Church street
-
పాప్ రాక్ ఐకాన్, గ్రామీ అవార్డు గ్రహితకు చేదు అనుభవం..!
ఎంత పెద్ద ఫేమస్ సింగర్ అయినా ఒక్కోసారి ఊహించని చేదు అనుభవాలు ఎదురవ్వుతుంటాయి. ముందుగా ప్లాన్ చేసుకుని, పర్మిషన్ తీసుకున్నా ఒక్కోసారి అవమానపాలుకాక తప్పదనేలా ఉంటాయి పరిస్థితులు. హుందాగా, నిజాయితీగా వ్యవహరించినా..అధికార దర్పం ముందు తలవంచక తప్పదేమో ఒక్కసారి. ఇదంతా ఎందుకంటే..నాలుగుసార్లు గ్రామీ అవార్డు గెలుచుకుని, పాప్ ఐకాన్‌గా పేరుగాంచిన సింగర్‌కి బెంగళూరులో అనుకోని పరిణామాన్ని చవిచూశాడు. ఏం జరిగిందంటే.. బ్రిటిష్ గాయకుడు-గేయ రచయిత ఎడ్ షీరన్ బెంగళూరులో చర్చి స్ట్రీట్‌లోని ఎంజీ రోడ్ మెట్రో స్టేషన్ ఎదురుగా ప్రదర్శన ఇచ్చేందుకు ప్లాన్ చేసుకున్నారు. ఈ ప్రదేశంలో ఒకటికి మించి రెండు పాటలతో అలరించబోతున్నా అంటూ మొదలు పెట్టారాయన. షీరన్ ముందుగా మొటి పాట అనగానే ఒక పోలీసు ఎంట్రీ ఇచ్చి ప్రదర్శనను అడ్డుకున్నారు.ఆయన ప్రదర్శన జరగకుండా స్పీకర్లను కూడా డిస్కనెక్ట్ చేశారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇదిలా ఉండగా, ఎడ్ షీరన్ మాత్రం ముందుస్తు ప్రణాళికతోనే ఈ ప్రదర్శన ప్లాన్ చేశామన్నారు. ఇలా రోడ్డుపై ప్రదర్శన ఇచ్చేందుకు పర్మిషన్ తీసుకున్నట్లు తెలిపారు. తామేమి అకస్మాత్తుగా అప్పటికప్పుడూ ఇలా ప్రదర్శన ప్లాన్ చేయలేదంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో వివరణ ఇచ్చారు. కాగా, షేప్ ఆఫ్ యు, థింకింగ్ అవుట్ లౌడ్, పర్ఫెక్ట్ అండ్ కాజిల్ ఆన్ ది హిల్ వంటి హిట్ పాటలకు పేరుగాంచిన పాప్ రాక్ ఐకాన్ ఎడ్ షీరన్. అతని ఆల్బమ్‌లు హాటకేక్లా ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల కొద్ది అమ్ముడైపోయాయి. ఆయన జనవరి 30 నుండి ఫిబ్రవరి 15 వరకు భారత్‌లో పర్యటించనున్నారు.A police officer pulled the plug when Ed Sheeran surprised everyone on Church Street😂😭😭😭 pic.twitter.com/cMIRoLC7Mk— Naai sekar (@snehaplsstop) February 9, 2025 (చదవండి: దటీజ్ సుధీర్..! దూషించే పదాన్నే లగ్జరీ బ్రాండ్‌గా మార్చి..) -
‘టెర్రర్’ సెంటిమెంట్!
