సాక్షి,హైదరాబాద్:సైబర్ నేరగాళ్లు రోజుకో అవతారమెత్తుతున్నారు. నగర పోలీస్ కమిషనర్(సీపీ) సీవీఆనంద్ డీపీతో వాట్సాప్ కాల్ చేస్తూ ప్రజలను భయపెట్టేందుకు కొత్త ఎత్తుగడ వేశారు. పాకిస్తాన్ దేశ కోడ్‌తో వాట్సాప్‌కాల్స్ చేస్తూ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమతంగా ఉండాలని ప్రజలకు సీపీ సీవీ ఆనంద్ సూచించారు.
ఇటీవల సైబర్ నేరగాళ్లు ఇటీవల అక్రమ కేసుల పేరిట ఫేక్ వాట్సాప్‌కాల్స్ చేస్తూ ప్రజలను బెదిరించి డబ్బులు వసూలు చేయడం పెరిగిపోయిన విషయం తెలిసిందే. డిజిటల్ అరెస్టులతో పాటు కేసులు రిజిస్టర్ అవడం, ఫోన్ కనెక్షన్‌ను ట్రాయ్ కట్ చేయడం తదితర కారణాలు చెప్పి ప్రజలను భయపెడుతున్నారు.
ఇదీ చదవండి: ట్రావెల్ బస్సులో భారీ చోరీ
Comments
Please login to add a commentAdd a comment