Commissioner of Police
-
సీవీ ఆనంద్ డీపీతో ఫేక్ వాట్సాప్ కాల్స్.. సైబర్ నేరగాళ్ల బెదిరింపులు
సాక్షి,హైదరాబాద్:సైబర్ నేరగాళ్లు రోజుకో అవతారమెత్తుతున్నారు. నగర పోలీస్ కమిషనర్(సీపీ) సీవీఆనంద్ డీపీతో వాట్సాప్ కాల్ చేస్తూ ప్రజలను భయపెట్టేందుకు కొత్త ఎత్తుగడ వేశారు. పాకిస్తాన్ దేశ కోడ్‌తో వాట్సాప్‌కాల్స్ చేస్తూ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమతంగా ఉండాలని ప్రజలకు సీపీ సీవీ ఆనంద్ సూచించారు. ఇటీవల సైబర్ నేరగాళ్లు ఇటీవల అక్రమ కేసుల పేరిట ఫేక్ వాట్సాప్‌కాల్స్ చేస్తూ ప్రజలను బెదిరించి డబ్బులు వసూలు చేయడం పెరిగిపోయిన విషయం తెలిసిందే. డిజిటల్ అరెస్టులతో పాటు కేసులు రిజిస్టర్ అవడం, ఫోన్ కనెక్షన్‌ను ట్రాయ్ కట్ చేయడం తదితర కారణాలు చెప్పి ప్రజలను భయపెడుతున్నారు.ఇదీ చదవండి: ట్రావెల్ బస్సులో భారీ చోరీ -
‘ఆర్జీకర్’ ఘటన ఎఫెక్ట్: కోల్‌కతా ‘సీపీ’ బదిలీ
కోల్‌కతా: సమ్మె చేస్తున్న జూనియర్ డాక్టర్లకు ఇచ్చిన హామీని పశ్చిమబెంగాల్లో మమత సర్కారు నిలబెట్టుకుంది. డాక్టర్ల డిమాండ్ మేరకు ఇప్పటిదాకా కోల్‌కతా నగర పోలీస్‌కమిషనర్‌గా ఉన్న వినీత్‌కుమార్ గోయెల్‌ను ప్రభుత్వం బదిలీ చేస్తూ మంగళవారం(సెప్టెంబర్17) ఉత్తర్వులు జారీ చేసింది.గోయెల్ స్థానంలో మనోజ్‌కుమార్ వర్మను కమిషనర్ ఆఫ్ పోలీస్‌గా నియమించారు.కోల్‌కతా ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసులో నగర పోలీస్ కమిషనర్ గోయెల్‌పై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్‌ను జూనియర్ డాక్టర్లు సీఎం మమత ముందుంచారు. దీంతో ప్రభుత్వం కమిషనర్‌ను బదిలీచేసింది. పోలీస్కమిషనర్తో పాటు ఆరోగ్య శాఖలోని పలువురు ఉన్నతాధికారులను బదిలీ చేయాలని డాక్టర్లు ప్రభుత్వాన్ని కోరారు. వీరి కోరిక మేరకు హెల్త్ డిపార్ట్మెంట్లో ఇప్పటికే పలువురు ఉన్నతాధికారులను బదిలీ చేశారు. ఇదీ చదవండి.. కోల్‌కతా బాధితురాలి ఫొటో..పేరు తొలగించండి: సుప్రీంకోర్టు -
విశాఖలో అర్థరాత్రి సీపీ ఆకస్మిక తనిఖీలు
-
‘మమత’ వర్సెస్ గవర్నర్: తారాస్థాయికి విభేదాలు..!
కోల్‌కతా: వెస్ట్‌బెంగాల్‌లో మమతాబెనర్జీ ప్రభుత్వం, గవర్నర్ ఆనంద బోస్ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. కోల్‌కతా నగర పోలీసు కమిషనర్ వినీత్‌కుమార్‌ను ఆ పదవి నుంచి తప్పించాలని గవర్నర్ బోస్ సీఎం మమతకు లేఖ రాసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే గవర్నర్ డిమాండ్‌ను మమత ప్రభుత్వం తిరస్కరించినట్లు సమాచారం. రాజ్‌భవన్‌ను ఆనుకోని పోలీసులు ఓ కంటట్రోల్‌ను నిర్మించి తన కదలికలపై నిఘా ఉంచినట్లు గవర్నర్ భావిస్తున్నరని తెలుస్తోంది. దీంతో ఆయన కోల్‌కతా నగర పోలీసు కమిషనర్‌ను తప్పించాలని కోరుతున్నట్లు చెబుతున్నారు. అయితే కంట్రోల్ రూమ్ కొత్తగా నిర్మించి కాదని, రాజ్‌భవన్ భద్రత కోసం గత ప్రభుత్వాల హయాం నుంచే అక్కడ ఉందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా, రాజ్‌భవన్‌లో మహిళలకు రక్షణ లేదని సీఎం మమత చేసిన ఆరోపణలపై గవర్నర్ ఇప్పటికే కోర్టులో పరువు నష్టం దావా వేశారు. -
‘ఎమ్మెల్యేలకు ఎర’పై దర్యాప్తు కొనసాగుతోంది
సాక్షి, హైదరాబాద్: సంచలనం సృష్టించిన ‘ఎమ్మెల్యేలకు ఎర’కేసులో నలుగురు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి దర్యాప్తు కొన సాగు తుందని సైబరాబాద్ పోలీసు కమిషనర్ అవినాశ్ మ హంతి తెలిపారు. త్వరలోనే దీనికి సంబంధించి పూర్తి వివరాలను వెల్లడి స్తామన్నారు. ప్రస్తుతం ఈ కేసు సుప్రీంకోర్టులో ఉందని చెప్పారు. గతేడాది అక్టో బర్లో నాటి బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు పైలట్ రోహిత్‌రెడ్డి, రేగ కాంతారావు, గువ్వల బాలరాజు, బీరం హర్షవర్ధన్‌రెడ్డిలతో మొయినాబాద్ అజీజ్‌నగర్‌లోని ఫాంహౌస్‌లో ముగ్గురు బీజేపీ రాయబారులు మంతనాలు జరపడం తెలిసిందే. దీనిపై అందిన విశ్వసనీయ సమాచారం మేరకు సైబరాబాద్ పోలీసులు ఫాంహౌస్‌పై దాడి చేసి ఢిల్లీలోని ఫరీదాబాద్‌కు చెందిన పురోహితుడు రామచంద్రభా రతి అలియాస్ సతీష్ శర్మ, హైద రాబాద్‌కు చెందిన వ్యాపారి నందకుమార్, తిరుపతికి చెందిన సింహయాజీ స్వా మిలను అరెస్టు చేశారు. మరోవైపు మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌పై హత్యాయత్నం కేసు దర్యాప్తు కూడా కొనసాగుతుందని సీపీ అవినాశ్ మహంతి తెలిపారు. గతేడాది ఫిబ్రవరిలో శ్రీనివాస్ గౌడ్‌పై హత్యా యత్నం కేసులో రాఘవేందర్ రాజు, నాగరాజు, యాదయ్య, విశ్వనాథ్, మున్నూ రు రవి, మధుసూదన్ రాజును పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. వారంతా విచారణకు రావాల్సిందే..: మాదక ద్రవ్యాల కేసుల్లో సినీ పరిశ్రమకు చెందిన వాళ్లను వదిలిపెడుతున్నా మనేది ఆరోపణ మాత్రమేనని సీపీ అవినాశ్ మహంతి స్పష్టం చేశారు. కబాలీ తెలుగు సినిమా నిర్మాత సుంకర కృష్ణ ప్రసాద్ చౌదరి (కేపీ చౌదరి) కేసు దర్యాప్తులో ఉందని, ఈ కేసులో ఎవరినీ వద లిపెట్టబోమన్నారు. విచారణలో కేపీ చౌదరి వెల్లడించిన పేర్లలో ప్రతి ఒక్కరూ వి చారణకు రావాల్సిందేనని చెప్పారు. గోవా నుంచి హైదరాబాద్‌కు 82.75 గ్రాము ల కొకైన్‌ను తరలిస్తుండగా కేపీ చౌదరిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు లో చౌదరిని విచారించగా.. డ్రగ్స్ కింగ్‌పిన్ ఎడ్విన్ న్యూన్స్తోపాటు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన సుమారు 900 మందితో సత్సంబంధాలు ఉన్నట్లు విచారణలో తేలింది. ఇందులో ఓ ప్రముఖ దర్శకుడు, ఇద్దరు హీరోయిన్లు, నలుగురు మహిళా ఆర్టిస్టులున్నారు. -
ట్రైసిటీస్ లో కోలువుదీరిన కొత్త పోలీస్ బోస్ లు
-
హైదరాబాద్ కొత్త సీపీగా కొత్తకోట శ్రీనివాసరెడ్డి
-
హైదరాబాద్ కొత్త సీపీగా శ్రీనివాస్‌రెడ్డి: డ్రగ్స్‌పై వారికి వార్నింగ్
సాక్షి,హైదరాబాద్: డ్రగ్స్ ముఠాలు హైదరాబాద్ వదిలిపోవాల్ని, లేదంటే కఠిన చర్యలుంటాయని హైదరాబాద్ కొత్త పోలీస్ కమిషనర్(సీపీ) కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి హెచ్చరించారు. బుధవారం(డిసెంబర్13) బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో నూతన సీపీగా శ్రీనివాస్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు.ఇప్పటిదాకా సీపీగా ఉన్న సందీప్ సాండిల్య శ్రీనివాస్‌రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా సీపీ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘డ్రగ్స్ ముఠాలపై ఉక్కుపాదం ఉంటుంది. సినిమా ఇండస్ట్రీలో కుడా డ్రగ్స్ విక్రయాలు జరుగుతున్నట్లు సమాచారం ఉంది. సినిమా పెద్దలు మీటింగ్ పెట్టుకోవాలి. డిమాండ్ ఉన్నందునే సప్లై జరుగుతోంది. పార్టీల పేరుతో డ్రగ్స్ వాడొద్దు. కొన్ని పబ్‌లలో డ్రగ్స్ వాడకం జరుగుతోంది. అది వెంటనే ఆపేయాలి. తెలంగాణ స్టేట్‌తో పాటు హైదరాబాద్ సిటీని డ్రగ్స్ ఫ్రీ సిటీగా చేయాలని ప్రభుత్వ ఆదేశాలున్నాయి. ఫ్రెండ్లీ పోలీస్ అనేది సరిగా అర్ధం చేసుకోవాలి.చట్టాన్ని అతిక్రమించే వారికీ ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండదు’అని సీపీ స్పష్టం చేశారు. ‘నా శక్తి సామర్థ్యాలు గుర్తించి హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా అవకాశం ఇచ్చిన సీఎం రేవంత్‌రెడ్డికి ధన్యవాదాలు. ఇప్పుడు హైదరాబాద్‌లో ముఖ్యంగా డ్రగ్స్, జూదాన్ని నిర్ములిస్తాం. ప్రజలకు , ప్రభుత్వానికి వారధిగా మీడియా ఉంటుంది. ప్రజాభిప్రాయాన్ని మీడియా ద్వారా తెలియజేయాలని కోరుతున్నా. మహిళ వేధింపులు, ర్యాగింగ్‌లపై షీ టీమ్స్ పని తీరును మరింత మెరుగుపరుస్తాం’ సీపీ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. గతంలో గ్రేహౌండ్స్‌లో పనిచేసిన శ్రీనివాస్‌రెడ్డికి ముక్కుసూటి అధికారిగా పేరుంది. ఇదీచదవండి..కొత్త సర్కార్ ప్లాన్!.. సెంట్రల్లోకి స్వితా సబర్వాల్.. ఆమ్రపాలి ఇన్! -
HYD: నేను ఆరోగ్యంగానే ఉన్నా: సీపీ సందీప్ శాండిల్య
సాక్షి, హైదరాబాద్ : తాను ఆరోగ్యంగానే ఉన్నానని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య తెలిపారు. ఈ మేరకు ఆయన తన ఆరోగ్యం గురించి స్వయంగా వివరాలు వెల్లడిస్తున్న ఒక వీడియోను విడుదల చేశారు. తనను ఒకరోజు పర్యవేక్షణలో ఉండాలని వైద్యులు సూచించినట్లు తెలిపారు. మంగళవారం యథావిధిగా విధులకు హాజరవుతానని శాండిల్య వెల్లడించారు. కాగా, సీపీ సందీప్ శాండిల్య సోమవారం మధ్యాహ్నం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. బషీర్‌బాగ్ పాత కమిషనరేట్‌లో ఉండగా సందీప్ చాతి నొప్పితో ఇబ్బంది పడ్డారు. దీంతో ఆయనను అధికారులు హుటాహుటిన హైదర్‌గూడలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం శాండిల్య ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ఆస్పత్రిలో సందీప్ శాండిల్యను సీఐడీ చీఫ్ మహేశ్ భగవత్, ఇతర సీనియర్ ఐపీఎస్ అధికారులు పరామర్శించారు. ఇదీ చదవండి..ఐదేళ్ల చిన్నారి హత్య.. తల్లి మీద పగతో పొరుగింటి మహిళ ఘాతుకం -
Hyderabad: సీపీ ఆకస్మిక తనిఖీ.. బోరబండ సీఐపై వేటు
హైదరాబాద్: బోరబండ పీఎస్‌ను హైదరాబాద్ నగర సీపీ సందీప్ శాండిల్య ఆకస్మిక తనిఖీ చేశారు. మంగళవారం బోరబండ పోలీస్ స్టేషన్‌కు ఆకస్మికంగా వచ్చిన సీపీ.. సీఐ రవికుమార్‌ను రౌడీ షీటర్ల లెక్క అడిగారు. దీనికి సీఐ రవికుమార్ తటపటాయించారు. అసలు రౌడీ షీటర్లు ఎవరో గుర్తించు అంటూ సీఐని సీపీ వెంట తీసుకెళ్లారు. రౌడీ షీటర్ల ఇళ్లను సీఐ రవికుమార్ గుర్తించలేకపోయారు. దాంతో సీఐను సీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు సందీప్ శాండిల్య. పనిమనిషిపై అత్యాచారం కేసులో మురళీ ముకుంద్ అరెస్ట్ ‘‘క్లిక్ చేసి వాట్సాప్ ఛానెల్ ఫాలో అవ్వండి’’ -
మీకు దండం సారూ.. మీ వల్లే నేను ఇప్పుడు బతికున్నా..
హైదరాబాద్: ఆర్పీరోడ్ లోని దర్గా ప్రాంతం..ఆదివారం ఉదయం..కొద్దిసేపట్లో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అక్కడ అభివృద్ధి పనుల పర్యవేక్షణ కోసం వస్తున్నారు. బందోబస్తులో భాగంగా మహంకాళి ఏసీపీ రవీందర్‌తో పాటు మిగతా పోలీసులు, నాయకులు అక్కడ ఉన్నారు. ఇంతలో ఓ మహిళ దూరం నుంచి పరుగెత్తుకుంటూ..అయాసపడుతూ వారి దగ్గరకు వచ్చింది. పోలీసులతో పాటు అందరూ ఏమైందా, అని కంగారు పడ్డారు. కానీ వచ్చీ రావడంతోనే ఆ మహిళ ఏసీపీ రవీందర్ వద్దకు వెళ్లి ‘మీకు దండం సారూ..మీ వళ్లే నేను ఇప్పుడు బతికున్నా..మీరు చేసిన సహాయం మరచిపోలేను..అప్పుడు ఆపరేషన్ చేయించడం వల్లే ప్రాణాలతో ఉన్నా అంటూ ఆయాసపడుతూ చెప్పింది. వెంటనే అక్కడున్న వాళ్లు ఆమెను కొద్దిసేపు కూర్చోబెట్టి మంచి నీళ్లు తాగించి..ఏమైందంటూ ఆరాతీయగా...తొమ్మిదేళ్ల క్రితం అనారోగ్యంతో ఉన్న ఆమెకు ప్రస్తుత మహంకాళి ఏసీపీ రవీందర్ సొంత డబ్బుతో ఆస్పత్రిలో చేరి్పంచి ఆపరేషన్ చేయించిన సంగతి చెప్పింది. 2014 సంవత్సరంలో టప్పాచబుత్రా పోలీస్ స్టేషన్లో రవీందర్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు. రోడ్డు పక్కన కార్వాన్కు చెందిన కవిత అనే మహిళ అనారోగ్యంతో బాధపడుతుండగా ఆస్పత్రిలో చేర్పించి సొంత ఖర్చులతో ఆపరేషన్ చేయించగా పూర్తి ఆరోగ్యంతో బయటపడింది. ఆ తర్వాత మళ్లీ ఆయన ఇతర ప్రాంతాలకు బదిలీపై వెళ్లడంతో కలవలేకపోయింది. ఆదివారం ఆమె కార్వాన్ నుంచి ఆర్టీసీ బస్సులో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వెళుతుంది. బస్సులో నుంచి బందోబస్తు విధుల్లో ఉన్న ఏసీపీ రవీందర్‌ను చూసి..గుర్తించి బస్సు ఆపాలని డ్రైవర్‌ను కోరింది. కానీ డ్రైవర్ ఆపకుండా ప్యాట్నీ సిగ్నల్ వరకు వెళ్లాడు. సిగ్నల్ దగ్గర బస్సు ఆగడంతో ఆమె బస్సు దిగి పరుగెత్తుకుంటూ దర్గా వరకు వచి్చంది. వచ్చీ రావడంతో ఆయనకు దండాలు పెడుతూ కన్నీరు పెట్టింది. మీ వల్లే ఈ రోజు ప్రాణాలతో ఉన్నా సారు, మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. మీరు కలుస్తారో లేదో అనుకుంటూ పరుగెత్తుకొచ్చాను అంటూ చెప్పుకొచి్చంది. మీరు ఇంకా పెద్ద పోస్టులోకి రావాలి, ఎమ్మెల్యే అంత ఎదగాలి సారూ అంటూ కృతజ్ఞతాభావాన్ని చాటింది. ‘నా అన్న కోసం వెండి రాఖీ కొని తీసుకుని వచ్చి కడతా’ అంటూ చెప్పింది. అంతే కాకుండా తన ఫోన్లో భద్రపరుచుకున్న ఏసీపీ ఫొటోను చూపించి ఆశ్చర్య పరిచింది. ఈ సంఘటన చూసిన పోలీసులు, మీడియా ప్రతినిధులు, నాయకులు అందరూ ఆ మహిళ కృతజ్ఞతాభావాన్ని, ఏసీపీ మానవతా దృక్పథాన్ని అభినందించారు. -
కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులతో సీపీ రంగనాథ్ సమావేశం
-
ప్రీతిది ఆత్మహత్యేనని నమ్ముతున్నాం: తండ్రి నరేందర్
సాక్షి, వరంగల్: కేఎంసీ మెడికో ప్రీతి మృతి విషయంలో తమకు అనుమానాలు ఉన్నాయంటూ మొదటి నుంచి చెబుతూ వస్తున్న ఆమె కుటుంబ సభ్యులు.. తాజాగా ఇవాళ మరో ప్రకటన చేశారు. ఆమెది ఆత్మహత్యేనని నమ్ముతున్నట్లు ప్రీతి తండ్రి నరేందర్ మీడియా ముందు ప్రకటించారు. వరంగల్ సీపీతో భేటీ అనంతరం ఈ పరిణామం చోటు చేసుకుంది. ప్రీతి మృతి కేసులో పోస్ట్‌మార్టం రిపోర్ట్ ఆధారంగా ఆమెది ఆత్మహత్యేనని శుక్రవారం సాయంత్రం వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ ప్రకటించారు. వారం, పదిరోజుల్లో ఛార్జ్‌షీట్ వేయనున్నట్లు కూడా తెలిపారాయన. అయితే.. ఈ ప్రకటన తర్వాత కూడా ప్రీతి మృతిపై కుటుంబ సభ్యులు పాత మాటే చెప్పుకొచ్చారు. కానీ, శనివారం ప్రీతి తండ్రి నరేందర్, సోదరుడు పృథ్వీ వరంగల్ సీపీ రంగనాథ్‌ను కలిశారు. ప్రీతి మృతిపై వాళ్ల అనుమానాలను ఆయన నివృత్తి చేసినట్లు తెలుస్తోంది. అనంతరం బయటకు వచ్చిన వాళ్లు.. మీడియాతో మాట్లాడారు. ప్రీతిది ఆత్మహత్యేనని నమ్ముతున్నాం. ఛార్జ్‌షీట్‌లో ఇంకా కొందరి పేర్లు చేరుస్తామని సీపీ చెప్పారు. కేఎంసీ ప్రిన్సిపాల్, హెచ్‌వోడీల బాధ్యతా రాహిత్యం ఉందని భావిస్తున్నాం అని ప్రీతి తండ్రి నరేందర్ మీడియాకు తెలిపారు. ప్రీతి మృతికి కారణమైన సిరంజీ దొరికింది. ఆమె శరీరంలో విష పదార్థాలు ఉన్నట్లు పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ లో వచ్చిందని సీపీ మాతో అన్నారు. రిపోర్ట్ మాత్రం చూపించలేదు. నిష్పక్షపాతంగా విచారణ జరగాలని మేం కోరాం అని ప్రీతి తండ్రి నరేందర్ తెలిపారు. -
ప్రీతి సూసైడ్‌కు అతడే కారణం: సీపీ రంగనాథ్
సాక్షి, వరంగల్: కాకతీయ మెడికల్ కాలేజీ మెడికో ధారవత్ ప్రీతి నాయక్ మృతి కేసులో సస్పెన్స్ వీడింది. ఆమెది ఆత్మహత్యేనని ప్రకటించారు వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్. ఈ మేరకు పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిందని ప్రకటించారాయన. ప్రీతిది ఆత్మహత్యేనని స్పష్టం చేసిన ఆయన.. ఇందుకు సీనియర్ విద్యార్థి సైఫ్ ప్రధాన కారణమని శుక్రవారం సాయంత్రం వెల్లడించారు. పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ వచ్చింది. ఇంజక్షన్ ద్వారా పాయిజన్ తీసుకున్నట్లు భావిస్తున్నాం. ఐపీసీ సెక్షన్ 306 కింద చర్యలు తీసుకుంటున్నాం. ప్రీతి ఆత్మహత్య కు సీనియర్ వైద్య విద్యార్థి సైఫ్ ప్రధాన కారణం. వారం పదిరోజుల్లో చార్జి షీట్ దాఖలు చేస్తామని సీపీ రంగనాథ్ తెలిపారు. ఇదిలా ఉంటే.. ప్రీతి ఆత్మహత్యకు కారణమైన సైఫ్‌కు వరంగల్ కోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ప్రతీ శుక్రవారం మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల మధ్య 16వారాల పాటు కేసు విచారణ అధికారి వద్ద హాజరు కావాలని సైఫ్ బెయిల్ ఉత్తర్వుల్లో న్యాయమూర్తి పేర్కొన్నారు. సైఫ్‌కు బెయిల్‌పై విడుదలైన మర్నాడే ప్రీతి సూసైడ్ కేసులో వరంగల్ సీపీ కీలక ప్రకటన చేయడం గమనార్హం. ఇదీ చదవండి: నరబలి కాదు.. ఆర్థిక వివాదాలే కారణం -
హైదరాబాద్‌లో డ్రగ్స్‌ను రూపుమాపడమే లక్ష్యం: సీపీ సీవీ ఆనంద్
-
9 కోట్ల విలువైన గంజాయిని తగుల బెట్టిన విశాఖ పోలీసులు
-
హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత
-
డ్రగ్స్ కేసులో కీలక నెట్వర్క్ చేధించాం..!
-
Sajay Pandey: ఆటోలో ఈడీ విచారణకు మాజీ సీపీ
ఢిల్లీ: అత్యున్నత అధికారిగా ప్రభుత్వం నుంచి మన్ననలు, నిజాయితీపరుడిగా ప్రజల నుంచి పొగడ్తలు అందుకున్నారాయన. అలాంటి వ్యక్తి.. సాదాసీదాగా ఈడీ విచారణకు హాజరు కావడం చర్చనీయాంశంగా మారింది. ముంబై మాజీ కమిషనర్ సంజయ్ పాండే మంగళవారం ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యాడు. ఒంటరిగా ఆటోలో ఢిల్లీ ఈడీ కార్యాలయానికి సంజయ్ పాండే చేరుకోవడం.. ఒక్కరే విచారణను ఎదుర్కోవడం.. ఈడీ ప్రాంగణంలో ఆయన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్(NSE) కో-లొకేషన్ స్కామ్‌కు సంబంధించి విచారణ కోసం ఆయన హాజరయ్యారు. వారం కిందటే.. ఆయన ముంబై పోలీస్ కమిషనర్‌గా రిటైర్డ్ అయిన విషయం తెలిసే ఉంటుంది. రెండున్నర గంటలపాటు ఆయన్ని ప్రశ్నించింది ఈడీ.. ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్‌లోని క్రిమినల్ సెక్షన్స్-50 ప్రకారం ఆయన స్టేట్మెంట్ను రికార్డు చేసింది. ఐసెక్ సెక్యూరిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి సంబంధించిన కార్యకలాపాల గురించి ఆయన్ని ప్రశ్నించింది ఈడీ. ఎన్ఎస్ఈ సెక్యూరిటీ అడిట్కు సంబంధించి.. కో-లొకేషన్ ఇర్రెగ్యులారిటీస్ ఈ కంపెనీలోనూ చోటు చేసుకున్నాయి. పైగా ఈ కంపెనీని పాండేనే 2001 మార్చిలో స్థాపించారు. 2006లో దాని డైరెక్టర్‌గా రాజీనామా చేశారు. అప్పటి నుంచి ఆయన తల్లికుమారుడు.. ఆ కంపెనీ వ్యవహారాలను చూసుకుంటున్నారు. ఎన్ఎస్ఈ కో-లొకేషన్ స్కామ్‌ను 2018 నుంచి సీబీఐ దర్యాప్తు చేస్తోంది. 1986 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన సంజయ్ పాండే.. ఐఐటీ-కాన్పూర్ గ్రాడ్యుయేట్. హర్వార్డ్ యూనివర్సిటీలోనూ ఉన్నత విద్యను అభ్యసించారు. బాంబే అల్లర్ల సమయంలో డీసీపీగా ఆయన తెగువ.. ప్రజల నుంచి మన్ననలు అందుకునేలా చేసింది. ఆర్థిక నేరాల విభాగం తరపున 1998లో కోబ్లర్ స్కామ్ ఆయన్ని వివాదంలోకి నెట్టింది. ఆపై సెంట్రల్‌డిప్యూటేషన్ మీద పీఎం సెక్యూరిటీ యూనిట్‌కు ఆయన ఎటాచ్ అయ్యారు. ముంబై కమిషనర్‌గా మాత్రమే కాదు.. మహారాష్ట్రకు తాత్కాలిక డీజీపీగానూ విధులు నిర్వహించారు కూడా. అయితే పోలీసులు విధులకు రాజీనామా చేసిన తర్వాతే ఆయన కంపెనీని స్థాపించగా.. అప్పటి ప్రభుత్వం ఆయన రాజీనామాను ఆమోదించకపోవడంతో తిరిగి విధుల్లో చేరారు. సమర్థవంతుడైన ఆఫీసర్‌గా పేరున్న సంజయ్ పాండే.. ఈడీ విచారణ ఎదుర్కోవడంపై సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తునే చర్చ నడుస్తోంది. -
బెంగళూరు నగర పోలీస్ కమిషనర్‌గా సీహెచ్ ప్రతాప్‌రెడ్డి
సాక్షి, బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరు నగర పోలీస్ కమిషనర్‌గా తెలుగు సీనియర్ ఐపీఎస్ సీహెచ్ ప్రతాప్‌రెడ్డి పగ్గాలు చేపట్టబోతున్నారు. ఆయనను సీపీగా నియమిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం సాయంత్రం ఉత్తర్వులిచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరుకు చెందిన ప్రతాప్‌రెడ్డి 1991 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. గతంలో బెంగళూరు నగర అదనపు కమిషనర్‌గా పని చేశారు. ప్రస్తుతం కర్ణాటక రాష్ట్ర శాంతిభద్రతల విభాగం అదనపు డీజీపీగా ఉన్నారు. బీటెక్ పూర్తిచేసి ఐపీఎస్ అయిన ప్రతాప్‌రెడ్డి మొదట హాసన్ జిల్లా అరసికెరె ఏఎస్పీగా, తరువాత పలు జిల్లాల ఎస్పీగా, కొంతకాలం బెంగళూరు – ముంబయి సీబీఐ విభాగంలో విధులు నిర్వర్తించారు. సైబర్ సెక్యూరిటీ విభాగంలో కీలక పాత్ర పోషించారు. విశిష్ట సేవలకు రాష్ట్రపతి, సీఎం మెడళ్లను అందుకున్నారు. ఆయన మంగళవారం కొత్తబాధ్యతలు తీసుకుంటారు. చదవండి: (ఆత్మహత్య వెనుక హనీట్రాప్) -
తెరపైకి ఆ పోలీస్ కమీషనర్ బయోపిక్..
Mumbai Former Police Commissioner Rakesh Maria Biopic By Rohit Shetty: బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి యాక్షన్ అండ్ కామెడీ సినిమాలకు పెట్టింది పేరు. ఇటీవల అక్షయ్ కుమార్‌తో సూర్యవంశీ తెరకెక్కించి హిట్ కొట్టాడు. అమెజాన్ ఓటీటీ కోసం ఇండియన్ పోలీస్ ఫోర్స్ అనె వెబ్ సిరీస్‌ను రోహిత్ శెట్టి డైరెక్ట్ చేయనున్న విషయం తెలిసిందే. తాజాగా రోహిత్ శెట్టి మరో సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు. అది కూడా ముంబై ఎక్స్ పోలీస్ కమీషనర్ రాకేష్ మారియా బయోపిక్‌ను తెరకెక్కించనున్నాడు రోహిత్. రాకేష్ మారియా తన కెరీర్లో సాధించిన విజయం ఆధారంగా ఈ బయోపిక్ రూపుదిద్దుకోనుంది. ఈ బయోపిక్‌ను తెరకెక్కిస్తున్నట్లు రోహిత్ శెట్టి అధికారికికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా రోహిత్ శెట్టి మాట్లాడుతూ 'రాకేష్ మారియా తన 36 ఏళ్ల అద్భుతమైన ఉద్యోగ ప్రయాణంలో ఎన్నో విశేషాలు ఉన్నాయి. ఆయన 1993 ముంబైలో జరిగిన పేలుళ్ల నుంచి అండర్ వరల్డ్ ముప్పు, 2008లోని 26/11 ముంబై ఉగ్రదాడుల వరకు ఎన్నో చూశారు. నిజ జీవితంలోని ఈ సూపర్ కాప్ ధైర్య, సాహసాల ప్రయాణాన్ని తెరపైకి తీసుకురావడం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను.' అని తెలిపారు. కాగా ఐపీఎస్ అధికారి అయిన రాకేష్ మారియా 1981వ బ్యాచ్ నుంచి సివిల్ సర్వీస్ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. 1993లో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్‌గా (ట్రాఫిక్) ఉన్న రాకేష్ మారియా ముంబై వరుస పేలుళ్ల కేసును ఛేదించారు. తర్వాత ముంబై పోలీస్ క్రైమ్ బ్రాంచ్‌కు డీసీపీగా, ఆ తర్వాత జాయింట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ అధికారిగా మారారు. 2008లో 26/11 ముంబై దాడులను పరిశోధించే బాధ్యతను కూడా మారియాకు అప్పగించారు. చదవండి: ప్రముఖ సింగర్ కన్నుమూత.. కరోనా కారణంగా చికిత్స ఆలస్యం ! అల్లు అర్జున్‌కు నెట్‌ఫ్లిక్స్ స్పెషల్ విషెస్.. దేనికంటే ? -
ఏప్రిల్ 1 నుంచి నిబంధనలు కఠినం చేస్తాం: ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్
-
నో పార్కింగ్.. నో కార్.. పోలీస్ కమిషనర్ ట్వీట్‌తో కలకలం
ముంబై పోలీస్ కమిషనర్ సంజయ్ పాండే చేసిన ట్వీట్ ఒకటి వాహనదారుల్లో కలకలం సృష్టించింది. అనేకానేక చర్చలకు దారి తీసింది. ముంబై రహదారులపై విపరీతంగా పెరుగుతున్న వాహనాల నేపథ్యంలో, ‘పార్కింగ్ స్థలం లేని వ్యక్తులకు కార్లను అమ్మకూడదు.. అంటే నో పార్కింగ్, నో కార్ పద్ధతిని ముంబైలో ప్రవేశపెడితే ఎలా ఉంటుంది..?’ అని సంజయ్ పాండే ట్వీట్ చేశారు. ముంబైలో ప్రతి రోజూ 600 కొత్త కార్లు నమోదవుతున్నాయనీ, వీటితో పాటు అసంఖ్యాక ట్యాక్సీలు, ఇతర వాహనాలు ఉన్నాయనీ, వీటన్నింటి వల్ల నగరంలో విపరీతమైన వాహనాల రద్దీ ఏర్పడుతోందని, అందుకే ఏదో ఒక ఉపాయం చేయాల్సి ఉంటుందనీ, నో పార్కింగ్, నో కార్ పద్దతిని అమలుచేస్తే ఎలా ఉంటుందోనని యోచిస్తున్నామనీ ఆయన అన్నారు. కాగా, పోలీస్ కమిషనర్ చేసిన ఈ ప్రతిపాదనకు తీవ్రమైన వ్యతిరేకత ఎదురవుతోంది. ముంబైలో దాదాపు 80 శాతం ప్రజలు చాల్స్‌లో, మురికివాడల్లో నివాసముంటున్నారనీ, వారికి పార్కింగ్ స్థలం ఎక్కడి నుంచి వస్తుందనీ, సుమారు 40 శాతం వాహనాలు రోడ్ల పైనే పార్కింగ్ చేస్తారనీ, ప్రభుత్వమే చవక ధరల్లో పార్కింగ్ స్థలాలని పే అండ్ పార్క్ పద్ధతిలో ఏర్పాటు చేయాలనీ, అందుకోసం ప్రతి ప్రాంతంలో పార్కింగ్ భవనాల నిర్మాణం కొనసాగించాలనీ పలువురు సూచించారు. ప్రత్యామ్నాయమార్గం చూడాలి.. మొబిలిటీ ఫోరంకు చెందిన అశోక్ దాతార్ మాట్లాడుతూ, ముంబైలో నో పార్కింగ్ నో కార్ పద్ధతి అమలు చేయడం అసాధ్యమనీ, వేరే ప్రత్యామ్నాయ వ్యవస్థ ఏర్పాటు చేయాలనీ అన్నారు. నిజానికి నో పార్కింగ్ నో కార్ ప్రతిపాదన ఇప్పటిది కాదు.. పార్కింగ్ సమస్య ఎంత పాతదో ఈ ప్రతిపాదన కూడా అంతే పాతది. ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ప్రతిపాదన సర్కారీ ఫైళ్ళల్లో మగ్గుతోంది. కాగా, గత పది సంవత్సరాల్లో ముంబైలో 107 శాతం వాహనాల సంఖ్య పెరిగిందనీ, ఈ సంఖ్య భస్మాసుర హస్తంగా మారక ముందే ఏదో ఒకటి చేయాలనీ, పోలీస్ కమీషనర్ సంజయ్ పాండే అభిప్రాయపడ్డారు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయమనీ, నేను కూడా ఒక ముంబైకర్‌నే అని, నేను రోడ్‌పై సౌకర్యవంతంగా కారు నడిపించాలని కోరుకుంటున్నాననీ ఆయన అన్నారు. ప్రస్తుతం ముంబైలో ఒక కిలోమీటర్ పరిధిలో 2,100 వాహనాలున్నాయి. గత పది సంవత్సరాల్లో 107 శాతం వాహనాలు పెరిగాయి. కార్ల సంఖ్య 92 శాతం పెరిగింది. ద్విచక్ర వాహనాల అమ్మకాలు 121 శాతం పెరిగాయి. వాహనాల రద్దీని అరికట్టేందుకు గతంలో కూడా పలు సూచనలు వచ్చాయి. అందులో 1. నో పార్కింగ్ నో కార్ పద్ధతి 2. రెండవ కారుపై అధికంగా రోడ్ ట్యాక్స్ విధించడం, 3. కారు యజమానులపై అధికంగా ఇంధన ట్యాక్స్ విధించడం, 4. మార్కెట్ ప్రాంతంలో పార్కింగ్ రేట్లను బాగా పెంచడం. కానీ ఈ సూచనలేవీ ఇంతవరకు అమలులోకి రాలేదు. వచ్చే సూచనలు కూడా కనిపించడం లేదు. -
ఇది చాలా విషాదకరమైన సంఘటన: సీవీ ఆనంద్
-
విశాఖ పాప కిడ్నాప్ కేసులో కీలక విషయాలు వెల్లడి
-
‘కమాండ్ కంట్రోల్ సెంటర్ పనులన్నీ ఫిబ్రవరి 15 లోపు పూర్తవ్వాలి’
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్‌లో నిర్మాణం జరుగుతున్న కమాండ్ కంట్రోల్ సెంటర్ పనులు ఫిబ్రవరి 15 వరకు పూర్తవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను అదేశించారు. ఫిబ్రవరి నెలలో మెయిన్ కమాండ్ కంట్రోల్ ను ప్రారంభించాలని సీఎం నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో కమాండ్ కంట్రోల్ భవన పనులను నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ పరిశీలించారు. అనంతరం ఆయన ఆర్అండ్బి ఈఎన్సి గణపతి రెడ్డి, ఇతర అధికారులతో కలిసి రివ్యు సమావేశాన్ని నిర్వహించారు. భవనానికి కావాల్సిన ఫర్నిచర్ పై ఆయన పరిశీలించడంతో పాటు పెండింగ్ పనులన్నీ ఫిబ్రవరి 15 లోపు పూర్తవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. -
సీపీ నాగరాజు డైరెక్షన్లోనే దాడి
సాక్షి,హైదరాబాద్: నిజామాబాబాద్ పోలీస్ కమిషనర్ నాగరాజు తనను హత్య చేయించేందుకు కుట్రపన్నారని, ఆయన డైరెక్షన్లోనే టీఆర్ఎస్ సర్కార్ తనపై హత్యాయత్నానికి ప్రయత్నించిందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. తనపై దాడి జరిగిన వైనాన్ని మంత్రి కేటీఆర్ సీఎం క్యాంపు కార్యాలయం నుంచి పర్యవేక్షించారని ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం అర్వింద్ మీడియాతో మాట్లాడుతూ..తనపై జరిగిన హత్యాయత్నాన్ని, కమిషనర్, ఇతర అధికారుల తీరుపై లోక్‌సభ స్పీకర్‌కు, ప్రివిలేజెస్ కమిటీకి, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు, రాష్ట్ర హోం మంత్రి, డీజీపీ, హోం కార్యదర్శులకు ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు. దాడి ఘటనలో తనను కాపాడిన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. ఎంపీ ల్యాడ్స్ నిధులతో చేపట్టిన ప్రాజెక్టును ప్రారంభోత్సవం చేసేందుకు వెళ్తే టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారన్నారు. దాడులకు భయపడం: విజయశాంతి బీజేపీని రాజకీయంగా ఎదుర్కోలేక టీఆర్ఎస్ సర్కార్.. గూండా రాజకీయాలకు తెరతీసిందని, ఈ దాడులకు భయపడేది లేదని ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి ధ్వజమెత్తారు. -
జీవితం చిన్నది కాదు.. మీ కుటుంబం మీకోసం ఇంట్లో వేచి ఉంది..
సాక్షి, సిద్దిపేట: రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు ట్రాఫిక్ నియమాలు పాటించాలని ట్రాఫిక్ పోలీసులు ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. అయినా కొంతమంది తమకేం కాదంటూ హెల్మెంట్ ధరించకుండా వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు గురవతున్నారు. చిన్నపాటి నిర్లక్ష్యంతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా ‘కమిషనర్ ఆఫ్ పోలీస్, సిద్దిపేట’ తన అధికారిక ట్విటర్ ఖాతాలో ఓ ప్రమాదానికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు. ‘దయచేసి హెల్మెట్ ధరించండి.. జీవితం చిన్నది కాదు, హెల్మెట్ ధరించి ఎక్కువ కాలం జీవించండి. మీ కుటుంబం మీ కోసం ఇంట్లో వేచి ఉంది’ అని కామెంట్ జతచేశారు. తాజాగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో.. ఓ మహిళ బైక్ నడుపుతూ వెళుతోంది. అకస్మాత్తుగా ఓ వ్యక్తి కారు యూటర్న్ చేద్దామని తిప్పడంతో ఆమె ఆ వాహనాన్ని ఢీకొట్టింది. అదృష్టవశాత్తు ఆమె హెల్మెట్ ధరించడంలో ప్రమాదం తప్పింది. ఈ వీడియో చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరిస్తారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. #Please_Wear_Helmet Life will not be short, wear a helmet live longer.. your family is waiting for you at home. pic.twitter.com/lfXnxECo95 — Commissioner of Police, Siddipet (@siddipetcp) January 7, 2022 -
మెగా హీరోను వదలని యాక్సిడెంట్ కేసు.. త్వరలోనే ఛార్జ్‌షీట్
Sai Dharam Tej Bike Accident Case: CP To File Chargesheet Over His Rash Driving: మెగా హీరో సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ కేసు మరోసారి తెరమీదకి వచ్చింది. ఇప్పటికే ఈ కేసుకి సంబంధించి నోటీసులు జారీ చేసిన పోలీసులు తాజాగా సాయితేజ్‌పై ఛార్జ్‌షీట్ దాఖలు చేయనున్నారు. సైబరాబాద్‌లో జరిగిన ప్రెస్మీట్లో కమిషనర్ స్టీఫెన్ రవింద్ర మాట్లాడుతూ.. 'హీరో సాయిధరమ్ తేజ్‌కు జరిగిన రోడ్డు ప్రమాదంపై కేసు నమోదు చేసి, అతడు కోలుకున్నాక 91 CRPC కింద నోటీసులు ఇచ్చాం. లైసెన్స్, ఆర్సీ, ఇన్సురెన్స్,పొల్యూషన్ సర్టిఫికెట్ డాక్యుమెంట్స్ వివరాలు ఇవ్వాలని కోరాం. కానీ అతడి నుంచి ఎలాంటి వివరణ రాలేదు. దీంతో త్వరలోనే సాయితేజ్‌పై ఛార్జ్‌షీట్ దాఖలు చేస్తాం' అని సీపీ వెల్లడించారు. కాగా కేబుల్ బ్రిడ్జి సమీపంలో సెప్టెంబర్10న సాయితేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఇటీవలె ప్రమాదం నుంచి కోలుకున్న తేజ్ ప్రస్తుతం సినిమాలపై ఫోకస్ పెట్టాడు. -
హైదరాబాద్ సీపీగా సీవీ ఆనంద్ నియామకం
-
పోలీసులకు రోజూ రెండు గంటలు సైకిల్ గస్తీ తప్పనిసరి: కమిషనర్
సాక్షి, చెన్నై: జీపులు, మోటారు సైకిళ్లను పక్కన పెట్టి సైకిల్‌పై గస్తీ వెళ్లేందుకు నగర పోలీసులు రెడీ అయ్యారు. ఇందుకోసం ఒక్కో స్టేషన్‌కు 4 చొప్పున సైకిళ్లను పంపిణీ చేశారు. రోజుకు 2 గంటలు సైకిల్ గస్తీ తప్పనిసరి చేస్తూ కమిషనర్ శంకర్‌జివ్వాల్ ఆదేశించారు. నగరంలో ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు రెండు గంటల పాటు తమ పరిధిలో సైకిల్ టీం గస్తీ నిర్వహించనున్నారు. తద్వారా నేరగాళ్లను పట్టుకునేందుకు వీలుంటుంది. చదవండి: (ట్రాఫిక్ కష్టాలు తీరేలా.. 2023కల్లా ‘కోస్టల్ రోడ్’ పూర్తి..) -
కానిస్టేబుల్ దురుసు ప్రవర్తన.. సీపీ చర్యలు
సాక్షి, గౌలిపురా: భవానీనగర్ పోలీస్‌స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్ కె.ఎన్.శివ కుమార్‌పై వేటు పడింది. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఆయనను సీఏఆర్ హెడ్ క్వార్టర్స్‌కు అటాచ్ చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీచేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటు వాహనదారునిపై దురుసుగా ప్రవర్తించడంతో కానిస్టేబుల్ కె.ఎన్.శివ కుమార్‌పై నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. శనివారం రాత్రి తలాబ్‌కట్టా రోడ్డులో బందోబస్తు నిర్వహిస్తున్న కె.ఎన్.శివ కుమార్‌కు ఓ వాహనదారుడితో వాగ్వాదం జరిగింది. ఇరువురి మధ్య వాదోపవాదం తీవ్రస్థాయికి చేరడంతో పాటు వాహనదారుని ఎడమ కన్నుకు గాయమైంది. విషయం తెలుసుకున్న స్థానికులు పెద్ద ఎత్తున గుమిగూడి భవానీనగర్ పోలీస్‌స్టేషన్‌కు చేరుకొని ఆందోళన నిర్వహించడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉన్నతాధికారుల జోక్యంతో పరిస్థితి సద్దుమణిగింది. ఈ సంఘటనపై విచారణ చేపట్టిన అధికారులు కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకున్నారు. చదవండి: బురిడీ బాబాల నిర్వాకం: పూజల పేరుతో మహిళపై లైంగిక దాడి -
విజయవాడ లో కర్ఫ్యూ ఎలా నడుస్తోంది ?
-
నకిలీలతో జాగ్రత్త.. మందులు కొనేముందు ‘6 పీ’ సరి చూసుకోండి
సాక్షి, సిటీబ్యూరో: సెకండ్ వేవ్‌లో కరోనా రోజు రోజుకూ పెరుగుతోందని కొత్వాల్ అంజనీకుమార్ అన్నారు. ఈ నేపథ్యంలోనే రెమిడెసివర్ వంటి ఔషధాలకు డిమాండ్ పెరగడంతో కొందరు బ్లాక్ మార్కెట్ చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ నేరం చేస్తున్న 40 మందికి పైగా నిందితుల్ని ఇప్పటి వరకు అరెస్టు చేశామని తెలిపారు. ఈ చీకటి దందాలకు సంబంధించి ఏదైనా సమాచారం ఉంటే తక్షణం పోలీసులకు తెలియజేయండని కోరారు. ఈ పరిస్థితుల్లో నకిలీ మందులు కూడా మార్కెట్లోకి వస్తాయన్నారు. వీటి నుంచి తప్పించుకోవడానికి అంతర్జాతీయంగా అమలులో ఉన్న ’6 పీ’ లను తెలుసుకోవాలి... వాటిని అమలు చేయాలని కోరారు. ఈ మేరకు ఆయన బుధవారం ట్వీట్ చేశారు. అందులోని వీడియోలో ఆయన పేర్కొన్న అంశాలివి.. ‘ ’ ► పీ1: ప్లేస్... దీని ప్రకారం అపరిచిత వెబ్సైట్ల నుంచి మందుల్ని ఖరీదు చేయకూడదు.అధీకృత మెడికల్ షాపు, ఫార్మాసిస్టు నుంచే ఖరీదు చేయాలి. ► పీ2: ప్రిస్క్రిప్షన్...రిజిస్టర్డ్ డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ ఆధారంగానే మందులు కొనండి. ► పీ3: ప్రామిసెస్... కొందరు వైద్యులు, మందుల దుకాణం యజమానులు ఈ మందు చాలా పవర్ఫుల్ అంటూ హామీలు ఇచ్చేస్తుంటారు. ఆ మాయలో పడకుండా వాడాల్సిన మందుల్నే ఖరీదు చేయాలి. ► పీ4: ప్రైస్... ఆయా మందులపై ముద్రించిన ఎమ్మార్పీ మొత్తాన్నే చెల్లించాలి. అంతకు మించి ఎవరైనా డిమాండ్ చేస్తుంటే పోలీసులకు సమాచారం ఇవ్వండి. ► పీ5: ప్రైవసీ... మీకు ఇంటర్నెట్లో ఏదైనా ఔషధం తదితరాలు ఖరీదు చేస్తుంటే ఎక్కడా మీ క్రెడిట్/డెబిట్ కార్డులకు సంబంధించిన రహస్య సమాచారం పొందుపర్చొద్దు. అది సైబర్ నేరాలకు దోహదం అవుతుంది. ► పీ6: ప్రొడక్ట్...ఏదైనా వస్తువును ఆన్లైన్లో ఖరీదు చేసే ముందు మీకు తెలిసిన వారిలో అప్పటికే దాన్ని ఖరీదు చేసిన వాళ్లు ఎవరైనా ఉంటే వారి సలహాలు, సూచనలు తీసుకోండి. Follow 6 Ps and be safe . Buy medicine at authorized place only. Your safety is most important for us. pic.twitter.com/AjcdezPjh1 — Anjani Kumar, IPS, Stay Home Stay Safe. (@CPHydCity) April 28, 2021 ( చదవండి: స్వచ్ఛంద సంస్థ ముసుగులో ఆక్సిజన్ సిలిండర్ల దందా ) -
మనిషి మాత్రమే మరో మనిషికి దానం..
సాక్షి, హైదరాబాద్: ప్లాస్మా దానం చేసి ప్రాణాలను రక్షించాలని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ మరోసారి పిలుపునిచ్చారు. కమిషనరేట్ పరిధిలోని సిబ్బంది ఇప్పటివరకూ 150మందికి పైగా పోలీస్ అధికారులు ప్లాస్మా దానం చేశారని ఆయన ట్విటర్లో పేర్కొన్నారు. ‘మనిషి మాత్రమే మరో మనిషికి దానం చేయగలడు. మీకు సహాయం చేయడానికి సిటీ పోలీసులు ఉన్నారు. ప్లాస్మా విరాళం వాట్సాప్ కోసం లేదా 9490616780కు కాల్ చేయండి’అని కోరారు. కాగా కరోనా వైరస్‌తో బాధపడుతున్న రోగులకు మరొకసారి పునర్జన్మనిచ్చేందుకు రక్తదానం దోహదపడుతుందని సీపీ అంజనీ కుమార్ పేర్కొన్నారు. కరోనా వ్యాధితో బాధపడుతున్న రోగులకు నగర పోలీసులు తమ తరపున ప్లాస్మా అందచేస్తుందన్నారు. -
అంకుల్ సలహానే టర్నింగ్ పాయింట్..
