు లక్ష్మి అనే మహిళ సొమ్మసిల్లి పడిపోయింది. దీంతో స్థానికులు ఆమెను సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. బిడ్డ కాన్పుకూ డబ్బుల్లేవు ‘నోట్ల రద్దు’ సమస్య నల్లగొండ జిల్లా శాలిగౌరారం పరిధిలోని జాలోనిగూడానికి చెం దిన చీమల అవిలయ్య అనే సన్నకారు రైతుతో కన్నీరు పెట్టించింది. ఆయన చిన్న కుమార్తె నిండు గర్భిణి. సోమవారం పురిటినొప్పులు రావడంతో నార్కట్‌పల్లిలోని ఓ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, హైదరాబాద్‌కు తరలించాలని సూచించారు. అయితే చేతిలో డబ్బుల్లేక ఏం చేయాలో తెలియని స్థితి పడిపోయాడు. కొందరు బంధువుల సూచన మేరకు నల్లగొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి ఆమెను తరలించినా.. ముందుగా రూ.20 వేలు కట్టాలన్నారు. సోమవారం సెలవు కావడంతో అవిలయ్య మంగళవారం డబ్బు తీసుకునేందుకు బ్యాంకుకు వెళితే.. ‘నో క్యాష్’ బోర్డు వెక్కిరించింది. దీంతో బోరుమన్న అవిలయ్య చివరికి డబ్బులను ఆస్పత్రి ఖాతాలోకి ట్రాన్స్ఫర్ చేయిస్తానంటూ నిర్వాహకులను బతిమాలుకుని, వైద్యం చేయాల్సిందిగా ఒప్పించాడు. ఇంత అవస్థలోనూ.. పెద్దపల్లి జిల్లా మారేడుగొండకు చెందిన సిరిసేటి కనకమ్మకు కిడ్నీలు పాడయ్యాయి.. నాలుగు రోజులకోసారి డయాలసిస్ చేయిస్తేనే బతుకుతుంది.. బ్యాంకులో డబ్బులున్నా చేతిలో చిల్లిగవ్వ లేదు.. దీంతో డబ్బును విత్‌డ్రా చేసుకునేందుకు మంగళవారం పెద్దపల్లిలోని ఎస్బీహెచ్ (ఏడీబీ) బ్రాంచికి వచ్చింది. నాలుగు గంటలపాటు క్యూలో నిలుచుంది. తర్వాత పక్కనే బల్లపై కూలబడింది. చివరికి తన వంతు వచ్చినా రూ.2 వేల కంటే ఎక్కువ ఇవ్వలేమని బ్యాంకు సిబ్బంది స్పష్టం చేశారు. ఈ విషయం తెలిసిన ‘సాక్షి’ సిబ్బంది, స్థానికులు కలసి ఆ మహిళ దయనీయ స్థితిని బ్యాంకు మేనేజర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఖాతాలో ఉన్న రూ.30 వేలలోంచి రూ.15 వేలు చెల్లించారు. సుధీర్‌బాబుపై సస్పెన్షన్ సాక్షి, హైదరాబాద్: పోస్టల్ శాఖలో పెద్ద నోట్ల మార్పిడి అభియోగాలపై సీబీఐ అరెస్ట్ చేసిన హైదరాబాద్ సిటీ రీజియన్ సీనియర్ సూపరిం టెండెంట్ సుధీర్‌బాబుపై కేంద్ర తపాలా శాఖ డైరెక్టరేట్ సస్పెన్షన్ వేటు వేసింది. ఈ మేరకు మంగళవారం తపాలా శాఖాధికారులు చంచల్ గూడ జైలులో రిమాండ్‌లో ఉన్న సుధీర్ బాబుకు సస్పెన్షన్ మెమో ప్రతిని అందిం చారు. ఇప్పటికే తపాలా శాఖాధికారులు హిమాయత్‌నగర్ సబ్ పోస్ట్ మాస్టర్ జి.రేవతి తో పాటు ఆఫీస్ అసిస్టెంట్ రవితేజలను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. -
‘పోస్టల్ స్కామ్’లో మరో ఇద్దరి అరెస్టు
జ్యుడీషియల్ రిమాండ్‌కు సుధీర్‌బాబు సాక్షి, హైదరాబాద్: ‘నగదు మార్పిడి’ని క్యాష్ చేసుకున్న పోస్టల్ శాఖ అధికారి, సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్టాఫీసెస్ (ఎస్‌ఎస్‌పీఓఎస్) కె.సుధీర్ బాబుకు దళారులుగా వ్యవహరించిన ఇద్దరిని సీబీఐ అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు. కొన్ని రోజులుగా పరారీలో ఉన్న సుధీర్ గురువారం లొంగిపోయిన విషయం విదితమే. ఇతడిని అరెస్టు చేసిన సీబీఐ అధికారులు పలు కోణాల్లో ప్రశ్నించారు. లా విద్యార్థి టి.నితిన్, కొద్దికాలం ఆస్ట్రేలియాలో ఉండి వచ్చిన వి.నర్సింహ్మారెడ్డి తమ దందాలో దళారులుగా వ్యవహరించినట్లు బయటపెట్టాడు. దీంతో వీరిద్దరినీ సీబీఐ అరెస్టు చేసింది. హిమాయత్‌నగర్, కార్వాన్, గోల్కొండ పోస్టాఫీసులు కేంద్రంగా రూ.2.95 కోట్ల నగదు అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లినట్లు అధికారులు గుర్తించారు. సుధీర్ దళారుల సాయంతో కొందరు వ్యాపారులు, బడా బాబుల నుంచి కమీషన్ తీసుకుని వారి పాత కరెన్సీని మార్చి ఇచ్చినట్లు సీబీఐ అధికారులు తేల్చారు. దళారులుగా వ్యవహరించిన వారికీ సుధీర్‌బాబు కమీషన్ ఇచ్చినట్లు గుర్తించారు. సూత్ర ధారుల్ని గుర్తించడం కోసం దర్యాప్తు ముమ్మరం చేశారు. సుధీర్‌బాబును శుక్రవారం న్యాయస్థానంలో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. లోతుగా విచారించడం కోసం న్యాయస్థానం అనుమతితో కస్టడీలోకి తీసుకోవాలని నిర్ణయించారు. -
సుధీర్‌బాబే సూత్రధారి!
