సాక్షి, బెంగళూరు: నగరంలోని చర్చ్‌స్ట్రీట్‌లో ఆదివారం రాత్రి జరిగిన బాంబు పేలుళ్లకు సంబంధించి విచారణ ప్రాధమిక స్థాయిలో ఉందని నగర పోలీస్ కమీషనర్ ఎంఎన్ రెడ్డి వెల్లడించారు. మంగళవారమిక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ...బాంబు పేలుడు ఘటనకు సంబంధించి విచారణ ప్రాథమిక స్థాయిలో ఉన్నందున ఇప్పుడే ఏ వివరాలు వెల్లడించలేమని తెలిపారు. ఈ ఘటనకు పాల్పడింది ఏ ఉగ్రవాద సంస్థ అనే విషయంపై కూడా ఇప్పటికీ ఓ స్పష్టమైన నిర్థారణకు రాలేదని తెలిపారు. ఘటనకు సంబంధించి అన్ని కోణాల్లోనూ వేగవంతంగా విచారణ కొనసాగుతోందని, ఇప్పటికే వివిధ విచారృ బందాలను ఇతర రాష్ట్రాలకు పంపామని చెప్పారు.
అయితే ఏయే రాష్ట్రాలకు విచారృ బందాలను పంపామనే విషయాన్ని ఇప్పుడు చెప్పలేనని అన్నారు. చర్చ్‌స్ట్రీట్‌లో జరిగిన బాంబు పేలుడు సందర్భంలో అక్కడి సీసీటీవీ కెమెరాల్లో లభించినృదశ్యాలు, కొంత మంది వ్యక్తులు చెప్పిన పోలికల ఆధారంగా అనుమానిత నిందితుల రేఖాచిత్రాలు రూపొందించామని, అయితే వీరు కేవలం అనుమానిత వ్యక్తులే కావడం వల్ల వాటిని మీడియాకు విడుదల చేయలేమని పేర్కొన్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికి ఎవరినీ అరెస్ట్ చేయలేదని, కేవలం కొంతమందిని విచారణ మాత్రమే జరిపి తిరిగి పంపించేశామని తెలిపారు.
మారు పేరుతో ట్వీట్ పంపాడు
నగరంలోని చర్చ్‌స్ట్రీట్‌లో ఆదివారం జరిగిన బాంబు పేలుళ్లకు తానే కారణమంటూ అబ్దుల్ పేరుతో ట్వీట్ పంపిన 17ఏళ్ల మైనర్‌ను తాము అదుపులోకి తీసుకున్నామని నగర పోలీస్ కమిషనర్ ఎం.ఎన్.రెడ్డి వెల్లడించారు. అతను నగరానికి చెందిన వ్యక్తేనని, నగరంలోనే విద్యాభ్యాసం చేస్తున్నాడని తెలిపారు. మైనర్ కావడం వల్ల ఇంతకు మించి వివరాలను వెల్లడించలేమని తెలిపారు. కాగా ట్వీట్ పంపిన నిందితుడు ప్ర స్తుతం విచారృ బందం అదుపులోనే ఉన్నాడని, అతని వేరే మతానికి చెందిన మారుపేరు పెట్టుకొని ట్వీట్ పంపినట్లు తమ విచారణలో వెల్లడైందని కమిషనర్ ఎం.ఎన్.రెడ్డి పేర్కొన్నారు. విచారణలో భాగంగా అత ని తల్లిదండ్రులను సైతం విచారించామని తెలిపారు.
చర్చ్‌స్ట్రీట్‌లో సంచారం యధాతథం
ఆదివారం చర్చ్‌స్ట్రీట్‌లో బాంబు పేలుడు ఘటనతో రెండు రోజులుగా జన సంచారం లేక వెలవెలపోయిన చర్చ్‌స్ట్రీట్‌లో తిరిగి మంగళవారం జనసంచారం ప్రా రంభమైంది. ఘటనా స్థలంలో సాక్షాధారాల సేకరణకు గాను ఘటన జరిగినప్పటి నుంచి మంగళవారం ఉదయం వరకు ఆ ప్రాంతంలో జనసంచారాన్ని పోలీ సు అధికారులు నిషేధించారు. కాగా మంగళవారానికి సాక్ష్యాల సేకరణ పూర్తి కావడంతో తిరిగి ఈ ప్రాం తంలో జనసంచారాన్ని పోలీసులు అనుమతించారు.
రెస్టారెంట్‌లో ‘ఎన్‌ఐఏ’ అధికారులు
ఇక బాంబు పేలుడు జరిగిన కోకోనట్ గ్రోవ్ రెస్టారెంట్‌కు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ*(ఎన్‌ఐఏ) అధికారులు మంగళవారం చేరుకున్నారు. ఎన్‌ఐఏ స్పెషల్ డీజీపీ నవనీత్ వాసన్ నేృతత్వంలోని అధికారృల బందం కోకోనట్ గ్రోవ్ రెస్టారెంట్‌కు చేరుకొని ఘటనకు సంబంధించిన వివరాలను సేకరించారు.
ఊహాచిత్రాలు రెడీ
Published Wed, Dec 31 2014 4:33 AM | Last Updated on Wed, Apr 3 2019 4:08 PM
Advertisement
Advertisement