సాక్షి, విశాఖపట్నం: ఎటువంటి బాల్ నైనా కూల్‌గా బౌండరీ దాటించే ఈ కెప్టెన్ ఆటలో ఎపుడూ అసహనం కనిపించదు. లక్ష్యం వైపే గురి.. అవరోధాలను అవలీలగా అధిగమించి విజయం సాధించే గడుసరి. అపుడు క్రికెట్ కెప్టెన్‌గా – ఇపుడు సిటీ పోలీసు టీమ్ కెప్టెన్‌గా ఒకటే పనితీరు– కూల్.. కూల్. విధి నిర్వహణలో ఎలాంటి సమస్యనైనా– తనదైన స్టైల్లో సామరస్యంగా పరిష్కరించడం.. తప్పు జరిగితే తుప్పు వదిలించడం కూడా ఆయనకే సాధ్యం. కెరీర్ ‘సరిలేరు నీకెవ్వరూ’– అంటూ సాగుతున్న సిటీ పోలీసు కమిషనర్ రాజీవ్ కుమార్ మీనా హృదయరాగం ఈ సండే స్పెషల్. టర్నింగ్ పాయింట్ ప్రాథమిక స్థాయి నుంచే టాపర్‌గా ఉన్న ఆర్.కె.మీనా ఇంటర్ నుంచి కామర్స్ సబ్జెక్ట్‌పై ఆసక్తి పెంచుకున్నారు. కామర్స్‌లోనే ఇంటర్, డిగ్రీ, పీజీ (ఎం.కామ్) పూర్తి చేశారు. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్‌గా ఉద్యోగం కూడా పొందారు. అలా ఢిల్లీలో ఉద్యోగం చేస్తూ.. జీవితం సాగిపోతున్న వేళ.. ఆయన మామయ్య భగవత్ ప్రసాద్ మీనా ఇచ్చిన సలహా సీపీ జీవితాన్నే మార్చేసింది. ఆర్.కె.మీనాకు సమస్యలపై స్పందించే గుణం ఉండడం, సామాజిక పరిస్థితులు, స్థితిగతులు, జనరల్ నాలెడ్జ్, సేవాతత్వం, రాజకీయ పరిణామాలపై ఆసక్తి ఉండటాన్ని ఆయన గమనించారు. ఇన్కమ్ ట్యాక్స్ అధికారిగా ఆయన ప్రస్థానం ఆగిపోకూడదని భావించి.. ‘సివిల్స్ సాధించే సత్తా నీలో ఉంది.. సివిల్స్‌కు ప్రిపేర్ అవ్వు.. ఐపీఎస్ సాధించు‘ అని ఆర్.కె.మీనాకు సలహా ఇచ్చారు. ఆయన సలహానే ‘స్ఫూర్తిగా’ తీసుకుని సివిల్స్‌లో ఆర్.కె.మీనా ఉత్తమ ర్యాంక్ సాధించి ఐపీఎస్ అయ్యారు. ఉత్తమమైన పని తీరు కనబరుస్తూ.. అందరిచేత ప్రశంసలు పొందారు. అడిషనల్ డీజీగా పదోన్నతి పొందిన రాజీవ్‌కుమార్ మీనా విశాఖ సీపీగా తన ముద్ర వేసుకున్నారు. కుటుంబ నేపథ్యం ఆర్.కె.మీనా తల్లిదండ్రులు దప్పోదేవి మీనా, భగవాన్ సాహీ మీనా. అతని తండ్రి ప్రభుత్వ పాఠశాలలో హిందీ ఉపాధ్యాయుడిగా పనిచేసి రిటైర్ అయ్యారు. తమ్ముడు ఢిల్లీలో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. పెద్ద చెల్లి ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్‌గా, చిన్న చెల్లి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలిగా ఉన్నారు. ఆయనది వ్యవసాయ ఆధారిత కుటుంబం. ఆర్.కె.మీనా తాతయ్యకు వ్యవసాయం అంటే ఇష్టం. అప్పుడప్పుడు ఈయన కూడా తాతకు వ్యవసాయంలో సాయం చేసేవారు. మీనాకు పశువుల పెంపకం అంటే ఇష్టం. ఉద్యోగ బాధ్యతలు చూసుకుంటూనే.. వాటి పెంపకం చేపడుతున్నారు. విద్యాభ్యాసం ఆర్.కె.మీనా సొంత గ్రామం రాజస్థాన్ రాష్ట్రం అల్వార్ పట్టణం. అల్వార్‌లోని ప్రభుత్వ నెహ్రూ పాఠశాలలో ఒకటి నుంచి 8వ తరగతి వరకు, 9వ తరగతి నుంచి 10 వరకు అల్వార్‌లోని ప్రతాప్ సెకండరీ స్కూల్, ఇంటర్ యశ్వంత్ హైయర్ సెకండరీ స్కూల్, డిగ్రీ, పీజీలు రాజ్ రిషి కళాశాలలో పూర్తి చేశారు. యు.కె.లోని బర్మింగ్‌హామ్ విశ్వవిద్యాలయంలో మాస్టర్ ఇన్ పబ్లిక్ అడ్మినిష్ట్రేషన్ చదివారు. అనామికాతో కల్యాణం ఇన్కమ్ ట్యాక్స్ అధికారి పనిచేస్తున్న సమయంలోనే జైపూర్‌కు చెందిన అనామికా మీనాను సీపీ వివాహం చేసుకున్నారు. ఆమె ఎమ్మెస్సీ పూర్తి చేశారు. వీరిది పెద్దలు కుదిర్చిన వివాహం. క్రికెట్, ఫుట్‌బాల్, రన్నింగ్ అంటే ఇష్టం ఆర్.కె.మీనాకు అవుట్డోర్ గేమ్స్ అంటే చాలా ఇష్టం. చిన్నతనం నుంచి ఆయన ఎక్కువగా ఆటలు ఆడేవారు. స్కూల్, కాలేజీల్లో ఫుట్‌బాల్, క్రికెట్ జట్లకు కెప్టెన్‌గా వ్యవహరించేవారు. పరుగుపందెంలో ఎన్నో బహుమతులు సాధించారు. హైదరాబాద్ నేషనల్ పోలీస్ అకాడమీలో ఐపీఎస్ శిక్షణలో ఉన్నప్పుడు రన్నింగ్‌లో(10కె) మొదటి బహుమతి గెలుపొందారు. తెలుగులో శ్రీరామదాసు సినిమా ఇష్టం శ్రీ రామదాసు సినిమా అంటే చాలా ఇష్టం. అందులో హీరో నాగార్జున నటన చాలా బాగుంటుంది. సంగీతం కూడా అద్భుతం. నేను ఖమ్మం ఎస్పీగా ఉన్న సమయంలో ఆ సినిమా ఆడియో రిలీజ్ భద్రాచలంలో నాచేతుల మీదుగా జరిగింది ఈ సినిమా రిలీజ్ బెనిఫిట్ షోకి వెళ్లాను. సినిమా చూసిన వెంటనే హీరో నాగార్జునకి ..మూవీ బావుందని చెప్పాను. ముంబై లాంటిది విశాఖ.. 2014 సంవత్సరంలో 16వ బెటాలియన్ ఐజీగా పనిచేస్తున్నప్పుడు విశాఖజిల్లా ఆనందపురం మండలంలోని పేకేరు గ్రామాన్ని దత్తత తీసుకున్నాను. అప్పటి నుంచి విశాఖ నగరమంటే అమితమైన ప్రేమ. ఉద్యోగ జీవితంలో చాలా చోట్ల పని చేశాను. ...నాకు నచ్చిన ప్రాంతం విశాఖనగరం. ఇది ఓ అందమైన నగరం. దేశ ఆర్థిక రాజధాని ముంబై తరహా అన్ని వనరులున్న ఏకైక నగరం ఇది. అంకుల్ సలహానే టర్నింగ్ పాయింట్ సామాజిక పరిస్థితులు, రాజకీయాలపై నాకున్న అవగాహన గమనించిన మామయ్య భగవత్ మీనా ప్రసాద్.. సివిల్స్ సాధించే సత్తా నాలో ఉందని స్ఫూర్తి నింపారు. ఆయన ఇచ్చిన సలహాలతోనే ఇన్కమ్ ట్యాక్ ఆఫీసర్‌గా ఉన్న నేను.. సివిల్స్‌కు ప్రిపేర్ అయి ఐపీఎస్ సాధించాను. హిందీ సినిమాలు ఎక్కువగా చూస్తారు ఆర్.కె.మీనా హిందీ సినిమాలు ఎక్కువగా చూస్తారు. అయితే ఇష్టమైన సినిమా మాత్రం రాజస్థానీ(హిందీ) మూవీ ‘ఖామోషీ’. హీరో సంజీవ్ కుమార్, హీరోయిన్ వహీదా రెహమాన్‌లకు ఆయన అభిమాని. సమర్థ పనితీరుకు ప్రశంసలు ‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నక్సల్స్ ప్రభావిత ప్రాంతమైన ములుగుకు ఏఎస్పీగా తొలుత బాధ్యతలు స్వీకరించాను. తర్వాత నక్సల్స్ ప్రభావం ఎక్కువగా ఉన్న మహబూబాబాద్, ఖమ్మంలో కూడా పనిచేశాను. అనంతరం యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్‌లో డైరెక్టర్‌గా కూడా విధులు నిర్వర్తించాను. ఆ సమయంలో సమర్థవంతమైన విధులు నిర్వహించినందుకు గానూ ప్రశంసలు పొందాను. నా ఉద్యోగ జీవితంలో ఆ క్షణాలు మరిచిపోలేను’ అని సీపీ గుర్తు చేసుకున్నారు. తప్పుదారి పడుతున్న సమాజాన్ని సన్మార్గంలో నడిపించే నాయకులను ఆయన ఆరాధిస్తారు. సీపీకు బి.ఆర్.అంబేడ్కర్, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ అంటే అమితమైన గౌరవం. అదే తరహాలో సమాజంలో మార్పునకు విశేష కృషి చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అంటే అభిమానం, ఇష్టమని సీపీ తెలిపారు. బెస్ట్ ఫ్రెండ్ ఉమేష్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న సమయంలో సహచర ఉద్యోగి ఉమేష్‌కుమార్‌తో ఆయనకు స్నేహం ఏర్పడింది. ఆర్.కె.మీనాకు బెస్ట్ ఫ్రెండ్ ఆయనే. అప్పటి నుంచి ఇప్పటివరకు ఏదైనా సమస్య గానీ, ఆలోచన గానీ, సంతోషంగానీ కుటుంబ సభ్యుల తర్వాత ఆయనతోనే పంచుకుంటారు. గ్రామాల దత్తత ఆర్.కె.మీనా ఢిల్లీలో ఐటీ మంత్రికి పీఎస్‌గా పనిచేస్తున్న సమయంలో అల్వార్ మండలంలో రెండు గ్రామాలను దత్తత తీసుకున్నారు. ఆ రెండు గ్రామాల్లో ప్రజలకు విద్య, వైద్య భవనాల నిర్మాణం, పిల్లల చదువులకు పుస్తకాలు, పాఠశాలకు సామగ్రి అందజేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2014లో 16వ బెటాలియన్ ఐజీగా పని చేస్తున్నప్పుడు విశాఖ జిల్లాలో ఆనందపురం మండలంలోని పీకేరు గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. యువతా మేలుకో.. ‘చేతనైతే సాయం చేయి.. సాయం చేసే వారిని విమర్శించొద్దు’. అని ఆర్.కె.మీనా పిలుపునిస్తున్నారు. లాక్డౌన్ సమయంలో పేదలకు సాయం చేసిన దాతలకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు చెబుతున్నారు. ‘సమయాన్ని వృథా చేసుకోకుండా.. నిజాయితీతో పనిచేయండి. కష్టపడి లక్ష్యాన్ని చేరుకోండి.. లక్ష్యసాధనలో గెలుపు మనదైతే.. పది మందికి సాయం చేసే స్థాయికి మనం ఎదుగుతాం’ అని ఆర్.కె.మీనా యువతకు సూచిస్తున్నారు. తల్లిదండ్రులు: దప్పో దేవి మీనా, భగవాన్ సాహి మీనా భార్య: అనామికా మీనా పిల్లలు: హర్షుల్ మేవాల్ (ఐఐటీ ఢిల్లీ), యశి్వన్ మేవాల్ (10వతరగతి, టింపనీ స్కూల్, విశాఖపట్నం) ఇష్టమైన క్రీడ: ఫుట్‌బాల్, క్రికెట్, రన్నింగ్, బ్యాడ్మింటన్ ఇష్టమైన క్రికెటర్ : వినోద్ కాంబ్లీ ఇష్టమైన సినిమా : ఖామోషీ (రాజస్థానీ మూవీ) ఇష్టమైన హీరో: సంజీవ్ కుమార్ హీరోయిన్: వహీదా రెహమాన్ ఇష్టమైన ఆహారం: ఖీర్, దాల్బాటి, చుర్మా (రాజస్థానీ వంటకాలు) ఇష్టమైన భాష: హిందీ, తెలుగు ఇష్టమైన నగరాలు: విశాఖపట్నం, జైపూర్ ఇష్టమైన పుస్తకాలు: ప్రేమ్‌చంద్ చారిత్రక పుస్తకాలు హిందీలో ‘కర్మభూమి’ అలవాట్లు: ఉదయం వాకింగ్, వ్యాయామం చేయడం అవార్డులు: ఇండియా పోలీస్ మెడల్ (ఐపీఎం) -
బెజవాడ వాసులను బెంబేలెత్తిస్తున్న కరోనా
-
మరింత కఠినంగా లాక్డౌన్...
-
అనవసరంగా ఎవరూ రోడ్లపైకి రావొద్దు: సీపీ ద్వారకా తిరుమలరావు
-
కఠిన చర్యలు తీసుకుంటాం: సీపీ అంజనీ కుమార్
-
ఢిల్లీ పోలీస్ కమిషనర్‌గా ఎస్ఎన్ శ్రీవాస్తవ
-
ఏ వార్త అయినా ఏకపక్షంగా రాయెద్దు
-
ఏలాంటి ఆధారాలు లేకుండా తప్పుడు వార్తలు రాయెద్దు
-
మీడియాతో విశాఖ సీపీ
-
2019లో మూడు శాతం క్రైం రేటు తగ్గింది: సీపీ
-
హైదరాబాద్ సీపీ కీలక ప్రకటన
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ పోలీస్‌కు బెస్ట్ క్వాలిటీలో దేశంలోనే మొదటి స్థానం దక్కించుకుందని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. ఆయన గురువారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. 2019లో తగ్గిన క్రైంరేటు, కేసుల వివరాలు, పోలీసులు శాంతిభద్రతలను కాపాడటంలో నిర్వహించిన కార్యక్రమాలను తెలిపారు. హైదరాబాద్ నగరంలో జరిగిన వివిధ సంస్కృత కార్యక్రమాలను శాంతియుతంగా నిర్వహించామని సీపీ అంజనీ కుమార్ పేర్కొన్నారు. హైదరాబాద్ షీ టీం బ్రాండ్ అంబాసిడర్‌గా రాష్ట్రంలో నిలిచిందని పేర్కొన్నారు. 14వేల మంది పోలీసులు ఈ ఏడాది(2019)లో పలు విధుల్లో పాల్గొన్నారని ఆయన వెల్లడించారు. 2019 మొత్తంగా మూడు శాతం క్రైం రేటు తగ్గిందని సీపీ అంజనీకుమార్ తెలిపారు. అందులో భాగంగా ఐపీసీ కేసులు 15, 598 నమోదు చేశామని అయన చెప్పారు. శారీరక నేరాలు తొమ్మిది శాతం, ప్రాపర్టీ క్రైం రెండు శాతం, చైన్ స్నాచింగ్ దొంగతనాలులు 30 శాతం తగ్గాయని ఆయన వెల్లడించారు. అదేవిధంగా 2019లో కోర్టుల్లో 42 శాతం క్రైం కేసుల్లో శిక్ష పడిందని తెలిపారు. రూ. 26 కోట్లకుపైగా నగదు, ప్రాపర్టీ సీజ్ చేసి ప్రపంచ రికార్డ్ నమోదు చేశామని ఆయన పేర్కొన్నారు. నాలుగు వందలకుపైగా చిన్న పిల్లలను పోలీసులు రక్షించారని ఆయన చెప్పారు. 2019 ఏడాదిలో ఆటో మొబైల్ కేసులు 17 శాతం పెరిగాయని సీపీ అంజనీకుమార్ తెలిపారు. వరకట్నం కేసులు పదకొండు శాతం ఎక్కువగా నమోదు అయ్యాయని సీపీ అంజనీ కుమార్ తెలిపారు. హైదరాబాద్ పరిధిలో అత్యాచార కేసులు తగ్గాయని.. 2018లో 178 కేసులు నమోదైతే, 2019లో 150 కేసులు నమోదు అయ్యాయని ఆయన తెలిపారు. సుమారు 16 శాతం అత్యాచార కేసులు తగ్గినట్లు ఆయన పేర్కొన్నారు. 2019లో 17 కేసుల్లో 25 మందికి జీవిత ఖైదు పడిందని సీపీ అంజనీ కుమార్ వెల్లడించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు 27, 737 కేసులు నమోదైనట్టు అంజనీకుమార్ తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో కోర్టు ద్వారా ఎనిమిది కోట్ల 32 లక్షలు వసూళ్లు అయినట్టు ఆయన వెల్లడించారు. 2019లో హైదరాబాద్ సిటీలో ఆక్సిడెంట్ కేసులు 2, 377 నమోదైతే, 261 మంది మరణించారని ఆయన వివరించారు. హైదరాబాద్ సిటీ పోలీస్ పరిధిలో 135 పీడీ యాక్ట్ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. అదేవిధంగా హైదరాబాద్ నగరంలో 122 పెట్రోలింగ్ వాహనాలు, మూడు లక్షల 40 వేల సీసీటీవీ కెమెరాలు ఉన్నాయని సీపీ అంజనీ కుమార్ తెలిపారు. షీ టీమ్, భరోసా కేంద్రాలతో హైదరాబాద్ నగర పోలీస్‌కు మంచి ఫలితాలు వస్తున్నాయని నగర పోలీసు కమిషనర్ సీపీ అంజనీ కుమార్ పేర్కొన్నారు. -
శంషాబాద్ హత్యాచార ఘటన : సీపీ కీలక సూచన
సాక్షి, హైదరాబాద్ : శంషాబాద్ హత్యాచార ఘటనలో బాధితురాలి వివరాలను ప్రచురించరాదని మీడియా సంస్థలకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ సూచించారు. ఇలాంటి అత్యంత హేయమైన సంఘటన వివరాలను పదేపదే ప్రసారం చేయడంతో ప్రజలు ప్రత్యేకించి మహిళలు వారి తల్లితండ్రుల్లో భయం నెలకొంటుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మీడియా సంయమనం పాటిస్తూ ప్రస్తుత పరిస్థితుల్లో తమతో కలిసి రావాలని, ప్రజల్లో విశ్వాసం నెలకొల్పి వారికి మేమున్నామనే భరోసా ఇవ్వడంలో సహకరించాలని కోరారు. సుప్రీం కోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా ఇలాంటి ఘటనల్లో బాధితురాలి పేరు ఇతర వ్యక్తిగత వివరాలను ప్రచురించడం, ప్రసారం చేయడానికి దూరంగా ఉండాలని మీడియా సంస్ధలను కోరుతున్నామని చెప్పారు. బాధితురాలి వివరాలు వెల్లడికావడంతో బాధిత కుటుంబానికి వివిధ రూపాల్లో సమస్యలు ఎదురవుతాయని అన్నారు. ప్రమాదకర పరిస్థితుల్లో బాధితులు ఏం చేయాలనే విషయంలో వారిలో అవగాహన పెంచే అంశాలను ప్రసారం చేయాలని కోరారు. -
‘అమాయక విద్యార్థులను రెచ్చగొట్టవద్దు’
సాక్షి, హైదరాబాద్ : విద్యార్థులను మవోయిస్టులుగా మార్చే సంస్థలపై దర్యాప్తు కోసం డిటెక్టివ్ వింగ్‌లో సిట్ ఏర్పాటు చేయనున్నట్లు నగర సీపీ అంజనీకుమార్ తెలిపారు. నిషేధిత మావోయిస్టు సంస్థలతో కొందరు విద్యార్థులు కలుస్తున్నారని.. తుపాకీ పట్టి హింస సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... సీపీఐ మావోయిస్టు సంస్థతో పాటు, తెలంగాణ విద్యార్థి వేదిక, తెలంగాణ ప్రజా ఫ్రంట్, తెలంగాణ డెమొక్రటిక్ ఫ్రంట్ పేరుతో విద్యార్థులను మావోయిస్టులుగా మార్చే కుట్ర జరగుతుందని పేర్కొన్నారు. ఈ క్రమంలో తెలంగాణ విద్యార్థి వేదిక ప్రెసిడెంట్ మద్దిలేటి ఇంట్లో సోదాలు నిర్వహించినట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా ఆయన ఇంట్లో అనేక పత్రాలు, మెమొరీ కార్డులు, డీవీడీలు, సీడీలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అంతేగాకుండా సీపీఐ మావోయిస్టు పార్టీ 50 వ వార్షికోత్సవానికి సంబందించిన కరపత్రాలు కూడా లభించినట్లు పేర్కొన్నారు. అదే విధంగా తెలంగాణ విద్యార్థి వేదికకు చెందిన మద్దిలేటి, అనుదీప్, భరత్, సందీప్, కిషోర్‌లపై వరంగల్, కొత్తగూడెం, గద్వాల్, కాజీపేట ప్రాంతాల్లో పలు కేసులు నమోదయ్యాయని సీపీ తెలిపారు. మేధావుల పేరుతో కొంతమంది అమాయకపు విద్యార్థులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని వెల్లడించారు. అలాంటి వారిపై నిఘా పెంచామని.. నిషేధిత కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. -
జయరాం కేసులో నిజాలను వెలికితీస్తాం : సీపీ
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ వ్యాపారవేత్త, ఎన్నారై చిగురుపాటి జయరాం హత్య కేసు తెలంగాణకు బదిలీ అయ్యిందని హైదరాబాద్ నగర కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు. ఈ మేరకు కృష్ణా జిల్లా ఎస్పీ స్పెషల్ మెసెంజర్ ద్వారా తమకు సమాచారం చేరిందని స్పష్టం చేశారు. ఆంధ్ర ప్రభుత్వం తమకు న్యాయం చెయ్యలేదని.. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం నుంచి న్యాయం ఆశిస్తున్నానంటూ జయరాం సతీమణి పద్మశ్రీ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆమె జూబ్లీహిల్స్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. తెలంగాణ పోలీసులపై తనకు పూర్తి నమ్మకం ఉందని.. కేసును తెలంగాణకు బదిలీ చేయాలని పద్మశ్రీ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో జయరాం హత్యకేసు తెలంగాణకు బదిలీ అయ్యింది. (శిఖా చౌదరే చేయించింది: జయరాం భార్య) తమపై జయరాం భార్య ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని సీపీ స్పష్టం చేశారు. కేసుపై అనుమానాలు ఉన్న నేపథ్యంలో పూర్తిస్థాయి విచారణ చేపడుతామన్నారు. బంజారాహిల్స్ ఏసీపీ ఆధ్వర్యంలో ఈ కేసు విచారణ జరుగుతుందని చెప్పారు. జయరాం హత్య కేసులో అరెస్టై రిమాండ్‌లో ఉన్న ఇద్దరు నిందితులను కూడా విచారిస్తామని సీపీ స్పష్టం చేశారు. ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన వారిలో ఒక్కరిని కూడా వదిలే ప్రసక్తే లేదన్నారు. పూర్తిస్థాయి విచారణ జరిపి నిజాలను వెలుగుతీస్తామని సీపీ పేర్కొన్నారు. -
సోమవారమొస్తా..
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖ నూతన పోలీస్ కమిషనర్‌గా నియమితులైన ఇంటెలిజెన్స్ ఐజీ మహేష్‌చంద్ర లడ్డా సోమవారం నగరానికి వచ్చి బాధ్యతలు స్వీకరించనున్నారు. పోలీసు ఉన్నతాధికారుల బదిలీల్లో భాగంగా ఈనెల 17న నగర పోలీస్ కమిషనర్ టి.యోగానంద్ విజయవాడ అదనపు సీపీగా బదిలీ అయిన సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో సీపీగా నియమితులైన లడ్డా ప్రస్తుతం పని చేస్తున్న నిఘా విభాగంలో శాఖాపరమైన పనుల కారణంగా అమరావతిలోనే కొనసాగుతున్నారు. మరోవైపు సెలవులో ఉన్న యోగానంద్ రెండు రోజుల్లో వచ్చి రిలీవ్ కానున్న నేపథ్యంలో ఈనెల 30న లడ్డా రానున్నారు. ఈ మేరకు బుధవారం సాక్షి ప్రతినిధితో ఆయన మాట్లాడి వివరాలు వెల్లడించారు. -
పోలీసింగ్‌లో సమూల మార్పులు
వరంగల్ క్రైం : వరంగల్ పోలీసు కమిషనరేట్ మార్పులకు వేదికైంది. గతానికి భిన్నంగా పరిపాలనలో కొత్త కొత్త పద్ధతులు పురుడు పోసుకుంటున్నాయి. ప్రజలు కోరుకుంటున్న ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానంతో ప్రజలకు చేరువవుతూనే.. అసాంఘిక కార్యకలపాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. నేరం జరిగిన గంటల్లో నిందితులను అరెస్టు చేసి రికార్డులు సృష్టిస్తున్నారు. కమిషనరేట్ పరిధిలో నేరం చేయాలంటే ఒంట్లో భయం పుట్టే విధంగా నేరస్తుల నేర చరిత్ర అధారంగా పీడీ యాక్టును ప్రయోగిస్తున్నారు. వరంగల్ పోలీసు కమిషనర్ డాక్టర్ విశ్వనాథ రవీందర్ నాలుగు నెలల కాలంలోనే పోలీసింగ్‌లో సమూల మార్పులు తీసుకువస్తూ తనదైన ముద్ర వేసుకున్నారు. డీజీపీ అదేశాల మేరకు పోలీసు స్టేషన్లలో మామూళ్లు వసూళ్లపై ఉక్కుపాదం మోపారు. క్రమశిక్షణకు మారుపేరుగా నిలవాలనే లక్ష్యంతో పోలీసు శాఖలో ఒక్కొక్కటిగా ప్రక్షాళన చేస్తూ ముందుకు సాగుతున్నారు. కమిషనరేట్ పరిధిలో పాలన, పోలీసు శాఖలో వస్తున్న నూతన మార్పులపై విశ్వనాథ రవీందర్థేమంటున్నారో ఆయన మాటల్లోనే.. నేర రహిత కమిషనరేట్ దిశగా.. నేరస్తులు నేరం చేయటానికి భయపడాలి. అప్పుడే నేరాల సంఖ్య తగ్గుతుంది. నేరం చేస్తే ఏమవుతుంది.. నాలుగు రోజుల్లో బయటకు వస్తాం.. అనే భావన నేరస్తుల నుంచి పోయే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. కేసుకు సంబంధించి సరైన అధారాలు సేకరించి శిక్ష పడే విధంగా చేస్తున్నాం. దీంతో పాటు నేరస్తులకు సంబంధించిన పూర్తి వివరాలు, కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల వివరాలను కూడా నమోదు చేస్తున్నాం. దీని వల్ల నేరస్తులు ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోలేరు. నేరస్తులు ఎవ్వరిని కూడాఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు. బ్లూకోల్ట్స్‌తో విజుబుల్ పోలీసింగ్.. ప్రజలకు పోలీసులపై నమ్మకం పెరిగే విధంగా కమిషనరేట్ పరిధిలోని 12 పోలీసు స్టేషన్లలో బ్లూకోల్ట్స్ ఏర్పాటు చేశాం. ఒక్కో పోలీస్ స్టేషన్‌ను మూడు సెక్టార్లుగా విభజించి... మూడు షిప్ట్‌లలో బృందాలు 24 గంటలు గస్తీ నిర్వహించేలా చర్యలు చేపట్టాం. గతంలో నేరస్తుల వివరాలను సీ డాట్ (క్రిమినల్ డాటా) ద్వారా నమోదు చేయడం జరిగింది. దీంతో బ్లూకోల్ట్స్ బృందాలు నేరస్తుడి ఇంటి పరిసర ప్రాంతాలకు వెల్లగానే ట్యాబ్‌లో ఇండికేషన్ వస్తుంది. దీంతో నేరస్తుల కదలికపై నిరంతరం నిఘా పెట్టడం జరుగుతుంది. బ్లూకోల్ట్స్ ద్వారా కమ్యూనిటి పోలీసింగ్, విజుబుల్ పోలీసింగ్, బందోబస్తు, ఇంటెలిజెన్స్, క్రిమినల్ సర్వే జరుగుతాయి. అసాంఘిక కార్యకలాపాలపై ‘టాస్క్’తో ఉక్కుపాదం.. ప్రభుత్వం నిషేధించిన గుట్కా, మట్కా, సట్టా, వ్యభిచారం వంటి అసాంఘిక కార్యకలాపాలపై టాస్క్‌ఫోర్స్‌తో ఉక్కుపాదం మోపుతున్నాం. 90 శాతం గుట్కా వ్యాపారులపై కేసులు నమోదు చేశాం. గుట్కా సరఫరా చేసే వ్యాపారులు ఎక్కడ ఉన్నా కేసులు పెట్టడం జరిగింది. భూకబ్జాదారులు, రౌడీలు ప్రజలకు ఇబ్బందులు కలుగజేస్తే ఊరుకోం. అసాంఘిక కార్యకలపాలను ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదు. త్వరలో మార్కెట్ ఇంటెలిజెన్స్.. ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని జరిగే మోసాలను అరికట్టేందుకు కమిషనరేట్ పరిధిలో త్వరలో మార్కెట్ ఇంటెలిజెన్స్ వ్యవస్థను ఏర్పాటు చేస్తాం. నకిలీ సర్టిఫికెట్లు, ఫోర్జరీ, సైబర్ నేరాలు, చిట్టీల పేరుతో చేసే మోసాలు తదితర అంశాలపై నిరంతరం నిఘా పెట్టేందుకు మార్కెట్ ఇంటెలిజెన్స్ విభాగం పనిచేస్తుంది. ట్రాఫిక్ నియంత్రణలో మార్పులు.. హైదరాబాద్ తర్వాత వరంగల్‌లో రోజురోజుకూ వాహనాల సంఖ్య పెరుగుతుంది. సుమారు 25వేల ఆటోలు, 5 లక్షల ఇతర వాహనాలు నగరంలో తిరుగుతున్నాయి. గ్రేటర్ మునిసిపల్ కార్పొరేషన్ సహకారంతో ట్రాఫిక్ సిగ్నళ్లను పునరుద్ధరిస్తున్నాం. ట్రాఫిక్ సిబ్బందికి హైదర్బాద్ నుంచి నిపుణులను పిలిపించి నిబంధనలపై శిక్షణ ఇప్పించాం. త్వరలో కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తాం. జంక్షన్లలో వాహనాలు అదుపు చేయడం ఎలా.. వాహనదారులతో ఎలా ప్రవర్తించాలి.. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన వాహనదారులకు కౌన్సెలింగ్‌ను ఈ కేంద్రం నుంచి ఇస్తాం. దీంతో పాటు పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాం. పద్ధతి మార్చుకోకుంటే వేటే.. కమిషనరేట్ పరిధిలో పనిచేసే అధికారులు, సిబ్బంది చాలా సమర్థవంతులు. ఈ విషయం అనేక సందర్భాల్లో నిరూపితమైంది. అందరు కూడా శిక్షణ పొందిన వారే. ఎంతో శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. అందరికీ నేను చెప్పే విషయం ఒక్కటే. తప్పు ఎవ్వరు చేసిన క్షమించాను. ఇప్పటివరకు ఎలా ఉన్న ఇప్పుడు పద్ధతి మార్చుకోవాలి. కమిషనరేట్ పరిధిలో యూనిఫాం సర్వీస్ అందాలి. పోలీసులందరూ బాధ్యతగా ప్రవర్తించాలి. ప్రజలకు పోలీసులు ఉన్నారనే నమ్మకం కలగాలి. ఎవ్వరైనా మారకుంటే మారడానికి అవకాశం ఇస్తాను, అయినా పద్ధతి మార్చుకోకుంటే వేటు తప్పదు. షీటీమ్స్ సిబ్బందికి శిక్షణ.. మహిళలు, యువతల భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదు. షీటీమ్స్ సిబ్బందికి శిక్షణ ఇవ్వడం జరిగింది. దీంతోపాటు నగరంలోని పోలీసు స్టేషన్లలో 15 వర్టికల్స్, గ్రామీణ ప్రాంతంలో 12 వర్టికల్స్ (విభాగాలు)లలో స్టేషన్లో పనిచేసే పోలీసులందరికీ బాధ్యతలను అప్పగించడం జరిగింది. దీని వల్ల వృతి పట్ల బాధ్యతాయుతంగా ప్రవర్తించడం జరుగుతుంది. క్రమశిక్షణతో నేరాలను అదుపు చేసే అవకాశం ఉంది. ప్రజలకు ఎక్కడైనా.. ఎవ్వరైనా ఇబ్బందులకు గురిచేస్తే స్థానిక పోలీసులకు వెంటనే సమాచారం ఇవ్వాలి. ఇప్పటికే కమిషనరేట్ పరిధిలో 626 గ్రామాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాం. దీనివల్ల నేరాల సంఖ్య తగ్గుతుంది. దీంతోపాటు ఎక్కడైనా నేరం జరిగిన వెంటనే సీసీ కెమెరాల అధారంగా నేరస్తులను పట్టుకోవడం జరుగుతుంది. నగరంలో రెండు మూడు నెలల్లో అన్ని కాలనీలలో సీసీ కెమెరాల ఏర్పాటు పూర్తవుతుంది. సిబ్బంది సంక్షేమానికి పెద్దపీట.. కమిషనరేట్ పరిధిలో పనిచేసే సిబ్బంది సంక్షేమం కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. సర్వీస్ పరంగా వారికి అందాల్సిన పదోన్నతులు, ఇంక్రిమెంట్లు, ఇతర సర్వీసులలో ఎక్కడ జాప్యం జరుగకుండా చూస్తున్నాం. సిబ్బంది, సీపీఓ కార్యాలయ సిబ్బందితో ఒక వాట్సప్ గ్రూప్ ఏర్పాటు చేశాం. ఎవ్వరికి ఏం ఇబ్బంది ఉన్నా.. ఆ గ్రూప్‌లో పోస్టు చేసిన మూడు రోజుల్లో పరిష్కారం అవుతుంది. ఈ విషయం కూడా గ్రూప్‌లో పోస్ట్ చేసేలా ఆదేశాలు ఇచ్చాం. కమిషనరేట్ పరిదిలో సుమారు 3 వేల మంది నిరుద్యోగ అభ్యర్థులకు వివిధ ప్రాంతాల్లో కోచింగ్ ఇస్తున్నాం. పోలీసు స్టేషన్లకు త్వరలో వాహనాలు అందిస్తాం. ఎవ్వరికి ఇబ్బంది ఉన్నా.. సమస్యలు పరిష్కారం కాకున్నా నేరుగా సంప్రదించవచ్చు. నేరస్తులు పద్ధతి మార్చుకోకుంటే శిక్ష పడడం ఖాయం. -
చాప్టర్ IX
పోలీస్ కమీషనర్ బంగ్లా. లోధి ఎస్టేట్. న్యూఢిల్లీ.నేటినుంచి రష్యాలో జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో ఆతిథ్య జట్టుతో తలపడనున్న సౌదీ అరేబియా.ఇసుక తుపాన్లతో, భారీ వర్షాలతో ఉక్కిరి బిక్కిరవుతున్న దేశ రాజధాని. రెండు రోజుల నుండి కురుస్తున్న....‘‘హలో...’’...భయాందోళనలో ప్రజలు. మరో నాలుగు రోజుల వరకు పరిస్థితి ఇలానే కొనసా...‘‘నానీ! టీవీ వాల్యూం కొంచెం డౌన్ చెయ్. హలో.. కమిషనర్ అరవింద్ కుమార్ స్పీకింగ్..’’‘‘హలో అరవింద్ సర్! నేను రమేష్‌ని మాట్లాడుతున్నా. పదేళ్ళ క్రితం ఏలూరులో మీ సబార్డినేట్‌గా పనిచేశాను సర్.’’‘‘హే రమేష్! ఎలా ఉన్నావ్? ఏంటి ఇంత సడన్‌గా కాల్ చేశావ్? హౌ ఈజ్ యువర్ ఫ్యామిలీ?’’‘‘అందరూ బావున్నాం సర్. ఒక ఇంపార్టెంట్ విషయం చెబ్దామని కాల్ చేశా. పదేళ్ళక్రితం మనం ఏలూరులో పనిచేసేటప్పుడు అన్ సాల్వ్డ్ మిస్టరీగా మిగిలిపోయిన రైల్వే హాకర్ మర్డర్ కేస్కి ఫైనల్‌గా సమాధానం దొరికింది సర్.’’‘‘వా... వాట్? కమ్ అగైన్.’’‘‘మీకు తెలిసే ఉంటుంది.. త్రీ డేస్ బ్యాక్ డెబ్బై రెండేళ్ళ నాగ్‌పూర్ మాఫియా డాన్ విలాస్ రావ్ దండేర్కర్ హార్ట్ అటాక్‌తో చనిపోయిన సంగతి. ఆఖరి కోరికగా తను చనిపోయిన తర్వాత వాడి ఆటో బయోగ్రఫీ విడుదల చెయ్యాలని ఫ్యామిలీ మెంబెర్స్కి చెప్పి బుక్స్ కూడా ఎప్పుడో ప్రింట్ చేయించేశాడంట సర్.’’ ‘‘సో..?’’‘‘ఆ బుక్ ‘మై కన్ఫెషన్స్ – విలాస్ రావ్ దండేర్కర్’ మార్కెట్లోకి నిన్నే రిలీజ్ అయ్యింది. ఆ బుక్‌లో చాప్టర్ 9 మీరొక్కసారి చదవండి సర్.’’‘‘కమాన్ రమేష్! అసలేముంది ఆ బుక్‌లో? ఏలూరులో జరిగిన మర్డర్‌కి, నాగ్‌పూర్ మాఫియా డాన్‌కి సంబంధం ఏంటి?’’‘‘బిలీవ్ మీ సర్. ఒక్కసారి చదవండి. మూడేళ్ళు ఆ కేస్ మీద మీరు పడ్డ స్ట్రగుల్‌కి ఆన్సర్ దొరుకుతుంది.’’‘‘ఓకే... ఓకే... డెఫినెట్‌గా చదువుతాను. బట్...’’‘‘పదేళ్ళ నాటి మర్డర్ మిస్టరీ వీడిపోయింది సర్. అది నేను చెప్పడం కంటే మీరు చదివి తెలుసుకుంటేనే బావుంటుంది. చాప్టర్ 9. బై సర్.’’‘‘ఓకే రమేశ్.. బై.’’ పోలీస్ కమిషనర్ అరవింద్ ఫోన్ పెట్టేశాడు.‘‘వాట్ హాపెండ్ డాడ్? ఎవరు ఫోన్లో..’’ అరవింద్ కొడుకు నాని అడిగాడు.‘‘నథింగ్. నేను బైటకి వెళ్తున్నా నానీ.’’‘‘ఇంత పెద్ద వర్షంలోనా? కమాన్ డాడ్.. మీరేగా కలిసి ఫుట్‌బాల్ మ్యాచ్ చూద్దామన్నారు..’’.‘‘సారీ నానీ! ఐ హావ్ టు గో నవ్. రియల్లీ సారీ. డిన్నర్ చేసేయ్, నాకోసం వెయిట్ చెయ్యకు.’’‘‘ఎంత టైం పడుతుంది డాడ్? ఆఫీస్ వర్కా? కాదంటే చెప్పండి ఈరోజు డ్రైవర్ రాలేదుగా నేనొచ్చి కార్ డ్రైవ్ చేస్తా...’’ ‘‘నో. బయట చూడు ఎంత పెద్ద వర్షం పడుతోందో. ఇట్స్ నాట్ సేఫ్ అవుట్ దేర్. మ్యాచ్ చూసి డిన్నర్ చేసి పడుకో. చిన్న పనే. చూసుకుని నేను వచ్చేస్తా.’’కార్ ఇంజిన్ స్టార్ట్ అయ్యింది.హెడ్ లైట్స్ ఆన్ అయ్యాయి. వైపర్స్ అటూ ఇటూ కొట్టుకుంటున్నాయి. కారు బంగ్లానుండి బయటకి వచ్చింది. అరవింద్‌ని కారు ముందుకి తీసుకువెళ్తోంటే... కాలం వెనక్కి తీసుకెళ్తోంది. 2008. ఏలూరు.గంటకి 182 కిలోమీటర్ల వేగంతో తీరం దాటనున్న తుఫాన్......దేశంలోని ప్రజల్ని పది సంవత్సరాలుగా మోసం చేస్తున్న ఆ దేశ ప్ర...నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా......రైల్వే స్టేషన్లో నిన్న రాత్రి జరిగిన సంఘటనకి...‘‘అబ్బబ్బబ్బా.. రేయ్ నానీ! ఒక్క చానల్ ఉంచలేవా, అస్తమానూ మారుస్తూ ఉంటావ్. అసలే అర్ధరాత్రెళ్లిన మనిషి ఇంకా ఇంటికి రాలేదు. చూస్తుంటే ఈ వానేమో ఆగి చచ్చేట్టులేదు. ఎక్కడున్నారో ఏంటో మీ నాన్నకోసారి ఫోన్ చెయ్.’’ టీవీ చూస్తున్న నానీతో అరుస్తున్నట్టు మాట్లాడింది వాళ్లమ్మ. పచ్చదనానికి, ప్రశాంతతకి నిలయమైన పశ్చిమ గోదావరి జిల్లా హెడ్ క్వార్టర్స్ ఏలూరు నగరం అర్ధరాత్రి అకస్మాత్తుగా పేలిన తుపాకీ శబ్దానికి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. జిల్లాలో తుపాకీతో చేసిన హత్య ఇదేమొదటిదవడంతో నగరవాసులు తీవ్ర భయాందోళనకి గురవుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాల్ని జిల్లా ఎస్పీ అరవింద్ కుమార్ గార్ని అడిగి తెలుసుకుందాం.‘‘అమ్మా! ఇలా రా. ఫోనెందుకు, డైరెక్ట్‌గా టీవీలో చూద్దువుగాని నాన్నని.’’ అన్నాడు నాని చిన్నగా నవ్వుతూ. ‘‘ఇట్స్ ఎ క్వైట్æ షాకింగ్ ఇన్సిడెంట్ టు అస్. గన్ కల్చర్ అనేది ఈ జిల్లాలో ఇప్పటివరకు లేదు. సమ్ వన్, మేబీ సమ్ పీపుల్.. ఈ ఊరు పద్ధతుల్ని మార్చాలని అర్ధరాత్రి అలా జస్ట్ లైక్ దట్ ట్రిగ్గర్ పుల్ చేశారు. ఒక మనిషిని చంపారు. ఈ ఏలూరు పెద్ద రైల్వే స్టేషన్లో హాకర్ అతను. పేరు నిమ్మకాయల నాగరాజు అలియాస్ రాజు. వి ఆర్ టేకింగ్ దిస్ కేస్ వెరీ సీరియస్ అండ్ హియర్ అయాం గివింగ్ మై వర్డ్ టు ది పీపుల్ ఆఫ్ ఏలూరు – డోంట్ పానిక్. వి విల్ హంట్ దిస్ గై డౌన్ అండ్ బ్రింగ్ బాక్ పీస్ టు ది సిటీ..’’ మీడియాతో మాట్లాడి పక్కకొచ్చాడు అరవింద్. ‘‘రమేశ్! కమాన్ కమ్ హియర్. ఇంత వర్షంలో కూడా ఎలా వచ్చింది ఈ బ్లడీ మీడియా. అసలు జనాన్ని సగం భయపెట్టేది వీళ్లే. జనం బాగా భయపడుతున్నారని వాళ్లకి కొంచెం ధైర్యం చెబుదామని నేనే మాట్లాడా. సరే! కేస్ గురించి రైల్వే పోలీస్ ఏమంటున్నారు?’’ సబార్డినేట్ రమేశ్‌ని పిలిచి ప్రశ్నించాడు అరవింద్. ‘‘అదే సర్! వాళ్ళు హేండిల్ చేస్తారంట ఈ కేస్‌ని.’’‘‘హేండిల్ చేస్తారా? ఎవరు వాళ్ళేనా? అయినా కేస్ గురించి వాళ్ళనెవడగుతాడు రమేశ్. సొసైటీ, మీడియా, హయ్యర్ అథారిటీస్ అందరూ పడేది మనమీదేగా. వాళ్ళు గనుక ఇన్వెస్టిగేషన్ చేస్తే ఓ పదేళ్ళు పడుతుంది కేస్ క్లోజ్ చెయ్యడానికి. చెప్పు... కేస్ మనమే తీసుకుంటున్నామని.’’‘‘ఓకే సర్ మాట్లాడతా. రాజు బాడీని అటాప్సీకి పంపించేశాం సర్. నిన్నరాత్రి రాజుతో పాటున్న ఇంకో రైల్వే హాకర్ శీనుని రైల్వే పోలీస్ స్టేషన్లో ఉంచి విచారిస్తున్నాం. ఏడుస్తున్నాడు కానీ ఏమీ చెప్పడంలేదు. షాక్‌లోనుండి ఇంకా తేరుకోలేదనిపిస్తోంది సర్.’’‘‘ఓకే! లెట్స్ సీ. పదండి’’.అరవింద్, రమేశ్ బయల్దేరారు. ‘‘ఈ రూమ్‌లో లైట్స్ లేవా? ఆన్ చెయ్యండి. వీడేనా?’’ అరవింద్ గట్టిగా మాట్లాడుతూ వచ్చాడు. ‘‘ఎస్ సర్!’’‘‘ఆ కిటికీలు మూసేయండి. జల్లు పడుతోంది లోపలకి. నీ పేరేంటి?’’‘‘సర్ అడుగుతున్నారుగా సమాధానం చెప్పు.’’‘‘సారు. నా పేరు శీనండి.’’ శీను నోరువిప్పాడు భయపడుతూ. ‘‘రైల్వే స్టేషన్లో ఏం చేస్తుంటావ్?’’ ‘‘ప్లాట్ఫారంమీద, రైల్లో కూల్డ్రింకులు, వాటర్ బాటిల్లు అమ్ముతాను సారు.’’‘‘రాజు నీకెలా తెలుసు?’’‘‘రేయ్ రేయ్... ఆపరా ఆ ఏడుపు. ఇది సర్ వీడి పరిస్థితి. వాడి పేరెత్తంగానే వీడేడుపెత్తుకుంటున్నాడు.’’ రమేశ్ కోపంగా అన్నాడు.‘‘వాడ్ని వీడే చంపేసుంటాడు రమేశ్. మనదగ్గర నుండి తప్పించుకోవడానికి ఇలా దొంగేడుపులు ఏడుస్తున్నాడు.’’‘‘సారు...?’’‘‘మరేంటి చెప్పు. ఇటు చూడు శీనూ! ముందు నిన్నరాత్రి ఏం జరిగిందో చెప్పు. ఇలా చెప్పకుండా నువ్వు ఆలస్యం చేసిన ప్రతి సెకనూ హంతకుడు పారిపోవడానికి హెల్ప్ అవుతుంది. హంతకుడికి హెల్ప్ చేస్తావా నువ్వు?’’‘‘లేదు సారు... లేదు. సెప్తా. రాజుగాడు, నేను సిన్నప్పట్నుండి స్నేహితులం సారు. పక్క పక్క ఇళ్లు. కలిసి పెరిగాం. ఒకేసోట సదువుకున్నాం. ఇప్పుడొకేసోట పనిజేత్తన్నాం సారు. ఆడు కూడా నాలానే ఇక్కడ కూల్డ్రింకులు, వాటర్ బాటిళ్లు అమ్ముతాడు. రోజూ ఇదే పనండి మాది. రోజూలానే నిన్న కూడా పన్లోకొచ్చాం. కానీ ఆ మాయదారి వాన పడకుండా ఉండుంటే రాజుగాడికి ఈ సావు తప్పేది సారు.’’‘‘ఊరుకో ఊరుకో. ఏడవకు. వానకి, రాజు హత్యకి సంబంధమేంటి?’’‘‘నిన్న కురిసిన వానకి స్టేషన్లో ఆఫీసర్లందరూ ఇంటికెళ్లిపోయారు సారు. అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ గారొక్కరే ఉండిపోయారనుకుంట. పయానం సేసేదానికి జనం కూడా గుబులు పడ్డట్టున్నారు.ఒక్కడంటే ఒక్కడు కూడా రాలేదు. మేము కూడా ఇంటికి పోయేటోల్లమే కానీ కాలక్షేపానికి కబుర్లు సెప్పుకుంటా అలా ఉండిపోయాం. ఆ సరదా కబుర్లే ఇంత కొంప ముంచిద్దనుకోలేదు సారు.’’‘‘కరెక్ట్‌గా చెప్పు నిన్నరాత్రి ఏం జరిగిందో...’’‘‘సెప్తా సారు. నిన్నరాత్రి........... అప్పటికే రాత్రి పదకొండున్నర దాటింది.‘ఏరా రాజు. ఇంకిటికి పోదామా?’ అన్నాను నేను. ‘వెల్దాంలేహె! ఓ కంగారెందుకురా. ఆ స్పెషల్ ట్రైన్ కూడా సూసేసి పోదాం.’ అన్నాడు రాజుగాడు. సిగరెట్ తాగుతా, ‘ఆహా శీనుగా. భలే మజాగా ఉందిరా ఈ వానలో సిగరెట్టు తాగుతుంటే.’ అన్నాడు. దయచేసి వినండి. ట్రైన్ నంబర్ 07101 సికింద్రాబాద్ నుండి కాకినాడ వెళ్ళవలసిన సూపర్‌ఫాస్ట్ స్పెషల్ 11:45కి ప్లాట్ఫారం నంబర్ రెండు మీదకి వస్తుంది అని వినిపిస్తుంటే ‘ఒరేయ్ శీనుగా! ఎందుకురా అదలా ఓ కూత్తది. అయినా ఏ నా కొడుకున్నాడు ఈ స్టేషన్లో దాని మాటలిండానికి.’ అంటూ ఉషారుగా మాట్లాడాడు. తర్వాత కాసేపటికి ట్రైనొచ్చింది సారు. మేమిద్దరం అలాగే కబుర్లు సెప్పుకుంటున్నాం. ఏం సూసాడో ఏమో కానీ, ట్రైన్ ఆగుతుండగా డ్రింక్ బాటిల్లు వాటర్ బాటిల్లు ఉన్న ట్రే పట్టుకుని ట్రైన్ కేసే పరిగెత్తాడు రాజుగాడు. బండాగే దిక్కుకి నా ఈపెట్టి కూసోడంతో రాజుగాడ్ని ఎవరు పిలిసారో నాకు కనపడ్లేదు సారు. కానీ ఆ బండికున్న మొత్తం డోర్లు కిటికీలు అన్నీ యేసేసున్నాయి సారు ఒక్క కిటికీ తప్ప. వాన జోరుగా పడతానే ఉంది. మావోడు వానలో తడుత్తానే తీసిన ఆ కిటికీ ఉన్న పెట్టె దగ్గరకి పరిగెత్తుకుంటా ఎల్లాడు.’’‘‘ఓకే. రాజు ఆ కిటికీ దగ్గరకెళ్ళిన తర్వాత ఏం జరిగింది?’’‘‘అదే తెలియదు సారు. పెట్టె నాకు శానా దూరంలో ఆగింది. ఆడు కిటికీలోనుండి ఎవరితోనో మాట్టాడాడు. తర్వాత ఎనక్కి తిరిగి నా వంక సూసి నవ్వాడు సారు.’’‘‘వాట్. నీ వంక చూసి నవ్వాడా? ఎందుకు?’’‘‘తెలియదు సారు. నా వంక సూసి నవ్వాక మళ్లీ కిటికీకేసి తిరిగాడు. అంతే బండి కూత పెట్టడం, ముందుకి కదలడం, రాజుగాడు నున్చున్నోడు నున్చున్నట్టే ఫ్లాట్‌ఫారం మీద పడటం.. అన్నీ సిటికెలో జరిగిపోయినాయి సారు. నేను పరిగెత్తుకెల్లి సూసేసరికి అక్కడంతా రక్తం. అటు పక్కకి పడున్న రాజుగాడ్ని నాకేసి తిప్పాను సారు. అంతే! తలంతా రక్తం. నుదురుకి బెజ్జం పడి రక్తం వత్తానే ఉంది. ఆడ్ని పిలిశా. కొట్టా. ఏ ఉలుకూ పలుకూ లేకుండా అలా పడున్నాడు. నాకు బయ్యమేసి ఎంటనే 108కి కొట్టా సారు. పోలీస్ సార్లక్కూడా సెప్పా. ఆల్లొచ్చి సూసి పాణం లేదన్నారు. రాజుగాడ్ని తీసుకొచ్చి పొడి ప్రాంతంలో పొడుకోబెట్టాం. తర్వాత ఎనక్కి తిరిగి సూసేసరికి ఫ్లాట్ఫారంమ్మీద ఒక్కటంటే ఒక్క రక్తం సుక్క ఆనవాలన్నా లేకుండా ఆ వాన దేవుడు అంతా నీటితో కడిగేశాడు సారు. ‘‘ఊరుకో శీను. రమేశ్! తనకి మంచి నీళ్ళు ఇవ్వండి.’’ లేచాడు అరవింద్. శీను దగ్గర్నుంచి అంతకన్నా మించి ఇంకే సమాధానం వస్తుందని అతననుకోలేదు. ‘‘సర్ ఆటాప్సీ రిపోర్ట్ వచ్చింది. 9 ఎంఎం బుల్లెట్ క్లోజ్ రేంజ్డ్ స్ట్రయిట్ హెడ్ షాట్ సర్. ఫింగర్ ప్రింట్స్ ఏం ట్రేస్ చెయ్యలేకపోయాం. నాకు ఈ కేస్‌లో విట్నెస్ దొరకడం కూడా ఇంపాజిబుల్ అనిపిస్తోంది సర్.’’ రిపోర్ట్ పట్టుకొని చెబుతూ ఉన్నాడు రమేశ్. ‘‘వై ఈజ్ దట్ రమేష్?’’‘‘ఆ రోజు వచ్చింది డైలీ ట్రైన్ కాదు సర్, స్పెషల్ ట్రైన్. అండ్ తుఫాన్‌కి తొంభై శాతం మంది జనం ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారు. మేము గేదర్ చేసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సెకండ్ క్లాస్ స్లీపర్ మొత్తం ఆరోజు 50 మంది మాత్రమే ప్రయాణం చేశారు. శీను చెప్పినదాని ప్రకారం చూస్తే ఆరోజు విండో ఓపెన్ చేసుంచిన కోచ్ 9 అని సస్పెక్ట్ చేసి పాసెంజర్స్ లిస్ట్ తీసుకున్నాం. ఆరోజు 9లో ముగ్గురు మాత్రమే ప్రయాణించారు సర్. భార్యాభర్తలిద్దరూ అండ్ ఒక స్టూడెంట్. వాళ్ళ బాక్గ్రౌండ్ వెరిఫై చేశాం. అంతా క్లీన్‌గా ఉంది. విడివిడిగా అడిగినప్పుడు వాళ్ళ ముగ్గురూ కూడా నాలుగో వ్యక్తిని చూడలేదనే చెప్పారు సర్. ఫైనల్లీ ఆరోజు జనమెక్కువ లేరని టీసీ కూడా టికెట్ చెకింగ్‌కి వెళ్లలేదంట సర్.’’ రమేశ్ తాను సేకరించిన వివరాలన్నీ చెప్పాడు. ‘‘వాట్ ఈజ్ దిస్ రమేశ్! ఇంకొన్ని రోజులాగితే హంతకుడే ఆరోజు తుఫాన్ తెప్పించాడంటారా? అసలు అంత పెద్ద కోచ్‌లో ఆ ముగ్గురికి కనపడకుండా ఇంకో వ్యక్తి ఉండటానికి అవకాశం లేదంటావా? వీళ్ళు కోచ్‌కి ఒక ఎండ్‌లో ఉండి నాలుగో వ్యక్తి ఇంకో ఎండ్‌లో ఉండే అవకాశం లేదంటావా?’’‘‘ఆ అవకాశం ఉంది సర్. కానీ ఆరోజు ట్రైన్ ఏలూరు నుండి బయలుదేరి వెళ్లిన తర్వాత వర్షం ఇంకా పెద్దది కావడంతో ట్రైన్‌ని కొవ్వూరులో నాలుగు గంటలపాటు ఆపేశారు. ఆ సమయంలో కోచ్‌లో ఉన్న ముగ్గురూ ఆ నాలుగో వ్యక్తిని చూసే అవకాశం లేదంటారా సర్?’’‘‘రైట్. అంటే వాడు ఆ కోచ్‌లో ఎక్కువసేపు ఉండుండడు. మనం ఎక్కడో ఏదో పాయింట్ వదిలేస్తున్నాం రమేశ్. ఒక రైల్వే హాకర్‌ని గన్‌తో కాల్చాల్సిన అవసరం ఎవరికుంటుంది? పైగా రాజుకి శత్రువులు కూడా ఎవరూ లేరు. ఉన్నా గన్‌తో కాల్చేంత స్కెచ్ వెయ్యగలరని నేననుకోవడం లేదు. హత్యకి క్లూ దొరకలేదు. మోటివ్ కనిపించట్లేదు. విట్నెస్ కూడా లేరు. ఇదంతా పకడ్బందిగా చేసిన హత్యా లేదా ఎవరైనా ఆకతాయిల పనా? ఎవరు చేసుంటారు రమేశ్ ఇదంతా?’’ ‘‘.... ఎవరు? ఎవరు?’’. కాలం పదేళ్లనాటి సంగతుల్ని, కారు పావుగంట ప్రయాణాన్ని ముగించుకుని ఆక్స్ఫర్డ్ బుక్‌స్టోర్ ముందుకొచ్చి ఆగాయి.‘‘గుడ్ ఈవినింగ్ సర్! హౌ మే ఐ హెల్ప్ యు?’’ నవ్వుతూ పలకరించాడు స్టోర్‌కీపర్. ‘‘యా! డూ యు హావ్ ద బుక్ ‘మై కన్ఫెషన్స్’ బై విలాస్ రావ్ దండేర్కర్?’’ అరవింద్ ఆ పుస్తకాన్ని చేతుల్లోకి తీసుకోవడానికి ఎంతో ఉత్సాహంగా ఉన్నాడు.‘‘జస్ట్ ఏ సెకండ్ సర్! యా వియ్ హావ్ ద బుక్ సర్. ఓవర్ దేర్ సిక్స్త్ రో ఫోర్త్ రాక్ సర్.’’ చెయ్యి ఆ రేక్ వైపు చూపిస్తూ చెప్పాడు స్టోర్‌కీపర్. ‘‘థాంక్యూ.’’ అంటూ ఆ రేక్ వైపుకు బయలుదేరాడు అరవింద్. బుక్ అందుకొని నేరుగా చాప్టర్ 9 ఉన్న పేజీకి వెళ్లిపోయాడు. చాప్టర్ IX నా తోడబుట్టిన తమ్ముడే నన్ను చంపాలనుకున్నాడు. చంపి నా కుర్చిలో కూర్చుని నేను నిర్మించిన చీకటి సామ్రాజ్యాన్ని ఏలాలనుకున్నాడు. భాయ్ భాయ్ అని ఆప్యాయంగా పిలుస్తూనే నన్ను చంపడానికి నా వెనుక పెద్ద కుట్ర రచించాడు.2008. అక్టోబర్. నాగ్‌పూర్‌లో రోజూ ఏదో ఒక సమయంలో వర్షం పడుతుండేది. తెల్లవారుజామున నాగ్‌పూర్ నుండి పెళ్లికని కారులో బయలుదేరి వెళ్తున్న మామీద దారి మధ్యలో ఎటాక్ జరిగింది. మేం కూడా వాళ్లమీద తిరిగి కాల్పులు జరిపాం. ఏడుగురున్న మా గుంపులో నలుగురు స్పాట్లో చచ్చిపోయారు. అందులో వికాస్ బాడీలో 32 బుల్లెట్లు దిగాయి నన్ను కవర్ చేసినందుకు. మిగిలిన ఇద్దర్ని నాగ్‌పూర్‌లో జరుగుతున్న విషయాలు తెలుసుకోమని పంపించి నేను ఆంధ్రా పారిపోయా. నా ప్రయాణమంతా వర్షమే. నేను తప్పించుకోవడానికి ఆ వర్షమే నాకు తోడయ్యింది. నేను ఆంధ్రాలోని వరంగల్ చేరే వేళకి చీకటి పడుతుంది. నాకు ప్రొటెక్షన్ ఇవ్వగలిగే ఒక ఆంధ్రా స్నేహితుడి దగ్గరకి వెళ్ళడానికి వరంగల్‌లో ట్రైన్ ఎక్కాను.ట్రైన్ అంతా దాదాపు ఖాళీగా ఉంది. వర్షాల వల్లనేమో ట్రైన్కున్న డోర్లు, కిటికీలు అన్నీ మూసేశారు. ట్రైన్ ఎక్కినప్పటినుంచి ఏ కోచ్‌లోనూ అరగంటకి మించి ఎక్కువసేపు ఉండలేదు నేను. ప్రమాదం నాకెంత దూరంలో ఉందో తెలియక ప్రతి అరగంటకి ఒక్కో కోచ్ మారుతూ పోయా. ఏ కోచ్‌లోనూ పెద్ద జనం లేరు. నా అరవయ్యేళ్ళ వయసుకి నన్ను అనుమానించినవారు, ప్రశ్నించినవారు ఎవ్వరూ లేరు. ఓ రెండు గంటల తరవాత ఎప్పుడు పట్టిందో తెలియకుండా నిద్ర పట్టేసింది. ఎంతసేపు పడుకున్నానో అలా!మెలకువొచ్చేసరికి ట్రైన్ మెల్లగా వెళ్తోంది. బాగా దాహం వేసింది. ట్రైన్ విండో ఐరన్ షట్టర్ పైకెత్తి బయటకి చూశా. వర్షం, చల్లగాలి ఒక్కసారిగా లోపలికి దూసుకొచ్చాయి. చీకటి తప్ప బయటేమీ కనిపించలేదు. చాలాసేపట్నుంచి అదే కోచ్‌లో ఉండిపోవడంతో వెంటనే లేచి వేరే కోచ్‌కి వెళ్ళిపోయా. నా దాహానికి గొంతెండుకుపోయింది. ఏదైనా స్టేషన్ వస్తుందేమోనని షట్టర్ పైకెత్తి బయటకి చూస్తూనే ఉన్నా. మెల్లగా నా గొంతు పిడచకట్టుకుపోయింది. లాలాజలం ఊరక నాలుక ఎండిపోయి నోట్లో అటూ ఇటూ తిప్పడానికి కూడా కష్టంగా తయారయ్యింది. అప్పుడే జీవితంలో నీళ్ల విలువేంటో తెలిసింది. కిటికీలోనుండి నా కుడిచేయి బయటకి పెట్టా. వాన నీటికి తడిచిన చేతి వేళ్లని నాలుక మీద రాసుకున్నా. తేడా తెలియలేదు. నీళ్ళే కావాలి తాగడానికి. చూశా, చూశా, చూస్తూనే ఉన్నా. ట్రైన్ వెళ్తోంది కానీ ఏ స్టేషన్లోనూ ఆగట్లేదు. ఆ సమయంలో నీళ్ల కోసం నేను పడిన యాతనతో పోల్చుకుంటే ఇన్నేళ్ల నా జీవితంలో నేనసలు ఏ బాధలూ పడలేదనే చెప్పాలి. నేను నా ప్రాణాన్ని లెక్కచెయ్యను కానీ ఇంకిలాంటి బాధ ఎక్కువసేపు పడలేననిపించింది. ఎక్కడో నాగ్‌పూర్‌లో పుట్టి పెరిగిన నాకు, ఇక్కడింత బాధేంటో అని అనుకుంటుండగానే ట్రైన్ వేగం తగ్గింది. షట్టర్ పైకెత్తి చూశా. ఏదో స్టేషన్ వచ్చింది. ఆనందంలో వాటర్ బాటిల్స్ ఎక్కడున్నాయో అని ప్లాట్ఫారం మీద వెతికాను. కనిపించాయి. రెండు ట్రేల్లో వాటర్ బాటిల్స్, డ్రింక్స్ పక్కన పెట్టుకుని ప్లాట్ఫారం మీద కబుర్లు చెప్పుకుంటున్న ఇద్దరు మనుషులు కనిపించారు. నేను ట్రైన్లో నుండి చెయ్యి బయటకి పెట్టి ఊపుతూ వాటర్ అని బొటన వేలు చూపించా. ఇద్దరిలో ఒక వ్యక్తి నన్ను చూసి ట్రే తీసుకుని నేనున్న కోచ్ వైపుకి పరిగెత్తాడు. ట్రైన్ ఆగింది. వర్షం మాత్రం ఆగకుండా అలా పడుతూనే ఉంది. ఆ మనిషి ట్రే పట్టుకుని నా దగ్గరకు రాగానే వాటర్ బాటిల్స్ అని చెప్పి నా పర్స్లోనుండి చేతికి తగిలిన నోటు తీసి అతనికిచ్చా. వర్షంలో తడిసిపోతుందని అతను నా చేతిలో ఉన్న నోటుని టక్కున లాక్కున్నాడు. లాక్కునేటప్పుడు చూశా, అది వెయ్యి రూపాయిల నోటు. అతను నోటుని తీసుకుని జేబులో పెట్టుకుని వాటర్ బాటిల్స్ ఇవ్వకుండా వెనక్కి తిరిగి అక్కడెక్కడో కూర్చుని ఉన్న ఇంకొకడి వైపు చూసి నవ్వాడు. వాడలా ఎందుకు నవ్వాడో ఆ క్షణంలో నాకర్థం కాలేదు. అలా నవ్వుతూనే వాడు నా వైపుకి తిరిగి మెల్లగా వెనక్కి జరిగాడు. నేను ట్రే వైపు చూపిస్తూ బాటిల్స్ అని కళ్ళతో అడిగా. వాడు నన్ను చూసి నవ్వుతున్నాడు కానీ బాటిల్స్ ఇవ్వడం లేదు. అప్పుడర్థమైంది వాడు నన్ను మోసం చెయ్యబోతున్నాడని. నేను డబ్బుల్ని లెక్క చెయ్యను కానీ నాకివ్వాల్సిన వాటర్ బాటిల్స్ కూడా ఇవ్వకుండా నా నుండి, వర్షం నుండి వెనక్కి జరుగుతుంటే కోపంతో నేను వాడ్ని అలా చూస్తూ ఉండిపోయా. వాడు కూడా ఈ అరవయ్యేళ్ళ ముసలోడు ఏం చేస్తాడ్లే అనే ఆలోచనతోనేగా నన్నిలా మోసం చేశాడు. నా జీవితంలో వాడికంటే దారుణమైన మనుషుల్ని చూశా. వాడినలాగే చూస్తూ నలభై ఏళ్లుగా నా వొంట్లో ఒక భాగమైపోయిన దానికోసం కుడి చేయి వెతికింది. పక్కన పెట్టిన కోట్లోకి చెయ్యి పోయింది.దొరికింది నా స్టార్ పిస్టల్. 92 మోడల్. టక్కున తీసి కిటికీలోపలనుండే ఆ మనిషికి గురి పెట్టా. అది కనబడగానే ఆ మనిషి మొహమ్మీద నవ్వు మాయం అయింది. గన్ చూడగానే చాలామంది షాక్‌లోకి వెళ్లిపోతారు. మెదడు మొద్దుబారిపోతుంది. వాడు కూడా షాక్లోకెళ్లిపోయాడు. వాడికి తగిలిన షాక్ భయంగా మారే సమయంలోనే... అసలు ఏం జరుగుతుందో మెదడుకి అర్థమయ్యే సమయంలోనే ట్రైన్ హార్న్ బ్లో చేశారు. నేను ట్రిగ్గర్ నొక్కాను. ట్రైన్ మెల్లగా కదిలింది. బులెట్ వేగంగా వెళ్లి వాడి నుదురిని చీల్చి తల్లోపలికెళ్లింది. వాడి చేతిలో ఉన్న ట్రే ఎగిరిపడింది. బాటిల్స్ అన్నీ చెల్లా చెదురయ్యాయి. వాడు నున్చున్నోడు నున్చున్నట్టే కుప్పకూలిపోయాడు. ప్లాట్ఫారం మీద చిమ్మిన వాడి రక్తం వర్షం కడిగెయ్యడమే నాకాఖరిగా కనిపించింది. అప్పుడంటే ఉద్రేకంలో చేశా కానీ, తర్వాత నా జీవితంలో ఈ సంఘటన తలచుకుని చాలాసార్లు బాధపడ్డాను. ‘‘సర్! ఎక్స్క్యూజ్ మీ సర్. వి ఆర్ క్లోజింగ్. డు యు వాంట్ ద బుక్, సర్?’’ స్టోర్‌కీపర్ మాటలతో చాప్టర్ 9 నుంచి బయటకొచ్చాడు అరవింద్. ‘‘యా! బిల్ ఇట్ ఫర్ మీ.’’ అన్నాడు ఏ భావం లేకుండా. కమిషనర్ అరవింద్ కుమార్ బుక్ స్టోర్ బైట గోడకానుకుని బంగారు కాంతిని వెదజల్లే సోడియం లైట్ల వెలుగులో వర్షాన్ని చూస్తూ తనలో తాను ఇలా అనుకుంటున్నాడు –‘పదేళ్ల క్రితం ఓ వర్షం పడిన రాత్రి జరిగిన మర్డర్ మిస్టరీకి సమాధానం ఈరోజు రాత్రి ఈ వర్షంలో తెలిసింది. నిజంగా వర్షానికి, దీనికి ఏమైనా సంబంధం ఉందా? లేదా ఇదంతా జస్ట్ కో ఇన్సిడెన్సా? ఏమో నిజంగా మనిషి మెదడుకి అందని విషయాలు ఇంకా ఎన్నున్నాయో!’అదే సమయంలో టీవీ చూస్తూ అరవింద్ కొడుకు నానీ కూడా తనలో తాను అనుకుంటున్నాడు – ‘డాడ్ ఇంకా రాలేదేంటి? ఫుట్‌బాల్ మ్యాచ్ కూడా అయిపోయింది. డిన్నర్ చేసి పడుకోమన్నారుగా డాడ్, ఇప్పుడు ఫోన్ చేస్తే డిస్టర్బ్ చేసినట్టు ఫీల్ అవుతారేమో?’టీవీ మోగుతూనే ఉంది – బ్రేకింగ్ న్యూస్... బ్రేకింగ్ న్యూస్...ఢిల్లీ జన్‌పథ్ రోడ్లో బ్రేక్స్ ఫెయిలయిన ఒక ట్రక్ రెండు బైకులు, ఒక కారు మీదనుండి దూసుకెళ్లడంతో అక్కడ భారీ ట్రాఫిక్ జామ్ అయింది. వర్షం పడుతుండటం వల్ల సహాయక చర్యలకి ఆలస్యమవుతుందని అక్కడున్న అధికారులు చెప్తున్నారు. మాకున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం యాక్సిడెంట్‌కి గురైన కారు ఢిల్లీలోని ఒక ప్రభుత్వశాఖ ఉన్నతాధికారిదని తెలిసింది. అయితే ప్రస్తుతం ఆ కారులో ఎవరున్నారో ఇంకా తెలియాల్సి ఉంది.వర్షం... వర్షం... వర్షం... అది మాత్రం ఆగకుండా అలా పడుతూనే ఉంది. ఎవరున్నారో ఇంకా తెలియాల్సి ఉంది.వర్షం... వర్షం... వర్షం... అది మాత్రం ఆగకుండా అలా పడుతూనే ఉంది. - కె.ఎన్. మనోజ్ కుమార్ -
వాటిపై దృష్టి పెడతాం : విజయవాడ సీపీ
సాక్షి, విజయవాడ : నగర పోలీస్ కమీషర్‌గా ద్వారకా తిరుమల రావు గురువారం బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిటీలో ఎటువంటి సవాళ్లనైనా స్వీకరిస్తామని చెప్పారు. నగరంలో ప్రాధాన్య అంశాలపై దృష్టి పెడతామని, ఆర్థిక నేరాలు, సైబర్ క్రైమ్‌పై దృష్టి సారించినున్నట్లు తెలిపారు. ప్రజలను అప్రమత్తం చేసి అవగాహన కల్పిస్తామని, జనరల్ క్రైమ్‌ను కూడా అరికట్టడానికి కృషి చేస్తానని చెప్పారు. రాజధాని నగరంలో వీఐపీల తాకిడి పెరుగుతోందని, తద్వారా ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉందని అన్నారు. మహిళలు, పిల్లల రక్షణకు ప్రత్యేక చర్యలు చేపడతామని చెప్పారు. మహిళా మిత్రలను మరింత మలోపేతం చేస్తామని, నగర ప్రజల్లో భద్రతా భావం పెంచుతామని పేర్కొన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటానని చెప్పిన ఆయన ప్రజలనుంచి సలహాలు తీసుకుంటామని అన్నారు. బాధ్యతలను స్వీకరించడానికి ముందు కమీషనర్ ద్వారకా తిరుమల రావు ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్నారు. ఈసందర్భంగా ఆలయ సిబ్బంది ఆయనకు సాదర స్వాగతం పలికారు. ఆ తరువాత మల్లికార్జున స్వామిని దర్శించుకొని ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా సీపీ ద్వారకా తిరుమలరావు మాట్లాడుతూ.. బాధ్యతలు చేపట్టే ముందు అమ్మవారి ఆశీర్వాదం కోసం వచ్చానని అన్నారు. నగరంలో ప్రజలు అందరు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. విధి నిర్వహణలో సమర్ధవంతంగా పని చేసే శక్తి ఇవ్వాలని అమ్మవారిని వేడుకున్నట్లు చెప్పారు. -
‘ఒక్క ర్యాగింగ్ కేసు నమోదు కానివ్వం’
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది కాలంలో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో కేవలం రెండు ర్యాగింగ్ కేసులు మాత్రమే నమోదయ్యాయి. వచ్చే సంవత్సరం ఒక్క ర్యాగింగ్ ఘటన చోటుచేసుకోకుండా పనిచేస్తామని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ అన్నారు. కాలేజీలలో ర్యాగింగ్ రూపు మాపాలనే ఉద్దేశంతో బషీర్‌బాగ్‌లోని పోలీస్ కమిషనర్ కార్యాలయంలో బుధవారం యాంటీ ర్యాంగింగ్ అవగాహనా కార్యాక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ అంజనీకుమార్ మీడియాతో మాట్లాడుతూ.. ర్యాగింగ్‌కు పాల్పడే విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కళాశాల యాజమాన్యాలు ర్యాగింగ్ నిర్మూలనపై, చట్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు. హైదరాబాద్ పోలీసులు, షీ టీమ్స్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో అడిషనల్ సీసీ షికా గోయల్, అన్ని జోన్ల డీసీపీలు, కాలేజీ రిజిస్ట్రార్లు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
‘లేడీ సింగం’ నైటౌట్.. టెన్షన్ టెన్షన్!
పంచకుల : బాధ్యతలు చేపట్టిన తొలిరోజు నుంచే ఓ లేడీ సింగం గడగడలాడిస్తున్నారు. తమ డిపార్ట్మెంట్ పోలీసుల పనితీరు ఎలా ఉందని తెలుసుకునేందుకు నైటౌట్ చేశారు. భద్రతా చర్యలు ఎలా చేపడుతున్నారో తెలుసుకునేందుకు కమిషనర్‌గా వచ్చిన తొలిరోజు రాత్రి మొత్తం నగరాన్ని పర్యవేక్షించారు. హర్యానాలో ఇది హాట్ టాపిక్‌గా మారింది. చారు బాలి పంచకుల పోలీస్ కమిషనర్(సీపీ)గా సోమవారం ఛార్జ్ తీసుకున్నారు. అయితే రాత్రివేళ మహిళలు, సాధారణ పౌరులకు ఎంతమేరకు తమ పోలీసులు భద్రతా కల్పిస్తున్నారో తెలుసుకోవాలనుకున్నారు చారు బాలి. బాధ్యతలు చేపట్టిన రోజు రాత్రే వాహనంలో పంచకుల రోడ్లపై తిరిగి పర్యవేక్షించి షాక్ తిన్నారు. పలు విధులు, ఏరియాల్లో పోలీసులు డ్యూటీలో లేకపోవడాన్ని డీసీపీ రాజేందర్ కుమార్ మీనాకు మంగళవారం తెలిపారు. పోలీసులు డ్యూటీలో ఎందుకు లేరో తనకు సాధ్యమైనంత త్వరగా వివరాలు ఇవ్వాలని ఆదేశించారు. నైట్ షిఫ్ట్స్‌లో కొందరు పోలీసులను రోస్టర్ విధానంలో ప్రజల భద్రత కోసం నియమించాలని సీపీ చారు బాలి సూచించారు. అయితే కమిషనర్ ఛార్జ్ తీసుకున్న తొలిరోజే తాము డ్యూటీ ఎగ్గొట్టామని తెలిస్తే పరిస్థితి ఏంటని నైట్ డ్యూటీ పోలీసులు కంగారు పడుతున్నారు. తొలిసారి కనుక వార్నింగ్ ఇచ్చి వదిలేస్తారని.. ఇకపై బుద్ధిగా డ్యూటీ చేస్తే సరిపోతుందని పోలీసులు సర్దిచెప్పుకుంటున్నట్లు సమాచారం. లేడీ సింగం అప్పుడే రంగంలోకి దిగారంటూ పంచకుల నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
విజయవాడలో రెచ్చిపోతున్న గంజాయి గ్యాంగ్‌లు
సాక్షి, విజయవాడ : విజయవాడలో విద్యార్థులే లక్ష్యంగా గంజాయి గ్యాంగ్‌లు రెచ్చిపోతున్నాయి. మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో జోరుగా అక్రమ దందా సాగిస్తున్నాయి. వీరిపై స్థానికులు పలుసార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో విద్యార్థులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నారు. పోలీసుల తీరుతో విసుగు చెందిన ఎన్నారై నూతక్కి నాగేశ్వరరావు అమెరికా నుంచి నేరుగా నగర పోలీస్ కమీషనర్ గౌతమ్ సవాంగ్‌కు ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. నగరంలోని మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఐటీఐ కాలేజీ ఆవరణలో గంజాయి గ్యాంగ్‌లు గుట్టు చప్పుడు కాకుండా అమ్మకాలు సాగిస్తున్నాయని ఎన్నారై తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 13 నుంచి 15 ఏళ్లలోపు వారిని లక్ష్యంగా చేసుకొని దారుణాలకు పాల్పడుతున్నట్లు వెల్లడించారు. మరికొన్ని సార్లు ముఠాలు శ్రుతిమించిపోతున్నాయని, విద్యార్థుల నుంచి ఫోన్లు, బ్యాగ్‌లు, పుస్తకాలతో పాటు ఇతర వస్తువులు గుంజుకొని రౌడీయిజానికి పాల్పడుతున్నారని తెలిపారు. స్టూడెంట్ జీవితాలతో చెలగాటమాడుకొనే ఈ గ్యాంగ్‌లకు ఆరుమెల్లి రామకృష్ణ అనే వ్యక్తి అండగా ఉన్నరని ఎన్నారై తన ఫిర్యాదులో ఆరోపించారు. ఒక్కోసారి వీధుల్లో ఈ గ్యాంగ్‌లు అల్లర్లకు పాల్పడుతూ స్థానికులను వేధిస్తున్నాయని ఎన్నారై తన ఫిర్యాదులో పేర్కొన్నారు. వీధుల్లో గంజాయి అమ్ముతూ, వద్దన్న వారిపై కత్తులు, బ్లేడ్లతో దాడులకు దిగుతున్నారని, విద్యార్థులు అటుగా పాఠశాలలకు, కళాశాలలకు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడిందని వెల్లడించారు. ఇదంతా మాచవరం పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో జరుగుతున్నా పోలీసులు ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సమస్యను వెంటనే పరిష్కరించాలని సవాంగ్‌ను కోరారు. ఈ మేరకు గ్యాంగ్‌లకు సంబంధించిన పూర్తి వివరాలు, పేర్లు వారి ఫోన్ నెంబర్లతో సహా కమీషనర్‌కు ఫిర్యాదు చేశారు. -
4నెలలు..4బాధ్యతలు
సాక్షి, సిటీబ్యూరో: సిటీపోలీస్ కమిషనర్‌గా పని చేస్తున్న మహేందర్‌రెడ్డి డీజీపీగా వెళ్లిన తర్వాత సిటీ బాధ్యతలు స్వీకరించిన వీవీ శ్రీనివాసరావు పేరిట అరుదైన రికార్డులు మిగిలిపోతున్నాయి. సుదీర్ఘకాలం పూర్తి అదనపు బాధ్యతల (ఎఫ్ఏసీ) పోలీసు కమిషనర్‌గా పని చేయడం ఒకటైతే... ఏకకాలంలో నాలుగు పోస్టులను నిర్వహించారు. వీటిలో మూడు అత్యంత కీలకమైనవి కావడం గమనార్హం. గతేడాది నవంబర్ 12 నుంచి సరిగ్గా నాలుగు నెలల పాటు ఎఫ్ఏసీ కమిషనర్‌గా పని చేసిన ఆయన సోమవారం (మార్చ్ 12) అంజనీ కుమార్‌కు బాధ్యతలు అప్పగించారు. అయినప్పటికీ ప్రస్తుతం ఆయన చేతిలో అసలు పోస్టు అదనపు సీపీతో (శాంతిభద్రతలు) పాటు మరో రెండు ఉన్నాయి. వీటి అప్పగింతలు పూర్తయితే తప్ప పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు బాధ్యతలు తీసుకునే అవకాశం లేదు. దీనికి మరో మూడునాలుగు రోజులు పట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. అంజనీ బదిలీతోనే ఆ స్థానంలోకి... ఐజీ హోదాలో ఉన్న వీవీ శ్రీనివాసరావు నగర పోలీసు కమిషనరేట్లోకి అంజనీ కుమార్ స్థానంలోనే వచ్చారు. కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత అనురాగ్ శర్మ తొలి డీజీపీగా బాధ్యతలు స్వీకరించారు. అప్పట్లో జరిగిన బదిలీల్లో నగర అదనపు పోలీసు కమిషనర్‌గా (శాంతిభద్రతలు) ఉన్న అంజనీ కుమార్ అదనపు డీజీగా (శాంతిభద్రతలు) బదిలీ అయ్యారు. అప్పట్లో ఆక్టోపస్‌లో పని చేస్తున్న వీవీ శ్రీనివాసరావు అంజనీ స్థానంలో బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి అదే బాధ్యతల్లో ఉన్న ఆయన మహేందర్‌రెడ్డి డీజీపీగా వెల్లడంతో ఎఫ్ఏసీ కొత్వాల్ బాధ్యతలు స్వీకరించారు. గతేడాది నవంబర్‌లో మహేందర్‌రెడ్డిని ఇన్చార్జ్ డీజీపీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసే నాటికి నగర పోలీసు కమిషనర్ నియామకంపై ఓ స్పష్టత రాకపోవడంతో శ్రీనివాసరావును ఎఫ్ఏసీ సీపీగా నియమించింది. కొత్త అధికారి నియామకం జరిగినా... ఆయన రాకలో ఆలస్యం జరిగే పక్షంలో సదరు అధికారిని రిలీవ్ చేసేందుకు ఇన్చార్జ్ సీపీని నియమిస్తుంటారు. ఇందుకు సంబంధించి జారీ చేసే ఉత్తర్వుల్లో ఆయనకు హెచ్ఏసీ (హోల్డింగ్ అడిషనల్ చార్జ్) కమిషనర్‌గా నియమిస్తుంది. అంటే... సదరు అధికారి ఆయన విధులను నిర్వర్తిస్తూనే అదనంగా కమిషనర్ బాధ్యతలు చేపట్టాలని అర్థం. పర్యవేక్షణ మినహా హెచ్ఏసీ అధికారికి కొత్వాల్‌కు ఉండే ఇతర అధికారాలు ఉండవు. శ్రీనివాసరావుకు సంబంధించి ప్రభుత్వం అప్పట్లో జారీ చేసిన ఉత్తర్వుల్లో ఆయనను ఎఫ్ఏసీ (ఫుల్ అడిషనల్ చార్జ్) కమిషనర్‌గా నియమించింది. దీని ప్రకారం ఆయన అదనపు సీపీ బాధ్యతలు కాకుండా పూర్తి స్థాయిలో కొత్వాల్ బాధ్యతలనే నిర్వర్తించారు. ఆ తర్వాత మరోటి. అప్పటికే శ్రీనివాసరావు అదనపు సీపీ బాధ్యతలో పాటు క్రీడల విభాగం అదనపు డీజీ బాధ్యతలనూ నిర్వర్తిస్తున్నారు. ఎఫ్ఏసీ కమిషనర్‌గా నియామకం కావడంతో ఈయన కొత్వాల్‌గా కొనసాగుతూనే మొత్తం మూడు బాధ్యతలను నిర్వర్తించారు. సిటీకి కమిషనర్ నియామకం జరగకుండానే స్పెషల్ బ్రాంచ్ సంయుక్త పోలీసు కమిషనర్‌గా పని చేస్తున్న ప్రమోద్‌కుమార్‌ను కొన్నాళ్ళ క్రితం ప్రభుత్వం బదిలీ చేసింది. దీంతో ఈ బాధ్యతల్నీ సైతం శ్రీనివాసరావుకే అప్పగించింది. ఇలా దాదాపు మూడు నెలల పాటు మొత్తం నాలుగు పోస్టులను ఆయన నిర్వర్తించారు. తాజా బదిలీల్లో పోలీసు రిక్రూట్మెంట్ బోర్డ్ ఛైర్మన్‌గా నియమితులు కావడంతో సోమవారం సీపీ బాధ్యతలను అంజనీ కుమార్‌కు అప్పగించారు. అదనపు సీపీగా (శాంతిభద్రతలు) రానున్న డీఎస్ చౌహాన్, సంయుక్త సీపీగా (స్పెషల్ బ్రాంచ్) తరుష్జోషిలకు సైతం బాధ్యతలు అప్పగించిన తర్వాత శ్రీనివాసరావు పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు బాధ్యతలు చేపట్టనున్నారు. అప్పటికే క్రీడల విభాగం అదనపు డీజీ పోస్టు ఆయన చేతిలోనే ఉంటుంది. త్వరలో ప్రభుత్వం పోలీసు విభాగంలో దాదాపు 18 వేల పోస్టులు భర్తీ చేయనున్న నేపథ్యంలో శ్రీనివాసరావుకు కొత్త బాధ్యతలూ అత్యంత కీలకంగా మారనున్నాయి. -
కాలేజీ రోజుల్లో ఢిల్లీ పోలీస్తో ‘ఢీ’
‘కాలేజీ రోజుల్లో ఢిల్లీ పోలీసునే ఢీ కొట్టాం. ఆ కాస్సేపు నువ్వానేనా అన్నట్లు పోరాడాం. ఢిల్లీ యూనివర్శిటీ ఆధీనంలోని కేఎం కాలేజ్ బాస్కెట్ బాల్ టీమ్‌లో నేను ఉండగా ఢిల్లీ పోలీసు టీమ్‌పై ఆడినప్పటి మాట ఇది...’ అంటూ సిటీ కొత్త కొత్వాల్ అంజనీ కుమార్ తన జ్ఞాపకాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. కాలేజీ రోజుల్లో పోలీస్ యూనిఫాం అంటే ఎంతో క్రేజ్ ఉండేదని..ఆ క్రేజ్‌తోనే ఐపీఎస్ ఆఫీసరనయ్యాయని ఆయన చెప్పుకొచ్చారు. తనకు హార్స్ రైడింగ్ అంటే చాలా ఇష్టమన్నారు. టీమ్‌వర్క్ ఉంటే ఏ పనిలోనైనా విజయం సాధ్యమని, తాను అందరినీ కలుపుకొనిపోయి నగరంలో శాంతిభద్రతలు పరిరక్షిస్తానని చెప్పారు. హైదరాబాద్‌కు 57వ పోలీసు కమిషనర్‌గా సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో అంజనీకుమార్ ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.... సాక్షి, సిటీబ్యూరో : ‘బీహార్‌లోని పట్నాలోనే నా బాల్యం, స్కూలు జీవితం గడిచిపోయాయి. డిగ్రీ, పీజీ చేయడం కోసం ఢిల్లీ చేరుకున్నా. ఢిల్లీ యూనివర్శిటీతో పాటు దాని ఆధీనంలోని కాలేజీల్లో చదివా. స్కూలు రోజుల నుంచే నేను స్పోర్ట్స్ పర్సన్‌ను. అనేక స్థాయిల్లో జరిగిన పోటీల్లో పాల్గొన్నా. బాస్కెట్‌బాల్, క్రికెట్ టీమ్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించా. ఆయా సందర్భాల్లో జరిగిన అనేక ఫంక్షన్లకు సీనియర్ ఐపీఎస్ అధికారులు ముఖ్యఅతిథులుగా హాజరయ్యే వారు. దీంతో వారిని దగ్గర నుంచి చూసే అవకాశం దక్కింది. అప్పట్లో నాకు పోలీసు యూనిఫాం అంటే ఎంతో క్రేజ్. ఆగస్టు 15, జనవరి 26న జరిగే పెరేడ్స్ ఎంతో స్ఫూర్తి నింపాయి. అప్పట్లోనే పోలీసు అవ్వాలని నిర్ణయించుకున్నా. ఇప్పుడది ఓ బాధ్యతగా మారింది... చిన్నప్పటి నుంచీ జాతీయ జెండాను చూసినా, జాతీయ గీతం విన్నా బయటకు చెప్పలేని పాజిటివ్ భావన కలిగేది. ఢిల్లీ యూనివర్శిటీ ఆధీనంలోని కేఎం కాలేజ్‌లో చదివే రోజుల్లో బాస్కెట్‌బాల్ టీమ్ కెప్టెన్‌గా వ్యవహరించా. అప్పట్లో మా జట్టు ఢిల్లీ పోలీసు జట్టుతో హోరాహోరా పోరాడి గెలిచింది. ఇలా పోలీసు, ఆర్మీ, సీఆర్పీఎఫ్ జట్లతోనూ ఆట ఆడాం. 1990లో ఐపీఎస్‌కు ఎంపికై ఆంధ్రప్రదేశ్‌కు అలాట్ అయ్యా. జనగాం ఏఎస్పీగా కెరియర్ ప్రారంభించా. ప్రస్తుతం యూనిఫాం అన్నది ఓ బాధ్యతగా మారిపోయింది. 80 లక్షల జనాభా ఉన్న సిటీకి పోలీసు కమిషనర్‌గా రావడం ఈ బాధ్యతని మరింత పెంచింది. నాపై నమ్మకం ఉంచిన ముఖ్యమంత్రి, డీజీపీల ఆశలు, ఆశయాలకు అనుగుణంగా పని చేస్తా. వీవీ శ్రీనివాసరావు నుంచి బాధ్యతలు స్వీకరిస్తున్న అంజనీకుమార్ ప్రస్తుతం వాటికి పూర్తిగా దూరమైపోయా... నగరంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీలో ఐపీఎస్ శిక్షణ తీసుకునే రోజుల్లో గుర్రపు స్వారీ, ఈతపై ఆసక్తి ఎక్కువగా ఉంటోంది. ఈ రెండు అంశాల్లోనూ మంచి ప్రతిభ కనబరుస్తూ వచ్చా. అధికారిగా పోస్టింగ్స్ తీసుకున్న తర్వాత కూడా ఖాళీ దొరికినప్పుడల్లా క్రీడాకారుడిగా, హార్స్ రైడర్‌గా మారిపోయేవాడిని. నగర పోలీసు విభాగంలో అదనపు సీపీగా పని చేసిన రోజుల్లోనూ దాన్ని కొనసాగించా. అయితే అదనపు డీజీపీగా (శాంతిభద్రతలు) బాధ్యతలు స్వీకరించిన తర్వాత వాటికి పూర్తిగా దూరమయ్యా. ఆ ఆటలు ఆడే అవకాశమే దక్కలేదు. గతంలో నగరంలో పని చేసిన అనుభవం ఇప్పుడు ఉపయుక్తంగా మారుతుంది. హైదరాబాద్ లాంటి నగరానికి సేవ చేసే అవకాశం దక్కడం అరుదైన అవకాశమే. టీమ్ వర్క్‌తోనే ముందుకు... సిటీ పోలీసింగ్ అంటే టీమ్ వర్క్. పోలీసు కమిషనర్ నుంచి కానిస్టేబుల్ వరకు ప్రతి స్థాయి అధికారీ ఇన్వాల్వ్ కావాలి. సీఎం, డీజీపీ నిర్దేశించిన లక్ష్యాలు చేరుకోవడానికి అదే పంథాలో పనిచేస్తాం. పోలీసు బాస్ ఎం.మహేందర్‌రెడ్డి ఆలోచనలతో అనేక విధానాలైన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంబంధిత ప్రాజెక్టులు సిటీలో అందుబాటులోకి వచ్చాయి. రాష్ట్రానికే నగరం రోల్ మోడల్‌గా మారింది. భవిష్యత్తులోనూ వీటిని కొనసాగిస్తూ సమకాలీన అవసరాలకు తగ్గట్టు అభివృద్ధి, మార్పు చేర్పులు చేస్తుంటాం. పోలీసు విభాగంలో ఏ స్థాయిలోనూ అవినీతిని ఉపేక్షించేది లేదు. ఎలాంటి ఆరోపణలు వచ్చినా పక్కాగా విచారణ చేపడతాం. వెలుగులోకి వచ్చిన వివరాల ఆధారంగా కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని అంజనీ కుమార్ అన్నారు. ఎన్కౌంటర్ తర్వాత తీవ్ర కలకలం, సంచలనం సృష్టించిన గ్యాంగ్‌స్టర్ నయీం వ్యవహారాలపై దర్యాప్తునకు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. దీనికి చీఫ్ ఐజీ వై.నాగిరెడ్డి అయినప్పటికీ ఆ విచారణను పర్యవేక్షించింది మాత్రం అదనపు డీజీ హోదాలో అంజనీ కుమారే. పోలో టీమ్ ఆయన డ్రీమ్... బషీర్‌బాగ్‌లోని పోలీసు కమిషనర్ కార్యాలయంలో సోమవారం ఉదయం 11.30 గంటలకు ఇన్చార్జ్ సీపీ వీవీ శ్రీనివాసరావు నుంచి అంజనీ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో నగర పోలీసు అధికారులు ఆయన్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. గోషామహల్లో ఉన్న నగర పోలీసు అశ్వక దళం 2013కు ముందు తీవ్ర నిరక్ష్యానికి గురైంది. స్టేబుల్స్గా పిలిచే గుర్రపు శాలలు సైతం రూపు కోల్పోయాయి. అప్పట్లో నగర అదనపు పోలీసు కమిషనర్‌గా ఉన్న అంజనీకుమార్ దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. స్వతహాగా అశ్వ ప్రియుడు, రైడర్ కావడంతో జాతీయ పోలీసు అకాడెమీతో పాటు వివిధ రేస్ కోర్స్‌లు, స్టడ్ ఫామ్స్ తిరిగి అంతర్జాతీయ ప్రమాణాలతో స్టేబుల్స్‌ను డిజైన్ చేశారు. ఆయన కృషి వల్లే 10 కొత్త గుర్రాలు సైతం నామమాత్రపు ధరకు సమకూరాయి. ఆలిండియా పోలీసు డ్యూటీ మీట్స్/స్పోర్ట్స్ మీట్స్‌లో పాల్గొనేందుకు సిటీ పోలీసు తరఫున పోలో టీమ్‌ను తయారు చేయాలన్నది అప్పట్లో అంజనీ డ్రీమ్. 80 లక్షల జనాభా కలిగిన ఇంత పెద్ద సిటీకి కమిషనర్‌గా పనిచేయడం గర్వంగా ఉంది. నాకు ఈ బాధ్యత అప్పగించిన సీఎం కేసీఆర్, డీజీపీ మహేందర్‌రెడ్డిలకు కృతజ్ఞతలు. సమర్థవంతంగా విధులు నిర్వర్తించి వారి నమ్మకాన్ని నిలబెడతా. – బాధ్యతల స్వీకరణ అనంతరం కొత్త పోలీస్ బాస్ అంజనీకుమార్ -
పెద్దల పెళ్లి ఉంది.. అటు వైపు వెళ్లద్దు
సాక్షి, బెంగళూరు: ‘నగరంలోని ప్యాలెస్ మైదానంలో రేపు సాయంత్రం పెద్దల పెళ్లి జరుగుతోంది. ప్యాలెస్ మైదానం వైపుగా వెళ్లకుండా వాహనదారులు ప్రయాణం మళ్లించుకోండి’ ఇది సాక్షాత్తు నగర ట్రాఫిక్ పోలీసు అదనపు కమిషనర్ ఆర్.హితేంద్ర చేసిన ట్వీట్. దీనిపై ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద రచ్చ జరుగుతోంది. ఆదివారం బెంగళూరులోని ప్యాలెస్ మైదానంలో మాజీ మంత్రి హెచ్డీ రేవణ్ణ కుమారుడు సూరజ్ గౌడ్ వివాహం జరిగింది. ఈ వివాహం నేపథ్యంలో ట్రాఫిక్ కమిషనర్ ఈ మేరకు నగర పౌరులకు ట్వీటర్ విజ్ఞప్తి చేశారు. దీనిపై నెటిజన్లు ఆయనపై విరుచుకుపడ్డారు. బెంగళూరు విమానాశ్రయాన్ని నేరుగా చేరుకోవడానికి ఇదే అత్యుత్తమ మార్గమని, దారి మళ్లించుకోవడం కుదరదని నెటిజన్లు గట్టిగా చెప్పారు. పెద్దల కోసం సామాన్యులు ఎందుకు దారి మళ్లించుకోవాలంటూ మరికొందరు ఘాటుగా ప్రశ్నించారు. నెటిజన్ల ట్వీట్లకు హితేంద్ర కూడా ఘాటుగానే బదులిచ్చారు. పెద్దల పెళ్లి ఉంది కాబట్టి చాలా మంది ప్రముఖులు వివాహానికి హాజరవుతారని, ఈ క్రమంలో ట్రాఫిక్ జామ్ సమస్య తలెత్తే ప్రమాదముందని, అందుకే ప్రజలకు తెలియజేద్దామని సూచించినట్లు తెలిపారు. ఇది కేవలం ఒక సూచన మాత్రమేనని, నిబంధన కాదని వెల్లడించారు. నగరవాసులు ట్రాఫిక్ ఇబ్బందులు పడకూడదనే ఉద్ధేశంతో తాను ట్వీట్ చేసినట్లు పేర్కొన్నారు. -
దక్షిణ మధ్య రైల్వే జీఎంకు వారంట్
సాక్షి, హైదరాబాద్: కోర్టు ముందు స్వయంగా హాజరు కావాలంటూ తాము ఇచ్చిన ఆదేశాలను పాటించని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వి.కె.యాదవ్‌కు ఉమ్మడి హైకోర్టు శుక్రవారం బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఈ వారంట్ అమలుకు చర్యలు తీసుకుని, ఈ నెల 25న యాదవ్ కోర్టు ముందు హాజరయ్యేలా చూడాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌ను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ సురేశ్ కెయిత్, జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. తన తండ్రి మరణించిన నేపథ్యంలో ఆయన కుమారుడిగా తనకు కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇవ్వాలని ప్రతాప్ అనే వ్యక్తి రైల్వే అధికారులను కోరారు. రెండో భార్య కుమారుడికి ఉద్యోగం ఇవ్వరాదన్న సర్క్యులర్‌ను కారణంగా చూపుతూ ఉద్యోగం ఇచ్చేందుకు అధికారులు నిరాకరించారు. దీనిపై ప్రతాప్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ తరఫు న్యాయవాది కె.సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, రెండో భార్య కుమారుడు కారుణ్య నియామకానికి అర్హుడు కాదన్న రైల్వేశాఖ సర్క్యులర్‌ను బాంబే, కలకత్తా హైకోర్టులు కొట్టేశాయని, ఆ తీర్పులపై రైల్వే అధికారులు అప్పీళ్లు దాఖలు చేయలేదన్నారు. వాదనలతో ఏకీభవించిన హైకోర్టు ప్రతాప్‌కు ఉద్యోగం ఇచ్చే విషయంలో 8 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని అధికారులను ఆదేశిస్తూ గత జూలైలో ఉత్తర్వులిచ్చింది. వీటిని అమలు చేయకపోవడంతో ప్రతాప్ కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం 20న కోర్టు ముందు హాజరు కావాలని వి.కె.యాదవ్‌ను ఆదేశించింది. శుక్రవారం ఆయన కోర్టు ముందు హాజరు కాకుండా వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ ఓ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను ధర్మాసనం తోసిపుచ్చింది. దక్షిణ మధ్య రైల్వే సీనియర్ డివిజినల్ పర్సనల్ ఆఫీసర్ జె.బలరామయ్య వ్యక్తిగత హాజరుకు సైతం ఆదేశాలిచ్చింది. -
‘దొంగ’ పోలీస్!
నిజామాబాద్ క్రైం(నిజామాబాద్ అర్బన్): దొంగలను క్రమశిక్షణలో పెట్టాల్సిన జైలు కానిస్టేబుల్.. వారితోనే చేతులు కలిపాడు. ఎత్తుకొచ్చిన బంగారాన్ని విక్రయించేలా చోరులతో ఒప్పందం చేసుకున్నాడు. ఇందుకు గాను తులానికి రూ.10 వేల చొప్పున ఇవ్వాలని ఇద్దరు అంతర్ జిల్లాల దొంగలతో ‘అగ్రిమెంట్’ చేసుకున్నాడు. సదరు చోరులు పట్టుబడడంతో ఆ కానిస్టేబుల్ ‘దొంగ వ్యవహారం’ బయటపడింది. నిందితుల అరెస్టు చేశామని, సదరు జైలు కానిస్టేబుల్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్తికేయ తెలిపారు. గురువారం ఆయన జిల్లా కేంద్రంలో వివరాలు వెల్లడించారు. నిజామాబాద్‌లోని అంబేద్కర్ కాలనీకి చెందిన బొమ్మెర్ల సోమేశ్, కామారెడ్డి జిల్లా బీడీ వర్కర్ కాలనీకి చెందిన మహ్మద్ షాహిద్ పాత నేరస్తులు. గతంలో దొంగతనాలు చేసి జైలుకు వెళ్లి వచ్చారు. ఈ క్రమంలో జైలులో ఉన్న సమయంలో ఇద్దరికి పరిచయం ఏర్పడింది. గత నవంబర్ 16న శిక్ష పూర్తి కావడంతో ఇద్దరు జైలు నుంచి విడుదలయ్యారు. ఆ తర్వాత కూడా వాళ్ల ప్రవర్తన మారలేదు. నవంబర్ నుంచి జనవరి వరకు నిజామాబాద్ అర్బన్, రూరల్ ప్రాంతాల్లో ఏకంగా 15 సార్లు దొంగతనాలకు పాల్పడ్డారు. వరుసగా చోరీలు జరుగుతుండంతో పోలీసులు గట్టి నిఘా పెట్టారు. ఈ క్రమంలో కంఠేశ్వర్ బైపాస్ రోడ్డు సమీపంలో చోరీ చేసేందుకు రాగా, అనుమానం వచ్చిన పోలీసులు వారిని పట్టుకొని విచారించగా అసలు విషయం వెలుగు చూసింది. మొత్తం 12 ఇళ్లలో చోరీలకు పాల్పడినట్లు నిందితులు ఒప్పుకున్నారు. వారి నుంచి 16 తులాల బంగారం, 50 తులాల వెండి, ఒక కెమెరా, మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సోమేష్పై 30 కేసులుండగా, షాహిద్‌పై 28 కేసులు ఉన్నాయి. ఇందులో నాన్‌బెయిలబుల్ కేసులు కూడా ఉన్నాయని సీపీ తెలిపారు. ‘దొంగ’లతో కలిసిన కానిస్టేబుల్! 30 కేసుల్లో నిందితుడైన సోమేశ్, 28 కేసుల్లో ముద్దాయిగా ఉన్న షాహిద్ తరచూ జైలుకు వెళ్తుండే వారు. ఈ క్రమంలో వారికి జైల్ కానిస్టేబుల్ సయ్యద్ ఖలీమ్ అహ్మద్‌తో పరిచయం ఏర్పడింది. దీంతో అతడు నిందితులతో చేతులు కలిపాడు. మీరు దొంగిలించిన సొత్తును అమ్మి పెడతానని, ఇందుకు ప్రతిఫలంగా తులానికి రూ.10 వేల చొప్పున ఇవ్వాలని సోమేశ్, షాహిద్‌లతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీంతో నిందితులు రెండు నెల వ్యవధిలో దొంగిలించిన సొత్తును సదరు కానిస్టేబుల్ వద్ద పెట్టారు. ఈ విషయం పోలీసుల విచారణలో తేలటంతో అధికారులు నివ్వెర పోయారు. వెంటనే సయ్యద్ ఖలీంను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. అతడ్ని కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు సీపీ తెలిపారు. దొంగలను పట్టుకోవటంలో ప్రతిభ చూపిన రూరల్ సీఐ వెంకటేశ్వర్లు, 6వ టౌన్, మోపాల్, రూరల్ ఎస్సైలు లక్ష్మయ్య, సతీష్, శ్రీధర్, హెడ్ కానిస్టేబుల్స్ గఫార్, రమేశ్, కానిస్టేబుల్స్ ముఖీం, ఈశ్వర్, పోచయ్య, సురేశ్, శ్రీకాంత్, లింబాద్రి, పవన్‌లను అభినందించిన సీపీ.. వీరికి రివార్డులు అందజేస్తామన్నారు. -
'ఏడు రోజుల్లో చార్జిషీట్.. రంగంలోకి సీబీఎస్ఈ'
గుర్గావ్: దారుణ హత్యకు గురైన రెండో తరగతి బాలుడి కేసు విషయంలో కేసు విషయంలో కేంద్ర మాద్యమిక విద్యా విభాగం(సీబీఎస్ఈ) రంగంలోకి దిగింది. గుర్గావ్లో జరిగిన ఈ దుర్ఘటనలో నిజనిర్దారణ చేసేందుకు ఇద్దరుతో కూడిన దర్యాప్తు బృందాన్ని ఏర్పాటుచేసింది. రెండు రోజుల్లో కేసు వివరాలను తెలియజేయాలని స్పష్టం చేసింది. ఈ విచారణ కమిటీకి పాఠశాల సహకరించాలని, వాస్తవాలేమిటో వివరించడంతోపాటు ఎఫ్ఐఆర్ రిపోర్ట్‌తోపాటు ఇతర వివరాలను తమకు పంపించాలని ఆదేశించింది. ఈ కేసును నిజనిర్దారణ కమిటీ ప్రత్యేకంగా దర్యాప్తు చేస్తుందని కూడా స్పష్టం చేసింది. విచారణలో స్కూల్ నిర్లక్ష్యం, బాధ్యత ఉందని తేలితే పాఠశాల గుర్తింపును కూడా రద్దు చేస్తామని ఈ సందర్భంగా సీబీఎస్ఈ తరుపున హెచ్ఆర్డీ మంత్రిత్వ శాఖకు చెందిన అధికారి ఉపేంద్ర కుశ్వాహ హెచ్చరించారు. నేరస్తులను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టొద్దని కూడా స్పష్టం చేశారు. మరోపక్క, ఈ కేసు విచారణ వాయువేగంతో ముందుకెళుతోంది. వారం రోజుల్లో కేసుకు సంబంధించిన చార్జిషీట్‌ను వేస్తామని ఈ కేసు విచారణ చూస్తున్న గుర్గావ్ పోలీస్ కమిషనర్ సందీప్ ఖిర్వార్ హామీ ఇచ్చారు. బస్సు కండక్టర్ ఈ దారుణ హత్యకు పాల్పడినట్లు స్పష్టమైందని, అయితే, మరేదైనా కోణం ఈ హత్య వెనుక ఉందా, ఈ హత్యకు ఎవరైనా ప్రేరేపించారా అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని ముగ్గురుతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేశామని, వారంలో కేసు చార్జిషీట్‌ను వేస్తామని స్పష్టం చేశారు. గుర్గావ్లోని ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఈ హత్య చోటు చేసుకున్న విషయం తెలిసిందే. -
విజయవాడకు కొత్త పోలీస్ కమీషనర్ !