మూడు పోస్టాఫీసుల్లో ‘నోట్ల మార్పిడి’ అవకతవకలు గుర్తింపు - రూ.2.95 కోట్లు పక్కదారి పట్టినట్లు ఆధారాలు - నిందితుల జాబితాలో ఆరుగురు ఉద్యోగులు - నలుగురిని అరెస్టు చేసిన సీబీఐ అధికారులు - విజిలెన్స్ ను రంగంలోకి దింపిన తపాలా శాఖ - రాష్ట్రవ్యాప్తంగా పోస్టాఫీసుల్లో తనిఖీలు సాక్షి, హైదరాబాద్: ‘నోట్ల మార్పిడి’ని సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్టాఫీసెస్ (ఎస్‌ఎస్‌పీఓఎస్) కె.సుధీర్‌బాబు భారీగా సొమ్ము చేసుకున్నట్లు తేలింది. హైదరాబాద్ లోని 3 పోస్టాఫీసులు కేంద్రంగా జరిగిన రూ. 2.95 కోట్ల అవకతవకలకు ఆయనే సూత్ర ధారి అని గుర్తించారు. సుధీర్‌బాబు మరో ఐదుగురు పోస్టల్ ఉద్యోగులతో కలసి అక్రమాలకు పాల్పడినట్లు వెల్లడైంది. ఈ వ్యవ హారంపై 3 కేసులు నమోదు చేసి దర్యాప్తు చేప ట్టిన సీబీఐ.. బుధవారం నలుగురు పోస్టల్ అధికారులు/ఉద్యోగులను అరెస్టు చేసింది. మూడు కేసులు.. ‘బడా బాబు’లకు చెందిన నల్లధనాన్ని తెల్లధ నంగా మార్చిన ఈ వ్యవహారంలో సుధీర్ బాబుతో పాటు అబిడ్స జీపీఓలో క్యాష్ ఓవర్ సీర్గా పనిచేసే సయ్యద్ ఎతేషుద్దీన్, ఎస్ఎస్ పీఓఎస్ కార్యాలయం ఆఫీస్ అసిస్టెంట్ జి. రవితేజ కీలకపాత్ర పోషించారని సీబీఐ గుర్తిం చింది. మూడు పోస్టాఫీసుల ద్వారా సాగిన ఈ వ్యవహారాలకు సంబంధించి ఆర్సీ నం.24 (ఎ)/2016, ఆర్సీ నం.27(ఎ)/2016, ఆర్సీ నం.28(ఎ)/2016 కింద కేసులు నమోదు చేసింది. నిందితులపై కుట్ర, మోసం, నమ్మక ద్రోహం, ప్రభుత్వ ఉద్యోగి ద్వారా నమ్మక ద్రోహం, ఖాతాలు/పుస్తకాలను తారుమారు చేయడం తదితర ఆరోపణలు చేసింది. ఈ వ్యవహారంలో మరికొందరు ప్రభుత్వ ఉద్యో గులకు, ప్రైవేట్ వ్యక్తులకు ప్రమేయమున్నట్లు అనుమానిస్తున్నామని పేర్కొంది. ఎవరి నగదును ఈ రకంగా అక్రమ మార్పిడి చేశా రనే అంశంపై లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు సీబీఐ అధికారులు పేర్కొన్నారు. పోస్టాఫీసులకు చేరకముందే.. నోట్ల మార్పిడి కోసం జీపీఓలోని పోస్టల్ ట్రెజరీ కార్యాలయం ఎస్‌ఎస్‌పీఓఎస్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్‌కు రోజూ కొంత మొత్తంలో రూ.2 వేల నోట్లను మంజూరు చేస్తోంది. జీపీఓలో ఉన్న పోస్టల్ ట్రెజరీ కార్యాలయంలో క్యాష్ ఓవర్సీర్గా పనిచేసే సయ్యద్ ఎతేషుద్దీన్ ఎస్ఎస్పీఓఎస్కు కొత్త నోట్లు పంపిస్తారు. వీటిని ఎస్‌ఎస్‌పీఓఎస్‌గా ఉన్న సుధీర్‌బాబు తన అధీనంలోని 11 సబ్ పోస్టాఫీసులకు రవితేజ ద్వారా సరఫరా చేరుుస్తారు. అరుుతే ఈ క్రమంలో హిమాయత్‌నగర్ సబ్ పోస్టాఫీ స్ ద్వారా