ఇల్లు, ఊరితో అనుబంధం తెంచుకోని ఆఫ్రిది గతేడాది జనవరిలో అహ్మదాబాద్‌లో ‘పర్యటన’ నగరంలో చిక్కిన నఫీజ్ ఖాన్‌కు ‘ట్రైనర్’ ఇతడు అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ విచారణలో వెల్లడి 2008లో అహ్మదాబాద్‌లోని డైమండ్ మార్కెట్లో పేలుడు 2014లో బెంగళూరు చర్చి స్ట్రీట్‌లో ఉన్న ‘కోకోనట్ గ్లోవ్’ వద్ద విధ్వంసం అదే ఏడాది చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్లో గుహవాటి వెళ్లే ఎక్స్‌ప్రెస్‌లో బ్లాస్ట్ 2015లో బెంగళూరులోని ఎంబీ రోడ్లో ఉన్న ఇజ్రాయిల్ వీసా సెంటర్‌కు నిప్పు 2016లో తనను పట్టుకోవడానికి {పయత్నించిన పోలీసు అధికారిపై కత్తితో దాడి సిటీబ్యూరో: మూడు ఉగ్రవాద సంస్థలతో సన్నిహిత సంబంధాలున్న ఆలమ్ జెబ్ ఆఫ్రిది ‘టై హిస్టరీ’లో మచ్చుకు కొన్నివి. ‘జునూద్ అల్ ఖలీఫా ఏ హింద్’ సంస్థ ముసుగులో దేశ వ్యాప్తంగా విధ్వంసాలకు కుట్రపన్ని, జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు జనవరిలో హైదరాబాద్‌లో చిక్కిన నలుగురిలో కీలకమైన నఫీజ్ ఖాన్‌కు ‘బాంబుల ట్రైనర్’గానూ వ్యవహరించాడు. ఇంత కరుడుగట్టిన ఉగ్రవాదిలోనూ సెంటిమెంట్ కోణం ఉంది. పుట్టిన ఊరు, చదువుకున్న స్కూలు, కన్నతల్లి, ఆత్మహత్య చేసుకున్న చెల్లి అంటే అతడికి ప్రాణం. దేశవ్యాప్తంగా అనేక ఏజెన్సీలకు వాంటెడ్‌గా ఉండి, ఎనిమిదేళ్లుగా పరారీలో ఉన్న ఈ ఉగ్రవాది గతేడాది జనవరిలో స్వస్థలానికి వెళ్లి వచ్చాడు. డైమండ్ మార్కెట్ కేసుకు సంబంధించి పీటీ వారెంట్‌పై అహ్మదాబాద్ తరలించిన క్రైమ్ బ్రాంచ్ గత నెల 21 నుంచి మంగళవారం వరకు కస్టడీలోకి తీసుకుని విచారించింది. ఈ నేపథ్యంలో వెలుగులోకి వచ్చిన ఆసక్తికర అంశాలపై ‘సాక్షి’ కథనం.. సంస్కృత భాషలోనూ దిట్ట.. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఉన్న జోహాపుర న్యూ ఆషియానా పార్కుకు చెందిన ఆలమ్ జెబ్ అఫ్రిది పదో తరగతి వరకు స్థానిక సన్‌ఫ్లవర్ స్కూల్లో చదివాడు. అక్కడ అరబిక్, ఉర్దూతో పాటు సంస్కృతం కూడా నేర్చుకున్నాడు. సంస్కృత భాషపై మంచి పట్టుంది. 1993లో తండ్రి మసూకర్ అహ్మద్ ఓ హత్యాయత్నం కేసులో జైలుకు వెళ్లడం అఫ్రిది జీవితంలో వచ్చిన మొదటి కుదుపు. 11-12 తరగతులు వెజల్పూర్లోని ద రేన్ స్కూల్లో చదివినప్పటికీ 2004లో ట్వెల్త్ క్లాస్ ఫెయిల్ అయ్యాడు. నిషిద్ధ స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా (సిమి) పబ్లిష్ చేసే మ్యాగజైన్ ‘తెహరీఖ్-ఏ-మిల్లత్’ చదవటంతో పాటు కొందరి రెచ్చగొట్టే ప్రసంగాలకు ఆకర్షితుడైన ఆలమ్ జెబ్.. తొలుత ఆ సంస్థలో సభ్యుడిగా మారాడు. ఉగ్రశిక్షణలోనూ ‘ఉత్తముడు’.. సిమికి చెందిన ఆరిఫ్ కాగ్జీ, జావేద్ షేక్, షంషుద్దీన్‌తో సంబంధాలు ఏర్పడిన తర్వాత పూర్తిగా ‘ఉగ్రబాట’ పట్టాడు. వీరి ద్వారా సిమి చీఫ్‌గా వ్యవహరించిన సఫ్దర్ నఘోరీ, అబ్దుల్ సుభాన్ ఖురేషీ అలియాస్ తౌఖీర్లకు దగ్గరయ్యాడు. 