-
బెల్లంపల్లి ఏసీపీపై బదిలీ వేటు
►పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేస్తూ మెమో ►ఏసీపీ సతీష్ బదిలీలో రాజకీయ జోక్యం? ►ఆరోపణల వెనుక వెలుగుచూడని మరో కోణం! ►అక్రమార్కులకు అండ, నకిలీ పత్తి విత్తన వ్యాపారులతో మైత్రి ఆరోపణలు ►రామగుండం కమిషనర్ దుగ్గల్ విచారణ..ప్రభుత్వానికి నివేదిక ►మంచిర్యాల ఏసీపీ చెన్నయ్యకు అదనపు బాధ్యతలు మంచిర్యాల: రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోనే వివాదాస్పద అధికారిగా వార్తల్లోకెక్కిన బెల్లంపల్లి అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ (ఏసీపీ) సిహెచ్.సతీష్‌పై బదిలీ వేటు పడింది. సతీష్‌ను రాష్ట్ర పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేస్తూ డీజీపీ అనురాగ్‌శర్మ సోమవారం ఉత్తర్వులు ఇచ్చారు. ఆయన స్థానంలో మంచిర్యాల ఏసీపీ సిహెచ్.చెన్నయ్యకు బెల్లంపల్లి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ ఆదేశాలు తక్షణం అమలులోకి వస్తాయని డీజీపీ కార్యాలయం ఓ మెమో ద్వారా తెలిపింది. కాగా పోలీస్ శిక్షణ కోసం 21 రోజుల పాటు మేఘాలయ రాష్ట్రంలోని షిల్లాంగ్ వెళ్లిన ఏసీపీ సతీష్ తిరిగి వచ్చి విధుల్లో చేరినరోజే ఆయనపై బదిలీ వేటు వేయడం చర్చనీయాంశమైంది. అవినీతి, అక్రమాలకు అండగా నిలవడంతో పాటు భారీ ఎత్తున వసూళ్లకు పాల్పడ్డట్టు ఆరోపణలు ఎదుర్కొన్న ఏసీపీ వ్యవహారంలో మరో కోణం వెలుగుచూడకుండా ‘జిల్లా రాజకీయం’ పనిచేసిందని తెలుస్తోంది. సతీష్‌ను బలి చేయడానికి ఒక్కటైన యంత్రాంగం తమ అక్రమాలు వెలుగులోకి రాకుండా పకడ్బందీ వ్యూహంతో వ్యవహరించినట్లు సమాచారం. స్వయంకృతమా... రాజకీయమా..? బెల్లంపల్లి ఏసీపీ సతీష్‌పై బదిలీ వేటు పడడం స్వయంకృతమా? బలమైన రాజకీయ కారణం ఉందా? అనే అంశం ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశమైంది. ఏసీపీగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఆయన వ్యవహా రశైలి వివాదాస్పదంగానే ఉంది. పలు అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. అక్రమార్కులకు అండగా ఉన్నట్లు సీఎం స్థాయిలో ఫిర్యాదులు వెళ్లాయి. అయినా ఆయనపై డీజీపీ అనురాగ్‌శర్మ ఎలాంటి చర్యలూ తీసుకోలే దు. అంతా సద్దుమనిగిందని భావిస్తున్న తరుణంలో హఠాత్తుగా బదిలీ వేటు పడడం చర్చకు కారణమవుతోంది. జూన్ ఆఖరి వారంలో ఆయనపై ఆరోపణలు వెల్లువెత్తగా విచారణ అధికారిగా రామగుండం పోలీస్ కమిషనర్ విక్రమ్‌జిత్ దుగ్గల్ వ్యవహరించి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. అయితే ఆరోపణలతో అట్టుడికినప్పుడు పోలీస్ శాఖ ఏసీపీ సతీష్ విషయంలో స్పం దించలేదు. ఆయన జూలై 24న షిల్లాంగ్‌లోని నార్త్ ఈస్టర్న్ పోలీస్ అకాడమీలో 21 రోజుల శిక్షణ పూర్తిచేసుకొని ఈనెల 11న తిరిగి వచ్చారు. సోమవారం డ్యూటీలో చేరిన రోజే బదిలీ వేటు వేయడం అనుమానాలకు తావిస్తోంది. ఈ బదిలీ వెనుక రాజకీయ కారణాలు కూడా ఉన్నాయన్న వాదన బలంగా వినిపిస్తోంది. కొందరు బడా వ్యక్తులను కాపాడడానికి ఏసీపీని బలిచేశారన్న విమర్శలు కూడా ఉన్నాయి. పకడ్బందీ వ్యూహమా..? బెల్లంపల్లి ఏసీపీ పరిధిలోకి మందమర్రి మునిసిపాలిటీ కూడా వస్తుంది. బెల్లంపల్లి, మందమర్రిలో జరిగే అవినీతి, అక్రమ కార్యకలాపాలు, రియల్ ఎస్టేట్, ఇసుక దందా, ప్రజాప్రతినిధుల పేరుతో సాగే ఆగడాల విషయంలో ఏసీపీ వ్యవహారశైలి ఎవరికీ అంతు చిక్కలేదు. సుమారు కోటి రూపాయల విలువైన నకిలీ పత్తి విత్తనాలను మందమర్రి మండలం గద్దెరేగడి సమీపంలో సీజ్ చేసిన కేసులో తొలిసారి ఏసీపీ వివాదంలోకి వచ్చారు. ఈ కేసులో లక్షల రూపాయలు చేతులు మారాయనే ఆరోపణతో ఏసీపీపై ఉచ్చు బిగిసింది. దీనికితోడు ఓ పెట్రోల్‌బంక్ యజమాని నుంచి లక్షలు వసూలు చేశారని, డబ్బులు ఇవ్వని మరో పెట్రోల్‌బంక్ యజమానిని కేసుల్లో ఇరికించారని ఆరోపణలు వచ్చాయి. ఏసీపీ పరిధిలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులతో గిట్టని వారిని వేధించినట్లు కూడా విమర్శలున్నాయి. ఫిర్యాదు చేయడానికి వచ్చిన బాధితులపైనే కేసులు నమోదు చేసి వేధించడం, ఇసుక అక్రమ రవాణాదారులకు అండగా ఉండడం వంటి ఆరోపణలు వెల్లువెత్తాయి. అదే సమయంలో పలు అంశాల్లో ఫిర్యాదులు ఎదుర్కొన్న బడా వ్యక్తులపై ఎలాంటి కేసులు నమోదు చేయలేని పరిస్థితి ఎదురైంది. సతీష్ సతీమణి కవిత జైపూర్ ఏసీపీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆమె జైపూర్ పరిధిలో అక్రమార్కుల వెన్నులో చలి పుట్టించారు. ఇసుక దందా చేసే బడా డాన్ల మీదే కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో చెన్నూర్‌లో ఇసుక మాఫియా డాన్‌గా పేరున్న ఓ వ్యక్తిని కాపాడేందుకు ‘మరోవైపు నుంచి నరుక్కువచ్చే’ సూత్రాన్ని పాటించి సతీష్‌ను మానసికంగా దెబ్బతీసేలా దాడి చేసినట్లు పోలీస్ వర్గాలు భావిస్తున్నాయి. సతీష్ బదిలీ వెనుక ప్రజాప్రతినిధుల హస్తం ఉన్నట్లు వారు ఆరోపిస్తున్నారు. -
గుట్కాపై గూండా యాక్ట్
♦ ఇక, ఉక్కు పాదం ♦ నాన్ బెయిలబుల్ కేసులు ♦ చెన్నై పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు గుట్కా, మావా, జర్దా వంటి మత్తు పదార్థాలను విక్రయించే వారి భరతం పట్టేందుకు పోలీసులు సిద్ధం అయ్యారు. ఇక, నాన్‌బెయిల్ వారెంట్‌తో కూడిన గుండా చట్టాన్ని ప్రయోగించనున్నారు. ఇందుకు ఆదేశాలను నగర పోలీసు కమిషనర్ విశ్వనాథన్ జారీచేశారు. గస్తీ పోలీసులకు ప్రత్యేక అధికారాలు ఇచ్చారు. నిఘా పెంచాలని సూచించారు. ఈనేపథ్యంలో ఆదివారం పోలీసులు రంగంలోకి దిగారు. రాష్ట్రవ్యాప్తంగా దాడులు జోరందుకున్నాయి. సాక్షి, చెన్నై : రాష్ట్రంలో గుట్కా, మావా, జర్దా, హాన్స్ వంటి పొగాకు వస్తువుల్ని నిషేధించి ఉన్నారు. ఈ నిషేధంతో రాష్ట్రంలోకి ఇటీవల గంజాయి ప్రవేశం మరింతగా పెరిగింది. అన్నిరకాల మత్తు పదార్థాలకు నిషేధం ఉన్నా, మార్కెట్లో మాత్రం యథేచ్ఛగా ఆ వస్తువులు లభిస్తుండడం గమనార్హం. చిన్న చిన్న దుకాణాల్లోనే కాదు, జన సంచారం అత్యధికంగా ఉండే ప్రాంతాల్లోనూ గుట్కాలు జోరుగా లభిస్తుండటంతో యువత పెడదారి పడుతోందని చెప్పవచ్చు. మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగం, పోలీసుల బృందాల తనిఖీలు సాగుతున్నా, పట్టుబడేది మాత్రం గోరంతే అన్న విమర్శలు ఉన్నాయి. ఇక, గుట్కాల విక్రయాల వ్యవహారంలో పోలీసు బాసులు చేతివాటం సైతం ఉన్నట్టుగా ఇటీవల వెలుగులోకి వచ్చింది. మంత్రితో పాటుగా పోలీసు పెద్దల సహకారంతోనే రాష్ట్రంలోకి గుట్కాలు తరలి వస్తున్నట్టు, పాన్ మసాలాల అక్రమ విక్రయాలు జోరుగా సాగుతున్నట్టు వెలుగులోకి వచ్చిన సమాచారం వివాదానికి దారితీసింది. వ్యవహారం కోర్టుకు సైతం చేరడంతో పోలీసు బాసులు తమ జాగ్రత్తల్లో పడ్డారు. ఇక, గుట్కాలు వంటి మత్తు పదార్థాలు విక్రయించే వారి భరతం పట్టే విధంగా నాన్ బెయిలబుల్ సెక్షన్‌తో కూడిన గూండా చట్టాన్ని ప్రయోగించేందుకు సిద్ధం అయ్యారు. భరతం పడతారు జనవరి ఒకటో తేదీ నుంచి చెన్నై నగరంలో గుట్కా, గంజాయి వంటి మత్తుపదార్థాలు, పొగాకు వస్తువుల విక్రయాలకు సంబంధించి పోలీసులు 1120 కేసులు నమోదు చేసిన 1919 మందిని అరెస్టు చేశారు. ఈ ఏడు నెలల కాలంలో రూ.57 లక్షల 84 వేల 381 విలువ గల పొగాకు వస్తువుల్ని స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 84 వేల గుట్కా ప్యాకెట్లు, 8 వేల కేజీల మేరకు గంజాయి ఉందని చెప్పవచ్చు. తమమీద ప్రసుత్తం ఆరోపణలు బయలుదేరిన నేపథ్యంలో ఇక, గుట్కా విక్రయదారుల భరతం పట్టే విధంగా చెన్నై పోలీసు కమిషనర్ ఏకే విశ్వనాథన్ ఆయా స్టేషన్లకు ఉత్తర్వులను జారీచేశారు. ఆమేరకు ఇక, గుట్కా వంటి వాటిని విక్రయిస్తూ పట్టుబడే వారి మీద గూండా చట్టం నమోదు చేయాలని ఆదేశించారు. పాఠశాలలు, కళాశాలలు, జన సంచారం అత్యధికంగా ఉండే ప్రాంతాల పరిసరాల్లోని చిన్న చిన్న దుకాణాల మీద నిఘా పెంచాలని సూచించి ఉన్నారు. అలాగే, ఉత్తరాది రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చే వాహనాల మీద నిఘా వేయడంతో పాటుగా, ఎవరైనా గుట్కా నములుతూ కనిపించినా, వారిని పట్టుకుని , ఎక్కడ విక్రయిస్తున్నారో ఆరా తీసి, ఆయా దుకాణాల మీద చర్యలు తీసుకునే విధంగా గస్తీ పోలీసులకు ప్రత్యేక అధికారాలు ఇచ్చారు. ఇక, పొగాకు వస్తువుల్ని విక్రయించినా, బయటి ప్రాంతాల నుంచి ఇక్కడికి తరలిస్తూ పట్టుబడినా, ఉపేక్షించబోమని, గూండా చట్టం నమోదు చేయడం తథ్యమని కమిషనర్ హెచ్చరించడం గమనార్హం. దాడులు గుండా యాక్ట్ ఆదేశాల నేపథ్యంలో పోలీసులు రంగంలోకి దిగారు. ఆయా ప్రాంతాల్లో ఆదివారం తమ దూకుడు ప్రదర్శించారు. దుకాణా ల్లో విక్రయిస్తున్న పాన్ మసాలా, గుట్కా వంటివి స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ దాడులు జోరందుకున్నాయి. కన్యాకుమారి జిల్లాలో అయితే, పెద్దఎత్తున గుట్కాలు పట్టుబడ్డాయి. వీటి విలువ రూ.పది లక్షలుగా నిర్ధారించారు. -
బోనాల నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర నేపథ్యంలో ఆ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆది–సోమవారాల్లో వివిధ సమయాల్లో, వివిధ ప్రాంతాల్లో ఇవి అమలులో ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ఉత్సవాలకు హాజరయ్యే వారి కోసం ప్రత్యేక పార్కింగ్ స్థలాలను కేటాయించారు. ఆదివారం తెల్లవారుజామున 4 నుంచి పూజ ముగిసే వరకు: ♦ఉజ్జయిని మహంకాళి పూజ ముగిసే వరకు టుబాకో బజార్ హిల్ స్ట్రీట్, జనరల్ బజార్, అధ్వయ్య చౌరస్తాల నుంచి మహంకాళి దేవాలయం వరకు ఉన్న మార్గాల్లో ట్రాఫిక్ అనుమతించరు. బాటా చౌరస్తా నుంచి రామ్‌గోపాల్‌పేట పోలీసుస్టేషన్ మధ్య ఉన్న సుభాష్ రోడ్లో వాహనాలకు మూసేస్తారు. ♦కర్బాలా మైదాన్ నుంచి రాణిగంజ్ చౌరస్తా వైపు వచ్చే ట్రాఫిక్‌ను మినిస్టర్స్ రోడ్, రసూల్‌పుర చౌరస్తా, సీటీఓ, ఎస్బీహెచ్ చౌరస్తా, వైఎంసీఏ చౌరస్తా, సెయింట్ జాన్స్ రోటరీ, గోపాలపురం లైన్, రైల్వేస్టేషన్ మీదుగా పంపిస్తారు. ♦ బైబిల్ హౌస్ వైపు నుంచి వచ్చే సాధారణ ట్రాఫిక్‌ను ఘాస్మండి చౌరస్తా, సజన్‌లాల్ స్ట్రీట్ మీదుగా పంపిస్తారు. ♦ రైల్వేస్టేషన్ నుంచి ట్యాంక్‌బండ్ వైపు వెళ్ళే ఆర్టీసీ బస్సుల్ని అల్ఫా హోటల్, గాంధీ ఎక్స్ రోడ్, మహంకాళి ఓల్డ్ ట్రాఫిక్ పోలీసుస్టేషన్, ఘాస్మండి, బౌబిల్ హౌస్, కర్బాలా మైదాన్ మీదుగా పంపిస్తారు. ♦రైల్వేస్టేషన్ నుంచి తాడ్‌బండ్, బేగంపేట వైపు వెళ్ళే ఆర్టీసీ బస్సుల్ని క్లాక్ టవర్, ప్యాట్నీ చౌరస్తా, వైఎంసీఏ చౌరస్తా, ఎస్బీహెచ్ చౌరస్తా మీదుగా మళ్ళిస్తారు. ♦ ఎస్బీహెచ్ చౌరస్తా నుంచి ఆర్పీ రోడ్ వైపు వెళ్ళే ట్రాఫిక్‌ను ప్యాట్నీ చౌరస్తా నుంచి క్లాక్ టవర్, ప్యారడైజ్ వైపు, ప్యారడైజ్ నుంచి ఆర్పీ రోడ్‌కు వచ్చే ట్రాఫిక్‌ను ప్యాట్నీ చౌరస్తా నుంచి ఎస్బీహెచ్, క్లాస్టవర్ వైపు పంపిస్తారు. ♦ క్లాక్ టవర్ వైపు నుంచి ఆర్పీ రోడ్లోకి వెళ్ళే ట్రాఫిక్‌ను ప్యాట్నీ చౌరస్తా నుంచి ఎస్బీహెచ్ చౌరస్తా వైపు పంపిస్తారు. ♦ సీటీఓ జంక్షన్ నుంచి ఎంజీ రోడ్ వైపు వెళ్ళే ట్రాఫిక్‌ను ప్యారడైజ్ చౌరస్తా నుంచి హెచ్డీఎఫ్సీ బ్యాంక్, సింధికాలనీ, మినిస్టర్స్ రోడ్, రాణిగంజ్ చౌరస్తా, కర్బాలా మైదాన్ వైపు, ప్యాట్నీ చౌరస్తా నుంచి వచ్చే ట్రాఫిక్‌ను ప్యారడైజ్ చౌరస్తా నుంచి సీటీఓ వైపు పంపిస్తారు. సోమవారం మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 10 గంటల వరకు: ♦ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, సెయింట్ మేరీస్ రోడ్ మధ్య మార్గాన్ని పూర్తిగా మూసేస్తారు. హకీంపేట్, బోయిన్పల్లి, బాలానగర్, అమీర్‌పేట్ వైపుల నుంచి సికింద్రాబాద్ స్టేషన్‌కు వచ్చే బస్సుల్ని క్లాక్ టవర్ వరకే అనుమతిస్తారు. పార్కింగ్ ప్రాంతాలివి: సెయింట్ జాన్స్ రోటరీ, స్వీకార్ ఉప్కార్, ఎస్బీహెచ్ వైపు నుంచి వచ్చే వాహనాలకు హరిహర కళాభవన్, మహబూబియా కాలేజ్ కర్బాలా మైదాన్, బైబిల్ హౌస్, ఘాసీమండీ వైపు నుంచి వచ్చే వాహనాలకు ఇస్లామియా హైస్కూల్ రాణిగంజ్, ఆదయ్య చౌరస్తా వైపు నుంచి వచ్చే వాహనాలను ప్రభుత్వ ఆదయ్య మెమోరియల్ హైస్కూల్ సుభాష్ రోడ్ వైపు నుంచి వచ్చే వాహనాలకు పాత జైల్‌ఖానాలోని ప్రాంతం మంజు «థియేటర్ వైపు నుంచి వచ్చే వాహనాలకు అంజలి థియేటర్ మద్యం విక్రయాలపై ఆంక్షలు... సికింద్రాబాద్‌లోని ఉజ్జయినీ మహంకాళి బోనాల నేపథ్యంలో ఉత్తర, మధ్య మండలాల్లోని కొన్ని ఠాణాల పరిధిలో మద్యం విక్రయాలు నిషేధిస్తూ కొత్వాల్ ఎం.మహేందర్‌రెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి మంగళవారం ఉదయం 6 గంటల వరకు గోపాలపురం, చిక్కడపల్లి, లాలగూడ, తుకారాంగేట్, మహంకాళి, మార్కెట్, మారేడ్‌పల్లి, కార్ఖానా, బేగంపేట, తిరుమలగిరి, రామ్‌గోపాల్‌పేట, గాంధీనగర్ ఠాణాల పరిధిలో ఇవి వర్తిస్తాయి. స్టార్ హోటల్స్‌లో ఉండే బార్లు, రిజిస్టర్డ్ క్లబ్బులకు మినహాయింపునిచ్చారు. -
ఏం చెప్పారు.. సీపీగారూ...
►ట్రాఫిక్ వ్యవస్థ పనిచేయకపోవడం కుట్ర పూరితమా..? ►మరి మూడు రోజులు మీరంతా ఏం చేస్తున్నట్టు ►సిగ్నల్స్ పనిచేయకపోతే.. పోలీసులైనా ఉండాలి కదా ►మరి వారంతా కట్టకట్టుకుని ఎక్కడికి వెళ్లినట్టు ►ఇలాగైతే మహానాడు భద్రత ఎలా? ►సీపీ వ్యాఖ్యలపై వెల్లువెత్తుతున్న విమర్శలు నగరంలో మూడు రోజులుగా ట్రాఫిక్ సిగ్నల్స్ పనిచేయకపోవడం కుట్ర పూరితమట!.. కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యం, ట్రాఫిక్ సిగ్నల్స్ నిర్వహణ కాంట్రాక్టు సంస్థ స్టాన్ పవర్ అలక్ష్యం వల్లే మహానగరంలో ట్రాఫిక్ వ్యవస్థ కుప్పకూలిందట!! వెంటనే సదరు సంస్థపై కేసు కూడా పెట్టేశారట!!! మూడు రోజులుగా నగర ప్రజలకు నరకం చూపిస్తున్న ట్రాఫిక్ వ్యవస్థ వైఫల్యంపై నగర పోలీస్ కమిషనర్ యోగానంద్ చెప్పుకొచ్చిన సంజాయిషీ ఇది. ఈ వివరణలు సంతృప్తిçకరంగాలేకపోగా.. కొత్త ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.. మరిన్ని విమర్శలకు తావిస్తున్నాయి. యోగానంద్ మీడియా ముందుకొచ్చి ఇదంతా కుట్రపూరితమని చెప్పుకొచ్చారు. సీపీ చెప్పినట్టుగానే జీవీఎంసీ, సిగ్నల్ కాంట్రాక్టు సంస్థ వైఫల్యమే అనుకుందాం.. మరి మూడురోజుల పాటు పోలీసు అధికారులు ఎందుకు స్పందించలేదు?.. సోమవారం నుంచి బుధవారం వరకు విశాఖ మహానగరంలో ఒక్క ట్రాఫిక్ సిగ్నల్ కూడా పనిచేయలేదంటే పోలీసు వ్యవస్థ ఏమేరకు పని చేస్తున్నట్టు??.. ఒకవేళ నిజంగానే సదరు సంస్థల నిర్లక్ష్యం, వైఫల్యం వల్లే సిగ్నల్స్ పనిచేయలేదనే అనుకుందాం.. మరి ట్రాఫిక్ పోలీసులు ఏం చేస్తున్నట్టు.. వెంటనే పసిగట్టి సంబంధిత శాఖల అధికారులను అప్రమత్తం చేయాలి కదా.. ట్రాఫిక్ సిబ్బంది ఎక్కడ? రోజుల తరబడి సిగ్నల్స్ పనిచేయని పరిస్థితిలో కనీసం పోలీసులు అక్కడే విధులు నిర్వర్తించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించాలి కదా.. కానీ ఈ మూడురోజుల్లో నగరంలోని సిగ్నల్స్ వద్ద ఒక్క ట్రాఫిక్ కానిస్టేబుల్ కూడా కనిపించలేదు. వందల్లో ఉన్న ట్రాఫిక్ పోలీసు సిబ్బంది ఉన్నట్టుండి ఏమైపోయారు.. ఖాకీలంతా కట్టకట్టుకుని ఒక్కసారిగా ఎక్కడికి వెళ్లినట్టు... ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం నగర ప్రజలందరికీ తెలుసు. మహానాడు పనుల్లో ఖాకీలు మునిగితేలడం వల్లే ఈ ట్రాఫిక్ వైఫల్యం అనేది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఏమో సీపీ చెప్పినట్టు జీవీఎంసీ, స్టాన్పవర్ల నిర్లక్ష్యం వల్ల సాంకేతిక ఇబ్బందులు కూడా తలెత్తి ఉండవచ్చు.. కానీ ట్రాఫిక్ జంక్షన్లలో ఒక్క పోలీసు కూడా విధులు నిర్వర్తించని తప్పిదానికి ఎవరిని బాధ్యులను చేయాలన్నది పోలీసు అధికారులకే వదిలేయాలి. ఇలాగైతే మహానాడు భద్రత ఏమేరకు మూడురోజుల పాటు ట్రాఫిక్ సిగ్నల్స్ పనిచేయకపోవడానికి కారణం కనుక్కునేందుకు విశాఖ పోలీసులకు మూడురోజుల సమయం పట్టింది. ఇంతటి ఘనత వహించిన పోలీసులు మహానాడుకు ఏ మేరకు భద్రత కల్పిస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. తెలుగుదేశం పార్టీ అట్టహాసంగా నిర్వహిస్తున్న మహానాడుకు సీఎంతో సహా మంత్రులు, టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక సంస్థల చైర్మన్లు, ప్రజాప్రతినిధులతో పాటు పాతిక వేలమందికి పైగా టీడీపీ కార్యకర్తలు తరలిరానున్నారు. వీరి భద్రతా సిబ్బందితో పాటు మందీమార్బలమంతా మూడు, నాలుగురోజులు ఇక్కడే మకాం వేయనున్నారు. ఇక అధికార యంత్రాంగం తరలిరానుంది. ఓ విధంగా రాష్ట్రంలో పాలన మూడురోజుల పాటు ఇక్కడి నుంచే కొనసాగనుంది. ఈ పరిస్థితుల్లో పోలీసులు ఏ మేరకు భద్రత కల్పిస్తారన్నది చర్చనీయాంశంగా మారింది. మహానాడు నేపథ్యంలో ఎటూ నగర పౌరుల భద్రతను గాలికొదిలేసిన ఖాకీలు కనీసం మహానాడుకైనా సరైన భద్రత కల్పిస్తే అదే మహా యోగం.. అనే పరిస్థితి ఇక్కడ నెలకొంది. -
టీఆర్ఎస్ బహిరంగ సభకు భద్రతా ఏర్పాట్లు
-
బహిరంగ సభకు భద్రతా ఏర్పాట్లు..
వరంగల్ : తెలంగాణ రాష్ట్ర సమితి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బహిరంగ సభకు భద్రతా పరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు వెల్లడించారు. ఆరు వేల మంది పోలీసు సిబ్బందితో బహిరంగ సభ కోసం విధులు నిర్వహిస్తారని తెలిపారు. మంగళవారం నాడిక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ, దాదాపు 25 లక్షల మేరకు ప్రజలు హాజరయ్యే అవకాశాలు ఉన్నందున పార్కింగ్, ట్రాఫిక్ వంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా అన్ని చోట్లా పికెటింగ్ నిర్వహిస్తూ పోలీస్ కంట్రోల్ రూమ్ ద్వారా ఎప్పటికప్పుడు సిబ్బందికి సూచనలు జారీ చేస్తామని చెప్పారు. సభకు హాజరయ్యే వారి వాహనాలను పార్క్ చేసుకోవడానికి వెయ్యి ఎకరాల్లో పార్కింగ్ స్థలం ఏర్పాటు చేశామని చెప్పారు. అలాగే సభకు వెళ్లడానికి 21 రహదారులను ఏర్పాటు చేశామన్నారు. -
డిపాజిట్‌దారులకు భారీ ఊరట!
- టీఎస్‌పీడీఎఫ్ చట్టంలో కీలక సవరణ - చార్జ్‌షీట్ దాఖలుకు ఇన్స్పెక్టర్లూ అర్హులే సాక్షి, హైదరాబాద్: బోగస్ ఆర్థిక సంస్థల్ని నమ్మి, డిపాజిట్లు పెట్టి నిండా మునిగిన డిపాజిట్‌దారులకు పెద్ద ఊరటే లభించింది. ఈ కేసుల దర్యాప్తులో ప్రధాన అడ్డంకిగా ఉన్న ‘చార్జ్‌షీట్ అధికారాల’సమస్యకు హైదరాబాద్ నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) పోలీసులు మార్గం కనిపెట్టారు. ఇన్స్పెక్టర్ కంటే తక్కువ స్థాయి కాని వారు అభియోగపత్రాలు దాఖలు చేయవచ్చంటూ తెలంగాణ స్టేట్ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ (టీఎస్‌పీడీఎఫ్) రూల్స్‌కు కీలక సవరణకు తీసుకువచ్చారు. సీసీఎస్ అధికారులు రూపొందించిన సవరణ ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదముద్ర వేస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఇవి కేవలం నగరానికే కాకుండా రాష్ట్రంలోని అన్ని జిల్లాలకూ వర్తిస్తాయని సీసీఎస్ డీసీపీ అవినాష్ మహంతి ‘సాక్షి’కి తెలిపారు. ఆస్తుల స్వాధీనానికి ఆస్కారం... ఆర్థికాంశాలు ముడిపడి ఉన్న ప్రతి కేసులోనూ టీఎస్‌పీడీఎఫ్ చట్టాన్ని ప్రయోగించడానికి ఆస్కారం లేదు. ఏఏ ఉదంతాల్లో అయితే నిందితులు బాధితుల నుంచి డిపాజిట్ల రూపంలో డబ్బు సేకరిస్తారో వాటిలో మాత్రమే ఈ చట్టాన్ని ప్రయోగించవచ్చు. మిగిలిన చట్టాల కింద నమోదైన కేసుల్లో నిందితుల్ని అరెస్టు చేసినప్పుడు వారి ఆస్తులు మొత్తాన్ని స్వాధీనం చేసుకునే ఆస్కారం లేదు. కేవలం ఆ నేరానికి సంబంధించిన డబ్బుతో సమీకరించుకున్న వాటినే సీజ్ చేయాలి. అయితే టీఎస్‌పీడీఎఫ్ చట్టం కింద నమోదైన కేసుల్లో మాత్రం నిందితులతో వారి సన్నిహితుల ఆస్తుల్ని సైతం స్వాధీనం చేసుకునే అధికారం పోలీసులకు ఉంటుంది. ఇలా సీజ్ చేస్తున్న ఆస్తుల జాబితాను ప్రభుత్వానికి పంపడం ద్వారా ఆమోదం పొందాల్సి ఉంటుంది. స్వాధీనం చేసుకున్న ఆస్తుల్ని పోలీసు విభాగం న్యాయస్థానానికి అప్పగిస్తుంది. నిందితులపై నేరం రుజువై, దోషులుగా తేలిన తర్వాత వేలం వేసి, అలా వచ్చిన డబ్బును బాధితులకు పంచే ఆస్కారం ఉంటుంది. సవరణ ప్రతిపాదించిన సీసీఎస్... గతంలో ఈ తరహా కేసుల్లో పోలీసు కమిషనర్/జిల్లా కలెక్టర్ మాత్రమే అభియోగపత్రాలు దాఖలు చేసే ఆస్కారం ఉంది. అలా కాకుండా దర్యాప్తు అధికారులు అభియోగపత్రాలు దాఖలు చేస్తే నిబంధనలకు విరుద్ధం కావడంతో న్యాయస్థానాల్లో వీగిపోతున్నాయి. దీంతో ఏళ్లుగా అనేక కేసులు పెండింగ్‌లో ఉండిపోయి బాధితులకు ఊరట లభించట్లేదు. ఒక్క సీసీఎస్‌లోనే దాదాపు 50 కేసులో ఈ కారణంగా పెండింగ్‌లో ఉండిపోయాయి. నగర నేర పరిశోధన విభాగం డీసీపీగా అవినాష్ మహంతి బాధ్యతలు స్వీకరించిన తరువాత టీఎస్‌పీడీఎఫ్ చట్టం కింద నమోదైన కేసులు అనేకం పెండింగ్‌లో ఉండడంపై ఆరా తీయగా... అభియోగపత్రాలు దాఖలు అధికారం అంశం బయటపడింది. దీంతో ఇన్స్పెక్టర్ కంటే తక్కువ స్థాయి కాని అధికారి ఎవరైనా అధీకృతులే అని, వారు అభియోగపత్రాలు దాఖలు చేయవచ్చంటూ సవరణకు ప్రతిపాదించారు. దీనికి ఆమోదముద్ర వేసిన ప్రభుత్వం గత నెల 24న ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సీసీఎస్‌లో ఉన్న టీఎస్‌పీడీఎఫ్ కేసుల్లో అభియోగపత్రాలు దాఖలుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. -
ఫోర్త్ లయన్ యాప్ కొత్త వెర్షన్ విడుదల
భవానీపురం : ఫోర్త్ లయన్ యాప్‌ను ప్రజలకు మరిన్ని సేవలను అందించేందుకుగాను దానిని ఆధునీకరించి రూపొందించిన కొత్త వెర్షన్‌ను విడుదల చేశారు. ఈ మేరకు నగర పోలీస్ కమిషనర్ కార్యాలయం నుంచి శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. గూగుల్ ప్లే స్టోర్ ద్వారా ఈ యాప్‌ను అప్డేట్ చేసుకోవాలని కోరారు. కొద్ది రోజులలో ఐఓఎస్ వెర్షన్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. యాప్ కొత్త వెర్షన్లో పొందుపరిచిన సౌకర్యాలు ► హోమ్ పేజి డిజైన్ మార్చి మరింత ఆకర్షణీయంగా నగర పోలీస్ వెబ్సైట్ వివరాలు ఇచ్చారు ► పబ్లిక్ ఇన్ఫర్మేషన్లోని పోలీస్ స్టేషన్ ఆప్షన్లో ఆ స్టేషన్‌ను కాంటాక్ట్ చేసేందుకు ఫోన్ నెంబర్, స్టేషన్ ఉండే ప్రాంతాన్ని మ్యాప్‌లో చూపించారు. ► నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అధికారుల వివరాలు, వారి ఫోన్ నెంబర్లు పొందుపరిచారు. తద్వారా వారిని ఫోన్ ద్వారా సంప్రదించే అవకాశం కల్పించారు. ► రహదారులలో ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రదేశాల (లైవ్ ట్రాఫిక్‌లో బ్లాక్ స్పాట్స్) వివరాలను ఇచ్చారు. ఈ సమాచారంతో బ్లాక్ స్పాట్స్ వద్ద జాగ్రత్తగా ప్రయాణం చేయవచ్చు. అలాగే ప్రమాదం జరిగిన ప్రాంతం నుంచి పోలీస్ స్టేషన్, హాస్పటల్ ఎంత దూరంలో ఉంది అనే వివరాలను పొందుపరిచారు. రాబోయే వెర్షన్లో దీనిని మరింత మెరుగుపరచనున్నారు. యాప్‌లో ప్రత్యేక సర్వీసులు ► మహిళా భద్రత కోసం ప్రత్యేకంగా ‘ట్రాక్ మై ట్రావెల్’, ఎస్ఓఎస్ను పొందుపరిచారు. ఏదైనా ప్రమాదాన్ని ఊహిస్తే యాప్‌లో ఈ బటన్‌ను నొక్కడం వలన పోలీసులు అప్రమత్తమై మీరు ఉన్న ప్రాంతానికి అతి తక్కువ సమయంలో చేరుకుని రక్షిస్తారు. ► నవ్యాంధ్రప్రదేశ్ రాజధానిగా రూపుదిద్దుకుంటున్న తరుణంలో విజయవాడ నగరం, చుట్టు పక్కల ప్రాంతాలలో స్థిరపడేందుకు ఉద్యోగరీత్యాగానీ, జోవనోపాధి కోసంగానీ ఎంతోమంది వస్తున్నారు. అటువంటివారికి ఇల్లు అద్దెకు ఇచ్చేటప్పుడు, కొత్తగా పనులలో కుదుర్చుకునేటప్పుడు, డ్రైవర్లను నియమించుకునే సమయంలో వారి వివరాలను ఈ యాప్‌లోని ‘వెరిఫికేషన్’ ఆప్షన్ ద్వారా పంపితే, పోలీసులు వారి గురించి విచారించి వారి వివరాలను దరఖాస్తుదారునికి తెలియచేస్తారు. మంచివారిని పనిలోకి తీసుకోవడం, సరైనవారికి ఇల్లు అద్దెకు ఇచ్చుకోవడం ద్వారా ఇబ్బందులు లేకుండా చేసుకోవచ్చు. ► ఊరు వెళ్లాల్సివచ్చినప్పుడు ఇంటి వివరాలను వెకేషన్ ఇన్ఫర్మేషన్లో పొందుపరిస్తే, ఆ ప్రాంతంలో పోలీసు బీటును ఏర్పాటు చేస్తారు. ప్రజలందరూ ఈ యాప్‌ను ఉపయోగించుకుని పోలీసుల సేవలను అందుకోవాలని కోరారు. -
188 ఏళ్ల తర్వాత
లండన్: దాదాపు 188 సంవత్సరాల తర్వాత తొలిసారి ఓ మహిళ లండన్ మెట్రోపాలిటన్ పోలీస్ డిపార్ట్మెంట్కు కమిషనర్‌గా నియమితులయ్యారు. స్కాట్లాండ్ యార్డ్ కమిషనర్‌గా ఉన్న బెర్నాడ్ హోగన్హోవ్ వచ్చే వారం పదవివిరమణ చేయనున్నారు. ఇదే డిపార్ట్మెంట్లో గతంలో అసిస్టెంట్ కమిషనర్‌గా విధులు నిర్వహించిన క్రెసిడా డిక్‌ను కమిషనర్‌గా నియమించారు. 2015లో డిక్ విదేశాంగ శాఖలో విధులకు వెళ్లారు. తాజాగా ఓ మహిళను ప్రతిష్టాత్మకమైన పోస్టుకు ఎంపిక చేయడంపై బ్రిటన్ హోంశాఖ కార్యదర్శి మాట్లాడారు. డిక్కు డిపార్ట్మెంట్కు సంబంధించిన ఓ సుదీర్ఘ అవగాహన ఉందని చెప్పారు. అది భవిష్యత్తులో డిపార్ట్మెంట్ను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుతుందని అభిప్రాయపడ్డారు. బ్రిటన్‌లోని అతిపెద్ద పోలీస్ ఫోర్స్ లండన్ మెట్రోపాలిటనే. దీన్నే స్కాట్లాండ్ యార్డ్ డిపార్ట్మెంట్ అని కూడా పిలుస్తారు. -
సీఐ వేధిస్తున్నాడు..
మహిళాపోలీస్స్టేషన్ సిబ్బంది ఆవేదన సాక్షి, వరంగల్: వరంగల్ పోలీసు కమిష నరేట్ పరిధిలోని మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఇన్స్పెక్టర్ విష్ణుమూర్తి వేధింపులకు గురి చేస్తున్నారంటూ సిబ్బంది పోలీసు కమిషనర్ జి.సుధీర్‌బాబుకు ఫిర్యాదు చేశారు. మహిళా పోలీసుస్టేషన్లో పనిచేస్తున్న సిబ్బంది బుధవారం పోలీస్ కమిషనర్‌ను స్వయంగా కలిసి ఫిర్యాదు పత్రం ఇచ్చారు. విధి నిర్వహణ పేరుతో పరేడ్, డ్రెస్ ఇలా ఉండాలంటూ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నా డని మహిళా సిబ్బంది పోలీసు కమిషనర్‌కు చెప్పారు. విష్ణుమూర్తిని ఇన్స్పెక్టర్గా కొన సాగిస్తే మూకుమ్మడిగా సెలవులు పెట్టేందు కు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఆరోపణలపై విచారణ జరిపి చర్య తీసు కుంటామని కమిషనర్ హామీ ఇచ్చారు. -
ఏ నిబంధన మేరకు ఉత్తర్వులిచ్చారు?
• ఆధార్ కార్డు విషయంలో • పోలీసుల ఉత్తర్వులపై హైకోర్టు ప్రశ్న సాక్షి, హైదరాబాద్: వాహనదారులు వాహనం నడిపే సమయంలో ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉంచుకోవాలంటూ జారీ చేసిన ఉత్తర్వులపై హైకోర్టు సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌ను వివరణ కోరింది. ఏ చట్ట నిబంధనలను అనుసరించి ఈ ఉత్తర్వులు జారీ చేశారో చెప్పాలని పేర్కొంది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ అం బటి శంకరనారాయణలతో కూడిన ధర్మాసనం మంగళవారం తీర్పునిచ్చింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైదరాబాద్‌కు చెందిన వై.సోమరాజు అనే వ్యక్తి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఆధార్ కోసం పోలీసులు ఒత్తిడి చేస్తున్నారని, నిబంధనల ప్రకారం ఆధార్ తప్పనిసరి కాదని నివేదించారు. హోంశాఖ తరఫు న్యాయవాది హెచ్.వేణుగోపాల్ స్పందిస్తూ.. ఆధార్ దగ్గర ఉంచుకోవాలన్నది సలహా మాత్రమేనన్నారు. డ్రైవింగ్ లెసైన్స్ లేకపోతే ఆధార్ ద్వారా ఆ వ్యక్తి వివరాలు తెలుసుకునేందుకే కమిషనర్ పత్రికా ప్రకటన ఇచ్చారన్నారు. వాదనలు విన్న ధర్మాసనం దీనిపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని కమిషనర్‌ను ఆదేశించింది. -
'మీడియా లేని పోలీసింగ్‌ను ఊహించలేం'
హైదరాబాద్ : హైదరాబాద్ మహానగరంలో మీడియా లేకుండా పోలీసింగ్‌ను ఊహించలేమని నగర కొత్వాల్ ఎం.మహేందర్‌రెడ్డి అన్నారు. పోలీసులు తీసుకునే ప్రతి చర్యలోనూ మీడియా పాత్ర వెలకట్టలేనిదని అభిప్రాయపడ్డారు. ప్రతి దశలోనూ పోలీసులకు మీడియా అండగా నిలిచిందని కితాబిచ్చారు. రంజాన్, గణేష్ ఉత్సవాలు, బక్రీద్ పండుగల్ని ప్రశాంతంగా పూర్తి చేయడానికి పోలీసులకు సహకరించిన మీడియాకు కొత్వాల్ గురువారం ఆత్మీయ పూర్వక విందు ఇచ్చారు. జలవిహార్‌లోని వేదిక హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో మీడియా ప్రతినిధులతో పాటు పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ... 'ప్రస్తుత సమాజంలో మీడియా పాత్ర ఎంతో కీలమైంది. అనేక సందర్భాల్లో పుకార్లను అరికట్టడంతోపాటు నిజానిజాలను ప్రజల దృష్టికి తీసుకువెళ్ళడంలో కీలకపాత్ర పోషిస్తోంది. బుధవారం నగరంలో అనేకచోట్ల బాంబులు ఉన్నాయంటూ పుకార్లు సోషల్ మీడియాలో చెలరేగాయి. దీనిపై నేను ఇచ్చిన వివరణను ప్రజల్లోకి మీడియా తీసుకువెళ్ళి సాధారణ జనజీవనం కొనసాగేలా చేసింది. నేరాల నిరోధం, కేసులు కొలిక్కి తీసుకురావడంతోపాటు పోలీసింగ్ కోసం పోలీసులు తీసుకుంటున్న ప్రతి చర్యనూ మీడియా ప్రజలకు వివరిస్తోంది. లండన్ నగరం ప్రపంచంలోనే సేఫ్ సిటీగా మారడానికి కారణం అక్కడ దాదాపు పదేళ్ల క్రితం అమలులోకి వచ్చి, నేటికీ కొనసాగుతున్న కమ్యూనిటీ సీసీ కెమెరా ప్రాజెక్టు. హైదరాబాద్‌లోనూ దాన్ని అమలు చేస్తున్నాం. సిటీలో ఇంతగా సక్సెస్ కావడానికి మీడియా ఇచ్చిన సహకారమే ప్రధాన కారణం. భవిష్యత్తులోనూ మీడియా ఇదే విధమైన సహాయసహకారాలను అందిస్తుందని ఆశిస్తున్నాం' అని అన్నారు. -
కొత్వాల్‌కు అభినందనలు...
ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా గణేష్ ఉత్సవాలను విజయవంతంగా పూర్తి కావడంతో నగర పోలీసు కమిషనర్‌ను పోలీసు అధికారుల సంఘం అభినందించింది. సంఘం ప్రతినిధులు శుక్రవారం కొత్వాల్‌ను కలిసి శుభాకాంక్షలు తెలపడంతో పాటు అహర్నిషలు శ్రమించిన సిబ్బందికి బత్తా ఇవ్వాలని కోరారు. – సాక్షి, సిటీబ్యూరో -
బుల్లెట్ గాయాలతో పోలీసుస్టేషన్‌కు యాదగిరి!
-
బుల్లెట్ గాయాలతో పోలీసుస్టేషన్‌కు యాదగిరి!
ఓల్డ్ బోయిన్ పల్లి సమీపంలో శనివారం ఉదయం జరిగిన కాల్పులకు భూ వివాదాలే కారణమని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి తెలిపారు. ఇద్దరి మధ్య పెనుగులాట జరిగిందని, ఈ పెనుగులాటలోనే కాల్పులు జరిగాయని ఆయన వివరించారు. కాల్పులు జరిగిన తర్వాత బుల్లెట్ గాయాలతోనే యాదగిరి పోలీసు స్టేషన్‌కు వచ్చారని చెప్పారు. అయితే ఈ ఘటనలో ఉపయోగించిన తుపాకి ఎవరిదనే విషయమై ఇంకా స్పష్టత లేదన్నారు. సీసీ కెమెరా విజువల్స్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని సీపీ మహేందర్‌రెడ్డి చెప్పారు. ప్రస్తుతం యాదగిరి ప్రాణాలకు ఎలాంటి ముప్పు లేదని, ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని అన్నారు. అల్వాల్‌లో ఓ భూ వివాదానికి సంబంధించి యాదగిరికి, మరో వ్యక్తికి మధ్య గొడవలు ఉన్నాయని, వాటి నేపథ్యంలోనే ఈ దాడి జరిగి ఉండొచ్చని తెలిపారు. -
పచ్చదనంతోనే ప్రగతి
l గంగదేవిపల్లికి రావడం అంటే టెంపుల్‌కు వచ్చినట్లు.. l హరితహారంలో 9.50 లక్షల మొక్కలు నాటాం l నగర పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు గీసుకొండ : పచ్చదనంతోనే ఏ సమాజమైనా ప్రగతి సాధిస్తుందని, ప్రస్తుతం కావల్సినవి కాంక్రీట్ జంగిల్స్ కావని, జంగిల్స్ అని వరంగల్ నగర పోలీస్ కమిషనర్ జి. సుధీర్‌బాబు అన్నారు. హరితహారాన్ని ప్రజల భాగస్వామ్యంతో ఉద్యమంలా చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. మండలంలోని జాతీయ ఆదర్శగ్రామం గంగదేవిపల్లిలో పోలీసుల ఆ««దl్వర్యంలో బుధవారం చేపట్టిన హరితహారం కార్యక్రమంలో మాట్లాడుతూ.. గంగదేవిపల్లికి రావడం అంటే దేవాలయానికి వచ్చినట్లుగా ఉంటుందని, ఇలాంటి గ్రామాన్ని హరితవనంగా తీర్చిదిద్దడానికి తొలుత 6 వేల మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని అన్నారు. పెంబర్తిని దత్తత తీసుకుని గంగదేవిపల్లిలా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నానని చెప్పారు. నీరు, చెట్లు సమృద్ధిగా ఉన్న చోటే గొప్ప నాగరికతలు వర్ధిల్లాయని గుర్తుచేశారు. గత ఏడాది హరితహారంలో 1.10 లక్షల మొక్కలు నాటితే, ప్రజల భాగస్వామ్యంతో ఈ ఏడాది నగర కమిషనరేట్ పరిధిలో 9.50 లక్షల మొక్కలు నాటామన్నారు. మామునూరు ఎసీపీ మహేందర్ మాట్లాడుతూ చైనా, ఆఫ్రికా దేశాల తర్వాత ఇక్కడే పెద్ద స్థాయిలో హరితహారం కార్యక్రమం జరుగుతోందన్నారు. మామునూరు డివిజన్ పరిధిలో 3.50 లక్షల మెక్కలు నాటామన్నారు. అనంతరం గ్రామంలో 8 సీసీ కెమెరాలను సీపీ ప్రారంభించారు. కార్యక్రమంలో సీఐ శ్రీనివాస్, ఎంపీపీ ముంత కళావతి, జెడ్పీటీసీ ఆంగోతు కవిత, ఎంపీడీఓ సాయిచరణ్, ఈవోపీఆర్డీ భీంరెడ్డి రవీంద్రారెడ్డి, మామునూరు సీఐ శ్రీనివాస్, గీసుకొండ ఎస్ఐలు అంజన్‌రావు, నవీన్‌కుమార్, సర్పంచ్ ఇట్ల శాంతి, గ్రామాభివృద్ధి కమిటీ నాయకుడు కూసం రాజమౌళి , అరబిందో ఫార్మసీ కాలేజి, ఉషోదయ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. -
ట్రాఫిక్ జామ్ ఎఫెక్ట్: పోలీసు కమిషనర్ బదిలీ
భారీ వర్షపాతంతో ఎన్నడూ కనీ వినీ ఎరుగనంత ట్రాఫిక్ జామ్ ఏర్పడటం, ఇది ఏకంగా రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కూడా వివాదానికి కారణం అవడంతో ఓ పోలీసు కమిషనర్ మీద బదిలీ వేటు పడింది. హరియాణాలోని గుర్గావ్ పోలీసు కమిషనర్ నవదీప్ విర్క్‌ను రోహ్తక్కు బదిలీ చేశారు. ఆయన స్థానంలో సందీప్ ఖిరావర్ను గుర్గావ్ సీపీగా నియమించారు. గుర్గావ్ వద్ద ఏకంగా 17 గంటల పాటు ట్రాఫిక్ జామ్ కావడంతో ఆ తప్పునకు బాధ్యులు మీరంటే మీరంటూ హరియాణా, ఢిల్లీ ముఖ్యమంత్రులు పరస్పరం ఆరోపించుకున్న విషయం తెలిసిందే. ఇక తాము అన్ని గంటల పాటు రోడ్డు మీదే ఇరుక్కుపోయినా.. ఎక్కడా ఒక్క పోలీసు కూడా కనిపించలేదని ప్రజలు ఆరోపించారు. దాంతో విర్క్ మీద వేటు పడింది. అయితే పోలీసులు మాత్రం పూర్తిస్థాయిలో విధుల్లో పాల్గొన్నారని ఆయన అంటున్నారు. నీళ్లు నిలిచిపోతుంటే పట్టించుకోకపోవడం కార్పొరేషన్ తప్పని చెప్పారు. శుక్రవారం నాడు ఎన్‌హెచ్8 మీదుగా వెళ్లిన ప్రయాణికులకు చుక్కలు కనిపించాయి. వందలాది ట్రక్కులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దాంతో మొత్తం ట్రాఫిక్ క్లియర్ అవడానికి దాదాపు 17 గంటలకు పైగా సమయం పట్టింది. సాయంత్రం 6 గంటలకు మొదలైన కష్టాలు అలా కొనసాగుతూనే ఉన్నాయి. చాలామంది తమ వాహనాలను అక్కడే వదిలేసి, మోకాలి లోతు నీళ్లలో నడుచుకుంటూ వెళ్లిపోయారు. ఢిల్లీ నుంచి గుర్గావ్ మధ్య ప్రయాణాలు ఆపుకోవాలని పోలీసులు ప్రజలకు సలహా ఇచ్చారు. -
హెల్మెట్ తప్పనిసరి..