రూ.36 లక్షలు, గోల్కొండ సబ్ పోస్టాఫీస్ ద్వారా రూ.1.39 కోట్లు, కార్వాన్ సబ్ పోస్టాఫీస్ ద్వారా రూ.1.39 కోట్లు పక్కదారి పట్టినట్లు సీబీఐ గుర్తించింది. కొత్త రూ.2 వేల నోట్లు సబ్ పోస్టాఫీసులకు చేరకుండానే సుధీర్‌బాబు వాటిని పాత నోట్లతో మార్చేవాడని దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఆ మూడు పోస్టాఫీసుల్లో సబ్ పోస్టుమాస్టర్స్గా పనిచేస్తున్న జి.రేవతి (హిమాయత్‌నగర్), ఎం.గోవిందరావు (గోల్కొండ), పి.సంపత్‌కుమార్ (కార్వాన్) ఈ అక్రమాలకు సహకరించారని తేల్చి.. వారిని ఈ కేసుల్లో నిందితులుగా చేర్చారు. రికార్డులు మార్చి చూపే యత్నం సుధీర్‌బాబు ఆదేశాల మేరకు రవితేజ ద్వారా అందుకున్న పాత నోట్లను సాధారణ ప్రజల నుంచి ‘మార్పిడి’ ద్వారా తీసుకున్నట్లు రికార్డులు రూపొందించేందుకు పోస్టల్ అధికారులు సిద్ధమయ్యారని సీబీఐ గుర్తిం చింది. ఈ వ్యవహారంలో పోస్టల్ ఉద్యోగులు అబ్దుల్ ఘనీ, కె.సురేష్‌కుమార్, జి.శ్రీనివా స్‌లకు ప్రమేయం ఉన్నట్లు గుర్తించింది. మొత్తంగా ఈ అక్రమాలను వెలికితీయడానికి పోస్టాఫీసులు, నిందితుల ఇళ్ళతో సహా మొత్తం 11 ప్రాంతాల్లో సీబీఐ అధికారులు దాడులు చేశారు. మొబైల్ ఫోన్లు, ల్యాప్ టాప్స్, డాక్యుమెంట్లతో పాటు రూ.17.02 లక్షల విలువైన కొత్త రూ.2 వేల నోట్లు స్వాధీనం చేసుకున్నారు. షేక్ అబ్దుల్ ఘనీ, జి.రవితేజ, కె.సురేష్‌కుమార్, జి. శ్రీనివా స్లను బుధవారం అరెస్టు చేశారు. ఇంటిదొంగల గుట్టు సీబీఐకి.. రద్దయిన నోట్లను దర్జాగా కొందరు తపాలా కార్యాలయాల ద్వారా మార్పిడి చేసుకోగలిగారు. కొందరు తపాలా శాఖ అధికారులు, ఉద్యోగులు కమీషన్లకు కక్కుర్తిపడి ‘నల్ల ధనికుల’కు సహ కరించిన విషయాన్ని సీబీఐ గుర్తించింది. దీంతో మేల్కొన్న తపాలాశాఖ స్వయంగా ఇంటిదొంగలను పట్టుకోవా లని నిర్ణరుుంచి, విజిలెన్సను రంగంలోకి దింపింది. నోట్ల రద్దు తర్వాత పెద్ద సంఖ్యలో డిపాజిట్లు వచ్చిన పోస్టాఫీ సులు, భారీగా నగదు మార్పిడి జరిగిన పోస్టాఫీసులను గుర్తించి తనిఖీలు చేస్తున్నారు. హైదరాబాద్‌లో 30 పోస్టాఫీసుల్లో తనిఖీలు చేయగా.. పలు చోట్ల అక్ర మాలు జరిగినట్టు తెలిసింది. ఈ వివరా లను వెంటనే సీబీఐకి అందజేయగా.. సీబీఐ చర్యలు ప్రారంభించింది. ఇక జిల్లా ల్లోనూ విజిలెన్స తనిఖీలు జరుగుతు న్నారుు. మరో రెండురోజుల్లో అవి పూర్తవుతాయని, అక్రమాలు వెలుగు చూస్తే ఆ వివరాలను కూడా సీబీఐకి అందిస్తామని తపాలాశాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. -
సుధీర్‌బాబు సైతం...
