మహిళాపోలీస్‌స్టేషన్ సిబ్బంది ఆవేదన
సాక్షి, వరంగల్: వరంగల్ పోలీసు కమిష నరేట్ పరిధిలోని మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఇన్‌స్పెక్టర్ విష్ణుమూర్తి వేధింపులకు గురి చేస్తున్నారంటూ సిబ్బంది పోలీసు కమిషనర్ జి.సుధీర్‌బాబుకు ఫిర్యాదు చేశారు. మహిళా పోలీసుస్టేషన్‌లో పనిచేస్తున్న సిబ్బంది బుధవారం పోలీస్ కమిషనర్‌ను స్వయంగా కలిసి ఫిర్యాదు పత్రం ఇచ్చారు.
విధి నిర్వహణ పేరుతో పరేడ్, డ్రెస్ ఇలా ఉండాలంటూ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నా డని మహిళా సిబ్బంది పోలీసు కమిషనర్‌కు చెప్పారు. విష్ణుమూర్తిని ఇన్స్‌పెక్టర్‌గా కొన సాగిస్తే మూకుమ్మడిగా సెలవులు పెట్టేందు కు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఆరోపణలపై విచారణ జరిపి చర్య తీసు కుంటామని కమిషనర్ హామీ ఇచ్చారు.
సీఐ వేధిస్తున్నాడు..
Published Thu, Jan 12 2017 3:27 AM | Last Updated on Tue, Sep 5 2017 1:01 AM
Advertisement
Advertisement