దశలవారీగా ద్విచక్ర వాహనదారులపై ఒత్తిడి అవగాహనతోనే లక్ష్య సాధనకు ప్రయత్నం ఆరునెలల్లో అందరూ వాడేలా కృషి వరంగల్ : నగరంలో ప్రతి ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ వాడేలా చర్యలు తీసుకునేందుకు పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. 28న నిర్వహించిన ‘మీ క్షేమం’ కార్యక్రమానికి విశేష స్పందన వచ్చిందని, అందులో పలువురు చేసిన సూచనలను అమలు చేసేందుకు ప్రయత్నిస్తామని అన్నారు. శుక్రవారం కమిషనరేట్‌లో ఆయన మాట్లాడుతూ.. హెల్మట్ల వాడకంపై విస్తృతంగా ప్రచారం నిర్వహించేలా ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. హెల్మెట్లు లేని వారి నుంచి ఫైన్ వసూలు చేయడం వల్ల లక్ష్యం సాధించడం కష్టమని పలువురు అభిప్రాయపడినట్లు చెప్పారు. ప్రస్తుతం రోజుకు సుమారు 150 మంది నుంచి ‘హెల్మెట్’ ఫైన్లు వసూలు చేస్తున్నట్లు తెలిపారు. ఫైన్ వేయకుండా వారిలో పరివర్తన తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. మొదటగా పోలీస్ సిబ్బంది హెల్మెట్ వాడేలా చర్యలు తీసుకుంటామన్నారు. కాలేజీ యాజమాన్యాలతో భేటీ... కాలేజీ విద్యార్థులు వేగంగా బైక్‌లు నడుపుతున్నారని గుర్తించామని చెప్పారు. అడ్మిషన్ల సమయంలో విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహించి తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకొని బైక్ నడుపాలన్న నిబంధనలను కాలేజీ యాజమాన్యంతో పెట్టించేలా ప్రయత్నిస్తున్నామని తెలిపారు. నగరంలో గోతులు ఉన్న రోడ్లను గుర్తించామని, వాటి మరమ్మతుకు గ్రేటర్ కార్పొరేషన్ అధికారులతో చర్చిస్తామని చెప్పారు. రోడ్డు ప్రమాదాలు ఎక్కడెక్కడ జరుగుతాయన్న విషయాలను అధ్యయనం చేయాలని నిట్ అధికారులను కోరినట్లు తెలిపారు. ప్రీపెయిడ్ ఆటోలు... నగరంలో ప్రీపెయిడ్ ఆటోలను ప్రారంభించాలని యోచిస్తున్నామని, అందుకోసం ఆటో యూనియన్లతో త్వరలో సమావేశం అవుతామని సీపీ పేర్కొన్నారు. స్టాండ్లు ఏర్పాటుచేసి ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
బోనాల సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, సిటీబ్యూరో: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర నేపథ్యంలో ఆ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆది–సోమవారాల్లో వివిధ సమయాల్లో, వివిధ ప్రాంతాల్లో ఇవి అమలులో ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ఉత్సవాలకు హాజరయ్యే వారి కోసం ప్రత్యేక పార్కింగ్ స్థలాలను కేటాయించారు. వేర్వేరు మార్గాల్లో వచ్చే వారి వాహనాలకు వేర్వేరు పార్కింగ్ స్థలాలు కేటాయించారు. ఆదివారం తెల్లవారుజామున 4 నుంచి ♦ ఉజ్జయిని మహంకాళి పూజ ముగిసే వరకు టుబాకో బజార్ హిల్ స్ట్రీట్, జనరల్ బజార్, ఆదయ్య చౌరస్తాల నుంచి మహంకాళి ఆలయం వరకు ఉన్న మార్గాల్లో ట్రాఫిక్ అనుమతించరు. బాటా చౌరస్తా నుంచి రామ్‌గోపాల్‌పేట పోలీసుస్టేషన్ మధ్య ఉన్న సుభాస్ రోడ్‌ను వాహనాలకు మూసేస్తారు. ∙కర్బాలా మైదాన్ నుంచి రాణిగంజ్ చౌరస్తా వైపు వచ్చే ట్రాఫిక్‌ను మినిస్టర్స్ రోడ్, రసూల్‌పుర చౌరస్తా, సీటీఓ, ఎస్బీహెచ్ చౌరస్తా, వైఎంసీఏ చౌరస్తా, సె యింట్ జాన్స్ రోటరీ, గోపాలపురం లైన్, రైల్వేస్టేషన్ మీదుగా పంపిస్తారు. ♦ బైబిల్ హౌస్ వైపు నుంచి వచ్చే సాధారణ ట్రాఫిక్‌ను ఘాస్మండి చౌరస్తా, సజన్‌లాల్ స్ట్రీట్ మీదుగా పంపిస్తారు. ♦ రైల్వేస్టేషన్నుంచి ట్యాంక్‌బండ్ వైపు వెళ్లే ఆర్టీసీ బస్సు ల్ని అల్ఫా హోటల్, గాంధీ ఎక్స్ రోడ్, మహంకాళి ఓల్డ్ ట్రాఫిక్ పోలీసుస్టేషన్, ఘాస్మండి, బౌబిల్ హౌస్, కర్బాలా మైదాన్ మీదుగా పంపిస్తారు. ♦ రైల్వేస్టేషన్ నుంచి తాడ్‌బండ్, బేగంపేట వైపు వెళ్లే ఆర్టీసీ బస్సుల్ని క్లాక్ టవర్, ప్యాట్నీ చౌరస్తా, వైఎం సీఏ చౌరస్తా,ఎస్బీహెచ్ చౌరస్తా మీదుగా పంపిస్తారు. ♦ ఎస్బీహెచ్ చౌరస్తా నుంచి ఆర్పీ రోడ్ వైపు వెళ్లే ట్రాఫిక్‌ను ప్యాట్నీ చౌరస్తా నుంచి క్లాక్ టవర్, ప్యారడైజ్ వైపు, ♦ ప్యారడైజ్ నుంచి ఆర్పీ రోడ్‌కు వచ్చే ట్రాఫిక్‌ను ప్యాట్నీ చౌరస్తా నుంచి ఎస్బీహెచ్, క్లాస్టవర్ వైపు పంపిస్తారు. ♦ క్లాక్ టవర్ వైపు నుంచి ఆర్పీ రోడ్లోకి వెళ్లే ట్రాఫిక్‌ను ప్యాట్నీ చౌరస్తా నుంచి ఎస్బీహెచ్ చౌరస్తా వైపు మళ్లిస్తారు. ♦ సీటీఓ జంక్షన్ నుంచి ఎంజీ రోడ్ వైపు వెళ్లే ట్రాఫిక్‌ను ప్యారడైజ్ చౌరస్తా నుంచి హెచ్డీఎఫ్సీ బ్యాంక్, సింధికాలనీ, మినిస్టర్స్ రోడ్, రాణిగంజ్ చౌరస్తా, కర్బాలా మైదాన్ వైపు, ప్యాట్నీ చౌరస్తా నుంచి వచ్చే ట్రాఫిక్‌ను ప్యారడైజ్ చౌరస్తా నుంచి సీటీఓ వైపు పంపిస్తారు. సోమవారం మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 10 గంటల వరకు: ♦ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, సెయింట్ మేరీస్ రోడ్ మధ్య మార్గాన్ని పూర్తిగా మూసేస్తారు. హకీంపేట్, బోయిన్పల్లి, బాలానగర్, అమీర్‌పేట వైపుల నుంచి సికింద్రాబాద్ స్టేషన్‌కు వచ్చే బస్సుల్ని క్లాక్ టవర్ వరకే అనుమతిస్తారు. పార్కింగ్ ప్రాంతాలివి: ♦ సెయింట్ జాన్స్ రోటరీ, స్వీకార్ ఉప్కార్, ఎస్బీహెచ్ వైపు నుంచి వచ్చే వాహనాలకు హరిహర కళాభవన్, మహబూబియా కాలేజ్ ♦ కర్బాలా మైదాన్, బైబిల్ హౌస్, ఘాసీమండీ వైపు నుంచి వచ్చే వాహనాలకు ఇస్లామియా హైస్కూల్ ♦ రాణిగంజ్, ఆదయ్య చౌరస్తా వైపు నుంచి వచ్చే వాహనాలను ప్రభుత్వ ఆదయ్య మెమోరియల్ హైస్కూల్ ♦ సుభాష్ రోడ్ వైపు నుంచి వచ్చే వాహనాలకు పాత జైల్‌ఖానాలోని ప్రాంతం ♦ మంజు «థియేటర్ వైపు నుంచి వచ్చే వాహనాలకు అంజలి థియేటర్. -
శిశువు అపహరణ కేసులో ఐదుగురి అరెస్ట్
-
రంజాన్ పోలీస్
నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి సోమవారం రాత్రి పాతబస్తీలో పర్యటించారు. మదీనా నుంచి చార్మినార్ వరకు ఆయన కాలినడకన వెళ్లి రాత్ బజార్‌ను తిలకించారు. మదీనా చౌరస్తా వరకు పోలీసు వాహనంలో వచ్చిన మహేందర్‌రెడ్డి...అక్కడి నుంచి దారిపొడుగునా నడుచుకుంటూ పలుచోట్ల షాపింగ్ చేశారు. పర్ఫ్యూమ్ కొనుగోలు చేసి చార్మినార్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి పిస్తాహౌస్, శాలిబండ, రాజేశ్ మెడికల్ హాల్ వరకు నడుచుకుంటూ వెళ్లారు. పోలీసుల బందోబస్తును పర్యవేక్షించారు. పిస్తా హౌస్ దగ్గర హలీమ్‌ను ఆసక్తిగా తిలకించారు. రంజాన్ సందర్భంగా పాతబస్తీలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటుచేశామని,పోలీసు శాఖ అప్రమత్తంగా ఉందని చెప్పారు. నగర అదనపు పోలీసు కమిషనర్(శాంతి భద్రతలు) వీవీ శ్రీనివాసరావు, సౌత్‌జోన్ డీసీపీ సత్యనారాయణలు సీపీ వెంట ఉన్నారు. - యాకుత్‌పురా -
క్రిమినల్స్ కాదు.. క్రైమ్ పైనే యుద్ధం
సాక్షి, సిటీబ్యూరో: ‘ఎటాక్ ఆన్ క్రైమ్... నాట్ ఆన్ క్రిమినల్స్’ (నేరాలపైనే దాడి, నేరస్తులపై కాదు) ఇదే తమ పోలీసింగ్ విధానమని సైబరాబాద్ ఈస్ట్ తొలి పోలీసు కమిషనర్ మహేష్ మురళీధర్ భగవత్ అన్నారు. ఆయన శుక్రవారం గచ్చిబౌలిలోని కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. నేరగాళ్లను మాత్రమే టార్గెట్‌గా చేసుకుంటూ వెళ్తే వచ్చే ఫలితాల కన్నా... ఓ వ్యక్తిని నేరగాడిగా మారుస్తున్న పరిస్థితుల్ని అధ్యయనం చేసి, పరిష్కారాలు చూపగలిగితే మేలైన ఫలితం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే ఎటాక్ ఆన్ క్రైమ్ విధానంలో పని చేస్తూ తొలిసారి నేరం చేసి అరెస్టయిన వారికి కౌన్సెలింగ్ ఇవ్వడం, వారిలో మార్పునకు కృషి చేయడం చేస్తామన్నారు. మహేష్ భగవత్ ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడుతూ... ‘తొలుత కమిషనరేట్ కార్యాలయంలో కోసం మా పరిధిలో అనువైన స్థలం గుర్తించాల్సి ఉంది. ఇప్పటికే ఉన్న ప్రాంతాలతో పాటు కొత్తగా భువనగిరి, వలిగొండ, చౌటుప్పల్ తదితరాలు కొత్తగా వచ్చి చేరాయి. 3500 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 17 లక్షల జనాభాతో ఉన్న ఈ ప్రాంతంలో గతేడాది 26 వేల కేసులు నమోదయ్యాయి. ఆయా ప్రాం తాల్లో ఉన్న ఇబ్బందులు, సమస్యల్ని పోలీసుస్టేషన్ల వారీగా ప్రజల్ని సంప్రదిస్తూ తెలుసుకుంటాం. వారి భాగస్వామ్యంతోనే వాటి పరిష్కారానికి కృషి చేస్తాం. వీలైనంత త్వరగా బాధితులకు సొత్తు... నేరాల నిరోధం కోసం విజుబుల్ పోలీసింగ్ విధానాలు చేపట్టనున్నాం. అలాగే జరిగిన నేరాలను త్వరగా కొలిక్కి తేవడంతో పాటు సొత్తు సంబంధ నేరాల్లో రికవరీ అయిన బంగారం, నగదును బాధితులకు వీలైంత త్వరగా అందేలా చర్యలు తీసుకుంటాం. పదేపదే నేరాలు చేసే రిపీటెడ్ అఫెండర్స్కు చెక్ చెప్పడానికి మాన్యువల్‌గా, సాంకేతికంగా నిఘా కొనసాగిస్తాం. పీడీ యాక్ట్ నమోదు ప్రక్రియ ఇకపైనా పక్కాగా అమలుచేస్తాం. ప్రస్తుతం గచ్చిబౌలి చుట్టు పక్కలకే పరిమితమైన సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్‌ను విస్తరించి, ఈస్ట్ ప్రాంతంలోనూ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటాం. అక్కడ పని చేసే ఉద్యోగినుల కోసం ‘షీ-క్యాబ్స్’, ‘షీ-షటిల్స్’ తదితర సేవలను అందుబాటులోకి తెస్తాం. సోషల్ మీడియాలో షికార్లు చేసే పుకార్లను తీవ్రంగా పరిగణిస్తాం. ఇలాంటి చర్యలకు ఉపక్రమించే వారిని గుర్తించడానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించడంతో పాటు నిందితులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం. మహిళల భద్రతకు పెద్దపీట... మహిళల భద్రతకు పెద్దపీట వేసే సైబరాబాద్ ఈస్ట్ అధికారులు వారితో పాటు చిన్నారులపై జరిగే నేరాల ను తీవ్రంగా పరిగణిస్తారు. ఇప్పటికే సీఐడీ, ఇతర జిల్లా ల్లో పని చేసిన సందర్భాల్లో మహిళలు/చిన్నారుల అక్ర మ రవాణా అడ్డుకోవడానికి అనేకచర్యలు తీసుకున్నాం. వాటిని కొనసాగిస్తూ వ్యవస్థీకృత ముఠాల మూలాలు కనిపెట్టి కఠినంగా వ్యవహరిస్తాం. ఈ తరహా కేసుల్లో బాధితులకు అవసరమైన సహాయసహకారాలు అందించాలనే ప్రభుత్వ ఆదేశాలను పక్కాగా అమలు చేస్తాం. వివిధ ప్రభుత్వ విభాగాలతో సమన్వయంగా పని చేసి వారి పునరావాసానికి చర్యలు తీసుకుంటాం. ప్రజలు ఎవరైనా ధైర్యంగా పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయవచ్చు. నేరుగా, ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా... ఇలా ఏ రూపంలో సహాయం కోరినా తక్షణం స్పందించి వారి మన్ననలు చూరగొంటాం. త్వరలో డివిజన్ల వారీగా ప్రజలతో సమావేశాలు ఏర్పాటు చేసి సమన్వయానికి అవసరమైన చర్యలు తీసుకుంటాం’ అని అన్నారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం మహేష్ భగవత్ గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్‌లను మర్యాద పూర్వకంగా కలిశారు. -
‘నిషా’చరులపై కఠిన చర్యలు
సాక్షి, హైదరాబాద్: నగరంలో నడుస్తున్న పబ్బుల్లో అర్ధరాత్రి 12 గంటల వరకు మ్యూజిక్ ప్లేకి, ఒంటి గంట వరకు పబ్ నడవడానికి అనుమతి ఉంది. మద్యం తాగి వాహనాలు పడిపే వారికి చెక్ చెప్పడానికి ట్రాఫిక్ పోలీసులు నిర్వహించే డ్రంకన్ డ్రైవ్స్ రాత్రి 10 నుంచి అర్ధరాత్రి ఒంటి గంట వరకు జరుగుతున్నాయి. అంటే పబ్స్, డ్రైవ్స్ రెండూ ఒకే సమయంలో పూర్తవుతున్నాయి. ఫలితంగా అర్ధరాత్రి ఒంటి గంటకు ఫూటుగా తాగి బయటకు వచ్చినా పట్టుకునే నాథుడే ఉండట్లేదు. జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న దేవి, భరత్ కారు ప్రమాదం ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఆ సమయంలో భరత్ మద్యం తాగి ఉండటాన్ని పరిగణనలోకి తీసుకున్న నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి డ్రంకన్ డ్రైవ్స్ నిర్వహించే సమయాలను సమూలంగా మార్చాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు అవసరమైన చర్యలు తీసుకుంటూ ప్రణాళికలు సిద్ధం చేయాల్సిందిగా ట్రాఫిక్ విభాగం అధికారుల్ని ఆదేశించనున్నారు. ఈ ప్రత్యేక డ్రైవ్స్ కనీసం తెల్లవారుజామున 2.30 గంటల వరకు అయినా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని యోచిస్తున్నారు. దీంతో పాటు మద్యం మత్తులో ప్రమాదాలు చేసి ఎదుటి వారి మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలకు నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే దేవి ప్రయాణిస్తున్న కారు డ్రైవ్ చేసిన భరత్‌సింహారెడ్డిపై ఐపీసీలోని సెక్షన్ 304 (పార్ట్-2) కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఇకపై నగర వ్యాప్తంగా ఇదే విధానం అమలులో ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఇప్పటి వరకు ‘304(ఎ)’... సాధారణంగా రోడ్డు ప్రమాద సంబంధ ఉదంతాలు చోటు చేసుకున్నప్పుడు పోలీసులు ఐపీసీ సెక్షన్ 304 (ఎ) కింద కేసు నమోదు చేస్తారు. ప్రమాదానికి కారణమైన వ్యక్తి నిర్లక్ష్యంగా, మితిమీరిన వేగంతో దూసుకువచ్చి ఢీ కొట్టాడని తేల్చేస్తారు. అయితే ఆ ప్రమాదాలకు కారణాలు విశ్లేషించడం వంటివి అరుదుగా జరుగుతాయి. దీనికి ఫిర్యాదు దారుల నుంచి సరైన సహకారం లభించకపోవడంతో పాటు మరెన్నో కారణాలు ఉంటున్నాయి. అయితే మద్యం తాగి వాహనం నడుపుతున్న వారిపై కేసు నమోదుకు ఐపీసీలోని 304 పార్ట్ 2 సెక్షన్ సరిగ్గా సరిపోతుందని పోలీసులు నిర్ణయించారు. అంటే మద్యం తాగిన సదరు వ్యక్తి తన డ్రైవింగ్ వల్ల ఎదుటి వారికి ప్రాణహాని ఉందని తెలిసీ పట్టించుకోకపోవడం. ఇలాంటి కేసుల్లో బెయిల్ సైతం తొందరగా లభించదు. న్యాయస్థానంలో నిరూపితమైతే గరిష్టంగా పదేళ్ల నుంచి జీవిత ఖైదు లేదా జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంది. ‘దేవిని ఇంటి దగ్గర దింపే బాధ్యత తీసుకున్న భరత్ ఆ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. మద్యం తాగి మితిమీరిన వేగంతో వాహనం నడుపుతూ ఆమె మృతికి కారణమయ్యాడు. ఇది దురదృష్టకర ఘటన. ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం. అందులో భాగంగానే 304 (పార్ట్-2) కింద కేసుల నమోదుకు నిర్ణయం తీసుకున్నాం’ అని కొత్వాల్ మహేందర్‌రెడ్డి వెల్లడించారు. -
బదిలీ వేటు!
సాక్షి, చెన్నై : రాష్ట్ర శాంతి భద్రతల విభాగం అదనపు డీజీపీ త్రిపాఠి బదిలీ వేటుకు గురయ్యారు. ఆ పగ్గాల్ని సముద్ర తీర భద్రతా విభాగం అదనపు డీజీపీ శైలేంద్రబాబుకు అప్పగించారు. చెన్నై పోలీసు కమిషనర్ రాజేంద్రన్‌ను మార్చి అసుతోష్ శుక్లాను నియమించారు. సోమవారం రాష్ట్రంలోకి పారా మిలటరీ బలగాలు అడుగు పెట్టనున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్ని పకడ్బందీగా విజయవంతానికి ఎన్నికల యంత్రాంగం కసరత్తుల్ని వేగవంతం చేసింది. అన్నాడీఎంకేకు అనుకూలంగా ఉన్న ఐఏఎస్, ఐపీఎస్‌ల భరతం పట్టే విధంగా ఎన్నికల బదిలీల పర్వానికి చర్యలు చేపట్టారు. ఆ దిశగా రాష్ట్ర వ్యాప్తంగా బదిలీలు జోరుగా సాగుతూ వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో శనివారం రాష్ట్ర డీజీపీ అశోక్‌కుమార్ పై ఎన్నికల యంత్రాంగం కన్నెర్ర చేసింది. ఆయన స్థానంలో పోలీసు శిక్షణ క ళాశాల డీజీపీ మహేంద్రన్ను నియమించారు. ఎన్నికలయ్యే వరకు మహేంద్రన్ డీజీపీగా వ్యవహరించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారుల అండదండాలతో గట్టెక్క వచ్చన్న ధీమాతో ఉన్న అన్నాడీఎంకేను ఇరకాటంలో పెట్టే విధంగా ఎన్నికల యంత్రాంగం పరుగులు తీస్తుండడంతో ఆ పార్టీ వర్గాల్లో ఆందోళన బయలు దేరింది. ఈ సమయంలో రాష్ర్టంలో డీజీపీ తర్వాత స్థానంలో శాంతి భద్రతల పగ్గాల్ని పర్యవేక్షించే అదనపు డీజీపీపై ఎన్నికల యంత్రాంగం కన్నెర్ర చేసింది. అన్నాడీఎంకేకు విధేయుడిగా ఆ పదవిలో త్రిపాఠి ఉండడంతో బదిలీ వేటకు చర్యలు చేపట్టారు. చెన్నై పోలీసు కమిషనర్‌గా, జైళ్ల శాఖ ఏడీజీపీగా పనిచేసి, శాంతి భద్రతల విభాగానికి అదనపు డీజీపీగా వ్యవహరిస్తున్న త్రిపాఠి అమ్మ జయలలితకు అత్యంత విధేయుడన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీంతో ఆయన్ను ఆ పదవి నుంచి పక్కన పెట్టిన, ఎన్నికల యంత్రాంగం సముద్ర తీర భద్రతా విభాగం అదనపు డీజీపీ శైలేంద్ర బాబును రంగంలోకి దించింది. డైనమిక్ పర్సన్‌గా పిలవబడే శైలేంద్రబాబును రంగంలోకి దించడంతో అన్నాడీఎంకే వర్గాలు ఇరకాటంలో పడ్డట్టే. ఇక, చెన్నై పోలీసు కమిషనర్‌గా వ్యవహరిస్తున్న రాజేం ద్రన్ కూడా అధికార పక్షం భక్తుడే అన్న ఆరోపణలు ఉన్నాయి. మాజీ డీజీపీ రామానుజం శిష్యుడిగా పిలవడే రాజేంద్రన్ గతంలో శాంతి భద్రతల విభా గం అదనపు డీజీపీగా వ్యవహరించారు. ప్రస్తుతం చెన్నై పోలీసు కమిషనర్‌గా ఉన్న ఆయన్ను పక్కన పెట్టి, ఎక్సైజ్ శాఖ అదనపు డీజీపీగా ఉన్న అసుతోష్ శుక్లాను రంగంలోకి దించారు. రంగంలోకి పారామిలటరీ : రాష్ట్ర పోలీసులపై నమ్మకం లేని దృష్ట్యా, బదిలీ పర్వం మీద దృష్టి పెట్టి, నిజాయితీ, నిక్కచ్చితనం కల్గిన అధికారుల్ని ఎన్నికల యంత్రాంగం నియమిస్తూ వస్తున్న విషయం తెలిసింది. వీరితో పాటుగా ముప్పై వేల మందితో కూడిన పారా మిలటరీ బలగాలతో ఎన్నికల భద్రత పర్యవేక్షణకు సిద్ధమైంది. 300 కంపెనీలకు చెందిన ఈ బలగాలు సోమవారం నుంచి రాష్ట్రంలోకి రానున్నాయి. తొలి బృందం ఉదయాన్నే సెంట్రల్ స్టేషన్‌కు చేరుకోనుంది. ఈనెల ఏడో తేదిలోపు ముప్పై వేల మందితో కూడిన పారా మిలటరీ బలగాలు ఎన్నికల భద్రతను తమ గుప్పెట్లోకి తీసుకోబోతున్నాయి. వీరితో పాటుగా 118 మంది శిక్షణలో ఉన్న ఐపీఎస్ అధికారులు రంగలోకి దిగనున్నారు. దీంతో నగదు బట్వాడా అడ్డుకట్ట, శాంతి భద్రతల పరిరక్షణ దిశగా చర్యలు వేగవంతం అయ్యాయి. ఇక, ప్రజలు 1950 టోల్ఫ్రీం, 9444123456 వాట్సాప్‌కు , 18004256669(ఐటీ) టోల్ ఫ్రీనంబర్లకు ఫిర్యాదులు చేయాలని ఎన్నికల ప్రధాన అధికారి రాజేష్ లఖానీ సూచించారు. ఇక, డీజీపీ, ఏడీజీపీల మార్పుతో పాటుగా ఐపీఎస్‌ల బదిలీ పర్వం సాగి ఉన్న దృష్ట్యా, ఇక ఎన్నికల భద్రతా పర్యవేక్షణ పూర్తి వ్యవహారాలు లఖానీ చేతికి చేరినట్టే. నేడు తుది జాబితా : నామినేషన్ల పరిశీలన పర్వం ముగియడంతో సోమవారం ఉప సంహరణ కార్యక్రమం జరగనుంది. తదుపరి తుది జాబితాను ప్రకటించబోతున్నారు. దాఖలైన 7153 నామినేషన్లలో 2,628 పరిశీలనలో తిరస్కరించ బడ్డాయి. 4485 నామినేషన్లు పరిగణలోకి తీసుకున్నారు. ఇందులో ఉప సంహరణలు ఏ మేరకు సాగనున్నాయో ఆ మేరకు తుది జాబితాను ప్రకటించనున్నారు. పరిశీలనానంతరం అత్యధిక శాతంగా 47 మంది అభ్యర్థులు ఉన్న జాబితాగా సీఎం జయలలిత రేసులో ఉన్న ఆర్కేనగర్ నిలవగా, తక్కువ సంఖ్యలో ఎనిమిది మంది అభ్యర్థులతో కూడలూరు చివరి స్థానంలో నిలిచింది. -
జర్నలిస్ట్‌లపై దాడులను ఉపేక్షించం
సీపీ గౌతమ్ సవాంగ్ విజయవాడ (భవానీపురం) : జర్నలిస్ట్‌లపై దాడులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ అన్నారు. గత శుక్రవారం రాత్రి వన్‌టౌన్‌లోని ముస్లిం శ్మశానవాటిక వివాదాన్ని కవర్ చేసేందుకు వెళ్లిన కాకతీయ దినపత్రిక బ్యూరో చీఫ్ షేక్ షఫీవుల్లాపై పశ్చిమ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ సమక్షంలో దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కోరుతూ ఏపీయూడబ్ల్యూజే కృష్ణా అర్బన్ యూనిట్ ఆధ్వర్యంలో సోమవారం ఐజేయూ, ఏపీయూడబ్ల్యూజే ప్రతినిధుల బృందం పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్‌ను కలిసి వినతి పత్రం అందచేసింది. ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ ఉపాధ్యక్షుడు అంబటి ఆంజనేయులు ఘటన పూర్వాపరాలను సీపీకి వివరించారు. దీనిపై స్పందించిన కమిషనర్ మాట్లాడుతూ సమాజ హితాన్ని కోరే జర్నలిస్ట్‌లపై దాడులు వాంఛనీయం కాదన్నారు. దాడి ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పోలీస్ కమిషనర్‌ను కలిసినవారిలో ఏపీయూడబ్ల్యూజే కృష్ణా అర్బన్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు జి.రామారావు, దారం వెంకటేశ్వరరావు, యూనియన్ నాయకులు చావా రవి, నిమ్మరాజు చలపతిరావు ఉన్నారు. -
కంట్రోల్ రూమ్‌కు అదనపు సిబ్బంది
విజయవాడ : విజయవాడ నగర పోలీస్ కమిషనరేట్‌ను అంచెలంచెలుగా బలోపేతం చేస్తున్నారు. పోలీసులకు ఎప్పటికప్పుడు సమాచారం చేరవేస్తూ పోలీస్ వ్యవస్థను పరోక్షంగా నడుపుతున్న కంట్రోల్ రూమ్ బలోపేతంపై నగర పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ తాజాగా దృష్టి సారించారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఉన్న సిబ్బంది సంఖ్యను రెట్టింపు చేయాలని నిర్ణయించారు. తద్వారా మరికొన్ని ప్రత్యేక సేవలు అందించాలని భావిస్తున్నారు. అదనంగా 53 మంది కేటాయింపు కమిషనరేట్ బలోపేతంలో భాగంగా కొత్త వింగ్‌లను ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. వీటి కోసం 471 మంది సిబ్బందిని కేటాయించారు. వారితో పాటు మరో 378 మంది కానిస్టేబుళ్లను డిప్యుటేషన్‌పై తీసుకురానున్నారు. వారిలో 53 మంది కానిస్టేబుళ్లను కంట్రోల్ రూమ్‌కు కేటాయించనున్నారు. మాస్టర్ కంట్రోల్ రూమ్‌గా సేవలు విజయవాడ నగరంలో ల్యాండ్ మార్క్‌గా నిలిచే పోలీస్ కంట్రోల్ రూమ్ కమిషనరేట్ కార్యకలాపాలకు కీలక కేంద్రంగా మారింది. కమిషనరేట్‌లో ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా కంట్రోల్ రూమ్‌కు సమాచారం వస్తుంది. ఆ వెంటనే సిబ్బంది దానిని ఏసీపీ స్థాయి అధికారి నుంచి కమిషనర్ వరకు చేరవేస్తారు. దీంతో పాటు సంబంధిత స్టేషన్‌కు సమాచారం ఇచ్చి గంట తర్వాత అప్డేట్ సమాచారం కూడా తీసుకుంటారు. వీటితోపాటు ఇతర సేవలను కూడా కంట్రోల్ రూమ్ సిబ్బంది కొనసాగిస్తున్నారు. వాస్తవానికి కంట్రోల్ రూమ్‌ను గతేడాదే కొంత అభివృద్ధి చేసి, దానికి మరమ్మతులు నిర్వహించారు. ప్రత్యేక చాంబర్లు కూడా ఏర్పాటు చేశారు. అదనంగా సిబ్బందిని మాత్రం నియమించలేదు. దీంతో సీఐతో కలిపి 45 మంది సిబ్బంది రోజూ మూడు షిఫ్టులలో పనిచేస్తున్నారు. కంట్రోల్ రూమ్ కార్యకలాపాల్ని సీఐ స్థాయి అధికారి పర్యవేక్షిస్తుండగా నలుగురు ఎస్ఐలు, 40 మంది కానిస్టేబుళ్లు 24 గంటలూ షిఫ్టుల వారీగా విధుల్లో ఉంటున్నారు. ఈ క్రమంలో నగరంలో బ్లూకోట్స్ వాహనాల సంచారం, రక్షక్ వాహనాల కదలికలను మానిటరింగ్ చేసి అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక సూచనలు కంట్రోల్ రూమ్ ద్వారా చేస్తుంటారు. నైట్ రౌండ్స్, పెట్రోలింగ్, వివిధ సందర్భాల్లో స్టేషన్లను అప్రమత్తం చేయటం తదితర పనులు కంట్రోల్ రూమ్ ద్వారా జరుగుతున్నాయి. ఫిర్యాదుల వెల్లువ రెగ్యులర్ విధులతో పాటు కంట్రోల్ రూమ్‌లోనే డయల్ 100ను మానిటరింగ్ చేస్తారు. నెలకు సగటున 3500కు పైగా వివిధ రకాల ఫిర్యాదులు అందుతున్నాయి. కమిషనరేట్ పోలీసులు నిర్వహిస్తున్న ఫోర్త్ లయన్ యాప్ ద్వారా నెలకు 150 వరకు ఫిర్యాదులు వస్తున్నాయి. వాటిని పూర్తిగా కంట్రోల్ రూమ్ పోలీసులే పర్యవేక్షిస్తుంటారు. ఈ క్రమంలో పని భారం పెరగటంతో పోలీసులు కొంత ఇబ్బంది పడుతున్నారు. దీంతో అదనంగా 53 మంది సిబ్బందిని కేటాయించి సీఐతో పాటు ఒక ఏసీపీ స్థాయి అధికారి పూర్తిగా పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. -
నా భర్తను విడిపించండి
టీనగర్: అత్తమామల చెర నుంచి తన భర్తను విడిపించాలని పోలీసు కమిషనర్‌కు ఒక పట్టభద్ర మహిళ ఫిర్యాదు చేశారు. వరకట్నం చిత్రహింసలకు గురిచేస్తున్న భర్త కుటుంబీకులపై చర్యలు గైకొనాలని అందులో కోరారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. చెన్నై, కొలత్తూరు తనికాచలం నగర్, నాలుగవ క్రాస్ స్ట్రీట్‌కు చెందిన సుజాత(33) చెన్నై పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఒక ఫిర్యాదు పత్రం అందజేశారు. తనకు 14 సెప్టెంబరు 2008లో వివాహం జరిగిందని, భర్త పేరు మదన్‌గా పేర్కొన్నారు. తాను తల్లిదండ్రులకు ఒకే కుమార్తెనని, డిగ్రీ పూర్తి చేశానన్నారు. ఇరు కుటుం బాల సమ్మతంతోనే వివాహం జరిగిందని, మొదట వారు వంద సవర్ల బం గారు నగలు కట్నంగా కోరారన్నారు. అందుకు తన తల్లిదండ్రులు అంగీకరించలేదని, అయినప్పటికీ వారు ఇరువురి జాతకాలు బాగా కుదిరాయని తెలిపి, త రచుగా తమ కుటుంబాన్ని సంప్రదించడంతో తల్లిదండ్రులు సమ్మతించినట్లు తెలిపారు. ముందుగా 50 సవర్ల బంగా రు నగలు, సారె వస్తువులతో తల్లిదండ్రులు ఘనంగా తమ వివాహం జరిపిం చారని, ఆ తర్వాత కొన్ని నెలలకే తన తల్లిదండ్రులు వంద సవర్ల నగలు అందజేయకుండా మోసగించినట్లు ఆరోపిస్తూ తనను చిత్రహింసలకు గురిచేసినట్లు పేర్కొన్నారు. తనకు బిడ్డ జన్మించిన తర్వాత తన మామ పేరు పెట్టాలంటూ భర్త కుటుంబీకులు ఒత్తిడి తెచ్చారని తాము జ్యోతిష్కుని సూచనతో పేరుపెట్టామని తెలిపారు. విడిగా కాపురం: ఇలావుండగా తాను ఉద్యోగానికి వెళతానంటూ భర్త కుటుంబీకుల అనుమతి కోరానని, మొదట్లో సమ్మతిర చిన వారు తర్వాత పూర్తి జీతాన్ని తమకు అందజేయాలంటూ షరతు విధించారన్నారు. భర్త కుటుంబీకులతో విసిగిపోయిన తాను విడిగా కాపురం చేసేందుకు నిర్ణయించానని, ప్యారిస్‌లో పనిచేస్తుండడంతో ఇల్లు మారదామని భర్తకు నచ్చజెప్పానని, అందుకు భర్త సమ్మతించాడని పేర్కొన్నారు. కొళత్తూరు ప్రాంతంలో ఒక ఇల్లు చూసుకుని భర్త, బిడ్డతో అక్కడ కాపురం పెట్టానని తెలిపారు. మొదట్లో తనతో సరిగా మాట్లాడని భర్త అనంతరం సరిగా ఇంటికి రావడం మానేశాడన్నారు. ఆయనకు ఒక మహిళతో సంబంధం ఉన్నట్లు తెలియడంతో దిగ్భ్రాంతి చెందానన్నారు. దీనిపై ఆయనను నిలదీయగా 16 మే, 2015 నుంచి ఇంటికి సరిగా రావడం లేదని, సెల్ఫోన్లో మాత్రమే మాట్లాడుతున్నారని తెలిపారు. ఆయన పుట్టింటికి మాత్రమే పరిమితమయ్యాడని, తాను అక్కడికి వెళ్లి రమ్మని కోరగా తనను అవమానపరిచి గెంటివేసినట్లు తెలిపారు. తన బిడ్డ కూడా తండ్రిపై బెంగతో ఉన్నట్లు పేర్కొన్నారు. అందుచేత తన చెంతకు భర్తను చేర్చాలని, ఆయన కుటుంబ సభ్యులపై తగిన చర్యలు గైకొనాలని అందులో కోరారు. దీనిపై మాధవరం మహిళా పోలీసులు చర్యలు తీసుకోలంటూ పోలీసు కమిషనర్ టీకే రాజేంద్రన్ ఉత్తర్వులిచ్చారు. -
మహిళ భద్రత కోసం యాప్ విడుదల
వరంగల్: మహిళలు, పౌరుల భద్రత కోసం హాక్ఐ యాప్‌ను వరంగల్ పోలీసులు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ యాప్‌ను నగర కమిషనర్ సుధీర్‌బాబు శనివారం ఆవిష్కరించారు. భద్రతాపరమైన సమస్యలు ఎదురైన వెంటనే తక్షణం పోలీస్ సాయం పొందేందుకు ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని కమిషనర్ తెలిపారు. -
మరోసారి తెరపైకి 'కాల్ మనీ'
-విజయవాడలో మహిళ ఆత్మహత్యాయత్నం -పోలీసు కమిషనర్ కార్యాలయం ఎదుట ఘటన విజయవాడ సిటీ (కృష్ణా జిల్లా) : 'కాల్ మనీ' వ్యాపారులు వేధిస్తున్నారంటూ కొండపల్లికి చెందిన బండి సావిత్రి సోమవారం ఉదయం విజయవాడ పోలీసు కమిషనర్ కార్యాలయం ఎదుట పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. ఈ హఠాత్పరిణామంతో కంగుతిన్న భద్రతా సిబ్బంది హుటాహుటిన ఆమెను చికిత్స కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి బాగానే ఉందని పోలీసులు చెపుతున్నారు. రుణమిచ్చిన వారి వేధింపులకు తోడు పోలీసులు పట్టించుకోకపోవడమే ఆత్మహత్యాయత్నానికి కారణమని ఆమె చెప్తోంది. పోలీసులు మాత్రం అప్పులు ఇచ్చిన వాళ్లు జీతం అటాచ్మెంటు కోసం కోర్టు నుంచి డిక్రీ తెచ్చుకున్నారని, తామేమీ చేయలేమని అంటున్నారు. సావిత్రి తెలిపిన వివరాల ప్రకారం.. డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్లో సావిత్రి భర్త పనిచేస్తున్నారు. వ్యక్తిగత అవసరాల కోసం ఇదే ప్రాంతానికి చెందిన టైలర్ చిమటా శ్రీనివాసరావు వద్ద రూ.40 వేలు కాల్‌మనీ కింద అప్పు తీసుకున్నారు. అంగన్వాడీ వర్కర్ గెట్టం నిర్మలకుమారి వద్ద కూడా కొంత అప్పు తీసుకున్నారు. వడ్డీ కింద రూ.లక్షన్నర వరకు చెల్లించినప్పటికీ ఇంకా చెల్లించాలంటూ ఒత్తిళ్లు తెస్తున్నారు. పోలీసులు కూడా వడ్డీ వ్యాపారులకే మద్దతుగా ఉన్నారనేది ఆమె ఆరోపణ. కమిషనరేట్ అధికారుల వద్ద కూడా తనకు న్యాయం జరగలేదని భావించి వెంట తెచ్చుకున్న పురుగుల మందును శీతల పానీయంలో కలుపుకుని పోలీసు కమిషనర్ కార్యాలయం గేటు వద్ద తాగింది. ఇది గమనించిన భద్రతా సిబ్బంది అంబులెన్స్‌ను రప్పించి చికిత్స కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రూ.2.70 లక్షలకు శ్రీనివాసరావు, రూ.2.50 లక్షలకు నిర్మలకుమారి కోర్టు నుంచి డిక్రీ తెచ్చుకున్నట్టు తెలిసింది. కోర్టు ఆదేశాలను దృష్టిలో ఉంచుకొని వడ్డీ వ్యాపారులపై చర్యలకు పోలీసులు వెనుకడుగు వేస్తున్నారు. ఇబ్రహీంపట్నం పోలీసుస్టేషన్ ఇన్స్పెక్టర్ డి.చవాన్ సాక్షితో మాట్లాడుతూ కోర్టు డిక్రీ ఇవ్వడంతో తాము జోక్యం చేసుకుంటే కోర్టు ధిక్కారణ కిందకు వస్తుందని ఆమెకు నచ్చజెప్పామన్నారు. పదే పదే ఆమె వచ్చి అడగడంతో అప్పు ఇచ్చిన వారిని కూడా పిలిపించి మాట్లాడామని, వారు అంగీకరించకపోవడంతో పెద్ద మనుషుల సమక్షంలో పరిష్కారం చేసుకోమని సూచించినట్టు తెలిపారు. -
సురేంద్రబాబు బాధ్యతల స్వీకారం
విజయవాడ సిటీ : నగర ఇన్చార్జి పోలీసు కమిషనర్‌గా ఎన్.వి. సురేంద్రబాబు బుధవారం రాత్రి బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుత సీపీ గౌతమ్ సవాంగ్ వ్యక్తిగత కారణాలపై 13 రోజులు సెలవు పెట్టిన సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో ఇన్చార్జిగా సురేంద్రబాబును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాత్రి 7 గంటల సమయంలో కమిషనరేట్‌కు చేరుకున్న ఆయన బాధ్యతలు చేపట్టారు. డీసీపీలు ఎల్.కాళిదాసు, జి.వి.జి.అశోక్‌కుమార్ సహా అధికారులతో సమావేశమై కమిషనరేట్ పరిస్థితులపై సమీక్షించారు. ఉదయం రాజీవ్‌గాంధీ హోల్‌సేల్ మార్కెట్ సమీపంలో జరిగిన అగ్నిప్రమాదం గురించి అధికారులను అడిగి వివరాలు తెలసుకున్నారు. గతంలో నగర సీపీగా పనిచేసిన సురేంద్రబాబుకు ఇక్కడి పరిస్థితులపై పూర్తి అవగాహన ఉంది. తన హయాంలో రౌడీలపై ఉక్కుపాదం మోపారు. సమాజంలో పెద్ద మనుషులుగా చెలామణి అవుతూ చట్ట విరుద్ధ చర్యలకు పాల్పడే వారిని అణచివేయడంలో ఆయన తనదైన ముద్ర చూపించారు. రాష్ట్రంలో నేడు కలకలం రేపుతున్న కాల్‌మనీ, వడ్డీ వ్యాపారంపై తొలుత కొరడా ఝళిపించిన వ్యక్తి సురేంద్రబాబే. అప్పట్లో ఆయన పేరు వింటేనే వడ్డీ వ్యాపారులు హడలి పోయేవారు. అధికారులకు హడల్ ముక్కుసూటిగా వ్యవహరించే సురేంద్ర బాబు అంటే అధికారులకు కూడా హడలని చెప్పొచ్చు. విధుల నిర్వహణలో అలక్ష్యం చూపే అధికారులు, సిబ్బందిపై కఠిన వైఖరి అవలంభిస్తారనే పేరు ఆయనకు ఉంది. -
సర్వం సిద్ధం!
గ్రేటర్ ఎన్నికలకు పక్కా బందోబస్తు భద్రతకు పెద్దపీట సమస్యాత్మక ప్రాంతాలపై {పత్యేక దృష్టి పోలింగ్ విధుల్లో 25 వేల మంది సిబ్బంది చెక్‌పోస్ట్‌లు, స్ట్రైకింగ్-షాడో పార్టీలు కొత్వాల్ మహేందర్‌రెడ్డి వెల్లడి సిటీబ్యూరో: గ్రేటర్ ఎన్నికలను అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలు, మార్గదర్శకాలను తూచా తప్పకుండా అమలు చేస్తామని వెల్లడిం చారు. మొత్తం 25 వేల మంది సిబ్బందిని బందోబస్తుకు వినియోగిస్తున్నామని తెలిపారు. నగర పోలీసులు, ప్రత్యే క విభాగాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారూ ఇందులో ఉన్నారు. అత్యంత సమస్యాత్మ క ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని కమిషనర్ చెప్పా రు. అదనపు కమిషనర్లు స్వాతి లక్రా, అంజనీకుమార్, జితేందర్, వై.నాగిరెడ్డిలతో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో కమిషనర్ మహేందర్‌రెడ్డి తెలిపిన వివరాలివీ... పోలింగ్ నేపథ్యంలో ప్రతి ఘట్టాన్నీ కెమెరాల్లో రికార్డు చేస్తారు. సమస్యాత్మకంగా భావించిన 3,200 పోలింగ్ స్టేషన్లలో ఎన్నికల సంఘం వెబ్ కాస్టింగ్ చేస్తోంది. ఈ కెమెరాలను కమిషనరేట్‌లోని కమాండ్ అండ్ కంట్రో ల్ సెంటర్‌తో అనుసంధానించారు. కమ్యూనిటీ సీసీ కెమెరాల ద్వారానూ పర్యవేక్షిస్తారు. {పతి పోలింగ్ బూత్లోనూ కనీసం ఇద్దరు చొప్పున యూనిఫాంలో పోలీసు సిబ్బంది ఉంటారు. నామినేషన్ దాఖలు చేసిన వారిలో నేరచరితుల కట్టడికి, సమస్యాత్మకంగా భావించే వారి కదలికలు కనిపెట్టడానికి ప్రత్యేక షాడో పార్టీలు ఏర్పాటు చేశారు. ఎన్నికల ఘట్టం ప్రారంభమైన తర్వాత ఇప్పటి వరకు నగరంలో 17 కేసులు నమోదు చేసిన పోలీసులు రూ.80 లక్షల నగదు స్వాధీ నం చేసుకున్నారు. పోలిం గ్ మంగళవారం ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. ఆ తరువాత కూడా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా సిబ్బంది విధుల్లో ఉంటారు. బ్యాలెట్ బాక్సులను భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్‌లకు గార్డ్లను ఏర్పాటు చేస్తున్నారు. నగర వ్యాప్తంగా పికె ట్లు కొనసాగుతాయి. 2-3 పోలింగ్ స్టేషన్లకు ఓ రూట్ గా విభజించారు. రూట్ పార్టీలకు ఎస్ఐ నేతృత్వం వహిస్తారు. 2-3 రూట్లకు కలిపి ఏసీపీ నేతృత్వం లో స్ట్రైకింగ్ ఫోర్స్ ఉంటుంది. డీసీపీలకు స్పెషల్ పార్టీ లు కేటాయించారు. ఇవి కాకుండా కమిషనర్, డీసీపీ, ఏసీ పీ, ఎస్హెచ్ఓల ఆధీనంలో రిజర్వ్ ఫోర్స్ ఉంటుంది. పోలింగ్ కేంద్రాల వద్ద 144వ సెక్షన్ పోలింగ్ కేంద్రాల వద్ద 144వ సెక్షన్ విధించా రు. వీటికి 200 మీటర్ల పరిధిలో నలుగురి కంటే ఎక్కువ మంది గుమిగూడటం నిషిద్ధం. మం గళవారం ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఇవి అమలులో ఉంటాయి. వీటిని అతిక్రమిం చిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటా రు. పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల దూరం లో నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయి. ఈ ప్రాంతాల్లో ప్రచారం, గుర్తు లు, బ్యానర్లు ప్రదర్శించడం, సైగలు చేయడం నిషిద్ధం. నాలుగు కేటగిరీలకే అనుమతి పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలోకి విధుల్లో ఉండే వారితో పాటు కేవలం నాలుగు కేటగిరీల వారినే అనుమతిస్తారు. ఓటర్లు, ఆ డివిజన్లో పోటీ చేస్తున్న అభ్యర్థి, ఎలక్షన్ ఏజెంట్, పోలింగ్ ఏజెంట్లకు మాత్రమే అనుమతి ఉంటుంది. వీరు మినహా ప్రజాప్రతినిధులను సైతం అనుమతించరు. సోమవారం రాత్రి నుంచి సిబ్బంది విధుల్లో ఉంటారు. బందోబస్తు ఏర్పాట్లివే... డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు: 14 పోలింగ్ సెంటర్లు: 1397 పోలింగ్ స్టేషన్లు: 4163 అత్యంత సమస్యాత్మక ప్రాంతాలు: 232 సమస్యాత్మక ప్రాంతాలు: 545 మొబైల్ పార్టీలు: 418 ట్రాఫిక్ వింగ్ చెక్‌పోస్టులు: 29 పికెట్స్: అవసరానికి అనుగుణంగా షాడో టీమ్స్: 80 స్ట్రైకింగ్ ఫోర్స్: 12 బృందాలు ప్రత్యేక స్ట్రైకింగ్ ఫోర్స్: 12 అందుబాటులో ఉండే మొత్తం సిబ్బంది: 25,624 సివిల్: 16,364 ఆర్మ్డ్ రిజర్వ్: 4860 ఎన్ఎస్ఎస్ క్యాడెట్లు: 3000 ఎన్సీసీ క్యాడెట్లు: 1400 -
కేసుల్లేవని సర్టిఫికెట్ ఇవ్వండి
తమిళ సినిమా: తనపై ఎలాంటి నేరారోపణలు, కేసులు లేవని సర్టిఫికెట్ ఇవ్వాల్సిందిగా సూపర్‌స్టార్ రజనీకాంత్ చెన్నై నగర పోలీస్‌కమిషనర్‌ను కోరారు. రజనీకాంత్ ఏమిటీ కేసు లేమిటీ అని ఆశ్చర్యంగా ఉందా? అయితే రండి చూ ద్దాం...మన సూపర్‌స్టార్ తాజాగా నటిస్తున్న రెండు చిత్రాల్లో 2.ఓ(ఎందిరన్-2) ఒకటి, స్టార్ డెరైక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ అత్యంత భారీ బడ్జెట్ చిత్రాన్ని లైకా సంస్థ నిర్మిస్తోంది. ఎమీజాక్సన్ నాయకిగా నటిస్తున్న ఈ చిత్రంలో విలన్‌గా బాలీవుడ్ ప్రముఖ నటుడు అక్షయ్‌కుమార్ నటిస్తున్నారు. చిత్ర షూటింగ్ ఇటీవలే ప్రారంభం అయ్యింది. అధిక భాగం షూటింగ్‌ను విదేశాల్లో నిర్వహించడానికి చిత్ర యూనిట్ ప్రణాళిక సిద్ధం చేసుకుంది. ఆయా దేశాల్లో ఒకటి బొలిలియా. అక్కడ షూటింగ్ చేయాలంటే కొన్ని విధివిధాలను కచ్చితంగా పాటించి తీరాలట. వృత్తి రీత్యా ఆ దేశానికి వెళ్లే వాళ్లపై ఎలాంటి కేసులు ఉండరాదట. ఎలాంటి నేరారోపణలు లేవని పోలీసుల నుంచి ధ్రువపత్రం పొంది ఆ దేశ అధికారులకు అందించాలట. అందువల్ల ఆ పోలీస్ ధ్రువపత్రం ఉంటేనే రజనీకాంత్, ఇతర చిత్ర యూనిట్ బొలిలియా దేశంలో అడుగుపెట్టగలరు. అందువల్ల 2.ఓ చిత్ర షూటింగ్ కోసం బొలిలియా వెళ్లనున్న రజనీకాంత్‌కు పోలీస్ ధ్రువపత్రం కోరుతూ ఆయన తరపున నగరపోలీస్ కమిషనర్‌కు వినతి పత్రాన్ని అందించారు. ఆయన నుంచి ధ్రువపత్రం వచ్చిన తరువాతనే రజనీకాంత్ బొలిలియా దేశం వెళ్లే షెడ్యూల్‌ను చిత్ర యూనిట్ ఖరారు చేయగలరని సమాచారం. -
సెలవుపై ‘సవాంగ్’
తిరిగి 28న రాక ఇన్చార్జి సీపీగా సురేంద్రబాబు విజయవాడ సిటీ : నగర పోలీసు కమిషనర్ దామోదర గౌతమ్ సవాంగ్ సెలవుపై వె ళ్లనున్నారు. గురువారం నుంచి ఈ నెల 27 వరకు ఆయన సెలవులో ఉంటారు. సవాంగ్ స్థానంలో ఆక్టోపస్ అదనపు డీజీపీ ఎన్వీ సురేంద్రబాబు ఇన్చార్జి కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహించనున్నారు. ఈ మేరకు డీజీపీ జె.వి.రాముడు ఉత్తర్వులు జారీ చేశారు. గత ఆగస్టులో పోలీసు కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన సవాంగ్ అనతి కాలంలోనే సంచలన కేసులు చేపట్టారు. నగరం నుంచి గుట్కా మాఫియాను తరిమికొట్టడంతో పాటు కల్తీ నెయ్యి, కల్తీ మద్యం కేసులపై ప్రత్యేక దృష్టిసారించారు. కాల్‌మనీ ముసుగులో మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులను ఆయన వెలుగులోకి తీసుకొచ్చారు. ఇందులో పలువురిపై కేసు నమోదుతో పాటు అధికార పార్టీ ప్రముఖుల పాత్రపై దృష్టిసారించారు. ఈ క్రమంలోనే హఠాత్తుగా ఆయన సెలవుపై వెళుతుండటం చర్చనీయాంశంగా మారింది. గతంలో పెట్టుకున్న దరఖాస్తును 20 రోజుల కిందటే ఆమోదించినట్టు డీజీపీ చెపుతున్నారు. ఇదే సమయంలో సవాంగ్ కంటే సమర్థుడైన సురేంద్రబాబును సీపీగా నియమించామంటూ ఆయన చేసిన వ్యాఖ్యల్లోని మర్మం బదిలీ పర్యవసానమేననేది కమిషనరేట్ వర్గాల అభిప్రాయం. కమిషనర్ సవాంగ్ బదిలీ ఊహాగానాలకు తెరపడాలంటే ఈ నెల 27 వరకు ఆగాల్సిందే. యాదృచ్ఛికమేనా... కాల్‌మనీ ముసుగులో సెక్స్ రాకెట్ వ్యవహారం వెలుగులోకి వచ్చి అధికార పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్న క్రమంలోనే ఇన్చార్జి పోలీసు కమిషనర్‌గా సురేంద్రబాబు రావడంపై పలువురు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. యాదృచ్ఛికంగానే ఆయనను ఇన్చార్జి పోలీసు కమిషనర్‌గా నియమించారా? లేక ఉద్దేశపూర్వకమా? అనే దానిపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో నగర పోలీసు కమిషనర్‌గా పని చేసిన సురేంద్రబాబు వడ్డీ వ్యాపారుల ఆటకట్టించేందుకు భారీ కసరత్తు చేశారు. అనేకమంది కాల్‌మనీ వ్యాపారులను అదుపులోకి తీసుకొని చెక్కులు, నోట్లు చించేశారు. పలువురు కాల్‌మనీ వ్యాపారులపై కేసులు కూడా నమోదు చేశారు. దీంతో ఈ కేసులో ఆయన వ్యవహార శైలిపై పలువురు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. -
పోలీస్ కమిషనర్ యూ టర్న్!