సమస్యల్లో చిక్కుకుని, వాటి నుండి బయటకు రాలేక జీవన పోరాటం చేస్తున్న నిస్సహాయులను ఆదుకుంటోంది ‘మేము సైతం’. ఈ కార్యక్రమం ద్వారా తెలుగు సినిమా తారలు జెమినీ టీవీలో చేస్తున్న వినూత్న సేవ అందర్నీ ఆకట్టుకుంటోంది. ఈ వారం హీరో సుధీర్‌బాబు గెస్ట్‌గా వచ్చి నిస్సహాయులకు సేవ చేయబోతున్నారు. బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న కన్నకొడుకును కాపాడడం కోసం చికిత్సకి ఉన్నదంతా పెట్టినా సరిపోక కొడుకును ఎలా కాపాడు కోవాలో తెలియక దయనీయ పరిస్థితిలో ఉన్న సత్యనారాయణని ఆదుకోవడం కోసం హీరో సుధీర్‌బాబు బేకరీలో పని చేయబోతు న్నారు చిన్నారిని కాపాడడం కోసం సుధీర్ బాబు చేస్తున్న ఈ సేవ ఈ శనివారం రా.9:30ని.లకు జెమినీలో ప్రసారం కానుంది. -
ఇప్పుడు ప్రేమకథల స్వరూపం మారిపోయింది - దాసరి
‘‘ఒకప్పుడు ప్రేమకథలంటే ప్రేమ గొప్పదనాన్ని తెలియచెప్పేవిగా ఉండేవి. కానీ, ఇప్పుడా పరిస్థితి లేదు. ప్రస్తుతం ప్రేమకథల స్వరూపం మారిపోయింది. ఇప్పుడు ప్రేమకథల పేరుతో కామ కథలను తీస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో లగడపాటి శ్రీధర్ ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ వంటి ప్రేమ గొప్పదనం తెలియజెప్పే సినిమా తీశారు. విడుదలకు ముందే ఈ చిత్రం చూసి, సూపర్‌హిట్ అవుతుందని చెప్పాను’’ అని దాసరి నారాయణరావు చెప్పారు. సుధీర్‌బాబు, నందిత జంటగా చంద్రు దర్శకత్వంలో లగడపాటి శ్రీధర్ నిర్మించిన ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ చిత్రం ఇటీవల జైపూర్‌లో జరిగిన చలన చిత్రోత్సవాల్లో ‘బెస్ట్ రొమాంటిక్ ఫిల్మ్’ అవార్డును గెలుచుకుంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో దాసరి నారాయణరావు ఈ చిత్రబృందాన్ని అభినందించారు. హిందీలో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని లగడపాటి శ్రీధర్ తెలిపారు. ఈ సమావేశంలో నటులు సుధీర్‌బాబు, గిరిబాబు, దర్శకులు చంద్రు, ఎన్. శంకర్, నీలకంఠ తదితరులు మాట్లాడారు. -
కృష్ణవంశీ తర్వాత నువ్వే అన్నారు!
సినిమా డెరైక్టర్ కావాలనుకుని బంగారంలాంటి జాబ్ వదిలేసుకున్నాడు శ్రీరామ్ ఆదిత్య. తండ్రి కూడా ఫుల్ సపోర్ట్. దాంతో తాను రాసుకున్న కథతో ఏడాది పాటు ఇండస్ట్రీ అంతా తిరిగాడు. చివరకు ఓ మంచి రోజున విజయ్, శశిధర్‌లను కలిశాడు. కట్ చేస్తే... ‘భలే మంచి రోజు’ సినిమాకు డెరైక్టర్ అయిపోయాడు. సుధీర్‌బాబు హీరోగా రూపొందిన శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం మొన్న శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా ఈ దర్శకుడి మనోభావాలు... సినిమా చూసి మా అమ్మా, నాన్న ఎగ్జైట్ అయ్యారు. ‘చాలా బాగా తీశావ్‌రా’ అని నాన్న హగ్ చేసుకున్నారు. నేను పుట్టింది, పెరిగింది హైదరాబాద్‌లోనే. మెకానికల్ ఇంజినీరింగ్ చేశాను. నాకు డెరైక్షన్ అంటే ఇష్టం. అందుకే ఫేస్బుక్, గూగూల్లో పని చేస్తున్నప్పుడు కథలు రాసుకున్నాను. జాబ్ చేస్తూనే ఓ ఎనిమిది షార్ట్ ఫిలింస్ చేశాను. వాటిలో ఒకదానికి ఇంటర్నేషనల్ అవార్డు వచ్చింది. చివరకు జాబ్ మానేసి, డెరైక్షన్ ట్రై చేశా. ఒక విభిన్న చిత్రం చేయాలనే ఆలోచనతో ‘భలే మంచి రోజు’ కథ రాసుకున్నాను. ఒక్క రోజులో జరిగే కథ కావడంవల్ల స్క్రీన్‌ప్లే పకడ్బందీగా ఉండాలి. ఈ కథ వినగానే సుధీర్‌బాబుతో చేద్దామని విజయ్ అన్నారు. సుధీర్‌బాబు ఈ చిత్రానికి పర్ఫెక్ట్ అనిపించింది. నేను చేసిన షార్ట్ ఫిలింస్ చూసి ఆయన అవకాశం ఇచ్చారు. నా అదృష్టం కొద్దీ మంచి నటీనటులు, సాంకేతిక నిపుణులు కుదిరారు. పరుచూరి గోపాలకృష్ణగారైతే ‘కృష్ణవంశీ తర్వాత నటీనటుల నుంచి ఆ స్థాయిలో నటన రాబట్టుకున్నది నువ్వే’ అన్నారు. ఈ చిత్రంలో ఐశ్వర్య పాత్ర అభ్యంతరకరంగా ఉందనే మాటలు వినిపిస్తున్నాయి. ఆ పాత్ర మాట్లాడిన కొన్ని డైలాగ్స్ తీసివేశాం. అందుకే వల్గర్‌గా అనిపిస్తోంది. ఆ డైలాగ్స్ వినిపించి ఉంటే, అలా అనిపించి ఉండేది కాదు. ప్రస్తుతం నా దగ్గర నాలుగైదు కథలు ఉన్నాయి. నా తదుపరి చిత్రం గురించి ఇంకా ఏమీ ఆలోచించలేదు. అందుకని ఏ కథతో సినిమా చేస్తాననేది ఇప్పుడే చెప్పలేను. -
ఒక్క హిట్ వస్తే మా బావ స్టారే!