2007లో గుజరాత్‌లోని వడోదర సమీపంలోని హలోల్ జరిగిన సిమి ఉగ్రవాద శిక్షణ శిబిరంలో పాల్గొన్న ఆఫ్రిది.. మిగిలిన 30 మంది కంటే ‘ఉత్తమమైన ప్రతిభ’ కనబరిచాడు. సిమి మాడ్యుల్‌తో పాటు ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాద సంస్థలోనూ చేరాడు. అహ్మదాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో టెలిఫోన్బూత్ ఆపరేటర్‌గా పనిచేస్తుండగా.. ఐఎంకు చెందిన ఉగ్రవాది ఖయాముద్దీన్ కపాడియా రూ.6 వేలు ఇతడికి ఇచ్చి ఓ సైకిల్ ఖరీదు చేసుకురమ్మన్నాడు. అలా తీసుకువచ్చిన దానిపై బాంబు బిగించి ఆఫ్రిదీ చేతనే డైమండ్ మార్కెట్ వద్ద పెట్టించాడు. 2008లో బాట్లా హౌస్ ఎన్కౌంటర్ తర్వాత ఐఎం మాడ్యుల్ గుట్టురట్టు కావడంతో ఆఫ్రిది అజ్ఞాతంలోకి వెళ్లిపోయి తన విధ్వంసాలు కొనసాగించాడు. హాలిడే రోజు స్వస్థలానికి.. దాదాపు ఎనిమిదేళ్లుగా స్వస్థలానికి దూరంగా ఉన్న అఫ్రిదీకి తన ఊరు, ఇల్లు, తల్లి, చెల్లి సెంటిమెంట్ పోలేదు. దీంతో పాత జ్ఞాపకాలు నెమరువేసుకునేందుకు గతేడాది అక్కడకు వెళ్లాడు. అయితే మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న తనను పట్టుకోవడానికి నిఘా, పోలీసు వర్గాలు నిత్యం వేటాడటంతో పాటు అనేకచొట్ల కన్నేసి ఉంటాయనే అనుమానంతో జాగ్రత్తలు తీసుకున్నాడు. గుజరాత్లో సెలవుదినమైన ‘ఉత్తరాయణ్ డే’ నేపథ్యంలో 2015 జనవరి 14న జోహాపురకు వెళ్లాడు. న్యూ ఆషియానా పార్క్, సన్‌ఫ్లవర్ స్కూల్, వెజల్పూర్లోని స్కూళ్ల వద్ద సంచరిస్తూ నాటి స్మృతులు జ్ఞాపకం చేసుకున్నాడు. ఇంటికి వెళ్తే తన కదలికల్ని ఏజెన్సీలు గుర్తించే అవకాశం ఉందని భయపడ్డాడు. దీంతో లోపలకు వెళ్లకుండా తన ఇంటి సమీపంలో తచ్చాడుతూ తల్లి గొంతు విన్నాడు. ఆపై అక్కడ నుంచి నిష్ర్కమించి 2008లో ఆత్మహత్య చేసుకున్న సోదరిని ఖననం చేసిన శ్మశానం వద్దకు వెళ్లాడు. అక్కడ తన చెల్లి సమాధి గుర్తించడం సాధ్యం కాకపోవడంతో భారీగా పుష్ఫగుచ్ఛాలు తీసుకుని దాదాపు అన్ని సమాధుల మీదా పెట్టాడు. ఆపై తన షెల్టర్ జోన్ బెంగళూరు చేరుకున్నాడు. ఆఫ్రిదిని కస్టడీలోకి తీసుకుని విచారించిన అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ అధికారులు ఆ విషయాలు తెలుసుకుని ఒకింత ఆశ్చర్యానికి లోనయ్యారట. -
దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల నిందితుడి అరెస్ట్
బెంగళూరు : బెంగళూరు బాంబు పేలుళ్ల కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో నిందితుడు, ఉగ్ర కార్యకలాపాల్లో కీలకుడిగా వ్యవహరిస్తున్న సయ్యద్ ఇస్మాయిల్ అఫక్ పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో అఫక్ పలు కీలక విషయాలు వెల్లడించినట్లు సమాచారం. దేశవ్యాప్తంగా పలు పేలుళ్లతో అతనికి సంబంధం ఉన్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. అలాగే దిల్సుఖ్నగర్ జంట పేలుళ్ల బాంబులను కూడా తానే తయారు చేసినట్లు అఫక్ ఒప్పుకున్నట్లు సమాచారం. పాకిస్తాన్ తీవ్రవాద సంస్థలతోనూ అఫక్కు సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. బెంగళూరు పోలీసులు విచారణను కొనసాగిస్తున్నారు. కాగా అఫక్‌ను హైదరాబాద్ పోలీసులు త్వరలో కస్టడీలోకి తీసుకోనున్నారు. మరోవైపు ఎన్ఐఏ అధికారులు అఫక్‌ను పీటీ వారెంట్‌పై హైదరాబాద్ తీసుకు రానున్నారు. కాగా డిసెంబర్ 27న బెంగళూరులో బాంబు పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో ఓ మహిళ మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. -
ఊహాచిత్రాలు రెడీ
సాక్షి, బెంగళూరు: నగరంలోని చర్చ్‌స్ట్రీట్‌లో ఆదివారం రాత్రి జరిగిన బాంబు పేలుళ్లకు సంబంధించి విచారణ ప్రాధమిక స్థాయిలో ఉందని నగర పోలీస్ కమీషనర్ ఎంఎన్ రెడ్డి వెల్లడించారు. మంగళవారమిక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ...బాంబు పేలుడు ఘటనకు సంబంధించి విచారణ ప్రాథమిక స్థాయిలో ఉన్నందున ఇప్పుడే ఏ వివరాలు వెల్లడించలేమని తెలిపారు. ఈ ఘటనకు పాల్పడింది ఏ ఉగ్రవాద సంస్థ అనే విషయంపై కూడా ఇప్పటికీ ఓ స్పష్టమైన నిర్థారణకు రాలేదని తెలిపారు. ఘటనకు సంబంధించి అన్ని కోణాల్లోనూ వేగవంతంగా విచారణ కొనసాగుతోందని, ఇప్పటికే వివిధ విచారృ బందాలను ఇతర రాష్ట్రాలకు పంపామని చెప్పారు. అయితే ఏయే రాష్ట్రాలకు విచారృ బందాలను పంపామనే విషయాన్ని ఇప్పుడు చెప్పలేనని అన్నారు. చర్చ్‌స్ట్రీట్‌లో జరిగిన బాంబు పేలుడు సందర్భంలో అక్కడి సీసీటీవీ కెమెరాల్లో లభించినృదశ్యాలు, కొంత మంది వ్యక్తులు చెప్పిన పోలికల ఆధారంగా అనుమానిత నిందితుల రేఖాచిత్రాలు రూపొందించామని, అయితే వీరు కేవలం అనుమానిత వ్యక్తులే కావడం వల్ల వాటిని మీడియాకు విడుదల చేయలేమని పేర్కొన్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికి ఎవరినీ అరెస్ట్ చేయలేదని, కేవలం కొంతమందిని విచారణ మాత్రమే జరిపి తిరిగి పంపించేశామని తెలిపారు. మారు పేరుతో ట్వీట్ పంపాడు నగరంలోని చర్చ్‌స్ట్రీట్‌లో ఆదివారం జరిగిన బాంబు పేలుళ్లకు తానే కారణమంటూ అబ్దుల్ పేరుతో ట్వీట్ పంపిన 17ఏళ్ల మైనర్‌ను తాము అదుపులోకి తీసుకున్నామని నగర పోలీస్ కమిషనర్ ఎం.