విజయవాడ సిటీ : ‘మద్యం షాపుల వేళలు కచ్చితంగా పాటించాలి. ఇందుకు విరుద్ధంగా జరిగితే సంబంధిత అధికారులను బాధ్యులను చేస్తాను. తెలియకుండా జరిగితే మరోసారి జరగకుండా హెచ్చరికలు ఉంటా యి. అధికారులకు తెలిసే మద్యం అమ్మకాల వేళలు పాటించడం లేదని గుర్తిస్తే ఇంటికి వెళ్లడమే..’ అంటూ నాలుగు నెలల కిందట నగర పోలీస్ కమిషనర్ దామోదర గౌతమ్ సవాంగ్ ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన సమయంలో హెచ్చరించారు. అంతే అధికారుల సమీక్ష సమావేశం ముగిసిన వెంటనే తమ పరిధిలోని బార్ అండ్ రెస్టారెంట్లు, మద్యం షాపులపై నిబంధనల కొరఢా ఝుళిపించారు. బార్లు ఉదయం 10 నుంచి రాత్రి 11 గంటల వరకు, మద్యం షాపులు ఉదయం 11 నుంచి రాత్రి 10 గంటల వరకు అమ్మకాలు జరపాలంటూ ఆదేశించారు. పావుగంట ఆలస్యమైనా సిబ్బందిని స్టేషన్లకు తరలించి కఠిన చర్యలు తీసుకున్నారు. పరిసర ప్రాంతాల్లో బెల్టు షాపులు గుర్తిస్తే సంబంధిత షాపులు సీజ్ చేస్తామంటూ హెచ్చరించారు. పది రోజుల పాటు అంతా సీపీ ఆదేశించినట్టే జరిగింది. ఆ తరువాత.. ఏం జరిగిందో కానీ వేళలు పాటించడం బార్ అండ్ రెస్టారెంట్ల నిర్వాహకులు మానేశారు. పాత పద్ధతిలోనే వ్యాపారం జరిగింది. రాత్రి 12 గంటల వరకు అమ్మకాలు జరిపిన నిర్వాహకులు ఆ తర్వాత ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటుచేసి మరీ అమ్మారు. ఉదయం 6 గంటల నుంచే షట్టర్లు తీసేసి మద్యం అమ్మకాలు నిర్వహిస్తున్నా పోలీసు అధికారులు చూసీచూడనట్టుగా వదిలేశారు. ఇందుకు సహకరించినందుకు గానూ పోలీసులకు గతంలో రూ.15 వేలు నెలవారీ మామూళ్లు ఇచ్చిన మద్యం వ్యాపారులు ఇప్పుడు రూ.20 వేలు, అమ్మకాలను బట్టి అంతకంటే ఎక్కువే ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఆంతర్యమేంటి?.. బాధ్యతలు చేపట్టిన వెంటనే అక్రమ దందాపై ఉక్కుపాదం మోపిన పోలీస్ కమిషనర్ పది రోజుల వ్యవధిలోనే యూ టర్న్ తీసుకోవడం వెనుక ప్రభుత్వ పెద్దల నుంచి వచ్చిన ఒత్తిళ్లే కారణంగా తెలుస్తోంది. ఇసుక, మద్యం దందా నిర్వహణలో అధికార పార్టీకి చెందిన కొందరు ప్రజాప్రతినిధులు, నేతలకు ప్రమేయం ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. రెట్టింపు లాభాలు రుచిమరిగిన తెలుగు తమ్ముళ్లకు సీపీ సవాంగ్ నిర్ణయం ఏమాత్రం రుచించలేదు. అంతే ప్రభుత్వ పెద్దల ద్వారా ఒత్తిళ్లు తెచ్చి సీపీ నిర్ణయాన్ని మార్చుకునే విధంగా చేశారనేది కమిషనరేట్ వర్గాల సమాచారం. చినబాబు ఆశీస్సులు.. ప్రభుత్వ వ్యవహారాల్లో కీలక పాత్ర పోషిస్తున్న చినబాబు మద్యం సిండికేట్‌కు వెన్నుదన్నుగా ఉన్నట్టు చెబుతున్నారు. మద్యం వ్యాపారంలోని తమ వర్గం ప్రయోజనాలు కాపాడేందుకు ప్రభుత్వం ద్వారా పోలీసులపై ఒత్తిళ్లు తెస్తున్నట్టు సమాచారం. నగరంలోని మద్యం సిండికేట్‌లో చక్రం తిప్పుతున్న నేత జిల్లాలోని కీలక ప్రజాప్రతినిధి అనుచరుడిగా ఉన్నాడు. కీలక ప్రజాప్రతినిధికి సంబంధించిన వ్యవహారాలను చక్కబెట్టడంతో పాటు చినబాబు నగరంలో ఉన్నప్పుడు హడావుడి అంతా మద్యం సిండికేట్ నేతదేనని చెబుతున్నారు. -
అక్కడ కార్లు చోరీ.. ఇక్కడ రూపుమార్చి విక్రయం
- హై ఎండ్ వాహనాలే టార్గెట్ - ఆరు రాష్ట్రాల్లో వాహన చోరీలు - నంబర్లు మార్చి తెలుగు రాష్ట్రాల్లో అమ్మకం - భారీ స్కాం బయటపెట్టిన సీసీఎస్ పోలీసులు హైదరాబాద్ బీమా కంపెనీల డేటాబేస్ నుంచి యాక్సిడెంట్ వెహికిల్స్ వివరాలు సేకరించడం... ఆయా సంస్థల్ని సంప్రదించి స్క్రాప్ ముసుగులో వాటిని ఖరీదు చేయడం... పత్రాలతో పాటు 'విడిభాగాలు' సేకరించడం... ఉత్తరాదిలో చోరీ చేయించిన వాహనాలకు వీటిని వినియోగించడం... అయితే అమ్మేయడం, లేదంటే ఫైనాన్స్ చేయించుకోవడం... ఈ పంథాలో గడిచిన 11 నెలల్లో 35 ఆధునిక వాహనాలను చోరీ చేసిన అంతరాష్ట్ర ముఠాను సీసీఎస్ పోలీసులు పట్టుకున్నారు. వీరి నుంచి 13 వెహికిల్స్‌తో పాటు మార్పిడి పరికరాలు, బోగస్ పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు అదనపు సీపీ (నేరాలు) స్వాతి లక్రా తెలిపారు. సంయుక్త పోలీసు కమిషనర్ డాక్టర్ టి.ప్రభాకర్‌రెడ్డితో కలిసి మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పూర్తి వివరాలు వెల్లడించారు. నకిలీ రిజిస్ట్రేషన్లతో దందా ప్రారంభం... విశాఖకు చెందిన సంగపు చక్రధర్ అలియాస్ వంశీ 2009 నుంచి నేరబాట పట్టాడు. మొదట్లో ఇతర రాష్ట్రాల్లో చోరీ అయిన వాహనాలకు దొంగ రిజిస్ట్రేషన్లు చేయించి.. రుణాలు తీసుకుంటూ ద్వారా ఫైనాన్స్ సంస్థలు, బ్యాంకులకు టోకరా వేస్తూ హైదరాబాద్ పోలీసులకు చిక్కాడు. ఇదే తరహాలో ఢిల్లీ, నోయిడా, ముంబై తదితర చోట్ల అరెస్టు అయ్యాడు. ఆ తరవాత ట్రాక్ మార్చిన చక్రధర్.. ఇన్సూరెన్స్ కంపెనీల ఆన్ లైన్ డేటాబేస్ మీద కన్నేశాడు. ప్రమాదాలకు లోనైన వాహనాలకు బీమా సొమ్ము చెల్లించే ఆయా సంస్థలు వాహనాలను స్వాధీనం చేసుకుంటాయి. స్క్రాప్‌లా అమ్మేందుకు ఆన్లైన్లో పొందుపరుస్తాయి. ఈ వివరాలను తెలుసుకునే చక్రధర్ ఆయా సంస్థల్ని సంప్రదించి వాహనంతో పాటు దాని పత్రాలను ఖరీదు చేసేవాడు. పత్రాలతో పాటు వాహనం ఇంజన్, ఛాసిస్ నెంబర్లు ఉండే భాగాలను భద్రపరిచి మిగిలింది స్క్రాప్‌గా అమ్మేసేవాడు. తన వద్ద ఉన్న పత్రాల్లో ఉన్న కంపెనీ, మోడల్, రంగుతో కూడిన కార్లను ఉత్తరాదిలో చోరీ చేయిస్తాడు. దీనికోసం మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, హర్యానా తదితర రాష్ట్రాల్లో 20 మంది అనుచరుల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అక్కడే చోరీ చేసిన వాహనానికి నకిలీ నంబర్ ప్లేట్, పత్రాల సాయంతో వాహనాలను దర్జాగా హైదరాబాద్ కు తీసుకువస్తారు. రాగన్నగూడలో 'మినీ వర్క్‌షాప్' ఇలా నగరానికి చేరుకున్న వాహనాలను చక్రధర్ రాగన్నగూడలో ఏర్పాటు చేసుకున్న డెన్‌కు తీసుకొస్తారు. అక్కడ పి.శివ, జి.రత్న కిషోర్, కె.శ్రీనివాసరావుల సాయంతో చోరీ వాహనానికి సంబంధించిన ఇంజన్, ఛాసిస్ నంబర్లు ఉండే ప్రాంతాలను కత్తిరించి 'స్క్రాప్' నుంచి సేకరించిన వాటిని అతికిస్తారు. అప్పటికే బీమా కంపెనీ నుంచి సేకరించిన 'స్క్రాప్ వాహనాల' పత్రాలు వీరి వద్ద ఉండటంతో ఆ రిజిస్ట్రేషన్ నంబర్‌నే చోరీ వాహనానికి వేస్తున్నారు. కోయంబత్తూరు కేంద్రంగా పని చేసే ప్రముఖ వాహనాల ఇంటీరియర్, ఎక్స్టీరియర్ డిజైనింగ్ సంస్థ దిలీప్ ఛాబ్రియా (డీసీ డిజైన్స్) ఔట్‌లెట్స్‌లో దాని రూపురేఖలు మార్చేస్తారు. దీంతో ఆర్టీఏ అధికారులు, ఆ వాహనం పొగొట్టుకున్న వారు సహా ఎవ్వరూ చోరీ చేసిన వాహనాన్ని గుర్తించడం సాధ్యం కాదు. ఇలా దొంగ వాహనాన్ని ముస్తాబు చేసి తెలుగు రాష్ట్రాల్లో అమ్మేస్తున్నారు. 'పుణె' నేర్పిన పాఠంతో.. చక్రధర్ గ్యాంగ్ ఈ ఏడాది మేలో పుణెలోని ఖత్రుడ్ ప్రాంతంలో ఓ ట్రావెల్స్‌కు చెందిన వాహనాన్ని చోరీ చేయించింది. దాన్ని హైదరాబాద్‌కు తీసుకువచ్చి, రూపురేఖలు మార్చిన చక్రధర్ సొంతానికి వాడుతున్నాడు. ఈలోపు ఓరోజు వనస్థలిపురం ప్రాంతంలో ఉండగా... నేరుగా వచ్చిన ఖత్రుడ్ పోలీసులు అరెస్టు చేశారు. ఆగస్టు వరకు అక్కడి ఎరవాడ జైల్లో శిక్షఅనుభవించిన చక్రధర్.. తాను చేసిన తప్పేంటో తోటి దొంగల ద్వారా చర్చించాడు. హైఎండ్ వాహనాల్లో కంపెనీలు ఇంజన్ కంట్రోల్ మాడ్యూల్ (ఈసీఎం) అనే పరికరాన్ని ఏర్పాటు చేస్తాయని, ఇగ్నిషన్ తాళంతో అనుసంధానమై ఉండే ఈ పరికరం కారు స్టార్ట్ చేయగానే జీపీఎస్ కు అనుసంధానమై యజమానికి ఆ వాహనం ఉన్న ప్రాంతాన్ని చూపిస్తుందని అర్థం అయ్యింది. తాను చిక్కడానికి పుణెలో చోరీ చేసిన కారులో ఉన్న ఈసీఎం కారణమని తెలియడంతో ఆ తరవాతి నుంచి మరింత జాగ్రత్తగా ఈ పరికరాన్ని రీప్లేస్ చేసే ఏర్పాటు చేశాడు. ఫలితంగా వాహనాల్లో జీపీఎస్ కట్ అయిపోతోంది. ఎట్టకేలకు చిక్కిన ముఠా... దొంగతనం చేసిన వాహనాలు అమ్ముడుకాకపోతే.. వాటిపై ఫైనాన్స్ తీసుకునేవాడు. రుణం కట్టడం మానేసే వాడు. యూపీలోని ఓ సంస్థ నుంచి రూ.45 లక్షలు, విశాఖలో మరో 9 వాహనాలపై భారీ మొత్తం రుణం తీసుకున్నాడు. ఈ రుణం తీసుకోవడంలో ఫైనాన్స్ సంస్థలో పనిచేసే శ్రీనివాసరెడ్డి లంచం తీసుకుని సహకరించాడు. ఈ గ్యాంగ్ వ్యవహారాలపై సమాచారం అందుకున్న ఇన్స్పెక్టర్లు వి.శ్యాంబాబు, డి.సుధీర్‌రెడ్డి, కరుణాకర్‌రెడ్డి వలపన్ని చక్రధర్, శివ, కిషోర్, శ్రీనివాసరావు, విజయ్, తన్వీర్లను అరెస్టు చేసి 13 వాహనాలు రికవరీ చేశారు. పరారీలో ఉన్న వారిని పట్టుకోవడంతో పాటు విశాఖలో ఉన్న తొమ్మిదింటితో పాటు వాహనాలను రికవరీ చేయాల్సి ఉందని స్వాతిలక్రా తెలిపారు. వీరు చోరీ చేసిన వాటిలో ఇన్నోవా, స్కార్పియో, డస్టర్, టవేరా, వెర్నా, స్విఫ్ట్ తదితరాలు ఉన్నాయి. రూపురేఖలు మారిపోయిన వాహనాల యజమానుల గుర్తింపూ కష్టంగా ఉందని, ఇప్పటికి ఇద్దరిని మాత్రమే గుర్తించామని అన్నారు. నిందితులపై పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని ఆమె చెప్పారు. -
హైదరాబాద్‌లో ఇంటింటి సర్వే: సీపీ
హైదరాబాద్ : నగరంలోని పాత నేరస్థులపై పోలీసులతో సమగ్ర సర్వే నిర్వహిస్తున్నామని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి వెల్లడించారు. బుధవారం హైదరాబాద్‌లో మహేందర్‌రెడ్డి విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ...2011 నుంచి పాత నేరస్థులకు చెందిన పూర్తి వివరాలు సేకరిస్తున్నామన్నారు. మొత్తం 11,500 మంది పాత నేరస్థులున్నారని చెప్పారు. అలాగే హైదరాబాద్‌లోనే 7500 మంది పాత నేరస్థులు ఉన్నారని తెలిపారు. పాత నేరస్థుల వివరాల సేకరణ కోసం ఇంటింటి సర్వే నిర్వహిస్తామన్నారు. నేరాలు అరికట్టేందుకు ఈ సర్వే ఉపయోగపడుతుందని మహేందర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. -
గస్తీ సిబ్బందికి ‘నేర’ పరీక్ష
పాత నేరస్తులపై నిత్యం నిఘా క్షేత్రస్థాయి సిబ్బందికి పర్యవేక్షణ బాధ్యత నగరంలోని ఎంఓ క్రిమినల్స్ జాబితా సిద్ధం నేరస్తుల వివరాలు అప్డేట్ వచ్చే వారం నుంచి ఆకస్మిక తనిఖీలు రోటీన్‌గా సాగిపోతున్న గస్తీ విధానాలను సమగ్రంగా మార్చడానికి నగర పోలీసు కమిషనర్ ఎం. మహేందర్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా స్థానికంగా ఉండే ఎంఓ క్రిమినల్స్‌ను పర్యవేక్షించే బాధ్యతల్ని బ్లూకోల్ట్స్, రక్షక్‌లకు అప్పగించారు. వచ్చేవారం నుంచి ఆకస్మిక తనిఖీల ద్వారా వీరి పనితీరును పరీక్షించాలని కొత్వాల్ నిర్ణయించారు. మంగళవారం జరిగిన సెట్ కాన్ఫరెన్స్‌లో ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. నగర కమిషనరేట్ పరిధిలో గడిచిన కొన్నేళ్ల గణాంకాలు, నేరాలను విశ్లేషిస్తే అధిక శాతం పాతవారి ‘పని’గానే తేలింది. వీరిపై కన్నేసి ఉంచితే నేర నిరోధం సాధ్యమని ఉన్నతాధికారులు భావించారు. దీనికోసం ‘ఎంఓ క్రిమినల్స్ డేటాబేస్’ రూపొందించారు. - సాక్షి, సిటీబ్యూరో ఠాణాల వారీగా వివరాలు.. నగర కమిషనరేట్ పరిధిలో గడిచిన దశాబ్ద కాలంలో 50 వేలకు పైగా నేరగాళ్లు అరెస్టయ్యారు. వీరిలో దాదాపు 30 వేల మంది పదేపదే ఒకే తరహా నేరాలు చేసి చిక్కిన వారున్నారు. పోలీసు పరిభాషలో వీరిని ‘ఎంఓ క్రిమినల్స్’గా పరిగణిస్తారు. వీరికి సంబంధించి సిటీ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (సీసీఆర్బీ)లో డేటాబేస్ రూపొందింది. దీనిపై దృష్టి పెట్టిన కొత్వాల్ మహేందర్‌రెడ్డి నేరగాళ్లపై నిఘాకు దాన్నే వినియోగించుకోవాలని నిర్ణయించారు. ఈ 30 వేల మంది వివరాలను విశ్లేషించి వారు నివసిస్తున్న ప్రాంతాల వారీగా జాబితా రూపొందించి వాటిని క్షేత్రస్థాయిలోని రక్షక్, బ్లూకోల్డ్స్ సిబ్బందికి అందించారు. నిత్యం ‘సందర్శించాల్సిందే’.. ఠాణాల వారీగా గస్తీ తిరిగే రక్షక్, బ్లూకోల్ట్ సిబ్బంది ఇకపై నిత్యం కచ్చితంగా తమ పరిధిలోని ఎంఓ క్రిమినల్స్ ఇళ్లకు వెళ్లాల్సిందేనని కొత్వాల్ స్పష్టం చేశారు. ఆ నేరగాడు ప్రస్తుతం ఏం చేస్తున్నాడు? అతడి జీవన సరళి.. కదలికల వివరాలు సేకరించడంతో పాటు సమీపంలో ఉండే బంధువులు, స్నేహితుల ఇళ్లకూ వెళ్లి ఆరా తీయాలని ఆదేశించారు. 30 వేల ఎంఓ క్రిమినల్స్ వివరాలను జోనల్, నేరం ప్రాతిపదిన విడిగా ప్రత్యేక జాబితాలు రూపొందించారు. వచ్చే వారం నుంచి ఆకస్మిక తనిఖీలు ఎంఓ నేరగాళ్లపై నిఘా కోసం తెరిచే సస్పెక్ట్ షీట్స్ సాధారణంగా వారు నివసిస్తున్న ప్రాంతం పరిధిలోని ఠాణాలో ఉంటాయి. అయితే, కొందరు తాము నివసిస్తున్న ప్రాంతంలో ఎలాంటి నేరాలు చేయట్లేదు. దీంతో ఇతర ప్రాంతాల వారికి ఇతడి విషయం తెలియట్లేదు. ఎంఓ క్రిమినల్స్ డేటా అప్డేట్ చేస్తున్న అధికారులు ఇలాంటివి గుర్తించినపుడు ఆయా షీట్స్‌ను పాత నేరగాళ్లు పంజా విసురుతున్న ప్రాంతాల్లోని ఠాణాలకు బదిలీ చేస్తున్నారు. గస్తీ సిబ్బంది బీట్ల వారీగా తమ ప్రాంతంలో నివసిస్తున్న అందరి నేరగాళ్లను ‘సందర్శించడానికి’ ఉన్నతాధికారులు వారం రోజుల గడువిచ్చారు. ఆ తరవాత కొత్వాల్ నుంచి ఇన్స్పెక్టర్ వరకు ఎవరైనా హఠాత్తుగా ఓ గస్తీ బృందం దగ్గరకు వెళ్లి జాబితాలోని ఓ నేరగాడి ఇంటికి తీసుకెళ్లమనో, అతడి ప్రస్తుత వ్యవహారాలు చెప్పమనో కోరతారు. ఇందులో విఫలమైన వారిపై చర్యలు తప్పవని కొత్వాల్ హెచ్చరించారు. చిరునామా మారితే అప్డేట్.. ఈ నిందితుల్ని ఒక్కోసారి ఒక్కో ఠాణా అధికారులు అరెస్టు చేస్తుంటారు. అలా అరెస్టయిన సందర్భంలో వీరు పేర్లు, చిరునామాలు మార్చి చెప్తుంటారు. ఈ లోపాన్ని సరిచేయడానికి రికార్డుల్లో ఉన్న చిరునామాలో సదరు పాత నేరగాడు లేకుంటే.. ఆ విషయాన్ని అధికారులకు తెలిపి స్థానిక పోలీసుల సాయంతో కొత్త చిరునామా గుర్తించాల్సిన బాధ్యత క్షేత్రస్థాయి సిబ్బందిదే. చిరునామా సరైనదై, ఆ నేరగాడు వరుసగా కొన్ని రోజుల పాటు అందుబాటులో లేకుంటే ఇప్పటికీ నేరాలు చేస్తున్నట్లు అనుమానించి ప్రత్యేక జాబితాలో చేర్చి దర్యాప్తు చేపడతారు. -
ప్రచారం... సమాచారం... పనితీరు
సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక బృందాల ఏర్పాటుపై విస్తృత ప్రచారం... ప్రజలు, బాధితుల ఇస్తున్న సమాచారం... తక్షణం స్పందిస్తున్న సిబ్బంది పనితీరు... ఈ మూడింటి కారణంగానే నగరంలో ఏర్పాటైన ‘షీ-టీమ్స్’ విజయవంతం కావడంతో పాటు తెలంగాణ వ్యాప్తంగా విస్తరించడానికి మూలమయ్యాయని అదనపు పోలీసు కమిషనర్ (నేరాలు) స్వాతి లక్రా అన్నారు. ఈ బృందాలు అందుబాటులోకి వచ్చిశనివారానికి ఏడాది పూర్తయింది. ఈ నేపథ్యంలో ఆమె బుధవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా స్వాతి లక్రా మాట్లాడుతూ... ‘ఏడాదిలో ‘షీ-టీమ్స్’కు వివిధ మాధ్యమాల ద్వారా 883 ఫిర్యాదులు వచ్చాయి. అత్యధికంగా 573 ‘డయల్-100’ ద్వారా వచ్చినవే. ప్రతి ఫిర్యాదు పైనా తక్షణం స్పందించేందుకు నగర వ్యాప్తంగా మొత్తం 100 బృందాలు షిఫ్టుల వారీగా పని చేస్తున్నాయి. వీటికి అదనంగా పోలీసుస్టేషన్లలోనూ కొన్ని టీమ్స్ ఉన్నాయి. కేసు తీరును బట్టి కౌన్సెలింగ్ నుంచి నిర్భయ చట్టం కింద కేసుల వరకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ‘షీ-టీమ్స్’ పనితీరుతో పాటు మహిళలు/యువతుల భద్రతపై కరపత్రాలు, లఘు చిత్రాల ద్వారా భారీ ప్రచారం చేపట్టనున్నాం. అన్ని వయస్సుల వారు, స్వచ్ఛంద సంస్థలతో పాటు మారిన పోకిరీలను వాలెంటీర్లుగా ఎంపిక చేసుకుని ముందుకు వెళ్లాలని నిర్ణయించాం. బంగారు తెలంగాణ సాధనలో ‘షీ-టీమ్స్’ పాత్ర కీలకంగా మారనుంది’ అని అన్నారు. ఈ ‘షీ-టీమ్స్’ విజయవంతం కావడంతో సీసీఎస్ సంయుక్త పోలీసు కమిషనర్ డాక్టర్ టి.ప్రభాకరరావు, అదనపు డీసీపీ రంజన్ రతన్ కుమార్, ‘షీ-టీమ్స్’ ఏసీపీ కవితతో పాటు సిబ్బందీ అహర్నిశలు శ్రమించారని స్వాతిలక్రా పేర్కొన్నారు. కౌన్సెలెంగ్ నా కుమారుడిని మార్చింది ‘రోడ్లపై యువతుల్ని వేధిస్తున్న నా కుమారుడిని ‘షీ-టీమ్స్’ అదుపులోకి తీసుకుని సీసీఎస్‌కు తరలించారు. కౌన్సెలింగ్ కోసం నన్ను కూడా పిలిచారు. ఆ సందర్భంలో అధికారులు చెప్పిన మాటలు, ఇంట్లో మేం తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ నా కుమారుడిలో మార్పు తెచ్చాయి’ - మహ్మద్ హాజీ బృందాలు నలుమూలలా విస్తరించాయి ‘‘షీ-టీమ్స్’ బృందాలు నగరంలోని అన్ని ప్రాంతాలకూ విస్తరించాయి. వీటి ఏర్పాటు, విస్తరణ ఓ ఉద్యమంలా సాగింది. ఇబ్బంది ఎదురైనప్పుడు ‘డయల్-100’కు ఫోన్ చేయగానే స్పందిస్తూ పెద్దన్నలా ఆదుకుంటున్నాయి.’ - దివ్య, విద్యార్థిని నేను ధైర్యంగా తిరుగుతున్నాను.. ‘సిటీకి కొత్తగా వచ్చాను. ఒకప్పుడు ఇంట్లోంచి బయటకు రావాలంటే పోకిరీలతో భయం వేసేది. తల్లిదండ్రులూ ఎంతో ఆందోళన చెందే వారు. ‘షీ-టీమ్స్’తో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. నేను ధైర్యంగా తిరగడంతో పాటు ఇబ్బందుల్లో వారినీ ఆదుకుంటున్నాను.’ - గాయత్రి, విద్యార్థిని -
బాలికలతో రికార్డింగ్ డ్యాన్స్‌లు
ఆ పై వ్యభిచారం ఓ బాలిక తల్లిసహా నలుగురు అరెస్టు విజయవాడ సిటీ: బాలికలతో రికార్డింగ్ డ్యాన్స్‌లు చేయించడంతోపాటు వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్న నలుగురిని కమిషనరేట్ పరిధిలోని నున్న రూరల్ పోలీసులు అరెస్టుచేశారు. నిందితుల్లో ఓ బాలిక తల్లి, ఆమెను ముఠాకు పరిచయం చేసిన మహిళ, విశాఖ జిల్లా అనకాపల్లికి చెందిన బ్రోకర్లు ఇద్దరు ఉన్నారు. బుధవారం సెంట్రల్ జోన్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ టి.ప్రభాకరబాబు వివరాలు వెల్లడించారు. విజయవాడ వాంబేకాలనీకి చెందిన కోడిరెక్కల శివకుమారి ఆర్థికంగా ఇబ్బందులు పడుతోంది. దీన్ని గమనించిన పొరుగింటి హుసేన్‌బీ విశాఖ జిల్లాలో రికార్డింగ్ డ్యాన్స్ చేసేందుకు కుమార్తెను పంపితే భారీగా నగదు ఇస్తారని చెప్పగా శివకుమారి అంగీకరించింది. ఆ తర్వాత ఆమె అనకాపల్లికి చెందిన సన్యాసిరావు, విమలను సంప్రదించి వినాయకచవితి సందర్భంగా నిర్వహించిన రికార్డింగ్ డ్యాన్స్‌లకు తన కుమార్తెను పంపింది. వారు డ్యాన్స్‌తోపాటు బాలికతో బలవంతంగా వ్యభిచారం చేయించారు. తిరిగి దసరా ఉత్సవాలకు బాలికను తీసుకెళ్లేందుకు సన్యాసిరావు, విమల రావడంతో భయపడిన బాలిక నున్న రూరల్ సీఐ సహేరాను కలిసి గోడు చెప్పుకుంది. ఆమె విషయాన్ని పోలీసు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లగా నిందితులను అరెస్టు చేసి బాలికను రక్షించాలంటూ ఆదేశించారు. రంగంలోకి దిగిన నున్న పోలీసులు బాలిక తల్లితోపాటు సహకరించిన హుసేన్‌బీ, సన్యాసిరావు, విమలను అరెస్టుచేసి రికార్డింగ్ డ్యాన్స్‌లకు తరలించేందుకు సిద్ధం చేసిన ఇద్దరు బాలికలను రక్షించి వసతి గృహానికి తరలించారు. విలేకరుల సమావేశంలో నున్న రూరల్ సీఐ సహేరా, ఎస్ఐలు శివప్రసాద్, సురేష్‌బాబు పాల్గొన్నారు. -
'నిమజ్జనం కోసం 25వేల భద్రతా సిబ్బంది'
-
'నిమజ్జనం కోసం 25వేల భద్రతా సిబ్బంది'
హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో ఆదివారం జరగబోయే వినాయక నిమజ్జనం కోసం 25 వేల భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నట్టు నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి తెలిపారు. శనివారం ఆయన 'సాక్షి' మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్, కర్నాటక, ఒడిశా, తమిళనాడు పోలీసులతో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేస్తున్నాం. కమాండింగ్ కంట్రోల్ సిస్టమ్ ద్వారా 400 సీసీ కెమెరాలతో మానిటర్ చేస్తాం. గతంలో ఇబ్బందులు ఎదురైన ప్రాంతాలను సమస్యాత్మక ప్రాంతంగా గుర్తించాం. నిమజ్జనం దారిలోని ప్రతి కూడాలిలో సీసీ కెమెరాలు అమర్చుతాం. ఎలాంటి ఘటన జరగకుండా కమాండింగ్ కంట్రోల్ ద్వారా మానిటర్ చేయనున్నాం. విధుల్లో ఉన్న సిబ్బందిని అప్రమత్తం చేస్తాం' అని చెప్పారు. ఆయన ఇంకా మాట్లాడుతూ.. ఖైరతాబాద్ మహాగణేష్ నిమజ్జనం మొదటిరోజే పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. బాలానగర్ గణేష్ నిమజ్జనయాత్ర ప్రారంభమయ్యేంత వరకు ఆగాల్సిన పనిలేదని తెలిపారు. ఉదయం నుంచి నిమజ్జన యాత్రలు నిర్వహించుకోవచ్చన్నారు. ట్యాంక్ బండ్ పరిసరాల్లో దాదాపు 70కి పైగా సీసీ కెమెరాలు ఏర్పాలు చేస్తామని చెప్పారు. భక్తులు, స్థానిక ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. ఏదైనా సమస్య వస్తే వెంటనే 100 నంబరుకు కాల్ చేయాలని సీపీ మహేందర్ రెడ్డి సూచించారు. -
నా కుటుంబానికి రక్షణ కల్పించండి
- తమిళ నటుడు పూచ్చి మురుగన్ తనకు తన కుటుంబానికి ప్రాణాపాయం ఉందని, అందుకుగాను తగిన రక్షణ కల్పించాలంటూ నటుడు పూచ్చి మురుగన్ శనివారం నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందించారు.అందులో ఆయన పేర్కొంటూ తాను దక్షిణ భారత నటీనటుల సంఘంలో సభ్యుడిగా ఉన్నానన్నారు. కొంత కాలం సంఘ నిర్వాహక సభ్యుడిగా బాధ్యతలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. అదే విధంగా సంఘం భవనం గురించి అది సంఘం సభ్యులకే సొంతం కావాలని పోరాడుతున్నానన్నారు.త్వరలో సంఘం ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కొందరు ఫోన్లో హత్యాబెదిరింపులకు పాల్పడుతున్నట్లు పేర్కొన్నారు. దీంతో తనకూ తన కుటుంబానికి ప్రాణాపాయం ఉందన్నారు. కాబట్టి తన కుటుంబానికి తగిన రక్షణ కల్పించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నట్లు నటుడు పూచ్చి మురుగన్ పేర్కొన్నారు. -
'సమన్వయంతో పండుగలు చేసుకోండి'
పశువులను తీసుకెళ్లే వాహనాలను ఆపరాదు పోలీసులకు సమాచారమివ్వాలని హిందువులకు సూచన హైదరాబాద్ సిటీబ్యూరో: సెప్టెంబరు నెలలోనే వినాయక చవితి ఉత్సవాలు, బక్రీద్ పండుగ రావడంతో ఇరువర్గాల ప్రజలు సమన్వయంతో వేడుకలు జరుపుకోవాలని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ పిలుపునిచ్చారు. గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో హిందువులు, ముస్లిం పెద్దలతో ఆయన గురువారం వేర్వేరుగా సమావేశాలు నిర్వహించారు. అన్నిజోన్ల ఏసీపీలతో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కాగా, హిందువులతో జరిగిన ప్రత్యేక సమావేశంలో వినాయక చవితి ఉత్సవాలకు సంబంధించి పెద్దలు లేవదీసిన ప్రశ్నలకు సీవీ ఆనంద్ సమాధానమిచ్చారు. బందోబస్తుతో పాటు ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అయితే బక్రీద్ కూడా ఇదే నెలలో ఉండటంతో ముస్లింలు తీసుకొచ్చే పశువులను నేరుగా ఎవరూ ఆపొద్దని హిందూ పెద్దలకు సూచించారు. ట్రాలీలు, లారీల్లో వచ్చే ఈ లోడ్లను ఆపడంతో గొడవ జరిగే అవకాశముందని సూచించారు. అలాగే ముస్లింలతోనూ జరిగిన ప్రత్యేక సమావేశంలో వారి సమస్యలను సీవీ ఆనంద్ సావధానంగా విన్నారు. నిరంతర నిఘా.. నగరంలోకి అక్రమంగా తరలించే పశువులు, ఆవులు, దూడలపై పోలీసులు నిరంతరం నిఘా ఉండనుంది. ప్రధాన ప్రాంతాలతో పాటు జాతీయ రహదారుల్లో 21 చెక్‌పోస్టులను ఏర్పాటు చేస్తున్నారు. ఎస్ఐల ఆధ్వర్యంలో సిబ్బందితో తనిఖీలు జరుగుతాయి. అలాగే చట్ట ప్రకారంగానే పశువులను తరలిస్తున్నారా అని సర్టిఫై చేసేందుకు వెటర్నరీ డాక్టర్లు విధులు నిర్వర్తించనున్నారు. మూడు షిఫ్టుల్లో 24 గంటల పాటు వారు పనిచేయనున్నారు. అలాగే అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన పశువులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పశువుల షెడ్డులోకి తరలిస్తారు. ఇప్పటికే ఐదు జోన్లో పూర్తయిన షెడ్డుల్లో పశువుల దాణా, గడ్డి, నీరు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుంటున్నారు. హైవేలతో పాటు ఫ్రధాన ప్రాంతాల్లో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తారని సీవీ ఆనంద్ హిందూ, ముస్లిం పెద్దలకు వివరించారు. -
క్లూస్...‘కీ’లకం!
సాక్షి, సిటీబ్యూరో : నేరాల నిరోధానికి... నిందితులకు కచ్చితంగా శిక్ష పడేలా చేసేందుకు నగర పోలీసులు సిద్ధమవుతున్నారు. దీని కోసం ప్రత్యేక కార్యాచరణకు సిద్ధమవుతున్నారు. వివిధ కారణాలతో శిక్షల నిరూపణ (కన్విక్షన్స్)లో ఎదురవుతున్న వైఫల్యాలను దృష్టిలో ఉంచుకొని... నగరంలో మరో 17 ‘క్లూస్’ బృందాలను రంగంలోకి దించుతున్నారు. నేరం జరిగిన వెంటనే క్లూస్ టీం సంఘటనా స్థలిని తమ ఆధీనంలోకి తీసుకొని... అక్కడ లభించేప్రతి ఆధారాన్నీ స్వాధీనం చేసుకొని... శాస్త్రీయంగా విశ్లేషించి... నిందితులను చట్ట ప్రకారం శిక్షించేలా స్కెచ్‌ను రూపొందిస్తారు. ప్రస్తుతం ఒక్క చోటనే క్లూ బృందాలు ఉన్నాయి. ఇకపై నగరమంతటా విస్తరిస్తాయి. అనుభవజ్ఞులతో శిక్షణ... బీఎస్సీ కెమిస్ట్రీ, ఎమ్మెస్సీ కెమిస్ట్రీతో పాటు వివిధ కోర్సులు చేసిన అభ్యర్థులను హోంగార్డు టెక్నికల్ ఉద్యోగులుగా తీసుకున్నారు. వీరికి ఫోరెన్సిక్ సైన్స్‌తో పాటు క్లూస్ టీమ్ అనుభవజ్ఞులతో ప్రత్యేక శిక్షణ ఇప్పించారు. ఘటనా స్థలిలో ఆధారాలు ఎలా సేకరించాలి? నిందితుడు వదిలిన ఏ ఒక్క ఆధారమైనా కేసు ఛేదనకు ఎలా సహకరిస్తుందనే అంశాలను బోధించారు. ఓ ఫ్లాట్‌లో దొంగతనం జరిగితే... తాళం విరగ్గొట్టిన తీరు ఆధారంగా... గతంలో చోరీలు చేసిన ముఠా వివరాలను సేకరించడంతో పాటు... నేరాలకు పాల్పడిన వైనం... ప్రస్తుత తీరును పోల్చి...మరిన్ని కొత్త అంశాలను ఎలా సేకరించాలనే దానిపై ప్రయోగాత్మకంగా శిక్షణనిస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన అనుభవజ్ఞులు కూడా ప్రత్యేక పాఠాలు చెప్పారని నగర క్లూస్ టీమ్ అధికారి డాక్టర్ వెంకన్న తెలిపారు. విదేశాల్లోనూ అధ్యయనం... అభివృద్ధి చెందిన దేశాల్లో నేరస్తులకు శిక్ష పడటంలో... సంఘటనను కళ్లకు కట్టించడంలో క్లూస్ టీమ్స్ది కీలక పాత్ర. ఆ దేశాల్లో ఏ చిన్న నేరం చేసినా ఆధారాల కోసం భూతద్దం వేసుకుని మరీ వెతుకుతారు. భారీ సంఖ్యలోనే సిబ్బంది ఉండటంతో నిందితులకు త్వరితగతిన శిక్ష పడుతుందని ఇక్కడి అధికారుల అధ్యయనంలో తేలింది. నగరంలో నిందితులను పట్టుకుంటున్న పోలీసులు... కోర్టుకు ఆధారాలు సమర్పించడంలో విఫలమవుతున్నారు. అందుకే చాలామంది నిందితులకు శిక్ష పడటం లేదనే విషయాన్ని గుర్తించారు. నగరంలో ఎక్కడ... ఎలాంటి నేర ఘటనలు చోటుచేసుకున్నా... వాటి వెనుక ఎవరున్నారనేది తెలుసుకునేందుకు ఆధునిక నేర పరిశోధన అవసరమని... అందుకు తగ్గట్టుగా క్లూస్ సిబ్బంది ఉండాలని పోలీసు అధికారులు నిర్ణయించారు. దేశంలోనే తొలిసారి ఇళ్లలో జరిగే చోరీలు, చైన్ స్నాచింగ్‌లు మొదలుకుని అన్ని కేసుల్లోనూ క్లూస్ టీమ్స్ ఇక నుంచి కీలకంగా వ్యవహరించనున్నాయి. ఒక్కో టీమ్‌లో ఆరుగురు సభ్యులు ఉండేలా... 17 డివిజన్లలో ఇవి పని చేయనున్నాయి. మూడు పోలీసు స్టేషన్లకు ఒక్కో బృందం చొప్పున పనిచేస్తుంది. ఇంత భారీ సంఖ్యలో టీమ్‌లు పెంచడం దేశంలో ఇదే తొలిసారి. దీంతో సంఘటనాస్థలికి సకాలంలో చేరుకోవడంతో పాటు త్వరగా ఆధారాలు సేకరించే వీలుంటుంది. కేసులకు తగ్గట్టుగా సిబ్బంది ఉండటంతో... వారు సేకరించే ఆధారాలు కీలకమై... శిక్ష పడే వారి శాతం పెరుగుతుంది. అలాగే ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్, సెంట్రల్ జోన్లకు నేరస్థలిని స్కాన్ చేసే యంత్రాలు (3డీ స్కానర్ల)ను కూడా కొనుగోలు చేస్తున్నాం. ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకుంటాం. మహేందర్‌రెడ్డి, నగర పోలీస్ కమిషనర్ 2014 నవంబర్ 18... ఉదయం... జూబ్లీహిల్స్‌లోని కేబీఆర్ పార్కులో వాకింగ్ చేస్తున్న పారిశ్రామిక వేత్త నిత్యానందరెడ్డిపై కాల్పులు జరిగాయి. ఈ ఘటన నగరంలో కలకలం సృష్టించింది. సంఘటనస్థలికి చేరుకున్న క్లూస్ టీమ్‌కు మడత పెట్టి ఉన్న ఓ చిన్న కాగితం దొరికింది. అందులో తొలి పదం ఎం... చివరి రెండు అక్షరాలు ఏఎం అని రాసి ఉన్నాయి. ఆ కాగితం మీద ఉన్న హెచ్టీపీటీ ఈమెయిల్ ఐడీ ఆధారంగా చిరునామా కనుక్కోగలిగారు. మెహదీపట్నం అని తెలిసింది. అక్కడే ఓ షాప్‌లో 24 రోజుల క్రితం నిందితడు కొనుగోలు చేసిన వస్త్రాలు... నేరం చేసినప్పుడు వేసుకున్న దుస్తుల రంగు ఒకటేనని తేలింది. నిందితుడు ఒబులేశును పట్టుకోవడంలో ఆ కాగితం ‘క్లూ’ కీలకపాత్ర పోషించింది. రెండు నెలల క్రితం ఎస్ఆర్ నగర పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ ఏటీఎంలో జరిగిన దొంగతనం కేసు ఛేదనలోనూ క్లూస్ టీమ్‌దే కీలకపాత్ర. ఘటనా స్థలికి కొన్ని గంటల్లోనే చేరుకున్న క్లూస్ టీమ్‌కు ఏటీఎంలోని ఓ భాగంలో ఓ బుల్లెట్ దొరికింది. దీనితో పాటు సీసీటీవీ ఫుటేజీకి చిక్కిన దృశ్యాలు కూడా నిందితుడిని పట్టుకోవడంలో పోలీసులకు సహకరించాయి. -
సెటిల్మెంట్ సో బెటర్ బాస్
ప్రైవేట్ పంచాయతీ చేసుకోమని ఆదేశం పెనమలూరు సీఐ తీరుపై సీపీ ఆగ్రహం కేసు నమోదుకు ఆదేశం అదుపులో నిందితులు విజయవాడ సిటీ: బాధితులు న్యాయం కోసం పోలీసులను ఆశ్రయిస్తారు. న్యాయం చేయాల్సిన పోలీసులు ప్రైవేటు వ్యక్తులను కలవమని చెబితే..ఇక బాధితులకు దిక్కెవరు. ఓ భూ వివాదంలో పెనమలూరు పోలీసు స్టేషన్‌కు వెళ్లిన వైద్యుడికి ప్రైవేటు వ్యక్తులతో పంచాయతీ చేసుకోమంటూ స్టేషన్ అధికారి పురమాయించారు. ఇది నచ్చని బాధిత వైద్యుడు పోలీసు కమిషనర్ గౌతమ్ సవాంగ్‌ను ఆశ్రయించడంతో పోలీసు అధికారి ప్రైవేటు పంచాయితీ వ్యవహారం వెలుగులోకి వచ్చి ంది. సీపీ ఆదేశాల మేరకు ఎట్టకేలకు కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేశారు. ప్రైవేటు వ్యక్తులను మధ్యవర్తులుగా పెట్టుకొని దందా నిర్వహిస్తున్నట్టు వచ్చిన ఆరోపణలపై పెనమలూరు ఇన్స్పెక్టర్ జగన్మోహన్పై సీపీ విచారణకు ఆదేశించినట్లు తెలిసింది. ఇదీ జరిగింది గుంటూరుకు చెందిన డాక్టర్ రావుకు కానూరు గ్రామ పరిధిలో 470 చదరపు గజాల చొప్పున రెండు ప్లాట్లు ఉన్నాయి. వీటిని విక్రయించేందుకు నిర్ణయించిన డాక్టర్ రావు తెలిసిన వ్యక్తులకు చెప్పాడు. ఇది తెలిసిన డాక్యుమెంట్ రైటర్ రమణ, బిల్డర్‌గా చెప్పుకుంటున్న దుర్గాప్రసాద్ గుంటూరు వెళ్లి తాము కొనుగోలుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. ముందుగా కొంత నగదు అడ్వాన్సుగా ఇస్తామని, మిగిలిన మొత్తం రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత ఇస్తామని చెప్పారు. దీనికి ససేమిరా అన్న డాక్టర్ రావు రిజిస్ట్రేషన్ సమయంలోనే మొత్తం ఇవ్వాలంటూ చెప్పగా వారు వెనుదిరిగి వెళ్లిపోయారు. కొద్ది రోజుల తర్వాత మరో వ్యక్తి ఆ ప్లాట్లు కొనుగోలుకు వెళ్లాడు. ఇదే సమయంలో డాక్యుమెంట్ రైటర్ రమణ తాము ఆ స్థలాన్ని కొనుగోలు చేసినట్టు పత్రికా ప్రకటన చేయడంతో పాటు కొనుగోలుకు ముందుకు వచ్చిన వ్యక్తికి విషయం చెప్పాడు. ఆపై డాక్టర్ రావు వద్దకు వెళ్లి ఆ ప్లాట్లు తమకే అమ్మాలని, లేని పక్షంలో లక్ష రూపాయలు ఇవ్వాలంటూ బెదిరించాడు. చివరకు రూ.35వేలు బెదిరించి తీసుకొని వెళ్లాడు. జరిగిన విషయాన్ని తన మిత్రుడైన న్యాయవాది సాయంతో పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు కట్టి నిందితులను అరెస్టు చేయాల్సిన పెనమలూరు ఇన్స్పెక్టర్ జగన్మోహన్ వివాదం పరిష్కరించాలంటూ కరణంగా చెప్పుకునే నాగేశ్వరరావు అనే వ్యక్తిని పురమాయించారు. దీంతో నాగేశ్వరరావు వెళ్లి వివాదాన్ని బిల్డర్స్ అసోసియేషన్ కార్యాలయంలో కూర్చొని పరిష్కరించుకుందామంటూ చెప్పాడు. తన ప్లాట్లపై లేని వివాదాలు సృష్టించడంతో పాటు రాజీ కోసం మధ్యవర్తులు రావడంపై మనస్థాపం చెందిన గుంటూరు వైద్యుడు హితుల సలహా మేరకు సీపీ గౌతమ్ సవాంగ్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై టాస్క్‌ఫోర్స్ విచారణకు ఆయన ఆదేశించారు. టాస్క్‌ఫోర్స్ అధికారులు విషయంపై ఆరా తీసి కేసు నమోదు చేయకపోవడంపై ఇన్స్పెక్టర్ను ప్రశ్నించగా పొంతనలేని కారణాలు చెప్పారు. టాస్క్‌ఫోర్స్ అధికారులు కేసు నమోదుకు ఆదేశించడంతో విధిలేని స్థితిలో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు వెళ్లిన సీఐ గుట్టుచప్పుడు కాకుండా సెటిల్మెంట్కు చేసిన ప్రయత్నం బెడిసికొట్టడంతో బాధిత డాక్టర్‌ను మచ్చిక చేసుకునేందుకు సీఐ జగన్మోహన్ సోమవారం ఉదయం గుంటూరు వెళ్లినట్లు తెలిసింది. అక్కడ డాక్టర్ రావు మాట్లాడేందుకు నిరాకరించడంతో మధ్యాహ్నం వరకు వేచి చూసి తిరిగి నగరానికి చేరుకున్న ఆయన సాయంత్రం కూడా స్టేషన్‌కి రాకుండా ఉన్నతాధికారులను కలిసేందుకు వెళ్లినట్లు సమాచారం. ఇప్పటికే ప్రైవేటు వ్యక్తులను ఏర్పాటు చేసుకొని దందాలు చేస్తున్నట్టు ఆరోపణలు రావడంతో ఉన్నతాధికారులు కూడా వ్యవహారశైలిని తప్పుపట్టినట్లు తెలిసింది. -
పోలీస్ కమిషనర్‌ను కలిసిన నటుడు
తమిళసినిమా: ప్రముఖ హాస్య నటుడు వివేక్ బుధవారం ఉదయం నగర పోలీస్ కమిషనర్ జార్జ్‌ను కలిశారు. వివేక్ పూర్వ దేశాధ్యక్షుడు, వైజ్ఞానికవేత్త అబ్దుల్ కలామ్ వీరాభిమాని అన్న విషయం తెలిసిందే. ఆయన స్ఫూర్తితో తమిళనాట కోటి మొక్కల్ని నాటాలనే బృహత్తర నిర్ణయాన్ని తీసుకుని, ఆ దిశగా ఇప్పటికే 27 లక్షల మొక్కల్ని నాటారు. కాగా అబ్దుల్ కలామ్ జయంతి అక్టోబర్ 15న విద్యార్థులతో కలిసి చెన్నై మెరీనా తీరంలో ర్యాలీ నిర్వహించి మొక్కల నాటే అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించతలపెట్టారు. ఇందులో పాల్గోనేవారికి ఒక్కో మొక్కను అందించనున్నారు. ఈ ర్యాలీ కార్యక్రమానికి అనుమతి కోరడానికి నటుడు వివేక్ పోలీస్ అధికారిణి కలిశానని అనంతరం విలేకరులకు వివరించారు. -
బిగ్‌సీ మేనేజరే సూత్రధారి
-
'నిఘా అవసరమే'
విజయవాడ: విజయవాడ పడమట పరిధిలోని టీచర్స్ కాలనీలో కొత్తగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను సోమవారం నగర పోలీస్ కమిషనర్ ఎబి.వెంకటేశ్వరరావు ప్రారంభించారు. మారిపోతున్న జీవన విధానంలో అనుక్షణం అప్రమత్తంగా ఉండటం కోసం సీసీ కెమెరాల నిఘా అవసరం ఎంతైనా ఉందని ఆయన ఈ సందర్భంగా అన్నారు. టీచర్స్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ మాదిరిగానే అన్నికాలనీలు సీసీ కెమరాలను ఏర్పాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. -
పోలీస్ కమీషనర్ ఆఫీస్ ఎదుట వ్యక్తి ఆత్మహత్యాయత్నం
విజయవాడ (కృష్ణా జిల్లా) : విజయవాడ పోలీస్ కమీషనర్ కార్యాలయం ఎదుట ఓ వ్యక్తి బలవన్మరణానికి యత్నించాడు. విజయవాడలో శనివారం మధ్యాహ్నం చోటుచేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. నగరంలోని కొత్తపేటకు చెందిన సుబ్బారావు(39) ఓ ప్రైవేట్ సంస్థలో కొంతకాలం పనిచేశాడు. అయితే ఆ సంస్థ తనకు జీతం చెల్లించలేదని ఆరోపిస్తూ సదరు వ్యక్తి కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా పోలీసులు ఫిర్యాదుపై సరిగా స్పందించకపోవడంతో మనస్తాపం చెందిన బాధితుడు ఈ రోజు మధ్యాహ్నం కమీషనర్ కార్యాలయం ఎదుట పురుగుల మందు తాగి బలవన్మరణానికి యత్నించాడు. -
అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్
కృష్ణా : అంతర్రాష్ట్ర ముఠాకు చెందిన ఇద్దరు దొంగలను విజయవాడ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. పోలీస్ కమిషనర్ ఏబీ వెంకటేశ్వరరావు దీనికి సంబంధించిన వివరాలను మీడియాకు తెలిపారు. మధ్యప్రదేశ్‌లోని దార్ జిల్లాకు చెందిన బన్సీ, పవార్ మరికొందరితో కలసి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో దొంగతనాలకు పాల్పడేవారని చెప్పారు. విజయవాడ నగరం చుట్టుపక్కల నాలుగు దోపిడీ కేసుల్లో వీరు నిందితులుగా ఉన్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ ఇద్దర్ని అరెస్ట్ చేసినట్టు కమిషనర్ తెలిపారు. వీరి నుంచి రూ.10.85లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. -
బంద్‌లపై నిర్బంధం!