‘‘కొన్ని రోజుల ముందు యూట్యూబ్‌లో టీజర్ చూశా. కొత్తగా ఉందనిపించింది. ఇప్పుడు ప్రచార చిత్రం చూశా. బాగా నచ్చింది. ఇవాళ ప్రేక్షకులు కొత్తదనాన్నే కోరుకుంటున్నారు’’ అని హీరో మహేశ్‌బాబు అన్నారు. సుధీర్‌బాబు, వామిక జంటగా 70ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో విజయ్‌కుమార్, శశిధర్ నిర్మించిన చిత్రం ‘భలే మంచి రోజు’. సన్నీ ఎం.ఆర్. స్వరపరచిన ఈ చిత్రం పాటల సీడీని మహేశ్‌బాబు ఆవిష్కరించి హీరో రానాకు అందించారు. ఈ సందర్భంగా మహేశ్ మాట్లాడుతూ -‘‘చిత్ర దర్శకుడి కాన్ఫిడెన్స్ నచ్చింది. సుధీర్‌ను అందరూ సపోర్ట్ చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. సుధీర్ అంటే నాకు ఇష్టం. ఎందుకంటే హార్డ్ వర్కింగ్ పర్సన్. ఒక మంచి హిట్ పడితే, స్టార్ అయిపోతాడు. ఈ సినిమాతో ఆ హిట్ వస్తుందని అనుకుంటున్నా’’ అని అన్నారు. ‘‘ఈ సినిమా రిలీజ్ రోజున ప్రేక్షకులకు ‘భలే మంచి రోజు’ అవుతుంది’’ అని రానా వ్యాఖ్యానించారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘సినిమా చేయడం అనే నా కల ఈ చిత్రంతో తీరింది. నేనీ రోజు ఇక్కడ ఉన్నానంటే కారణం నా తల్లిదండ్రులే. యూనిట్ అందరం ఇష్టపడి చేసిన సినిమా ఇది’’ అన్నారు. హీరో సుధీర్‌బాబు, పరుచూరి గోపాలకృష్ణ పాల్గొన్న ఈ కార్యక్రమంలో అతిథులుగా రెజీనా, సందీప్ కిషన్, ‘దిల్’ రాజు, లగడపాటి శ్రీధర్, అనిల్ సుంకర, దేవా కట్టా, శ్యామ్‌దత్ తదితరులు పాల్గొన్నారు. -
మహేశ్ ఏది ఫీలైతే... అదే చెబుతాడు!