ఎన్.రెడ్డి వెల్లడించారు. అతను నగరానికి చెందిన వ్యక్తేనని, నగరంలోనే విద్యాభ్యాసం చేస్తున్నాడని తెలిపారు. మైనర్ కావడం వల్ల ఇంతకు మించి వివరాలను వెల్లడించలేమని తెలిపారు. కాగా ట్వీట్ పంపిన నిందితుడు ప్ర స్తుతం విచారృ బందం అదుపులోనే ఉన్నాడని, అతని వేరే మతానికి చెందిన మారుపేరు పెట్టుకొని ట్వీట్ పంపినట్లు తమ విచారణలో వెల్లడైందని కమిషనర్ ఎం.ఎన్.రెడ్డి పేర్కొన్నారు. విచారణలో భాగంగా అత ని తల్లిదండ్రులను సైతం విచారించామని తెలిపారు. చర్చ్‌స్ట్రీట్‌లో సంచారం యధాతథం ఆదివారం చర్చ్‌స్ట్రీట్‌లో బాంబు పేలుడు ఘటనతో రెండు రోజులుగా జన సంచారం లేక వెలవెలపోయిన చర్చ్‌స్ట్రీట్‌లో తిరిగి మంగళవారం జనసంచారం ప్రా రంభమైంది. ఘటనా స్థలంలో సాక్షాధారాల సేకరణకు గాను ఘటన జరిగినప్పటి నుంచి మంగళవారం ఉదయం వరకు ఆ ప్రాంతంలో జనసంచారాన్ని పోలీ సు అధికారులు నిషేధించారు. కాగా మంగళవారానికి సాక్ష్యాల సేకరణ పూర్తి కావడంతో తిరిగి ఈ ప్రాం తంలో జనసంచారాన్ని పోలీసులు అనుమతించారు. రెస్టారెంట్లో ‘ఎన్ఐఏ’ అధికారులు ఇక బాంబు పేలుడు జరిగిన కోకోనట్ గ్రోవ్ రెస్టారెంట్‌కు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ*(ఎన్ఐఏ) అధికారులు మంగళవారం చేరుకున్నారు. ఎన్ఐఏ స్పెషల్ డీజీపీ నవనీత్ వాసన్ నేృతత్వంలోని అధికారృల బందం కోకోనట్ గ్రోవ్ రెస్టారెంట్‌కు చేరుకొని ఘటనకు సంబంధించిన వివరాలను సేకరించారు. -
మరింత భద్రత
* రాష్ర్టంలోనూ ‘పబ్లిక్ సేఫ్టీ ఎన్ఫోర్స్మెంట్ యాక్ట్’ * రాష్ట్ర హోం శాఖ మంత్రి, సీనియర్ పోలీసు అధికారులతో ముఖ్యమంత్రి అత్యవసర సమావేశం * రాష్ట్ర ఇంటలిజెన్స్ శాఖ పటిష్టం సాక్షి, బెంగళూరు : నగరంలోని చర్చ్ స్ట్రీట్‌లో జరిగిన బాంబు పేలుడు ఉదంతంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలోని ప్రజల భద్రతను మరింత కట్టుదిట్టం చేసే దిశగా కర్ణాటకలోనూ ‘పబ్లిక్ సేఫ్టీ ఎన్ఫోర్స్మెంట్ యాక్ట్’ను అమల్లోకి తీసుకొచ్చేందుకు సన్నద్ధమైంది. బాంబు పేలుడు ఘటన నేపథ్యంలో రాష్ట్ర హోం శాఖ మంత్రి కేజే జార్జ్, డీజీపీ లాల్‌రుఖుమ్ పచావో, నగర పోలీస్ కమీషనర్ ఎంఎన్ రెడ్డితో పాటు ఇతర సీనియర్ అధికారులతో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన క్యాంపు కార్యాలయం కృష్ణాలో సోమవారం ఉదయం అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో బాంబు పేలుడు ఘటనకు సంబంధించి సుదీర్ఘ చర్చ జరిగింది. బాంబు పేలుడు ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసు అధికారులు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, రాష్ట్ర హోం శాఖ మంత్రి కేజే జార్జ్‌లకు వివరించారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో ముఖ్యంగా బెంగళూరు నగరంలోని జనసందోహ ప్రాంతాల్లో ప్రజల రక్షణా వ్యవస్థను మరింత కట్టుదిట్టం చేయాల్సిన ఆవశ్యకతపై చర్చ జరిగింది. ఈ సందర్భంలో ఆంధ్రప్రదేశ్ (ఉమ్మడి) తరహాలో ‘పబ్లిక్ సేఫ్టీ ఎన్ఫోర్స్మెంట్ యాక్ట్’ను రాష్ట్రంలో సైతం అమల్లోకి తీసుకురావాల్సిన ఆవశ్యకతను పోలీసు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ యాక్ట్ ప్రకారం వంద మంది కంటే ఎక్కువ మంది జనసందోహం ఉన్న రెస్టారెంట్స్, మాల్స్, ఆస్పత్రులు, కార్యాలయాలు ఇలా అన్ని ప్రదేశాల్లోనూ సీసీటీవీ కెమెరాలను తప్పక అమర్చాల్సి ఉంటుంది. తద్వారా ప్రజల భద్రతపై మెరుగైన నిఘాను ఉంచేందుకు పోలీసులకు ఆస్కారం ఉంటుంది. పోలీసు అధికారులు చేసిన సూచనలను విన్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ‘పబ్లిక్ సేఫ్టీ ఎన్ఫోర్స్మెంట్ యాక్ట్’ను రాష్ట్రంలో అమల్లోకి తీసుకొచ్చేందుకు సమ్మతించినట్లు సమాచారం. ఇక ఈ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మీడియాతో మాట్లాడుతూ...ఈ తరహా ఘటనలు మరోసారి నగరంలో పునరావృతం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వానికి వివరాలు అందజేస్తున్నామని, దర్యాప్తును వేగవంతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం నుంచి సాంకేతిక సహకారాన్ని సైతం తీసుకుంటున్నామని చెప్పారు. రాష్ట్ర ఇంటలిజెన్స్ శాఖను మరింత పటిష్టం చేసే దిశగా ఇక రాష్ట్రంలో ఇంటలిజెన్స్ శాఖను మరింత పటిష్టం చేసే దిశగా సైతం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇంటలిజెన్స్ విభాగంలో ప్రత్యేక కేడర్ వ్యవస్థను అమల్లోకి తీసుకురావడంతో పాటు ఈ విభాగంలో నియామకాల కోసం సైతం ప్రత్యేక విధానాన్ని రూపొందించనున్నట్లు సమాచారం. అంతేకాక సాంకేతిక పరమైన నైపుణ్యాలను సైతం ఈ సిబ్బందికి పెంపొందించడం తో పాటు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు గాను మరో 40 మంది నిపుణులైన ఇంజనీర్లను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. -
అది ఉగ్రవాదుల దాడే: కిరెన్ రిజ్జూ