ఓటుకు నోటు నేపథ్యంలో పోలీసులకు మౌఖిక ఆదేశాలు సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు నోటు’ వ్యవహారం రోజురోజుకు మలుపులు తిరుగుతూ.. ఇందుకు ప్రధాన సూత్రధారి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడేనన్న ఆరోపణలతో ప్రతిష్ట దిగజారుతుండటంతో దీన్నుంచి రాష్ట్ర ప్రజల దృష్టిని మళ్ళించడానికి ప్రభుత్వం పావులు కదుపుతోంది. బాబు తీరును ఎండగడుతూ ప్రతిపక్షాలు భారీ స్థాయిలో చేపడుతున్న నిరసనలతో వాస్తవాలు ప్రజలకు చేరతాయనే ఉద్దేశంతో అవి విజయవంతం కాకుండా వ్యూహరచన చేస్తోంది. ఇందులో భాగంగా ఎక్కడికక్కడ నిర్బంధం పెంచనుంది. జిల్లా ఎస్పీలకు, పోలీసు కమిషనర్లకు ఈ మేరకు మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. ఎక్కడైనా నిరసనలు, బంద్ వంటివి విజయవంతమైతే అందుకు స్థానిక అధికారులతో పాటు ఉన్నతాధికారుల్నీ బాధ్యుల్ని చేస్తామంటూ హెచ్చరించింది. అసాధారణ పరిస్థితుల్లో మినహా ఈ తరహా నిరసనలకు సాధారణంగా అనుమతులు ఇస్తుంటారు. ప్రస్తుతం చంద్రబాబుకు, సర్కారుకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టడానికి ఎవరైనా అనుమతులు కోరితే.. వివిధ కారణాలను సాకుగా చూపి అనుమతులు నిరాకరించాలని పోలీసు విభాగాన్ని ప్రభుత్వం ఆదేశించింది. తప్పనిసరి పరిస్థితుల్లో అనుమతులిస్తే ఆయా పార్టీ శ్రేణులు మినహా సాధారణ ప్రజలు ఆయా నిరసనల్లో పాలు పంచుకోకుండా భద్రతా చర్యలు చేపట్టాలని ఆదేశించింది. ఎవరైనా బంద్‌కు పిలుపునిస్తే ఆయా ప్రాంతాల్లో బంద్‌కు నేతృత్వం వహించే, చురుకుగా పాల్గొనే వారిని ముందస్తు అరెస్టులు చేయాలని స్పష్టం చేసింది. వైఎస్సార్సీపీ ఆందోళనలపై కేసులు డోన్: ఓటుకు కోట్ల వ్యవహారంలో చంద్రబాబు తీరును నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో మంగళవారం ఆందోళనలు చేపట్టిన నేపథ్యంలో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. కర్నూలు జిల్లా డోన్ ఎమ్మెల్యే బి.రాజేంద్రనాథ్‌రెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు శ్రీరాములుతో పాటు 10 మంది కార్యకర్తలపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. ఈ మేరకు బుధవారం తెల్లవారుజామున కోట్రికె హరికిషన్, బి.ప్రసాద్, కేడీ ప్రభాకర్, మొలకన్న, సుదర్శన్‌రెడ్డి, రంగస్వామి గౌడ్లను అరెస్టు చేశారు. వీరిని కోర్టులో హాజరుపర్చగా మేజిస్ట్రేట్ బెయిల్‌కు అనుమతించారు. ఆదోనిలో 25 మందిపై : ఆదోని పాతబస్టాండ్ సర్కిల్లో ఆందోళన చేశారంటూ పోలీసులు 25 మందిపై కేసు నమోదు చేశారు. -
గీత రచయిత తామరై ఫిర్యాదు
తమిళసినిమా: గీత రచయిత తామరై మంగళవారం ఉదయం చెన్నై పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఒక ఫిర్యాదు చేశారు. ఇటీవల ఈమె తన భర్త త్యాగు తనను, తన కొడుకును వదిలేసి వెళ్లిపోయాడంటూ బహిరంగ పోరాటం చేశారు. తన ఇంటి వద్ద భర్త ఇంటి ముందు స్థానిక నుంగంబాక్కంలో గల వళ్లువర్‌కోట్టం వద్ద ధర్నా చేసి సంచలనం కలిగించారు. చివరికి కొందరు తమిళ రచయితలు కల్పించుకుని తామరైతో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించారు. భర్త త్యాగు తామరైతో కలిసి జీవించడానికి సమ్మతించారు. ఇలాంటి పరిస్థితిలో తామరై సోమవారం పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేయడం గమనార్హం. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఇటీవల తనకు బెదిరింపు ఫోన్‌కాల్స్ వస్తున్నాయన్నారు. ఫేస్బుక్లోను అసభ్య పద జాలాలతో బెదిరిస్తున్నారని తెలిపారు. అదే విధంగా కొందరు ఆగంతుకులు తన ఇంటి వద్ద తచ్చాడుతున్నారని వారెవరో ఎందుకు తన ఇంటి చుట్టూ తిరుగుతున్నారో తనకు బెదిరింపు కాల్స్ చేసేవారెవరో విచారించి తగిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నట్టు తెలిపారు. -
సీసీ కెమెరాలతో ప్రజలకు భరోసా
నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి బంజారాహిల్స్ : నగరంలో సీసీ కెమెరాల ఏర్పాటుతో ప్రజలకు భరోసా లభిస్తుందని నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి అన్నారు శనివారం ఫిలింనగర్ కాలనీలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఈయన ప్రారంభించారు. అనంతరం రామానాయుడు కళామండపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సంపన్నులు నివసించే ఫిలింనగర్ లాంటి ప్రాంతాల్లో కూడా చిన్న చిన్న వ్యాపారులు చేసుకునే సమాజ భద్రత కోసం సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. మన పిల్లలు విదేశాల్లో ఒంటరిగా ఉన్నా, క్షేమంగా ఉండటానికి అక్కడున్న ఉన్న వ్యవస్థే కారణమన్నారు. హైదరాబాద్‌లోనూ అలాంటి భరోసాను కల్పించే చర్యల్లో భాగంగానే కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. నగరాన్ని మరింత ఉన్నతంగా, రక్షణాత్మకంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందుకుగాను అభివృద్ధి చెందిన దేశాల్లో అమలులో ఉన్న విధానాలను అనుసరిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా డిసెంబర్‌లోగా నగరంలో లక్ష కెమెరాలను ఏర్పాటు చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఫిలించాంబర్ చుట్టు సీసీ కెమెరాల ఏర్పాటుకు ఫిలింనగర్ సొసైటీ రూ. 3.75 లక్షలు విరాళంగా ప్రకటించి అడ్వాన్స్‌గా రూ. 50 వేల చెక్కును సొసైటీ కార్యదర్శి కాజా సూర్యనారాయణ కమిషనర్‌కు అందజేశారు. అంతేకాకుండా క్లబ్ సమీపంలోని ఖాళీ స్థలంలో పోలీస్ స్టేషన్ నిర్మాణం చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో వెస్ట్‌జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు, బంజారాహిల్స్ ఏసీపీ ఉదయ్‌కుమార్‌రెడ్డి, ఇన్స్పెక్టర్ పి. మురళీకృష్ణ, ఎస్.ఐ గోవర్ధన్‌రెడ్డి, నటులు జీవిత రాజశేఖర్, నిర్మాత సురేష్‌బాబు, జి. ఆది శేషగిరిరావు, విజయ్‌చందర్ తదితరులు పాల్గొన్నారు. -
అన్నింటా..బెస్ట్
♦ బడ్జెట్లో ప్రత్యేక నిధులు ♦ పోలీస్ యంత్రాంగంలో కొత్త స్థైర్యం ♦ విస్తృత కార్యక్రమాలతో ప్రజలకు చేరువ ♦ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ గచ్చిబౌలి : ‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నక్సలిజం, తీవ్రవాదుల బెడద ఉంటుందని, భూములు కబ్జాలకు గురవుతాయనే అపోహలు సృష్టించారు. అయితే నూతన రాష్ట్రం ఏర్పడిన ఏడాదిలో ఆ అపోహలన్నీ పటాపంచలయ్యాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ శాంతిభద్రతలకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ యావత్ పోలీస్ సిబ్బందిలో ఆత్మస్థైర్యాన్ని నింపారు. నా 24 ఏళ్ల సర్వీస్‌లో ఎన్నడూ లేని విధంగా పోలీసు శాఖకు ప్రణాళిక బద్దమైన బడ్జెట్, వనరులు, సౌకర్యాలు సమకూర్చారు.సైబరాబాద్ కమిషనరేట్‌లో అనేక విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. ఈ చలానా, మూడు రోజుల్లో పాస్‌పోర్టు వెరిఫికేషన్, వాట్సప్ సౌకర్యం, ీషీ టీమ్స్ ఏర్పాటుతో పారదర్శకంగా, జవాబుదారితనంతో ఉండేం దుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, సైబరాబాద్ కమిషనర్ సీ.వీ.ఆనంద్ ‘సాక్షి’తో పేర్కొన్నారు. పెట్రోలింగ్ వ్యవస్థలో మార్పులు 60 లక్షల జనాభా, 3,700 కిలో మీటర్ల పరిధిలో విస్తరించిన సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 3 వేల మంది పోలీసులు, 2 వేల మంది హోంగార్డ్స్ సేవలందిస్తున్నారు. ప్రతి స్టేషన్‌కు ఐదు ఇన్నోవా కార్లు, బ్లూ కోల్ట్స్ ఇచ్చారు. రాత్రి వేళల్లో సెట్లో అందుబాటులో లేని అధికారులు, సిబ్బంది పనితీరును పరిశీలిస్తాం. వాహనాల్లో జీపీఎస్ సిస్టమ్, జాబ్ చార్ట్, పెట్రోల్ సిస్టిమ్‌ను పర్యవేక్షించేందుకు ఎఫ్‌ఆర్‌సీసీ నిఘా ఉంటుంది. దీంతో పది నిమిషాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటాం. భూ వివాదాలపై ఎస్ఓపీ విధానాన్ని ప్రవేశ పెట్టాం. ఎస్హెచ్ఓలు నిబంధనలు తప్పకుండా పాటించాలి. ఇందుకు సంబందించి ఇప్పటికే 650 కేసులు నమోదు చేశాం. నిబంధనలు పాటించని ఏసీపీ, సీఐలను సస్పెండ్ చేశాం. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ను బలోపేతం చేశాం. క్రెడిట్ కార్డ్‌ల ద్వారా చలానా చెల్లించవచ్చు. సైబరాబాద్‌లో సరైన అడ్రస్ లేని వాహనాలు ఉండటంతో నగదు చలానాకు ప్రాధాన్యత ఇస్తున్నాం. ట్రాఫిక్ స్పీడ్ గన్స్, బ్రీత్ ఎనలైజైర్స్, క్రెన్స్ కెమెరా, ట్రాఫిక్ ఆఫీసర్లకు బాడీ కెమెరాలు అమర్చి పారదర్శకంగా పనిచేస్తున్నాం. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పాస్‌పోర్ట్ వెరిఫికేషన్ మూడు రోజుల్లో పూర్తవుతుంది. ఐటీ కారిడార్‌లో మహిళల భద్రత కోసం షీ టీమ్స్ ఏర్పాటు చేశాం. ప్రతి పీఎస్‌లో ఉమెన్ హెల్ప్ డెస్క్, ఐటీ కారిడార్‌లో మహిళ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశాం. వాట్సాప్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చాం. ఇప్పటి కే 50 వేల మంది ఇందులో రిజిస్టర్ అయ్యారు. కమిషనరేట్ పరిధిలో ఏ ఘటన జరిగిన సమాచారంతో పాటు ఫోటోలు వస్తాయి. దీంతో అధికారులకు వేగంగా ఆదేశాలు ఇచ్చేందుకు వీలుంటుంది. -
సురక్షిత నగరంగా హైదరాబాద్
నగర పోలీస్ కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి కాచిగూడ : సురక్షిత నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దడానికి ప్రజలు సహకరించాలని నగర పోలీస్ కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి కోరారు. శుక్రవారం రాత్రి కాచిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో నగరంలోనే మొట్టమొదటి సారిగా బర్కత్‌పురలోని హౌజింగ్‌బోర్డు కాలనీలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. నగరంలో త్వరలోనే లక్ష సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆరు నెలలుగా నగరవాసులకు సీసీ కెమెరాలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. హౌసింగ్‌బోర్డు కాలనీ ప్రజలు ముందుకు వచ్చి తమ సొంత ఖర్చుతో 16 కెమెరాలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. బంజారాహిల్స్‌లో ఏర్పాటు చేసే మానిటరింగ్ సిస్టంతో నగరంలోని అన్ని కెమెరాలు కమాండ్ కంట్రోల్‌కు అనుసంధానమయ్యే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. కమాండ్ కంట్రోల్ సిస్టం కోసం ప్రభుత్వం రూ. వెయ్యి కోట్ల బడ్జెట్‌ను కేటాయించిందని అన్నారు. సీసీ కెమెరాలు జీహెచ్ఎంసీ, వాటర్ బోర్డు తదితర ప్రభుత్వ విభాగాలకు కూడా ఉపయోగపడేవిధంగా మానిటర్ చేస్తామన్నారు. కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు టి.శేషునారాయణ, అడిషనల్ సీపీ అంజన్‌కుమార్, డీసీపీ వి.రవీందర్, అడిషనల్ డీసీపీ ఎల్టీ చంద్రశేఖర్, కాచిగూడ ఏసీపీ సిహెచ్ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
నా పాటలను సొమ్ము చేసుకుంటున్నారు!
‘‘నా అనుమతి లేనిదే నా పాటలను వాడకూడదు’’ అని సంగీత జ్ఞాని ఇళయరాజా ఇప్పుడు కాదు.. ఎప్పట్నుంచో వాపోతున్నారు. అయినప్పటికీ రేడియో, టీవీ, అంతర్జాలం.. ఇలా ఎక్కడి పడితే అక్కడ ఆయన అనుమతి లేకుండా పాటలను వాడేసుకుంటున్నారు. లాభం లేదనుకుని, ఇళయరాజా ఆ మధ్య మద్రాస్ హైకోర్టు దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. ఆయన విన్నపాన్ని పరిశీలించి, ఇళయరాజా అనుమతి లేకుండా పాటలను ఎవరూ వినియోగించకూడదంటూ న్యాయస్థానం ఓ ఉత్తర్వు కూడా జారీ చేసింది. అయితే ఆ ఉత్తర్వును కూడా చాలామంది ఖాతరు చేయడంలేదు. దాంతో తన పాటలను వాడుకుంటున్న రికార్డింగ్ కంపెనీలను, రేడియో స్టేషన్లను, ఆన్లైన్ పైరసీని అడ్డుకోవడానికి అభిమానుల ద్వారా ఇళయరాజా చాలా ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ ఫలితం కనిపించలేదు. ఇక లాభం లేదనుకుని డీజీపీ, చెన్నై పోలీస్ కమిషనర్, తమిళనాడులోని అన్ని జిల్లాల్లో ఉన్న ఎస్ఐలకు లేఖ రాశారు. ‘‘నా పాటలను తస్కరిస్తున్నారు. నా అనుమతి లేకుండా సొమ్ము చేసుకుంటున్నారు. వారిపై చర్యలు తీసుకోవాలి’’ అని ఇళయరాజా కోరారు. ఇప్పుడైనా రాజాగారికి ఫలితం కనిపిస్తుందో? లేదో? -
సినీ పంపిణీదారుడిపై నటి వనిత ఫిర్యాదు
తమిళసినిమా: సినీ పంపిణీదారుడిపై నటి, నిర్మాత వనిత మంగళవారం పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. వనిత సీనియర్ నటుడు విజయకుమార్ కూతురన్న విషయం గమనార్హం. అనంతరం వనిత విలేకరులతో మాట్లాడుతూ తాను వనిత ఫిలిం ప్రొడక్షన్స్ అనే చిత్ర నిర్మాణ సంస్థను నెలకొల్పి ఎంజీఆర్, శివాజి, రజనీ, కమల్ నర్పణి మండ్రం అనే చిత్రాన్ని నిర్మించానన్నారు. ఈ చిత్ర పంపిణీ హక్కులను వెబ్రన్ మూవీస్ వెంకటేష్ రాజాకు ఇచ్చానని తెలిపారు. ఆయన తన చిత్రాన్ని 80 థియేటర్లలో విడుదల చేస్తానని ఒప్పందం కుదుర్చుకున్నారన్నారు. అలాగే చిత్ర ప్రచార ఖర్చు కంటూ 30 లక్షలను డిజిటల్ విధానంలో విడుదల చేయడానికంటూ ఎనిమిది లక్షలను తన నుంచి వెంకటేష్ రాజా తీసుకున్నారని చెప్పారు. చిత్రాన్ని అతి తక్కువ థియేటర్లలో విడుదల చేసి ఆయన ఒప్పందాన్ని మీరారని ఆరోపించారు. దీంతో నిర్మాతగా తనకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. అందువలన పంపిణీదారుడు వెంకటేష్‌రాజాను తాను ఇచ్చిన 38 లక్షలను తిరిగి చెల్లించాలని కోరుతూ ఆయనపై పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేసినట్లు నటి, నిర్మాత వనిత వెల్లడించారు. -
పోలీస్ కమీషనర్ ఎందుకెళ్లారు..?
-
జైపూర్ కమిషనర్‌గా పదేళ్ల బాలుడు
జైపూర్: రాజస్థాన్ లోని జైపూర్ పోలీస్ కమిషనర్‌గా పదేళ్ల బాలుడు బాధ్యతలు స్వీకరించారు. వెంట వెంటనే తన దిగువ అధికారులకు ఆదేశాలు జారీ చేశాడు. అదేంటి పదేళ్ల బాలుడు పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించడమా.. అని ఆశ్చర్యపోతున్నారా.. మరేంలేదు. రాజస్థాన్‌కు చెందిన గిరీశ్ శర్మ అనే బాలుడు గత కొద్ది కాలంగా తీవ్ర కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నాడు. అతని పరిస్థితి కాస్తంత విషాధంగానే ఉంది. అయితే, ఆ బాలుడికి ఐపీఎస్ చదివి పోలీస్ కమిషనర్ కావాలని కోరిక. అతడి కోరికను గుర్తించిన ప్రముఖ స్వచ్ఛంద సంస్థ మేక్ ఏ విష్ పౌండేషన్ ఈ విషయాన్ని పోలీస్ కమిషనర్ జంగా శ్రీనివాసరావుకు వివరించింది. దీంతో ఆయన అనుమతించి ఒకరోజు పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు అప్పగించి అతడి కోరికను తీర్చారు. బాధ్యతలు స్వీకరించిన వెంటనే ప్రత్యేక చాంబర్లో గిరీశ్ శర్మ సమావేశం ఏర్పాటు చేశాడు. కింది స్థాయి అధికారులతో మాట్లాడారు. అనంతరం చాలా ఫైళ్లపై సంతకాలు కూడా చేశాడు. అనంతరం వారందరి నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ దేశానికి ద్రోహం చేసేది ఎక్కువ దొంగలేనని వారిని అరెస్టు చేయడమే తన లక్ష్యమని ఈ సందర్భంగా చెప్పాడు. గిరీశ్ శర్మ మూడో తరగతి చదువుతున్నాడు. -
ఘరానా పోలీసులపై ఉక్కుపాదం
- పోలీసుల నేరాలు పెరుగుతుండటంతో నగర సీపీ రాకేశ్ మారియా నిర్ణయం - ట్రాక్ రికార్డు సరిగాలేని వారు బ్లాక్ లిస్టులోకి.. - ప్రజలతో సంబంధం లేని శాఖలకు బదిలీ సాక్షి, ముంబై: ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే నేరాలకు పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తుండటంతో ఈ విషయాన్ని నగర పోలీస్ కమిషనర్ రాకేశ్ మారియా సీరియస్‌గా తీసుకున్నారు. గలీజు పోలీసులపై ఉక్కుపాదం మోపేందుకు రంగం సిద్ధం చేశారు. తన ఆధీనంలో ఉన్న మొత్తం బలగాల చరిత్రను స్వయంగా పరిశీలించడం ప్రారంభించారు. అక్రమ సంబంధాలు, మద్యం బానిసలు, పని దొంగలుగా తేలిన పోలీసులను బ్లాక్ లిస్టులో పెట్టాలని నిర్ణయించారు. వీరందరినీ ప్రజలతో ప్రత్యక్షంగా సంబంధాలు లేని శాఖకు బదిలీ చేయనున్నారు. వివరాల్లోకెళితే.. ఇటీవల మాదకద్రవ్యాల అక్రమ రవాణా చేస్తున్న మహిళతో ఓ పోలీస్ కానిస్టేబుల్‌కు సంబంధాలున్నట్లు వెలుగులోకి రావడం, సాకినాకా పోలీసుస్టేషన్లో మోడల్‌పై పోలీసులు సామూహిక అత్యాచారానికి పాల్పడడం, వడాలాలో అత్యాచారం కేసులో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం తదితర సంఘటనలతో పోలీసు శాఖపై తీవ్ర విమర్శలు వ్యక్తం అయ్యాయి. దీంతో మలినమైన పోలీసు శాఖను శుభ్రం చేసేందుకు మారియా వినూత్న పథకానికి శ్రీకారం చుట్టారు. ‘కొందరు పోలీసుల నిర్వాకం వల్ల మొత్తం శాఖపై మచ్చ పడుతోంది. ఇలాంటి వారిని ఏరేసి మే నెలాఖరుకు జాబితా రూపొందిస్తామని మారియా అన్నారు. ట్రాక్ రికార్డ్ సరిగా లేని పోలీసులను సాయుధ, ప్రత్యేక దళాల శాఖలకు బదిలీ చేస్తామని మారియా తెలిపారు. ఫిర్యాదు చేయడానికి పోలీసు స్టేషన్‌కు వచ్చిన బాధితులతో ఎలా ప్రవర్తించాలి..? ఎలా మాట్లాడాలి..? వంటి వాటిపై శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని పోలీసు స్టేషన్లలో ఇప్పటికే ప్రారంభించామని చెప్పారు. వృద్ధులు స్టేషన్‌కు వస్తే పరిధిలోకి రాదంటూ వేధించకుండా, ఫిర్యాదు నమోదు చేసుకుని వారి పంపించాలని సూచించినట్లు చెప్పారు. ట్రాఫిక్ శాఖలో పనిచేస్తున్న 25 మంది కానిస్టేబుళ్లను పనితనం సరిగా లేకనే బదిలీ చేశామని, ఎవరి ఫిర్యాదు మేరకు చేయలేదని ఆయన వివరణ ఇచ్చారు. -
సీసీఎస్‌లో ఐదుగురిపై వేటు
సాక్షి, హైదరాబాద్: రాజధానిలోని సెంట్రల్ క్రైమ్ స్టేషన్(సీసీఎస్)లో అక్రమాలను వెలుగులోకి తెస్తూ ‘సాక్షి’లో వచ్చిన కథనాలపై నగర పోలీస్ కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. అవినీతికి పాల్పడిన సీసీఎస్‌లోని ఐదుగురు పోలీసు అధికారులను సస్పెండ్ చేశారు. ఈ మేరకు బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ అయ్యాయి. సస్పెండైన వారిలో ఇద్దరు ఇన్స్పెక్టర్లు, సబ్ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ సబ్ఇన్స్పెక్టర్, హెడ్‌కానిస్టేబుల్ ఉన్నారు. సీసీఎస్‌కు చెందిన ఆటో మొబైల్ టీం(ఏటీఎం) ఇన్స్పెక్టర్ తుమ్మపూడి శ్రీనివాస ఆంజనేయప్రసాద్, సబ్ఇన్స్పెక్టర్ జి.శ్రీనివాస్, అసిస్టెంట్ సబ్ఇన్స్పెక్టర్ ఆర్.ఎం.గురునాథుడు, హెడ్‌కానిస్టేబుల్ ఎ.మోహన్లతో పాటు సీసీఎస్ వైట్ కాలర్ అఫెన్స్ టీం ఇన్స్పెక్టర్ మధుమోహన్ అవినీతికి పాల్పడినట్లు విచారణలో తేలింది. విచారణాధికారులు బుధవారం సాయంత్రం కమిషనర్ మహేందర్‌రెడ్డికి నివేదిక సమర్పించారు. దీంతో వారిపై ఆయన సస్పెన్షన్ వేటు వేశారు. నెల రోజుల క్రితమే ఇన్‌కమ్‌ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్‌ను బెదిరించి అతని ఆస్తులను బలవంతంగా మరొకరి పేరుపై రిజిస్ట్రేషన్ చేయించిన వ్యవహారంలో ఇదే సీసీఎస్‌లో పనిచేస్తున్న ఇన్స్పెక్టర్ను కూడా కమిషనర్ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా పోలీసులు రికవరీ చేసిన వాహనాల మాయంపై ‘సాక్షి’లో వచ్చిన వరుస కథనాలపై ఆయన స్పం దించారు. 60 ఠాణాల పరిధిలో రికవరీ వాహనాలపై ఆరా తీయడంతో పలువురు పోలీసులు అక్రమంగా వాడుతున్న 140 వాహనాలు తిరిగి ఠాణాలకు చేరుకున్నాయి. -
పోలీస్ కమిషనర్‌కు శరవణన్ ఫిర్యాదు
నటుడు శరవణన్ బుధవారం ఉదయం నగర పోలీసు కమిషనర్‌ను కలిసి ఫిర్యాదు లేఖను అందించారు. తంబిదురై, తాయ్ మనసు తదితర చిత్రాల్లో హీరోగా నటించిన నటుడు శరవణన్. ప్రస్తుతం ఈయన వివిధ రకాల పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవల ఆంధ్రరాష్ట్రం శేషాచలం ప్రాంతంలో ఎర్రచందనం స్మగ్లింగ్ వ్యవహారం ఇరు రాష్ట్రాల్లో తమిళనాడు, ఆంధ్ర, కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ స్మగ్లింగ్ కేసులో నటుడు శరవణన్ మంగళవారం రాత్రి పోలీసులు అరెస్టు చేశారనే ప్రచారం వాట్సాప్‌లో హల్చల్ చేసింది. దీంతో దిగ్భ్రాంతికి గురైన శరవణన్ బుధవారం చెన్నై నగర పోలీసు కమిషనర్‌కు కలిసి వాట్సాప్‌లో అసత్య ప్రచారంపై ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తాను ప్రస్తుతం చెన్నైలో జరుగుతున్న షావుకారపేట్టై అనే చిత్రం షూటింగ్లో పాల్గొంటున్నానని తెలిపారు. తనను పోలీసులు అరెస్టు చేశారన్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. తాను అన్నాడీఎంకే పార్టీ ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నానని తెలిపారు. వాట్సాప్‌లో తనపై జరుగుతున్న దుష్ర్పచారంపై తగిన చర్యలు తీసుకోవాలని పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేసినట్లు నటుడు శరవణన్ వెల్లడించారు. -
గ్రేటర్లో గులాబీ జోష్!
► ప్లీనరీకి విస్తృత ఏర్పాట్లు.. ► వేదికల ఏర్పాటు బాధ్యత నగర మంత్రులకే.. ► సిటీ అంతటా గులాబీ తోరణాలు,ఫ్లెక్సీలు, కటౌట్లే.. సాక్షి, సిటీబ్యూరో : తెలంగాణ ఆవిర్భావం తర్వాత టీఆర్ఎస్ పార్టీ ఈ నెల 24న ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్లీనరీ నేపథ్యంలో గ్రేటర్ నగరం గులాబీ వనంలా మారింది. మహానగరంలో ప్రధాన రహదారులు, కూడళ్లు పార్టీ జెండాలు, తోరణాలు,ఫ్లెక్సీలు, కటౌట్లతో నిండిపోయింది. తెలంగాణాలోని పది జిల్లాల నుంచి నగరానికి చేరుకునే ముఖ్య నాయకులు, కార్యకర్తలకు ఘనస్వాగతం పలికేందుకు ఆయా జిల్లాల నుంచి నగరంలోకి ప్రవేశించే రహదారులపై 150 వరకు భారీ స్వాగత ద్వారాలు ఏర్పాటు చేస్తున్నారు. సుమారు 75 వేల భారీ గులాబీ జెండాలు, 50 వేల చిన్న జెండాలు, 50 లక్షల పార్టీ తోరణాలతో నగరాన్ని ముస్తాబు చేస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు మిషన్ కాకతీయ, వాటర్‌గ్రిడ్, ఆసరా పింఛన్లు వంటి పథకాలపై 400 భారీ హోర్డింగ్స్ ఏర్పాటు చేశారు. ఎల్బీస్టేడియం కూడా గులాబీ వర్ణ శోభితమైంది. ఎల్బీ స్టేడియంలో ఎక్సైజ్‌శాఖ మంత్రి పద్మారావు భారీ స్టేజి ఏర్పాటు పనులను పర్యవేక్షిస్తున్నారు. ఈనెల 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పరేడ్ గ్రౌండ్స్‌లో ఏర్పాటుచేయనున్న బహిరంగ సభ ఏర్పాట్లను ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లు పర్యవేక్షిస్తున్నారు. బుధవారం రవాణాశాఖమంత్రి మహేందర్‌రెడ్డి, ఇతర ముఖ్యనేతలు ఎల్బీస్టేడియంలో ప్లీనరీ ఏర్పాట్లను పరిశీలించారు. గ్రేటర్ టీఆర్ఎస్లో ఉత్సాహం మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుకు ఇటీవలే పార్టీ అధ్యక్ష బాధ్యతలను అప్పగించడంతో గ్రేటర్ గులాబీ దళంలో జోష్ మొదలైంది. ఆయన నేతృత్వంలో పార్టీలోని అన్ని వర్గాలను, గ్రూపులను కలుపుకొనిపోవడంతోపాటు రాబోయే బల్దియా ఎన్నికలో సత్తా చాటడమే లక్ష్యంగా ముందుకెళుతున్నామని, ముందుగా ప్లీనరీని విజయవంతం చేసేందుకు శాయశక్తులా కృషిచేస్తున్నామని గ్రేటర్ టీఆర్ఎస్ ముఖ్యనేతలు చెబుతున్నారు. 2 వేల మంది పోలీసులతో బందోబస్తు : కమిషనర్ మహేందర్‌రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీ సమావేశాలకు 2000 మంది పోలీసులతో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి తెలిపారు. ఉన్నతాధికారులతో కలిసి బుధవారం ఆయన ఎల్బీస్టేడియాన్ని సందర్శించారు. అదనపు పోలీసు కమిషనర్ అంజనీకుమార్, డీసీపీలు కమలాసన్‌రెడ్డి, సుధీర్‌బాబులతో కలిసి ఏర్పాట్లను సమీక్షించారు. 24 గంటలు బందోబస్తును పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా అధికారులను నియమించారు. ప్లీనరీకి వచ్చే వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేక ప్రదేశాలను కేటాయించారు. నిజాం కళాశాల, పబ్లిక్ గార్డెన్, ఎన్టీఆర్ స్టేడియం, ఇందిరాపార్క్ తదితర కేటాయించిన ప్రాంతాలలోనే వాహనాలను పార్కింగ్ చేయాలని సూచించారు. -
ఉల్లంఘనులు
♦ ఫొటోగ్రాఫర్లుగా మారిన ట్రాఫిక్ పోలీసులు ♦ వీడియోలు, ఫొటోలతో నగరంలో హల్చల్ ♦ అస్తవ్యస్తంగా మారుతున్న ట్రాఫిక్ ♦ బందరురోడ్డులో అర్థంలేని నిబంధనలతో వాహనదారుల అవస్థలు నగరంలో తాజా ట్రాఫిక్ నింబధనలు పోలీసుల పనితీరును ప్రశ్నిస్తున్నాయి. ట్రాఫిక్ పోలీసుల చేతిలో కెమెరాలు పెట్టి ఇష్టానుసారంగా ఫొటోలు తీయించి జరిమానాలు విధించడం, బందరురోడ్డులో అర్థంలేని ట్రాఫిక్ నిబంధనలు విమర్శలకు తావిస్తున్నాయి. స్వామిభక్తి ప్రదర్శించి ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదాయం సమకూర్చేందుకు పోలీసులు కావాలనే ఇలాంటి ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాహనదారులు పేర్కొంటున్నారు. సాక్షి ప్రతినిధి, విజయవాడ : ట్రాఫిక్ పోలీసులంటే ప్రజలకు రక్షణ కల్పించేవారు.. ప్రమాదాలు జరగకుండా, ప్రయాణాలు సజావుగా సాగేందుకు చర్యలు తీసుకునే రక్షకభటులు. కానీ, నగరంలో పరిస్థితి చూస్తే మాత్రం ట్రాఫిక్ పోలీసులంటే ఫొటో, వీడియోగ్రాఫర్లే గుర్తొస్తారు. చోద్యంగా ఉన్నా ఇది నిజమే. ట్రాఫిక్ ఉల్లంఘనుల ఆట కట్టించేందుకు, నిబంధనలను తప్పనిసరిగా పాటించేందుకు నగర పోలీస్ కమిషనర్ వీరి చేతిలో కెమెరాలు పెట్టారు. నిబంధనలు అతిక్రమించే వారిని ఫొటో తీసి వారి వాహనం నంబరు ఆధారంగా ఇంటికే జరిమానా చలానాలు పంపించే ఈ విధానాన్ని గత నెలలో ప్రారంభించారు. అయితే, ట్రాఫిక్ పోలీసులు రోడ్లపై తీస్తున్న ఫొటోలకు చిక్కకుండా తప్పించుకునే పనిలో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. రెడ్‘సిగ్నల్’ వ్యవస్థ నగరంలోని ప్రధాన కూడళ్లలో సిగ్నల్స్ ఒక్కటి కూడా సక్రమంగా పనిచేయట్లేదు. కొన్నిచోట్ల సిగ్నల్ సెంటర్లలో ఎల్లో లైట్లు లేవు. నేరుగా రెడ్‌లైట్ పడిపోతోంది. మరికొన్ని చోట్ల వాహనాలు రోడ్డు మధ్యలో ఉండగానే రెడ్‌సిగ్నల్ పడిపోతోంది. అదే సమయంలో వేరే వైపు నుంచి వచ్చే వాహనాలు బయల్దేరడం, ఒకరికి ఒకరు ఎదురుపడటంతో ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారుతోంది. అర్థంలేని నిర్ణయాలతో హడావుడా..! బందరురోడ్డులోని డీవీ మనార్ నుంచి స్వీట్ మ్యాజిక్ వైపునకు వెళ్లే వాహనాల సంఖ్య ఇటీవల పెరిగింది. గతంలో ఇక్కడ బందర్‌రోడ్డు క్రాస్ చేసేందుకు 15 సెకన్ల సిగ్నల్ సమయాన్ని మాత్రమే ఇచ్చేవారు. దీనిని కనీసం 30 సెకన్లకు పెంచితే ట్రాఫిక్ తగ్గేది. ఇదంతా ఎందుకనుకున్న ట్రాఫిక్ పోలీసులు ఏకంగా డీవీ మనార్, పీవీపీ వద్ద రోడ్డు క్రాసింగ్ రద్దుచేశారు. తాజా నిర్ణయంతో డీవీ మనార్ నుంచి స్వీట్ మ్యాజిక్ వైపునకు రావాలంటే బెంజిసర్కిల్ వరకు వెళ్లి తిరిగి రావాలి. స్వీట్ మ్యాజిక్ నుంచి డీవీ మానర్‌కు వెళ్లాలంటే పీవీపీ వద్దకు వెళ్లి రోడ్డు క్రాస్ చేసి రావాలి. 20 సెకన్లలో రోడ్డు దాటే పద్ధతికి స్వస్తిచెప్పి ఏకంగా ఐదు నిమిషాల పాటు కిలోమీటరున్నర తిరిగొచ్చేలా అధికారులు నిర్ణయించారు. దీంతో బిజీ సమయంలో వాహనదారులు అష్టకష్టాలు పడుతున్నారు. వన్‌వేలు, నో పార్కింగ్లు ఎక్కడ సార్? ♦ నగరంలో వన్‌వేలు, నో పార్కింగ్ స్థలాలు ఎక్కడ ఉన్నాయో కూడా తెలియని పరిస్థితి. మచ్చుకైన హెచ్చరిక బోర్డులు కనిపించవు. నగరానికి కొత్తగా వచ్చిన వారైతే ఎటు వెళ్లాలో కూడా సమాచారం ఉండదు. ♦ ఇంతా జరుగుతున్నా ట్రాఫిక్ పోలీసులు మాత్రం కెమెరాలు పట్టుకుని ఫొటోలు తీసేస్తూ తమ పని తాము చేసుకుంటున్నారు. హెచ్చరికల బోర్డులు లేనపుడు ఫొటోలు తీసి జరిమానాలు ఎలా విధిస్తారని వాహనదారులు ప్రశ్నిస్తున్నారు. తప్పొకరిది.. జరిమానా వేరొకరికా..? వాహనదారుడి స్నేహితుడు కావచ్చు.. బంధువు కావచ్చు.. తెలిసిన మరెవరైనా కావచ్చు. ఏదైనా పనిమీద అర్జెంటుగా వెళ్లాల్సి రావచ్చు. అటువంటి సమయాల్లో పక్కవారి వాహనాలు వాడుకోవడం కొత్తేమీ కాదు. నగర పోలీసుల కొత్త చట్టం ప్రకారం వాహనం ఎవరు నడిపినా శిక్ష మాత్రం వాహన యజమానికే చలానా రూపంలో వెళ్లిపోతోంది. ఇది ఎంతవరకు సబబని పలువురు ప్రశ్నిస్తున్నారు. 150 కెమెరాలు, 26 వీడియో కెమెరాలు నగరంలో ఏఎస్ఐ, కానిస్టేబుల్ స్థాయివారు ఫొటోలు తీసే కార్యక్రమాన్ని చేపట్టారు. సీఐ స్థాయి నుంచి పైఅధికారులతో పోలీస్ కమిషనర్ వీడియో కెమెరాల బృందాలను ఏర్పాటుచేశారు. వీరంతా నగరంలోని 26 ప్రాంతాల్లో వీడియోలు తీయడం, జరిమానాలు విధించడం చేస్తున్నారు. ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చెప్పాల్సిన అధికారులు ఇలా తిరుగుతుండటంతో జనం నవ్వుకుంటున్నారు. బందరురోడ్డుపై ఆంక్షలు ఎవరి కోసం..? బందరురోడ్డులో ఇటీవల అమలుచేస్తున్న ట్రాఫిక్ నిబంధనలు స్వామిభక్తి కోసమేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రోడ్డును నేరుగా దాటే కార్యక్రమానికి స్వస్తిచెప్పి ఊరంతా తిరిగొచ్చేలా పోలీసులు ప్లాన్ వేసి అమలుచేస్తున్నారు. సీఎం చంద్రబాబుకు పోరంకిలో నివాస గృహం నిర్మితం కానుంది. ముందు నుంచే జనానికి ట్రాఫిక్ ఆంక్షలు అలవాటు చేసేందుకు పోలీసులు తీసుకున్న నిర్ణయాల్లో భాగమే ఇదని వాహనదారులు పేర్కొంటున్నారు. ఖజానా నింపుకొనేందుకేనా? పోలీసులు ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెట్టే పనుల్లో భాగమే ఈ ట్రాఫిక్ చర్యలని సమాచారం. నెలకు కోటి రూపాయల వరకు ప్రభుత్వ ఖజానాకు జమ చేసేందుకు చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే పోలీసులు ఫొటోలు, వీడియోల ద్వారా రోజుకు కనీసంగా 500 మంది నుంచి జరిమానాలు వసూలు చేస్తున్నారు. -
పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేస్తే..
హైదరాబాద్: q తమ సిబ్బంది పాస్‌పోర్ట్ వెరిఫికేషన్‌కు దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లిన సమయంలో కొందరు ఉండడం లేదని, దీంతో విచారణ పెండింగ్‌లో పడుతోందన్నారు. చెన్నై, బెంగళూరు, ఢిల్లీ తదితర నగరాల్లో ఉద్యోగాలు చేస్తున్న నగరవాసులు పాస్‌పోర్ట్ కోసం హైదరాబాద్‌లో దరఖాస్తు చేసుకుని మరుసటి రోజే నగరం విడిచి వెళ్తున్నారని, ఇలాంటి వారు మూడు రోజులు ఇంటి వద్దగానీ, నగరంలోగానీ ఉంటే పాస్‌పోర్ట్ వెరిఫికేషన్ చేసేందుకు వీలు కలుగుతుందని అన్నారు. పాస్‌పోర్ట్ క్లియరెన్స్ ఒక్కోసారి 24 గంటల్లోనే పూర్తవుతోందని, కొన్ని సందర్భాల్లో మూడు రోజులకు మించడం లేదని చెప్పారు. ప్రస్తుతం నగరంలో పాస్‌పోర్ట్ దరఖాస్తులేవీ పెండింగ్‌లో లేవని స్పష్టం చేశారు. ఎఫ్‌వీవోలకు నెలకు 30 లీటర్ల పెట్రోల్.. స్పెషల్ బ్రాంచ్ ఫీల్డ్ వెరిఫికేషన్ ఆఫీసర్స్(ఎఫ్‌వీవోలు) సొంత బైక్‌పై వెళ్లి పాస్‌పోర్ట్ దరఖాస్తుల విచారణ చేపట్టేవారు. వారికి పోలీసులకు ఇచ్చే విధంగానే నెలకు పెట్రోల్ అలవెన్స్ కింద ప్రభుత్వం రూ.200 ఇచ్చేది. చాలీచాలని అలవెన్స్‌లు ఇవ్వడంతో పాస్‌పోర్ట్ దరఖాస్తుదారుడి నుంచి ఎంతో కొంత డబ్బు ఆశించేవారు. ఇటీవల నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి దరఖాస్తుదారుల నుంచి డబ్బులు తీసుకోవద్దని ఆదేశించారు. అయితే విధి నిర్వహణలో బైక్‌పై తిరిగితే ప్రభుత్వం నెలకు ఇచ్చే రూ.200 సరిపోదని తెలుసుకున్న ఉన్నతాధికారులు.. వారికి నెలకు 30 లీటర్ల పెట్రోల్ ఇచ్చేందుకు నిర్ణయించారు. మార్చి నుంచి ఈ అలవెన్స్‌లు ఇస్తున్నారు. కాగా, త్వరలో స్పెషల్ బ్రాంచ్‌కు తొలి విడతలో 44 కొత్త బైక్‌లు రానున్నాయి. వీటిని బాగా పనిచేసిన వారికి ఇచ్చేందుకు ఎఫ్‌వీవోల గ్రేడింగ్‌ను అధికారులు పరిశీలిస్తున్నారు. -
‘పోలీసు స్కాన్’
ఖాకీల పనితీరుకు ప్రజల మార్కులు లా అండ్ ఆర్డర్‌కు 42 శాతం స్పెషల్ బ్రాంచ్‌కు 70 శాతం మొదటి స్థానంలో కాలాపత్తర్ చివరి స్థానంలో మాదన్నపేట ఠాణా సిటీబ్యూరో: పోలీసుల పనితీరుకు నగర ప్రజలు ఇచ్చిన మార్కుల ఫలితాలను పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి మూల్యాంకనం చేస్తున్నారు. ప్రజలకు ఉత్తమ సేవలందించడంలో ముందు వరుసలో ఉన్న ఠాణాలతో పాటు పూర్తిగా వెనకబడిపోయిన ఠాణాలను సైతం ఆయన గుర్తించారు. పనితీరు సరిగా లేని ఠాణా సిబ్బందిని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు. రాబోయే రోజుల్లో పనితీరును మెరుగుపర్చుకుని ప్రజలతో శభాష్ అనిపించుకోవాలని లేకుంటే బదిలీ వేటు పడుతుందని పేర్కొన్నారు. గతడాది ఆగస్టు 25 నుంచి ప్రత్యేక కాల్ సెంటర్ ద్వారా బాధితులు, ఫిర్యాదుదారులకు నేరుగా ఫోన్ చేసి పోలీసుల పనితీరుపై ఆరా తీయడం మొదలు పెట్టిన విషయం తెలిసిందే. ఆరు నెలల పాటు సాగిన ఈ వ్యవహారంలో మూడు నెలలకు ఒకసారి ఠాణాల గ్రేడింగ్‌ను తీశారు. ఈ ఏడాది జనవరి 31వ తేదీ వరకు శాంతి భద్రతల విభాగం పోలీసుల సేవలకు 42 శాతం సంతృప్తి వ్యక్తం చేయగా, స్పెషల్ బ్రాంచ్ విభాగం పనితీరుపై మాత్రం 70 శాతం మార్కులు వేశారు నగర పౌరులు. ప్రజలకు మేలైన సేవలందించడంలో మొదటి స్థానంలో సౌత్‌జోన్‌లోని కాలాపత్తర్ పోలీసు స్టేషన్ ఉండగా, చివరి స్థానాన్ని మాదన్నపేట దక్కించుకుంది. ఆరా తీసి మార్కులు... కాల్సెంటర్లో ప్రైవేటు వ్యక్తులుంటారు. వీరు బాధితులు/ఫిర్యాదుదారులకు నేరుగా ఫోన్ చేసి ‘‘ ఫిర్యాదు రాసేందుకు రాణాలో రిసెప్షనిస్టు సహకరించారా? లేదా?, ఫిర్యాదు స్వీకరించే సమయంలో పోలీసులు ఎలా వ్యవహరించారు, డబ్బు డిమాండ్ చేశారా, ఎఫ్ఐఆర్ నమోదు చేశారా, నిందితులను అరెస్టు చేశారా’’ అని అడుగుతారు. ఇలా సేకరించిన వివరాలతో పోలీసుల పని తీరుపై మూడు నెలలకు ఒకసారి ఠాణాలకు గ్రేడింగ్ ఇస్తారు. మొదటి మూడు నెలల్లో ఠాణాలకు సగటున 46 శాతం మార్కులు రాగా, రెండో దశలో 42 శాతం మార్కులు వచ్చాయి. మొదటి మూడు స్థానాలు... మొదటి దశ ఫలితాల్లో మొదటిస్థానంలో గోపాలపురం, రెండో స్థానంలో కాలాపత్తర్, ఎస్ఆర్నగర్, మూడో స్థానంలో తిరుమలగిరి ఠాణాలు వచ్చాయి. ఇక రెండో దశ ఫలితాల్లో మొదటిస్థానంలో కాలాపత్తర్, రెండో స్థానంలో కంచన్‌బాగ్, ఆసిఫ్‌నగర్, మూడో స్థానంలో బొల్లారం ఉంది. చివరి మూడో స్థానంలో... మొదటి దశ ఫలితాల్లో చివరి స్థానంలో 5 శాతంతో బేగంపేట మహిళా పీఎస్, 31 శాతంతో చంద్రాయణగుట్ట, 32 శాతంతో రెయిన్‌బజార్ ఉంది. రెండో దశ ఫలితాల్లో 31 శాతంతో మాదన్నపేట, 33 శాతంతో మలక్‌పేట, ఫలక్‌నుమా, 34 శాతంలో చాదర్‌ఘాట్ ఠాణాలు చివరి స్థానాల్లో నిలిచాయి. ఎస్బీపై 70 శాతం సంతృప్తి... స్పెషల్ బ్రాంచ్ విభాగం పోలీసు సేవలపై 70 శాతం ప్రజలు తమ సంతృప్తిని వ్యక్తపరిచారు. మొదటి దశలో ఇది కేవలం 42 శాతం మాత్రమే ఉండే. రెండో దశకు వచ్చేసరికి 27 శాతాన్ని పెంచుకుంది ఎస్బీ. రెండో దశలో 1442 మంది పాస్‌పోర్టు దరఖాస్తుదారులకు కాల్‌సెంటర్ ద్వారా ఫోన్ చేయడంతో ఈ ఫలితాలు ఇలా వచ్చాయి. మొదటి దశలో ఓ అధికారి జీరో శాతం ఉండగా రెండో దశకు వచ్చే సరికి 70 శాతం మార్కులను సాధించడం గమనార్హం. ట్రాఫిక్ విభాగంపై కూడా.. ఇప్పటి వరకు శాంతి భద్రతలు, స్పెషల్ బ్రాంచ్ విభాగాలపైనే ఫీడ్‌బ్యాక్ తీసుకున్న నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి ట్రాఫిక్ విభాగంపై కూడా దృష్టి సారించారు. ట్రాఫిక్ పోలీసుల పనితీరుపై కాల్‌సెంటర్ నుంచి ఫోన్ చేసే ప్రక్రియ వారం రోజుల క్రితం మొదలైంది. -
వాట్సప్ 94906 17444
సైబరాబాద్ పోలీసుల ప్రయోగం నేరాల అడ్డుకట్టకు యత్నం అందుబాటులోకి కొత్త నెంబర్ పౌర పోలీసు సేవలను ప్రారంభించిన కమిషనర్ సిటీబ్యూరో: అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ... ప్రజల భాగస్వామ్యంతో నేరాలను అదుపు చేసే దిశగా సైబరాబాద్ పోలీసులు మరో అడుగు ముందుకేశారు. ఇందులో భాగంగా వాట్సప్ సేవలను వినియోగించుకోనున్నారు. దీని కోసం సెల్‌ఫోన్ నెంబర్ 94906 17444ను అందుబాటులోకి తీసుకొచ్చారు. పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ తన కార్యాలయంలో శుక్రవారం దీన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పోలీసు సేవలు ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ఈ నెంబర్ ఉపకరిస్తుందని చెప్పారు. బాధితులు ఎప్పుడైనా వాట్సప్ ద్వారా తమకు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. అసాంఘిక శక్తులు, అనుమానిత వ్యక్తులు, ట్రాఫిక్ సమస్యలపై పౌర పోలీసులు స్పందించి వాట్సప్ ద్వారా తెలియజేస్తే వెంటనే పోలీసులు స్పందించేందుకు వీలు కలుగుతుందన్నారు. గుర్తు తెలియని మృతదేహాలు లభ్యమైనప్పుడు, మిస్సింగ్ కేసులు, రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్న సమయంలో వాట్సప్ ద్వారా ఫొటోలు షేర్ చేసుకుంటే కేసు దర్యాప్తు వేగవంతమవడంతో పాటు మిస్టరీలు వీడే అవకాశం ఉంటుందన్నారు. బాధితులకు సకాలంలో న్యాయం చేసేందుకు వీలు కలుగుతుందన్నారు. ప్రజల సహకారం ఉంటే శాంతి భద్రతలు, ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించగలమన్నారు. 551 మందికి... సైబరాబాద్‌లోని ఎస్ఐ స్థాయి నుంచి కమిషనర్ వరకు సుమారు 551 మందికి వాట్సప్ సౌకర్యం కల్పించామని సీవీ ఆనంద్ వివరించారు. వీరందరి వద్ద ఇంటర్నెట్ సౌకర్యం కలిగిన స్మార్ట్ఫోన్లు ఉంటాయన్నారు. ఇదే నెంబర్‌తో వాట్సప్‌లో 10 గ్రూప్‌లను చేర్చామని తెలిపారు. లా అండ్ ఆర్డర్ గ్రూప్‌లో 69 మంది, క్రైమ్ గ్రూప్‌లో 99, ట్రాఫిక్ గ్రూప్‌లో 79, సీఏఆర్, సీఎస్‌డబ్ల్యూ గ్రూప్‌లో 50 మంది, మీడియా గ్రూప్‌లో 56 మంది, మాదాపూర్ జోన్ గ్రూప్‌లో 51 మంది, బాలనగర్ జోన్ గ్రూప్‌లో 36 మంది, ఎల్బీనగ ర్ జోన్ గ్రూప్‌లో 66 మంది, శంషాబాద్ జోన్ గ్రూప్‌లో 40, మల్కాజ్గిరి జోన్ గ్రూప్‌లో 36 మంది పోలీసులను చేర్చినట్టు చెప్పారు. ఈ గ్రూప్లన్నింటికి 94906 17444 అడ్మిన్ నెంబర్‌గా ఉంటుంది. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని ఏ సమస్యలనైనా వాట్సప్ ద్వారా తెలియజేయవచ్చని కమిషనర్ తెలిపారు. ఫిర్యాదును సంబంధిత పోలీసు గ్రూప్‌లకు పంపించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. నేరాలు, మహిళలకు వేధింపులు, ఈవ్‌టీజింగ్, ట్రాఫిక్, శాంతి భద్రతలకు సంబంధించిన ఫిర్యాదులు, సలహాలు, సూచనలను మెసేజ్‌ల ద్వారా ఆడియో, వీడియో, క్లిప్పింగ్‌ల రూపంలో ప్రజలు పంపించవచ్చు. పోలీసుల అక్రమాలు, మంచి పనులు కూడా వాట్సప్‌కు పంపించవచ్చని కమిషనర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ పోలీసు కమిషనర్ టి.వి.శశిధర్‌రెడ్డి, అదనపు డీసీపీ ప్రతాప్‌రెడ్డి, ఏసీపీ రవీందర్ రెడ్డి, జి.పి.వాసుసేన, అడ్మిన్ ఇన్స్పెక్టర్ ఆనంద్‌రెడ్డి, సుధీర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ట్రాఫిక్‌పైనే దృష్టి
సిబ్బంది రహిత నియంత్రణ నైట్ ఆపరేషన్ ఆగలేదు మోటారు సైకిళ్ల చోరీలను ఉపేక్షించేది లేదు సింగపూర్ శిక్షణ స్ఫూర్తిదాయకం విలేకరుల సమావేశంలో సీపీ వెంకటేశ్వరరావు విజయవాడ సిటీ : నగరంలోని ట్రాఫిక్ సమస్యపై వచ్చేవారం నుంచి ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు పోలీస్ కమిషనర్ ఏబీ వెంకటేశ్వరరావు చెప్పారు. శుక్రవారం సాయంత్రం కమిషనరేట్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో డీసీసీ అశోక్ కుమార్‌తో కలిసి ఆయన మాట్లాడారు. సిబ్బంది రహిత ట్రాఫిక్ నియంత్రణ చేపట్టాలని నిర్ణయించినట్టు చెప్పారు. ఇందులో భాగంగానే రోడ్లపై ట్రాఫిక్ విధులు నిర్వహించే 150 మంది కానిస్టేబుళ్లకు కెమెరాలు ఇచ్చి నిబంధనల ఉల్లంఘనులను గుర్తిస్తామన్నారు. రాంగ్ పార్కింగ్, సిగ్నల్ జంపింగ్ వంటివి కెమెరాల్లో బంధించి ఈ-చలానా ద్వారా కాంపౌండింగ్ ఫీజు వసూలు చేస్తామని సీపీ తెలిపారు. తద్వారా పోలీసులకు, వాహనదారులకు మధ్య ఘర్షణ వాతావారణం నిలువరించి స్వచ్ఛందంగా ట్రాఫిక్ నిబంధనలు పాటించేలా చేయడమే తమ అభిమతమని పేర్కొన్నారు. మద్యం మత్తులో వాహనాలు నడిపే వారిని సీనియర్ పోలీస్ అధికారుల సమక్షంలో తనిఖీలు చేస్తామని తెలిపారు. ఆర్సీ పుస్తకం, డ్రైవింగ్ లెసైన్స్ తనిఖీలు వంటివి అవినీతికి ఆస్కారం లేని రీతిలో పారదర్శకంగా ఉంటాయని సీపీ వివరించారు. నైట్ ఆపరేషన్ ఆగదు నైట్ ఆపరేషన్ చేసినప్పుడు అల్లరి గ్యాంగులు, బ్లేడ్‌బ్యాచ్ సభ్యులు కనిపించలేదని సీపీ పేర్కొన్నారు. ఇటీవల పోలీసులు ఆ పని చేయడం లేదనే ప్రచారంతో తిరిగి తమ కార్యకలాపాలు ప్రారంభించారన్నారు. తాము నైట్ ఆపరేషన్ ఆపలేదని, విధుల నిర్వహణలో భాగంగా రాత్రి గస్తీలు, పెట్రోలింగ్ యథావిధిగానే నిర్వహిస్తున్నామని చెప్పారు. నైట్ ఆపరేషన్ కొనసాగుతుందనే విషయూన్ని గుర్తుంచుకోవాలన్నారు. కంట్రోల్ రూమ్ 24 గంటలూ పనిచేస్తుందని, ఏ సమస్య వచ్చినా డయల్ 100కి ఫోన్ చేయాలని సూచించారు. మోటారు సైకిళ్ల చోరీపై నిఘా సీసీఎస్ పునర్వ్యవస్థీకరణ తర్వాత నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టామని సీపీ పేర్కొన్నారు. గతంలో మాదిరిగా రొటీన్ తనిఖీలు కాకుండా రోజువారీ ప్రాధాన్యతలు నిర్ణయించుకుని నేరస్తుల పట్టివేతకు కృషి చేస్తున్నామన్నారు. వచ్చేవారం నుంచి మోటారు సైకిళ్ల చోరీపై దృష్టిసారిస్తామని పేర్కొన్నారు. గత మూడేళ్లలో రెండువేల మోటారు సైకిళ్లు చోరీకి గురైతే.. కేవలం 900 మోటారు సైకిళ్లు మాత్రమే స్వాధీనం చేసుకున్నామని, ఇకపై మోటారు సైకిళ్ల దొంగలను ఉపేక్షించేది లేదన్నారు. ఎప్పుడైనా ఆకస్మిక తనిఖీలు చేపట్టే అవకాశం ఉంద న్నారు. మోటారు సైకిళ్ల యజమానులు రికార్డులు, డ్రైవింగ్ లెసైన్స్ వెంట ఉంచుకోవాలన్నారు. బాధ్యతారాహిత్యమే ఇంటిని అద్దెకు ఇచ్చే ముందు ఆయా వ్యక్తుల వృత్తి, ఆదాయ వ్యయాలను విచారించుకోకపోవడం యజమానుల బాధ్యతారాహిత్యంగానే పరిగణించాల్సి ఉంటుందని పోలీస్ కమిషనర్ పేర్కొన్నారు. నేరస్తులు చిన్నచిన్న ఇళ్లను అద్దెకు తీసుకుంటూ చోరీలు, ఇతర అసాంఘిక చర్యలకు పాల్పడుతున్నారన్నారు. ఇల్లు అద్దె కోసం ఎవరైనా వస్తే డయల్ 100 లేదా సమీప పోలీస్ స్టేషన్లకు సమాచారం ఇస్తే ఉచితంగానే అద్దెదారుల వివరాలు తెలుసుకుని అందజేస్తామని పేర్కొన్నారు. భవన నిర్మాణం సహా ఇతర విధులకు వేర్వేరు రాష్ట్రాల నుంచి కూలీలను తీసుకు వచ్చే వారు కూడా పోలీసుల సాయంతో వారి గురించి సమాచారం సేకరించాలని సూచించారు. సింగపూర్ కన్సెల్టెన్సీ సమంజసమే.. రాజధాని నిర్మాణం కోసం సింగపూర్ సంస్థకు మాస్టర్‌ప్లాన్ రూపకల్పన బాధ్యతలు అప్పగించడాన్ని సీపీ వెంకటేశ్వరరావు స్వాగతించారు. సీఆర్డీఏ తరఫున ఐదు రోజుల సింగపూర్ శిక్షణకు వెళ్లిన ఆయన అక్కడి విషయాలను వివరిం చారు. పోలీస్ విధివిధానాలు తెలుసుకోవడానికి వెళ్లలేదని, నగర నిర్మాణం, అభివృద్ధి, గృహ నిర్మాణం, ట్రాఫిక్ మేనేజ్మెంట్, రోడ్డు మేనేజ్మెంట్ అంశాలపై ఇచ్చిన శిక్షణలో పాల్గొన్నామన్నారు. దీనిపై అక్కడి ఉన్నతస్థాయి అధికారులు శిక్షణ ఇచ్చారని చెప్పారు. రాజధాని నిర్మాణం, ఆధునిక సిటీ నిర్వహణ వంటి అంశాలపై వారు ఇచ్చిన శిక్షణ ఎంతగానో స్ఫూర్తిదాయకంగా నిలిచిందన్నారు. పోలీసింగ్ విధివిధానాలు తెలుసుకునేందుకు ప్రభుత్వం మరోసారి పంపే అవకాశం ఉందన్నారు. సింగపూర్ అభివృద్ధిని పరిగణనలోకి తీసుకునే న వ్యాంధ్ర రాజధాని నిర్మాణం కోసం మాస్టర్ ప్లాన్ రూపొం దించే పని వారికి అప్పగించడం మంచి నిర్ణయమన్నారు. -
మహిళల రక్షణకు ప్రాధాన్యం
అతివల రక్షణకు కొత్త సాఫ్ట్వేర్ శాంతిభద్రతలపై ప్రత్యేక దృష్టి కొత్త సీపీ అమిత్ గార్గ్ విశాఖపట్నం: మహిళల రక్ష ణకు తొలి ప్రాధాన్యమిస్తానని కొత్త పోలీస్ కమిషనర్ అమిత్ గార్గ్ తెలిపారు. సోమవారం సాయంత్రం ఆయన సీపీ గా బాధ్యతలు స్వీకరించారు. పోలీస్ కమిషనరేట్‌లో తనను కలిసిన విలేకరులతో ఆయన మాట్లాడుతూ నగరంలో శాంతి భద్రతలు కాపాడానికి అహర్నిశలు శ్రమిస్తానన్నారు. మహిళల రక్షణ కోసం కొత్త సాఫ్ట్వేర్లు, సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెడుతున్నామని తెలిపారు. ఈ సాఫ్ట్వేర్లను రాష్ట్ర హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, డీజీపీ జె.వి.రాముడు ప్రారంభించనున్నట్టు చెప్పారు. ఆయనను డీఐజీ పి.ఉమాపతి, ఎస్పీ కోయ ప్రవీణ్, డీసీపీలు త్రివిక్రమవర్మ, రవికుమార్‌మూర్తి, రాంగోపాల్ నాయక్, ఏడీసీపీలు వరదరాజు, మహేంద్రపాత్రుడు, వెంకటేశ్వరావు, మెరైన్ ఏసీపీ మహ్మద్‌ఖాన్, సీఐలు, ఎస్ఐలు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ‘ఐ క్లిక్’..మహిళలకు ‘అభయం’ మహిళల రక్షణకు ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానాన్ని, సాఫ్ట్వేర్లను రూపొందించారు. వాటిని నగర మహిళలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు రాష్ట్ర హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప మంగళవారం ఆవిష్కరించనున్నారు. రాష్ట్ర డీజీపీ జె.వి.రాముడు ఈ కార్యక్రమాలకు హాజరవుతారు. ఉదయం 11గంటలకు సీఎంఆర్ ప్లాజాలో హోమ్ మంత్రి ‘ఐ క్లిక్ కౌసిక్’ సాంకేతిక పరికరాన్ని ప్రారంభిస్తారు. అనంతరం పోలీస్ కమిషనరేట్‌లో ఐ క్లిక్కు సంబంధించిన సీ అండ్ సీ సెంటర్‌ను ప్రారంభించనున్నారు. సీఎఆర్లో జరిగే ‘అభయం’ ఆవిష్కరణ సభలో పాల్గొని సాఫ్ట్‌వేర్‌ను ప్రారంభించి ప్రసంగిస్తారు. రాష్ట్ర మంత్రులు, పోలీస్ ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఐ క్లిక్ పరికరాలను నగరంలోని షాపింగ్‌మాల్స్, ఏటీఎం సెంటర్లు, రద్దీ ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నారు. ఆపదలో ఉన్న మహిళలు ఈ పరికానికి ఉంటే బటన్ నొక్కితే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. సీ అండ్ సీ సెంటర్ ఈ మొత్తం ఆపరేషన్‌ను సమన్వయం చేస్తుంది. ‘అభయం’ సాఫ్ట్‌వేర్‌ను స్మార్ట్ఫోన్లలో డౌన్లోడ్ చేసుకుని ఐదు మొబైల్ నెంబర్లను దానిలో నిక్షిప్తం చేసుకుంటే ఆపదలో ఉన్నప్పుడు ఆ నంబర్లకు ఎస్ఎమ్ఎస్ రూపంలో సమాచారం వెళుతుంది. ఈ సదుపాయాల గురించి మహిళలకు అవిగాహన కల్పించడం కోసం విస్తృత ప్రచారం కల్పించనున్నారు. -
రజనీకాంత్ జోక్యం చేసుకోవాలి
-
'రజనీకాంత్ జోక్యం చేసుకోవాలి'
లింగా చిత్రం డిస్ట్రిబ్యూటర్లు బుధవారం నిరాహార దీక్ష చేపట్టారు. స్వయంగా రజనీకాంత్ వచ్చి జోక్యం చేసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పూర్తి వివరాలు: లింగా చిత్రానికి నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ కొందరు డిస్ట్రిబ్యూటర్లు ఈనెల 10న నగరంలో నిరాహార దీక్షకు దిగాలని నిర్ణయం తీసుకున్నారు. అందుకు అనుమతి కోరుతూ చెన్నైకి చెందిన మెరీనా ఫిలింస్ సంస్థ నిర్వాహకుల్లో ఒకరైన ఆర్.సింగార వడివేలన్ చెన్నై పోలీసు కమిషనర్ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందించగా పోలీసులు దీన్ని స్వీకరించడానికి నిరాకరించారంటూ ఆయన చెన్నై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ మంగళవారం విచారణకు స్వీకరించిన న్యాయమూర్తి టీఎస్ శివజ్ఞానం బుధవారం తగిన బదులివ్వాలని పోలీసు కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేశారు. బుధవారం ఈ కేసు విచారణకు వచ్చింది. ప్రభుత్వం తరపున న్యాయవాది జయప్రకాష్ నారాయణన్ హాజరైన ఈ కేసులో తగిన నిర్ణయం తీసుకోవడానికి పోలీసు కమిషనర్‌కు మరింత కాల వ్యవధి కావాలంటూ కోరారు. అయితే ప్రస్తుతం డిస్ట్రిబ్యూటర్లు మాత్రం హీరో రజనీకాంత్ వచ్చి ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. -
9 లోపు సమాధానం ఇవ్వండి
లింగా చిత్రం వ్యవహారంలో డిస్ట్రిబ్యూటర్ల నిరాహార దీక్షకు అనుమతి విషయమై 9వ తేదీ 11 గంటల్లోపు పోలీసు కమిషనర్ సమాధానం ఇవ్వాలని చెన్నై ప్రధాన న్యాయస్థానం ఆదేశించింది. వివరాల్లో కెళితే... లింగా చిత్రానికి నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ కొందరు డిస్ట్రిబ్యూటర్లు ఈనెల 10న నగరంలో నిరాహార దీక్షకు దిగాలని నిర్ణయం తీసుకున్నారు. అందుకు అనుమతి కోరుతూ చెన్నైకి చెందిన మెరీనా ఫిలింస్ సంస్థ నిర్వాహకుల్లో ఒకరైన ఆర్.సింగార వడివేలన్ చెన్నై పోలీసు కమిషనర్ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందించగా పోలీసులు దీన్ని స్వీకరించడానికి నిరాకరించారంటూ ఆయన చెన్నై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ మంగళవారం విచారణకు స్వీకరించిన న్యాయమూర్తి టిఎస్ శివజ్ఞానం బుధవారం తగిన బదులివ్వాలని పోలీసు కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేశారు. బుధవారం ఈ కేసు విచారణకు వచ్చింది. ప్రభుత్వం తరపున న్యాయవాది జయప్రకాష్ నారాయణన్ హాజరైన ఈ కేసులో తగిన నిర్ణయం తీసుకోవడానికి పోలీసు కమిషనర్‌కు మరింత కాల వ్యవధి కావాలంటూ కోరారు. దీంతో న్యాయమూర్తి ఈ నెల 9వ తేదీ 11 గంటల్లోపు పిటీషన్‌దారుడి పిటిషన్‌ను సమగ్రంగా పరిశీలించి కోర్టుకు సరైన సమాధానం చె ప్పాలని ఆదేశించారు. -
విజయ్ బెదిరించాడు... డిస్ట్రిబ్యూటర్ జయణ్ణ
బెంగళూరు: నటుడు దునియా విజయ్ తనను చంపేస్తానని బెదిరిస్తున్నాడని బెంగళూరు నగర పోలీస్ కమిషనర్ ఎం.ఎన్.రెడ్డికి ప్రముఖ కన్నడ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ జయణ్ణ సోమవారం ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే... గాంధీనగరలోని కపాలి చిత్రమందిరం (సినిమా థియేర్)ను జయణ్ణ లీజ్‌కు తీసుకున్నారు. ఈ థియేటర్లో ప్రస్తుతం ఉపేంద్ర హీరోగా నటించిన శివం చిత్రం ప్రదర్శిస్తున్నారు. దునియా విజయ్ హీరోగా నటించిన జాక్సన్ చిత్రం విడుదలకు సిద్ధమైంది. నాలుగు రోజుల క్రితం దునియా విజయ్ తనకు ఫోన్ చేసి జాక్సన్ సినిమాను కపాలి థియేటర్లో విడుదల చేయాలని, లేకుంటే అంతు చూస్తానని బెదిరించాడని జయణ్ణ ఆరోపించారు. శివం సిని మా ఇటీవలే విడుదలైందని, ఆ సినిమాను ఎలా తీసివేస్తామని చెబితే దునియా విజయ్ బెదిరింపులకు ది గుతున్నాడని ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తును సీసీబీ పోలీసు అధికారులకు సీపీ అప్పగించారు. సీసీబీ పోలీసు అధికారులు దునియా విజయ్, జయణ్ణలను పిలిపించి వివరాలు సేకరించారు. జయణ్ణ తన మీద ఫిర్యాదు చేయడం బాధ కలిగించిందని, తాను ఎవ్వరినీ బెదిరించలేదని సోమవారం మీడియా ఎదుట దునియా విజయ్ చెప్పారు. -
తగ్గిన డ్రంకెన్ డ్రైవింగ్ కేసులు
సాక్షి, ముంబై : నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని మద్యం సేవించి వాహనాలు నడిపే వారి సంఖ్య తగ్గిందని ట్రాఫిక్ పోలీసులు చెప్పారు. డిసెంబర్ 31న రాత్రి మద్యం సేవించి వాహనాలు నడిపిన 523 మందిపై ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేశారు. మద్యం సేవించి వాహనం నడిపిన వారిలో టీవీ నటుడు సిద్ధార్థ్ శుక్లా కూడా ఉన్నారని పోలీసులు చెప్పారు. మొత్తంగా 6,676 నిబంధనల ఉల్లంఘన కేసులు నమోదయ్యాయన్నారు. అయితే ఎటువంటి ప్రాణాంతకమైన సంఘటనలు చోటు చేసుకోలేదని చెప్పారు. ఠాణే, నవీ ముంబై, మీరా-భయందర్, వసాయి-విరార్లలో 1,041 డ్రంకెన్ డ్రైవింగ్ కేసులు నమోదయ్యాయి. ముంబై కన్నా ఠాణేలో 19 శాతం కేసులు అధికంగా నమోదవడం విశేషం. నగరంలోని ఇతర ప్రాంతాలతో పోల్చితే మలాడ్‌లో 57 కేసులు నమోదయ్యాయి. ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించిన వారిలో 26 నుంచి 30 ఏళ్లలోపు వారు 149 మంది ఉన్నారు. అంతేకాకుండా హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపిన 1,317 మందిపై కూడా కేసులు నమోదు చేశారు. కాగా, 70 ప్రాంతాల్లో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు నాకా బందీని నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. పట్టుబడిన వారిని ఏ బార్లో మద్యం సేవించారో కూడా విచారించామని పోలీసు కమిషనర్ ఉపాధ్యాయ తెలిపారు. సదరు బార్ యజమానులపై కూడా చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించిన సుమారు 12వేల మంది డ్రైవర్లకు గులాబి పువ్వులు అందచేశామని ఉపాధ్యాయ చెప్పారు. -
ఊహాచిత్రాలు రెడీ
సాక్షి, బెంగళూరు: నగరంలోని చర్చ్‌స్ట్రీట్‌లో ఆదివారం రాత్రి జరిగిన బాంబు పేలుళ్లకు సంబంధించి విచారణ ప్రాధమిక స్థాయిలో ఉందని నగర పోలీస్ కమీషనర్ ఎంఎన్ రెడ్డి వెల్లడించారు. మంగళవారమిక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ...బాంబు పేలుడు ఘటనకు సంబంధించి విచారణ ప్రాథమిక స్థాయిలో ఉన్నందున ఇప్పుడే ఏ వివరాలు వెల్లడించలేమని తెలిపారు. ఈ ఘటనకు పాల్పడింది ఏ ఉగ్రవాద సంస్థ అనే విషయంపై కూడా ఇప్పటికీ ఓ స్పష్టమైన నిర్థారణకు రాలేదని తెలిపారు. ఘటనకు సంబంధించి అన్ని కోణాల్లోనూ వేగవంతంగా విచారణ కొనసాగుతోందని, ఇప్పటికే వివిధ విచారృ బందాలను ఇతర రాష్ట్రాలకు పంపామని చెప్పారు. అయితే ఏయే రాష్ట్రాలకు విచారృ బందాలను పంపామనే విషయాన్ని ఇప్పుడు చెప్పలేనని అన్నారు. చర్చ్‌స్ట్రీట్‌లో జరిగిన బాంబు పేలుడు సందర్భంలో అక్కడి సీసీటీవీ కెమెరాల్లో లభించినృదశ్యాలు, కొంత మంది వ్యక్తులు చెప్పిన పోలికల ఆధారంగా అనుమానిత నిందితుల రేఖాచిత్రాలు రూపొందించామని, అయితే వీరు కేవలం అనుమానిత వ్యక్తులే కావడం వల్ల వాటిని మీడియాకు విడుదల చేయలేమని పేర్కొన్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికి ఎవరినీ అరెస్ట్ చేయలేదని, కేవలం కొంతమందిని విచారణ మాత్రమే జరిపి తిరిగి పంపించేశామని తెలిపారు. మారు పేరుతో ట్వీట్ పంపాడు నగరంలోని చర్చ్‌స్ట్రీట్‌లో ఆదివారం జరిగిన బాంబు పేలుళ్లకు తానే కారణమంటూ అబ్దుల్ పేరుతో ట్వీట్ పంపిన 17ఏళ్ల మైనర్‌ను తాము అదుపులోకి తీసుకున్నామని నగర పోలీస్ కమిషనర్ ఎం.ఎన్.రెడ్డి వెల్లడించారు. అతను నగరానికి చెందిన వ్యక్తేనని, నగరంలోనే విద్యాభ్యాసం చేస్తున్నాడని తెలిపారు. మైనర్ కావడం వల్ల ఇంతకు మించి వివరాలను వెల్లడించలేమని తెలిపారు. కాగా ట్వీట్ పంపిన నిందితుడు ప్ర స్తుతం విచారృ బందం అదుపులోనే ఉన్నాడని, అతని వేరే మతానికి చెందిన మారుపేరు పెట్టుకొని ట్వీట్ పంపినట్లు తమ విచారణలో వెల్లడైందని కమిషనర్ ఎం.ఎన్.రెడ్డి పేర్కొన్నారు. విచారణలో భాగంగా అత ని తల్లిదండ్రులను సైతం విచారించామని తెలిపారు. చర్చ్‌స్ట్రీట్‌లో సంచారం యధాతథం ఆదివారం చర్చ్‌స్ట్రీట్‌లో బాంబు పేలుడు ఘటనతో రెండు రోజులుగా జన సంచారం లేక వెలవెలపోయిన చర్చ్‌స్ట్రీట్‌లో తిరిగి మంగళవారం జనసంచారం ప్రా రంభమైంది. ఘటనా స్థలంలో సాక్షాధారాల సేకరణకు గాను ఘటన జరిగినప్పటి నుంచి మంగళవారం ఉదయం వరకు ఆ ప్రాంతంలో జనసంచారాన్ని పోలీ సు అధికారులు నిషేధించారు. కాగా మంగళవారానికి సాక్ష్యాల సేకరణ పూర్తి కావడంతో తిరిగి ఈ ప్రాం తంలో జనసంచారాన్ని పోలీసులు అనుమతించారు. రెస్టారెంట్లో ‘ఎన్ఐఏ’ అధికారులు ఇక బాంబు పేలుడు జరిగిన కోకోనట్ గ్రోవ్ రెస్టారెంట్‌కు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ*(ఎన్ఐఏ) అధికారులు మంగళవారం చేరుకున్నారు. ఎన్ఐఏ స్పెషల్ డీజీపీ నవనీత్ వాసన్ నేృతత్వంలోని అధికారృల బందం కోకోనట్ గ్రోవ్ రెస్టారెంట్‌కు చేరుకొని ఘటనకు సంబంధించిన వివరాలను సేకరించారు. -
‘భద్రత’ భారం పిల్లలపైనే..