సుధీర్‌బాబు... హీరో కృష్ణ గారి అల్లుడు. మహేశ్‌బాబుకు బావ. క్రీడాకారుడిగా మొదలై కథానాయకుడిగా వెండితెర మీదకు నడిచొచ్చారు. సినిమా వెంట సినిమాగా ఒక్కో మెట్టూ పెకైక్కుతూ వస్తున్న సుధీర్‌బాబు ‘ప్రేమకథా చిత్రమ్’ నుంచి ఇటీవలి ‘మోసగాళ్ళకు మోసగాడు’ దాకా ప్రేక్షకులకు సుపరిచితులు. తాజాగా ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ...’ సినిమాతో ఈ శుక్రవారం జనం ముందుకొస్తున్న సుధీర్‌తో కాసేపు... ** కృష్ణగారు, మహేశ్‌బాబు మీకు మంచి కేరాఫ్ అడ్రస్‌లా, సినిమా రంగంలోకి రావడానికి విజిటింగ్ కార్డ్‌లా ఉపయోగపడ్డారనుకోవచ్చా? అడ్రస్, విజిటింగ్ కార్డ్ సంగతి పక్కన పెడితే, నేను మైనస్‌తో నా కెరీర్ మొదలుపెట్టాను. హీరో కావాలనుకున్న తర్వాత అవకాశాల కోసం రెండేళ్లు తెగ తిరిగాను. ‘కృష్ణ గారి అల్లుణ్ణి, మహేశ్ బావను’ అని చెప్పుకుని అవకాశాలు తెచ్చుకోవాలనుకోలేదు. వాస్తవానికి నా మొదటి సినిమాకు నేనే డబ్బులు పెట్టాను. ‘కృష్ణగారి అల్లుడట, మహేశ్‌బాబు బావ అట..’ అని అభిమానులు థియేటర్‌కు వచ్చారు. ఆ అభిమానం నాకు ప్లస్ అయ్యింది. అవకాశాలు తెచ్చుకోవడానికీ, నిలదొక్కువడానికీ నా కష్టమే నాకు ఉపయోగపడింది. ** బయటి హీరోలకు మహేశ్ నుంచి గట్టి పోటీ ఉంది! మీకేమో ఇంటి నుంచే పోటీ ఉంది? మహేశ్‌ది వేరే ట్రాక్. నాది వేరే ట్రాక్. నేను అప్ కమింగ్ హీరో. కొంచెం గుర్తింపు తెచ్చుకుని, ఇలా నిలదొక్కుకోవడానికి చాలా కష్టపడ్డాను. ఇప్పుడు 20, 30 మంది హీరోలున్నారు. పోటీ బలంగానే ఉంది. తట్టుకోవడానికి ఎంత కష్టపడాలో అంతా పడతాను. ** మామూలుగా మీరు యాక్ట్ చేసే ఏ సినిమానైనా మహేశ్‌బాబు చూస్తారేమో! మరి.. ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ చూశారా? ఇంకా చూడలేదు. నేను యాక్ట్ చేసే ప్రతి సినిమా మహేశ్ చూస్తాడని చెప్పలేం. టైమ్ కుదిరితే మాత్రం తప్పకుండా చూస్తాడు. ** మహేశ్ తన చెల్లెలు ప్రియదర్శిని (సుధీర్‌బాబు భార్య) సంతృప్తి కోసం మీ సినిమాలు బాగుంటాయంటారా, లేక నిజంగా నచ్చితేనే? ముఖస్తుతి కోసం, ఒకరిని సంతృప్తిపరచడం కోసం నా సినిమాలు బాగున్నాయని మహేశ్‌బాబు చెప్పడు. నిజంగా నచ్చితే అప్పుడు ఎవరూ అడగకుండానే చెబుతారు. ఒకవేళ నచ్చకపోతే మాత్రం మా మామగారు (సూపర్ స్టార్ కృష్ణ) నచ్చిందని చెప్పమన్నా చెప్పడు. లోపల ఏది ఫీలైతే అదే బయటకు చెబుతాడు. ** ప్రస్తుతం చేసిన ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ చిత్రం గురించి ఏం చెబుతారు? ఇది కన్నడ చిత్రం ‘చార్మినార్’కు రీమేక్. ఈ రీమేక్‌కి లగడపాటి శ్రీధర్ నన్ను హీరోగా తీసుకోవడం నాకు ఆనందంగా ఉంది. సినిమా మీద అపారమైన ప్రేమ, మంచి సినిమా తీయాలనే తపన ఉన్న వ్యక్తి శ్రీధర్. ‘చార్మినార్’ గురించి చెప్పగానే, నేనా సినిమా చూడననీ, కథ చెప్పమనీ అడిగాను. కథ నాకు బాగా నచ్చి, ఒప్పుకున్నాను. కన్నడంలో తీసిన చంద్రు దర్శకత్వంలోనే ఈ చిత్రం రూపొందింది. ** ఈ కథలో మీకు సవాల్ అనిపించినదేంటి? పదహారేళ్ల కుర్రాడిగా, ఇరవై రెండేళ్ల యువకుడిగా, ముప్ఫయ్యేళ్ల వ్యక్తిగా నటించాను. టీనేజ్ కుర్రాడిగా కనిపించడం కోసం కొంచెం బరువు తగ్గాను. ఆ వయసులో అమాయకంగా కనిపించాలి కదా... అందుకు తగ్గట్టుగా బాడీ లాంగ్వేజ్ మార్చుకున్నాను. నటుడిగా నాకు సంతృప్తినిచ్చిన చిత్రం ఇది. ** ఈ చిత్రంలో మీ అబ్బాయి నటించాడట? లేదు. శ్రీధర్గారబ్బాయి యాక్ట్ చేశాడు. మావాడు ‘మోసగాళ్లకు మోసగాడు’లో చేశాడు. ఇప్పుడు నాని సినిమాలో చేస్తున్నాడు. ** మీ అబ్బాయి పేరేంటి? పిల్లాణ్ణి కూడా హీరోని చేయాలనుకుంటున్నారా? (నవ్వుతూ...) మా వాడి పేరు చర్విత్ మానస్. వాడికి