న్యూఢిల్లీ: బెంగళూరులో ఆదివారం చోటు చేసుకున్న బాంబు పేలుళ్ల వెనుక ఉగ్రవాదుల హస్తం ఉందని హోంశాఖ స్పష్టం చేసింది. సోమవారం మీడియాతో మాట్లాడిన హోంశాఖ సహోయమంత్రి కిరణ్ రిజ్జూ.. ఆ దాడి ఖచ్చితంగా ఉగ్రవాదులు చేసిందేనని తెలిపారు. అయితే ఆ బాంబు దాడి ప్రభావం తక్కువ ఉండటంతో పెద్దగా ప్రాణం నష్టం జరగలేదన్నారు. ఆ దాడి వెనుక సిమి (స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్ మెంట్ ఆఫ్ ఇండియా) ఉండవచ్చనే అనుమానం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆ కోణంలోనే దర్యాప్తు సాగుతుందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. నగరంలోని చర్చిస్ట్రీట్ ప్రాంతంలో ఆదివారం రాత్రి 8.30 గంటలకు పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఓ మహిళ మరణించిగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. రెస్టారెంట్‌కు సమీపంలోని ఫుట్‌పాత్‌పై ఉన్న చెట్ల పొదల్లో ఈ బాంబ్‌ను అమర్చినట్లు పోలీసులు తెలిపారు. -
బెంగళూరులో బాంబు పేలుళ్లు
మహిళ మృతి, ముగ్గురికి గాయాలు సాక్షి, బెంగళూరు: బాంబు పేలుడుతో బెంగళూరు నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నగరంలోని చర్చిస్ట్రీట్ ప్రాంతంలో ఆదివారం రాత్రి 8.30 గంటలకు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఓ మహిళ మరణించింది. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. నగరంలో వారాంతాల్లో జన సందోహం అధికంగా ఉండే ప్రాంతాల్లో చర్చి స్ట్రీట్ ఒకటి. ఈ ప్రాంతంలోని కోకోనట్ క్రో రెస్టారెంట్ వద్ద ఆదివారం రాత్రి 8.30 గంటలకు బాంబు పేలింది. రెస్టారెంట్‌కు సమీపంలోని ఫుట్‌పాత్‌పై ఉన్న చెట్ల పొదల్లో ఈ బాంబ్‌ను అమర్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ పేలుడుకు ఫుట్‌పాత్‌పై నడుస్తున్న తమిళనాడుకు చెందిన ఇద్దరు వ్యక్తులు భవానీ దేవి(38), కార్తిక్ (23) గాయపడ్డారు. వీరిద్దరూ ఒకే కుటుంబానికి చెందినవారు. వీరితో పాటు సందీప్, మరో వ్యక్తి సైతం గాయపడ్డారు. భవానీదేవికి తలకు తీవ్ర గాయమైంది. సందీప్ వెన్నెముకకు, కార్తీక్ కాలికి గాయాలయ్యాయి. వీరిలో భవానీ దేవి, కార్తీక్‌లను మాల్యా ఆస్పత్రిలో, సందీప్ హోస్తాత్ ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో భవానీదేవి మరణించారు. నగర పోలీస్ కమిషనర్ ఎంఎన్‌రెడ్డి మాట్లాడుతూ పేలుడుకు ఐఈడీని వాడి ఉండొచ్చన్నారు. తక్కువ తీవ్రత ఉన్న బాంబ్ కావడం వల్ల విస్ఫోటన తీవ్రత తక్కువగా ఉందన్నారు. పేలుడు వెనక సిమి హస్తం ఉండొచ్చని అనుమానిస్తున్నామన్నారు. ప్రజలు ఏటా న్యూ ఇయర్ వేడుకలు జరుపుకునే ఈ ప్రాంతంలో పేలుడు జరగడం గమనార్హం. -
బెంగళూరులో బాంబు పేలుళ్లు