* ఖర్చు భరించే స్థోమత తమకు లేదనిచేతులెత్తేస్తున్న ఎయిడెడ్ పాఠశాలలు * ఫీజులు పెంచాలని యాజమాన్యాల యోచన సాక్షి, ముంబై : ఎయిడెడ్ పాఠశాలల్లో ఫీజులు పెంచాలని యాజమాన్యాలు యోచిస్తున్నాయి. ఇటీవల పాకిస్థాన్ దేశం పెషావర్‌లో ఒక పాఠశాలలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో సుమారు 145 మంది విద్యార్థులు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నగరంలోని పలు పాఠశాలల్లో భద్రతను పెంచాలని స్థానిక పోలీసులు జారీ చేశారు. దీనిపై ఎయిడెడ్ పాఠశాలల యాజమాన్యాలు ఆలోచనలో పడ్డాయి. ఈ సందర్భంగా నగర ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల నిర్వాహకులు మాట్లాడుతూ.. పోలీసుల సూచనల ప్రకారం.. పాఠశాలల్లో భద్రతను పెంపొందించే స్తోమత తమ వద్ద లేదన్నారు. ఫీజులు పెంచడం, లేదా ప్రభుత్వం ఇందుకు గాను ప్రత్యేక నిధులను కేటాయించడం ద్వారా మాత్రమే తాము భద్రతను కొంత మేర పెంచగలుగుతామని వెల్లడించారు. పెషావర్ ఉదంతం అనంతరం పాఠశాలల్లో భద్రత నిమిత్తం ఎటువంటి చర్యలు తీసుకోవాలో సూచిస్తూ నగర పోలీసులు జీవో జారీచేశారు. పాఠశాల ప్రాంగణంలోని ప్రహరీ గోడను ఎనిమిది అడుగుల ఎత్తు వరకు పెంచి పైన బాబ్డ్ వైర్‌ను ఏర్పాటు చేయాల్సిందిగా సర్క్యూలర్‌లో పేర్కొన్నారు. పాఠశాలల్లో సీసీటీవీ కెమెరాలు, రౌండ్ ద క్లాక్ పర్యవేక్షించే వాకీ టాకీలతో కూడిన భద్రతా సిబ్బంది, ఇంటర్‌కం వంటి సదుపాయాలు ఏర్పాటుచేయాలన్నారు. అంతేకాకుండా పాఠశాలలకు వచ్చే సందర్శకులను కూడా పరిశీలించాలని పేర్కొన్నారు. పోలీసు కమిషనర్ రాకేష్ మారియా ఈ అంశమై ఆదేశించారు. అయితే ఇంత మొత్తంలో తాము పాఠశాలల్లో భద్రత కల్పించలేమని ఎయిడెడ్ పాఠశాలల అధికారులు పేర్కొంటున్నారు. ఉపాధ్యాయలు, నాన్‌టీచింగ్ సిబ్బందికి చెల్లించే జీతాల వరకు మాత్రమే తమకు ప్రభుత్వం నుంచి నిధులు అందుతున్నాయన్నారు. భద్రతకు సంబంధించిన ఖర్చు తామే భరిస్తున్నామని రాజ్య శిక్షన్ సంస్థ అసోసియేషన్ కార్యదర్శి ఆర్పీ జోషీ తెలిపారు. విద్యార్థుల భద్రతను అంతర్జాతీయ భద్రత అంశంగా పరిగణించి ప్రభుత్వమే నిధులు కేటాయించాలని జోషి అభిప్రాయ పడ్డారు. -
ఒలింపిక్స్‌పై గురిపెట్టండి
ఆర్చరీ క్రీడాకారులకు సీపీ హితవు ఘనంగా ప్రారంభమైన చెరుకూరి లెనిన్-ఓల్గా స్మారక ఆర్చరీ పోటీలు 20 రాష్ట్రాల నుంచి వచ్చిన క్రీడాకారులు విజయవాడ స్పోర్ట్స్ : రియో (బ్రెజిల్)-2016 ఒలింపిక్స్‌లో భారతదేశం పతకాలు సాధించే ఈవెంట్లలో ప్రధాన క్రీడగా ఆర్చరీ ఉంటుందని నగర పోలీస్ కమిషనర్ ఏబీ వెంకటేశ్వరరావు ఆశాభావం వ్యక్తం చేశారు. ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో చెరుకూరి లెనిన్-ఓల్గా స్మారక 37వ జాతీయ జూనియర్, ఏడో మినీ జాతీయ ఆర్చరీ పోటీలను మంగళవారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ రియో ఒలింపిక్స్‌లో పతకం సాధించే లక్ష్యంతో ముందుకెళ్తున్న చెరుకూరి లెనిన్-ఓల్గా ఆర్చరీ అకాడమీకి ప్రతి ఒక్కరూ సహకారం అందించాలన్నారు. పోటీల్లో పాల్గొన్న 20 రాష్ట్రాల ఆర్చర్లు విజయవాడ నగరాన్ని సందర్శించాలని కోరారు. గౌరవ అతిథి, సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో ఆర్చరీకి చెరుకూరి సత్యనారాయణ వన్నె తీసుకురాగా, ప్రపంచ క్రీడా చిత్రపటంలో దివంగత చెరుకూరి లెనిన్ నగర ఖ్యాతిని ఇనుమడింపజేశారన్నారు. ఆర్చరీ అసోసియేషన్ ఇండియా ప్రధాన కార్యదర్శి అనీల్ కామినేని మాట్లాడుతూ 2015లో జరిగే ఏషియన్, వరల్డ్ ఆర్చరీ చాంపియన్‌షిప్‌ల్లో పాల్గొనేందుకు ఆర్చర్లు సిద్ధపడాలన్నారు. మునిసిపల్ కమిషన ర్ సి.హరికిరణ్ మాట్లాడుతూ చెరుకూరి ఓల్గా ఆర్చరీ అకాడమీకి తన వంతు సహకారం అందిస్తానన్నారు. ఈ కార్యక్రమానికి ఏపీ ఆర్చరీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చెరుకూరి సత్యనారాయణ అధ్యక్షత వహించగా, మేయర్ కోనేరు శ్రీధర్, స్పోర్ట్స్ కమిటీ చైర్మన్ చెన్నుపాటి గాంధీ, డీఎస్డీవో పి.రామకృష్ణ, వేదగంగోత్రి ట్రస్ట్ చైర్మన్ వరప్రసాద్, ఒలింపిక్ సంఘ కార్యదర్శి కేపీ రావు, పలు క్రీడా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. తొలుత ఆర్చర్లు మార్చ్‌పాస్ట్ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నారుు. ఉత్సాహంనింపిన సీపీ ప్రసంగం ఆర్చరీ పోటీల సందర్భంగా సీపీ చేసిన ప్రసంగం క్రీడాకారుల్లో ఉత్సాహాన్ని నింపింది. అంతటితో ఆగకుండా ఆయన ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్‌ను పిలిచి వెంటనే కాంపౌండ్ బౌల్‌ను కొనుగోలు చేసి కమిషనరేట్‌లో పోలీసు అధి కారులు రిలాక్స్ కోసం ప్రాక్టీస్ చేరుుంచాలని సూచించారు. తొలిరోజు ఫలితాలు తొలిరోజు జరిగిన కాంపౌండ్ ఆర్చరీ విభాగంలో టీమ్ చాంపియన్‌షిప్‌లో విజయవాడ ఓల్గా ఆర్చరీ క్రీడాకారిణులు నిరాశపరిచినా వ్యక్తిగత ర్యాంకింగ్‌లో ఒలింపిక్ రౌండ్‌కు అర్హత సాధించారు. జూనియర్ బాలిక, మినీ బాలుర టీమ్ చాంపియన్‌షిప్‌లో ఏపీ ఆర్చర్లు రన్న రప్‌గా నిలిచారు. జూనియర్ బాలికల కాంపౌండ్ టీమ్ చాంపియన్‌షిప్‌లో 217-217 తేడాతో ఏపీ, జార్ఖండ్ జట్లు టైగా నిలవగా, టై బ్రేక్‌లో ఒక్క క్లోజర్ పాయింట్‌తో జార్ఖండ్ జట్టు విజయం సాధించింది. మినీ బాలుర విభాగంలో టీమ్ చాంపియన్‌షిప్‌లో మణిపూర్ స్వర్ణపతకం సాధించగా, ఆంధ్రప్రదేశ్ జట్టు రజత పతకం, హర్యానా కాంస్య పతకం కైవసం చేసుకున్నాయి. వ్యక్తిగత ర్యాంకింగ్-మినీ బాలికల విభాగంలో ఓల్గా ఆర్చర్లు కె.జ్యోత్స్న 627 పాయింట్లతో టాప్ స్థానంలో నిలిచింది. జూనియర్ ర్యాంకింగ్ విభాగంలో పూర్వాష 669, అనూషరెడ్డి 667 పారుుంట్లతో ప్రథమ, ద్వితీయ, తరంగ, గీతికాలక్ష్మి 659 పాయింట్లతో మూడు, నాల్గో స్థానాల్లో నిలిచారు. వీరంతా బుధవారం జరిగే వ్యక్తిగత ఒలింపిక్ రౌండ్‌కు అర్హత సాధించారు. -
‘లింక్’ తేలుస్తాం
మెహ్దీ ల్యాప్‌టాప్‌లో ఉన్న వివరాలను సేకరిస్తున్నాం : పోలీస్ కమిషనర్ ఎంఎన్ రెడ్డి బెంగళూరు : ఐఎస్ఐఎస్ సంస్థ తరఫున ప్రచోదిత ట్వీట్లు నిర్వహిస్తున్న ఆరోపణలపై అరెస్ట్ అయిన మెహ్ది నుంచి సమాచారాన్ని సేకరించేందుకు గాను విచారణను వేగవంతం చేసినట్లు నగర పోలీస్ కమిషనర్ ఎంఎన్ రెడ్డి వెల్లడించారు. మెహ్ది నుంచి స్వాధీనం చేసుకున్న ల్యాప్‌టాప్‌లో ఉన్న సమాచారాన్ని తెలుసుకునే దిశగా ప్రయత్నాలు ప్రారంభించామన్నారు. ఇందుకు గాను ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను సైతం వినియోగిస్తున్నట్లు చెప్పారు. మంగళవారమిక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మెహ్ది ల్యాప్‌టాప్‌లో ఉన్న సమాచారాన్ని తెలుసుకున్న అనంతరం మెహ్దికి ఉగ్రవాదులతో నేరుగా సంబంధాలున్నాయా లేదా అనే అంశంపై స్పష్టత వస్తుందని తెలిపారు. మెహ్ది పోలీస్ కస్టడీ ఈనెల 18తో ముగియనుందని, అనంతరం అతన్ని కోర్టులో హాజరుపరుస్తామని పేర్కొన్నారు. అవసరమైతే మరికొన్ని రోజులు మెహ్దిని తమ కస్టడీకి ఇవ్వాల్సిందిగా న్యాయస్థానాన్ని కోరుతామన్నారు. ట్విట్టర్ ద్వారా మెహ్ది ఎవరెవరితో సంబంధాలు కలిగి ఉన్నాడనే విషయమై ట్విట్టర్ సంస్థ వద్ద పూర్తి సమాచారం ఉందని, తాము నోటీసులు ఇచ్చిన తర్వాత సంస్థ ప్రతినిధులు తమకు అనుకూలంగా స్పందిస్తున్నారని వెల్లడించారు. ఇక మెహ్దిని స్వయంగా కమిషనర్ ఎంఎన్ రెడ్డి, జాయింట్ పోలీస్ కమిషనర్ హేమంత్ నింబాళ్కర్లే స్వయంగా విచారణ జరుపుతున్నట్లు సమాచారం. నగరంలోని ఓ రహస్య ప్రదేశంలో మెహ్దీ విచారణ కొనసాగుతోందని తెలుస్తోంది. -
నేరాల సంఖ్య తగ్గించడమే ధ్యేయం
న్యూఢిల్లీ: నగరంలో మహిళల పట్ల నేరాల సంఖ్యను జీరోస్థాయికి తగ్గించేందుకు తమ శాఖ కృషి చేస్తోందని, ఇందుకు ప్రజల సహకరించాలని నగర పోలీస్ కమిషనర్ బీఎస్ బస్సీ అన్నారు. డిసెంబర్ 16 గ్యాంగ్‌రేప్ ఘటన జరిగి రెండేళ్లు పూర్తి అయ్యిన సందర్భంగా మంగళవారం మీడియాతో మాట్లాడారు. నగరంలో ఎప్పుడైతే మహిళల పట్ల నేరాల సంఖ్య జీరోస్థాయికి తగ్గుతోందో అప్పుడే తనకు సంతృప్తి కలుగుతోందని అన్నారు. డిసెంబర్ ఘటన తర్వాత మహిళల్లో చైతన్యం పెరిగిందని, తమపై జరిగిన అన్యాయాలపై పోలీసులకు ఫిర్యాదులు చేయడానికి వెనుకాడడం లేదన్నారు. అలాంటి వారికి చట్టపరమైన సహాయం కూడా తోడైందని అన్నారు. 2012లో 680 కేసుల్లో ఎఫ్ఐఆర్ నమోదు కాగా, 2013లో 1,559, నవంబర్, 2014 వరకూ 1,925 కేసుల్లో ఎఫ్ఐఆర్ నమోదు అయ్యాయని చెప్పారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కేసులు 2012లో 615, 2013లో 3,347, ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 3,392 కేసుల్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు చెప్పారు. పోలీసులు ప్రజలతో కలిసిమెలసి ఉండడంతోపాటు ప్రజల్లో కూడా మరింత చైతన్యం పెరగాలని అన్నారు. నగరంలో మహిళలు ధైరంగా తిరగడం కోసం ఆత్మరక్షణలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. 1,000 పెప్పర్ స్ప్రేలను నగరంలోని మహిళలకు పంపిణీ చేశామని చెప్పారు. మహిళల పట్ల నేరాల సంఖ్యను తగ్గించడం కోసం పోలీసులు అన్నిరకాల చర్యలు తీసుకొంటున్నారని చెప్పారు. కేసు దర్యాప్తులు కూడా నిష్పక్షపాతంగా త్వరతగతిన పూర్తి చేస్తున్నారని చెప్పారు. -
'కిస్ ఆఫ్ లవ్'కు అనుమతి ఇచ్చేదిలేదు: పోలీసు కమిషనర్
బెంగళూరు : 'కిస్ ఆఫ్ లవ్' కార్యక్రమానికి ఎలాంటి పరిస్థితిలో అనుమతి ఇచ్చేది లేదని బెంగళూరు నగర పోలీసు కమిషనర్ ఎంఎన్ రెడ్డి తేల్చి చెప్పారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భారతీయ సంస్కతి ప్రకారమే కాకుండా ఐపీసీ సెక్షన్ 294 ప్రకారం బహిరంగ స్థలాల్లో అశ్లీలంగా ముద్దులు పెట్టుకోవడం, కౌగిలించుకోవడం నేరమని ఆయన తెలిపారు. ఈనెల 30వ తేదీ ఆదివారం సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు ఇక్కడి టౌన్‌హాల్ దగ్గర 'కిస్ ఆఫ్ లవ్' కార్యక్రమాన్ని నిర్వహించడానికి అనుమతి ఇవ్వాలని సామాజిక కార్యకర్త రచిత తనేజా ఇప్పటికే అర్జీ సమర్పించారని అన్నారు. కాగా, కిస్ ఆఫ్ లవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తే తాము ఎలాగైనా అడ్డుకుంటామని చట్టానికి వ్యతిరేకంగా బహిరంగ వ్యాఖ్యలు చేసిన శ్రీరామసేన వ్యవస్థాపకుడు ప్రమోద్ ముతాలిక్‌కు నోటీసులు జారీ చేసినట్లు ఆయన చెప్పారు. ** -
నెలలోగా రద్దీ షాపుల్లో సీసీ కెమరాలు తప్పనిసరి
-
బెజవాడలో పిల్లల కిడ్నాప్ గ్యాంగులు: సీపీ
పిల్లలను అపహరించే గ్యాంగులు విజయవాడలో తిరుగుతున్నట్లు అనుమానంగా ఉందని నగర పోలీసు కమిషనర్ ఏబీ వెంకటేశ్వరరావు తెలిపారు. నెల రోజుల్లోగా రద్దీగా ఉండే దుకాణాల్లో తప్పనిసరిగా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటుచేసుకోవాలని, లేకపోతే జరిమానాలు తప్పవని అన్నారు. దుకాణాలను కూడా సీజ్ చేస్తామని సీపీ హెచ్చరించారు. ఈ మేరకు దుకాణాల యజమానులకు ఆయన సూచన చేశారు. పేద పిల్లలనే కిడ్నాపర్లు లక్ష్యంగా పెట్టుకునే అవకాశం ఉందని, పిల్లలను ఒంటరిగా పంపించొద్దని సూచించారు. -
రెండో సారి షీకి చిక్కితే నిర్భయ కేసు
రెండు నెలల్లో 80 మంది అరెస్టు అదనపు పోలీసు కమిషనర్ స్వాతిలక్రా సిటీబ్యూరో: ఈవ్‌టీజింగ్ కేసులో రెండో సారి పట్టుబడితే వారిపై నిర్భయ చట్టం ప్రయోగిస్తామని అదనపు పోలీసు కమిషనర్ (క్రైమ్స్ అండ్ సిట్) స్వాతిలక్రా హెచ్చరించారు. రెండు నెలల క్రితం ఏర్పాటు చేసిన ‘షీ టీమ్’లకు శనివారం వరకు 80 మంది యువకులు చిక్కారని ఆమె తెలిపారు. శనివారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో స్వాత్రిలక్రా వివరాలు వెల్లడించారు. షీ బృందాలకు చిక్కిన వారిలో 16 మందిని కోర్టులో హాజరుపర్చగా, ఎనిమిది మందికి జైలు శిక్ష పడిందన్నారు. ఈవ్‌టీజింగ్ ఎక్కువగా మెహదీపట్నంలోని సెయింట్ ఆన్స్ కళాశాల, దిల్సుఖ్నగర్ లోని ఎన్ఆర్ఐ కళాశాల, మలక్‌పేటలోని వాణి కళాశాల, కోఠి, ఎస్ఆర్నగర్, నారాయణగూడ, ట్యాంక్‌బండ్ బస్టాప్‌లు, సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్లలో చోటు చేసుకున్నాయన్నారు. బాధితుల నుంచి 100కు ఫోన్లు రాగానే సీసీఎస్ ఏసీపీ కవిత వెంటనే స్పందించి ఆ ఏరియాలోని షీ టీమ్స్‌ను అప్రమత్తం చేస్తున్నారని తెలిపారు. రద్దీ ప్రాంతాల్లో షీ టీమ్స్ సిబ్బంది కరపత్రాలు, బుక్లెట్లు పంచుతూ ఈవ్‌టీజింగ్‌పై ఫిర్యాదు చేయాలని మహిళలకు ధైర్యం చెబుతున్నారని వివరించారు. నగరంలో అన్ని పాఠశాలలో త్వరలో చైల్డ్ అబ్యూజింగ్ మేనేజింగ్ కమిటీలు వేయనున్నట్లు తెలిపారు. ప్రయివేటు సంస్థలు కూడా మహిళా ఉద్యోగుల రక్షణ కోసం కమిటీలు వేసుకోవాలని సూచించారు. ఈవ్‌టీజింగ్‌పై షార్ట్‌ఫిలింలు రూపొందించామని, వాటిని సినిమా థియేటర్లలో ప్రదర్శిస్తామన్నారు. ఈవ్‌టీజింగ్‌కు పాల్పడి, పట్టుబడిన కొందరు యువకులు మీడియాతో మాట్లాడుతూ, తాము సైతం ఈవ్‌టీజింగ్‌ను అరికట్టేందుకు సహకారం అందిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో డీసీపీ పాలరాజు, అదనపు డీసీపీ జె.రంజన్త్రన్, ఏసీపీ కవితలు పాల్గొన్నారు. -
గూఢచర్యాన్ని మరింత మెరుగుపర్చండి
శాంతిభద్రతల సమీక్షలో పోలీసులకు ఎల్జీ సూచన సాక్షి, న్యూఢిల్లీ: ఇటీవల నగరంలో జరిగిన మతఘర్షణల నేపథ్యంలో పోలీసులు మరింత అప్రమత్తంగా ఉండాలని, తమ సమాచార సేకరణ సామర్థ్యాన్ని మరింత మెరుగుపరచుకోవాలని లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ సూచించారు. గురువారం పోలీస్ కమిషనర్ బస్సీతో పాటు ఇతర పోలీసు ఉన్నతాధికారులతో సమావేశమై నగరంలో శాంతిభద్రతల పరిస్థితిని ఆయన సమీక్షించారు. మతపరమైన హింసను నివారించేందుకు రహస్య సమాచార సేకరణ పద్ధతులను అభివృద్ధి పరచుకోవాలని సూచించారు. పదిహేను రోజుల క్రితం నగరంలో జరిగిన మతఘర్షణలను అరికట్టడంలో పోలీసులు చేసిన కృషిని నజీబ్ జంగ్ ప్రశంసించి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు మరింత అప్రమత్తంగా మెలగాలని ఆదేశించారు. అటువంటి ఘటనలు పునరావృతం కాకుండా అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నామని కమిషనర్ బీఎస్ బస్సీ చెప్పారు. సామాజిక సంబంధాలను ప్రోత్సహించేందుకు శాంతి కమిటీలను ఏర్పాటుచేశామని ఎల్జీకి వివరించారు. ప్రజల్లో భయాందోళనలను తొలగించేందుకు తాము జిల్లా స్థాయిలో ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలు వింటున్నామని అధికారులు చెప్పారు. వచ్చే పక్షం రోజులకు సంబంధించి శాంతి భద్రతల ఏర్పాట్లను జంగ్ అడిగి తెలుసుకున్నారు. అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన సందర్భంగా మరింత అప్రమత్తంగా ఉండాలని ఆయన పోలీసులకు సూచించారు. నిరంకారి సమాగం వార్షికోత్సవం సందర్భంగా భారీగా ప్రజలు తరలి వస్తారని, అప్పుడు కూడా అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ఇ-ప్లాట్‌ఫారంపైకి చేరడానికి చేపట్టిన చర్యలతో పాటు ఇ-పోలీసింగ్ అప్లికేషన్లను అభివృద్ధి చేయడానికి ఢిల్లీ పోలీసులు జరుపుతున్న కృషిని కూడా లెఫ్టినెంట్ గవర్నర్ సమీక్షించారు. ఢిల్లీ పోలీసులు విజయవంతంగా అమలుచేస్తోన్న ఢిల్లీ ట్రాఫిక్ పోలీస్ మొబైల్ యాప్, పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ ఆప్లికేషన్, ఢిల్లీ పోలీస్ లాస్ రిపోర్ట్ అప్లికేషన్లను ఆయన సమీక్షించారు. నగర రోడ్లపై రద్దీని తగ్గించేందుకు ఢిల్లీ పోలీసులు చేస్తున్న ప్రయత్నాలను ఆయన కొనియాడారు. లక్షల మంది సందర్శించే అంతర్జాతీయ మేళా వేలమంది హాజరయ్యే వార్షిక నిరంకారీ సమాగంల దష్ట్యా పోలీసులు శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు చేసిన ఏర్పాట్లను కూడా లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశించారు. -
బాధితులే బ్రాండ్ అంబాసిడర్లు...
పీపుల్స్ ఫ్రెండ్లీ పోలిసింగ్ సదస్సులో కమిషనర్ మహేందర్‌రెడ్డి సిటీబ్యూరో: ‘‘మీరేమి అన్నారో ప్రజలు మరిచిపోతారు... మీరేమి చేశారో కూడా మరిచిపోతారు... కానీ.. మీరు వారికి ఎటువంటి భావన కలిగించారో మాత్రం బాధితులు మరిచిపోరు...’’ అని నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి అన్నారు. పీపుల్స్ ఫ్రెండ్లీ పోలిసింగ్‌పై కమిషనరేట్ కాన్ఫరెన్స్హాల్లో నిర్వహిస్తున్న అవగాహన సదస్సులో ఆయన పోలీసు సిబ్బందినుద్దేశించి ప్రసంగించారు. బాధితులే పోలీసులకు బా్రండ్ అంబాసిడర్లుగా ఉండేలా మన విధులుండాలన్నారు. ప్రజలకు స్నేహ పూర్వకమైన పోలీసు వ్యవస్థను అందించేందుకు నగరంలో ఉన్న 12 వేల మంది పోలీసులను పీపుల్స్ ఫ్రెండ్లీ పోలీసింగ్వైపు తీర్చి దిద్దే శిక్షణ కార్యక్రమానికి మహేందర్‌రెడ్డి తొమ్మిది రోజుల క్రితం శ్రీకారం చుట్టారు. వారి రోజువారీ విధులకు ఆటంకం కలుగుకుండానే నిత్యం వంద మందికి ‘పీపుల్స్ ఫ్రెండ్లీ పోలిసింగ్’పై శిక్షణ ఇప్పిస్తున్నారు. ఈ కార్యక్రమం మరో రెండు నెలల వరకు కొనసాగనుంది. ఠాణాకు వచ్చే బాధితులను ఎలా పలకరించాలి? వారు చెప్పే ఫిర్యాదును ఎలా వినాలి, ఆ తర్వాత సమస్యను ఎలా పరిష్కారించాలి తదితర అంశాలపై శిక్షణ ఇస్తున్నారు. ఒక్కసారి ఠాణాకు వచ్చిన బాధితుడు పోలీసులందించే సేవలపై సంతృప్తి వ్యక్తం చేసేలా మన నడవడిక ఉండాలని కమిషనర్ మహేందర్‌రెడ్డి సూచించారు. ప్రజల కోసం పని చేస్తున్నామని మనకు మనం చెప్పుకునే కంటే బాధితులే మన సేవలపై ప్రచార కర్తలుగా మెలిగే విధంగా మనం నడుచుకోవాలన్నారు. ముఖ్యంగా స్టేషన్‌కు వచ్చే మహిళా ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడాలన్నారు. స్నేహపూర్వక సేవలందిస్తాం... ఉన్నతాధికారులు ఈ విధంగా తమను తీర్చి దిద్దడం సమాజానికి, పోలీసు వ్యవస్థకు మెరుగైన ఫలితాలు వస్తాయని శిక్షణకు హాజరైన కొందరు పోలీసులు ‘సాక్షి’కి తెలిపారు. ప్రజలకు సేవ చేసేందుకు అధికారులు తమ వెన్ను తట్టడం చాలా ఆనందంగా ఉందన్నారు. పేదలు, ధనవంతులు ఎవరు ఠాణాకు వచ్చినా స్నేహ పూర్వకమైన సేవలందిస్తామన్నారు. -
త్రిలోక్‌పురి ఘటనతో ‘పోలీస్’ అప్రమత్తం
న్యూఢిల్లీ: త్రిలోక్‌పురి ఘర్షణలు ఢిల్లీ పోలీసులకు సరికొత్త గుణపాఠాలను నేర్పాయి. ఈ నేపథ్యంలో భవిష్యత్‌లో ఇలాంటి సమస్యలు తలెత్తినప్పుడు ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోవాలనే అంశంపై పోలీసులు దృష్టి సారించారు. పోలీసు బలగాలను బలోపేతం చేయడంతోపాటు, క్షేత్రస్థాయిలో వివిధ వర్గాల ప్రజల వద్దకు వెళ్లి అవగాహన కల్పిస్తూ ఘర్షణలను తగ్గించడానికి కృషి చేయాల్సిన అవసరాన్ని గుర్తించారు.‘త్రిలోక్‌పురిలో ఘర్షణలు నివారించడానికి భారీ సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించాల్సి వచ్చింది. అది కూడా దీర్ఘకాలం కొనసాగించాల్సి వచ్చింది. దీన్ని అధిగమించడానికి నూతన నిబంధనలు రూపొందించామని’ నగర్ పోలీస్ కమిషనర్ బీఎస్ బస్సీ చెప్పారు. దీని ప్రకారం ఎక్కడైనా సమస్య ఉత్పన్నమైనప్పుడు పోలీసు సిబ్బంది ఏ యూనిట్లో ఉన్నా, ఏ డ్యూటీలో ఉన్పప్పటికీ ఆయా సంఘటన స్థలానికి తక్షణమే తరలి వెళ్లాల్సి ఉంటుంది. అత్యవసర సమయాల్లో సిబ్బంది ఈ ప్రోటోకాల్‌ను కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. వివిధ కేటగిరీలుగా వర్గీకరణ ఈ సిబ్బందిని వివిధ కేటగిరిలుగా వర్గీకరించారు. ఆకస్మిక డ్రిల్-(సీడీ) ఇందులో యూనిట్లో 20 శాతం బలగాలు ఉంటాయి. అత్యవసర సమయాల్లో సమస్యాత్మక ప్రాంతాలకు వెళ్తాయి. సీడీ-1- సీడీ-9 గా వ్యవహరిస్తారు. సీడీ-2లో 20 శాతం సిబ్బంది ఉంటారని సీనియర్ పోలీసు అధికారి చెప్పారు. ఈ కొత్త విధానం ద్వారా సిబ్బందిని ప్రత్యేక యూనిట్స్‌గా విస్తరించడానికి అవకాశం ఉంది. స్పెషల్ సెల్, క్రైమ్‌బ్రాంచ్ విభాగాలకు సహాయంగా ట్రాఫిక్, మహిళా స్పెషల్ పోలీస్ యూనిట్లు పనిచేస్తాయి. సమస్యాత్మక ప్రాంతాల్లో రంగంలోకి దిగి స్థానిక పోలీసులతో కలిసి శాంతిభద్రతలను పర్యవేక్షిస్తాయి. ఇదే విధానాన్ని 11 జిల్లాలోనూ అమలు చేస్తారు. ఓ పోలీస్ స్టేషన్ పరిధిలో అత్యవసరం అయినప్పుడు సీడీ-3 రంగంలోకి దిగుతుంది. ఇందులో జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లకు చెందిన 30 శాతం పోలీసు సిబ్బంది ఉంటారు. సాధారణంగా ఒక పోలీస్ స్టేషన్లో 15 నుంచి 200 మంది సిబ్బంది పెట్రోలింగ్, వివిధ రకాల విధుల్లో ఉంటారు. ఒక నోటీస్ జారీ చేస్తే వీరంతా అత్యవరస విధుల్లో చేరాల్సి ఉంటుంది. సెలవులో ఉన్నప్పటి కీ విధులకు హాజర వుతారు. త్రిలోక్‌పురిలో ఇరువర్గాల మధ్య చిన్న ఘర్షణ కారణంగా మొదలైన అల్లర్లలో 19 మంది ప్రజలు 13 మంది పోలీసులు గాయపడ్డారు. నూతన పద్ధతి ప్రకారం అధిక సంఖ్యలో పోలీసులు బలగాలు సంఘటన స్థలానికి వెళ్లి పరిస్థితిని ఎదుర్కొని, అదుపు చేసే అవకాశం ఉంటుందని సీనియర్ పోలీస్ అధికారి చెప్పారు. -
భద్రతకు భరోసా
* పోలీసుకు మొదటిసారిగా ప్రణాళికా బడ్జెట్ * జంట కమిషనరేట్లకు రూ. 186 కోట్లు కేటాయింపు * నగరానికి రూ. 116 కోట్లు,సెబరాబాద్కు రూ. 70 కోట్లు సాక్షి, సిటీబ్యూరో: పోలీసు శాఖ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికా బడ్జెట్‌ను అందించింది. జంట పోలీసు కమిషనరేట్లకు కలిపి రూ.186 కోట్ల నిధులను తెలంగాణ రాష్ట్ర తొలి బడ్జెట్ సమావేశాల్లో కేటాయించింది. నగరాన్ని స్మార్ట్ అండ్ సేఫ్ సిటీగా తీర్చి దిద్దేందుకు ప్రాణాళిక బడ్జెట్ కింద నగర పోలీసు కమిషనరేట్‌కు రూ.116 కోట్లు, సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌కు రూ.70 కోట్లు అందించింది. పోలీసు శాఖను మరింత బలోపేతం చేసేందుకు ఈ నిధులను వినియోగించనున్నట్లు జంట పోలీసు కమిషనర్లు ఎం.మహేందర్‌రెడ్డి, సీవీ ఆనంద్ పేర్కొన్నారు. ప్రతీ ఏటా నగర పోలీసు శాఖకు ప్రణాళికేతర బడ్జెట్‌ను మాత్రమే ప్రభుత్వం కేటాయించేది. ఈ సారి అలా కాకుండా ప్రణాళికా బడ్జెట్ కేటాయించడంపై వారు హర్షం వ్యక్తం చేశా రు. బంజారాహిల్స్‌లో కొత్తగా నిర్మించతలపెట్టిన నగర పోలీసు ప్రధాన కార్యాలయ భారీ భవనానికి ప్రత్యేకంగా ఈ బడ్జెట్లో నిధులు కేటాయించారు. దీంతో త్వరలో భవన శంకుస్థాపనకు ఏర్పాట్లు జరుగనున్నాయి. ఇక ఫ్రెండ్లీ పోలీసు వ్యవస్థకు కూడా పెద్ద పీట వేశారు. ప్రతీ పోలీసు స్టేషన్లో ఫ్రెండ్లీ సర్వీస్ డెలివరీ యూనిట్స్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇక నేర రహిత నగరంగా తీర్చి దిద్దేందుకు సీసీటీవీ సర్వెలెన్స్ ప్రాజెక్ట్‌ను మరింత బలోపేతం చేసేందుకు ఏకంగా రూ.69.59 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఇక ట్రాఫిక్ సమస్య నివారణ కోసం కూడా ఇందులో నిధులు కేటాయించారు. అలాగే, నేరాల అదుపు, కరుడు గట్టిన నేరస్తుల ఆట కట్టించేందుకు టెక్నాలజీ అభివృద్దికి కూడా ప్రత్యేకంగా ఈ బడ్జెట్లో నిధులు కేటాయించారు. నగర కమిషనరేట్ కు.. * రూ.20 కోట్లు: కొత్తగా నిర్మించనున్న కమిషనర్ ప్రధాన కార్యాలయం. * కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్, ఎమర్జెన్సీ రెస్పాన్స్ మేనేజ్మెంట్ * రూ.20 కోట్లు: ప్రతి పోలీసు స్టేషన్లో సిటిజన్ ఫ్రెండ్లీ సర్వీస్ డెలివరీ యూనిట్ ఏర్పాటు * రూ.44.59 కోట్లు: సీసీటీవీ సర్వేలెన్స్ ప్రాజెక్ట్ * రూ.21.41 కోట్లు: ట్రాఫిక్ మేనేజ్మెంట్, ఆటోమెటిక్ ట్రాఫిక్ సిగ్నల్ సిస్టమ్ మేనేజ్మెంట్, ఎన్ఫోర్స్మెంట్ * రూ.10 కోట్లు-నేరాలు, నేరస్తుల ఆట కట్టించేందు కు సరికొత్త టెక్నాలజీని సమకూర్చుకునేందుకు సైబరాబాద్‌కు... * కేటాయించింది మొత్తం రూ.70 కోట్లు * రూ.25 కోట్లు: సీసీ కెమెరాల ఏర్పాటు * రూ.45 కోట్లు: ప్రతి పోలీసు స్టేషన్లో ఆధునిక రిసెప్షన్ సెంటర్లు, టాయిలెట్స్, బారికేడ్లు, * గచ్చిబౌలిలోని కమిషనరేట్ భవనంపై అదన ంగా మరో అంతస్తు నిర్మాణం, కమాండ్ కంట్రో ల్ సెంటర్, ఆదిబట్ల, గచ్చిబౌలి, జవహర్‌నగర్, మహిళా పోలీసు స్టేషన్ లకు పక్కా భవనాలు. శుభసూచకం... పీపుల్స్, పోలీసు, పీస్ (శాంతి), పొగ్రెస్ (అభివృద్ధి)కి ఈ బడ్జెట్ శుభసూచకం. సమాజంలో శాంతి లేనిదే అభివృద్ధి సాధ్యం కాదు. దానికి అధిక ప్రధాన్యత నిస్తూ పోలీసు శాఖకు ముఖ్యమంత్రి కేసీఆర్ భారీగా నిధులు కేటాయించడం ఆహ్వానించదగ్గ విషయం. నేను ఉమ్మడి రాష్ట్రంలో డీజీపీగా పని చేసిన సమయంలో 11 వందల కోట్లు కేటాయించాం. దానితో పోలిస్తే విభజన అనంతరం తొలి బడ్జెట్లో తెలంగాణకు భారీ మొత్తంలో నిధులు కేటాయించారు. ఇది భవిష్యత్‌లో ప్రజల ధన, మాన, ప్రాణ రక్షణకు ఎంతగానే దోహదపడుతుంది. అభివృద్ధి శరవేగంగా సాగడానికి పోలీసు శాఖకు ఈ నిధులు సరిపోతాయి. పీపుల్స్, పోలీసు, పీస్, ప్రొగెస్ (4పి) అనే ఇంగ్లీష్ నానుడికి ఈ బడ్జెట్ ప్రేరణగా ఉంది. - పేర్వారం రాములు, మాజీ డీజీపీ ప్రతి పైసా ప్రజల కోసం ఉపయోగిస్తాం... ప్రభుత్వం కేటాయించిన రూ.186 కోట్ల నిధులలో ప్రతి పైసా ప్రజలకు ఉపయోగపడేలా చర్యలు తీసుకుంటాం. పోలీసు స్టేషన్లలో సౌకర్యాలు మరింత మెరుగు పరుస్తాం. నేరాల అదుపుతోపాటు నేరాల మిస్టరీని త్వరగా ఛేదించేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చుకుంటాం. జంట పోలీసు కమిషనరేట్లలో ఉన్న కరుడు గట్టిన నేరస్తులను కట్టడి చేసేందుకు పక్కా ప్రణాళికను తయారు చేస్తున్నాం. పోలీసులకు కావల్సిన వాహనాలు ఇప్పటికే ప్రభుత్వం అందజేసింది. వారికి కావాల్సిన మరికొన్ని పరికరాలు, సౌకర్యాల కల్పిస్తాం. - ఎం.మహేందర్‌రెడ్డి, సీవీ ఆనంద్ జంట పోలీసు కమిషనర్లు