ఏడేళ్లు. యాక్టింగ్ అంటే చాలా ఇంట్రస్ట్. నన్ను చూసి, జిమ్నాస్టిక్స్ చేస్తున్నాడు. వాడు చేసేవి నేను కూడా చేయలేను. వాళ్ల మామయ్య (మహేశ్) సినిమాలు చూస్తుంటాడు. బహుశా యాక్టింగ్ మీద ఇంట్రస్ట్ కలగడానికి వాళ్ళ మేనమామ మహేశే ఇన్స్పిరేషన్ ఏమో! ** ఇంతకీ మీరు మీ మామయ్య కృష్ణగారితో ఎప్పుడు నటిస్తారు? మంచి కథ కుదిరితే నాకు నటించాలనే ఉంది. ఎందుకంటే, మా కుటుంబంలో రమేశ్‌బాబు, మహేశ్, నా భార్య ప్రియదర్శిని, మంజుల, ఆమె భర్త సంజయ్... ఇలా అందరికీ మామయ్యగారితో కలిసి నటించే అవకాశం దక్కింది. నాక్కూడా ఓ చాన్స్ వస్తే ఆనందిస్తా. ** మీ ఆవిడ యాక్ట్ చేశారా? ఎప్పుడు? చిన్నప్పుడు మామయ్యగారి సినిమాల్లో నటించింది. ** మీ తదుపరి చిత్రాల సంగతులేమిటి? నూతన దర్శకుడు శ్రీరామ్‌తో ఓ సినిమా చేస్తున్నా. దీనికి వర్కింగ్ టైటిల్‌గా ‘భలే మంచి రోజు’ అనుకుంటున్నాం. హిందీ చిత్రం ‘భాగీ’లో నటిస్తున్నా. ఇది ఏ సినిమాకీ రీమేక్ కాదు. ఓ ట్రయాంగిల్ లవ్‌స్టోరీ. నేను, టైగర్ ష్రాఫ్, శ్రద్ధాకపూర్ ముఖ్య పాత్రలు చేస్తున్నాం. -
ఆ కథతో ప్రేమలో పడ్డా!
‘‘కన్నడంలో రూపొందిన ‘చార్మినార్’ చిత్రం చూడగానే, ఆ కథతో ప్రేమలో పడిపోయా. అందుకే తెలుగు పునర్నిర్మాణ హక్కులు పొందాను. కన్నడ చిత్రానికి దర్శకత్వం వహించిన చంద్రూతోనే తెలుగు రీమేక్ రూపొందించాను. అసభ్యతకు తావు లేని చిత్రం ఇది. సుధీర్‌బాబు, నందితల నటన ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఇది కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం. పాటలకు మంచి స్పందన లభిస్తోంది. ఈ 19న విడుదల చేసే ఈ చిత్రానికి కూడా మంచి ప్రేక్షకాదరణ లభిస్తుందనే నమ్మకం ఉంది’’ అని లగడపాటి శ్రీధర్ అన్నారు. సుధీర్‌బాబు, నందిత జంటగా ఆర్. చంద్రు దర్శకత్వంలో శ్రీమతి లగడపాటి శిరీషా శ్రీధర్ నిర్మించిన చిత్రం ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’. గురువారం హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ - ‘‘కన్నడంలో ఇప్పటివరకూ నేను రూపొందించిన ఎనిమిది సినిమాలూ మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. తెలుగులో నాకిది తొలి చిత్రం. నా జీవితంలో జరిగిన ఓ సంఘటన ఆధారంగా చేసిన చిత్రం ఇది’’ అని తెలిపారు. యువతకు ఈ చిత్రం ఓ గైడ్లాంటిదని రచయిత సాయినాథ్ అన్నారు. తన కెరీర్లో ఇది మంచి సినిమాగా నిలిచిపోతుందని నందిత చెప్పారు. -
పోలీస్ కమిషనర్‌గా సుధీర్‌బాబు
- జనవరిలో ఏర్పాటైన కమిషనరేట్ - తాజాగా కమిషనర్ నియామకం - త్వరలో మొదలుకానున్న పాలన - మామునూరుకు తరలనున్న రూరల్ విభాగం - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం - మూడు రోజుల్లో విధుల్లో చేరుతా : సుధీర్‌బాబు సాక్షి, హన్మకొండ : వరంగల్ నగర పోలీస్ కమిషనర్‌గా సుధీర్‌బాబును నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. వరంగల్ పోలీస్ కమిషనర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టబోతున్న సుధీర్‌బాబు 2001 బ్యాచ్‌కు చెందిన అధికారి. హైదరాబాద్ నార్త్‌జోన్ డీసీపీగా ఇప్పటి వరకు పని చేశారు. ఆయనకు డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా పదోన్నతి కల్పిస్తూ వరంగల్ కమిషనర్‌గా నియమిస్తున్నట్లు ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పోలీస్ శాఖ పరంగా వరంగల్ అర్భన్ జిల్లా ఉన్న ప్రాంతాన్ని వరంగల్ పోలీస్ కమిషరేట్‌గా వ్యవహరిస్తు రాష్ట్ర ప్రభుత్వం 2015 జనవరిలో ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవలే న్యాయపరమైన కార్యక్రమాలు పూర్తికావడంతో వరంగల్ నగర పోలీస్ కమిషనర్‌గా సుధీర్‌బాబును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కొది రోజుల్లోనే వరంగల్ నగరంలో కమిషనరేట్ అమల్లోకి రానుంది. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్, సైబరాబాద్‌ల తర్వాత మూడో పోలీస్ కమిషనరేట్‌గా వరంగల్ నగరం ఏర్పాటు కానుంది. త్వరలో కమిషనరేట్ ఏర్పాటు కానుండటంతో ఇప్పటివరకు పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో కొనసాగిన వరంగల్ రూరల్ పోలీస్ విభాగం మామూనూరు బెటాలియన్‌కు మారుతుంది. వరంగల్ పోలీస్ కమిషనర్‌గా సుధీర్‌బాబును నియమించడంతో త్వరలోనే కమిషనరేట్ పరిపాలన మొదలుకానుంది. -
మాయదారి మల్లిగాడితో రొమాన్స్
‘సీమ టపాకాయ్’, ‘అవును’ తదితర చిత్రాల్లో నటించి తెలుగులో క్రేజీ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న పూర్ణ, సుధీర్‌బాబుకి జోడీగా చేయబోతున్నారు. ‘మాయదారి మల్లిగాడు’ పేరుతో రూపొందనున్న ఈ చిత్రం షూటింగ్ ఈ నెల 28న మొదలు కానుంది. హనుమ ముప్పరాజు దర్శకత్వంలో యం.రేవన్‌కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ప్రేమ, సెంటిమెంట్, యాక్షన్ కలబోతతో పూర్తిస్థాయి వినోదభరితంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతామని దర్శకుడు చెప్పారు. ఈ చిత్రంలో సుధీర్‌బాబు, పూర్ణల రొమాన్స్ ఆకట్టుకుంటుందని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: రతన్, కెమెరా: బీఎల్ సంజయ్. -
టైటిలే చెబుతోంది ఆడేంటో!
‘ప్రేమకథా చిత్రమ్’ విజయం తర్వాత సుధీర్‌బాబు చేస్తున్న చిత్రం ‘ఆడు మగాడ్రా బుజ్జి’. కృష్ణారెడ్డి గంగదాసు దర్శకుడు. ఎస్.ఎన్.ఆర్.ఫిలిమ్స్ ఇండియా, కలర్స్ అండ్ క్లాప్స్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్త నిర్మాణంలో సుబ్బారెడ్డి, ఎస్.ఎన్.రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘టైటిల్ బట్టే ఈ సినిమా ఎంత శక్తివంతంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. హీరోగా సుధీర్‌బాబు రేంజ్‌ని పెంచే సినిమా ఇది’’ అని చెప్పారు. నిర్మాతలు మాట్లాడుతూ -‘‘ఆద్యంతం నవ్వించే యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. ఒక్క పాట మినహా చిత్రీకరణ పూర్తయింది. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నెలలో పాటలను, వచ్చే నెలలో చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: శాంటోనియో ట్రెజియో, సహనిర్మాత: సుభాష్‌చంద్ర ఆకుల. -
సుధీర్‌బాబు రిస్కీ ఫైట్స్!
ఎస్ఎమ్ఎస్, ప్రేమకథా చిత్రమ్ అంటూ క్యూట్ రొమాంటిక్ ఎంటర్టైనర్స్లో నటించిన సుధీర్‌బాబు ఈసారి ‘ఆడు మగాడ్రా బుజ్జి’ అనే యాక్షన్ ఓరియంటెడ్ మూవీలో నటిస్తున్నారు. కృష్ణారెడ్డి గంగదాసు దర్శకత్వంలో కలర్స్ అండ్ క్లాప్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సుబ్బారెడ్డి, ఎస్.ఎన్. రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రెండు పాటలు మినహా సినిమా పూర్తయ్యింది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ - ‘‘సుధీర్‌బాబు నటన, డాన్స్, ఫైట్స్ హైలైట్‌గా నిలుస్తాయి. శ్రీ కోటి ఇచ్చిన పాటలు ఓ ఎస్సెట్ అవుతాయి. కుటుంబం అంతా ఎంజాయ్ చేయదగ్గ సినిమా ఇది’’ అని చెప్పారు. నిర్మాతలు మాట్లాడుతూ - ‘‘రిస్కీ ఫైట్స్‌ని సుధీర్‌బాబు సునాయాసంగా చేశారు. ఈ చిత్రానికి ప్రధాన బలం కథ. దర్శకుడు అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. వచ్చే నెల మొదటి వారంలో పాటలను, నెలాఖరున సినిమాని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: శాంటోనియో ట్రెజియో, సహనిర్మాత: సుభాష్ చంద్రబోస్.